Lives
-
ఉత్తరప్రదేశ్.. రక్తదానంలో నంబర్ వన్
రక్తదానం చేయడంలో ఉత్తరప్రదేశ్ ప్రజలు ముందున్నారు. రాష్ట్ర జనాభాలోని 14.61 శాతం మంది ప్రజలు 2023లో రక్తదానం చేసి, తమ సామాజిక సేవా భావాన్ని చాటుకున్నారు. రక్తదానం చేయడంలో యూపీ తర్వాత మహారాష్ట్ర రెండో స్థానంలో నిలవగా, గుజరాత్ మూడో స్థానంలో నిలిచింది.ఆర్టీఐ కార్యకర్త విపుల్ శర్మ దరఖాస్తుకు ప్రతిస్పందనగా కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తాజాగా ఈ-రక్తకోష్ పోర్టల్ డేటాను షేర్ చేసింది. దీనిలోని వివరాల ప్రకారం కరోనా మహమ్మారి తర్వాత దేశంలో రక్తదానం చేసేవారి సంఖ్య ప్రతి ఏటా 50 శాతానికి పైగా పెరుగుతోంది. రాష్ట్ర ఆరోగ్యశాఖ 2021లో 45 లక్షల యూనిట్ల రక్తం సేకరించగా, అది 2022 నాటికి 80 లక్షల యూనిట్లకు పెరిగింది. 2023లో దేశంలోని మూడు వేలకు పైగా బ్లడ్ బ్యాంక్‌లలో మొదటిసారిగా 1.29 కోట్ల యూనిట్ల రక్తాన్ని సేకరించారు. వీటిలో అత్యధికంగా 18.11 లక్షల యూనిట్ల రక్తాన్ని ఉత్తరప్రదేశ్‌లోని 400కు పైగా బ్లడ్ బ్యాంకులు అందించాయి.మహారాష్ట్రలో 15.20 లక్షల యూనిట్ల రక్తాన్ని సేకరించగా, గుజరాత్లో 10.51 లక్షల యూనిట్ల రక్తాన్ని సేకరించారు. అమెరికన్ రెడ్‌క్రాస్ సొసైటీ తెలిపిన వివరాల ప్రకారం ఒక మహిళ సగటున 4.3 లీటర్ల రక్తాన్ని కలిగి ఉంటుంది. ఒక పురుషునిలో సగటున 5.7 లీటర్ల రక్తం ఉంటుంది. ఒక ఆరోగ్యకరమైన వ్యక్తి ప్రతి రోజూ 400 నుండి రెండు వేల మిల్లీలీటర్ల రక్తాన్ని ఉత్పత్తి చేస్తాడు. ఒక వ్యక్తి ఒకసారి అర లీటరు రక్తాన్ని దానం చేయవచ్చు. 2018లో దేశంలోని 124 బ్లడ్ బ్యాంకులు ఈ-రక్తకోష్ పోర్టల్‌లో నమోదయ్యాయి. ఆ ఏడాది వీటిలో మొత్తంగా 35 లక్షల యూనిట్ల రక్తాన్ని సేకరించారు. 2019లో రక్తదానం 43 లక్షల యూనిట్లకు పెరిగింది. అయితే 2020లో కరోనా మొదటి వేవ్ సమయంలో కేవలం 40 లక్షల యూనిట్ల రక్తాన్ని మాత్రమే సేకరించారు. -
మూడేళ్లలో 3,200 రోడ్డు ప్రమాదాలు, 1,231 మంది మృతి!
రోడ్డు ప్రమాదాల్లో ఏటా వందలాది మంది ప్రాణాలు కోల్పోతున్నారు. అయితే మధ్యప్రదేశ్‌లోని ఖర్గోన్ జిల్లాలో గత మూడేళ్లలో అత్యధిక రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. ఈ ప్రాంతంలో గత మూడేళ్లలో మొత్తం 3200 రోడ్డు ప్రమాదాలు జరిగాయి. వీటిలో 1231 మంది మృతి చెందారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో 23 మంది రోడ్డు ప్రమాదాల్లో మరణించారు. మితిమీరిన వేగం, ట్రాఫిక్ నిబంధనలు పాటించకపోవడం వల్లే ఎక్కువగా ప్రమాదాలు జరుగుతున్నాయి. ప్రమాదాలను తగ్గించేందుకు ట్రాఫిక్ విభాగం ఎప్పటికప్పుడు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తోంది. అయినప్పటికీ నిబంధనలు పాటించకుండా, నిర్లక్ష్యంగా వాహనాలు నడిపే వారి కారణంగానే ప్రమాదాలు జరుగుతున్నాయనే ఆరోపణలున్నాయి. ఖర్గోన్ జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు ట్రాఫిక్ టీఐ దేవేంద్ర సింగ్ పరిహార్ సరికొత్త ప్రణాళికను సిద్ధం చేశారు. జిల్లాలో మొత్తం 24 బ్లాక్ స్పాట్లు ఉన్నాయని అధికారులు గుర్తించారు. ఈ బ్లాక్స్పాట్ల వద్ద ప్రమాదాలను తగ్గించేందుకు కలెక్టర్ నేతృత్వంలో అన్ని రోడ్ ఏజెన్సీలతో సమన్వయ సమావేశం నిర్వహించారు. రోడ్డు పక్కన ఉన్న పొదలను తొలగించి, సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలని ఈ సమావేశంలో నిర్ణయించారు. రోడ్ల విస్తరణ, నగరాల్లో రద్దీ ప్రాంతాల్లో ఆక్రమణల తొలగింపుపై ఆయా శాఖల అధికారులు దృష్టి సారించనున్నారు. -
భారతీయులు ఉండని దేశాలు ఏవి? పాక్‌తో పాటు జాబితాలో ఏమున్నాయి?
ప్రపంచంలోని దాదాపు ప్రతి దేశంలో భారతీయులు స్థిరపడుతున్నారు. అయితే పాకిస్తాన్లో భారతీయులు స్థిరపడటానికి ఇష్టపడటం లేదు. ఇలా ఒక్క పాకిస్తాన్‌లోనే కాదు యూరప్‌లో కూడా భారతీయులు నివసించని దేశాలు అనేకం ఉన్నాయని తెలిస్తే ఎవరైనా ఆశ్చర్యపోతారు. భారతదేశీయులు నివసించని ప్రపంచంలోని కొన్ని దేశాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా, బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ తదితర దేశాల్లో వేలాది మంది భారతీయులు స్థిరపడ్డారు. అయితే కొన్ని దేశాల్లో ఒక్క భారతీయుడు కూడా కనిపించడు. ప్రపంచంలోని దాదాపు 195 దేశాల్లో భారతీయులు నివసిస్తున్నారు. కానీ భారతీయులు నివసించని దేశాలు పాకిస్తాన్‌తో సహా చాలా ఉన్నాయి. వాటికన్ సిటీ యూరోపియన్ దేశం వాటికన్ సిటీ ప్రపంచంలోనే అతి చిన్న దేశం. కేవలం 0.44 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఈ దేశం ఉంది. అక్కడ నివసించే ప్రజలు రోమన్ క్యాథలిక్ మతాన్ని అనుసరిస్తారు. ఈ దేశంలో జనాభా కూడా చాలా తక్కువ. ఈ దేశంలో ఒక్క భారతీయుడు కూడా నివసించడం లేదు. అయితే దీనికి భిన్నంగా భారతదేశంలో రోమన్ క్యాథలిక్ మతాన్ని అనుసరించే క్రైస్తవులు పెద్ద సంఖ్యలో ఉన్నారు. శాన్ మారినో శాన్ మారినో కూడా ఐరోపాలోని ఒక రిపబ్లిక్ దేశం. ఇక్కడ మొత్తం జనాభా 3 లక్షల 35 వేల 620. ఈ దేశ జనాభాలో ఒక్క భారతీయుడు కూడా కనిపించడు. అయితే ఈ దేశంలో భారతీయ టూరిస్టులు కనిపిస్తారు. బల్గేరియా బల్గేరియా ఆగ్నేయ ఐరోపాలోని ఒక దేశం. ఇది ప్రకృతి అందాలకు ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. 2019 జనాభా లెక్కల ప్రకారం బల్గేరియా మొత్తం జనాభా 6,951,482. ఇక్కడ నివసించే అధికశాతం జనాభా క్రైస్తవ మతాన్ని అనుసరిస్తుంది. ఈ దేశంలో భారతీయులు ఎవరూ నివసించరు. అయినా ఇక్కడ భారతీయ దౌత్యవేత్తలు కనిపిస్తారు. తువాలు తువాలు ఓషియానియా ఖండంలోని ఒక ద్వీపంలో ఉన్న దేశం. తువాలును ఎల్లిస్ దీవులు అని కూడా అంటారు. ఇది ఓషియానియాలో ఉంది. ఇది ఆస్ట్రేలియాకు ఈశాన్య పసిఫిక్ మహాసముద్రంలో ఉంది. ఈ దేశ జనాభా దాదాపు 10 వేలు. ఈ ద్వీపంలో కేవలం 8 కిలోమీటర్ల పొడవైన రోడ్లు మాత్రమే ఉన్నాయి. ఇక్కడ భారతీయులెవరూ నివసించరు. ఈ దేశానికి 1978లో స్వాతంత్ర్యం వచ్చింది. పాకిస్తాన్ భారతీయులు నివసించని దేశాల జాబితాలో మన పొరుగు దేశం పాకిస్తాన్ కూడా ఉంది. భారతదేశం, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితుల కారణంగా భారతీయులెవరూ ఇక్కడ నివసించడం లేదు. పాకిస్తాన్లో భారత దౌత్యవేత్తలు, ఖైదీలు తప్ప మన దేశానికి చెందినవారెవరూ కనిపించరు. ఇది కూడా చదవండి: వీధి కుక్కలను చంపడం తప్పుకాదని గాంధీ ఎందుకన్నారు? -
ఆ గూడేనికే వెలుతురు నువ్వమ్మా!
‘ఇరవై ఏళ్ల వరకూ మా ఇంట్లో బల్బు చూళ్లేదు’ అంటుంది భాగ్యశ్రీ. మహరాష్ట్రలో నక్సల్ ప్రభావిత గడ్చిరోలి జిల్లాలోని తమ గూడేనికి చాలా కాలం పాటు సర్పంచ్‌గా ఎవరూ నిల్చునే ధైర్యం చేయలేదు. సమస్యలు తీర్చేవారూ లేరు. ‘చివరకు నేనే సర్పంచ్ అవుదామని నిశ్చయించుకున్నా’ అంది భాగ్యశ్రీ. 24 ఏళ్ల ఈ గిరిజన నాయకురాలు తన వారి కోసం పని చేస్తున్న తీరు ప్రతి అణగారిన సమూహానికి చూపుతున్న మార్గం చాలానే ఉంది. మహరాష్ట్రలో ముంబై, పూణె వంటి నగరాలది ఒక ప్రపంచమైతే గడ్చిరోలి వంటి నక్సల్ ప్రభావిత గిరిజన ప్రాంతాలది మరో ప్రపంచం. ‘మహారాష్ట్రకు ఊపిరితిత్తి’ అని పిలిచే ఈ ప్రాంతమంతా దట్టమైన అడవి, గిరిజన ఆవాసాలతో ఉంటుంది. అయితే నక్సలైట్ల ప్రభావం వల్ల, గిరిజనులనే నిర్లక్ష్యం వల్ల దారుణమైన వెనుకబాటుతనం ఇక్కడ ఉంటుంది. ‘మా గూడెంలో నాకు ఇరవై ఏళ్లు వచ్చే వరకూ కరెంటు లేదు. మా ఇంట్లో బల్బు వెలగడం చూళ్లేదు’ అంటుంది 24 ఏళ్ల భాగ్యశ్రీ లక్ష్మి. గడ్చిరోలి అడవుల్లో అత్యధిక సంఖ్యలో ఉండే మడియా తెగకు చెందిన ఈ చదువుకున్న అమ్మాయి తన సొంతగూడెం ‘కొటి’ పంచాయితీ కింద ఉన్న 9 గ్రామాలకు సర్పంచ్. ఈ ప్రాంత గిరిజనుల జీవితాలకు ఒక ఆశాదీపం. సర్పంచ్ లేని ఊరు భాగ్యశ్రీ లక్ష్మి పుట్టి పెరిగిన ‘కొటి’ గూడేనికి 2003 నుంచి సర్పంచ్ లేడు. ఎందుకంటే నక్సల్ ప్రభావం వల్ల ఏ సమస్యో అని ఎవరూ నిలబడలేదు. దాంతో ఆ ప్రాంతమంతా అనేక సమస్యలు పేరుకుపోయాయి. బాల్య వివాహాలు, చదువు మానేయడం, నక్సల్ అనే అనుమానంతో అమాయక గిరిజన యువకులను ఏళ్ల తరబడి జైళ్లల్లో పడేయడం.. ఇదీ అక్కడ జరుగుతున్నది. డాక్టర్లు పొరపాటున కూడా రారు. అదేమంటే రోడ్లు లేవంటారు. రోడ్లు వేయమని అధికారుల దగ్గరకు వెళితే వారు మరేవో సమస్యలు చెప్తారు. ‘ఇవన్నీ చూసి చూసి విని విని నేనే సర్పంచ్‌గా మారి ఏదో ఒకటి చేద్దామని బయలుదేరాను’ అంటుంది భాగ్యశ్రీ లక్ష్మి. నేనొచ్చాను భాగ్యశ్రీ లక్ష్మి తల్లి అంగన్వాడి టీచర్. తండ్రి ప్రభుత్వ టీచర్. అందుకే భాగ్యశ్రీని చదివించారు. ‘చంద్రాపూర్‌లో బి.ఏ. ఫిజికల్ ఎడ్యుకేషన్ చదివాను. మంచి వాలీబాల్ ప్లేయర్‌ని నేను. టీచింగ్ రంగంలోకి వెళదామనుకున్నాను. కాని నా చదువు నాకు మాత్రమే ఉపయోగపడితే ఎలా? నా వారికి ఏదైనా చేయాలని సర్పంచ్ అయ్యాను. ఏకగ్రీవంగా నన్ను ఎన్నుకున్నారు’ అంది భాగ్యశ్రీ. అయితే ఆమెకు పదవి రావడాన్ని ఊహించని కొంతమంది మగవారు భాగ్యశ్రీ పదవీ స్వీకారం రోజు ఆమెతో దురుసుగా వ్యవహరించారు. మైక్ తీసుకొని మాట్లాడబోతే మాట్లాడనివ్వలేదు. అసభ్యంగా ప్రవర్తించారు. ‘నేను ఇంటికొచ్చి చాలా ఏడ్చాను. అయితే మా అమ్మ– నువ్వు ఇక మీదట మామూలు భాగ్యశ్రీగా ఉండకు. ఒక నాయకురాలు ఎలా ఉంటుందో అలా ఉండు’ అని ధైర్యం చెప్పింది. ఆ క్షణమే నేను గట్టిగా నిలబడాలనుకున్నాను’ అంటుంది భాగ్యశ్రీ. బైక్ మీద తిరుగుతూ... ప్రతి ఉదయం టీ తాగి బైక్ మీద తిరుగుతూ తన అజమాయిషీలో ఉన్న గ్రామాల సమస్యలు పరిష్కరిస్తోంది భాగ్యశ్రీ. ఆమె సర్పంచ్ అయ్యాక గూడేల్లోని తల్లిదండ్రులతో పోట్లాడి మొదటగా చేసిన పని బాల్యవివాహాలు మాన్పించడం... బాలికలను హాస్టళ్లకు పంపి చదివించడం... స్కూళ్లలో తిరిగి చేరేలా చేయడం, టాయిలెట్లు నిర్మించడం... ‘నా కింద తొమ్మిది గ్రామాల్లో ఆరింటికి కరెంటు తెప్పించాను’ అని తెలిపిందామె. ‘అధికారులు ఏది అడిగినా నక్సల్స్ సమస్యను సాకుగా చూపుతారు. ప్రజల సమస్యలను నిజంగా పరిష్కరిస్తే నక్సల్స్ అడ్డుపడరు’ అంది. ‘గిరిజనులకు కొన్ని విశ్వాసాలుంటాయి. వారు అన్ని మాటలూ వినరు. వారిని ఒప్పించి అభివృద్ధివైపు నడిపించడమే పెద్ద సవాలు. బయటవారు నాయకులు కావడం కంటే లోపలివారు నాయకులైతేనే అది సులభం. ఎవరి సమూహాల మేలు వారే చూసుకోవాలి’ అంటుంది భాగ్యశ్రీ. గిరిజనులకు కొన్ని విశ్వాసాలుంటాయి. వారు అన్ని మాటలు వినరు. వారిని ఒప్పించి అభివృద్ధివైపు నడిపించడమే పెద్ద సవాలు. బయటవారు నాయకులు కావడం కంటే లోపలివారు నాయకులైతేనే అది సులభం. ఎవరి సమూహాల మేలు వారే చూసుకోవాలి. -
'వారి ప్రాణాలు తీయడానికి వెనకాడబోం' బీజేపీ లీడర్ వివాదాస్పద వ్యాఖ్యలు..
