shiva balaji
-
నేను బట్టలు ఎలా ఐరన్ చేస్తానో తెలిస్తే నవ్వుతారు..!
-
యూట్యూబ్ కామెంట్స్ లో చాలా వార్నింగ్ లు వచ్చాయి: మధుమిత
-
శివ బాలాజీపై డౌట్ వచ్చి అప్పుడే దూరం పెట్టేశా: మధుమిత
టాలీవుడ్ క్యూట్ కపుల్స్‌లో శివ బాలాజీ, మధుమిత జంట ఒకరు. ఇంగ్లీష్ కారన్(2004) మూవీలో వీరిద్దరు కలిసి నటించారు. ఆ సమయంలోనే వీరిద్దరి మధ్య స్నేహం ఏర్పడింది. కొన్నాళ్ల తర్వాత అది కాస్త ప్రేమగా మారింది. 2009లో ఈ జంట పెద్దల సమక్షంలో వివాహం చేసుకుంది. అయితే తమ పెళ్లి అంత ఈజీగా జరగలేదని అంటోంది ఈ ప్రేమ జంట. అంతే కాకుండా శివనే మొదట తనకు ప్రపోజ్ చేశాడని తెలిపింది. (ఇది చదవండి: పెళ్లి చేసుకుంటే అమ్మ చనిపోంతుందని చెప్పారు: శివ బాలాజీ) ఇటీవల ఓ ఇంటర్వ్యూకు హాజరైన ఈ జంట పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. సినిమాలాగానే తమ పెళ్లిలో చాలా ట్విస్టులు ఉన్నాయని చెప్పుకొచ్చారు. ఈ జంట లైఫ్‌లో ఎదురైన అనుభవాలను అభిమానులతో పంచుకున్నారు. వీరిద్దరి మధ్య ప్రేమ ఎప్పుడు మొదలైందన్న విషయాన్ని మధుమిత వెల్లడించారు. మధుమిత మాట్లాడుతూ.. 'నేను ఇది మా అశోక్‌గాడి లవ్ స్టోరీలో మొదటిసారి శివను చూసినప్పుడే ఈ అబ్బాయి బాగున్నాడనిపించింది. ఇంగ్లిష్ కరన్’ సమయంలో దర్శకుడు పరిచయం చేయగా.. నేనే అతన్ని పలకరించాను. ఆ తర్వాత చాలాసార్లు నాకు హెల్ప్ చేసే సరికి మంచి వాడనే ఫీలింగ్ కలిగింది. మొదట్లో నేను హాయ్ అంటే హాయ్ అనేవాడు. తను కూడా నన్ను చాలా గమనించేవాడు. నేను ఒకసారి లిప్‌స్టిక్ వేసుకున్న తర్వాత తుడుచుకున్న టిష్యూ తీసుకుని దాచుకున్నాడు. అలాంటి పనులు చేస్తూ నాకు కనిపించాలని ప్రయత్నించేవాడు. ఒకసారి నేను చెన్నై వెళ్లగానే మిస్ అవుతున్నట్లు మెసేజ్ పెట్టాడు. అది చూసి నాకు సందేహం వచ్చి దూరం పెట్టడం మొదలుపెట్టా. కానీ ఆ తర్వాత కూడా నాకు దగ్గరయ్యేందుకు చాలా ట్రై చేశారు. ఒకరోజు ఏకంగా పెళ్లి చేసుకుందామా అని అడిగేశాడు. ' అంటూ చెప్పుకొచ్చింది. (ఇది చదవండి: భీమిలీ కబడ్డీ జట్టు హీరోయిన్ గుర్తుందా?.. ఇప్పుడేం చేస్తోందో తెలుసా!) -
ఇంట్రెస్టింగ్గా ‘కళ్యాణమస్తు’ ట్రైలర్
శేఖర్ అయాన్ వర్మ, వైభవి రావ్ జంటగా రూపొందుతున్న చిత్రం ‘కళ్యాణమస్తు’. ఒ.సాయి దర్శకుడు. బోయపాటి రఘుబాబు నిర్మాత. మే 12న చిత్రం విడుదల కానుంది. తాజాగా ఈ చిత్రం ట్రైలర్ ను శివబాలాజీ లాంచ్ చేసారు. అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించేలా ఈ చిత్ర ట్రైలర్‌ని కట్ చేశారు. ట్రైలర్ మొదటి నుంచి చివరవరకు ఆసక్తికరంగా ఉంది. మంచి విజువల్స్ తో, క్యూట్ లవ్ స్టొరీతో కమర్షియల్ ఎలిమెంట్స్ కూడా ఉన్నాయి. (చదవండి: బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోన్న పీఎస్-2.. రెండు రోజుల్లో వందకోట్లు!) ఈ సినిమా నుంచి ఇప్పటి వరకు రిలీజ్ అయిన ప్రతి కంటెంట్ ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. అందరికి నచ్చేలా సినిమా ఉంటుంది’అని దర్శకుడు ఒ.సాయి అన్నారు. ‘కంటెంట్ వైస్ సినిమా చాలా బాగుంది. ఆ కంటెంట్ లో నేనూ ఒక పాత్రని పోషించాను’అని కాశీ విశ్వనాద్ అన్నారు. ‘ఈరోజుల్లో చిన్న సినిమాని థియేటర్ వరకు తీసుకుని రావడం చాలా కష్టం అయిపొయింది. అలాంటిది మేము ఈ సినిమాని థియేటర్ వరకు తీసుకుని వచ్చాము. కచ్చితంగా అందరూ చూసి ఆదరించాలి’అని హీరో శేఖర్ వర్మ అన్నారు. -
ఇప్పుడు అమెజాన్ ప్రైమ్‌లో సిందూరం సినిమా
శివ బాలాజీ, ధర్మ, బ్రిగిడా సాగ ప్రధాన తారాగణంగా శ్యామ్ తుమ్మలపల్లి దర్శకత్వంలో రూపొందిన చిత్రం సిందూరం. ఈ ఏడాది జనవరి 26న థియేటర్స్ లో విడుదలై విమర్శకుల ప్రశంశలతో పాటు జనాధారణ పొందిన సిందూరం సినిమా ఇప్పుడు అమెజాన్ ప్రైమ్‌లో విడుదల అయ్యింది. థియేటర్స్‌లో సినిమాను మిస్ అయినవాళ్లు ఇప్పుడు ఓటీటీలో చూడొచ్చు. నక్సల్స్ పాయింట్‌తో ఉద్యమం నేపథ్యంలో చాలా సినిమాలు వచ్చాయి. హిస్టరీలో జరిగిన కొన్ని రియాలిటీ సన్నివేశాలను సిందూరం సినిమాలో చూపించారు. ఉద్యమ నేపథ్యం, రాజకీయం, ప్రేమకథ ఇందులో ఉంటాయి. ఓవర్ఆల్ గా ఇది నక్సల్ ఇన్ఫార్మర్ కథగా సిందూరం సినిమాను తెరకెక్కించారు. దీనిని ఒక హై ఇంటెన్స్ సినిమాగా చెప్పుకోవచ్చు. -
భర్త శివ బాలాజీతో మధుమిత మాస్ డాన్స్, వీడియో వైరల్
టాలీవుడ్ క్యూట్ కపుల్లో నటుడు శివ బాలాజీ, మధుమిత జంట ఒకటి. హీరోహీరోయిన్లుగా నటించిన వీరిద్దరు ఆ తర్వాత ప్రేమ పెళ్లి చేసుకున్నారు. 2004లో వచ్చిన తమిళ చిత్రం ‘ఇంగ్లీస్ కారన్’ షూటింగ్లో వీరిద్దరికి పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారి కొంతకాలం పాటు డేటింగ్ చేశారు. అనంతరం పెద్ద అంగీకారంతో 2009లో వీరిద్దరు పెళ్లి చేసుకున్నారు. ఇక వివాహం అనంతరం నటకు గుడ్‌బై చెప్పిన మధుమిత ప్రస్తుతం గృహిణిగా పిల్లలు బాధ్యత, ఇంటి వ్యవహారాలను చూసుకుంటుంది. మరోవైపు సోషల్ మీడియాలోనూ ఫుల్ యాక్టివ్‌గా ఉంటుంది. చదవండి: ‘కట్టప్ప’ సత్యరాజ్ కూతురు గురించి ఈ ఆసక్తిక విషయాలు తెలుసా? తరచూ తన వ్యక్తిగత విషయాలను, ఫ్యామిలీ వెకేషన్ ఫొటోలను ఎప్పటికప్పుడు షేర్ చేస్తుంది. ఈ నేపథ్యంలో తాజాగా భర్త శివ బాలాజీతో కలిసి డాన్స్ చేసిన వీడియో షేర్ చేసింది. పుష్పలో సమంత నటించిన ‘ఊ అంటవా మావ ఊఊ అంటావా’ ఐటెం సాంగ్‌కు భర్తతో కలిసి స్టెప్పులేసింది. ఈ వీడియోకు నెటిజన్లంతా ఫిదా అవుతున్నారు. ఆమె ఇచ్చిన క్యూట్ క్యూట్ ఎక్స్ప్రెషన్స్, స్టెప్స్‌కి ఫ్యాన్స్ సర్ప్రైజ్ అవుతున్నారు. చాలా రోజులు తర్వాత మధుమితను ఇలా కొత్తగా చూస్తున్నామంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం శివ బాలాజీ-మధుమితల ఈ డాన్స్ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. View this post on Instagram A post shared by Madhumitha (@madhumithasivabalaji) -
Sindhooram Reviw: ‘సిందూరం’ మూవీ రివ్యూ
టైటిల్: సిందూరం నటీనటులు: శివ బాలాజీ, ధర్మ, బ్రిగిడ సాగ తదిరులు నిర్మాణ సంస్థ: శ్రీ లక్ష్మీ నరసింహ మూవీ మేకర్స్ నిర్మాత: ప్రవీణ్ రెడ్డి జంగా దర్శకుడు: శ్యామ్ తుమ్మలపల్లి సంగీతం: గౌవ్రా హరి సినిమాటోగ్రఫీ: కేశవ్ ఎడిటర్: జస్విన్ ప్రభు విడుదల తేది: జనవరి 26, 2023 కథేంటంటే.. ఈ సినిమా కథంతా 2023 ప్రాంతంలో సాగుతుంది. ఖమ్మం జిల్లా పినపాకకు చెందిన రవి (ధర్మ), శిరీష (బ్రిడిగా సాగా) కాలేజీలో మంచి స్నేహితులు. చదువు పూర్తయ్యాక శిరీష ఎమ్మార్వో ఉద్యోగం సాధించి సొంత ఊరికి వెళ్తుంది. ధర్మ బాడ్మింటన్‌లో జాతీయ స్థాయిలో రాణించాలని కలలు కంటాడు. అయితే కారణం చేత ధర్మ బాడ్మింటన్‌కి దూరమై నక్సలైట్ సానుభూతిపరుడిగా మారతాడు. శిరీష ఎమ్మార్వో ఉద్యోగం వదిలేసి సొంత ఊరు శ్రీరామగిరి జెడ్పీటీసీగా పోటీ చేస్తుంది. దీంతో శిరీషను అదే ప్రాంతంలోని సింగన్న (శివబాలాజీ) దళం టార్గెట్ చేస్తుంది. అసలు శిరీష ఎందుకు రాజకీయాల్లోకి రావాల్సి వచ్చింది? ఆమెను సింగన్న దళం ఎందుకు టార్గెట్ చేసింది? బాడ్మింటన్ కావాలనుకున్న ధర్మ ఎందుకు నక్సల్స్‌తో చేతులు కలిపాడు? శిరీష అన్న, రాజకీయ నేత ఈశ్వరయ్య(రవి వర్మ)ను చంపింది ఎవరు? పోలీసులకు, నక్సల్స్ మధ్య జరిగిన పోరులో ఎవరు బలైయ్యారు? చివరకు రవి తీసుకున్న నిర్ణయం ఏంటి? అనేదే మిగతా కథ. ఎవరెలా చేశారంటే.. ఈ సినిమాకు ప్రధాన బలం బ్రిగిడ సాగా పోషించిన పాత్ర. శిరీషగా అద్భుతమైన ఫెర్ఫార్మెన్స్ ప్రదర్శించి అందరిని ఆకట్టుకుంది. అలాగే రవి పాత్రలో ధర్మ ఒదిగిపోయాడు. తొలి చిత్రమే అయినా చక్కగా నటించాడు. చాలా బరువైన పాత్ర తనది. క్లైమాక్స్‌లో ఆయన చెప్పే డైలాగ్స్ ఆకట్టుకుంటాయి. శివ బాలాజీ ఈ చిత్రంలో కొత్తగా కనిపిస్తాడు. ఈశ్వరయ్య పాత్ర కూడా ఆకట్టుకుంటుంది. చిరంజీవి అభిమానిగా జోష్ రవి నవ్వించే ప్రయత్నం చేశాడు. అలా సినిమాలోని పాత్రలన్నీ తమ పరిధి మేరకు నటించాయి. ఎలా ఉందంటే... నక్సల్స్ పాయింట్ తో ఉద్యమం నేపథ్యంలో చాలా సినిమాలు వచ్చాయి. సిందూరం కూడా ఆ తరహా చిత్రమే. 90 దశకంలో తెలంగాణ ప్రాంతంలో జరిగిన పలు సంఘటనలు, వాస్తవ సంఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు దర్శకుడు శ్యామ్ తుమ్మలపల్లి. ఉద్యమ నేపథ్యం, రాజకీయం, ప్రేమకథ ఇందులో ఉంటాయి. నక్సల్స్, పోలీసుల మధ్య నలిగిపోయిన ప్రజల జీవితాలు, రైతుల వ్యధలను తెరపై కళ్లకు కట్టినట్లు చూపించారు. ఈ విషయంలో దర్శకుడిని అభినందించాల్సిందే. కానీ ఈ సినిమాలో ఎమోషనల్ టచ్ మిస్ అయిందనే ఫీలింగ్ కలుగుతుంది. కొన్ని సన్నివేశాలు ఎర్రజెండా ప్రేమికులకు ఇబ్బందిగా ఉంటాయి. పస్టాఫ్ కాస్త స్లోగా సాగుతుంది. కానీ సెకండాఫ్ మెప్పిస్తుంది. చివర్లో వచ్చే ట్విస్టులు ప్రేక్షకులను ఆశ్చర్యానికి గురి చేస్తాయి. పాటలు వినసొంపుగా ఉంటాయి. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లుగా ఉన్నాయి. -
Sindhooram: ఆకట్టుకుంటున్న ‘ఓ మాదిరిగా సాగే నా జీవితం..’ సాంగ్
శివ బాలాజీ, ధర్మ , బ్రిగిడ సాగ(పవి టీచర్) ప్రధాన పాత్రల్లో నటించిన తాజా చిత్రం సిందూరం. ఇటీవల ఈ సినిమా నుంచి విడుదలైన మొదటి పాట (ఆనందమో..అవేశమో)కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. తాజాగా ఈ చిత్రం నుంచి రెండో పాటను విడుదల చేశారు మేకర్స్. "ఓ మాదిరిగా" అంటూ సాగే ఈ పాటను సక్సెస్ఫుల్ డైరెక్టర్ పరుశురాం గారు రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాట చాలా బాగుంది అని, హరి సంగీతం ఫ్రెష్ ఫీల్ ఇచ్చిందని, సత్య ప్రకాష్, హరిణి చాలా బాగా పాడారని, బాలాజీ గారి సాహిత్యం బాగుందని, లీడ్ పెయిర్ బాగా యాక్ట్ చేశారని కొనియాడారు. మొదటి పాటకు వచ్చినట్టే ఈ పాటకు కూడా మంచి రెస్పాన్స్ వస్తుందనే నమ్మకం తమకుందని డైరెక్టర్ శ్యామ్ తుమ్మలపల్లి, ప్రొడ్యూసర్ ప్రవీణ్ రెడ్డి జంగా అన్నారు. శ్యామ్ తుమ్మలపల్లి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీ లక్ష్మి నరసింహ మూవీ మేకర్స్ బ్యానర్ పై ప్రవీణ్ రెడ్డి జంగా నిర్మిస్తున్నారు. -
సిరి ఎలిమినేషన్‌తో సంబరపడ్డాం, కానీ మళ్లీ వచ్చింది: శ్రీరామ్
