గీత స్మరణం | Song of the day from Bala Bharatam | Sakshi
Sakshi News home page

గీత స్మరణం

Published Thu, Nov 14 2013 12:32 AM | Last Updated on Sat, Sep 2 2017 12:34 AM

గీత స్మరణం

గీత స్మరణం

 పల్లవి :
 
 బలె బలె బలె బలె పెద్దబావ
 భళిర భళిర ఓహొ చిన్నబావ
 కనివిని ఎరుగని విడ్డూరం
 సరిసాటిలేని మీ ఘనకార్యం    ॥బలె॥
 
 చరణం : 1
 
 మీరు నూరుగురు కొడుకులు... అహ...
 మారుమ్రోగు చలిపిడుగులు    ॥
 మట్టి తెచ్చి గంభీర గుట్టలేసి...
 జంభారి పట్టపేన్గు బొమ్మ చేయు ఘటికులు     (2)
 వీరాధివీరులైన శూరాతిశూరులైన
 మీ కాలిగోటికి చాలరు    ॥బలె॥
 
 చరణం : 2
 
 దైవమేదీ వేరు లేదు తల్లి కంటే
 ఆ తల్లి కోర్కె తీర్చువారే బిడ్డలంటే
 ఏ తల్లీ నోచలేదు ఇంతకంటే      (2)
 ఈ మాట కల్లకాదు ఈరేడు జగములందు
 మీలాంటి వాళ్లు ఇంక పుట్టరంటే    ॥బలె॥
 
 చరణం : 3
 
 మేళాలు తాళాలు ముత్యాలముగ్గులు
 రతనాలు గొడుగులు సంబరాలు    ॥
 ఊరంత పచ్చని తోరణాలు వీరణాలు తందనాలు (2)
 ఊరేగే వైభవాలు బంగారు వాయనాలు
 ఆనందభరితమౌను జీవితాలు    ॥బలె॥
 
 చిత్రం : బాలభారతం (1972)
 రచన : ఆరుద్ర
 సంగీతం : సాలూరి రాజేశ్వరరావు
 గానం : ఎల్.ఆర్.ఈశ్వరి
 

 నిర్వహణ: నాగేశ్
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement