ఇలా..పల..కాలి!
రైట్ టు స్పీక్
హాయ్.. గైస్ అండ్ గాల్స్! ఆగండి. తప్పు పడిందిక్కడ. గైస్ కాదు. గాయ్‌స్. సో.. గాయ్స్ అండ్ గాల్స్.. క్లాస్ పీకడం ఎలా ఉంటుందో ఇప్పుడు మీరు వినబోతున్నారు. అలా బండి రైజ్ చేసి వెళ్లిపోకండి. రైజ్ చెయ్యడమా! అంత టైమ్ ఎక్కడిదని ఎక్కడి బండిని అక్కడే వదిలేసి పారిపోకండి. ఇదొక ఇంట్రెస్టింగ్ క్లాస్. జస్ట్ ఫై మినిట్స్ క్లాస్. పీకినట్టు ఉండదు. పీచు మిఠాయి తిన్నట్లు ఉంటుంది. ఏ బ్రాండ్‌ను
మనం ఎలా పలుకుతున్నాం? అసలు ఎలా పలకాలి?ఇదీ.. టాపిక్. అవసరమా? చెవర్లెట్ కారును డ్రైవ్ చెయ్యడానికి చవర్లెట్ అనే మాటను ఎలా పలకాలో తెలుసుకుని ఉండడం అవసరమా? చవర్లెట్ కాకపోతే ఇంకోటి. మీరెంతో లవ్ చేసే బ్రాండ్ గురించి తెలుసుకోవాలని మీకు ఉండదా! అదీ సంగతి. క్లాస్ స్టార్ అవుతోంది వచ్చేయండి.
CHEVROLET
ఫస్ట్ ఫస్ట్ చవర్లెట్‌తోనే స్టార్ట్ చేద్దాం. వందేళ్ల క్రితం యూఎస్‌లోని మిషిగన్‌లో (మనం మిచిగాన్ అంటాం కదా.. అదే) 1911లో చవర్లెట్ కంపెనీ మొదలైంది. దీన్ని ఇప్పటికీ మనం చవర్లెట్ అనే అంటుంటాం. అనాల్సింది మాత్రం ‘షెవ్–రొ–లే’ అని! మొదట్లో ఈ కంపెనీని షార్ట్‌కర్ట్‌లో ‘షెవీ’ అనేవారు.
GIVENCHY
ఇదో ఫ్రెంచి ఫ్యాషన్ హౌస్. దునియాలో ఇంతవరకు దీన్ని కొట్టినవాళ్లు లేదు. ఈ కంపెనీ పేరును సరిగా పలికిన భారతీయుడూ లేడు. గివ్–ఎన్–చీ అంటాం మనం. అనాల్సింది మాత్రం ‘జీ–వాన్–షీ’ అని. ఇదేదో దైవాంశ సం‘భూతం’లా ఉంది!
PORSCHE
జర్మన్ కార్ల కంపెనీ. ఇది అన్నీ ‘హై పెర్‌ఫార్మెన్స్’ కార్లనే తయారుచేస్తుంది. కానీ దీన్ని ప్రొనౌన్స్ చెయ్యడంలో మాత్రం ఈ మానవ మాత్రులది పూర్ పెర్‌ఫార్మెన్సే! పోర్స్ అనీ, పోర్చే అని అంటాం. అనాల్సింది మాత్రం ‘పూర్–షా’ అని.
COINTREAU
కాక్‌టైల్స్‌లో కలుపుకునే ఈ ఫ్రెంచి లిక్కర్.. తీపి, పులుపు కలిసిన అనాసపండ్ల రసం. దీన్కొక చుక్కేసుకుంటే మీరు ఫ్రాంకోఫైల్ అయిపోతారు. అంటే.. ఫ్రాన్స్‌ను పిచ్చిపిచ్చిగా ఇష్టపడే మాలోకం అయిపోతారు. అప్పుడు మీరు దీన్ని ఎలాగైనా పలకొచ్చు కానీ, పలకాల్సింది మాత్రం ‘క్వాన్–ట్రో’ అని. జనరల్‌గా అంతా ‘కాయిన్–ట్రో’ అంటుంటారు.
HYUNDAI
మళ్లీ ఇంకో కారు. ఇది దక్షిణ కొరియా వాళ్లది. హ్యూన్‌డై అంటాం మనం. అనాల్సింది మాత్రం ‘హ్యున్–డే’ అని.
CHRISTIAN LOUBOUTIN
ఆడవాళ్ల లగ్జరీ బ్రాండ్ షూ. ఇలా వేస్కొని అలా వదిలేయడానికే కానీ, రఫ్ అండ్ టఫ్‌గా యూజ్ చేయడానికి లేదు. చేస్తే ఏమౌతుంది? ఇంకో జత కొనాల్సి వస్తుంది. షో రూమ్‌లోకి వెళ్లి.. లూ–బో–టిన్ అని అడగుతారు పెద్దపెద్దవాళ్లు. అడగవలసింది మాత్రం లూ–బూ–టాన్ అని.
NIKE
అమెరికన్ స్పోర్ట్స్ బ్రాండ్. ప్రపంచంలో సగం జనాభా ఒక రకంగా, మిగతా సగం జనాభా ఇంకో రకంగా దీనిని పలుకుతుంది. మనవాళ్లు కూడా మొన్నటి వరకు ‘నైక్’ అనేవాళ్లు. ఇప్పుడు ‘నైకీ’ అంటున్నారు. నైకీ కరెక్ట్.
దుస్తులు, ఆభరణాలు, వాచీలు, బ్యాగులు, ఐ వేర్, పెర్‌ఫ్యూమ్‌లు.. చాలా ఉత్పత్తి చేస్తుంటుంది ఈ ఇటాలియన్ కంపెనీ. డాల్సే గబానా అని అనేస్తాం గబాల్న. అది తప్పు. ‘డాల్–చె గబ్–అనా’ అనాలి. ఇది రైటు.
దీన్ని పలకడం తెలీదా! నవ్విపోతారు!! నవ్వేం పోరు కానీ.. దీన్నసలు ‘అ–డో–బీ’ అనాలి. అడోబీ ఫొటోషాప్ అన్నమాట. ఇది తెలియకుండానే.. అడోబ్ అడోబ్ అనుకుంటూ ఫొటోషాప్‌లో చాలా చేసేశారు కదా!
RENAULT
ఫ్రెంచి కార్ల కంపెనీ ఇది. రెనాల్ట్ అని అంటాం. అనాల్సింది మాత్రం ‘రెన్–ఓ’ అని. వ్రూమ్.. అంటూ వెళ్లే కారు రోడ్డును మింగేసినట్లు.. చివరి మూడు ఆల్ఫాబెట్స్.. యుఎల్‌టి.. లను మింగేసి పలకాలి.
ADIDAS
‘నైకీ’లా ఇంకో ఫేమస్ బ్రాండ్. దీన్ని ఎలా పలకాలన్నది ఇప్పటికీ ఓ కన్‌ఫ్యూజన్. ఆడీడాస్ అని అంటాం. అనాల్సిందైతే మాత్రం ‘యాడ్–డీ–డాస్’ అని.
FERRERO ROCHER
మధురమైన చాక్లెట్. బంగారు పొరలో చుట్టి అమ్ముతారు. ఇటలీ దీని తల్లి వేరు. పేరు మాత్రం..(పంటికి అంతుక్కుపోయి) నాలుక సరిగా తిరగదు. పోనీ, చాక్లెట్ తినకముందే ప్రొనౌన్స్ చేస్తే? అప్పుడు సరిగా పలుకుతామా? సరిగ్గా అంటే ఏం లేదు.. ఇప్పుడు అంతా పలుకుతున్నట్టే... ‘ఫెర్–రేర్–రా రో–షెర్’ అని అంటాం. కానీ పలకాల్సింది మాత్రం ‘ఫర్–రేర్–రో రో–షే’ అని.
HERVE LEGER
రెడ్‌కార్పెట్ సెలబ్రిటీల ఒంటిపైన కనిపించే ‘బ్యాండేజ్’ డ్రెస్ బ్రాండ్ ఇది. ఓసారి హాలీవుడ్‌లో రిపోర్టర్స్ అడిగారు.. ఈ బ్రాండ్ నేమ్ ఏమిటని. ఆ అమ్మాయిలంతా ‘హర్–వీ లీ–జర్’ అనే చెప్పారు. పలకాల్సింది మాత్రం ‘ఎయిర్–వే లే–జా’ అని.
HOEGAARDEN
గోధుమలతో తయారయ్యే వీట్ బీర్ ఇది. బెల్జియం కంపెనీ ‘హోగార్డెన్’ తయారుచేస్తుంది. అయితే ఇది హోగార్డెన్ కాదు. ‘హూగార్డెన్’.
LOUIS VUITTON
ఈ ఫ్రెంచ్ ఫ్యాషన్ హౌస్ ‘ఎల్‌వి’ అనే లోగోతో దుస్తుల దగ్గర్నుంచి బ్యాగులు, షూలు.. అన్నీ ఆడవాళ్ల కోసం ఉత్పత్తి చేస్తుంటుంది. (కొన్నేవో మగవాళ్లకు కూడా ఉన్నట్లుంది). అయిదే దీన్ని ఎలా పలకాలి? లూయీస్ వూటాన్ అని కాదు. ‘లూ–వీ వ్యీ–థాన్’ అనాలి.
MIELE
జర్మన్ గృహోపకరణాల కంపెనీ. వాషింగ్ మిషన్‌లు, ఫ్రిజ్‌లు తయారు చేస్తుంటుంది. ఈ మధ్య ఇండియాలో కూడా బాగా పాపులర్ అయింది. కంపెనీ పేరును సరిగా పలకడమే మనకింకా అలవాటు కాలేదు. మీలే అంటున్నాం. ‘మీల్–ఉ’ అనడం కరెక్ట్.
TAG HEUER
బాగా సంపన్నులు మాత్రమే ధరించగలిగే వాచీల కంపెనీ. యాడ్స్‌లో మనం టాగ్‌హ్యూయెర్ అని చదువుతాం. దీన్నసలు టాగ్ హాయర్ అని పలకాలి.
ఊ... ఇప్పటికివి చాలు. మరోసారి మరికొన్ని. చివరిగా.. AMAZONని ఎలా పలకాలో చెప్పుకుని క్లాస్ ఫినిష్ చేసేద్దాం. అమెజాన్ తెలుసు కదా. ఆన్‌లైన్‌లో ఈసరికే అమెజాన్ నుంచి ఏదో ఒకటి తెప్పించుకునే ఉంటారు. ఆ అమెజాన్‌ని ఎలా పలకాలో తెలుసా? ‘అమ–జున్’ అని(ట)! ఎలా పలికితే ఏంటి.. ఫ్యాషన్ ఒలకకుండా ఉంటుందా.. అనే కదా మీరు అనడం. ఒలుకుతుంది. కానీ సరిగ్గా పలికితే మీతో పాటు మీ నాలెడ్జీ వెలిగిపోతుంది.