
సాక్షి, ఇబ్రహీంపట్నం : పట్టాదారు పాస్‌పుస్తకాలు, రైతుబంధు చెక్కుల పంపిణీని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. సాధారణ ఎన్నికల్లో గెలుపునకు సోపానంగా మారుతుందని భావిస్తున్న ఈ కార్యక్రమంపై ముఖ్యమంత్రి కేసీఆర్ భారీ ఆశలు పెట్టుకున్నారు. ఈ నేపథ్యంలో రైతుబంధు, పాస్‌పుస్తకాల జారీపై ప్రజల మనోగతాన్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు.
ఇందులోభాగంగా ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డితో సీఎం కేసీఆర్ ఫోన్‌లో సంభాషించారు. తాళ్లపల్లిగూడెంలో కిషన్‌రెడ్డి చెక్కులు పంపిణీ చేస్తుండగా.. ముఖ్యమంత్రి ఫోన్ చేసి రైతుబంధు గురించి ప్రజలు ఎమనుకుంటున్నారని అడిగి తెలుసుకున్నారు. ప్రజల స్పందన ఎలా ఉంది.. ఇంకా ఏం చేస్తే బాగుంటుందో తెలుసుకోవాలని సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment