రంగారెడ్డిలో టీడీపీ ఖాళీ | ranga reddy district tdp leaders join trs | Sakshi
Sakshi News home page

రంగారెడ్డిలో టీడీపీ ఖాళీ

Published Sat, Feb 27 2016 12:48 PM | Last Updated on Fri, Aug 10 2018 8:16 PM

ranga reddy district tdp leaders join trs

కుత్బుల్లాపూర్: టీడీపీకి మరోసారి భారీ దెబ్బ తగిలింది. రంగారెడ్డి జిల్లా నుంచి భారీ సంఖ్యలో టీడీపీ నాయకులు శనివారం టీఆర్‌ఎస్‌లో చేరిపోయారు. టీడీపీ రాష్ట్ర కార్యదర్శి శ్రీశైలం యాదవ్, రంగారెడ్డి జిల్లా కుత్బుల్లాపూర్ ఎంపీపీ సన్న కవిత, దూలపల్లి సర్పంచ్ లక్ష్మి, కొంపల్లి, బహదూర్‌పల్లి ఉప సర్పంచ్‌లు, కొంపల్లి, దూలపల్లి పంచాయతీలకు చెందిన 18 వార్డు మెంబర్లు, ఒక వైస్ ఎంపీపీ టీఆర్‌ఎస్‌లో చేరారు. హైదరాబాద్‌లో మంత్రులు హరీశ్‌రావు, మహేందర్‌రెడ్డి సమక్షంలో పార్టీ కండువాలు కప్పుకున్నారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement