మణికొండ: మణికొండ పరిధిలోని పంచవటి కాలనీ, హరివిల్లు అపార్ట్‌మెంట్‌లో టీఆర్‌ఎస్ రాజేంద్రనగర్ అభ్యర్థి టి. ప్రకాశ్‌గౌడ్ ఆదివారం ఎన్నికల ప్రచారం చేశారు. పలువురు సినీ, టీవీ నటులను కలిసి కారు గుర్తుకు ఓటు వేయాలని ఆయన అభ్యర్థించారు. సినీ, బుల్లితెర నటుడు శివబాలాజీ ఇంటికి వెళ్లి తనకు మద్దతు ఇవ్వాలని కోరారు. ప్రకాశ్ గౌడ్ వెంట ఎంపీపీ తలారి మల్లేశ్, ఎంపీటీసీ సభ్యుడు కె.రామకృష్ణారెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ పి.చంద్రశేఖర్‌రెడ్డి తదితరులు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment