బాబు మైండ్ గేమ్
నెల్లూరు: తెలంగాణ రాష్ట్రంలో టీడీపీ చావుదెబ్బతిన్న విషయం తెలిసిందే. తెలంగాణలో ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు ఎర్రబెల్లి దయాకర్‌రావు, ప్రకాష్ గౌడ్‌లు పార్టీకి గుడ్‌బై చెప్పి టీఆర్‌ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. మరో ముగ్గురు ఎమ్యెల్యేలు కూడా టీఆర్‌ఎస్ గూటికి చేరుతారనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఆ విషయం నుంచి ప్రజల దృష్టి మరల్చడానికి టీడీపీ అధినేత చంద్రబాబు మైండ్‌గేమ్ మొదలుపెట్టారు. ఎల్లో మీడియాలో పచ్చరాతలు రాయించారు. జిల్లాకు చెందిన ఇద్దరు ముగ్గురు ఎమ్మెల్యేలు పార్టీ మారుతున్నట్లు గాలివార్తలు రాయించడంతో పాటు టీవీ చానళ్లలో కూడా సూళ్లూరుపేట ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య పార్టీ మారనున్నట్లు ప్రకటనలు ఇప్పించారు. దీనిైపై స్పందించిన జిల్లా పార్టీ అధ్యక్షుడు, ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డి, సూళ్లూరుపేట ఎమ్మెల్యే కిలివేటి ఎల్లో మీడియాలో వస్తున్న కథనాలను ఖండించారు. పార్టీ మారేది లేదని స్పష్టం చేశారు. చంద్రబాబు మైండ్‌గేమ్‌పై తీవ్రంగా ధ్వజమెత్తారు. సొంత పార్టీ ఎమ్మెల్యేలను కాపాడుకోలేక వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలపై తప్పుడు ప్రచారం చేయిస్తున్నారని మండిపడ్డారు. సీఎం హోదాలో ఉన్న చంద్రబాబు ఇటువంటి మైండ్‌గేమ్ రాజకీయాలకు పాల్పడటం సరికాదని హితవు పలికారు.