Bigg Boss Telugu 5 Promo, Ex Bigg Boss Housmates Fun: చప్పగా సాగుతున్నషోలో కొంత ఎనర్జీ నింపడానికి మాజీ కంటెస్టెంట్లను రంగంలోకి దించాడు బిగ్‌బాస్. ఈ క్రమంలో శివబాలాజీ, హరితేజ, అఖిల్ సార్థక్, రాహుల్ సిప్లిగంజ్, శివజ్యోతి, రోల్ రైడా, అరియానా, గీతా మాధురి హౌస్‌మేట్స్‌తో మాట్లాడారు. కాకపోతే గతేడాదిలాగే ఈసారి కూడా కరోనాను దృష్టిలో పెట్టుకుని ప్రత్యక్షంగా కాకుండా ఓ రూమ్‌లో నుంచి సంభాషించారు. ఈ అతిథులు ఫైనలిస్టుల్లో మరింత ఎనర్జీ నింపగా హరితేజ మాత్రం వారిని రోస్ట్ చేస్తూ నవ్వించింది. ఇక రాహుల్ సిరికోసం పాట పాడి ఆకట్టుకున్నాడు. అంతేకాదు హౌస్‌మేట్స్‌తో గేమ్స్ కూడా ఆడించినట్లు కనిపిస్తోంది. సిరి, షణ్ను కలిసి డ్యాన్స్ చేస్తుంటే మానస్, సన్నీ, శ్రీరామ్ మాత్రం వాళ్లకు వాళ్లే స్టెప్పులేసుకున్నారు. వీరిని చూసి జాలిపడ్డ హరితేజ మీకు చప్పట్లు కొట్టడానికి కూడా ఎవరూ లేరే అని సెటైర్లు వేసింది. మా బాధ అర్థం చేసుకుని బిగ్‌బాస్ సర్ప్రైజ్ ఎలిమినేషన్ అంటూ సిరిని పంపించేస్తే మేమంతా సంబరపడ్డాం. కానీ అంతలోనే కన్ఫెషన్ రూమ్ నుంచి షణ్నూ అంటూ పరిగెత్తుకొచ్చింది అని సరదాగా జోక్ చేశాడు. అయితే అతడి ఇన్నర్ ఫీలింగ్ కూడా అదేకానీ పైకి మాత్రం జోక్ చేసినట్లు చెబుతూ కవర్ చేశాడంటూ కామెంట్లు చేస్తున్నారు నెటిజన్లు. ఏదేమైనా మొత్తానికి మానస్, సన్నీ, శ్రీరామ్ ఒకే దగ్గర కలిసి ఉంటుంటే చూడటానికి రెండు కళ్లు చాలడం లేదంటున్నారు ఫ్యాన్స్! -
శివబాలాజీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన మధుమిత
-
శివబాలాజీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన మధుమిత
టాలీవుడ్ క్యుటెస్ట్ కపుల్స్‌లో శివ బాలాజీ, మధుమిత జంట ఒకటి. ఇద్దరూ సహా నటీనటులుగా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చారు. సినిమాల్లో నటిస్తున్న క్రమంలో పరిచయం ఏర్పడి వీరిద్దరి మధ్య కొంతకాలానికి ప్రేమ చిగురించింది. ఆ తర్వాత పెద్దలను ఒప్పించి పెళ్లిపీటలు ఎక్కి వైవాహిక బంధంలోకి అడుగు పెట్టారు. 2009 మార్చీలో 1న పెద్దల సమక్షంలో ప్రేమ వివాహం చేసుకున్నారు. అప్పటి నుంచి ఎంతో అన్యోన్యంగా ఉంటు పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు. ఎక్కడికి వెళ్లిన ఇద్దరూ మ్యాచింగ్ దుస్తులు ధరించిన మ్యారీడ్ దోస్తుల్లా ఆకట్టుకుంటారు. ఈ నేపథ్యంలో దీపావళి పండగ సందర్భంగా ఈ ‘బ్రైట్ కపుల్’ సాక్షితో టీవీ పంచుకున్న ముచ్చట్లివి.. శివబాలాజీ: నాకు కోపం ఎక్కువని మధు నన్ను పెళ్లి చేసుకోవడం