Prakash Goud
-
‘అష్ట’కష్టాలు!
సాక్షి, హైదరాబాద్: భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) నుంచి ఎమ్మెల్యేల ఫిరాయింపుల పర్వం కొనసాగుతోంది. గులాబీ ఎమ్మెల్యేలు వరుసగా అధికార కాంగ్రెస్‌లో చేరుతున్నారు. రాబోయే రోజుల్లో తమ పారీ్టలోకి బీఆర్ఎస్ ఎమ్మెల్యేల చేరికలు మరింత వేగవంతం అవుతాయని కాంగ్రెస్ శిబిరం ప్రచారం చేస్తోంది. మరోవైపు పార్టీ అధినేత కేసీఆర్ స్వయంగా రంగంలోకి దిగినా వలసలకు అడ్డుకట్ట పడటం లేదని బీఆర్ఎస్ వర్గాలు అంటున్నాయి.గతంలో చేసిన పనుల బిల్లుల కోసం, వ్యాపారాలపై దాడులు, కేసుల బెదిరింపులతోనే ఎమ్మెల్యేలు పార్టీ మారుతున్నారని ఆరోపిస్తున్నాయి. దీనికితోడు ఈ అసెంబ్లీ సమావేశాల్లోగా బీఆర్ఎస్ శాసనసభాపక్షం కాంగ్రెస్‌లో విలీనం అవుతుందంటూ ఫిరాయింపు ఎమ్మెల్యే దానం నాగేందర్ చేసిన వ్యాఖ్యలు కూడా కలకలం రేపుతున్నాయి. ఈ నెల 24 నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో వలసల అంశం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. వరుసగా వలసల బాట! గత ఏడాది చివర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ తరఫున 39 మంది ఎమ్మెల్యేలు గెలుపొందారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ ఉప ఎన్నిక ఓటమితో ఈ సంఖ్య 38కి చేరింది. ఇక గత ఆరు నెలల్లో బీఆర్ఎస్ నుంచి ఎనిమిది మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ గూటికి చేరారు. తాజాగా రాజేంద్రనగర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్ కూడా కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాం«దీ, అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు చేరిక ఖరారు కాగా... హైదరాబాద్ నగరానికి చెందిన మరో ఆరుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్‌లో చేరుతారనే ప్రచారం జరుగుతోంది. శాసనసభాపక్షం విలీనంపై చర్చ నిబంధనల ప్రకారం.. బీఆర్ఎస్ సంఖ్యాబలంలో మూడింట రెండొంతుల మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరితే బీఆర్ఎస్ శాసనసభాపక్షం అందులో విలీనమైనట్టు పరిగణిస్తారు. 2014–18 మధ్యలో టీడీపీ శాసనసభాపక్షం, 2018–23 మధ్యలో కాంగ్రెస్ శాసనసభాపక్షం ఇదే తరహాలో బీఆర్ఎస్లో విలీనమయ్యాయి. ఈ నిబంధన ప్రకారం బీఆర్ఎస్ నుంచి కనీసం 26 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరితే.. శాసనసభాపక్షం విలీనమైనట్టుగా పరిగణిస్తారు.ఇప్పటికే 9 మంది కాంగ్రెస్‌లో చేరడం, మరొకరు చేరికకు సిద్ధమైన నేపథ్యంలో.. ఇంకో 16 మంది బీఆర్ఎస్ నుంచి ఫిరాయించాల్సి ఉంటుంది. అయితే బీఆర్ఎస్కు హైదరాబాద్, రంగారెడ్డి, మెదక్ జిల్లాల పరిధిలోనే ఎక్కువ మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇప్పుడు ఈ ఉమ్మడి జిల్లాల నుంచే ఫిరాయింపులు ఎక్కువగా ఉంటాయనే ప్రచారం జరుగుతోంది. కట్టడి కోసం బీఆర్ఎస్ ప్రయత్నాలు బీఆర్ఎస్ నుంచి ఇప్పటికే తొమ్మిది మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరడంతో.. మిగతా వారిని కట్టడి చేసేందుకు గులాబీ పారీ్టలో ప్రయత్నాలు జరుగుతున్నాయి. బీఆర్ఎస్ సర్కారులో అధికారం అనుభవించిన కడియం శ్రీహరి, పోచారం శ్రీనివాస్‌రెడ్డిలతోపాటు కేసీఆర్‌కు సన్నిహితుడైన ఎం.సంజయ్ వంటి నేతలు కూడా వీడటంపై చర్చ జరుగుతోంది. దీంతో పార్టీ అధినేత కేసీఆర్ స్వయంగా రంగంలోకి దిగి.. పక్షం రోజుల క్రితం ఎర్రవల్లి నివాసంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో భేటీ అయ్యారు.వారికి విందు ఇచ్చి.. పారీ్టలో కొనసాగితే కలిగే ప్రయోజనాలు, భవిష్యత్తుపై భరోసా కలి్పంచే ప్రయత్నాలు చేశారు. ఈ సందర్భంగా కొందరు ఎమ్మెల్యేలు తమను ఆర్థికంగా ఆదుకోవాలని కోరగా.. కేసీఆర్ సానుకూలంగా స్పందించినట్టు తెలిసింది. ఓ ఎమ్మెల్యే తన కారు మరమ్మతుకు అయ్యే ఖర్చులను తీసుకుని కూడా పార్టీ మారారని ప్రచారం జరుగుతోంది. మరింత మంది బీఆర్ఎస్ను వీడనున్నారన్న ప్రచారం నేపథ్యంలో.. పార్టీ ఎమ్మెల్యేలతో కేసీఆర్ మరోమారు వ్యక్తిగతంగా భేటీకానున్నారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. ప్రలోభాలు, బెదిరింపులను ప్రస్తావిస్తూ..!! పార్టీ మారుతున్న ఎమ్మెల్యేలు తమకు అధికార పార్టీ నుంచి వస్తున్న ఒత్తిళ్లు, బెదిరింపులను కేసీఆర్‌కు ఏకరువు పెడుతున్నారని బీఆర్ఎస్ వర్గాలు చెప్తున్నాయి. గతంలో చేసిన అభివృద్ధి పనులకు సంబంధించిన బిల్లులు రాకపోవడం, కుటుంబ సభ్యుల వ్యాపారాలపై దాడులు, కేసులు పెడతామనే బెదిరింపులు వంటి కారణాలతో పార్టీ మారక తప్పడం లేదని అంటున్నారని పేర్కొంటున్నాయి. నగర శివార్లలోని ఓ ఎమ్మెల్యే కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకుని జరుగుతున్న దాడులను వారు గుర్తు చేస్తున్నారని వివరిస్తున్నాయి. న్యాయ పోరాటం.. ప్రజల మధ్యకు.. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు కోసం డిమాండ్ చేస్తున్న బీఆర్ఎస్.. అసెంబ్లీ వేదికగా కొట్లాడాలని నిర్ణయించింది. మరోవైపు రాష్ట్రపతి, గవర్నర్లను కలసి అసెంబ్లీ స్పీకర్, కాంగ్రెస్ వైఖరిని వివరించాలని.. అనర్హత వేటుపై స్పందించాల్సిందిగా కోరాలని భావిస్తోంది. రాష్ట్రపతి ఎదుట పార్టీ ఎమ్మెల్యేలతో పరేడ్ చేయించేందుకూ సన్నద్ధమవుతోంది. ఫిరాయింపు ఎమ్మెల్యేలపై అనర్హత వేటుకు సంబంధించి సుప్రీంకోర్టును ఆశ్రయించేందుకు బీఆర్ఎస్ ఏర్పాట్లు పూర్తి చేసింది. మరోవైపు పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో కేసీఆర్ స్వయంగా పర్యటించి.. ఆ ఎమ్మెల్యేలు, అధికార పార్టీ తీరును ఎండగట్టాలనే వ్యూహాన్ని కూడా సిద్ధం చేస్తున్నట్టు బీఆర్ఎస్ కీలక నేత ఒకరు వెల్లడించారు. -
కాంగ్రెస్‌లో చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో కాంగ్రెస్ ఆపరేషన్ ఆకర్ష్‌లో భాగంగా మరో బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ కాంగ్రెస్ గూటికి చేరారు. సీఎం రేవంత్ సమక్షంలో రాజేంద్రనగర్ ఎమ్మెల్యే హస్తం పార్టీలో చేరిపోయారు. దీంతో, కాంగ్రెస్‌లో చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే సంఖ్య ఎనిమిదికి చేరింది.కాగా, రాజేంద్రనగర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆయనకు పార్టీ కండువా కప్పి కాంగ్రెస్ ఇంఛార్జ్ దీపాదాస్ మున్షీ హస్తం పార్టీలోకి ఆహ్వానించారు. ఇక, తాజాగా ప్రకాశ్ గౌడ్ చేరికతో బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లోకి చేరిన వారి సంఖ్య ఎనిమిదికి చేరుకుంది. మరోవైపు.. రేపు మరో బీఆర్ఎస్ ఎమ్మెల్యే కాంగ్రెస్‌లో చేరుతున్నట్టు తెలుస్తోంది. ఇదిలా ఉండగా.. ఇంకా పలువురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరుతారని హస్తం పార్టీ నేతలు చెబుతున్నారు. -
కాంగ్రెస్‌లోకి బీఆర్ఎస్ సిటీ ఎమ్మెల్యేలు
సాక్షి, హైదరాబాద్: బీఆర్ఎస్కు చెందిన మరో ఇద్దరు ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరేందుకు రంగం సిద్ధమైంది. హైదరాబాద్ నగర పరిధిలోని ఇద్దరు ఎమ్మెల్యేలు ప్రకాశ్‌గౌడ్ (రాజేంద్రనగర్), అరికెపూడి గాంధీ (శేరిలింగంపల్లి) శుక్రవారం సీఎం రేవంత్ సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నట్టు పార్టీ వర్గాలు తెలిపాయి. వారితోపాటు కొందరు మున్సిపల్ చైర్మన్లు కూడా తమ పార్టీలో చేరుతున్నట్లు కాంగ్రెస్ వర్గాలు వెల్లడించాయి. ఇప్పటివరకు బీఆర్ఎస్ నుంచి ఏడుగురు ఎమ్మెల్యే లు కాంగ్రెస్‌లో చేరగా.. ఈ ఇద్దరి చేరిక పూర్తయితే ఆ సంఖ్య తొమ్మిదికి చేరనుంది.ఏపీ సీఎం చంద్రబాబును కలిసిన తర్వాతే..ప్రకాశ్‌గౌడ్, అరికెపూడి గాంధీ ఇద్దరూ 2014 ఎన్నికల్లో టీడీపీ తరఫున ఎమ్మెల్యేలుగా గెలిచి.. తర్వాత బీఆర్ఎస్లో చేరారు. 2018, 2023 అసెంబ్లీ ఎన్నికల్లో వీరిద్దరూ బీఆర్ ఎస్ తరఫున ఎమ్మెల్యేలుగా ఎన్నిక య్యారు. నిజానికి ఈ ఇద్దరు నేతలు కూడా టీడీపీలో కొన సాగినకాలంలో ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్ర బాబునాయుడుకు అత్యంత సన్నిహితులుగా ఉన్నారు. తెలంగాణ ఆవిర్భావం తర్వాత ఇక్కడ టీడీపీ ఉనికి కోల్పోవడంతో బీఆర్ఎస్లో చేరారు. మరోవైపు ఇటీవల ఏపీ సీఎంగా బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు తాజాగా హైదరాబాద్‌కు వచ్చారు. ప్రకాశ్‌గౌడ్, అరికెపూడి గాంధీ ఈ నెల ఏడున చంద్రబాబుతో భేటీ అయి చర్చించారు. తర్వాత వారం రోజుల లోపలే వారిద్దరూ కాంగ్రెస్ పార్టీలో చేరుతుండటం చర్చనీయాంశంగా మారింది. చంద్రబాబు ఆదేశాల మేరకే వారు కాంగ్రెస్ గూటికి చేరుకుంటున్నట్టు ప్రచారం జరుగుతోంది. -
బీఆర్ఎస్ గట్టి షాక్.. రేపు కాంగ్రెస్‌లోకి మరో ఎమ్మెల్యే!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో బీఆర్ఎస్కు కష్టకాలం నడుస్తోంది. ఒక్కొక్కరుగా బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యేలు పార్టీని వీడుతూ కాంగ్రెస్ పార్టీలోకి జంప్ అవుతున్నారు. తాజాగా మరో బీఆర్ఎస్ ఎమ్మెల్యే రేపు(శుక్రవారం) హస్తం గూటికి చేరుతున్నారు.కాగా, సీఎం రేవంత్ సమక్షంలో రాజేంద్రనగర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ శుక్రవారం కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. ప్రకాశ్ గౌడ్‌తో పాటు మరో ఇద్దరు మున్సిపల్ చైర్మన్లు కూడా హస్తం పార్టీలో చేరుతున్నారు. ఇదిలా ఉండగా.. ఇటీవలి కాలంలో పలువురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేల కాంగ్రెస్ పార్టీలో చేరిన విషయం తెలిసిందే. ఇక, ప్రకాశ్ గౌడ్ చేరికలో కాంగ్రెస్‌లోకి వెళ్లిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేల సంఖ్య ఎనిమిదికి చేరుకుంది. -
కాంగ్రెస్‌లోకి మరిన్ని చేరికలు!
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీలోకి బీఆర్ఎస్ ఎమ్మెల్యేల చేరికలు మళ్లీ మొదలవుతున్నాయి. జీహెచ్ఎంసీ పరిధిలోని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే టి.ప్రకాశ్ గౌడ్ హస్తం గూటికి చేరేందుకు సిద్ధమయ్యారు. శుక్రవారం జూబ్లీహిల్స్‌లోని క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డిని ఆయన కలిశారు. ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు, సీఎం సలహాదారు వేం నరేందర్‌రెడ్డిలతో కలిసి ఆయన సీఎంను కలిశారు. ప్రకాశ్‌గౌడ్ కాంగ్రెస్‌లో చేరేందుకు సుముఖత వ్యక్తం చేశారని, శనివారం తన అనుచరులతో కలిసి ఆయన అధికారికంగా పార్టీ లో చేరతారని గాం«దీభవన్ వర్గాలు వెల్లడించాయి. మరోవైపు బీజేపీ నేత, మాజీ ఎంపీ రవీంద్ర నాయక్ శుక్రవారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌రెడ్డితో కలిసి సీఎం క్యాంపు కార్యాలయానికి వచి్చన ఆయనకు రేవంత్‌రెడ్డి కండువా కప్పి పార్టీలోకి ఆహా్వనించారు. అలాగే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమీప బంధువు ఎడ్ల రాహుల్‌రావు కూడా కాంగ్రెస్‌లో చేరారు. ఎమ్మెల్సీ మహేందర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావుల సమక్షంలో ఆయనకు రేవంత్‌రెడ్డి పార్టీ కండువా కప్పారు. ఎన్నికల క్లైమాక్స్‌లో..: కాంగ్రెస్ ఎమ్మెల్యేలు 20 మంది తనకు టచ్‌లోకి వచ్చారంటూ మాజీ సీఎం కేసీఆర్ వ్యాఖ్యానించిన మరుసటిరోజే బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఒకరు కాంగ్రెస్‌లోకి వచ్చేందుకు సంసిద్ధత వ్యక్తం చేయడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. బీఆర్ఎస్కు చెందిన పలువురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చే రేందుకు సిద్ధంగా ఉన్నప్పటికీ పార్లమెంటు ఎన్నికల ఫలితాలను బట్టి పార్టీలోకి చే ర్చుకోవాలనే భావనతో సీఎం రేవంత్ ఉన్నారని, కానీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలే బీఆర్ఎస్లోకి వెళ్తారనే కోణంలో కేసీఆర్ మాట్లాడిన నేపథ్యంలోనే.. ఆపరేషన్ ఆకర్ష్‌కు ఆయన పదును పెట్టారని గాం«దీభవన్ వర్గాలు చెపుతున్నాయి. ఈ నేపథ్యంలో జీ హెచ్‌ఎంసీకి చెందిన మరో నలుగురైదుగురు ఎమ్మెల్యేలు కూడా టచ్‌లో ఉన్నారని, లోక్‌సభ ఎన్నికలకు ముందే వారు పార్టీలోకి చేరతారని కాంగ్రెస్ నేతలు చెపుతున్నారు. ఓ మాజీ మంత్రి కూడా ఈ జాబితాలో ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. బీఆర్ఎస్కు వైరా మాజీ ఎమ్మెల్యే గుడ్‌బై వైరా: ఖమ్మం జిల్లా వైరా మాజీ ఎమ్మెల్యే లావుడ్యా రా ములు నాయక్ శుక్రవారం బీఆర్ఎస్కు రాజీనామా చే శారు. ఈ మేరకు పార్టీ అధినేత కేసీఆర్‌కు లేఖ పంపించారు. 2018లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన ఆయ న ఆనాటి బీఆర్ఎస్ అభ్యర్థి మదన్‌లాల్‌పై విజయం సాధించారు. అనంతరం బీఆర్ఎస్లో చేరగా, గత ఎన్నికల్లో బీఆర్ఎస్ ఆయనకు కాకుండా మళ్లీ మదన్‌లాల్‌కే టికెట్ కేటాయించింది. మదన్‌లాల్ ఓడిపోయినా.. వైరా ఇన్చార్జిగా ఆయననే ని యమించడంతో పార్టీలో తనకు సరైన గౌరవం లభించడం లేదని రాములు నాయ క్ సన్నిహితుల వద్ద వాపోయారు. ఈ నేపథ్యంలో ఎంపీలు వద్దిరాజు, నామా తదితరులు రాములు నాయక్ ఇంటికి వెళ్లి తగిన గుర్తింపు లభించేలా చూస్తామని హామీ ఇచ్చారు. అయినప్పటికీ ఆయన బీఆర్ఎస్కు రాజీనామా చేశారు. కాగా కాంగ్రెస్‌లోకి వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నానని ఆయన చెప్పినట్లు తెలిసింది. -
బీఆర్ఎస్కు మరో షాక్.. పార్టీని వీడనున్న ఎమ్మెల్యే
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం కోల్పోయినబీఆర్‌ఎస్ పార్టీకి వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. లోక్‌సభ ఎన్నికల ముందు నేతలు ఒక్కొకరుగా పార్టీని వీడుతున్నారు. ఎంపీలు, ఎమ్మెల్యేలు, మాజీలు ఇలా అందరూ బీఆర్ఎస్కు గుడ్‌బై చెబుతున్నారు. తాజాగా మారో సిట్టింగ్ ఎమ్మెల్యే కారు దిగేందుకు రెడీ అయ్యారు. బీఆర్ఎస్ రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్‌గౌడ్ కాంగ్రెస్‌లో చేరేందుకు సిద్ధమయ్యారు. ఈ మేరకు ఎమ్మెల్యే శుక్రవారం సీఎం రేవంత్‌రెడ్డిని కలిశారు. త్వరలోనే కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లు సీఎంకు తెలియజేశారు. తన అనుచరులతో కలిసి, సీఎం సమక్షంలో ప్రకాష్ గౌడ్ కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నారు. కాగా ఇప్పటికే బీఆర్ఎస్ నుంచి గెలుపొందిన ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావు కాంగ్రెస్‌లో చేరిన సంగతి తెలిసిందే. వీరితోపాటు అనేకమంది ఎంపీలు, ముఖ్య నేతలు సైతం బీఆర్ఎస్ను వీడారు. -
సీఎం రేవంత్‌తో ప్రకాశ్‌గౌడ్ భేటీ
సాక్షి, హైదరాబాద్/మణికొండ: బీఆర్ఎస్ రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్ ఆదివారం ముఖ్య మంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డిని కలిశారు. జూబ్లీహి ల్స్లోని సీఎం నివాసానికి వెళ్లి భేటీ అయ్యారు. రేవంత్ సన్నిహితుడు, ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్‌రెడ్డి కూడా ఈ భేటీలో పాల్గొన్నారు. దీనితో ప్రకాశ్‌గౌడ్ బీఆర్ఎస్ను వీడి, కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారని ప్రచారం జరిగింది. దీనిని ప్రకాశ్‌గౌడ్ ఖండించారు. మర్యాదపూర్వకంగానే కలిశా: ప్రకాశ్‌గౌడ్ తాను మర్యాదపూర్వకంగానే సీఎం రేవంత్‌తో భేటీ అయ్యానని ప్రకాశ్‌గౌడ్ పేర్కొన్నారు. తాను ప్రాతి నిధ్యం వహిస్తున్న రాజేంద్రనగర్ నియోజకవర్గంలోని శంషాబాద్ మండలం కొత్వాల్‌గూడ, బహ దూర్‌గూడ, ఘాన్సిమియాగూడ గ్రామాల్లో భూసంబంధ సమస్యల పరిష్కారం కోసమే సీఎంను కలి శానని ఓ ప్రకటనలో తెలిపారు. నియోజకవర్గ అభి వృద్ధికి ప్రత్యేక నిధులు మంజూరు చేయాలని తాను కోరగా.. సీఎం సానుకూలంగా స్పందించారన్నారు. భేటీ వెనుక ఎలాంటి రాజకీయ ఉద్దేశం లేదని, తాను కాంగ్రెస్‌లో చేరుతున్నట్టు జరుగుతున్న ప్రచారం అవాస్తవమని పేర్కొన్నారు. -
సీఎం రేవంత్‌తో మరో బీఆర్ఎస్ ఎమ్మెల్యే భేటీ.. ఏం జరుగుతోంది?
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో లోక్‌సభ ఎన్నికల వేళ రాజకీయంగా రసవత్తరంగా మారుతోంది. రాష్ట్రంలో పొలిటికల్ సమీకరణాలు మారుతున్నాయి. సీఎం రేవంత్ రెడ్డిని కలిసేందుకు బీఆర్ఎస్ నేతలు క్యూ కడుతున్నారు. దీంతో, రాజకీయంగా చర్చ మొదలైంది. కాగా, తాజాగా రంగారెడ్డి జిల్లా పాలిటిక్స్ హాట్ టాపిక్‌గా మారాయి. నేడు సీఎం రేవంత్ రెడ్డిని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ కలిశారు. ఈ క్రమంలో ప్రకాష్ గౌడ్‌కు కాంగ్రెస్ కండువా కప్పి ప్రభుత్వ ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి ఆహ్వానించారు. ఇక, సీఎం రేవంత్‌తో ప్రకాష్ దాదాపు గంట పాటు చర్చించారు. దీంతో, రాష్ట్రంలో రాజకీయం మరోసారి హీటెక్కింది. ఇదిలా ఉండగా.. శనివారం కూడా సీఎం రేవంత్ రెడ్డిని మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి కలిశారు. మరికొంత మంది ఎమ్మెల్యేలు కూడా సీఎం రేవంత్‌తో టచ్‌లో ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. ఇక, ఇటీవలే మెదక్ జిల్లాకు చెందిన నలుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా రేవంత్‌ను కలిశారు. వీరి భేటీపై పెద్ద చర్చ జరగడంతో నలుగురు ఎమ్మెల్యేలు ప్రెస్‌మీట్ పెట్టి కీలక వ్యాఖ్యలు చేశారు. తాము కేవలం అభివృద్ధిపై చర్చించేందుకే సీఎం రేవంత్‌ను కలిసినట్టు క్లారిటీ ఇచ్చారు. అయితే, బీఆర్ఎస్ నేతలు వరుస పెట్టి సీఎం రేవంత్‌ను కలుస్తున్న నేపథ్యంలో రాబోయే లోక్‌సభ ఎన్నికలకు ప్రాధాన్యత సంతరించుకుంది. ఎన్నికల నాటికి రాష్ట్రంలో మరిన్ని వలసలు ఉండవచ్చనే వార్తలు వినిపిస్తున్నాయి. మరోవైపు.. తాజాగా కాంగ్రెస్ సీనియర్ నేత మధు యాష్కీ ఆసక్తికర కామెంట్స్ చేశారు. అనేక మంది విపక్ష ఎమ్మెల్యేలు మాతో టచ్‌లో ఉన్నారంటూ వ్యాఖ్యలు చేశారు. దీంతో, ఆయన వ్యాఖ్యలు బీఆర్ఎస్ను టెన్షన్ పెడుతున్నట్టు సమాచారం. -
ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ కు వ్యతిరేకంగా నినాదాలు
-
రాజేంద్ర నగర్ నియోజకవర్గంలో అధికారికా పార్టీ ఎవరిధి?
రాజేంద్ర నగర్ నియోజకవర్గం రాజేంద్ర నగర్ నియోజకవర్గం నుంచి టిఆర్ఎస్ అభ్యర్ధిగా పోటీచేసిన టి.ప్రకాష్ గౌడ్ తన సమీప టిడిపి ప్రత్యర్ది గణేష్ గుప్త పై 57331 ఓట్ల మెజార్టీతో విజయం సాదించారు. మహాకూటమిలో భాగంగా ఈ సీటును టిడిపికి కేటాయించారు. ప్రకాష్ గౌడ్ గతంలో రెండుసార్లు వరసగా టిడిపి తరపున గెలిచారు. 2014లో గెలిచిన తర్వాత ఆయన టిఆర్ఎస్ లో చేరిపోయారు. 2018లో టిఆర్ఎస్ పక్షానే పోటీచేసి మరోసారి విజయం సాదించారు.ప్రకాష్ గౌడ్‌కు 106676 ఓట్లు రాగా, గణేష్ గుప్తాకు 49345 ఓట్లు వచ్చాయి. ఇక్కడ ఎమ్.ఐ.ఎమ్. అభ్యర్దిగా పోటీచేసిన మిరాజ్ బేగ్‌కు 46 వేల కుపైగా ఓట్లు వచ్చి మూడోస్థానంలో ఉన్నారు. ప్రకాష్ గౌడ్ సామాజికపరంగా గౌడ వర్గానికి చెందినవారు. 2014లో కాంగ్రెస్ ఐ అభ్యర్ధిగా పోటీచేసిన జ్ఞానేశ్వర్‌పై 25881 ఓట్ల తేడాతో టిడిపి-బిజెపి కూటమి అభ్యర్ధిగా ప్రకాష్ గౌడ్ విజయం సాధించారు. 2009 లో ఏర్పడిన ఈ నియోజకవర్గంలో వరసగా మూడుసార్లు బిసి గౌడ్ వర్గం నేతగా ప్రకాష్ గౌడ్ విజయం సాధించారు. రాజేంద్ర నగర్ నియోజకవర్గంలో గెలిచిన.. ఓడిన అభ్యర్థులు వీరే.. -
బీజేపీ సీనియర్ నేత ప్రకాష్ గౌడ్ మృతి
ముషీరాబాద్: భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకుడు, అడిక్‌మెట్ డివిజన్ కార్పొరేటర్ సునీత భర్త ప్రకాష్ గౌడ్ (55) మృతి చెందారు. శ్వాస సంబంధిత వ్యాధితో బంజరాహిల్స్‌లోని ఓ ప్రైవేటు అసుపత్రిలో చేరి చికిత్స పొందుతూ శనివారం తెల్లవారు జామున 3 గంటలకు మృతి చెందారు. ఆయనకు ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. అంత్యక్రియలు పార్శిగుట్టలోని గౌడ స్మశాన వాటికలో జరిగాయి. ఈనెల 7న అడిక్‌మెట్ కార్పొరేటర్ కార్యాలయాన్ని రాంనగర్ మీసేవా కేంద్రం పైన ఉన్న వార్డు కార్యాలయంలో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు డా.కె.లక్ష్మణ్ చేతుల మీదగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో చురుకుగా పాల్గొన్న ప్రకాష్ గౌడ్ సాయంత్రానికి స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆసుపత్రిలో చేరారు. వైద్య పరీక్షల అనంతరం ఆయనకు కరోనాగా నిర్ధారణ అయింది. దీంతో ఆయనను మెరుగైన చికిత్స కోసం ఐసీయూలో చేర్చారు. చికిత్స పొందుతూ మృతి చెందారు. డైనమిక్ లీడర్ ► నియోజకవర్గంలో డైకమిక్ లీడర్‌గా ప్రకాష్ గౌడ్ పేరు తెచ్చుకున్నారు. యువజన కాంగ్రెస్‌లో ఉన్నప్పుడు దూకుడుగా ఉండేవారు. ఆ దూకుడుతోనే అనతి కాలంలో ముఖ్య నాయకుడుగా ఎదిగారు. గాందీభవన్‌లో జరిగిన యుత్ కాంగ్రెస్ సమావేశంలో దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖర్‌రెడ్డి మాట్లాడుతుండగా ఆందోళన చేసి సస్పెన్షన్‌కు గురయ్యారు. గ్రేటర్ హైదరాబాద్‌లో 15 ఏళ్లుగా కార్పొరేషన్ ఎన్నికలు నిర్వహించలేదని కోర్టు మెట్లెక్కడంతో ప్రభుత్వం 2002లో ఎన్నికలను నిర్వహించింది. కార్పొరేషన్ ఎన్నికల ముందు 2020లో ఆయన బీజేపీలో చేరారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఆయనన భార్య సునీత కార్పొరేటర్‌గా విజయం సాధించారు. పలువురి సంతాపం ► ప్రకాష్ గౌడ్ మృతి వార్త తెలుసుకున్న పలువురు నేతలు తమ సంతాపాన్ని తెలియజేశారు. బీజేపీ శ్రేణులు రాంనగర్, అడిక్‌మెట్ తదితర ప్రాంతాల్లో ఆయన చిత్రాపటానికి పూలమాలలు వేసి నివాళులు ఆరి్పంచారు. ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్, బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు డా.కె.లక్ష్మణ్, మాజీ ఎంపీ జితేందర్‌రెడ్డి, రాంనగర్ మాజీ కార్పొరేటర్ కల్పనా యాదవ్, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి నగేష్ ముదిరాజ్, టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు ఎం.ఎన్.శ్రీనివాస్ రావు, జాతీయ దళిత నాయకులు గజ్జల సూర్యనారాయణ, బీజేపీ అసెంబ్లీ కనీ్వనర్ రమేశ్ రాం, బీజేపీ చెందిన పలువురు కార్పొరేటర్లు, పార్టీ నాయకులు, కార్యకర్తలు సంతాపం తెలియజేశారు. ( చదవండి: పెద్దపల్లి ఎంపీ వెంకటేశ్ కనబడడం లేదు.. ) -
ప్రకాష్.. హ్యాట్రిక్
రాజేంద్రనగర్: హ్యాట్రిక్ విజయం అందించిన రాజేంద్రనగర్ నియోజకవర్గ ప్రజల రుణాన్ని ఎన్ని జన్మలేత్తిన తీర్చుకోలేనని టి.ప్రకాష్‌గౌడ్ వెల్లడించారు. మంగళవారం నిర్వహించిన కౌంటింగ్ అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ తాను ప్రజా సేవ చేసేందుకు ప్రజల్లోకి వచ్చానని అందుకు వారు తనను ఆహ్వానించారన్నారు.ప్రతిసారి నన్ను అఖండ మెజార్టీతో గెలిపిస్తున్నారని వారి సేవ చేసి రుణం తీర్చుకుంటానన్నారు. మహిళలు, యువతీయువకులు అందరు కలిసి తనను గెలిపించారన్నారు. గత రెండుసార్లు ప్రతిపక్షంలో ఉండి విజయం సాధించానని ఇప్పుడు అధికార పక్షంగా మరోసారి గెలిపించారన్నారు. రానున్న రోజుల్లో నియోజకవర్గంలోని ప్రజా సమస్యలన్చు పూర్తిస్థాయిలో పరిష్కరిస్తానన్నారు. తనవెంట నిలిచిన నాయకులు, కార్యకర్తలందరికి న్యాయం చేస్తానన్నారు. నియోజకవర్గాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతానన్నారు. గత నాలుగు సంవత్సరాలలో అభివృద్ధి పూర్తిస్థాయిలో నిర్వహించలేదన్నారు. మరోసారి అవకాశం ఇచ్చారని ఈ ఐదు సంవత్సరాలలో పూర్తిస్థాయిలో సమస్యలను పరిష్కరిస్తానన్నారు. ఈ సందర్భంగా తన విజయానికి కృషి చేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. పతంగికి నియోజకవర్గంలో స్థానం లేదు.. రాజేంద్రనగర్ నియోజకవర్గంలో మజ్లిస్ పార్టీకి స్థానం లేదు. మూడు సార్లు పోటీ చేసి కనిపించకుండా పోయింది. ప్రత్యర్థులు ఎన్నో కుట్రలు పన్నిన ప్రజలు మాత్రం ఆదర్శించారన్నారు. మైనార్టీలు మరోసారి నావెంటే ఉన్నారని స్పష్టమైందన్నారు. వారికి అందుబాటులో ఉండి అభివృద్ధికి నిత్యం కృషి చేస్తానన్నారు. -
శివబాలాజీ.. జర దేఖో జీ..!
మణికొండ: మణికొండ పరిధిలోని పంచవటి కాలనీ, హరివిల్లు అపార్ట్మెంట్లో టీఆర్ఎస్ రాజేంద్రనగర్ అభ్యర్థి టి. ప్రకాశ్‌గౌడ్ ఆదివారం ఎన్నికల ప్రచారం చేశారు. పలువురు సినీ, టీవీ నటులను కలిసి కారు గుర్తుకు ఓటు వేయాలని ఆయన అభ్యర్థించారు. సినీ, బుల్లితెర నటుడు శివబాలాజీ ఇంటికి వెళ్లి తనకు మద్దతు ఇవ్వాలని కోరారు. ప్రకాశ్ గౌడ్ వెంట ఎంపీపీ తలారి మల్లేశ్, ఎంపీటీసీ సభ్యుడు కె.రామకృష్ణారెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ పి.చంద్రశేఖర్‌రెడ్డి తదితరులు ఉన్నారు. -
భూ వివాదం.. టీఆర్ఎస్ ఎమ్మెల్యేపై కేసు
సాక్షి, హైదరాబాద్ : భూ వివాద విషయమై రాజేంద్రనగర్ ఎమ్మెల్యేపై మైలార్ దేవ్ పల్లి పోలీసు స్టేషన్లో కేసు నమోదైంది. ఆవుల శ్రీనివాస్ అనే వ్యక్తి ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్‌పై ఫిర్యాదు చేసినట్టు పోలీసులు తెలిపారు. 447,427,506 సెక్షన్ల కింద పోలీసులు కేసును నమోదు చేశారు. కాగా ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్‌పై గతంలోను పలు కేసులు ఉన్నాయి. 2014లో తెలుగుదేశం పార్టీ తరపున గెలిచిన ప్రకాశ్ గౌడ్ తర్వాత టీఆర్ఎస్లో చేరిన సంగతి తెలిసిందే. -
ఆస్ట్రేలియాలో తెలం‘గానం’..
సిడ్నీ: ఆస్ట్రేలియాలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు శనివారం ఘనంగా జరిగాయి. ఆస్ట్రేలియన్ తెలంగాణ ఫోరం (ఏటీఎఫ్) ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా జరిగిన ఈ వేడుకల్లో తెలంగాణ రాష్ట్ర హోం శాఖ సలహాదారు అనురాగ్ శర్మ, టీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ ముఖ్య అతిథులుగా, ఆస్ట్రేలియా ప్రజా ప్రతినిధులు జూలీ ఓవెన్స్, జూలియా ఫిన్, స్కాట్ ఫార్లో, హగ్ మెక్ డర్మాట్, డేవిడ్ క్లార్క్ విశిష్ట అతిథులుగా పాల్గొన్నారు. తెలంగాణ అమరులు, ప్రొఫెసర్ జయశంకర్‌కు నివాళులు అర్పించిన అనంతరం అతిథులు వేడుకలు ప్రారంభించారు. తెలంగాణ ఆట, పాటలతో సభా ప్రాంగణం ఉర్రూతలూగింది. జై తెలంగాణ నినాదాలతో ఆ ప్రాంతమంతా హోరెత్తింది. కార్యక్రమంలో ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ మాట్లాడుతూ.. బంగారు తెలంగాణ సాధించడమే కేసీఆర్ లక్ష్యమనీ, పారిశ్రామిక ప్రగతికి, రైతు సంక్షేమానికి ప్రభుత్వం అధిక ప్రాదాన్యిమిస్తోందని అన్నారు. రాష్ట్రంలో విరివిగా పెట్టబడులు పెట్టి బంగారు తెలంగాణ సాధనలో భాగం కావాలని ఎన్నారైలను కోరారు. విదేశాల్లో ఉంటూ తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడుతున్న ఎన్నారైల కృషి ఎనలేనిదని అనురాగ్ శర్మ అన్నారు. ప్రత్యేక రాష్ట్ర సాధనలో ఎన్నారైలు కీలక పాత్ర పోషించారని అభినందించారు. ‘ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’లో తెలంగాణ మొదటి స్థానంలో ఉందనీ.. టీఎస్ ఐపాస్ విధానంలో 15 రోజుల్లోనే పరిశ్రమలకు అనుమతులు ఇస్తున్నామని తెలిపారు. తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ‘తెలంగాణ సాధించుకోవడంతోనే మన కర్తవ్యం పూర్తయినట్టు కాదనీ.. బంగారు తెలంగాణ నిర్మాణానికి అందరం బాధ్యత వహించాల’ని ఏటీఎఫ్ అధ్యక్షుడు అశోక్ మాలిష్ అన్నారు. బంగారు తెలంగాణ సాధనలో తమవంతు సహాయ సహకారాలు ఎప్పుడూ ఉంటాయని ఏటీఎఫ్ ప్రధాన కార్యదర్శి ప్రదీప్ సేరి మాట్లాడారు. ఆస్ట్రేలియా వ్యాప్తంగా ఉన్న తెలంగాణ వాసులు, ప్రవాస భారతీయులు, వివిధ సంస్థల ప్రతినిధులు ఈ కార్యక్రమానికి భారీగా తరలివచ్చారు. కార్యక్రమంలో తెలంగాణ బిజినెస్ కౌన్సిల్ ఫోరం (ఆస్ట్రేలియా) అధ్యక్షుడు అశోక్ మరం, సందీప్ మునగాల, సున్లీ్ కల్లూరి, మిథున్ లోక, వినయ్ యమా, ప్రదీప్ తెడ్ల, గోవర్దన్ రెడ్డి, అనిల్ మునగాల, కిశోర్ రెడ్డి, నటరాజ్ వాసం, శశి మానెం, డేవిడ్ రాజు, ఇంద్రసేన్ రెడ్డి, పాపి రెడ్డి, నర్సింహ్మ రెడ్డి, ప్రమోద్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. -
