festivals
-
ప్రకృతికి కృతజ్ఞతలు చెప్పడమే పండుగ!
సంక్రాంతి తల్లి సకల సౌభాగ్యాలు ఇచ్చే కల్పవల్లి. తెలుగు లోగిళ్ళలో భోగి, సంక్రాంతి, కనుమ పేరిట 3 రోజులపాటు వైభవోపేతంగా జరుగుతుంది. సంక్రాంతి ప్రకృతి మాతకు కృతజ్ఞతలు తెలిపే పండుగ. గత సాంస్కృతిక వారసత్వాన్ని కొనసాగించే పండుగ. రైతు ఇంటికి పౌష్యలక్ష్మి సమృద్ధిగా వచ్చి చేరే కాలం కాబట్టి రైతు తన కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉంటాడు. భోగి తెల్లవారు జామున భోగిమంటలు వేసి చలి కాచుకుంటారు. వచ్చిన వారంతా మంటల్లో భోగి పిడకలు వేస్తారు. ఈ మంటలపై మరిగించిన నీళ్ళతో తలంటు స్నానాలు చేస్తారు. యువతులు ఇళ్ళ ముంగిట గొబ్బెమ్మలు పెట్టి, వాటి చుట్టూ పాటలు పాడుతూ నృత్యం చేస్తారు. ఈరోజునే ఐదేళ్ల లోపు పిల్లలపై భోగిపళ్ళు పోయడమనే సంప్రదాయముంది. రేగుపళ్ళునే భోగిపళ్ళుగా వినియోగించడం పరిపాటి.మరుసటి రోజు సంక్రాంతి. ఇది చాలా ముఖ్యమైన రోజు. పెద్దలంతా కోడికూత జామునే నిద్ర లేస్తారు. స్నానాదులు ముగించి, ఉపవాసముంటారు. పితృదేవతలకు భక్తిశ్రద్ధలతో పొత్తర్లు పెడతారు. పిండివంటలను నైవేద్యంగా పెట్టి పూజలు చేస్తారు. కొత్త బట్టలు, మడపళ్ళు మూలన పెట్టి సమర్పిస్తారు. మూడోరోజు కనుమ. ఇది పశువుల పండగ. ప్రత్యేకించి గోవులకు పూజ చేస్తారు. అందుకే పశువులను అందంగా అలంకరిస్తారు. పశువుల కొమ్ములకు రంగులు పూస్తారు. పూల మాలలు కడతారు. వండిన పిండివంటలను పశువులకు తినిపిస్తారు. ఇలాగే ముక్కనుమ రోజున కూడా పశుపూజ ఉంటుంది.ఇంకా... పల్లెల్లో అడుగడుగునా ధనుర్మాసపు శోభ తాండవిస్తుంది. వీధులన్నీ పచ్చని మామిడి తోరణాలతో, అరటిబోదులతో, చెరకు గడలతో అలంకరించబడతాయి. బొమ్మల కొలువులు, సాము గరిడీలు, సంగిడీలు ఎత్తడాలు, గంగిరెద్దుల వారి నాదస్వర గీతాలు, డూడూ బసవన్న నాట్యాలు, హరిదాసుల కీర్తనలు, రంగస్థల పద్య నాటకాలు, మేలుకొలుపు గీతాలు, బుడబుక్కల వారి పాటలు, కొమ్మదాసరుల విన్యాసాలు, పిట్టల దొరల హాస్య సంభాషణలు, జంగమ దేవరల పొగడ్తలతో పల్లె వాతావరణం పరిమళ భరితమౌతుంది. అందుకే సంక్రాంతి పండుగను సకల కళల సమాహారంగా కవులు అభివర్ణిస్తారు. కోస్తాంధ్ర అంతటా సంక్రాంతి వేడుకలు కన్నులపండువగా జరుగుతాయి. తమిళనాడులో జల్లికట్టు వలె, దక్షిణ కోస్తాలో కోడిపందాలు (ప్రభుత్వ అనుమతి లేనప్పటికీ) జోరుగా నిర్వహిస్తారు. వీటిని ప్రజలు తండోపతండాలుగా వెళ్లి చూస్తారు.పిల్లలైతే కొత్త బట్టలు ధరించి, గాలిపటాలు ఎగరవేస్తూ సందడి చేస్తారు. పండుగ రోజుల్లో ఇంటి ముంగిళ్ళన్నీ రంగురంగుల రంగవల్లికలతో కళకళలాడుతాయి. అన్నావదినలతో, అక్కాబావలతో యువతీ యువకులంతా సరదాగా పండగ సమయాలను గడుపుతారు. సంప్రదాయంగా వస్తున్న ముగ్గుల పోటీలు, ఎడ్లబళ్ళ పందాలు, కబడ్డీ, వాలీబాల్ వంటి గ్రామీణ క్రీడల పోటీలు నిర్వహిస్తారు. మైసూర్–కలకత్తాలలో దసరా ఉత్సవాల వలె, పూణే–హైదరాబాదులో గణపతి నవరాత్రి ఉత్సవాలు మాదిరి కోస్తాంధ్ర అంతటా సంక్రాంతిని ఘనంగా నిర్వహించడం ఆనవాయితీ. తమ వారితో కలసి పండుగలో పాల్గొనేందుకు ఎక్కడో సుదూర ప్రాంతాల్లో నివసిస్తున్నవారు స్వగ్రామాలకు చేరుకుంటారు. ఈ క్రమంలో హైదరాబాద్ నగరమైతే జనం లేక బోసిపోతోంది. ఇలా వచ్చిన వారంతా తమ ఊరిలో పండుగ మూడు రోజులూ ఉత్సాహంగా గడుపుతారు. ఎన్నో మధుర జ్ఞాపకాలను మదినిండా పదిలపరుచుకుంటారు. పండుగయ్యాక వలస జీవులంతా పట్టణాలకు తిరుగు ప్రయాణ మవుతారు.పండుగలు మన సంస్కృతీ సాంప్రదాయాలలో భాగంగానే పుట్టాయి. పండుగలు జాతీయ సమైక్యతా భావనకు చిహ్నాలు. వివిధ పండుగలను కులాల, మతాలకతీతంగా సామరస్యంగా జరుపుకోవడం మన కర్తవ్యం. మన వైవిధ్య జీవనానికి పండుగలు గొప్ప ప్రతీకగా నిలుస్తాయి. పండుగల నిర్వహణలో ఆచార వ్యవహారాలు అన్ని ప్రాంతాలలో ఒకేలా ఉండవు. ఐనప్పటికీ పండుగ యొక్క సామాజిక, సాంస్కృతిక ధ్యేయం ఒకటే కాబట్టి, అంతటా ఒకేలా ఐక్యత పరిఢవిల్లుతుంది. భారతదేశం ‘భిన్నత్వంలో ఏకత్వం’ అనే విశిష్ట లక్షణాన్ని కలిగియున్నది. ఈ దేశంలో పుట్టిన ప్రతి పౌరుడూతాను ఇష్టపడుతున్న జీవనాన్ని స్వేచ్ఛగా ఎంచుకోవచ్చు. దీనిలో భాగంగానే తాను కోరుకున్న సంస్కృతీ సాంప్రదాయాలను, ఆచార వ్యవహారాలను తన జీవితంలో ఎటువంటి ఒత్తిడికి గురికాకుండా మేళవించుకోవచ్చు.పిల్లా తిరుపతిరావు వ్యాసకర్త తెలుగు ఉపాధ్యాయులుమొబైల్: 7095184846 -
2025లో ముఖ్యమైన పండుగలు, ఏ రోజున వచ్చాయో తెలుసా?
2024 ఏడాదికి వీడ్కోలు పలికి, కొత్త ఏడాది 2025 (New Year 2025)లోకి అడుగుపెట్టబోతున్నాము. కొత్త ఆశలు, ఆశయాలతో నూతన ఏడాదికి స్వాగతం చెప్పబోతున్నాము. మి కొత్త సంవత్సరం వస్తుందంటే ఏ పండుగలు ఏ రోజు వచ్చాయో అన్న ఆసక్తి అందరిలో ఉంటుంది. అంతేకాదు న్యూ ఇయర్ అనగానే పిల్లలంతా తమ బర్త్‌డే ఎపుడు (వారం) వచ్చిందా అని ఆసక్తిగా వెదుక్కుంటారు. ఉద్యోగులైతే ఏ ఏ పండుగలు ఆదివారం వచ్చాయబ్బా అని తెలుసుకునేందుకు తెగ ఉవ్విళ్లూరుతారు. ఇక మహిళలు (మిగిలినవారు కూడా) పెద్ద పండుగలు, శుభఘడియలు ఎపుడు వచ్చాయో తెలుసు కునేందుకు ఉత్సాహంగా చూపుతారు. మరి 2025లో సంక్రాంతి (Sankranti, ఉగాది (Ugadi), హోలీ (holy) వినాయక చవితి, శ్రీరామ నవమి, వరలక్ష్మి వ్రతం, కృష్ణాష్టమి, దసరా (Dussera) దీపావళి (Diwali) ఎపుడు వచ్చాయో చూద్దామా?2025లో పెద్ద పండుగలు, వారం తేదీభోగి : సోమవారం (13/01/25)మకర సంక్రాంతి : మంగళవారం (14/01/25)కనుమ : బుధవారం(15/01/25)మహాశివరాత్రి: 26/02/25 (బుధవారం)హోలీ: శుక్రవారం (14/3/25)ఉగాది : ఆదివారం (30/3/25)శ్రీరామ నవమి : ఆదివారం( 6/04/25)వరలక్ష్మి వ్రతం : శుక్రవారం(8/08/25)శ్రీ కృష్ణాష్టమి : శనివారం (16/08/25)వినాయక చవితి: బుధవారం(27/08/25)దుర్గాష్టమి : మంగళవారం (30/09/25)విజయ దశమి లేదా దసరా : గురువారం(02/10/25) ఇదీ చదవండి: 2025లో ముఖ్యమైన పండుగలు, ఏ రోజున వచ్చాయో తెలుసా? దీపావళి:సోమవారం (20/10/25)క్రిస్మస్ : గురువారం (25/12/25)అలాగే 2025లో రిపబ్లిక్ డే (జనవరి 26), ఉగాది రోజులు ఆదివారం వచ్చాయి. -
అందాల అడవి రైతు.. హార్న్‌బిల్
పెద్దదోర్నాల: నల్లమల అభయారణ్యం విభిన్న వన్యప్రాణులకు నెలవు. ఇక్కడి అరుదైన పక్షులు, జంతు జాతులు పర్యావరణ ప్రేమికుల్ని అబ్బురపరుస్తాయి. పక్షిజాతుల్లో అత్యంత అరుదైన జీవనశైలి హార్న్‌బిల్ (ఫారెస్ట్ ఫార్మర్) పక్షుల సొంతం. వీటి స్వభావం అచ్చంగా మనుషుల్ని పోలి ఉంటుంది. మగ పక్షులు కుటుంబ బాధ్యతను మోస్తూ.. ఆడ పక్షులకు అవసరమైన తిండిని సంపాదిస్తూ.. వాటిని గూడు దాటకుండా బాధ్యతగా చూసుకుంటాయి. వీటిని అడవి రైతులుగా పిలుస్తుంటారు. పొడవైన ముక్కు, తోకలతో ఎంతో అందంగా, ఆకర్షణీయంగా కనపడతాయి. స్వచ్ఛమైన ప్రేమకు ప్రతిరూపం హార్న్‌బిల్ పక్షులు ఎత్తైన చెట్లలో సహజ సిద్ధంగా ఏర్పడ్డ గూళ్లలో నివసిస్తాయి. మగ పక్షులు పితృస్వామ్యాన్ని బాధ్యతగా నిర్వర్తిస్తూ కుటుంబ పోషణను చూసుకుంటాయి. తల్లి పక్షి గూడులో గుడ్లు పెట్టి పిల్లలను పొదుగుతుంది. పిల్లలతో కలిసి మూడు నెలలపాటు ఎటూ కదలకుండా గూట్లోనే ఉండిపోతుంది. మగ హార్న్‌బిల్ ఆ మూడు నెలలు ఆహారాన్ని సేకరించి.. గూట్లో ఉన్న తల్లి, పిల్ల పక్షులకు నోటిద్వారా అందిస్తుంది. ఆహారం కోసం తిరిగే సమయంలో మగ హార్న్‌బిల్ వేటగాళ్ల బారినపడినా.. ప్రమాదవశాత్తు మరణించినా గూటిలో ఉన్న తల్లి పక్షితోపాటు పిల్ల పక్షులు కూడా ఆకలితో చనిపోతాయే తప్ప ఇంకే ఆహారాన్ని ముట్టవు. దీంతోపాటు హార్న్ బిల్ పక్షుల దాంపత్య జీవనం ఎంతో పవిత్రంగా ఉంటుంది. ఇవి జీవితాంతం ఒకే పక్షితో జత కడతాయే తప్ప మరే పక్షిని దరిచేరనివ్వవు. నాగాలాండ్‌లో ఏటా ఉత్సవం హార్న్‌బిల్ పక్షుల జీవన విధానానికి ముగ్ధులైన నాగాలాండ్ వాసులు వాటి పేరిట ఏటా 10 రోజుల పాటు ఉత్సవాన్ని జరుపుకుంటారు. నాగాలాండ్ రాష్ట్ర రాజధాని కోహిమాకు 12 కిలోమీటర్లు దూరంలో గల కిసామాలోని గిరిజనులు హార్న్‌బిల్ ఉత్సవాన్ని సంప్రదాయంగా నిర్వహిస్తారు. డిసెంబర్ 1నుంచి 10వ తేదీ వరకు జరిగే ఈ ఉత్సవంలో చిన్నా పెద్డా తేడా లేకుండా అనేక సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించుకుంటారు.రెండు రాష్ట్రాల పక్షి అరుణాచల్ ప్రదేశ్, కేరళ రాష్ట్రాలు రాష్ట్ర పక్షిగా హార్న్‌బిల్‌ను గుర్తించాయి. ఈ పక్షుల జీవన కాలం 40 నుంచి 50 సంత్సరాలని అటవీశాఖ అధికారులు చెబుతున్నారు. వీటి పొడవు 95 నుంచి 120 సెంటీమీటర్లు కాగా.. రెక్కలు విప్పినప్పుడు వీటి వెడల్పు 151 సెంటీమీటర్ల నుంచి 178 సెంటీమీటర్లు ఉంటుందని పేర్కొంటున్నారు. ఇవి సుమారు 4 కేజీల బరువు ఉంటాయి.ఫారెస్ట్ ఫార్మర్ హార్న్‌బిల్ మగ పక్షి పండ్లను సేకరించి తల్లి, పిల్లలకు ఆహారంగా అందిస్తుంది. గూడుకు చేరుకున్న పక్షి పండ్ల గింజలను తొలగించి మరీ పిల్లలు, తల్లి నోటికి అందిస్తుంది. అలా అందిస్తున్నప్పుడు.. అది వదిలేసిన గింజలు నేలపై పడి.. అడవిలో మొలకెత్తి చెట్లుగా ఎదుగుతాయి. అందుకే.. ఈ పక్షిని అడవి రైతుగా పేర్కొంటారు. -
హరిత దీపావళి జరుపుకొందాం!
భూమిపై సమస్త జీవరాశి బ్రతకడానికి కీలక పాత్ర పోషిస్తున్న గాలి నేడు కలుషితమై జీవ జాతి మనుగడకు పెను శాపంగా మారుతోంది. మన ఆర్థిక, సామాజిక జీవితంపై వాయు కాలుష్యం తీవ్ర ప్రభావాన్ని చూపిస్తోంది. ముఖ్యంగా పరిశ్ర మలు, మోటార్ వాహనాలు, థర్మల్ విద్యుత్ కేంద్రాలు, అగ్నిపర్వతాలు పేలడం, గనుల తవ్వకం, పంట అవశేషాలు కాల్చడం, అడవులు నరకడం, పండగలు–శుభకార్యాల్లో బాణా సంచా కాల్చడం లాంటి కారణాల వలన వాయు కాలుష్యం పెరిగిపోతోంది. కలుషిత గాలిలోని సూక్ష్మాతి సూక్ష్మ రేణువులు మానవ,జంతు ఊపిరితిత్తుల వడపోత కేంద్రాలను దాటుకొని నేరుగా రక్తంలో చేరి రకరకాల వ్యాధులకు కారణమవు తున్నాయి. గాలి కాలుష్యం వల్ల ఉబ్బసం, ఊపిరితిత్తుల క్యాన్సర్, శ్వాస కోశ సంబంధమైన వ్యాధులు, గుండె జబ్బులు సంభవిస్తాయి. అంతేకాకుండా గర్భిణీ స్త్రీలు, గర్భస్థ శిశువులపై ప్రభావం చూపిస్తూ ‘నిశ్శబ్ద హంతకుడి‘గా వాయు కాలుష్యం వ్యవహరిస్తోంది.భారత్‌లోని చిన్నారుల మరణాల విషయంలో పోషకాహార లోపం తర్వాత వాయు కాలుష్య ప్రభావం అధికంగా ఉందని ‘లాన్సర్’ జర్నల్ పేర్కొంది. ప్రపంచ వాయు నాణ్యత నివే దిక–2023 ప్రకారం వాయు కాలుష్యంలో బంగ్లాదేశ్, పాకిస్తాన్ తర్వాత మూడో స్థానంలో భారత్ ఉండడం ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటికీ ఢిల్లీ కాలుష్య రాజధానుల్లో మొదటి స్థానంలో ఉంది. గడిచిన దశాబ్ద కాలం నుంచి మనదేశంలో పంట అవశేషాలు, బాణసంచా లాంటి కాలుష్య కారకాలు వాయు కాలుష్యంలో ప్రముఖ పాత్ర పోషిస్తున్నాయి. ‘గాలి నాణ్యత, వాతావరణ సూచన మరియు పరిశోధన వ్యవస్థ’ (ఎస్ఏ ఎఫ్ఏఆర్) అధ్య యనం ప్రకారం... శీతాకాలంలో ముఖ్యంగా దీపావళి పండుగ సందర్భంగా బాణాసంచా కాల్చడం వలన దీపావళి మరుసటి నాడు ఢిల్లీలో గాలి నాణ్యత సూచి ప్రమాదకర స్థితిలోకి వెళుతోంది. గాలి నాణ్యత సూచీ 0 నుండి 100 వరకు ఉంటేనే అది ఆరోగ్యకరమైన గాలిగా పరిగణిస్తారు. కానీ శీతాకాలంలో ఢిల్లీలో గాలి నాణ్యత సూచి రోజురోజుకూ దిగజారుతుంది. దీపావళి తర్వాత సాధారణ పరిస్థితి రావడా నికి ఢిల్లీలో 25 రోజులు, హైదరాబా దులో 16 రోజుల సమయం పడుతుందని సర్వేలు చెబుతున్నాయి. దీనికి కారణం విపరీతమైన టపా సులు పేల్చ డమే. పండగలు, ఉత్సవాల్లో పర్యావరణ హిత బాణా సంచాను మాత్రమే వాడాలి. రసాయనాలతో తయారు చేసిన టపాసుల స్థానంలో పర్యావరణహిత బాణసంచాను వాడకంపై ప్రజల్లో అవగాహన కల్పించాలి. దీపావళి పండుగ రోజున సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం రాత్రి 8 నుంచి 10 గంటల వరకు మాత్రమే టపాసులు కాల్చాలనే నిబంధన ప్రతి ఒక్కరూ పాటించాలి. హరిత దీపావళి అందరి జీవితాల్లో వెలుగు నింపాలి.– సంపతి రమేష్ మహారాజ్ ‘ ఉపాధ్యాయుడు -
పండుగల వేళ..ఢిల్లీలో హై అలర్ట్
సాక్షి,న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో పోలీసులు హై అలర్ట్ ప్రకటించారు. దసరా, దీపావళి పండుగల వేళ ఉగ్రవాదుల దాడులు జరిగే అవకాశం ఉండడంతో ఢిల్లీ పోలీసులను నిఘా వర్గాలు అలర్ట్ చేసినట్లు సమాచారం. పండుగల నేపథ్యంలో ఉగ్రవాదులు భారీ దాడులకు ప్లాన్ చేసినట్లు నిఘా వర్గాలకు సమాచారమందినట్లు తెలుస్తోంది. విదేశీయులను రక్షణ కవచంగా ఉపయోగించుకుని దాడులు చేసేందుకు ఉగ్రవాదులు వ్యూహాలు పన్నుతున్నారని నిఘా వర్గాలు హెచ్చరించాయి. కొన్ని దేశాల రాయబార కార్యాలయాలను లక్ష్యంగా చేసుకుని దాడులు జరగొచ్చని అనుమానిస్తున్నారు.పండుగల వేళ ఢిల్లీలోని అన్ని మార్కెట్లు, ప్రాపర్టీ డీలర్లు, కార్ డీలర్లు, గ్యారేజీల వద్ద తనిఖీలను పెంచాలని హోం శాఖ నుంచి పోలీసులకు ఆదేశాలందాయి. మరోపక్క సోషల్ మీడియా పోస్టుల ద్వారా మత విద్వేషాలు రెచ్చగొట్టేందుకు ఉగ్రవాద ముఠాలు కుట్రలు చేస్తున్నట్లు సమాచారం.ఇదీ చదవండి: ‘ఆప్’ ఎంపీ ఇంట్లో ‘ఈడీ’ సోదాలు -
Bihar: విషాదాన్ని మిగిల్చిన పండుగ.. నీట మునిగి 46 మంది మృతి
పాట్నా: బిహార్‌లో జివుతియా పండుగ వేడుకల్లో పెను విషాదం చోటు చేసుకుంది. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో నదీ స్నానాలు చేసే క్రమంలో 46 మంది నీట మునిగి మరణించారు. వీరిలో 37 మంది చిన్నారులు ఉన్నట్లు అధికారులు తెలిపారు. మరో ముగ్గురు గల్లంతైనట్లు పేర్కొన్నారు.కాగా బిహార్ రాష్ట్ర వ్యాప్తంగా బుధవారం ‘జీవిత్పుత్రిక’ పండుగ జరుపుకున్నారు. తమ పిల్లల క్షేమం కోసం తల్లులు ఉపవాసం ఉండటంతో పాటు పిల్లలతో కలిసి నదులు, చెరువుల్లో పవిత్ర స్నానాలు చేస్తారు. ఈ నేపథ్యంలో ఆ రాష్ట్రంలోని 15 జిల్లాల పరిధిలోని నదుల్లో పుణ్యస్నానాలు ఆచరిస్తూ సుమారు 46 మంది గల్లంతయ్యారు.వీరిలో ఇప్పటి వరకు 43 మంది మృతదేహాలను వెలికితీసినట్లు విపత్తు నిర్వహణ విభాగం(డీఎండీ) అధికారులు తెలిపారు. తదుపరి గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని చెప్పారు. తూర్పు, పశ్చిమ చంపారన్, నలంద, ఔరంగాబాద్, కైమూర్, బక్సర్, సివాన్, రోహ్తాస్, సరన్, పాట్నా, వైశాలి, ముజఫర్‌పూర్, సమస్తిపూర్, గోపాల్‌గంజ్, అర్వాల్ జిల్లాల్లో మునిగిపోయిన సంఘటనలు నమోదయ్యాయి.ఈ విషాద ఘటనలపై రాష్ట్ర ప్రభుత్వం దిగ్బ్రాంతి వ్యక్తం చేసింది. మృతుల కుటుంబాలకు రూ. 4 లక్షల చొప్పున నష్ట పరిహారం అందజేస్తామని సీఎం నితీష్‌కుమార్ వెల్లడించారు. నష్టపరిహారం అందించే ప్రక్రియ ప్రారంభమైందని, చనిపోయిన వారిలో ఎనిమిది మంది కుటుంబ సభ్యులకు ఇప్పటికే పరిహారం అందిందని సీఎం ఓ ప్రకటనలో తెలిపారు. -
ఖైరతాబాద్ గణేషుడి తొలిపూజలో సీఎం.. గవర్నర్ ప్రత్యేక పూజలు
సాక్షి, హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో వినాయక చవితి ఉత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ప్రజలు భక్తి శ్రద్ధలతో జరుపుకుంటున్నారు. ఖైరతాబాద్ గణేషుడికి సీఎం రేవంత్‌రెడ్డి తొలిపూజ నిర్వహించనున్నారు. 70 అడుగుల ఎత్తులో సప్తముఖ మహాశక్తి రూపంలో మహాగణపతి దర్శనమిస్తున్నారు.👉ఖైరతాబాద్ గణేశుడిని సీఎం రేవంత్‌రెడ్డి దర్శించుకున్నారు. సప్తముఖ వినాయకుడి వద్దకు చేరుకున్న ముఖ్యమంత్రికి.. స్థానిక ఎమ్మెల్యే దానం నాగేందర్ స్వాగతం పలికారు. అనంతరం రేవంత్‌రెడ్డి.. మహాగణపతికి గజమాల, పండ్లు సమర్పించారు. వినాయకుడి తొలిపూజలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్.. రాష్ట్రంలోని అన్ని గణేష్ ఉత్సవ కమిటీలకు ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు.తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ.. శనివారం మధ్యాహ్నం ఖైరతాబాద్ గణపతిని దర్శించుకున్నారు. ఈ సందర్బంగా గవర్నర్‌కు గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు సత్కరించారు. అనంతరం, గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ గణపతికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.👉ఏటా ఒక్కో రూపంలో దర్శనమిచ్చే మహాగణపతి ఈసారి 70 అడుగుల ఎత్తు, 28 అడుగుల వెడల్పుతో నిలబడిన ఆకారంలో బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు, మహంకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి రూపాలతో కూడిన సప్త ముఖాలు, ఆపై సప్త తలలతో ఆదిశేషావతారం, రెండువైపులా 14 చేతులతో కుడివైపు చక్రం, పుస్తకం, వీణ, కమలం, గద.. ఎడమవైపు రుద్రాక్ష, ఆసనం, పుస్తకం, వీణ, కమలం, గద ఉంటాయి. మహాగణపతికి కుడివైపున పది అడుగుల ఎత్తులో ప్రత్యేకంగా బాలరాముడి విగ్రహంతో ఈసారి దర్శనమిస్తున్నారు.👉ఎడమవైపు రాహు కేతువుల విగ్రహాలను 9 అడుగుల ఎత్తులో ఏర్పాటుచేశారు. మహాగణపతి పాదాల చెంత ఆయన వాహనమైన మూషికం ఆకారాలు 3 అడుగులలో దర్శనమిస్తున్నాయి. విగ్రహానికి కుడివైపున 14 అడుగుల ఎత్తులో శ్రీనివాస కళ్యాణం, ఎడమవైపు శివపార్వతుల కళ్యాణం విగ్రహ మూర్తులను ఏర్పాటు చేశారు. -
శంఖం... లక్ష్మీ స్వరూపం
ప్రాచీన భారతీయ సంస్కృతిలో శంఖానికి విశిష్ట స్థానం ఉంది. శ్రీమన్నారాయణుని మన సనాతన ధర్మంలో శంఖాన్ని మహావిష్ణు స్వరూపంగా, లక్ష్మీప్రదంగా వివరించారు.శంఖంలో పోస్తేనే తీర్థమన్నారు మనవారు. శాస్త్రప్రకారం శంఖం లక్ష్మీస్వరూపం.సముద్రంలో జీవించు ఒక ప్రాణి ఆత్మరక్షణ కోసం శరీరానికి నాలుగువైపుల రక్షణ కవచం నిర్మించుకొంటుంది. కొంతకాలం తర్వాత అది కవచం వదిలి కొత్త కవచం కట్టుకోవడంలో లీనమవుతుంది. ఆ కవచమే మనకు చిరపరిచయమైన శంఖం.అర్చన సమయాలలో శంఖనాదం చేస్తారు. బెంగాల్లో వివాహ సందర్భంగా శంఖధ్వని తప్పనిసరి, శంఖం లోపలి భాగం ముత్యంలా ఉంటుంది. అందులో చెవి పెట్టి వింటే సముద్ర ఘోష వినిపిస్తుంది. శంఖంలో ΄ోసిన తీర్థం సేవించడం వల్ల వాత పిత్త దోషాలు, సమస్త రోగాలు తొలగి ΄ోతాయని పరమపురుష సంహిత చెబుతోంది.శంఖాలలో దక్షిణావర్త శంఖం శ్రీ విష్ణువుకు, లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరం అయింది. ఈ శంఖం ఉన్న ఇంటిలో అఖండ సంపదలతో లక్ష్మి నివసిస్తుందని ప్రతీతి. చాలామంది పూజలో ఈ శంఖాన్ని పెడతారు. పుణ్యదినాలలో ఇంట్లో పూజచేసి దేవతార్చనలో పెట్టాలి. శ్రీరామనవమి, విజయదశమి, గురుపుష్యమి, రవిపుష్యమి నక్షత్రాలు, పుణ్యతిథులు ఈ పర్వదినాల్లో తప్పకుండా పూజ చేయాలని పెద్దలు చెప్పారు. -
రంగస్థల నాటకానికి రక్షాకంకణం
సినీ’మాయే’ – విస్తృతమై, ‘నాటు నాటు’ అంటూ నాటుకుంటున్న ఈ కాలాన నీటుగా, ఉదాత్త విలువల దీటుగా – నాటకం పట్ల సమాజంలో కళాభిరుచులకు ఆస్కారంగా, ఆదరాభిమానాలు పాదుకు నేలా రంగస్థల నాటకానికి ప్రాపుగా ఒక కాపు కాస్తూ, కృషి చేస్తున్న సంస్థల్లో ఒకటి ‘రసరంజని’. జీవధార కళగా రంగస్థల నాట కాన్ని పరివ్యాప్తం చేస్తూ, సొంత రిపర్టరీ నిర్వహణతో బాటు – ఎన్నో నాటక సమా జాలకు వెన్నుదన్నుగా నిలిచి ప్రోత్సహిస్తూ, మూడు దశాబ్దాలుగా నాటక రంగాభి మానుల మన్ననలు అందుకుంటున్న సంస్థ రసరంజని. ‘వరల్డ్ థియేటర్ డే’ను మార్చి 27న జరుపుకొంటున్న సందర్భంగా రసరంజని 3 రోజులపాటు నాటకోత్సవాలు నిర్వహిస్తోంది. పౌరాణిక నాటకాలు, చారిత్రకాలు, సాంఘిక నాటకాలు ఎన్నో సమాజాభివృద్ధిలో, సామాజిక చైతన్యంలో గణనీయమైన పాత్ర పోషించాయి. నాటక ప్రదర్శన అన గానే జనం ఒకప్పుడు తండోపతండాలుగా బండ్లు కట్టుకుని మరీ తరలి వెళ్లేవారు. ఆ రోజుల్లో సురభి వంటి నాటక సమాజాల కీర్తి సురభిళాలు పరివ్యాపితమై విరాజిల్లేవి.పాండవోద్యోగ విజయాలు, శ్రీకృష్ణరాయ బారం వంటి పద్యనాటకాల లగాయితు కన్యాశుల్కం, వరవిక్రయం, చిల్లర దేవుళ్ళు ఇలా చెప్పుకుంటూపోతే అంతులేని పట్టి కగా... జనాదరణ పొంది సమాజంపై ప్రభా వం చూపిన రంగస్థల నాటకాలు ఎన్నో. ఈ తరానికి వాటిని (ప్ర)దర్శింపచేయడంలో ‘రసరంజని’ పాత్ర అవిస్మరణీయం. నాటక రంగ అభివృద్ధి కోసం, ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనూ నాటకం విస్తృతంగా ప్రదర్శింపబడాలనీ, నాటకం ప్రజల మధ్యకి వెళ్లాలనీ, నాటకం ద్వారా సమాజ చైతన్యం జరగాలనీ ముఖ్యంగా ఎన్ని ఇక్కట్లున్నా టిక్కెట్టు కొని నాటకం చూడడం అనే ఉత్తమాభిరుచిని జనం విడనాడకూడదనే సంకల్పంతో నేటికీ రంగస్థల నాటక ప్రదర్శ నలకే కట్టుబడి 31 ఏళ్లుగా నెలనెలా రసరంజని నిర్వహిస్తున్న కార్యక్రమాలు నాటకరంగానికే తలమానికాలు.‘రసరంజని’ 1993 మార్చి 8న నెల కొల్పబడింది. ఈ మూడు దశాబ్దాల ప్రయా ణంలో దాదాపు 700 నాటకాలు, మూడు వేల అయిదువందల ప్రదర్శనలు – సంస్థ కళాకారులతోనే కాక అనేక నాటక సమా జాల వారితో ప్రదర్శించడమైంది. సొంత రిపర్టరీ నెలకొల్పడం ద్వారా ఎందరో నటీనటులకు, రచయితలకు, దర్శ కులకు, రంగస్థల సాంకేతిక నిపుణులకు శిక్షణ ఇచ్చి, తద్వారా వారు నాటకరంగంలో స్థిరపడి వన్నెవాసికెక్కడానికి రసరంజని దోహదపడింది. రంగస్థలంపై రసరంజని కథానాటక సప్తాహాలు, కథానాటక శరన్న వరాత్రులు, తెలుగు హాస్య నాటకోత్సవాలు, జాతీయ నాటక ప్రదర్శనలు, జాతీయహిందీ నాటకోత్సవాలు వంటి కార్యక్రమాల ద్వారా ప్రదర్శనలు అందించి తనదైన ప్రత్యే కతను చాటుకుంది. ‘ప్రపంచమే ఒక నాటక రంగం. ప్రతి ఒక్కరం పాత్ర ధారు లమే!’ దర్శకుడు వేర యినా, మనమే అయినా, జీవితం అనే తెర పడే వరకూ అంకాలు మారుతూ బ్రతుకు దృశ్యాలు ఘటనలూ, సంభా షణలూ వెలుగు నీడలతో వివిధ రసా లతో సాగుతూనే ఉంటాయి అనే మాట మనం వింటూ వస్తున్నదే ! అటువంటప్పుడు నాటకమే ప్రపంచంగా, సమాజహిత చింతనతో కృషి చేస్తున్న నాటకరంగం సంస్థలను సమాదరించడం జనకర్తవ్యం. వారు కోరుతున్నది నాటకం చూడమని! నాటకాన్ని సమాదరించడం అంటే జీవితాన్ని సమాదరించడమే! మనిషినీ, మానవతనూ సమాదరించడమే! - వ్యాసకర్త ఆకాశవాణి విశ్రాంత అధికారి -సుధామ -
వూడూ ఫెస్టివల్! ఈ వేడుకకు దెయ్యాలొచ్చి నృత్యాలు చేస్తాయట!
ప్రపంచవ్యాప్తంగా మతపరమైన ఆచారాల్లోని ఎన్నో వింతలు, విచిత్రాల గురించి విన్నాం, చూశాం. అయితే, ‘హైతియన్ వూడూ’ అనే ప్రాచీనమతానికి చెందిన ఆఫ్రికన్ భక్తులు నిర్వహించే ‘వూడూ ఫెస్టివల్’ ప్రపంచానికే మిస్టరీ. సాధారణంగా సంప్రదాయ వేడుకల్లో.. మనిషిని దేవుడు ఆవహించడం, మనుషులు పూనకాలొచ్చి ఊగడం లాంటివి చూస్తుంటాం. అలాంటి జాతరల్లో.. కొందరు భక్తులు బృందాలుగా విడిపోయి రకరకాల వేషధారణలతో.. డప్పు దరువుల మధ్య గజ్జె కట్టి తాండవమాడటం తెలిసిందే. అయితే ఈ వూడూ వేడుకకు దయ్యాలొస్తాయి. స్వయంగా నాట్యమాడతాయి. ఎంతటివారినైనా నిర్ఘాంతపరుస్తాయి. ‘ఈ బొమ్మ లోపల ఉన్నది మా పూర్వీకుల ఆత్మే’ అని చెబుతుంటారు వూడూ మతస్థులు. ఆశ్చర్యంగా ఉంది కదూ! కానీ ఈ పండుగకు వెళ్లిన వాళ్లంతా.. అక్కడ నోరెళ్లబెట్టి రావాల్సిందే. ఏమిటా కథ? పశ్చిమ ఆఫ్రికాలోని బెనిన్, టోగో, ఘనా వంటి దేశాల్లో కొన్ని నగరాలు.. జనవరి నెలొస్తే ప్రపంచ పర్యాటకులతో కిటకిటలాడు తుంటాయి. జనవరి 7 నుంచి సుమారు 14 రోజుల పాటు ఈ సంబరాలు అంబరాన్ని అంటుతాయి. రకరకాల వేషధారణలతో భక్తులు.. నిప్పుల గుండాల చుట్టూ తిరుగుతూ.. నృత్యాలు చేస్తూ ఆకట్టుకుంటారు. ఈ మొత్తం వేడుకలో గుర్రం పందాలతో పాటు.. ‘వూడూ ఘోస్ట్ డాన్స్’ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. ఈ పండుగ ప్రతి ఇంట్లో తమ పూర్వీకుల ఆత్మలకు గౌరవార్థంగా ప్రార్థన చేయడంతో మొదలవుతుంది. తర్వాత చిన్నచిన్న మనిషి ప్రతిమలను పెట్టి.. అందులోకి చనిపోయినవారి ఆత్మలను ఆహ్వానిస్తారట. అనంతరం పూజ చేసి.. మేకను బలిచ్చి, మద్యంతో పాటే.. నైవేద్యంగా పెట్టి.. ఆత్మలకు శాంతి కలిగిస్తారట. గడ్డి, ఎండిన ఆకులు, నల్ల కుండలు, పుర్రెలు, కర్రల సాయంతో ఎత్తైన పెద్ద బొమ్మలను తయారు చేసి.. వాటిని రాత్రి అయ్యేసరికి ప్రదర్శన కోసం తీసుకొస్తుంటారు చాలామంది. అయితే అలా తీసుకెళ్లే ముందు.. ఆ బొమ్మలకు పూర్వీకుల ఆత్మశక్తిని ఆపాదిస్తారట. ప్రత్యేకమైన పూజలు చేసి.. ఆ వూడూ బొమ్మల్లో కనిపించని అదృశ్యశక్తిని నింపుతారట. వాటిని జాతరకు తీసుకుని వెళ్లి ప్రదర్శన ఇస్తున్నప్పుడు.. అవి చూపరులను హడలగొట్టేలా నృత్యాలు చేస్తాయి. అయితే అవేం హాని కలిగించవు. అలా అని వాటిని తాకడానికి ప్రయత్నించకూడదని స్థానికులు హెచ్చరిస్తుంటారు. కొన్ని వూడూ బొమ్మల్లో మనుషులుండి దాన్ని నడిపిస్తారు. అందులోంచే నృత్యం చేస్తుంటారు. కానీ ఇంకొన్ని వూడూ బొమ్మలు మాత్రం.. మనిషి సాయం లేకుండానే ఏదో కనిపించని శక్తి నడిపిస్తున్నట్లుగా కదులుతాయి. ‘ఈ బొమ్మలో మనిషి లేడు.. కేవలం ఇదంతా ఆత్మ కోలాహలమే’ అనే విషయాన్ని తెలియపరచడానికి.. ఆ బొమ్మను మధ్యమధ్యలో ఎత్తి.. చూపిస్తుంటారు ఆ వంశస్థులు. ‘వూడూ మతస్తులు ఆత్మలతో మాట్లాడతారు. చేతబడులు చేస్తారు’ అనే ప్రచారం.. అక్కడ నివసించే ఇతర స్థానికులకు ఓ సూచన. విదేశీయులను అదుపులో ఉంచే ఒక హెచ్చరిక. ఏదిఏమైనా ఈ వూడూ ఫెస్టివల్లో.. ప్రాణంలేని కొన్ని బొమ్మలు మనిషి సాయం లేకుండా ఎలా కదులుతున్నాయి? ఎలా నాట్యం చేస్తున్నాయి? అనేది నేటికీ మిస్టరీనే! ప్రతి ఏటా బెనిన్లోని కోటోనౌ, ఔయిడా, అబోమీ, గాన్వీ, నాటిటింగౌ, పోర్టో నోవో, అల్లదా నగరాల్లో.. టోగోలోని లోమ్, టోగోవిల్ నగరాల్లో.. ఘనాలోని అక్రా, కేప్ కోస్ట్, కుమాసి నగరాల్లో ఈ సంబరాలు జరుగుతుంటాయి. సుమారు ఐదువందల ఏళ్ల క్రితం నుంచే ఈ ఆచారాన్ని పాటిస్తున్నారు వూడూ మతస్థులు. ఈ మతం 1996లో అధికారికంగా గుర్తింపు పొందింది. పశ్చిమ ఆఫ్రికా దేశంలోని 13 మిలియన్ల జనాభాలో 12% మంది వూడూను అభ్యసిస్తున్నారట. ఈ ఆధ్యాత్మిక మూలాలతో ఆచారాలతో పర్యాటకులను ఆకర్షించడానికి ప్రభుత్వం నిర్ణయించింది. అందుకే ఈ జాతరను, పండగను ఆయా దేశాలు ప్రెస్టీజియస్‌గా నిర్వహిస్తుంటాయి. ---సంహిత నిమ్మన (చదవండి: తవ్వకాల్లో రెండువేల ఏళ్ల నాటి చెయ్యి..దానిపై మిస్టీరియస్..!) -
బంతిపూలకు మాత్రమే ఆ ప్రత్యేకత.. అందుకే పూజల్లో వాడుతారు
వేడుక వచ్చిందంటే చాలు బంతిపూల తోరణాలతో ఇళ్లూ వాకిళ్లు కళకళలాడుతూ ఉంటాయి. బంతిపూలకు మాత్రమే ఈ ప్రత్యేకత ఉంది. అందానికి, ఆరోగ్యానికి మేలు చేసే బంతిని మనకు ప్రకృతి ఇచ్చిన బహుమతిగా చెప్పచ్చు. తెల్లవారుజామున సూర్యుడు ఉదయించగానే భూమిలోని చీకట్లు తొలగి వెలుగు రేకలు అంతటా వ్యాపిస్తాయి. అదేవిధంగా, బంతిపువ్వును చూడగానే, మన మనస్సు తన బాధలను మరచిపోయి సంతోషిస్తుంది. ఈ సారూప్యత వల్ల బంతిపువ్వును సూర్యభగవానుడికి చిహ్నంగా చెప్పుకోవచ్చు. గణేష్ చతుర్థి, నవరాత్రుల నుండి దీపావళి వరకు ఈ పూలకు చాలా డిమాండ్ ఉంది. మ్యారిగోల్డ్ శాస్త్రీయ నామం టాగెట్స్. భారతదేశానికి 350 సంవత్సరాల క్రితం పోర్చుగీసు వారి రాకతో మెక్సికో నుండి చేరుకుంది బంతి. చాలా అందంగా కనిపించే పసుపు, కుంకుమ రంగులో ఉండే ఈ పువ్వులను అందరూ ఇష్టపడతారు. విస్తారంగా సాగు.. మన దేశంలో బంతిపూల సాగు పెద్ద ఎత్తున చేస్తుంటారు రైతులు. ఇది మతపరమైన ఆచారాలతో పాటు, అనేక ఉత్పత్తుల తయారీలలో కూడా ఉపయోగపడుతుంది. సీజన్‌ను బట్టి బంతి పువ్వులను సాగు చేస్తారు. ఇది ఏప్రిల్, మే నెలల్లో సాగును ప్రారంభిస్తే ఆగస్టు–సెప్టెంబర్లలో చలికాలం ప్రారంభమవడానికి ముందు పంట చేతికొస్తుంది. ఈ రాష్ట్రాల్లో ఎక్కువ ప్రపంచవ్యాప్తంగా 50 రకాల బంతి పువ్వులు ఉన్నాయి, వాటిలో మూడు జాతులు వాణిజ్య, వ్యవసాయం కోసం పెరుగుతాయి. ఉత్తరప్రదేశ్, హర్యానా, ఉత్తరాఖండ్, పశ్చిమ బెంగాల్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర వంటి రాష్ట్రాల పొలాలు బంతి పువ్వులతో వెలిగిపోతుంటాయి. త్యాగానికి పేరు బంతి పువ్వు బృహస్పతికి ఇష్టమైనదిగా జ్యోతిష్యులు చెబుతుంటారు. దేవతల గురువు బృహస్పతిని బంతి పువ్వులతో పూజిస్తే జ్ఞానం పెంపొందుతుందని నమ్మకం. పసుపు–కుంకుమపువ్వును కలిపినట్టుగా ఉండే ఈ రంగు త్యాగానికి ప్రసిద్ధి చెందింది, మరోవైపు ఇది అగ్ని వంటి ఉగ్రమైన వ్యక్తిత్వాన్ని కూడా ప్రతిబింబిస్తుంది. ప్రజల మొదటి ఎంపిక ప్రజలు తమ ఇళ్లను బంతి పువ్వులతో అలంకరిస్తారు. కోల్‌కతా నుంచి వచ్చే బంతిపూలలో ఒకటి ఎరుపు, మరొకటి పసుపు. ఈ రంగు పువ్వులను బసంతి మేరిగోల్డ్ అంటారు. ఇదే అన్ని చోట్ల జనం మొదటి ఎంపికగా ఎంచుకుంటున్నారు. బంతిపూలతో అందంగా మెరిసిపోవచ్చు బొబ్బలు, కాలిన గాయాలు, దురదలు, చర్మవ్యాధుల నివారణలో బంతి పువ్వులను ఉపయోగిస్తారని ఆయుర్వేదంలో ఉంది. ఇందులో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు రక్తకణాలను ఉత్పత్తి చేసి చర్మాన్ని మృదువుగా, ఆరోగ్యంగా మార్చగలవు. బంతి పువ్వులు వాపునే కాదు అలసటను తగ్గించడానికి కషాయంలా కూడా ఉపయోగిస్తారు. బంతి పువ్వు పొడి ముడతలు పడిన చర్మాన్ని మృదువుగా చేయడంలో కూడా సహాయపడుతుంది. బంతి పువ్వులు సహజ యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలను కలిగి ఉంటాయి. ఇవి కాలుష్యం నుండి చర్మాన్ని కాపాడతాయి. అందమైన ప్రయోజనాలు బంతిపూలు యాంటీ బయొటిక్, యాంటీ ఫంగల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలను కలిగి ఉంటాయి. మేరిగోల్డ్ ఫేస్ ప్యాక్ ముఖ చర్మాన్ని బిగుతుగా చేయడంతో పాటు చర్మకాంతిని పెంచడంలో ప్రభావవంతంగా పనిచేస్తుంది. మొటిమలు, ముఖంపై మచ్చలు ఉన్నవారు బంతి పువ్వు ఫేస్ ప్యాక్‌ని ఉపయోగించవచ్చు. అందుకే, సౌందర్య ఉత్పత్తులు, మసాజ్ నూనెలు, లోషన్లు, సబ్బులు.. మొదలైన ఉత్పత్తులలో బంతిపువ్వులను ఉపయోగిస్తారు. దీని ఉపయోగం శరీరానికి చల్లదనాన్ని అందిస్తుంది. దీన్ని నొప్పి, వాపును తగ్గించడానికి, పేగు, కడుపు రుగ్మతల నుండి ఉపశమనానికి, అల్సర్లను నయం చేయడానికి కూడా ఉపయోగిస్తారు. -
రూ.76 లక్షల రేంజ్ రోవర్ కేవలం రూ.100కే..! ఎగబడుతున్న జనం..
తక్కువ ధరలో కారు కొనాలన్నా.. కనీసం ఐదు లక్షలైనా ఉండాలి. లగ్జరీ కార్ల విషయానికి వస్తే కోట్లు ఖర్చుపెట్టాల్సి ఉంటుంది. కానీ ఇప్పుడు కేవలం రూ. 100 పెడితే లక్షల ఖరీదైన కారు గెలుచుకోవచ్చు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. అస్సాంలో ప్రతి ఏటా నిర్వహించే హౌలీ రాస్ ఫెస్టివల్ (Howly Raas Festival) ముందు నిర్వాహక కమిటీ గత సంవత్సరం మాదిరిగానే లాటరీని నిర్వహించింది. ఇందులో మొదటి బహుమతి రూ.76 లక్షల విలువైన రేంజ్ రోవర్. రెండవ బహుమతి రూ. 50 లక్షల విలువైన టయోటా ఫార్చ్యూనర్, స్కార్పియో, మూడవ బహుమతి స్కోడా కుషాక్, నెక్సాన్ ఉన్నాయి. ఈ ఖరీదైన కార్లను సొంతం చేసుకోవాలంటే కేవలం రూ.100 పెట్టి లాటరీ టికెట్ కొంటే సరిపోతుంది. ఈ లాటరీ అనేది గత 95 సంవత్సరాలుగా నిర్వహిస్తున్నట్లు, విజేతలకు కార్లను బహుమతిగా ఇస్తున్నట్లు తెలుస్తోంది. ఈ లాటరీ విషయం తెలిసి చాలామంది టికెట్ కొనటానికి బారులు తీరుతున్నారు. ఇదీ చదవండి: వారానికి 60 గంటల కంటే ఎక్కువే.. పని గంటలపై ఇదిగో ప్రూఫ్.. లాటరీ టికెట్ కొనుగోలు చేసిన తరువాత విజేతలను 2023 డిసెంబర్ 10న ప్రకటించనున్నారు. లాటరీ టికెట్స్ అమ్మిన డబ్బును వివిధ కార్యక్రమాలను ఉపయోగిస్తారు. ఈ ఏడాది నవంబర్ 24 నుంచి డిసెంబర్ 10 వరకు రాస్ పండుగను నిర్వహిస్తారు. గతేడాది మొత్తం 3.2 లక్షల లాటరీ టికెట్స్ అమ్ముడయ్యాయి, ఈ సారి సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉంది. -
అమ్మవారి నామాలే ఆ మహా నగరాలు!
విభిన్న నామాలతో, వివిధ రూపాలలో ఆయా ప్రాంతాల్లో కొలువైన ఆ ఆదిపరాశక్తి పేరు మీద ఏకంగా కొన్ని మహానగరాలే వెలిశాయంటే ఆశ్చర్యం కాక మరేమిటి? అమ్మవారి నామంతో వెలసిన అలాంటి నగరాలు కొన్ని... వాటి ప్రాశస్త్యం క్లుప్తంగా... కోల్‌కతా – కాళీమాత కోల్‌కతా పేరు చెప్పగానే ఆ మహానగరంలో వెలసిన కాళికాదేవి రూపంతోపాటు కాళీఘాట్‌లో ప్రతి యేటా అంగరంగ వైభవంగా జరిగే దసరా ఉత్సవాలు కళ్లకు కడతాయి. నల్లని రూపంతో, రక్త నేత్రాలతో, పొడవాటి నాలుక బయటపెట్టి ఎంతో రౌద్రంగా కనిపించే ఈ అమ్మవారు తనను పూజించే భక్తుల పాలిట కరుణామయి. కన్నతల్లిలా బిడ్డలను కాపాడుతుంది. కోల్‌కతాకు ఆ పేరు రావడం వెనక ప్రాచుర్యంలో ఉన్న కొన్ని పురాణ గాథలను చూద్దాం... ‘కాళీఘాట్’ అనే పదం నుంచి ఈ నగరానికి కోల్‌కతా అనే పేరొచ్చినట్లు చాలామంది చెబుతారు. అలాగే బెంగాలీ భాషలో కాలికా క్షేత్ర అంటే.. కాళికాదేవి కొలువై ఉన్న ప్రాంతం అని అర్థం. అమ్మవారు కొలువైన కాళీఘాట్ కాళీ దేవాలయానికి వందల ఏళ్ల చరిత్ర ఉన్నట్లు స్థల పురాణం చాటుతోంది. మంగళాదేవి పేరు మీదుగా మంగళూరు కర్ణాటకలోని ముఖ్య పట్టణాల్లో మంగళూరు ఒకటి. ఇక్కడ కొలువైన మంగళాదేవి పేరు మీదే ఈ నగరానికి మంగళూరు అనే పేరొచ్చింది. పురాణాల ప్రకారం మంగళాదేవి ఆలయాన్ని శ్రీ మహావిష్ణు దశావతారాల్లో ఆరో అవతారమైన పరశురాముడు స్థాపించినట్లు తెలుస్తుంది. ప్రతిసారీ దసరా శరన్నవరాత్రుల సమయంలో మంగళాదేవికి ఇక్కడ ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఈ క్రమంలో సప్తమి రోజున ‘చండీ’ లేదా ‘మరికాంబ’గా, అష్టమి రోజున ‘మహా సరస్వతి’గా, నవమి రోజు ‘వాగ్దేవి’గా పూజలందుకుంటోందీ తల్లి. మహర్నవమి రోజున అమ్మవారి ఆయుధాలకు విశేష పూజలు నిర్వహించడంతోపాటు చండీయాగం కూడా చేస్తారు. దశమిరోజు అమ్మవారిని దుర్గా దేవిగా అలంకరించిన తర్వాత నిర్వహించే రథయాత్ర ఎంతో కన్నుల పండువగా సాగుతుంది. ముంబై – ముంబా దేవి దక్షిణ ముంబైలోని బులేశ్వర్ ప్రాంతంలో కొలువైన ఈ ఆలయంలోని అమ్మవారు వెండి కిరీటం, బంగారు కంఠహారం, రతనాల ముక్కుపుడకతో అత్యంత శోభాయమానంగా దర్శనమిచ్చే ఈ అమ్మల గన్న అమ్మను దర్శించుకోవడం పూర్వజన్మ సుకృతమే అని చెప్పవచ్చు. ఇక్కడ దసరా ఉత్సవాలు మహాద్భుతంగా జరుగుతాయి. వాణిజ్యపరంగా దేశంలోకెల్లా అత్యంత సుప్రసిద్ధమైన ముంబై మహానగరానికి ఆ పేరు రావడంలో అక్కడ వెలసిన ముంబాదేవి ఆలయమే కారణం. ఇందుకో పురాణ కథనం ఉంది. పార్వతీమాత కాళికాదేవిగా అవతారమెత్తే క్రమంలో ఆ పరమశివుని ఆదేశం మేరకు ‘మత్స్య’ అనే పేరుతో ఇప్పుడు ముంబైగా పిలుస్తున్న ప్రాంతంలో ఓ మత్స్యకారుల వంశంలో పుట్టిందట. ఆమె అవతారం చాలించే సమయంలో మత్స్యకారుల కోరిక మేరకు ‘మహా అంబ’గా వెలిసిందని, కాలక్రమేణా ఆమె పేరు‘ముంబాదేవి’గా మారినట్లు స్థలపురాణం ద్వారా తెలుస్తుంది. శ్యామలాదేవి పేరు మీదుగా సిమ్లా సాక్షాత్తూ ఆ కాళీమాతే శ్యామలా దేవిగా వెలసిన పుణ్యస్థలి సిమ్లా అని స్థలపురాణం చెబుతోంది. ఈ గుడిని 1845లో బ్రిటిష్ పరిపాలనా కాలంలో బెంగాలీ భక్తులు జకు అనే కొండపై నిర్మించారట! ఎంతో ప్రశాంతమైన వాతావరణంలో శ్యామవర్ణంలో మెరిసే దుర్గా మాత రూపం చూపరులను కట్టిపడేస్తుంది. చండీగఢ్ – చండీ మందిర్ అటు పంజాబ్‌కు, ఇటు హరియాణాకు రాజధానిగా విరాజిల్లుతోన్న చండీగఢ్ నగరానికి ఆ పేరు రావడం వెనక అమ్మవారి పేరే కారణం. చండీ అంటే పార్వతీదేవి ఉగ్రరూపమైన చండీమాత అని, గఢ్ అంటే కొలువుండే కోట అని అర్థం. ఇలా ఈ నగరానికి చండీగఢ్ అని పేరు వచ్చిందంటే అక్కడ కొలువైన చండీ దేవాలయమే కారణం. చండీగఢ్‌కు 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న పంచకుల జిల్లాలో కల్క పట్టణంలో కొండపై వెలసిందీ దేవాలయం. పాటన్‌దేవి పేరుతో పట్నా శక్తి స్వరూపిణి ‘పాటన్‌దేవి’ అమ్మవారు కొలువైన ఆలయం ఉండటమే పట్నాకు ఆ పేరు రావడానికి కారణం. ఈ ఆలయం 51 సిద్ధ శక్తి పీఠాలలో ఒకటిగా విరాజిల్లుతోంది. పురాణ గాథల ప్రకారం దక్షయజ్ఞం సమయంలో అగ్నికి ఆహుతైన సతీదేవి శరీరాన్ని మహావిష్ణువు ముక్కలుగా ఖండించగా, కుడి తొడభాగం ఈ ప్రాంతంలో పడిందట! అలా వెలసిన అమ్మవారిని మొదట్లో ‘సర్వానందకరి పాటనేశ్వరి’ అనే పేరుతో కొలిచేవారు. కాలక్రమంలో.. ఆ పేరు‘పాటనేశ్వరి’గా, ఇప్పుడు ‘పాటన్‌దేవి’గా రూపాంతరం చెందుతూ వచ్చింది. దసరా సమయంలో పది రోజులపాటు ఇక్కడ అమ్మవారికి ప్రత్యేక అభిషేకాలు, అర్చనలు, హారతులతో కన్నుల పండువగా ఉత్సవాలు జరుగుతాయి. నైనాదేవి పేరుతో నైనిటాల్ ఆహ్లాదకరమైన వాతావరణం, అందమైన కొండ ప్రాంతాలతో అత్యంత శోభాయమానంగా అలరారే నైనిటాల్‌కు ఆ పేరు రావడం వెనక ఓ అద్భుతమైన చరిత్ర ఉంది, దక్షయజ్ఞంలో దహనమైన సతీదేవి శరీరాన్ని ఖండించినప్పుడు ఆమె నేత్రాలు ఈ ప్రదేశంలో పడినట్లుగా స్థల పురాణం చెబుతోంది. మహిషాసురుడిని సంహరించిన కారణంగా నైనాదేవి కొలువైన చోటును మహిషపీuŠ‡ అని కూడా పిలుస్తారు. అలా మహిషుడిని సంహరించిన సమయంలో దేవతలందరూ అమ్మవారిని ’జై నైనా’ అంటూ నినదించడం వల్ల ఈ అమ్మవారు అప్పట్నుంచి ‘నైనాదేవి’గా పూజలందుకుంటోందట. శక్తి పీఠాలలో ఒకటైన ఈ ఆలయంలో విజయదశమి ఉత్సవాలు మహాద్భుతంగా జరుగుతాయి. దుర్గా మాత పేరుతో విరాజిల్లే మరికొన్ని ప్రాంతాలు అంబాలా – భవానీ అంబాదేవి (హరియాణా) అంబ జోగే – అంబ జోగేశ్వరి/ యోగేశ్వరి దేవి (మహారాష్ట్ర) తుల్జాపుర్ – తుల్జా భవాని (మహారాష్ట్ర) హసన్ – హసనాంబ (కర్ణాటక) త్రిపుర – త్రిపురసుందరి (త్రిపుర) మైసూరు – మహిషాసురమర్దిని (కర్ణాటక) కన్యాకుమారి – కన్యాకుమారి దేవి (తమిళనాడు) సంబల్పూర్ – సమలాదేవి/ సమలేశ్వరి (ఒడిశా) (చదవండి: ఇంటిని పాజిటివ్ ఎనర్జీతో నింపేలా కళాత్మకంగా తీర్చిదిద్దుకోండిలా..! ) -
బాలాత్రిపుర సుందరీ దేవిగా దుర్గమ్మ
సాక్షి ప్రతినిధి, విజయవాడ: ఇంద్రకీలాద్రిపై శరన్నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. ఆదివారం తెల్లవారుజామున 3 గంటలకు వేద పండితులు, అర్చకుల సుప్రభాత సేవతో అమ్మవారి శరన్నవరాత్రి ఉత్సవాలకు అంకురార్పణ జరిగింది. తొలిరోజు స్నపనాభిషేకం అనంతరం బాలా త్రిపుర సుందరీ దేవీ అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. ఉదయం 8.40గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు అమ్మవారిని దర్శించుకునే అవకాశం కల్పించారు. ఆదివారం, దసరా సెలవులు కావడంతో తొలి రోజు నుంచే ఆలయానికి పెద్ద సంఖ్యలో భక్తులు రావడంతో క్యూలైన్లు, కంపార్ట్మెంట్లు నిండిపోయాయి. క్యూలైన్లలో భక్తులకు ఇబ్బంది లేకుండా తాగునీటి సౌకర్యం కల్పించారు. స్నానఘాట్లల్లో ప్రత్యేకంగా షవర్లు, తలనీలాలు సమర్పించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. భక్తుల దర్శనానికి ఎటువంటి అంతరాయం కలుగకుండా వీవీఐపీల సమాచారం ముందుగా తెలియజేస్తే ప్రొటోకాల్‌కు ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు చేస్తామని కలెక్టర్ ఎస్.ఢిల్లీరావు చెప్పారు. సాయంత్రం అమ్మవారి ఉత్సవమూర్తులతో నగరోత్సవం నిర్వహించి, పంచహారతులను సమర్పించారు. సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను ఆకట్టుకున్నాయి. దేవదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ ఉత్సవ ఏర్పాట్లను పరిశీలించారు. కాగా, శరన్నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా రెండోరోజైన సోమవారం నాడు శ్రీ కనకదుర్గమ్మవారు భక్తులకు శ్రీ గాయత్రీదేవీగా దర్శనమివ్వనున్నారు. దుర్గమ్మ సేవలో గవర్నర్ దంపతులు ఇంద్రకీలాద్రి (విజయవాడ పశ్చిమ): దసరా మహోత్సవాల్లో భాగంగా తొలి రోజైన ఆదివారం బాలత్రిపుర సుందరిదేవి అలంకారంలో ఉన్న దుర్గమ్మను గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ దంపతులు దర్శించుకున్నారు. దర్శనానికి విచ్చేసిన గవర్నర్‌కు వేద పండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు జరిపించుకున్న అనంతరం ఆయనకు వేద పండితులు ఆశీర్వచనం అందజేశారు. గవర్నర్‌కు అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలు, పట్టువస్త్రాలను దేవదాయ శాఖ కమిషనర్ సత్యనారాయణ, ఎమ్మెల్యే వెలంపల్లి శ్రీనివాసరావు, చైర్మన్ కర్నాటి రాంబాబు అందజేశారు. గవర్నర్ వెంట కలెక్టర్ ఢిల్లీరావు తదితరులున్నారు. అలాగే, మంత్రులు ఆర్కే రోజా, విశ్వరూప్ కూడా దుర్గమ్మను దర్శించుకున్నారు. -
ఓట్ల పండుగ.. రూ.కోట్లు పిండేద్దాం
సాక్షి, హైదరాబాద్: టీఎస్ఆర్టీసీ గతేడాది నుంచి ప్రత్యేక సందర్భాల్లో ‘చాలెంజ్’పేరుతో సిబ్బందికి ప్రత్యేక లక్ష్యాన్ని నిర్దేశిస్తోంది. గత దసరా, దీపావళి సమయాల్లో ఫెస్టివల్ చాలెంజ్, ఈ ఏడాది మార్చి నుంచి జూన్ వరకు వంద రోజుల చాలెంజ్‌లను నిర్వహించింది. ఇప్పుడు దసరా, దీపావళి, కార్తీకమాసం, శబరిమలై అయ్యప్ప దర్శనం, క్రిస్మస్, కొత్త సంవత్సరం, సంక్రాంతిలను పురస్కరించుకుని అక్టోబరు 22 నుంచి వచ్చే ఏడాది జనవరి 16వరకు ‘100 రోజుల చాలెంజ్’ను నిర్వహిస్తోంది. ఆయా సందర్భాల్లో ప్రయాణికులు ఆర్టీసీ బస్సుల్లో ఎక్కువగా ప్రయాణించేలా చూడటంతోపాటు, వీలైనన్ని ఎక్కువ బస్సులను రోడ్కెక్కించటం, ఎక్కువ కిలోమీటర్లు తిప్పటం లక్ష్యం. ఇప్పుడు ఈ ప్రత్యేక సందర్భాల జాబితాలో ఎన్నికలు కూడా చేరాయి. ఈమేరకు అన్ని డిపోలకూ ఆదేశాలు జారీ అయ్యాయి. ఎన్నికల సమయంలోఏం చేస్తారంటే? ♦ ఎన్నికల సభలకు అద్దెకు బస్సులు: ప్రచారంలో రాజకీయ పార్టీలకు బహిరంగసభలు కీలకం. ఆ సభలకు జనాన్ని తరలించేందుకు వాహనాల అవసరం ఎక్కువగా ఉంటుంది. ఏ పార్టీ ఎక్కడ బహిరంగ సభలు నిర్వహిస్తున్నాయో ముందుగానే తెలుసుకుని ఆ సభలకు జనాన్ని తరలించేందుకు ఆర్టీసీ బస్సులు బుక్ అయ్యేలా చూడాలి. ♦ నగరంలో ఏ ప్రాంత ప్రజలు ఎక్కడో గుర్తింపు: నగరంలో ఉండే ఓటర్లలో చాలామంది ఓటు హక్కు వేరే నియోజకవర్గాల్లో ఉంటుంది. పోలింగ్ రోజు వారు ఆయా ప్రాంతాలకు వెళ్లాల్సి ఉంటుంది. ఏ నియోజకవర్గం ఓటర్లు నగరంలోని ఏయే ప్రాంతాల్లో ఎక్కువగా ఉంటున్నారో గుర్తించాలి. వారిని సొంత నియోజకవర్గాలకు తరలించేందుకు ఆర్టీసీ బస్సులను బుక్ చేసుకునేలా ఆయా నియోజకవర్గ నేతలతో మాట్లాడి ఒప్పించాలి. ♦ ప్రచార సామగ్రి కోసం బస్సులు: ప్రచారంలో కీలకమైన సామగ్రిని తరలించేందుకు నేతలు వాహనాలను బుక్ చేసుకుంటారు. ఆర్టీసీ బస్సులను అందుకు బుక్ చేసేలా వారితో మాట్లాడి ఒప్పించాలి. ♦ ఓటర్లూ బస్సులే ఎక్కాలి: వేరే ప్రాంతాల్లో ఉండే ఓటర్లు పోలింగ్ రోజు ఓటు హక్కును వినియోగించుకునేందుకు సొంత ప్రాంతానికి వెళ్లేందుకు ఆర్టీసీ బస్సులనే ఎ క్కేలా చూడాలి. ఇందుకు ప్రచారం చేయటంతోపాటు, కీలక పాయింట్ల వద్ద స్టాఫ్ ఉండి దీనిని సుసాధ్యం చేయాలి. ♦ ఈవీఎంలు, సిబ్బంది తరలింపునకు బస్సులు: పోలింగ్ సిబ్బంది, ఈవీఎంల తరలింపునకు ఎన్నికల సంఘం వాహనాలను బుక్ చేసుకుంటుంది. అందుకు ఆర్టీసీ బస్సులే బుక్ అయ్యేలా చూడాలి. గతేడాది దసరా, దీపావళి సమయాల్లో ఆర్టీసీ రూ.1360.69 కోట్ల ఆదాయాన్ని సాధించింది. ఎన్నికల నేపథ్యంలో ఈసారి గతేడాది కంటే కనీసం 10 శాతం ఆదాయం పెరగాలన్నది సంస్థ లక్ష్యం. -
Jivitputrika festival: 24 గంటల వ్యవధిలో.. బిహార్‌లో 22 మంది నీటమునక
పట్నా: బిహార్‌లోని వేర్వేరు ప్రాంతాల్లో 24 గంటల వ్యవధిలో నదులు, చెరువుల్లో స్నానాలు చేసేందుకు వెళ్లిన 22 మంది మృత్యువాత పడినట్లు అధికారులు ఆదివారం తెలిపారు. వీరిలో అత్యధికులు జీవిత్పుత్రికా పండుగ సందర్భంగా స్నానాలు చేయడానికి వెళ్లిన మహిళలేనన్నారు. ఈ పండుగ రోజు మహిళలు తమ సంతానం బాగుండాలని దేవుణ్ని కోరుకుంటూ ఉపవాస దీక్షలు, నదీ స్నానాలు ఆచరించడం సంప్రదాయం. భోజ్‌పూర్‌లో బహియారా ఘాట్ వద్ద సోనె నదిలో స్నానాలు చేసేందుకు వెళ్లిన 15–20 మధ్య వయస్కులైన బాలికలు సెల్ఫీ తీసుకుంటూ నీటి ఉధృతికి కొట్టుకుపోయినట్లు అధికారులు వివరించారు. భోజ్‌పూర్‌లో అయిదుగురు, జెహానాబాద్‌లో నలుగురు, పట్నా, రొహతాస్ల్లో ముగ్గురు చొప్పున, దర్భంగా, నవడాల్లో ఇద్దరేసి, కైమూర్, మాధెపురా, ఔరంగాబాద్‌ల్లో ఒక్కరు చొప్పున జల సమాధి అయినట్లు ముఖ్యమంత్రి కార్యాలయం తెలిపింది. -
ప్రకృత్యైనమః
గుర్తించాలే కానీ దేవుడు అనేక రూపాల్లో ఉంటాడు. వాటిలో కనిపించనివే కాదు, కనిపించేవీ ఉంటాయి. ఎక్కడో ఉన్నాడనుకునే దేవుడు... మన చేతికందే దూరంలో ఒక మొక్కలోనూ, కొమ్మలోనూ, ఆ కొమ్మకు పూసిన పువ్వులోనూ కూడా ఉన్నాడని గ్రహించడమే లౌకిక, పారలౌకిక సమన్వయంతో కూడిన ఆధ్యాత్మిక ప్రస్థానంలో తొలి ఎరుక. దైవం మానుషరూపేణ అంటారు. అలాగే, దైవం ప్రకృతి రూపేణ కూడా! రామకృష్ణ పరమహంస ఓసారి ఆకాశంలో రెక్కలు విప్పుకుంటూ ఎగిరే పక్షిని చూసి సమాధిలోకి వెళ్లిపోయారట. చెట్టును, పిట్టను, పువ్వును, పసిపాప నవ్వును, పారే ఏటినీ, ఎగిరే తేటినీ చూసి తన్మయులైతే చాలు; ఆ రోజుకి మీ పూజ అయిపోయిందని ఒక మహనీయుడు సెలవిస్తాడు. షడ్రసోపేతంగా వండిన తన వంటకాలను తృప్తిగా ఆరగిస్తే ఇల్లాలు ఎంత ఆనందిస్తుందో, తన వ్యక్తరూపమైన ప్రకృతిని చూసి పరవశిస్తే దేవుడు అంతే ఆనందిస్తాడని ఆయన అంటాడు. నది ఒడ్డున నిలబడి దాని పుట్టుకను, గమనాన్ని, పోను పోను అది చెందే వైశాల్యాన్ని, అది ప్రవహించిన పొడవునా దానితో అల్లుకున్న మన జీవనబంధాన్ని స్మరించుకున్నా అది పుణ్య స్నానంతో సమానమేనని ఒక కథకుడు రాస్తాడు. కృష్ణశాస్త్రి గారు పల్లవించినట్టు అడుగడుగునా, అందరిలోనే కాదు; ప్రకృతిలో అన్నింటిలోనూ గుడి ఉంది. అనాది నుంచీ నేటివరకూ మనిషి ఊహలో, భావనలో మనిషీ, దేవుడూ, ప్రకృతీ పడుగూ పేకల్లా అల్లుకునే వ్యక్తమయ్యారు. ఋగ్వేద కవి చూపులో ప్రకృతి పట్ల వలపు, మెరుపు ఎంతో ముగ్ధంగా, సరళంగా, సహజసుందరంగా జాలువారుతాయి. ‘‘వెలుగులు విరజిమ్మే ఓ ఆకాశపుత్రీ, సకల సంపదలకూ నెలవైన ఉషాదేవీ! వస్తూ వస్తూ మాకు ధనరూపంలోని ఉషస్సును వెంట బెట్టుకుని రా’’ అని ఒక ఋక్కు అంటుంది. ఋగ్వేద కవి చింతనలో అగ్ని ధూమధ్వజుడు; సూర్యకాంతితో తళతళా మెరుస్తూ ధ్వనిచేసే సముద్రపు అలల్లా వ్యాపిస్తాడు. ‘‘తమసానదీ జలాలు మంచివాడి మనసులా స్వచ్ఛంగా ఉన్నా’’యని వాల్మీకి వర్ణిస్తాడు. సుగ్రీవుడితో అగ్ని సాక్షిగా స్నేహం చేసిన రాముడు, ‘‘వర్షాకాలంలో మంచి పొలంలో వేసిన పంట ఫలించినట్టు నీకార్యాన్ని సఫలం చేస్తా’’నంటాడు. ఆ మాటలకు సుగ్రీవుడు, ‘‘నదీవేగంలా హఠాత్తుగా ఉరవడించిన కన్నీటివేగాన్ని ధైర్యంతో నిలవరించుకున్నా’’డని రామాయణ కవి అంటాడు. ఏ కాలంలోనూ మనిషీ, ఋషీ, కవీ ప్రకృతి పొత్తిళ్లలో పసివాడిగానే ఉన్నాడు తప్ప ప్రకృతికి దూరం కాలేదు. ఇతిహాస కావ్య ప్రబంధాలలో ప్రకృతి వర్ణనలు తప్పనిసరి భాగాలు. శారద రాత్రుల్లో ఉజ్వల తారకలు, కొత్త కలువ గంధాన్ని మోసుకొచ్చే సమీరాలూ, కర్పూరపు పొడిలా చంద్రుడు వెదజల్లే వెన్నెల వెలుగులూ, చెంగలువ కేదారాలూ, మావులూ క్రోవులూ పెనవేసుకున్న అడవులూ, పక్షులు బారులు కట్టి ఇంటిముఖం పట్టే సూర్యాస్తమయ దృశ్యాలూ, తలను రెక్కల్లో పొదవుకుని పంటకాలువల దగ్గర నిద్రించే బాతువుల సన్నివేశాలూ... ఇలా కవి ఊహల రస్తాకెక్కని ప్రకృతి విశేషం ఏదీ ఉండదు. పత్రం పుష్పం ఫలం తోయం రూపంలో ప్రకృతి భాగం కాని పూజా ఉండదు. వినాయకుని పూజలో ఉపయోగించే మాచీ,బృహతి, బిల్వం, ధత్తూరం, బదరి, తులసి, మామిడి, కరవీరం, దేవదారు, మరువకం లాంటి ఇరవయ్యొక్క పత్రాల పేర్లే చెవులకు హాయిగొలిపి ఆకుపచ్చని చలవపందిరి వేసి మనసును సేదదీర్చుతాయి. అమ్మవారి స్తుతుల నిండా పూవులూ, వనాలూ పరచుకుంటాయి. చంపకాలు, సౌగంధికాలు, అశోకాలు, పున్నాగాలతో అమ్మ ప్రకాశించిపోతుంది. కదంబ పూలగుత్తిని చెవికి అలంకరించుకుంటుంది. చాంపేయ, పాటలీ కుసుమాలు తనకు మరింత ప్రియమైనవి. శిరసున చంద్రకళను ధరిస్తుంది. ప్రకృతి వెంటే పర్యావరణమూ గుర్తురావలసిందే. పర్యావరణ స్పృహ ఇప్పుడే మేలుకొంద నుకుంటాం కానీ, ప్రకృతిలో భాగంగా మనిషి పుడుతూనే పెంచుకున్న స్పృహ అది. రావణ సంహారం తర్వాత రాముడు అయోధ్యకు వెడుతూ, వానరులు ఎక్కడుంటే అక్కడ చెట్లు సమృద్ధిగా ఉండాలనీ; అవి అన్ని కాలాల్లోనూ విరగ కాయాలనీ; నదుల్లో నీరు నిత్యం ప్రవహిస్తూ ఉండాలనీ ఇంద్రుని వరం కోరాడు. పాండవులు ద్వైతవనంలో ఉన్నప్పుడు ఆ అడవిలోని చిన్న జంతువులు ధర్మరాజుకు కలలో కనిపించి, ‘‘మీరు రోజూ మమ్మల్ని వేటాడి చంపడంవల్ల మా సంఖ్య తగ్గిపోయింది, బీజప్రాయంగా మిగిలాం, మేము పూర్తిగా నశించేలోగా దయచేసి మరో చోటికి వెళ్లం’’డని ప్రార్థించాయి. విశ్వనాథవారు తన ‘వేయిపడగలు’ నవలలో పర్యావరణానికి ప్రతీకగా పసరిక అనే పాత్రనే సృష్టించారు. ఆధునిక వేషభాషల వ్యామోహంలో పడీ, జీవ వైవిధ్యాన్ని దెబ్బతీసే వ్యవసాయ పద్ధతుల వల్ల పర్యావరణ విధ్వంసం ఏ స్థాయిన జరుగుతోందో ఆ పాత్ర ద్వారా గంట కొట్టి చెప్పారు. పూర్వకాలపు రాజులు అడవిని, అటవీ జనాన్ని, సంపదను పర్యావరణ భద్రతకు తోడ్పడే స్వతంత్ర అస్తిత్వాలుగా చూశారు తప్ప, తమ రాజ్యంలో భాగం అనుకోలేదు. ఇప్పుడా వివేచన అంతరించి అడవులు రాజ్యానికి పొడిగింపుగా మారి బహుముఖ ధ్వంసరచనకు లక్ష్యాలయ్యాయి. ప్రకృతికి పండుగకు ఉన్న ముడి తెగిపోయి ప్రతి పండుగా పర్యావరణంపై పిడికిటిపోటుగా మారడం చూస్తున్నాం. ప్రకృతిని మనం రక్షిస్తే ప్రకృతి మనల్ని రక్షిస్తుందన్న సంగతిని గుర్తు చేసుకోడానికి నేటి వినాయకచవితి కన్నా గొప్ప సందర్భం ఏముంటుంది! -
బర్నింగ్ మ్యాన్ ఫెస్టివల్‌కు హాజరై చిక్కుకుపోయిన 70వేల మంది
బర్నింగ్‌మ్యాన్ ఫెస్టివల్.. ఇది అమెరికాలోని ఎడారిలో నిర్వహించే అతిపెద్ద ఫెస్టివల్. ఈ ఫెస్టివల్ నిర్వహించే క్రమంలో 70 వేల మంది ఎడారిలో చిక్కుకుపోయారు. ఎడారిలో అతి భారీ వర్షం కురవడంతో వేల సంఖ్యలో ప్రజలు అక్కడ చిక్కుకుపోయారు.. వర్షం కారణంగా ఎడారి అంతా బురద మయంగా మారడంతో ఎవరూ కూడా అక్కడ నుంచి బయటపడలేని పరిస్థితులు తలెత్తాయి. నెవడాలోని బ్లాక్‌రాక్ ఎడారి వర్షం కారణంగా పూర్తిగా చిత్తడిగా మారిపోయి అంతా బురద మయం అయిపోయింది. దాంతో ఆ ఫెస్టివల్‌కు హాజరైన సుమారు 70వేలకు పైగా ప్రజలు అక్కడ చిక్కుకుపోయారు. కొన్ని మైళ్ల దూరం వరకూ ఎటువైపు చూసినా బురదే కనిపిస్తోంది. నడుస్తుంటే కాళ్లు బురదలో కూరుపోవడంతో ఎటూ కదల్లేని పరిస్థితి కనిపిస్తోంది. ప్రస్తుతం అక్కడ వాహనాలకు అనుమతి నిరాకరించడంతో సందర్శకులు అక్కడే ఆహారం, నీరు సమర్చుకుని పొడిగా ఉన్న ప్రదేశంలో తలదాచుకోవాలని అధికారులు తెలిపారు. గత నెల 27వ తేదీన బర్నింగ్ మ్యాన్ ఫెప్టివల్ మొదలు కాగా, ఆ తర్వాత ఈ ప్రదేశాన్ని హరికేన్ తాకింది. దాంతో భారీ వర్షం కురిసి ఆ ప్రాంతం బురద మయంగా మారిపోయింది. ఒక్కరాత్రిలోనే నెలలకు పైగా కురవాల్సిన వర్షం కురవడంతో ఆ ప్రాంతమంతా స్తంభించిపోయింది. కొంతమంది బురదలోనే అక్కడ నుంచి బయటపడేందకు యత్సిస్తున్నా పరిస్థితులు అంతగా అనుకూలించడం లేదు. -
కెనడాలో ఘనంగా నోవా మల్టీఫెస్ట్ వేడుకలు
కెనడా హాలిఫాక్స్‌లో అత్యద్భుతంగా నోవా మల్టీఫెస్ట్ వేడుకలు జరిగాయి. తెలుగు భాష అత్యున్నత వైభవం, దేశ, విదేశాలకు పరిచయం మనమంతా పండుగ ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూడటం కాదు, మేము ఎక్కడ ఉంటే అక్కడే పండుగ అంటూ మన సంస్కృతి సంప్రదాయాలను కెనడాలో చాటి చెబుతున్నారు మన భారతీయులు. ముఖ్యంగా మన తెలుగు వారు విశాల్ భరద్వాజ్ వారి టీం భ్యారి, టీనా, సెలెస్ట్ గారి ఆధ్వర్యంలో కెనడా ఎన్ఎస్ లీడర్ పార్టీ లీడర్, యార్మౌత్ ఎమ్మెల్యే జాక్ చర్చిల్, ఎన్డీపీ లీడర్ క్లాజుడై చందర్, క్లేటొన్ పార్క్ ఎమ్మెల్యే రఫా డీకోస్తాంజో ముఖ్య అతిథులుగా విచ్చేసిన నోవా మల్టీఫెస్ట్ సంబరాలు కార్యక్రమాన్ని ప్రారంభోత్సవం చేశారు. 8 వేల మంది ప్రజలు హాజరయ్యారు. శ్రీహరి చల్లా గారు మన దేశం / రాష్ట్రం తరఫున కార్య కలాపాలు నిర్వహించారు. శ్రీహరి గారి బృందం, ఫణి వంక గారు, శివ మారెళ్ళ గారు , చంద్రా తాడేపల్లి గారు, వెంకట్ వేలూరి గారు, శ్రీనివాస చిన్ని గారు, పృద్వి కాకూరు, క్రిష్ట్న వేణి గారు, రత్నం గారు, జయ గారు, ప్రియాంక గారు, లావణ్య గారు, శ్రీలేఖ, జనని కృష్ణ, జ్యోత్స్నా శ్రీజ , దీపీకా కర్ణం, జయశ్రీ కర్ణం, సియ శివకుమార్, రిషిన్త్ శివకుమార్, శిబి నాన్తం ఆట్రియం, రోహిత్ సాయి చల్లా పాల్గొని కార్యక్రమాన్ని ఘనంగా నిర్వర్తించారు. కెనడాలో హాలిఫాక్స్ నగరంలో జరిగిన "నోవా మల్టీఫెస్ట్" సంబరాలలో మన తెలుగు వారు, ఇతర రాష్ట్రాల వారు కలిసి మన పండుగలు (ఉగాది,- తెలుగు కొత్త సంవత్సరం, కర్వా చౌత్(అట్ల తదియ), రాఖీ -రక్షాబంధన్, తెలుగు పండుగ సంక్రాంతి(ముగ్గులు, గాలిపటాలు, ధాన్యం, పాలు కలిపి వండిన నైవేద్యం); దీపావళి( దీపాల వరుస, ఆనందం, విజయం, సామరస్యానికి గుర్తుగా జరుపుకునే పండుగలు) వాటి ప్రాముఖ్యతను కెనడా వాసులకి వివరించి కన్నుల విందు చేశారు. వాతావరణం అనుకూలించక మా నోవా మల్టీఫెస్ట్ సంబరాలు ఒక్క రోజు మాత్రమే జరిగింది, ఐనా 8000 మంది వేడుకలలో పాల్గొనడం విశేషం. వివిధ భాషలు, వివిధ సంస్కృతులకు నివాసమైన కెనడా వాసులు మన పండుగలు విశేషాలను బాగా అర్థం చేసుకొని, అభినందించారు. రెండు రోజులు హోరున వర్షాలు ఈదురు గాలులు, మూడవ రోజు వాతావరణం అనుకూలించడం వలన వేడుకలు ఘనంగా జరిగాయి. కెనడా వాసులలో మన ఇండియా పండుగల ప్రాముఖ్యత గుర్తించి ఎనిమిది వేలకు పైగా పాల్గొని ఘన విజయం సాధించింది. కెనడా హెలి ఫ్యాక్స్ సుప్రజ గారు మాట్లాడుతూ "ఏ దేశమేగినా ఎందు కాలిడినా, పొగడరా నీ తల్లి భూమి భారతిని, నిలుపరా నీ జాతి నిండు గౌరవాన్ని" అంటూ.. మన ప్రాచీన కళలైనటు వంటి భరతనాట్యం (జనని కృష్ణ ), కూచిపూడి (జ్యోత్స్న శ్రీజ చల్లా), కర్రసాము(శిబి నాన్తం ఆట్రియం ) జానపద నృత్యాలతో (దీపీకా కర్ణం జయశ్రీ కర్ణం) కెనడా ప్రజలను ఆశ్చర్య చకితులను చేసింది. అలాగే మన సాంప్రదాయ వస్త్రాలతో కెనడా వాసులని అలంకరించింది. వివాహ భోజనంబు వింతైన వంటకంబు అంటూ రకరకాల దేశాల వారి విందు భోజనాలు అందరూ ఆరగించారు. (చదవండి: డాలస్ నాటా కన్వెన్షన్‌లో ట్రాన్స్పోర్ట్ కీ రోల్) -
సత్యసాయి నిగమంలో ఉగాది ఉత్సవాలు
-
శాంతియుతంగా పండుగలు జరుపుకోవాలి
మంచిర్యాలక్రైం: శాంతియుత వాతావరణంలో పండుగలు జరుపుకోవాలని మంచిర్యాల ఏసీపీ తిరుపతిరెడ్డి అన్నారు. బక్రీద్, తొలి ఏకాదశి, బోనాల పండుగలు వరుసగా ఉన్నందున అన్ని మతాల పెద్దలతో స్థానిక ఏసీపీ కార్యాలయంలో శాంతి కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏసీపీ మాట్లాడుతూ గోవధపై నిషేధం విధించారని, గోవులను అక్రమంగా రవాణా చేసినా, వధించిన చర్యలు ఉంటాయని తెలిపారు. మతాలకతీతంగా పండుగలు జరుపుకోవాలని, ఏదైనా సమస్య ఉత్పన్నమైతే వెంటనే 100డయల్‌కు సమాచారం అందించాలని సూచించారు. ఈ సమావేశంలో సీఐ రాజు, ఎస్సైలు పాల్గొన్నారు. ప్రశాంత వాతావరణంలో.. బెల్లంపల్లిరూరల్: ప్రజలు పండుగలను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని బెల్లంపల్లి ఏసీపీ పంతాటి సదయ్య అన్నారు. మంగళవారం సాయంత్రం తాళ్లగురిజాల పోలీసుస్టేషన్ ఆవరణలో ఏర్పాటు చేసిన శాంతికమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. మత సామరస్యం కోసం ప్రతి ఒక్కరూ పాటుపడాలని అన్నారు. సామాజిక మాధ్యమాల్లో వదంతులు సృష్టిస్తే కఠిన చర్యలు తప్పవని తెలిపారు. ఈ సమావేశంలో బెల్లంపల్లిరూరల్ సీఐ రాజ్‌కుమార్‌గౌడ్, వన్‌టౌన్ ఎస్‌హెచ్‌వో శంకరయ్య, మతపెద్దలు, తాళ్లగురిజాల, వన్‌టౌన్, టూటౌన్ ఎస్సైలు నరేష్, విక్టర్, రవికుమార్, సిబ్బంది పాల్గొన్నారు. -
భారీగా తగ్గనున్న, ఫ్రిజ్ లు, టీవిల ధరలు
-
ఏం కొంటాంలే! తగ్గుముఖం పట్టిన ఇళ్ల కొనుగోళ్లు..
భారత్‌లో పండుగల సీజన్లో ఇళ్ల కొనుగోళ్లు తగ్గుముఖం పడుతున్నాయి. పండుగ త్రైమాసికంలో (అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు) తీసుకున్న గృహ రుణాల విలువ ఇటీవలి సంవత్సరాలలో స్థిరంగా తగ్గుముఖం పట్టడంతో ఇది స్పష్టమవుతోంది. మరోవైపు ఇదే కాలంలో ఆటో, ద్విచక్ర వాహనాలు, కన్స్యూమర్ డ్యూరబుల్స్, వ్యక్తిగత రుణాలు స్థిరమైన వృద్ధిని సాధించగా, గృహ రుణాలు మాత్రం తగ్గుముఖం పట్టాయి. వాహన రుణాల్లో గణనీయ వృద్ధి క్రెడిట్ బ్యూరో సీఆర్ఐఎఫ్ హై మార్క్ నివేదిక ప్రకారం.. 2023 ఆర్థిక సంవత్సరం పండుగ సీజన్ అయితే మూడో త్రైమాసికం విలువ, పరిమాణం రెండింటిలోనూ ఆటో, ద్విచక్ర వాహన రుణాలలో గణనీయమైన వృద్ధిని సాధించింది. అయితే, ఈ కాలంలో గృహ రుణాలు 2. 6 శాతం తగ్గిపోయాయి. ఇది ఇటీవలి సంవత్సరాలలో గృహ రుణాలకు సంబంధించి అత్యంత నిరాశాజనక పండుగ త్రైమాసికం. అయితే గృహ రుణాల తగ్గుదలకు వడ్డీ రేట్ల పెరగడం కారణంగా భావించవచ్చు. వాహన రుణాలు ఆరిజినేషన్స్ (విలువ)లో 24 శాతం పెరుగుదలను ప్రదర్శించాయి. 2022 ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో ఇవి రూ.60,900 కోట్లు ఉండగా 2023 ఆర్థిక సంవత్సరం క్యూ3లో రూ.75,500 కోట్లకు పెరిగాయి. అదేవిధంగా ద్విచక్ర వాహన రుణాలు 34. 5 శాతం వృద్ధిని సాధించాయి. 2022 ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో రూ.17,100 కోట్ల నుంచి 2023 ఆర్థికేడాది మూడో త్రైమాసికానికి రూ.23,000 కోట్లకు పెరిగాయి. పర్సనల్ లోన్ విభాగం కూడా 20. 2 శాతం వృద్ధిని సాధించింది. 2022 ఆర్థిక ఏడాది క్యూ3లో రూ.1,58,500 కోట్ల నుంచి 2023 ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో రూ.1,90,500 కోట్లకు చేరుకుంది. We today announced the second edition of the How India Celebrates Report on Festive Lending in India. Discover key trends and insights into major consumer lending products. Get the full report at: https://t.co/9cSuZdbuSW#CRIF #HowIndiaCelebrates #FestiveLoans #Insights pic.twitter.com/6DOu8jkGJh — CRIF India (@CRIF_India) June 14, 2023 -
అలీకి పద్మశ్రీ రావాలి
‘‘బాలనటుడిగా కెరీర్‌ని ప్రారంభించి నలభై ఐదేళ్లుగా అగ్ర హాస్య నటుడుగా కొనసాగుతున్న అలీ కారణజన్ముడు. అతనికి పద్మశ్రీ అవార్డు వస్తే చూడాలని ఉంది’’ అని సీనియర్ నటి రాజశ్రీ అన్నారు. సంగమం ఫౌండేషన్, వివేకానంద హాస్పిటల్స్ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో ‘కామెడీ ఫెస్టివల్’ నిర్వహించారు. ఇందులో భాగంగా నటుడు అలీని ‘సంగమం– వివేకానంద జీవిత సాఫల్య పురస్కారం’ అవార్డుతో సత్కరించారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన రాజశ్రీ మాట్లాడుతూ–‘‘అలీ ఎంత మంచి నటుడో అంత మంచి వ్యక్తి కూడా. తనలోని సేవాగుణం స్ఫూర్తినిస్తుంది’’ అన్నారు. కాగా అలనాటి హీరో కాంతారావు కుమారుడు రాజా, వ్యాపారవేత్త రాజశేఖర్‌లు హాస్యనటి పాకీజా, కళాకారిణి హేమకుమారిలకు ఒకొక్కరికి రూ. 25000 ఆర్థిక సాయం అందించారు. వివేకానంద హాస్పిటల్స్ అధినేత డా. గీత, నటుడు తనికెళ్ల భరణి, ‘సంగమం’ సంజయ్ కిషోర్ పాల్గొన్నారు. -
వరప్రదం.. దేవర వృషభం
సంస్కృతి, సంప్రదాయాలకు పట్టుగొమ్మలు గ్రామసీమలు. అవి సంబరాలకు నెలవులు. విశిష్ట ఆచారాలకు పుట్టినిళ్లు. అలాంటి గ్రామాల్లో కొనసాగుతున్న ఒక అరుదైన విశేషమే.. దేవరెద్దు, దేవరభక్తుల పరంపర.. (షేక్ ముజుబుద్దీన్, సాక్షి, కడప డెస్క్) : దేవరెద్దులు.. అన్నమయ్య జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో మాత్రమే కనిపిస్తాయి. అనాదిగా వస్తున్న ఆచారానికి ఇవి ప్రతీకలుగా ఉంటున్నాయి. గ్రామానికి శుభం చేకూరుస్తాయనే ప్రజల నమ్మకానికి నిదర్శనంగా నిలుస్తున్నాయి. గ్రామాలు సస్యశ్యామలం దేవరెద్దులు కలిగిన గ్రామాలు సస్యశ్యామలంగా ఉంటాయని నమ్మకం. దేవరెద్దును పోషిస్తున్న భక్తుల వంశాభివృద్ధి చెంది, సుఖసంతోషాలతో ఉంటారని విశ్వాసం. దాన్ని మేపడానికి వదిలేసినప్పడు ఏ పొలంలో అయినా మేయవచ్చు. అది మేసిన పొలం యజమానులు తమ అదృష్టంగా భావిస్తారు. అలాగే గ్రామస్తులు తమకు తోచిన పదార్థాలను ప్రసాదంగా దేవరెద్దుకు అందజేస్తుంటారు. దేవరెద్దు మృతి చెందితే ఆ ఊరికి, గ్రామస్తులకు అరిష్టం జరుగుతుందనే భయంతో తక్షణం కొత్తదాన్ని ఎంపిక చేస్తారు. విశేషాల సమాహారం దేవరెద్దు పుట్టినప్పటి నుంచి గిట్టే వరకు ఎన్నో వేడుకలు నిర్వహిస్తారు. వీటిని సంరక్షించేందుకు ప్రత్యేకంగా దేవరభక్తులుంటారు. తిరునాల, ఉత్సవాల సందర్భంగా వీటిని అలంకరించి సంబరాలు చేసుకుంటారు. దేవరెద్దును దేవుడిలా పూజిస్తారు. దీని పై ఎవ్వరూ దెబ్బ వేయరు. ఇది చనిపోయినా.. కొత్త దేవరెద్దును, దేవరభక్తులను ఎంపిక చేయాలన్నా వేడుక నిర్వహిస్తారు. బంధుమిత్రులతో పాటు చుట్టు పక్కల ప్రాంతాల వారు కూడా తరలివస్తారు. సంప్రదాయ వాయిద్యాలతో పాటు మద్దిళ్లు, కొమ్ములు ఊదడం, పలకలు కొట్టడం లాంటివి చేస్తారు. కొత్త ఎద్దును ఎంపిక చేసిన తర్వాత దానికి సంప్రదాయ అలంకరణ అనంతరం ఊరేగిస్తారు. దేవరెద్దు చనిపోతే... ఎక్కడైనా దేవరెద్దు చనిపోతే అంత్యక్రియలు వేడుకలా నిర్వహిస్తారు. అడవికి వెళ్లి పచ్చారు కొయ్యలు తెస్తారు. వాటితో విశ్వబ్రాహ్మణుల ద్వారా ప్రత్యేకంగా రథం తయారు చేయిస్తారు. ఎద్దు ప్రాణంతో ఉన్నప్పుడు ఎలా పడుకుని ఉంటుందో.. ఆ విధంగా రథంలో ఉంచుతారు. పెద్ద ఎత్తున భక్తులు తరలి వచ్చి ఊరేగింపుగా తీసుకెళ్తారు. చెక్కభజనలు, పిల్లనగ్రోవి, డప్పులు, సాంస్కతిక కార్యక్రమాలతో అంగరంగ వైభవంగా సేవ చేస్తారు. భూమిలో గుంత తీసి ఖననం చేసే సమయంలో కూడా ఎద్దును కూర్చున్న స్థితిలోనే ఉంచుతారు. ఈ కార్యక్రమం ఒక తిరునాళ్లలా జరిపిస్తారు. దీనికి ఇతర గ్రామాల్లోని దేవరెద్దులు, దేవరభక్తులు కూడా తరలివస్తారు. నియమానుసారం.. దేవరభక్తులను నియమించడానికి గ్రామస్తులు స్నానం ఆచరించి నిర్దేశిత ప్రాంతానికి చేరుకుంటారు. ప్రతి ఒక్కరూ చేతిలో పండ్లు, ప్రసాదం పట్టుకుని కూర్చుంటారు. దేవరెద్దును తీసుకొచ్చి అక్కడ వదిలేస్తారు. మొదటిసారి ఎవరి ప్రసాదం స్వీకరిస్తే వారిని ఎద్దుభక్తుడిగా ఎంపిక చేస్తారు. ఈ విధంగా వరుసగా కదిరిభక్తుడు, గుర్రప్ప భక్తుడు, పూల భక్తుడులను నియమిస్తారు. ► దేవరభక్తుడు దేవరెద్దుకు పూజలు చేయడంతో పాటు ఉత్సవాలకు తీసుకెళ్లాలంటే ప్రత్యేకంగా అలంకరించాల్సి ఉంటుంది. కత్తి (బెత్తం) చేతపట్టుకుని దేవరెద్దుతో పాటు ఊరేగింపుగా వెళతాడు. ► కదిరి భక్తుడు నరసింహస్వామికి పూజలు చేయాల్సి ఉంటుంది. ఉత్సవాలకు నరసింహస్వామి చిత్రపటంతో వెళతాడు. ► గుర్రప్పభక్తుడు ఎద్దుకు సంబంధించిన ఆభరణాలు, ఉత్సవ సామగ్రి, గుర్రప్పస్వామి శిలతో కూడిన ఓ పెట్టెను ఎత్తుకుని వెళ్లాల్సి ఉంటుంది. ► పూల భక్తుడు ఏదైనా ఉత్సవాలు, తిరునాళ్లు జరిగినప్పుడు గ్రామంలో ప్రతి ఇంటికి వెళ్లి భక్తులను ఆహ్వానించాల్సి ఉంటుంది. కేవీ పల్లెలో.. అధిక సంఖ్యలో.. అన్నమయ్య జిల్లాలోని కేవీపల్లె, కురబలకోట, కలికిరి, సంబేపల్లె మండలాల్లో ప్రధానంగా దేవరెద్దుల సంస్కృతి ఉంది. కేవీపల్లె మండలంలో 12 గ్రామాల్లో ఒక్కో దేవరెద్దు చొప్పున ఉన్నాయి. తోటి దళితవాడ, నారమాకుపల్లె, గొర్లకణంపల్లె, గుట్టలపై బండకాడపల్లె, దిగువగడ్డ, పెండ్లిపెంట, పేయలవారిపల్లె, తీతవగుంటపల్లె, తువ్వపల్లె, బొప్పసముద్రం, తిమ్మాపురం, వంకవడ్డిపల్లెలో దేవరెద్దులు ఉన్నాయి. సంబేపల్లె మండలంలో అన్నప్పగారిపల్లె, శెట్టిపల్లె, గున్నికుంట్ల, గురిగింజకుంట, కలకడ మండలంలో పాళెంమూల, బాలయ్యగారిపల్లె పంచాయతీ నాయనవారిపల్లె, కలికిరి మండలంలో అద్దవారిపల్లెలోనూ దేవరెద్దులు ఉన్నాయి. కురబలకోట మండలంలో కూడా అక్కడక్కడా ఉన్నాయి. కాగా.. ఒకటి, రెండు గ్రామాల్లో మాత్రమే కొత్తగా దేవరెద్దులు పుట్టాయి. దేవరెద్దు అంటే.. ఏ గ్రామంలో అయినా పుట్టిన దూడ వారం రోజులైనా పాలు తాగకుండా ఉంటే.. దాన్ని దేవాలయం వద్దకు తీసుకెళ్లి ప్రసాదం పెడతారు. అది తింటే దానిని దేవరెద్దుగా పరిగణిస్తారు. దానిని సంరక్షించుకుంటే గ్రామాలకు శుభం కలుగుతుందని నమ్ముతారు. ఉత్సవాలకు ఊరేగింపుగా.. దేవరెద్దు ఉన్న ఊళ్లతో పాటు సమీప ప్రాంతాల్లో ఎక్కడ ఉత్సవాలు జరిగినా వీటిని ప్రత్యేకంగా ఊరేగింపుగా తీసుకెళతారు. ప్రధానంగా శివరాత్రి సందర్భంగా జరిగే ఝరి ఉత్సవంలో ప్రత్యేక ఆకర్షణగా ఇవి నిలుస్తాయి. ఆ రోజున జాగరణ నిర్వహించిన ప్రజలు మరుసటి రోజు ఉదయాన్నే ఝరికోనలో స్నానమాచరిస్తారు. అక్కడికి దేవరెద్దును, నాణ్యాలు(దెవరెద్దు పూజసామగ్రి)ని ఊరేగింపుగా తీసుకెళ్తారు. ఈ కార్యక్రమం ఎంతో వైభవంగా జరుగుతుంది. దీనిని చూడటానికి జనం పెద్ద ఎత్తున తరలివస్తారు. పూజ సామగ్రి కోసం దేవరిల్లు దేవరెద్దు కోసం ప్రత్యేకంగా ఇల్లు ఏర్పాటు చేస్తారు. దానిని దేవరిల్లు అంటారు. అందులో దేవుని చిత్రపటాలు ఉంచుతారు. దేవరెద్దు అక్కడే ఉంటుంది. దానికి అలంకరణ సామగ్రి కోసం ప్రత్యేకంగా పెట్టె ఉంటుంది. గంట, గజ్జెలు, మువ్వలు, మల్లముట్లు, గొడుగులు, వస్త్రం తదితరాలుంటాయి. వాటిని దేవరింటిలో భద్రపరుస్తారు. కొత్త దేవరెద్దు ఎంపిక ఇలా.. దేవరెద్దు చనిపోయిన స్థానంలో కొత్త దాన్ని ఎంపిక చే సేందుకు గ్రామస్తులంతా పూజలు నిర్వహిస్తారు. గ్రా మంలో పండ్లు, ప్రసాదాలు పెట్టి దూడలు, ఎద్దులను ఒక చోట వదులుతారు. ఏది అయితే ప్రసాదం స్వీకరిస్తుందో.. దాన్ని దేవరెద్దుగా పరిగణిస్తారు. కొత్తగా దేవరెద్దు ఎంపికైన అనంతరం మూడేళ్లకు తిరునాల నిర్వహిస్తారు. దానికి మిగతా గ్రామాల్లోని దేవరెద్దులను కూడా ఆహ్వానిస్తారు. గ్రామానికి వచ్చిన వాటికి మంగ ళ వాయిద్యాలతో ఘన స్వాగతం పలుకుతారు. సాంస్కృతిక కార్యక్రమాలతో సంబరాలు చేసుకుంటారు. దేవర భక్తులు.. సదా సంరక్షకులు గ్రామంలో దేవరెద్దును సంరక్షించడానికి, పూజలు చేయడానికి, ఉత్సవాలకు తీసుకు వెళ్లడానికి నలుగురు వ్యక్తులుంటారు. వీరిని దేవర భక్తులు అంటారు. ఎక్కువగా ఏళ్ల తరబడి ఒకే కుటుంబ సభ్యులు దేవరెద్దు భక్తులుగా ఉంటారు. వారిని ఎద్దు భక్తుడు, కదిరి భక్తుడు, గుర్రప్పభక్తుడు, పూల భక్తుడిగా పిలుస్తారు. నిష్టగా ఉంటాం మేము చాలా నిష్టగా ఉంటాం. భక్తుడిగా నియమించినప్పటి నుంచి ఎద్దు బాగోగులు నేనే చూసుకుంటున్నా. 25 ఏళ్లుగా మా వంశస్తులే దేవరెద్దు భక్తులుగా ఉన్నాం. దేవరెద్దు భక్తులతో పాటు ఇతర భక్తులు దేవరెద్దుకు పూజలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. – యల్లయ్య, వీఆర్ఓ, ఎద్దు భక్తుడు, తోటిదళితవాడ, కేవీపల్లె మండలం. పురాతనకాలం నుంచి వస్తున్న ఆచారం మా గ్రామంలో దేవరెద్దును సంరక్షించడం, పూజలు నిర్వహించడం పురాతన కాలం నుంచి ఆచారంగా వస్తోంది. కొన్ని కట్టుబాట్లు పాటిస్తూ దేవరెద్దును సంరక్షించడం జరుగుతోంది. – నాగులయ్య, గుర్రప్ప భక్తుడు, తోటిదళితవాడ, కేవీపల్లె మండలం అదృష్టంగా భావిస్తున్నాం దేవరెద్దు రూపంలో దేవుడే ప్ర త్యక్షంగా కన్పిస్తున్నాడు. అలాంటి దేవరెద్దుకు సేవ చేయడం అదృష్టంగా భావిస్తున్నాం. పండుగలు, ఉత్సవాలతోపాటు ప్రతి శనివారం క్రమం తప్పకుండా పూజలు నిర్వహిస్తాం. – నాగరాజ, పూల భక్తుడు, తోటిదళితవాడ, కేవీపల్లె మండలం ఒక్కపొద్దు పాటిస్తున్నాం ప్రతి శనివారం, పండుగల సమయంలో మేము ఒక్కపొద్దు పాటిస్తాం. దేవరింటిలో పూజ లు నిర్వహించడంతో పాటు అక్కడే భోజనం వండుకుని దేవరెద్దుకు పూజలు నిర్వహించిన తరువాతనే ఒక్కపొద్దు విడుస్తాం. – శశికుమార్, కదిరి భక్తుడు, తోటిదళితవాడ, కేవీపల్లె మండలం గౌరవంగా చూసుకుంటాం దేవరెద్దు సంప్రదాయం పెద్దల కాలం నుంచి వస్తోంది. ఎద్దును గౌరవంగా చూసుకుంటున్నాం. మాలో ఎవరైనా చనిపోతే కొత్త భక్తుడిని దేవరెద్దే ఎంపిక చేసుకుంటుంది. – కె.వంశీ, దేవరభక్తుడు, దిగువబోయపల్లె, కురబలకోట మండలం 40 ఏళ్లుగా.. దేవరెద్దును దేవుడితో సమానంగా చూస్తారు. పండుగలు, ఉత్సవాల సందర్భాల్లో అలంకరించి ఊరేగిస్తారు. 40 ఏళ్లుగా భక్తుడిగా ఉన్నా. – శిద్దప్ప, దేవరభక్తుడు, మండ్యంవారిపల్లె, కురబలకోట మండలం -
అవును... ఇది నిజమే!
► జపాన్ లోని ఆసోచి కొండల్లో ‘విండ్ ఫోన్’ అనే టెలిఫోన్ బూత్ ఉంది. ‘విండ్ ఫోన్ ఏమిటి? అక్కడెక్కడో కొండల్లో ఉండడం ఏమిటి?’ అనుకుంటున్నారా! విషయంలోకి వస్తే...2011లో జపాన్ లో భూకంపం వచ్చి ఎంతోమంది చనిపోయారు. చనిపోయిన వారితో ఆత్మీయులకు మాట్లాడే అవకాశం లేదు. వారు ఎక్కడో ఉన్నట్లుగానే భావించి ఫోన్లో మాట్లాడి మనసులో ఉన్న బాధను దించుకోవడమే ఈ ‘విండో ఫోన్’ ఉద్దేశం. దీన్ని స్ఫూర్తిగా తీసుకొని అమెరికా, ఆస్ట్రేలియా, బ్రిటన్‌లో కూడా ‘విండ్ ఫోన్’లు ఏర్పాటయ్యాయి. ► పెరూలో ‘టకనాకుయ్’ పేరుతో ప్రతి సంవత్సరం ‘ఫైటింగ్ ఫెస్టివల్’ జరుగుతుంది. ‘టకనాకుయ్’ అంటే ఒకరితో ఒకరు తలపడడం. అంతమాత్రాన ఈ ఫైటింగ్ ఫెస్టివల్లో రక్తం కారేలా కొట్టుకోరు. ఒక విధంగా చెప్పాలంటే ఉత్తుత్తి ఫైటింగ్ అన్నమాట! మనసులో ఉన్న కోపం, ఒత్తిడి, ఆందోళనను వదిలించుకోవడానికి ఈ ‘ఫైటింగ్ ఫెస్టివల్’ ఉపయోగపడుతుందనే నమ్మకం ఉంది. దీనికి ఎంతో పురాతనమైన చరిత్ర ఉంది. -
11 నుంచి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు
సాక్షి, శ్రీశైలం టెంపుల్: శ్రీశైల మహాక్షేత్రంలో ఈ నెల 11 నుంచి 21వ తేదీ వరకు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నారు. భూకైలాసంగా ప్రసిద్ధి చెందిన ఈ దివ్యక్షేత్రంలో 11 రోజుల పాటు బ్రహ్మోత్సవాలు వైభవంగా జరిపేందుకు అధికారులు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. 11న ప్రత్యేక పూజలతో ఉత్సవాలను ప్రారంభిస్తారు. సాయంత్రం అంకురార్పణ అనంతరం శ్రీకాళహస్తీశ్వరస్వామి దేవస్థానం తరఫున స్వామి, అమ్మవార్లకు పట్టువస్త్రాలు సమర్పిస్తారు. 12న స్వామి, అమ్మవార్లకు భృంగి వాహనసేవ, 13న హంస వాహన సేవ, దుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానం తరఫున పట్టు వస్త్రాల సమర్పణ, 14న మయూర వాహన సేవ, టీటీడీ తరఫున పట్టు వస్త్రాల సమర్పణ ఉంటుంది. అలాగే 15న రావణ వాహనసేవ, రాష్ట్ర ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాల సమర్పణ, 16న పుష్పపల్లకి సేవ, 17న గజ వాహనసేవ, 18న మహాశివరాత్రి సాయంత్రం ప్రభోత్సవం, రాత్రి ఏడు గంటలకు నందివాహన సేవ, రాత్రి 10 గంటలకు లింగోద్భవకాల మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, పాగాలంకరణ, రాత్రి 12 గంటలకు స్వామి, అమ్మవార్లకు కళ్యాణోత్సవం జరుగుతుంది. 19న సాయంత్రం స్వామి, అమ్మవార్ల రథోత్సవం, తెప్పోత్సవం, 20న పూర్ణాహుతి, రాత్రి ఏడు గంటలకు ధ్వజావరోహణ, 21న అశ్వవాహన సేవ, రాత్రి ఎనిమిది గంటలకు పుష్పోత్సవం, శయనోత్సవం, ఏకాంతసేవ నిర్వహిస్తారు. (చదవండి: చాంతాడంతా చలానాలు పెండింగ్..మూడు రోజుల్లో రూ. 25 కోట్లు వసూళ్లు) -
తక్కువ బడ్జెట్లో ఇంటి అలంకరణ.. వావ్ అనాల్సిందే!
పండగను ప్రత్యేకంగా జరుపుకోవాలనే తపన అందరిలోనూ ఉంటుంది. అందుకు తగినట్టుగా ఇంటి అలంకరణను ఎంచుకుంటారు. అయితే, పండగ కళ అందరికన్నా బాగా కనపడాలని కోరుకునేవారికి డెకార్ నిపుణులు ఈ సూచనలు చేస్తున్నారు. ఫ్యాబ్రిక్‌తో డిజైన్.. కర్టెన్లు, చీరలు, దుపట్టాలు లేదా ఏదైనా ఫాబ్రిక్‌ని ఉపయోగించి మీ లివింగ్‌రూమ్‌ని అందంగా మార్చుకోవచ్చు. ఇందుకు పండగ థీమ్‌తో బాగా సరియే డిజైన్ లేదా ప్రింట్‌ని ఎంచుకోవాలి. రంగవల్లికలైనా, ఇంటి అలంకరణలో డిజైన్ని మెరుగుపరచడానికైనా పువ్వులు, లైటింగ్ ఎంపికలు, బెలూన్ లను వాడచ్చు. గాలిపటం గాలిపటాలు ఎగురవేసిన జ్ఞాపకాలు మీలో ఉండే ఉంటాయి. అయితే, గాలిపటాలు ఎగురవేయడాన్ని మీ ఇంటి వెలుపలికి ఎందుకు పరిమితం చేయాలి? ఈసారి ఇంటిని పండగ కళ నింపేలా ఒక వాల్ని పతంగులతో అలంకరించండి. ఆకులతో.. భోగి, సంక్రాంతి శ్రేయస్సుకు వేడుకలు. అందుకే ప్రధాన రంగు ఆకుపచ్చ తప్పక ఉంటుంది. మామిడి ఆకులు పొంగల్ వేడుకలలో అత్యంత ముఖ్యమైన అంశాలలో ఒకటి. వీటిని మీ ద్వారం వద్ద వేలాడదీయచ్చు. మామిడి ఆకులు శుభప్రదానికి, సంతోషానికి సూచికలు. పర్యావరణ అనుకూలమైనవి. మామిడి ఆకులు, ఇతర పువ్వులతో కలిపి చేసే అలంకరణ కూడా చూడముచ్చటగా ఉంటుంది. వెదురు బుట్టలు కొన్నిరకాల చిన్న చిన్న బుట్టలను ఎంపిక చేసుకోవాలి. వాటి చివర్లను పువ్వులు లేదా ఇతర టాసిల్స్తో జత చేయాలి. వాటిని గొడుగులా ఔట్ డోర్ లేదా బాల్కనీ ఏరియాలో వేలాడదీయవచ్చు. తక్కువ బడ్జెట్ అలంకరణకు తక్కువ బడ్జెట్లో పర్యావరణకు అనుకూలమైనవి, తిరిగి భద్రపరుచుకునేవి ఎంపిక చేసుకుంటే పండగ సంబరం మరింత పెరుగుతుంది. ఇందుకు ఖరీదైన వస్తువులను కొనడం అవసరం లేదు. ప్రాథమిక అలంకరణలపై దృష్టి పెడితే చాలు. వాటిలో... స్కాచ్ టేప్, సేఫ్టీ పిన్స్ లేదా అతికించడానికి గ్లూ, కట్టర్ లేదా కత్తెర వంటివి సిద్ధం చేసుకోవాలి. ప్రతి ప్రయత్నమూ మిమ్మల్ని విసిగిస్తే సింపుల్‌గా బెలూన్లను ఎంపిక చేసుకోవచ్చు. వీటి నిర్వహణ కూడా పెద్ద కష్టం కాదు. రంగు రంగుల బెలూన్లు రెండు మూడు కలిపి, గుచ్చంలా వాల్కి ఒక్కో చోట అతికించవచ్చు. లేదా హ్యాంగ్ చేయవచ్చు. ప్రతి పూజలో పువ్వులు ముఖ్యమైన భాగం. కాబట్టి, మీ ఇంటికి కొన్ని తాజాపూలను ముందుగానే కొనుగోలు చేయండి. పూలతో ఎన్ని అలంకరణలైనా చేయచ్చు. పండుగలలో ఏదైనా తీపిని తినడం మంచి శకునంగా భావిస్తారు. అలాగే, స్వయంగా చేసినవైనా, కొనుగోలు చేసినవైనా కొన్ని రకాల తీపి పదార్థాలను అందుబాటులో ఉంచాలి. పండగ సమయాల్లో ప్రకాశంతమైన రంగు దుస్తులు బాగుంటాయి. వాటిలో మంచి పచ్చ, పసుపు, మెరూన్, పింక్.. ఎంచుకోవాలి. (క్లిక్ చేయండి: పండగ రోజు ట్రెడిషనల్ లుక్ కోసం ఇలా చేయండి..) -
వచ్చే ఏడాది ప్రభుత్వ సెలవులు ఇవే
సాక్షి, అమరావతి: వచ్చే ఏడాది (2023) పండుగలు, పర్వదినాలకు చెందిన సాధారణ సెలవుల్లో మూడు ఆదివారాలు, ఒకటి రెండో శనివారం వచ్చాయి. ఐచ్ఛిక సెలవుల్లో నాలుగు ఆదివారాలు వచ్చాయి. 2023లో ప్రభుత్వ సాధారణ సెలవులు, ఐచ్ఛిక సెలవులను ప్రకటిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కె.ఎస్.జవహర్‌రెడ్డి గురువారం ఉత్తర్వులు జారీచేశారు. రెండో శనివారం భోగి సాధారణ సెలవుల్లో వచ్చింది. మకర సంక్రాంతి, దుర్గాష్టమి, దీపావళి ఆదివారాల్లో.. సాధారణ సెలవుల్లో వచ్చాయి. ఐచ్ఛిక సెలవుల్లో నాలుగు ఆదివారాలు వచ్చాయి. 2023లో మొత్తం 23 సాధారణ, 22 ఐచ్ఛిక సెలవులు ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వ నోటిఫికేషన్ మేరకు బ్యాంకింగ్‌తోపాటు జాతీయ స్థాయిలో నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ చట్టం కింద 16 సెలవులను రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. -
Winter: వేడినీటి బుగ్గల్లో స్నానాలు.. ముల్లంగి, తామరతూళ్లు తింటే..!
Funday Cover Story- Worldwide Winter Festivals: శీతకాలం చిరుచలితో మొదలై, గజగజ వణికించే స్థాయికి చేరుతుంది. చలిపంజా దెబ్బకు జనాలు రాత్రివేళ ఇంటి నుంచి బయటకు అడుగుపెట్టేందుకే వెనుకాడుతారు. శీతకాలం రాగానే, అప్పటివరకు అలమరాల అట్టడుగున పడివున్న చలిదుస్తులు ఒంటిమీదకు వస్తాయి. వీథుల్లో చలిమంటల సందడి మొదలవుతుంది. చలితీవ్రత పెరిగే కొద్ది, మనుషులకు వణుకూ పెరుగుతుంది. చలిలో ఆరుబయటకు వచ్చేవాళ్లు ఒద్దికగా చేతులు కట్టుకుని చలిని కాచుకుంటారు. చలికాలంలో కొన్నిచోట్ల తెరిపిలేని హిమపాతంతో నేలంతా మంచుతో నిండిపోతుంది. శీతకాలం మొదలయ్యే వేళ దీపావళి, శీతకాలం తారస్థాయిలో ఉండేటప్పుడు మకరసంక్రాంతి వేడుకలను మనం జరుపుకొంటాం. శీతకాలంలో ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల ప్రజలు వారి వారి సంప్రదాయ వేడుకలను జరుపుకొంటారు. వ్యవసాయ పనులు ముగిసి, కాస్త తీరిక దొరికే కాలం కావడంతో సంబరాలు చేసుకుంటారు. కాలానికి తగినట్లుగా ప్రత్యేకమైన వంటకాలను ఆగరిస్తారు. ఆరుబయటకు చేరి ఆట పాటలతో శీతల వాతావరణాన్ని ఆస్వాదిస్తారు. వివిధ దేశాల్లో జరుపుకొనే శీతకాల సంబరాలను, వాటి విశేషాలను తెలుసుకుందాం... షెట్లాండ్ వైకింగ్ ఫెస్టివల్ స్కాట్లాండ్లోని షెట్లాండ్ ప్రాంతంలో క్రిస్మస్ వేడుకలు ముగిసినప్పటి నుంచి మూడునెలల వరకు సుదీర్ఘంగా కొనసాగే చలిమంటల వేడుక ‘షెట్లాండ్ వైకింగ్ ఫెస్టివల్’. స్థానికంగా ఈ వేడుకలను ‘అప్ హెలీ ఆ’ అంటారు. షెట్లాండ్ రాజధాని లెర్విక్లో ఈ వేడుకల్లో భాగంగా జనవరి మూడో మంగళవారం రోజున జనాల ఆట పాటలతో వాద్యాల హోరుతో భారీ ఊరేగింపు జరుగుతుంది. వైకింగ్‌ల పొడవాటి పడవలను అనుకరిస్తూ ప్రత్యేకంగా రూపొందించిన దుస్తులు ధరించి, మేళతాళాలతో ఈ ఊరేగింపులో పాల్గొంటారు. తొలినాళ్లలో తారుపీపాలకు నిప్పుపెట్టి స్లెడ్జిబళ్ల మీద మంచునిండిన వీథుల్లోకి లాక్కొచ్చేవారు. ఇటీవలికాలంలో తారుపీపాలకు నిప్పుపెట్టడం వంటి పనులు మానేసి, ఎక్కడికక్కడ చలిమంటలు వేసుకుని, వేడుకలు జరుపుకొంటున్నారు. వెనిస్ కార్నివాల్ ఇటలీలోని వెనిస్ నగరంలో శీతకాలం ముగుస్తూ ఉండే సమయంలో జరిగే ఉత్సవం ఇది. క్రైస్తవుల ఉపవాస దినాలైన ‘లెంట్’ రోజుల్లోని ‘యాష్ వెన్స్డే’ నుంచి మొదలయ్యే వెనిస్ కార్నివాల్ ‘ష్రోవ్ ట్యూస్డే’ వరకు మూడువారాల పాటు జరిగే ఈ వేడుకల్లో భారీ ఎత్తున జనాలు పాల్గొంటారు. దేశ విదేశాల నుంచి సుమారు ముప్పయి లక్షలకు పైగా జనాలు వెనిస్ వీథుల్లో జరిగే ఊరేగింపుల్లో చిత్రవిచిత్ర వేషధారణలతో రకరకాల మాస్కులు ధరించి తిరుగుతూ సందడి చేస్తారు. ఈ వేడుకల్లో భాగంగా వెనిస్ కూడళ్లలో ఏర్పాటు చేసే బహిరంగ వేదికలపై సంగీత, నృత్య, నాటక ప్రదర్శనలు నిర్వహిస్తారు. ముఖాలకు మాస్కులు ధరించడాన్ని రోమన్ చక్రవర్తి 1797లో నిషేధించడంతో చాలాకాలం ఈ వేడుకలు కనుమరుగయ్యాయి. ఇటలీ ప్రభుత్వం సాంస్కృతిక పునరుద్ధరణలో భాగంగా 1979 నుంచి పునఃప్రారంభించడంతో వెనిస్ కార్నివాల్ అంతర్జాతీయ పర్యాటకులను ఆకర్షించే స్థాయికి చేరుకుంది. లా ఫాలాస్ వాలెన్షియా స్పెయిన్‌లోని వాలెన్షియా నగరంలోను, చుట్టుపక్కల పట్టణాలు, గ్రామాల్లోను ఈ వేడుకలు ఏటా మార్చి 1 నుంచి 19 వరకు జరుగుతాయి. ఈ వేడుకల్లో మార్చి 15 నుంచి 19 వరకు ఐదురోజుల పాటు సెయింట్ జోసెఫ్ స్మారకార్థం ప్రత్యేక ప్రార్థన కార్యక్రమాలను నిర్వహిస్తారు. వీథుల్లో చలిమంటలను వెలిగించి ఆటపాటలతో జనాలు కాలక్షేపం చేస్తారు. మార్చిలో శీతకాల సంబరాలేమిటా అనుకోకండి. అక్కడ మార్చిలోనూ మంచు కురుస్తూనే ఉంటుంది. చలిమంటల ముందు సేదదీరుతూ విందు వినోదాలు, గానా భజానాలతో జనం ఉల్లాసంగా గడుపుతారు. ఈ రోజుల్లో ప్రత్యేకంగా తయారు చేసే బిర్యానీ మాదిరి ‘ప్యేలా’ అనే వంటకాన్ని సామూహిక విందుల్లో వడ్డిస్తారు. దీని తయారీలో బియ్యం, మేక, గొర్రె, కుందేలు, కోడి, చేపలు, ప్రత్యేక సుగంధ ద్రవ్యాలను ఉపయోగిస్తారు. లా ఫాలెస్ వాలెన్షియాను ‘యునెస్కో’ వారసత్వ వేడుకగా గుర్తించింది. నయాగరా వింటర్ ఫెస్టివల్ ఆఫ్ లైట్స్ నయాగరా జలపాతం మామూలుగా చూస్తేనే కళ్లకు మిరుమిట్లు గొలుపుతుంది. ఇక శీతకాలంలో రాత్రివేళ ఈ జలపాతం వద్ద ఆరుబయట చేసే విద్యుద్దీపాలంకరణలు చూస్తే, రంగు రంగుల నక్షత్రాలు కళ్లముందే కదలాడినట్లుంటుంది. నయాగరా జలపాతం వద్ద కెనడాలో ఏటా శీతకాలం పొడవునా ‘వింటర్ ఫెస్టివల్ ఆఫ్ లైట్స్’ వేడుకలను దేదీప్యమానంగా నిర్వహిస్తారు. ఈసారి నవంబర్ 12న మొదలైన ఈ వేడుకలు ఫిబ్రవరి 20 వరకు కొనసాగనున్నాయి. విద్యుద్దీప కాంతుల వెలుగులో ధగధగలాడే నయాగరా అందాన్ని తిలకించేందుకు పెద్దసంఖ్యలో పర్యాటకులు ఇక్కడకు చేరుకుంటారు. ఈ సందర్భంగా పలు వినోద కార్యక్రమాలు, బాణసంచా ప్రదర్శనలు కూడా జరుగుతాయి. హార్బిన్ ఐస్ అండ్ స్నో స్కల్ప్చర్ ఫెస్టివల్ చైనాలో ఏటా శీతకాలంలో జరిగే అంతర్జాతీయ హిమశిల్పకళా వేడుకలు ఇవి. హీలోంగ్జియాంగ్ ప్రావిన్స్‌లోని హార్బిన్ నగరంలో జరిగే ఈ వేడుకలను తిలకించేందుకు దేశ విదేశాల నుంచి దాదాపు రెండుకోట్ల మంది వరకు వస్తారు. ప్రపంచంలోనే అత్యంత భారీ హిమశిల్పాలు ఈ ఉత్సవాల్లో కొలువుదీరుతాయి. హార్బిన్ నగరంలోని కూడళ్లలోను, నగరం మీదుగా ప్రవహించే సోంఘువా నదీ తీరంలోను భారీ ఎత్తున హిమశిల్పాలను ఏర్పాటు చేస్తారు. సైబీరియా మీదుగా వీచే చలిగాలుల వల్ల సోంఘువా నదిలోని నీళ్లు గడ్డకట్టిపోతాయి. నదిలో నుంచి వెలికితీసిన భారీ మంచుదిమ్మలతోనే స్థానిక కళాకారులు శిల్పాలను చెక్కి, ప్రదర్శనకు ఉంచుతారు. చైనాలో ఈ వేడుకలు 1963 నుంచి జరుగుతూ వస్తున్నాయి. ఏటా డిసెంబర్ చివరి వారం నుంచి ఫిబ్రవరి చివరి వారం వరకు జరిగే ఈ వేడుకల ద్వారా చైనా ప్రభుత్వానికి పర్యాటక ఆదాయం దండిగానే లభిస్తుంది. టోజి మత్సురి జపాన్‌లో జరుపుకొనే శీతకాల వేడుకలు ‘టోజి మత్సురి’. ఈ వేడుకలనే ‘టోజిసాయి’ అని కూడా అంటారు. మంచు కురిసే ప్రాంతాల్లో ఆరుబయట గుడారాలు వేసుకుని, వాటి ముందు చలిమంటలు వేసుకుని, ఆటపాటలతో గడుపుతారు. ‘ఓన్సెన్’ అనే వేడినీటి బుగ్గల్లో స్నానాలు చేస్తారు. నిజానికి ఈ వేడినీటి బుగ్గల్లో ఏడాది పొడవునా స్నానాలు చేస్తుంటారు గాని, శీతకాలం తప్పనిసరిగా వీటిలో స్నానం చేయడం ఆరోగ్యకరమని జపానీయులు నమ్ముతారు. గతించిన పెద్దలను తలచుకుంటూ చెరువుల్లో దీపాలను విడిచిపెడతారు. శీతకాలంలో గుమ్మడి, క్యారెట్, ముల్లంగి, తామరతూళ్లు తినడం శుభప్రదమనే నమ్ముతారు. ముఖ్యంగా తామరతూళ్లతో తయారుచేసే రెన్కాన్ చిప్స్‌ను చిన్నాపెద్దా ఇష్టంగా తింటారు. రేక్జావిక్ వింటర్ లైట్స్ ఫెస్టివల్ ఐస్లాండ్లోని రేక్జావిక్ నగరంలో ఏటా శీతకాలంలో వింటర్ లైట్స్ ఫెస్టివల్ వేడుకలు జరుగుతాయి. నగరంలోని చారిత్రిక కట్టడాలు, మ్యూజియమ్లు, పార్కులు, ఈతకొలనులు, మైదానాలు వంటివాటిని రంగురంగుల విద్యుద్దీపాలతో అలంకరిస్తారు. నగరంలోని వేడినీటి బుగ్గలలో జనాలు ఈతలు కొడతారు. వేడుకలు జరిగేంత కాలం రాత్రివేళల్లో మ్యూజియమ్లన్నీ సందర్శకుల కోసం తెరిచే ఉంచుతారు. కూడళ్లలో ఏర్పాటు చేసే తాత్కాలిక వేదికలపైనా, నగరంలోని రంగస్థలాలపైన సంగీత, నృత్య, వినోద కార్యక్రమాలు కోలాహలంగా సాగుతాయి. హ్వాషియోన్ సాన్షియోనియో ఐస్ ఫెస్టివల్ దక్షిణ కొరియాలోని గాంగ్వన్ డో ప్రావిన్స్‌లో ఏటా శీతకాలంలో ఐస్ ఫెస్టివల్ వేడుకలు జరుగుతాయి. హ్వాషియోన్ నగరంలో గడ్డకట్టిన నదిపై రకరకాల క్రీడలు, వినోద కార్యక్రమాలను నిర్వహిస్తారు. నది ఎగువ ప్రాంతంలోని సాన్షియోనియో వద్ద మంచుదిమ్మల మీద ఏర్పడిన రంధ్రాల గుండా చేపలను పట్టే పోటీలను నిర్వహిస్తారు. భారీస్థాయి మంచుశిల్పాలను తీర్చిదిద్ది ప్రదర్శిస్తారు. పర్యాటకులను ఆకట్టుకునేందుకు కొరియన్ ప్రభుత్వం ఈ సందర్భంగా వివిధ కార్యక్రమాలను నిర్వహిస్తుంది. ఏటా జనవరి 14 నుంచి ఫిబ్రవరి 5 వరకు జరిగే ఈ వేడుకలు తిలకించేందుకు దేశ విదేశాల నుంచి 15 లక్షల మందికి పైగా పర్యాటకులు వస్తుంటారు. డ్రాగన్ కార్నివాల్ స్లోవేనియా రాజధాని ల్యూబ్లీయానలో ఏటా శీతకాలంలో జరిగే సంప్రదాయ వేడుక డ్రాగన్ కార్నివాల్. పురాతన పేగన్ సంస్కృతికి ఆనవాలుగా కొనసాగే ఈ వేడుకల్లో భారీ ఊరేగింపులు నిర్వహిస్తారు. వేలాది మంది చిత్రవిచిత్రమైన మాస్కులు, రంగు రంగుల దుస్తులు ధరించి పాల్గొంటారు. భారీసైజులోని ఆకుపచ్చని డ్రాగన్ బొమ్మను మోసుకుంటూ ఊరేగిస్తారు. సంప్రదాయ వాద్యపరికరాలను మోగిస్తూ, నాట్యం చేస్తూ నగర వీథుల్లో సందడి చేస్తారు. పదమూడో శతాబ్దిలో పేగన్, క్రైస్తవ సంస్కృతులు పరస్పరం కలగలసిపోయిన నాటి నుంచి డ్రాగన్ కార్నివాల్ జరుగుతూ వస్తోందని చెబుతారు. నలభైరోజుల లెంట్ ఉపవాస దినాలకు ముందుగా, జనవరి చివరి వారంలో లేదా ఫిబ్రవరి మొదటి వారంలో ఈ సంబరాన్ని నిర్వహిస్తారు. కలోన్ వింటర్ కార్నివాల్ జర్మనీలోని కలోన్ నగరంలో ఏటా వింటర్ కార్నివాల్ వేడుకలు భారీ స్థాయిలో జరుగుతాయి. పదకొండో నెల పదకొండో తేదీన– అంటే, ఏటా నవంబర్ 11న ఉదయం 11.11 గంటల నుంచి ‘కార్నివాల్’ సీజన్ మొదలవుతుంది. వీథుల్లో చిత్రవిచిత్ర వేషధారణలతో నిర్వహించే ఊరేగింపులతో ఈ వేడుకలు జనవరి 6 వరకు కొనసాగుతాయి. ఈ రోజుల్లో ‘ఫ్యాట్ థర్స్డే’ నుంచి ‘యాష్ వెన్స్డే’ వరకు వారం రోజులను ‘క్రేజీ డేస్’ అంటారు. ఈ వారం రోజుల్లోనూ మరింత భారీ స్థాయిలో వేడుకలు జరుగుతాయి. పిల్లలూ పెద్దలూ వీథుల్లోకి చేరి, ఆటపాటలతో కాలక్షేపం చేస్తారు. వివిధ దేశాల నుంచి వచ్చే బ్యాండ్ బృందాలు, నృత్యబృందాలు ఊరేగింపుల్లో పాల్గొంటాయి. కలోన్ కార్నివాల్లో పాల్గొనేందుకు ముఖ్యంగా యూరోప్ నలుమూలల నుంచి జనాలు పెద్దసంఖ్యలో వస్తారు. సప్పోరో స్నో ఫెస్టివల్ జపాన్‌లోని సప్పోరో నగరంలో ఏటా ఫిబ్రవరిలో జరిగే వేడుక ఇది. మంచుగడ్డ కట్టే పరిస్థితుల్లో మంచుతో శిల్పాలను తీర్చిదిద్ది ప్రదర్శిస్తారు. ఈసారి 2023 ఫిబ్రవరి 4 నుంచి 11 వరకు ఈ వేడుకలు జరగనున్నాయి. సప్పోరో నగరంలోని ఓడోరి పార్క్, సుసుకినో, సుడోమ్ సహా పలు ప్రదేశాలు ఈ వేడుకల్లో హిమశిల్ప ప్రదర్శనలకు వేదికలుగా నిలుస్తాయి. ఓడోరి పార్క్‌లో హిమశిల్పాల పోటీలు కూడా జరుగుతాయి. ఈ పోటీల్లో పాల్గొనేందుకు ప్రపంచం నలుమూలలకు చెందిన కళాకారులు వందలాదిగా ఇక్కడకు వస్తుంటారు. సప్పోరో స్నో ఫెస్టివల్ 1950లో తొలిసారిగా ఒకరోజు కార్యక్రమంగా మొదలైంది. అప్పట్లో ఆరుగురు హైస్కూల్ విద్యార్థులు ఓడోరి పార్క్‌లో చేరి, మంచుతో శిల్పాలు మలచి సందర్శకులను ఆకట్టుకున్నారు. జపాన్ సైనిక దళాలు కూడా 1955 నుంచి ఈ వేడుకల్లో పాల్గొనడం ప్రారంభించడంతో ఇవి వారంరోజుల వేడుకలుగా మారాయి. అనతికాలంలోనే ఈ వేడుకలు అంతర్జాతీయ ప్రాచుర్యం పొందాయి. ఇక్కడి హిమశిల్పాలను తిలకించడానికి దేశవిదేశాల నుంచి ఏటా దాదాపు పాతిక లక్షల మంది వరకు పర్యాటకులు వస్తుంటారు. సెయింట్ పాల్ వింటర్ కార్నివాల్ అమెరికాలోని మిన్నెసోటా రాష్ట్ర రాజధాని సెయింట్ పాల్లో ఏటా శీతకాలంలో భారీ కార్నివాల్ జరుగుతుంది. ఈ కార్నివాల్ వెనుక ఒక కథ ఉంది. న్యూయార్క్‌కు చెందిన ఒక పాత్రికేయుడు సెయింట్ పాల్‌ను ‘మరో సైబీరియా’గా పోలుస్తూ కథనం రాశాడు. శీతకాలంలో ఇక్కడ మనుషులు బతకలేరని అతను రాశాడు. ఈ కథనం స్థానికులకు కోపం తెప్పించింది. శీతకాలంలో కూడా సెయింట్ పాల్లో మనుషులు బతుకుతారని, అంతేకాదు, ఉల్లాసంగా ఉత్సాహంగా వేడుకలూ జరుపుకొంటారని రుజువు చేసేందుకు 1885లో మాంట్రియల్ సరిహద్దుల్లో ఒక మంచుసౌధాన్ని నిర్మించి వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకలు 1937 వరకు ఒక క్రమం లేకుండా జరుగుతూ వచ్చాయి. తిరిగి 1946 నుంచి ఏటా క్రమపద్ధతిలో నిర్వహించడం ప్రారంభమైంది. ఈ వేడుకల కోసం భారీ హిమసౌధాన్ని సిద్ధం చేస్తారు. వీథుల్లో పరేడ్లు, రాత్రివేళల్లో కాగడాల ఊరేగింపులు, సంగీత నృత్య కార్యక్రమాలు, హిమశిల్పాల తయారీ పోటీలు వంటి కార్యక్రమాలు నిర్వహిస్తారు. క్యూబెక్ వింటర్ కార్నివాల్ కెనడాలోని క్యూబెక్ నగరంలో ఏటా ఫిబ్రవరిలో పదిరోజుల పాటు వింటర్ కార్నివాల్ జరుగుతుంది. ఈసారి ఫిబ్రవరి 3 నుంచి 12 వరకు ఈ వేడుకలు జరగనున్నాయి. క్యూబెక్‌లో 1893 నుంచి జరుగుతూ వస్తున్న ఈ కార్నివాల్లో పాల్గొనేందుకు కెనడా, అమెరికా, యూరోప్‌ల నుంచి పెద్దసంఖ్యలో పర్యాటకులు వస్తుంటారు. నగరంలో పగలూ రాత్రీ కూడా కోలాహలంగా ఊరేగింపులు జరుగుతాయి. వాద్యపరికరాలను మోగిస్తూ, విచిత్రవేషధారణలతో వేలాది మంది ఈ ఊరేగింపుల్లో పాల్గొంటారు. ఈ సందర్భంగా మంచుశిల్పాల ప్రదర్శనలు, క్రీడా కార్యక్రమాలు, సాంస్కృతిక కార్యక్రమాలు, విందు వినోద కార్యక్రమాలను నిర్వహిస్తారు. Funday Cover Story: అత్యధిక దూరం వలసపోయే పక్షి ఏదో తెలుసా? -
అది నా సెంటిమెంట్.. ఇప్పటికీ కంటిన్యూ చేస్తున్నా: రష్మిక
తమిళసినిమా: శాండిల్ వుడ్లో చిన్న చిత్రం ద్వారా నటిగా పరిచయం అయిన కన్నడ బ్యూటీ రష్మిక మందన్నా ఆ తరువాత ఛలో అనే చిత్రంతో టాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చింది. ఆ చిత్రంతోనే అదృష్టం వరించిందని చెప్పాలి. ఆ తరువాత నటించిన గీత గోవిందం చిత్ర విజయం.. రష్మిక దశనే మార్చేసింది. మధ్యలో కొన్ని కమర్షియల్ చిత్రాల్లో నటించినా అల్లుఅర్జున్‌కు జంటగా నటించిన పుష్ప చిత్రం ఈమెను బాలీవుడ్ స్థాయికి తీసుకెళ్లిపోయింది. అక్కడ అమితాబ్‌బచ్చన్‌తో కలిసి నటించిన గుడ్‌బై చిత్రం వాణిజ్య రీత్యా విజయం సాధించకపోయినా రష్మికకు మంచి పేరే తెచ్చిపెట్టింది. ప్రస్తుతం బాలీవుడ్లో రెండు చిత్రాలు, కోలీవుడ్‌లో ఒక చిత్రం చేస్తూ బిజీగా ఉంది. విజయ్‌కు జంటగా నటిస్తున్న ద్విభాషా చిత్రం వారీసు (తెలుగులో వారసుడు) చిత్రం సంక్రాంతికి విడుదలకు సిద్ధమవుతోంది. టాలీవుడ్లో నటించనున్న పుష్ప–2 చిత్రం త్వరలో సెట్‌పైకి వెళ్లనుంది. కాగా దీపావళి పండుగను కుటుంబ సభ్యులతో జరుపుకోవడానికి సొంత ఊరికి వెళ్లింది. దీని గురించి ఆమె ఒక భేటీలో పేర్కొంటూ ఎంత బిజీగా ఉన్నా పండుగలు, పర్వదినాలను తన కుటుంబ సభ్యులతో జరుపుకుంటానని చెప్పింది. అంతేకాకుండా ముఖ్యమైన పండుగ రోజుల్లో బంగారం, వెండి ఆభరణాలను కొనుగోలు చేయటం అనేది తమ సెంటిమెంట్ అని చెప్పింది. ఇప్పుడు తన నూతన చిత్రాల ప్రారంభానికి ముందు బంగారం గానీ, వెండి గానీ కొనుగోలు చేస్తూ ఆ సెంటిమెంట్ కొనసాగిస్తున్నామని చెప్పింది. తనను, తన చెల్లిని ‘నాన్న.. మీరు మన ఇంటి మహాలక్ష్ములు’ అని తన తండ్రి అంటుంటారని చెప్పింది. అది తనకు చాలా గర్వంగా అనిపిస్తుందని, ఆ మహాలక్ష్మిని ఆహ్వానించడానికి తాము పండుగలకు ముందు బంగారం, వెండి ఆభరణాలను కొంటామని నటి రష్మికా మందన్నా పేర్కొంది. -
ఘనంగా విజయనగరం ఉత్సవాలు
-
క్రతువు ముగిసింది.. కాలుష్యం మిగిలింది!
సాక్షి, హైదరాబాద్: మహా నగరంలో గణేష్ నిమజ్జన ఉత్సవాలు వైభవంగా ముగిశాయి. హుస్సేన్‌సాగర్ సహా సుమారు వంద జలాశయాల్లో వేలాదిగా గణపతి ప్రతిమలను నిమజ్జనం చేశారు. నిమజ్జన క్రతువు ముగిసిన వెంటనే వ్యర్థాలను గణనీయంగా తొలగించినట్లు బల్దియా యంత్రాంగం ప్రకటించినప్పటికీ.. ప్లాస్టర్‌ఆఫ్ ప్యారిస్ విగ్రహాల నిమజ్జనం కారణంగా టన్నుల కొద్దీ ఘన వ్యర్థాలు, అధిక గాఢత రసాయనాలు, హానికారక మూలకాలు, ఇనుము, కలప, పీఓపీ ఆయా జలాశయాల్లో కలిసినట్లు పీసీబీ నిపుణులు చెబుతున్నారు. త్వరలో నిమజ్జన కాలుష్యంపై తుది నివేదిక విడుదల చేయనున్నట్లు తెలిపారు. హుస్సేన్‌సాగర్‌లో అంచనా ఇలా.. జలాశయంలోకి సుమారు 5 వేల టన్నుల ఘన వ్యర్థాలు, 30 వేల లీటర్ల అధిక గాఢత గల రసాయనాలు, హానికారక మూలకాలు, 2 టన్నుల ఇనుము, 150 టన్నుల కలప, సుమారు వంద టన్నుల పీఓపీ సాగరంలో కలిసినట్లు పీసీబీ ప్రాథమికంగా అంచనా వేసింది. ఇందులో ఇనుము, కలపను బల్దియా ఆధ్వర్యంలో తొలగించినా.. పీఓపీ, ఇతర హానికారక రసాయనాలు, రంగులు నీళ్లలో కలిసిపోవడంతో హుస్సేన్‌సాగర్ మరింత గరళమవుతుందని నిపుణులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. అధిక మోతాదులో హానికారక రసాయనాలు, వ్యర్థాలు, మూలకాలు ప్రవేశించడంతో జలాశయంలో ప్రతి లీటరు నీటిలో జీవరాశుల మనుగడకు అత్యావశ్యకమైన బయోలాజికల్ ఆక్సిజన్ డిమాండ్(బీఓడీ), కెమికల్ ఆక్సిజన్ డిమాండ్లు పరిమితులకు మించి నమోదైనట్లు అంచనా వేస్తున్నారు. రసాయనాలు, మూలకాలిలా.. రసాయన రంగుల అవశేషాలు: లెడ్ సల్ఫేట్, చైనా క్లే, సిలికా, జింక్ ఆక్సైడ్, రెడ్ ఐరన్ ఆక్సైడ్, రెడ్ లెడ్, క్రోమ్ గ్రీన్, పైన్ ఆయిల్, లిన్సీడ్ ఆయిల్, లెడ్ అసిటేట్, వైట్ స్పిరిట్, టరీ్పన్, ఆల్కహాల్, ఎస్టర్, తిన్నర్, వార్ని‹Ù. హానికారక మూలకాలు: కోబాల్ట్, మాంగనీస్, డయాక్సైడ్, మాంగనీస్ సల్ఫేట్, అల్యూమినియం, జింక్, బ్రాంజ్ పౌడర్స్, బేరియం సల్ఫేట్, క్యాల్షియం సల్ఫేట్, కోబాల్ట్, ఆర్సినేట్, క్రోమియం ఆక్సైడ్, రెడ్ ఆర్సినిక్, జిక్ సలై్ఫడ్, మెర్క్యురీ, మైకా. తలెత్తే అనర్థాలు.. ఆయా జలాశయాల్లో సహజ ఆవరణ వ్యవస్థ దెబ్బతింటుంది. చేపలు, పక్షులు, వృక్ష, జంతు అనుఘటకాల మనుగడ ప్రశ్నార్థకమవుతుంది. పర్యావరణం దెబ్బతింటుంది. సమీప ప్రాంతాల్లో గాలి, నీరు కలుషితమవుతుంది. దుర్వాసన వెలువడే ప్రమాదం ఉంది. ఆయా జలాశయాల్లో పట్టిన చేపలను పలువురు మత్స్యకారులు నగరంలోని వివిధ మార్కెట్లలో విక్రయిస్తున్నారు. వీటిని కొనుగోలు చేసి తిన్న వారికి శరీరంలోకి హానికారక మూలకాలు చేరుతున్నాయి. మలేరియా, డెంగీ వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉంది. సమీప ప్రాంతాల్లో భూగర్భ జలాలు గరళంగా మారతాయి. క్యాల్షియం, ఐరన్, మెగ్నిషియం మాలిబ్డనమ్, సిలికాన్లు జలాశయం ఉపరితలంపై తెట్టుగా ఏర్పడతాయి. జలాశయాల అడుగున క్రోమియం, కోబాల్ట్, నికెల్, కాపర్, జింక్, కాడ్మియం, లిథియం వంటి హానికారక మూలకాలు అవక్షేపాలుగా ఏర్పడతాయి. (చదవండి: రూబీ లాడ్జీ: ఎనమిదికి చేరిన మృతుల సంఖ్య..ఫైర్ అధికారి కీలక వ్యాఖ్యలు) -
దుమ్ములేపుతున్న ఆన్లైన్ అమ్మకాలు, ఏకంగా రూ. 94 వేల కోట్ల బిజినెస్!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశవ్యాప్తంగా ఈ–కామర్స్ కంపెనీల జోరు కొనసాగుతోంది. దీపావళితో ముగిసే నెల రోజుల పండుగల సీజన్లో ఆన్లైన్ వేదికగా రూ.94 వేల కోట్ల వ్యాపారం జరిగే అవకాశం ఉందని రెడ్‌సీర్ అంచనా వేస్తోంది. గతేడాది సీజన్‌తో పోలిస్తే ఇది 28 శాతం అధికమని వెల్లడించింది. పెరిగిన వినియోగదార్ల సంఖ్యకు అనుగుణంగా అమ్మకాలు అధికంగా ఉంటాయని రెడ్‌సీర్ స్ట్రాటజీ కన్సల్టెంట్స్ అసోసియేట్ పార్ట్నర్ సంజయ్ కొఠారీ తెలిపారు. గతేడాదితో పోలిస్తే ఈ పండుగల సీజన్లో ఆన్లైన్ షాపర్స్ రెండింతలు కానున్నారని వివరించారు. ఫెస్టివ్ సేల్స్ పట్ల అవగాహన, విస్తృతి పెరగడం, కస్టమర్ల లక్ష్యంగా ఎంపికలు, ఉత్పత్తుల శ్రేణి విరివిగా అందుబాటు ధరలో ఉండడం ఇందుకు కారణమన్నారు. 2021లో ఆన్లైన్ సేల్స్ రూ.4,14,232 కోట్లు నమోదైంది. ప్రస్తుత సంవత్సరం ఇది 30 శాతం అధికమై రూ.5,41,688 కోట్లకు చేరనుందని రెడ్‌సీర్ అంచనా వేస్తోంది. | నాలుగింతల వృద్ధి.. ఆన్లైన్ కస్టమర్ల సంఖ్య 2018తో పోలిస్తే ఈ ఏడాది నాలుగింతల వృద్ధి నమోదు కానుందని రెడ్‌సీర్ తెలిపింది. ‘డిజిటల్ వైపు కస్టమర్లు బాట పట్టడం, ద్వితీయ శ్రేణి నగరాల్లో వినియోగదార్ల సంఖ్య పెరగడం ఈ స్థాయి వృద్ధికి దోహదం చేయనుంది. సీజన్ తొలి వారం రూ.47 వేల కోట్ల వ్యాపారం జరిగే చాన్స్ ఉంది. ఫ్యాషన్ విభాగం గణనీయంగా దూసుకెళ్లనుంది. ద్వితీయ శ్రేణి నగరాల నుంచి కస్టమర్లు పెరగడమే ఇందుకు కారణం. అలాగే తొలిసారిగా ఆన్‌లైన్‌కు మళ్లినవారు ఫ్యాషన్‌ను ఎంచుకుంటారు. ఫ్యాషన్ బ్రాండ్స్ ఎక్కువ మొత్తంలో రంగ ప్రవేశం చేయనున్నాయి. మెరుగైన డీల్స్, నూతన ఆవిష్కరణల కారణంగా మొబైల్, ఎలక్ట్రానిక్స్ విభాగం బలమైన పనితీరు కనబర్చనుంది. లైవ్, వీడియో కామర్స్‌తో ఆన్లైన్ షాపర్స్ సంఖ్య మరింత పెరుగుతుంది’ అని వివరించింది. -
దేవుళ్లను రాజకీయాల్లోకి లాగొద్దు: మంత్రి తలసాని
హిమాయత్‌నగర్ (హైదరాబాద్): పండుగలు, దేవుళ్లను రాజకీయాలకు వాడుకోవడం తగదని, ఈ నెల 9న గణేశ్ నిమజ్జనానికి అన్ని ఏర్పాట్లూ ప్రభుత్వమే ఘనంగా చేస్తుందని మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ అన్నారు. నిమజ్జనాలకు ప్రభుత్వం ఏర్పాట్లు చేయడంలేదని, చేతకాకపోతే తామే నిర్వహిస్తామని.. భాగ్యనగర్ గణేశ్ ఉత్సవసమితి నేతలు చేసిన వ్యాఖ్యలను ఆయన ఖండించారు. సోమవారం ఆదర్శ్‌నగర్ ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ, వేలసంఖ్యలో పోలీసులు, జీహెచ్ఎంసీ, వాటర్‌బోర్డు, రవా ణా, ఆర్అండ్బీ తదితర ప్రభుత్వ విభాగాలన్నీ కలసి చేసే కార్యక్రమం వారి వల్ల సాధ్యమవుతుందా? అని ప్రశ్నించారు. ఉత్సవసమితి నాయకులు బాధ్యతారహితంగా వ్యవహరించడం తగదన్నారు. నిమజ్జనానికి ఏర్పాట్లన్నీ జరుగుతాయని, ఎవరూ ఆందోళన పడాల్సిన అవసరం లేదని ఆయన స్పష్టంచేశారు. ట్యాంక్‌బండ్‌లో గణేశ్ నిమజ్జనం చేయనివ్వకపోతే ప్రగతిభవన్‌లో నిమజ్జనం చేస్తామంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలపై మంత్రి స్పందిస్తూ.. ‘ఇటువంటి వ్యాఖ్యలు నేను చెడ్డీలు వేసుకున్నప్పటి నుంచి వింటున్నా’ అని (నవ్వుతూ) అన్నారు. కాగా, ఒకరి పండుగలు ఘనంగా నిర్వహిస్తున్నారని, హిందువుల పండుగలు జరిపించడంలేదనే పిచ్చి మాటల నుంచి కొందరు వ్యక్తులు బయటకు రావాలని మంత్రి సూచించారు. ప్రభుత్వానికి అన్ని పండుగలూ సమానమేనన్నారు. ఇదీ చదవండి: 2024: ఢిల్లీ ‘పవర్’ మనదే.. దేశమంతా ఫ్రీ పవరే! -
దేశ భక్తి ఉట్టిపడేలా..
సాక్షి, హైదరాబాద్: భారత స్వతంత్ర వజ్రోత్సవాలు సోమవారం ఘనంగా ప్రారంభం కానున్నాయి. 15 రోజులపాటు రాష్ట్ర వ్యాప్తంగా సాగే ఈ ఉత్సవాలను హైదరాబాద్‌లోని హెచ్ఐసీసీ వేదికగా ఉదయం 11:30 గంటలకు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ప్రారంభిస్తారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్, డీజీపీ మహేందర్‌రెడ్డి, సీఎం ఓఎస్డీ దేశపతి శ్రీనివాస్, మున్సిపల్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్లతోపాటు వివిధ శాఖల ఉన్నతాధికారులు ఆదివారం ఏర్పాట్లను పరిశీలించారు. రాష్ట్రవ్యాప్తంగా దేశ భక్తి ఉట్టిపడేలా, అత్యంత ఘనంగా ఈ వేడుకలను నిర్వహిస్తున్నట్లు సీఎస్ తెలిపారు. ప్రారంభోత్సవ కార్యక్రమానికి రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, జిల్లా పరిషత్ చైర్మన్ లు, జడ్పీటీసీలు, ఎంపీపీలు ఇతర ప్రజాప్రతినిధులు హాజరయ్యేలా ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. జిల్లాల నుంచి జడ్పీటీసీలు, ఎంపీపీలకు నేరుగా రావడానికి ప్రత్యేక వాహన సదుపాయాలు ఏర్పాటు చేశామన్నారు. కాగా, జాతీ య పతాకావిష్కరణతో ప్రారంభమయ్యే ఈ కార్యక్రమాల్లో భారత స్వతంత్ర వజ్రోత్సవాల స్ఫూర్తిని చాటేలా కళా ప్రదర్శనలు ఏర్పాటు చేశారు. హైదరాబాద్‌లోని అన్ని జంక్షన్లు, ప్రభుత్వ కార్యాలయాలను విద్యుత్ దీపాలతో అలంకరించారు. కార్యక్రమాలు ఇలా.. ►ఉదయం11.30 గంటల ప్రాంతంలో కేసీఆర్ హెచ్ఐసీసీ ప్రాంగణానికి చేరుకుంటారు. ►అనంతరం జాతీయ పతాకావిష్కరణ, గాంధీజీ, భరతమాత విగ్రహాలకు పుష్పమాలాలంకరణ, సాంçస్కృతిక కార్యక్రమాలు ►75 మంది వీణ కళాకారులతో వాయిద్య ప్రదర్శన ►శాండ్ ఆర్ట్ ప్రదర్శన,దేశభక్తి ప్రబోధ నృత్య కార్యక్రమం, ఫ్యూజన్ ప్రదర్శన, లేజర్ షో ►తొలుత ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ స్వాగత ప్రసంగం ►అనంతరం వజ్రోత్సవాల కమిటీ చైర్మన్ డా.కేశవరావు ప్రారంభోపన్యాసం, తరువాత ముఖ్యమంత్రి ప్రసంగం. -
Bank Holidays: ఆగస్టులో బ్యాంకులకు ఎన్ని రోజులు సెలవులంటే?
సాక్షి, ముంబై: ఆగస్టు మాసంలో ఎన్ని రోజులు బ్యాంకులకు సెలవులో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) జాబితాను శనివారం విడుదల చేసింది. ఆగస్టు నెలలో శని, ఆదివారాలు కలిపి ఆరు సెలవులు. ఆగస్ట్‌లో ఆగస్ట్ 9 (మంగళవారం), స్వాతంత్య్ర దినోత్సవం,ఆగస్టు 19 (శుక్రవారం) జన్మాష్టమి ఆగస్టు 19 (శుక్రవారం) ఉన్నాయి. ఆర్బీఐ క్యాలెండర్ ప్రకారం ఆగస్టు నెలలో మొత్తం 9 రోజుల పాటు బ్యాంకులు పనిచేయవు గెజిట్ సెలవులు, చట్టబద్ధమైన సెలవులు, ఆదివారాల్లో ప్రైవేట్, ప్రభుత్వ బ్యాంకులు పనిచేయవు. అలాగే ప్రతీ నెల రెండో, నాల్గో శనివారాల్లో కూడా బ్యాంకులు పనిచేయవు. ఇవి కాకుండా వివిధ రాష్ట్రాల్లో పలు ప్రాంతీయ పండుగల సందర్భంగా కూడా ఆయా రాష్ట్రాల్లోని బ్యాంకుల స్థానిక శాఖలు బ్యాంకులు పనిచేయవు. దీని ప్రకారం ఆగస్టు నెలవారీ సెలవులు ఇలా ఉన్నాయి. అయితే సెలవు రోజుల్లో కూడా ఆన్లైన్ సేవలు యథావిధిగా అందుబాటులో ఉంటాయని గమనించాలి. జాతీయ, ప్రాంతీయ సెలవులు ఆగస్టు 1: ద్రుక్పా త్షే-జి (సిక్కిం) ఆగస్టు 8, 9: మోహర్రం ఆగస్టు 11, 12, శుక్ర, శని : రక్షా బంధన్ ఆగస్టు 13: దేశభక్తుల దినోత్సవం ఆగస్టు 15: స్వాతంత్య్ర దినోత్సవం ఆగస్టు 16: పార్శీల నూతన సంవత్సరం (షాహెన్షాహి) ఆగస్టు 18,గురువారం: జన్మాష్టమి ఆగస్ట్ 19, శుక్రవారం: శ్రావణ వద్/కష్ణ జయంతి ఆగస్టు 20, శనివారం: శ్రీకష్ణాష్టమి ఆగస్టు 29, సోమవారం: శ్రీమంత శంకరదేవుని తిథి ఆగస్టు 31, బుధవారం వినాయక చవితి ఆగస్టు 7: ఆదివారం ఆగస్టు 13 : శనివారం ఆగస్టు 14: ఆదివారం ఆగస్టు 21: ఆదివారం ఆగస్ట్ 27: నాల్గో శనివారం ఆగస్టు 28: ఆదివారం ఇది కూడా చదవండి: Zomato: జొమాటోకు భారీ షాక్, ఎందుకంటే? -
19 ఏళ్ల తర్వాత.. చనిపోయిన వ్యక్తి.. మళ్లీ ప్రాణాలతో..
మైసూరు: చామరాజనగర జిల్లాలోని కొళ్ళెగాల తాలూకా పాళ్య గ్రామంలో 19 ఏళ్ల తరువాత సీగేమారమ్మ జాతరలో బలి పండుగ నిర్వహించారు. ఇందులో ఒక భక్తుడు చనిపోయి 9 గంటల తరువాత మళ్లీ ప్రాణాలతో తిరిగి వస్తాడు. ఇందులో వాస్తవం ఎంతన్నది కాకుండా నమ్మకంతో ఆచరిస్తారు. ఇలా జరిగింది ఐదుమంది భక్తులు ఆలయంలో పూజలు చేసి బావిలో నుంచి రాగి తొట్టెలో నీటిని నింపుకొని వస్తారు. ఆ సమయంలో అమ్మవారి ఊరేగింపు వారికి ఎదురుగా వస్తుంది. కురిసిద్ద నాయకుడు అనే వ్యక్తి పైన అర్చకులు మంత్రాలు చదివి పూలు చల్లి అతని ఎదపైన కాలుతో తొక్కడంతో అతని ఊపిరి ఆగిపోతుంది. దీనినే బలి అంటారు. అతడు అచేతంగా 9 గంటలపాటు అలాగే ఉంటాడు. తరువాత కురిసిద్ద నాయకుడు ప్రాణాలతో లేవడంతో భక్తులు హర్షం వ్యక్తం చేశారు. ఈ బలి తంతును 19 ఏళ్ల తరువాత నిర్వహించినట్లు చెప్పారు. మరో ఘటనలో.. వ్యక్తి దారుణ హత్య తుమకూరు: తోట నుంచి ఇంటికి బైక్‌పై వెళ్తున్న వ్యక్తిని గుర్తు తెలియని వ్యక్తులు అడ్డుకుని హత్య చేసిన ఘటన తుమకూరు జిల్లా గుబ్బి తాలూకా కరిశెట్టిహళ్లి గ్రామంలో చోటు చేసుకుంది. హతుడిని కరిశెట్టిహళ్లి గ్రామానికి చెందిన మూడ్లయ్య(42)గా గుర్తించారు. మూడ్లయ్య సోమవారం అర్ధరాత్రి కరిశెట్టిహళ్లికి వెళ్తున్న సమయంలో దుండగులు అడ్డుకుని హత్య చేశారు. గుబ్బి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. చదవండి: ‘నాన్న క్షమించు.. నాకు బతకడం ఇష్టం లేదు’ -
క్షణక్షణం ఉత్కంఠ.. ఎప్పుడు ఏ ప్రమాదం ముంచుకొస్తుందో
సాక్షి, ముంబై: రాష్ట్ర రాజకీయాలకు కేంద్ర బిందువైన ముంబైలో వేసవి ఎండలతోపాటు రాజకీయ వాతావరణం కూడా వేడెక్కుతోంది. గల్లీల్లో జరుగుతున్న రాజకీయ సభలు, ఆ తర్వాత వివిధ మతాల ఉత్సవాలు, రాజకీయ నేతల హెచ్చరికలు, వివిధ సంఘటనల ఆందోళనల కారణంగా ముంబైలో ఏ క్షణంలోనైనా శాంతి, భద్రతలు అదుపు తప్పే అవకాశాలున్నాయి. దీంతో గత 20 రోజుల నుంచి ముంబైలో జరుగుతున్న నేరాల ను అదుపు చేయడంతోపాటు బందోబస్తు, శాంతి, భద్రతలను కాపాడటం పోలీసులకు నిత్యకృత్యమైంది. దీంతో నగర పోలీసులపై అదనపు పని భా రం పడుతోంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని గతంలో కంటే స్టేట్ రిజర్వుడు పోలీసు ఫోర్స్ (ఎస్ఆర్పీఎఫ్) బలగాలను మరింత పెంచాల్సి వచ్చింది. వరుసగా పండుగలు..వివాదాలు.. ప్రపంచంలో లేదా దేశంలో ఎక్కడా అల్లర్లు, మత ఘర్షణలు, బాంబు పేలుళ్లు, ఇతర ఎలాంటి ఘటనలు జరిగినా ముందుగా ముంబై నగరాన్ని అప్రమత్తం చేయడం పరిపాటిగా మారింది. దీనికి తోడు ఇటీవల మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన (ఎమ్మెన్నెస్) చీఫ్ రాజ్ ఠాక్రే లౌడ్‌స్పీకర్లపై చేసిన ప్రకటన యావత్‌దేశంలో వివాదాస్పదంగా మారింది. రాజ్ ఠాక్రే చేసిన ప్రకటనతో ముంబై, మహారాష్ట్ర సహా దేశం లోని దాదాపు అన్ని రాష్ట్రాలలో అదనపు పోలీసు బలగాలను మోహరించాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ వివాదం నడుస్తుండగానే రాజకీయాల్లో సీనియర్ నాయకుడు, నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) అధినేత శరద్ పవార్ ఇంటిపై ఆర్టీసీ ఉద్యోగులు మూకుమ్మడిగా దాడి చేసిన సంఘటన సంచలనం సృష్టించింది. పోలీసుల నిర్లక్ష్యం వల్లే ఈ దాడి జరిగిందని వెలుగులోకి వచ్చింది. అనంతరం ఈ నెల 14న బాబాసాహెబ్ అంబేడ్కర్ జయంతి, మహావీర్ జయంతి, గుడ్ ఫ్రై డే, హనుమాన్ జయంతి, ఈస్టర్, వచ్చే నెలలో మే 1న మహారాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు, ఆ తర్వాత 3న రంజాన్ ఇలా వరుసగా ఒకదాని తర్వాత మరొకటి వివిధ మతాల పండుగలు, ఉత్సవాలు వస్తున్నాయి. మే మూడో తేదీలోపు మసీదులపై ఉన్న లౌడ్స్పీకర్లను తొలగించాలని రాజ్‌ఠాక్రే మహావికాస్ ఆఘాడి ప్రభుత్వానికి అల్టీమేటం జారీ చేశారు. లేదంటే మసీదుల ఎదుట అంతకు రెట్టిం పు లౌడ్స్పీకర్లు పెట్టి హనుమాన్ చాలీసా పఠనం చేస్తామని హెచ్చరించారు. గడువు దగ్గర పడుతున్న కొద్దీ సామాన్య ప్రజలతోపాటు రాజకీయ నాయకులు, మంత్రుల్లో ఉత్కంఠ నెలకొంది. చదవండి: (హిందీ జాతీయ భాష కాదు.. బడాయి వద్దు!) నాయకుల ఆరోపణలు, ప్రత్యారోపణల వల్ల శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా పోలీసులు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. ముంబైలో గట్టి పోలీసు బందో బస్తూ ఏర్పాటు చేయడంతోపాటు పోలీసు రికార్డు ల్లో నేర చరిత్ర ఉన్న నేరస్తులందరినీ అదుపులోకి తీసుకుంటున్నారు. మోహళ్ల కమిటీ, శాంతి కమిటీ, సామాజిక సంస్థలు, ఉత్సవ మండళ్ల ప్రతినిధులు, అన్ని మత గురువులతో సమావేశం నిర్వహించారు. నేరశాఖ పోలీసులు సోషల్ మీడియాపై ప్రత్యేకంగా దృష్టిసారించారు. మత ఘర్షణలు సృష్టించే సందేశాలను, పోస్టులను తొలగించారు. కొత్త వివాదానికి తెరలేపిన రాణా దంపతులు శాంతి భద్రతలను అదుపులో ఉంచే విధంగా పోలీసులు చర్యలు తీసుకుంటున్న నేపథ్యంలో ఎంపీ నవనీత్ కౌర్ రాణా, ఎమ్మెల్యే రవీ రాణా బాంద్రా కళానగర్‌లోని మాతోశ్రీ బంగ్లా ఎదురుగా హనుమాన్ చాలీసా పఠిస్తామని ప్రకటించి కొత్త వివాదానికి తెరలేపారు. ముస్లింల పవిత్ర రంజాన్ మాసం కొనసాతున్న నేపథ్యంలో మరోసారి శాంతి, భద్రతలు అదుపు తప్పే ప్రమాదముందని ముందే గ్రహించిన ముంబై పోలీసులు మరింత అప్రమత్తమయ్యారు. హనుమాన్ చాలీసా పఠనంపై రాణా దంపతుల పట్టుదల, బీజేపీ నేత కిరీట్ సోమయ్య, మోహిత్ కంబోజ్‌లపై జరిగిన దాడుల కారణంగా పోలీసులపై పని భారం విపరీతంగా పెరిగిపోయింది. ప్రస్తుతం శాంతిభద్రతలు అదుపులో ఉన్నప్పటికీ పరిస్థితి మాత్రం నివురుగప్పిన నిప్పులా ఉంది. రాష్ట్రంలో ఎప్పుడేం జరుగుతుందో తెలియని పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో పోలీసులు ఏ మాత్రం నిర్లక్ష్యం వహించకుండా అప్రమత్తంగా విధులు నిర్వహిస్తున్నారు. మత ఘర్షణలు, శాంతి, భద్రతలకు ఎలాంటి విఘాతం కల్గకుండా, ఒకవేళ అలాంటి పరిస్థితే వస్తే వెంటనే నియంత్రించేందుకు ముంబై పోలీసులకు తోడుగా ఎస్‌ఆర్‌పీఎఫ్‌కు చెందిన 19 కంపెనీలను ముంబైలో నియోగించారు. వీరితోపాటు అల్లర్ల నియంత్రణ బలగాలు, క్విక్ రెస్పాన్స్ టీం, వివిధ దళాలకు చెందిన బలగాలను అప్రమత్తం చేశారు. -
Ugadi 2022: శ్రీ శుభకృత్‌నామ సంవత్సర పండుగలు
ఏప్రిల్ 2022 చైత్ర మాసం 2 ఉగాది, వసంత నవరాత్రులు ప్రారంభం 3 ఉమ, శివ, అగ్నిపూజ 4 ఉత్తమ మన్వాది, సౌభాగ్య గౌరీవ్రతం 5 గణేశపూజ 6 నాగపూజ, శ్వేతవరాహకల్పం, శ్రీ పంచమి 8 సూర్యపూజ 9 భవానీ యాత్ర, అశోక రుద్రపూజ 10 శ్రీరామనవమి 11 ధర్మరాజ దశమి 12 విష్ణు డోలోత్సవం, మతత్రయ ఏకాదశి, రుక్మిణీపూజ 13 వామన ద్వాదశి 14 దమనోత్సవం, మేష సంక్రమణం 15 శైవచతుర్దశి, కర్దమక్రీడ 26 మతత్రయ ఏకాదశి 29 మాస శివరాత్రి, శివసన్నిధి స్నానం మే 2022 వైశాఖ మాసం 1 ధర్మఘటాది దానం 3 అక్షయతదియ, చందనోత్సవం, బలరామ జయంతి 4 నాగ చతుర్థి 6 శంకరజయంతి 8 గంగోత్పత్తి, విద్యారణ్య జయంతి 9 అపరాజితాదేవి పూజ 10 చండికాదేవిపూజ 11 వాసవీ జయంతి 12 మతత్రయ ఏకాదశి 13 పరశురామ ద్వాదశి 14 నృసింహ జయంతి 15 వృషభ సంక్రమణం 18 పార్థివ కల్పం 24 చండికాదేవి పూజ 25 హనుమజ్జయంతి 26 మతత్రయ ఏకాదశి 28 మాసశివరాత్రి జూన్ 2022 జ్యేష్ఠ మాసం 05 ఆరణ్యకగౌరీ వ్రతం 07 శుక్లాదేవీ పూజ 08 బ్రహ్మాణీదేవి పూజ 09 దశపాపహర దశమి, సేతుబంధన రామేశ్వర ప్రతిష్ఠ 11 రామలక్ష్మణద్వాదశి 14 సావిత్రీవ్రతం 15 మిథున సంక్రమణం 21 త్రిలోచన పూజ 24 మతత్రయ ఏకాదశి 25 కూర్మజయంతి 27 మాసశివరాత్రి ఆషాఢ మాసం 30 చంద్రదర్శనం, సీతారామ రథోత్సవం జూలై 2022 1 పూరీ జగన్నాథ రథోత్సవం 4 స్కంధ పంచమి 5 కుమారషష్ఠి 7 మహిషాసురమర్దినీపూజ 8 ఐంద్రీదేవి పూజ 9 మహాలక్ష్మీ వ్రతారంభం 10 తొలి ఏకాదశి, శయన ఏకాదశి 11 వాసుదేవ ద్వాదశి, చాతుర్మాస్య వ్రత ప్రారంభం 17 కర్కాటక సంక్రమణం, దక్షిణాయన పుణ్యకాలం 18 సంకల్పాలకు దక్షిణాయనం 27 మాసశివరాత్రి శ్రావణ మాసం 30 చంద్రదర్శనం ఆగస్టు 2022 1 దూర్వాగణపతివ్రతం 2 నాగపంచమి 3 సూర్యషష్ఠి 5 వరలక్ష్మీ వ్రతం 6 కౌమారీదేవి పూజ 8 మతత్రయ ఏకాదశి 9 దామోదర ద్వాదశి, పవిత్రారోపణం 12 రాఖీపూర్ణిమ, యజుర్వేదోపాకర్మ 15 సంకట చతుర్థి 19 స్మార్త శ్రీకృష్ణాష్టమి 20 కౌమారీదేవీ పూజ 23 స్మార్త ఏకాదశి 25 మాస శివరాత్రి 26 సర్వేషాం అమావాస్య 27 పోలా వ్రతం భాద్రపద మాసం 28 శైవమౌనవ్రతం 29 కల్కి జయంతి 30 సువర్ణగౌరీ వ్రతం 31 శివాచతుర్థి 31 వినాయకచవితి సెప్టెంబర్ 2022 1 ఋషిపంచమి 4 కేదారవ్రతం 6 మతత్రయ పరివర్తన ఏకాదశి 7 వామనజయంతి 9 అనంత వ్రతం 11 మహాలయ పక్ష ప్రారంభం 12 ఉండ్రాళ్ళ తద్ది 18 వ్యతీపాత మహాలయం 21 మతత్రయ ఏకాదశి 22 యతి మహాలయం 24 శహత మహాలయం 24 మాస శివరాత్రి ఆశ్వయుజ మాసం 26 దసరా నవరాత్రుల ప్రారంభం అక్టోబర్ 2022 02 సరస్వతీ పూజ, దేవీ త్రిరాత్రవ్రతం 03 దుర్గాష్టమి 04 మహర్నవమి 05 విజయదశమి 06 మతత్రయ ఏకాదశి 07 గోద్వాదశీ, పద్మనాభ ద్వాదశి 12 అట్లతద్ది 21 మతత్రయ ఏకాదశి 22 గోవత్స ద్వాదశి 23 మాస శివరాత్రి 23 నరకచతుర్దశి 24 దీపావళి అమావాస్య 25 కేదార వ్రతం కార్తీక మాసం 26 అఖండదీప ప్రారంభం 27 యమపూజ, భగినీహస్త భోజనం 29 నాగుల చవితి నవంబర్ 2022 04 మతత్రయ ఏకాదశి 05 క్షీరాబ్ది ద్వాదశి, చిల్కు ద్వాదశి 07 జ్వాలాతోరణం 08 గ్రహణం, కార్తీకవ్రతోద్యాపనం 20 మతత్రయ ఏకాదశి 21 గోవత్స ద్వాదశి 22 మాస శివరాత్రి 23 సర్వేషాం అమావాస్య మార్గశిర మాసం 29 సుబ్రహ్మణ్య షష్ఠి 30 మిత్రసప్తమి డిసెంబర్ 2022 1 కాలభైరవాష్టమి 4 మతత్రయ ఏకాదశీ 4 గీతాజయంతి 5 హనుమద్వ్రతం 7 దత్తజయంతి 9 పరశురామజయంతి 22 మాస శివరాత్రి జనవరి 2023పుష్య మాసం 2 మతత్రతయ ఏకాదశి, ముక్కోటి ఏకాదశి 3 కూర్మ జయంతి 13 భోగి 14 మకర సంక్రాంతి 15 కనుమ 20 మాస శివరాత్రి మాఘమాసం 23 వాసవీ ఆత్మార్పణ 24 గుడలవణ దానం 26 శ్రీ పంచమి 28 రథసప్తమి 29 భీష్మాష్టమి ఫిబ్రవరి 2023 1 మతత్రయ భీష్మఏకాదశి 5 మహామాఘి 13 కుంభసంక్రమణం 18 మహాశివరాత్రి మార్చి 2023 ఫాల్గుణ మాసం 3 మత్రతయ ఏకాదశీ 4 నృసింహ ద్వాదశీ 5 కామదహనం అర్ధరాత్రి 6 హోళీ ప్రదోషం 8 వసంతోత్సవం 15 మీన సంక్రమణం 20 మాస శివరాత్రి 21 సర్వేషాం అమావాస్య 22 ఉగాది -
మనకు తెలిసిన పేరు... తెలియని ఊరు!
కచ్.. మనకు తెలిసిన పేరు... తెలియని ఊరు. సరిహద్దు రాష్ట్రంలో ఓ సరిహద్దు జిల్లా. అరేబియా సముద్రం ఓ ఎల్ల.. పొరుగుదేశం పాకిస్థాన్ మరో ఎల్ల. ఇది జిల్లా అనే కానీ.. ఓ రాష్ట్రమంత విస్తారమైనది. ఎడారిని తలపించే ఉప్పు నేలలు. ఏటా మూడు నెలల వేడుకలు. గాంధీ పుట్టిన గుజరాత్ వైభవం ఇది. సంగీతం, నాట్యం... వీటికి నేపథ్యంగా తెల్లటి ఎడారిని తలపించే ఉప్పు నేలలు. ఈ అద్భుతాన్ని చూడడానికే వచ్చినట్లు...ఆకాశం కిటికీకి ఉన్న మబ్బు తెరలు తీసి తొంగి చూస్తున్నట్లు చంద్రుడు నిండుగా ఉంటాడు. పగలైతే సూర్యుడు దేదీప్యమానంగా వెలిగిపోతూ... తెల్లటి ఉప్పు మీద కిరణాల దాడి చేస్తుంటాడు. ధవళవర్ణంలోని ఉప్పు నేల ఏడురంగుల్ని ప్రతిఫలిస్తూ కళ్లు మిరుమిట్లు గొలుపుతూ ఉంటుంది. ఈ ప్రకృతి నైపుణ్యాన్ని తలవంచి ఆస్వాదించాల్సిందే తప్ప తలెత్తి చూడడం కష్టమే. తలెత్తడానికి కూడా బెదిరిపోయేటట్లు భయభ్రాంతుల్ని చేస్తుంటాడు భానుడు. ధైర్యం చేసి తలెత్తి చూస్తే ఏడురంగులు ఒకేసారి కళ్ల మీద దాడి చేస్తున్నట్లుంటాయి. ఎప్పుడు వెళ్లవచ్చు! గుజరాత్ రాష్ట్రంలో కచ్ మహోత్సవ్ ఏటా శీతాకాలంలో మూడు నెలలపాటు జరుగుతుంది. ఈ ఏడాది నవంబర్ 12 మొదలై వచ్చే ఏడాది ఫిబ్రవరి 28 వరకు కొనసాగుతుందని అంచనా. అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. ఈ ఉత్సవాలకు టూర్ ప్యాకేజ్‌లు ఉంటాయి. ముందుగానే బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. నిండు పున్నమి రోజుల్లో కచ్ తీరంలో రాత్రి బస ఉండేటట్లు ప్లాన్ చేసుకుంటే టూర్‌ని ఆద్యంతం సమగ్రంగా ఆస్వాదించవచ్చు. ఏమేమి చూడవచ్చు! ఉప్పు నేల మీద ఎర్రటి తివాచీ పరుచుకుని, ఎర్రటి తలపాగాలు చుట్టుకున్న కళాకారులు సంప్రదాయ గుజరాతీ కచ్ జానపద సంగీతాన్ని ఆలపిస్తుంటారు. మరోవైపు డాన్స్ ప్రదర్శనలు. ఇక హాండీక్రాప్ట్స్ విలేజ్‌లో అడుగుపెట్టగానే రంగురంగుల కుండల మీద చూపు ఆగిపోతుంది. కృష్ణుడు వెన్న దొంగలించిన కథనాలు కళ్ల ముందు మెదలుతాయి. కృష్ణుడికి అందకుండా ఉట్టి మీద పెట్టిన కుండలు గుర్తొస్తాయి. ఈ ట్రిప్‌కి గుర్తుగా ఒక్క కుండనైనా తెచ్చుకోవాలని మనసు లాగుతుంది. కానీ ఇంటికి చేరేలోపు పగిలిపోతుందేమోననే భయం ఆపేస్తుంది. లెదర్ ఆర్టికల్స్, ఉడెన్ హ్యాండీక్రాఫ్ట్స్, కాపర్ బెల్స్ దొరుకుతాయి. ఇక దుస్తులైతే బాతిక్ ప్రింట్, అజ్రక్ ప్రింట్, రోగన్ వర్క్, సిల్వర్ వర్క్, మడ్మిర్రర్ వర్క్, కచ్ వర్క్ ఎంబ్రాయిడరీలు వందల రకాలు దేనికందే ప్రత్యేకం అన్నట్లుంటాయి. నిజానికి కచ్ అనే పేరు మనకు బాగా సుపరిచితమైనదే. ఎంబ్రాయిడరీ నేర్చుకునే వాళ్లకు కచ్ వర్క్‌లో నైపుణ్యం సాధించాలనే కల ఉంటుంది. ‘కచ్ వర్క్ వచ్చు’ అని చెప్పడంలో ఓ సంతోషంతోపాటు కొంత అతిశయం, మరికొంత ఆత్మవిశ్వాసం కూడా తొణికిసలాడుతుంటాయి. ఒంటెబండి విహారం మనకు ఒంటెద్దు బండి తెలుసు. ఇక్కడ మాత్రం ఒంటె బండి విహారం ప్రత్యేకత. హనీమూన్ కపుల్‌కి ఒంటె సవారీ, కుటుంబంతో వెళ్లిన వాళ్ల కోసం ఒంటెబండి సవారీ రెండూ ఉంటాయి. సూర్య కిరణాలు సోకి తెల్లగా మిలమిల మెరుస్తున్న ఉప్పు కయ్యల్లో ఒంటె పాదాల ముద్రలు పడుతుంటాయి. కొంత సేపటికే ఉప్పు కరిగి పాదముద్రలు మాయమైపోతాయి. మాండవి తీరాన ఒంటె సవారీ కూడా మంచి అనుభూతిగా మిగులుతుంది. ఒంటెబండి సవారీతోపాటు హాట్ ఎయిర్ బెలూన్ ఎక్కిస్తే పిల్లలకు ఈ టూర్ హండ్రెడ్ పర్సెంట్ సంతోషాన్నిచ్చినట్లే. -
కరోనా ఉధృతి: కర్ణాటక సర్కార్ కీలక నిర్ణయం
సాక్షి, బెంగళూరు: కోవిడ్-19 కేసులు కొత్తగా పెరుగుతున్న దృష్ట్యా, అటు థర్డ్‌వేవ్ ప్రమాదంపై నిపుణులు హెచ్చరికల నేపథ్యంలో కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మూడు నెలల పాటు భారీ ఊరేగింపులు నిర్వహించకూడదంటూ ఆదేశాలను జారీ చేసింది. రాష్ట్రవ్యాప్తంగా రాజకీయ, మతపరమైన సమావేశాల్లో భారీగా గుమిగూడటం, ఊరేగింపులను కర్ణాటక ప్రభుత్వం బ్యాన్ విధించింది. ఆగస్టు- అక్టోబర్ వరకు పండుగ సీజన్ ప్రారంభంకాన్ను నేపథ్యంలో వరమహాలక్ష్మి వ్రతం, ముహర్రం, కృష్ణ జన్మాష్టమి, గణేష్ చతుర్థి, దుర్గా పూజ తదితర పండుగ రోజుల్లో స్థానికంగా ఆంక్షలను అమలు చేయడంపై నిర్ణయం తీసుకోవాలని జిల్లా అధికారులను రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. ఆగష్టు 12 నుండి ఆగస్టు 20 వరకు అన్ని రకాల ఊరేగింపులపై నిషేధం విధిస్తూ కొత్త మార్గదర్శకాలను గురువారం జారీ చేసింది. మొహర్రం, గణేశ్, దసరా ఉత్సవాల వేడుకలపై విస్తృతమైన ఆంక్షలను ప్రకటించింది. రెండు పండుగలకు సంబంధించిన అన్ని రకాల ఊరేగింపులను నిషేధించింది. ఆలం, పంజా, తాజియాత్‌లను దూరం నుండి వీక్షించాలి. ప్రార్థన మందిరాలలో మాస్క్ ధరించడం తప్పనిసరి. కోవిడ్ సంబంధిత నిబంధనలు పాటిస్తూ మసీదుల వద్ద ప్రార్థనలు జరపాలని పేర్కొంది. అలాగే కమ్యూనిటీ హాళ్లు, ఓపెన్ గ్రౌండ్, షాదీ మహల్ మొదలైన వాటిలో సామూహిక ప్రార్థనలకు అనుమతిలేదు. గణేష్ చతుర్థికి కూడా ఆంక్షలు అమల్లోకి రానున్నాయి. గణేష్ పందిళ్ల ఏర్పాటు చేయడాన్ని నిషేధించింది. వినాచయక చవితిని సాధారణ పద్ధతిలో జరుపుకోవాలి. వినాయక విగ్రహాన్ని తీసుకువచ్చేటప్పుడు, నిమజ్జన సంయంలో మాత్రమే ఊరేగింపు కార్యక్రమాన్ని నిర్వహించాలి. గణేశ్, దేవీ విగ్రహాలను నిర్దేశించిన ప్రదేశాలలోనే నిమజ్జనం చేయాలి. దేవాలయాలను ప్రతిరోజూ విధిగా శానిటైజ్ చేయాలి. శానిటైజర్ ఉపయోగించిన తర్వాత మాత్రమే భక్తులను అనుమతించాలి. థర్మల్ చెకింగ్ సదుపాయాన్ని నిర్వాహకులు ఏర్పాటు చేసుకోవాలని కూడా ఈ ఆదేశాల్లో పేర్కొన్నారు. బెంగళూరులో బ్లాక్ ఫంగస్ మాదిరిగా ఎనిమిది మందిలో రెడ్ ఫంగస్ బయటపడింది. ఇప్పటివరకు కరోనా సోకినవారిలో, కోలుకున్నవారిలో కొందరు బ్లాక్‌ఫంగస్, వైట్, యెల్లో ఫంగస్లకు గురికావడం తెలిసిందే. ఇప్పుడు తాజాగా రెడ్ ఫంగస్ వెలుగులోకి వచ్చింది. ఐటీ నగరంలో గత ఐదురోజుల్లో 192 మంది కరోనా రోగుల నుంచి నమూనాలను తీసుకుని పరీక్షలు చేయగా వారిలో 148 మందిలో డెల్టా వైరస్ బయటపడింది. మరో 8 మందిలో రెడ్ ఫంగస్ కనిపించినట్లు బెంగళూరు కార్పొరేషన్ ఆరోగ్య విభాగం ప్రత్యేక కమిషనర్ రణదీప్ తెలిపారు. అయితే రెడ్ ఫంగస్‌తో అంత ప్రమాదం లేదన్నారు. డెల్టా రకం వేగంగా సోకుతుండటం వల్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. బెంగళూరులో జూలైలో నమోదైన మొత్తం కరోనా కేసుల్లో 12 శాతం పిల్లల కేసులు కాగా ఆగస్టు మొదటివారంలో ఇది 13 శాతానికి చేరింది. 12-18 ఏళ్లు మధ్య వయస్సు పిల్లలు ఎక్కువగా బయట తిరుగుతుండటం వల్ల కరోనా సోకుతోందని రణదీప్ తెలిపారు. -
ఈదుల్ ఫిత్ర్ శుభాకాంక్షలతో... శుభాల పరిమళం..
మానవ జీవితంలో ఆనంద సమయాలు చాలా ఉంటాయి. ప్రత్యక్షంగానో, పరోక్షంగానో వ్యక్తిగతంగానో, సామూహికంగానో ఏదైనా మేలు జరిగినప్పుడు మానవ అంతరంగం ఆనందంతో పులకించడం సహజం. అలాంటి వాటిలో పండుగలు ముఖ్యమైనవి. వాటిలో రంజాన్ ఇంకా ముఖ్యమైనది. ముస్లిం సోదరులు జరుపుకునే ‘ఈద్’కి రంజాన్ మాసంతో సంబంధం ఉండటం వల్ల ఈ పండుగ అదే పేరుతో ప్రసిద్ధికెక్కింది. నిజానికి రమజాన్ అన్నది సంవత్సరంలోని పన్నెండు నెలల్లో తొమ్మిదవ నెల పేరు. దీనికింతటి ప్రత్యేకత రావడానికి కొన్ని కారణాలున్నాయి. సర్వ మానవాళికి మార్గదర్శక గ్రంథమైన పవిత్ర ఖురాన్ రమజాన్ మాసంలోనే అవతరించింది. మానవజాతికి జ్ఞానకాంతిని ప్రసాదించే దివ్యజ్యోతి రమజాన్ మాసంలో అవతరించిన కారణంగానే ఈ మాసానికి ఇంతటి గౌరవం, ఘనత, పవిత్రత ప్రాప్తమయ్యాయి. మానవుల శారీరక, మానసిక, ఆధ్యాత్మిక వికాసానికి అద్భుతంగా ఉపకరించే ‘రోజా’ అనే ఉపవాస వ్రతాన్ని కూడా దైవం ఈ నెలలోనే విధిగా చేశాడు. ఇది జనహృదయాల్లో భయభక్తులు జనింపజేసి, మానవీయ విలువలను, సుగుణాలను పెంపొందిస్తుంది. పాపకార్యాలు, దుర్మార్గాల వైపుకు మనసు పోకుండా కాపాడుతుంది. ఉపవాసం వల్ల సహనశక్తి పెరుగుతుంది. జాలి, దయ, కరుణ, త్యాగం, పరోపకారం లాంటి సద్గుణాలు అలవడతాయి. స్థితిపరులు ఉపవాసం పాటిస్తే, పేదసాదల ఆకలి బాధను వారు అనుభవపూర్వకంగా తెలుసుకోగలుగుతారు. ఇలా మరెన్నో మానవీయ, నైతిక సుగుణాలను మానవుల్లో పెంపొందింపజేసే ఏర్పాటును చేసిన విశ్వప్రభువుకు కృతజ్ఞతగా నెల రోజుల ఉపవాసాలను ముగించి షవ్వాల్ మొదటి తేదీన ఈద్ జరుపుకుంటారు. దేవుని మన్నింపు లభించే మహత్తర శుభదినం ఈద్. తప్పులు, పొరపాట్లకు క్షమాపణ కోరుకునే రోజు ఈద్. జరిగిన తప్పుల పట్ల సిగ్గుపడుతూ, ఇకముందు తప్పులు చేయం అని, దైవమార్గంపై స్థిరంగా ఉంటామని సంకల్పం చెప్పుకునే రోజు ఈద్. కనుక దేహంలో ప్రాణం ఉండగానే దైవం ఇచ్చిన సదవకాశాన్ని వినియోగించుకొని సన్మార్గం వైపు మరలాలి. ఒక విషయం సత్యమని తెలిసినా దానికనుగుణంగా తమ జీవితాలను మలచుకోడానికి చాలామంది ముందుకు రారు. ఇదే మానవుల బలహీనత. దీన్ని అధిగమించడంలోనే విజ్ఞత, వివేకం దాగి ఉన్నాయి. పుట్టిన ప్రతి మనిషీ గిట్టక తప్పదన్న విషయం ఎంత సత్యమో, ఈ అశాశ్విత దేహం నుండి ఆత్మ ఎప్పుడు వీడిపోతుందో ఎవరికీ తెలియదన్నదికూడా అంతే సత్యం. అందుకే ఈ ఆత్మజ్యోతి ఆరిపోకముందే జాగృతమై దైవం వైపు మరలాలి. జరిగిపోయిన తప్పుల్ని సవరించుకొని రుజుమార్గం పైకిరావాలి. మనం తెలిసీ తెలియక చేసిన పాపాలను క్షమించడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. పవిత్ర రమజాన్ దీనికి చక్కని అవకాశం కల్పించింది. ఈ నెల్లాళ్ళూ ఎంతటి నియమ నిష్టలతో గడిపారో ఇకముందు కూడా ఇదే స్ఫూర్తి కొనసాగిస్తామని ప్రతిన బూనాలి. ఈద్ పర్వదినం సందర్భంగా ఇలాంటి దృఢ సంకల్పం చెప్పుకుంటే అది నిజమైన పండుగ రోజు అవుతుంది. జీవితాల్లో ఆనందోత్సాహాలు వెల్లివిరిసే శుభదినం అవుతుంది. ఒకవేళ ఈవిషయాలపట్ల శ్రద్ధ వహించక పోతే ఈద్ సౌభాగ్యానికి దూరమయ్యే ప్రమాదం కూడా ఉంది. కనుక ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని దైవానికి కృతజ్ఞతలు చెల్లిస్తూ పవిత్ర జీవితం గడిపే ప్రయత్నం చెయ్యాలి. పండుగ రోజు వేకువ ఝామునే నిద్రలేచి స్నానపానాదులు ముగించుకొని ప్రాతః కాల ఫజర్ నమాజు చేయాలి. ఉన్నంతలో మంచి దుస్తులు ధరించి, అత్తరు లాంటి సువాసన ద్రవ్యాలను వినియోగించాలి. ఈద్గాలో సమావేశమై సామూహికంగా దైవానికి కృతజ్ఞతా స్తోత్రాలు చెల్లిస్తూ ఈద్ నమాజ్ చేయాలి. కరోనా కారణంగా ఈసారి ఈద్ గాహ్‌లలో కాకుండా మసీదులలోనే మాస్క్ ధరించి, భౌతికదూరం పాటిస్తూ నమాజు ఆచరించవలసి ఉంది. తమ అపరాధాలను మన్నించమని, సన్మార్గాన నడపమని దుఆ చేయాలి. సమస్త మానవాళి సుఖసంతోషాలను కాంక్షిస్తూ ప్రత్యేక ప్రార్థనలు చేయాలి. వ్యాధుల బారినుండి, అప్పుల బారినుండి, శత్రువుల బారినుండి,కరువుకాటకాల నుండి, దారిద్య్రం నుండి తమను, దేశాన్ని, యావత్ భూప్రపంచాన్ని రక్షించమని, ముఖ్యంగా కరోనా మహమ్మారి నుండి మానవాళినంతటినీ కాపాడమని విశ్వప్రభువును వేడుకోవాలి. స్నేహితులు, బంధువులు, ఇరుగు పొరుగు, పరిచితులు, అపరిచితులందరితో సంతోషాన్ని పంచుకోవాలి. ‘ఈద్ ముబారక్’ అంటూ శుభాకాంక్షలు తెలుపుకోవాలి. అన్ని సందర్భాల్లో కోవిడ్ నిబంధనలు పాటించాలి. పండుగ పరమార్థాన్ని అవగాహన చేసుకుంటే రమజాన్ ఆరాధనల ఆశయం నెరవేరుతుంది. భావి జీవితాలు సుఖసంతోషాలతో గడిచిపోతాయి. సమాజంలో శాంతి, సామరస్యాలు వెల్లివిరుస్తాయి. ఒక చక్కని సుందర సమాజం ఆవిష్కృతమవుతుంది. పండుగ పంచిన మంచి మానవ జీవితాల్లో చివరి శ్వాస వరకూ గుబాళించాలని మనసారా కోరుకుందాం. – ముహమ్మద్ ఉస్మాన్ ఖాన్ -
మూడు సంపదల పండగ
తెల్లవారు జామునే పొలానికి వెళ్లే అలవాటున్న రైతు ఆ రోజు కూడా ఐదు గంటలకు తన పొలం చేరుకునేసరికి, అక్కడ నిండుగా అలంకరించుకుని ఉన్న ముగ్గురు యువతులు కబుర్లు చెప్పుకుంటూ కనిపించారు. వారిని చూస్తూనే ‘ఈ ముగ్గురూ అచ్చంగా మహాలక్ష్మికి ప్రతిరూపంలా ఉన్నారు. వీరెవరో, వీరి కబుర్లేమిటో వినాల్సిందే అనుకున్నాడు. అయితే తను కనిపిస్తే వారు వెళ్లిపోతారేమోనని ఒక చెట్టుచాటున కూర్చున్నాడు. ‘‘అక్కా! భోగి లక్ష్మి! నీకు భోగాలు ఎక్కువ. అందుకే భోగినాడు తలంటు పోస్తారు, భోగి పండ్లు పోస్తారు, భోగి మంటలు వేస్తారు, అన్ని బాల భోగాలు చేస్తారు. పొంగలి వండుతారు. ఎంతైనా పెద్దదానివి కదా! అందుకే నీకు సకల భోగాలు జరుగుతాయి.. అన్నారు చెల్లెళ్లు మకర లక్ష్మి, కనుమ లక్ష్మి. ‘‘అలా అంటావేంటే మకరలక్ష్మీ! నువ్వు వచ్చిన రోజునే కదా పెద్ద పండుగ అంటారు. అసలు ఈ పండుగనే నీ పేరుతో మకర సంక్రాంతి అని పిలుస్తారు. సూర్యభగవానుడు నీ రాశిలో ప్రవేశించినందుకేగా ఈ పండుగ చేసుకునేది. ఉద్యోగస్థులకు సెలవు ప్రకటించేది కూడా నీ పండుగకే కదా. కొత్త బట్టలు కట్టుకునేది కూడా నీ పండుగకే కదా.. అంది కనుమ లక్ష్మి. ఇద్దరి మాటలు విన్న భోగి లక్ష్మి, ‘‘మీరిద్దరూ నాకు చెల్లెళ్లు, నా పండుగ రోజున ఏదైనా చీడ ఉండే అది పోగొట్టడానికి భోగి మంట వేసి, మిమ్మల్ని కంటికి రెప్పలా కాపాడుకుంటాను కదా నేను. అంతేనా, నాతో పాటు మీరు కూడా ఉంటేనే కదా ఈ పండుగ. మకర లక్ష్మి వచ్చిందంటూ నీ కోసమే కదా బొబ్బట్లు, పులిహోర... వంటి పెద్ద పెద్ద పిండి వంటలు వండుతారు. పిల్లలు గాలిపటాలు ఎగురవేస్తారు. పెద్దలకు నైవేద్యాలు పెడతారు. మీమీ ప్రాధాన్యత మీకు ఎప్పుడూ ఉంటుంది’’ అంటూ చెల్లెళ్లను ఆప్యాయంగా మందలించింది భోగి లక్ష్మి. ‘‘నిజమే అక్కా! ఏదో సరదాగా అన్నాం. నీ మాటే నిజం. ఎవరి ప్రాధాన్యత వారికి ఉంటుంది. కనుమనాడు మినుము కొరకాలంటూ రకరకాల గారెలు వేస్తారు. మాంసాహారులు కడుపునిండుగా ఆ రోజున మాంసమే తింటారు. కార్మికులకు సెలవు ప్రకటిస్తారు. భోగిలక్ష్మి వచ్చిన నాడు ఎవ్వరికీ సెలవు ఉండదు. అందరూ ఎవరి పనులు వారు చేసుకోవలసిందే’’ ఇలా ముగ్గురు లక్ష్ములు ఒకరినొకరు పొగుడుకుంటున్నారో, నిందాస్తుతులో తెలియకుండా సంభాషణ సాగుతోందనిపించింది రైతుకి. ‘‘అక్కా భోగిలక్ష్మి, మన మాటలను పక్కన పెడితే, నాకు మాత్రం ఒకటి అర్థమవుతోంది. మనం ముగ్గురం కలిసి వస్తేనే ఈ పండుగ. ఇదే పెద్ద పండుగ... అని కనుమ లక్ష్మి అంటుంటే... అవును నిజమే... మన ముగ్గురం కలిసి వస్తున్నందుకే బొమ్మలు కొలువు పెట్టుకుంటున్నారు, మనం రావడానికి నెల రోజులు ముందు నుంచి ముగ్గులు వేసుకుంటున్నారు, గొబ్బెమ్మలు పెట్టుకుంటున్నారు, తిరుప్పావై చదువుకుంటున్నారు..’’ అంది భోగి లక్ష్మి. ‘‘అంతేనా, అక్క ఎప్పుడెప్పుడు వస్తుందా గోదా కల్యాణం, ఎప్పుడెప్పుడు చేసుకుందామా అని ఎదురు చూస్తుంటారు.. ’’అంది మకర లక్ష్మి. ‘‘మనం అసలు విషయం మర్చిపోయాం. ఈ నెలనాళ్లు హరిదాసుల హరినామ సంకీర్తనలతో తెలుగు లోగిళ్లు మారుమోగుతుంటాయి. గంగిరెద్దుల వారు ప్రతి ఇంటిముందు నిలబడి, అమ్మగారికి దండం పెట్టు.. అంటూ వృషభరాజం చేత నమస్కరింపచేస్తారు. వారికీ, వీరికీ కూడా సంవత్సరానికి సరిపడా సంభారాలు సమకూరతాయి..’’ అంది కనుమలక్ష్మి. ‘‘అవును అసలు వీరి వల్లే కదా, ఈ మాసమంతా పండుగ కళ సంతరించుకుంటుంది. ముగ్గులు, గొబ్బెమ్మలు, హరిదాసులు, గంగిరెద్దులు... పుడమితల్లికే కొత్త అందాన్ని తీసుకువస్తాయి..’’ అంది మకరలక్ష్మి. ‘ఇలా వారు మాట్లాడుకుంటూంటే పరవశంగా వింటున్న ఆ రైతు ఇక మనసు ఉండబట్టుకోలేక, వారి దగ్గరకు వచ్చి, ముగురమ్మలకు పాద నమస్కారం చేసి, ‘‘అమ్మా, మీ ముగ్గురు లచ్చిందేవులూ ఈ రోజు నా పొలానికి వచ్చి, మాట్లాడుకోవటం నాకు ఎంత ఆనందంగా ఉందో! మీరు వస్తున్నారనే కదా, మా ఆడబిడ్డలు అల్లుళ్లతో, మనుమలతో కలిసి పుట్టింటికి వస్తున్నారు. మా రైతుల ఇళ్లన్నీ మీకు పుట్టింటితో సమానమే. మీరు వస్తున్నందుకే కదా అందరికీ చేతినిండా పని.. మా పంటలు పండిన సంబరంతో మీకు నైవేద్యాలు పెట్టాలి. అప్పుడే మా కడుపు చల్లగా ఉంటుంది. మా కుటుంబాలు చల్లగా ఉంటాయి. మీరు ఎప్పటికీ మమ్మల్ని ఇలాగే చల్లగా చూడాలి తల్లీ’’ అంటూ వారిని తన ఇంటికి సాదరంగా ఆహ్వానించాడు. ముగ్గురూ ఎంతో ఆనందంగా వచ్చారు. ఆ రైతు ముగ్గురు బంగారు తల్లులకీ భోగి పళ్లు పోశాడు, పిండి వంటలు తయారు చేశాడు, కనుమ నాడు వారిని రథం మీద గుండె తడితో వారి ఇళ్లకు సాగనంపాడు. మరు సంవత్సరం కోసం ఆ రోజు నుంచే కళ్లల్లో ఆశలు పెట్టుకుని ఎదురుచూడసాగాడు. సృజన: వైజయంతి పురాణపండ -
పండుగల నిర్ణయంలో ఏకాభిప్రాయం ఉండాలి
పెందుర్తి: పండుగలను నిర్ణయించే విషయంలో పంచాంగకర్తలు ఏకాభిప్రాయానికి రావాలని విశాఖ శ్రీశారదాపీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి కోరారు. పండుగల విషయంలో పంచాయితీలు సరికాదన్నారు. భవిష్యత్‌లో జరగబోయే ప్రమాదాలను, ఉపద్రవాలను అంచనావేయడం వంటి ప్రజలకు ఉపయోగపడే అంశాలపై పంచాంగకర్తలు దృష్టి సారించాలన్నారు. విశాఖ జిల్లా పెందుర్తి మండలం చినముషిడివాడలోని శ్రీశారదాపీఠంలో రాష్ట్ర అర్చక ట్రైనింగ్ అకాడమీ తరఫున ఆదివారం దైవజ్ఞ సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామీజీ మాట్లాడుతూ.. పండుగల విషయంలో విభేదాలను పక్కనపెట్టి, పంచాంగకర్తలు అందరూ ఏకతాటిపై నిలవాలన్నారు. రాబోయే ప్లవ నామ సంవత్సరానికి సంబంధించి పండుగల విషయంలో ఏకాభిప్రాయంతో పంచాంగాలను ప్రచురించాలని కోరారు. వచ్చే ఏడాది వివిధ రాష్ట్రాలకు సంబంధించిన పంచాంగకర్తలందరితో పెద్దఎత్తున దైవజ్ఞ సమ్మేళనం నిర్వహించాలని సంకల్పించామని పేర్కొన్నారు. ఉత్తర పీఠాధిపతి స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామీజీ, దేవదాయశాఖ జాయింట్ కమిషనర్ చంద్రశేఖర్ ఆజాద్, అర్చక ట్రైనింగ్ అకాడమి డైరెక్టర్ కృష్ణశర్మ, దేవాలయ పాలన సంస్థ డైరెక్టర్ ద్రోణంరాజు రామచంద్రరావు, పలువురు పంచాంగకర్తలు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. -
అక్కడ పండుగ ఉత్సవాలకు అనుమతి లేదు
న్యూఢిల్లీ: దేశంలో కరోనా మహమ్మారి వ్యాప్తి ఏమాత్రం తగ్గడం లేదు. నిత్యం వేలాదిగా కొత్త కేసులు నమోదవుతూనే ఉన్నాయి. రోజూ దాదాపు వెయ్యి మంది కరోనాతో కన్నుమూస్తున్నారు. రానున్న మూడు నెలలు పండుగ రోజులే. అక్టోబర్ నుంచి డిసెంబర్ నెలాఖరు దాకా దేశంలో ఏదో ఒక చోట పండుగ కార్యక్రమాలు జరుగుతాయి. దసరా, దీపావళి, క్రిస్మస్ వంటి వేడుకల్లో జనం భారీగా పాల్గొంటారు. ప్రజలు పెద్ద ఎత్తున గుమికూడే చోట కరోనా వైరస్ వేగంగా వ్యాప్తి చెందే ప్రమాదం ఉంది. అందుకే ఈసారి పండుగల విషయంలో జాగ్రత్తలు పాటించాలని కేంద్ర ఆరోగ్య శాఖ సూచించింది. కట్టడి(కంటైన్మెంట్) జోన్లలో పండుగ ఉత్సవాలకు అనుమతి లేదని స్పష్టం చేసింది. అలాంటి ప్రాంతాల్లో జనం ఇళ్లకే పరిమితం కావాలని, ఇళ్లల్లోనే పండుగలు జరుపుకోవాలని వెల్లడించింది. ఈ మేరకు మంగళవారం ప్రామాణిక నిర్వాహక విధానాన్ని(ఎస్ఓపీ) విడుదల చేసింది.(చదవండి: ఆరోగ్యమంత్రికి కరోనా, రాహుల్‌తో కలిసి వేదిక పంచుకున్న వైనం) పండుగల్లో విగ్రహాలను, పవిత్ర గ్రంథాలను చేతులతో తాకరాదు. భక్తి సంగీతం/పాటలు వినిపించవచ్చు. పాటల పోటీలు నిర్వహించకూడదు. బృందాలుగా పాడకూడదు. పండుగ కార్యక్రమాలు జరిగే చోట జనం భౌతిక దూరం పాటించేందుకు వీలుగా మార్కింగ్ చేయాలి. ఒక్కొక్కరి మధ్య కనీసం 6 అడుగుల దూరం ఉండాలి. క్యూ లైన్లలోనూ ఇదే విధానం పాటించాలి. ఇలాంటి వేడుకలు తగినంత స్థలం ఉన్నచోటే ఏర్పాటు చేసుకోవాలి. థర్మల్ స్క్రీనింగ్ తప్పనిసరిగా చేయాలి. వేడుకలే జరిగే ప్రాంగణాలను ఎప్పటికప్పుడు శానిటైజేషన్ చేయాలి. భక్తులతో ర్యాలీలు, విగ్రహాల నిమజ్జనాలు జరిగేటప్పుడు పరిమితి సంఖ్యలోనే జనాన్ని అనుమతించాలి. ర్యాలీల్లో అంబులెన్స్‌ను అందుబాటులో ఉంచాలి. వేడుకల ప్రాంగణంలోకి ప్రవేశించడానికి ఒకదారి, బయటకు వెళ్లడానికి మరో దారి వేర్వేరుగా ఉండాలి. ఆలయాల్లోకి వెళ్లే భక్తులు తమ చెప్పులను వాహనాల్లోనే వదిలేయడం మంచిది. పండుగ వేడుకల ప్రాంగణాలు, ఆలయాల్లో భక్తులకు సురక్షితమైన తాగునీరు అందుబాటులో ఉంచాలి. వైద్య సదుపాయం సైతం ఉండాలి. -
పండుగలను ఇళ్లలోనే జరుపుకోండి
సాక్షి, హైదరాబాద్: జన సమూహాలు లేకుండా వినాయకచవితి ఉత్సవాలతోపా టు మొహర్రంను ఎవరి ఇం ట్లో వారే నిర్వహించుకోవాలని, సామూహిక నిమజ్జనా లు, ప్రార్థనలు వద్దని ప్రజలకు అటవీ, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. కరోనా నేపథ్యంలో ఈ రెండు పండుగలను నిరాడంబరం గా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నా రు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ఆదివారం మంత్రి తన క్యాంప్ కా ర్యాలయం నుంచి మీడియా ద్వారా ఈ మేరకు విజ్ఞప్తి చేశారు. కరోనా నిబంధన లను ప్రజలు తప్పకుండా పాటించాలని, వ్యక్తుల మధ్య భౌతికదూరం పాటించాలని, మాస్కులు తప్పక ధరించాలని, ఈ నిబంధనలను పాటిస్తూ ప్రజలు పండుగలు జరుపుకోవాలని కోరారు. -
బంగారం ధరలకు రెక్కలు
-
వింటే భారతం చూస్తే బోనం
పండుగల సందర్భాలలో నగరాల్లో నివాసం ఉంటున్నవారు తమ గ్రామాలకు తరలి వెళ్తారు. బోనాలు, మహంకాళి జాతరలకు మాత్రం గ్రామాల నుంచి ప్రజలు నగరాలకు చీమల వరుసలుగా తరలివస్తారు. బోనాలు ఇంతటి విశిష్టతను సంతరించుకోడానికి కారణం.. అవి మాతృస్వామ్యపు వైభవాలు కావడమేనని తాజాగా వెలువడిన ఛాయాచిత్ర ఖచిత మహోద్గ్రంథం ‘బోనాలు– మహంకాళిజాతర’లో ఆ పుస్తక ప్రధాన సంపాదకుడు, ప్రముఖ సినీ దర్శకుడు బి.నరసింగరావు; పుస్తక పదకర్త, తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ నిర్వాహకులు మామిడి హరికృష్ణ అంటున్నారు. అనాదికాలం నుంచీ స్త్రీ దేవతలను ఆరాధించే సంప్రదాయం మన సంస్కృతిలో ఉంది. మానవ పరిణామక్రమంలో నిరంతరాయంగా ప్రవహిస్తోన్న భావధార ఆ సంప్రదాయం. ఇందులో కాలానుగుణంగా అనేక ఆచారాలు, విధి విధానాలు ప్రవేశించి ఈ ఆరాధన ఒక జీవన విధానంగా స్థిరపడింది. హైదరాబాద్–సికింద్రాబాద్.. జంట నగరాల్లో ప్రజలు జరుపుకునే బోనాలు జాతర.. స్త్రీ దేవతారాధనలో తనదైన ఒక ప్రత్యేకతను సంతరించుకుంది. ‘బోనం తెలంగాణ ఆత్మ అయితే, బతుకమ్మ తెలంగాణ జీవితం’ అంటారు బి.నరసింగరావు. బోనం ఇవ్వడం అంటే తమ కష్టసుఖాల్లో నువ్వు తోడుగా ఉన్నావమ్మా అని సాధారణ ప్రజలు దేవతకు కృతజ్ఞత చెప్పడం. పురాతన కాలం నుంచీ బోనాలు సమర్పించే సంప్రదాయం ఉంది. ఆ వైనాలను ఇతిహాసాల నుంచి, చరిత్ర నుంచి వివరిస్తూ, ‘మదర్ రైట్స్’ గ్రంథ రచయిత బారన్ ఒమర్ రోల్ఫ్ మాతృదేవతారాధనల గురించి అనేక ఆసక్తికరమైన అంశాలను ఆ పుస్తకంలో ప్రస్తావించారు. గ్రీకు దేవత డెమటార్, ఉపఖండపు దేవత చాముండి.. ప్రజలను అంటురోగాల నుంచి కాపాడే స్త్రీ శక్తులు. క్రీ.పూ. ఇరవై వేల సంవత్సరాల నాటికే తమిళనాడులోని అడిచెన్నలూరు, ఆస్ట్రియా, రష్యా దేశాలలో లభించిన త్రికోణాకారపు ప్రతిమల సారూప్యతలను వివరిస్తూ, సింధు నాగరికతలో మాతృదేవత.. ప్రధాన దైవంగా స్థిరపడినట్లు రోల్ఫ్ రాశారు. ఆసక్తికరమైన ఆ వివరాలు కూడా ‘బోనాలు– మహం కాళి జాతర’ పుస్తకంలో ఉన్నాయి. మనిషి నేటి రూపాన్ని, ఆహారపు అలవాట్లను సంతరించుకునే క్రమంలో తాము స్వీకరించే ఆహారం మార్పులకు లోనైనట్లే బోనాల సంప్రదాయంలో, స్థలకాలాదుల్లో కూడా మార్పులు చోటు చేసుకున్నాయి. తొలినాళ్లలో గ్రామాలకు మాత్రమే పరిమితమైన బోనాలు.. మెట్రో నగరంలో కుటుంబాలు సమూహాలుగా మారి జరుపుకునే పండుగగా పరిణామం చెందింది. జంట నగరాలలో శ్రావణ–ఆషాఢ మాసాలలో (రుతువులు మారి అంటువ్యాధులు ప్రబలేందుకు ఆస్కారం ఉన్న జూన్–జూలై–ఆగస్ట్ మాసాలలో) జరిగే బోనాలు, మహంకాళి జాతర సందర్భంగా గ్రామాల నుంచి ప్రజలు నగరానికి తరలి వస్తారు. పిల్లాజెల్లలను రోగాల బారి నుంచి కాపాడండమ్మా అని అర్థిస్తూ, నగరంలోని బోనాల జాతర సందర్భంగా ప్రధానంగా పోచమ్మ, ఎల్లమ్మ దేవతలకు బోనాలు సమర్పిస్తారు. ఇవన్నీ పైపైన తెలిసిన విషయాలే కానీ, తెలియనివి, తెలుసుకోవలసినవి అయిన విశేషాలెన్నింటినో ఒక పిక్టోరియల్ హిస్టరీగా ఈ పుస్తకం కనువిందు చేసి, దివ్యానుభూతిని కలిగిస్తుంది. అపురూప భావచిత్రాలు శివరామాచారి శిల్పం ముఖచిత్రంగా, విద్యాసాగర్ లక్కా పసుపు పారాణి పాద చిత్రం బ్యాక్ కవర్‌గా వెలువడిన ‘బోనాలు : మహంకాళి జాతర’ పుస్తకంలో పద్నాలుగు మంది సిద్ధహస్తులైన స్టిల్ ఫొటోగ్రాఫర్లు తీసిన జాతర ఫోటోలతో పాటు.. అన్నవరం శ్రీనివాస్ ప్రాథమిక వర్ణాలను ఉపయోగించి చిత్రించిన పది పెయింటింగుల బోనాల సంప్రదాయపు అపురూప భావచిత్రాలు కూడా ఇందులో ఉన్నాయి. (పుస్తకం వివరాలను ఇవాళ్టి ‘సాహిత్యం’పేజీలో చూడొచ్చు). -
ఫైనాన్సర్ టోకరా!
సాక్షి, తుర్కపల్లి(ఆలేరు): అతనో వికలాంగుడు.. ఏప్రాంతంవాడో తెలియదు.. చిరువ్యాపారులకు డబ్బులు అప్పుగా ఇస్తూ ఫైనాన్సర్‌గా మారాడు. అయ్యప్పమాల వేసి పరమభక్తుడిగా నటించాడు.. పండుగలొస్తేచాలు హంగూఆర్భాటాలతో పూజలు చేసి స్వీట్లు పంపిణీ చేసేవాడు. అన్నదానాలూ చేసేవాడు. విలాసవంతమైన జీవితం గడుపుతూ ధనవంతుడినని నమ్మించాడు. తాను కొనుగోలు చేసిన భూములను తక్కువ ధరకు అమ్ముతానని కొందరిని నమ్మించి అడ్వాన్స్‌ల పేరిట రూ.51లక్షల వరకు వసూలు చేసి ఆ సొమ్ముతో రాత్రికిరాత్రే బిఛానా ఎత్తేశాడు. ఈ సంఘటన తుర్కపల్లి మండల కేంద్రంలో మంగళవారం వెలుగులోకి వచ్చింది. పోలీసులు, బాధితులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ఆకుల ఆనంద్‌రెడ్డిగా పరిచయం చేసుకున్న ఓ వికలాంగుడు నాలుగేళ్లక్రితం ఓ చిన్నపాటి సూట్‌కేసుతో తుర్కపల్లికి వచ్చాడు. తాను ఫైనాన్సర్అని చెప్పి ఓ ఇంట్లో అద్దెకు దిగాడు. వచ్చిన కొద్ది రోజుల్లోనే ఇంట్లోకి కావాల్సిన ఏసీలు, ఫ్రిజ్, టీవీ, సోఫాలు, ఇలా రకరకాల వస్తువులు కొనుగోలు చేశాడు. తను ఉండే ఇంట్లో పరమభక్తుడిలా రోజూ పూజలు చేస్తూ చుట్టపక్కల వారికి ప్రసాదాలు పంచేవాడు. దీపావళి పండుగ వస్తే ఘనంగా లక్ష్మీపూజ చేసి స్వీట్లు పంపిణీ చేసేవాడు. తుర్కపల్లిలో చిరువ్యాపారులకు, ఆటోడ్రైవర్లకు ఫైనాన్స్ ఇచ్చి డెయిలీ వసూళ్లకు యువకులను సైతం తన దగ్గర ఉద్యోగులుగా పెట్టుకున్నాడు. తాంత్రికస్వామిగా.. కార్తీకమాసం కంటే ముందే అయ్యప్పమాలధారణ చేసేవాడు. 23 సార్లు తాను మాలవేసుకున్న తాంత్రికస్వామిగా పరిచయం చేసుకున్నాడు. అయ్యప్ప పూజల సందర్భంగా పెద్ద ఎత్తున్న మండల కేంద్రంలో అన్నదానాలు చేసేవాడు. గుళ్లు గోపురాలకు పెద్ద ఎత్తున చందాలు రాసేవాడు. గణేశ్ నవరాత్రోత్సవాలు వచ్చాయంటే అన్నదాన కార్యక్రమాలు నిర్వహించేవాడు. ఆర్థికంగా ఉన్న అయ్యప్ప భక్తులు, ప్రజలపై కన్ను మాల వేసుకున్న భక్తుల్లో ఆర్థికంగా ఉన్నవారిపై ఓ కన్నువేసేవాడు.ఆ క్రమంలోనే చుట్టు పక్కల ఉన్న భూములను కొనుగోలు చేసానని భూమి జిరాక్స్ పత్రాలను వారికి చూపించేవాడు. ఎవరూ లేని సమయంలో ఆ భూముల వద్దకు తీసుకెళ్లి ఈ భూమి నేను అగ్రిమెంట్ చేసుకున్నానని నమ్మించే వాడు. ఆ భూములను తక్కువ ధరలకు మీకు అమ్ముతామని పెద్ద మొత్తంలో అడ్వాన్స్‌లు తీసుకునేవాడు. ఈ విషయం ఎవరికీ చెప్పవద్దని అందరికీ తెలిస్తే భూమిని మీకు అమ్మనని స్పష్టంచేసేవాడు. అనంతపురం వాసుడిగా.. మీరు ఏప్రాంతం నుంచి వచ్చారని ప్రజలు అడిగితే తనది అనంతçపురం అని, ధనవంతుల కుటుంబం అని నమ్మించాడు. కుటుంబ సభ్యులు ఎక్కడ అని అడిగితే తన ఫొటోతో ఇతరుల ఫొటోలను జతచేసి మార్ఫింగ్చేసి కుటుంబ సభ్యులని చూపించాడు. గురుస్వామిని నమ్మించి.. తుర్కపల్లికి చెందిన ఓగురుస్వామిని నమ్మించి రూ.36లక్షలు వసూలు చేశాడు. తాను బొమ్మలరామారంలోని మెయిన్‌రోడ్డులో భూమి కొనుగోలు చేశానని ఆ గురుస్వామిని అక్కడికి తీసుకెళ్లి చూయించాడు. ఇక్కడ 14 ఎకరాలు ఉందని దీనిని యజమానులు రూ.75వేలకు ఎకరం చొప్పున కొనుగోలు చేశారని తెలిపాడు. ఇందులో 5 ఎకరాల భూమని తాను వారి వద్దనుంచి రూ.5లక్షలకు ఎకరం చొప్పున కొనుగోలు చేశానని చెప్పాడు. ఈ భూమికి ఎకరం రూ.80లక్షల వరకు డిమాండ్ ఉందని కానీ గురుస్వామి కాబట్టి మీకు రూ.20లక్షలకు ఎకరం చొప్పున విక్రయిస్తానని చెప్పి నమ్మించాడు. ఇలా ఆ గురుస్వామినుంచి ఇటీవల రూ. 36 లక్షలు వసూలు చేశాడు. మరో వ్యక్తి వద్దనుంచి రూ.5లక్షలు, ఓహోటల్ యజమాని వద్ద రూ.2.50లక్షలు, మరికొంతరి వద్ద కొంత సొమ్ము వసూలు చేశాడు. ఈ నెల 27న భూమి రిజిస్ట్రేషన్ చేస్తానని రావాలని గురుస్వామికి చెప్పాడు. అయితే 27తేదీన ఫైనాన్సర్‌కు ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ వస్తోంది. దీంతో గురుస్వామి ఆఫైనాన్సర్ ఇంటి వెళ్లివాకబు చేశాడు. పనిమీద రాత్రి బయటికి వెళ్లాడని, రెండు రోజుల తర్వాత వస్తానని చెప్పాడని అతని వద్ద పనిచేసే వర్కర్లు చెప్పారు. మంగళవారం ఫోన్ చేసినా స్విచ్ఆఫ్ వచ్చింది. అతడు 51 లక్షల రూపాయల నగదు ,నగలతో ఆదివారం రాత్రి తన మూడుచక్రాల వాహనంపైన భువనగిరికి వెళ్లి బస్‌స్టాండ్‌లోని పార్కింగ్‌లో ఉంచి ఆటోలో పరారయ్యాడు. గురుస్వామితో పాటు మరో ఐదుగురు బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈమేరకు కేసు నమోదు చేశారు. ఎటువంటి ఆధారం దొరకకుండా.. ఎవరికీ ఎలాంటి ఆధారాలు దొరకకుండా ఆనంద్‌రెడ్డి వ్యవహరించాడు. అతడు వాడిన ఫోన్లు, సి మ్‌లతో పాటు వాహనం కూడా గ్రామస్తుల పే రుమీదనే కొనుగోలు చేశాడు. తన ఉంటున్న గది లో పలుబ్యాంక్లకు సంబంధించిన పాస్పుస్తాకా లు, ఖాళీ చెక్కులు, ఆధార్‌కార్డులు, ప్రామిసరీ నోట్లు, వాహనాలు ధ్రువీకరణ పత్రాలు లభించాయి. పలు జిల్లాల్లో కూడా కేసులు ఆంధ్రరాష్ట్రంలోని అనంతపుం, తాడిపత్రి, చిత్తూ రు, మదనపల్లి, తిరుపతిలో అతని పై పలు కేసులున్నాయని పోలీసులు తెలియజేశారు. -
జయ జయ శ్రీ సుదర్శన
సర్వధర్మ సముద్ధరణకై ఉద్భవించింది సుదర్శనచక్రం. అది ఆయుధమే అయినా పురుషమూర్తి రూపంలో పూజించబడుతూ విష్ణుసామ్యాన్ని పొందింది. ఈ స్వామిని చక్రమూర్తి, చక్రత్తాళ్వార్ అని పిలుస్తారు. వైష్ణవాలయాలలో చక్రమూర్తి తప్పక ఉంటుంది. ప్రతి ఉత్సవం చివరిలో చక్రస్నానం చేస్తారు. ఈ సుదర్శనచక్రం లోహంతో తయారు చేయబడి ఉంటుంది. కానీ సుదర్శనమూర్తి పూర్తి సాకార రూపంలో, ప్రత్యేకసన్నిధిలో కొలువు దీరిన క్షేత్రం ఒకటుంది. అదే 108 వైష్ణవ దివ్యదేశాలలో 46వదైన తిరుమోగూర్. ఇక్కడి స్వామి కాలమేఘపెరుమాళ్. నాలుగుప్రాకారాలతో కూడిన అతి పెద్ద ఆలయం ఇది. చక్రత్తాళ్వార్ తొలి దేవాలయం ఇదే. ఒక చతురస్రమైన శిలపై మధ్యలో సుదర్శనమూర్తి కుడివైపు ఎనిమిది చేతులు, ఎడమవైపు ఎనిమిది చేతులు కలిగి పదహారు చేతులలో శంఖం, చక్రం, పాశం, గొడ్డలి, కత్తి, బాణం, శూలం, విల్లు, అంకుశం, అగ్ని, వజ్రాయుధం, డాలు, నాగలి, రోకలి, గద, ఈటె మొదలైన ఆయుధాలు ధరించి షోడశాయుధ సుదర్శనమూర్తిగా, భయంకరమైన కోరమీసాలతో అగ్నిజ్వాలలతో కూడిన కిరీటంతో హారం, భుజకీర్తులు, హస్తాభరణాలతో షట్కోణం మధ్యలో దర్శనమిస్తాడు. ఆయన చుట్టూ ఆరు వలయాలు ఉన్నాయి. ఆ ఆరు వృత్తాలలో 154 దివ్య బీజాక్షరాలు లిఖించబడి ఉన్నాయి. ఈ మూర్తి చుట్టూ నలభై ఎనిమిది మంది దేవతల విగ్రహాలు చెక్కబడి ఉన్నాయి. విశేషించి ఈ స్వామి మూడు కన్నులతో ఉంటాడు. ఈ మూర్తికి వెనుకవైపు యోగనరసింహస్వామివారు చతుర్భుజాలతో ఆసీనుడై ఉంటాడు.ఇక్కడి చక్రత్తాళ్వార్ స్వామి చాలా ప్రభావవంతమైన దేవుడు. ఈ స్వామిని దర్శించడానికి దేశం నలుమూలల నుంచి అనేకమంది భక్తులు ఇక్కడికి వస్తుంటారు.సుదర్శనమూర్తిని నాలుగు, ఆరు, ఎనిమిది, పది, పన్నెండు, పదహారు చేతులతో నిర్మించవచ్చనీ, ఆయుధాలసంఖ్య పెరిగిన కొద్దీ ఆ స్వామి శక్తి పెరుగుతుందనీ విశ్వకర్మీయం అనే ప్రాచీన శిల్పశాస్త్రం చెప్పింది. సకల శత్రుసంహారం సుదర్శనమూర్తి దర్శనఫలం అని వైష్ణవాగమాల అభిప్రాయం. వ్యాపార, వ్యవహారాలలో విజయం, సకలదృష్టిదోషనివారణ, కార్యసిద్ధి కలుగుతుందని భక్తుల నమ్మకం. – డాక్టర్ ఛాయా కామాక్షీదేవి -
కోరిన కోర్కెలను తీర్చే కల్పవల్లి శ్రీమావుళ్లమ్మ తల్లి
అమ్మలగన్న అమ్మగా, కోరిన కోర్కెలను తీర్చే కల్పవల్లిగా భీమవరం గ్రామ దేవత శ్రీమావుళ్లమ్మ తల్లి దేశ విదేశాల్లో ఉన్న తెలుగు వారి దైవంగా ప్రసిద్ధి. అమ్మ సన్నిధికి వచ్చి తమ బాధలను చెప్పుకుని ఆర్తితో వేడుకుంటే చాలు... చిటికెలో సమస్యలన్నీ దూరమవుతాయని భక్తుల విశ్వాసం. అందుకే సామాన్య భక్తుడి నుంచి సంపన్నుడి వరకు నిత్యం అమ్మవారి దర్శనం కోసం పరితపిస్తుంటారు. అంతటి మహిమ గల మూర్తి పచ్చని పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో కొలువై ఉంది. వ్యాపారం ప్రారంభించినా, వివాహాదివేడుకలు చేస్తున్నా, నూతన వాహనాలు కొన్నా, అంతా శ్రీమావుళ్లమ్మ అమ్మవారి దయ అని చెప్పుకుంటారు స్థానికులు. ఘనంగా ఆరంభమైన వార్షికోత్సవాలుఅమ్మవారి 55వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా ఆరంభమైనాయి. జనవరి 13న మొదలైన ఈ ఉత్సవాలు ఫిబ్రవరి 15 వరకు కొనసాగుతాయి. అమ్మవారి ఉత్సవాలను తిలకించడానికి తెలంగాణ నుంచి రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి భక్తులు తరలి వస్తున్నారు. అమ్మవారి ఆలయం వద్ద ప్రతి రోజు పలు సంస్కృతిక కార్యక్రమాలు, నాటకాలు, కూచిపూడి, జానపద నృత్య ప్రదర్శనలు ఏర్పాటు చేయగా భక్తులు భారీగా తరలి వచ్చి తిలకిస్తున్నారు. ఉత్సవాలకు వచ్చే భక్తులకు ఉత్సవాల నిర్వాహకులు నీరుల్లి, కూరగాయలు, పండ్లు వర్తకం సంఘం, అమ్మవారి ఉత్సవ కమిటీ వారు రోజుకు సుమారు 800 మంది భక్తులకు అన్నదాన ప్రసాదం వితరణ చేస్తున్నారు. వచ్చే నెల 7 తేదీ శ్రీఆదిలక్ష్మీ అమ్మవారి అలంకరణ నుంచి 15 తేదీ శ్రీ అన్నపూర్ణ దేవి అమ్మవారి అలంకరణ వరకు అమ్మవారికి ప్రత్యేక అలంకరణలు ఉంటాయి. అమ్మవారి ఉత్సవాల కోసం ఏర్పాటు చేసిన విద్యుత్ అలంకరణలు భక్తులను ఎంతో అకట్టుకుంటున్నాయి. – బొక్కా రామాంజనేయులు (నాని) ఉత్సవాలు... విశేషాలు ►శ్రీమావుళ్లమ్మ అమ్మవారు విగ్రహం ఎనిమిది అడుగుల మించిన ఎత్తుతో ఉండడం విశేషం. ►అమ్మవారి స్వర్ణ కిరీటం తిరుమల వెంకటేశ్వరస్వామి వారి కిరీటం కంటే పెద్ద కిరీటమని ప్రతీతి. ►శ్రీమావుళ్లమ్మ అమ్మవారు క్రీస్తు శకం 1200 సంవత్సరంలో వెలిసినట్లు చెబుతారు. ►భీమవరం పట్టణంలో ప్రస్తుతం ఉన్న మోటుపల్లి వారి వీధిలో అమ్మవారి గరగలు భద్రపరుచుటకు నిర్మించిన పూరి గుడి ఉన్న ప్రాంతంలో వేప, రావి చెట్టు కలిసి ఉన్న చోట శ్రీమావుళ్లమ్మ అమ్మవారు వెలిశారని తెలుస్తోంది. ►మామిడి చెట్లు ఎక్కువగా ఉన్న ప్రాంతంలో వెలిసిన తల్లి కనుక శుభపద్రమైన మామిడి పేరుమీదగా మామిళ్ళ అమ్మగా... అనంతరం మావుళ్లమ్మగా నామాంతరం చెందిందని చరిత్ర చెబుతుంది. ►చిన్న చిన్న ఊళ్ళ వారంతా కలిసి అమ్మవారిని గ్రామ దేవతగా కొలవడం వల్లే మావుళ్ల అమ్మ మావుళ్లమ్మగా నామాంతరం చెందారని మరి కొందరు అభిప్రాయం. ►ఫిబ్రవరి 15న అమ్మవారి ఆలయం వద్ద సుమారు 60 వేలమందికి అఖండ అన్నసమారాధన జరుగుతుంది. -
ఈ సారి షాపింగ్ 'పండగే'!
గతేడాది ఆన్లైన్ షాపింగ్ ఫెస్టివల్ సమయంలో ప్రమోద్ రూ.33,000 రూపాయిల మొబైల్ కొనుగోలు చేయాలని నిర్ణయించుకున్నాడు. ఈ కామర్స్ ప్లాట్‌ఫామ్ పాత మొబైల్ ఫోన్ ఎక్సేంజ్‌పై అదనంగా రూ.3,000 డిస్కౌంట్ ఆఫర్ చేయడాన్ని చూశాడు. తనకు తెలిసిన వ్యక్తి దగ్గర రూ.3,000 పెట్టి పాత మొబైల్ కొని దాన్ని ఎక్సేంజ్‌కు పెట్టాడు. ఆ మొబైల్‌కు ఈ కామర్స్ సంస్థ రూ.5,000 విలువ కట్టింది. అప్‌ఫ్రంట్ డిస్కౌంట్ కింద రూ.3,000 తగ్గింపు లభించింది. బ్యాంకు కార్డుపై మరో 10 శాతం డిస్కౌంట్ లభించింది. ఇతర తగ్గింపులు కూడా పోను చివరికి ఆ మొబైల్‌ను ప్రమోద్ కేవలం రూ.20,000కే సొంతం చేసుకున్నాడు. రానున్న పండుగలను దృష్టిలో పెట్టుకుని పెద్ద ఈ కామర్స్ సంస్థలు నిర్వహించే షాపింగ్ ఫెస్టివల్స్‌లో తక్కువ ధరలకే ఉత్పత్తులను ఎలా సొంతం చేసుకోవచ్చన్నది ఈ ఉదాహరణ తెలియజేస్తోంది. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, స్నాప్‌డీల్, పేటీఎం సంస్థలు ఈ నెల 10– 15 తేదీల మధ్య భారీ ఎత్తున విక్రయ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. అంతేకాదు వచ్చే నెలలో దీపావళికి ముందు మరోసారి పెద్ద ఎత్తున ఫెస్టివల్ సేల్స్ కూడా నిర్వహించనున్నాయి. ఈ అమ్మకాల సందర్భంగా మంచి డీల్స్ కచ్చితంగా ఉంటుంటాయి. గతానికి భిన్నంగా ఈ ఏడాది పండుగల షాపింగ్ చాలా పెద్ద ఎత్తున జరుగుతుందని ఆన్లైన్ ప్లాట్ఫామ్లో నమోదైన విక్రేతలు అంచనా వేస్తున్నారు. ‘‘ఫ్లిప్‌కార్ట్‌ను వాల్‌మార్ట్ కొనుగోలు చేసిన తర్వాత పోటీ మరింత తీవ్రతరం అయింది. అంతర్జాతీయ బ్రాండ్లు తక్కువ ధరలకే మార్కెట్లో పెద్ద వాటాను ఆక్రమించనున్నాయి’’ అని క్యాష్‌కరో డాట్ కామ్ సహ వ్యవస్థాపకురాలు స్వాతి భార్గవ పేర్కొన్నారు. మొబైల్స్ ఒక్కటే కాదు... గత కొన్నేళ్లుగా ఆన్లైన్ షాపింగ్ ఫెస్టివల్స్‌ను గమనిస్తే... ఎక్కువ ఆఫర్లు స్మార్ట్ఫోన్లపైనే ఉంటుండేవి. దీనికి కారణం ఆన్లైన్లో ఎక్కువగా అమ్ముడుపోయే ఉత్పత్తులు స్మార్ట్ఫోన్లు కావడమే. కానీ, ఈ కామర్స్ ప్లాట్‌ఫామ్‌లు ఈ సారి ఆఫర్లను మరిన్ని విభాగాల్లోని ఉత్పత్తులపైనా అందించనున్నాయి. ‘‘వినియోగదారులు కన్జ్యూమర్ డ్యూరబుల్స్ (మన్నికైన ఉత్పత్తులు)పై తగ్గింపులను ఆశిస్తున్నారు. ముఖ్యంగా రిఫ్రిజిరేటర్లు, ఏసీలపై డిస్కౌంట్ కోరుకుంటున్నారు. ఈ విభాగంలోనే డిమాండ్ ఎక్కువగా ఉంది. అదే సమయంలో స్మార్ట్ఫోన్లపై మార్జిన్లు చాలా తగ్గిపోయాయి’’ అని కంపేర్‌రాజా, కూపర్రా జా సంస్థల అధినేత రోహిత్‌చుగ్ చెప్పారు. స్మార్ట్ఫోన్లపై ఎలానూ డిస్కౌంట్లు ఉంటాయి. కాకపోతే ఈ సారి సేల్స్‌లో ఎలక్ట్రానిక్స్, ఫ్యాషన్‌పై అధిక డిస్కౌం ట్లను ఆశించొచ్చని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. క్యాష్‌బ్యాక్ వ్యాపారాన్ని మరింత విస్తరించుకునేందుకు, అదే సమయంలో కస్టమర్ల సంఖ్యను భారీగా పెంచుకునేందుకు ఈ కామర్స్ సంస్థలు మార్కెటింగ్ సంస్థలకు కొంత కమీషన్లు చెల్లిస్తుంటాయి. యూజర్లను తమ వెబ్‌సైట్‌కు మళ్లించడం అవి చేస్తుంటాయి. క్యాష్‌కరో డాట్ కామ్, గోపైసా డాట్‌కామ్ తదితర సంస్థలు ఇదే పనిచేస్తుంటాయి. అయితే ఇవి కస్టమర్లకు తమకు వచ్చే కమీషన్లో కొంత తిరిగి ఇవ్వడం అదనపు ఆకర్షణ. ‘‘క్యాష్ బ్యాక్ ఎంతన్నది ఉత్పత్తిపై ఆధారపడి ఉంటుంది. 2 శాతం నుంచి 35 శాతం వరకు ఉండొచ్చు. మా కమీషన్లో 70–80 శాతాన్ని తిరిగి వినియోగదారులకు బదిలీ చేస్తాం’’ అని క్యాష్‌కరో ఫౌండర్ స్వాతి భార్గవ తెలిపారు.ఈ క్యాష్ బ్యాక్‌ను తదుపరి లావాదేవీ కోసం వినియోగించుకోవచ్చన్నారు. కొన్ని సంస్థలయితే ఈ క్యాష్ బ్యాక్ మొత్తాన్ని బ్యాంకు ఖాతాకు బదిలీ చేసుకునే అవకాశం కూడా కల్పిస్తున్నాయి. మార్కెటింగ్ అఫిలియేట్ సంస్థలు డీల్స్ ప్రచారం విషయంలో ఈ కామర్స్ సంస్థలతో ప్రత్యేక ఒప్పందాలను కుదుర్చుకుంటున్నాయి. ఈ సంస్థల పోర్టళ్లను పరిశీలిస్తే కూపన్ కోడ్స్ కనిపిస్తాయి. వీటిని ఈ కామర్స్ ప్లాట్‌ఫామ్‌లపై వినియోగించడం ద్వారా, అదనపు డిస్కౌంట్ కూడా పొందొచ్చు. తగ్గింపు అవకాశాలు ధరలను వివిధ పోర్టళ్లలో ఏవిధంగా ఉన్నదీ చూపించేందుకు కొన్ని పోర్టళ్లు ఉన్నాయి. ప్రైస్దేఖో డాట్ కామ్, కంపేర్‌రాజా, మైస్మార్ట్‌ప్రైస్, బైహట్కే, స్మార్ట్పిక్స్ సంస్థలన్నీ ఈ సేవలు అందించేవే. ఏ ఏ పోర్టళ్లలో ఫలానా ప్రొడక్ట్ ధర ఎంతున్నది, క్రెడిట్/డెబిట్ కార్డులపై ఏదైనా తగ్గింపు ఆఫర్లున్నాయా? అన్నవి చూపిస్తాయి. ఒక్క పేజీలోనే అన్ని డీల్స్‌ను చూసి నిర్ణయం తీసుకునే సౌకర్యం ఉంటుంది. యాప్స్‌లో ప్రత్యే క డీల్స్ అన్నవి గతంలోనే ఎక్కువగా ఉండగా, ఈ సారి తగ్గిపోనున్నాయి. ఖరీదైన ఉత్పత్తులను కొనుగోలు చేసే ముందు వినియోగదారులు వాటిని వెబ్సైట్లలోనే చూసేందుకు ప్రాధాన్యం ఇస్తున్నట్టు ఈ కామర్స్ సంస్థలు గుర్తించడమే ఇందుకు కారణమని రోహిత్‌చుగ్ తెలిపారు. -
2019–పండగల తేదీలు ఖరారు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ విద్వత్సభ ఆధ్వర్యంలో రెండు రోజుల పాటు జరిగిన తెలంగాణ రాష్ట్ర జ్యోతిష మహాసభలు–2018లో మంగళవారం 2019 ఏడాదికి సంబంధించి పండగ తేదీలను వేదపండితులు ఖరారు చేశారు. ఈ జాబితాను రాష్ట్ర ప్రభుత్వానికి అందజేయనున్నారు. వివరాలు ఇలా ఉన్నాయి. చైత్రమాసం ఏప్రిల్ 6న ఉగాది, 13న స్మార్తానాం శ్రీరామనవమి, 14న శ్రీవైష్ణవానాం శ్రీరామనవమి, 17న మహావీర జయంతి, 19న శ్రీ హనుమద్విజయోత్సవం, వైశాఖ మాసం మే నెలలో 7న అక్షతదియ, పరశురామ జయంతి, బసవజయంతి, 17న సర్వేషాం నృసింహజయంతి, 29న శ్రీహనుమజ్జయంతి, జ్యేష్ఠమాసం జూన్ 17న వట సావిత్రీవ్రతం, ఆషాఢ మాసం జులై 4న జగన్నాథ రథయాత్ర, 16న వ్యాసపూర్ణిమ, గురుపూర్ణిమ, 21న సికింద్రాబాద్ మహంకాళి జాతర, శ్రావణమాసం ఆగస్టు 4న నాగుల చవితి, 5న నాగ, గరుడ పంచమిలు, 9న వరలక్ష్మీవ్రతం, 14న హయగ్రీవజయంతి, 15న రాఖీ పూర్ణిమ, 23న స్మార్తానాం శ్రీకృష్ణాష్టమి, 24 శ్రీవైష్ణవానాం శ్రీకృష్ణాష్టమి, శ్రీవేంకటేశ్వరవ్రతం, భాద్రపద మాసం సెప్టెంబర్ 1న బలరామ జయంతి, 14న మహాలయపక్షారంభం, 28న మహాలయ అమావాస్య, 29న శ్రీ దేవీ శరన్నవరాత్రారంభం, ఆశ్వీజమాసం అక్టోబర్ 5న సరస్వతీ పూజ, గరుడ జయంతి, 6న దుర్గాష్టమి, బతుకమ్మ పండుగ, 8న విజయదశమి, 27న దీపావళి, నరకచతుర్దశి, 31న నాగుల చవితి, కార్తీక మాసం నవంబర్ 12న కార్తీక పూర్ణిమ, మార్గశిరమాసం డిసెంబర్ 2న శ్రీసుబ్రహ్మణ్యషష్ఠి, 8న గీతాజయంతి, 11న శ్రీదత్త జయంతి, 19న కాలభైరవాష్టమి. జ్యోతిష విజ్ఞానాన్ని అందించడం మా బాధ్యత ధర్మాచరణే లక్ష్యంగా లభించిన జ్యోతిష శాస్త్ర విజ్ఞానాన్ని ప్రతి ఒక్కరికీ అందించే బాధ్యత తమపై ఉందని విద్వత్సభ కోశాధికారి మరుమాముల వెంకటరమణశర్మ అన్నారు. ‘పండగల విషయంలో వివాదాలు తలెత్తుతున్నాయి. ఈ పరిస్థితి రాకుండా చూడాలి. అదే విధంగా జ్యోతిష పండితులను గౌరవించుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే ప్రభుత్వ సహకారంతో రాష్ట్ర ప్రథమ జ్యోతిష మహాసభలు నిర్వహించామ’న్నారు. ధార్మిక పరిషత్ ఏర్పాటుచేయాలి... 31 జిల్లాల నుంచి వచ్చిన పండితులందరూ ఏకాభిప్రాయంగా ధార్మిక పరిషత్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అంతేకాదు ధార్మిక మండలి కూడా ఉండాలని కోరారు. గౌరవ వేతనంతో ప్రతి ముఖ్యమైన ఆలయానికి ఆగమ శాస్త్ర సలహాదారుణ్ణి ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరాం. అదే విధంగా ఆలయ అర్చకుడు ఏం చేయాలి? ఏ నియమాల ఆధారంగా పూజలు నిర్వహించాలి? అర్చకులు, పురోహితులు, వేదపండితులు, ధార్మికవేత్తల విధివిధానాలు ఏంటీ? అనే అంశాలపై అవగాహనకు వర్గల్ సరస్వతి క్షేత్రంలో డిప్లొమా కోర్సు ప్రవేశపెట్టనున్నాం. కరదీపిక తయారీ... భవిష్యత్ తరాలకు పూజలు ఎలా చేయాలి? ఏ సమయంలో చేయాలనే దానిపై అవగాహన కల్పించేందుకు కరదీపికను సత్వరమే ప్రజల ముందుకు తీసుకురావాలని నిర్ణయించాం. యువతలో ధార్మిక చింతన కల్గించేందుకు చర్యలు తీసుకోనున్నాం. -
గెలుపే గమ్యం..!
తూర్పుగోదావరి, పిఠాపురం : వ్యవసాయంలో ప్రత్యేక పాత్ర పోషించిన ఎడ్లు నేడు పరుగు పందాల్లో ప్రాధాన్యతను సంతరించుకుంటున్నాయి. పూర్వం నుంచి ఎడ్ల పందాలు కొనసాగుతున్నప్పటికీ కొన్ని ప్రాంతాల్లో పండుగలకు మాత్రమే పరిమిత మయ్యేవి. గతంలో ప్రత్యేక పండుగ రోజులు, ప్రత్యేక సందర్భాలలో మాత్రమే నిర్వహించే ఈ పందాలు నేడు మామూలు సమయాలలోనూ కొనసాగుతున్నాయి. కేవలం పందెంలో గెలుపే లక్ష్యంగా రూ. లక్షలు వెచ్చించి మరీ ఎడ్లను పెంచడంలో పలువురు రైతుల ఆసక్తి చూపుతున్నారు. పందెంలో గెలిస్తే వచ్చేది చిన్న మొత్తమే అయినా దాని ద్వారా వచ్చే సంతృప్తి వెలకట్టలేనిదని రైతులు చెబుతున్నారు. ఎడ్లు, అవి లాగే బండ్లు వ్యవసాయంలో కీలక పాత్ర పోషించినా యంత్రాలు అందుబాటులోకి రావడంతో ప్రతి రైతు ఇంటా ఉండే ఎడ్లు బళ్లు ఇప్పుడు అంతగా కనిపించడం లేదు. కానీ కొందరు రైతులు ఎడ్ల బళ్ల పోటీల కోసమే ప్రత్యేకంగా ఎడ్లను పెంచుతున్నారు. జిల్లాలో ప్రతి నెలా ఏదో ఒకచోట ఎడ్ల పరుగు పందాలు జరుగుతుండగా రాష్ట్రంలో అన్ని జిల్లాల నుంచి పందాల కోసం రైతులు తమ ఎడ్లను తీసుకుని వస్తున్నారు. జిల్లాలో లైను పందాలు ఆడుతుండగా, ఇతర జిల్లాల్లో రౌండు పందాలు ఆడుతుంటారు. ప్రత్యేక శిక్షణ పరుగు పందాల్లో పాల్గొనే ఎడ్లకు గిత్తల ప్రాయం నుంచి ప్రత్యేక శిక్షణ ఇస్తుంటారు. కేవలం ఒక సంవత్సరం వయసులో ఉండగానే చిన్న సైజు బండ్లకు కట్టి పరుగులో శిక్షణ ఇస్తుంటారు. సాధారణ ఎడ్లలా కాకుండా నిత్యం బండి కట్టి పరుగులు పెట్టిస్తూ సమయానుకూలంగా దూరాలను పరుగెత్తిస్తుంటారు. ఎడ్ల ఖరీదు రూ.లక్షల్లో సాధారణంగా మైసూరు, దేశవాళీ ఎడ్లను పరుగు పందాలకు వినియోగిస్తారు. పరుగు పందాలలో పాల్గొనే ఎడ్ల ఖరీదు రూ.లక్షల్లో పలుకుతోంది. ఒక్కో ఎద్దు రూ.2 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు పలుకుతున్నాయి. ఒకే రకంగా ఒకే జాతికి చెందిన రెండు ఎడ్లను కొనడానికి ఎంత ఖర్చైనా రైతులు వెనుకాడడం లేదు. ఇతర జిల్లాలకు వెళ్లి మరీ రూ.లక్షలు వెచ్చించి కొనుగోలు చేస్తున్నారు. మేత కూడ ప్రత్యేకమైనదే పందాల్లో పాల్గొనే ఎడ్లకు ప్రత్యేకమైన మేత మేపుతుంటారు. కేవలం ప్రత్యేకమైన దాణా పెడుతుంటారు. ఉలవలు, రాగులు, జొన్నలు, ప్రతీరోజు ఉడకబెట్టి నానబెట్టిన ఎండుగడ్డి ముక్కలలో వేసి దాణాగా మేపుతారు. వీటి మేతకు సంవత్సరానికి సుమారు 3 లక్షల వరకు వ్యయమవుతుందని రైతులు చెబుతున్నారు. పందాలు ఉన్నా లేకపోయినా వీటి ఆరోగ్యం పట్ల శ్రద్ధ తప్పదని మేతలో ఎప్పుడూ మార్పు లేకుండా ఖర్చుకు వెనుకాడకుండా మేపాల్సి ఉంటుందంటున్నారు. ప్రత్యేక మసాజ్‌లు పరుగెత్తి అలసిపోయిన ఎడ్లకు మనుషుల మాదిరిగానే జండూబామ్ వంటి మందులతో మసాజ్ చేస్తుంటారు. ప్రతీ రోజు పరుగులో శిక్షణ అనంతరం మసాజ్ చేయకపోతే కాళ్లు పట్లు పటేసి పరుగుకు ఇబ్బందిగా ఉంటుందని రైతులు చెబుతున్నారు. దీనికోసం పరుగు పెట్టిన ప్రతీసారీ మసాజ్‌లు తప్పనిసరిగా చేయాల్సి ఉంటుందంటున్నారు. పందెం కొడితే విలువ పెరుగుతుంది పందెంలో గెలిచిన ఎడ్లకు ఎనలేని గిరాకీ ఉంటుంది. ఎన్ని పందాలు కొడితే అంత విలువ పెరగడంతో పాటు పోటీపడి మరీ ఎక్కువ ధరలకు కొనుగోలు చేస్తుంటారు. ఎక్కువ పందాలు కొట్టిన ఎద్దులు ఒక్కోటి సుమారు రూ.3 లక్షల నుంచి 4 లక్షలకు అమ్ముడవుతాయని రైతులు చెబుతున్నారు. ఇతర జిల్లాల నుంచి వచ్చిన రైతులు పందాలు ఎక్కువగా గెలిచే ఎడ్లను కొనుగోలు చేస్తుంటారు. -
ఇక ఫెస్టివల్స్ నిర్వహణ పర్యాటకశాఖకే
సాక్షి, విశాఖపట్నం: రాష్ట్రంలో వివిధ ఫెస్టివల్స్‌ను వచ్చే ఏడాది నుంచి పర్యాటకశాఖే నిర్వహిస్తుందని పర్యాటకశాఖ మంత్రి భూమా అఖిలప్రియ తెలిపారు. ఆదాయం వచ్చే ఈవెంట్లు, పండగలను నిర్వహించడం ఎలా? అన్న దానిపై ప్రణాళిక రూపొందిస్తామన్నారు. ఈ నెల 28 నుంచి జరగనున్న యాటింగ్ ఫెస్టివల్ వివరాలను తెలిపేందుకు సోమవారం రాత్రి ఫిషింగ్ హార్బర్ జెట్టీ వద్ద ఆమె విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఈ ఏడాది రాష్ట్రంలో 24 ఈవెంట్లకు గాను 18 మాత్రమే నిర్వహించామన్నారు. వచ్చే సంవత్సరం ఏఏ కార్యక్రమాలు చేపట్టాలో కేలండర్ రూపొందిస్తామన్నారు. రాష్ట్రంలో పర్యాటకరంగంపై అందరిలోనూ ఆసక్తి పెరుగుతోందన్నారు. విశాఖలో ఉన్న అందమైన పర్యాటక వనరులను బయట ప్రపంచానికి తెలియజేయడానికి, అంతర్జాతీయంగా పర్యాటకులను ఆకర్షించేందుకు యాటింగ్ ఫెస్టివల్‌ను నిర్వహిస్తున్నామని చెప్పారు. ఈ ఫెస్టివల్‌కు వచ్చే ఆదరణను బట్టి భవిష్యత్‌లో ఇలాంటివి నిర్వహించాలా? వద్దా? అన్నది అధ్యయనానికి వీలుంటుందన్నారు. గోవాలో యాటింగ్ ద్వారా గంటకు రూ.90 వేల నుంచి లక్ష ఆదాయం వస్తుందని, విశాఖలోనూ అలాంటి ఆదరణ ఉంటుందో, లేదో చూస్తామన్నారు. ఫెస్టివల్లో పాల్గొనున్న 9 బోట్లు యాటింగ్ ఫెస్టివల్లో 9 బోట్లు పాల్గొంటున్నాయన్నారు. ఈ ఫెస్టివల్ పూర్తయ్యాక వీటిలో రెండు బోట్లను కొన్నాళ్లపాటు ఆసక్తి ఉన్న వారి కోసం ఇక్కడ ఉంచుతామని తెలిపారు. అనుమతి కోసం విశాఖ పోర్టు ట్రస్టు అధికారులతో చర్చిస్తామన్నారు. యాటింగ్‌లో పాల్గొనే బోట్లకు రక్షణగా గజ ఈతగాళ్లున్న స్థానిక మత్స్యకారుల బోట్లు ఉంటాయని, అత్యవసర సాయం అందించడానికి నేవీ అంగీకరించిందని చెప్పారు. ఇప్పటివరకు 14 మంది రిజిస్ట్రేషన్ ఇప్పటిదాకా ఈ ఫెస్టివల్లో పాల్గొనేందుకు 14 మంది రిజిస్ట్రేషన్ చేయించుకున్నారన్నారు. యాటింగ్ క్రీడ ఖరీదు కూడుకున్నది కావడంతో ఉన్నత వర్గాల వారిని దృష్టిలో ఉంచుకునే టిక్కెట్టు ఖరీదు రూ.14,500గా నిర్ణయించామన్నారు. అన్ని పర్యాటక ఈవెంట్లను ఈ–ఫ్యాక్టర్ సంస్థకే ఎందుకు కట్టబెడుతున్నారని విలేకరులు అడిగిన ప్రశ్నకు ఆమె సమాధానమిస్తూ టూరిజం ఎంప్యానల్ అయినందును ఈ సంస్థకు అప్పగిస్తున్నామన్నారు. ఈ యాటింగ్ ఫెస్టివల్ ద్వారా వచ్చిన సొమ్మును మత్స్యకారుల సంక్షేమానికి ఖర్చు చేస్తామని ఈ–ఫ్యాక్టర్ సంస్థ ప్రతినిధి సుమీత్ తెలిపారు. జాయింట్ కలెక్టర్ సృజన మాట్లాడుతూ యాచింగ్ ఫెస్టివల్లో వివిధ అడ్వెంచర్ ఈవెంట్లతో పాటు ప్రతిరోజూ 20 మందిని ఎంపిక చేసి లక్కీ డ్రా తీస్తామన్నారు. విజేతలకు ఒకరోజు యాచ్‌ల్లో ఉచితంగా విహరించే అవకాశం కల్పిస్తామని చెప్పారు. విలేకరుల సమావేశంలో పర్యాటకశాఖ ఈడీ డి.శ్రీనివాసన్, జిల్లా పర్యాటకాధికారి పూర్ణిమదేవి, ఈఫ్యాక్టర్ సంస్థ ప్రతినిధి ముఖర్జీ పాల్గొన్నారు. -
పర్యాటకం.. నిధుల పందేరం
సాక్షి ప్రతినిధి, కర్నూలు: పర్యాటక శాఖలో నిధుల పందేరం కొనసాగుతోంది. ఫెస్టివల్స్ పేరిట రూ.కోట్లు ఖర్చు చేస్తున్నారు. ప్రతిసారి ఏదో ఒక కొత్త పేరుతో ఫెస్టివల్స్ నిర్వహించడం.. సగటున రూ.2 కోట్ల మేర ఖర్చు చేయడం ఆనవాయితీగా మారింది. ఒకటిన్నర ఏడాది కాలంలోనే నాలుగు ఫెస్టివల్స్‌ను పర్యాటకశాఖ నిర్వహించింది. వీటి నిర్వహణలో ఆ శాఖ సిబ్బందికి ఏ మాత్రమూ పాత్ర లేదు. పూర్తిగా ఈవెంట్ మేనేజర్లకే అప్పగిస్తున్నారు. ఒక్కో ఫెస్టివల్స్‌ను ఒక్కో ఈవెంట్ మేనేజింగ్ సంస్థకు పర్యాటక శాఖ అప్పగిస్తోంది. మరోవైపు టెంపుల్ టూరిజం సర్క్యూట్, శిల్పారామం పేరిట వివిధ పథకాలను ప్రకటించిన పర్యాటక శాఖ ఒక్క ప్రాజెక్టును కూడా ఇప్పటివరకు పూర్తి చేసిన పాపాన పోలేదు. రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి అఖిలప్రియ జిల్లాకు చెందినవారు. అయితే..జిల్లాలో దీర్ఘకాలం పనికొచ్చే కార్యక్రమాలు కాకుండా కేవలం సాంస్కృతిక కార్యక్రమాలకే రూ.కోట్లు ఖర్చు చేస్తున్నారు. దీంతో అఖిలప్రియ వ్యవహారశైలిపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈవెంట్ మేనేజర్లదే హవా ఇప్పటివరకు పర్యాటక శాఖ ఆధ్వర్యంలో ఓర్వకల్లులో మూన్లైట్, కర్నూలులో ధూల్ ఫెస్టివల్స్‌తో పాటు అహోబిలం ఫెస్టివల్‌ను, తాజాగా కర్నూలులో ఇండియన్ పెర్ఫార్మింగ్ ఆర్ట్షోను నిర్వహించారు. ఈ కార్యక్రమాల్లో పర్యాటక శాఖ అధికారుల పాత్ర నామమాత్రమేనని చెప్పవచ్చు. ఒక్కో ఫెస్టివల్‌కు రూ.2 కోట్ల చొప్పున మొత్తం రూ.8 కోట్ల మేర ఖర్చు చేశారు. ఒక్కో ఫెస్టివల్ నిర్వహణను ఒక్కో ఈవెంట్ మేనేజ్మెంట్ సంస్థకు అప్పగించారు. కేవలం సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహిస్తూ..కోట్లకు కోట్లు ఖర్చు చేస్తున్నారు. మరోవైపు మొత్తం పెత్తనమంతా ఈవెంట్ మేనేజర్లకే అప్పగించడం.. పర్యాటకశాఖ అధికారులకు ఏ పాత్ర లేకపోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నిధులతో కనీసం జిల్లాలో వివిధ దేవాలయాలను కలుపుతూ టూరిజం సర్క్యూట్ కానీ, మినీ శిల్పారామాన్ని కానీ ఏర్పాటు చేసివుంటే అటు భక్తులతో పాటు శిల్పకారులకైనా మంచి జరిగేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అహోబిలం ఫెస్టివల్‌కు కోటి 70 లక్షల రూపాయలు ఖర్చు చేసిన ప్రభుత్వం.. కనీసం రోడ్డును బాగు చేసి ఉంటే భక్తులకు సౌకర్యవంతంగా ఉండేది. మొత్తం మీద ఫెస్టివల్స్ పేరుతో రూ.కోట్లు ఖర్చు చేయడంతో మంత్రి అఖిలప్రియ వ్యవహారంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. -
కోర్టులకూ జంతువులపై ప్రేమేనా..?
ఈ మధ్య కాలంలో హిందువుల పండుగలపై కొంతమంది పనిగట్టుకుని విషం చిమ్ముతున్నారు. రాజకీయ అలజడుల కారణంగా హిందూ పండుగలపై రోజురోజుకు ఆంక్షలు మితి మీరుతున్నారు. సంప్రదాయాలకు చట్టాలతో ముడి పెడుతున్నారు. పూజపై..పండుగపై లెక్కలేనన్ని ఆంక్షలు వేస్తున్నారు. సంక్రాంతికి సంబరాలు నిర్వహించాలన్నా.. వాకిట్లో కళ్లాపి చల్లి ముగ్గులు వేయాలన్నా.. సంప్రదాయ బద్ధమైన గంగిరెద్దులను ఆడించాలన్నా జంతు ప్రేమికుల నుంచి అనుమతి పొందాలి. పతంగులు ఎగరేయాలన్నా.. దారాలకు తట్టుకుని పక్షులు చనిపోతాయని ఆరోపణలు. కోడిపందేలు ఆడించాలన్నా ఆంక్షలే.. దీపావళికి టపాసులు కాల్చాలన్నా, జల్లికట్టు ఆడాలన్నా కోర్టు అనుమతి కావాలి. వినాయకుడికి పూజలు చేయాలన్నా.. నిమజ్జనం చేయా లన్నా.. నాగుల చవితికి పుట్టలో పాలు పోయాలన్నా, పుష్క రాల్లో స్నానం చేయాలన్నా కోర్టు అనుమతి కావాలి. నమ్మిన దేవుడికి పాలాభిషేకం చేయాలంటే ఆంక్షలు. చివరకు హోళీ ఆడాలన్నా కూడా! ఇలా హిందువుల పండుగలు అంటేనే ప్రకృతి విరుద్ధమని, వాటిని నిషేధించాలనే ప్రచారం జోరుగా సాగుతోంది. కోడి పందేలు లేనిదే ఆంధ్రప్రదేశ్‌లో సంక్రాంతి పండుగలేదు. ఏడాది కోసారి హుషారుగా.. ఉల్లాసంగా సంప్రదాయ బద్దంగా నిర్వహించే ఈ పండు గపైనా జంతు ప్రేమికులు ఆంక్షలు నిప్పులు గక్కుతున్నారు. కానీ, కోడి పందెం అనేది గ్రామీణ ప్రాంతాల్లో రైతాం గాన్ని.. పల్లె సీమలను ఒక్కటి చేసే పండుగ. తర తరాలుగా వస్తున్న సంప్రదాయం. అయితే దీన్ని రద్దు చేయాలని డిమాండ్ చేసేవారికి చికెన్ సెంటర్లు కనపడవా..? పర్యావరణానికి ముప్పుగా సంక్రమి స్తున్న పశువధను ఆపేందుకు ఎవరూ కదలడంలేదు. కానీ జల్లికట్టు ఆట అనగానే.. కోడి పందేలు వినగానే తోక తొక్కిన పాములా ఎగిరి దూకుతున్నారు. కాబట్టి వీటిపై పార్టీలకు అతీతంగా ప్రతి హిందువు స్పందించాలి. హిందు త్వంపై జరుగుతున్న విష ప్రచారాన్ని అరికట్టాలి. – పగుడాకుల బాలస్వామి, హైదరాబాద్ మొబైల్ : 99129 75753 -
గండికోట ఉత్సవాలకు సర్వం సిద్ధం
జమ్మలమడుగు/జమ్మలమడుగు రూరల్: గండికోట వారసత్వ ఉత్సవాలకు అధికారులు సర్వం సిద్ధం చేశారు. ఈనెల 21వతేదీ ఆదివారం నుంచి ఉత్సవాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో పనులను వేగవంతంగా పూర్తి చేయించారు. గత మూడు రోజులుగా ఇన్చార్జి కలెక్టర్ శ్వేత అధికారులతో కలిసి పనులు పర్యవేక్షించడంతోపాటు నిర్వహణపై అధికారులతో సమీక్షా సమావేశాలను ఏర్పాటు చేస్తూ వచ్చారు. గండికోట ఉత్సవాలలో జరిగే కార్యక్రమాలను సుమారు మూడు వేల మంది వీక్షించేలా ప్రత్యేక వేదిక ఏర్పాటు చేశారు. వేదికను జుమ్మా మసీదు ముందు భాగం ఆకారంలో తీర్చి దిద్దారు. రాష్ట్రం నలుమూలలా తయారైన వివిధ రకాల వస్తువుల ప్రదర్శన కోసం ఎగ్జిబిషన్ స్టాల్స్, వివిధ శాఖలకు సంబంధించిన స్టాల్స్‌తో పాటు, పుస్తకాల ప్రదర్శన, ఫుడ్‌స్టాల్స్ కోసం ప్రత్యేక ఏర్పాట్లు పూర్తి చేశారు. రహదారి వెంబడి అలంకరణ పనులు పూర్తి చేశారు. నేడు పట్టణంలో ర్యాలీ.. గండికోట ఉత్సవాల సందర్భంగా జమ్మలమడుగు పట్టణంలో ఆదివారం ఉదయం ఆర్డీఓ వి.నాగన్న ఆధ్వర్యంలోకళాకారులు, స్థానిక అధికారులు, విద్యార్థులతో ర్యాలీ నిర్వహించనున్నారు. సాయంత్రం గండికోటలో కార్యక్రమాలను ప్రారంభించనున్నారు. ఉత్సవాల కోసం ఆర్టీసీ ప్రత్యేక బస్సులు.. గండికోట ఉత్సవాల సందర్భంగా పట్టణంలోని పాత బస్టాండ్ వద్ద నుంచి ప్రతి 20 నిమిషాలకు ఒక ఆర్టీసీ బస్సును ఏర్పాటు చేసినట్లు కడప డిప్యూటీ చీఫ్ మేనేజర్ కిశోర్‌కుమార్ పేర్కొన్నారు. మూడు రోజులపాటు సాగే ఈ ఉత్సవాలలో పర్యాటకులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా బస్సు సౌకర్యాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. జమ్మలమడుగు నుంచి గండికోటకు ఒక్కొక్కరికి రూ.13 చొప్పున టిక్కెట్ ధర నిర్ణయించామన్నారు. రానుపోను టిక్కెట్ కూడ ఇస్తామని ఆయన తెలిపారు. ప్రొద్దుటూరు నుంచి 2, మిగతా ఆరు డిపోల నుంచి ఒక్కొక్క బస్సును గండికోటకు నడుపుతామన్నారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. -
మేం పండగ చేసుకోవద్దా?
సాక్షి, పెదవాల్తేరు(విశాఖతూర్పు): పోలీసుశాఖలో విభజించి పాలించు చందంగా పాలన నడుస్తోందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. తెలుగునాట పెద్ద పండగ సంక్రాంతి. ఇటువంటి ముఖ్యమైన పండగకు పోలీసులకు సెలవులు లేకుండా పోయాయి. ఈ మేరకు సెలవులు అడగొద్దంటూ నగరంలోని పోలీస్స్టేషన్లలో నోటీస్‌బోర్డులు సైతం ఏర్పాటు చేయడం గమనార్హం. మరోవైపు పోలీసులలో క్రైస్తవులు, ముస్లింలకు క్రిస్మస్, రంజాన్ పర్వదినాలలో సెలవులు ఇస్తున్నారు. నగరంలోని పోలీసులలో క్రైస్తవులు 10 శాతం, ముస్లింలు 5శాతం ఉన్నారు. మిగిలిన 85శాతం మంది పోలీసులు హిందువులే కావడం విశేషం. మరి మిగిలిన వారికి వారి పర్వదినాలలోసెలవులు ఇస్తున్న ప్రభుత్వం హిందువులైన పోలీసులకు సెలవులు ఇవ్వకపోవడం తగదని పలువురు పేర్కొంటున్నారు. నగర పోలీస్‌కమిషనరేట్ పరిధిలో గల 23 పోలీస్స్టేషన్లలో 3,300మంది అధికారులు, కానిస్టేబుళ్లు పనిచేస్తున్నారు. అలాగే, విశాఖ రూరల్‌జిల్లా పరిధిలో 47పోలీస్స్టేషన్లలో 2వేల మంది వరకు పోలీసులు పనిచేస్తున్నారు. విశాఖ పోలీసులలో చాలామంది శ్రీకాకుళం, విజయనగరం, ఉభయగోదావరి, తదితర జిల్లాలకు చెందిన వారు ఉన్నారు. వీరి బంధువులు సైతం ఇతర రాష్ట్రాలు, విదేశాలనుంచి పండగకు స్వస్థలాలకు వస్తారు. ఈ నేపథ్యంలో పోలీసులు మాత్రం సెలవులు లేని కారణంగా అయినవారిని కలుసుకోలేని దుస్థితి ఎదుర్కుంటున్నారు. ఇదీ కారణంగా చెబుతున్నారు... పండగకు సెలవులు ఇస్తామంటే అందరూ సెలవులు పెట్టేస్తారని పోలీసు అధికారులు చెబుతున్నారు. కాని,ఆరోగ్యం బాగోకపోయినా, ఇంట్లో ఎవరికైనా అనారోగ్యం చేసిన సందర్భాలలో మాత్రం సెలవులు మంజూరు చేస్తున్నామని చెబుతున్నారు. ఇక సంక్రాంతి సీజన్ అంటే అన్ని జిల్లాలకు వీవీఐపీల తాకిడి ఎక్కువగా వుంటుంది. ఇక ఈ సీజన్లో దొంగతనాలు కూడా ఎక్కువగా జరుగుతాయి. ఇతర జిల్లాల నుంచి విశాఖ వలస వచ్చిన ప్రజలంతా దాదాపుగా పెద్ద పండగకు ఊళ్లకు వెళుతుంటారు. ఆయా ప్రాంతాలలో అధికశాతం ఇళ్లకు తాళాలు వేసి వుంటాయి. ఇదే అదనుగా దొంగలు చెలరేగిపోయే అవకాశం వున్నందునే సెలవులు ఇవ్వడం లేదని అధికారులు అంటున్నారు. పోలీసుల ఆందోళన అందరూ ఊర్లు వెళ్లిపోతుంటే పోలీసులు మాత్రం స్టేషన్లకు, బందోబస్తుకు పరిమితం కావల్సిన పరిస్థితి నెలకొంది. ఏడాదిపొడుగునా వీఐపీలు, వీవీఐపీల బందోబస్తు, నేరాల నివారణ,దర్యాప్తు, సమన్ల జారీ, స్టేషన్‌డ్యూటీ, నైట్‌పెట్రోలింగ్ వంటి విధులతో నిత్యం సతమమతమవుతున్నారు. ఇక రాష్ట్ర విభజన తరువాత ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు విశాఖలో పర్యటనలు ఎక్కువగా చేయడం తెలిసిందే. విశాఖలో జాతీయ, అంతర్జాతీయ సదస్సులు, సమ్మిట్ల సంగతి సరేసరి. దీనితో పోలీసులు ఊపిరిసలపనంత పనులు చేస్తున్నారంటే అతిశయోక్తి కాదు. దీంతో పోలీసులు తీవ్ర మానసిక ఒత్తిళ్లకు లోనవుతున్నారు. ఈ నేపథ్యంలో సంక్రాంతికి సరదాగా కుటుంబ సభ్యులతో స్వస్థలాలకు వెళ్లి ప్రశాంతంగా గడిపే అవకాశం లేకపోవడం సర్వత్రా విమర్శలకు తావిస్తోంది. ఇప్పటికైనా పోలీస్‌శాఖ ,ప్రభుత్వం వైఖరి మార్చుకోవాలని పలువురు కోరుతున్నారు. -
వచ్చే తెలుగు సంవత్సరం పండుగలివే
మార్చి 18న ఉగాది.. అక్టోబర్ 18న విజయదశమి సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని సిద్ధాంతులు, జ్యోతిష్యులు, పంచాగకర్తలు వచ్చే తెలుగు ఏడాది (విళంబినామ సంవత్సరం) పండు గలపై స్పష్టతనిచ్చారు. చైత్ర మాసం నుంచి ఫాల్గుణ మాసం వరకు వచ్చే పండుగల వివరాలను వెల్లడించారు. పండుగల నిర్వహణ తేదీలపై ఏటా తలెత్తుతున్న వివాదాలను పరిష్కరించేందుకుగాను ఈ ప్రయత్నం చేశారు. రెండ్రోజులపాటు హైదరాబాద్‌లో జరిగిన విద్వత్ సభ నిర్ణయా లను సభ నిర్వాహకులు ఎం.వెంకటరమణ శర్మ, దివ్యజ్ఞాన సిద్ధాంతి, గాయత్రి తత్వా నంద రుషి, యాయవరం చంద్రశేఖర శర్మ తదితరులు సోమవారం సీఎం కేసీఆర్‌ను కలసి తెలిపారు. పండుగల తేదీలకు సంబంధించిన వివరాలు అందించారు. విళంబినామ సంవత్సరంలో ముఖ్య పండుగలు 2018 మార్చి 18: ఉగాది; మార్చి 25: స్మార్తానాం శ్రీరామనవమి; మార్చి 26: వైష్ణవానాం శ్రీరామనవమి; ఏప్రిల్ 14: మాస శివరాత్రి; ఏప్రిల్ 18: అక్షయ తృతీయ; మే 10: శ్రీ హనుమాన్ జయంతి; జులై 27, వ్యాస పూర్ణిమ, గురు పూర్ణిమ; జులై 29: సికింద్రాబాద్ మహంకాళి జాతర ఆగస్టు 24: వరలక్ష్మీ వ్రతం; ఆగస్టు 26: రాఖీ పూర్ణిమ; సెప్టెంబర్ 2: స్మార్తానాం శ్రీ కృష్ణాష్టమి; సెప్టెంబర్ 3: శ్రీ వైష్ణవానాం శ్రీ కృష్ణాష్టమి ; సెప్టెంబర్ 13: వినాయక చవితి; అక్టోబర్ 17: దుర్గాష్టమి; అక్టోబర్ 18: విజయదశమి; నవంబర్ 6: దీపావళి; నవంబర్ 23: కార్తీక పూర్ణమి; 2019 జనవరి 14: భోగి; జనవరి 15: సంక్రాంతి; జనవరి 16: కనుమ; ఫిబ్రవరి 12: రథ సప్తమి; మార్చి 4: మహా శివరాత్రి; మార్చి 19: కామదహనం (దక్షిణాది వారికి); మార్చి 20: కామదహనం (ఉత్తరాది వారికి); మార్చి 21: హోళి. -
గిరిపై మార్మోగిన వేదఘోష
అన్నవరం : సత్యదేవుని దివ్యకల్యాణ మహోత్సవాలలో భాగంగా వైశాఖ శుద్ధ త్రయోదశి సోమవారం సాయంత్రం నవదంపతులు సత్యదేవుడు, అనంతలక్ష్మీ అమ్మవార్ల సమక్షంలో వేదపండిత సదస్యం ఘనంగా జరిగింది. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన సుమారు 125 మంది పండితులను సత్కరించారు. మధ్యాహ్నం 2.30 గంటలకు నవదంపతులు సత్యదేవుడు, అమ్మవార్లను పెళ్లిపెద్దలు సీతారాములు వెంట రాగా అనివేటి మండపం వద్దకు ఊరేగింపుగా తీసుకువచ్చి అక్కడి వేదిక మీద ప్రతిష్ఠించారు. అనంతరం స్వామి, అమ్మవార్లను అలంకరించి పూజలు చేశారు. పండితులు నాలుగు గంటలకు అనివేటి మండపాన్ని చేరుకున్నారు. సాయంత్రం ఆరు గంటలవరకూ రత్నగిరి పరిసరాలు పండితుల వేదమంత్రోఛ్చాటనతో మార్మోగాయి. తరువాత దేవస్థానం వేదపండితులు సత్యదేవుడు, అమ్మవార్లకు వేదాశీస్సులందచేశారు. అనంతరం వేదపండితులను దేవస్థానం చైర్మ¯ŒS రోహిత్, ఈఓ నాగేశ్వరరావు ఘనంగా సత్కరించారు. తొలుత మహామహోపాధ్యాయ విశ్వనాథ గోపాలకృష్ణ. ప్రముఖ పండితుడు చిర్రావూరి శ్రీరామశర్మలను, తరువాత మిగిలిన పండితులను సత్కరించారు. వేదపండితుల పాండిత్యాన్ని అనుసరించి రూ.మూడువేలు, రూ.2,700, రూ.2,300, రూ.1,500 చొప్పున నగదు పారితోషికం, మామిడిపండు, స్వామివారి ప్రసాదం, విసనకర్ర బహూకరించారు. విశ్రాంత వ్రతబ్రహ్మ పాలంకి పట్టాభిరామ్మూర్తి, విశ్రాంత దేవస్థానం పంచాంగకర్త తొయ్యేటి సుబ్రహ్మణ్యంలను కూడా సత్కరించారు. ఈ కార్యక్రమంలో వేదపండితులు కపిలవాయి రామశాస్త్రి, ముష్టి కామశాస్త్రి, గొల్లపల్లి ఘనాపాఠి, ప్రధానార్చకులు గాడేపల్లి వేంకట్రావు, కొండవీటి సత్యనారాయణ, వ్రతపురోహిత ప్రముఖులు నాగాభట్ల కామేశ్వరశర్మ, ముత్య సత్యనారాయణ, పురోహితులు పాలంకి పట్టాభి, అంగర సతీష్, అర్చకస్వాములు కోట శ్రీను తదితరులు పాల్గొన్నారు. అన్నవరంలో నేడు వైదిక కార్యక్రమాలు l తెల్లవారుజామున: 3.00 గంటలకు సుప్రభాతసేవ l ఉదయం: 8.00 గంటలకు చతుర్వేదపారాయణ l సాయంత్రం 4.00 గంటలకు: పేపర్ మిల్లు పార్కులో స్వామి, అమ్మవార్ల వనవిహారోత్సవం l రాత్రి 9.00 గంటలకు : కొండ దిగువన స్వామి, అమ్మవార్లను వెండి వాహనంపై ఊరేగింపు సాంస్కృతిక కార్యక్రమాలు l ఉదయం 6.00 నుంచి 9.00 గంటల వరకూ భజనలు l సాయంత్రం 5.00 నుంచి 6.00 గంటల వరకూ భక్తిరంజని l సాయంత్రం 6.00 నుంచి రాత్రి 9.00 గంటల వరకూ భరతనాట్యం -
వైభవంగా చౌడేశ్వరీదేవి రథోత్సవం
లేపాక్షి/ చిలమత్తూరు (హిందూపురం) : ఉగాది పండుగను పురస్కరించుకుని బుధవారం మధ్యాహ్నం రెండు గంటలకు లేపాక్షి మండలం చోళసముద్రం గ్రామంలో చౌడేశ్వరీదేవి రథోత్సవం వైభవంగా జరిగింది. గ్రామస్తులంతా కలిసి అమ్మవారిని గర్భగుడి నుంచి పల్లకీ సేవ ద్వారా ఊరేగించి రథంలో కొలువుదీర్చారు. అనంతరం రథాన్ని గ్రామ పంచాయతీ కార్యాలయం వరకు లాగారు. కార్యక్రమంలో సర్పంచ్ కదిరప్ప, ఉప సర్పంచ్ నాగరాజు, వైఎస్సార్సీపీ మండల కన్వీనర్ నారాయణస్వామి, నాయకులు కూతుల శీనా, యు.మూర్తి, మోహన్, బి.మూర్తి, ఆలయ కమిటీ సభ్యులు నానెప్ప, చౌడప్ప, కేశప్ప, టీడీపీ నాయకులు ప్రభాకర్‌రెడ్డి, జయచంద్ర, బీజేపీ నాయకుడు చౌడప్ప, సీపీఐ నాయకుడు శివప్ప, గ్రామపెద్దలు, భక్తులు పాల్గొన్నారు. చిలమత్తూరులో గ్రామ దేవత చౌడేశ్వరీ మాతా గ్రామోత్సవం బుధవారం కనులపండువగా సాగింది. ఉత్సవ విగ్రహాన్ని పలు రకాల పూలతో రమణీయంగా అలంకరించి పల్లకీపై ఆసీనులను చేసి గ్రామోత్సవం నిర్వహించారు. -
జిల్లా అభివృద్ధికి సమష్టి కృషి
ఉగాది ఉత్సవాల్లో కలెక్టర్ పిలుపు అనంతపురం సిటీ : అభివృద్ధిలో అనంతను అగ్రస్థానంలో నిలిపేందుకు సమష్టిగా కృషి చేద్దామని జిల్లా కలెక్టర్ కోన శశిధర్ జిల్లా ప్రజలు, అధికారులకు పిలుపునిచ్చారు. బుధవారం జిల్లా సాంస్కృతిక మండలి ఆధ్వర్యంలో స్థానిక జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో హేవిళంబి నామ సంవత్సర ఉగాది ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ నిత్యం కరువు కాటకాలతో విలవిలలాడుతున్న అనంతను అభివృద్ధి పథంలో నిలపాలన్న తపనతో ముందుకు వెళదామన్నారు. ఈ ఏడాది వర్షాలు సమృద్ధిగా కురుస్తాయని పంచాంగ శ్రవణం ద్వారా వినిపించారని, ఇది సంతోషదాయకమని అన్నారు. కరువు నివారణకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. వచ్చే జూన్ నాటికి లక్షకు పైగా ఫారంపాండ్లను నిర్మిస్తామన్నారు. గడిచిన ఒకటిన్నర సంవత్సరంలో నీటి సంరక్షణ పనులకు రూ.2,006 కోట్లు ఖర్చు చేశామన్నారు. నాలుగు వేల కిలో మీటర్ల మేర సీసీ రోడ్లు నిర్మించినట్లు తెలిపారు. అడిగిన వారికి గ్రామాల్లోనే పనులు కల్పిస్తూ వలసలను నియంత్రిస్తున్నామన్నారు. కార్యక్రమంలో జెడ్పీ చైర్మన్ చమన్, ఎమ్మెల్యే ప్రభాకరచౌదరి, జాయింట్ కలెక్టర్ లక్ష్మీకాంతం, జేసీ–2 ఖాజామొహిద్దీన్, ట్రైనీ కలెక్టర్ వినోద్‌కుమార్ తదితరులు మాట్లాడారు. జెడ్పీ సీఈఓ రామచంద్ర, ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ హరేరామ్‌నాయక్, ఐసీడీఎస్ పీడీ జుబేదా బేగం తదితర అధికారులు, అనధికారులు పాల్గొన్నారు. సకాలంలో వర్షాలు హేవిళంబి నామ సంవత్సరంలో వర్షాలు సకాలంలో కురుస్తాయని, తక్కువ వర్షపాతమే అయినా రైతులకు చాలా ఉపశమనం ఉంటుందని వేద పండితులు వాసుదేవశాస్త్రి తెలిపారు. ఉగాది ఉత్సవాల్లో భాగంగా ఆయన పంచాంగాన్ని చదివి వినిపించారు. ఈ ఏడాది ఎరుపు రంగు ధాన్యానికి మంచి బలం కనిపిస్తోందన్నారు. పాడి రైతులకు కూడా చాలా అనుకూలంగా ఉంటుందన్నారు. ప్రమాదాల సంఖ్య పెరిగే అవకాశాలు కన్పిస్తున్నాయన్నారు. అందరూ సుభిక్షంగా ఉండేందుకు, అరిష్టాల నుంచి ఉపశమనం పొందేందుకు సుదర్శన యాగం లాంటివి జిల్లా అధికార యంత్రాంగం చేయించాలని సూచించారు. రాజకీయంగా కూడా ఈ ఏడాది ‘అనంత’ కీలక స్థానంలో నిలుస్తుందన్నారు. ఆకట్టుకున్న కవి సమ్మేళనం పంచాంగ పఠనం అనంతరం కవి సమ్మేళనం నిర్వహించారు. రాచపాళెం చంద్రశేఖరరెడ్డి అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమంలో డాక్టర్ శాంతి నారాయణ, సడ్లపల్లి చిదంబరరెడ్డి, ఆశావాది ప్రకాశరావు, డీఎస్ సైబరాబాను తదితరులు కవితలు చదివి విన్పించారు. అనంతరం చిన్నారులు కూచిపూడి, భరత నాట్యంతో అలరించారు. పలువురు కళాకారులు, పండితులు, కవులను అధికారులు ఘనంగా సన్మానించారు. -
శ్రీశైలం లో 17 నుంచి శివరాత్రి వేడుకలు
శ్రీశైలం: ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రమైన శ్రీశైలంలో ఈ నెల 17 నుంచి 26వ తేదీ వరకు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నట్లు ఈఓ నారాయణ భరత్ గుప్త..ఆదివారం విలేకరులకు తెలిపారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని 17 నుంచి ఆలయంలో ఆర్జిత సేవలను రద్దు చేస్తున్నామని పేర్కొన్నారు. అందరికీ మల్లన్న దర్శనభాగ్యం కల్పించేందుకు 22వ తేదీ నుంచి స్పర్శదర్శనాన్ని నిలుపుదల చేస్తున్నామని చెప్పారు. తిరుమల తిరుపతి దేవస్థానం 18వ తేదీన , రాష్ట్ర ప్రభుత్వం 21వ తేదీన.. పట్టువస్త్రాలను సమర్పిస్తుందని తెలిపారు. మహాశివరాత్రి పర్వదినం 24వ తేదీ వస్తుందని, అ రోజు రాత్రి 10గంటలకు లింగోద్భవకాల మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం, రాత్రి 10.30 గంటలకు పాగాలంకరణ, అర్ధరాత్రి 12 గంటలకు కల్యాణోత్సవం నిర్వమిస్తామని చెప్పారు. -
నరసన్న పెళ్లికొడుకాయెనే..
∙అంతర్వేదిలో కల్యాణోత్సవాలకు శ్రీకారం ∙బుగ్గన చుక్క, నొసట తిలకంతో దర్శనమిచ్చిన స్వామి మాడవీధుల్లో సూర్య, చంద్రప్రభ వాహనాలపై ఉత్సవం అంతర్వేదిలో లక్షీ్మనృసింహస్వామివారి వార్షిక దివ్య తిరు కల్యాణ మహోత్సవాలు శుక్రవారం వైభవంగా ప్రారంభమయ్యాయి. సూర్యభగవానుడి జన్మదినం రోజైన రథసప్తమి నాడు స్వామిని నవవరుడిని చేశారు. బుగ్గన చుక్క, నొసటన తిలకం, పట్టువస్రా్తలు ధరించి పెళ్లికొడుకుగా సిగ్గులొలుకుతూ దర్శనమిచ్చిన శ్రీవారిని చూసి భక్తులు తన్మయత్వం చెందారు. సఖినేటిపల్లి / మలికిపురం ఏటా మాదిరి ముద్రికాలంకరణ(శ్రీవారిని పెళ్లికుమారుని, అమ్మవారిని పెళ్లి కుమార్తె చేసే కార్యక్రమం)ను కేశవదాసుపాలేనికి చెందిన బెల్లంకొండ, ఉండపల్లి కుటుంబాల వారు ఆలయ అర్చకుల సమక్షంలో ఘనంగా జరిపించారు. సాయంత్రం 6.30 గంటలకు ధూపసేవ అనంతరం ప్రధాన అర్చకుడు పాణింగిపల్లి శ్రీనివాస కిరణ్, వేదపండితుడు చింతా వేంకటశాస్త్రి, స్థానాచార్య వింజమూరి రామరంగాచార్యులు, అర్చకస్వాములు శ్రీవారికి, అమ్మవారికి వైఖానసాగమానుసారం, శ్రీవైష్ణవ సంప్రదాయ ప్రకారం విశేష పూజలు చేశారు. మామిడాకులు భస్మం చేయగా వచ్చిన బూడిదతో బుగ్గన చుక్కపెట్టి, ఉంగరం తొడిగి పెళ్లికుమారుడు, పెళ్లికుమార్తెను చేసే తంతును పూర్తిచేశారు. ఆనవాయితీగా రథసప్తమి పర్వదినాన కేశవదాసుపాలేనికి చెందిన బెల్లంకొండ, ఉండపల్లి కుటుంబాల వారు సంప్రదాయబద్ధంగా స్వామివారికి అభిషేకాలు నిర్వహించారు. స్వామికి బెల్లంకొండ, అమ్మవారికి ఉండపల్లి కుటుంబీకులు నూతన వస్రా్తలను సమర్పించుకున్నారు. వారు ఏర్పాటు చేసిన అన్నదానంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని, స్వామి ప్రసాదాన్ని తీసుకున్నారు. ఆలయ అసిస్టెంట్ కమిషనర్ చిక్కాల వెంకట్రావు పాల్గొన్నారు. ఆలయ నిర్మాత కృష్ణమ్మకు నివాళులు అంతర్వేదిలో కల్యాణోత్సవాలు ప్రారంభం సందర్భంగా ఆలయ నిర్మాత కొపనాతి కృష్ణమ్మ విగ్రహానికి పలువురు ప్రముఖులు, అధికారులు, ప్రజాప్రతినిధులు, ట్రస్టీలు, ఉత్సవ సేవాకమిటీ సభ్యులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఏటా ఉత్సవాలు ప్రారంభానికి ముందు పుణ్యక్షేత్రంలో ఉన్న ఆయన నిలువెత్తు విగ్రహం వద్ద నివాళులు అర్పించడం ఆనవాయితీ. తూర్పు వీధి(మెరకవీధి)కి చేరిన రథం.. స్వామి కల్యాణ మహోత్సవాల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచేది రథోత్సవం. ఈ వేడుక ఈనెల ఏడోతేదీ భీష్మ ఏకాదశి పర్వదినాన మెరక వీధి నుంచి మొదలవుతుంది. ఏడాది పొడవునా ఆలయం వద్ద ఉండే రథానికి ఉత్సవాల సందర్భంగా అవసరమైన మరమ్మతులు చేసి, రంగు రంగులతో ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు. మధ్యాహ్నం రాజకీయ ప్రముఖులు, అధికారులు, ట్రస్టీలు, సేవా కమిటీ సభ్యులు, అర్చకులు రథం వద్ద పూజలు చేసి కొబ్బరికాయలు కొట్టారు. అనంతరం గోవింద నామస్మరణల మధ్య రథాన్ని మెరకవీధికి తోడ్కొని వెళ్లారు. ఉత్సవాల తొలిరోజు సాయంత్రం సూర్యవాహనంపైన, రాత్రి చంద్రప్రభ వాహనంపైన కొలువుదీరిన శ్రీస్వామి మాడవీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. స్వామివారిని... దర్శించుకున్నారు. అంతర్వేదిలో నేడు.. శ్రీలక్షీ్మనృసింహస్వామి కల్యాణోత్సవాల్లో భాగంగా రెండో రోజు శనివారం సాయంత్రం నాలుగు గంటలకు హంసవాహనంపైన, రాత్రి ఏడు గంటలకు శేషవాహనంపైన గ్రామోత్సవం నిర్వహించనున్నారు. సాయంత్రం ధూపసేవ అనంతరం ధ్వజారోహణ నిర్వహించనున్నారు. పూర్ణాహుతితో ముగిసిన క్రతువులు అయినవిల్లి : అయినవిల్లి విఘ్నేశ్వరుని ఆలయంలో మూడురోజుల పాటు నిర్వహిస్తున్న క్రతువులకు శుక్రవారం పూర్ణాహుతి కార్యక్రమంతో ముగింపు పలికారు. ఆలయ ప్రధానార్చకులు మాచరి సూరిబాబు ఆధ్వర్యంలో స్వామిని పంచామృతాలతో అభిషేకించారు. లక్షగరిక పూజలు చేశారు. వేదపండితులు పూర్ణాహుతి కార్యక్రమంతో స్వామివారి ఆలయంలో ప్రత్యేక పూజలకు ముగింపు పలికారు. విద్యార్థుల కోసం చదువుల పండుగ నిర్వహించారు. కార్యక్రమంలో పండితులు విద్యార్థుల నాలుకపై బీజాక్షరాలను లిఖించారు. ఆలయ చైర్మ¯ŒS రావిపాటి సుబ్బరాజు, ఆలయ ఈఓ ముదునూరి సత్యనారాయణరాజు, ధర్మకర్తల మండలి సభ్యులు, అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఆదివారం ఎమ్మెల్యే పులపర్తి నారాయణమూర్తి చేతులు మీదుగా స్వామివారి ప్రసాదంగా విద్యార్థులకు పెన్నులను పంపిణీ చేసేందుకు ఏర్పాటు చేశామని ఈఓ తెలిపారు. -
కలియుగ దైవం లక్ష్మీనరసింహస్వామి
దక్షిణ కాశీగా పురాణ ప్రసిద్ధి చెంది, చారిత్రక ప్రాధాన్యాన్ని సంతరించుకున్న పవిత్ర పుణ్యక్షేత్రం అంతర్వేది శ్రీలక్షీ్మనృసింహస్వామివారి ఆలయం. ఈ క్షేత్రంలో శ్రీలక్షీ్మనృసింహస్వామివారు శిలారూపంలో పశ్చిమ ముఖంగా అవతరించారు. ప్రకృతి వైపరీత్యాల నుంచి స్వామివారు కాపాడతారని ఇక్కడ భక్తుల ప్రగాఢ విశ్వాçÜం. ఫిబ్రవరి మూడో తేదీ నుంచి స్వామివారి కల్యాణోత్సవాలు ప్రారంభంకానున్నాయి. – సఖినేటిపల్లి సఖినేటిపల్లి మండలం తీరప్రాంత గ్రామం అంతర్వేది క్షేత్ర మహత్యానికి సంబంధించి అనేక పురాణ గాధలున్నాయి. కృతయుగ ఆరంభంలో సృష్టికర్త బ్రహ్మ రుద్రయాగం చేయడానికి నిర్ణయించి, ఆయాగ వేదికను సాగరసంగమం తీరమైన గ్రామంలో నిర్మించినట్టు ఆలయ చరిత్ర చెబుతోంది. యాగరక్షణకు నీలకంఠేశ్వరుడిని ప్రాణప్రతిష్ఠ చేసి, యాగం పూర్తి చేసినట్టు పండితులు చెబుతున్నారు. బ్రహ్మయాగ వేదికగా ఉన్న ఈ గ్రామానికి అంతర్వేదిక పేరొచ్చింది. కాలక్రమంలో అది అంతర్వేదిగా స్థిరపడింది. అంతర్వేది ఉత్సవాల షెడ్యూల్... ఫిబ్రవరి 3 నుంచి 11 వరకూ జరుగుతున్న అంతర్వేది శ్రీలక్షీ్మనృసింహస్వామివారి వార్షిక దివ్య తిరు కల్యాణోత్సవాల ప్రధాన ఘట్టాల షెడ్యూల్. ∙3న రథసస్తమి. సూర్యవాహనం, చంద్రప్రభ వాహనంపై గ్రామోత్సవం. ముద్రికాలంకరణ(శ్రీస్వామివారినిపెళ్లికుమారుని, అమ్మవారిని పెళ్లికుమార్తె చేయడం) ∙6న పంచముఖ ఆంజనేయస్వామి, కంచుగరుడ వాహనాలపై గ్రామోత్సవాలు. రాత్రి 12.21 గంటలకు మృగశిర నక్షత్రయుక్త తులా లగ్నపుష్కరాంశలో శ్రీస్వామివారి తిరు కల్యాణ మహోత్సవం. ∙7న భీష్మ ఏకాదశి సందర్భంగా శ్రీస్వామివారి రథోత్సవం. ∙10న మాఘ పౌర్ణమి(సముద్ర స్నానాలు) ∙11న అంతర్వేది చెరువులో హంసవాహనంపై తెప్పోత్సవం. నా పూర్వజన్మ సుకృతం ఇంత వరకూ లక్షీ్మనృసింహస్వామివారికి అర్చకుడిగా సేవలు చేసుకున్న తనకు ఈ ఏడాది స్వామివారి కల్యాణం చేయించే భాగ్యం దక్కడం పూర్వజన్మసుకృతం. ప్రధాన అర్చకుడిగా తొలిసారిగా స్వామివారి కల్యాణం తన చేతుల మీదుగా జరుగునున్న తరుణంలో ఎంతో ఆనందిస్తున్నా. – పాణింగిపల్లి శ్రీనివాస కిరణ్, ప్రధాన అర్చకుడు స్వామివారి దయ ఎంతో ఉంది శ్రీలక్షీ్మనృసింహస్వామివారు కొలువై ఉన్న దేవస్థానానికి అసిస్టెంట్ కమిషనర్‌గా బాధ్యతలను నిర్వర్తిస్తుండడం ఎంతో సంతోషకరం. శ్రీస్వామివారి కరుణకటాక్షాలతో భక్తులు, తాము ఎంతో ఆనందంగా జీవిస్తున్నాం. అలాగే స్వామివారు భక్తుల నుంచి కోరుకునే కార్యక్రమాలను తన చేతుల మీదుగా స్వామివారికి చేరడం ఎంతో సంతృప్తి. – చిక్కాల వెంకట్రావు, అసిస్టెంట్ కమిషనర్ అంతర్వేదిలో సందర్శనీయ ప్రాంతాలు వశిష్టసేవాశ్రమం: ఆలయానికి సుమారు 500 మీటర్ల దూరంలో ఏటిగట్టుకు ఆవలి వైపున ఉంది. అంతర్వేదిలోని వశిష్టాసేవాశ్రమం ఆధ్యాత్మిక నిలయంగా భాసిల్లుతోంది. ఈ ఆశ్రమాన్ని కల్యాణ మహోత్సవాలకు వచ్చే భక్తులు సందర్శించుకోవచ్చు. ఇక్కడ అరుంధతీ, వశిష్ట మహర్షులు కొలువు దీరారు. చుట్టూ నీరు ఉండేలా అష్టభుజాకారంగా దీనిని ఆచార్య కే.జీ. ప్రసాదరాజు నిర్మించారు. అరుంధతీదేవికి వశిష్ట మహర్షికి వివాహం జరిగిన సమయంలో సమస్త దంపతులకు రక్షణగా నిలవాలని దేవతలు ఆశీర్వదించారని, అందుకే వీరిని దర్శించుకుంటే దంపతుల మధ్య అన్యోన్యత పెరుగుతుందని భక్తుల విశ్వాçÜం. గుర్రాలక్క ఆలయం ఆలయానికి సుమారు రెండు కిలోమీటర్ల దూరంలో శ్రీలక్షీ్మనరసింహస్వామివారి సోదరి గుర్రాలక్క(అశ్వ రూఢాంబిక) ఆలయం ఉంది. క్షేత్ర ప్రతిపత్తికి ప్రతీకగా ఉన్న ఆమె ఆలయాన్ని భక్తులు దర్శించుకోవడం ఎంతో శ్రేయస్కరం. రథోత్సవం రోజున రథంపై నూతన వధూవరులుగా మూర్తీభవించిన శ్రీస్వామి సతీసమేతంగా గుర్రాలక్క ఆలయానికి వెళ్లి కొత్త దుస్తులు ఇవ్వడం పరిపాటి. నీలకంఠేశ్వరుని ఆలయం ఆలయానికి సుమారు 200 మీటర్ల దూరంలో శ్రీనీలకంఠేశ్వరుని ఆలయం ఉంది. కృతయుగ ఆరంభంలో బ్రహ్మ రుద్రయాగం నిర్వహించేందుకు వేదికగా ఈ ప్రాంతాన్ని ఎంపిక చేసినట్టు ప్రతీతి. యాగరక్షణకు నీలకంఠేశ్వరస్వామిని ప్రతిíష్ఠించి, యాగాన్ని పూర్తి చేసిన మహాపుణ్యక్షేత్రం ఇది. బ్రహ్మ యజ్ఞవేదికైనందున ఈప్రాంతం అంతర్వేదికగా ఏర్పడి కాలక్రమంలో అంతర్వేదిగా మారింది. ఈ క్షేత్రంలో శ్రీఆంజనేయస్వామిని క్షేత్ర సంరక్షకునిగా కూడా ప్రతిష్ఠించారని పురాణ సారాంశం. ఆకట్టుకునే లైట్‌హౌస్, సాగరసంగమం ఆలయానికి సుమారు రెండు కిలోమీటర్ల దూరంలో లైట్‌హౌస్ ఎంతో ఆహ్లాదాన్ని ఇస్తుంది. దానికి సమీపంలోనే సాగరసంగమం ఉంది. -
మారువేషం వెయ్... నీళ్లల్లో దూకెయ్...
క్రిస్మస్ పండుగలు లేకపోతే జనం బోరుకొట్టి చస్తారు. పండుగలు బోరు కొట్టినా విసుక్కుని నీరసపడతారు. అందుకే ప్రతి పండుగను ఉత్సాహపూరితంగా నింపడానికి మనుషులు ఎప్పుడూ ప్రయత్నిస్తుంటారు. యూరప్‌ను చూడండి. అది క్రిస్మస్లో వెలిగిపోతుంది. ఏడాదికి ఒకసారి వచ్చే పండుగ. దానిని ఘనంగా జరుపుకోవడానికి ప్రతి అవకాశాన్ని తీసుకుంటారు. స్విట్జర్లాండ్వాళ్లయితే ఒక అడుగు ముందుకేసి ఒళ్లు ఒణికించే విశేషాలన్ని ఈ పండుగలో చేస్తారు. ఒణికించే అనే మాట ఎందుకు వాడాల్సి వచ్చిందంటే అక్కడ జరిగే పోటీ అలాంటిది. అక్కడి జెనీవాలో జెనీవా లేక్ అనేది ఒకటి ఉంది. ఈ సీజన్లో దాని ఉష్ణోగ్రత 6 లేదా 7 డిగ్రీల సెల్సియస్ ఉంటుంది. అలాంటి చల్లటి ఝిల్లటి నీళ్లలో వాళ్లు క్రిస్మస్ సందర్భంగా ఈత పోటీ పెట్టుకుంటారు. దాదాపు 126 మీటర్ల పొడవున ఈ నీళ్లలో ఈది గెలిచిన వారు కప్పు అందుకుంటారు. ఆ కప్పు పేరు ‘కిస్మిస్ కప్’. అయితే ఉత్తినే ఈదడానికి పర్మిషన్ లేదు. ప్రతి ఒక్కరూ మారు వేషం వేసుకొని మరీ నీళ్లలో దూకాలి. ఈ పోటీలో పాల్గొనడానికి జనం ఉత్సాహంగా ముందుకు వస్తారు. చాలామంది ఒంటి మీద కేవలం లోదుస్తులు మాత్రమే ఉంచుకుని ముప్పావు వంతు నగ్నంగా నీళ్లలో దిగి ఈదుతారు. ఒళ్లు వణుకుతున్నా అందరితో కలిసి ఈదే ఆ పోటీ చాలా బాగుంటుందనే అందరి ఉవాచ. ఏమిటి వ్లా గొప్ప? మనవాళ్లు కూడా ఈ సీజన్లో మాలలు వేసి తెల్లవారే చల్లటి నదీ జలాల్లో స్నానం చేస్తారు కదా... ఉత్తరాదిన గంగా స్నానం చాలా సామాన్యమైనదే కదా అంటారా? మరదే. ఇక్కడి భక్తి ఇక్కడిది అక్కడి థ్రిల్ అక్కడిది. మనిషికి థ్రిల్ కావాలన్నది మాత్రం వాస్తవం అని ఈ ఫొటోలు చూస్తే తెలుస్తుంది. -
కందనవోలు సంబరాలు ఘనంగా నిర్వహిద్దాం
- కార్తీక మాసం ముగిసేలోగా నిర్వహణకు చర్యలు - జేసీ ఆధ్వర్యంలో ప్రత్యేక కమిటీ - కలెక్టర్ సీహెచ్ విజయమోహన్ వెల్లడి కర్నూలు(అగ్రికల్చర్): కందనవోలు సంబరాలను ఘనంగా నిర్వహించేందుకు తగిన ప్రణాళికలు సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ సీహెచ్ విజయమోహన్ ఆదేశించారు. సంబరాల నిర్వహణపై గురువారం సాయంత్రం కాన్ఫరెన్స్ హాలులో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లా సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిభింబించేలా, లోకల్ టూరిజాన్ని ప్రోత్సహించేలా కందనవోలు సంబరాలను నిర్వíßంహిచాలన్నారు. ఇందుకోసం జాయింట్ కలెక్టర్ హరికిరణ్ నేతృత్వంలో ప్రత్యేక కమిటీలు ఏర్పాటు చేశారు. పర్యాటక శాఖ జిల్లా అధికారి వెంకటేశ్వర్లు మెంబరు కన్వీనర్‌గా, డీఆర్డీఏ, డ్వామా పీడీలు, యువజన సంక్షేమ అధికారి, వ్యవసాయ శాఖ జాయింట్ డైరెక్టర్, సమాచార శాఖ డీడీలు సభ్యులుగా నియమించారు. వేడుకల నిర్వహణకు, కల్చరల్, పబ్లిసిటీ, సావరిన్ కమిటీ, తదితర కమిటీలను ఏర్పాటు చేయాలని కలెక్టర్ సూచించారు. కార్తీక మాసం ఈనెల 29న ముగుస్తున్నందునా 27, 28, 29 తేదీల్లో సంబరాల నిర్వహణకు ఏర్పాట్లు చేయాలన్నారు. కందనవోలు సంబరాలపై హైస్కూలు, జూనియర్, డిగ్రీ కళాశాలల విద్యార్థులకు వ్యాసరచన, వక్తృత్వం, చిత్రలేఖనం పోటీలు నిర్వహించాలన్నారు. నిర్వహణపై పూర్తి ప్రణాళికలను సోమవారం సమర్పించాలని పర్యాటక శాఖ అధికారిని ఆదేశించారు. సమావేశంలో జేసీ హరికిరన్, డీఆర్డీఏ పీడీ రామకృష్ణ, డ్వామా పీడీ పుల్లారెడ్డి, జేడీఏ ఉమామహేశ్వరమ్మ, కర్నూలు ఆర్డీఓ రఘుబాబు, జిల్లా పర్యాటక శాఖ అధికారి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. -
సింగపూర్‌లో పండుగ చేస్కోండి
సింగపూర్ టూరిజం బోర్డ్ ఆహ్వానం ముంబై: సింగపూర్‌లో పండుగలు జరుపుకోవాలంటూ దేశీయ పర్యాటకులకు సింగపూర్ టూరిజం బోర్డ్, సింగపూర్ ఎరుుర్‌లైన్‌స ఆహ్వానం పలికారుు. అక్టోబర్ నుంచి నుంచి డిసెంబర్ చివరి వరకు సింగపూర్‌లో పర్యటించేందుకు వీలుగా సింగపూర్ ఎరుుర్లైన్సలో టికెట్ బుక్ చేసుకునే వారికి ‘సింగపూర్ 241 పాస్‌పోర్ట్’ యాప్ ద్వారా ఉచిత ప్రయోజనాలు అందుకోవచ్చని ఈ సంస్థలు ఓ ప్రకటనలో తెలిపారుు. సింగపూర్‌లోని 24 భాగస్వామ్య ఔట్లెట్లలో, రెస్టారెంట్లలో రూ.48వేల విలువ మేరకు ప్రయోజనాలు అందుకోవచ్చని పేర్కొన్నారుు. -
ముగిసిన వాడపల్లి వెంకన్న బ్రహ్మోత్సవాలు
వైభవంగా చక్రస్నాన మహోత్సవం వాడపల్లి(ఆత్రేయపురం): కోనసీమ తిరుపతిగా ప్రసిద్ధి చెం దిన శ్రీ వాడపల్లి వేంకటేశ్వర స్వామి ఆల యంలో ఐదురోజులు పాటు నిర్వహించి న బ్రహ్మోత్సావాలు ఆదివారం ఘనంగా ముగిశాయి. ఈ సందర్బంగా స్వామి వారు కల్కి, అమ్మవారు గజలక్ష్మీ అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. శ్రీ వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు ము గింపులో భాగంగా స్వామివారి చక్రతీర్థ స్నాన మహోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. వేకువ జామునే విష్వక్షే్సనపూజ, పుణ్యహవచనం, పూర్ణహూతి, బాలబోగం, ప్రసాద వినియోగం తదితర కార్యక్రమాలును వైఖానస యువబ్రహ్మ ఆగమ భాస్కర ఖండవల్లి రాజేశ్వర వర ప్రసాదాచార్యులు ఆధ్వర్యంలో వేదపండితులు, అర్చకులు ఘనంగా నిర్వహించా రు. ఈ సందర్బంగా స్వామి వార్ని ఆలయం నుంచి పల్లకి పై ఉంచి బాణాసంచా కాల్పుల నడుమ బ్యాండ్ మేళాలతో స్వామి వారిని గౌతమీ గోదావరి వద్దకు తీసుకుని వచ్చి అక్కడ స్వామి వా రికి ఏర్పాటు చేసిన ఆలయంలో ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. ఉదయం స్వామివారిని తీర్థ బిందెతో గోదావరి జలాలను తీసుకు వచ్చి సుప్రభాతసేవ అనంతరం స్వామివారికి అభిషేకించారు. స్వామి వారిని ప్రత్యేకంగా పట్టు వస్త్రాలు, పూలతో అలంకరించారు. ఉదయం 10 గంటలకు స్వామి వార్ని కల్కి అవతారం, అమ్మవారిని గజలక్ష్మీ అ వతారంలో గజవాహన సేవ, సాయంత్రం చూరో్ణత్సవం, మహదాశీర్వచనం, సాయంత్రం 4 గంట లకు అశ్వవాహనంపై స్వామి వారిని ఘనంగా ఊరేగించారు. అనంతరం స్వామి వార్ని విశేష పుష్పములతో పుష్పాల రాయుడికి ఉయ్యాల సే వ, పవళింపు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. -
వేడుక చూడ.. వెల్లువలా..
భక్తులతో కిటకిటలాడిన ‘కోనసీమ తిరుపతి’ నయనమనోహరంగా నాలుగో రోజు బ్రహ్మోత్సవాలు సూర్య, చంద్రప్రభ వాహనాలపై స్వామి ఊరేగింపు వాడపల్లి(ఆత్రేయపురం) : అటు గౌతమిలో జలం పరవళ్లు.. ఇటు తీరంలో జనం పరవళ్లు.. ‘కోనసీమ తిరుపతి’ వాడపల్లి వేంకటేశ్వరస్వామి బ్రహోత్సవాల్లో నాలుగోరోజు∙శనివారం కావడంతో భక్తులు పోటెత్తారు. రాష్ట్రం నలుమూలల నుంచీ తరలివచ్చిన భక్తులతో గ్రామంలో కిటకిటలాడినట్టయింది. స్వామివారిని ప్రత్యేకంగా అలంకరించి సూర్య, చంద్రప్రభ వాహనాలపై గ్రామోత్సవం నిర్వహించారు. ఉదయం తీర్థపు బిందెతో గోదావరి జలాలను తెచ్చి సుప్రభాతసేవ అనంతరం స్వామివారికి అభిషేకం చేశారు. గోత్రనామాలతో పూజలు, నిత్యహోమాలు, నివేదన, బలిహరణ, నీరాజన మంత్ర పుష్పాలు సమర్పించి తీర్థప్రసాద వినియోగం చేశారు. ఆగమ భాస్కర ఖండవల్లి రాజేశ్వర వరప్రసాదాచార్యులు ఆధ్వర్యంలో వేదపండితులు, అర్చకులు 108 కలశాలతో అభిషేకం నిర్వహించి స్వామి వార్ని ప్రత్యేకంగా అలంకరించి సూర్య, చంద్రప్రభ వాహనాలపై ఊరేగించారు. స్వామివారికి విష్వక్సేనæ పూజ, పుణ్యాహవచనం, కుంభపూజ, తిరుమంజనోత్సవం, విశేషారాధన, చతుర్వేద పారాయణం, బాలభోగ నివేదన, అనంతరం స్వామి వారికి అషో్టతర శత కలశాభిషేకం, సహస్ర దీపాలంకరణ సేవ తదితర కార్యక్రమాలను నిర్వహించారు. ఏర్పాట్లను ఈవో బీహెచ్‌వీ రమణమూర్తి ఆధ్వర్యంలో ఆలయ పర్యవేక్షకులు రాధాకృష్ణ, సాయిరామ్, శివ, నరీన్ చక్రవర్తి పర్యవేక్షించారు. వేలాదిమంది భక్తులు స్వామిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. నేటితో బ్రహ్మోత్సవాలకు తెర బ్రహ్మోత్సవాలు ఆదివారం ముగియనున్నాయి. చివరిరోజు స్వామివారికి ప్రత్యేక పూజలు చేస్తారు. ముత్యాలపల్లకిలో ఉత్సవ మూర్తులను బాణ సంచా కాల్పుల నడుమ గోదావరి తీరానికి వెళ్లి చక్రస్నానం చేయిస్తారు. అనంతరం బాలభోగం, నివేదన, గజవాహన సేవ, అశ్వవాహన సేవ తోపాటు విశేష పుష్పాలతో స్వామివారికి ఉయ్యాలసేవ, పవళింపు సేవ తదితర కార్యక్రమాలు జరుగుతాయి. -
వెంకన్న వేడుక..కన్నులకు కానుక
భక్తజనం మురిసేలా బ్రహ్మోత్సవాలు మూడోరోజు రాముని అవతారంలో స్వామి హనుమత్, గరుడ వాహనాలపై ఊరేగింపు మహిమ గల దేవునికి సుమాభిషేకం వాడపల్లి(ఆత్రేయపురం): ‘కోనసీమ తిరుపతి’గా ఖ్యాతికెక్కిన వాడపల్లి శ్రీవేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో మూడో రోజైన శుక్రవారం స్వామి వారికి పుష్పాభిషేకంతో పాటు హనుమద్వాహన, గరుడ వాహన సేవ తదితర కార్యక్రమాలు భక్తజనులకు కన్నులవిందుగా జరిగాయి. స్వామివారికి ఉదయం 6 గంటలకు సుప్రభాతసేవ అనంతరం తీర్థపు బిందెతో గోదావరి జలాలను తీసుకువచ్చి అభిషేకించారు. గోత్రనామాలతో పూజలు, నిత్యహోమాలు జరిగాయి. అనంతరం నివేదన, బలిహరణ, నీరాజన మంత్ర పుష్పాలు సమర్పించి తీర్థప్రసాద వినియోగం చేశారు. బ్రహ్మోత్సవ కార్యక్రమాలను ఆగమ భాస్కర ఖండవల్లి రాజేశ్వర వరప్రసాదాచార్యులు ఆధ్వర్యంలో వేదపండితులు, అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. స్వామివారిని ప్రత్యేకంగా పట్టు వస్త్రాలు, పువ్వులతో అలంకరించారు. వజ్ర వైఢూర్యాభరణాలతో అలంకృతుడైన వెంకన్నను చూసి భక్తులు పులకించారు. ఆలయంలో భక్తులు ఆర్జిత సేవలు నిర్వహించారు. ఉదయం వసంతోత్సవం, నిత్యహోమం, పుష్పయాగం, నీరాజన మంత్రపుష్పం, బలిహరణ అనంతరం 10 గంటలకు స్వామి వారికి శ్రీరాముని రూపంలో హనుమద్వాహనంపై గ్రామోత్సవం నిర్వహించారు. సాయంత్రం 5 గంటలకు గరుడవాహన సేవ, స్వస్తి వచనం, నిత్యహోమం, నవమూర్తి అర్చన, అష్టోత్తర కలశారాధన, శయ్యాధివాసం, చతుర్వేద స్వస్తి, నీరాజన మంత్రపుష్పం తదితర పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఏర్పాట్లను ఆలయ ఈవో బీహెచ్‌వీ రమణ మూర్తి ఆధ్వర్యంలో ఆలయ పర్యవేక్షకులు రాధాకృష్ణ, సాయిరామ్, శివ, నరీన్ చక్రవర్తి పర్యవేక్షించారు. కాగా శనివారం స్వామి వారి దర్శనానికి వచ్చే భక్తుల తాకిడిని దృష్టిలో ఉంచుకుని ఆ మేరకు ఏర్పాట్లు చేస్తున్నట్లు ఈఓ తెలిపారు. ఏడువారాల నోము అచరించే భక్తులతోపాటు స్వామి వారి బ్రహ్మోత్సవాలు కావడంతో అధిక సంఖ్యలో భక్తులు తరలివస్తారన్నారు. ఇవీ నేటి కార్యక్రమాలు బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం స్వామివారికి ప్రత్యేక పూజలతో పాటు విశేష నదీ జలంతో పూర్ణాభిషేకం, అష్టోత్తర శతకలశాభిషేకం, ఉదయం 10 గంటలకు సూర్యప్రభ వాహన సేవ, సాయంత్రం 4 గంటలకు చంద్రప్రభ వాహన సేవ, సహస్ర దీపాలంకరణ, విశేష పూజలు, సేవలు జరుగుతాయి. -
మీసాల వెంకన్న బ్రహ్మోత్సవాలు ప్రారంభం
యానాం టౌన్ : మీసాల వెంకన్నగా ప్రసిద్ధి చెందిన యానాం భూసమేత వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో స్వామివారి చతుర్ధశి బ్రహ్మోత్సవాలు సోమవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. యానాం వేంకటేశ్వర దేవస్థాన ఆలయ సముదాయ కమిటీ ఆధ్వర్యంలో ఈ నెల 12 వరకు నిర్వహించే ఈ బ్రహ్మోత్సవాలను ప్రాంతీయ పరిపాలనాధికారి దవులూరి సుబ్రహ్మణ్యేశ్వరరావు, ఎïస్పీ నితిన్ గోహల్ ఆలయ ప్రాంగణంలో స్వామివారి జయపతాకాన్ని ఎగురవేసి ప్రారంభించారు. ప్రముఖ వైఖానస వేదపండితులు వాడపల్లి గోపాలాచార్యుల ఆధ్వర్యంలో ఉదయం ఆలయంలో సంకల్పం, దీక్షాధారణ, దిగ్దేవతా ప్రార్థన వంటి పూజలను వేదమంత్రాలతో శాస్త్రోక్తంగా నిర్వహించారు. అలాగే తిరుమల తరహాలో ఆరాధనోత్సవాలు, ప్రత్యేకఉత్సవాలలో భాగంగా వివిధ పూజా కార్యక్రమాలను ప్రత్యేకగంగా ఏర్పాటు చేసిన యాగశాలలో 10 మంది రుత్వికులు, ఆలయఅర్చకులు జరిపించారు. పరిపాలనాధికారి, ఎస్పీతో పాటు దేవస్థాన కమిటీ అధ్యక్షుడు కాపగంటి ఉమాశంకర్, కమిటీ ప్రతినిధులు స్వామివారిని దర్శించుకుని పూజలు చేశారు. వందలాది మంది భక్తులు తరలివచ్చి బ్రహ్మోత్సవ కార్యక్రమాలను తిలకించారు. -
అటుపావనఝరి .. ఇటు సాంస్కృతిక సిరి
1934 నుంచి అవిచ్ఛిన్నంగా దేవీచౌక్‌లో నవరాత్ర వేడుకలు 83వ వసంతంలోకి అడుగుపెట్టిన సంబరాలు నాటి మూడులాంతర్ల సెంటరే నేటి దేవీచౌక్ రూ.200 ఖర్చుతో మెుదలు.. నేడు రూ.లక్షలతో నిర్వహణ చారిత్రక నగరి రాజమహేంద్రవరానికి దైవమిచ్చిన ద్రవరూపవరంలా ప్రవహించే జీవనది గోదావరి జలతరంగిణి అయితే.. దానికి కూతవేటు దూరంలోని ఓ కూడలి పావన శరన్నవరాత్ర మహోత్సవాల సందర్భంగా ‘జనతరంగిణి’గా తుళ్లిపడుతుంది. అదే దేవీచౌక్. దేశంలో దసరా ఉత్సవాలకు కర్ణాటక రాష్ట్రంలోని మైసూరు తరువాత అంతటి ప్రాచుర్యాన్ని సంతరించుకున్నాయి తెలుగువారి సాంస్కృతిక రాజధాని నడిబొడ్డున ఇక్కడ జరిగే బాలా త్రిపురసుందరి అమ్మవారి నవరాత్ర వేడుకలు. ఎనిమిది దశాబ్దాలకు పైగా నగర సాంస్కృతిక, ఆధ్యాత్మిక చరిత్రలో అంతర్భాగమైన దేవీచౌక్ ఉత్సవాలలో– ఒక్కప్రదర్శనలో పాల్గొన్నా, జన్మ ధన్యమైనట్టు కళాకారులు భావించేవారు, నేటికీ భావిస్తున్నారు. అంతరించిపోతున్న పౌరాణిక నాటకాలకు ఊపిరులూదుతున్న ఈ ఉత్సవాలలో భక్తి, కళలు, రక్తి, ముక్తి పెనవేసుకుపోయి నగర కీర్తిప్రతిష్టలను ఇనుమడింపచేస్తున్నాయి. పున్నమినాటి పండు వెన్నెల్లో గోదావరి అలల మిలమిలలను చూస్తే వచ్చే సంతోషంతో.. నవరాత్ర వేడుకల్లో రాత్రి వేళల్లో దేవీచౌక్ సంరంభాన్ని తిలకిస్తే కలిగే ఆనందం పోటీ పడుతుందంటే అతిశయోక్తి కాదు. రాజమహేంద్రవరం కల్చరల్ : నగరంలోని ముఖ్య కూడళ్లలో ఒకటైన దేవీచౌక్‌ను 1962 వరకూ మూడు లాంతర్ల సెంటరుగా వ్యవహరించే వారు. మునిసిపాలిటీ ఇక్కడ మూడు లాంతర్లతో దీపాలు బిగించడంతోనే ఆ పేరు వచ్చింది. 1940 నుంచి1974 మధ్యకాలం దేవీచౌక్ ఉత్సవాలకు స్వర్ణయుగమని భావించవచ్చు. నాటక, సినీరంగాలకు చెందిన ప్రముఖ కళాకారులు ఇక్కడ ప్రదర్శనలు ఇవ్వడానికి ఆసక్తి చూపేవారు. మొదట్లో హరికథలు, బుర్రకథలు, భజనలు ప్రదర్శించగా తరువాత సురభి కళాకారుల పౌరాణిక నాటకాలు, సాంఘిక నాటకాలు ప్రదర్శించేవారు. దిగ్గజ కళాకారులకు వేదికగా.. దేవీచౌక్ ఉత్సవాలలోఒక్కఛాన్స్ వస్తే చాలనుకునే కళాకారులు నాడు భావించేవారు, నేటికీ భావిస్తున్నారు. అలనాటి ప్రముఖ కళాకారులు ఈలపాటి రఘురామయ్య, సూరిబాబు, షణ్ముఖ ఆంజనేయరాజు, పీసపాటి, రేలంగి వెంకట్రామయ్య, అభినవ అంజనేయుడు సంపత్‌నగర్ లక్ష్మణరావు వంటి ఎందరో కళాకారులు ఇక్కడప్రదర్శనల ద్వారా సార్థకం చేసుకున్నట్టు భావించేవారు. సినీ ప్రముఖులు సి.ఎస్.రావు–రాజసులోచన, జెమినీగణేశన్–సావిత్రి, ఆదినారాయణ రావు–అంజలి, చలం–శారద దంపతులు, కైకాల సత్యనారాయణ, నూతన్‌ప్రసాద్, రావు గోపాలరావు తదితరులు ఇక్కడ సత్కారాలను అందుకున్నారు. వీరే సారథులు.. ఉత్సవాలను ఏటా నిర్వహించే శ్రీదేవి ఉత్సవకమిటీలో ప్రస్తుతం తోలేటి ధనరాజు అధ్యక్షునిగా, బత్తుల రాజేశ్వరరావు, ముత్యాల కుమారరెడ్డి ఉపాధ్యక్షులుగా, పడాల శివరామలింగేశ్వరరావు కార్యదర్శిగా, ఆండ్ర నమశ్శివాయ కోశాధికారిగా వ్యవహరిస్తున్నారు. నలుగురు సహాయకార్యదర్శులు, 38 మంది కమిటీసభ్యులు ఉత్సవాలను విజయవంతం చేయడానికి కృషిచేస్తున్నారు. దేవీచౌక్‌గా రూపాంతరం ఇలా... 1934లో దివంగత బత్తుల నాగరాజు, బత్తుల మునియ్య సోదరులు దేవీ నవరాత్ర ఉత్సవాలకు శ్రీకారం చుట్టారు. నాడు కేవలం రూ.200తో చేపట్టిన ఈ ఉత్సవాలను నేడు దాతల సహకారంతో, లక్షలాది రూపాయలతో నిర్వహిస్తున్నారు. మాజీ శాసనసభ్యుడు దివంగత బత్తుల మల్లికార్జునరావు (చంటి)ఉత్సవాలకు ఊపు తీసుకువచ్చారు. 1963లో కలకత్తానుంచి బాలాత్రిపురసుందరి పాలరాతి విగ్రహాన్ని తెచ్చి, ప్రతిషి్ఠంచిన నాటినుంచి మూడులాంతర్ల సెంటర్ కాస్తా దేవీచౌక్‌గా మారిపోయింది. ఇది నా పూర్వజన్మ సుకృతం దేవీచౌక్ ఉత్సవాలకు మూలస్తంభంగా చెప్పుకోవలసిన దివంగత బత్తుల మల్లికార్జునరావు మా తండ్రి. గత పదేళ్లుగా ఉత్సవాలకు అలంకరణ బాధ్యతను నిర్వహిస్తున్నాను. ఇది నా పూర్వజన్మ సుకృతం. అమ్మవారి ఆశీస్సులే నా ప్రగతికి కారణమని అనుకుంటున్నాను. – బత్తుల రాజరాజేశ్వరరావు, శ్రీదేవి ఉత్సవ కమిటీ ఉపాధ్యక్షుడు నగర సాంస్కృతిక వైభవానికి ప్రతీక దేవీచౌక్‌లో 1992–93 ప్రాంతాలలో బుర్రకథలను వినిపించేవాడిని. సినిమాలు, టీవీలు స్వైరవిహారం చేస్తున్న ఈ రోజుల్లో పౌరాణిక నాటకాలను ప్రదర్శించడం అభినందనీయం.నగర సాంస్కృతికవైభవానికి ప్రతీక దేవీచౌక్ ఉత్సవాలు. – రాజగురు డాక్టర్ ఎం.ఆర్.వి.శర్మ సమాజానికి శ్రేయస్కరం దేవీచౌక్ ఉత్సవాల్లో ప్రతినిత్యం సామూహిక కుంకుమపూజలు, లలితాపారాయణలు జర గడం సమాజానికి ఎంతో మంచిది. అంతరించిపోతున్న నాటకకళకు ఈ ఉత్సవాలు ఊపిరులూదుతున్నాయి. – డాక్టర్ బి.వి.ఎస్.మూర్తి, సాహితీవేత్త దేవీచౌక్ పేరును చాటిన ఉత్సవాలు దేవీపూజలకు మెసూరు, పశ్చిమ బెంగాల్, మన రాజమహేంద్రిలోని దేవీచౌక్ ఉత్సవాలు పెట్టిందిపేరు. దేవీచౌక్ పేరు రాష్ట్రంలోనే ప్రచారంలోకి రావడానికి ఈ ఉత్సవాలే కారణం. – గ్రంధి రామచంద్రరావు, హిందూ ధర్మ ప్రచార మండలి సభ్యుడు నగర కీర్తి కిరీటంలో కలికితురాయి తెలుగువారి సాంస్కృతిక రాజధాని కీర్తి కిరీటంలో కలికితురాయి దేవీచౌక్ ఉత్సవాలు. నేటికీ కళాకారులు ఈ ఉత్సవాలలో పాల్గొనడానికి ఆసక్తి చూపుతున్నారు. – సరసకవి డాక్టర్ ఎస్వీ రాఘవేంద్రరావు ఆ అవకాశంకోసం ఎదురుచూస్తున్నాను ఎన్నోఅద్భుతమైన నాటకాలకు దేవీచౌక్ వేదిక అయింది. ఆరోజుల్లో ప్రజలు నిలబడి నాటకాలు చూసేవారు. గాయకునిగా దేవీచౌక్‌లో అవకాశానికి ఎదురుచూస్తున్నాను. – ఎర్రాప్రగడ రామకృష్ణ, కవి, గాయకుడు మన సంస్కృతిలో అంతర్భాగం కళాకారులు తమప్రతిభకు గీటురాయిగా ఈ ఉత్సవాలను భావించేవారు, నేటికీ భావిస్తున్నారు. ఈ ఉత్సవాలు మన సంస్కృతిలో అంతర్భాగం. – ప్రాణహితకవి సన్నిధానం నరసింహశర్మ -
పండుగలకు ప్రత్యేక రైళ్లు
హైదరాబాద్: తిరుమల బ్రహ్మోత్సవాలు, దసరా, దీపావళి పర్వదినాల సందర్భంగా ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని 52 ప్రత్యేక రైళ్లు నడిపేందుకు దక్షిణ మధ్య రైల్వే ప్రణాళికలను సిద్ధం చేసింది. దసరా సెలవుల నేపథ్యంలో హైదరాబాద్, సికింద్రాబాద్‌ల నుంచి వివిధ ప్రాంతాలకు రాకపోకలు సాగించే ప్రయాణికుల డిమాండ్‌కు అనుగుణంగా ప్రత్యేక రైళ్లు నడుపనున్నట్లు దక్షిణమధ్య రైల్వే సీపీఆర్వో ఎం.ఉమాశంకర్‌కుమార్ తెలిపారు. ఈ ప్రత్యేక రైళ్లన్నింటికీ ప్రత్యేక చార్జీలు వర్తిస్తాయి. ఈ మేరకు హైదరాబాద్-తిరుపతి (02764/02763) స్పెషల్ ట్రెయిన్ ఈ నెల 28, అక్టోబర్ 5, 12, 19, 26 తేదీలలో సాయంత్రం 5.55 గంటలకు నాంపల్లి నుంచి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 7 గంటలకు తిరుపతికి చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ఈ నెల 29, అక్టోబర్ 6, 13, 20, 27 తేదీలలో సాయంత్రం 5 గంటలకు తిరుపతి నుంచి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 5.50 కి సికింద్రాబాద్ చేరుకుంటుంది. సికింద్రాబాద్-మైసూర్ (07073/07074) స్పెషల్ ట్రైయిన్ అక్టోబర్ 2, 9, 16, 23, 30 తేదీలలో రాత్రి 9 గంటలకు సికింద్రాబాద్ నుంచి బయలుదేరి మరుసటి రోజు మధ్యాహ్నం 12.15 కు మైసూర్ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో అక్టోబర్ 3, 10, 17, 24, 31 తేదీలలో సాయంత్రం 6.15 కు మైసూర్ నుంచి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 10 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది. సంత్రాగచ్చి (కోల్కత్తా)-సికింద్రాబాద్ (02849/02850) స్పెషల్ ట్రైయిన్ అక్టోబర్ 5, 12, 19, 26, నవంబర్ 2, 9, తేదీలలో రాత్రి 11.50 కి సంత్రాగచ్చి నుంచి బయలుదేరి శుక్రవారం తెల్లవారు జామున 4.30 కు సికింద్రాబాద్ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో అక్టోబర్ 7, 14, 21, 28, నవంబర్ 4, 11 తేదీలలో ఉదయం 6.20 కి సికింద్రాబాద్ నుంచి బయలుదేరి శనివారం ఉదయం 10.25 కు సంత్రాగచ్చి చేరుకుంటుంది. సికింద్రాబాద్-విజయవాడ (07757/07758) స్పెషల్ ట్రైయిన్ అక్టోబర్ 2, 9, 16, 23, 30 నవంబర్ 6, 13, 20, 27 తేదీలలో ఉదయం 5.30 కు సికింద్రాబాద్ నుంచి బయలుదేరి అదేరోజు ఉదయం 10.45 కు విజయవాడ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో అదే రోజు సాయంత్రం 5.30 కు విజయవాడ నుంచి బయలుదేరి రాత్రి 10.50 కి సికింద్రాబాద్ చేరుకుంటుంది. సికింద్రాబాద్-పాట్నా (02793/02794) స్పెషల్ ట్రెయిన్ ఈ నెల 30, అక్టోబర్ 7, 14, 21, 28, నవంబర్ 4, 11తేదీలలో ఉదయం 8.35 కు సికింద్రాబాద్ నుంచి బయలుదేరి మరుసటి రోజు సాయంత్రం 4.10 కి పాట్నా చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో అక్టోబర్ 2, 9, 16, 23, 31, నవంబర్ 8, 13 తేదీలలో మధ్యాహ్నం 12.45 కు పాట్నా నుంచి బయలుదేరి మరుసటి రోజు రాత్రి 10.20 కి సికింద్రాబాద్ చేరుకుంటుంది. -
సిద్దిపేట గౌరవాన్ని కాపాడుకుందాం
ఇన్చార్జ్ డీఎస్పీ షేక్‌లాల్ అహ్మద్ ప్రశాంత వాతావరణంలో పండుగలు జరుపుకోవాలి సమష్టి కృషితో ముందుకు సాగాలి పట్టణంలో పీస్ కమిటీ సమావేశాలు సిద్దిపేట జోన్: ప్రశాంత వాతావరణంలో వినాయకచవితి, బక్రీద్ పర్వదినాలను జరుపుకొని సిద్దిపేట గౌరవాన్ని కపాడుకుందామని ఇన్చార్జ్ డీఎస్పీ షేక్‌లాల్ అహ్మద్ ప్రజలకు పిలుపునిచ్చారు. శనివారం ఆర్డీఓ కార్యాలయంలో, శివమ్స్ గార్డెన్లో పీస్ కమిటీ సమావేశాలు నిర్వహించారు. ఆయా సమావేశాలల్లో ఆయన పాల్గొని ప్రసంగించారు. వినాయక చవితి నవరాత్రి ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో జరుపుకోవాలన్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అధికారులు సమష్టిగా పని చేయాలన్నారు. మండపాలు ఏర్పాటు చేసిన వారు స్థానిక పోలీస్ స్టేషన్లో అనుమతి తీసుకోవాలన్నారు. అనంతరం మున్సిపల్ కమిషనర్ రమణాచారి, ఆర్టీఏ ఏసురత్నం, ఆర్అండ్బీ ఈఈ బాల్ నర్సయ్య మాట్లాడారు. నిమజ్జనానికి అన్ని ఏర్పాట్లు పూర్తవుతున్నట్లు చెప్పారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు చిత్తశుద్ధితో పని చేయాలన్నారు. ఆదివారం మంత్రి హరీశ్‌రావు సిద్దిపేటలోని కోమటి చెరువును సందర్శించి ఏర్పాట్లపై సూచనలు ఇవ్వడం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో సిద్దిపేట తహసీల్దార్ శ్రీనివాస్, నీటి పారుల శాఖ ఏఈ విష్ణువర్ధన్, ట్రాన్స్‌కో డీఈ శ్రీనివాస్‌రెడ్డి, సీఐలు సురేందర్‌రెడ్డి, సైదులు, ఎస్ఐ రాజేంద్రప్రసాద్, ఫైర్ ఆఫీసర్ శ్రావణ్, శానిటరీ ఇన్స్పెక్టర్ కృష్ణారెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ అక్తర్, కౌన్సిలర్లు జావేద్, మోహిస్, పట్టణ ప్రముఖులు గుండ్ల జనార్దన్, దరిపల్లి చంద్రం, రమేష్, ఐతే బాల్‌రాజేశం, సజ్జు లతీఫ్, మోహినొద్దీన్, ఎజాజ్ తదితరులు పాల్గొన్నారు. -
ఉత్సవాలను ప్రశాంతంగా జరుపుకోవాలి
గణేష్ మండపాల ఏర్పాటుకు అనుమతి తీసుకోవాలి వరంగల్ రూరల్ ఎస్పీ అంబర్‌కిషోర్‌ఝా వరంగల్ : రూరల్ పరిధిలో గణేష్ నవరాత్రి ఉత్సవాలను ప్రశాంతంగా జరుపుకోవాలని రూరల్ ఎస్పీ అంబర్‌కిషోర్‌ఝా ఒక ప్రకటనలో కోరారు. సోమవారం నుంచి జిల్లాలో వినాయక చవితి నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమవుతున్న సందర్భంగా ఉత్సవ కమిటీలు తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఉత్సవాలకు ఎలాంటి ఆటంకాలు కలుగకుండా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టినట్లు తెలిపారు. ప్రతి ఉత్సవ కమి టీ వారి పరిధిలోని స్థానిక పోలీస్‌స్టేష న్లకుతప్పకుండాసమాచారం అందించాలన్నారు. పట్టణాల్లో ఉత్సవ విగ్రహాలు ఇతరుల స్థలంలో పెడితే సంబంధిత యజమాని అనుమతి తీసుకోవాలని సూచించారు. అన్ని శాఖల అనుమతులు తీసుకుని మండపాలను ఏర్పాటు చేసుకోవాలని, ఎలాంటి అవాంఛనీయ సం ఘటనలు జరుగకుండా కమిటీ సభ్యులు తీసుకోవాలని వివరించారు. విద్యుత్, మైక్‌ల పర్మిషన్లు తీసుకోవాలని, ఇతరులకు ఇబ్బందులు కలుగకుండా ఉత్సవాలు నిర్వహించుకోవాలని సూచిం చారు. రాత్రి 10 గంటలు దాటిన తర్వాత ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించరాదని, మండపాల వద్ద ఉత్సవ కమిటీలు పర్యవేక్షణ ఏర్పాటు చేసుకోవాలన్నారు. ప్రతి విగ్రహానికి సంబంధించిన ఉత్సవ కమిటీల సెల్ నంబర్లు, సభ్యుల వివరాలను స్థానిక పోలీస్ స్టేషన్లలో అందించాలని కోరారు. అనుమానాస్పద వస్తువులు, వ్యక్తులు కనిపిస్తే డయల్ 100కు, వాట్సాప్, కమాండ్ కంట్రోల్ నంబర్ 85009 27777కు ఫోన్ చేయాలని ఎస్పీ సూచించారు. పర్యావరణ పరిరక్షణను దృష్టిలో పెట్టుకుని ఉత్సవ కమిటీలు మట్టి వినాయక విగ్రహాలకు ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. -
పండుగలకు ప్రత్యేక రైళ్లు
డివిజను మీదుగా సికింద్రాబాద్, విశాఖపట్నం, నాగర్సోల్, తిరుపతికి.. విజయవాడ (నగరంపాలెం): వినాయక చవితి, దసరా, దీపావళికి ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్లు గుంటూరు రైల్వే డివిజన్ సీనియర్ డివిజనల్ కమర్షియల్ మేనేజరు కే ఉమామహేశ్వరరావు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. రైలు నం 07069 సికింద్రాబాద్– విశాఖపట్నం ప్రత్యేక ఎక్స్‌ప్రెస్ రైలు నేడు సికింద్రాబాద్‌లో 21.40కి బయలుదేరుతుంది. రైలు నం 07070 విశాఖపట్నం–హైదరాబాద్ ప్రత్యేక ఎక్స్‌ప్రెస్ రైలు నాలుగో తేదీ విశాఖపట్నంలో 22.00కి బయలుదేరి డివిజన్ పరిధిలోని గుంటూరు, సత్తెనపల్లి, పిడుగురాళ్ల, మిర్యాలగూడ, నల్గొండలో ఆగుతుంది. రైలు నం 07071 హైదరాబాద్–విశాఖపట్నం ప్రత్యేక ఎక్స్‌ప్రెస్ 5న హైదరాబాద్‌లో 21.10కి బయలుదేరి విశాఖపట్నంకు మరుసటిరోజు 11.00కు చేరుకుంటుంది. రైలు నం 07072 విశాఖపట్నం– సికింద్రాబాద్ ప్రత్యేక ఎక్స్‌ప్రెస్ సెప్టెంబరు ఆరో తేదీ విశాఖపట్నంలో 18.55కి బయలుదేరి సికింద్రాబాద్‌కు మరుసటిరోజు 08.50కి వస్తుంది. ఈ ప్రత్యేక రైళ్లు ఒక ఏసీ త్రీటైర్, ఒక ఏసీ టూటైరు, పది స్లీపర్ బోగీలు, రెండు ఎస్ఎల్ఆర్ బోగీలతో నడుస్తాయి. తిరుపతి– నాగర్సోల్– తిరుపతికి వీక్లీ రైలు.. దసరా, దీపావళి పండుగలకు తిరుపతి – నాగర్సోల్ – తిరుపతికి వీక్లీ ప్రత్యేక రైలు డివిజన్‌కు నడుపుతున్నారు. రైలు నం 07417 తిరుపతి–నాగర్సోల్ ప్రత్యేక రైలు సెప్టెంబరు 16,23,30, అక్టోబర్ 7,14,21,28 నవంబరు 4,11 తేదీల్లో తిరుపతిలో 07.30కి బయలుదేరి నాగర్సోల్కు మరుసటిరోజు 11.55కి చేరుకుంటుంది. రైలు నం 07418 నాగర్సోల్– తిరుపతి ప్రత్యేక ఎక్స్‌ప్రెస్ రైలు సెప్టెంబరు 17,24,అక్టోబర్ 1,08,15,22,29, నవంబరు 5,12 తేదీల్లో నాగర్సోల్లో 22.00కి బయలుదేరి తిరుపతికి రెండో రోజు 4 గంటలకు చేరుకుంటుంది. ఒక ఏసీ టూటైర్, మూడు ఏసీ త్రీటైరు, ఏడు స్లీపర్ కోచ్‌లు, ఆరు జనరల్, రెండు ఎస్ఎల్ఆర్ కోచ్‌లతో ఈ రైలు నడుస్తుంది. ప్రయాణికులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సీనియర్ డీసీఎం కే ఉమామహేశ్వరరావు కోరారు. -
ప్రశాంతంగా పండుగల నిర్వహణ
కడప కల్చరల్ : సెప్టెంబరులో రానున్న వినాయక చవితి, బక్రీద్ పండుగలను ప్రశాంతంగా జరుపుకొందామని కలెక్టర్ కేవీ సత్యనారాయణ, ఎస్పీ పీహెచ్డీ రామకృష్ణ తెలిపారు. సోమవారం స్థానిక కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో అధికారులు, అనధికారులతో వారు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తహసీల్దార్లు, ఆర్డీఓలు మండల, డివిజన్ స్థాయిల్లో ఉత్సవ కమిటీలతో సమావేశాలు ఏర్పాటు చేసి ప్రశాంతంగా పండుగలను నిర్వహించుకునేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలపాలన్నారు. ఎస్పీ పీహెచ్డీ రామకృష్ణ మాట్లాడుతూ బహిరంగ ప్రదేశాల్లో విగ్రహాలను ఎక్కడ పెడుతున్నారో సంబంధిత పోలీసుస్టేషన్లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. బక్రీద్ సందర్భంగా తీసుకోవాల్సిన జాగ్రతలు, వివిధ అంశాలను ఎమ్మెల్యే అంజద్‌బాషా అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. పర్యావరణ సంరక్షణకు మట్టి వినాయకులను పూజించాలని ప్రజలకు అవగాహన కల్పించేందుకు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు తయారు చేసిన పోస్టర్లను విడుదల చేశారు. సమావేశానికి కడప ఎమ్మెల్యే అంజద్‌బాషా, పెద్దదర్గా ప్రతినిధులు నయీమ్, శాంతి కమిటీ సభ్యులు, జేసీ శ్వేత తెవతీయ, డీఆర్వో సులోచన, ఆర్డీఓలు చిన్నరాముడు, ప్రభాకర్పిళ్లై, టీడీపీ నాయకులు సుభాన్‌బాషా, వినాయక చవితి ఉత్సవ కమిటీ సభ్యులు, ముస్లిం మత పెద్దలు పాల్గొన్నారు. -
హేట్సాఫ్.. సింధు !
ఉద్విగ్న క్షణాలు వీడాయి. ‘జయహో సింధు’ నినాదాలు మిన్నంటాయి. విశ్వ క్రీడా వేదికపై బాడ్మింటన్ దిగ్గజం పీవీ సింధు ప్రదర్శించిన పోరాట పటిమకు ‘పశ్చిమ’ ప్రజానీకం జేజేలు పలికింది. రియో ఒలింపిక్స్‌లో రజత పతకం గెలిచిన తొలి భారతీయ మహిళగా రికార్డులకు ఎక్కిందని తెలిసి సంబరాలు జరుపుకుంది. సింధు పూర్వీకులు మన జిల్లా వాసులే. ఆమె తాతయ్య ఏలూరు నగరానికి చెందిన వారు. ఉద్యోగరీత్యా ఆదిలాబాద్ జిల్లా నిర్మల్‌కు వెళ్లారు. సింధు తండ్రి పుసర్ల వెంకటరమణ అక్కడే జన్మించారు. విద్యుత్ శాఖలో ఇంజినీర్‌గా పనిచేస్తున్న ఆయన హైదరాబాద్‌లో స్థిరపడ్డారు. అయినప్పటికీ మన జిల్లాతో ఆ కుటుంబానికి సంబంధ బాంధవ్యాలు కొనసాగుతూనే ఉన్నాయి. సింధు, ఆమె కుటుంబ సభ్యులు ఏటా రెండు మూడుసార్లు పెదవేగి మండలం రాట్నాలకుంట గ్రామంలోని రాట్నాలమ్మ ఆలయానికి వస్తుంటారు. ఆ కుటుంబానికి రాట్నాలమ్మ అంటే ఎనలేని భక్తిభావం. సింధు రియో ఒలింపిక్స్‌కు వెళ్లడానికి ముందు జూన్ 19న కుటుంబ సభ్యులతో కలసి అమ్మవారిని దర్శించుకున్నారు. ఆమె తండ్రి వెంకటరమణ శుక్రవారం కూడా ఈ ఆలయానికి వచ్చారు. రాట్నాలమ్మ ఆశీస్సులు, కోట్లాదిమంది భారతీయుల దీవెనలే రియోలో సింధు రజత పతకాన్ని సాధించడానికి కారణమయ్యాయని వ్యాఖ్యానించారు. ఈనెల 25 లేదా 26వ తేదీన సింధుతో కలిసి అమ్మవారి దర్శనానికి వస్తామని చెప్పారు. జయహో సింధు ఏలూరు (ఆర్‌ఆర్‌పేట)ఫఒలింపిక్ పోటీల్లో భారత దేశం తరపున తెలుగు బిడ్డ, బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు రజత పతకం సాధించడంతో నగరంలో యువత సంబరాలు చేసుకున్నారు. శేఖర్ చారి టబుల్ ట్రస్ట్ చైర్మన్ కమ్ముల సోమశేఖర్ ఆధ్వర్యంలో బాణసంచా కాల్చారు. అలాగే పీవీ సింధు రూపాన్ని నగరానికి చెందిన సూక్ష్మ కళారూపాల శిల్పి మేతర సురేష్ బాబు అగ్గిపుల్లపై చెక్కారు. -
నెలంతా పండుగే..
రాయవరం : ఆగస్టు.. ఈ నెలంతా పండుగ వాతావరణమే. నాలుగైదు పండుగలతో పాటు శ్రావణమాసం కలుస్తుండడంతో ఎలాంటి శుభకార్యాలు నిర్వహించినా మేలు జరుగుతుందనే నమ్మకం కూడా ప్రజల్లో ఉంది. 7న నాగపంచమితో ప్రారంభం.. ఆదివారం నాగుల పంచమి. నాగపంచమి రోజున సంతానం లేని వాళ్లు, వివాహం కావల్సిన వారు నాగేంద్రుడికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేస్తారు. నాగేంద్రుడిని దర్శించుకుంటారు. పాముల పుట్టలు, నాగదేవత ఆలయాల్లో పాలు పోస్తారు. ఇలా చేస్తే నాగదోషాలు తొలగిపోతాయని భక్తుల నమ్మకం. 9న మంగళగౌరీ వ్రతం.. శ్రావణమాసంలో మహిళలు ఎక్కువగా మంగళగౌరీ వ్రతాన్ని ఆచరిస్తారు. పసుపు కుంకుమలు చల్లగా ఉండాలని కోరుతూ ముత్తయిదువలు ఈ వ్రతాన్ని ఆచరిస్తారు. శ్రావణమాసంలో ఈ వ్రతాన్ని ఆచరించడం, నోము నోయడం జిల్లాలో అనాదిగా వస్తోంది. 12న వరలక్ష్మీ వ్రతం.. శ్రావణమాసం అత్యంత పవిత్రమైనదిగా హిందువులు భావిస్తుంటారు. రెండో శుక్రవారం మహిళలు ఇళ్లల్లో వరలక్ష్మీ వ్రతం ఆచరిస్తారు. వ్రతం ఆచరిస్తే అషై్టశ్వర్యాలు సమకూరడంతో పాటు మాంగళ్య బంధం బలపడుతుందని నమ్ముతారు. 15న స్వాతంత్య్ర దినోత్సవం.. ప్రతి భారతీయుడూ గర్వించదగ్గ రోజు ఆగస్టు 15. సుమారు 200 ఏళ్ల బ్రిటిష్ వారి చీకటి పాలనకు తెరపడిన రోజు. ఈ రోజున జిల్లాలో ఉన్న 52 లక్షల మందికి పండుగే అని చెప్పవచ్చు. 18న రాఖీ పౌర్ణమి.. అన్నాచెల్లెళ్లు, అక్కాతమ్ముళ్ల అనుబంధానికి ప్రతీక రాఖీ. రాఖీ పౌర్ణమి వచ్చిందంటే చాలా మంది అన్నాచెల్లెళ్లు, అక్కాతమ్ముళ్లు ఎంత దూరంలో ఉన్నా తల్లిదండ్రుల ఇంటికి చేరుతారు. 24న కృష్ణాష్టమి.. కృష్ణుడి జన్మదినాన్ని పురస్కరించుకుని ఈ పండుగ నిర్వహిస్తుంటారు. చిన్నారులకు కృష్ణుడి వేషం వేసి, వారి లేత పాదాలకు రంగులు అద్ది, ఇంట్లో బుడి బుడి అడుగులు వేయిస్తుంటారు. వారి పాదముద్రలను చూసి మురిసిపోతుంటారు. కృష్ణాష్టమినాడే ఉట్టి కొడితే పుణ్యం లభిస్తుందని యువకులు ఉట్టి కొట్టడానికి పోటీ పడుతుంటారు. ఉట్టిలోని నైవేద్యాన్ని పొలాల్లో చల్లితే పంటలు బాగా పండుతాయని రైతుల నమ్మకం. -
కొండెక్కిన చికెన్ ధరలు
సదాశివపేట రూరల్ : పండగలు పబ్బాలు వస్తే చాలామంది చికెన్ వండుకుంటారు. వాతావరణం చల్లబడితే చాలు చికెన్ తినాలనిపిస్తుంది. కాని ధరలు పెరగడంతో సామాన్య ప్రజలు చికెన్ తినాలంటేనే భయపడుతున్నారు. కేజీ రూ. 200 కావడంతో కారం పొడితోనే కాలం వెల్లదీస్తున్నారు. స్కిన్లెస్ అయితే రూ. 220కి పెరిగింది. పోనీ గుడ్డతోనైనా సరిపెట్టుకుందామంటే అదికూడా రూ. 5లకు పెరిగింది. మాంసకృత్తులతో పాటు పప్పు దినుసుల ధరలు చుక్కలనంటడంతో సామాన్యులు పౌష్టికాహారానికి దూరమవుతున్నారు. మొన్నటి వరకు కేజీ రూ. 150 ఉన్న చికెన్ ఇప్పుడు రూ. 200లకు చేరింది. ఆషాఢ మాసంలో బోనాల పండుగ రావడంతో ఆనవాయితీగా చాలమంది సంబురాలు చేసుకుంటారు. ఈ సందర్భంగా మాంసం తినడం సాధారణం. గతంలో దేశీ కోళ్లను ఎక్కువగా పెంచుకొనేవారు. ప్రస్తుతం వాటి ఊసే లేదు. కుటుంబాలు పెరగడం పెరటితో తగినంత స్థలం లేకపోవడంతో ఈ కోళ్లను పెంచడానికి అనువుగా లేకుండాపోయింది. దీంతో అత్యధికులు బాయిలర్ చికెన్ మీద ఆధారపడి ఉన్నారు. పౌల్ట్రీ యజమానులు చికెన్ ధరలను పెంచడంతో చికెన్‌తో పాటు గుడ్ల ధరలు కూడా పెరిగాయి. మార్కెట్లో వంద గుడ్లు హోల్‌సేల్‌గా రూ. 480 ఉండగా, రిటైల్‌గా వంద గుడ్లకు రూ. 500లకు అమ్ముతున్నారు.పండుగలకు కరువే... మండలంలో, పట్టణంలో ఆషాఢ మాసం బోనాల పండుగను జరుపుకుంటున్నారు. ఆషాఢ మాసంలో పోచమ్మ, ఈదమ్మ, పోలేరమ్మ, మాచమ్మ వంటి ఇడుపు దేవతలకు అత్యధికంగా కోళ్లు బలిస్తుంటారు. ఈ పండుగల్లో ఇంటికో కోడిని కోస్తుంటారు. కోళ్ల ధరలు పెరగడంతో ఈ ఏడాది మాంసం జోలికి పోవడం లేదు. చికెన్ తినడం మానేశాం లేబర్ పని చేసుకుని బతికే మాకు రోజంతా పనిచేస్తే రూ. 200 ఇస్తారు చికెన్ కేజీ రూ. 200లకు చేరింది. రోజు కష్టం చికెన్‌కే పోతే మిగతా ఖర్చులు ఎలా భరించాలి. రెండు నెలలుగా చికెన్‌గా మానేశాం. నీళ్ల చారు, కారం పొడితోనే కాలం వెళ్లదీస్తున్నాం. - రాజమణి, గృహిణి కనీసం గుడ్లు తినలేకపోతున్నాం కూలీ పనిచేసుకొని బతికే మారు రోజంతా కష్టపడి పనిచేస్తే రూ. 200 వస్తాయి. పిల్లల చదువులకు ఫీజులు, ఇంటి అద్దె కట్టాలి. గుడ్ల రేట్లు పెరగడంతో వాటిని కూడా తినలేకపోతున్నాం.. - సక్కుబాయి, గృహిణి -
సంబురాలు అదరాలే..
♦ పండగ వాతారణంలో ఉత్సవాలు నిర్వహించాలి ♦ అమరుల స్థూపం వద్ద నివాళులతో కార్యక్రమాలు ప్రారంభం ♦ సాయంత్రం సాంస్కృతిక ప్రదర్శనలు కలెక్టర్ రోనాల్డ్ రోస్ సంగారెడ్డి జోన్ : రాష్ట్రావతరణ దినోత్సవ సందర్భంగా పండుగ వాతావరణంలో సంబురాలను ఘనంగా నిర్వహించాలని, ఇందుకు అన్ని ఏర్పాట్లు పూర్తిచేసినట్లు కలెక్టర్ రోనాల్డ్ రోస్ తెలిపారు. బుధవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర అవతరణ వేడుకల్లో జిల్లా ప్రజలంతా భాగస్వామ్యులై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. గ్రామ, మండల, పట్టణ ప్రాంతాల్లో జెండాలు ఎగురవేసి, మిఠాయిలు పంచిపెట్టాలని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. ప్రతి పల్లె, ఆవాసాలు అవతరణ ఉత్సవాలను భారీ స్థాయిలో నిర్వహించాలని, క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న అధికారులు, అన్ని వర్గాల ప్రజలు ఉత్సవాల్లో పాల్గొనాలన్నారు. ఉదయం 8.30 గంటలకు మంత్రి హరీశ్‌రావు కలెక్టరేట్ కార్యాలయంలోని తెలంగాణ అమరవీరుల స్థూపం వద్ద నివాళులర్పిస్తారని, తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలలు వేసి అవతరణ ఉత్సవాలను ప్రారంభిస్తామన్నారు. పరేడ్ గ్రౌండ్లో జెండా ఆవిష్కరణ, మంత్రి సందేశం, సాంస్కృతిక ప్రదర్శనలను ఏర్పాటు చేస్తామన్నారు. ఈ సందర్భంగా వివిధ రంగాల్లో 25 మంది ప్రతిభావంతులకు జిల్లా స్థాయిలో రూ. 51,116 నగదు బహుమతి అందజేసి సత్కరిస్తారన్నారు. తెలంగాణ అమరుల కుటుంబాల్లోని 47 మందికి ఉద్యోగ నియామక పత్రాలు అందజేస్తామన్నారు. అనాథ శరణాలయాలు, వృద్ధాశ్రమాలు, అంధుల పాఠశాలల్లో దుస్తులు, మిఠాయిలు, తదితర పరికరాలను అందజేసేందుకు ఏర్పాట్లు చేశామన్నారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ వైద్య విధాన పరిషత్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాలు నిర్వహిస్తున్నామన్నారు. సాయంత్రం 4 గంటలకు ఐబీ నుంచి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గ్రౌండ్ వరకు భారీ ర్యాలీ, ఉద్యోగ సంఘాలు, కుల సంఘాల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నామన్నారు. ఉత్సవాల్లో భాగంగా మైసూర్‌కు చెందిన రేవణ బృందం, హైదరాబాద్ సత్కళా భారతి బృందం, తమిళనాడు భూపాల్ కళా బృందం, సిద్దిపేట దుర్గాప్రసాద్ బృందంచే సాంస్కృతి కళా ప్రదర్శనలు ఉంటాయన్నారు. తెలంగాణ వంటకాలతో ఫుడ్ కోర్టు ఏర్పాటుచేస్తున్నట్లు వివరించారు. తెలంగాణ సాంప్రదాయం ఉట్టిపడేలా కుటుంబం సమేతంగా ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో పాల్గొనాలన్నారు. విలేకరుల సమాశంలో జేసీ వెంకట్రామిరెడ్డి, డీఆర్వో దయానంద్, సమాచార పౌర సంబంధాల సహాయ సంచాలకులు శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు. ఆకట్టుకున్న సూక్ష్మ గులాబీ జెండా పెద్దశంకరంపేట: తెలంగాణా ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పెద్దశంకరంపేటకు చెందిన అవుసుల భవాని సూక్ష్మ తెలంగాణా జెండాను తయారు చేసి అందరి మన్ననలను పొందుతుంది. ఫెవీ గమ్‌తో తెలంగాణా చిత్రపటంతో ఉన్న జెండా తయారీతో పాటు తెలంగాణా తల్లి ఫోటోలు, ప్రధాన మంత్రి నరేంద్రమోఢీ, సిఎం కెసిఆర్ చిత్రపటాలను గీసింది. గతంలో కూడా సూక్ష్మ కళాఖండాలను తయారు చేయడంతో పాటు చిత్రలేఖనంలో ప్రతిభ కనబర్చుతోంది. భవాని ప్రస్తుతం పేటలోని యువచైతన్య డిగ్రీ కళాశాలలో బీఎస్సీ ఫైనల్ఇయర్ చదువుతోంది. -
ముఖ్యమైన పండుగలు
ఏప్రిల్.. 8 ఉగాది, తెలుగు సంవత్సరాది 11 {శీపంచమి 13 మేష సంక్రమణం. 14 తమిళ సంవత్సరాది 15 }రామనవమి 22 మదనపౌర్ణమి 25 సంకటహర చతుర్థి మే 1 మేడే, కార్మిక దినోత్సవం, శుక్రమూఢమి ప్రారంభం 4 చిన్నకర్తరీ ప్రారంభం 5 మాసశివరాత్రి 9 అక్షయ తృతీయ, సింహాచల నృసింహస్వామి చందనోత్సవం 11 శంకరజయంతి, అగ్నికర్తరి ప్రారంభం 20 నృసింహజయంతి 21 బుద్ధజయంతి 25 రోహిణి కార్తె ప్రారంభం,సంకటహర చతుర్థి 28 కర్తరీ త్యాగం. 31 హనుమజ్జయంతి జూన్ 3 మాసశివరాత్రి 8 మృగశిర కార్తె ప్రారంభం 17 రామలక్ష్మణ ద్వాదశి 22 ఆరుద్ర కార్తె ప్రారంభం 23 సంకటహర చతుర్థి జూలై 2 శనిత్రయోదశి 3 మాసశివరాత్రి 6 పూరీ జగన్నాథ రథయాత్ర, రంజాన్. 9 స్కందపంచమి 12 శుక్రమూఢమి సమాప్తం 15 తొలి ఏకాదశి 16 కర్కాటక సంక్రమణం, దక్షిణాయనం ప్రారంభం 19 గురుపౌర్ణమి 23 సంకటహర చతుర్థి 31 గోదావరి అంత్యపుష్కరాలు ప్రారంభం ఆగస్టు 1 మాసశివరాత్రి 6 నాగచతుర్థి 7 నాగపంచమి 11 గోదావరి అంత్యపుష్కరాలు సమాప్తం, కృష్ణానది పుష్కరాలు ప్రారంభం. 12 వరలక్ష్మీ వ్రతం 15 స్వాతంత్య్ర దినోత్సవం 18 రాఖీ పండగ, శ్రావణ పౌర్ణమి 21 సంకటహర చతుర్థి 25 }Mృష్ణజన్మాష్టమి 30 మాసశివరాత్రి సెప్టెంబర్ 1 పోలాల అమావాస్య 2 చంద్రదర్శనం 5 వినాయక చవితి 6 ఋషిపంచమి 12 గురుమూఢమి ప్రారంభం, పరివర్తన ఏకాదశి 15 అనంతపద్మనాభ వ్రతం 17 మహాలయపక్షం ప్రారంభం 19 ఉండ్రాళ్ల తదియ, సంకటహర చతుర్థి అక్టోబర్.. 1 శరన్నవరాత్రులు ప్రారంభం. 2 గాంధీ జయంతి, చంద్రదర్శనం 8 సరస్వతీ పూజ 9 దుర్గాష్టమి 10 మహర్నవమి, గురుమూఢమి సమాప్తం 11 విజయదశమి 18 అట్లతదియ 19 సంకటహర చతుర్థి 28 ధనత్రయోదశి, మాసశివరాత్రి 29 నరకచతుర్థి 30 దీపావళి పండగ నవంబర్ 1 చంద్రదర్శనం 3 నాగుల చవితి 4 నాగపంచమి 11 చిలుకద్వాదశి, క్షీరాబ్ది 12 శనిత్రయోదశి 14 కార్తీక పౌర్ణమి, బాలల దినోత్సవం, 17 సంకటహర చతుర్థి 27 మాసశివరాత్రి డిసెంబర్ 1 చంద్రదర్శనం 5 సుబ్రహ్మణ్యషష్ఠి 10 గీతాజయంతి, మోక్షద ఏకాదశి 13 దత్తజయంతి, కోరల పౌర్ణమి 16 ధనుస్సంక్రమణం ప్రారంభం 17 సంకటహర చతుర్థ్ధి 25 {Mిస్మస్ 27 మాసశివరాత్రి 30 చంద్రదర్శనం. జనవరి 2017 1 ఆంగ్లసంవత్సరాది 8 ముక్కోటి ఏకాదశి 13 భోగిపండగ 14 మకర సంక్రాంతి 15 కనుమ పండగ 16 ముక్కనుమ 26 రిపబ్లిక్‌డే. 29 చంద్రదర్శనం 31 తిలచతుర్థి ఫిబ్రవరి 1 మదనపంచమి, శ్రీపంచమి 3 రథసప్తమి 7 భీష్మ ఏకాదశి 11 మహామాఘి 25 మహాశివరాత్రి మార్చి 9 నృసింహ ద్వాదశి 12 హోలిపండగ 13 లక్ష్మీజయంతి, వసంతోత్సవం 20 శుక్రమూఢమి ప్రారంభం 26 మాసశివరాత్రి 29 శ్రీ హేవళంబి నామ సంవ త్సర ఉగాది -
శవాలను వెలికితీసి..వాటిని శుభ్రపరిచి
పండుగలు, ఉత్సవాలు, జాతరలు, పర్వదినాల్లో అనేక రకాలున్నాయి. చాలా వరకు పండగలన్నీ మతంతో ముడిపడి ఉన్నప్పటికీ.. వీటిలో కొన్ని మానవుని ఉత్పత్తితో ప్రత్యక్షంగానో, పరోక్షంగానోగాని సంబంధం కలిగి ఉంటాయి. ఉత్పత్తి అంటే ఆహార ఉత్పత్తి మాత్రమే కాదు. పునరుత్పత్తి కూడా! పంటలు, రుతువులను బట్టి కూడా పండుగలు జరుపుకుంటారు. కొన్ని పూర్తిగా ఆధ్యాత్మిక పండుగలున్నాయి. ఇటీవల కాలంలో రాజకీయ విముక్తి, ఉద్యమాలు, పోరాటాల్లో త్యాగాలు చేసిన వారి జయంతులు, వర్ధంతులు కూడా పండగలు,పర్వదినాల్లో చేరిపోయాయి. ఒక మర్యాదగానో లేక భయం కారణంగానో మరణించినవారిని గౌరవించాలని నమ్మకం ప్రపంచంలోని అన్ని సమాజాలు, నాగరికతల్లో ఉంది. కొన్ని నాగరికతల్లో అయితే మరణించిన వారిని గుర్తించుకొనుటకు ప్రత్యేకంగా సెలవు దినాలుగా కేటాయించుకున్నారు. మరణించిన వారిని స్మరించుకునేందుకు ప్రపంచవ్యాప్తంగా చేసుకునే కొన్ని పండుగలు గురించి తెలుసుకుందాం. డే ఆఫ్ డెడ్.. మెక్సికోలో జరుపుకునే పండుగ ఇది. ఆ దేశంలో అతి ముఖ్యమైన పండుగగా జరుపకుంటారు. ప్రతి ఏడాది నవంబర్ 1, 2 తేదీల్లో ఘనంగా జరుపుకుంటారు. ప్రతి చోటును పుర్రెలు, ఎముకలతో అందంగా అలంకరిస్తారు. పండుగ రోజున పూర్వీకుల సమాధులను శుభ్రపరుస్తారు. వాటిని పూలతో అందంగా అలంకరిస్తారు. వారి సమాధుల వద్ద ప్రార్థనలు నిర్వహిస్తారు. బాన్ ఫెస్టివల్.. జపాన్‌లో గత 500 సంవత్సరాల నుంచి తమ పూర్వీకుల జ్ఞాపకార్థం ఈ వేడుకను జరుపుకుంటున్నారు. బౌద్ధమత సంబంధమైన ఈ వేడుకను మూడు రోజులు నిర్వహిస్తారు. ప్రతి ఏడాది ఆగస్టు 15-18 మధ్య దీనిని జరుపుకుంటారు. ఈ వేడుకల్లో ముఖ్యమైంది బాన్ ఓడోరి అనే నృత్యం. ఈ నృత్యం చేస్తే వారివారి పూర్వీకుల ఆత్మలు దిగివచ్చి వారితో పాటు వేడుకలో పాల్గొంటాయనేది వారి నమ్మకం. ఒక బౌద్ధమతస్థుడు ధ్యానం చేస్తున్నప్పుడు తన తల్లి ఆత్మ...కొన్ని ప్రేతాత్మల మధ్య ఇరుక్కుని కష్టపడుతుందని తెలుసుకుంటాడు. ఎలాగైనా తన తల్లి ఆత్మను కాపాడమని బుద్ధుని కోరగా..ఆయన మత గురువుల కోసం శ్రద్ధాంజలి జరపుకోమని చెప్పారట. ఆయన చెప్పినట్టే చేసిన అతనికి తన తల్లిని దయ్యాలు వదిలేసినట్లు కనపడటంతో ఆనందంతో నృత్యం చేసేడట. ఆ నృత్యమే ‘బాన్ ఓడోరి’ అనే నృత్యంగా ప్రసిద్ధి చెందింది. ద హంగ్రీ ఘోస్ట్ ఫెస్టివల్.. చైనాలో జరుపుకునే పండుగ ఇది. నెల రోజలు నిర్వహిస్తారు. ఆ నెలను ఆత్మల నెలగా పిలుస్తారు. ఆ నెలలో ఒక రోజు వారి పూర్వీకులు వారి ఇంటికి వచ్చి భోజనం చేస్తారని వారు నమ్ముతారు. నెలలో ఏ రోజు వస్తారో తెలియదు కనక ఆ నెల మొత్తం వారు భోజనం చేసేటప్పుడు అధికంగా ఒక పల్లెంలో ఆహారం ఉంచి పెడతారు. అలాగే రోజూ రాత్రిపూట వెదురు పేపరుతో చేసిన ఆకులలో చిన్న కొవ్వొత్తులను వెలిగించి చెరువులలో వదులుతారు. కింగ్మింగ్ ఫెస్టివల్.. చైనీయులు ప్రతి ఏడాది ఏప్రిల్ మాసం మధ్యలో జరుపుకుంటారు. పండుగ రోజు తమ పూర్వీకుల సమాధుల దగ్గరకు వెళ్లి సమాధులను శుభ్రం చేస్తారు. సమాధుల వద్ద టీ, భోజనం, వెదురుతో చేసిన పేపరును ప్రసాదంగా ఉంచుతారు. ఈ మూడు సమాధుల వద్ద ఉంచితే ఆత్మలకు శాంతి కలుగుతుందని వారి నమ్మకం. చుసియోక్.. దక్షిణ కొరియాలో జరుపుకునే ఈ పండుగకు ఆ దేశంలో మూడు రోజుల సెలవు. తమ పూర్వీకుల పుణ్యం, దయ, కటాక్షం కారణం కారణంగానే తాము ఈ రోజు ఈ స్థితిలో ఉన్నామని ప్రజలు వారిని పండుగ రోజుల్లో స్మరించుకుంటారు. మొదటి రోజు ‘సాంగ్పియోంన్’ అనే భోజనం తయారుచేసి మొత్తం పూర్వీకులకు సమర్పిస్తారు. మిగిలిన రెండు రోజులు పూర్వీకుల సమాధుల దగ్గరకు వెళ్లి ప్రార్థనలు చేస్తూ నృత్యాలు చేస్తారు. గాయ్జాతర..: నేపాల్‌లో ఆగస్టు, సెప్టెంబర్ మాసాల్లో ఈ పండుగను 8 రోజులపాటు జరుపుకుంటారు. ఆవులు తమ ఆత్మీయుల ఆత్మలను స్వర్గానికి తీసుకువెళతాయని వారు నమ్ముతారు. అందుకుని ఆ సంవత్సరం వారి కుటుంబాల్లో చనిపోయిన వారికోసం ఆవులను ఊరేగింపుగా ఆ ఇంటి పెద్ద తీసుకువెళతాడు. ఆవులు దొరకని వారు వారి ఇళ్లలోని పిల్లలను అలంకరించి తీసుకువెళతారు. మరణానికి సంబంధించిన పాటలు పాడుకుంటారు. దీని వల్ల మరణ భయం పోతుందని వారి నమ్మకం. లిమురాలియ.. ఇది మిగిలిన దేశాలలో చేసుకున్నట్లు పూర్వీకుల ఆత్మశాంతికోసం చేసే పండుగ కాదు. రోమ్ నగరంలో పూర్వీకుల ఆత్మలను తమ ఇళ్ల నుంచి తరిమివేయటానికి, ఇంటిని పరిశుద్ధంగా చేసుకోవటానికి ఈ పండుగను చేసుకుంటారు. ఆ ఇంటి పెద్ద మధ్య రాత్రి లేచి, మూడు సార్లు చేతులు కడుగుకొని, కాళ్లకు చెప్పులు లేకుండా తన భుజాలపై నుంచి నల్ల నువ్వులను 9 సార్లు ఇళ్లంతా జల్లుతూ..‘నన్నూ, నా వారినీ ఈ నల్ల నువ్వులతో ఆత్మల దగ్గర నుంచి విడిపిస్తున్నాను’ అని చెబుతాడు. పితృ పక్ష హిందూ సంప్రదాయం ప్రకారం ఆశ్వయూజ మాసంలో 15 రోజులు జరుపుకుంటారు. తమ పితృ దేవతలకు ప్రార్థన చేస్తూ భోజనమును ప్రసాదంగా పెడతారు. హిందూ పురాణాల ప్రకారం కర్ణుని ఆత్మ స్వర్గం చేరుకున్నప్పుడు అక్కడ తినడానికి బంగారం తప్ప ఏమీ లేదట. ఆకలితో అవస్థపడుతున్నప్పుడు కర్ణుడు ఇంద్రుని కలసి వంటగది ఎక్కడా అని అడుగగా..తాను బంగారమే తింటానని, తన పూర్వీకులకు కూడా తాను బంగారాన్నే ఆహారంగా పెట్టానని చెప్పాడట. వారి మధ్య కాసేపు వాగ్వివాదం జరిగిన తరువాత ఇంద్రుడు కర్ణుడిని 15 రోజులు భూమికి పంపిచాడట. కర్ణుడు ఆ 15 రోజులూ తన పూర్వీకులకు భోజనం, మంచినీరు ఇచ్చాడట. ఫమాడిహానా... మడగాస్కర్ దేశంలో జరుపుకునే పండగ. దీనికని ప్రత్యేకంగా ఏ రోజునూ వారు కేటాయించలేదు. చలికాలంలో సమాధుల దగ్గరకు వెళ్లి సమాధులలో ఉన్న వారి పూర్వీకుల శవాలను వెలికితీసి..వాటిని శుభ్రపరిచి మళ్లీ సమాధులలో ఉంచుతారు. ఇక్కడి వారి నమ్మకమేమిటంటే శవాలు పూర్తిగా మట్టిలో కలసిపోతేనే మరణించినవారు స్వర్గానికి చేరుకోగలరని..అంతవరకు ఆత్మలు అక్కడే ఉంటాయని వారి నమ్మకం. -
పండగ రోజుల్లో కుటుంబానికి దూరంగా..!
-
హైదరాబాద్‌లో పతంగుల పండుగ
-
చికెన్@డబుల్ సెంచరీ
హైదరాబాద్: చికెన్ ధరలు దడ పుట్టిస్తున్నా యి. మొన్నటి వరకు రిటైల్ మార్కెట్లో కేజీ రూ.160కి లభించిన స్కిన్లెస్ చికెన్‌పై కిలోకు రూ.40 వరకు పెరిగింది. ప్రస్తుతం మార్కెట్లో లైవ్ కోడి కేజీ 120, డ్రెస్డ్ చికెన్ కిలో రూ.175, స్కిన్లెస్ రూ.205కు అమ్ముతున్నారు. గత వారం చికెన్ (స్కిన్‌తో) కిలో రూ.140, స్కిన్ లెస్ రూ.160 కు లభించింది. సోమవారం నుంచి స్కిన్ లెస్ చికెన్ కేజీ డబుల్ సెంచరీ దాటేసింది. దీంతో సామాన్యులు చికెన్ వైపు చూడాలంటేనే హడలెత్తే పరిస్థితి తలెత్తుతోంది. పండుగల గిరాకీతో... క్రిస్మస్, నూతన సంవత్సరం, సంక్రాంతి పండుగల గిరాకీని సొమ్ము చేసుకునేందుకు వ్యాపారులు ధరలు పెంచినట్లు తెలుస్తోంది. నగర మార్కెట్లో ఒక్కోచోట ఒక్కోరకంగా ధరలు ఉండటమే ఇందుకు నిదర్శనం. సంక్రాంతి వరకు చికెన్ ధరలు అస్థిరంగానే ఉంటాయని వ్యాపారులు చెబుతున్నారు. గుడ్లు, మటన్ ధర లు కూడా రోజురోజుకూ పైపైకి ఎగబాకుతున్నాయి. ఇప్పటికే పప్పులు, నూనెల ధరలు సామాన్యులకు చుక్కలు చూపిస్తున్న తరుణంలో ఆ లిస్ట్‌లో చికెన్ కూడా చేరిపోయిందని మాంసం ప్రియులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
వరుస పండుగలకు సువిధ రైళ్లు
హైదరాబాద్: ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని పలు మార్గాల్లో అదనపు చార్జీలపై సువిధ రైళ్లను నడుపనున్నట్లు దక్షిణమధ్య రైల్వే సీపీఆర్వో ఎం.ఉమాశంకర్‌కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. సికింద్రాబాద్-యశ్వంత్‌పూర్ (02285/02286) సువిధ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ జనవరి 17వ తేదీన రాత్రి 9 గంటలకు సికింద్రాబాద్ నుంచి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 7.55 గంటలకు యశ్వంత్‌పూర్ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో జనవరి 18వ తేదీ రాత్రి 10.40 గంటలకు యశ్వంత్‌పూర్ నుంచి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 10.10 కి సికింద్రాబాద్ చేరుకుంటుంది. సికింద్రాబాద్-కాకినాడ (07427/07428) స్పెషల్ సువిధ ట్రైన్ డిసెంబర్ 29, జనవరి 5 తేదీల్లో సాయంత్రం 7.15 కు సికింద్రాబాద్ నుంచి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 5.15 కు కాకినాడ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో డిసెంబర్ 30, జనవరి 6 తేదీల్లో సాయంత్రం 6.10 కి కాకినాడ నుంచి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 4.30 కు సికింద్రాబాద్ చేరుకుంటుంది. -
ఓయూలో ఏ పండక్కీ అనుమతి లేదు
డీసీపీ రవీందర్ సిటీబ్యూరో: రాబోయే 8 రోజుల్లో ఉస్మానియా యూనివర్సిటీలో ఎటువంటి పండగలు నిర్వహించడానికి అనుమతి లేదని హైదరాబాద్ ఈస్ట్ జోన్ డిప్యూటీ కమిషనర్ డాక్టర్ రవీందర్ స్పష్టం చేశారు. వర్సిటీలో ఈనెల 10న ‘బీఫ్ ఫెస్టివల్, ‘గో పూజ’, 12న ‘పోర్క్ ఫెస్టివల్’ పేరుతో వేడుకలను నిర్వహిస్తామని పలు సంఘాలు, సంస్థలు ప్రకటించిన విషయం తె లిసిందే. వీటి నిర్వహ ణపై అన్ని వైపుల నుంచి భిన్న స్వరాలు వెలువడుతున్నాయి. ఇప్పటికే వర్సిటీలో పండగల నిర్వహణకు ఎటువంటి అనుమతి లేదని వర్సిటీ వర్గాలు స్పష్టం చేసిన విషయం తెలిసిందే. తాజాగా పోలీసులు కూడా ఇదే విషయాన్ని వెల్లడించారు. క్యాంపస్‌లో శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా ఉండేందుకు అవసరమైన అన్ని చర్యలను తీసుకుంటామని డీసీపీ రవీందర్ చెప్పారు. ఇందుకు విద్యార్థులు, ఉద్యోగులు, ఇతరులంతా సహకరించాలని విజ్ఞప్తి చేశారు. పండగలు కాదు.. సమస్యలపై దృష్టి సారించాలి ఓయూలోని సమస్యల పరిష్కారంపై అందరూ దృష్టిసారించాలని, పండగల పేరుతో వర్సిటీలోని ప్రశాంత వాతావరణాన్ని చెడగొట్టొదని ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి నిరంజన్ పిలుపునిచ్చారు. వర్సిటీలో విద్యకు సంబంధించి, అందరికీ ఆమోదయోగ్యమైన పండగలు నిర్వహిస్తే తమకు అభ్యంతరం లేదన్నారు. ఓయూలో పేరుకపోయిన మెస్ బకాయిలను తక్షణమే చెల్లించాలని, వర్సిటీ అభివృద్ధికి రూ. 100 కోట్లు విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నేడు రౌండ్‌టేబుల్ సమావేశం పెద్దకూర పండగపై రాద్దాంతం చేయడంతోపాటు.. దాన్ని అడ్డుకునేందుకు గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ లోథా కుట్ర పనుతున్నారని ప్రజాస్వామ్య సాంస్కృతిక వేదిక ప్రతినిధులు ఆరోపించారు. రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్న ఆయనపై రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ (హెచ్ఆర్సీ) ఫిర్యాదు చేశామని, ఈ కేసును హెచ్ఆర్సీ స్వీకరించిందని చెప్పారు. ఈనెల 7వ తేదీలోగా నివేదిక ఇవ్వాలని నగర పోలీస్ కమిషనర్‌కు నోటీసులు జారీ చేసిందని వివరించారు. బీఫ్ ఫెస్టివల్‌పై ఓయూలో శనివారం రాజకీయ, ప్రజా సంఘాలతో రౌండ్‌టేబుల్ సమావేశం నిర్వహించనున్నట్లు చెప్పారు. పెద్దకూర తిన్నారన్న కారణంగా దేశవ్యాప్తంగా దాడులకు గురైన బాధిత కుటుంబాలను కూడా ఈ సమావేశానికి ఆహ్వానిస్తున్నామన్నారు. -
అట్టహాసంగా విజయనగరం ఉత్సవాలు
విజయనగరం ఉత్సవాలు శనివారం అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. కోట జంక్షన్ వద్ద ర్యాలీతో ఉత్సవాలను కలెక్టర్ ఎంఎం నాయక్ ప్రారంభించారు. శనివారం నుంచి మూడు రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాల్లో భాగంగా అన్ని రకాల కళా ప్రదర్శనలు ఏర్పాటు చేశామని ఆయన తెలిపారు. ఆనందగజపతి ఆడిటోరియంలో జరిగిన ప్రారంభోత్సవ కార్యక్రమంలో మంత్రి మృణాళిని, ఎమ్మెల్యే మీసాల గీత, కలెక్టర్ సహా ప్రముఖులు పాల్గొన్నారు. జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందిన కళాకారులు ప్రాచీన యుద్ధ విద్యలతో అయోధ్య మైదానంలో ఏర్పాటు చేసిన ప్రదర్శన ఆహుతులను ఆకట్టుకుంటోంది. ఉత్సవాలతో పట్టణం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. విజయనగరం సందడిగా మారింది. -
మీ పండుగ పాడుగాను..!
సాక్షి: 'పుర్రెకో బుద్ధి.. జిహ్వకో రుచి' అంటారు. కొన్ని చోట్ల జరిగే వెరైటీ ఫెస్టివల్స్ చూస్తే ఇది నిజమే అనిపిస్తుంది. కొంత మంది బుర్రలో తట్టిన వింత ఆలోచనల కారణంగానే ఇలాంటి పండుగలు పుట్టుకొచ్చాయి. సాధారణంగా పండుగల వెనుక ఎంతో చారిత్రక నేపథ్యం, ప్రాధాన్యం ఉంటాయి. కానీ ఇలాంటివేమీ లేకుండా వేలం వెర్రిగా జరుపుకునే కొన్ని వెరైటీ ఫెస్టివల్స్ గురించి ఈ రోజు తెలుసుకుందాం.. ! స్పెయిన్‌లో జరిగే టమోటాల పండుగనే 'టమోటా యుద్ధం' అని కూడా అంటారు. దీన్ని ఆగస్టు చివరి బుధవారం జరుపుకుంటారు. ఇది 1945లో ప్రారంభమైంది. ఈ పండుగ రోజున అక్కడికి చేరుకునే జనం ఒక గంట పాటు ఒకరిపై ఒకరు టమోటాలు విసురుకుని ఆనందిస్తారు. అయితే ఇందులో పాల్గొన్న ప్రజలు గాయపడకుండా ఉండేందుకు టమోటాలను విసిరే ముందు నలిపేయాలనే షరతు కూడా ఉంది. ఎలామొదలైంది.. టమోటా యుద్ధం మొదలైన తీరు హాస్యాస్పదంగా అనిపిస్తుంది. 1945 ఆగస్టు చివరి బుధవారం అక్కడ సంప్రదాయం ప్రకారం 'జెయింట్స్ అండ్ బిగ్ హెడ్స్' పెరేడ్ జరుగుతోంది. ఇందులో ఉత్సాహంగా పాల్గొన్న వారిలో ఒక యువకుడు కింద పడిపోయాడు. అతనికి కోపం వచ్చి చేతికి అందిన వస్తువునల్లా జనం మీదకు విసరడం మొదలు పెట్టాడు. ఇంతలో అటుగా వెళ్తున్న టమోటా బండి కనపడింది. అతను ఆ టమోటాలను కూడా విసరడం మొదలు పెట్టాడు. తర్వాత అతనితో పాటు మిగిలిన జనం కూడా ఇలా చేయడం ప్రారంభించారు. పోలీసులు వచ్చే వరకు ఈ తంతు అలానే కొనసాగింది. ఈ పండుగ ఆరంభానికి ప్రారంభ సంఘటన ఇదే. ఇదేదో బావుంది కదా అని కొంత మంది యువత తర్వాత సంవత్సరం కూడా ఉత్తుత్తిగా గొడవపడి టమోటాలతో కొట్టుకున్నారు. ప్రతి ఏటా యువత ఇలా చేయడం ఇష్టపడుతుండటంతో ప్రభుత్వమే దీన్ని అధికారికంగా నిర్వహించడం మొదలు పెట్టింది. పర్యాటకులకు ఇది ప్రధాన ఆకర్షణగా మారింది. జర్మనీలో ప్రతి ఏటా అక్టోబర్ 6న బాతుల పండుగను నిర్వహిస్తారు. అయితే ఇందులో నిజమైన బాతులను ఉపయోగించరు. పసుపుపచ్చ రంగులో ఉండే రబ్బరు బాతు బొమ్మలను ఈ పందెంలో ఉంచుతారు. బొమ్మలు తిరగబడకుండా ఉండేందుకు బాతు బొమ్మకు చిన్న ఇనుపముక్క కడతారు. ఈ పందెంలో వందలాది మంది పాల్గొంటారు. ఈ బొమ్మల మీద పేర్లు రాసుకుంటారు. ఎవరి బాతు ఎక్కువ దూరం ప్రయాణిస్తే వారు పందెంలో గెల్చినట్టు లెక్క. గెల్చిన వారికి 10,000 యూరోల బహుమతి (సుమారు రూ. 7 లక్షలు) లభిస్తుంది. ఈ పండుగలో అందరూ ఒక చోట గుమికూడి రెడ్‌వైన్‌ను ఒకరిపై ఒకరు చల్లుకుంటారు. జూన్ చివరి మూడు రోజుల్లో ఈ ఫెస్టివల్‌ను జరుపుకుంటారు. దక్షిణ స్పెయిన్‌లోని హారో అనే పట్టణంలో విదేశీయులతో కలిసి సుమారు 10,000 మంది ఇందులో పాల్గొంటారు. వీరంతా జగ్గులు, బకెట్స్, వాటర్ పిస్టల్స్‌తో సుమారు 1,30,000 లీటర్ల రెన్వైన్ చల్లుకుని తడిసిముద్దవుతారు. ప్రత్యేకతలు.. బ్యాటిల్ ఆఫ్ వైన్ ఫెస్టివల్లో పాల్గొనేందుకు వచ్చేవారు ముందుగా ఆన్లైన్లో బుక్ చేసుకుని, వివరాలు నమోదు చేసుకోవాలి. ఉదయం ఏడు గంటలకు మొదలయ్యే ఈ పండుగకి ఒక గంట ముందే చేరుకోవాలి. ఇందులో పాల్గొనే ప్రతి ఒక్కరు కచ్చితంగా తెల్ల దుస్తులు ధరించాలి. చిన్న పిల్లలకు ప్రవేశం లేదు. ఎవరి మీద ఎవరికీ కోపం ఉండకూడదు. కేవలం ఎదుటి వారి తెల్ల దస్తులను వైన్‌తో తడిపి రెడ్‌గా చేయడమే దీని ప్రధాన ఉద్దేశం. ఉదయం మొదలైన పండుగ సాయంత్రం వరకు కొనసాగుతుంది. -
పండుగలు.. శబ్దకాలుష్య కేంద్రాలు
వందేళ్ల క్రితం లోకమాన్య తిలక్ ప్రారంభించిన సామూహిక ఉత్సవాలకు నేడు కొనసాగుతున్న ఉత్సవాలకు పోలికే లేదు. శబ్దం ఎంత ఎక్కువగా ఉంటే సంబరం అంత భారీగా ఉంటుందనే తప్పు భావన నేడు ప్రబలిపోయింది. రోడ్లమీదే ప్రార్థనలు చేసుకో వడాన్ని అధిగమించడంలో ముస్లింలకు సహాయపడాలనే ఉద్దేశంతో ముంబైలోని మసీ దులు అదనపు అంతస్తులను నిర్మించుకోవడానికి గతంలో మనోహర్ జోషి నేతృత్వం లోని శివసేన-బీజేపీ ప్రభు త్వం అనుమతించింది. సరిగ్గా 20 ఏళ్ల తర్వాత దేవేంద్ర ఫడ్నవిస్ నేతృత్వం లోని బీజేపీ-శివసేన ప్రభుత్వం గణేష్ చతుర్థిని సంబ రంగా జరుపుకోవడానికి హిందువులు వీధులను ఆక్ర మించాలని కోరుకుంటోంది. ట్రాఫిక్‌కు ఆటంకం కావ చ్చని తెలుస్తున్నప్పటికీ వీధుల్లో పందిళ్లు నిర్మించుకోవ డానికి మహారాష్ట్ర ప్రభుత్వం సమ్మతిస్తోంది. గణపతి ఉత్సవం మహారాష్ట్రలో సుదీర్ఘకాలం నుం చి కొనసాగుతున్న సంప్రదాయం. దాదాపు అధికారు లందరూ ఉత్సవాల నిర్వాహకుల పట్ల అనుకూలత ప్రదర్శిస్తుంటారు. పందిళ్లను నిర్మించుకోవడానికి రహ దార్లను తవ్వి వేసే స్వేచ్ఛను కూడా వారికి ప్రసాదిస్తుం టారు. పురపాలక సంస్థలు ఆ గుంటలను పూడ్చివేసే ప్రయత్నం చేయవు. నిజానికి, ట్రాఫిక్ బాగా రద్దీగా ఉన్న ప్రాంతాల్లో అలాంటి పందిళ్లను నిర్మించుకోవ డానికి అనుమతి ఇవ్వకపోతే, ఉత్సవాల నిర్వాహకులు అసౌకర్యానికి గురై ఇబ్బందిపడతారంటూ ముంబై పుర పాలక సంస్థ బాంబే హైకోర్టు ముందు వాదించింది కూడా. అయితే ఈ వాదనతో ఏకీభవించని హైకోర్టు, పురపాలక సంస్థ ఎవరి ప్రయోజనాలకోసం సేవ చేయాలనుకుంటోందని ప్రశ్నించింది. తమ తమ రాజకీయ ప్రయోజనాలను ఇది దెబ్బ తీస్తుంది కాబట్టి ఎవరూ ఈ అంశాన్ని తడమాలను కోవడం లేదు. గణపతి ఉత్సవాలను జరుపుకోవల సింది భారత్‌లోనే కానీ పాకిస్తాన్లో కాదని శివసేన బాహాటంగా ప్రకటించింది. వీధుల్లో నమాజ్ చేసుకో కుండా చేయాలని గతంలో తాను కోరుకున్న విషయా న్ని శివసేన మర్చిపోయినట్లు వ్యవహరిస్తూ గణేష్ ఉత్సవాల నిర్వహణలో తమకు అసౌకర్యం కలిగించే ఎలాంటి ఆటంకాలనయినా ధిక్కరిస్తుంటుంది. ఈ విష యంలో సంయమనం పాటించి వివాద పరిష్కారం చేయడానికి బదులుగా, న్యాయస్థానాలు తీసుకునే చర్య కోసం ఇతర రాజకీయ పార్టీలు వేచి చూస్తుంటాయి. ఈ నేపథ్యంలో, లౌకికవాదం గురించి ఏ రాజ కీయ నేత అయినా వివేచన ప్రదర్శించిన అరుదైన సం ఘటన ఉందా అని గుర్తు చేసుకుంటున్నాను. చిమన్ పటేల్ ప్రభుత్వానికి తన మద్దతు ఉపసంహరించుకున్న సందర్భంగా గుజరాత్ శాసనసభలో నవీన్ శాస్త్రి మా ట్లాడుతూ లౌకికవాదాన్ని ఇలా నిర్వచించారు : ఒక స్త్రీ లేదా పురుషుడు తమ ఇంటి గడప దాటి బయటకు వచ్చిన క్షణం నుంచి అతడు లేదా ఆమె దేశ పౌరుడి గానే ఉంటారు తప్ప, హిందువుగా లేదా ముస్లింగా ఉండరు. మతాలను, వాటి చిహ్నాలను వీధుల్లో లేకుం డా చేయాలన్నదే ఆయన భావం. కానీ మనం ఇప్పుడు చూస్తున్న ధోరణి ఏమిటంటే, మతాల మధ్య తీవ్ర స్పర్థాతత్వంతో వాటిని వీధుల్లోకి తీసుకువస్తుండటమే. ఒక్క గణపతి ఉత్సవాల విషయంలోనే కాదు.. దహి-హంది వేడుకల్లోనూ యువకులు ప్రాణాలకు తెగించి, మానవ పిరమిడ్లను నిర్మించడంలో పోటీపడు తుంటారు. తమకు బహుమతిని తెచ్చిపెట్టనున్న, ఎత్తులో ఉండే కుండను చేరుకోవడానికే వారు పిరమిడ్ల రూపం దాలుస్తారు. ఇక నవరాత్రి కూడా జనం తొక్కిడి తో, శబ్దకాలుష్యంలో కూరుకుపోతుంది. ఈ అన్ని ఉత్స వాల్లో రాజకీయ నేతలు, వారి అనుయాయులు పాత్ర పోషిస్తూ పండుగలను వికృతపరుస్తుంటారు. ఇవి వం దేళ్ల క్రితం లోకమాన్య తిలక్ ప్రారంభించిన రకం ఉత్స వాలు కాదు. బ్రిటిష్ వాళ్ల కన్నుగప్పటానికి పండుగల రూపంలో ప్రజలను కూడగట్టాలన్నది తిలక్ ఉద్దేశం. అయినా ఆయన కార్యక్రమం వీధుల్లోకి ఎక్కలేదు. బహిరంగ స్థలాలను దుర్వినియోగపర్చడాన్ని అనుమతించనట్లయితే దాన్ని మత స్వాతంత్య్రానికి అడ్డంకిగా చూస్తున్నారు. పండుగల సందర్భంగా శబ్ద కాలుష్య ప్రమాదాన్ని తనిఖీ చేయాలంటూ బాంబే హైకోర్టు గతంలో ఇచ్చిన ఆదేశాలను పురపాలక సంస్థ లు పెడచెవిన పెట్టాయి. ఇది అంతిమంగా రాజకీయ వర్గాల ప్రయోజనాలకే ఉపయోగపడుతుంది. ఈ పండుగల నిర్వహణకు అవసరమయ్యే నిధులు వీరిలో ఒక సెక్షన్‌ను బలిసేలా చేశాయి. రాజకీయ నేతలు నిర్ణయం తీసుకుంటే అధికారవర్గం దానికి జీహుజూర్ అంటోంది. ప్రజలు లెక్కలోకే రారు. అలాగని చెప్పి ఈ పండుగలకు ప్రజాదరణ కొరవ డిందని చెప్పలేము. సమాజంలోని ఒక భాగం మాత్ర మే వీటిలో పాలుపంచుకుంటోంది. చాలామంది ఇంటి లో పూజ చేస్తారు. ఈ ఉత్సవాలపై టీవీల ప్రత్యక్ష ప్రసా రాల ఫలితంగా అనేకమంది జనసందోహపు అసౌక ర్యం నుంచి తప్పించుకోవడానికి తమ డ్రాయింగ్ రూమ్‌లలో కూర్చుని చూస్తుంటారు. కొంతమంది దర్శనం కోసం పొరుగున ఉన్న మందిరానికి వెళ్లి కూర్చుంటారు. పేరుకు వీరు సార్వజనిక్ లేదా పబ్లిక్‌గా కనిపిస్తారు కానీ, నగరాలలో ఓటింగ్ జరిగే సమ యంలో వీరి భాగస్వామ్యం చాలా తక్కువగానే ఉం టుంది. అందుకే శబ్దం ఎంత ఎక్కువగా ఉంటే ఉత్సవం అంత భారీగా ఉంటుందనే తప్పుడు భావం పాకిపో యింది. ఈ ఉత్సవాల సందర్భంగా వాయించే వాయి ద్యాలు ఎవరి కర్ణభేరులనయినా అమాంతంగా బద్దలు చేస్తాయి. తిలక్ వందేళ్ల క్రితం ప్రారంభించిన ఉత్సవాలు ఇవి కాదు. పుణేలోని తన ఇంటి ఆవరణలో తొలి సామూహిక ఉత్సవం జరిపిన సంవత్సరం తర్వాత ముంబైలో తను సందర్శించిన తొలి ఉత్సవ స్థలం వద్ద నేటికీ ఒక చిన్న విగ్ర హం మాత్రమే ఉంది. అక్కడ శబ్దం ఏమాత్రం లేదు. ఇతరులు దీన్ని ఆదర్శంగా తీసు కోవడం పోయి, ప్రతి సంవత్సరం విగ్రహాల ఎత్తును పెంచుకుంటూ పోయారు. గణేష్ ఉత్సవాలను ఆ క్షణంలో నిర్వహించే లక్ష్యం గా మాత్రమే అందరూ భావిస్తున్నారు తప్పితే అవి కలిగించే దీర్ఘకాలిక ప్రభావాలను ఎవరూ పట్టించు కోవటం లేదు. మతపరమైన మనోభావం అనేది మన దేశంలో మంచి సాకుగా ఉంటుంది మరి. (వ్యాసకర్త సీనియర్ పాత్రికేయులు ఈమెయిల్: mvijapurkar@gmail.com) - మహేష్ విజాపుర్కార్ -
సంక్రాంతి వచ్చే.. సంబరాలు తెచ్చె
సంబరాలు తెచ్చింది. ఆడపడుచుల ముత్యాల ముగ్గులు.. పత ంగుల రెపరెపలు.. డూ..డూ బసవన్నల సయ్యాట.. వలస వెళ్లిన కూలీల రాకతో పల్లెలు కళకళలాడుతున్నాయి. సకినాలు, బొబ్బట్లు, పిండివంటల రుచులు మనసును దోచేస్తున్నాయి. జిల్లాలో సంక్రాంతిని కీడు పండుగ అని భావించినా.. ప్రతిఇంటా జరుపుకుంటారు. కొత్త బట్టలు కొనకపోయినా.. కోటిదేవతలను పూజిస్తారు..! బండ్లు బోనాలు, తిరునాళ్లతో సంబరాలు ప్రారంభమవుతాయి. సింగోటం బ్రహ్మోత్సవాలు, అచ్చంపేట నిరంజన్‌షావలీ గంధోత్సవం సంక్రాంతి నుంచే ప్రారంభమవుతాయి. - ఆత్మకూర్/షాద్‌నగర్ ముగ్గుల సందడి సంక్రాంతి పండగ వస్తుందంటే చాలు.. యువతులు, మహిళలు కొంగొత్త ముగ్గులు వేయడం నేర్చుకుంటారు. వేకువజామునే లేచి కళ్లాపి జల్లి వాకిళ్లను సిద్ధంచేస్తారు. రంగురంగుల ముగ్గులతో అందరి ముందు తమ ప్రతిభ చూపుతుంటారు. సంక్రాంతికి తొలి అడుగు ముంగిట వేసే ముగ్గులే.. పల్లెల్లో రంగురంగుల ముగ్గులు ఆహ్వానం పలుకుతున్నాయి. దీనికితోడుగా పలు సంఘాలు, సంస్థలు ముగ్గులపోటీల నిర్వహణతో పాటు నేటి తరాలను సంస్కృతి పరిరక్షణ దిశగా ప్రోత్సహిస్తుండటం విశేషం. డూ..డూ బసవన్న.. అయ్యగారికి దండం పెట్టు.. అమ్మగారికి దండం పెట్టు..!అంటూ డూడూ బసవన్నలతో సందడి చేసే గంగిరెద్దుల అంతాఇంతాకాదు. పచ్చని పం టలుపండించే రైతు లు పాలిచ్చే గో వును దైవంగా భావించి దానిని వస్త్రాలతో అలంకరించి కొ త్తగా ఇంటికొచ్చిన ధాన్యాన్ని నైవేద్యంగా పెట్టడం ఆనవాయితీగా వస్తోంది. అయితే పట్టణ ప్రాంతాల్లో నేటి తరాలకు ఈ ప్రాధాన్యతను తెలియజేసేందుకు కొన్ని సంస్థలు కళాకారుల ద్వార ప్రదర్శనలు ఇప్పిస్తున్నాయి. నేడు భోగి భోగి మంటలు.. భోగుల్లో.. భోగుల్లో..భోగభాగ్యాల భోగుల్లో.. భోగి మంటలా భోగుల్లో..! అంటూ గ్రామీణ ప్రాంతాల్లో భోగిమంటల సంప్రదాయం ఇంకా కొనసాగుతూనే ఉంది. పాత వస్తువులను పాతర పెట్టి కొత్త వస్తువులు స్వాగతం పలికే ఈ కార్యక్రమం ద్వారా ఆనందాలు పంచుకోవడం ప్రత్యేకం.. అందుకే అన్ని వర్గాలను అలరించే పండగగా సంక్రాంతి మన్ననలు అందుకుంటుంది. బొమ్మల కొలువు.. ఇది సంక్రాంతి వేళ ఇంటింటా కనిపించే అపురూపమైన దృశ్యం. రకరకాల బొమ్మలను పేర్చి ఇంటిని శోభాయమానంగా అలంకరించడం ఆనవాయితీ. దీనితో పాటు చిన్నారులకు రేగిపళ్లు, జోడిపళ్లు, చెరుకు ముక్కలతో దిష్టితీస్తారు. ఇరుగుపొరుగు వారిని పిలిచి అన్నదానం వంటి కార్యక్రమాలను చేపడతారు. పిండివంటల రుచి ఎంతో రుచికరమైన వంటలు చేసుకోవడం సం క్రాంతి రోజున వస్తోంది. ఈ సందర్భంగా చేసే నువ్వుల రొట్టెలు, కలియగూర, వేరుశనగబెల్లంతో చేసే ఉండలు శరీరానికి ఎంతో బలాన్నిస్తాయి. ఈ వర్తమానంలో విపరీతంగా ఉండే చలిని తుట్టుకునే శక్తిని ఇవ్వడమే కాకుండా రానున్న వేసవిలో ఎండను తట్టుకునే శక్తినిస్తాయి. అందుకే సంక్రాంతి వేడుకల్లో ఇవి ప్రత్యేకతనిస్తాయి. అయ్యారే గాలిపటం.. అవును గాలిపటం కనిపిస్తే చాలు..అయ్యారే అంటూ తాము తయ్యారే అంటారు చిన్నారులు.. సంక్రాంతి వేడుకలకు ముందునుంచి సంక్రాంతి వేడుకలు పూర్తయ్యేవరకూ గాలిపటాలు కనిపిస్తుంటాయి. అందుకే చిన్నారులకు అత్యంత ఇష్టమైన పండగగా నేటికీ సంక్రాంతి కనువిందు చేస్తోంది. వీరి ఆసక్తికి తగినట్టుగానే మార్కెట్లో రంగురంగుల గాలిపటాలు సందడి చేస్తున్నాయి. -
పోతన, పాల్కురికి ఉత్సవాలు
భాగవతం రచించిన బమ్మెర పోతన, తొలి తెనుగు విప్లవ కవి బసవ పురాణ గ్రంథకర్త పాల్కురికి సోమనాథుడి పేర్లతో ఉత్సవాలు నిర్విహ స్తామని తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు వరంగల్ సాక్షిగా ప్రకటించడం హర్షదాయకం. గత పాలకుల ఏలుబడిలో తెలంగాణ ప్రాంతానికి చెందిన కవులు, కళాకారులు, సాహితీవేత్తలు నిరాదరణకు గురయ్యారు. కనీసం తెలంగాణ ప్రాంతం ఇంతమంది ప్రజాకవులకు, పండితులకు, విద్వత్కవులకు జన్మని చ్చిందన్న ఎరుకను కూడా లేకుండా చేశారు. ఈ నేపథ్యంలో తెలంగాణ సంస్కృతికి ఆకరమైన ఇలాంటి మహనీయులను జ్ఞప్తికి తెస్తూ సాంస్కృతిక కార్యక్రమా లపై తెలంగాణ ప్రభుత్వం ఆసక్తి ప్రదర్శించడం ముదావహం. ఈ నేపథ్యంలో పోతన జన్మస్థలానికి ప్రాభవం తీసుకువస్తామని, ఆనాడు బమ్మెర పోతన దున్నిన నాలుగు ఎకరాల్లో స్మారకమందిరాన్ని నిర్మి స్తామని, రామాయణ మహాకావ్య సృష్టికర్త వాల్మీకి దేవస్థానం అభివృద్ధికి కూడా కృషి చేస్తానని ముఖ్యమంత్రి ప్రకటించాలి. దీంతో పాటు తెలంగాణ రైతులు, ప్రజలు తమ విముక్తి కోసం అరవైఏళ్ల క్రితం చేపట్టిన మహత్తర సాయుధ పోరాట చరిత్రను కూడా ప్రభుత్వం పాఠ్యాంశాలలో తప్పనిసరిగా చేర్చాలి. - దౌడ్ విజయకుమార్ పరకాల, వరంగల్ జిల్లా -
‘విశేష’నామ సంవత్సరం
పండుగలు, సెలవులు వస్తున్నాయంటే ఆనందపడని వారెవరు?.. అంబరాన్నంటే సంబరాలతో మన ముంగిటికి విచ్చేసిన 2015 సంవత్సరం ప్రతి యేడు కంటే ఎక్కువ సెలవులు, ఎన్నో వింతలు, విశేషాలను తీసుక్చొంది. ఈ ఏడాది పండుల్లో చాలా వాటిని గురువారం ఆక్రమించగా నాలుగు నెలల్లో ఐదు ఆదివారాలు రావడం విశేషం. ఒకే రోజు రెండు పండుగలు వచ్చే సందర్భాలూ ఉన్నాయి. శని, సోమవారాల్లో కొన్ని పండగలు వచ్చి ఆదివారంతో కలిపి జంట సెలవులు ఇప్పిస్తున్నాయి. ముఖ్యమైన వైకుంఠ ఏకాదశి, మిలాద్ ఉన్ నబీ పండుగలు ఈ ఏడాదిలో రెండుసార్లు రావడం విశేషం. అక్టోబర్‌లో 11 సెలవులు అక్టోబర్‌లో ఆదివారాలతో కలిపి ఎనిమిది సెలవులు రాగా, ఐచ్ఛిక సెలవులతో కలిపితే 11 సెలవులు రావడం విశేషం. వీటికి తోడు దసరా సెలవులు.. వెరసి ఈ నెలంతా సెలవులే సెలవులు. 4 నెలల్లో 5 ఆదివారాలు మార్చి, నవంబర్ నెలలు ఆదివారంతో ప్రారంభం అవుతుండగా మార్చి, మే, ఆగస్టు, నవంబర్ నెలల్లో ఐదేసి ఆదివారాలు వస్తున్నాయి. రంజాన్, మొహర్రం శనివారమే ముస్లింలకు పవిత్రమైన రంజాన్ మాసం శుక్రవారంతో ప్రారంభమవుతుంది. వీరు అత్యంత పవిత్రంగా జరుపుకొనే రంజాన్, మొహ్రం పండగలు మాత్రం శనివారం వచ్చాయి. ఒకేరోజు రెండు పండుగలు ⇒ఈ ఏడాది ఒకేరోజు రెండు పండుగలు.. అది కూడా ఐదు సందర్భాల్లో వస్తున్నాయి. ⇒జనవరి ఒకటి: నూతన సంవత్సరం, వైకుంఠ ఏకాదశి ⇒జనవరి 26: రథసప్తమి, గణతంత్ర దినోత్సవం ⇒మే 2: అన్నమయ్య జయంతి, బుద్ధ జయంతి ⇒సెప్టెంబర్ 24: బక్రీద్, ఓనమ్ ⇒నవంబరు 25: కార్తీక పౌర్ణమి, గురునానక్ జయంతి ఎనిమిది జంట సెలవులు ⇒జనవరి 25 ఆదివారం, 26 సోమవారం గణతంత్ర దినోత్సవం ⇒మార్చి 28 శనివారం, 29 ఆదివారం శ్రీరామ నవమి ⇒జూలై 18 శనివారం రంజాన్, 19 ఆదివారం ⇒ఆగస్టు 15 శనివారం స్వాతంత్య్ర దినోత్సవం, 16 ఆదివారం ⇒సెప్టెంబర్ 5 శనివారం కృష్ణాష్టమి, 6 ఆదివారం ⇒అక్టోబర్ 24 శనివారం మొహర్రం, 25 ఆదివారం ⇒డిసెంబర్ 24 మిలాద్ ఉన్ నబీ, 25 క్రిస్మస్, 26 బాక్సింగ్ డే (ఐచ్ఛిక సెలవు), 27 ఆదివారం గురువారానిదే ఆధిపత్యం నూతన సంవత్సరం గురువారంతో ప్రారంభమై, గురువారంతోనే (డిసెంబర్ 31) ముగు స్తుంది. అందుకేనేమో ఈ ఏడాది గురువారం ఆధిపత్యం కొనసాగనుంది. రెండు సంప్రదాయ పండుగలతో పాటు చిన్నాపెద్దా కలిపి మొత్తం 14 పండుగలు గురువారం రోజే వస్తున్నాయి. సంక్రాంతి, దసరా గురువారమే వచ్చాయి. 10 పండుగలతో శుక్రవారం రెండో స్థానంలో ఉంది. శనివారం 9 పండుగలు, బుధవారం 7, ఆది, సోమవారాల్లో 5, మంగళవారం 4 పండుగలు రానున్నాయి. ఒకే పండుగ రెండుసార్లు సాధారణంగా ఏ పండుగైనా ఏడాదిలో ఒకసారే వస్తుంది. ఈ ఏడాది మాత్రం రెండు పండుగలు రెండేసిసార్లు రావడం అరుదైన విషయం. ⇒ వైకుంఠ ఏకాదశి: జనవరి 1, డిసెంబర్ 21 ⇒మిలాద్ ఉన్ నబీ: జనవరి 4, డిసెంబర్ 24 18 ఏళ్ల తర్వాత...మళ్లీ అవే రోజులు ఈ ఏడాది కాలెండర్లో ఒక ఆశ్చర్యకరమైన సంఘటన చోటు చేసుకుంది. 1997వ సంవత్సరంలోని కొన్ని ఆసక్తికర తేదీలు, వారాలు తిరిగి 18 ఏళ్ల తర్వాతఈ ఏడాది వచ్చాయి. వాటిని పరిశీలిస్తే... 4-04-2015, 6-06-2015, 8-08-2015, 10-10-2015, 12-12-2015 రోజులు శనివారాలుగాఉన్నాయి. ఒకే తేదీ... నెల సంఖ్యలు కలిసి వచ్చాయి. ఇవే తేదీలు, వారాలు 1997లో కనిపించాయి. అంటే 18 ఏళ్ల తర్వాత మళ్లీ అవే తేదీలు..అవే రోజులు రావడం ఈ ఏడాది క్యాలెండర్లో ప్రత్యేకత . -
వనాల్లో ఉల్లాస పవనాలు..
జిల్లావ్యాప్తంగా తోటలు, తోపులు, తీరాల్లో తిరణాల వాతావరణం కనిపించింది. హిందువులకు పరమ పావనమైన కార్తికమాసంలో చివరిరోజు, ఆదివారం కలిసి రావడంతో వనసమారాధనలు విరివిగా జరిగాయి. వివిధ సంఘాలు, సామాజికవర్గాలే కాక బంధుమిత్రులతో కూడిన బృందాలు ఇళ్లను, ఊళ్లను వీడి పచ్చని ప్రకృతి ఒడికి, కడలి తీరానికి చేరారు. పగలంతా ఆటపాటలు, విందువినోదాలతో గడిపారు. సమారాధనల సందర్భంగా పెద్దలూ పిన్నలైపోయి కేరింతలు కొట్టారు. రకరకాల ఆటలు ఆడుతూ తుళ్లిపడ్డారు. అంతర్వేది నుంచి మారేడుమిల్లి వరకూ సందడి నెలకొంది. ఆలయాలను, క్షేత్రాలను సందర్శించే వారితో పాటు పాపికొండలకు షికారు వెళ్లిన వారి సంఖ్య గణనీయంగా పెరిగింది. వివిధ సామాజికవర్గాలు నిర్వహించిన వన సమారాధనలకు ఆయా వర్గాలకు చెందిన ప్రముఖులు, ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. -సాక్షి, రాజమండ్రి ఘనంగా కాపు వన సమారాధన మధురపూడి / రాజమండ్రి రూరల్ :రాజమండ్రి నగర కాపు సంఘం అధ్యక్షుడు, వైఎస్సార్సీపీ రాజమండ్రి రూరల్ కో ఆర్డినేటర్ ఆకుల వీర్రాజు అధ్యక్షతన కాపుల కార్తిక వనసమారాధన మధురపూడిలోని ఎస్బీ వెంచర్స్‌లో ఆదివారం ఘనంగా జరిగింది. తొలుత దేవాదాయ మంత్రి పి.మాణిక్యాలరావు, వైఎస్సార్ సీపీ సీజీసీ సభ్యులు జక్కంపూడి విజయలక్ష్మి తదితరులు రాష్ట్ర కాపు సంఘం అధ్యక్షుడు దివంగత మిరియాల వెంకట్రావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. మిరియాల వెంకట్రావు కోడలు సృజన జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. సంజీవని స్వచ్ఛంద రక్తదాతల సంస్థ, రోటరీ క్లబ్ (కాకినాడ)ల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రక్తదానశిబిరాన్ని మంత్రి మాణిక్యలరావు ప్రారంభించారు. మంత్రి మాణిక్యాలరావు, సినీ దర్శకుడు మారుతి తదితరులను సత్కరించారు. రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే డాక్టర్ ఆకుల సత్యనారాయణ, మేయర్ పంతం రజనీ శేషసాయి, జిల్లా పరిషత్ చైర్మన్ నామన రాంబాబు, డీసీసీ అధ్యక్షుడు కందుల దుర్గేష్, జిల్లా టీడీపీ అధ్యక్షుడు పర్వత చిట్టిబాబు, తాడేపల్లిగూడెం మున్సిపల్ చైర్మన్ బొలిశెట్టి శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యేలు వంగాగీత, కురసాల కన్నబాబు, రౌతు సూర్యప్రకాశరావు, సీనియర్ న్యాయవాది ఎస్జీ రామారావు, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి యర్రా వేణుగోపాలరాయుడు, సీసీసీ చానల్ ఎండీ పంతం కొండలరావు, జిల్లాకాపు సంఘ అధ్యక్షుడు వాసిరెడ్డి ఏసుదాసు, కాపు నాయకులు బస్సా ప్రభాకరరావు, తాడివాక రమేష్‌నాయుడు, శ్రీనివాసనాయుడు తదితరులు మాట్లాడారు. కార్తిక వనసమారాధన కమిటీ నిర్వాహకులు మారిశెట్టి రామారావు, గన్నాబత్తుల మహేష్‌లు కాపు, కాపు ఉపకులాలను బీసీల్లో చేర్చాలన్న దానితో పాటు మరో ఐదు ఆకాంక్షలను వ్యక్తం చేస్తూ తీర్మానాలను ప్రవేశపెట్టారు. ఈకార్యక్రమంలో ప్రముఖ కాంట్రాక్టర్ ఆర్.సుబ్బరాజు, బాలత్రిపురసుందరి, జక్కంపూడి చిన్ని, సుంకర శ్రీనివాస్, యెనుముల రంగబాబు, సుంకర చిన్ని, పలువురు కాపు ప్రముఖులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. కోటగుమ్మం (రాజమండ్రి) :సంఘీయులంతా ఐకమత్యంతో మెలగితే అభివృద్ధి సుసాధ్యమని గౌడ, శెట్టిబలిజ, శ్రీశయన, యాత నాయకులు పిలుపునిచ్చారు. స్థానిక ఎస్.కె.వి.టి. డిగ్రీ కాలేజీలో ఆదివారం గౌడ, శెట్టిబలిజ, ఈడిగ, శ్రీశయన, యాత కులాల కార్తిక సమారాధన జరిగింది. జిల్లా నుంచే కాక వివిధ జిల్లాల నుంచి ఆ సామాజికవర్గాలకు చెందిన దాదాపు 25 వేల మంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఉప ముఖ్యమంత్రి, రెవెన్యూ, స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖల మంత్రి కె.ఇ.కృష్ణమూర్తిని ఈ సందర్భంగా ఘనంగా సత్కరించారు. పలువురు నాయకులు మాట్లాడుతూ సంఘీయుల పురోభివృద్ధికి పలు సూచనలు చేశారు. గౌడ సంఘం రాష్ట్ర చైర్మన్ మార్గాని నాగేశ్వరరావు, కార్యనిర్వాహక అధ్యక్షుడు రెడ్డి సుబ్రహ్మణ్యం, గౌడ, శెట్టిబలిజ సంక్షేమ సంఘం గౌరవ అధ్యక్షుడు కాసాని భుజంగరావు, అధ్యక్షుడు రెడ్డి రాజు, ప్రధాన కార్యదర్శి డాక్టర్ అనుసూరి పద్మలత, పాలిక శ్రీను, బుడ్డిగ రవి, హితకారిణి సమాజం చైర్మన్ బుడ్డిగ శ్రీనివాస్, ఉపాధ్యక్షులు అంగర ఉమ, గేడి రాజు, ఆర్గనైజింగ్ సెక్రటరీ సూరంపూడి శ్రీహరి, వెలిగట్ల పాండురంగారావు, వల్లూరి ప్రకాష్, మట్టా శ్రీను తదితరులు పాల్గొన్నారు. అంతకు ముందు ఉప ముఖ్యమంత్రి కె.ఇ.కృష్ణమూర్తి వై జంక్షన్లో గౌడ, శెట్టిబలిజ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్వాతంత్య్ర సమర యోధుడు సర్దార్ గౌతు లచ్చన్న కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ, రాజమండ్రి మేయర్ పంతం రజనీ శేషసాయి, లచ్చన్న కుమారుడు, పలాస ఎమ్మెల్యే గౌతు శ్యామ్‌సుందర్ శివాజీ, శాసనమండలిలో ప్రభుత్వ విప్ చైతన్యరాజు, జెడ్పీ మాజీ చైర్మన్ చెల్లుబోయిన వేణు తదితరులు పాల్గొన్నారు. -
నగరానికి ఉత్సవశోభ..!
సాక్షి ముంబై: నగరంతోపాటు శివారు ప్రాంతాలు నవరాత్రి ఉత్సవాలకు ముస్తాబయ్యాయి. అన్ని ప్రాంతాల ప్రజలు నివసించే ముంబై, ఠాణేలో వివిధ సంప్రదాయాల్లో ఉత్సవాలు జరుపుకుంటున్నారు. బెంగాలీలు దుర్గాదేవి విగ్రహాలను నెలకొల్పి ప్రత్యేక పూజలు చేస్తుండగా.. గుజరాతీయులు ప్రత్యేక పూజల తోపాటు దాండియా ఆటలు ఆడుతూ వేడుకలు జరుపుకుంటున్నారు. తెలంగాణ ప్రజలు ఎక్కువగా ఉండే ప్రాంతాలు బతుకమ్మ పాటలతో మార్మోగుతున్నాయి. ఇలా ఎవరి సంప్రదాయానికి అనుగుణంగా వారు నవరాత్రి ఉత్సవాలను జరుపుకుంటుండడంతో ప్రతి పల్లె, పట్టణం, నగరంలో ఉత్సవశోభ కనిపిస్తోంది. తెలుగువారి బతుకమ్మ... దేశ, విదేశాల్లో ఎక్కడ ఉన్నా తెలుగు ప్రజలు తమ సంస్కృతి సంప్రదాయాలను కాపాడుకునేందుకు వేడుకలను వేదికలుగా చేసుకుంటున్నారు. దసరాకు ముందు తెలంగాణ ప్రాంతానికి చెందిన తెలుగు వారు జరుపుకునే బతుకమ్మ పండుగ ఈ వేడుకల్లో ప్రత్యేకాకర్షణగా నిలుస్తోంది. రంగురంగుల పూలను పేర్చి, రూపొందించిన బతుకమ్మలను ఇంటిముందున్న వాకిట్లో పెట్టి వాటి చుట్టూ తిరుగుతూ పాటలు పాడుతూ మహిళలు తొమ్మిదిరోజులపాటు బతుకమ్మ ఆడతారు. చివరి రోజు సద్దుల బతుకమ్మ ఉత్సవాన్ని భారీఎత్తున జరుపుకుంటారు. బతుకమ్మలను నీటిలో నిమజ్జనం చేస్తారు. ముంబైతో పాటు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో నివసించే తెలుగు ప్రజలు తమ పరిసరాల్లో బతుకమ్మ పండుగలను జరుపుకుంటున్నారు. అనేక ప్రాంతాల్లో చివరి రోజు మాత్రమే బతుకమ్మలను ఆడుతున్నప్పటికీ వర్లీ, బాంద్రా, అంధేరి, గోరేగావ్, బోరివలి, భివండీ, షోలాపూర్ తదితర ప్రాంతాల్లో తొమ్మిదిరోజుల పాటు బతుకమ్మను ఆడుతున్నారు. కిటకిటలాడుతున్న దేవీమాత ఆలయాలు... దసరా సందర్భంగా ముంబైతోపాటు రాష్ట్రంలోని మహాలక్ష్మి, మహాకాళి, దుర్గాదేవి, లక్ష్మీదేవి తదితర దేవి ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇందుకోసం ముందునుంచే ఆలయాయాలను విద్యుత్ దీపాలతోపాటు రంగురంగుల పుష్పాలతో అలంకరించారు. ముంబైతోపాటు రాష్ట్రవ్యాప్తంగా అనేక ప్రాచీనమైన ఆలయాలున్నాయి. వీటిలో శక్తి పీఠాలు కూడా ఉన్నాయి. వీటిలో ఉస్మానాబాద్ జిల్లాలోని తుల్జాభవానీ, కొల్హాపూర్‌లోని మహా లక్ష్మి, నాందేడ్ జిల్లా మావూర్లోని రేణుకా దేవీమాతా, నాసిక్ జిల్లాలోని సప్తశృంగి దేవీమాతా ఆలయాలున్నాయి. ఇక ముంబైలోని మహాలక్ష్మి, ముంబ్రాదేవి, ఠాణే జిల్లాలోని వజ్రేశ్వరీ, విరార్‌లోని జీవ్దనీ మాతా, ముంబ్రాలోని కొండపై ఉన్న ముంబ్రా దేవి తదితర ఆలయాలు కూడా నవరాత్రి వేడుకలకు ముస్తాబయ్యాయి. ఈ ఆలయాలన్నీ దసరా నవరాత్రుల సందర్భంగా భక్తులతో కిటకిటలాడుతున్నాయి. నవరాత్రులను పురస్కరించుకొని ప్రత్యేకంగా ముస్తాబు చేశారు. తొమ్మిదిరోజులపాటు భారీ ఎత్తున భక్తులు రానున్న నేపథ్యంలో ఎవరికి ఎలాంటి ఇబ్బంది కలుగకుండా భద్రతతోపాటు తాగు నీరు, ఇతర సదుపాయాలు కల్పించే ఏర్పాట్లు పూర్తిచేశారు. -
ఈ పూలు.. కనకమే!
