Manchireddy Kishan Reddy
-
ఇబ్రహీంపట్నం నియోజకవర్గం బీఆర్ ఎస్ అభ్యర్థి మంచిరెడ్డి కిషన్ రెడ్డితో టుడేస్ లీడర్
-
ఇబ్రహింపట్నంని జయించే నాయకుడు ఎవరు?
ఇబ్రహింపట్నం నియోజకవర్గం ఇబ్రహింపట్నం నియోజకవర్గంలో సిటింగ్ ఎమ్మల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి మరోసారి గెలిచారు. ఆయన దీనితో వరసగా మూడుసార్లు గెలిచినట్లయింది. రెండుసార్లు టిడిపి తరపున, ఒకసారి టిఆర్ఎస్ పక్షాన గెలుపొందారు. కిషన్ రెడ్డి 2014లో టిడిపి పక్షాన గెలిచినా, ఆ తర్వాత కాలంలో ఆయన టిఆర్ఎస్లో చేరిపోయారు. కిషన్ రెడ్డి తన సమీప బిఎస్పి ప్రత్యర్ది మల్ రెడ్డి రంగారెడ్డి పై 411 ఓట్ల ఆదిక్యతతో విజయం సాదించారు. రంగారెడ్డి కాంగ్రెస్ ఐ టిక్కెట్ ఆశించగా, మహాకూటమిలో భాగంగా ఆ సీటును టిడిపికి ఇవ్వడంతో ఆయన పార్టీ మారి బిఎస్పి టిక్కెట్ పై పోటీచేశారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఐ కూడా రంగారెడ్డికి మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించినా ఓటమి తప్పలేదు. కిషన్‌రెడ్డికి 71599 ఓట్లు రాగా, రంగారెడ్డికి71088 ఓట్లు వచ్చాయి. ఇక్కడ టిడిపి పక్షాన పోటీచేసి సామా రంగారెడ్డికి 16600 పైచిలుకు ఓట్లు వచ్చాయి. రెడ్డి సామాజికవర్గానికి చెందిన నేత కిషన్ రెడ్డి .2014 ఎన్నికలలో టిడిపి-బిజెపి అభ్యర్దిగా పోటీచేసిన కిషన్ రెడ్డి తన సమీప స్వతంత్ర అభ్యర్ధి, కాంగ్రెస్ ఐ తిరుగుబాటు అభ్యర్ధి ఎమ్. రామ్ రెడ్డిపై 11056 ఓట్ల ఆధిక్యతతో గెలుపొందారు. 2014లో టిఆర్ఎస్ తరపున ప్రముఖ సినీ నటుడు అల్లు అర్జున్ మామ చంద్రశేఖర్ రెడ్డి పోటీచేసిన ఓడిపోయారు. ఇబ్రహింపట్నంలో ఐదుసార్లు రెడ్డి సామాజికవర్గం నేతలు గెలుపొందితే, మూడుసార్లు బిసి నేతలు గెలుపొందారు. ఈ నియోజకవర్గం రిజర్వుడ్ గా ఉన్నప్పుడు తొమ్మిది సార్లు ఎస్.సి.నేతలు విజయం సాధించారు. గతంలో మేడ్చల్‌లో పోటీచేసి మూడుసార్లు గెలిచిన సీనియర్ నాయకుడు టి.దేవేందర్‌గౌడ్ 2009లో మల్కాజిగిరి లోక్‌సభ నియోజకవర్గం నుంచి ఇబ్రహీంపట్నం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ప్రజారాజ్యం పక్షాన పోటీచేసి రెండు చోట్ల ఓడిపోయారు. ఇబ్రహీంపట్నంలో మూడోస్థానంలో మిగిలారు. మరో మాజీ ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి 1994లో టిడిపితరుఫున 2004లో కాంగ్రెస్ ఐ పక్షాన గెలిచారు. 2009లో ఓటమిపాలయ్యారు. 2018లో బిఎస్పి టిక్కెట్ పై పోటీచేసి ఓటమి చెందారు. 1952 నుంచి 1972 వరకు జనరల్‌గాను, 1978 నుంచి 2004వరకు రిజర్వుడుగాను ఉన్న ఇబ్రహీంపట్నం నియోజకవర్గం 2009లో తిరిగి జనరల్‌గా మారింది. కాంగ్రెస్, కాంగ్రెస్ ఐ కలిసి ఎనిమిదిసార్లు, టిడిపి నాలుగుసార్లు, సిపిఎం మూడుసార్లు, టిఆర్ఎస్ ఒకసారి పిడిఎఫ్ ఒకసారి గెలుపొందాయి. కాంగ్రెస్‌నేత ఎమ్.ఎన్.లక్ష్మీనరసయ్య మూడుసార్లు గెలుపొందగా, సిపిఎమ్ పక్షాన కొండిగారి రాములు రెండుసార్లు గెలిచారు. మరో కాంగ్రెస్ నేత ఎజి కృష్ణ రెండుసార్లు గెలుపొందారు. ఇక్కడ నుంచి 1978లో గెలిచిన సుమిత్రదేవి మొత్తం ఐదుసార్లు వివిధ నియోజకవర్గాలలో విజయం సాధించారు. ఇక్కడ గెలిచినవారిలో సుమిత్రదేవి, పుష్పలీల, ఎమ్.ఎన్.లక్ష్మీనరసయ్యలు మంత్రి పదవులు నిర్వహించారు. ఇబ్రహింపట్నం నియోజకవర్గంలో గెలిచిన.. ఓడిన అభ్యర్థులు వీరే.. -
ఉమ్మడి రంగారెడ్డి జిల్లా బీఆర్ఎస్ నేతలపై నజర్
సాక్షి, రంగారెడ్డి జిల్లా: ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు చెందిన అధికార బీఆర్ఎస్ పార్టీ నేతలపై కేంద్ర దర్యాప్తు సంస్థలు దృష్టిసారించాయి. విచారణ పేరుతో ఇప్పటికే ఒకరి తర్వాత మరొకరికి నోటీసులు జారీ చేస్తూ ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. ముఖ్యనేతలు, వారి కుటుంబ సభ్యులపై ఈడీ, ఐటీ దాడులు నిర్వహిస్తుండటంతో ఇన్నాళ్ల పాటు ప్రత్యక్షంగా, పరోక్షంగా సహకరించిన బంధువులు, ముఖ్య అనుచరులు, వ్యాపార భాగస్వాములు, ప్రభుత్వ ఉద్యోగులు ప్రస్తుతం వీరిని చూస్తే చాలు ముఖం చాటేస్తున్నారు. ఈ కేసుల్లోకి తమను ఎక్కడ లాగుతారోననే భయంతో బెంబేలెత్తిపోతున్నారు. ఆరు నెలల క్రితం వరకు ఆయా నేతల దృష్టిలో పడేందుకు రోజంతా వారి ఇళ్లు, క్యాంపు ఆఫీసుల ఎదుట పడిగాపులుగాసిన వారు సైతం అటువైపు వెళ్లేందుకు ఆసక్తి చూపడం లేదు. విదేశాల్లో క్యాసినో గేమ్స్‌తో మొదలు.. మెయినాబాద్ ఫాం హౌస్ కేంద్రంగా ఎమ్మెల్యేల కొనుగోలు అంశం వరకూ ఇలా ప్రతి కేసు జిల్లా నేతలకు, వారి ముఖ్య అనుచరులకు, ఆర్థిక బినామీలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. మనీలాండరింగ్ కేసులో మంచిరెడ్డికి మనీలాండరింగ్‌కు పాల్పడిన అభియోగంపై ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు మంచిరెడ్డి కిషన్‌రెడ్డికి ఆగస్టులో ఈడీ నోటీసులు జారీ చేసింది. సెప్టెంబర్ 26, 27 తేదీల్లో వరుసగా రెండు రోజుల పాటు తమ ఆఫీసుకు పిలిపించి 14 గంటలకుపైగా విచారించింది. 2014లో మంచిరెడ్డి ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లో పర్యటించారు. ఈ సమయంలో చేసిన ఖర్చులతో పాటు 2015లో ఇండోనేషియా వేదికగా గోల్డ్‌మైన్స్ సంస్థలో పెట్టుబడులు పెట్టారనే అభియోగంపై విచారణ చేపట్టింది. ప్రస్తుతం ఆ కేసు పెండింగ్‌లోనే ఉంది. సాక్షాత్తూ పార్టీ జిల్లా అధ్యక్షుడిపై మనీలాండరింగ్ ఆరోపణ లు రావడం, ఆయనకు ఈడీ నోటీసులు జారీ చేయడం, విచారణకు సైతం హాజరు కావడంతో జిల్లా రాజకీయాల్లో కలకలం సృష్టించింది. అప్పటి వరకు ఆయన అపాయింట్మెంట్ కోసం రోజుల తరబడి ఎదురు చూసిన వారు ఆ తర్వాత మంచిరెడ్డి ఎదురుపడితే సైలెంట్‌గా సైడై పోతుండటం గమనార్హం. అక్రమ ఆస్తుల కేసులో మంత్రికి మెడికల్ కాలేజీల్లో ఫీజుల వసూలు, పన్నుల ఎగవేత వంటి పక్కా సమాచారంతో మంత్రి చామకూర మల్లారెడ్డి ఇంటిపై ఇటీవల ఐటీ సోదాలు నిర్వహించింది. నవంబర్ 22న ఏకకాలంలో 50 బృందాలు బోయిన్‌పల్లిలోని ఆయన ఇల్లుతో సహా విద్యా సంస్థలు, ఆస్పత్రుల్లో సోదాలు చేపట్టింది. వరుసగా మూడు రోజుల పాటు కొనసాగిన దాడుల్లో మంత్రి అల్లుడు, కుమారుడు, ఇతర కుటుంబ సభ్యులు, బంధువులు, బినామీలు, వ్యాపార భాగస్వాముల బ్యాంకు లావాదేవీల వివరాలు, లాకర్లు తెరిపించి పెద్ద మొత్తంలో ఆస్తులను గుర్తించారు. ఈ సమయంలో మంత్రితో పాటు 16 మందికి నోటీసులు జారీ చేశారు. ఆర్థిక అవకతవకల కోణంలో విచారించేందుకు ఈడీకి లేఖ రాసినట్లు ప్రచారం సాగుతోంది. అప్పటి వరకు మంత్రి వెంట మౌనంగా ఉన్న జిల్లా ఎమ్మెల్యేలు, ఇతర నేతలు ప్రస్తుతం ఆయనపై ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. రెండు రోజుల క్రితం మైనంపల్లి ఫాంహౌస్ వేదికగా ముఖ్యనేతలంతా భేటీ కావడం, మంత్రి వ్యవహారశైలిపై బహిరంగ విమర్శలు చేస్తుండటం గమనార్హం. ప్రస్తుతం పైలెట్ మెయినాబాద్ ఫాం హౌస్(ఎమ్మెల్యేల ఎర) కేసులో కీలక ఫిర్యాదుదారుడిగా ఉన్న తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్‌రెడ్డిపై ఈడీ దృష్టి సారించింది. బెంగళూరు డ్రగ్స్ కేసులోనూ ఆయన పేరు వినిపిస్తోంది. ఇటీవలే పైలెట్‌కు నోటీసులు జారీ చేయగా, అత్యంత నాటకీయ పరిణామాల మధ్య గత సోమవారం మధ్యాహ్నం విచారణ సంస్థ ముందు హాజరయ్యారు. ఏడు గంటల పాటు విచారించిన ఈడీ మరుసటి రోజు మళ్లీ హాజరు కావాల్సిందిగా సూచించింది. దీంతో రెండో రోజైన మంగళవారం కూడా ఆయన ఈడీ ముందుకు వెళ్లారు. ఎన్నికల అఫిడవిట్లో ఆయన చూపిన స్థిర, చర ఆస్తులు, ఆ తర్వాత ఆయన కూడబెట్టిన ఆస్తులు, విద్యార్హత, బ్యాంకు ఖాతాలు, పాస్‌పోర్టు, పాన్, ఆధార్ కార్డు వంటి వ్యక్తిగత వివరాలను ఆరా తీసినట్లు తెలిసింది. ఎమ్మెల్యేల ఎర కేసులో ఆయనపై అనేక ఆరోపణలు రావడం, సిట్ విచారణ కొనసాగుతుండటం, మరో వైపు ఈ కేసును సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని బీజేపీ డిమాండ్ చేస్తుండటం, ఇదే సమయంలో ఆయనకు ఈడీ నోటీసులు రావడం వంటి వరుస పరిణామాలు అధికార బీఆర్ఎస్ను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. అప్పటి వరకు ఎమ్మెల్యేతో అంటకాగిన నేతలు, అనుచరులు, రియల్ ఎస్టేట్ వ్యాపార భాగస్వాములు ప్రస్తుతం పైలెట్ వెంట వెళ్లేందుకు జంకుతున్నారు. (క్లిక్ చేయండి: ప్లాట్ కొంటున్నారా..? తస్మాత్ జాగ్రత్త) -
రెండోరోజు ఈడీ విచారణకు హాజరైన మంచిరెడ్డి కిషన్ రెడ్డి
-
అధికార పార్టీలో ఈడీ కుదుపు.. కేడర్‌లో ఆందోళన
సాక్షి, రంగారెడ్డి జిల్లా: ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జిల్లా రాజకీయాల్లో కలకలం సృష్టించింది. ఏకంగా అధికార టీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డికి నోటీసులు జారీ చేసింది. దీంతో ఆయన మంగళవారం ఈడీ ముందు హాజరయ్యారు. జిల్లా పార్టీ అధినేతపైనే మనీలాండరింగ్ ఆరోపణలు రావడం, ఈడీ నోటీసులు జారీ చేయడంతో కార్యకర్తల్లో ఆందోళన మొదలైంది. మంచిరెడ్డి కిషన్‌రెడ్డి ఉమ్మడి రంగారెడ్డి జిల్లా టీడీపీ అధ్యక్షుడిగా పనిచేశారు. 2009లో తొలిసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆ తర్వాత 2014లో రెండోసారి విజయం సాధించారు. ఆ తర్వాత టీఆర్ఎస్లో చేరి 2018 ఎన్నికల్లో టీఆర్ఎస్ నుంచి స్వల్ప మెజార్టీతో గెలుపొందారు. ఆయనకు ఇటీవల పార్టీ జిల్లా అధ్యక్ష పదవిని కూడా కట్టబెట్టింది. సర్వత్రా చర్చనీయాంశం 2015లో ఇండోనేషియా వేదికగా గోల్డ్‌మైన్స్ సంస్థల్లో పెట్టుబడులు పెట్టడంతోపాటు మనీ లాండరింగ్‌కు పాల్పడినట్లు అభియోగాలు ఉన్నాయి. ఈ అంశంపై ఆయనకు నెల రోజుల క్రితమే ఈడీ నోటీసులు జారీ చేసింది. ఈ మేరకు ఆయన లిఖితపూర్వకంగా వివరణ కూడా ఇచ్చారు. సంతృప్తి చెందని ఈడీ స్వయంగా హాజరు కావాల్సిందిగా ఆదేశాలు జారీ చే యడంతో ఆయన ఈడీ ముందు హాజరవడం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. ఆయనకు అత్యంత సన్నిహితంగా ఉన్న వాళ్లలోనూ ఆందోళన మొదలైంది. మరోవైపు ఇటీవల ఈడీ విచారించిన క్యాసినో నిర్వాహకుడు చీకోటి శ్రీనివాస్తోనూ మంచిరెడ్డికి సంబంధాలున్నాయని, ఈ కేసులోనూ ఆయనను విచారించే అవకాశాలున్నాయని కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. దీంతోపాటు 2014లో ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాల్లో మంచిరెడ్డి సహా పలువురు పర్యటించారు. ఈ సందర్భంగా వినియోగించిన వ్యయంపై అనుమానాలు రావడం.. ఈ నిధులు విదేశాల నుంచి వచ్చినట్లు ఆరోపణలు రావడం కూడా ఈడీ విచారణకు కారణంగా కనిపిస్తోంది. ఈడీ మాత్రం మంచిరెడ్డిని ఏ కేసులో విచారించారనేదానిపై ఇప్పటివరకు అధికారికంగా ప్రకటించలేదు. ప్రజలకు వివరణ ఇవ్వాలి ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి అక్రమ సంపాదనపై ఈడీ విచారణ.. గతంలో వచ్చిన జూదం, భూ ఆక్రమణలపై ఇబ్రహీంపట్నం ప్రజలకు వివరణ ఇవ్వాలని సీపీఎం జిల్లా కార్యదర్శి కాడిగళ్ల భాస్కర్ డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఇది వ్యక్తిగత విషయం కాదని, ఒక ప్రజాప్రతినిధిగా జవాబుదారీగా ఉండాలని హితవుపలికారు. ఆయనపై ఇది కొత్త ఆరోపణ కాదని, అనేక భూ తగాదాల్లో ప్రజల పక్షం కాకుండా రియల్టర్ల పక్షాన నిలబడినట్లు విమర్శలు ఉన్నాయని తెలిపారు. తాజాగా ఖానాపురం గ్రామ ప్రజల విషయంలోనూ ప్రజల పక్షాన లేరన్నారు. వరుస ఆరోపణల నేపథ్యంలో వివరణ ఇవ్వాల్సిన బాధ్యత ఆయనపై ఉందన్నారు. -
ఇవాళ మరోసారి ఈడీ ముందుకు మంచిరెడ్డి కిషన్ రెడ్డి
-
పాలిటిక్స్‌లో టెన్షన్: ఈడీ ఆఫీసులో టీఆర్ఎస్ ఎమ్మెల్యే.. కేసు అదేనా?
సాక్షి, హైదరాబాద్: ఇటీవలి కాలంలో పలు కేసుల్లో తెలంగాణలో ఈడీ, ఐటీ అధికారులు దాడులు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో అధికార పార్టీ ఎమ్మెల్యేకు మరోసారి ఈడీ నోటీసులు జారీ చేయడం, విచారించడం తెలంగాణలో సంచలనంగా మారింది. వివరాల ప్రకారం.. టీఆర్ఎస్ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డిపై 2015లో ఈడీ కేసు నమోదు చేసింది. ఇండోనేషియాలో బంగారం మైన్స్‌లో పెట్టుబడుల్లో ఫెమా నిబంధనలు ఉల్లంఘించారని మంచిరెడ్డికి ఈడీ నోటీసులు పంపించింది. కాగా, ఆర్థిక లావాదేవీలపై వివరణ ఇవ్వాలని గతంలో నోటీసులు ఇచ్చింది. ఈ క్రమంలో ఈడీ ఎదుట హాజరై మంచిరెడ్డి.. లావాదేవీలపై వివరణ ఇచ్చారు. ఇదిలా ఉండగా.. ఈ కేసులోనే మరోసారి మంచిరెడ్డికి ఈడీ అధికారులు నోటీసులు ఇచ్చారు. దీంతో, కిషన్‌రెడ్డి మంగళవారం మరోసారి ఈడీ ఎదుట హాజరయ్యారు. ఈడీ ఆఫీసులో విచారణ కొనసాగుతోంది. కాగా, ఇటీవల చోటుచేసుకున్న క్యాసినో వ్యవహారంతో ఈ కేసుకు ఏదైనా సంబంధం ఉందా? అన్నది ఆసక్తికరంగా మారింది. మరోవైపు.. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో భాగంగా తెలంగాణకు చెందిన పలువురిని సైతం ఈడీ విచారించిన విషయం తెలిసిందే. -
ఈడీ ఎదుట హాజరైన టీఆర్ఎస్ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి
-
గ్రేటర్ జిల్లాలకు టీఆర్ఎస్ అధ్యక్షులు వీరే.. ముగ్గురూ ముగ్గురే..
సాక్షి, హైదరాబాద్: ఎట్టకేలకు టీఆర్ఎస్ జిల్లా శాఖలకు అధ్యక్షులొచ్చారు. సుదీర్ఘకాలంగా అదిగో.. ఇదిగో అంటూ ఊరిస్తున్న అధ్యక్షుల పేర్లను పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. మరో రెండేళ్లలో జరిగే శాసనసభ ఎన్నికలకు అనుగుణంగా గులాబీ బాస్ కొత్త సారథులను ఎంపిక చేసినట్లు కనిపిస్తోంది. పార్టీ సారథ్య బాధ్యతలను నామినేటెడ్ పోస్టుల రేసులో ఉన్నవారికి అప్పగిస్తారని భావించినా.. అంచనాలు తలకిందులు చేస్తూ మూడు జిల్లాలకు ఎమ్మెల్యే/ఎమ్మెల్సీలనే ఖరారు చేయడం ఆశ్చర్యానికి గురి చేసింది. గ్రేటర్ పరిధిలోని మూడు జిల్లాల్లో రెండు ఎమ్మెల్యేలకు, ఒకటి ఎమ్మెల్సీకి దక్కాయి. హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడిగా జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్, రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడిగా ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, మేడ్చల్ జిల్లా అధ్యక్షుడిగా ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు నియమితులయ్యారు. ఇక త్వరలోనే జిల్లా, డివిజన్ల పూర్తిస్థాయి కమిటీలు పూర్తి చేయనున్నట్లు భావిస్తున్నారు. (క్లిక్: వీరే గులాబీ రథసారథులు.. 33 జిల్లాల అధ్యక్షుల జాబితా ఇదే) ముగ్గురూ ముగ్గురే.. ► అధ్యక్షులుగా నియమితులైనవారు సుదీర్ఘ కాలంగా రాజకీయాల్లో ఉన్నవారే. గోపీనాథ్, కిషన్‌రెడ్డి ఉమ్మడి రాష్ట్రంలో టీడీపీ హయాం నుంచి రాజకీయాల్లో కొనసాగుతున్నారు. మాగంటి గోపీనాథ్ 1985లో తెలుగుయువత అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. 1987లో హుడా డైరెక్టర్‌గా, 1988 వినియోగదారుల ఫోరం తొలి జిల్లా అధ్యక్షుడిగా పనిచేశారు. టీఆర్ఎస్లోకి రాకముందు టీడీపీ హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడిగా పనిచేశారు. ► మంచిరెడ్డి కిషన్‌రెడ్డి రెండు పర్యాయాలు టీడీపీ నుంచి, 2018 ఎన్నికల్లో టీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. సర్పంచ్‌గా రాజకీయ అరంగేట్రం చేసిన మంచిరెడ్డి.. ఉమ్మడి రాష్ట్రంలో రంగారెడ్డి జిల్లా టీడీపీ అధ్యక్షుడిగా.. నీటిపారుదల అభివృద్ధి సంస్థ చైర్మన్ తదితర హోదాల్లో పనిచేశారు. ప్రస్తుతం ప్రభుత్వ హామీల కమిటీ చైర్మన్‌గా ఉన్నారు. ► కుత్బుల్లాపూర్ నియోజకవర్గానికి చెందిన శంభీపూర్ రాజు తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నారు. టీఆర్ఎస్ ఆవిర్భావం నుంచి క్రియాశీలకంగా ఉన్న ఆయనకు గులాబీ దళపతికి సన్నిహితుడిగా పేరుంది. వరుసగా రెండోసారి ఎమ్మెల్సీ పదవి లభించింది. అదృష్టంగా భావిస్తున్నా పార్టీ సభ్యత్వ నమోదు నుంచి అధిష్టానం అప్పగించిన ఏపనైనా నిబద్ధతతో, సిస్టమేటిక్‌గా చేస్తున్నా. ఎంతో కీలకమైన, రాష్ట్ర రాజధాని నగరమైన హైదరాబాద్ జిల్లాకు పార్టీ అధ్యక్షుడిగా నియమించడాన్ని అదృష్టంగా భావిస్తున్నా. హైకమాండ్ ఆదేశాలకనుగుణంగా.. అందరినీ కలుపుకొని నడుచుకుంటాను. – మాగంటి గోపీనాథ్ సమన్వయంతో పనిచేస్తా పార్టీ పటిష్టత కోసం ఎమ్మెల్యేలు, క్యాడర్‌తో సమన్వయంతో పనిచేస్తా. గతంలోనూ జిల్లా అధ్యక్షుడిగా పనిచేసిన అనుభవముంది. నాపై నమ్మకముంచి బాధ్యతలప్పగించిన అధిష్టానం నిర్ణయాన్ని గౌరవిస్తా. మరింత కష్టపడి పనిచేస్తా. పార్టీ బలోపేతానికి పాటు పడతా. – మంచిరెడ్డి కిషన్‌రెడ్డి తిరుగులేని మెజార్టీకి కృషి కేసీఆర్, కేటీఆర్‌ల ఆశయాలకనుగుణంగా పని చేస్తా. జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలు అందరినీ కలుపుకొని ముందుకు సాగుతా. వార్డు, డివిజన్, పట్టణ, మండల, జిల్లాస్థాయిలో పార్టీకోసం పనిచేసే వారికి తగిన పదవులు లభించేలా చూస్తా. అందరి సహకారంతో వచ్చే ఎన్నికల్లో జిల్లాలో పార్టీ అభ్యర్థులు తిరుగులేని మెజార్జీతో గెలిచేలా కృషి చేస్తా. – శంభీపూర్ రాజు -
టీఆర్ఎస్ ఎమ్మెల్యేపై రాళ్ల దాడి
సాక్షి, రంగారెడ్డి: ఇబ్రహీంపట్నం టీఆర్ఎస్ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డికి చేదు అనుభవం ఎదురైంది. ఆయన గురువారం మేడిపల్లి చెరువు పూజలు చేసేందుకు వెళ్లారు. ఎమ్మెల్యే రాకను గ్రామ ప్రజలు, రైతులు అడ్డుకున్నారు. తమ గ్రామంలోకి రావడానికి వీల్లేదని కిషన్‌రెడ్డిని నిలువరించారు. దీంతో మేడిపల్లి చెరువు దగ్గర ఉద్రికత్త పరిస్థితుల నెలకొన్నాయి. . ఫార్మాతో భూములు కోల్పోతుంటే పరామర్శించకుండా.. బెదిరింపులకు పాల్పడుతున్నారంటూ రైతులు పెద్ద ఎత్తున నిరసన తెలిపారు. ఓ దశలో ఆయన వాహనాలపై రైతులు రాళ్లు, చెప్పులు విసిరారు. రైతుల విసిరిన రాళ్ల దాడిలో ఒకరికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఫార్మసిటీ అక్రమ భూ సేకరణ నిలిపివేయాలంటూ నినాదాలు చేశారు. ఫార్మా సిటీకి ఎమ్మెల్యే మద్దతు ఇస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మంచిరెడ్డి కిషన్ రెడ్డి రాజీనామా చేయాలంటూ ఆయనపైకి రైతులు దూసుకు వెళ్లారు. ఈ సందర్భంగా పోలీసులకు, రైతులకు మధ్య తోపులాట జరిగింది. పరిస్థితి ఉద్రిక్తంగా మారడటంతో పోలీసులు లాఠీఛార్జ్ చేశారు. నిరసన తెలుపుతున్నమాజీ ఎమ్మెల్యే కోదండరెడ్డితో సహా పలువురి నాయకులను పోలీసులు అరెస్ట్ చేశారు. యాచారంలో రైతుల అక్రమ అరెస్టుల పర్వం కొనసాగుతోందని స్థానికులు విమర్శిస్తున్నారు. ఇక మేడిపల్లి చెరువు సందర్శనకు ఎమ్మెల్యే రాకతో పోలీసులు కొంతమంది రైతులను ముందస్తుగా అరెస్ట్ చేశారు. -
మరో టీఆర్ఎస్ ఎమ్మెల్యేకు కరోనా పాజిటివ్
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణలో కరోనా బారిన పడుతున్న వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ఇప్పటికే పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులకు కరోనా సోకడం రాష్ట్ర ప్రజానీకాన్ని ఆందోళనకు గురిచేస్తోంది. ముఖ్యంగా అధికార టీఆర్ఎస్కు చెందిన నేతలు ఎక్కువగా వైరస్ బారిన పడటం ఆ పార్టీలో గుబులు రేపుతోంది. తాజాగా ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో ఆయన అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. మరోవైపు గత కొద్ది రోజులుగా ఎమ్మెల్యేకు సన్నిహితంగా మెలిగిన వారి వివరాలను అధికారులు సేకరిస్తున్నారు. ఇటీవల ఆయన నియోజకవర్గంలోని పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనడంతో ప్రభుత్వ అధికారులు, పార్టీ శ్రేణులు భయాందోళనకు గురవుతున్నారు. -
నంది వనపర్తి : ఉద్రిక్తతల మధ్య రోడ్డు విస్తరణ పనులు
-
ఆ భూమి విలువ రూ. 100 కోట్లు: మంచిరెడ్డి
సాక్షి, హైదరాబాద్ : అబ్దుల్లాపూర్‌మెట్ తహశీల్దార్ విజయారెడ్డి హత్య కేసులో తనపై వస్తున్న ఆరోపణలపై టీఆర్ఎస్ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి స్పందించారు. నిందితుడు టీఆర్ఎస్ కార్యకర్త అని, ఎమ్మెల్యే అనుచరులే హత్య చేయించారంటూ వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని కొట్టిపారేశారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి తనపై చేసిన ఆరోపణలను ఆయన ఖండించారు. తన మీద ఓడిపోయిన మల్రెడ్డి ఓటమి తట్టుకోలేకే ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. భూ కబ్జాదారులు అంటూ ప్రచారం చేస్తున్న వారే అసలు కబ్జాదారులని విమర్శించారు. విజయారెడ్డి మరణం దురదృష్టకరమని, ఆమె హత్యకు తనకు ఎలాంటి సంబంధం లేదని ఆయన స్పష్టం చేశారు. విజయారెడ్డి మరణాన్ని రాజకీయం చేస్తున్నారని, ఈ కేసుపై పోలీసుల దర్యాప్తు చేస్తున్నారని ఆయన తెలిపారు. నిందితుడు సురేశ్ భూములు కొనుగోలు చేసింది మల్రెడ్డి రంగారెడ్డి, రాంరెడ్డి కుటుంబ సభ్యులేనని, మొత్తం 412 ఎకరాలపై పూర్తి దర్యాప్తు చేయాలని కోరారు. పాస్ పుస్తకాలు లేకుండా భూమిని రిజిస్ట్రేషన్ చేసుకున్నారని, 90 నుంచి 101 సర్వేలో మొత్తం భూమిపై దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేశారు. అలాగే ముఖ్యమంత్రి కేసీఆర్‌ను సైతం ఈ భూములపై దర్యాప్తు జరిపించాలని ఎమ్మెల్యే కోరారు. ఆ భూమి విలువ రూ. 100 కోట్లు నాలుగు సర్వేల్లో ఉన్న భూమి విలువ 100 కోట్లు ఉంటుందని మంచిరెడ్డి అన్నారు. 1980లో ప్లాట్లు అన్ని రిజిస్ట్రేషన్ చేసుకున్నారని, 16 ఎకరాల భూమిని కబ్జా చేసుకున్నది మల్ రెడ్డి రంగారెడ్డి కుటుంబ సభ్యులేనని ఆరోపించారు. తాను 30 లక్షల రూపాయలు తీసుకుంటున్నట్లు వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని, తనపై తప్పుడు ఆరోపణలు చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. అంతేగాక న్యాయ పరంగా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. నిందితుడు సురేష్ గత ఎన్నికల్లో కాంగ్రెస్‌లో ఉన్నాడని, మల్ రెడ్డి రంగారెడ్డి సోదరులతో పాటు ఇంకా అనేక మంది ఇందులో భాగమై ఉన్నారని ఆరోపించారు. -
లాజిస్టిక్ హబ్‌ను ప్రారంభించిన మంత్రి కేటీఆర్
హైదరాబాద్ : ఇబ్రహీంపట్నం మండలం మంగళ్పల్లిలో శుక్రవారం రోజున లాజిస్టిక్ హబ్ (వస్తు నిల్వ కేంద్రం)ను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. దాదాపు 60 శాతం పనులు పూర్తయిన నేపథ్యంలో కమర్షియల్ ఆపరేషన్ పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. 'ఇబ్రహీంపట్నం ప్రస్తుతం అభివృద్ధి దిశగా దూసుకుపోతున్నది. హైదరాబాద్ శివారులో విస్తరించడం, ఔటర్ రింగ్‌రోడ్, అనేక కార్పొరేట్ కంపెనీలు ఇక్కడే ఇక్కడే ఏర్పడుతుండడంతో ఈ ప్రాంతం అన్ని రంగాల్లో శరవేగంగా విస్తరిస్తున్నది. 22 ఎకరాల విస్తీర్ణంలో రూ.20 కోట్ల వ్యయంతో పబ్లిక్, ప్రైవేట్ భాగస్వామ్య (పీపీపీ) విధానంలో దేశంలో మొదటి పార్క్‌గా దీన్ని అందుబాటులోకి తీసుకొస్తున్నాం. త్వరలోనే బాట సింగారంలో మరో లాజిస్టిక్ పార్క్ ప్రారంభం కానుంది. ఎలిమినేడులో ఏరో స్పేస్ ప్రాజెక్ట్ రానుంది. వ్యవసాయ ప్రాంతాలకు పాలమూరు రంగారెడ్డి ద్వారా ముఖ్యమంత్రి కేసీఆర్ సాగు నీటిని అందిస్తున్నారు. నియోజకవర్గంలో ఇప్పటికే ఎనిమిది సార్లు పర్యటించాను. నిరంతరం ప్రజల కోసం పనిచేసే వ్యక్తి మీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషణ్ రెడ్డి అని ఎమ్మెల్యేని పొగడ్తలతో ముంచెత్తారు. కుంట్లూర్‌లో ఎస్టీపీ నిర్మించడానికి నిధులు మంజూరు చేస్తున్నాం. ముచ్చర్లలో ఫార్మా క్లస్టర్ రానుంది. ఫార్మా క్లస్టర్ ద్వారా ఎన్నో ఉద్యోగాలు రానున్నాయి. ఓఆర్ఆర్ చుట్టూ ఎన్నో పరిశ్రమలు స్థాపించవచ్చు. మరో ఎనిమిది లాజిస్టిక్ పార్క్ లను నిర్మించనున్నాము. రెండు రైల్వే టర్మినల్స్ వస్తున్నాయి. వాటిని అనుసందానం చేసుకోని పరిశ్రమలు స్థాపించాలి. లాజిస్టిక్ పార్క్‌ల స్థాపనకు మన నగరం అగ్ర భాగంలో ఉంది. మనందరం కోరుకునేది అభివృద్ధి కనుక కొత్త పరిశ్రమలు మన ప్రాంతానికి వచ్చినపుడు మనందరం స్వాగతించాలని' కేటీఆర్ అన్నారు. విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ.. పీపీపీ మోడ్‌లో నిర్మించిన మొదటి లాజిస్టిక్ పార్క్ ఇది. జిల్లాలోని మున్సిపాలిటీలకు మరిన్ని నిధులివ్వాలని మంత్రి కేటీఆర్‌ని కోరారు. దీనికి ఆయన సానుకూలంగా స్పందించారు. ఇబ్రహీంపట్నం నియోజకవర్గ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషణ్ రెడ్డి మాట్లాడుతూ.. లాజిస్టిక్ పార్క్‌ను ఇక్కడ ఏర్పాటు చేస్తున్నందుకు కేటీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఇబ్రహీంపట్నం నియోజకవర్గం లో ఉన్న ఒక్కో మునిసిపాలిటీకి రూ. పది కోట్లు మంజూరు చేయాలని మంత్రి కేటీఆర్‌ని కోరారు. పరిశ్రమలు స్థాపించడానికి ఇక్కడ అనువైన స్థలాలు ఉన్నట్లు తెలిపారు. రంగారెడ్డి జిల్లా జెడ్పీ చైర్మెన్ అనితా రెడ్డి , ఎండీ ఆంకాన్ మాట్లాడుతూ.. జిల్లా వాతావరణం చాలా బాగుంటుంది. లాజిస్టిక్ పార్క్‌ను మంత్రి కేటీఆర్ ఇచ్చిన స్పూర్తితో తక్కువ కాలంలోనే పూర్తిచేయనున్నట్లు తెలిపారు. ఇందులో ట్రక్ డ్రైవర్ల పాత్ర ఎంతో కీలకమన్నారు. ఈ లాజిస్టిక్ పార్క్‌ల ఏర్పాటువల్ల ఇంకా అనేక కంపెనీలు ఈ ప్రాంతంలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వస్తాయన్నారు. -
‘పట్నం’లో నేడు హరిత పండుగ
సాక్షి, ఇబ్రహీంపట్నం: ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో హరితహారం కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేపడుతున్నారు. గురువారం నియోజకవర్గంలోని మంచాల, యాచారం, ఇబ్రహీంపట్నం, అబ్దుల్లాపూర్‌మెట్ మండలాలతో పాటు పెద్దఅంబర్‌పేట్, ఇబ్రహీంపట్నం, తుర్కయంజాల్, ఆదిబట్ల మున్సిపాలిటీలలో మొక్కలు నాటనున్నారు. ఇందుకోసం అటవీశాఖ, మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం ద్వారా నర్సరీల్లో పెంచిన మొక్కలను ఆయా గ్రామాలకు సరఫరా చేశారు. గ్రామాలకు తరలించేందుకు మొక్కలను వాహనంలో ఎక్కిస్తున్న దృశ్యం హరితహారంలో ఇబ్రహీంపట్నం నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే ఆదర్శంగా నిలిపేందుకు ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకున్నారు. ఒకే రోజు ఆరు లక్షలు మొక్కలు నాటాలనే లక్ష్యం పెట్టుకున్నారు. ఇందుకోసం ఇప్పటికే అధికారులను అప్రమత్తం చేసి కార్యక్రమం విజయవంతం చేయడానికి అడుగులు వేశారు. డ్వాక్రా మహిళలు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, యువకులు, సంక్షేమ పథకాల లబ్ధిదారులు సైతం ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొంటున్నారు. ఇంటింటికీ ఆరు మొక్కలు నాటాలని, ప్రభుత్వ, ప్రైౖవేటు స్థలాల్లో, రోడ్ల వెంట, పార్కు స్థలాల్లో మొక్కలు నాటడానికి ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే నర్సరీల నుంచి మొక్కలను ఆయా గ్రామాలకు తరలించారు. కొన్ని గ్రామాల్లో మొక్కలు ఇంటింటికీ తిరిగి పంపిణీ చేయడం కూడా పూర్తయ్యింది. ఈ కార్యక్రమానికి గ్రామస్థాయిలో నోడల్ అధికారులను నియమించారు. నాగన్‌పల్లి వద్ద గుంతలు తవ్వుతున్న కూలీలు హాజరుకానున్న ప్రియాంక వర్గీస్ స్థానిక ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి మన్నెగూడ సెంట్రల్ రోడ్డు డివైడర్ మధ్యలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని ముందుగా ప్రారంభించి, అనంతరం రాయపోల్ అటవీశాఖ భూముల్లో మొక్కలు నాటుతారు. గున్గల్ ఫారెస్టులో మొక్కలు నాటే కార్యక్రమంలో ముఖ్యమంత్రి కార్యాలయ ఓఎస్డీ ప్రియాంక వర్గీ‹స్ పాల్గొంటారు. అదేవిధంగా అబ్దుల్లాపూర్‌మెట్ మండలం కవాడిపల్లిలో పార్లమెంట్ సభ్యుడు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, మంచాల మండలంలో జిల్లా పంచాయతీ అధికారిణిæ పద్మజారాణి, లోయపల్లిలో గీత కార్మికులు మొక్కలు నాటే కార్యక్రమానికి జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ రఘురాం, తుర్కగూడ రైతుల ఆధ్వర్యంలో నిర్వహించే హరితహారం కార్యక్రమానికి జిల్లా వ్యవసాయాధికారిణి గీతారెడ్డి, ఇబ్రహీంపట్నం మున్సిపల్ పరిధిలో ట్రాన్స్‌కో డీఈ సురేందర్‌రెడ్డి, ఆర్డీఓ అమరేందర్, చర్లపటేల్‌గూడలో స్థానిక ఏసీపీ యాదగిరిరెడ్డి, మంగళ్‌పల్లి అటవీ భూముల్లో జిల్లా ఫారెస్టు అధికారి తదితరులు పాల్గొని మొక్కలు నాటనున్నారు. హరిత పండుగలో అందరూ పాల్గొనండి రాష్ట్రంలో ఎక్కడాలేని విధంగా ఇబ్రహీంపట్నంలో జరగబోయే హరితపండగను జయప్రదం చేయాలి. అన్ని ప్రభుత్వ శాఖల అధికారులు తప్పకుండా హాజరుకావాలి. డ్వామా, ఈజీఎస్, అటవీశాఖల అధికారులు ఆరు లక్షల మొక్కలు నాటడానికి కావాల్సిన ఏర్పాట్లు ఇప్పటికే పూర్తిచేశారు. ఎక్కడా ఇబ్బందులు లేకుండా గోతులు తవ్వించి సిద్ధంగా పెట్టారు. హరితహారం విజయవంతం చేయడానికి వరణుడు కూడా సహకరిస్తున్నాడు. ఇబ్రహీంపట్నం నియోజకవర్గం రాష్ట్రంలో ఆదర్శంగా నిలవాలి. ముఖ్యమంత్రి మెచ్చుకునేలా మన హరితహారం పండగ జరగాలి. ఉదయం పది గంటలకే కార్యక్రమం ప్రారంభం కావాలి. – మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, ఎమ్మెల్యే, ఇబ్రహీంపట్నం -
మంచిరెడ్డి కిషన్‌రెడ్డికి అచ్చొచ్చిన 6666
ఇబ్రహీంపట్నం రూరల్ : రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గ టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మంచిరెడ్డి కిషన్‌రెడ్డి తన కారును సెంటిమెంట్‌గా భావిస్తున్నారు. హోండసీటీ 6666 నెంబరు గల కారులో ప్రచారం చేస్తున్నారు. గతంలో రెండు పర్యాయాలు ఈ కారులోనే ప్రచారం చేసి గెలుపొందారు. మళ్లీ అదే సెంటిమెంట్ పాటిస్తున్నారు. కొత్తకార్లు ఉన్నప్పటికీ ఆయన పాత కారునే వాడుతున్నారు. అదేవిధంగా ప్రచార పత్రాల్లో, వాల్‌పోస్టర్లలో ఒక పక్కన ఎర్రబొట్టును వాడటం కూడా ఆయన ప్రత్యేకతట. -
మంచిరెడ్డి కిషన్‌రెడ్డికు చేదు అనుభవం
-
నగదు తక్కువ.. ఆస్తులు ఎక్కువ
సాక్షి, ఇబ్రహీంపట్నం: అసెంబ్లీ స్థానానికి టీఆర్ఎస్ అభ్యర్థిగా నామినేషన్ వేసిన మంచిరెడ్డి కిషన్‌రెడ్డి అఫిడవిట్లో ప్రకటించిన ఆస్తుల వివరాలు ఇలా ఉన్నాయి. ఆయన పేరుపై రూ.1.56 కోట్లు, భార్య ముకుంద పేరుపై రూ.48.49 లక్షల చరాస్తులు ఉన్నట్టు పేర్కొన్నారు. ఆయనతో నగదు రూ.60 వేలు, భార్యతో రూ.40 వేలు ఉన్నట్టు చూపారు. ఒక బ్యాంకు ఖాతాలో రూ.31.43లక్షలు, మరో ఖాతాలో రూ.6,384 ఉన్నట్టు పేర్కొన్నారు. అలాగే భార్య పేరు మీద ఒక ఖాతాలో రూ. 26 వేలు, మరో ఖాతాలో రూ.5.11లక్షలు ఉన్నట్టు చూపారు. ఎల్ఐసీ బాండ్లు రూ.5లక్షల విలువగలవి, భార్యపేరుతో రూ. 10లక్షల విలువ గలవి ఉన్నట్టు పేర్కొన్నారు. హోండా సిటీ సీఆర్వీ, బీఎండబ్ల్యూ, ఇన్నోవా వాహనాలు ఉన్నాయని తెలిపారు. బంగారు ఆభరణాల విషయానికి వస్తే.. ఆయన పేరుతో 50 గ్రాములు, భార్య పేరుపై కిలో బంగారు, 3 కిలోల వెండి ఆభరణాలు ఉన్నట్టు చూపారు. ఇబ్రహీంపట్నంలోని పద్మావతి సర్వీస్ స్టేషన్లో వాటా(రూ.20లక్షలు) ఉందన్నారు. ఇక స్థిరాస్తుల విషయానికి వస్తే ఎలిమినేడు గ్రామంలో 29.39 ఎకరాలు, కందుకూరు మండలం తిమ్మాపూర్‌లో 11.35ఎకరాలు, సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌లో 16.28 ఎకరాలు.. మొత్తం 58.22 ఎకరాలు ఉండగా, మార్కెట్ విలువ రూ.11 కోట్లుగా చూపారు. అలాగే భార్యపేరుపై సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌లో 12.36 ఎకరాలు, కీసర మండలం రాంపల్లిదాయరలో 4.09ఎకరాలు.. మొత్తం 17.15 ఎకరాలు ఉందని, దీని విలువ రూ.2.75 కోట్లుగా పేర్కొన్నారు. అలాగే తిరుమల హిల్స్‌లో 220 గజాల ఇల్లు, ఎల్మినేడులో మరో ఇల్లు, భార్య పేరుపై తిరుమల హిల్స్‌లో 320 గజాల ఇల్లు ఉందన్నారు. వాహనంపై ప్రస్తుతం రూ.14 లక్షల రుణం ఉన్నట్టు చూపారు. -
టీఆర్ఎస్ ఉద్యమకారుల ఆవేదన సభ.. మంచిరెడ్డికి ఝలక్!
సాక్షి, ఇబ్రహీంపట్నం : ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో టీఆర్ఎస్లోని తెలంగాణ ఉద్యమకారులు పార్టీ అభ్యర్థి, తాజా మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డికి వ్యతిరేకంగా గళమెత్తారు. టీఆర్ఎస్ ఉద్యమకారుల ఆవేదన సభ పేరిట నిర్వహించి.. మంచిరెడ్డి కిషన్ రెడ్డికి టికెట్ ఇవ్వడంపై ఉద్యమకారులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. సభ జరుగుతుండగా.. మధ్యలోనే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి రావడంతో తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. కిషన్ రెడ్డి తీరుపై ఉద్యమకారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ పాత, కొత్త నేతల మధ్య వాగ్వాదం జరిగింది. అందరినీ కలుపుకొని వెళ్తున్నానని కిషన్ రెడ్డి సర్దిచెప్పేందుకు ప్రయత్నించినా.. ఆయన తీరుపై అసమ్మతి నేతలు చల్లబడలేదు. ఉద్యమకారులను కిషన్‌రెడ్డి కించపరిచారని పలువురు నేతలు నిరసన వ్యక్తం చేశారు. దీంతో సభ పూర్తికాకుండానే మంచిరెడ్డి వెళ్లిపోయారు. మంచిరెడ్డితోపాటు ఈ సమావేశానికి ఎంపీ బూర నర్సయ్యగౌడ్ కూడా హాజరయ్యారు. పార్టీలోని ఉద్యమకారులను కలుపుకొని వెళ్లాలని ఆయన నేతలకు సూచించారు. -
మంచిరెడ్డికి ఓటెయ్యవద్దు: కంచర్ల
సాక్షి, ఇబ్రహీంపట్నం(రంగారెడ్డి జిల్లా): టీఆర్ఎస్ అభ్యర్థులకు ఇప్పుడు రెబెల్ నాయకులతో తలనొప్పి వస్తోంది. ఇతర పార్టీల నుంచి టీఆర్ఎస్లోకి చేరిన అభ్యర్థులకు ప్రస్తుతం పెద్ద సమస్య ఏర్పడింది. గత ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేసిన అభ్యర్థులు ఇప్పుడు వారికి సహకరించే పరిస్థితి లేదు. గత ఎన్నికల్లో ఇతర పార్టీల నుంచి గెలిచి, టీఆర్ఎస్లో చేరిన వారందరికీ సీఎం కేసీఆర్ టిక్కెట్లు ఇచ్చారు. గతంలో ఆ స్థానాల్లో టీఆర్ఎస్ నుంచి పోటీ చేసిన వారికి ఎలాంటి హామీలు ఇవ్వకపోవడంతో వారు టీఆర్ఎస్ అభ్యర్థులకు వ్యతిరేక ప్రచారం ప్రారంభించారు. దాదాపు అన్ని నియోజకవర్గాల్లో ఇదే పరిస్థితి ఏర్పడింది. తాజాగా రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం అసెంబ్లీ అభ్యర్థిగా మంచిరెడ్డి కిషన్ రెడ్డిని కేసీఆర్ ప్రకటించారు. 2014 ఎన్నికల్లో ఆయన టీడీపీ నుంచి గెలిచారు. అనంతరం పార్టీ మారి టీఆర్ఎస్లోకి వచ్చారు. 2014 ఎన్నికల్లో ఇబ్రహీంపట్నం నుంచి టీఆర్ఎస్ అభ్యర్థిగా కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి నిలబడి సుమారు 22 వేల ఓట్లు తెచ్చుకున్నారు. ఈసారి పార్టీ టిక్కెట్ తనకు ఇవ్వకుండా పార్టీ మారి వచ్చిన మంచిరెడ్డికి ఇవ్వడంతో ఆయన తిరుగుబావుటా వేశారు. మంచిరెడ్డి ఓడించాలని ఊరూరా తిరిగి ప్రచారం చేస్తున్నారు. బండరావిరాలలో శుక్రవారం ఆయన స్థానికులతో మాట్లాడుతూ.. మంచిరెడ్డికి ఓటు వేయొద్దని కోరారు. పార్టీ మారి వచ్చిన అభ్యర్థులందరికీ ఇదే పెద్ద సమస్యగా మారింది. -
ప్రోగ్రెస్ రిపోర్ట్ మంచిరెడ్డి కిషన్‌రెడ్డి
-
అధికారిపై సర్పంచ్ దాడి
మంచాల రంగారెడ్డి : మండల పరిధిలోని లింగంపల్లి గేట్ సమీపంలో డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణ శంకుస్థాపనలో రగడ చోటు చేసుకుంది. ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి గేట్ సమీపంలో ఆదివారం డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణానికి భూమిపూజ చేసేందుకు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ప్రారంభోత్సవంలో ప్రొటోకాల్ సమస్య వివాదానికి దారితీసింది. డబుల్ ఇళ్ల కోసం గుర్తించిన స్థలం లింగంపల్లి గ్రామ పంచాయతీ, రెవెన్యూ మాత్రం నోముల గ్రామ పరిధిలోకి వస్తుంది. ఇక్కడ శిలాఫలకంలో లింగంపల్లి సర్పంచ్ వాసవి పేరుపెట్టారు. కాని నోముల సర్పంచ్ మల్లేశ్ పేరు శిలాఫలకంలో లేదు. దీంతో నోముల సర్పంచ్ మల్లేశ్ ‘నా పేరు ఎందుకు శిలా ఫలకంలో పెట్టలేదని, ఎస్టీ కావడంతో దళితుడిననే కారణంతోనే అవమానించారని’ ఆందోళనకు దిగాడు. అధికారులు పొరపాటు చేశారని తిరిగి పేరు నమోదు చేస్తామనని ఎమ్మెల్యే నచ్చచెప్పారు. దీంతో ఆగ్రహానికి గురైన మల్లేశ్ ఆర్అండ్బీ అధికారి బాలు నాయక్‌పై చెయి చేసుకున్నారు. అధికారిపై దాడితో సమస్య వివాదంగా మారింది. వెంటనే పోలీసులు నోముల సర్పంచ్ మల్లేష్‌ను అక్కడి నుంచి తీసుకెళ్లారు. సర్పంచ్ మల్లేష్ మాత్రం తాను దళితుడిని అనే ఒక్క కారణంతోనే అవమానించారని ఆరోపించారు. కార్యక్రమంలో ఎంపీపీ జయమ్మ, జిల్లా రైతు సమన్వయ కమిటి కోఆర్డినేటర్ వంగేటి లక్ష్మారెడ్డి, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ సత్తు వెంకటరమణారెడ్డి, మాజీ వైస్ చైర్మన్ దండేటికార్ రవి, వివిధ గ్రామాలకు చెందిన ఎంపీటీసీ సభ్యులు, సర్పంచ్‌లు, అధికారులు పాల్గొన్నారు. -
ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డికి కేసీఆర్ ఫోన్
సాక్షి, ఇబ్రహీంపట్నం : పట్టాదారు పాస్‌పుస్తకాలు, రైతుబంధు చెక్కుల పంపిణీని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. సాధారణ ఎన్నికల్లో గెలుపునకు సోపానంగా మారుతుందని భావిస్తున్న ఈ కార్యక్రమంపై ముఖ్యమంత్రి కేసీఆర్ భారీ ఆశలు పెట్టుకున్నారు. ఈ నేపథ్యంలో రైతుబంధు, పాస్‌పుస్తకాల జారీపై ప్రజల మనోగతాన్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇందులోభాగంగా ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డితో సీఎం కేసీఆర్ ఫోన్లో సంభాషించారు. తాళ్లపల్లిగూడెంలో కిషన్‌రెడ్డి చెక్కులు పంపిణీ చేస్తుండగా.. ముఖ్యమంత్రి ఫోన్ చేసి రైతుబంధు గురించి ప్రజలు ఎమనుకుంటున్నారని అడిగి తెలుసుకున్నారు. ప్రజల స్పందన ఎలా ఉంది.. ఇంకా ఏం చేస్తే బాగుంటుందో తెలుసుకోవాలని సూచించారు. -
ఎక్స్‌రే గదికి తాళం!