భోపాల్: బీజేపీ సీనియర్ నాయకుడు కైలాష్ విజయవర్గీయ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దేశాన్ని ప్రేమించేవాళ్లందరూ తమ సోదరులేనని అన్నారు. అలాగే.. దేశానికి వ్యతిరేకంగా మాట్లాడేవాళ్ల ప్రాణాలు తీయడానికి కూడా వెనకాడబోమని వ్యాఖ్యానించారు. బాంగ్రోట్‌లో నిర్వహించిన పార్టీ కార్యకర్తల సమావేశంలో ఈ మేరకు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ' మేము ఎవరికీ ప్రత్యర్థులం కాదు. భారత మాతా కీ జై అనేవారందరూ మా సోదరులే. వారికోసం మా ప్రాణాలను త్యజించడానికి ముందుంటాం. కానీ భారత మాతకు వ్యతిరేకుల ప్రాణాలు తీయడానికి మాత్రం అస్సలు వెనకాడబోము' అని కైలాష్ విజయవర్గీయ మాట్లాడారు. రామ మందిరంపై మాట్లాడిన ఆయన కాంగ్రెస్ స్వభావంపై నిప్పులు చెరిగారు. ఉత్తరప్రదేశ్‌లో రామ మందిరం ఎప్పుడు అవుతుందని కొందరు విమర్శలు చేస్తున్నారని, అలాంటివారందరూ వచ్చే జనవరిలో ప్రారంభం కాబోతున్న అయోధ్య రామాలయాన్ని దర్శించుకుని పాప పరిహారం చేసుకోవాలని హితువు పలికారు. ఈ సందర్భంగా కైలాష్ విజయవర్గీయ కేంద్ర ప్రభుత్వం పనితీరుపై ప్రశంసలు కురిపించారు. కాశ్మీర్లో శాంతి పునరుద్ధరణను అందరం గుర్తించాలని అన్నారు. కాశ్మీర్లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితి, ఇంతకు ముందు ఉన్న పరిణామాలు అందరికీ తెలుసని అన్నారు. ప్రస్తుతం అక్కడ ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగురుతుందని చెప్పారు. ఇదీ చదవండి: సీఎంను కించపరుస్తూ పోస్టులు.. వాట్సాప్ గ్రూప్ అడ్మిన్ అరెస్టు.. -
మత్స్యకారుల జీవితంపై సాక్షి గ్రౌండ్ రిపోర్ట్
-
ఇద్దరికిద్దరు.. సాహసవీరులు..
-
జాన్ బీ, జహాన్ బీ రెండూ ముఖ్యం: ప్రధాని మోదీ
సాక్షి, న్యూఢిల్లీ : కరోనా వైరస్ నియంత్రణలో భాగంగా దేశవ్యాప్తంగా లాక్ డౌన్ పొడిగింపుపై ఉత్కంఠ కొనసాగుతుండగా దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. కోవిడ్ -19 ప్రభావం, పరిణమాలపై 13 రాష్ట్రాల ముఖ్యమంత్రులతో శనివారం ప్రధాని వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా దేశ ప్రజలప్రాణాలను, ఆర్థిక వ్యవస్థను రక్షించాల్సిన అవసరాన్ని ప్రధాని నరేంద్ర మోదీ నొక్కి చెప్పారు. దేశ ఉజ్జ్వల భవిష్యత్తు దృష్ట్యా, ఆరోగ్యవంతమైన భారతం కోసం ప్రజల జీవితంతో పాటు దేశమూ ముఖ్యమేనని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి ఇప్పటి వరకు తీసుకున్న చర్యల ప్రభావాన్ని నిర్ణయించడానికి తదుపరి 3-4 వారాలు చాలా కీలకమని పేర్కొన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులనుద్దేశించి వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతూ తమ ప్రభుత్వం దష్టి ‘జాన్ హైతో జహాన్ హై’ నుంచి ‘జాన్ బీ ఔర్ జహాన్ బీ’ పైకి దృష్టి మళ్లిందని ప్రకటించడం ప్రధానంగా పలువురి దష్టిని ఆకర్షించింది. ‘ప్రాణముంటే ప్రగతి అదే ఉంటుంది’ నుంచి ‘ప్రాణం ఉండాలి. ప్రగతీ ఉండాలి’ అన్నది ఆయన ప్రాస వ్యాక్యానికి అర్థం. ‘మనం ఉంటేనే ప్రపంచం... అన్నది నిన్నటి మంత్ర, మనము ఉండాలి, ప్రపంచం ఉండాలి... అనేది నేటి మంత్ర. ఇప్పటిదాకా తీసుకున్న చర్యల సత్ఫలితాలు కనిపించాలంటే, మరో మూడు నాలుగు వారాలు చాలా ముఖ్యం. వ్యవసాయ ఉత్పత్తులను నేరుగా వినియోగదారుడికి అందేలా మార్కెటింగ్ చట్టాల్లో మార్పులు తీసుకురావాలి. ఆరోగ్య సేతు యాప్ ఇకనుంచి ట్రావెల్ ఈ పాస్ లాగా ఉపయోగపడుతుంది. డాక్టర్లు, నర్సులు, పారామెడికల్ సిబ్బంది పైన దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. దేశంలో సరిపోయినన్ని మందులు అందుబాటులో ఉన్నాయి. బ్లాక్ మార్కెటింగ్ చేసే వారిపై ఉక్కుపాదం మోపాలి’ అని ప్రధాని స్పష్టం చేశారు. అయితే సీఎంలతో ప్రధాని నరేంద్రమోదీ టెలి కాన్ఫరెన్స్ తర్వాత ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ట్వీట్ గందరగోళాన్ని రేపింది. లాక్ డౌన్ పొడిగింపుపై సరైన నిర్ణయం తీసుకున్నారంటూ ఆయన ట్వీట్ చేశారు. ముఖ్యమంత్రుల వీడియో కాన్ఫరెన్స్‌లో ఏప్రిల్ 30 వరకు లాక్డౌన్ పొడిగించడం గురించి ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడారని అటు మమతా బెనర్జీ కూడా వెల్లడించారు. అయితే ఈ ప్రకటనను ఖండించిన కేంద్రం... ప్రధాని ఇంకా ఒక నిర్ణయం తీసుకోలేదని ప్రకటించింది. ఈ నేపథ్యంలోనే ప్రసంగం కూడా వాయిదా పడిందని, సోమవారం మోదీ జాతినుద్దేశించి ప్రసంగించనున్నారని సమాచారం. -
మారుతి
‘‘పిల్లలంతా వెళ్లిపోయాక ఇల్లెంత బోసిపోయిందో చూడండీ..’’ అంట్ల గిన్నెలు సింక్‌లో వేస్తూ అవంతి నిట్టూర్పు.‘‘వాళ్ల ఉద్యోగాలు.. వాళ్ల జీవితాలు..తప్పదు’’ చిలికిన మజ్జిగను రెండు గ్లాసుల్లో పోస్తూ అన్నాడు ప్రసాద్.‘‘అందుకే చిన్న ఇల్లు తీసుకుందాం అంటే విన్నారా?’’ అంది పెరుగ్గిన్నెను ఫ్రిజ్‌లో పెడుతూ.‘‘ఇది మనకోసం కాదుగా అవంతీ..’’ అన్నాడు రెండు మజ్జిగ గ్లాసులను తీసుకుని డైనింగ్ హాల్లోకి వెళుతూ, ‘‘మరే..’’బొడ్లో దోపుకున్న చీర కొంగును తీసి చేతులు తుడుచుకుంటూ భర్తను అనుసరించింది. రాత్రి తొమ్మిదైంది... ఎక్కడి నుంచో కుక్క అరుపు. ‘‘హూ.. మొదలైంది’’ డైనింగ్ టేబుల్ కుర్చీ ఇవతలకు లాక్కుంటూ అవంతి. మౌనంగా ఒక మజ్జిగ గ్లాస్ భార్యకు ఇచ్చాడు ప్రసాద్. తన గ్లాస్‌లోని మజ్జిగను సిప్ చేస్తూ హాల్లో ఉన్న కిటికీ దగ్గరకు వెళ్లాడు. బయటకు చూశాడు. తెల్లటి ప్రహరీకి నల్లని గేట్. స్ట్రీట్ లైట్ వెలుతురు ఏటవాలుగా పడి మెరుస్తోంది. గేట్ లోపల.. బయట ఏమీ లేదు. కుక్క కూడా! మజ్జిగ సిప్ చేస్తూనే కిటికీ తలుపులు మూసి బోల్ట్ పెట్టి కర్టెన్ లాగాడు. ఇంకో సిప్ చేస్తూ డైనింగ్ టేబుల్ దగ్గరకు వచ్చాడు. అప్పటికే మజ్జిగ తాగేసింది అవంతి. భర్తనే చూస్తోంది... పది రోజులే అవుతోంది ఆ గృహ ప్రవేశం చేసి. కొడుకు, కోడలు, కూతురు, అల్లుడు.. నలుగురూ ఉద్యోగస్తులే. ప్రవేశం అయిన అయిదు రోజులకే వెళ్లిపోయారు. వేసవి సెలవులు కదా మనవలు, మనవరాళ్లను ఉంచమన్నా వినలేదు ‘‘మిమ్మల్ని విసిగిస్తారు’’ అంటూ. ఇప్పుడు ఆ కుక్క అరుపులు తప్ప ఆ ఇంట్లో ఏ అలికిడీ లేదు. ఆ కుక్కా కనిపించదు. వినిపిస్తూ ఉంటుంది. అంతే! ఏంటో ఈ రెండు రోజులుగా దాని అరుపు వింటుంటే భయమేస్తోంది అవంతికి. ఇప్పుడు భర్త మొహంలోనూ అది కనపడుతోంది ఆమెకు. మజ్జిగ తాగడం పూర్తి అయినా ఇద్దరూ అలాగే కూర్చున్నారు చాలా సేపు!∙∙ బోఓ... బో.. బో.. బోఓ.. బో.. బో.. బోఓ.. బో.. బో.. బోఓ.. బో.. బో.. బోఓ..చటుక్కున నిద్రలోంచి లేచింది అవంతి. కుక్క ఏడుపు.. అదే పనిగా!మంచం కింద నుంచి వస్తోంది. వంగి చూసింది. కుక్క లేదు. ఈసారి ఆ ఏడుపు లివింగ్ ఏరియా దూరానికి వెళ్లింది. గబగబా అక్కడికి పరిగెత్తింది అవంతి. బయట గేట్ దగ్గరకు షిఫ్ట్ అయింది ఏడుపు. మెయిన్ డోర్ తెరిచి చూసింది ఆమె. ఏమీ కనిపించలేదు. మళ్లీ ఇంట్లోకి మళ్లింది ఏడుపు. అవంతీ లోపలకు వెళ్లింది. ఈ సారి హృదయ విదారకంగా.. పైన బెడ్ రూమ్ లోంచి. ఆ వైపుగా కదిలింది ఆమె. అరే.. వంటింట్లోంచి.. కిందకు దిగింది ఆమె. టెర్రస్ మీద నుంచి వినపడింది.. టెర్రస్ చేరుకుంది అవంతి. లేదు.. కుక్క లేదు.. కాని ఏడుపు తడవ తడవకు ఒక్కో చోటికి మారుతూనే ఉంది. పిచ్చిపట్టినదానిలా అవంతి ఎటుపడితే అటు పరుగులు తీస్తూనే ఉంది. కాసేపటికి నిద్రలేచిన ప్రసాద్‌కి పక్కన భార్య కనిపించలేదు. హాల్లోకి వచ్చి చూశాడు. ఆయాస పడుతూ.. నీరసంగా ఈడుస్తూ .. చెమటలు పట్టి భార్య. ‘‘అవంతీ....!’’ విస్మయంగా పిలిచాడు ప్రసాద్. చటుక్కున చూసింది భర్తను. ‘‘ఏమండీ.. అదెక్కడుందో కనపడట్లేదు.. పాపం ఒకటే ఏడుపు.. ఇందాకటి నుంచి..’’ జాలేసింది ప్రసాద్‌కి.. ‘‘అవంతీ..?’’ ‘‘కుక్కండీ.. పాపం.. ఎందుకు ఏడుస్తోందో?’’ ‘‘కుక్క లేదు.. ఏం లేదు.. పదా.. పడుకుందువు గానీ’’ అంటూ ఆమె భుజమ్మీద చేయి వేసి బెడ్రూమ్లోకి తీసుకెళ్లాడు. అయినా వెనక్కి తిరిగి చూస్తూనే ఉంది అవంతి.. ‘‘అదిగో అక్కడ నుంచి వినపడుతోంది’’ అంటూ గుమ్మం బయటవైపుకి చూపిస్తూ వెళ్లబోయింది. ‘‘నేను చూస్తాలే. నువ్ పడుకో’’ అంటూ బలవంతంగా మంచమ్మీద కూర్చోబెట్టాడు భార్యను. పక్కనే స్టడీ టేబుల్ మీదున్న నీళ్ల గ్లాస్ ఇచ్చాడు. దాహంగా ఉందేమో గటగటా తాగేసింది అవంతి. ఖాళీ గ్లాస్ భర్త చేతికిచ్చి.. మంచం మీద వాలిపోయింది. గ్లాస్ టేబుల్ మీద పెట్టి ఇటు తిరిగేసరికే నిద్రలోకి జారుకుని కనిపించింది భార్య. పక్కనే కూర్చున్నాడు అవంతి తల నిమురుతూ. కుక్క ఏడుపు భార్య భ్రమ కాదు. ఆ ఇంట్లోకి వచ్చినప్పటి నుంచి ఎదురవుతున్న అనుభవాలను చూస్తుంటే! పిల్లలు వెళ్లినప్పటి నుంచీ ఇది జరుగుతున్న తతంగమే. తను నమ్మడానికి కారణం.. రాత్రిళ్లు దాని అరుపులు తనకూ వినిపించడమే! ఇద్దరికీ ఒకే రకమైన భ్రమ, భ్రాంతి ఉంటాయా? చిత్రమేంటంటే.. తెల్లవారే సరికి ఇదంతా మరిచిపోతోంది అవంతి. అడిగితే అమాయకంగా మొహం పెడుతుంది.. ప్రతి రోజూ! కలతతోనే నడుం వాల్చాడు ప్రసాద్.∙∙ వేసవి కదా.. ఉదయం ఆరింటికే హాజరు వేసేసుకున్నాడు సూర్యుడు. రాత్రి నిద్రలేమి ప్రసాద్‌ను వెంటాడుతోంది. మార్నింగ్ వాక్‌లో అన్యమనస్కంగానే అడుగులు వేస్తున్నాడు. పార్క్‌లో ఎదురుపడ్డ వాళ్లంతా విష్ చేస్తుంటే.. చిరునవ్వుతో బదులిస్తున్నాడు. కాస్త నడకకే అలసినట్టనిపించింది. చెట్టు నీడలో ఉన్న íసిమెంట్ బెంచీ చూసుకుని కూలబడ్డాడు. జబ్బకున్న సంచీ పక్కన పెట్టి దాంట్లోంచి నీళ్ల సీసా తీసి గొంతు తడుపుకున్నాడు. సీసాకు మూత పెడుతూ తల తిప్పాడు యథాలాపంగా. ప్రసాద్ కంటే రెండుమూడేళ్లు పెద్దవాడై ఉంటాడు.. ఒక వ్యక్తి నడుస్తూ వస్తున్నాడు. పక్కనే గోధుమ వర్ణంలో మెరిసిపోతున్న సింహంలాంటి కుక్క. దానికి ఏదో చెప్తున్నాడు అతను. అది శ్రద్ధగా వింటోంది అతని మాటలను. సిమెంట్ బెంచీ కనపడగానే పరిగెత్తుకుంటూ వచ్చి ఆగింది తన యజమానిని కూర్చోమన్నట్టుగా. వెనకాలే అతనూ వచ్చి బెంచి మీద సేద తీరాడు. ప్రసాద్ పక్కనే. ఆసక్తిగా గమనిస్తున్నాడు ప్రసాద్. అపరిచితుడు కూర్చోగానే నవ్వుతూ విష్ చేశాడు ప్రసాద్‌ని. బదులుగా తనూ నవ్వాడు. ప్రసాద్ కళ్లన్నీ ఆ కుక్క మీదనే. ఎక్కడో చూసినట్టు.. చాలా పరిచయం ఉన్నట్టు. గమనించిన ఆ అపరిచితుడు.. ‘‘వీడి పేరు మారుతి. నా బంటు. నా పిల్లల కన్నా’’ చెప్తున్నప్పుడు అతని కళ్లల్లో నీటి పొర. యజమానిని చూస్తూ కుక్క ఏడ్చింది.. అరిచింది.. అచ్చం.. రాత్రిళ్లు తమకు వినిపిస్తున్నట్టుగానే!ప్రసాద్ భృకుటి ముడి పడింది. అదీ గమనించాడు అపరిచితుడు. ‘‘భయపడకండి.. మారుతి మిమ్మల్నేం చేయడు. వాడు ఆ ఇంటిని వదిలిపోలేడు. ఎందుకంటే అది నా యిల్లు. ఆస్తి కోసం నా కొడుకులు నన్ను చంపేశారు. నా మీద బెంగతో చిక్కి శల్యమై మారుతీ నా దగ్గరకు వచ్చేశాడు. తర్వాత ఆ ఇంటిని నా పిల్లలు మీకు అమ్మేశారు. నా మీద.. నేను కట్టిన ఆ ఇంటి మీద ప్రేమ చావక వీడు .. రోజూ మిమ్మల్ని ఇబ్బంది పెడ్తున్నాడు. క్షమించండి..’’ స్థిరమైన గొంతుతో.. విషాదమైన చూపులతో ఇంకేదో చెప్పుకు పోతూనే ఉన్నాడు ఆ అపరిచితుడు. అతని ఒళ్లో తల పెట్టి బాధగా మూలుగుతున్నాడు మారుతి. వెన్నులోంచి చలి ప్రసాద్‌కి.. ‘‘ప్రసాద్ గారూ.. ప్రసాద్ గారూ.. ’’భుజం తట్టినట్టనిపించి మెడ తిప్పాడు.. పక్కింటి ఆయన.. వెంటనే.. బెంచి చివర చూశాడు.. ఖాళీగా ఉంది ఆ జాగా! సరస్వతి రమ -
ఆ ముందురోజు అలా ఎందుకు మాట్లాడాడో
సిటీలో మన జీవితాలు సౌకర్యంగా ఉండటానికి ఎంతోమందిపగలూ రాత్రి పని చేస్తుంటారు... ఎండలో వానలో చలిలో పని చేస్తుంటారు.మనకి వాళ్లందరు అనామకులుకానీ వాళ్లకీ ఒక ఇల్లూ కుటుంబం మమతలూ మమకారాలూ ఉంటాయి.త్యాగంలో పెద్దాచిన్నా ఉండదేమో. ఒక జవాను ప్రాణానికి ఎంత విలువ ఉంటుందో ఈ ప్రాణానికీ అంత విలువ ఉంటుంది. కార్వాన్ సత్యనారాయణపురంలోని ఆ ఇరుకు గల్లీలో ఆ రెండు గదుల రేకుల ఇంట్లో కరెంటు లేదు. లైటు వెలుగుతూ ఉంది. ఫ్యాన్ తిరుగుతూ ఉంది. కాని కరెంటు లేదు. అవును... ఆ ఇంటికి విద్యుత్తు వంటి, ప్రాణ ప్రవాహం లాంటి మగదిక్కు పది రోజుల క్రితం తన వృత్తికి తన ప్రాణం అర్పించాడు. నిన్న వరకూ ఉన్న మనిషి ఇవాళ లేడంటే ఆ ఇల్లాలి పరిస్థితి ఏమిటి? పిల్లల పరిస్థితి ఏమిటి? ఆ వెలితి పూడే మాట ఏమిటి?‘నమస్తే’ అంది ఒక రకమైన బిడియంతో సంగీత. ఆమె పూర్తి పేరు పోగుల సంగీత. భర్త పేరు పోగుల భూమయ్య. నలభై లోపు వయసు. ఇప్పుడు లేడు. చనిపోయాడు.‘సైనికులు చనిపోతే గొప్ప పేరొస్తుంది. పోలీసులు చనిపోతే కూడా గొప్ప పేరొస్తుంది. మా ఆయన కరెంట్ మనిషి. కరెంటు మనిషి చనిపోతే ఎక్కడైనా పేరొస్తుందా?’ అందామె భర్తను తలుచుకుంటూ.ఏప్రిల్ 3, 2018న భూమయ్య చనిపోయాడు. కరెంట్ పోల్ మీద అక్కడికక్కడే చనిపోయాడు. అతడు గన్‌ఫౌండ్రీ సెక్షన్‌లోని హైదరగూడ సబ్‌డివిజన్‌లో విద్యుత్ పంపిణీ సంస్థ కాంట్రాక్ట్ వర్కర్. అతడు చనిపోయిన సంగతి పత్రికలలో చిన్న వార్తగా వచ్చింది. దానిని ఎంతమంది చదివారో తెలియదు. ‘చూశారా మా ఇల్లు. ఆయన లేడు. పిల్లలు లేరు. ఒక ఆడదాని బతుక్కు ఇంతకు మించిన శాపం ఏముంది?’ అంది. ఆ క్షణంలో ఆమె గొంతు దు:ఖంతో వణికింది. సంగీతకు ఇద్దరు పిల్లలు. కొడుకు ఆకాశ్ 6వ తరగతి చదువుతున్నాడు. కుమార్తె వెన్నెల 4వ తరగతి చదువుతోంది. తండ్రి లేని ఇంట్లో వాళ్లు ఉండలేకపోతున్నారు. గాలి మార్పు కోసం వాళ్లను ఊరికి పంపింది సంగీత. ‘పెళ్లయ్యాక ఆయన వెంట నడిచా. ఇక్కడే ఉంటున్నాం. చనిపోయాక నష్టపరిహారం చెక్ ఇప్పించారు కార్మిక నాయకులు. అది చెల్లుబాటు కావాలంటే ఆధార్‌లో పేర్లు సరిగా ఉండాలట. నా పేరులో తప్పు ఉంది. దానిని మార్పించుకోవడానికి తిరుగుతున్నాను. అదెప్పుడవుతుందో’ అందామె.సిక్స్›్తసెన్స్ అంటుంటారు. మనిషి చనిపోయేముందు ఆ సంగతి తెలుస్తుందా? భూమయ్య రెండు నెలల క్రితమే ఆ రెండు గదుల ఇంట్లో భార్య చేత చిన్న కిరాణా షాపు పెట్టించాడు. అంటే కొంచెం ఉప్పు, చింతపండు, బిస్కెట్ ప్యాకెట్లు... ‘నాకొచ్చే పద్నాలుగు వేలు ఏం సరిపోతాయి. ఇలాంటి షాపుంటే నువ్వు బతకొచ్చు... నేను ఉన్నా లేకున్నా’ అన్నాడు. అప్పట్లో ఆ సంగతి సంగీత పట్టించుకోలేదు. ఇప్పుడు ఆ చిన్న కిరాణా షాపును చూస్తుంటే ఆమెకు భర్తే గుర్తుకు వస్తున్నాడు. ముందురోజు రాత్రి.. ఒక మనిషితో ఎంత కాలం జీవించినా చనిపోయే ముందురోజు మాత్రం బాగా గుర్తుండిపోతుంది. ఆ రోజు పదే పదే గుర్తుకు వస్తుంటుంది. భర్త చివరిరోజు సంగీతకు బాగా గుర్తుంది.‘మా అమ్మాయి వెన్నెల అంటే ఆయనకు చాలా ఇష్టం. ఏం అడిగినా కాదనకుండా తెచ్చి ఇచ్చేవాడు. 2వ తారీఖు రాత్రి 9 గంటల ప్రాంతంలో వెన్నెలను ఒడిలోకి తీసుకుని కిందకు దించలేదు. సరదాగా గడుపుతూ ముద్దులాడాడు. డాడీ ఉన్నంత వరకు నీకు ఏమీ కాదురా.. నువ్వు పెద్ద చదువులు చదువుకుని పెద్ద ఉద్యోగం చెయ్యాలి అన్నాడు. నేను లేనప్పుడు అమ్మని విసిగించవద్దు, అమ్మ చెప్పినట్లు వినాలి సరేనా.. అంటూ ముద్దాడుతూ ఒట్టు ఏపించుకున్నాడు. డాడీ ఎక్కడ ఉన్నా మీతోనే ఉంటాడు.. మీరు మాత్రం అమ్మని ఏడిపించొద్దు అని పదే పదే అన్నాడు. ఎప్పుడూ లేనిది ఇయ్యాల ఆయనేంటీ కొత్తగా మాట్లాడుతున్నాడనుకున్నాను.మరుసటి రోజే దుర్వార్త వినాల్సి వస్తుందని కలలో కూడా ఉహించలేకపోయాను’ బోరున విలపించింది సంగీత. ‘అమ్మా.. నాన్న ఏడమ్మా? నాన్న మళ్లీ రాడా..?? మొన్న మాతో కలసి అన్నం తిన్నాడు కదా..! మళ్లీ మనందరం అలా అన్నం ఎప్పుడు తింటామమ్మా అని పిల్లలు అంటుంటే వాళ్లకు ఎలా నచ్చజెప్పాలో అర్థం కాలేదు. వాళ్లకు తెలుసు వాళ్ల నాన్న చనిపోయాడు అని. కానీవాళ్లు అలా అడుగుతుంటే నా గుండె బరువెక్కిపోతోంది’ అంటున్న ఆమె కన్నీటి పాట ఎవరికీ వినిపించనిది. ఈ రణగొణ ధ్వనులలో ఎవరూ వినలేనిది. పని పిచ్చోడు ‘ఆయనకు పనంటే పిచ్చి. ఒక ఎండ లేదు, వాన లేదు, చలి లేదు. పండుగలప్పుడు కూడా ఇంట్లో ఉండేవాడు కాదు. కరెంట్ లేకపోతే మనం ఒక్క నిమిషం ఇంట్లో ఉండలేం కదా. వేరే వాళ్లు ఎలా ఉంటారు? నేను వెళ్లి వాళ్లకు కరెంట్ తెప్పిస్తే మన పేరు చెప్పుకుంటారు అని అంటుండేవాడు. వర్షాకాలంలో అయితే నాకు మెతుకు గొంతు దిగేది కాదు. రోజుకు మూడు డ్యూటీలు చేస్తున్నట్టుగా తిరిగేవాడు. వైర్లు తెగినాయంట అంటూ వెళ్లి పోయేవాడు. ఆయన క్షేమంగా ఇంటికి తిరిగొచ్చే వరకు నా గుండెల్లో రైళ్లు పరిగెడుతూ ఉండేవి. ఎంత టైం అయినా సరే ఆయన ఇంటికి క్షేమంగా తిరిగొచ్చాకనే తిండి తినేదాన్ని. కరెంటు వాళ్లది కనపడని కష్టం’ అంది సంగీత. ఆ రోజు ఏం జరిగిందంటే... భూమయ్య తన తోటి ఉద్యోగి రంగారెడ్డితో డ్యూటీలో ఉన్నాడు. కింగ్‌కోఠి సమీపంలోని పర్దాగేట్ నుంచి ఫోన్ కాల్ వచ్చింది. మీటర్ బిగించాల్సి ఉంది వెళ్దాం పదా అంటూ భూమయ్య బయలుదేరి వెళ్లాడు. స్తంబం పైకి ఎక్కి సర్వీస్ వైర్ కలుపుతున్నాడు. ఆ సమయంలో లెఫ్ట్‌సైడ్ సర్క్యూట్లో నుంచి కరెంట్ పాస్ అయ్యింది. క్షణాల్లో షాక్ తగిలింది. పోల్ మీద భూమయ్య శరీరం కంపించింది. సాయం అందించే సమయం లేదు. చూస్తుండగానే పోల్ మీదే మాడిపోయాడు. ఆ తర్వాత గాంధీ ఆస్పత్రికి తీసుకెళ్లినా ప్రయోజనం లేకపోయింది.‘ఆ రోజు ఆయన పనికి వెళ్లినప్పటి నుంచి మనసెందుకో కీడు శంకిస్తోంది. అయినా పట్టించుకోకుండా నా పని నేను చేసుకుంటున్నా. పోలీసులు ఫోన్ చేసి ఆసుపత్రికి రమ్మనగానే గుండెల్లో రైళ్లు పరిగెత్తాయి. ఏమైంది సారూ అని అడిగినా. ఏమీ కాలేదమ్మా.. నువ్వు ముందు ఆసుపత్రికి రా అన్నారు. భయం భయంతోనే ఆసుపత్రికి వెళ్లాను. వాళ్లు నన్ను వెంట పెట్టుకుని శవాలు ఉండే చోటుకు తీసికెళ్లారు. అక్కడ నా భర్త ప్రాణం లేకుండా పడి ఉన్నాడు’ అంది సంగీత. – చైతన్య వంపుగాని, సాక్షి ప్రతినిధి, హైదరాబాద్ -
భార్యను చంపిన భర్తకు యావజ్జీవం
సాక్షి, హైదరాబాద్: భార్యను రోకలి బండతో కొట్టి చంపిన భర్తకు ఉమ్మడి హైకోర్టు యావజ్జీవ కారాగార శిక్షను ఖరారు చేసింది. కరీంనగర్ జిల్లా కోర్టు విధించిన యావజ్జీవ శిక్షను సమర్థిస్తూ న్యాయమూర్తులు జస్టిస్ ఎ.రామలింగేశ్వరరావు, జస్టిస్ యు.దుర్గాప్రసాదరావులతో కూడిన ధర్మాసనం ఇటీవల తీర్పు చెప్పింది. 11 ఏళ్ల క్రితం హుజూరాబాద్‌కు చెందిన శ్రీనివాస్ సరితను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. కొంతకాలం తర్వాత అదనపు కట్నం కోసం వేధించడమే కాకుండా అనుమానించడం మొదలుపెట్టాడు. 2010 అక్టోబర్ 13న తాగి వచ్చి రోకలితో సరిత తలపై బాది హత్య చేశాడు. ఆమె సోదరుని ఫిర్యాదుతో శ్రీనివాస్‌పై కేసు నమోదైంది. నిందితుడికి యావజ్జీవ శిక్ష విధిస్తూ కరీంనగర్ జిల్లా కోర్టు 2012 మేలో తీర్పు చెప్పింది. తన తొమ్మిదేళ్ల కుమార్తె సాక్ష్యం చెల్లదని, శిక్ష రద్దు చేయాలని శ్రీనివాస్ దాఖలు చేసిన అప్పీల్‌ను హైకోర్టు కొట్టేసింది. పిల్లల సాక్ష్యాల్ని యథాతథంగా తీసుకోవచ్చని, కింది కోర్టు తీర్పులో జోక్యం చేసుకునేందుకు ఆస్కారం లేదని ధర్మాసనం తాజాగా స్పష్టం చేసింది. -
మరణిస్తూ నలుగురికి కొత్త జీవితం
కొరుక్కుపేట(చెన్నై): తాను చనిపోతూ మరో నలుగురుకి కొత్త జీవితాన్ని అందించాడు బ్రెయిన్‌డెడ్‌కు గురైన 33ఏళ్ల యువకుడు. స్థానిక ట్రిప్లికేన్‌లోని దుర్గా లాయిడ్స్ రోడ్డులో నివాసం ఉంటున్న ఆర్.జయప్రకాశ్(33) ప్రైవేట్ ఫ్యాబ్రికేటింగ్ సంస్థలో అసెంబ్లింగ్ టెక్నిషియన్‌గా పనిచేస్తున్నాడు. ఇతడు పనిచేస్తున్న స్థలంలోనే తలకు తీవ్రగాయం కావడంతో చికిత్సకోసం ఈనెల 13న శ్రీరామచంద్ర ఆస్పత్రిలో చేరారు. ఈ క్రమంలో ఈనెల 15న జయప్రకాశ్ బ్రెయిన్ డెడ్‌కు గురైనట్లు ఆసుపత్రి వైద్యులు నిర్దారించారు. దీంతో అతని కుటుంబ సభ్యులు అవయవాలను దానం చేసేందుకు ముందుకు వచ్చారు. డాక్టర్ మహ్మద్ రేలా బృందం అతని అవయవాలను కలకత్తాకు చెందిన 54ఏళ్ల వ్యాపార వేత్తకు లివర్ ట్రాన్స్‌ప్లాంట్ చేయగా, డాక్టర్ ఎస్.వెంకటరమణన్ బృందం నైవేలికి చెందిన 55 ఏళ్ల వ్యక్తికి కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్ చేశారు. మరో కిడ్నీ, గుండెను మరో రెండు ఆసుపత్రులకు తరలించారు. కార్నియాను భవిష్యత్తు ఉపయోగం కోసం ఎస్ఆర్ఎంసీలో ఉంచినట్లు వైద్యులు వెల్లడించారు. -
చరిత్రకు సజీవ సాక్ష్యం ఈ చింతచెట్టు
-
రక్తదానం చేస్తే ప్రాణం పోసినట్లే
కర్నూలు: అత్యవసర సమయాల్లో రక్తం ఇచ్చి ఆదుకుంటే బాధితులకు ప్రాణం పోసినట్లేనని ఎస్పీ ఆకె రవికృష్ణ అన్నారు. మోక్షగుండం విశ్వేశ్వరయ్య 49వ జయంతి సందర్భంగా గురువారం ఉదయం స్థానిక గాయత్రి ఎస్టేట్ ఎదుటనున్న మోక్షగుండం విశ్వేSశ్వరయ్య సర్కిల్లో లైసెన్స్డ్ ఇంజనీర్ ఆర్కిటెక్చర్ సర్వేయర్ అసోసియేషన్(లీసా) ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన ఎస్పీ శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా లీసా సభ్యులు రక్తదానం చేశారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ ప్రమాదం సంభవించినపుడు, ఆపరేషన్ల సమయంలో సరైన సమయానికి రక్తం అందక ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారన్నారు. రోడ్డు ప్రమాదాల్లో ఒక కుటుంబానికి ఆధారంగా ఉన్న వ్యక్తి మరణిస్తే ఆ కుటుంబ సభ్యుల పరిస్థితి చాలా దారుణంగా ఉంటుందన్నారు. రక్తదానం చేస్తే ఇలాంటి ఎన్నో కుటుంబాల్లో వెలుగులు నింపవచ్చన్నారు. కార్యక్రమంలో కర్నూలు డీఎస్పీ రమణమూర్తి, ఇంజనీర్స్ లీసా చైర్మన్ మురళిమోహన్‌రావు, మూడవ పట్టణ సీఐ మధుసూదన్‌రావు, ఆర్గనైజర్ యోహాన్, రెడ్‌క్రాస్ చైర్మెన్ శ్రీనివాసులు, మెడికల్ ఆఫీసర్ పద్మావతి తదితరులు పాల్గొన్నారు. -
ప్రేమ వేధింపులకు బాలిక బలి