ఆదోని రూరల్: శ్రావణ మాసంలో ఇష్టదైవానికిపూజలు చేయాలంటే హిందువులు భయపడుతున్నారు. శుభకార్యాలు చేసేవారు సైతం ఖర్చు పెరుగుతుందేమోనని ఆలోచిస్తున్నారు. పూల ధరలుఅమాంతంగా పెరగడమే ఇందుకు కారణం.మొన్నటి వరకు కిలో రూ. 250లోపు ఉన్న కనకాంబరాల ధర ఒక్కసారిగా రూ. 450కి చేరింది.మార్కెట్లో మూర పూలు రూ.25 పలుకుతున్నాయి. ఈ ధర ఇంకా పెరిగే అవకాశం ఉందనివ్యాపారులు చెబుతున్నారు. పెళ్లిళ్లు, శ్రావణమాసం రావడంతో పూలకు గిరాకీ పెరిగిందనిచెబుతున్నారు. వర్షాభావ పరిస్థితుల్లో సాగు ఆశాజనకంగా లేకపోవడం కూడా మరో కారణంగాతెలుస్తోంది. ఇదిలా ఉండగా ఆదోని మండలపరిధిలో పాండవగల్, కుప్పగల్, పెద్దతుంబళం,బల్లేకల్, కౌతాళం మండలంలోని ఎరిగేరతో పాటుమరికొన్ని గ్రామాల్లో వంద ఎకరాలకు పైగానే కనకాంబరాలను బోర్లకింద రైతులు సాగుచేస్తున్నారు.ఆషాఢ మాసంలో గిరాకీ లేక కేజీ రూ. 100ప్రకారం అమ్ముకున్నారు. రెండు రోజులుగా మంచిధర రావడంతో రైతులు సంతోషిస్తున్నారు. ఇదే ధరనిలకడగా ఉండకపోవచ్చని చెబుతున్నారు. -
వివక్షకు గురైన తెలంగాణ పండుగలు
తూప్రాన్: అరవై ఏళ్లుగా తెలంగాణలోని పండుగలు వివక్షకు గురయ్యాయని డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. తూప్రాన్‌లో ఆదివారం నిర్వహించిన బోనాల పండుగకు ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆలయ నిర్వాహకులు పూర్ణకుంభంతో ఆమెకు స్వాగతం పలికారు. అనంతరం డిప్యూటీ స్పీకర్ తెలంగాణ బోనం ఎత్తుకుని అమ్మవారికి సమర్పించి, ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో మాట్లాడుతూ స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి సీమాంధ్రుల పాలనలో వివక్షకు గురయ్యామని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారంలోకి వచ్చిన వెంటనే బతుకమ్మ, బోనాల పండుగలను రాష్ట్ర పండుగలుగా ప్రకటించారన్నారు. ప్రత్యేక తెలంగాణ కోసం ఎలాగైతే ఉద్యమించామో అలాగే తెలంగాణ పునర్నిర్మాణంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ చిట్టిమిల్ల శివ్వమ్మ, ఎంపీపీ గుమ్మడి శ్రీనివాస్, వార్డు సభ్యులు ఆంజాగౌడ్, షఫీ, మన్నేశ్రీనివాస్, నరేష్, రాజు, సలాక రాజేశ్వర్‌శర్మ తదితరులు పాల్గొన్నారు. లయన్స సేవలు ఆదర్శనీయం మెదక్: ప్రపంచంలో సేవను మించిన సుగుణం లేదని డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి పేర్కొన్నారు. లయన్స్‌క్లబ్ ఆఫ్ మెదక్ మంజీరా ఆధ్వర్యంలో ఆదివారం రాత్రి మెదక్ పట్టణంలోని మాయ గార్డెన్స్‌లో నిర్వహించిన జిల్లా అవార్డ్స్ నైట్ కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా మాట్లాడుతూ ప్రపంచ వ్యాప్తంగా లయన్స్‌క్లబ్ సేవలకు గుర్తింపు ఉందన్నారు. హరిత తెలంగాణ కోసం ప్రభుత్వం కృషి చేస్తున్నట్లుగానే లయన్స్ క్లబ్ సుమారు 2.50లక్షల మొక్కలు నాటడం హర్షనీయమన్నారు. రూ.2కోట్లతో వికలాంగులకు వివిధ రకాల పరికరాలు అందజేసి వారి జీవితాల్లో వెలుగులు నింపిన ఘనత లయన్స్క్లబ్కే సొంతమన్నారు. లయన్స్ సేవలు చూస్తుంటే తనకు కూడా క్లబ్లో పూర్తిస్థాయి సేవాకార్యక్రమాలు చేపట్టాలనిపిస్తోందన్నారు. అంతకు ముందు పద్మాదేవేందర్‌రెడ్డి వికలాంగులకు వివిధ పరికరాలు అందజేశారు. అనంతరం లయన్స్‌క్లబ్ వారు ఆమెను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ మల్లికార్జున్‌గౌడ్, మాజీ మల్టిపుల్ కౌన్సిల్ అధ్యక్షులు బాబురావు, జిల్లా గవర్నర్లు సునీతా ఆనంద్, జనార్దన్‌రెడ్డి, జిల్లా వైస్ ప్రథమ గవర్నర్ రాజ్‌కుమార్, 2వ వైస్ గవర్నర్ ఓబుల్ రెడ్డి, జిల్లా కో ఆర్డినేటర్ డాక్టర్ సురేందర్, కేబినెట్ కార్యదర్శి రమణరాజు, కోశాధికారి అమర్నాథ్రావు, లయన్స్‌క్లబ్ ఆఫ్ మెదక్ మంజీరా అధ్యక్షుడు రాంకిషన్, కార్యదర్శి నాగరాజుగౌడ్, కోశాధికారి శ్రీనివాస్‌తోపాటు సభ్యులు పాల్గొన్నారు. -
ఆరోగ్యానికి సెనగలు
శ్రావణ మాసం... ఇంటింటా సెనగలు కొలువుతీరే మాసం... నోములు... వ్రతాలు... పూజలు... పండుగలు... ఇళ్లన్నీ ఆకుపచ్చని తోరణాలు, పసుపు పచ్చని చేమంతులతో కళకళలాడుతుంటాయి... ఎవరో ఒక అతిథి ఇంటికి రావడం... వాయినాలు ఇవ్వడం... పుచ్చుకోవడం... ఏదైతేనేం... ఇల్లంతా సెనగలే సెనగలు... ఒక్కసారి ఆలోచనకు పదును పెట్టండి... సెనగలతో వంటలను అలంకరించండి... సంప్రదాయంగా చేసే హయగ్రీవతో పాటు... పాఠోళీ, గుత్తి కూరలు... ఎన్నో... ఎన్నెన్నో చేసుకుందాం... శరీరానికే కాదు ఆరోగ్యానికి కూడా నగలు సమకూర్చుకుందాం... సెనగల కూర కావ లసినవి: సెనగలు - కప్పు; పసుపు - పావు టీ స్పూను; ఉల్లి తరుగు - అర కప్పు; చిన్న ఉల్లిపాయలు - 4 (సూపర్ మార్కెట్లో దొరుకుతాయి); పచ్చి మిర్చి - 3 (పొడవుగా మధ్యకు కట్ చేయాలి); కరివేపాకు - 4 రె మ్మలు; మిరప్పొడి - టీ స్పూను; పసుపు - టీ స్పూను; ఎండు మిర్చి - 2; కొబ్బరి తురుము - అర కప్పు; చిన్న ఉల్లిపాయలు - 2 (సన్నగా తరగాలి); ధనియాలు - ఒకటిన్నర టేబుల్ స్పూన్లు (ధనియాల పొడి కూడా వాడుకోవచ్చు) మసాలా కోసం: సోంపు - పావు టీ స్పూను, ఏలకులు - 2, లవంగాలు - 3, దాల్చినచెక్క - చిన్న ముక్క, మిరియాలు - నాలుగు గింజలు తయారి: సెనగలను ముందు రోజు రాత్రి నానబెట్టాలి మరుసటి రోజు ఒక గిన్నెలో... నానబెట్టిన సెనగలు, ఉప్పు, పసుపు వేసి కుకర్‌లో ఉడికించాలి (ఉడికించిన నీళ్లను పక్కన ఉంచి, గ్రేవీ కోసం వాడుకోవాలి) బాణలిలో టీ స్పూను నూనె వేసి కాగాక ధనియాలతో పాటు మిగిలిన మసాలా దినుసులు కూడా వేసి వేయించాలి చిన్న ఉల్లిపాయల తరుగు జత చేసి బాగా వేయించాక, కొబ్బరి తురుము వేసి గోధుమ రంగులోకి వచ్చేవరకు వేయించి, దించి చల్లారాక, మిక్సీలో వేసి మెత్తగా చేయాలి మరొక బాణలిలో కొబ్బరి నూనె వేసి కాగాక, ఆవాలు, ఎండు మిర్చి వేసి వేయించాలి ఉల్లి తరుగు, చిన్న ఉల్లిపాయల తరుగు, పచ్చి మిర్చి తరుగు, కరివేపాకు వేసి వేయించాలి పసుపు, మిరప్పొడి జత చేసి కొద్ది సేపు వేయించి, ఉడికించి ఉంచుకున్న నీళ్లు పోసి, మరిగాక కొబ్బరి పేస్ట్, ఉడికించిన సెనగలు వేసి బాగా కలిపి ఐదు నిమిషాలు ఉడికించాలి. బెండకాయ గుత్తి కూర కావలసినవి: బెండకాయలు - పావు కేజీ; నూనె - టేబుల్ స్పూను; స్టఫింగ్ కోసం: సెనగలు - కప్పు (ఉడికించి మిక్సీలో వేసి మెత్తగా పేస్ట్ చేయాలి); పల్లీలు - 2 టేబుల్ స్పూన్లు (వేయించాలి); నువ్వులు - టేబుల్ స్పూను (వేయించాలి); అవిసె గింజలు - టేబుల్ స్పూను (వేయించాలి); పచ్చి మిర్చి ముద్ద - 2 టేబుల్ స్పూన్లు; అల్లం వెల్లుల్లి ముద్ద - 2 టీ స్పూన్లు; పసుపు - పావు టీ స్పూను; నిమ్మరసం - 2 టేబుల్ స్పూన్లు; కొత్తిమీర - గుప్పెడు; ఉప్పు - తగినంత తయారి: అవిసె గింజలు, నువ్వు పప్పు, పల్లీలను విడివిడిగా మిక్సీలో వేసి పొడి చేసి పక్కన ఉంచాలి ఒక పాత్రలో... తయారుచేసి ఉంచుకున్న సెనగల ముద్ద, అల్లం వెల్లుల్లి ముద్ద, పచ్చి మిర్చి ముద్ద, పసుపు, నిమ్మరసం, కొత్తిమీర, ఉప్పు వేసి అన్నీ కలిసేలా కలపాలి బెండకాయలను శుభ్రంగా కడిగి తడిపోయే వరకు ఆరబెట్టి, రెండు వైపులా తొడిమలు తీసి, మధ్యకు గాటు పెట్టాలి. (బెండకాయ ముక్కలు కాకుండా జాగ్రత్త పడాలి) ముందుగా తయారుచేసి ఉంచుకున్న స్టఫింగ్ మిశ్రమాన్ని బెండకాయలలో జాగ్రత్తగా స్టఫ్ చేయాలి వెడల్పాటి బాణలిలో నూనె వేసి కాగాక బెండకాయలను ఒక్కొక్కటిగా వేసి, బాగా కలిపి మూత పెట్టి పది నిమిషాలు ఉంచాలి పల్లీ, నువ్వులు, అవిసె గింజల పొడుల మిశ్రమం వేసి కలిపి దించేయాలి. పాఠోళీ కావ లసినవి: సెనగలు - రెండు కప్పులు; ఉల్లి తరుగు - కప్పు; పచ్చి మిర్చి తరుగు - 3 టీ స్పూన్లు; కరివేపాకు - 4 రెమ్మలు; అల్లం తురుము - టీ స్పూను; నూనె - చిన్న గిన్నెడు; ఎండు మిర్చి - 4; సెనగపప్పు - 2 టీ స్పూన్లు; మినప్పప్పు - 2 టీ స్పూన్లు; ఆవాలు - టీ స్పూను; జీలకర్ర - టీ స్పూను, ఉప్పు - తగినంత తయారి: సెనగలను ముందు రోజు రాత్రి నీళ్లలో నానబెట్టాలి మరుసటి రోజు నీరు తీసేసి... అల్లం తురుము, పచ్చి మిర్చి, ఉప్పు జత చేసి మిక్సీలో వేసి మెత్తగా చేసి పక్కన ఉంచాలి బాణలిలో రెండు టేబుల్ స్పూన్ల నూనె వేసి కాగాక, సెనగ పప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండు మిర్చి ఒకదాని తరవాత ఒకటి వేసి వేయించాలి కరివేపాకు, ఉల్లి తరుగు వేసి బాగా వేగాక, సెనగల ముద్ద వేసి కలిపి మూత ఉంచాలి (సన్నని మంట మీద మాత్రమే చేయాలి) మధ్యమధ్యలో బాగా కలుపుతూ నూనె జత చేస్తుండాలి బాగా విడివిడిగా అయ్యేవరకు ఉంచి దించేయాలి ఇది అన్నంలోకి చాలా రుచిగా ఉంటుంది. హయగ్రీవ కావలసినవి: సెనగలు - కప్పు; బెల్లం తురుము - ఒకటిన్నర కప్పులు; కొబ్బరి తురుము - అర కప్పుస; ఏలకుల పొడి - టీ స్పూను; నెయ్యి - టేబుల్ స్పూను; జీడిపప్పు పలుకులు - 10; కిస్మిస్ - రెండు టేబుల్ స్పూన్లు తయారి: నానబెట్టి ఉంచుకున్న సెనగలకు రెండు కప్పులు నీళ్లు జత చేసి ఉడికించాలి ఒక పెద్ద పాత్రలో ఉడికించి ఉంచుకున్న సెనగలు, బెల్లం తురుము, కొబ్బరి తురుము, ఏలకుల పొడి వేసి స్టౌ మీద ఉంచాలి. (మంట బాగా తగ్గించాలి) బెల్లం పూర్తిగా కరిగి మిశ్రమం చిక్కబడ్డాక దింపేయాలి చిన్న బాణలిలో నెయ్యి వేసి కరిగాక జీడిపప్పు పలుకులు, కిస్మిస్ వేసి వేయించి, సిద్ధంగా ఉన్న హయగ్రీవలో వేసి కలపాలి. -
శాంతియుతంగా పండుగలు
బహదూర్‌పురా: రంజాన్, బోనాల పండుగను ప్రజలందరూ శాంతియుత వాతావరణంలో జరుపుకోవాలని నగర పోలీసు కమిషనర్ మహేందర్‌రెడ్డి అన్నారు. చౌమహల్లా ప్యాలెస్‌లో బుధవారం నగర పోలీసుల కమిషనర్ ముస్లింలకు ఇఫ్తార్ విందు ఇచ్చారు. జామే నిజామియా ఉలేమాలు సందేశాన్ని ఇచ్చిన అనంతరం కమిషనర్ ప్రసంగించారు. పాతబస్తీ ప్రజలందరూ గంగా, జమునా రీతిలో రంజాన్, బోనాల ఉత్సవాలను జరుపుకోవాలన్నారు. రంజాన్, బోనాల పండుగ ఉత్సవాలను శాంతియుతంగా నిర్వహించేందుకు పెద్ద ఎత్తున పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశామన్నారు. పాతనగరంలో రంజాన్ మాసమే కాకుండా మిగతా అన్ని నెలలు కూడా ప్రజలు శాంతియుతంగా జరుపుకోవాలన్నారు. పాతబస్తీ మతసామరస్యానికి సూచిక అనేది రంజాన్, బోనాల పండుగ ద్వారా తెలపాలన్నారు. జాయింట్ సీపీ మల్లా రెడ్డి మాట్లాడుతూ రంజాన్ నెల మతసామరస్యాన్ని, మనవత్వాన్ని చాటే నెల అన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర డీజీపీ అనురాగ్ శర్మ, యాంటీ కరప్షన్ బ్యూరో డెరైక్టర్ జనరల్ ఏకే ఖాన్, ఎమ్మెల్యేలు అహ్మద్ బలాల, పాషా ఖాద్రీ, ఖలీం సాహేబ్, మైనార్టీ కమిషన్ చైర్మన్ అబీద్ రసూల్ ఖాన్, జాయింట్ సీపీ ఎం.ఎం. భగత్, బిలాల్ కమిటీ చైర్మన్, డీసీపీలు ఎస్.ఎస్.త్రిపాఠి, కమలాసన్ రెడ్డి, శివకాశి దమోదర్, జామే నిజామియా ముఫ్తీలు, ఉలేమాలు, ముస్లింలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. -
ఆధ్యాత్మిక శోభ
జంట పండుగలతో అలరారనున్న మహానగరం ఓవైపు బోనాలు, మరోవైపు పవిత్ర రంజాన్ ప్రార్థనలు నేడు గోల్కొండ కోటలో బోనాలు మతసామరస్యం వెల్లివిరిసేలా నెలరోజుల పండుగలు సాక్షి, సిటీబ్యూరో: జంట పండుగల వేళ మహానగరం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. మతసామరస్యం వెల్లివిరిసేలా అన్ని వర్గాల వారు భక్తిపూర్వకంగా జరుపుకొనే పండుగలివి. భిన్న సంస్కృతుల మధ్య ఐక్యతకు చాటే సమయమిది. ఓ వైపు ఆనందం ఉట్టిపడేలా జరుపుకొనే ఆషాఢం బోనాల జాతర.. మరోవైపు ముస్లింలు అత్యంత భక్తిశ్రద్ధలతో ఆచరించే పవిత్ర రంజాన్ ప్రార్థనలు ఒకేసారి రావడంతో నగరం ప్రత్యేకంగా ముస్తాబైంది. ఆషాఢంలో అమ్మవారి బోనాలు, పోతరాజుల నృత్యాలు విశేషంగా ఆకట్టుకోనున్నాయి. ఆషాఢ మాసం ప్రవేశించడంతో ఆదివారం భక్తజనసందోహం నడుమ గోల్కొండ జగదాంబిక అమ్మవారి ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. వందల ఏళ్లుగా భక్తుల ఆరాధ్యదైవంగా, కొంగుబంగారంగా వెలుగొందుతోన్న జగదాంబిక అమ్మవారికి బోనాలు సమర్పించి భక్తులు మొక్కులు చెల్లించుకోనున్నారు. ఓ వైపు బోనమెత్తుకొని బారులు తీరే మహిళలు, మరోవైపు గుగ్గిలం, మైసాక్షిల పరిమళాలు, పోతరాజుల విన్యాసాలు అమ్మవారిని వేనోల్లా కీర్తిస్తూ ఆలపించే పాటలతో నగరం పులకించిపోనుంది. గోల్కొండలో ప్రారంభమయ్యే జాతర వరుసగా పాతబస్తీ, సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి ఆలయంలో, ఆ తరువాత నగరంలోని అన్ని ప్రాంతాల్లో జరిగే ఉత్సవాలతో నెల పాటు కొనసాగుతుంది. మరోవైపు రంజాన్ ప్రార్థనలు.. మరోవైపు ముస్లింలు ఎంతో పవిత్రంగా భావించే రంజాన్ మాసం కూడా ప్రారంభమవుతుంది. ఇది కూడా నెల పాటు కొనసాగనుంది. రోజూ ఉదయం నుంచి సాయంత్రం వరకు అల్లాను ఆరాధిస్తూ, ఉపవాసాలతో మసీదుల్లో ప్రార్థనలు చేస్తుంటారు. ప్రతి ఇంట్లోనూ ఆధ్యాత్మిక వాతావరణమే నెలకొంటుంది. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఇంటిల్లిపాది కఠోరమైన ఉపవాసదీక్షలు పాటిస్తారు. అన్ని వర్గాలతో కలిసి ఇఫ్తార్ విందుల్లో పాల్గొంటారు. పేద ముస్లింలను ఆదుకునేందుకు అందజేసే ఆర్థిక సహాయం రంజాన్ మాసంలోని గొప్పతనాన్ని ఆవిష్కరించనుంది. వరుస పండుగలు... ఆషాఢం తరువాత శ్రావణంలోనూ వరుగా పండుగలే వస్తున్నాయి. శ్రావణమాసం కూడా పవిత్రమైంది. ఆ నెలంతా భక్తులు, మహిళలు పూజలు, వ్రతాలు, నోములతో గడిపేస్తారు. గణేశ్ నవరాత్రి ఉత్సవాలు, బతుకమ్మ పండుగ, దసరా ఉత్సవాలతో నగరంలో ఆధ్యాత్మికత ఉట్టిపడనుంది. ఈ వరుస పండుగలు మానసిక ప్రశాంతతను, ఆహ్లాదాన్ని, ప్రేమ, ఆప్యాయతలను పంచుతాయి. ఆధ్యాత్మిక భావాలను కలిగించడంతోపాటు, మానవ సంబంధాల్లోని మహోన్నతమైన విలువలను ఆవిష్కరిస్తాయి. -
ఔరా... ఆవులే క్యాన్వాసులా!
కళాత్మకం వేసవి వస్తే పలు ప్రాంతాల్లో పలు రకాల ఫెస్టివల్స్, కార్నివాల్స్ జరుగుతుంటాయి కదా! లగ్జెంబర్గలో కూడా ఓ ఫెస్టివల్ జరుగుతుంది. దాని గురించి తెలిస్తే కాస్త సరదాగా, కాస్త విచిత్రంగా కూడా అనిపిస్తుంది. మార్చి నెల రాగానే ఆ దేశంలో సందడి మొదలవుతుంది. అందరూ ఆవుల బొమ్మలు తయారు చేయడంలో మునిగిపోతారు. పలు రకాల లోహాలు, చెక్క, కాంక్రీట్ వంటి వాటితోటి అందరూ ఆవు బొమ్మలను తయారు చేసుకుంటారు. వీటి మీద తమకు నచ్చిన చిత్రాలను గీసి, వాటికి మంచి మంచి రంగులు వేస్తారు. ఏప్రిల్ నెల వచ్చేసరికి మొదలవుతుంది అసలు సందడి. అందరూ తమ ఇళ్లముందు తాము తయారుచేసిన ఆవు బొమ్మల్ని ప్రతిష్ఠిస్తారు. వ్యాపారస్తులైతే తమ షాపుల ముందు వీటిని పెడతారు. నీ ఆవు బాగుందా, నా ఆవు బాగుందా అంటూ ఆరాలు తీస్తుంటారు. దాదాపు నవంబర్ నెల వరకూ ఈ తంతు నడుస్తుంది. ఇది ఆ దేశంలో ఎంతోకాలంగా ఉన్న సంప్రదాయం. ఏటా ఆ దేశంలో రంగురంగుల ఆవుల పండుగ జరుగుతూనే ఉంటుంది. ఆ ఆవుల అందాలు చూడటానికి విదేశాల నుంచి సైతం సందర్శకులు వస్తుంటారు! -
హోళీ.. యువతకు రంగేళీ!
భారత దేశాన్ని పండగల దేశం అంటారు. దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఎప్పుడు ఎదో ఒక పండగ కార్యక్రమంతో సందడి సందడిగా ఉంటుంది. దేశవ్యాప్తంగా ప్రజల్ని ఏకం చేసే పండుగల్లో హోళీ ఒకటి. హోళీ పండుగ మతాలు, కులాలు, ప్రాంతాల కతీతంగా, చిన్న పెద్ద అనే తేడాలేకుండా అందరూ కలిసి హోళీ జరుపుకోవడం ఎన్నో ఏళ్లుగా వస్తోంది. వసంత రుతువు వచ్చిన సందర్భంగా ఫాల్గుణ శుద్ధ పూర్ణిమ రోజున జరుపుకునే పండగను దేశంలోని వివిధ ప్రాంతాల్లో మహా పాల్గుణి, హోలికా, హోలికా దహన్, హోళీ అనే పేర్లతో పిలుస్తుంటారు. వివిధ ప్రాంతాల్లో ఏ పేరుతో హోళీని జరుపుకున్న రంగులు పండగగానే ప్రతి ఒక్కరి మనసులో ముద్ర వేసుకుంది. పసిపిల్లు, పెద్దలు, ఆడ, మగ అనే బేధం లేకుండా..స్నేహితులు, బంధువులు ఒకరిపై మరొకరు రంగులు చల్లుకుంటూ ఎంతో ఉత్సాహంగా జరుపుకునే పండగ హోళీ. వసంత కాలంలో వచ్చే రంగుల పండుగను, హోలీ, కాముని పున్నమి, డోలికోత్సవముగా జరుపుకుంటారు. భారత్ లోనే కాకుండా నేపాల్, బంగ్లాదేశ్ వంటి తదితర దేశాల్లో ప్రజలు ఆనందంగా ఈ పండుగను వైభవంగా జరుపుకుంటారు. గుజరాత్ రాష్ట్రంలో 'గోవిందా ఆలా రే.. జరా మట్కి సంభాల్ బ్రిజ్ బాలా' అంటూ జానపద గీతాలతో కృష్ణుడిని ఆరాధిస్తూ యువతీ, యువకులు రంగుల్లో మునిగి తేలుతారు. హోళీ రోజున పాలు, పెరుగు ఉన్న కుండను తాడు కట్టి 'ఉట్టి కొట్టడం' అనే ఆటను ఆడుకుంటారు. ఉట్టి కొట్టడానికి యువకులు పిరమిడ్ రూపంలో ఏర్పడి పాలు, పెరుగు ఉన్న ఉట్టిని కొట్టడం హోళీ సందర్బంగా ఎన్నో శతాబ్దాలుగా గుజరాత్ సంస్కృతిలో ఓ భాగమైంది. ఎన్నో సంస్కృతులు, ఆచారాలున్న భారత దేశంలో వివిధ ప్రాంతాల్లో వివిధ రకాలుగా హోళీని జరుపుకుంటారు. పాల్గుణ శుద్ద పూర్ణిమ రోజున కృష్ణ భగవానుడిని ఊయలలో వేసిన వేడుకకు గుర్తుగా బెంగాల్ లో డోలికోత్సవాన్ని జరుపుకుంటారు. రాక్షస జాతికి చెందిన హిరణ్యకశ్యపుడిని విష్ణువు రూపంలో ఉన్న నరసింహస్వామి సంహరించడానికి గుర్తుగా కూడా హోళీని జరుపుకుంటారని చరిత్ర వెల్లడిస్తోంది. హిరణ్య కశ్యపుడి సోదరి హోళికా దహనాని గుర్తుగా ప్రతి ఏటా హోళికా దహనం చేస్తారని చెప్పుకుంటారు. హోళీకి సంబంధించి ఏన్నో విషయాలను, కథలను పురాణాలు వెల్లడిస్తున్నాయి. దేశ వ్యాప్తంగా అందరూ ఆడుకునే హోళీ పండగను బాలీవుడ్, టాలీవుడ్ లో నిర్మించిన పలు చిత్రాల్లో పెద్ద పీట వేశారు. 'హోళీ కే దిన్' అంటూ షోలే చిత్రంలో హేమామాలిని, ధర్మేంద్రలపై చిత్రీకరించిన పాట అత్యంత ప్రాచుర్యం పొందింది. అలాగే 'సిల్ సిలా' చిత్రలో 'రంగ్ బర్సే' అంటూ అమితాబ్ వేసిన స్టెప్పులు భారతీయ హోళీ సంస్కతిలో ఓ భాగమైంది. హోళీ రోజున రంగ్ బరసే అంటూ యువతీ యువకులు చిందేడం చూస్తూనే ఉంటాం. ఇంకా లమ్హే చిత్రంలో 'మోహే చేడో నా', భాగ్ భన్ చిత్రంలో 'హోరి ఖేలే రాఘువీరా' మంగళ్ పాండే చిత్రంలో దేఖో ఆయీ హోళీ అనే పాటలు ఇప్పటికి మనలో ఉత్సాహాన్ని నింపుతాయి. ఇవియే కాకుండా డర్ చిత్రంలో అంగ్ సే ఆంగ్ లగానా సాజన్, కామ్ చోర్ చిత్రంలో 'మాల్ దే గులాల్ మోహే, ఆయే హోలీ ఆయే రే', జక్మీ చిత్రంలో ఆయీ రే ఆయీ రే హోలీ, నవరంగ్ చిత్రంలో 'అరే జా రే హట్ నత్కత్', కటీ పతంగ్ చిత్రంలో 'ఆజ్ నా చోడంగే బస్ హమ్ జోలీ ఖేలేంగే హమ్ హోళీ', కోహినూర్ చిత్రంలో 'తన్ రంగ్ లో జి ఆజ్ మన్ రంగ్ లో' ముంబై సే ఆయే మేరే దోస్త్.. 'కోయి భీఘా హై రంగ్ సే' మదర్ ఇండియాలో 'హోళీ ఆయీ రే కన్హాయీ' పాటలే కాకుండా ఇటీవల వచ్చిన ఇత్నా మాజా క్యో ఆరా రహాహై.. అంటూ యే జవానీ హై దీవాని, రామ్ లీలా, గూండే చిత్రాల్లో పాటలు కూడా ప్రేక్షకులను ఆలరించడమే కాకుండా సంస్కృతిలో భాగమయ్యాయి. బాలీవుడ్ కు తామేమి తగ్గమనే రీతిలో టాలీవుడ్ లో కూడా హోళీ పండగకు పెద్ద ప్రాధాన్యత ఇచ్చారు. కొట్టు కొట్టు రంగు తీసి కొట్టు.. రంగులోనే లైఫ్ ఉందిరా.. కొట్టు కొట్టు డోల్ దెబ్బ కొట్టూ ఒంటి నిండా సత్తువుందిరా.. హోళీ హోళీ అంటూ నాగార్జున 'మాస్' చిత్రంలో దర్శకుడు లారెన్స్.. రంగు రబ్బా రబ్బా అంటుంది రంగు బరిసే.. గుండే షబ్బా షబ్బా అంటూ.. జూనియర్ ఎన్టీఆర్ 'రాఖీ' లో చిత్రంలో, రంగేళి హోళీ..రంగా కే మా కేళి.. ఎప్పుడు రమ్మంటే అప్పుడు రావాలి అంటూ ప్రభాస్ తో కృష్ణ వంశీ యువతీ, యువకుల్లో జోష్ ను పెంచారు. ప్రతి ఏటా వచ్చే హోళీ పండగ జాతి సమైక్యతను పెంపొదించడమే కాకుండా కుల, మతాలకతీతంగా దేశ ప్రజలందర్ని ఒక్కటి చేస్తుందని ఆశిద్దాం! -
దయనీయంగా దర్జీల జీవితం
విడవలూరు/ గూడూరు టౌన్/ కోట, న్యూస్‌లైన్: ‘ఏరా పండక్కి కొత్త బట్టలు కుట్టించుకున్నావా. ఇంకా లేదా. టైలర్ రాము దగ్గరకెళ్లి నీ ఆల్తి బట్టలివ్వు. పండగొచ్చేస్తుంది. వాళ్లు మళ్లీ బిజీ అయిపోతారు’ ఇవి గతంలో విన్పించే మాటలు. పండగైనా, శుభకార్యమైనా ప్రతి ఇంట్లో అందరూ టైలర్(ద ర్జీ) వద్ద కొత్త దుస్తులు కుట్టించుకునే వారు. ఇదంతా పదేళ్ల క్రితం నాటి హడావుడి. ప్రస్తుతం కాలం మారింది. మార్కెట్‌ను ముంచెత్తుతున్న రెడిమేడ్ దుస్తులపై అన్ని వర్గాల ప్రజలు ఆసక్తి చూపుతుండటంతో టైలర్లకు ఆదరణ కరువవుతోంది. ఈ క్రమంలో ఎప్పుడూ బిజీగా ఉండే టైలర్లు పండగలు, శుభకార్యాల సీజన్లోనూ చేతి నిండా పనిలేక దయనీయ పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. ప్రజలు ఏరోజుకారోజు అవసరాన్ని బట్టి అప్పటికప్పుడు రెడిమేడ్ దుస్తుల దుకాణాలను ఆశ్రయిస్తుండటంతో టైలర్లకు ఏడాదిలో మూడు నెలలు కూడా పని దొరకని పరిస్థితి నెలకొంది. అయినప్పటికీ ఎక్కువ మంది నమ్ముకున్న వృత్తిని వదులుకోలేకపోవడంతో ఉన్నవారిలో పోటీ పెరిగింది. ఆధునిక పోకడలకు అనుగుణంగా దుస్తులు కుడుతున్న వారికే ఆదరణ లభిస్తోంది. బూట్‌కట్, పెన్సిల్ కట్ అని యువత కోరినవిధంగా దుస్తులు కుట్టిన వారికే పని దొరుకుతోంది. ఈ క్రమంలో పల్లెల్లోని టైలర్ల పరిస్థితి దారుణంగా మారింది. పల్లెల్లో ఎక్కువ మంది మహిళలు ఈ వృత్తిపైనే ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. వీరిలో ఆధునిక పోకడలకు అనుగుణంగా మహిళా దుస్తులు కుడుతున్న వారికి ఆదరణ లభిస్తోంది. నెల్లూరు, గూడూరు, కావలి, బుచ్చిరెడ్డిపాళెం, కోట, కోవూరు తదితర ప్రాం తాల్లో మహిళల దుస్తులు కుట్టే టైలర్లు కొంతమేర ఆదరణ పొందుతున్నారు. మొత్తం మీద జిల్లాలో సుమారు 13,500 మంది టైలర్లు ఉన్నారు. వీరిలో సగం మందికి కూడా చేతి నిండా పని దొరకని పరిస్థితి. ఏళ్ల తరబడి మిషన్లకే పరిమితం కావడంతో కొందరు దృష్టి లోపం, కీళ్ల నెప్పుల సమస్యలను ఎదుర్కొంటున్నారు. వీరి గోడును పట్టించుకునే పాలకులు కరువయ్యారు. మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో టైలర్ల సమస్యలను గుర్తిం చారు. వాటి పరిష్కారానికి చర్యలు తీసుకునేలోపే ఆయన మృతిచెందడంతో టైలర్ల పరిస్థితి మళ్లీ మొదటికొచ్చింది. ఇప్పటికైనా పాలకులు తమ సంక్షేమంపై దృష్టిపెట్టాలని టైలర్లు కోరుతున్నారు. ప్రభుత్వం స్పందించాలి పూర్తిగా ఆదరణ కోల్పోతున్న మా సంక్షేమంపై ప్రభుత్వం దృష్టిపెట్టాలి. రెడిమేడ్ దుస్తుల కారణంగా మేము జీవనాధారం కోల్పోతున్నాం. ఇప్పటికైనా పాలకులు స్పందించి మాకు పూర్తి న్యాయం జరిగేలా చూడాలి. శ్రీనివాసులు (టైలర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు) పని కరువైంది ఇటీవల కాలంలో మా వద్ద దుస్తులు కుట్టించుకునే వారు తగ్గిపోయారు. గతంలో కళకళలాడిన దుకాణాలు ప్రస్తుతం వెలవెలబోతున్నాయి. పనులు లేకపోవడంతో కొందరినే పనికి రమ్మంటున్నా. మిగిలిన మిషన్లు ఖాళీగా ఉంటున్నాయి. మల్లికార్జున్, టైలర్, గూడూరు మోడల్ టైలరింగ్కే గిరాకి నేను 30 ఏళ్లుగా టైలరింగ్‌తో ఉపాధి పొందుతున్నా. అప్పట్లో చీరలకు అంచు,ఫాల్స్‌తో పాటు జాకెట్లు కుట్టేవాళ్లం. ఇప్పుడు వర్క్శారీస్ అంటూ మహిళలు ప్రత్యేకత కనబరుస్తున్నారు. వారి అభిరుచికి అనుగుణంగా దుస్తులు కుడితేనే ఆదరిస్తున్నారు. గుణ, టైలరింగ్ శిక్షకురాలు, కోట -
కళా పరిరక్షణే యువజనోత్సవాల ధ్యేయం
ఖమ్మం ఖిల్లా, న్యూస్‌లైన్: గ్రామీణ కళలను పరిరక్షించి భావితరాలకు అందించేందుకు, పల్లె కళాకారుల్లో ప్రతిభాపాటవాలను వెలికితీసేందుకు యువజనోత్సవాలు దోహదపడుతాయని జిల్లా గృహ నిర్మాణశాఖ సంచాలకులు వైద్యం భాస్కర్ పేర్కొన్నారు. నగరంలోని షాదీఖానాలో జిల్లా యువజన సర్వీసుల శాఖ-సెట్‌కమ్ ఆధ్వర్యంలో గురువారం జిల్లా స్థాయి యువజనోత్సవాలు ఘనంగా జరిగాయి. సెట్‌కమ్ ముఖ్య కార్యనిర్వహణధికారి ఎస్. వెంకటరంగయ్య అధ్యక్షతన జరిగిన ఈ వేడులను ఉద్దేశించి ముఖ్య అతిథి హౌసింగ్ పీడీ వైద్యం భాస్కర్ మాట్లాడారు. యువ క ళాకారులు తాము ఎంచుకున్న అంశంలో అత్యున్నత ప్రతిభ కనబర్చేందుకు నిరంతరం శ్రమించాలన్నారు. ప్రతిభ కనబరిచే కళాకారులకు ఆర్థికంగా అండగా ఉండేందుకు సమాజం ఎప్పుడూ ముందుంటుందన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆకాంక్ష త్వరలో సాకరమయ్యే అవకాశం ఉన్నందున ఈ ప్రాంత సంస్కృతి, సంప్రదాయాలు, కళలను పరిరక్షించాలని, వాటిని భావితరాలకు అందించాలని కోరారు. యువజనోత్సవాల్లో పాల్గొంటున్న కళాకారులు గెలుపోటములను సమానంగా తీసుకోవాలని సోషల్ వెల్ఫేర్ డీడీ రంగలక్ష్మీదేవి సూచించారు. ఓటమిని గెలుపునకు పునాదిగా భావించాలన్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు జూన్ నుంచి అక్టోబర్ వరకు జిల్లాలోని ప్రతి నియోజకవర్గంలో యువజనోత్సవాలు నిర్వహించామని సెట్‌కమ్ సీఈఓ వెంకటరంగయ్య తెలిపారు. ఈ ఉత్సవాల్లో నిర్దేశించిన 18 అంశాల్లో ప్రథమ, ద్వితీయస్థానం పొందిన కళాకారులకు జిల్లాస్థాయి యువజనోత్సవాల్లో ప్రదర్శన ఇచ్చే అవకాశం కల్పించామన్నారు. మిమిక్రీ, ఏకపాత్రాభిన యం, వక్తృత్వం, కామెడీస్కిట్, జానపద గేయాలు, నృత్యం, చిత్రలేఖనం, క్విజ్, మార్షల్ఆర్ట్స్, ఫ్యాషన్ షో, మోనోయాక్షన్, మ్యాజిక్ షో, వ్యాసరచన ఇలా మొత్తం 13 అంశాల్లో పోటీలు నిర్వహించారు. వీటిలో ప్రథమస్థానంలో నిలిచిన వారిని ప్రభుత్వ సూచనల మేరకు రాష్ట్రస్థాయి యువజనోత్సవాలకు పంపిస్తామన్నారు. మిగిలిన ఐదు అంశాలపై ఈ నెల 18న భక్తరామదాసు కళాక్షేత్రంలో పోటీలు జరుగుతాయని పేర్కొన్నారు. ఈ యువజనోత్సవాలకు ఎస్ఆర్అండ్ బీజీఎన్ఆర్ డిగ్రీ కళాశాల అధ్యాపకులు మహ్మద్ అబ్దుల్‌నయీం, సాంబశివరావు, వెంకటలాల్లు న్యాయనిర్ణేతలుగా వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో వయోవృద్ధుల సంక్షేమశాఖ సహాయ సంచాలకులు వి.మున్నయ్య, అల్పసంఖ్యాక వర్గాల ఆర్థిక సంస్థ కార్యనిర్వహక సంచాలకులు ఎం. తఖద్దుస్ అహ్మద్, తెలంగాణ ఎన్జీవోస్ జిల్లా అధ్యక్షుడు గరిడేపల్లి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. -
అత్యుత్తమం భారతీయ సంస్కృతి
వన్‌టౌన్, న్యూస్‌లైన్ : ప్రపంచానికే భారతీయ సంస్కృతి దిక్సూచి వంటిదని విజయవాడ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు వెలంపల్లి శ్రీనివాసరావు అన్నారు. అంత మహోన్నతమైన సంస్కృతి, సంప్రదాయాలను పరిరక్షించడానికి విద్యార్థులంతా కంకణం కట్టుకోవాలని కోరారు. మూడు రోజుల పాటు జరిగే కృష్ణా విశ్వవిద్యాలయం ‘కృష్ణాతరంగ్-2013’ అంతర్ కళాశాల యువజనోత్సవాలు శనివారం కేబీఎన్ కళాశాలలో ప్రారంభమయ్యాయి. జ్యోతి వెలిగించి యువజనోత్సవాలను వెలంపల్లి ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ భారతీయ సంస్కృతి యావత్ సాంస్కృతిక రంగంలోనే ఇమిడి ఉందన్నారు. ముఖ్యఅతిథిగా హజరైన విశ్వవిద్యాలయం రిజిష్ట్రార్ ఆచార్య డీ.సూర్యచంద్రరావు మాట్లాడుతూ విద్యార్థుల్లో అంతర్లీనంగా దాగి ఉన్న కళాత్మకతను వెలికి తీసేందుకే విశ్వవిద్యాలయం ప్రతి ఏటా కృష్ణాతరంగ్ పేరుతో యువజనోత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహిస్తుందన్నారు. యువజనోత్సవాల్లో జిల్లా నలుమూలల నుంచి వచ్చిన వందలాది మంది విద్యార్థులు ఈ మూడు రోజుల పాటు వివిధ సాహితీ, సాంస్కృతిక, వైజ్ఞానిక అంశాల్లో తమ ప్రతిభను చాటి చెప్పనున్నారని చెప్పారు. గౌరవ అతిథిగా హజరైన ఉన్నత విద్యాశాఖ రీజినల్ జాయింట్ డెరైక్టర్ గీతాంజలి మాట్లాడుతూ యువత నేటి ఆధునిక శాస్త్ర సాంకేతిక రంగాలను సద్వినియోగించుకుని మరింత ఉన్నతస్థానాలకు చేరుకోవాలన్నారు. సభకు అధ్యక్షత వహించిన నూజివీడు పీజీ సెంటర్ ప్రిన్సిపాల్ ఆచార్య ఎం.బసవేశ్వరరావు మాట్లాడుతూ జిల్లా ప్రజలు అన్ని రంగాల్లోనూ ప్రతిభను ప్రదర్శిస్తూ తెలుగువారి కీర్తిని ప్రపంచానికి చాటుతున్నారన్నారు. ముఖ్యంగా సాంస్కృతిక రంగంలో అనేక మంది ప్రముఖులను జల్లా అందించిందని చెప్పారు. అటువంటి సాంస్కృతిక రంగంలో యువత సైతం అద్భుత ప్రతిభను కనబరుస్తూ ముందుకు సాగడం అభినందనీయమని చెప్పారు. విశ్వవిద్యాలయం కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ సుందరకృష్ణ, హిందూహైస్కూల్స్ కమిటీ ప్రధాన కార్యదర్శి గోపిశెట్టి మల్లయ్య, కేబీఎన్ కళాశాల పాలకవర్గ అధ్యక్షులు ఉప్పల సాంబశివరావు తదితరులు ప్రసంగించారు. అలరించిన సాంస్కృతిక ప్రదర్శనలు... కృష్ణాతరంగ్-2013 అంతర్ కళాశాలల యువజనోత్సవ పోటీల్లో తొలి రోజు శనివారం ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను అలరించాయి. ఉదయం నుంచి సాయంత్రం వరకు జరిగిన వివిధ పోటీల్లో విద్యార్థులు అద్భుతమైన ప్రతిభాపాటవాలను ప్రదర్శించారు. లలిత సంగీతం, శాస్త్రీయ సంగీతం, జాతీయ బృందగానం, పాశ్చాత్య బృందగానం, క్విజ్ ప్రిలిమ్స్, స్పాట్ ఫొటోగ్రఫీ, క్లేమోడలింగ్, శాస్త్రీయ నృత్యం, జానపద వాద్యం, వక్తృత్వం తదితర అంశాల్లో పోటీలు నిర్వహించారు. విజయవాడ, మచిలీపట్నం, తిరువూరు, మొవ్వ, ఉయ్యూరు. నందిగామ, నూజివీడు తదితర ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో విద్యార్థులు ఈ పోటీలకు హజరయ్యారు. -
2014 ప్రభుత్వ సెలవు దినాలు ఇవీ..
సాక్షి, హైదరాబాద్: వచ్చే ఏడాదికి గాను వివిధ పండుగలు, వేడుకల సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాలకు వర్తించే సాధారణ, ఐచ్ఛిక సెలవు దినాలను ప్రభుత్వ సాధారణ పరిపాలన శాఖ శుక్రవారం వెల్లడించింది. -
గీత స్మరణం
పల్లవి : బలె బలె బలె బలె పెద్దబావ భళిర భళిర ఓహొ చిన్నబావ కనివిని ఎరుగని విడ్డూరం సరిసాటిలేని మీ ఘనకార్యం ॥బలె॥ చరణం : 1 మీరు నూరుగురు కొడుకులు... అహ... మారుమ్రోగు చలిపిడుగులు ॥ మట్టి తెచ్చి గంభీర గుట్టలేసి... జంభారి పట్టపేన్గు బొమ్మ చేయు ఘటికులు (2) వీరాధివీరులైన శూరాతిశూరులైన మీ కాలిగోటికి చాలరు ॥బలె॥ చరణం : 2 దైవమేదీ వేరు లేదు తల్లి కంటే ఆ తల్లి కోర్కె తీర్చువారే బిడ్డలంటే ఏ తల్లీ నోచలేదు ఇంతకంటే (2) ఈ మాట కల్లకాదు ఈరేడు జగములందు మీలాంటి వాళ్లు ఇంక పుట్టరంటే ॥బలె॥ చరణం : 3 మేళాలు తాళాలు ముత్యాలముగ్గులు రతనాలు గొడుగులు సంబరాలు ॥ ఊరంత పచ్చని తోరణాలు వీరణాలు తందనాలు (2) ఊరేగే వైభవాలు బంగారు వాయనాలు ఆనందభరితమౌను జీవితాలు ॥బలె॥ చిత్రం : బాలభారతం (1972) రచన : ఆరుద్ర సంగీతం : సాలూరి రాజేశ్వరరావు గానం : ఎల్.ఆర్.ఈశ్వరి నిర్వహణ: నాగేశ్ -
పండుగలకు పటిష్ట బందోబస్తు
కరీంనగర్ క్రైం, న్యూస్‌లైన్: శరవన్నరాత్రులు, బక్రీద్ పర్వదినం సందర్భంగా జిల్లాలో ఎలాంటి అవాంఛనీ య సంఘటనలు జరగకుండా పటి ష్ట బందోబస్తు చర్యలు చేపట్టినట్లు ఎస్పీ రవీందర్ తెలిపారు. పోలీస్ హెడ్కార్వర్టర్స్లో బుధవారం జిల్లా నేర సమీక్షా సమావేశం నిర్వహించా రు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడు తూ గోవధలు జరగకుండా చర్యలు తీసుకోవాలని పోలీస్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. గొలుసు దొంగతనాలు, దోపిడీల నియంత్రణకు జిల్లా వ్యాప్తంగా పెట్రోలింగ్‌ను ముమ్మరం చేశామని, పాత నేరస్థుల పై నిఘా పెంచామని చెప్పారు. అనుమానితుల పట్ల అప్రమత్తంగా ఉం డాలని, పోలీసులకు సమాచారం ఇ వ్వాలని కోరారు. బాణాసంచా దుకాణాలను నిర్దేశించిన ప్రాంతాల్లోనే వి క్రయించాలని సూచించారు. విద్యాసంస్థల్లో ర్యాగింగ నిరోధానికి అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశించారు. స్టేషన్‌కు వచ్చే ప్రతీ ఫి ర్యాదుకు రశీదు ఇవ్వాలని, జాప్యమై తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. శివారు దాబాల్లో మద్యం విక్రయాలు, అశ్లీల కార్యకలాపాలు జరుగుతున్నట్లు సమాచారం అందితే వెంటనే దాడులు నిర్వహించి చర్యలు తీసుకోవాలన్నారు. అనంతరం గడిచిన నెలలో సమర్ధవంతమైన సేవలందించిన పలువురికి రివార్డులు, జ్ఞాపికలు అందజేశారు. -
మూడిళ్ల పండగ
ఉండేవి ఉంటాయి. ఉంటూనే ఉంటాయి. అంతమాత్రాన... పండగలు లేకుండా పోతాయా? పలకరింపులు బంద్ అయిపోతాయా? రాకపోకలు తెగిపోతాయా? ఇచ్చిపుచ్చుకోవడం ఆగిపోతుందా? ఒకనాటి సంస్కృతా, ఒకనాటి సంప్రదాయమా? ఒకనాటి ఆత్మీయతలా, ఒకనాటి అనుబంధాలా? ప్రాంతాలు లెక్క కాదు... అంతరంగం ముఖ్యం. పరమాన్నాలు ఎన్నిరకాలని కాదు... తియ్యదన మే ప్రధానం. భక్ష్యాలు, బొబ్బట్లు, ఓలిగలు... వేర్వేరు కావచ్చు. అదే బెల్లం, అదే పంచదార, అదే పిండి... అందరం ఒక్కటే... నేటి నుంచి నవరాత్రి ఉత్సవాలు. కలిసి జరుపుకుందాం... కలిసి తీపిని పంచుకుందాం. శుభాకాంక్షలు తెలుపుకుందాం. పాలముంజలు కావలసినవి: శనగపప్పు - ముప్పావు కప్పు; బెల్లంతురుము - కప్పు; పచ్చికొబ్బరి తురుము - 3 టేబుల్ స్పూన్లు; ఏలకుల పొడి - పావు టీ స్పూను; బొంబాయిరవ్వ - ఒకటిన్నర కప్పులు; పాలు - మూడు కప్పులు; నూనె-డీప్ ఫ్రైకి సరిపడా తయారి: శనగపప్పును శుభ్రంగా కడిగి తగినంత నీరు పోసి కుకర్‌లో ఉడికించాలి ఉడికిన తర్వాత నీరు ఎక్కువగా ఉంటే వడపోసి, పప్పు చల్లారాక, మిక్సీలో వేసి పొడిపొడిగా వచ్చేలా చేయాలి ఒక పాత్రలో బెల్లం తురుము, కొద్దిగా నీరు వేసి స్టౌ మీద ఉంచి, బెల్లం కరిగి, మరిగేవరకు ఉంచాలి శనగపప్పు పొడి, కొబ్బరి తురుము, ఏలకుల పొడి వేసి కలపాలి మిశ్రమమంతా దగ్గర పడేవరకు ఉడికించి దించేయాలి చల్లారాక, ఉండల్లా చే సి పక్కన ఉంచాలి గిన్నెలో పాలు పోసి స్టౌ మీద ఉంచి మరిగించాలి బొంబాయిరవ్వ నెమ్మదిగా వేస్తూ, కలుపుతుండాలి మంట తగ్గించి, మిశ్రమం దగ్గర పడేవరకు రెండు నిముషాలు ఉడికించాలి చల్లారిన తరవాత మిశ్రమం బాగా మెత్తగా అయ్యేవరకు కలపాలి చేతికి నూనె లేదా నెయ్యి రాసుకుని, ఈ మిశ్రమాన్ని కొద్దికొద్దిగా చేతిలోకి తీసుకుని ఉండలు చే సుకోవాలి ఒక్కో ఉండను చేతిలోకి తీసుకుని పూరీ షేప్‌లోకి ప్రెస్ చేయాలి శనగపప్పు మిశ్రమాన్ని మధ్యలో ఉంచి అంచులను మూసేయాలి బాణలిలో నూనె వేసి కాగాక ఒక్కో ఉండను నూనెలో వేసి గోధుమరంగులోకి వచ్చేవరకు వేయించి తీసేయాలి. కొబ్బరి సద్ది కావలసినవి: అన్నం - మూడు కప్పులు; కొబ్బరి ముక్కలు - కప్పు; పచ్చిమిర్చి - 3 (మధ్యకు కట్ చేయాలి); ఎండుమిర్చి - 3; పల్లీలు - 2 టేబుల్ స్పూన్లు; జీడిపప్పు - పది పలుకులు; ఆవాలు - టీ స్పూను; శనగపప్పు - టీ స్పూను; మినప్పప్పు - టీ స్పూను; కరివేపాకు - రెండు రెమ్మలు; నూనె - టేబుల్ స్పూను; ఉప్పు - తగినంత; నువ్వులపొడి - రెండు టేబుల్ స్పూన్లు. తయారి: కొబ్బరిముక్కలను మిక్సీలో వేసి మెత్తగా పేస్ట్ చేసి పక్కన ఉంచాలి బాణలిలో టేబుల్ స్పూన్ నూనె వేడి చేసి, ఆవాలు, శనగపప్పు, మినప్పప్పు, పల్లీలు వేసి వేయించాలి జీడిపప్పు, పచ్చిమిర్చి తరుగు, ఎండుమిర్చి, కరివేపాకు జత చేసి రెండు నిముషాలు వేయించాలి కొబ్బరిపేస్ట్ వేసి బాగా కలిపి, వేయించాలి అన్నం, ఉప్పు వేసి కలపాలి మంట తగ్గించి రెండు నిముషాలు ఉంచి దించేయాలి. కజ్జి కాయలు కావలసినవి: మైదా - 250 గ్రా; బొంబాయిరవ్వ - కప్పు; పంచదార - ఒక కప్పు కంటె కొద్దిగా ఎక్కువ; ఎండుకొబ్బరి తురుము - అరకప్పు; ఏలకుల పొడి - అర టీ స్పూను; ఉప్పు - చిటికెడు; నెయ్యి - 2 టీ స్పూన్లు; నూనె - డీప్ ఫ్రైకి తగినంత తయారి: ఒక పాత్రలో బొంబాయిరవ్వ, ఎండుకొబ్బరి తురుము, ఏలకులపొడి, పంచదార వేసి కలిపి పక్కన ఉంచాలి వేరే పాత్రలో మైదా, నెయ్యి, ఉప్పు వేసి చపాతీపిండిలా కలిపి, పైన వస్త్రం వేసి, సుమారు గంటసేపు నాననివ్వాలి నానిన పిండిని చిన్నచిన్న ఉండలు చేసి, పూరీలా ఒత్తి కజ్జికాయ మౌల్డ్ మీద ఉంచాలి టేబుల్ స్పూను బొంబాయిరవ్వ మిశ్రమాన్ని ఇందులో ఉంచి మౌల్డ్‌ని మూసి, అంచులు తీసేయాలి బాణలిలో నూనె వేసి కాగాక, తయారుచేసి ఉంచుకున్న కజ్జికాయలను వేసి గోధుమరంగులోకి వచ్చేవరకు వేయించి తీసేయాలి. గుమ్మడి హల్వా కావలసినవి: తీపిగుమ్మడికాయ తురుము - 2 కప్పులు; పాలు - 2 కప్పులు; పంచదార - కప్పు; నెయ్యి - 3 టేబుల్ స్పూన్లు; బాదంపప్పులు - 15; ఏలకులపొడి - అర టీ స్పూను తయారి: బాణలిలో నెయ్యి వేసి కరిగాక బాదంపప్పుల తరుగు వేసి వేయించి, తీసి పక్కన ఉంచాలి అదే బాణలిలో గుమ్మడికాయ తురుము వేసి పచ్చివాసన పోయేవరకు సుమారు ఐదు నిముషాలు వేయించాలి రెండు కప్పుల పాలు పోసి బాగా కలిపి, పాలు ఇగిరిపోయేవరకు ఉడికించాలి పంచదార వేసి కలపాలి అన్నీ బాగా ఉడికిన తరవాత దించేయాలి ఏలకులపొడి, బాదంపప్పు ముక్కలు వేసి కలిపి సర్వ్ చేయాలి. పెరుగన్నం కావలసినవి: అన్నం - రెండు కప్పులు; ఉప్పు - కొద్దిగా; పెరుగు - రెండు కప్పులు; కొత్తిమీర - చిన్న కట్ట; దానిమ్మ గింజలు - పావుకప్పు; కిస్మిస్ ద్రాక్ష - రెండు టీస్పూన్లు; జీడిపప్పులు - టేబుల్ స్పూను; తయారి: ఒకపాత్రలో అన్నం, పెరుగు, ఉప్పు వేసి బాగా కలపాలి దానిమ్మ గింజలు, కిస్మిస్ ద్రాక్ష వేసి కలపాలి కొత్తిమీర, జీడిపప్పులతో గార్నిష్ చేయాలి. మురుకులు కావలసినవి: బియ్యప్పిండి - 3 కప్పులు; వేయించిన శనగపిండి - కప్పు ; వాము - టీ స్పూను; కారం - 2 టీ స్పూన్లు; ఉప్పు - తగినంత; నూనె - తగినంత తయారి: ఒక పాత్రలో బియ్యప్పిండి, శనగపిండి, ఉప్పు, కారం, వాము వేసి కలపాలి ఒక గిన్నెలో రెండు కప్పుల నీరు, రెండు టేబుల్స్పూన్ల నూనె వేసి మరిగించి, ఆ నీటిని పిండిలో వేసి కలపాలి అవసరమనుకుంటే కొద్దిగా చన్నీరు వేస్తూ పిండి మెత్తగా అయ్యేవరకు కలపాలి పిండిని కొద్దికొద్దిగా తీసుకుని, మురుకుల గొట్టంలో ఉంచి, ఒక ప్లేట్ లాంటి దాని మీద గుండ్రంగా మురుకు ఆకారం వచ్చేలా తిప్పుతుండాలి బాణలిలో నూనె పోసి కాగాక, వీటిని జాగ్రత్తగా నూనెలో వేసి, మంట తగ్గించి వేయించాలి బంగారు వర్ణంలోకి వచ్చాక తీసేయాలి. పాల్ పోలీ కావలసినవి: మైదా - కప్పు; పాలు - అర లీటరు; కండెన్స్డ్ మిల్క్ - 3 టేబుల్ స్పూన్లు; నూనె - టీ స్పూను; నీరు - పావు కప్పు; నూనె - డీప్‌ఫ్రైకి సరిపడా; పంచదార - 4 టేబుల్ స్పూన్లు; ఉప్పు - చిటికెడు; బాదంపప్పులు - కొద్దిగా; కుంకుమపువ్వు - చిటికెడు; ఏలకులపొడి - పావు టీ స్పూను తయారి: ఒక పాత్రలో మైదా వేసి నీరు పోస్తూ పూరీ పిండిలా క లిపి, మూత పెట్టి గంటసేపు నాననివ్వాలి కడాయిలో పాలు మరిగించి, మంట తగ్గించి, కండెన్స్డ్ మిల్క్ పోయాలి చిన్న గ్లాసులో కొద్దిగా నీరు, కుంకుమపువ్వు వేసి బాగా కలిపి, మరుగుతున్న పాలలో వేయాలి పంచదార, ఏలకుల పొడి వేసి కలపాలి ఈ పాలను వెడల్పాటి పాత్రలో పోయాలి పిండిని చిన్నచిన్న ఉండలుగా తీసుకుని, పూరీల మాదిరిగా ఒత్తి నూనెలో వేసి వేయించాలి పూరీలన్నీ తయారుచేసుకుని, పాలలో వేయాలి గంటసేపు నానినతర్వాత పూరీలను బయటకు తీసి, బాదంపప్పులతో గార్నిష్ చేసి, చల్లగా సర్వ్ చేయాలి. సజ్జ ముద్దలు కావలసినవి: సజ్జపిండి - 2 క ప్పులు; బెల్లంతురుము - కప్పు; నీరు - తగినంత; ఏలకులపొడి - చిటికెడు; డ్రైఫ్రూట్స్ - (బాదం, జీడిపప్పు, కిస్మిస్) - 2 టీ స్పూన్లు; నెయ్యి - 2 టే బుల్ స్పూన్లు తయారి: తగినన్ని నీరు మరిగించాలి ఒక గిన్నెలో సజ్జపిండి వేసి, వేడినీరు కొద్దికొద్దిగా పోస్తూ కలిపి ముద్ద చేయాలి కావలసిన పరిమాణంలో ముద్ద తీసుకొని, కొద్దికొద్దిగా నీరు చిలకరిస్తూ, రొట్టె చేసి, పెనం మీద వేసి రెండువైపులా కాల్చాలి వేడిగా ఉన్నప్పుడే సజ్జ రొట్టెలకు నీళ్లు అద్దుకుంటూ చేత్తో ముక్కలు ముక్కలు చేసి, రోట్లో వేసి దంచాలి స్టౌ మీద బాణలి ఉంచి అందులో నెయ్యి, బెల్లం, ఏలకులపొడి, సజ్జరొట్టె ముక్కల పొడి వేసి కొద్దిగా వేయించి దించాలి కావలసిన పరిమాణంలో ఈ పొడిని తీసుకొని బాదం, జీడిపప్పులు, కిస్మిస్లు అద్దుకుంటూ ముద్దలు చేయాలి. ఓలిగలు కావలసినవి: కందిపప్పు - కప్పు; బెల్లంతురుము - కప్పు; నీరు - 3 కప్పులు. పైన కవరింగ్ కోసం: మైదా - కప్పు; నువ్వుపప్పు - 2 టేబుల్‌స్పూన్లు; నూనె - అర కప్పు; నీరు - అరకప్పు; పసుపు - అర టేబుల్ స్పూను తయారి: ఒక పాత్రలో కందిపప్పు, తగినంత నీరు వేసి కుకర్‌లో ఉంచి నాలుగు విజిల్స్ వచ్చాక దించేయాలి చల్లారాక అధికంగా ఉన్న నీరు తీసేసి, పప్పును మెత్తగా చిదిమి, బెల్లం తురుము జత చేసి స్టౌ మీద ఐదు నిముషాలు ఉంచి దించి చల్లారనివ్వాలి ఏలకులపొడి జత చేసి, ఈ మిశ్రమాన్ని మిక్సీలో వేసి మెత్తగా చేసుకోవాలి ఒక పాత్రలో మైదా, నీరు, పసుపు, నూనె వేసి చపాతీపిండిలా కలిపి మూడుగంటలసేపు నాననివ్వాలి ఈ పిండిని చిన్న ఉండలా తీసుకుని చేతితో ఒత్తి, పూర్ణం ముద్దను ఇందులో ఉంచి, అప్పడాల పీట మీద ఉంచి అప్పడాల కర్రతో నెమ్మదిగా ఒత్తాలి స్టౌ మీద పెనం ఉంచి, కొద్దిగా నూనె వేసి, తయారుచేసి ఉంచుకున్న ఓలిగను పెనం మీద వేసి చుట్టూ నూనె వేసి, రెండువైపులా నూనె వేసి కాలాక తీసేయాలి. సేకరణ డా.వైజయంతి పిండివంటలు రుచిగా ఉండాలంటే... బొంబాయిరవ్వ వేయించి వాడితే పిండివంటలు రుచిగా ఉంటాయి. ఎండుకొబ్బరి వాడితే స్వీట్లు ఎక్కువరోజులు నిల్వ ఉంటాయి. మైదాపిండిని కలిపిన తరవాత చిన్నగిన్నెడు నూనె వేసి చేత్తో బాగా మర్దన చేసి, గిన్నె మీద తడి వస్త్రం కప్పి, గంటసేపు నాననిస్తే పిండివంటలు గుల్లగా వస్తాయి. గుమ్మడికాయ వంటి వాటిని స్వీట్లలో ఉపయోగించేటప్పుడు, వీటిలోని నీరు బాగా పిండేసి, నేతిలో దోరగా వేయించాలి. మిల్క్ స్వీట్లు తయారుచేసేటప్పుడు... పాల బదులు కండెన్స్డ్ మిల్క్ ఉపయోగిస్తే స్వీట్లు రుచిగా ఉంటాయి. ఏ పిండివంటలనైనా నూనెలో వేయించేటప్పుడు మంట తగ్గిస్తే, వంటకాలు మాడిపోకుండా, దోరగా వేగుతాయి.