ఎల్లుండి టీఆర్ఎస్లో చేరుతున్నా... | will join in TRS day after tomorrow: Manchireddy kishan reddy | Sakshi
Sakshi News home page

ఎల్లుండి టీఆర్ఎస్లో చేరుతున్నా...

Published Wed, Apr 22 2015 11:32 AM | Last Updated on Wed, Aug 15 2018 9:27 PM

ఎల్లుండి టీఆర్ఎస్లో చేరుతున్నా... - Sakshi

ఎల్లుండి టీఆర్ఎస్లో చేరుతున్నా...

హైదరాబాద్ :  ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి టీడీపీకి గుడ్బై చెప్పారు. రంగారెడ్డి జిల్లా టీడీపీ అధ్యక్ష పదవికి, పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ఆయన తెలిపారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్తో భేటీ అనంతరం బుధవారమిక్కడ విలేకర్లతో మాట్లాడారు. ఈనెల 24న టీఆర్ఎస్లో చేరుతున్నట్లు మంచిరెడ్డి కిషన్ రెడ్డి ప్రకటించారు.

నియోజకవర్గ అభివృద్ధి కోసమే పార్టీ మారుతున్నట్లు ఆయన చెప్పారు. పార్టీ కార్యకర్తల అభిప్రాయాల మేరకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు మంచిరెడ్డి పేర్కొన్నారు. ఇబ్రహీంపట్నం నియోజకవర్గ అభివృద్ధికి సీఎం కేసీఆర్ నిధులు ఇస్తామని హామీ ఇచ్చినట్లు ఆయన చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement