
అట్టహాసంగా విజయనగరం ఉత్సవాలు
విజయనగరం ఉత్సవాలు శనివారం అట్టహాసంగా ప్రారంభమయ్యాయి.
విజయనగరం ఉత్సవాలు శనివారం అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. కోట జంక్షన్ వద్ద ర్యాలీతో ఉత్సవాలను కలెక్టర్ ఎంఎం నాయక్ ప్రారంభించారు. శనివారం నుంచి మూడు రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాల్లో భాగంగా అన్ని రకాల కళా ప్రదర్శనలు ఏర్పాటు చేశామని ఆయన తెలిపారు. ఆనందగజపతి ఆడిటోరియంలో జరిగిన ప్రారంభోత్సవ కార్యక్రమంలో మంత్రి మృణాళిని, ఎమ్మెల్యే మీసాల గీత, కలెక్టర్ సహా ప్రముఖులు పాల్గొన్నారు. జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందిన కళాకారులు ప్రాచీన యుద్ధ విద్యలతో అయోధ్య మైదానంలో ఏర్పాటు చేసిన ప్రదర్శన ఆహుతులను ఆకట్టుకుంటోంది. ఉత్సవాలతో పట్టణం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. విజయనగరం సందడిగా మారింది.