► బాలుడిని మందలిస్తే... అతడి స్నేహితుడు వెంటపడ్డాడు ► ఫిర్యాదు చేసినా పట్టించుకోని పోలీసులు ► వేధింపులు భరించలేక బాలిక బలవన్మరణం ► నిందితుడు సైతం మైనరే కావడం గమనార్హం రాజేంద్రనగర్: ప్రేమ వేధింపులు బాలిక ఉసురు తీశాయి. గతంలో వెంటపడిన బాలుడి స్నేహితుడే ఆమె పాలిట విలన్‌గా మారాడు. ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోకపోవడంతో వేధింపులు కొనసాగాయి. వీటిని తాళలేకపోయిన బాలిక బుధవారం ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటనపై మైలార్‌దేవ్‌పల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. వివరాలు... మైలార్‌దేవ్‌పల్లి హౌసింగ్ బోర్డు కాలనీకి చెందిన దంపతులు స్థానికంగా కూరగాయల వ్యాపారం చేస్తున్నారు. వీరికి ముగ్గురు సంతానం. పెద్ద కుమార్తె (15) స్థానిక పాఠశాలలో పదో తరగతి చదువుతోంది. శాంతినగర్‌కు చెందిన మైనర్ (17) గతంలో ప్రేమ పేరుతో ఈమెను వేధించాడు. తన స్నేహితులతో కలిసి వచ్చి ప్రేమించమని వెంటపడేవాడు. ఈ విషయాన్ని బాలిక నాలుగు నెలల క్రితం తల్లిదండ్రులకు తెలిపింది. వారు సదరు మైనర్‌ను మందలించడంతో ఆ సమస్య తీరింది. నెల రోజులుగా అతడి స్నేహితుడి రూపంలో మరో సమస్య బాలికను చుట్టుముట్టింది. గతంలో ఈమె వెంటపడిన మైనర్‌కు స్నేహితుడైన శాంతినగర్కే చెందిన మరో మైనర్ ఈ బాలిక వెంటపడటం ప్రారంభించాడు. ‘నిన్ను ప్రేమిస్తున్నా.. నన్ను ప్రేమించు’.. అని వేధించసాగాడు. ఆమె సెల్‌ఫోన్ నెంబర్ కూడా సంపాదించి తరచూ ఫోన్లు చేస్తూ, మెసేజ్‌లు పంపి మానసికంగా హింసిస్తున్నాడు. రోజు రోజుకూ వేధింపులు శృతిమించడంతో బాలిక ఈ విషయాన్ని తన తల్లి దృష్టికి తీసుకెళ్లింది. దీంతో ఆమె 20 రోజుల క్రితం మైలార్‌దేవ్‌పల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. సదరు బాలుడిని ఠాణాకు పిలిచి మందలిస్తామని పోలీసులు చెప్పడంతో బాలిక తల్లి వెళ్లిపోయింది. బుధవారం ఉదయం 6 గంటలకు బాలికకు సదరు మైనర్ మరోసారి ఫోన్ చేశాడు. ఫోన్ మాట్లాడినందుకు బాలికను తల్లి మందలించింది. తండ్రి వచ్చాక విషయాన్ని ఆయన దృష్టికి తీసుకెళ్లి, మరోసారి పోలీసుస్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేద్దామని చెప్పింది. చదువుకునే నీకు ఇంత చిన్న వయసులోనే సెల్‌ఫోన్ ఎందుకని చెప్పి తల్లి పని నిమిత్తం బయటకు వెళ్లింది. అదే సమయంలో బాలిక చున్నీతో ఫ్యానుకు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. నిద్రలేచిన బాలిక సోదరుడు విషయాన్ని గుర్తించి స్థానికులతో పాటు తల్లిదండ్రులకు తెలిపాడు. హుటాహుటిన ఇంటికి చేరుకున్న తల్లిదండ్రులు స్థానిక ఆస్పత్రికి తీసుకెళ్లగా.. అప్పటికే బాలిక మృతి చెందినట్టు వైద్యులు నిర్థారించారు. ఘటనపై ఫిర్యాదు అందుకున్న మైలార్‌దేవ్‌పల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పోలీసుల అదుపులో మైనర్లు... ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మైనర్‌తో పాటు గతంలో బాలికను వేధించిన బాలుడినీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి సెల్ఫోన్ల కాల్‌డేటా ఆధారంగా దర్యాప్తు చేస్తున్న పోలీసులు ఇద్దరినీ వివిధ కోణాల్లో ప్రశ్నిస్తున్నారు. ఆత్మహత్య చేసుకున్న బాలిక సెల్‌ఫోన్‌ను కూడా స్వాధీనం చేసుకొని కాల్‌డేటా, ఎస్సెమ్మెస్‌ల వివరాలను విశ్లేషిస్తున్నారు. పోలీసులు స్పందించలేదు... బాలుడు తన కుమార్తెను వేధిస్తున్న విషయంపై తాను మైలార్‌దేవ్‌పల్లి పోలీస్స్టేన్లో 20 రోజుల క్రితం ఫిర్యాదు చేశానని బాలిక తల్లి బుధవారం మీడియాకు తెలిపింది. పోలీసులు తక్షణం స్పందించి చర్యలు తీసుకుని ఉంటే తన బిడ్డ బతికి ఉండేదని రోదిస్తూ చెప్పింది. ఈ విషయంపై మైలార్‌దేవ్‌పల్లి ఇన్స్పెక్టర్ సుధీర్‌కుమార్‌ను వివరణ కోరగా... తనకు ఎలాంటి ఫిర్యాదు అందలేదన్నారు. బాలికను ప్రేమ పేరుతో వేధించి ఆత్మహత్యకు పురిగొల్పిన నిందితులను కఠినంగా శిక్షించాలని బాలల హక్కుల సంఘం అధ్యక్షురాలు అనురాధారావు డిమాండ్ చేశారు. మైనర్లకు ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా 9491292424 నెంబర్‌కు సమాచారం ఇవ్వాలని కోరారు. సమాచారం ఇచ్చిన/ఫిర్యాదు చేసిన వారి పేర్లను గోప్యంగా ఉంచుతామని ఆమె హామీ ఇచ్చారు. -
‘సాహసానికి’ సన్మానం
కర్నూలు: కర్తవ్య విధి నిర్వహణలో పోలీసులు ప్రాణ త్యాగాలకు వెనుకాడరని పెద్దతుంబళం పోలీసులు నిరూపించారని ఎస్పీ ఆకె రవికృష్ణ అన్నారు. వారిని స్ఫూర్తిగా తీసుకొని జిల్లా పోలీసులు ప్రజలకు మంచి సేవలు అందించి శాఖకు మంచిపేరు తీసుకురావాలని కోరారు. కందుకూరు తుంగభద్ర నదిలో ప్రాణాలకు తెగించి ఏడుగురిని రక్షించిన పోలీసులను మంగళవారం జిల్లా కేంద్రానికి రప్పించి ఎస్పీ ఆకె రవికష్ణ సన్మానించారు. నదిలో కొట్టుకపోతున్న వారిని ఒడ్డుకు తీసుకొచ్చేందుకు మనోధైర్యాన్ని కలుగజేసి వారి ప్రాణాలను కాపాడిన పెద్దతుంబళం ఎస్ఐ శ్రీనివాసులు, హెడ్ కానిస్టేబుల్ మల్లికార్జున స్వామిని కమాండ్ కంట్రోల్ సెంటర్లో అభినందించి సన్మానించారు. రిస్క్యూ టీమ్‌లో పాల్గొన్న పీసీలు 888, 3715, 3693, 3638, 2926, 3640, 9091 తదితరులను కూడా ఎస్పీ అభినందించారు. కార్యక్రమంలో ఆదోని తాలుకా సీఐ దైవప్రసాద్ కూడా పాల్గొన్నారు. సమయానికి వచ్చి తమ ప్రాణాలు కాపాడారని బాధితులు కృతజ్ఞతలు తెలిపినట్లు ఈ సందర్బంగా ఎస్పీ వెల్లడించారు. -
పేకాట క్లబ్‌తో జీవితాలు నాశనం
ఎమ్మెల్యే పీఆర్కే మాచర్ల టౌన్: పల్నాడు ప్రాంతంలో పేదల జీవితాలతో ఆటలాడుతున్న పేకాట క్లబ్ మూసివేత కోసం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఉద్యమానికి సమాయత్తం అవుతోంది. ఉద్యమానికి మహిళలు మద్దతు పలుకుతున్నారు. క్లబ్ మూసివేతకు ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామని శాసనసభ్యుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి చెప్పారు. దాచేపల్లిలో పేకాట క్లబ్ జోరుగా సాగుతోందని, ప్రజల జీవితాలను నాశనం చేసే పేకాటకు అధికారులు ఎలా అనుమతులిస్తున్నారో అర్ధం కావడం లేదని వైఎస్సార్సీపీ నేతలు అంటున్నారు. అసలే కరువు... వర్షాభావంతో పల్నాడు ప్రాంతంలో కరువు దాపురించింది. ఈ తరుణంలో నిర్వహిస్తున్న పేకాట క్లబ్ ప్రజల పాలిట శాపంగా మారింది. పేకాటలో సర్వం కోల్పోయిన వారు వీధుల పాలవుతున్నారు. కరువు కారణంగా కుటుంబ పోషణే కష్టంగా మారిన తరుణంలో కొందరు వ్యసనపరులు ఆస్తులను అమ్మి ఉన్నది కాస్తా పేకాటలో పెడుతుండడంతో బాధిత కుటుంబ సభ్యుల్లో కలవరం నెలకొంది. రోజూ బంకినీయే రూ.20 లక్షలు.. మాచర్ల, గురజాల నుంచే కాకుండా జిల్లా, పొరుగు రాష్ట్రాల నుంచి పేకాటరాయుళ్లు జూదమాడేందుకు క్లబ్‌కు వస్తున్నారు. జూదంపై నిర్వాహకులకు రోజూ రూ.20 లక్షలు బంకిని వస్తుందంటే పేకాట ఏ స్థాయిలో జరుగుతుందో అర్ధం చేసుకోవచ్చు. అధికార పార్టీ నేతలు తమ ప్రయోజనాల కోసం తమ జీవితాలను నాశనం చేస్తున్నారని పేకాట బాధితుల కుటుంబీకులు మండిపడుతున్నారు. క్రికెట్ బెట్టింగ్, పేకాట, మూడు ముక్కలాట వంటి జూదాలు ఎక్కడ జరిగినా సత్వరమే స్పందిÆ చే పోలీసులు దాచేపల్లి క్లబ్ గురించి ఎందుకు పట్టించుకోరో అన్నది మిలియన్ డాలర్ ప్రశ్నగా మారింది. పేకాటక్లబ్, అక్రమ మైనింగ్‌లపై రానున్న అసెంబ్లీ సమావేశాల్లో ప్రస్తావిస్తానని ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సోమవారం ‘సాక్షి’కి తెలిపారు. క్లబ్ ప్రారంభించిన కొత్తలో అసెంబ్లీలో ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తే పోలీసులు వెంటనే మూసివేశారన్నారు. తర్వాత అధికార పార్టీ నేతల వత్తిళ్లకు తలొగ్గి మళ్లీ క్లబ్‌ను తెరిపించారన్నారు. ఈ క్లబ్ కారణంగా ఎన్నో కుటుంబాలు నాశనమవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. క్లబ్ నడిపే నేతలకు ఎవరూ అడ్డు చెప్పకపోవడంతో క్యాబరే డాన్సులు పెట్టే ప్రయత్నంలో ఉన్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. పచ్చని కాపురాల్లో నిప్పులు పోసే క్లబ్‌ను మూసివేయించి కుటుంబాలు చితికిపోకుండా చూడాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. క్లబ్‌ను మూయించకపోతే ప్రభుత్వం తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. బాధిత కుటుంబాల శాపనార్ధాలు, ఉసురుతో తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు. మహిళలతో ఉద్యమాన్ని చేపడతానని హెచ్చరించారు. -
ప్రాణాలు బలిగొంటున్న ఇసుకాసురులు
మితిమీరిన వేగంతో ప్రమాదాలు గర్రెపల్లి నుంచి ట్రాక్టర్ల ద్వారా సరఫరా ‘మామూలు’గా తీసుకుంటున్న అధికారులు చొప్పదండి : అక్రమ ఇసుక రవాణా అమాయకుల ప్రాణాలను బలిగొంటోంది. ఇసుక ట్రాక్టర్లు మితిమీరిన వేగంతో ప్రయాణిస్తూ పలు ప్రమాదాలకు కారణమవుతున్నాయి. పగలు రాత్రి లేకుండా కొనసాగుతున్న అక్రమ దందా మూలంగా గ్రామాల్లోని సాధారణ ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. అక్రమ వ్యాపారాలను అడ్డుకోవాల్సిన అధికారుల ఉదాసీన వైఖరి రోడ్డు మీద ప్రయాణించే వారిపాలిట శాపంగా మారుతోంది. ఇసుక రవాణ చేసే వాహనాలతో ప్రమాదాల బారిన పడి ప్రతి సంవత్సరం ఒకరిద్దురూ ప్రాణాలు వదులుతున్నారు. అడ్డుకట్ట వేసేదెప్పుడో.. చొప్పదండి కేంద్రంగా ఇసుక అక్రమ రవాణా యథేచ్ఛగా కొనసాగుతోంది. సుల్తానాబాద్ మండలం గర్రెపల్లి నుంచి చొప్పదండి కేంద్రంగా అనుమతి లేకుండనే పగలు, రాత్రి తేడా లేకుండా ట్రాక్టర్లతో ఇసుక రవాణా కొనసాగుతోంది. చొప్పదండి మండలంతో పాటు, పరిసరాలలో ఇసుకకొరత ఉండడంతో అక్రమ రవాణా యథేచ్ఛగా కొనసాగుతోంది. చొప్పదండి శివార్లలో నిర్మాణ రంగం అభివృద్ధి చెందుతుండటంతో దళారులు కమీషన్ దందాలకు తెరలేపి ఇసుక అక్రమ రవాణాకు ఆజ్యాం పోస్తున్నారు. అక్రమ రవాణాపై కొరుఢా ఝులిపించాల్సిన అధికారులు మాముళ్ల మత్తులో తూగుతుండడంతో ఇసుక దళారులకు అడ్డు అదుపు లేకుండా పోతోంది. ఇసుక తరలించే వాహనాల వల్ల చొప్పదండితో పాటు భూపాలపట్నం, వెదురుగట్ట, కరీంనగర్ మండలం బహుదూర్‌ఖాన్‌పేట గ్రామాల్లో రోడ్ల వెంట ప్రజలు వెళ్లేందుకే జంకుతున్నారు. జనావాసాలు మధ్య నుంచే ఇసుక ట్రాక్టర్లు మితిమీరిన వేగంతో వెలుతుండడంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. ఇసుక ట్రాక్టర్ల ఆగడాలను నిరోధించాలని స్థానికులు ఎన్నిసార్లు అధికారులకు వవిజ్ఞప్తి చేసినా ఎవరూ పట్టించుకోవడం లేదు. నిఘా కరువు చొప్పదండి కేంద్రంగా ఇసుక అక్రమ రవాణా జరుగుతున్నా రెవెన్యూ, పోలీస్ అధికారులు సీరియస్‌గా దృష్టి సారించడం లేదు. అప్పుడప్పుడు దాడులు చేసి నామమాత్రంగా జరిమానాలు విధించి వదిలేస్తుండటంతో, అక్రమార్కులు తమ దందాను కొనసాగిస్తూనే ఉన్నారు. అధిక ధరలకు ఇసుక విక్రయిస్తూ జనాలను దోచుకుంటున్నారు. రూ. లక్షల్లో కొనసాగుతున్న దందాపై పలువురు అధికారులు చేతివాటం ప్రదర్శిస్తుండటంతో ఇసుక అక్రమ రవాణా దారుల వ్యవహారం బయటకు పొక్కడం లేదని విమర్శలు వస్తున్నాయి. -
ఉసురుతీసిన అప్పులు
అప్పులబాధతో రైతు బలవన్మరణం హుజూర్నగర్ మండల పరిధిలో ఘటన హుజూర్నగర్: అప్పులకుంపటి మరో రైతు ఉసురు తీసింది. వర్షాభావ పరిస్థితులకు దిగుబడి రాక, అప్పుల వారి ఒత్తిడి తట్టుకోలేక చావే శరణ్యమనుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ ఘటన హుజూర్నగర్ మండల పరిధిలో మంగళవారం చోటు చేసుకుంది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. హుజూర్నగర్ మండలం బూరుగడ్డ గ్రామానికి చెందిన రాగం అంజయ్య (35) వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. తనకున్న మూడు ఎకరాల భూమిలో వరి సాగు చేశాడు. పెట్టుబడులు, కుటుంబ అవసరాల నిమిత్తం తెలిసిన వారి వద్ద రూ. 6 లక్షల వరకు అప్పు చేశాడు. గత రెండు సీజన్లుగా సాగు నీరు అందకపోవడంతో దిగుబడి ఆశాజనకంగా లేదు. దీంతో అప్పుల వారి ఒత్తిడి పెరిగిపోవడంతో తట్టుకోలేక మంగళవారం తన వ్యవసాయ బావి వద్దకు వెళ్లి చెట్టుకు ఉరివేసుకున్నాడు. కాగా అటువైపుగా వెళ్తున్న రైతులు చెట్టుకు వేలాడుతున్న అంజయ్య మృతదేహాన్ని చూసి కుటుంబ సభ్యులకు సమాచారమందించారు. ఘటన స్థలాన్ని పోలీసులు పరిశీలించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
కార్మికుల జీవితాలతో సంఘాల చెలగాటం
రెబ్బెన(ఆదిలాబాద్) : కొన్ని కార్మిక సంఘాల నాయకులు సింగరేణి గుర్తింపు ఎన్నికల్లో లబ్ధి పొందడానికి కార్మికుల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారని హెచ్ఎంఎస్ ప్రధాన కార్యదర్శి రియాజ్‌అహ్మద్ అన్నారు. శుక్రవారం బెల్లంపల్లి ఏరియా పరిధి డోర్లి–1 గేట్ మీటింగ్‌లో ఆయన మాట్లాడు తూ గుర్తింపు సంఘంగా ఉన్న టీబీజీకేఎస్ వారసత్వపు ఉద్యోగాలు, సకల జనుల సమ్మె కాలానికి వేతనం ఇప్పిం చడంలో పూర్తిగా విఫలమైందని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం సమ్మె కాలాన్ని స్పెషల్ క్యాజువల్ లీవ్‌గా పరిగణించి వేతనం మంజూరు చేయాలని ఆదేశిస్తే గుర్తింపు సంఘం కావాల నే అడ్డుకుందన్నారు. వారసత్వపు ఉద్యోగాలను కోల్పోయిన సమయంలోనే అన్ని సంఘాలు ఏకమై సమ్మె నోటీసు ఇస్తే ఆనాడే ఉద్యోగాలు తిరిగి వచ్చి ఉండేవని, ఏఐటీయూసీ, ఐఎన్టీయూసీ నాయకులు మెడికల్ బోర్డు లో పైరవీల కోసమే రాకుండా చేశారని ఆరోపించారు. ఆ తర్వాత టీబీజీకేఎస్ నాయకులు బోర్డులో పైరవీలు ప్రారంభించటంతోనే సంఘం రెండుగా చీలి పోయిందని చెప్పారు. సమస్యలపై నిర్భయంగా పోరాడినందుకే హెచ్ఎం ఎస్ నాయకులపై సస్పెన్షన్లు, పోలీసు కేసులు వంటి చర్యలు చేపట్టారని అన్నారు. సమావేశంలో మణిరాంసిం గ్, అబ్దుల్ ఖాదర్, ఓజియార్, రాజన ర్సు, అంజనేయులు గౌడ్, శ్రీనివాస్‌రె డ్డి, రాజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
విద్యార్థుల జీవితాలతో చెలగాటం
ఎన్ఎస్యూఐ రాష్ట్ర అధ్యక్షుడు వెంకట్ జిల్లాలో ఎన్ఎస్యూఐ క్యాంపస్ యాత్ర ఖమ్మం: తెలంగాణ రాష్ట్రం వస్తే విద్యాపరంగా ఏ ఇబ్బంది లేకుండా చూస్తామని హామీలు ఇచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్ ఫీజు రీయింబర్స్‌మెంట్‌లో కోత, ఎంసెట్–2 పేపర్ లీకేజీల వంటి సంఘటనలతో విద్యార్థుల జీవితాలతో ఆటలాడుకుంటున్నారని ఎన్ఎస్యూఐ రాష్ట్ర అధ్యక్షుడు వెంకట్ ఆరోపించారు. ఎన్ఎస్యూఐ ఆధ్వర్యంలో తలపెట్టిన చలో క్యాంపస్ యాత్ర గురువారం ఖమ్మం చేరుకుంది. వరంగల్ క్రాస్ రోడ్డు నుంచి జిల్లా ఎన్ఎస్యూఐ నాయకులు బైక్ ర్యాలీ నిర్వహించి.. యాత్రను ఖమ్మం నగరంలోని ఆహ్వానించారు. అనంతరం మహిళా కళాశాల, కేంద్రియ విద్యాలయం ప్రాంతాల్లో పర్యటించి.. అక్కడున్న పరిస్థితులను పరిశీలించారు. ఈ సందర్భంగా వెంకట్ మాట్లాడుతూ మహిళా కళాశాల ప్రాంగణంలో మద్యం సీసాలు, అపరిశుభ్ర వాతావరణం నెలకొందని, నగరం నడిబొడ్డులో ఉన్న మహిళలకు రక్షణ లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్రియ విద్యాలయంలో 1220 మంది విద్యార్థులకు కేవలం నలుగురే రెగ్యులర్ ఉపాధ్యాయులున్నారని, 19మంది ఉపాధ్యాయులను ఒకేసారి బదిలీ చేయడం శోచనీయమన్నారు. ఇలా అయితే చదువులు ఎలా కొనసాగుతాయని ఆవేదన వ్యక్తంచేశారు. కార్యక్రమంలో నాయకులు సంతోష్, చందన, సారిక, అనురాధ, మహేష్, సందీప్, ఉదయ్‌కుమార్, అజయ్, శంకర్ తదితరులు పాల్గొన్నారు. -
ఏటా 50 లక్షల మరణాలకు అదే కారణం
లండన్: ఇటీవలికాలంలో బాగా తగ్గిపోతున్న శారీరక శ్రమకు ప్రజలు చెల్లిస్తున్న మూల్యం ఎంతో తెలుసా.. సంవత్సరానికి 67.5 బిలియన్ డాలర్లతో పాటు 50 లక్షల మంది ప్రాణాలు. ఇంటర్నేషనల్ టీమ్ ఆఫ్ రీసెర్చర్స్ నిర్వహించిన తాజా పరిశోధనలో వ్యాయామం లేకపోవటం మూలంగా 67.5 బిలియన్ డాలర్లను ప్రపంచవ్యాప్తంగా ప్రజలు ఆరోగ్యం విషయంలో ఖర్చు చేస్తున్నారని తేల్చారు. వారానికి కనీసం 150 నిమిషాల శారీరక శ్రమ చేస్తే ఆరోగ్యంగా ఉండొచ్చిన వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చెబుతున్నా.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న వయోజనుల్లో 50 శాతం మంది కూడా ఈ మార్క్‌ను చేరుకోవటం లేదని పరిశోధకులు వెల్లడించారు. రోజుకు ఎనిమిది గంటలకు పైగా కూర్చొని పనిచేసేవారిలో సరైన శారీరక శ్రమ లేకపోయినట్లయితే వారిలో అకాల మరణాలు సంభవించే అవకాశం పెరుగుతోందని పరిశోధనలో తేలింది. శరీరానికి సరైన వ్యాయామం లేకపోవటం మూలంగా గుండె జబ్బులు, డయాబెటిస్, క్యాన్సర్ల ముప్పు పెరుగుతుందని పరిశోధనకు నేతృత్వం వహించిన ఎకిలండ్ తెలిపారు. -
రైతుల జీవితాలతో సర్కారు చెలగాటం
జీఓ నంబర్ 271ని రద్దు చేయాలి రెతుల రౌండ్‌టేబుల్ సమావేశం డిమాండ్ భూ యాజమాన్య హక్కులకు చేటని ఆందోళన అమలాపురం రూరల్ : ‘భూమి మీద యాజమాన్య హక్కులను కాలరాసే జీఓ: 271ని నిలుపుదల చేయాలి. పట్టాదారు పాస్‌పుస్తకాలు, టైటిల్ డీడ్ల విధానం కొనసాగించి, 1బి రికార్డుల్లో తప్పులు సవరించాకే అమలు చేయాలి’ అని అఖిలపక్షాలు, రైతు సంఘాల ప్రతినిధులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈదరపల్లి జనహిత కార్యాలయంలో భారతీయ కిసాన్ సంఘ్ జిల్లా అధ్యక్షుడు దొంగ నాగేశ్వరరావు ఆధ్వర్యంలో గురువారం జీఓ :271పై జరిగిన రౌండ్‌టేబుల్ సమావేశంలో అధికార టీడీపీ, బీజేపీ, వైఎస్సార్ కాంగ్రెస్, సీపీఐ, కాంగ్రెస్ పార్టీలతోపాటు బీకేఎస్, కోనసీమ రైతు పరిరక్షణ సమితి, అఖిలభారత రైతు కూలీ సంఘం, పలు రైతు సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. పట్టాదారుపాస్ పుస్తకాలను, టైటిల్ డీడ్ విధానాన్ని రద్దు చేసి, కొత్తగా ఇచ్చిన జీఓ :271 ప్రకారం వెబ్‌ల్యాండ్‌లో ఉంచిన 1బి ఆధారంగా మాత్రమే భూమిహక్కుల బదలాయింపు చేయడం వల్ల రైతులు తీవ్రంగా నష్టపోతారని ముక్తకంఠంతో చెప్పారు. వెబ్‌ల్యాండ్ రికార్డుల్లో రైతుల పేర్లు, సర్వే నంబర్లు తప్పుగా ఉన్నాయని, దీని వల్ల బ్యాంకు రుణాలతోపాటు తనఖాల్లో ఇబ్బందుల పాలవుతారని అన్నారు. కొత్త భూ వివాదాలకు ఆస్కారం.. నీటి వినియోగదారుల సంఘం రాష్ట్ర మాజీ ప్రధాన కార్యదర్శి కొవ్వూరి త్రినాథ్‌రెడ్డి మాట్లాడుతూ వెబ్‌ల్యాండ్ ఆధారంగా రిజిస్ట్రేషను చేస్తే భూమి యజమానికి తెలియకుండా అమ్మకాలు జరిగే ప్రమాదముందని ఆందోళన వ్యక్తం చేశారు. వెబ్‌ల్యాండ్‌లో ఉన్న తప్పులను ఆధారాలతో సహా చూపించారు. బీకేఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వెల్లాపు సూర్యనారాయణ మాట్లాడుతూ చంద్రబాబు ప్రభుత్వం రైతుల జీవితాలతో చెలగాటం ఆడుతోందన్నారు. ఈ జీఓల వల్ల రియల్ ఎస్టేట్ వ్యాపారులకు మాత్రమే లాభం జరుగుతుందని ఆరోపించారు. పార్టీలకు అతీతంగా పోరాడాలి.. వైఎస్సార్ సీపీ జిల్లా రైతు విభాగం అధ్యక్షుడు జున్నూరి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ రైతులు పార్టీలకు అతీతంగా ఈ సమస్యలపై పోరాడాలన్నారు. బీజేపీ రాష్ట్ర కార్యవర్గసభ్యుడు ఆర్.వి.నాయుడు మాట్లాడుతూ శాంతి యుతంగా సమావేశాలు పెట్టుకుంటే అడ్డుకోవడం దారుణమన్నారు. పీసీసీ సభ్యుడు కల్వకొలను తాతాజీ ప్రభుత్వం స్వప్రయోజనాల కోసమే రోజుకో జీఓ తెచ్చిందన్నారు. బీకేఎస్ రాష్ట్ర కార్యదర్శి ముత్యాల జమ్మి భూ రికార్డులు సర్వే చేశాకే 1బి అమలు చేయాలని డిమాండ్ చేశా రు. బీకేఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఉప్పుగంటి భాస్కరరావు, జిల్లా ప్రధాన కార్యదర్శి యాళ్ల వెంకటానందం, కోనసీమ రైతు పరిరక్షణ సమితి అధ్యక్షుడు యాళ్ల బ్రహ్మానందం, మాజీ అధ్యక్షుడు రంబాల బోసు, రైతు సంఘం ప్రతిని ధులు అడ్డాల గోపాలకృష్ణ, తిక్కిరెడ్డి గోపాలకృష్ణ, వివిధ పార్టీలకు చెందిన పెయ్యిల శ్యామ్‌ప్రసాద్, చెల్లుబోయిన కేశవశెట్టి, చిక్కం బాలయ్య, పత్తి దత్తుడు పాల్గొన్నారు. -
ఆఫ్రికన్ల ఆయుష్షు అమాంతం పెరిగింది
ఆఫ్రికా: పేదరికం, ఆహారలేమితో పోషకాహార లోపం, అన్నింటికి మించి మొత్తం ప్రపంచంలోనే ఆర్థికంగా వెనుకబడిన ప్రాంతాలు ఆఫ్రికా ఖండం సొంతం. సాధరణంగా ఏ దేశాల్లో అమితంగా సౌకర్యాలు ఉంటాయో ఆ దేశాల్లోనే జీవన ప్రమాణ రేటు అమితంగా ఉంటుంది. అయితే, ఇన్ని గడ్డు సమస్యల మధ్య ఉంటున్న ఆఫ్రికా జనాభా జీవిత కాలం మరింత పెరిగింది. గడిచిన పదిహేనేళ్లలో ఆ దేశాల్లో నివసించే ప్రజల ఆయుర్ధాయం ఆశ్చర్యం కలిగించే రీతిలో పెరిగినట్లు ప్రపంచ ఆరోగ్య గణంకాలు-2016 వెల్లడించింది. 2000 సంవత్సరంతో పోల్చినప్పుడు 2015లో అమితంగా వారి ఆయుష్షు పెరిగిందని.. పేద దేశాల్లో కూడా సానుకూల ఫలితాలు వస్తున్నాయని ఆ గణంకాలు వెల్లడించాయి. కనీసం 9.4 సంవత్సరాల అదనపు ఆయుర్ధాయం పెరిగినట్లు పేర్కొన్నాయి. ఎయిడ్స్ మహమ్మారితో పోరాటం విషయంలో కూడా ఆఫ్రికా దేశాలు ముందంజలో ఉన్నట్లు చెప్పాయి. ఆఫ్రికా ప్రజల జీవిత ఆయుష్షుపై 1990లో వెల్లడైన వాస్తవాలను చూసి అవాక్కయిన ప్రపంచ ఆరోగ్య సంస్థ.. అందుకు నివారణ మార్గాలు సూచించింది. ఎన్నో కార్యక్రమాలు అమలుపరిచేందుకు సహకరించింది. అంతేకాదు, దాదాపు ఓ ఆరు దేశాలు మలేరియావంటి రోగాల నుంచి పూర్తిస్థాయిలో తాము ఆశించిన సమయం కన్నా ముందుగానే బయటపడతాయని కూడా ఆ సంస్థ తెలిపింది. -
జిహాదీలను ఎదిరించి, సైన్యాన్ని రక్షించిన శునకం!
లండన్ః బ్రిటిష్ సైన్యాన్ని రక్షించిన మిలటరీ డాగ్ ఇప్పుడు వార్తల్లో హీరో అయిపోయింది. ఏభైమంది ఐసిస్ సమూహాన్ని దీటుగా ఎదుర్కొని బ్రిటిష్ ప్రత్యేక దళాలపై విశ్వాసాన్ని చూపింది. సాస్ సైనికులు పది రోజుల ట్రైనింగ్ అనంతరం తిరిగి వస్తుండగా.. ఫైటర్లనుంచి రక్షించి ప్రత్యేకతను చాటింది. నాలుగు వాహనాల కాన్వాయ్ లో బ్రిటిష్ సైనిక దళాలతో పాటు ప్రయాణిస్తున్న అల్సేషన్ డాగ్... కుర్షిద్ సరిహద్దు ప్రాంతంలోకి రాగానే అనుకోకుండా జిహాదీల సమూహానికి చిక్కారు. గతనెల్లో సుమారు ఏభైమంది ఐసిస్ సభ్యులు ఓ హోం మేడ్ బాంబుతో సైన్యంపై దాడికి దిగారు. తప్పించుకునేందుకు ప్రయత్నించిన బ్రిటిష్ సైన్యంపై వెనుకనుండి దాడి చేశారు. అదే సమయంలో కాన్వాయ్ లో సైనికులతో పాటు ప్రయాణిస్తున్న మిలటరీ డాగ్ తన ప్రతాపం చూపింది. కోపంతో ఉగ్రరూపం దాల్చింది. ఐసిస్ దళాలపై విరుచుకు పడింది. ఓ జిహాదీని మైడపైనా, ముఖంపైనా కరిచింది. మరో జిహాదీ చేతులు, కాళ్ళను పట్టుకు పీకేసింది. ఆల్సేషన్ కుక్క టెర్రర్ కు ఐసిస్ సభ్యులు ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకొని పరుగులు తీశారు. కుక్క భయానికి అక్కడినుంచీ పారిపోయారు. ఐసిస్ దాడులనుంచి తన ప్రాణాలను కాపాడుకునేందుకు పారిపోకుండా.. ఆ కుక్క వీరోచితంగా పోరాడి తమ సైనికులను రక్షించడం అభినందించాల్సిన విషయమని, అందుకు దానికి ఎంతో తర్ఫీదు ఇచ్చి ఉంటారని ఘటన అనంతరం అంతా మెచ్చుకున్నారు. ఆల్సేషన్ దగ్గరకు వస్తే సాధారణ మనుషులైతే భయపడతారు. కానీ జిహాదీలను సైతం తీవ్రంగా భయపెట్టి, వారిని దీటుగా ఎదుర్కొని తన బాధ్యతను నిర్వర్తించడం నిజంగా ఆశ్చర్యకరమని అంటున్నారు. -
పరమానందం పొందాలంటే..?
నచికేతా! జీవులు నిద్రపోయేటప్పుడు కూడా తాను మేలుకొని ఉండి, అనేక విషయాలను నిర్మిస్తూ, నిత్యమై, శుద్ధమై ఉండేదే పరబ్రహ్మం. అన్ని లోకాలూ అందులోనే ఉన్నాయి. దానిని దాటి ఎవరూ పోలేరు. ఆత్మ అంటే ఇదే. ఒకే అగ్ని వేర్వేరు కట్టెలలో వెలుగుతున్నట్టు ఆత్మ జీవులందరిలో వేర్వేరు రూపాల్లో కనిపిస్తుంది. వాటికి భిన్నంగా కూడా ఉంటుంది. ఒకే వాయువు జీవులలో ప్రవేశించి వివిధ రూపాల్లో కనబడుతున్నట్టు అందరిలో ఉన్న పరమాత్మ భిన్నరూపాల్లో దర్శనం ఇస్తున్నాడు. లోకానికి అంతటికీ నేత్రంగా ఉన్న సూర్యుడు ఆ చర్మచక్షువుల రాగద్వేషాలకు అతీతంగా ఉన్నట్టు అందరిలో ఉన్న ఆత్మ స్వచ్ఛమై నిర్మలమై ఉంటుంది. పరమాత్మ సకల జీవుల అంతరాత్మగా ఉంటూ భిన్నరూపాల్లో కనిపిస్తున్నాడు. ఆ పరమాత్మ తనలోనే ఉన్నాడని తెలుసుకున్న జ్ఞానులకు శాశ్వతానందం కలుగుతుంది. దీనిని అజ్ఞానులు పొందలేరు. అనిత్యమైన వాటిల్లో నిత్యంగా, చేతనాల్లోని చైతన్యంగా ఉండే పరమాత్మను తమ ఆత్మలో దర్శించగలిగిన ధీరులు మాత్రమే శాశ్వతమైన శాంతిని పొందగలుగుతారు. గురువర్యా! యమధర్మరాజా! నువ్వు చెప్పినట్టు రుషులు పొందే అనిర్వచనీయమైన ఆ పరమానందాన్ని నేను ఎలా తెలుసుకోవాలి? అది స్వయంప్రకాశమా? మరొక వెలుగులో కనిపిస్తుందా? నచికేతా! అక్కడ సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, అగ్ని, మెరుపులు ఎవరూ ప్రకాశించరు. పరమాత్మ వెలుగులోనే ఇవన్నీ ప్రకాశిస్తాయి. సనాతనమైన ఈ రావిచెట్టు వేళ్లు పైకి, కొమ్మలు కిందికీ వ్యాపించి ఉంటాయి. ఇదే పవిత్రమూ, శాశ్వతమూ అయిన పరబ్రహ్మం. ఎవరైనా ఏదైనా దీంట్లోనే ఉన్నాయి. ఇదే ఆత్మ. పరమాత్మ నుంచే సకల ప్రపంచం ప్రాణాన్ని పొంది మళ్లీ దానిలోకే లీనమౌతోంది. పెకైత్తిన వజ్రాయుధంలా ఆత్మ మిరుమిట్లు గొలుపుతూ భయపెడుతూ ఉంటుంది. ఇది తెలుసుకున్నవారు జనన మరణాలకు అతీతంగా అమృతత్వాన్ని పొందుతారు. నాయనా! భయంతోనే అగ్ని, సూర్యుడు, ఇంద్రుడు, వాయువు, మృత్యువు అందరూ తమ బాధ్యతలను నిర్వహించడానికి పరుగెత్తుతున్నారు. ఆ పరబ్రహ్మాన్ని శరీరం నశించకముందే దర్శించగలిగిన మానవుడు బంధాలనుంచి విముక్తుడు అవుతాడు. లేకపోతే జన్మలు తప్పవు. లోపల ఉన్న పరమాత్మ పితృలోకంలో స్వప్నంలా, గంధర్వలోకంలో నీటిలో ప్రతిబింబంగా, బ్రహ్మలోకంలో వెలుగునీడలుగా కనిపిస్తుంది. ఇంద్రియాల విభిన్నతనూ, వృద్ధిక్షయాలనూ తెలుసుకొన్న ధీరుడు దేనికీ దుఃఖించడు. ఇంద్రియాలకన్నా మనస్సు గొప్పది. మనస్సు కంటే బుద్ధి ఉత్తమం. బుద్ధికంటే విశ్వాత్మ, దానికంటే అవ్యక్త ప్రకృతి శ్రేష్ఠం. అవ్యక్త ప్రకృతి కంటే సర్వవ్యాపకుడూ, స్త్రీ పురుషాదిలింగరహితుడూ అయిన పరమపురుషుణ్ణి తెలుసుకోగలిగిన ప్రాణికి అమృతత్వం లభిస్తుంది. ఆ పరమ పురుషునికి ఏ కోపమూ లేదు. కంటికి కనపడ డు. హృదయంలో ఉండి మనస్సును శాసించే బుద్ధికి మాత్రమే కనపడతాడు. చూడగలిగిన వారికి జననమరణాలు ఉండవు. నచికేతా! మనస్సుతో సహా అయిదు జ్ఞానేంద్రియాలు (కన్ను, ముక్కు, చెవి, నాలుక, చర్మం)ఆత్మల్లో స్థిరమైనప్పుడు, బుద్ధి నిశ్చలమైనప్పుడు ఆ స్థితిని ‘పరమపదం’ అంటారు. ఇంద్రియాలను స్థిరంగా నిగ్రహించుకోవడమే ‘యోగం’. యోగి మనోవికారాలను అప్రమత్తతతో గెలుస్తాడు. యోగంలోనుంచి ఏ క్షణంలోనైనా పతనం కావచ్చు. జాగ్రత్తగా ఉండాలి. ఆత్మను మాటలతో, కళ్లతో, మనస్సుతో చూడలేరు. అది ఉన్నదని తెలుసుకున్న వారి ద్వారానే తెలుసుకోగలరు. ‘అస్తి’ ‘నాస్తి’ అనే రెండు పదాల్లోనూ ‘అస్తి’ఉంది. అది తెలుసుకున్నవారికి తత్త్వ దర్శనం అవుతుంది. మానవుడు ఎప్పుడు కోరికలను నశింపజేసుకుంటాడో అప్పుడు మరణం ఉండి కూడా లేనివాడు అవుతాడు. శరీరం ఉండగానే బ్రహ్మత్వాన్ని పొందుతాడు. మానవుడు జీవించి ఉండగానే బంధాలను ఛేదించుకుంటే మరణం లేనివాడు అవుతాడని వేదాంతం బోధిస్తోంది. మానవ హృదయంలో నూటొక్క గదులు ఉన్నాయి. వాటిల్లో ఒకటి తలలోకి ప్రయాణిస్తుంది. దానిద్వారా మనిషి అమృతత్వాన్ని పొందుతాడు. మిగిలిన నాడులు శరీరంలో అన్ని వైపులకి ప్రయణిస్తూ అంతరించిపోతాయి. బొటనవేలు పరిమాణంలో అన్ని ప్రాణుల్లోనూ ఉండే అంతరాత్మ గురించి మానవుడు మాత్రమే తెలుసుకోగలడు. అందుకే జంతువులలో నరజన్మ శ్రేష్ఠం. ధీరుడైనవాడు వివేకంతో అంతరాత్మను దర్శించగలగాలి. అంతరాత్మయే స్వచ్ఛమూ, శాశ్వతమూ అని తెలుసుకున్న వాడు పవిత్రుడూ, శాశ్వతుడూ అవుతాడు. ఇదే బ్రహ్మవిద్య. బ్రహ్మజ్ఞానం. ఈవిధంగా యమధర్మరాజు చెప్పినదంతా శ్రద్ధగా విన్న నచికేతుడు నిర్మలుడై, మృత్యువును జయించి పరబ్రహ్మత్వాన్ని పొందాడు. నచికేతుణ్ణి ఆదర్శంగా తీసుకుని కఠోపనిషత్తులో చెప్పిన ఆత్మజ్ఞానాన్ని గురువు సన్నిధిలో శ్రద్ధగా అధ్యయనం చేసి, అభ్యసించి, అనుభూతిని పొందినవారు జీవన్ముక్తులై బ్రహ్మజ్ఞులు అవుతారు. ఓం సహనావవతు, సహనౌ భునక్తు సహవీర్యం కరవావహై, తేజస్వినా వధీతమస్తు, మా విద్విషావహై ఓం శాంతిశ్శాంతి శాంతిః - డా. పాలపర్తి శ్యామలానంద ప్రసాద్ -
వైన్ తాగి 107 ఏళ్ళు బతికాడు..!
ఇటీవల చికిత్స కోసం ఆస్పత్రికి వెళ్ళిన ఓ 107 ఏళ్ళ వృద్ధుడి జీవన విధానం అందర్నీ ఆశ్చర్యపరిచింది. అతడు కేవలం రెడ్ వైన్ మాత్రమే తాగి బతికాడన్న విషయం తెలిసి అంతా విస్మయం చెందారు. స్పెయిన్ గాల్సియాలోని విగోకి చెందిన యాంటోనియో డొకాంపో గార్సియా క్రితం వారం అనారోగ్యంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. బతికున్నంత కాలం తాను స్వయంగా ఇంట్లో తయారు చేసుకున్న రెడ్ వైన్ మాత్రమే తాగేవాడట. డొకాంపో మధ్యాహ్న భోజనానికి బదులుగా రెండు బాటిల్స్... డిన్నర్ కు బదులుగా మరో రెండు బాటిల్స్ రెడ్ వైన్ తాగేవాడు. అంటే ఒక్కసారి అతడు తాగే మొత్తం వైన్ ఒకటిన్నర లీటరు వరకు ఉంటుందని అతడి కుమారుడు మిగ్వెల్ డొకాంపో తెలిపాడు. తామిద్దరూ కలిసి ఇంట్లోనే నెలకు రెండు వందల లీటర్ల రెడ్ వైన్ తయారు చేసేవాళ్ళమని, నీళ్లు కూడా తాగకుండా తన తండ్రి వైన్ మాత్రమే ఆహారంగా తీసుకునేవాడని చెప్తున్నాడు. 107 సంవత్సరాలపాటు తన తండ్రి ఎంతో ఆరోగ్యంగా బతికారని... స్పానిష్ అంతర్యుద్ధంలో ప్రాంకో కోసం పోరాటం తరువాత వైన్ ఉత్పత్తి కేంద్రం.. బొడేగాస్ డొకాంపో స్థాపించారని, అందుకోసం రబాదావియా టౌన్ లో స్వంత ద్రాక్షతోట ఏర్పాటు చేసుకున్నారని తెలిపాడు. డొకాంపో కేవలం కెమికల్ ఫ్రీ ఆర్గానిక్ వైన్ ను మాత్రమే తాగేవాడు. అయితే అతడు ఉత్పత్తి చేసిన వైన్ లో ఎక్కువ భాగం అమ్మేయగా... మిగిలిన వైన్ తో పాటు, అతని ద్రాక్షతోటను ప్రస్తుతం అతడి మేనల్లుడు జెరోనిమో డొకాంపో నిర్వహిస్తున్నాడు. డొకాంపో సంవత్సరానికి 60,000 లీటర్ల వైన్ ను ఉత్సత్తి చేసి, అందులో 3 వేల లీటర్లను తన కోసం ఉంచుకొనేవాడు. అయితే తాను అన్నేళ్ళు ఆరోగ్యంగా బతకడానికి వైనే కారణమని ఎప్పుడూ చెప్తుండేవాడట. -
నలుగురికి ప్రాణదాత... ఆ బాలుడు
పంజగుట్ట: రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ 12 ఏళ్ల బాలుడికి బ్రెయిన్‌డెడ్ అయింది. అయితే, ఇదే ప్రమాదంలో తీవ్రగాయాలకు గురై ఆసుపత్రిలో చికిత్సపొందుతున్న అతని తల్లిదండ్రులు... తన కొడుకు మరణించినా నలుగురి ప్రాణాలు నిలిపి చిరంజీవి కావాలని అవయవదానం చేశారు. నిమ్స్ జీవన్‌దాన్ ప్రతినిధి అనూరాధ కథనం ప్రకారం ... ప్యారడైజ్ బాలంరాయి వద్ద నివాసం ఉండే పి.సత్యనారాయణ జీఎంఆర్ కార్గోలో మేనేజర్. భార్య విమల కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి. వీరికి వైష్ణవ్ (12) కొడుకు ఉన్నాడు. సత్యనారాయణ దంపతులు ఈనెల 12న కారులో వైష్ణవ్‌తో పాటు బంధువుల పిల్లలు ముగ్గురితో కలిసి రామోజీ ఫిలింసిటీ వద్ద నుంచి వస్తుండగా ట్రాక్టర్ ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో కారు వెనుక కూర్చున్న నలుగురు పిల్లలలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా వైష్ణవ్‌కు తీవ్రగాయాలయ్యాయి. కారు నడుపుతున్న సత్యనారాయణకు ఛాతీపై బలమైన గాయాలు కాగా. విమల కాలు విరిగింది. ముగ్గురినీ వెంటనే సన్‌షైన్ ఆసుపత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం వైష్ణవ్‌ను అక్కడి నుంచి లక్డికాపూల్‌లోని గ్లోబల్ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతున్న వైష్ణవ్‌కు మంగళవారం బ్రెయిన్ డెత్ అయింది. జీవన్‌దాన్ ప్రతినిధులు సన్‌షైన్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సత్యనారాయణ, విమల వద్దకు వెళ్లి విషయం చెప్పి వారిని వైష్ణవ్ అవయవాలను దానం చేసేందుకు ఒప్పించారు. వైద్యులు వైష్ణవ్ శరీరం నుంచి కిడ్నీలు, కాలేయం, గుండెను తొలగించారు. ఆసుపత్రి నుంచి అంబులెన్స్‌లో శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు, అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో చెన్నైలోని ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రి నుంచి అంబులెన్స్ ఎయిర్‌ఫోర్టుకు వెళ్లే సమయంలో ట్రాఫిక్ జామ్ కాకుండా పోలీసులు ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. -
‘కూలి’న బతుకులు..
పొట్టచేత పట్టుకొని వలసబాట పట్టారు.. రాష్ట్ర కాని రాష్ట్రం అయినా.. కడుపునింపుకుందామని కర్ణాటకకు వెళ్లారు. ఉర్సులో ఒకరు టిఫిన్ సెంటర్ పెట్టారు. మరొకరు స్వీట్‌హౌస్‌లో పనిచేస్తున్నారు. ఎంతోకొంత సంపాదించి కుటుంబానికి ఆసరాగా ఉందామనుకున్న వారి జీవితాలు శిథిలాల్లో కలిసిపోయాయి. వాటర్‌ట్యాంకు కుప్పకూలి వారి ప్రాణాలు హరించింది. టిఫిన్ సెంటర్ నిర్వహిస్తున్న మహిళ గర్భవతి కావడంతో ఆ ఇంట్లో రోదనలు మిన్నంటాయి. మాగనూర్/గట్టు: రెక్కాడితే గాని డొక్కాడని కుటుంబాలు వారివి. చిరువ్యాపారంతో కుటుంబాన్ని నెట్టుకొస్తున్న ఓ మహిళ, యజమాని వద్ద జీతం కుదిరి అమ్మానాన్నలకు చేదోడువాదోడుగా ఉంటున్న మరో యువకుడు శనివారం కర్ణాటకలోని యాపల్‌దిన్నె జంగిల్‌సాబ్ ఉర్సు ఉత్సవాల్లో వాటర్ ట్యాంకు కూలి దుర్మరణం పాలయ్యారు. ఈ ప్రమాదంలో మృతిచెందిన ఐదుగురిలో జిల్లావాసులు ఇద్దరు ఉన్నారు. యాపల్‌దిన్నె గ్రామంలో ఏటా జరిగే జంగిల్‌సాబ్ ఉర్సు ఉత్సవాలకు వేలాది మంది భక్తులు హాజరై తమ మొక్కులు చెల్లించుకున్నారు. ఈ నేపథ్యంలో చిరువ్యాపారులు దుకాణాలను ఏర్పాటుచేసి పిల్లల ఆట వస్తువులు, తినుబండారాలు, గాజులు తదితర వాటిని విక్రయిస్తూ పొట్టపోసుకుంటారు. ఈ క్రమంలో జిల్లాకు చెందిన ఉసేన్(23) స్థానికంగా మిఠాయి దుకాణంలో జీతం కుదిరాడు. మరో మహిళ షాజాహాన్(25) అక్కడే జాతరలో టిఫిన్ సెంటర్ నిర్వహిస్తోంది. ఇదిలాఉండగా, శనివారం ఉదయం కొందరు నీళ్లు తీసుకురావడానికి, మరికొందరు స్నానాలు చేసేందుకు సమీపంలో ఉన్న వాటర్‌ట్యాంక్ వద్దకు వెళ్లారు. ఇంతలో ట్యాంకు ఢమాల్.. అని పె...ద్దశబ్దం చేస్తూ కూలిపోడంతో అక్కడే ఉన్న ఉసేన్, షాజాహాన్తో పాటు మరో ముగ్గురు వీరేష్(25), దుర్గప్ప(55), జోమెల్(40) శిథిలాల కిందపడి అక్కడికక్కడే మృత్యువాతపడ్డారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. అమ్మానాన్నకు తోడుగా.. గట్టు మండలకేంద్రానికి చెందిన తెలుగు ఊసేన్ది నిరుపేద కుటుంబం. తండ్రి డబ్బా మల్లయ్య తన కొడుకును గ్రామానికి చెందిన మిఠాయి దుకాణం యజమానురాలు రమాదేవి వద్ద జీతం కుదిర్చి తన భార్యతో కలిసి గార్లపాడుకు వలసవెళ్లారు. ఉదయం స్నానం చేసి తాగునీళ్లు తీసుకురావడానికి వెళ్లిన తెలుగు ఊసేన్ వాటర్‌ట్యాంకు కూలడంతో మృత్యువాతపడ్డారు. తోటి మిఠాయి దుకాణం వారు మృతదేహాన్ని గట్టుకు తీసుకొచ్చి విషయాన్ని కుటుంబ సభ్యులకు తెలియజేశారు. భర్త, పిల్లల పోషణ కోసం.. మరో మృతురాలు గద్వాల మండలం జమ్మీచెడు గ్రామానికి చెందిన షాజహాన్ నిండు గర్భిణి. తన భర్త యూసుఫ్ చేయి విరగడంతో అన్నీ తానై టిఫిన్ సెంటర్‌ను నిర్వహిస్తూ కుటుంబాన్ని నెట్టుకొస్తుంది. చాలాఏళ్ల క్రితం ఎమ్మిగనూరుకు వలస వెళ్లారు. అక్కడి నుంచి జాతరలు, ఉర్సులకు వెళ్తూ అక్కడే టిఫిన్ సెంటర్‌ను నిర్వహించేవారు. ఈ క్రమంలోనే యాపల్‌దిన్నె ఉర్సుకు వెళ్లారు. ముగ్గురు పిల్లలు షబానా, షాన్వాజ్, ఖలీల్ పోషణ బాధ్యతలను తన భుజాలపైనే వేసుకుంది. స్థానిక జంగిల్‌సాబ్ ఉర్సు ఉత్సవాల్లో టిఫిన్ సెంటర్‌ను నిర్వహిస్తున్న షాజహాన్ తాగునీళ్లు తీసుకొచ్చేందుకు సమీపంలో ఉన్న వాటర్‌ట్యాంకు వద్దకు వెళ్లింది. ట్యాంకు కూలడంతో అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది. ప్రమాదానికి కారణాలివే.. యాపల్దిన్నెలో ప్రమాదానికి కారణమైన వాటర్ ట్యాంక్ ను ఇటీవలే నిర్మించి.. క్యూరింగ్ సరిగాచేయలేదు. సిమెంట్ తక్కువగా, ఇసుక ఎక్కువగా వేసి నిర్మించడంతో నీటి సామర్థ్యాన్ని తట్టుకోలేకపోయింది. ఈ ట్యాంకు నిర్మాణం కోసం ప్రభుత్వం రూ.3.20లక్షలు మంజూరుచేయగా, అందులో కాంట్రాక్టర్ కక్కుర్తిపడి కేవలం రూ.90 వేలల్లోనే ట్యాంకును నిర్మించినట్లు స్థానికులు చెప్పారు. వారం రోజుల క్రితం నిర్మించిన ట్యాంకు నీళ్లు నింపకుండానే కూలిపోయిందని వాపోయారు. సమీక్షించిన కలెక్టర్ శనివారం జిల్లాకేంద్రంలో జరుగుతున్న విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశంలో గద్వాల ఎమ్మెల్యే డీకే అరుణ యాపల్‌దిన్నె ఘటనను ప్రస్తావిస్తూ మృతుల్లో జిల్లావాసులు ఉన్నందున సహాయక చర్యల్లో పాల్గొనేందుకు జిల్లా నుంచి బృందాన్ని పంపించాలని కలెక్టర్ జీడీ ప్రియదర్శినిని కోరారు. స్పందించిన ఆమె అప్పటికే గద్వాల ఆర్డీఓ అబ్దుల్హామీద్ను సంఘటనస్థలానికి వెళ్లాల్సిందిగా ఆదేశించారు. ఆయన రాయిచూర్ ప్రభుత్వాసుపత్రికి చేరుకుని మృతదేహాలను వారి స్వగ్రామాలకు తీసుకెళ్లేందుకు ప్రత్యేక వాహనాలను ఏర్పాటుచేశారు. అలాగే గట్టు మండల కోఆప్షన్ సభ్యుడు మన్నెసాబ్, ఎస్ఎంసీ చైర్మన్ తిమ్మయ్య, టీఆర్ఎస్ నేత రామకృష్ణారెడ్డి యాపల్దిన్నెకు వెళ్లి సహాయకచర్యల్లో పాల్గొన్నారు. -
పట్టాలెక్కిన పసితనం!
పేదరికం... ప్రపంచాన్ని వణికించే ఎన్నో విషయాల్లో ఈ నాలుగక్షరాల పదం కూడా ఉంది. ఇది ఎన్నో దేశాలను శాసిస్తోంది. ఎన్నో జీవితాలను వేధిస్తోంది. గుప్పెడు మెతుకులు కరువై కడుపును రగిల్చే ఆకలి మంటలు, తల దాచుకోవడానికి చిన్న గూడైనా లేని బతుకులు, ఒంటిని కప్పుకోవడానికి జానెడు గుడ్డ కరువైన జీవితాలు... ఇవన్నీ పేదరికానికి సాక్ష్యాలు! ప్రముఖ ఫొటోగ్రాఫర్ తుర్జాయ్ చౌదరి కెమెరా కళ్లు ఎప్పుడూ ఈ పేదరికాన్ని చూసి చెమ్మగిల్లుతుంటాయి. ఎక్కడ ఎవరు దీనావస్థలో కనిపించినా చప్పున బంధిస్తాయి. ఈ ఫొటో వాటిలో ఒకటి. బంగ్లాదేశ్‌లోని ఓ మురికివాడలో సంచరిస్తున్నప్పుడు... అనుకోకుండా ఈ దృశ్యం చౌదరి కంటపడింది. అమ్మానాన్నలు కూలిపనికి వెళ్లిపోతే, తన చిట్టి తమ్ముడిని చూసుకోవాల్సిన బాధ్యత ఈ చిన్నారి తల్లిమీద పడింది. ఆకలితో ఏడుస్తోన్న తమ్ముడికి బువ్వ తినిపించడానికి అమ్మ అవతారమెత్తింది. ఆడిస్తూ, లాలిస్తూ ఇలా పట్టాల మధ్యకు చేరింది. రైళ్లు వస్తాయన్న భయం లేదు. ఏదైనా ప్రమాదం వాటిల్లుతుందన్న చింత లేదు. ఎలాగైనా తన తమ్ముడి బుల్లి బొజ్జ నింపాలన్న తపన తప్ప! ఆ తపనను ఒడిసిపట్టాడు చౌదరి. పేదరికం సాక్షిగా పట్టాలెక్కిన బతుకుల్ని ప్రపంచానికి స్పష్టంగా చూపించాడు! -
చల్లపల్లి కేంద్రంగా జోరుగా జూదం
బడుగులను చిదిమేస్తున్న నంబర్లాట రోడ్డున పడుతున్న బడుగులు రోజుకు రూ.5 లక్షలకు పైగా చేతులు మారుతున్న వైనం పట్టించుకోని పోలీసులు చల్లపల్లి : నంబర్లాట బడుగుల బతుకులను చిదిమేస్తోంది. ప్రత్యేకించి కాయకష్టం చేసి పొట్టపోసుకొనే వారిని టార్గెట్ చేసుకుని సాగుతున్న ఈ ఆట వల్ల సామాన్యుల జీవితాలు రోడ్డున పడుతున్నాయి. పగలంతా కష్టపడి సంపాదించిన సొమ్మును అరవెరైట్లు పెరుగుతుందన్న ఆశతో సాయంత్రం వేళ ఆటలో పెట్టి, తీవ్రంగా నష్టపోతున్నారు. ఒకప్పుడు చల్లపల్లికి మాత్రమే పరిమితమైన నంబర్లాట ఇప్పుడు ఘంటసాల, మోపిదేవి మండలాలకు విస్తరించింది. ఇదంతా పోలీసులకు తెలిసినా పట్టించుకోక పోవడం విమర్శలకు తావిస్తోంది. నంబర్లర్లాట ఇలా.. చల్లపల్లి ప్రాంతంలో నంబర్లాటను బ్రాకెట్ అంటారు. ప్రతిరోజూ ఓ దినపత్రికలో వచ్చే అసోం లాటరీ నంబర్లను ఎంచుకుని ఆట మొద లెడతారు. చివరి రెండు నంబర్లను ఎంచుకున్న వారిని డబుల్డిజిట్ అంటారు. ఈ ఆటలో వారు కోరుకున్న చివరి రెండు నంబర్లు వస్తే.. వారు లాటరీలో పెట్టినప్రతి రూపాయికి రూ.66 చొప్పున (66 రెట్లు) చెల్లిస్తారు. ఓపెనింగ్, క్లోజింగ్‌లో ఒక నంబరును ఎంచుకునే వారిని సింగిల్ డిజిట్ అంటారు. ఈ ఆటలో కోరుకున్న నంబర్లు వచ్చిన వారికి రూపాయికి పదిరూపాయలు మాత్రమే ఇస్తారు. రోజుకు రూ.5లక్షలు చల్లపల్లి కేంద్రంగా జరుగుతున్న నంబర్లాటలో రోజుకు రూ.5లక్షల వరకూ చేతులు మారుతున్నట్లు తెలిసింది. నలుగురు నిర్వాహకుల పరిధిలో 45 మంది బుక్కర్లు ఉదయం ఏడు గంటలకే ఆయా గ్రామాల్లోకి వెళ్ళి ఒక్కొక్కరు 25 నుంచి 60 మంది ఆటగాళ్ల నుంచి నంబర్లు, పందెం డబ్బు సేకరిస్తారు. ఒక్కో వ్యక్తి రూ.5 రూపాయల నుంచి రూ.వెయ్యి వరకూ నంబర్లపై పందెం కాస్తుంటారు. బుక్కర్లు చిన్న కాగితాలపై ఆ నంబర్లను రాసి ఇస్తారు. ప్రతిరోజూ సాయంత్రం 4గంటలకు చల్లపల్లిలోని ఓ నెట్ సెంటర్లో అసోం లాటరీని నెట్లో ఓపెన్‌చేసి నిర్వాహకులు దాని కాపీని తీసుకుంటారు. అనంతరం ఆ లిస్టును బుక్కర్లకిచ్చి ఎంచుకున్న నంబర్లు వచ్చినవారికి ఒప్పందం ప్రకారం డబ్బులిచ్చేస్తారు. సుమారు 3వేల మంది ఈ ఆటకు బానిసలుగా మారారంటే ఆట ఏస్థాయిలో సాగుతుందో అర్థం చేసుకోవచ్చు. బలవుతున్న బడుగులు చిరు వ్యాపారులు, ముఠా, దినసరి కూలీలు, రిక్షాపుల్లర్లు, ఆటోడ్రైవర్లు, షాపుల్లో పనిచేసే వర్కర్లు నంబర్లాట ఎక్కువగా ఆడుతుంటారు. చివరి రెండు నంబర్లు ఎంచుకున్నవారికి 66 రెట్లు సొమ్ము వస్తుండటంతో ఎక్కువ మంది ఆశగా ఈ ఆటనే ఆడుతుంటారు. ఈ ఆట ద్వారా డబ్బు గెలుచుకునేది చాలా తక్కువమంది. డబ్బు పోగొట్టుకున్నవారే అధికం. కొందరైతే పనిచేస్తే వచ్చే డబ్బులు చాలక అప్పులు తెచ్చి ఆటలో పెట్టి డబ్బులు పోగొట్టుకుంటున్నారు. గ్రామాలకు పాకుతోంది.. గతంలో ఈ ఆట చల్లపల్లి పరిసర ప్రాంతాల్లో మాత్రమే సాగేది. ప్రస్తుతం మోపిదేవి, ఘంటసాల మండలాకు విస్తరించింది. చల్లపల్లి సెంటర్, నారాయణరావునగర్, పాగోలు, పురిటిగడ్డ, పెదకళ్లేపల్లిరోడ్, సాలిపేట, రామానగరం, లక్ష్మీపురం, యార్లగడ్డరోడ్, పురిటిగడ్డ, నదకుదురు, మోపిదేవి మండలం వెంకటాపురం, కఫ్తానుపాలెం, పెదప్రోలు, ఘంటసాల మండలం కొడాలి, చిట్టూర్పులకు పాకింది. పోలీసుల ప్రోత్సాహంతోనే .. నాలుగేళ్ల క్రితం చల్లపల్లి కేంద్రంగా నంబర్లాట జోరుగా సాగింది. అప్పట్లో పలుమార్లు గొడవలు జరగడం, చాలామంది పేదలు రోడ్డున పడటంతో అప్పటి ఎస్పీ హరికుమార్ తీవ్ర చర్యలు తీసుకోవడంతో రెండేళ్ల పాటు ఈ ఆట కనుమరుగైంది. ఆ తర్వాత చల్లపల్లికి బదిలీపై వచ్చిన ఓ ఎస్.ఐ ఈ ఆటను పునఃప్రారంభించేందుకు ప్రోత్సాహం అందించారు. తద్వారా నిర్వాహకుల నుంచి పెద్ద ఎత్తున ముడుపులు పొందారని ఆరోపణలు వెల్లువెత్తాయి. అనంతరం వీఆర్‌పై ఎస్ఐ బదిలీ అయినప్పటికీ తరువాత వచ్చిన పోలీస్ అధికారులు జోరందకున్న నంబర్లాటను అరికట్టలేక పోయారు. ఇప్పుడు కూడా పోలీసులకు పెద్ద ఎత్తున ముడుపులు ముట్టజెపుతున్నట్టు నిర్వాహకులు బహిరంగంగానే చెబుతున్నారు. నంబర్లాటపై పత్రికల్లో, టీవీల్లో వార్తలు రాకుండా చూసుకోవాలని పోలీసులే ఉచిత సలహా ఇచ్చినట్టు తెలిసింది. గతంలో ‘సాక్షి’లో పలుసార్లు నంబర్లాటపై కథనాలు వచ్చినపుడు కొద్దిరోజులు కట్టడి చేసినప్పటికీ తరువాత మళ్లీ మామూలయిపోయింది. పోలీస్‌స్టేషన్‌కు దగ్గరలోనే.. చల్లపల్లి పోలీస్‌స్టేషన్‌కు అతి సమీపంలోనే నంబర్లాట జరుగుతున్నప్పటకీ పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోపోవడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. స్ధానిక సంతబజార్, ప్రధాన సెంటర్లోని పెట్రోల్ బంకు సమీపంలో నిర్వాహకులు యథేచ్చగా నంబర్లాట సాగిస్తున్నప్పటికీ పోలీసులు పట్టించుకోవడం లేదు. బడుగుల జీవితాలను రోడ్డు పాలు చేస్తున్న నంబర్లాటను అరికట్టేందుకు పోలీసు ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని ఈ ప్రాంత వాసులు కోరుతున్నారు. -
ఇలా చేయండి!
‘రిటైరయ్యాక కూడా జీవితం ఉంటుంది ఆ జీవితాన్ని వ్యర్థంగా గడపరాదు... అర్థవంతంగా గడపాలి’ ఇది చదువుల శకుంతలమ్మ చెప్పే సూక్తి. ఈ లెక్కల టీచర్ భాషలో ‘అర్థవంతం’... అంటే పరోపకారం! అప్పుడే ఆమె దగ్గర లెక్క సరిగ్గా కుదురుతుంది. చదువంటే డిగ్రీ కాదు... జీవితాలు బాగుపడడం... ఇది ఆమె చెప్పే మరో సూక్తి. లెక్కల్లో విలువలకు నైతిక విలువలను రంగరించడమే ఆమెకు తెలిసిన లెక్క. దారిద్య్రరేఖకు దిగువన ఉన్న వారికి చదువు చెప్పడం ఆమెకు ఆనందం. హైదరాబాద్‌లోని అశోక్‌నగర్ క్రాస్‌రోడ్స్ నుంచి లోపలికి వెళ్తే అశోక్‌నగర్ కల్చరల్ అసోసియేషన్ వారి కమ్యూనిటీ భవనం. ఆ భవనంలోని మధ్య హాలు గ్రంథాలయం. కాలనీలోని పెద్దవాళ్లు పుస్తకాలు చదువుకుంటున్నారు. అదే హాల్లో ఒక పక్కగా, మరో గదిలో ఎనిమిది, తొమ్మిది, పదవ తరగతి పిల్లలకు ట్యూషన్ క్లాసులు జరుగుతున్నాయి. ఆ భవనం గేటు ఎదురుగా కనిపించే ఇల్లే వేమూరి శకుంతలది. ఆమె ఇంట్లో... దాదాపుగా పదిమంది పెద్ద పిల్లలున్నారు. హారిక... వాసవి కాలేజ్‌లో కంప్యూటర్ సైన్స్‌లో బీటెక్ పూర్తి చేసింది. క్యాంపస్ ప్లేస్మెంట్లో కాగ్నిజెంట్ టెక్నాలజీ సొల్యూషన్స్‌లో ఉద్యోగం వచ్చింది. ఆగస్టులో ఉద్యోగంలో చేరనుంది. రమాలీల... ఈ అమ్మాయి పాలిటెక్నిక్ విద్యార్థి. ఈ-సెట్లో 18వ ర్యాంకు తెచ్చుకుంది. ఆ పక్కనే ఉన్న కిరణ్‌సాయి 128వ ర్యాంకు తెచ్చుకున్నాడు. కౌన్సెలింగ్ మొదలైతే వీరిద్దరూ ఈ ఏడాది ఇంజినీరింగ్ రెండవ సంవత్సరంలో చేరుతారు. లీలావతి జనరల్ నర్సింగ్ అండ్ మిడ్వైఫరీ కోర్సులో సీటు తెచ్చుకుంది. ‘‘ఈ అమ్మాయికి లెక్కల మీద పట్టు పెద్దగా లేదు. అందుకే తనకు ఇష్టమైన మరో రంగాన్ని సూచించాను’’ అంటూ ఒక్కొక్కరినీ పరిచయం చేశారు 79 ఏళ్ల వేమూరి శకుంతల. ఈ పిల్లలందరూ వాళ్ల కుటుంబాల నుంచి తొలితరం విద్యావంతులే అంటే ఆశ్చర్యం కలుగుతుంది. వీరి తల్లిదండ్రుల్లో ఎవరూ పిల్లల చదువు కోసం వేలు, లక్షల రూపాయలు ఖర్చు చేయగలిగిన స్థితిలో లేరు. ఇస్త్రీ బండితో బతుకు వెళ్లదీసేవాళ్లు, ఇళ్లలో పనులు చేసుకునేవాళ్లు, వాచ్‌మ్యాన్, అటెండర్ వంటి చిన్న ఉద్యోగాలు చేస్తున్న వాళ్లే. ‘‘మేమంతా ఇంత బాగా చదివి, మంచి ఉద్యోగాలు తెచ్చుకుంటున్నామంటే అమ్మ వల్లనే’’ అన్నారు ఈ పిల్లలందరూ ముక్తకంఠంతో. ‘‘మేము కూడా మంచిగా చదువుకుని ఉద్యోగాలు చేస్తాం’’ అని చిన్న పిల్లలు వంత పలుకుతున్నారు. లెక్కల టీచరమ్మ! నగరంలోని ఉన్నత విద్యావంతులు, సంపన్న వర్గాల పిల్లలు చదువుకునే కాలేజ్‌గా పేరున్న ఫ్రాన్సిస్‌లో మంచి లెక్చరర్‌గా గుర్తింపు తెచ్చుకున్న శకుంతల, లెక్కల పాఠాలను దారిద్య్ర రేఖకు దిగువనున్న వారికి అందించడం వెనుక ఒక ఆసక్తికరమైన సంఘటన ఉంది. ‘‘మా ఇంట్లో పని చేసే ఆమె ఒకరోజు చాలా బాధపడుతూ... తన రెక్కల కష్టంతో కొడుకుని చదివిస్తున్నానని, కానీ కొడుక్కి లెక్కలు రావడం లేదని, వాడికి లెక్కలు నేర్పించమని అడిగింది. ఫెయిలవుతాడని భయపడిన ఆ కుర్రాడు 72 మార్కులతో పాసయ్యాడు. రిటైరయ్యాక ఇదే వ్యాపకం’’ అన్నారామె చుట్టూ ఉన్న పిల్లలను చూస్తూ. విద్యార్థుల మధ్య వంతెన శకుంతలమ్మ దగ్గర చదువుకుని ఉన్నత స్థాయిలో ఉన్న సంపన్న విద్యార్థులు ఆమెకి చేదోడుగా ఉంటున్నారు. ఫీజులు కట్టడానికి ఒక్కో విద్యార్థినీ ఒక్కో సంపన్న పూర్వ విద్యార్థితో అనుసంధానం చేస్తారామె. సమాజంలో దిగువ స్థాయిలో జీవిస్తున్న వారి కోసం రిజర్వేషన్లు పెంచడమే పరిష్కారం కాదంటారామె ‘‘ఓపెన్ కేటగిరీలో ఉద్యోగాలు సంపాదించుకోగలిగినంత నాణ్యమైన విద్యనందించాలి. అప్పుడు ఎవరికి వారు పోటీ ప్రపంచంలో నిలబడగలిగే శక్తి తెచ్చుకుంటారు. ధైర్యాన్ని సంపాదించుకుంటారు’’ అని తన అభిప్రాయాన్ని కుండబద్దలు కొట్టారు శకుంతలమ్మ. ఆమె చెబుతున్నట్లే ఆమె దగ్గర చదువుకుంటున్న విద్యార్థులు రిజర్వేషన్ కోటా కోసం చూడడం లేదు. ఓపెన్‌లో సీటు తెచ్చుకుని చదువుకుంటున్నారు. ‘ఓపెన్‌లో మెరిట్ సీటు తెచ్చుకుంటే నాకదే మీరిచ్చే గురుదక్షిణ’ అని పిల్లలకు లక్ష్యాన్ని స్థిరీకరిస్తున్నారామె. - సాక్షి ప్రతినిధి కొంతైనా చేయాలని... శకుంతల మేడమ్ చేస్తున్న పని నాకు బాగా నచ్చింది. ఆమెలా కాకపోయినా కొంతైనా చేయగలిగితే బావుణ్ణు అనుకునేదానిని. మా పాపకు పెళ్లయిన తర్వాత నేను కూడా ఇందులో భాగస్వామినయ్యాను. పిల్లలకు ట్యూషన్ క్లాసులు, వాళ్ల చేత ఏయే పరీక్షలు ఎప్పుడు రాయించాలి... వంటి పనుల్లో మేడమ్‌కి సహాయంగా ఉంటున్నాను. - శ్రీవల్లి, శకుంతలమ్మకు సహకార భాగస్వామి -
విధుల పంచాయితీ
వివాదంగా మారిన ఉద్యోగుల కాపలా {స్టాంగ్‌రూంల వద్ద సెక్యూరిటీ గార్డు బాధ్యతలపై విమర్శలు జెడ్పీ సీఈఓ ఆదేశాలపై సర్వత్రా నిరసన విధుల్లో చేరిన సూపరింటెండెంట్లు, సీనియర్ అసిస్టెంట్లు మహిళా ఉద్యోగులకు ఊరటనిచ్చిన మినహాయింపు జిల్లా పరిషత్, న్యూస్‌లైన్ : స్థానిక ఎన్నికలకు సంబంధించి బ్యాలెట్ బాక్స్‌లు భద్రపర్చిన స్ట్రాంగ్‌రూంల వద్ద జిల్లా పరిషత్ పరిధిలో పనిచేస్తున్న సూపరింటెండెంట్లు, సీనియర్ అసిస్టెంట్లను కాపలా పెట్టడం వివా దంగా మారింది. జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల పోలింగ్ ముగిసిన విషయం తెలిసిందే. ఈ మేరకు జిల్లాలోని ములుగు, పరకాల, మహబూబాబాద్, వరంగల్, నర్సంపేట, జనగామ రెవెన్యూ డివిజన్ కేంద్రాల్లో ఆరు స్ట్రాంగ్ రూంలను ఏర్పాటు చేసి బ్యాలెట్ బాక్స్‌లను భద్రపర్చారు. వీటి భద్రత బాధ్యతలను పోలీసు యంత్రాంగం చేపట్టింది. అయితే ఓట్ల లెక్కింపు ప్రక్రియను సుప్రీం కోర్టు వాయిదా వేయడంతో స్ట్రాంగ్ రూంల వద్ద రాష్ట్ర ఎన్నికల కమిషన్ కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టింది. సుప్రీం ఆదేశాల ప్రకారం వచ్చే నెల ఏడో తేదీ తర్వాతే లెక్కింపు చేపట్టాలి. తుది విడత పోలింగ్ జరిగిన రోజు నుంచి లెక్కేస్తే... సుమారు 30 రోజుల వ్యవధి ఉంది. ఈ నేపథ్యంలో స్ట్రాంగ్ రూంలలో భద్రపర్చిన బ్యాలెట్ బాక్సులను ఎప్పటికప్పుడు పరిశీలించాలని సీఈసీ నిర్ణయం తీసుకుంది. స్ట్రాంగ్ రూంలు జిల్లా కేంద్రంలో ఉంటే కలెక్టర్ గానీ... జేసీ గానీ, రెవెన్యూ డివిజన్లలో ఉంటే ఆయా డివిజన్లకు చెందిన ఆర్డీఓలు ప్రతిరోజు ఉదయం, సాయంత్రం వేళల్లో పరిశీలించాలని ఉత్తర్వులు జారీ చేసింది. బ్యాలెట్ పేపర్లు చెదలు, చీడపురుగులతో పాడవకుండా పరిశీలించేందుకు ఆర్డీఓలతోపాటు ఆయా మండలాలకు చెందిన ఆర్ఓలు, ఏఆర్ఓలు... పోటీ చేసిన అభ్యర్థుల సమక్షంలో వారంలో ఒక రోజు స్ట్రాంగ్ రూముల్లో ఉన్న బ్యాలెట్ బాక్స్‌లను పరిశీలించాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. ఎస్ఈసీ రాష్ట్రవ్యాప్తంగా ఈ విధానాన్ని అమలు చేస్తోంది. ఇంతవరకు వ్యవహారం బాగానే ఉంది. ఈ క్రమంలో జిల్లాలో పంచాయతీరాజ్ శాఖలో పనిచేస్తున్న సూపరింటెండెంట్లు, సీనియర్ అసిస్టెంట్లకు స్ట్రాంగ్ రూంల వద్ద కాపలా ఉండాలని సీఈఓ ఆంజనేయులు ఉత్తర్వులు జారీ చేశారు. ప్రతిరోజూ ముగ్గురు చొప్పున సూపరింటెండెంట్లు, సీనియర్ అసిస్టెంట్లు మూడు షిప్టులుగా ఎనిమిది గంటలపాటు విధులు నిర్వర్తించాలని ఆదేశాలు జారీ చేయడంపై సర్వత్రా నిరసన వ్యక్తమవుతోంది. అరుుతే ఈ విధుల నుంచి మహిళా ఉద్యోగులను మినహాయించడం వారికి ఊరటనిస్తోంది. ఇది సరికాదు... ఎన్నికల్లో భాగంగా బ్యాలెట్ బాక్సులను భద్రపర్చిన స్ట్రాంగ్‌రూంల వద్ద పోలీసులు భద్రతా ఏర్పాట్లు చేపట్టినప్పటికీ... పీఆర్ ఉద్యోగులను కాపలా పెట్టడం సరికాదని తెలంగాణ పంచాయతీరాజ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు బేహర శ్రీకాంత్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా స్ట్రాంగ్‌రూంల వద్ద పోలీసులు భద్రతా ఏర్పాట్లు చూస్తుంటే... ఇక్కడ పీఆర్‌కు చెందిన ఉద్యోగులకు కూడా డ్యూటీలు వేయడం ఆశ్చర్యంగా ఉందన్నారు. పీఆర్ ఉద్యోగులు ఇప్పటి వరకు ఎన్నడూ స్ట్రాంగ్ రూంల వద్ద విధులు నిర్వర్తించలేదని... జెడ్పీ సీఈఓ నిర్ణయంతో వారు ఆందోళనలకు గురవుతున్నారన్నారు. స్ట్రాంగ్‌రూంల వద్ద పీఆర్ ఉద్యోగులను కాపలా పెట్టడం పోలీసులను అవమానించినట్లేనని పేర్కొన్నారు. ఇలాంటి వివాదాస్పదమైన నిర్ణయంపై సీఈఓ పునరాలోచించుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. -
తెల్లారిన బతుకులు
శంషాబాద్, న్యూస్‌లైన్ : తెల్లవారకముందే వారి జీవితాలు తెల్లారిపోయాయి. రాత్రి కుటుంబీకులతో మాట్లాడి నిద్రలోకి జారుకున్న కార్మికులు అంతలోనే కానరాని లోకాలకు తరలిపోయారు. నలుగురు కార్మికుల సజీవ దహనంతో శంషాబాద్ ఉలిక్కిపడింది. ‘తిలా పాపం తలా పిడికెడు’ అన్న చందంగా ఈ దుర్ఘటనలో కంపెనీ యాజమాన్యం, అధికారులు పాలుపంచుకున్నారు. అనుమతి లేని పరిశ్రమలపై దాడులు చేయాల్సిన అధికారులు మిన్నకుండిపోవడంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. ఏదైనా ఘటన జరిగినప్పుడే నేతలు మీడియా ప్రచారం కోసం ప్రగల్భాలు పలికి తర్వాత పట్టించుకోవడం లేదని స్థానికులు విమర్శిస్తున్నారు. గగన్‌పహాడ్, సాతంరాయి పారిశ్రామిక వాడలో అనుమతుల్లేని పరిశ్రమల కోకొల్లలు. గురువారం తెల్లవారుజామున అశ్రీత రబ్బరు పరిశ్రమలో జరిగిన ప్రమాదంలో నలుగురు బీహారీ కార్మికులు సజీవ దహనమవడంతో శంషాబాద్‌లో ఆందోళన నెలకొంది. రసాయనాలు సరఫరా చేసే పైపులైన్ లీకేజీ అవడంతో మంటలు ఎగిసిపడి ప్రమాదం చోటుచేసుకుంది. కన్నెత్తి చూడని అధికారులు అశ్రీత పరిశ్రమలో అన్నీ నిబంధనలకు విరుద్ధమే. ఈ కంపెనీకి పీసీబీ అధికారుల అనుమతి లేదు. సకాలంలో అధికారులు స్పందించి కఠిన చర్యలు తీసుకుంటే నాలుగు ప్రాణాలు గాలిలో కలిసిపోయేవి కావు. 15 రోజుల క్రితం స్థానికంగా లియో ఫ్లైవుడ్ పరిశ్రమలో రసాయన రియాక్టర్ పేలింది. ఈ ఘటనలో త్రుటిలో నలుగురికి ప్రాణాపాయం తప్పింది. ఆయిల్ పరిశ్రమల నుంచి వచ్చే వరిపొట్టుతో గగన్‌పహాడ్ వాసులు కూడా ఊపీరి పీల్చుకునేందుకు ఇబ్బంది పడుతున్నారు. కాలుష్యం వెదజల్లే పరిశ్రమలను ఇక్కడి నుం చి తరలించాలని రెండేళ్ల కిందటే నోటీసులు జారీ అయినా సంబంధిత అధికారులు పట్టించుకోకపోవడం గమనార్హం. ప్రాణాలకు వెల.. ఇక్కడి పరిశ్రమల్లో ఎక్కువ మంది బీహార్, ఒడిశా కార్మికులు పనిచేస్తున్నారు. కంపెనీలో తరచూ ప్రమాదాలు జరిగి ప్రా ణాలు కోల్పోతే యాజమాన్యం ఎంతోకొంత పరిహారం ఇచ్చి చేతులు దులిపేసుకుంటున్నారు. పరిశ్రమల యజమానులకు కొందరు ఖాకీలు సహకరిస్తుండటంతో ప్రమాదాలు నిత్యకృత్యం అవుతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. కంపెనీ యజమాని అరెస్టు.. కంపెనీ యజమాని కైలాష్ అగర్వాల్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని ఆర్జీఐఏ ఠాణాకు తరలించే సమయంలో కార్మిక సంఘాలు అడ్డుపడ్డాయి. మృతుల కుటుంబాలకు రూ. 15 లక్షల చొప్పున పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశాయి. ఒక్కో కుటుంబానికి రూ. 10 లక్షలు చెల్లిస్తానని యజమాని కైలాష్‌అగర్వాల్ ఆందోళనకారులను హామీ ఇచ్చారు. అనంతరం అతడిని పీఎస్‌కు తరలించారు. నలుగురి సజీవ దహనం సంఘటనతో కోపోద్రిక్తులైన గగన్‌పహాడ్ వాసులు స్థానికంగా ఉన్న ఆయిల్ పరిశ్రమలపై దాడులు చేశారు. కొన్ని వాహనాల అద్దాలను కూడా ధ్వంసం చేశారు. మృతుల్లో ఒకరు జైకిషన్ మైలార్‌దేవ్‌పల్లి డివిజన్ లక్ష్మీగూడ రాజీవ్ గృహకల్పలో ఉంటున్నాడు. ఈయనకు భార్య గీత, పిల్లలు రవికుమార్, దుర్గ ఉన్నారు. జైకిషన్ బీహార్ నుంచి పదేళ్ల క్రితం వలస వచ్చాడు. 2008లో దివంగత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి చేతులమీదుగా లక్ష్మీగూడ రాజీవ్ గృహకల్పలో ఇల్లు తీసుకున్నాడు. -
గీత స్మరణం
పల్లవి : బలె బలె బలె బలె పెద్దబావ భళిర భళిర ఓహొ చిన్నబావ కనివిని ఎరుగని విడ్డూరం సరిసాటిలేని మీ ఘనకార్యం ॥బలె॥ చరణం : 1 మీరు నూరుగురు కొడుకులు... అహ... మారుమ్రోగు చలిపిడుగులు ॥ మట్టి తెచ్చి గంభీర గుట్టలేసి... జంభారి పట్టపేన్గు బొమ్మ చేయు ఘటికులు (2) వీరాధివీరులైన శూరాతిశూరులైన మీ కాలిగోటికి చాలరు ॥బలె॥ చరణం : 2 దైవమేదీ వేరు లేదు తల్లి కంటే ఆ తల్లి కోర్కె తీర్చువారే బిడ్డలంటే ఏ తల్లీ నోచలేదు ఇంతకంటే (2) ఈ మాట కల్లకాదు ఈరేడు జగములందు మీలాంటి వాళ్లు ఇంక పుట్టరంటే ॥బలె॥ చరణం : 3 మేళాలు తాళాలు ముత్యాలముగ్గులు రతనాలు గొడుగులు సంబరాలు ॥ ఊరంత పచ్చని తోరణాలు వీరణాలు తందనాలు (2) ఊరేగే వైభవాలు బంగారు వాయనాలు ఆనందభరితమౌను జీవితాలు ॥బలె॥ చిత్రం : బాలభారతం (1972) రచన : ఆరుద్ర సంగీతం : సాలూరి రాజేశ్వరరావు గానం : ఎల్.ఆర్.ఈశ్వరి నిర్వహణ: నాగేశ్ -
నీలిరంగు కిరోసిన్‌తో ప్రాణాలకు ముప్పు
నీలిరంగు కిరోసిన్‌తో వాహనాలను నడుపడం వల్ల ప్రయాణికులు, ప్రజల ప్రాణాలకు ముప్పు వాటిల్లుతుందని జిల్లా విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారి పండరి అన్నారు. శుక్రవారం మండలంలోని బొగ్గుగుడిసె చౌరస్తా వద్ద పలు వాహనాలను ఆయన తనిఖీ చేశారు. ప్రభుత్వం రేషన్ దుకాణాల ద్వారా సరఫరా చేస్తున్న నీలిరంగు కిరోసిన్‌తో నడుస్తున్న ప్రైవేట్ వాహనాలను ఆయన సోదా చేశారు. మార్కెట్లో తక్కువ ధరకు లభిస్తున్న సబ్సిడీ కిరోసిన్‌ను వాహనాల్లో నింపి నడపడంవల్ల వచ్చే విష వాయువుల వల్ల ప్రజలు అనేక రకాల రోగాలబారిన పడుతున్నారన్నారు. వాహనాలు కిరోసిన్‌తో నడపడం వల్ల పర్యావరణం దెబ్బతినడంతోపాటు దానివల్ల వచ్చే కార్బన్ మోనాక్సైడ్ వల్ల వివిధ రకాల జబ్బులు వస్తున్నాయన్నారు. కిరోసిన్‌తో నడుస్తున్న వాహనాల ఆటకట్టించేందుకు తనిఖీలు ముమ్మరం చేస్తున్నామని పండరి తెలిపారు. ఈ సందర్భంగా పలు వాహనాలను తనిఖీ చేసి కిరోసిన్‌తో నడుపుతున్న వాటిని సీజ్ చేశారు.