‘ఎనిమీ’తో ఆందోళన వద్దు
శంషాబాద్ : కొత్వాల్‌గూడ గ్రామస్తులు తమ భూములకు సంబంధించి ఎలాంటి భయాందోళనకు గురికావాల్సిన అవసరం లేదని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్‌గౌడ్ గ్రామస్తులకు భరోసా ఇచ్చారు. శుక్రవారం రాజేంద్రనగర్ ఆర్డీవో శ్రీనివాస్, తహసీల్దార్ సురేష్‌తో కలిసి ఆయన గ్రామస్తులతో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం భూ సంస్కరణల ద్వారా ప్రతి ఒక్కరికీ న్యాయం చేసేందుకే కృషి చేస్తుందన్నారు. బోగస్ కంపెనీలతో కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థకు చెందిన లావాదేవీలతో గ్రామస్తులకు ఎలాంటి నష్టం జరగదన్నారు. సదరు సంస్థలపై ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. గ్రామంలో ప్రధానంగా ఉన్న ఎనిమీ ప్రాపర్టీకి సంబంధించిన సమస్యను పరిష్కరించేందుకు రెవెన్యూ యంత్రాంగం రాష్ట్ర స్థాయిలో చర్యలు తీసుకుంటుందన్నారు. గ్రామ ప్రజలకు అనుగుణంగానే అధికారులు ఇప్పటికే పలుమార్లు నివేదికలను కేంద్ర ప్రభుత్వానికి సమర్పించారన్నారు. అనవసర అపోహలకు గురై భూములను విక్రయించవద్దని సూచించారు. సమస్య పరిష్కరించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకెళతానన్నారు. ఇప్పటికి రెండు సార్లు సమీక్ష... ఎనిమీ ప్రాపర్టీకి సంబంధించి జాయింట్ కలెక్టర్ స్థాయిలో ఇప్పటికే రెండుసార్లు సమీక్షలు జరిగాయని రాజేంద్రనగర్ ఆర్డీవో శ్రీనివాస్ తెలిపారు. గ్రామంలోని 1–174 సర్వే నెంబర్లలో మొత్తం 2700 ఎకరాల భూములు ఉన్నాయన్నారు. ఇందులో 286 ఎకరాల ప్రభుత్వ భూమి పోను, 685 ఎకరాల సీలింగ్ భూమి, 125 ఎకరాల భూదాన్ భూమి ఉందన్నా రు. మొత్తం 1621.12 ఎకరాల భూమిలో పట్టాదారులు, కౌలుదారులున్నారన్నారు. మూడు సంవత్సరాలుగా కేంద్ర ప్రభుత్వం ఎనిమీ ప్రాపర్టీకి సంబంధించిన వివరాలను సేకరిస్తుందన్నారు. మార్చి నెలాఖరు వరకు ఎనిమీ ప్రాపర్టీకి సంబంధించిన సమస్యలపై ప్రభుత్వంతో నిర్ణయం తీసుకునే అవకాశం ఉందన్నారు. అంతకు ముందు స్థానికులు ఎనిమీ ప్రాపర్టీ కారణంగా గ్రామస్తులు ఎదు ర్కొంటున్న సమస్యలను విన్న వించారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు కె.చంద్రారెడ్డి, గ్రామస్తులు, టీఆర్ఎస్ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. -
కుప్పకూలిపోయిన టీఆర్ఎస్ ఎమ్మెల్యే
-
కుప్పకూలిపోయిన టీఆర్ఎస్ ఎమ్మెల్యే
సాక్షి, హైదరాబాద్ : రాజేంద్రనగర్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్ అకస్మాత్తుగా అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయనను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు సమాచారం. ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ శంషాబాద్‌లోని ఓ హాటల్ ప్రారంభోత్సవంలో పాల్గొనేందుకు గురువారం సాయంత్రం అక్కడికి వెళ్లారు. అయితే ప్రారంభోత్సవం జరుగుతుండగా ఎమ్మెల్యే ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. అస్వస్థతకు గురైన ప్రకాశ్ గౌడ్‌ను ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి ప్రథమ చికిత్స అందించారు. అయితే ఎమ్మెల్యే పరిస్థితి విషమించడంతో అక్కడి వైద్యుల సలహా మేరకు నగరంలోని నిమ్స్‌కు తరలించినట్లుగా సమాచారం. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. -
న్యాయవాది ప్రకాశ్‌గౌడ్ హఠాన్మరణం
హైదరాబాద్: ప్రముఖ న్యాయవాది, బీజేపీ లీగల్ సెల్ గ్రేటర్ నాయకుడు కె.ప్రకాశ్‌గౌడ్(73) కన్నుమూశారు. బుధవారం తెల్లవారుజామున హైదరాబాద్ మల్లేపల్లిలోని తన స్వగృహంలో ఆయన గుండెపోటుతో మృతి చెందారు. ఆయన 40 సంవత్సరాలకుపైగా బీజేపీలో ఉంటూ పేదలకు ఉచితంగా సేవలందించారు. గతంలో నక్సలైట్ నాయకుడు కొండపల్లి సీతారామయ్యను విడుదల చేయించి న్యాయవాద వృత్తిలో పేరుగాంచారు. మాజీ ఎమ్మెల్యే బద్దం బాల్‌రెడ్డి, తెలంగాణ రాష్ట్ర బీజేపీ ఎస్సీ సెల్ అధ్యక్షుడు కె. రాములు, భాగ్యనగర్ ఉత్సవ సమితి ప్రధాన కార్యదర్శి డాక్టర్ భగవంత్‌రావు, వీహెచ్‌పీ రాష్ట్ర అధ్యక్షులు రామరాజు ఆయన మృతిపట్ల సంతాపం వ్యక్తం చేశారు. బుధవారం మధ్యాహ్నం ప్రకాశ్‌గౌడ్ అంత్యక్రియలు విజయ్‌నగర్‌కాలనీ శ్మశానవాటికలో జరిగాయి. -
టీఆర్ఎస్లో చేరిన మరో టీడీపీ ఎమ్మెల్యే
హైదరాబాద్: తెలంగాణ టీడీపీలో వలసల పర్వం కొనసాగుతోంది. శుక్రవారం రాజేంద్రనగర్ టీడీపీ ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్.. తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. కేసీఆర్ ఆయనకు పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. ఇటీవల టీడీపీకీ ప్రకాశ్ గౌడ్ రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. టీడీపీ సీనియర్ ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్ రావుతో పాటు ప్రకాశ్‌గౌడ్ కూడా టీఆర్ఎస్లో చేరాలని నిర్ణయించుకున్నారు. ఎర్రబెల్లి ఇదివరకే టీఆర్ఎస్లో చేరగా, ఈ రోజు ప్రకాశ్ గౌడ్ గులాబీ కండువా కప్పుకున్నారు. -
బాబు మైండ్ గేమ్
నెల్లూరు: తెలంగాణ రాష్ట్రంలో టీడీపీ చావుదెబ్బతిన్న విషయం తెలిసిందే. తెలంగాణలో ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు ఎర్రబెల్లి దయాకర్‌రావు, ప్రకాష్ గౌడ్లు పార్టీకి గుడ్‌బై చెప్పి టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. మరో ముగ్గురు ఎమ్యెల్యేలు కూడా టీఆర్ఎస్ గూటికి చేరుతారనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఆ విషయం నుంచి ప్రజల దృష్టి మరల్చడానికి టీడీపీ అధినేత చంద్రబాబు మైండ్‌గేమ్ మొదలుపెట్టారు. ఎల్లో మీడియాలో పచ్చరాతలు రాయించారు. జిల్లాకు చెందిన ఇద్దరు ముగ్గురు ఎమ్మెల్యేలు పార్టీ మారుతున్నట్లు గాలివార్తలు రాయించడంతో పాటు టీవీ చానళ్లలో కూడా సూళ్లూరుపేట ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య పార్టీ మారనున్నట్లు ప్రకటనలు ఇప్పించారు. దీనిైపై స్పందించిన జిల్లా పార్టీ అధ్యక్షుడు, ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డి, సూళ్లూరుపేట ఎమ్మెల్యే కిలివేటి ఎల్లో మీడియాలో వస్తున్న కథనాలను ఖండించారు. పార్టీ మారేది లేదని స్పష్టం చేశారు. చంద్రబాబు మైండ్‌గేమ్‌పై తీవ్రంగా ధ్వజమెత్తారు. సొంత పార్టీ ఎమ్మెల్యేలను కాపాడుకోలేక వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలపై తప్పుడు ప్రచారం చేయిస్తున్నారని మండిపడ్డారు. సీఎం హోదాలో ఉన్న చంద్రబాబు ఇటువంటి మైండ్‌గేమ్ రాజకీయాలకు పాల్పడటం సరికాదని హితవు పలికారు. -
సారథుల అస్త్రసన్యాసం!
♦ పార్టీ అధ్యక్షుల ఫిరాయింపులతో టీడీపీ ఉక్కిరిబిక్కిరి ♦ ‘గుంటి’ నుంచి మొదలై ప్రకాష్ వరకు జంపు జిలానీలే ♦ జిల్లాలో పార్టీకి మిగిలింది ఇద్దరే శాసనసభ్యులు సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: తెలుగుదేశం పార్టీకి వాస్తుదోషం పట్టుకున్నట్టుంది. కార్యాలయాలను మార్చినా కాలం కలిసిరావడంలేదు. వరుస పరిణామాలు ఆ పార్టీని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. జిల్లా సారథులంతా మధ్యలోనే అస్త్రసన్యాసం చేస్తుండడం పచ్చపార్టీని కలవరపరుస్తోంది. గులాబీ దూకుడుకు పార్టీ అధ్యక్షులే గోడ దూకుతుండడంతో దిక్కుతోచని పరిస్థితిలో పడింది. తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా నిలిచిన జిల్లాలో ఆ పార్టీ ప్రస్తుతం నామమాత్రంగా మిగిలిపోయింది. 2014లో జరిగిన సాధారణ ఎన్నికల్లో బలంగా వీచిన టీఆర్ఎస్ పవనాలకు ఎదురొడ్డి ఏడు అసెంబ్లీ, ఒక పార్లమెంటు స్థానంలో విజయం సాధించింది. సరిగ్గా అదే ఏడాదిన్నర తర్వాత ఆ పార్టీ ఉనికి కోసం పడరాని పాట్లు పడుతోంది. ప్రస్తుతం ఆర్.కృష్ణయ్య (ఎల్బీనగర్), అరికెపూడి గాంధీ (శేరిలింగంపల్లి) మాత్రమే పార్టీలో మిగిలారు. వీరిలో గాంధీ కూడా పార్టీ మారుతారనే ప్రచారం జరుగుతుండగా. కృష్ణయ్య మాత్రం పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. ‘గుంటి’తో మొదలు.. జిల్లా అధ్యక్షులుగా వ్యవహరించిన గుంటి జంగయ్య టీఆర్ఎస్లోకి ఫిరాయించగా, ఆ తర్వాత పగ్గాలు చే పట్టిన పట్నం మహేందర్‌రెడ్డి కూడా సాధారణ ఎన్నికలముందు గూలాబీ గూటికి చేరిన సంగతి తెలిసిందే. అనంతరం సార థ్య బాధ్యతలు స్వీకరించిన ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి గ్రహబలం బాగాలేదని పార్టీ కార్యాలయాన్ని కాస్తా ఆదర్శ్‌నగర్‌లోని ఎమ్మెల్యే క్వార్టర్స్‌కు మార్చారు. అక్కడకు మార్చినా పార్టీ రాత మారలేదు. ఆయన కూడా అనూహ్యంగా టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. దీంతో రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ పార్టీ అధ్యక్షుడిగా వచ్చారు. పార్టీ కార్యాలయానికి తాళం వేసిన ఆయన కార్యకలాపాలన్నీ సొంత నియోజకవర్గం నుంచే నడిపారు. ఆయన కూడా ఎక్కువ కాలం పార్టీలో ఇమడలేకపోయారు. గ్రేటర్ ఫలితాలతో నీరుగారిన ప్రకాశ్ పార్టీకి గుడ్‌బై చెప్పారు. అధికారపార్టీలోకి జంప్ అయ్యారు. దీంతో మరోసారి కొత్త సారథి వేటను టీడీపీ అధిష్టానం కొనసాగిస్తోంది. -
ప్రకాష్‌గౌడ్ జంప్
♦ ఎర్రబెల్లితో కలిసి టీఆర్ఎస్లో చేరిన రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ♦ త్వరలో భారీ బహిరంగసభ ఏర్పాటు చేస్తామని వెల్లడి ♦ అయోమయంలో తెలుగు తమ్ముళ్లు అంతా ఊహించినట్లే జరిగింది. తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు, రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్‌గౌడ్ గులాబీ గూటికి చేరారు. అనుచరులు, కార్యకర్తలతో రెండ్రోజులుగా సమాలోచనలు చేస్తున్న ఆయన.. టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకునేందుకు నిర్ణయించుకున్నారు. ఈ మేరకు బుధవారం రాత్రి టీడీపీ శాసనసభ పక్ష నేత ఎర్రబెల్లి దయాకర్‌రావుతో కలిసి టీఆర్ఎస్లో చేరుతున్నట్టు వెల్లడించారు. సీఎం కేసీఆర్ సమక్షంలో టీఆర్ఎస్ పార్టీలోకి వెళ్లినప్పటికీ త్వరలో బహిరంగసభ ఏర్పాటు చేసి అధికారికంగా చేరనున్నట్లు ఎర్రబెల్లి దయాకర్‌రావు ప్రకటించారు. టీడీపీకి కంచుకోటగా ఉన్న జిల్లాలో ఇప్పుడు ఆ పార్టీకి సంఖ్యాబలం పూర్తిగా తగ్గిపోయింది. జిల్లా అధ్యక్షుడిగా ఉన్న ప్రకాష్‌గౌడ్ టీఆర్ఎస్ గూటికి చేరడంతో కార్యకర్తలు అయోమయంలో పడ్డారు. సారథులంతా అధికారపార్టీలో చేరిపోతే తమ పరిస్థితి ఏమిటనే సందిగ్ధంలో ఉన్నారు. - సాక్షి, రంగారెడ్డి జిల్లా సాక్షి, రంగారెడ్డి జిల్లా: జిల్లాలో టీఆర్ఎస్ పార్టీ మరింత బలపడుతోంది. ఎన్నికల తర్వాత నలుగురు ఎమ్మెలేలతో అత్తెసరు మెజార్టీ ఉన్న ఆ పార్టీకి ఇప్పుడు రెండింతలు బలం పెరిగింది. కాంగ్రెస్ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు యాదయ్య, యాదవరెడ్డి టీఆర్ఎస్లో చేరగా.. టీడీపీ ఎమ్మెల్యేలు వరుసగా తీగల కృష్ణారెడ్డి, మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, మాధవరం కృష్ణారావు, వివేకానంద గులాబీ గూటికి చేరారు. తాజాగా టీడీపీ జిల్లా అధ్యక్షుడు ప్రకాష్‌గౌడ్ సైతం అధికారపార్టీ కండువా కప్పుకుంటున్నారు. దీంతో సంఖ్యా పరంగా జిల్లాలో టీఆర్ఎస్ బలమైన పార్టీగా ఎదిగింది. ఇదేబాటలో ‘గాంధీ’..! ప్రస్తుతం జిల్లాలో టీడీపీ తరఫున శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపుడి గాాంధీ, ఎల్బీనగర్ ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య మాత్రమే ఉన్నారు. గాంధీ కూడా టీఆర్ఎస్లో చేరుతారనే ఊహాగానాలు సాగుతున్నాయి. అయితే ఆయన మాత్రం చేరికను ఖండించారు. తాజాగా ప్రకాష్‌గౌడ్ టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకోవడంతో ఇక ఆయన వంతే మిగిలిఉందని రాజకీయ పార్టీ వర్గాలు గుసగుసలాడుతున్నాయి. ఇదేక్రమంలో ఆర్అండ్బీ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావును గాంధీ కలుస్తారనే ప్రచారం జరుగుతోంది. ఆయన ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్ సమక్షంలో గాంధీ గులాబీ కండువా వేసుకుంటారని విశ్వసనీయ వర్గాల సమాచారం. -
తెలంగాణలో టీడీపీకి భారీ షాక్
► కారెక్కిన ఎర్రబెల్లి ► రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్ కూడా ► టీడీపీ శాసనసభాపక్ష నేతను కండువా కప్పి ఆహ్వానించిన కేసీఆర్ ► టీడీఎల్పీని టీఆర్ఎస్లో విలీనం చేస్తూ స్పీకర్‌కు లేఖ రాస్తాం ► తెలంగాణలో టీడీపీ బతికి బట్టకట్టే పరిస్థితి లేదు: ఎర్రబెల్లి దయాకర్‌రావు ► బాబుకు ఫ్యాక్స్‌లో ఎర్రబెల్లి, ప్రకాశ్ రాజీనామా లేఖలు ► 15 మంది ఎమ్మెల్యేల్లో ఆ పార్టీకి మిగిలింది ఆరుగురే... ► వారిలోనూ ముగ్గురు కారెక్కుతారన్న ఎర్రబెల్లి ► ఎర్రబెల్లి, వివేకానంద, ప్రకాశ్‌లను సస్పెండ్ చేసిన టీడీపీ సాక్షి, హైదరాబాద్: అధికార టీఆర్ ఎస్ పార్టీ ఆకర్ష్ దెబ్బకు తెలంగాణ టీడీపీ ఉక్కిరిబిక్కిరవుతోంది. బుధవారం ఏకంగా టీడీపీ శాసనసభాపక్ష నేత ఎర్రబెల్లి దయాకర్‌రావు ఆ పార్టీకి రాజీనామా చేసి ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు సమక్షంలో టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు! ఆయనతో పాటు రాజేంద్రనగర్ టీడీపీ ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్ కూడా టీఆర్ఎస్లో చేరారు. కుత్బుల్లాపూర్ టీడీపీ ఎమ్మెల్యే వివే కానంద గౌడ్ మంగళవారమే సీఎం సమక్షంలో టీఆర్ఎస్లో చేరడం తెలిసిందే. ఆ మర్నాడే ఇలా ఏకంగా టీడీఎల్పీ నేత మరో ఎమ్మెల్యేతో కలసి టీఆర్ఎస్లో చేరి టీడీపీకి కోలుకోలేని షాకిచ్చారు. ఎర్రబెల్లి టీఆర్ఎస్లో చేరతారని చాన్నాళ్లుగా ప్రచారం జరుగుతున్నా ప్రతిసారీ ఆయన ఖండిస్తూ వచ్చారు. బుధవారం నారాయణఖేడ్‌లో సీఎం కేసీఆర్ ఉప ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్న భారీ నీటిపారుదల మంత్రి టి.హరీశ్‌రావు, అది ముగియగానే నేరుగా హైదరాబాద్ ఆదర్శనగర్ న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్‌లోని ఎర్రబెల్లి నివాసానికి చేరుకున్నారు. గంటసేపు ఆయనతో చర్చలు జరిపిన హరీశ్, చివరకు ఎర్రబెల్లి కుటుంబ సభ్యులను కూడా ఒప్పించారని టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. అనంతరం హరీశ్ తన కారులోనే ఎర్రబెల్లి, ప్రకాశ్ గౌడ్ ఇద్దరినీ వెంట తీసుకుని సీఎం అధికారిక నివాసానికి చేరుకున్నారు. కేసీఆర్ వారిద్దరితో దాదాపు గంటసేపు మాట్లాడారు. అనంతరం వారికి గులాబీ కుండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఎర్రబెల్లి, ప్రకాశ్ గౌడ్లు తమ రాజీ నామా లేఖలను టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబుకు ఫ్యాక్స్‌లో పంపారని సమాచారం. ఎర్రబెల్లి, ప్రకాశ్‌గౌడ్, వివేకానంద గౌడ్లను తెలంగాణ తెలుగుదేశం పార్టీ నుంచి అధినేత చంద్రబాబు బుధవారం సస్పెండ్ చేశారు. తెలంగాణలో టీడీపీ బతికి బట్టకట్టదు తెలంగాణ ప్రజలంతా టీఆర్ఎస్ వైపే ఉన్నారని, రాష్ట్రంలో టీడీపీ బతికి బట్టకట్టే పరిస్థితి కనిపించడం లేదని ఎర్రబెల్లి అన్నారు. సీఎం సమక్షంలో గులాబీ క ండువా కప్పుకున్న అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. మరో ఇద్దరు ముగ్గురు టీడీపీ ఎమ్మెల్యేలు కూడా టీఆర్ఎస్లోకి వచ్చే అవకాశముందని వివరించారు. వరంగల్ జిల్లాకు చెందిన మరికొం దరు టీడీపీ నాయకులు కూడా త్వరలో టీఆర్ఎస్లో చేరతారన్నారు. టీడీపీ శాసనసభా పక్షాన్ని (టీడీఎల్పీని) టీఆర్ఎస్లో విలీనం చేస్తూ స్పీకర్ మధుసూదనాచారికి లేఖ ఇవ్వనున్నట్టు కూడా ఎర్రబెల్లి చెప్పారు. ‘‘టీడీపీని వీడటం బాధగానే ఉంది. తప్పని పరిస్థితుల్లో పార్టీ మారుతున్నా, కార్యకర్తలంతా క్షమించాలి. తెలంగాణలో టీడీపీని కాపాడే ప్రయత్నం చేశా. కానీ ఇక్కడ టీడీపీ బతకదు. పార్టీ జెండా రూపకల్పనలో కూడా సభ్యుడిగా ఉన్న నేను త ప్పని పరిస్థితుల్లో పార్టీ మారా. టీడీపీ కార్యకర్తలూ అర్థం చేసుకుని టీఆర్ ఎస్‌లో చేరాలి. వరంగల్‌లో కానీ, నిజాం కాలేజీ మైదానంలో కానీ బహిరంగ సభ ఏర్పాటు చేసి సీఎం సమక్షంలో గులాబీ కండువా కప్పుకుంటాను’’ అని ఆయనన్నారు. తెలంగాణ అభివృద్ధి చెందాలంటే కేసీఆర్ వల్లే సాధ్యమవుతుందని చెప్పారు. టీడీపీ నిబంధనల మేరకే టీఆర్ఎస్ నేతలను కానీ, సీఎంను కానీ విమర్శించాననన్నారు. అది పార్టీ వ్యవహారం మాత్రమేనన్నారు. తన నియోజకవర్గ అభివృద్ధి కోసమే టీఆర్ఎస్లో చేరుతున్నానని ప్రకాశ్ గౌడ్ చెప్పారు. టీడీపీకి మిగిలింది ఆరుగురే 2014 సార్వత్రిక ఎన్నికల్లో తెలంగాణలో టీడీపీ 15 ఎమ్మెల్యే స్థానాలు గెలుచుకుంది. వివేక్, ఎర్రబెల్లి, ప్రకాశ్ గౌడ్లతో కలిపి ఇప్పటికి 9 మంది ఎమ్మెల్యేలు టీఆర్ ఎస్‌లో చేరారు. మిగిలిన ఆరుగురిలో ఎల్బీ నగర్ ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య ఎన్నికల ఫలితాలు వచ్చినప్పటి నుంచే టీడీపీకి దూరంగా ఉంటున్నారు. ఆ లెక్కన ఇప్పుడిక తెలంగాణలో టీడీపీకి మిగిలింది ఐదుగురు ఎమ్మెల్యేలే. వారు మహబూబ్‌నగర్ నుంచి రేవంత్‌రెడ్డి (కొడంగల్), ఎస్.రాజేందర్‌రెడ్డి (నారాయణ్‌పేట), హైదరాబాద్ నుంచి మాగంటి గోపీనాథ్ (జూబ్లీహిల్స్), అరికెపూడి గాంధీ (శేరిలింగంపల్లి), ఖమ్మం జిల్లా నుంచి సండ్ర వెంకట వీరయ్య (సత్తుపల్లి). వీరిలోనూ కనీసం ఇద్దరి నుంచి ముగ్గురు త్వరలో గులాబీ తీర్థం పుచ్చుకుంటారని ప్రచారం జరుగుతోంది. టీఆర్ఎస్లో చేరిన టీడీపీ ఎమ్మెల్యేలు 2014 సాధారణ ఎన్నికల్లో టీడీపీ తరఫున గెలిచి, అనంతరం టీఆర్ఎస్లో చేరిన ఎమ్మెల్యేల సంఖ్య బుధవారంతో 9కి చేరింది. వారు... 1. తలసాని శ్రీనివాస్‌యాదవ్ సనత్‌నగర్ 2. చల్లా ధర్మారెడ్డి పరకాల 3. తీగల కృష్ణారెడ్డి మహేశ్వరం 4. మాధవరం కృష్ణారావు కూకట్పల్లి 5. మంచిరెడ్డి కిషన్‌రెడ్డి ఇబ్రహీంపట్నం 6. జి.సాయన్న కంటోన్మెంట్ 7. కేపీ వివేకానంద కుత్బుల్లాపూర్ 8. ఎర్రబెల్లి దయాకర్‌రావు పాలకుర్తి 9. ప్రకాశ్ గౌడ్ రాజేంద్రనగర్ -
ప్లోర్ లీడర్‌గా ఎమ్మెల్యే రేవంత్..
