భోపాల్: బీజేపీ సీనియర్ నాయకుడు కైలాష్ విజయవర్గీయ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దేశాన్ని ప్రేమించేవాళ్లందరూ తమ సోదరులేనని అన్నారు. అలాగే.. దేశానికి వ్యతిరేకంగా మాట్లాడేవాళ్ల ప్రాణాలు తీయడానికి కూడా వెనకాడబోమని వ్యాఖ‍్యానించారు. బాంగ్రోట్‌లో నిర్వహించిన పార్టీ కార్యకర్తల సమావేశంలో ఈ మేరకు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
' మేము ఎవరికీ ప్రత్యర్థులం కాదు. భారత మాతా కీ జై అనేవారందరూ మా సోదరులే. వారికోసం మా ప్రాణాలను త్యజించడానికి ముందుంటాం. కానీ భారత మాతకు వ్యతిరేకుల ప్రాణాలు తీయడానికి మాత్రం అస్సలు వెనకాడబోము' అని కైలాష్ విజయవర్గీయ మాట్లాడారు.
రామ మందిరంపై మాట్లాడిన ఆయన కాంగ్రెస్ స్వభావంపై నిప్పులు చెరిగారు. ఉత్తరప్రదేశ్‌లో రామ మందిరం ఎప్పుడు అవుతుందని కొందరు విమర్శలు చేస్తున్నారని, అలాంటివారందరూ వచ్చే జనవరిలో ప్రారంభం కాబోతున్న అయోధ్య రామాలయాన్ని దర్శించుకుని పాప పరిహారం చేసుకోవాలని హితువు పలికారు.
ఈ సందర్భంగా కైలాష్ విజయవర్గీయ కేంద్ర ప్రభుత్వం పనితీరుపై ప్రశంసలు కురిపించారు. కాశ్మీర్‌లో శాంతి పునరుద్ధరణను అందరం గుర్తించాలని అన్నారు. కాశ్మీర్‌లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితి, ఇంతకు ముందు ఉన్న పరిణామాలు అందరికీ తెలుసని అన్నారు. ప్రస్తుతం అక్కడ ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగురుతుందని చెప్పారు.
ఇదీ చదవండి: సీఎంను కించపరుస్తూ పోస్టులు.. వాట్సాప్ గ్రూప్ అడ్మిన్ అరెస్టు..
Comments
Please login to add a commentAdd a comment