speak
-
లోక్ సభలో నోరు మెదపని ఎంపీలు వీరే..
దేశంలోని ఓటర్లు తమ సమస్యలను కేంద్రం దృష్టికి తీసుకెళ్తారని ఎంపీలను పార్లమెంట్‌కు పంపిస్తారు. అయితే దీనికి విరుద్దంగా ప్రవర్తించిన ఎంపీలు కూడా ఉన్నారు. ఎంపీల ఐదేళ్ల పదవీకాలం ముగియనుండడంతో త్వరలో లోక్‌సభ ఎన్నికలు జరగనున్నాయి. 17వ లోక్‌సభలో వివిధ పార్టీలకు చెందిన తొమ్మిది మంది ఎంపీలు తమ పదవీ కాలంలో ఒక్కసారి కూడా సభలో మాట్లాడనేలేదు. లోక్‌సభ సెక్రటేరియట్ నుండి అందిన సమాచారం ప్రకారం ఈ ఎంపీలలో అమితమైన ప్రజాదరణ పొందినవారు కూడా ఉన్నారు. సినీ రంగం నుంచి రాజకీయాల్లోకి వచ్చిన సన్నీ డియోల్, శతృఘ్న సిన్హా సభలో ఒక్కమాట కూడా మాట్లాడలేదు. మరోవైపు పార్లమెంటు కార్యకలాపాల్లో పాల్గొనని నేతల వర్గంలో శత్రుఘ్న సిన్హా చేరారు. శత్రుఘ్న సిన్హా ప్రస్తుతం పశ్చిమ బెంగాల్‌లోని అసన్సోల్ నియోజకవర్గానికి చెందిన ఎంపీ. గతంలో శత్రుఘ్న సిన్హా పట్నా సాహిబ్ లోక్‌సభ స్థానానికి ఎంపీగా ఉన్నారు. బాలీవుడ్ నటుడు సన్నీ డియోల్ పార్లమెంటులో ఒక్కసారి కూడా ఎటువంటి అంశాన్ని లేవనెత్తలేదు. అదేవిధంగా కర్ణాటకలోని బీజాపూర్ స్థానానికి చెందిన బీజేపీ ఎంపి రమేష్ చంద్రప్ప జిగజినాగి కూడా ఎప్పుడూ సభలో మాట్లాడలేదు. ఉత్తరప్రదేశ్‌లోని ఘోసీ నియోజకవర్గం ఎంపీ అతుల్ రాయ్ కూడా ఈ జాబితాలోనే ఉన్నారు. -
'వారి ప్రాణాలు తీయడానికి వెనకాడబోం' బీజేపీ లీడర్ వివాదాస్పద వ్యాఖ్యలు..
భోపాల్: బీజేపీ సీనియర్ నాయకుడు కైలాష్ విజయవర్గీయ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దేశాన్ని ప్రేమించేవాళ్లందరూ తమ సోదరులేనని అన్నారు. అలాగే.. దేశానికి వ్యతిరేకంగా మాట్లాడేవాళ్ల ప్రాణాలు తీయడానికి కూడా వెనకాడబోమని వ్యాఖ్యానించారు. బాంగ్రోట్‌లో నిర్వహించిన పార్టీ కార్యకర్తల సమావేశంలో ఈ మేరకు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ' మేము ఎవరికీ ప్రత్యర్థులం కాదు. భారత మాతా కీ జై అనేవారందరూ మా సోదరులే. వారికోసం మా ప్రాణాలను త్యజించడానికి ముందుంటాం. కానీ భారత మాతకు వ్యతిరేకుల ప్రాణాలు తీయడానికి మాత్రం అస్సలు వెనకాడబోము' అని కైలాష్ విజయవర్గీయ మాట్లాడారు. రామ మందిరంపై మాట్లాడిన ఆయన కాంగ్రెస్ స్వభావంపై నిప్పులు చెరిగారు. ఉత్తరప్రదేశ్‌లో రామ మందిరం ఎప్పుడు అవుతుందని కొందరు విమర్శలు చేస్తున్నారని, అలాంటివారందరూ వచ్చే జనవరిలో ప్రారంభం కాబోతున్న అయోధ్య రామాలయాన్ని దర్శించుకుని పాప పరిహారం చేసుకోవాలని హితువు పలికారు. ఈ సందర్భంగా కైలాష్ విజయవర్గీయ కేంద్ర ప్రభుత్వం పనితీరుపై ప్రశంసలు కురిపించారు. కాశ్మీర్లో శాంతి పునరుద్ధరణను అందరం గుర్తించాలని అన్నారు. కాశ్మీర్లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితి, ఇంతకు ముందు ఉన్న పరిణామాలు అందరికీ తెలుసని అన్నారు. ప్రస్తుతం అక్కడ ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగురుతుందని చెప్పారు. ఇదీ చదవండి: సీఎంను కించపరుస్తూ పోస్టులు.. వాట్సాప్ గ్రూప్ అడ్మిన్ అరెస్టు.. -
భావ స్వేచ్ఛను కాపాడదాం.