- నేడు టీడీపీ పక్ష నేత గా ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి ప్రకటన - టీడీపీ నుంచి ఎర్రబెల్లి, వివేకానంద, ప్రకాశ్ గౌడ్ సస్పెన్షన్ హైదరాబాద్: టీడీపీ నేత ఎర్రబెల్లి దయాకర్ రావు టీఆర్ఎస్ లో చేరడంతో ఖంగుతిన్న టీడీపీ అధినేత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దిక్కుతోచని స్థితిలో పడిపోయారు. ఎర్రబెల్లితో సంప్రదింపులు జరపాలని చేసిన ప్రయత్నాలు ఫలించకపోవడంతో ఆయనను పార్టీ నుంచి సస్పెండు చేయాలను నిర్ణయానికి వచ్చారు. ప్రస్తుతం ఎర్రబెల్లి అసెంబ్లీ లో టీడీపీ పక్ష నేతగా ఉన్నందున ఆయన స్థానంలో రేవంత్ రెడ్డి ని టీడీపీ పక్ష నేతగా నిర్ణయించారు. గురువారం టీడీపీ నేతలతో టెలి కాన్ఫిరేన్స్ సందర్భంగా ఏపీ సీఎం చంద్రబాబు హైదరాబాద్ కు రానున్నారు. ఈ సమావేశంలో రేవంత్‌ను ప్లోర్ లీడర్‌గా చంద్రబాబు ప్రకటించనున్నారు. కాగా, తెలంగాణ టీడీపీ ఎమ్మెల్యేలు ఎర్రబెల్లి, వివేకానంద, ప్రకాశ్ గౌడ్లను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్టు బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. పార్టీ వ్యతిరేక కార్యకలపాలకు పాల్పడినందుకుగానూ ఎర్రబెల్లితో పాటు ప్రకాష్ గౌడ్, వివేకానందలను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్టు ప్రకటించారు. ఇదిలా ఉండగా, కొంతమంది అవకాశవాదులు ప్యాకేజీలకు, పదవులకు, పనులకు ఆశపడి పార్టీని వీడారని తెలంగాణ టీడీపీ అధ్యక్షులు ఎల్ రమణ విమర్శించారు. ఈ మేరకు ఆయన ఒక పత్రిక ప్రకటన విడుదల చేశారు. టీడీపీ బడుగు, బలహీన వర్గాల పార్టీ, అనేక సంక్షోభాలు వచ్చినా పార్టీని కార్యకర్తల సహాయంతో ధీటుగా ఎదుర్కొన్నామని తెలిపారు. ఇది కార్యకర్తల పార్టీగా అభివర్ణించారు. టీడీపీ సిద్ధాంతాలు ఎన్టీఆర్ ఆశయాలు, చంద్రబాబు నాయుడు విధానాలు తెలంగాణకు అవసరమనీ, పార్టీ పటిష్టతకు నిరంతరం కృషి చేస్తామని చెప్పారు. నాయకులు తమ స్వార్థంతో పార్టీని వీడినా.. కార్యకర్తలు పార్టీతోనే ఉంటారని ఎల్ రమణ వెల్లడించారు. -
చంద్రబాబు అంటే ఇష్టమే కానీ టీడీపీ బతకదు:ఎర్రబెల్లి
హైదరాబాద్: తెలంగాణ శాసనసభలో తెలుగుదేశం పార్టీ ఫ్లోర్ లీడర్ గా వ్యవహరిస్తోన్న సీనియర్ నేత, పాలకుర్తి ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్ రావు అధికార టీఆర్ఎస్ పార్టీలో చేరారు. రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ కూడా ఆయన వెంట గులాబీ గూటికి చేరుకున్నారు. బుధవారం సీఎం క్యాంప్ కార్యాలయంలో సీఎం కేసీఆర్.. ఎర్రబెల్లి, ప్రకాశ్ గౌడ్ లకు గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. చేరిక అనంతరం ఎర్రబెల్లి మీడియాతో మాట్లాడారు. తెలుగుదేశం పార్టీ అంటే ఇప్పటికీ తనకు ప్రేమ ఉందని, అయితే టీఆర్ఎస్ తోనే తెలంగాణ ప్రజలకు న్యాయం జరుగుతుందని నమ్ముతున్నట్లు ఎర్రబెల్లి చెప్పారు. టీడీపీ ఇక్కడ బతకలేని పరిస్థితి అర్థమయినందునే తాను, ప్రకాశ్ గౌడ్ తో కలిసి పార్టీ మారినట్లు వివరించారు. మిగిలిన టీడీపీ ఎమ్మెల్యేలను కూడా టీఆర్ఎస్ లో చేరాల్సిందిగా ఆయన విజ్ఞప్తి చేశారు. 'టీడీపీని వీడటం బాధగా ఉంది. చంద్రబాబంటే ఇప్పటికీ ఇష్టమే. కానీ ఇక్కడ పార్టీ బతకదు. ప్రజలు టీఆర్ఎస్ వెంట ఉన్నారు. మెన్నటి గ్రేటర్ ఎన్నికల్లోనూ ఇది స్పష్టంగా వెల్లడైంది. అందుకే ఈ పార్టీలో చేరా. కార్యకర్తలు, నాయకులు క్షమించి, సహకరించాలని కోరుతున్నా' అంటూ ఉద్వేగంగా మాట్లాడారు ఎర్రబెల్లి. పార్టీ లేదా ప్రభుత్వంలో మీరు కీలకపాత్ర పోషించనున్నారా? అన్న విలేకరుల ప్రశ్నకు బదిలిస్తూ.. అలాంటి హామీలేవీ పొందలేదని స్పష్టం చేశారు. ఆరుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైనా తాను అనేక పదవులు చేపట్టానని గుర్తు చేశారు. ఇప్పటికి క్యాంప్ ఆఫీస్ లో కండువా కప్పుకున్నప్పటికీ త్వరలోనే వరంగల్ లోగానీ, హైదరాబాద్ లో గానీ భారీ బహిరంగ సభ నిర్వహిస్తామని ఎర్రబెల్లి చెప్పారు. -
టీడీపీ దుకాణం బంద్!
హైదరాబాద్: తెలంగాణలో తెలుగుదేశం పార్టీ పూర్తిగా కనుమరుగవుతుందా? టీడీపీ ఇక ఆంధ్రప్రదేశ్‌కు మాత్రమే పరిమితం కానుందా? అంటే తాజా పరిణామాలు, ఆగని వలసలు ఔననే సూచిస్తున్నాయి. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు.. 2014 ఎన్నికల్లో టీడీపీ ఓటమి, ఆ తదనంతరం వేగంగా చోటుచేసుకున్న పరిణామాలు తెలంగాణలో టీడీపీని ఉనికిని ప్రశ్నార్థకం చేశాయి. ఒకరి వెంట ఒకరు టీడీపీ ఎమ్మెల్యేలు, నేతలు, శ్రేణులు ఇలా పూర్తిగా అధికార టీఆర్ఎస్ పార్టీలో చేరుతుండటంతో తెలంగాణలో ఆ పార్టీ పునాదులు కదిలిపోతున్నాయి. తాజాగా వరంగల్ లోక్‌సభ ఉప ఎన్నిక, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికలు ఇక తెలంగాణలో టీడీపీ కోలుకోలేదనే విషయాన్ని స్పష్టం చేశాయి. దీనికితోడు తాజాగా టీ టీడీపీ సీనియర్ నేత, అసెంబ్లీలో పార్టీ శాసనసభాపక్ష నేత ఎర్రబెల్లి దయాకర్ రావు, గ్రేటర్ ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ కూడా టీఆర్ఎస్లో చేరేందుకు సిద్దమవ్వడంతో ఆ పార్టీ పూర్తిగా ఖాళీ అయ్యే పరిస్థితి నెలకొంది. టీడీపీకి తెలంగాణలో అగ్రనాయకుల్లో ఒకరైన ఎర్రబెల్లి కూడా పార్టీకి రాజీనామా చేసి.. తన భవిష్యత్తు తాను చూసుకోవడంతో సైకిల్ పార్టీకి దిక్కతోచని పరిస్థితి నెలకొంది. 2014 ఎన్నికల తర్వాత టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చింది మొదలు సైకిల్ నుంచి కారులోకి వలసలు మొదలయ్యాయి. అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ నుంచి 15 ఎమ్మెల్యేలు గెలుపొందగా.. ఇప్పటికే ఏడుగురు కారు ఎక్కారు. తాజాగా ఎర్రబెల్లి దయాకర్ రావు, ప్రకాశ్ గౌడ్ కూడా టీఆర్ఎస్లో చేరుతుండటంతో ఆ పార్టీలో చేరిన టీడీపీ ఎమ్మెల్యేల సంఖ్య 9కి చేరింది. దీంతో టీడీపీ ఎమ్మెల్యేలు రెండింట మూడొంతుల మంది కారెక్కినట్టయింది. ఈ నేపథ్యంలో టీడీపీ శాసనసభాపక్షాన్ని పూర్తిగా టీఆర్ఎస్లోకి విలీనం చేసుకోవడం ద్వారా పార్టీ మారిన సైకిల్ పార్టీ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడకుండా గులాబీ పార్టీ వ్యూహాన్ని సిద్ధం చేసినట్టు తెలుస్తోంది. టీడీపీ కనుమరుగు! టీడీపీని దెబ్బతీయడంలో అధికార టీఆర్ఎస్ పార్టీ వ్యూహం బాగానే పనిచేస్తున్నట్టు కనిపిస్తోంది. అధికారంలోకి వచ్చిన నాటినుంచి టీఆర్ఎస్లోకి టీడీపీ నేతలు వలసలు నిరాటంకంగా కొనసాగుతున్నాయి. టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు వలసలను అడ్డుకునేందుకు ఎంతగా ప్రయత్నిస్తున్నా.. నేతలు మాత్రం ఒకరి వెంట ఒకరి క్యూ కట్టుకొని కారు ఎక్కుతున్నారు. వరంగల్ ఉప ఎన్నిక, గ్రేటర్ ఎన్నికల ఫలితాలతో ఈ వలసలు తారాస్థాయికి చేరాయి. టీడీపీలో బలమైన సీనియర్ నేతగా, చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడిగా ముద్రపడిన ఎర్రబెల్లి సైతం సైకిల్ ను వీడి కారు ఎక్కుతుండటంతో తెలంగాణలో ఈ పచ్చపార్టీ వేగంగా కనుమరుగయ్యే పరిస్థితి కనిపిస్తోంది. టీ టీడీపీలో సీనియర్ నేతలైన ఎర్రబెల్లి దయాకర్ రావుకు, రేవంత్‌రెడ్డికి మధ్య విభేదాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో టీడీపీ తెలంగాణ అధ్యక్ష పదవి ఎల్ రమణకు, వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి రేవంత్ రెడ్డికి ఇవ్వడంపై కూడా ఎర్రబెల్లి గతకొంతకాలంగా అసంతృప్తితో ఉన్నట్టు చెప్తున్నారు. టీటీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి తనకు ఇవ్వకపోవడం కూడా ఎర్రబెల్లి పార్టీ వీడటానికి కారణమని వినిపిస్తోంది. ఎమ్మెల్యేలు ఎర్రబెల్లి, ప్రకాశ్ గౌడ్ టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకోవడం ఖాయమవ్వగా.. మరో గ్రేటర్ ఎమ్మెల్యే కూడా కారు ఎక్కునున్నారని సమాచారం అందుతోంది. ఈ నేపథ్యంలో టీటీడీపీలో ఉన్న రేవంత్‌రెడ్డిలాంటి ఒకరిద్దరు నేతలు మినహా.. చెప్పుకోదగ్గ నాయకత్వంగానీ, కార్యకర్తల బలంగానీ తెలంగాణలో ఉండబోదని పరిశీలకులు అంటున్నారు. ఈ పరిస్థితులు ఇలా ఉండటంతో నారాయణఖేడ్ ఉప ఎన్నికల్లోనూ టీటీడీపీ పూర్తిగా డీలాపడిపోయిందని, ఏదో నామ్‌కే వాస్తే అన్నట్టుగా రేవంత్‌రెడ్డి లాంటి ఒకరిద్దరు నేతలు అక్కడ ప్రచారం నిర్వహించారు కానీ, ఎవరూ ఈ ఉప ఎన్నికను సీరియస్‌గా తీసుకోలేదని తెలంగాణ టీడీపీ శ్రేణులు అంటున్నాయి. ఇప్పటివరకు వివేకానంద (కుత్బుల్లాపూర్), మాధవరం కృష్ణారావు (కూకట్పల్లి), మంచిరెడ్డి కిషన్‌రెడ్డి (ఇబ్రహీపట్నం), చల్లా ధర్మారెడ్డి (పరకాల), తీగల కృష్ణారెడ్డి (మహేశ్వరం), సాయన్న (కంటోన్మెంట్), తలసాని శ్రీనివాస్ యాదవ్ (సనత్‌నగర్), ప్రకాశ్ గౌడ్ (రాజేంద్రనగర్), ఎర్రబెల్లి దయాకర్ రావు (పాలకూర్తి) టీఆర్ఎస్లో చేరిన, చేరుతున్న వారు కాగా.. ఇంకా టీడీపీలో మిగిలిన ఎమ్మెల్యేలు అరికెపూడి గాంధీ (శేర్లింగంపల్లి), కృష్ణయ్య (ఎల్బీనగర్), మాగంటి గోపి (జుబ్లీహిల్స్), రాజేందర్‌రెడ్డి (నారాయణపేట), సండ్ర వేంకట వీరయ్య (సత్తుపల్లి).. -
'చదువుకోనందుకు బాధగా ఉంది'
మణికొండ (రంగారెడ్డి): చిన్నతనంలో చదువుకోనందుకు ఇప్పటికీ బాధ కలుగుతోందని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్ అన్నారు. సోమవారం రాజేంద్రనగర్ మండల పరిషత్ కార్యాలయంలో మండలస్థాయి ఉత్తమ ఉపాధ్యాయులకు సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన ఉపాధ్యాయులను సన్మానించిన అనంతరం మాట్లాడుతూ... చిన్నతనంలో అప్పటి పరిస్థితుల వల్ల తాను చదువుకోలేకపోయానని... తనలాంటి పరిస్థితి ఎవరికీ రావద్దన్నారు. ఉపాధ్యాయులు ఎంతో ఓపికతో ప్రతి విద్యార్థిని గమనిస్తూ విద్యాబోధన చేస్తారని చెప్పారు. -
ప్రొటోకాల్ పాటించటం లేదంటూ ఎమ్మెల్యే ఆగ్రహం
రాజేంద్రనగర్ : ప్రొటోకాల్ నిబంధనలను సక్రమంగా పాటించడం లేదంటూ ఉన్నతాధికారులపై రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ మండిపడ్డారు. మంగళవారం రాజేంద్రనగర్ నియోజకవర్గంలో రవాణాశాఖ మంత్రి మహేందర్‌రెడ్డితోపాటు ప్రకాష్‌రెడ్డి పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. స్థానికంగా రూ.82 లక్షలతో నిర్మించిన కొత్త సీసీరోడ్డును వారు ప్రారంభించారు. ఈ సందర్భంగా స్థానిక ఎమ్మెల్సీ ఎన్ రామచందర్‌రావు పేరుకు బదులు ఈ కార్యక్రమంతో సంబంధం లేని వారి పేరు శిలఫలకంపై ఉండటంతో ప్రకాష్ గౌడ్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ప్రొటోకాల్ నిబంధనలు పాటించడం లేదంటూ ఉన్నతాధికారుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. -
'మాట తప్పారు... అందుకే మనసు మార్చుకున్నా'
మణికొండ (రంగారెడ్డి జిల్లా): రాజేంద్రనగర్ నియోజకవర్గ పరిధిలో అన్ని గ్రామాలకు మూడు నెలల్లో తాగునీటిని అందిస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రులు ఇచ్చిన మాట తప్పారని... దాంతో పార్టీ మారే విషయంలో తాను మనసు మార్చుకున్నాని టీడీపీ ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్ తెలిపారు. శనివారం మండల పరిషత్ కార్యాలయం ఆవరణలో జరిగిన తెలంగాణ ఆవిర్భావ ఉత్సవాల కార్యక్రమంలో పాల్గొని అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రాజేంద్రనగర్ మండల పరిధిలో నీటి సమస్యపై కొన్ని నెలలుగా రాష్ట్ర ప్రభుత్వ పెద్దలను సంప్రదిస్తున్నా... మాటలే చెపుతున్నారు తప్ప చేతల్లో చూపటం లేదన్నారు. శనివారం ఉదయం మంత్రి హరీష్‌రావుతో ఇదే విషయంలో చర్చించగా మూడు రోజుల్లో నీటిని ఇస్తామని హామీ ఇచ్చారని చెప్పారు. ఇలా నీటి విషయంలో వారు మాట తప్పటంతో... తాను పార్టీ మారే విషయంలో మనసు మార్చుకున్నానని ఆయన పేర్కొన్నారు. రేవంత్‌రెడ్డి విషయంలో ప్రభుత్వం కుట్ర చేసిందన్నారు. తెలుగుదేశం పార్టీకి ఎమ్మెల్యేలను కొనే స్థోమత లేదన్నారు. రాబోయే గ్రేటర్ ఎన్నికల్లో పార్టీల బలాబలాలు తేలుతాయన్నారు. -
రంగారెడ్డి టీడీపీ అధ్యక్షుడిగా ప్రకాష్ గౌడ్?
హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లా టీడీపీ అధ్యక్షుడిగా, రాజేంద్రనగర్ టీడీపీ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ పేరు తెరమీదకు వచ్చింది. ప్రస్తుతం జిల్లా అధ్యక్షుడుగా ఉన్న ఇబ్రహీంపట్నం టీడీపీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకుంటున్న విషయం తెలిసిందే. ఆయన గురువారం అధికారికంగా టీఆర్ఎస్లో చేరనున్నారు. ఈ నేపథ్యంలో జిల్లా అధ్యక్షుడిగా ప్రకాష్ గౌడ్‌ను నియమించాలని పార్టీ అధిష్టానం నిర్ణయించినట్లు సమాచారం. గతంలో ప్రకాష్ గౌడ్ కూడా టీఆర్ఎస్లో చేరుతున్నట్లు ప్రచారం జరిగినా ఆయన మాత్రం టీడీపీలోనే ఉన్నారు. -
విఐపి రిపోర్టర్ -రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్
-
చెరువులను పరిరక్షిస్తాం
శంషాబాద్ రూరల్ : రా్రష్టంలో కబ్జాకు గురైన చెరువుల పరిరక్షణకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పి.మహేందర్‌రెడ్డి అన్నారు. చెరువుల పునరుద్దరణతో సాగు, తాగునీటి సమస్య పరిష్కారం కోసం కృషి చేస్తున్నట్లు పేర్కొన్నారు. మండలంలోని చిన్నగోల్కొండలో మంగళవారం రూ.1.20 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేసిన 33/11 కేవీఏ విద్యుత్ సబ్‌స్టేషన్ ప్రారంభోత్సవం, ఆర్‌ఎంఎస్‌ఏ నిధులు రూ.42.35 లక్షలతో నిర్మించ తలపెట్టిన పాఠశాల అదనపు తరగతి గదుల పనులకు శంకుస్థాపనను స్థానిక ఎమ్మెల్యే టి. ప్రకాష్‌గౌడ్‌తో కలిసి చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మంత్రి మాట్లాడుతూ.. జిల్లాలో 3,718 చెరువులను పునరుద్ధరించడానికి ప్రణాళిక రూపొందించామన్నారు. పట్టణ ప్రాంతాల్లో ఉన్న చెరువుల కబ్జాలను తొలగించి, అక్రమార్కులపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. శంషాబాద్‌కు కృష్ణా జలాల సరఫరాకు రూ.13 కోట్లు చెల్లించినట్లు పేర్కొన్నారు. జంట నగరాలతో పాటు నగరం చుట్టూ ఉన్న పట్టణ ప్రాంతాల్లో తాగునీటి సమస్య పరిష్కారానికి కృష్ణా జలాలను తీసుకొస్తామన్నారు. స్థానికంగా సబ్‌స్టేషన్ నుంచి 24 గంటల కరెంటు సరఫరా జరిగేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. జీఓ 111ను సడలించాలి: ఎమ్మెల్యే.. శంషాబాద్ ప్రాంతం అభివృద్ధికి ఆటంకంగా మారిన జీఓ 111 సడలింపు కోసం మంత్రి చొరవ తీసుకోవాలని ఎమ్మెల్యే ప్రకాష్‌గౌడ్ కోరారు. శంషాబాద్ మండలంలో ఆర్టీసీ డిపో ఏర్పాటుకు మంత్రి కృషి చేయాలని ఎంపీపీ చెక్కల ఎల్లయ్య కోరారు. పాఠశాలల్లో మరుగుదొడ్లు లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని, సమస్య పరిష్కారం కోసం ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని జెడ్పీటీసీ సభ్యుడు బూర్కుంట సతీష్ కోరారు. కార్యక్రమంలో చివరగా లబ్ధిదారులకు మంత్రి ఆసరా పింఛన్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ సారా సువర్ణ కృష్ణగౌడ్, ఎంపీటీసీ సభ్యురాలు మణెమ్మ, డీసీఎంఎస్ చైర్మన్ కె.శ్రావణ్‌కుమార్‌గౌడ్, శంషాబాద్ సొసైటీ చైర్మన్ మహేందర్‌రెడ్డి, సర్పంచులు దౌనాకర్‌గౌడ్, మహేందర్‌రెడ్డి, సిద్దేశ్వర్, సత్యనారాయణ, ఎంపీడీఓ శ్రీకాంత్‌రెడ్డి, తహసీల్దార్ వెంకట్‌రెడ్డి, ఎంఈఓ ఎస్.నర్సిం హారావు, ప్రధానోపాధ్యాయుడు పాపిరెడ్డి, వివిధ పార్టీల నాయకులు పాల్గొన్నారు. -
ప్రజాప్రతినిధిగా బాధ్యతలను నెరవేరుస్తా
సమస్యల పరిష్కారానికి వెంటనే చర్యలు తీసుకుంటా.. కాలనీని అభివృద్ధి పథంలో నిలుపుతా ఆ కాలనీ.. సాయంత్రం 6 గంటలు దాటిందంటే చాలు అంధకార బంధురంగా మారుతుంది. వీధిదీపాలు లేకపోవడంతో ప్రజలు చీకటిలోనే మగ్గాల్సి వస్తోంది. రోడ్డు సక్రమంగా లేకపోవడంతో కాలనీవాసుల కష్టాలు అన్నీ ఇన్నీ కావు. చీకటి పడిందంటే చాలు ఇళ్లనుంచి బయటికి వచ్చేందుకు జనాలు జంకాల్సిన పరిస్థితి. ఇక్కడ లెక్కలేనన్ని సమస్యలు తిష్టవేశాయి. ఈ దుస్థితి అంతా మరెక్కడో కాదు.. అంతర్జాతీయ విమానాశ్రయానికి అత్యంత చేరువగా ఉన్న చారీనగర్ కాలనీలో నెలకొంది. శంషాబాద్ పంచాయతీ పరిధిలోని చారీనగర్ కాలనీ కుగ్రామాన్ని తలపిస్తుంది. ఇక్కడ నెలకొన్న సమస్యల పరిష్కారానికి ‘సాక్షి’ రిపోర్టర్‌గా రాజేంద్రనగర్ ఎమ్మెల్యే టి. ప్రకాష్ గౌడ్ వచ్చారు. ప్రజలతో ఆయన మమేకమయ్యారు. సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వాటిని అతి త్వరలోనే పరిష్కరించడానికి చర్యలు చేపడతానని.. చారీనగర్ కాలనీ దశ మారుస్తానని ప్రజలకు హామీ ఇచ్చారు. ఎమ్మెల్యే : ఏమ్మా.. పింఛను వస్తోందా? కోటేశ్వరి: వికలాంగురాలినైన నాకు పింఛను ఇవ్వడంలేదు. పంచాయతీ కార్యాలయం చుట్టూ ఎన్నిసార్లు తిరిగినా పట్టించుకోవడంలేదు. ఎమ్మెల్యే : సర్టిఫికెట్ చూపించావా? కోటేశ్వరి : చూపించినా చెల్లదంటున్నారు. ఎమ్మెల్యే: అధికారులతో మాట్లాడి న్యాయం జరిగేలా చూస్తాను. నీకు ట్రైసైకిల్ ఇప్పిస్తాను. ఎమ్మెల్యే : పెద్దమ్మా.. ఇక్కడేం సమస్యలున్నాయి? మాణెమ్మ: మా బస్తీలో మురుగు కాలువలు లేవు. మురుగు రోడ్డు మీద పారుతోంది. ఎన్నాళ్ల నుంచో చెబుతున్నా ఎవరూ స్పందించడం లేదు. ఎమ్మెల్యే : కాలనీలో ప్రాధాన్యత క్రమంగా భూగర్భ డ్రైనేజీల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటాను. ఎమ్మెల్యే : అమ్మా.. కాలనీలో ప్రధాన సమస్య ఏమిటి? భారతమ్మ: కాలనీకి ఉన్న రోడ్డు అధ్వానంగా ఉంది. మా గోస ఎవరు పట్టించుకుంటలేరు సారూ.. ఎమ్మెల్యే: కాలనీకి రోడ్డు కోసం ఇటీవలే నిధులు మంజూరయ్యాయి. అంతర్గత రోడ్ల కోసం నిధులు వచ్చేలా, పనులు జరిగేలా కృషి చేస్తాను. ఎమ్మెల్యే : పెద్దాయనా.. ఫించన్ వస్తోందా? వీరయ్య: నాకు ఒక కన్ను పూర్తిగా కనిపించదు సార్. పింఛను అడిగితే రాదంటున్నారు. ఎమ్మెల్యే : సర్టిఫికెట్ తెచ్చుకున్నావా? వీరయ్య : సర్టిఫికెట్ కోసం ఎన్నిసార్లు తిరిగినా ఇవ్వడం లేదు. ఎమ్మెల్యే : నీ పేరు అధికారులకు చెబుతాను. ఫించన్ వచ్చేలా చర్యలు తీసుకుంటారు. ఎమ్మెల్యే : కరెంటు సరఫరా ఎలా ఉంది? జైబున్నీసాబేగం: మా బస్తీలో వీధి దీపాలు లేవు. బస్తీ చుట్టూ చెట్ల పొదలు ఉండడంతో పాములు తిరుగుతున్నాయి. రాత్రి వేళ బయటికి వెళ్లలేకపోతున్నాం. ఎమ్మెల్యే: అధికారులతో మాట్లాడి తగు చర్యలు తీసుకునేలా కృషి చేస్తాను. ఎమ్మెల్యే: బాబూ.. ఏం పని చేస్తున్నావు? గౌస్: మాకు ఎయిర్‌పోర్టులో ఉద్యోగాలు ఇవ్వడంలేదు. ఉద్యోగం ఇచ్చినా జీతాలు సక్రమంగా చెల్లించకుండా ఏదో రకంగా ఇబ్బంది పెడుతున్నారు. ఎమ్మెల్యే: అంతర్జాతీయ విమానాశ్రయం ఏర్పాటైనా ఇక్కడి నిరుద్యోగులకు ఉపాధి దొరకకపోవడం విచారకరం. ఈ అంశంపై ప్రత్యేకంగా దృష్టిసారిస్తా. ఎమ్మెల్యే : పెద్దాయనా సమస్యలు ఏమున్నాయి? జావెదిమియా: మా కాలనీలో ఎవరైనా చనిపోతే పూడ్చిపెట్టడానికి జానేడు జాగ లేదు సార్. స్మశాన వాటికకు స్థలం కేటాయించాలి. ఎమ్మెల్యే : అధికారులతో మాట్లాడి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటాను. ఎమ్మెల్యే: చెప్పమ్మా.. ఇక్కడ ఎలాంటి సమస్యలున్నాయి? మౌనిక: మా కాలనీకి బస్సు సౌకర్యం సరిగ్గా లేదు. ఎమ్మెల్యే : రోజుకు బస్సు ఎన్ని సార్లు వస్తుంది. మౌనిక : రోజుకు ఉదయం ఒక ట్రిప్పు మాత్రమే వస్తుంది. మిగతా అన్ని సమయాల్లో శంషాబాద్ వరకు కాలినడకనే వెళ్లాల్సిన పరిస్థితి. ఎమ్మెల్యే: వెంటనే ఆర్టీసీ అధికారులతో మాట్లాడి చర్యలు తీసుకుంటాను. ఎమ్మెల్యే : అమ్మా.. బాగున్నారా? మంజుల: ఏం బాగో సారు.. మాకు రోగం వస్తే వైద్యం చేయించుకోవడానికి కూడా ఇబ్బందులు పడుతున్నాం. ప్రతి చిన్న దానికి శంషాబాద్ వెళ్లాల్సిందే. ఎమ్మెల్యే : వైద్య సౌకర్యం అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటాను. ఎమ్మెల్యే : మీదగ్గర ఉన్న సమస్యలేమిటో చెప్పండమ్మా? అనుసూజ: బస్తీలో అందరం పేదవాళ్లం ఉంటున్నాం. మాకు ఇళ్ల పట్టాలు ఇవ్వలేదు. అద్దె ఇళ్లలో నివసిస్తున్నాం. మాకు న్యాయం చేయాలి. ఎమ్మెల్యే: ఈ విషయమై రెవెన్యూ అధికారులతో చర్చించి సమస్య పరిష్కారానికి ప్రయత్నిస్తాను. లావణ్య: సార్.. మా బస్తీలో నిరుద్యోగ సమస్య ఉంది. యువతులకు కుటీర పరిశ్రమ ఏర్పాటు చేయించి ఉపాధి కల్పించాలి. కుట్టు మిషన్ నేర్చుకున్న వారికి ఆర్థిక సహాయం అందజేస్తే స్వయం ఉపాధి పొందుతారు. ప్రధానంగా రవాణా సమస్యను పరిష్కరించాలి. ఎమ్మెల్యే: నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించడానికి తప్పకుండా చర్యలు తీసుకుంటాను. ఎమ్మెల్యే : పెద్దాయనా మీ సమస్యలేమున్నాయి? మాసయ్య: మాకు సొంత ఇల్లు లేదు. అద్దె ఇంట్లో ఉంటున్నాం. కూలీ చేసుకునే మాకు సొంతిల్లు లేక ఇబ్బందులు పడుతున్నాం. మమ్మల్ని ఆదుకోవాలి. ఎమ్మెల్యే: కాలనీలో చాలా మందికి ఇళ్ల పట్టాలు లేవని చెబుతున్నారు. ఉన్నతాధికారులతో మాట్లాడి..అందరి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటాను. ఎమ్మెల్యే : ఇంకా ఏం కష్టాలున్నాయమ్మా..? సత్తమ్మ : మోరీల దగ్గరి నుంచి రోడ్డు వరకు ఏది చెప్పినా ఎవరూ పట్టించుకుంటలేరు సారూ.. ఎమ్మెల్యే : ఒక్కొక్కటిగా సమస్యలన్నింటినీ పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటా. -
టీఆర్ఎస్ గూటికి తీగల
ఆక ర్ష్.. వికర్ష్! సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: ఊహాగానాలకు తెరపడింది. ఊహించినట్లుగానే మహేశ్వరం ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి గులాబీ గూటికి చేరారు. రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్ కూడా టీఆర్ఎస్ వ్యూహానికి ఆకర్షితులైనప్పటికీ, వెనువెంటనే మనసు మార్చుకోవడం జిల్లా రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. అధికార పార్టీ వలలో చిక్కుకోకుండా టీడీపీ అధిష్టానం బుజ్జగింపులకు దిగినా తీగల మాత్రం మనసు మార్చుకోకుండా షి‘కారు’కే మొగ్గు చూపి షాక్ ఇవ్వగా.. సీఎం కేసీఆర్‌తో భేటీ అన ంతరం ప్రకాశ్‌గౌడ్ యూ టర్న్ తీసుకోవడంతో గులాబీ శిబిరం నివ్వెరపోయింది. గురువారం చోటుచేసుకున్న ఈ అనూహ్య పరిణామాలు జిల్లా రాజకీయవర్గాల్లో కలకలం సృష్టించాయి. రానున్న గ్రేటర్ ఎన్నికల్లో సత్తా చాటాలని ఉవ్విళ్లూరుతున్న టీఆర్ఎస్ అధిష్టానం.. శివార్లలో బలంగా ఉన్న ‘దేశం’ను లక్ష్యంగా చేసుకుంది. ఈ క్రమంలోనే ఆ పార్టీ ఎమ్మెల్యేలకు వల విసిరింది. దాదాపు అందరూ ఎమ్మెల్యేలతో సంప్రదింపులు జరుపుతున్న గులాబీ నేతలు.. ప్లీనరీలోపు తమ్ముళ్లను తమవైపు తిప్పుకోవాలని ప్రణాళిక రూపొందించారు. ఇందులో భాగంగానే ఇటీవల తన కుమారులతోసహా తీగల కృష్ణారెడ్డి ముఖ్యమంత్రిని కలిశారు. ఈ భేటీలోనే కారెక్కాలనే ఆకాంక్షను తీగల వ్యక్తం చేశారు. కార్యకర్తల సమావేశం అనంతరం అధికారికంగా గులాబీ కండువా కప్పుకోవాలని భావించారు. అయితే, టీడీపీని వీడాలనే తన నిర్ణయానికి కార్యకర్తలు, ముఖ్యనేతల నుంచి అభ్యంతరం వ్యక్తం కావడంతో మీమాంసలో పడ్డ ఆయన దసరా రోజున టీఆర్ఎస్ గూటికి చేరాలనే ముహూర్తాన్ని వాయిదా వేశారు. టీఆర్ ఎస్‌లో చేరడం ఖాయమైనప్పటికీ, నిర్ణయాన్ని పెండింగ్‌లో పెట్టారనే ప్రచారం నేపథ్యంలో గురువారం గులాబీ జెండా కప్పుకోవడం గమనార్హం. తీగలను నిలువరించేందుకు జిల్లా పార్టీ అధ్యక్షుడు మంచిరెడ్డి కిషన్‌రెడ్డి స్వయంగా బుజ్జగింపులకు దిగినా ఫలితం లేకుండా పోయింది. ఇంటికివెళ్లి మరీ రాజకీయ భవిష్యత్తు ఇచ్చిన టీడీపీని వీడకూడదని కోరినా... తీగల మాత్రం ఇప్పటికే నిర్ణయం తీసుకున్నానని, మునిగిపోయే నావలో ఉండలేనని తెగేసి చెప్పినట్లు తెలిసింది. పీచేముడ్! తీగలతో కలిసి కేసీఆర్‌ను కలిసి టీఆర్ఎస్లో చేరుతున్నట్లు ప్రకటించిన కొన్ని గంటల్లోనే ప్రకాశ్‌గౌడ్ మనసు మార్చుకున్నారు. అభివృద్ధి పనులకు నిధులు అడిగేందుకే సీఎంను కలిశానని, పార్టీ మారేది లేదని స్పష్టంచేశారు. ఈ పరిణామం టీఆర్ఎస్కు షాక్ ఇచ్చింది. పార్టీలో చేరికను ఖరారు చేసుకున్న అనంతరమే ప్రకాశ్‌కు ఆహ్వానం పలికామని, చివరి నిమిషంలో ఎదురు తిరగడం విస్మయం కలిగించిందని గులాబీ నేతలు వాపోయారు. మరోవైపు ప్రకాశ్‌గౌడ్ యూటర్న్ తీసుకోవడంలో అంతర్యమేమిటో బోధపడడం లేదని తెలుగు తమ్ముళ్లు అంటున్నారు. ఇప్పటికే పలుమార్లు కేసీఆర్‌తో మంతనాలు జరిపిన క్రమంలో ప్రకాశ్ పార్టీని వీడుతారని భావించామని, చేరినట్లే చేసి వెనక్కిరావడం ఆశ్చర్యం కలిగించిందని అన్నారు. ఇదిలావుండగా, తన నియోజకవర్గంలో కృష్ణా పైప్‌లైన్ పనులను పూర్తి చేస్తేనే టీఆర్ఎస్లో చేరుతానని సీఎంకు స్పష్టం చేసినట్లు ప్రకాశ్‌గౌడ్ తన సన్నిహితులకు వివరించారు. నాలుగు నెలల్లో కృష్ణాజలాలను అందిస్తానని, పార్టీలో చేరాలని కేసీఆర్ పేర్కొన్నప్పటికీ, పనులు పూర్తయిన తర్వాతే, అది కూడా కార్యకర్తల అభిప్రాయం మేరకే నడుచుకుంటానని తెలిపానని చెప్పారు. ఇదిలావుండగా, సాయంత్రం టీడీపీ అధినేత చంద్రబాబునాయుడును కలిసిన ప్రకాశ్.. టీడీపీని వీడబోనని స్పష్టం చేసినట్లు సమాచారం. -
ఎంపీపీ స్థానం కాంగ్రెస్ వశమయ్యేనా?
మణికొండ, న్యూస్‌లైన్: రాజేంద్రనగర్ మండల పరిషత్‌ను తిరిగి దక్కించుకుని కాంగ్రెస్ పట్టునిలుపుకుంటుందా...? కాస్త దూరంలో ఉన్న అవకాశాన్ని సిట్టింగ్ ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్ తన రాజకీయ చతురత ప్రదర్శించి దక్కించుకుంటారా అనే విషయం మండల వ్యాప్తంగా చర్చానీయాంశమైంది. మండల పరిధిలో 22మంది ఎంపీటీసీలు ఉండగా అందులో 12మంది మద్దతు ఉన్నవారు ఎంపీపీగా ఎన్నికవుతారు. అయితే ప్రస్తుతం కాంగ్రెస్‌కు 10, టీడీపీకి బీజేపీతో కలసి 8మంది సభ్యుల బలం ఉంది. పుప్పాలగూడలో గెలిచిన ఇద్దరు స్వతంత్ర సభ్యులు కాంగ్రెస్‌కే మద్దతు ఇచ్చే అవకాశం ఉంది. దాంతో కాంగ్రెస్ ఎంపీపీ స్థానం కాంగ్రెస్ వశమయ్యే సూచనలే అధికం. కానీ ఇక్కడే ఓ చిన్న తిరకాసు.. కాంగ్రెస్ పార్టీ తరఫునే గెలుపొందిన నార్సింగ్‌కు చెందిన ఇద్దరు ఎంపీటీసీ సభ్యులు కాంగ్రెస్‌కు మద్దతు ఇచ్చే విషయంలో సందేహం వ్యక్తం చేస్తున్నట్టు సమాచారం. గత సర్పంచ్ ఎన్నికల్లో పార్టీ తరఫున పోటీ చేసిన నాయకుడి భార్యపైనే రెబల్ అభ్యర్థిని ఆ పార్టీ నేత జ్ఞానేశ్వర్ పోటీలోకి దించారని వారు ఆరోపిస్తున్నట్టు సమాచారం. దీంతో ఎంపీపీ ఎంపికలో కాంగ్రెస్‌కు తామెందుకు మద్దతు ఇవ్వాలనే వారు ప్రశ్నిస్తున్నట్టు సమాచారం. స్వతంత్రులు ఇద్దరు మద్దతు ఇచ్చినా.. కాంగ్రెస్ తరఫున గెలిచిన ఆ ఇద్దరు మద్దతు ఇవ్వకపోతే కాంగ్రెస్ బలం తిరిగి 10లోనే ఉండిపోతుంది. ఇక టీడీపీవారు ఇదే అదనుగా వారిద్దరిని తమవైపు తిప్పుకుంటే కనుక వారి బలం అపుడు 10కే చేరే అవకాశం ఉంటుంది. దీంతో అపుడు తిరిగి మండలంలో మిగిలిన హిమాయత్‌సాగర్, కిస్మత్‌పూర్‌లలో గెలుపొందిన స్వతంత్ర అభ్యర్థులు కీలకం కానున్నారు. వారిద్దరినీ తమవైపు తిప్పుకునేందుకు ఇరు పార్టీల నాయకులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్టు విశ్వసనీయ సమాచారం. అవసరమైతే అడిగినంతా ఇచ్చుకునైనా వారి మద్దతు కూడగట్టుకునేందుకు మంగళవారం రాత్రి నుంచే ప్రయత్నాలను ముమ్మురం చేసినట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. టీడీపీలో రాని క్లారిటీ మండల వ్యాప్తంగా టీడీపీ, కాంగ్రెస్ పార్టీ ఎంపీటీసీ బలాబలాలు అలా ఉండగా మరోవైపు టీడీపీలో ఎంపీపీ స్థానం ఏ వ్యక్తి కట్టబెట్టాలనే విషయంలో తర్జన భర్జన కొనసాగుతున్నట్టు సమాచారం. మొన్నటి వరకు ఖానాపూర్‌కు చెందిన మల్లేశ్ముదిరాజ్కు ఎంపీపీ స్థానమంటూ ప్రచారం చేయడంతో పాటు అతడి చేత ఎన్నికలలో ఖర్చుపెట్టించి తీరా ఇపుడు బండ్లగూడకు చెందిన ప్రేమ్కుమార్గౌడ్ను తెరపైకి తెచ్చినట్టు ఆపార్టీ నాయకులే వాపోతున్నారు. ఇంకోవైపు ఎంపీపీ స్థానం జనరల్‌కు ఉందని, గత ఎమ్మెల్యే ఎన్నికల్లో అభ్యర్థి గెలుపునకు తీవ్రంగా కృషి చేశానని, పార్టీలో సీనియర్‌నని, తనకు గ్రీన్‌సిగ్నల్ ఇస్తే ఎలాగైనా ఎంపీపీ స్థానాన్ని సాధిస్తానని మణికొండకు చెందిన కె.రామకృష్ణారెడ్డి పార్టీ నాయకులను కోరినట్టు సమాచారం. అవసరమైతే రెండున్నరేళ్లు తాను, మరో రెండున్నరేళ్లు పార్టీ లో మరెవరైనా ఎంపీపీగా కొనసాగవచ్చని, ఇది తనకు సమ్మతమేనని పేర్కొన్నట్టు తెలిసింది.