
సాక్షి, హైదరాబాద్: ఈనెల 27 నుంచి వచ్చేనెల 7వరకు రైతుబంధు సహాయం అందించాలని తెలంగాణ ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్‌రావు(కేసీఆర్) నిర్ణయించారు. సోమవారం ఆయన రైతుబంధుపై సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో మంత్రి నిరంజన్‌రెడ్డితో పాటు ఆర్థిక, వ్యవసాయ అధికారులు పాల్గొన్నారు. రూ.7,300 కోట్లు విడుదల చేయాలని ఆర్థికశాఖను కేసీఆర్ ఆదేశించారు. రైతుల ఖాతాల్లోనే నేరుగా డబ్బు జమ చేయాలని తెలిపారు. తక్కువ విస్తీర్ణం కలిగిన రైతుల నుంచి మొదలు పెట్టి ఎక్కువ విస్తీర్ణం కలిగిన రైతులందరికీ 10 రోజుల్లో డబ్బులు వేయాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు.(చదవండి: ఢిల్లీతో ఢీకి టీఆర్‌ఎస్ రెడీ)
Comments
Please login to add a commentAdd a comment