పండుగలకు ప్రత్యేక రైళ్లు
పండుగలకు ప్రత్యేక రైళ్లు
Published Fri, Sep 2 2016 9:23 PM | Last Updated on Sun, Apr 7 2019 3:24 PM
డివిజను మీదుగా సికింద్రాబాద్, విశాఖపట్నం, నాగర్‌సోల్, తిరుపతికి..
విజయవాడ (నగరంపాలెం): వినాయక చవితి, దసరా, దీపావళికి ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్లు గుంటూరు రైల్వే డివిజన్ సీనియర్ డివిజనల్ కమర్షియల్ మేనేజరు కే ఉమామహేశ్వరరావు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. రైలు నం 07069 సికింద్రాబాద్– విశాఖపట్నం ప్రత్యేక ఎక్స్‌ప్రెస్ రైలు నేడు సికింద్రాబాద్‌లో 21.40కి బయలుదేరుతుంది. రైలు నం 07070 విశాఖపట్నం–హైదరాబాద్ ప్రత్యేక ఎక్స్‌ప్రెస్ రైలు నాలుగో తేదీ విశాఖపట్నంలో 22.00కి బయలుదేరి డివిజన్ పరిధిలోని గుంటూరు, సత్తెనపల్లి, పిడుగురాళ్ల, మిర్యాలగూడ, నల్గొండలో ఆగుతుంది. రైలు నం 07071 హైదరాబాద్–విశాఖపట్నం ప్రత్యేక ఎక్స్‌ప్రెస్ 5న హైదరాబాద్‌లో 21.10కి బయలుదేరి విశాఖపట్నంకు మరుసటిరోజు 11.00కు చేరుకుంటుంది. రైలు నం 07072 విశాఖపట్నం– సికింద్రాబాద్ ప్రత్యేక ఎక్స్‌ప్రెస్ సెప్టెంబరు ఆరో తేదీ విశాఖపట్నంలో 18.55కి బయలుదేరి సికింద్రాబాద్‌కు మరుసటిరోజు 08.50కి వస్తుంది. ఈ ప్రత్యేక రైళ్లు ఒక ఏసీ త్రీటైర్, ఒక ఏసీ టూటైరు, పది స్లీపర్ బోగీలు, రెండు ఎస్‌ఎల్‌ఆర్ బోగీలతో నడుస్తాయి.
తిరుపతి– నాగర్‌సోల్– తిరుపతికి వీక్లీ రైలు..
దసరా, దీపావళి పండుగలకు తిరుపతి – నాగర్‌సోల్ – తిరుపతికి వీక్లీ ప్రత్యేక రైలు డివిజన్‌కు నడుపుతున్నారు. రైలు నం 07417 తిరుపతి–నాగర్‌సోల్ ప్రత్యేక రైలు సెప్టెంబరు 16,23,30, అక్టోబర్ 7,14,21,28 నవంబరు 4,11 తేదీల్లో తిరుపతిలో 07.30కి బయలుదేరి నాగర్‌సోల్‌కు మరుసటిరోజు 11.55కి చేరుకుంటుంది. రైలు నం 07418 నాగర్‌సోల్– తిరుపతి ప్రత్యేక ఎక్స్‌ప్రెస్ రైలు సెప్టెంబరు 17,24,అక్టోబర్ 1,08,15,22,29, నవంబరు 5,12 తేదీల్లో నాగర్‌సోల్‌లో 22.00కి బయలుదేరి తిరుపతికి రెండో రోజు 4 గంటలకు చేరుకుంటుంది. ఒక ఏసీ టూటైర్, మూడు ఏసీ త్రీటైరు, ఏడు స్లీపర్ కోచ్‌లు, ఆరు జనరల్, రెండు ఎస్‌ఎల్‌ఆర్ కోచ్‌లతో ఈ రైలు నడుస్తుంది. ప్రయాణికులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సీనియర్ డీసీఎం కే ఉమామహేశ్వరరావు కోరారు.
Advertisement