ప్రజాస్వామ్యానికి గీటురాయి అసమ్మతి. భిన్నాభిప్రాయ ప్రకటనకు స్వేచ్ఛ లేకుంటే సామాజిక జీవి తానికి అర్థమే లేదు. కానీ నేడు పరిస్థితి దీనికి భిన్నంగా తయారైంది. నచ్చని భావాలు ప్రకటించే మేధావులు, రచయితల మీద దాడులు చేస్తున్నారు. కుట్ర కేసులు మోపి అక్రమంగా నిర్బంధిస్తున్నారు. ఆధిపత్యశక్తులకు వైవిధ్యమనే జీవన విలువ అంగీకారం కాదు. భావాలను అదుపు చేయాలనుకుంటారు. రచన అంటేనే అసమ్మతి కాబట్టి సృజనకారులపై దాడులు చేస్తున్నారు. బెది రిస్తున్నారు. రచయితలు తమ రచనలను తామే తృణీకరించుకునే పరిస్థితి కల్పిస్తున్నారు. పాలకుల భావాలపై అసమ్మతి ప్రకటించే స్వేచ్ఛ ఉండాలి. అదే ప్రజాస్వామ్యం. దేశవ్యాప్తంగా మేధావులు, రచయితల అరెస్టుల సందర్భంగా మన సుప్రీం కోర్టు ఇదే చెప్పింది. ‘అసమ్మతి అనేది ప్రజాస్వామ్యానికి సేఫ్టీ వాల్వ్ లాంటిది. దాన్ని అనుమతించకుంటే ప్రజాస్వామ్యమనే ప్రెషర్ కుక్కర్ పేలిపోతుంద’ని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. ప్రజాస్వామ్య భావనను బతికించుకుందాం. కులమత లింగ అంతరాలకు అతీతంగా మనిషిని ఉన్నతంగా నిలబెట్టే ఒక సామూహిక స్వరాన్ని వినిపిద్దాం. భావ ప్రకటనా స్వేచ్ఛకై, జీవించే స్వేచ్ఛకై మన గొంతునే ఒక ఉమ్మడి వేదిక చేద్దాం. కలెక్టివ్ వాయిస్ ఆధ్వర్యంలో వివిధ రంగాల మేధావులు, పత్రికా సంపాదకులు, ప్రముఖులు, భాగస్వామ్య సంస్థలతో వినిపిస్తున్న భావ ప్రకటన పరిరక్షణ సామూహిక స్వరంలో గొంతు కలుపుదాం. (భావప్రకటన స్వేచ్ఛ కోసం ఆదివారం మధ్యాహ్నం 2 గంటలకు సుందరయ్య విజ్ఞానకేంద్రంలో సభ) కలెక్టివ్ వాయిస్, హైదరాబాద్ -
ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డికి కేసీఆర్ ఫోన్
సాక్షి, ఇబ్రహీంపట్నం : పట్టాదారు పాస్‌పుస్తకాలు, రైతుబంధు చెక్కుల పంపిణీని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. సాధారణ ఎన్నికల్లో గెలుపునకు సోపానంగా మారుతుందని భావిస్తున్న ఈ కార్యక్రమంపై ముఖ్యమంత్రి కేసీఆర్ భారీ ఆశలు పెట్టుకున్నారు. ఈ నేపథ్యంలో రైతుబంధు, పాస్‌పుస్తకాల జారీపై ప్రజల మనోగతాన్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇందులోభాగంగా ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డితో సీఎం కేసీఆర్ ఫోన్లో సంభాషించారు. తాళ్లపల్లిగూడెంలో కిషన్‌రెడ్డి చెక్కులు పంపిణీ చేస్తుండగా.. ముఖ్యమంత్రి ఫోన్ చేసి రైతుబంధు గురించి ప్రజలు ఎమనుకుంటున్నారని అడిగి తెలుసుకున్నారు. ప్రజల స్పందన ఎలా ఉంది.. ఇంకా ఏం చేస్తే బాగుంటుందో తెలుసుకోవాలని సూచించారు. -
ఇలా..పల..కాలి!
