
రంగారెడ్డి టీడీపీ అధ్యక్షుడిగా ప్రకాష్ గౌడ్?
హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లా టీడీపీ అధ్యక్షుడిగా, రాజేంద్రనగర్ టీడీపీ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ పేరు తెరమీదకు వచ్చింది. ప్రస్తుతం జిల్లా అధ్యక్షుడుగా ఉన్న ఇబ్రహీంపట్నం టీడీపీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకుంటున్న విషయం తెలిసిందే. ఆయన గురువారం అధికారికంగా టీఆర్ఎస్లో చేరనున్నారు.
ఈ నేపథ్యంలో జిల్లా అధ్యక్షుడిగా ప్రకాష్ గౌడ్ను నియమించాలని పార్టీ అధిష్టానం నిర్ణయించినట్లు సమాచారం. గతంలో ప్రకాష్ గౌడ్ కూడా టీఆర్ఎస్లో చేరుతున్నట్లు ప్రచారం జరిగినా ఆయన మాత్రం టీడీపీలోనే ఉన్నారు.