ఇబ్రహీంపట్నంరూరల్ : యాచారం మండల కేంద్రానికి చెందిన మేరాజ్‌అంజూ అనే మహిళా సోమవారం మధ్యాహ్నం రెండు గంటల సమయంలో ఇబ్రహీంపట్నం ప్రభుత్వ ఆస్పత్రికి వచ్చింది. ఎక్స్‌రే ఎక్కడ తీస్తారని సాధారణ రోగులను అడగడంతో మాకు తెలియదని చెప్పారు. ఆమెకు ఎదురుగా ఓ నర్సు వచ్చి ఇక్కడ ఎక్స్‌రే మిషన్ ఉంది కానీ ఎక్స్‌రే తీసే వారు లేరని వ్యంగంగా సమాధానం ఇచ్చింది. ప్రజా వైద్యంపై నిర్లక్ష్యం చేస్తున్నారనే విషయానికి ఇది నిలువెత్తు నిదర్శనం. బాధ్యతాయుతంగా నడుచుకోవాల్సిన సిబ్బంది రోగులను, ప్రభుత్వాన్ని అబాసుపాలు చేసేలా వ్యవహరిస్తున్నారు. ఆరునెలలుగా వేసిన తాళం తీయ్యలే... ఇబ్రహీంపట్నం, మంచాల, యాచారం మండలాలతో పాటు ఇతర ప్రజలకు పెద్ద దిక్కైన పెద్దాస్పత్రి ఇబ్రహీంపట్నం ప్రభుత్వ దవాఖాన. ప్రజలకు నిరంతరం సేవలందిండచానికి గతంలో జిల్లా కలెక్టర్‌గా పని చేసిన వాణిప్రసాద్ చొరవతో పాత పెద్దాస్పత్రి బాగుపడింది. సకల సౌకర్యాలతో ఆదర్శ ఆస్పత్రిగా తీర్చిదిద్దితే మళ్లీ ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్నచందంలాగా తయారైంది. అప్పట్లో అన్ని విభాగాలు పని చేసే విధంగా ఎక్స్‌రే మిషన్ తీసుకొచ్చి పెట్టారు. గతంలో డిజిటల్ ఎక్స్‌రే లేకపోవడంతో సంవత్సర కాలంగా రూ.లక్షల్లో వెచ్చించి డిజిటల్ ఎక్స్‌రే ఏర్పాటు చేశారు. పట్టుమని పది కాలాలు గడవక ముందే ఎక్స్‌రే గదికి తాళం వేశారు. శామీర్‌పేట్ నుంచి డిప్యూటేషన్ విధానంతో ఇబ్రహీంపట్నంలో విధులు నిర్వర్తించేవారు. జిల్లాల విభజన తర్వాత మేడ్చెల్‌కు కేటాయించడంతో వారు తిరిగి వెళ్లిపోయారు. ప్రస్తుతం ఆరు నెలల కాలంగా ఇబ్రహీంపట్నం ఎక్స్‌రే యంత్రానికి అతిగతి లేకుండా పోయింది. పేద ప్రజలకు ఎక్స్‌రేలు తీసేవారు కరువయ్యారు. ప్రైవేటు ఆస్పత్రులను ఆశ్రయిస్తే రూ.200–600 వరకు తీసుకుంటారు. పేదలకు ప్రభుత్వ ఆస్పత్రి దిక్కవుతుందని అనుకుంటే టెక్నిషియన్ కొరత తీరడం లేదని వాపోతున్నారు. నిత్యం 600నుంచి 1000 రోగుల వచ్చే ప్రభుత్వఆస్పత్రికి వెంటనే ఎక్స్‌రే టెక్నిషియన్ మంజూరు చేయాలని కోరుతున్నారు. ఎమ్మెల్యేకు ఫిర్యాదు చేస్తాం స్థానిక ఆస్పత్రిలో ఇన్నాళ్లుగా ఎక్స్‌రే తీయడానికి ఆపరేటర్ లేకపోవడం చాలా బాధకరం. రాష్ట్ర ప్రభుత్వం ఆస్పత్రుల నిర్వహణకు అధిక నిధులు కేటాయిస్తుంది. ఆస్పత్రి యాజమాన్య కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లి వెంటనే సమస్య పరిష్కరం అయ్యేలా చూస్తాం. పేద ప్రజలకు ఇలాంటి సమస్యలు మళ్లి పునరావృత్తం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఆరోగ్యశాఖదే.– జెర్కొని రాజు, ఇబ్రహీంపట్నం -
నయీమ్‌తో కలసి మంచిరెడ్డి అకృత్యాలు
-
నయీమ్‌తో కలసి మంచిరెడ్డి అకృత్యాలు
విచారణ జరపాలంటూ డీజీపీకి మల్రెడ్డి రంగారెడ్డి విజ్ఞప్తి సాక్షి, హైదరాబాద్: ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో గ్యాంగ్‌స్టర్ నయీమ్‌తో కలిసి ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, ఆయన కుమారుడు ప్రశాంత్‌రెడ్డి కబ్జాలు, అకృత్యాలకు పాల్పడ్డారని.. దీనిపై విచారణ జరపాలని మాజీ ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి డీజీపీని కోరారు. ఈ మేరకు బుధవారం డీజీపీ అనురాగ్‌శర్మను కలసి పలు పత్రాలను అందజేశారు. మంచిరెడ్డి ఏడేళ్లుగా నయీమ్‌తో సంబంధాలు కొనసాగిస్తూ దళిత, గిరిజన రైతులను బెదిరిం చారని... కోట్ల విలువైన భూములను కబ్జా చేసి, రియల్ ఎస్టేట్ వ్యాపారులకు అప్పగించారని ఆరోపించారు. రియల్ వ్యాపారుల నుంచి భారీగా వసూళ్లు చేశాడన్నా రు. ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో భూములు కొన్నా, అమ్మినా మంచిరెడ్డికి తెలియకుండా జరగడానికి వీల్లేని విధంగా భయానక వాతావరణాన్ని నయీమ్ సృష్టించాడని ఆరోపించారు. ఆదిభట్లలో మంచి ఇన్ఫ్రా డెవలపర్స్‌లో ఉన్న 36.10 ఎకరాలను మంచిరెడ్డి, ఆయన అనుచరులు రైతులను బెదిరించి రిజిస్టర్ చేయించుకున్నారని.. తట్టిఖానా రెవెన్యూ పరిధిలో 325 ఎకరాల భూమిని పేదల నుంచి తక్కువ ధరకు సొంతం చేసుకున్నారన్నారు. మంచిరెడ్డి, నయీమ్ అకృత్యాలు, కబ్జాలపై సిట్‌తో విచారణ జరిపించి రైతులకు న్యాయం చేయాలని డీజీపీకి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆదిభట్లలోని మంచి ఇన్ఫ్రా డెవలపర్స్ డాక్యుమెంట్, నయీమ్, రాంరెడ్డి పట్వారీ కుమారుడు నర్సింహరెడ్డి డాక్యుమెంట్, ఖానాపూర్ 67/ఇ లోని నకిలీ పాస్‌బుక్ , ప్రొసీడింగ్స్, రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌కు ఇచ్చిన వినతిపత్రం కాపీలను డీజీపీకి ఇచ్చినట్లు మల్రెడ్డి తెలిపారు. -
ఆ ఎమ్మెల్యే జైలుకూడు తినకతప్పదు
హైదరాబాద్: కాంగ్రెస్ నేత, మాజీ ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి, ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డిల మధ్య వివాదం ముదిరింది. మల్రెడ్డి రంగారెడ్డి తనపై చేసిన ఆరోపణలను రుజువు చేయాలని, లేదంటే చట్టప్రకారం చర్యలు తీసుకుంటానని మంచిరెడ్డి కిషన్‌రెడ్డి హెచ్చరించారు. ఎమ్మెల్యే అనుచరులతో వచ్చి ఇబ్రహీంపట్నం చౌరస్తాలో బైఠాయించారు. ఈ వ్యాఖ్యలపై మల్రెడ్డి స్పందిస్తూ.. తాను చేసిన ఆరోపణలకు కట్టుబడి ఉన్నానని, నిరూపించలేకపోతే రాజకీయాల నుంచి తప్పుకుంటానని సవాల్ విసిరారు. 'మంచిరెడ్డి సంస్కారం లేకుండా మాట్లాడుతున్నారు. ఓ గ్యాంగ్‌స్టర్ మాట్లాడినట్టు మాట్లాడుతున్నారు. నయీంతో ఆయనకు ఏడెనిమిది సంవత్సరాల నుంచి సంబంధాలు ఉన్నాయి. దమ్ముంటే నయీంతో కలసి చేసిన దందాల మీద మాట్లాడాలి. మంచిరెడ్డి పేదల దగ్గర నుంచి భూములు లాక్కొన్నారు. ఏడేళ్ల నుంచి ఎక్కడెక్కడ కబ్జాలు చేశారో నా దగ్గర ఆధారాలున్నాయి. మంచిరెడ్డి తన తప్పులను కప్పిపుచ్చుకునేందుకే అధికార టీఆర్ఎస్లోకి వెళ్లారు. పేదల రక్తాన్ని పీల్చి వందల కోట్ల రూపాయలు సంపాదించారు. నయీం కేసులో సంబంధాలున్నవారిని అరెస్ట్ చేసినట్టే మంచిరెడ్డిపై కూడా చర్యలు తీసుకోవాలి. ఆయన దళిత కుటుంబాలను మోసం చేశాడు. నా దగ్గర ఆధారాలున్నాయి. మంచిరెడ్డి దొరికిన దొంగ, తప్పించుకోలేరు. జైలు కూడు తినకతప్పదు' అని మల్రెడ్డి రంగారెడ్డి అన్నారు. -
మల్‌రెడ్డికి ఎమ్మెల్యే మంచిరెడ్డి సవాల్
రంగారెడ్డి: రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం చౌరస్తాలో సోమవారం మధ్యాహ్నం ఉద్రిక్తత నెలకొంది. కాంగ్రెస్ నేత, మాజీ ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి తనపై చేసిన ఆరోపణలను రుజువు చేయాలని డిమాండ్ చేస్తూ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి అనుచరులతో వచ్చి స్థానిక చౌరస్తాలో బైఠాయించారు. మల్రెడ్డి చర్చకు రావాలని ఎమ్మెల్యే సవాల్ విసిరారు. (చదవండి 'ఎమ్మెల్యే మంచిరెడ్డికి నయీంతో సంబంధాలు!') ఈ సందర్భంగా ఎమ్మెల్యే మంచిరెడ్డి మాట్లాడుతూ...మరో రెండు గంటలు ఇక్కడే ఉంటానన్నారు. గ్యాంగ్‌స్టర్ నయీంతో తనకు సంబంధముందన్న ఆరోపణలను మల్రెడ్డి రుజువు చేయాలన్నారు. దమ్ము, ధైర్యం లేకే మల్రెడ్డి మొహం చాటేశారని మంచిరెడ్డి ఆరోపించారు. ఆరోపణలు నిరూపించకుంటే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటానని మంచిరెడ్డి హెచ్చరించారు. (చదవండి : 'నయీంతో నాకెలాంటి సంబంధాలు లేవు' ). -
ఎమ్మెల్యే మంచిరెడ్డికి నయీంతో సంబంధాలు!
సైదాబాద్: గ్యాంగ్‌స్టర్ నయీంతో కలిసి ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి భూ దందాలు కొనసాగించాడని మాజీ ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి ఆరోపించారు. నయీం దాచిపెట్టిన నగదు మంచిరెడ్డి వద్దే ఉందని ఆ విషయాన్ని అతడిని అరెస్ట్ చేసి విచారిస్తే తెలుస్తుందని అన్నారు. అమాయక రైతులను బెదిరించి మంచి ఇన్ ఫ్రా పేరుతో లూటి చేశాడన్నారు. సైదాబాద్ డివిజన్ తిరుమలాహిల్స్‌లోని తన నివాసంలో ఆదివారం మల్రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఎమ్మెల్యేతో పాటు అతని కుమారుడు ప్రశాంత్‌రెడ్డి చేసిన భూ దందాలు స్థానికులకు తెలుసన్నారు. టీడీపీ నుంచి టీఆర్ఎస్లో చేరిన వరకు కిషన్ రెడ్డి ఎన్నో అక్రమాలకు పాల్పడ్డాడని అన్నారు. నయీంను అడ్డు పెట్టుకొని దందాలు సాగించడాని తెలిపారు. ఇబ్రహీంపట్నంలో సిట్ అధికారులు అరెస్ట్ చేసిన శ్రీహరితో కలిసి మంచిరెడ్డి భూ లావాదేవీలు సాగించారని అన్నారు. ఆదిభట్లలో సర్వేనెంబర్లు 165–197, 216–218, 292, 290, 209, 300 నెంబర్లలో గల భూములను నయీంతో కలిసి మంచిరెడ్డి కాజేశాడని విమర్శించారు. ఒకే డాక్యుమెంట్లో శ్రీహరితో పాటు మంచిరెడ్డి పేరు ఉంటే శ్రీహరిని మాత్రమే అరెస్ట్ చేసి ఎమ్మెల్యే కిషన్ రెడ్డిని ఎలా వదిలేస్తారని ప్రశ్నించారు. నయీం కేసు నిష్పక్షపాతంగా సాగాలంటే మంచిరెడ్డిని అరెస్ట్ చేసి సీబీఐ చేత విచారించాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. తమ వద్ద ఉన్న ఆధారాలను సిట్ అధికారులకు అందించినట్లు తెలిపారు. ఇబ్రహీంపట్నం కాంగ్రెస్‌పార్టీ సర్పంచ్‌లు పాల్గొన్నారు. -
'ఎమ్మెల్యే రూ.300 కోట్లు సంపాదించాడు'
హైదరాబాద్ : గ్యాంగ్‌స్టర్ నయీం ప్రధాన అనుచరుడు శ్రీహరితో కలిసి ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి భారీగా అక్రమాలకు పాల్పడ్డారని కాంగ్రెస్ నేత, మాజీ ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి ఆరోపించారు. హైదరాబాద్‌లో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ..ఎమ్మెల్యే మంచిరెడ్డిపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. నయీం కేసులో శ్రీహరిని అరెస్ట్ చేసిన పోలీసులు ఎమ్మెల్యే మంచిరెడ్డిని ఎందుకు అరెస్ట్ చేయలేదని రంగారెడ్డి ప్రశ్నించారు. శ్రీహరితో కలిసి ఎమ్మెల్యే రూ.300 కోట్లు సంపాదించాడని ఆయన ఆరోపించారు. ఆదిభట్లలోని భూ కబ్జా విషయాలు బయటకొస్తాయనే భయంతోనే మంచిరెడ్డి పార్టీ మారారన్నారు. ఎమ్మెల్యే అవినీతిపై ఇబ్రహీంపట్నం చౌరస్తాలో బహిరంగ చర్చకు సిద్ధమని రంగారెడ్డి సవాల్ విసిరారు. -
రోడ్లు, రవాణాకు అధిక ప్రాధాన్యం
ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి మంతన్‌గౌరెల్లిలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన యాచారం: ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలోని ప్రతి గ్రామానికి బీటీ రోడ్డు, ఆర్టీసీ బస్సు సౌకర్యాం కల్పించే విధంగా కృషి చేస్తానని ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి అన్నారు. మంతన్‌గౌరెల్లి గ్రామంలో రూ. కోటి నిధులతో చేపట్టిన వివిధ అభివృద్ధి పనులకు సోమవారం ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. నియోజకవర్గంలో ప్రతి గ్రామానికి, గిరిజన తండాకు బీటీ బీటీ రోడ్డు నిర్మించడానికి ఎన్ని రూ. కోట్లయినా ఖర్చు చేస్తామని స్పష్టంచేశారు. రోడ్డుతో పాటు అన్ని గ్రామాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం కల్పిస్తామని చెప్పారు. గిరిజనులు ఆర్థికంగా ఎదగడానికి కృషి చేయాలని సూచించారు. ఎన్ని కష్టాలోచ్చినా పిల్లలను ఉన్నత చదువులు చదివించాలన్నారు. వెనుకబడిన కులాల్లో ఉన్నత చదువుల వల్లే ఉద్యోగాలు పొంది ఆర్థికంగా స్థిరపడే అవకాశం ఉందని చెప్పారు. ప్రతిభ ఉన్న నిరుద్యోగ యువతి, యువతులకు ఎంకేఆర్ ఫౌండేషన్ నుంచి ఉద్యోగాలు సాధించేలా ఉచితంగా శిక్షణ ఇప్పిస్తానన్నారు. ప్రతి గిరిజన తండాకు స్వచ్ఛమైన కృష్ణాజలాలు సరఫరాకు కృషి చేస్తానని అన్నారు. ముందు కాలంలో ఎస్సీ, ఎస్టీ కాలనీల అభివృద్ధే లక్ష్యంగా ప్రణాళికలు చేస్తున్నట్లు తెలిపారు. నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో ఉన్న ఎస్సీ, ఎస్టీ కాలనీల్లో తాగునీరు, డ్రైనేజీ, వీధిలైట్లు, బీటీ రోడ్ల నిర్మాణం కోసం రూ.100 కోట్ల నిధులు ఖర్చు చేసేలా కృషి చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఏడాది కాలంలోనే రూ.500 కోట్లు ఖర్చు చేసి అభివృద్ధి పనులు చేసినట్లు తెలిపారు. వచ్చే మూడేళ్ల కాలంలో మరో వెయ్యి కోట్లు ఖర్చు చేసి వివిధ అభివృద్ధి పనులు చేసి తెలంగాణాలోనే ఇబ్రహీంపట్నం నియోజకవర్గాన్ని ఆదర్శవంతంగా అభివృద్ధి చేస్తానని పేర్కొన్నారు. సోమన్న ఆలయంలో ఎమ్మెల్యే పూజలు... మాల్ - మంతన్‌గౌరెల్లి గ్రామాల మధ్య ఉన్న సోమన్న ఆలయంలో సోమవారం ఉదయం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూజారులు ఆయనకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆలయం వద్ద సీసీ రోడ్డు, తాగునీరు వసతి కోసం రూ.20 లక్షల నిధులు మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు. నల్లవెల్లి, మాల్, మంతన్‌గౌరెల్లి తదితర గ్రామాల మధ్య వెలసిన సోమన్న దేవాలయ అభివృద్ధి కోసం తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. స్వామివారికి పూజలు చేసి సమృద్ధిగా వర్షాలు కురవాలని వేడుకున్నారు. ఈ కార్యక్రమంలో ఇబ్రహీంపట్నం మార్కెట్ కమిటీ చైర్మన్ సత్తు వెంకటరమణారెడ్డి, ఎంపీపీ రమావత్ జ్యోతీనాయక్, జెడ్పీటీసీ కర్నాటి రమేష్‌గౌడ్, మంతన్‌గౌరెల్లి ఎంపీటీసీ సభ్యుడు కొర్ర అరవింద్ నాయక్, సర్పంచ్ కనుక నర్సయ్య, టీఆర్ఎస్ నాయకులు రమావత్ శ్రీనివాస్ నాయక్, శంకర్‌నాయక్, శ్రీనువాస్ నాయక్ తదితరులు పాల్గొన్నారు. పూజల అనంతరం గ్రామస్తులు ఎమ్మెల్యేను ఘనంగా సన్మానించారు. -
గ్రామాల అభివృద్ధికి పాటుపడాలి
మంచాల: గ్రామాల అభివృద్ధికి ప్రతి ఒక్కరు పాటు పడాలని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి అన్నారు. బుధవారం మంచాల మండల పరిధిలోని లింగంపల్లి, తాళ్లపల్లి గూడ గ్రామాల్లో హరితాహారం పథకం కింద మొక్కలు నాటారు, అదే విధంగా ఆయా గ్రామాల్లో సీసీ రోడ్డు, అండర్ డ్రైనేజీ పనులు ప్రారంభం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామాలను అన్ని రకాలుగా అభివృద్ధి చేసుకోవడన్నాకి ప్రతి ఒక్కరు బాధ్యతగా బావించి ముందుకు రావాలన్నారు. గ్రామాల్లో ప్రజలందరికి మౌలిక వసతుల కల్పన కోసం తన వంతు సహాకారం ఎల్లప్పుడు ఉంటుందన్నారు.ప్రధానంగా పారిశుద్ధ్యం, తాగునీరు, విధి లైట్లు, వంటి సమస్యలను పరిష్కారించుకోవాలన్నారు. అదే విధంగా గ్రామాల్లో అంతర్గత రోడ్ల నిర్మాణం కూడా చాలా అవసరమన్నారు. గ్రామాల అభివృద్ధికి విడుతల వారిగా నిధులు ఇవ్వడం జరుగుతుందన్నారు. ప్రభుత్వం ఇచ్చె నిధులను సక్రమంగా సద్వినియోగం చేసుకోవాలన్నారు. ప్రభుత్వం అమలు చేసే సంక్షేమ పథకాలు కూడా పేదలకు అందించే విధంగా ప్రజాప్రతినిధులు కృషి చేయాలని అన్నారు. బంగారు తెలంగాణ రాష్ర్ట సాధనలో బాగంగా ప్రభుత్వం మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ, కళ్యాణ లక్ష్మి, షాధిముభారక్, వంటి అనేక సంక్షేమ పథకాలను అమలు చేసిందన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరు సక్రమంగా సద్వినియోగం చేసుకోవాలన్నారు. గ్రామీణ ప్రాంతాలకు రోడ్డు ,రవాణా సౌకర్యం కూడా కల్పించడం జరుగుతుందన్నారు. గ్రామీణ ప్రాంతాల రోడ్ల అభివృద్ధికి కోట్లాది రూపాయాలు కేటాయించడం జరిగిందన్నారు. ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి ప్రజలు గుర్తించుకోవాలన్నారు. లింగంపల్లిలో రూ.5లక్షలతో సీసీ రోడ్డు, మరో రూ.5లక్షలతో అండర్ డ్రైనేజీ పనులు చేయడం జరిగిందన్నారు. అదే విధంగా తాళ్లపల్లి గూడ గ్రామంలో రూ.5లక్షలతో సీసీ రోడ్డు, రూ.3లక్షలతో అండర డ్రైనేజీ పనులు ప్రారంభం చేయడం జరిగింది. హరితాహారం..... హరితాహారం పథకంలో బాగంగా లింగంపల్లి, తాళ్లపల్లి గూడ గ్రామాల్లో 5వేల మొక్కలు నాటడం జరిగింది. నాటిన ప్రతి మొక్కను కాపాడాలని ఎమ్మెల్యే కిషన్‌రెడ్డి సూచించారు. ప్రభుత్వం ఎంతో ఉన్నత ఆశయంతో హరితాహారం పథకం అమలు చేయడం జరుగుతుందన్నారు. నాటిన మొక్కలను కాపాడినప్పుడే ఆ పథకాన్నికి సార్ధకత చేకూరుతుందన్నారు.గ్రామాల్లో పాఠశాల స్థాయి నుండి రైతు వరకు కచ్చితంగా మొక్కలు నాటాలి. వాటిని పెంచాలన్నారు. ప్రకృతి వైఫరిత్యాలను అడ్డుకోవాలంటే కచ్చితంగా మొక్కలను నాటాలన్నారు. పచ్చధనం ద్వారా ప్రకృత్తి బాగుంటుందన్నారు.ప్రజల ఆరోగ్యం కూడా బాగుంటుందన్నారు. వర్షాలు బాగా కురిసి పంటలు బాగా పండాలి, రైతులు బాగుండాలి అంటే కచ్చితంగా మొక్కలు నాటాలన్నారు. కార్యక్రమంలో మంచాల ఎంపీపీ జయమ్మ, జడ్పీటీసీ సభ్యుడు భూపతిగళ్లమహిపాల్, వైస్ ఎంపీపీ భాషయ్య, ఇబ్రహీంపట్నం మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ దండేటికార్ రవి, డైరెక్టర్ కిషన్‌రెడ్డి, లింగంపల్లి సర్పంచ్ రాచకొండ వాసవి, తాళ్లపల్లిగూడ సర్పంచ్ యాదయ్య, ఎంపీటీసీ సభ్యురాలు మంజుల, ఉప సర్పంచ్ మహేంధర్, వార్డు సభ్యులు, ఎంపీడీఓ నాగమణి, తహసీల్దార్ శ్యాంప్రకాశ్, మాజీమార్కెట్ కమిటీ చైర్మన్ అంజిరెడ్డి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు చిందం రఘుపతి, నాయకులు పరమేష్, శ్రీరాంలు, జానీ పాష, యాదయ్య, సీఐ గంగాధర్, ఎస్సైలు కె.యాదగిరి తదితరులు పాల్గొన్నారు. -
'ఇంటికో ఉద్యోగం ఇప్పిస్తా'
ఇబ్రహీంపట్నం రూరల్ (రంగారెడ్డి) : పరిశ్రమల ఏర్పాటుతో భూములు కోల్పోయే రైతులకు ఇంటికో ఉద్యోగం ఇప్పిస్తానని ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి హామీ ఇచ్చారు. శుక్రవారం రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం ఎల్మినేడులో ఏర్పాటు చేసిన గ్రామసభలో ఆయన మాట్లాడారు. పరిశ్రమల ఏర్పాటుతో వెనుకబడ్డ ఎల్మినేడు గ్రామ దశ మారిపోతుందని చెప్పారు. ఇందుకు అవసరమైన భూములను ఇచ్చి సహకరించాలని రైతులను కోరారు. పరిశ్రమల ఏర్పాటుతో గ్రామంలోని మూడు వేల మందికి ఉద్యోగాలు లభిస్తాయని చెప్పారు. జీవో 45 ప్రకారం భూముల మార్కెట్ ధర కంటే మూడు రెట్లు అదనంగా పరిహారం లభించేలా చేస్తానన్నారు. -
జెడ్పీటీసీ సమావేశం రసాభాస
వికారాబాద్: జెడ్పీటీసీ సభ్యులు, ఎమ్మెల్యేల వాగ్వాదంతో శుక్రవారం జరిగిన రంగారెడ్డి జిల్లా పరిషత్ సమావేశం రసాభాసగా మారింది. జెడ్పీటీసీలను మాట్లాడనివ్వడం లేదని కాంగ్రెస్ సభ్యులు ఆరోపించారు. ఎమ్మెల్యేలు కూడా జెడ్పీటీసీలు సభ్యులేనని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి అనడంతో గందరగోళం రేగింది. ప్రాణహిత-చేవెళ్ల, పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టులపై స్పష్టత లేదని కాంగ్రెస్ నేత రామ్మోహన్ రెడ్డి అన్నారు. జిల్లాకు రావాల్సిన నీటి వాటాను తగ్గించారని ఆరోపించారు. అయితే ప్రత్యేక సమావేశం పెట్టి అనుమానాలు నివృత్తి చేస్తామని మంత్రి మహేందర్ రెడ్డి హామీయివ్వడంతో సభ్యులు శాంతించారు. -
భూదందా కోసమే ఎమ్మెల్యే పార్టీ మారాడు
మంచిరెడ్డి టీఆర్ఎస్ నుంచి పోటీ చేసి గెలవాలి విలేకరుల సమావేశంలో మల్రెడ్డి రంగారెడ్డి ధ్వజం ఆదిబట్ల : ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి తన భూదందా కోసమే అధికార టీఆర్ఎస్లో చేరాడని మాజీ ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి తీవ్ర స్థాయిలో విమర్శించారు. ఎమ్మెల్యే ఇబ్రహీంపట్నంలో చేస్తున్న అక్రమ భూదందాలకు అడ్డుకట్టు వేస్తామని ఆయన తెలిపారు. శుక్రవారం మండల కేంద్రంలోని డాగ్ బంగ్లాలో విలేకరుల సమావేశంలో మల్రెడ్డి రంగారెడ్డి మాట్లాడుతూ.. ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి అభివృద్ధి పేరుతో నియోజకవర్గ ప్రజలను మభ్యపెట్టి టీఆర్ఎస్లో చేరాడని ఆరోపించారు. కరీముల్లాఖాన్ భూములకు సంబంధించి గతంలోనే ప్రభుత్వం భూసేకరణకు నోటీసు ఇచ్చిందని, అయినా ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి తన పలుకుబడితో తన చెంచాల(అనుచరుల) పేరు మీద అగ్రిమెంట్ ఏ విధంగా చేసుకుంటారని ప్రశ్నించారు. ఒకవైపు సాధారణ ప్రజలకు కులం, ఆదాయం సర్టిఫికెట్ల కోసం తహాసీల్దార్ కార్యాలయాలల్లో వారం రోజుల సమయం పడుతుంటే కలెక్టర్ కార్యాలయంలో ఎలాంటి సర్వే చేయకుండా మూడు రోజుల్లో సదరు భూమికి సంబంధించిన ఓఆర్సీ ఇవ్వటం ఏమిటని దుయ్యబట్టారు. భూదాన్ బోర్డు పరిహారం విషయంలో ఏపీఐఐసీ గతంలో కరీముల్లాఖాన్ వారసులకు రూ. 18 కోట్లు ఇచ్చిందని తెలిపారు. కరీముల్లాఖాన్ వారసులు లేకపోవడంతో ఆ పరిహారం వెనుతిరిగిందని చెప్పారు. మరిప్పుడు కరీముల్లాఖాన్‌కు కొత్తగా వారసులు ఎలా వచ్చారని మల్రెడ్డి రంగారెడ్డి ప్రశ్నించారు. సర్కార్ కరీముల్లాఖాన్ భూములకు సంబంధించి సమగ్ర విచారణ జరిపించి చర్యలు తీసుకొవాలని డిమాండ్ చేశారు. పట్నం అంగట్లో ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి పశువులాగా అమ్ముడుపోయి అక్రమ భూదందాకు తెర లేపాడని ధ్వజమెత్తారు. సొంత పార్టీ నాయకులే కిషన్‌రెడ్డితో వేగలేమని చెబుతుంటే.. ఆయన తీరు ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చన్నారు. పట్నం ప్రజల ఉసురు ఎమ్మెల్యేకు తగులుతుందని చెప్పారు. కృష్ణా నది జలాలతో పట్నం చెరువును నింపి సస్యశామలం చేస్తామన్న ఎమ్మెల్యే.. నామమాత్రంగా రెండు రోజులు నీళ్లు వదిలి ప్రజలను మభ్యపెట్టారని మండిపడ్డారు. ఎమ్మెల్యే తన పదవికి రాజీనామా చేసి టీఆర్ఎస్ నుంచి పోటీ చేసి గెలవాలని మల్రెడ్డి రంగారెడ్డి సవాల్ విసిరారు. సమావేశంలో మంచాల జెడ్పీటీసీ సభ్యులు భూపతిగల్ల మహిపాల్, మాజీ ఎంపీపీ కృపేష్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ గురునాథ్‌రెడ్డి, మాజీ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు నిట్టు కృష్ణ. ఎమ్ఆర్ఆర్ యువసేన నియోజకవర్గ అధ్యక్షుడు బుర్ర మహేందర్‌గౌడ్, మండల అధ్యక్షుడు మొద్దు కరుణాకర్‌రెడ్డి, నాయకులు దర్పల్లి రాజశేఖర్‌రెడ్డి, పట్నం శివశంకర్, జైపాల్‌రెడ్డి, భాస్కరాచారి, గౌస్, శ్రీనివాస్‌రెడ్డి పాల్గొన్నారు. -
గులాబీలో డిష్యుం డిష్యుం!
- వీధికెక్కిన ‘పట్నం’రాజకీయాలు - రెండుగా చీలిన టీఆర్ఎస్ - మంచిరెడ్డికి వ్యతిరేకంగా నిరసనలు - వైరివర్గాలతో జతకట్టిన ఎంపీ బూర ఇబ్రహీంపట్నం : రంగారెడ్డి జిల్లా గులాబీలో ముసలం పుట్టింది. స్థానిక ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డికి వ్యతిరేకంగా అసమ్మతి గ్రూపు వీధికెక్కింది. ఎమ్మెల్యే ఒంటెద్దు పోకడలను నిరసిస్తూ రచ్చకెక్కింది. దీంతో ఇబ్రహీంపట్నం నియోజకవర్గం అధికార పార్టీలో రాజకీయం వేడెక్కింది. నాలుగు నెలల క్రితం మంచిరెడ్డి టీఆర్ఎస్లో చేరడంతో పార్టీలో లుకలుకలకు దారితీసింది. అప్పటి వరకు నియోజకవర్గ ఇన్చార్జ్గా వ్యవహరించిన కంచర్ల చంద్రశేఖర్‌రెడ్డి, మరో సీనియర్ నేత ఈసీ శేఖర్‌గౌడ్ ఈ పరిణామంతో డీలా పడ్డారు. ఈ క్రమంలోనే ఇన్చార్జ్ బాధ్యతల నుంచి తప్పించడంతో కంచర్ల పార్టీ కార్యక్రమాలకు అంటీముట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు. మరోవైపు ఆయన వర్గీయులను కూడా తనవైపు తిప్పుకునేందుకు మంచిరెడ్డి అనుసరిస్తున్న వైఖరితో గుస్సా మీద ఉన్న ఆయన ఈ వ్యవహారంపై అధిష్టానానికి ఫిర్యాదు చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఈసీ శేఖర్‌గౌడ్ ఏకంగా విలేకర్ల సమావేశం పెట్టి మరి ఎమ్మెల్యే వ్యవహార శైలిపై విమర్శనాస్త్రాలను సంధించారు. భూ అక్రమాలకు పాల్పడుతూ పార్టీ విలువలను భ్రష్టుపట్టిస్తున్నారని ఆరోపించారు. గ్రూపు రాజకీయాలను ప్రోత్సహిస్తూ పార్టీ కోసం పోరాడిన కార్యకర్తలను అణగదొక్కుతున్నారని విమర్శించారు. నావేలితో నాకన్నే పొడిపించారు మరోవైపు భువనగిరి ఎంపీ బూర నర్సయ్యగౌడ్ కూడా ఎమ్మెల్యే వైఖరిపై కినుక వహించినట్లు తెలిసింది. వైరివర్గాలకు అనుకూలంగా మాట్లాడిన తీరు ఆయన అసమ్మతిని బయటపెట్టింది. భూములు కోల్పోయిన బాధితులకు పరిహారం అందించేందుకు ప్రభుత్వ స్థాయిలో నేను మాట్లాడితే.. మరొకరు చెక్కులను పంపిణీ చేయడమేమిటనీ’ ఆయ న ఇబ్రహీంపట్నంలో విలేకర్ల సమావేశంలో ఆవేదన వ్యక్తం చేశారు. అంతేగాకుండా ‘రాజకీయాల్లో నేనొక అజ్ఞానినని, నా వేలితోనే నా కంటిని పొడిపించిన మేధావులు ఇక్కడి వారని’ పరోక్షంగా మంచిరెడ్డిని ఉద్దేశించి ఆయన వ్యాఖ్యానించడం చూస్తే ‘పట్నం’ లో గ్రూపురాజకీయాలు తారాస్థాయికి చేరాయని తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఎంపీ వర్గీయుడిగా గుర్తింపు పొందిన ఈసీ శేఖర్‌గౌడ్ విలేకర్ల సమావేశం పెట్టడం చర్చకు తెరలేపింది. మహేందర్‌తో కంచర్ల భేటీ ఇదిలావుండగా, జిల్లా మంత్రి మహేందర్‌రెడ్డితో బుధవారం చంద్రశేఖర్‌రెడ్డి భేటీ అ య్యారు. ఇబ్రహీంపట్నం నియోజకవ ర్గంలో తాజా రాజకీయ పరిస్థితులను వివరించిన చంద్రశేఖర్‌రెడ్డి.. తనవర్గీయులకు జరుగుతు న్న అన్యాయంపై ఏకరువు పెట్టినట్లు తెలిసిం ది. మంచిరెడ్డితో ముందు నుంచి అభిప్రాయబేధాలున్న మహేందర్.. ఈ అంశంపై లోతు గా వెళ్లకుండా.. పరిస్థితులను చక్కదిద్దుతానని భరోసా ఇచ్చినట్లు సమాచారం. ఇదిలావుండగా, మంచిరెడ్డి వ్యవహారశైలిపై అసంతృప్తితో ఉన్న చంద్రశేఖర్‌రెడ్డి తాజా పరిణామాలను సీఎం దృష్టికి తీసుకెళ్లాలని నిర్ణయిం చినట్లు తెలిసింది. ఈ మేరకు అపాయింట్మెంట్ కోరినట్లు తెలిసింది. -
అభివృద్ధికి అందరూ సహకరించాలి
ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి మంచాల : నియోజకవర్గ అభివృద్ధికి అందరూ టీఆర్ఎస్ పార్టీతో కలిసి రావాలని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి అన్నారు. ఆదివారం మండల పరిధిలోని జాపాల గ్రామంలోని శ్రీమల్లి కార్జున స్వామి ఆలయంలో ధ్వజస్తంభ ప్రతిష్ఠాపన కార్యక్రమానికి ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అనంతరం ఆంజనేయ స్వామి ఆలయంలో ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశంలో పాల్గొని ప్రసంగించారు. నియోజకవర్గ అభివృద్ధి కోసమే తాను టీఆర్ఎస్ పార్టీలో చేరానని తెలిపారు. ఏళ్ల తరబడిగా వెనుకబాటులో ఉన్న ఇబ్రహీంపట్నం నియోజకవర్గ అభివృద్ధికోసమే తాను ఈ నిర్ణయం తీసుకున్నానని స్పష్టం చేశారు. అన్ని గ్రామాలను సంపూర్ణంగా అభివృద్ధి చేయడమే తన లక్ష్యమన్నారు. నియోజకవర్గం అభివృద్ధికి ముఖ్యమంత్రి కేసీఆర్ భరోసా ఇవ్వడంతోనే పార్టీలో చేరినట్లు మంచిరెడ్డి కిషన్‌రెడ్డి చెప్పారు. అభివృద్ధి కోసం అన్ని పార్టీల వారు టీఆర్ఎస్తో కలిసి రావాలని ఆయన కోరారు. ఈనెల 24న మండల కేంద్రంలో నిర్వహించే టీఆర్ఎస్ సదస్సుకు పార్టీ కార్యకర్తలు అందరూ హాజరుకావాలని సూచించారు. జూన్ 2 నుంచి రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాలను ఘనంగా నిర్వహించాలన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు ఈసీ శేఖర్‌గౌడ్, అంజిరెడ్డి, సత్తు వెంకటరమణారెడ్డి, బీయన్ జ్ఞానేశ్వర్, డబ్బికార్ శ్రీనివాస్, ఆవుల మల్లేష్, దండేటికార్ రవి, జక్క రాంరె డ్డి, పుల్లారెడ్డి, రఘుపతి, జంగయ్య, చంద్రయ్య, జాపాల యాదవ సంఘం నాయకులు ఉన్నారు. అయితే.. చిత్తాపూర్ గ్రామంలో బీజేపీ, టీడీపీ నుంచి మాజీ ఎంపీటీసీ సభ్యుడు బొడ్డు రాములు గౌడ్, మాజీ సర్పంచ్ సత్యనారాయణతో పాటు ఉపసర్పంచ్ ఎల్లమ్మతో పాటు మొత్తం పలువురు ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రె డ్డి సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. -
‘పట్నం’ జలసిరికి కొర్రీ!
దశాబ్దాలుగా నీళ్లులేక నోళ్లు తెరిచిన చారిత్రక ఇబ్రహీంపట్నం చెరువుకు జలకళ సంతరింపజేసే విషయంలో జలమండలి కొర్రీలు పెడుతోంది. ఇప్పటికే పూర్తయిన కృష్ణా మూడో దశ పైపులైన్ ద్వారా నల్గొండ జిల్లా కోదండాపూర్ ఏఎంఆర్పీ కాల్వ నుంచి గ్రేటర్ హైదరాబాద్‌కు 90 ఎంజీడీల కృష్ణాజలాలను తరలించనున్నారు. అయితే ఇదే మార్గంలోఉన్న ఈ చెరువును శుద్ధిచేయని (రా వాటర్) జలాలతో నింపే అవకాశం ఉన్నప్పటికీ జలమండలి అభ్యంతరం వ్యక్తం చేయడం ‘పట్నం’ చెరువుకు శాపంగా పరిణమిస్తోంది. చెరువును నింపే విషయంలో వాటర్‌బోర్డు అధికారుల మోకాలడ్డు! - కృష్ణా మూడోదశ ద్వారా మొత్తం తరలించనున్న నీరు 5.5 టీఎంసీలు - పట్నం చెరువు నింపడానికి అవసరమయ్యేది 0.5 టీఎంసీలే - సాంకేతికంగా సాధ్యమేనంటున్న నీటిపారుదల రంగ నిపుణులు సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: ‘పట్నం’ చెరువు నింపే అంశంపై వాటర్‌బోర్డు యంత్రాంగం మల్లగుల్లాలు పడుతోంది. చెరువు నింపేందుకు అన్ని రకాలుగా అవకాశాలున్నప్పటికీ అధికారులు తటపటాయిస్తున్నారు. ఇటీవల గులాబీ గూటికి చేరిన స్థానిక ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి ఇబ్రహీంపట్నం చెరువును శుద్ధిచేయని జలాలతో నింపాలని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావును కోరిన విషయం తెలిసిందే. ఈ ప్రధాన డిమాండ్ నెరవేర్చేందుకు హామీ ఇచ్చినందునే పార్టీలో చేరుతున్నట్లు కిషన్‌రెడ్డి ప్రకటించారు కూడా. అయితే చెరువు నింపేందుకు అన్ని అవకాశాలున్నప్పటికీ వాటర్‌బోర్డు అధికారులు అందుకు ససేమిరా అనడంపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. ఇబ్రహీంపట్నంలో ఇటీవల జరిగిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతూ.. ఖరీదైన శుద్ధి చేసిన జలాలతో చెరువును నింపడం సాధ్యంకాదని.. కానీ రా వాటర్‌ను నింపే అంశంపై అధ్యయనం చేస్తామని ప్రకటించడంతో స్థానికుల్లో కొత్త ఆశలు చిగురించాయి. 0.5 టీఎంసీలు చాలు! ఇబ్రహీం కులీ కుతుబ్‌షా నిర్మించిన ఈ చెరువు సామర్థ్యం 0.5 టీఎంసీలు మాత్రమే. ఒకసారి ఈ చెరువు నిండితే మూడేళ్లలో సుమారు 42 గ్రామాల కరువు తీరనుంది. సబ్బండ చేతివృత్తుల కులాలకు కరువుతీరా ఉపాధి లభించనుంది. అయితే, ఈ చెరువు నింపే అంశంపై సానుకూలంగా స్పందిస్తే కోదండాపూర్ నుంచి సాహెబ్‌నగర్ (103 కి.మీ) వరకు మార్గమధ్యంలోని చెరువులకు కూడా జలాలను తరలించాలనే డిమాండ్ వస్తుందని జలమండలి అనుమానిస్తోంది. దీంతో గ్రేటర్లో తాగునీటి అవసరాలకు ఈ పరిణామం ఆశనిపాతంగా మారుతుందని భావిస్తోంది. వాస్తవానికి కృష్ణా మూడో దశ కింద 40 ఫిల్టర్ బెడ్లను (కోదండాపూర్) పూర్తి చేయాల్సివుంది. దీంట్లో ఇప్పటికీ పది ఫిల్టర్ బెడ్లను మాత్రమే నిర్మించారు. వీటి ద్వారా 45 ఎంజీడీలను రాజధాని తాగునీటి అవసరాలకు తరలించారు. మరో 35 ఫిల్టర్బెడ్ల నిర్మాణానికి మూడు నెలల సమయం పట్టే అవకాశముంది. ఈ మధ్యకాలంలో 0.5 టీఎంసీల శుద్ధిచేయని జలాలతో ఇబ్రహీంపట్నం చెరువు నింపేందుకు అన్నివిధాలా అవకాశముందని, మూడోదశ ద్వారా తరలించనున్న మొత్తం 5.5 టీఎంసీల్లో 0.5 టీఎంసీల నీళ్లు పెద్ద విషయమేమీ కాదని నీటిపారుదలశాఖ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. కానీ, ‘పట్నం’ చెరువుకు జలసిరి రాకుండా వాటర్‌బోర్డు ఉన్నతాధికారులు మోకాలడ్డుతుండడం చర్చనీయాంశంగా మారింది. చెరువు నింపడం తథ్యం: మంచిరెడ్డి శుద్ధిచేయని కృష్ణాజలాలతో ‘పట్నం’ చెరువును నింపేందుకు వాటర్‌బోర్డు కార్యాచరణ సిద్ధం చేస్తుంది. సోమవారం ఇదే అంశంపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలిశా. 35 ఫిల్టర్బెడ్ల నిర్మాణంలోపు నగరానికి వచ్చే 45 ఎంజీడీల నుంచి 0.5 టీఎంసీలను చెరువు నింపేందుకు ఇవ్వనున్నట్లు హామీ ఇచ్చారు. వాటర్‌బోర్డు అధికారులు కూడా అందుకనుగుణంగా ప్రతిపాదనలు తయారు చేస్తున్నారు. -
నేడు ‘పట్నం’కు సీఎం కేసీఆర్
ఇబ్రహీంపట్నం: ముఖ్యమంత్రి కేసీఆర్ సోమవారం ఇబ్రహీంపట్నం రానున్నారు. రుచి దాబా వెనుక ఉన్న విశాలమైన మైదానంలో సాయంత్రం 6 గంటలకు నిర్వహించే బహిరంగ సభలో ఆయన పాల్గొంటారు. స్థానిక ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి టీఆర్ఎస్లో చేరిన తర్వాత నిర్వహిస్తున్న బహిరంగ సభ కావడంతో సర్వత్రా చర్చనీయాంశమైంది. ‘పట్నం’ అభివృద్ధికి ఏమేం హామీలు ఇస్తారోనని.. ఎలాంటి వరాల జల్లు కురిపిస్తారోనని ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. నియోజకవర్గంలో తిష్టవేసిన సమస్యలకు సోమవారం నాటి సీఎం సభతోనైనా శాశ్వత పరిష్కారం దొరుకుతుందన్న ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. వీటికి పరిష్కారం లభించేనా? - ‘పట్నం’ మీదుగా మాల్ వరకు ప్రతిపాదనలో ఉన్న నాలుగులేన్ల రహదారి. ఎప్పటి నుంచో పెండింగ్‌లో ఉంది. - ప్రభుత్వ డిగ్రీ, జూనియర్ కళాశాలల భవన సముదాయాలను పది ఎకరాల స్థలంలో నిర్మించాలన్న నేతల హామీ ఇప్పటి వరకు కార్యరూపం దాల్చలేదు. - కృష్ణా జలాల సరఫరా, పారిశ్రామిక సంస్థల్లో స్థానికులకు ఉపాధి తదితర సమస్యలు. ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఎమ్మెల్యే ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి ప్రోద్భలంతోనే ముఖ్యమంత్రి ‘పట్నం’ బహిరంగ సభకు హాజరవుతున్నారు. ఎమ్మెల్యే టీఆర్ఎస్లో చేరిక తర్వాత నిర్వహిస్తున్న సభ కావడంతో భారీగా జనసమీకరణ చేస్తున్నారు. దాదాపు 40వేల మందికి పైగా హాజరవుతారని అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేశారు. మరోవైపు టీడీపీ నాయకులు, కార్యకర్తలు భారీస్థాయిలో సీఎం సమక్షంలో టీఆర్ఎస్లో చేరుతారని తెలుస్తోంది. -
'వైఎస్ఆర్ సీపీ సభ్యులు టీడీపీలో చేరలేదు'
-
ఆసక్తికరంగా ‘పట్నం’ రాజకీయం
- టీఆర్ఎస్లో ఎమ్మెల్యే మంచిరెడ్డి చేరికతో మరో మలుపు - ఒకే పార్టీలో నలుగురు నియోజకవర్గ నాయకులు - ఎంత వరకు కలిసి సాగుతారనేదానిపై సర్వత్రా చర్చనీయాంశం ఆదిబట్ల : ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో రాజకీయం రోజుకో మలుపు తిరుగుతోంది. అధికార పార్టీ టీఆర్ఎస్లో ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి చేరికతో రాజకీయ సమీకరణలు ఒక్కసారిగా మారిపోయాయి. నిన్న మొన్నటి వరకు ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకున్న నాయకులంతా ఇప్పుడు ఒకేగూటికి చేరారు. దీంతో పార్టీలో అగ్ర నాయకులు కలిసిమెలసి ఇమడగలరా అన్న సందేహం వ్యక్తమవుతోంది. ఒకే పార్టీలో నలుగురు అగ్రనాయకులు ఉండడం పార్టీ బలాన్ని పెంచేదే అయినప్పటికీ నాయకులు కార్యకర్తలను కలుపుకొని పార్టీని ఎంత వరకు మందుకు తీసుకెళ్తారు అన్నదే అందరినీ తొలుస్తున్న ప్రశ్న. ప్రస్తుతం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి కంచర్ల చంద్రశేఖర్‌రెడ్డి, ఈసీ శేఖర్‌గౌడ్, వంగేటి లకా్ష్మరెడ్డి వంటి నాయకులు ఉన్నారు. నియోజకవర్గంలో పార్టీ క్షేత్రస్థాయిలో రోజురోజుకూ బలమైన పునాదులు నిర్మించుకుంటోంది. ఇప్పటికే టీడీపీకి చెందిన నగరపంచాయతీ చైర్మన్ కంబాళపల్లి భరత్‌కుమార్, టీడీపీ మాజీ మండల అధ్యక్షుడు యంపల్లి నిరంజన్‌రెడ్డి, యాచారం, హయత్‌నగర్ మండల పరిషత్ అధ్యక్షులు జ్యోతినాయక్, హరితధన్రాజ్, యాచారం జెడ్పీటీసీ సభ్యుడు కర్నాటి రమేష్‌గౌడ్ తదితరులు టీఆర్ఎస్లో చేరారు. వచ్చేనెల 4న ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో ముఖ్యమంత్రి కేసీఆర్ బహిరంగసభ ఉండడంతో టీడీపీకి చెందిన నాయకులు, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, కో ఆపరేటివ్ చైర్మన్లు, కార్యకర్తలు భారీ ఎత్తున టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకోవడానికి సిద్ధంగా ఉన్నారని తెలుస్తోంది. -
కారెక్కిన కిషన్‌రెడ్డి
- సీఎం కేసీఆర్ సమక్షంలో గులాబీ తీర్థం - పరిమితస్థాయిలో నేతల చేరిక - 4న ‘పట్నం’కు ముఖ్యమంత్రి సాక్షి, రంగారెడ్డిజిల్లా ప్రతినిధి: ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి అధికారికంగా టీఆర్ఎస్లో చేరారు. శుక్రవారం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు సమక్షంలో పరిమిత ప్రజాప్రతినిధులతో గులాబీ తీర్థం పుచ్చుకున్నారు. బడంగ్‌పేట, ఇబ్రహీంపట్నం నగర పంచాయతీ అధ్యక్షుడు, పలువురు ఎంపీపీలు, జెడ్పీటీసీ సభ్యులు, ముఖ్యనేతలు కారెక్కినవారిలో ఉన్నారు. మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, హరీశ్‌రావు, మహేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే కాలె యాదయ్య, హరీశ్వర్‌రెడ్డి పాల్గొన్న ఈ కార్యక్రమంలో సీఎం మాట్లాడుతూ పార్టీని బలోపేతం చేసేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. మే 4న ఇబ్రహీంపట్నంలో ముఖ్యమంత్రి కేసీఆర్ పాల్గొనే బహిరంగ సభల్లో మిగతాశ్రేణులు టీఆర్ఎస్లో చేరుతాయని కిషన్‌రెడ్డి వివరించారు. ప్లీనరీకి భారీగా తరలిన నేతలు! హైదరాబాద్‌లో జరిగిన టీఆర్ఎస్ ప్లీనరీకి జిల్లా నుంచి నాయకులు భారీగా తరలివెళ్లారు. గ్రామ, మండల, జిల్లాస్థాయి నేతల ఎల్బీ స్టేడియానికి తరలివెళ్లడంతో శివార్లన్నీ గులాబీమయం అయ్యాయి. ఇటీవల పార్టీ పదవులు చేపట్టిన నాయకులు ప్రత్యేక వాహన శ్రేణుల్లో భారీగా అనుచరులతో ప్లీనరీ స్థలికి వెళ్లారు. -
అంతా నావెంటే ఉన్నారు
హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి శుక్రవారం ఉదయం ముఖ్యమంత్రి కేసీఆర్‌తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా సీఎం క్యాంపు కార్యాలయంలో అధికారికంగా గులాబీ కండువా కప్పుకున్నారు. దీంతో ఆయన టీఆర్ ఎస్ చేరిక పూర్తయింది. కేసీఆర్‌తో భేటీ అనంతరం మంచిరెడ్డి మాట్లాడుతూ జిల్లాలో జడ్పీటీసీలు, ఎంపీటీసీలు తనవెంటే ఉన్నారన్నారు. కాగా నియోజకవర్గ అభివృద్ధికి చేయూతనిస్తానని సీఎం హామీ ఇచ్చినందునే టీఆర్ఎస్లో చేరాలని నిర్ణయించుకున్నట్లు మంచిరెడ్డి తెలిపారు. నాగార్జునసాగర్ రహదారిని నాలుగు వరుసలుగా విస్తరించడం, జాపాల్- రంగాపూర్ అబ్జర్వేటరీ అభివృద్ధి, ఇబ్రహీంపట్నం పెద్ద చెరువును కృష్ణాజలాలతో నింపడం, మూసీ మురుగునీటి శుద్ధికి సీఎం సహకరిస్తానని భరోసా ఇచ్చినట్లు చెప్పారు. కార్యకర్తలు, నాయకుల ఒత్తిడి మేరకే టీఆర్ఎస్లో చేరుతున్నా తప్ప ఎలాంటి వ్యక్తిగత ఏజెండా లేదని స్పష్టం చేశారు. త్వరలో ఇబ్రహీంపట్నంలో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేస్తామని, దీనికి సీఎం రానున్నారని ఆయన చెప్పారు. -
త్వరలో ‘పట్నం’ చెరువుకు జలకళ
- చెరువు స్థితిగతులు పరిశీలించిన మెట్రో వాటర్‌బోర్డు ఎండీ జగదీష్ ఆదిబట్ల: ఇబ్రహీంపట్నం పెద్ద చెరువుకు త్వరలోనే మహర్దశ పట్టనుంది. గురువారం పట్నం చెరువును మెట్రో వాటర్‌బోర్డు ఎండీ జగదీష్, స్థానిక ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డితో కలిసి సందర్శించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పదేళ్లుగా వర్షాలు లేక చెరువు నిండక రైతులు, మత్స్యకారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. అదే విషయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి, నీటిపారుదలశాఖ మంత్రి హరీష్‌రావు దృష్టికి తీసుకెళ్లినట్టు చెప్పారు. ఇబ్రహీంపట్నం పెద్ద చెరువను కృష్ణాజలాలతో నింపితే దాదాపు 50 గ్రామాల రైతులు సంతోషంగా ఉంటారని మంత్రికి వివరించినట్టు చెప్పారు. తక్షణమే మంత్రి హరీష్‌రావు అధికారులకు ఆదేశాలిచ్చారని, అందులో భాగంగా పట్నం చెరువును అధికారులు గురువారం సందర్శించారని చెప్పారు. చెరువు నిండేందుకు 0.8 టీఎంసీల నీరు అవసరమని, ప్రస్తుతం 0.5 టీఎంసీల నీటితో పట్నం చెరువును పునరుద్ధరించనున్నట్టు చెప్పారు. చెరువు కృష్ణా నీటిని ఏ విధంగా తరలించాలి.. చెరువు సామర్థ్యం ఎంత.. తదితర వివరాలను అధికారులు సేకరించారు. చెరువుకు నీరందించే ప్రణాళికపై అధికారులు సుధీర్ఘంగా చర్చించారు. అనంతరం వాటర్‌బోర్డు ఎండీ జగదిష్ విలేకరులతో మాట్లాడుతూ.. పట్నం చెరువుకు 400 ఎకరాల ఆయకట్టు ఉందని, పూర్తి స్థాయి వివరాలను ప్రభుత్వానికి నివేదిక రూపంలో ఇస్తామని చెప్పారు. వారి వెంట డీజీఎం దశరథ్‌రెడ్డి, వాటర్‌బోర్డు డెరైక్టర్ కొండారెడ్డి, డీఈఈ విజయలక్ష్మి, తహసీల్దార్ ఉపేందర్‌రెడ్డి, నగర పంచాయతీ చైర్మన్ భరత్‌కుమార్ తదితరులు ఉన్నారు. -
అభివృద్ది కొసమై టీఆర్ఎస్లో చేరుతున్నా...
-
ఎల్లుండి టీఆర్ఎస్లో చేరుతున్నా...
హైదరాబాద్ : ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి టీడీపీకి గుడ్‌బై చెప్పారు. రంగారెడ్డి జిల్లా టీడీపీ అధ్యక్ష పదవికి, పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ఆయన తెలిపారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌తో భేటీ అనంతరం బుధవారమిక్కడ విలేకర్లతో మాట్లాడారు. ఈనెల 24న టీఆర్ఎస్లో చేరుతున్నట్లు మంచిరెడ్డి కిషన్ రెడ్డి ప్రకటించారు. నియోజకవర్గ అభివృద్ధి కోసమే పార్టీ మారుతున్నట్లు ఆయన చెప్పారు. పార్టీ కార్యకర్తల అభిప్రాయాల మేరకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు మంచిరెడ్డి పేర్కొన్నారు. ఇబ్రహీంపట్నం నియోజకవర్గ అభివృద్ధికి సీఎం కేసీఆర్ నిధులు ఇస్తామని హామీ ఇచ్చినట్లు ఆయన చెప్పారు. -
చంద్రబాబుకు షాక్ ఇచ్చిన మంచిరెడ్డి
-
రంగారెడ్డి టీడీపీ అధ్యక్షుడిగా ప్రకాష్ గౌడ్?
హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లా టీడీపీ అధ్యక్షుడిగా, రాజేంద్రనగర్ టీడీపీ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ పేరు తెరమీదకు వచ్చింది. ప్రస్తుతం జిల్లా అధ్యక్షుడుగా ఉన్న ఇబ్రహీంపట్నం టీడీపీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకుంటున్న విషయం తెలిసిందే. ఆయన గురువారం అధికారికంగా టీఆర్ఎస్లో చేరనున్నారు. ఈ నేపథ్యంలో జిల్లా అధ్యక్షుడిగా ప్రకాష్ గౌడ్‌ను నియమించాలని పార్టీ అధిష్టానం నిర్ణయించినట్లు సమాచారం. గతంలో ప్రకాష్ గౌడ్ కూడా టీఆర్ఎస్లో చేరుతున్నట్లు ప్రచారం జరిగినా ఆయన మాత్రం టీడీపీలోనే ఉన్నారు. -
చంద్రబాబుకు షాక్ ఇచ్చిన మంచిరెడ్డి
హైదరాబాద్ : అనుకున్నట్లే అయ్యింది. తెలంగాణలో పర్యటించనున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి ఆపార్టీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి షాక్ ఇచ్చారు. రంగారెడ్డి జిల్లా టీడీపీ అధ్యక్షుడు, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే సైకిల్ దిగి కారెక్కేందుకు రెడీ అయ్యారు. టీడీపీ నేతల బుజ్జగింపు ప్రయత్నాలు ఫలితాన్ని ఇవ్వలేదు. ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి బుధవారం ఉదయం టీఆర్ఎస్ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కేసీఆర్‌తో భేటీ అయ్యారు. సీఎం క్యాంప్ కార్యాలయంలో ఈ సమావేశం జరిగింది. మంచిరెడ్డి కిషన్ రెడ్డి గురువారం అధికారికంగా టీఆర్ఎస్ పార్టీలో చేరనున్నారు. కాగా గడిచిన రెండు రోజులుగా మంచిరెడ్డి కిషన్ రెడ్డి ...టీడీపీని వీడి టీఆర్ఎస్లో చేరతారనే ఊహాగానాలు జోరందుకున్నాయి. ఈ నేపథ్యంలో ఆయన నిన్న ఇబ్రహీంపట్నం మండలం ఎలిమినేడులోని తన వ్యవసాయక్షేత్రంలో పార్టీ ముఖ్యనేతలు, సహచరులతో సుదీర్ఘ మంతనాలు జరిపారు. టీఆర్ఎస్లో చేరేందుకు దారితీస్తున్న పరిణామాలను వివరించారు. గత రెండు పర్యాయాలు విపక్షంలోనే ఉండడంతో నియోజకవర్గ అభివృద్ధికి ఆశించిన స్థాయిలో నిధులు రాబట్టలేకపోయానని, ఇప్పుడు అధికారపార్టీతో చేతులు కలిపితే మంచి భవిష్యత్తు ఉంటుందని హితబోధ చేశారు. రాజకీ యంగా ఉజ్వల భవిష్యత్తు ఉండాలంటే అధికారపార్టీ అండదండలు ముఖ్యమని, గతకొన్ని నెలలుగా ఈ సమీకరణలన్నింటినీ బేరీజు వేసుకున్న తర్వాతే పార్టీ మారాలనే నిర్ణయానికి వచ్చినట్లు వివరించినట్లు సమాచారం. -
పార్టీ మారొద్దని మీ నాన్నకు చెప్పవా..
ఎమ్మెల్యే మంచిరెడ్డి కుమారుడికి లోకేశ్ విజ్ఞప్తి హైదరాబాద్: తెలంగాణలో వలసబాట పడుతున్న టీటీడీపీ ఎమ్మెల్యేలను నిలువరించే బాధ్యతను అధినేత చంద్రబాబు తనయుడు లోకే్శ్ తన భుజాలపై వేసుకున్నారు. రంగారెడ్డి జిల్లా టీడీపీ అధ్యక్షుడు, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి టీఆర్ఎస్లో చేరనున్నారన్న సమాచారం నేపథ్యంలో లోకేష్ మంగళవారం కిషన్‌రెడ్డితో మాట్లాడేందుకు ప్రయత్నిం చారు. అయితే తాను స్వగ్రామమైన ఎలిమినేడులో పార్టీ కార్యకర్తల సమావేశంలో ఉన్నట్లు మంచిరెడ్డి చెప్పడంతో ఆయన తనయుడు, మాజీ కార్పొరేటర్ ప్రశాంత్‌రెడ్డిని పార్టీ కార్యాలయానికి లోకే్శ్ పిలిపించారు. ‘మీ నాన్నను పార్టీ మారొద్దని చెప్పు. భవిష్యత్తులో మంచి అవకాశాలు లభిస్తాయి’ అని సూచించినట్లు తెలిసింది. తన వంతుగా తండ్రిని ఒప్పించే ప్రయత్నం చేస్తానని ప్రశాంత్ చెప్పినట్లు సమాచారం. కాగా, మంచిరెడ్డి ఏర్పాటు చేసిన సమావేశం హాల్ వద్ద కార్యకర్తల పేరిట కేసీఆర్ ఫొటోతో కూడిన ఫ్లెక్సీలు ఏర్పాటు కావడం గమనార్హం. కారెక్కడం ఖాయం రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: మంచిరెడ్డి కారెక్కడం దాదాపుగా ఖాయమైంది. మంగళవారం ఎలిమినేడులోని తన వ్యవ సాయ క్షేత్రంలో పార్టీ ముఖ్యులతో సుదీర్ఘ సమాలోచనలు జరిపిన ఆయన టీడీపీని వీడాలనే నిర్ణయానికొచ్చారు. టీఆర్ఎస్లో చేరాలనే నిర్ణయాన్ని మెజార్టీ నేతలు వ్యతిరేకించినట్లు తెలిసింది. రాజకీయ భవిష్యత్‌ను ప్రసాదించిన టీడీపీకి దూరం కావద్దని మంచాల, యాచారం మండలాల నేతలు వారించారు. పనులు కావాలన్నా, నిధులు రావాలన్నా అధికారపార్టీ తీర్థం పుచ్చుకోవడమే ఉత్తమమని మరికొందరు నాయకులు స్పష్టం చేశారు. -
వీఐపీ రిపోర్టర్ : ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి
-
ఆదుకుంటా..అండగా ఉంటా
సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా వెంకటరమణ కాలనీని అన్నివిధాలుగా అభివృద్ధిపరుస్తా ..ఐటీ హబ్‌గా ఇబ్రహీంపట్నం ఇప్పటికే బహుళ ప్రాచుర్యం పొందుతోంది. మండలంలోని ఆదిబట్లలో టీసీఎస్‌తో ఈ ప్రాంతానికి ప్రపంచవ్యాప్తంగా కొత్త గుర్తింపు వచ్చింది. అంతేకాకుండా రాష్ట్ర రాజధానికి నిమిషాల వ్యవధిలో చేరుకునేంత సమీపంలో ఉన్న ఈ ప్రాంతం పలువురు పారిశ్రామిక దిగ్గజాల దృష్టినీ ఆకర్షిస్తోంది. నూతన పారిశ్రామిక విధానానికి అనువైన అన్ని వనరులూ పుష్కలంగా ఉన్నా.. ఈ మండలంలో కనీస వసతులు లేని కాలనీలూ ఉన్నాయంటే ఆశ్చర్యపోనవసరంలేదు. మౌలిక సదుపాయాలు కొరవడటంతో ప్రజలు ఇబ్బందుల పాలవుతున్నారనడంలో ఏ మాత్రం అతిశయోక్తి లేదు. ఈ నేపథ్యంలో ఇబ్రహీంపట్నంలో అభివృద్ధికి నోచుకోని వెంకటరమణ కాలనీకి ‘సాక్షి’ వీఐపీ రిపోర్టర్‌గా స్థానిక ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి వచ్చారు. ‘పెద్దాయనా ఎలా ఉన్నావు.. ఏమ్మా పింఛన్ వస్తోందా.. బ్రదర్ మీ కాలనీలో సమస్యలేంటి’ అంటూ.. స్థానిక ప్రజల కష్టాలను అడిగి తెలుసుకున్నారు. ఆదుకుంటానని.. అండగా ఉంటానని వారికి భరోసా ఇచ్చారు. కాలనీలో ఆయన దాదాపు 3 గంటల పాటు గడపగడపకూ తిరిగారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందుతున్న తీరుపై ఆరా తీశారు. ప్రజల సమస్యలను సావధానంగా వినడమే కాకుండా.. వాటిని నోట్ చేసుకున్నారు. రిపోర్టర్‌గా ఎమ్మెల్యే తీసుకున్న చొరవకు ప్రజలు హర్షాతిరేకాలు వ్యక్తంచేశారు.. మీ అభిమానానికి సర్వదా రుణపడి ఉంటామని ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. ఎమ్మెల్యే హామీలు... వెంకటరమణ కాలనీలో తాగునీటి సమస్యను అధిగమించేందుకు తక్షణం చేతి పంపుల ఏర్పాటు శ్మశానవాటికలో మౌలిక సదుపాయాల కల్పన సామాజిక భవన నిర్మాణానికి కృషి అర్హులైన పేదలకు వినోబానగర్‌లో గృహ వసతి చదువుకున్న నిరుద్యోగులకు ఈ ప్రాంతంలో నెలకొల్పే పరిశ్రమల్లో ఉపాధి అవకాశాలు అర్హులైన నిరుపేదలందరికీ పింఛన్లు సీసీ రోడ్ల ఆధునికీకరణకు చర్యలు వీధి దీపాల ఏర్పాటు ఎమ్మెల్యే: పెద్దాయనా బాగున్నావా? భిక్షపతి: ఏం బాగు సార్.. పింఛన్ డబ్బులు అందడంలేదు. ఎమ్మెల్యే: ఏం ఎందుకు.. నీ వయసెంత.. సర్టిఫికెట్లు ఇక్కడే ఉన్నాయా? భిక్షపతి: నా వయస్సు 65 ఏళ్లు. సర్టిఫికెట్లు ఇంటి వద్ద ఉన్నాయి. ఎమ్మెల్యే: ఏమయ్యా.. ఏంటి వెంకటరమణ కాలనీలో సమస్యలు? రఘుపతి: కాలనీ మధ్యలో స్మశానం ఉందిసార్.. ప్రహరీ లేక పోవడంతో విషసర్పాల భయం వెంటాడుతోంది. ఎమ్మెల్యే: ప్రహరీ నిర్మాణం కోసం చర్యలు తీసుకుంటా. ఎమ్మెల్యే: ఏమ్మా .. ఎంతమంది బిడ్డలు. బతుకుదెరువు బాగుందా? పోచమ్మ: నాకు ముగ్గురు కొడుకులు. బతుకుదెరువు కోసం వలస వెళ్లారు. రెండునెళ్ల నుంచి పింఛన్ వస్తలేదు. ఎమ్మెల్యే: బాబూ .. మీ కాలనీలోని సమస్యలను వివరించు? ఇబ్రహం: సార్ .. నాకు పింఛన్ రావడంలేదు. మా కాలనీలో రోడ్డు సరిగ్గాలేదు. కమ్యూనిటీ హాల్ నిర్మాణం చేపట్టి మినీ ఫంక్షన్‌హాల్‌గా మారిస్తే బాగుంటుంది. ఎమ్మెల్యే: అమ్మాయ్.. ఏం చదువుకున్నావు.. ఇంటి వద్దే ఉంటావా? రాణి: సార్.. నాకు పోలీస్‌శాఖలో ఉద్యోగం చేయాలనుంది. డిగ్రీ పూర్తి చేశాను. ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ రాక పోవడంతో ఇంటి వద్దే ఉంటున్నాను. ఎమ్మెల్యే: మీ కాలనీలో ప్రజలెదుర్కొంటున్న సమస్యలేంటి? దశరథ్: మంచినీటి సరఫరా లేదు. వృద్ధులు, వికలాంగులు, వితంతువులు పింఛన్ డబ్బులు వస్తాయో.. రావోనని ఆందోళన చెందుతున్నారు. ఎమ్మెల్యే: పింఛన్లపై అపోహలు వద్దు. అర్హులైన వారందరికీ పింఛన్ సౌకర్యం అందించేందుకు చర్యలు తీసుకుంటా. ఎమ్మెల్యే: ఏం పెద్దమ్మ.. పింఛన్ వస్తోందా..? కొడుకులు ఏం చేస్తుంటారు? రాములమ్మ: సార్.. నా కొడుకులు సెంట్రింగ్ పనులు చేసుకుంటూ బతుకుదెరువు సాగిస్తున్నారు. నాకే పింఛన్ రాక ఇబ్బంది పడుతున్నా. ఎమ్మెల్యే: ఏం పెద్దమనిషి.. నీపేరేంటి.. బాగున్నావా? మైసయ్య: సార్ నాకు ఇంటి స్థలం లేదు. కూలి పనులు చేస్తూ పొట్టపోసుకుంటున్నా. అదికూడా సరిగ్గా దొరకంలేదు. ఎమ్మెల్యే: ఏమ్మా .. ఏంటి మీ కాలనీలో సమస్య ? మణెమ్మ: మా కాలనీలో అసలే రోడ్డు సౌకర్యం లేదంటే.. ఉన్న రోడ్డునే ఆక్రమించుకున్నారు. రాత్రివేళ వీధిదీపాలు వెలగక ఇబ్బందులు పడుతున్నాం. ఎమ్మెల్యే: ఏం తల్లి.. ఎందుకు బాధలో ఉన్నావు? స్వరూప: సార్.. నా భర్త చనిపోయాడు. పిల్లలు ఉన్నారు. ఎలా బతకాలో తెలియడంలేదు. ఎమ్మెల్యే: బాధపడొద్దు. పిల్లల కోసం ధైర్యంగా ఉండాలి. మీ కుటుంబానికి ప్రభుత్వపరంగా అందే సహకారాన్ని అందజేస్తా. ఎమ్మెల్యే: ఏమ్మా.. మీ కాలనీలో ఏమైనా సమస్యలున్నాయా? సత్తెమ్మ: మా కాలనీలో మురుగు కాలువలు లేవు. రోడ్లపైనే మరుగునీరు పారుతోంది. దోమలతో రోగాల బారిన పడుతున్నాం. ఎమ్మెల్యే: నీ పేరేంటి.. కొడుకులున్నారా? బుగ్గమ్మ: సార్.. నా కొడుకులు వారి బతుకుదెరువు వారు చూసుకున్నారు. నాకు నెలనెలా వచ్చే పింఛన్ రావడం లేదు. ఎమ్మెల్యే : మీకొచ్చిన కష్టాలేంటో చెప్పండి? బాలకృష్ణ : సార్.. మా కాలనీలో అన్నీ సమస్యలే. డ్రైనేజీ కాలువలు లేవు. మంచినీటి సౌకర్యం, రహదారి సౌకర్యం లేదు. పందులు, దోమలతో ఇబ్బందులు పడుతున్నాం. మినీ నీటి ట్యాంక్ ఏర్పాటు చేస్తే బాగుంటుంది. ఎమ్మెల్యే: బాబూ.. మీ కేమైనా సమస్యలున్నాయా? రంగయ్య: సార్.. మా కాలనీలో కుక్కలు, పందుల బెడద అధికంగా ఉంది. ఇళ్లస్థలాలు లేవు. ఎమ్మెల్యే: ఏమ్మా .. నీ బాధలేంటో చెప్పు? మహిళ: సార్.. ఈమె పేరు పెంటమ్మ. ఈమెకు చెవులు వినపడవు. కొడుకులు లేరు. పింఛన్ రావడంలేదు (పక్కన ఉన్న మహిళ). ఎమ్మెల్యే: ఏమ్మా.. మీ ప్రాంతంలో సమస్యలేమున్నాయ్? ప్రేమమ్మ: సార్.. మా కాలనీలో రోడ్డు సమస్య ఉంది. మంచినీటిని కూడా కొనుక్కోవాల్సి వస్తోంది. ఎమ్మెల్యే: ఏమ్మా మీరంతా ఒకే చోట ఉన్నారు.. ఏంటీ మీ ప్రాంతంలో ఉన్న సమస్యలు? మహిళలు: సార్ .. మంచినీళ్ల కోసం ప్రతిరోజు ఇబ్బంది పడుతున్నాం. డ్రైనేజీలు లేకపోవడంతో మురుగువాసన విపరీతంగా వస్తోంది. ఎమ్మెల్యే: బోరు వేస్తే నీళ్లు పడతాయా ? మహిళలు: బోరువేస్తే నీరుపడుతుంది సార్.. కాలనీలో రెండు బోర్లు వేయిస్తే ప్రజల అవసరాలు తీరుతాయి. ఎమ్మెల్యే: ఏం కౌన్సిలర్ గారూ.. ప్రజలు ఇంత ఇబ్బంది పడుతుంటే మీరేం చేస్తున్నారు? రవీందర్ (కౌన్సిలర్): మా వార్డులో ప్రజల సమస్యలు పరిష్కరించేందుకు ప్రణాళికలు సిద్ధం చేశాం. రూ.15లక్షలతో మౌలిక సదుపాయాల కల్పనకు త్వరలో పనులు ప్రారంభిస్తాం. సమస్యలు తెలిశాయి.. పరిష్కారం చూపుతా.. ‘సాక్షి’ వీఐపీ రిపోర్టర్‌గా ఇబ్రహీంపట్నం వెంకటరమణ కాలనీలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకున్నా. సాధ్యమైనంతవరకు వాటిని పరిష్కరించే ప్రయత్నం చేస్తా. సామాజిక స్పృహతో ‘సాక్షి’ చేపట్టిన ఈ కార్యక్రమం ప్రజా సంక్షేమానికి బాటలు వేస్తుంది. ప్రజలను కలుసుకునేందుకు, వారి సమస్యలు తెలుసుకునేందుకు ఇలాంటి కార్యక్రమాలు ఇంకా కొనసాగాలి. - మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, ఎమ్మెల్యే -
షరతుల్లేకుండా రుణమాఫీ
యాచారం: బ్యాంకర్లు తమ టార్గెట్ కోసం రైతులకు తెలియకుండానే రీ షెడ్యూలు చేసి నేడు రుణమాఫీ వర్తించకుండా చేయడం న్యాయం కాదని టీడీపీ జిల్లా అధ్యక్షుడు, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. బుధవారం ‘సాక్షితో ఆయన మాట్లాడారు. బ్యాంకు అధికారులు చేసిన తప్పిదాల వల్ల నేడు పేద రైతులు ఆందోళన చెందే పరిస్థితులు వచ్చాయని అన్నారు. 2010 లో అతివృష్టి, అనావృష్టి వల్ల రైతులు మొత్తంగా పంటలను నష్టపోయారని తెలిపారు. అప్పట్లో రైతుల పరిస్థితి దారుణంగా ఉందని అన్నారు. కొన్ని బ్యాంకుల మేనేజర్లు తమ టార్గెట్ కోసం రైతులకు తెలియకుండానే రీ షెడ్యూల్ చేయడం, టర్మ్‌లోన్ కింద మార్చడం వల్ల , ప్రభుత్వ నిబంధనల వల్ల నేడు ఆ రైతులు రుణమాఫీకి అనర్హులుగా మిగులుతున్నారన్నారు. షరతుల్లేకుండా రైతులంతా రుణమాఫీ పొందే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. రీ షెడ్యూల్ వల్ల జిల్లాలో పలు చోట్ల వందలాది మంది పేద రైతులు నష్టపోయే ప్రమాదం ఉందన్నారు. స్వయంగా జిల్లా కలెక్టర్, వ్యవసాయ శాఖ జేడీ పర్యవేక్షణ చేసి రైతులకు న్యాయం చేయాలని కోరారు. జిల్లాలో ఎక్కడ లేని విధంగా యాచారం, మంచాల మండలాల్లో రైతులు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. రుణాలిచ్చే విషయంలో బ్యాంకర్లు సరైన నింబంధనలు పాటించలేదని అన్నారు. పంటలను పరిశీలించకుండానే రుణాలిచ్చేశారన్నారు. అధికారులు ప్రత్యేక చోరవ తీసుకొని అర్హులెన రైతులకు నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలని, లేదంటే ఆందోళనలు తప్పవని హెచ్చరించారు. ప్రభుత్వం నిర్ణయించిన ప్రకారం షరతుల్లేకుండా రైతులకు రూ. లక్షలోపు రుణ మాఫీ చేయాలని కోరారు. -
మైనింగ్ జోన్ రద్దయ్యేనా!
యాచారం, న్యూస్‌లైన్: తెలంగాణలో టీఆర్ఎస్ విజయం సాధించడంతో యాచారం, నందివనపర్తి గ్రామాల రైతుల్లో ఆనందం వెల్లివిరుస్తోంది. మండల పరిధిలోని ఈ రెండు గ్రామాల్లో గత ప్రభుత్వ హయాంలో దాదాపు 900 ఎకరాల్లో ైమైనింగ్ జోన్ ఏర్పాటుకు నిర్ణయించారు. అయితే స్థానిక రైతులు మాత్రం జోన్ ఏర్పాటును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. వ్యాపారులతో కుమ్మక్కైన అధికారులు.. ఆ భూముల్లో సాగు సాగడంలేదని తప్పుడు రికార్డులు సృష్టించి మైనింగ్ జోన్ ఏర్పాటుకు కుట్రలు చేశారని రైతులు ఆరోపిస్తూ ఆందోళనలకు దిగారు. వివిధ రాజకీయపక్షాలు, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో పలుమార్లు ఆందోళనలు, ధర్నాలు నిర్వహించి కలెక్టర్‌తోసహా ఇతర ఉన్నతాధికారులకు వినతి పత్రాలు సమర్పించారు. ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ముదిరెడ్డి కోదండరెడ్డిలు కూడా పలుమార్లు జిల్లా కలెక్టర్లను కలిసి రద్దు విషయంలో తక్షణమే స్పష్టమైన ప్రకటన చేయాలని కోరారు. అయితే మైనింగ్ జోన్ రద్దుకు ఇప్పటికీ ప్రభుత్వం నుంచి స్పష్టమైన ప్రకటన రాలేదు. కాగా రెండేళ్ల కిందట జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం మండలంలోని పలు గ్రామాల్లో పర్యటించి తెలంగాణ ప్రభుత్వం వస్తే మైనింగ్ జోన్ రద్దుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. తెలంగాణ ప్రభుత్వంలో తమకు అన్యాయం జరగదనే ఆశతో అన్నదాతలున్నారు. ఈ రెండు గ్రామాల్లో వందలాది మంది రైతులు ఏళ్ల కొద్ది ఆ భూములను సాగుచేసుకొని జీవనోపాధి పొందుతున్నారు. ఈ మైనింగ్ జోన్లో అత్యధికంగా ఇతర జిల్లాలకు చెందిన వ్యాపారులే స్టోన్ క్రషర్లు, క్వారీల ఏర్పాటుకు అనుమతులు పొందారు. అయితే స్థానికుల ఆందోళనలకు భయపడి సదరు భూముల్లో ప్రభుత్వం స్టోన్ క్రషర్లకు, క్వారీల ఏర్పాటుకు మాత్రం అనుమతులివ్వడం లేదు. ప్రస్తుతం టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడనుండడం, తన సన్నిహితుడైనా కేసీఆరే త్వరలో రాష్ట్రానికి సీఎం కానున్నట్లు స్పష్టం కావడంతో ఈ విషయంపై కోదండరాం ప్రత్యేక దృష్టి సారించాలని మండల రైతులు కోరుతున్నారు. ప్రభుత్వం ఏర్పడిన వెంటనే మైనింగ్ జోన్‌ను రద్దు చేస్తూ ఉత్తర్వులివ్వాలని వారు కోరుతున్నారు.