రైట్ టు స్పీక్ హాయ్.. గైస్ అండ్ గాల్స్! ఆగండి. తప్పు పడిందిక్కడ. గైస్ కాదు. గాయ్స్. సో.. గాయ్స్ అండ్ గాల్స్.. క్లాస్ పీకడం ఎలా ఉంటుందో ఇప్పుడు మీరు వినబోతున్నారు. అలా బండి రైజ్ చేసి వెళ్లిపోకండి. రైజ్ చెయ్యడమా! అంత టైమ్ ఎక్కడిదని ఎక్కడి బండిని అక్కడే వదిలేసి పారిపోకండి. ఇదొక ఇంట్రెస్టింగ్ క్లాస్. జస్ట్ ఫై మినిట్స్ క్లాస్. పీకినట్టు ఉండదు. పీచు మిఠాయి తిన్నట్లు ఉంటుంది. ఏ బ్రాండ్‌ను మనం ఎలా పలుకుతున్నాం? అసలు ఎలా పలకాలి?ఇదీ.. టాపిక్. అవసరమా? చెవర్లెట్ కారును డ్రైవ్ చెయ్యడానికి చవర్లెట్ అనే మాటను ఎలా పలకాలో తెలుసుకుని ఉండడం అవసరమా? చవర్లెట్ కాకపోతే ఇంకోటి. మీరెంతో లవ్ చేసే బ్రాండ్ గురించి తెలుసుకోవాలని మీకు ఉండదా! అదీ సంగతి. క్లాస్ స్టార్ అవుతోంది వచ్చేయండి. CHEVROLET ఫస్ట్ ఫస్ట్ చవర్లెట్తోనే స్టార్ట్ చేద్దాం. వందేళ్ల క్రితం యూఎస్‌లోని మిషిగన్‌లో (మనం మిచిగాన్ అంటాం కదా.. అదే) 1911లో చవర్లెట్ కంపెనీ మొదలైంది. దీన్ని ఇప్పటికీ మనం చవర్లెట్ అనే అంటుంటాం. అనాల్సింది మాత్రం ‘షెవ్–రొ–లే’ అని! మొదట్లో ఈ కంపెనీని షార్ట్కర్ట్లో ‘షెవీ’ అనేవారు. GIVENCHY ఇదో ఫ్రెంచి ఫ్యాషన్ హౌస్. దునియాలో ఇంతవరకు దీన్ని కొట్టినవాళ్లు లేదు. ఈ కంపెనీ పేరును సరిగా పలికిన భారతీయుడూ లేడు. గివ్–ఎన్–చీ అంటాం మనం. అనాల్సింది మాత్రం ‘జీ–వాన్–షీ’ అని. ఇదేదో దైవాంశ సం‘భూతం’లా ఉంది! PORSCHE జర్మన్ కార్ల కంపెనీ. ఇది అన్నీ ‘హై పెర్ఫార్మెన్స్’ కార్లనే తయారుచేస్తుంది. కానీ దీన్ని ప్రొనౌన్స్ చెయ్యడంలో మాత్రం ఈ మానవ మాత్రులది పూర్ పెర్ఫార్మెన్సే! పోర్స్ అనీ, పోర్చే అని అంటాం. అనాల్సింది మాత్రం ‘పూర్–షా’ అని. COINTREAU కాక్‌టైల్స్‌లో కలుపుకునే ఈ ఫ్రెంచి లిక్కర్.. తీపి, పులుపు కలిసిన అనాసపండ్ల రసం. దీన్కొక చుక్కేసుకుంటే మీరు ఫ్రాంకోఫైల్ అయిపోతారు. అంటే.. ఫ్రాన్స్‌ను పిచ్చిపిచ్చిగా ఇష్టపడే మాలోకం అయిపోతారు. అప్పుడు మీరు దీన్ని ఎలాగైనా పలకొచ్చు కానీ, పలకాల్సింది మాత్రం ‘క్వాన్–ట్రో’ అని. జనరల్‌గా అంతా ‘కాయిన్–ట్రో’ అంటుంటారు. HYUNDAI మళ్లీ ఇంకో కారు. ఇది దక్షిణ కొరియా వాళ్లది. హ్యూన్డై అంటాం మనం. అనాల్సింది మాత్రం ‘హ్యున్–డే’ అని. CHRISTIAN LOUBOUTIN ఆడవాళ్ల లగ్జరీ బ్రాండ్ షూ. ఇలా వేస్కొని అలా వదిలేయడానికే కానీ, రఫ్ అండ్ టఫ్‌గా యూజ్ చేయడానికి లేదు. చేస్తే ఏమౌతుంది? ఇంకో జత కొనాల్సి వస్తుంది. షో రూమ్‌లోకి వెళ్లి.. లూ–బో–టిన్ అని అడగుతారు పెద్దపెద్దవాళ్లు. అడగవలసింది మాత్రం లూ–బూ–టాన్ అని. NIKE అమెరికన్ స్పోర్ట్స్ బ్రాండ్. ప్రపంచంలో సగం జనాభా ఒక రకంగా, మిగతా సగం జనాభా ఇంకో రకంగా దీనిని పలుకుతుంది. మనవాళ్లు కూడా మొన్నటి వరకు ‘నైక్’ అనేవాళ్లు. ఇప్పుడు ‘నైకీ’ అంటున్నారు. నైకీ కరెక్ట్. దుస్తులు, ఆభరణాలు, వాచీలు, బ్యాగులు, ఐ వేర్, పెర్ఫ్యూమ్లు.. చాలా ఉత్పత్తి చేస్తుంటుంది ఈ ఇటాలియన్ కంపెనీ. డాల్సే గబానా అని అనేస్తాం గబాల్న. అది తప్పు. ‘డాల్–చె గబ్–అనా’ అనాలి. ఇది రైటు. దీన్ని పలకడం తెలీదా! నవ్విపోతారు!! నవ్వేం పోరు కానీ.. దీన్నసలు ‘అ–డో–బీ’ అనాలి. అడోబీ ఫొటోషాప్ అన్నమాట. ఇది తెలియకుండానే.. అడోబ్ అడోబ్ అనుకుంటూ ఫొటోషాప్‌లో చాలా చేసేశారు కదా! RENAULT ఫ్రెంచి కార్ల కంపెనీ ఇది. రెనాల్ట్ అని అంటాం. అనాల్సింది మాత్రం ‘రెన్–ఓ’ అని. వ్రూమ్.. అంటూ వెళ్లే కారు రోడ్డును మింగేసినట్లు.. చివరి మూడు ఆల్ఫాబెట్స్.. యుఎల్టి.. లను మింగేసి పలకాలి. ADIDAS ‘నైకీ’లా ఇంకో ఫేమస్ బ్రాండ్. దీన్ని ఎలా పలకాలన్నది ఇప్పటికీ ఓ కన్ఫ్యూజన్. ఆడీడాస్ అని అంటాం. అనాల్సిందైతే మాత్రం ‘యాడ్–డీ–డాస్’ అని. FERRERO ROCHER మధురమైన చాక్లెట్. బంగారు పొరలో చుట్టి అమ్ముతారు. ఇటలీ దీని తల్లి వేరు. పేరు మాత్రం..(పంటికి అంతుక్కుపోయి) నాలుక సరిగా తిరగదు. పోనీ, చాక్లెట్ తినకముందే ప్రొనౌన్స్ చేస్తే? అప్పుడు సరిగా పలుకుతామా? సరిగ్గా అంటే ఏం లేదు.. ఇప్పుడు అంతా పలుకుతున్నట్టే... ‘ఫెర్–రేర్–రా రో–షెర్’ అని అంటాం. కానీ పలకాల్సింది మాత్రం ‘ఫర్–రేర్–రో రో–షే’ అని. HERVE LEGER రెడ్‌కార్పెట్ సెలబ్రిటీల ఒంటిపైన కనిపించే ‘బ్యాండేజ్’ డ్రెస్ బ్రాండ్ ఇది. ఓసారి హాలీవుడ్లో రిపోర్టర్స్ అడిగారు.. ఈ బ్రాండ్ నేమ్ ఏమిటని. ఆ అమ్మాయిలంతా ‘హర్–వీ లీ–జర్’ అనే చెప్పారు. పలకాల్సింది మాత్రం ‘ఎయిర్–వే లే–జా’ అని. HOEGAARDEN గోధుమలతో తయారయ్యే వీట్ బీర్ ఇది. బెల్జియం కంపెనీ ‘హోగార్డెన్’ తయారుచేస్తుంది. అయితే ఇది హోగార్డెన్ కాదు. ‘హూగార్డెన్’. LOUIS VUITTON ఈ ఫ్రెంచ్ ఫ్యాషన్ హౌస్ ‘ఎల్వి’ అనే లోగోతో దుస్తుల దగ్గర్నుంచి బ్యాగులు, షూలు.. అన్నీ ఆడవాళ్ల కోసం ఉత్పత్తి చేస్తుంటుంది. (కొన్నేవో మగవాళ్లకు కూడా ఉన్నట్లుంది). అయిదే దీన్ని ఎలా పలకాలి? లూయీస్ వూటాన్ అని కాదు. ‘లూ–వీ వ్యీ–థాన్’ అనాలి. MIELE జర్మన్ గృహోపకరణాల కంపెనీ. వాషింగ్ మిషన్లు, ఫ్రిజ్‌లు తయారు చేస్తుంటుంది. ఈ మధ్య ఇండియాలో కూడా బాగా పాపులర్ అయింది. కంపెనీ పేరును సరిగా పలకడమే మనకింకా అలవాటు కాలేదు. మీలే అంటున్నాం. ‘మీల్–ఉ’ అనడం కరెక్ట్. TAG HEUER బాగా సంపన్నులు మాత్రమే ధరించగలిగే వాచీల కంపెనీ. యాడ్స్‌లో మనం టాగ్హ్యూయెర్ అని చదువుతాం. దీన్నసలు టాగ్ హాయర్ అని పలకాలి. ఊ... ఇప్పటికివి చాలు. మరోసారి మరికొన్ని. చివరిగా.. AMAZONని ఎలా పలకాలో చెప్పుకుని క్లాస్ ఫినిష్ చేసేద్దాం. అమెజాన్ తెలుసు కదా. ఆన్లైన్లో ఈసరికే అమెజాన్ నుంచి ఏదో ఒకటి తెప్పించుకునే ఉంటారు. ఆ అమెజాన్‌ని ఎలా పలకాలో తెలుసా? ‘అమ–జున్’ అని(ట)! ఎలా పలికితే ఏంటి.. ఫ్యాషన్ ఒలకకుండా ఉంటుందా.. అనే కదా మీరు అనడం. ఒలుకుతుంది. కానీ సరిగ్గా పలికితే మీతో పాటు మీ నాలెడ్జీ వెలిగిపోతుంది. -
యువతితో మాట్లాడాడని స్తంభానికి కట్టేసి..
మంగళూరు: సహచర ఉద్యోగినితో మాట్లాడాడనే కారణంతో ఓ ముస్లిం వ్యక్తిని చితకబాదిన ఘటన కర్ణాటకలోని మంగళూరులో చోటుచేసుకుంది. దీనికి సంబంధించి మొత్తం 13మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిలో కొంతమంది భజరంగ్ దళ్ కార్యకర్తలు ఉన్నారు. పోలీసుల వివరాల ప్రకారం 29 ఏళ్ల ముస్లిం వ్యక్తి ఓ హిందూ యువతితో కారులో ఉండగా ఒక్కసారిగా ఓ గుంపు అతడిపై దాడి చేసింది. బట్టలూడదీసి కొట్టడమే కాకుండా వీధుల వెంట పరుగెత్తించారు. అనంతరం ఓ విద్యుత్ స్తంభానికి కట్టేసి దాదాపు గంట సేపు పిడిగుద్దులు గుప్పించారు. దీనికి సంబంధించిన ఫొటోలు స్థానిక టీవీ చానెల్లలో, వాట్సాప్‌లో హల్ చల్ రేపడంతో పోలీసులు ఘటనా ప్రదేశానికి చేరుకున్నారు. అయితే, బాధితుడు మాత్రం తాను.. ఆ యువతి ఒక మాల్ లో పనిచేస్తున్నామని, ఆమె లోన్ కట్టేందుకు డబ్బులు అవసరం ఉన్నాయని అడగడంతో ఇచ్చేందుకు ఏటీఎం వద్దకు కారులో వెళ్లానని ఇంతలోనే వారు వచ్చి దాడి చేశారని తెలిపాడు. ఈ విషయంలో ఆ అమ్మాయి జోక్యం చేసుకునేందుకు ప్రయత్నించినా ఆమెను కూడా తిట్టారని, ఆమె మాటలు పట్టించుకోలేదని వివరించాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.