వాళ్లింట్లో ఇష్టం లేదు. అయితే ఇప్పుడు అర్థం చేసుకున్నారు. మధుమిత: పెళ్లికి ముందు కొన్నేళ్ల పాటు ప్రేమించుకున్నా కూడా పెళ్లయిన కొత్తలో ప్రతీ చిన్న విషయానికీ గొడవ పడేవాళ్లం. అయితే ఆ తర్వాత ఎలా ఉండాలో తెలుసుకున్నాం. శివబాలాజీ: తను పప్పుచారు నుంచి పాయా దాకా అన్నీ అద్భుతంగా వండుతుంది. మధుమిత: ఇంటర్లో అన్నయ్య నుంచి వంటలు నేర్చుకున్నాను. నా దగ్గర నుంచీ తనకు నచ్చినవన్నీ తను (శివ) కూడా నేర్చుకున్నారు. శివబాలాజీ: పెళ్లయ్యాక సినిమాలు మానేయాలని మధు ఫ్యామిలీ డిసైడ్ అయింది. అయితే ఆలోచించమని నచ్చజెప్పా. అప్పుడు ఓకే అన్నప్పటికీ పెళ్లి తర్వాత పాత్రల విషయంలో పర్టిక్యులర్ అయిపోయింది. మధుమిత: కరోనా టైమ్‌లో 3 నెలల పాటు ఫార్మ్‌లో గడిపేశాం. శివబాలాజీ: నాకు చిన్నప్పటి నుంచీ వ్యవసాయం, నీళ్ల మధ్యలో ఇల్లు అంటే ఇష్టం. మధు వాళ్ల ఫ్యామిలీకి కూడా అదే హాబీ. మధుమిత: అందరూ సేఫ్‌గా పండగ చేసుకోవాలని కోరుకుంటున్నాం. -
శివబాలాజీ భార్యపై మోహన్ బాబు సీరియస్
Mohan Babu Serious On Shiva Balaji Wife Madhumitha : మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్(మా) అధ్యక్షుడిగా మంచు విష్ణు ప్రమాణ స్వీకారం చేశారు. ఫిలింనగర్ కల్చరల్ సెంటర్లో జరిగిన ఈ కార్యక్రమంలో సీనియర్ నటుడు మోహన్‌బాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నటుడు శివబాలాజీ భార్య మధుమితపై సీరియస్ అయ్యారు. స్పీచ్ మధ్యలో వెనుక నుంచి మాట్లాడవద్దంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్‌మీడియాలో చక్కర్లు కొడుతుంది. చదవండి: MAA Elections 2021: చేయి కొరకడంపై శివబాలాజీ భార్య సీరియస్ 'నా జీవితం తెరిచిన పుస్తకం. నా పుస్తకంలో విలన్‌గా చెయ్యాలని అనుకున్నాను. విలన్, క్యారెక్టర్ ఆర్టిస్ట్, హీరోగా చేశాను. మనమంతా ఒకే తల్లి బిడ్డలం. మనుషుల్లో టాలెంట్ ఉంటే అవకాశాలు వస్తాయి. కేవలం టాలెంట్‌తోనే ఇక్కడ కొనసాగుతారు. ఇది రాజకీయ వేదిక కాదు. పాలిటిక్స్‌లో కంటే ఇక్కడే ఎక్కువ జరుగుతున్నాయి. ఇలాంటివి కూడా ఉంటాయా? అని ఆశ్చర్యపోయాను' అని మోహన్ బాబు పేర్కొన్నారు. అయితే స్పీచ్ మధ్యలో శివబాలాజీ భార్య మధుమితపై సీరియస్ అయ్యారు. పెద్దలు స్పీచ్ ఇస్తుంటే వెనుక నుంచి గుసగుసలు, సైగలు చేయడం తనకు నచ్చదని కోప్పడ్డారు. ఇలా చేస్తే మాట్లాడాలనుకున్న కొన్ని ముఖ్యమైన విషయాలకు బ్రేకులు పడతాయంటూ సున్నితంగా హెచ్చరించారు. చదవండి: ఇలాంటివి కూడా ఉంటాయా అని ఆశ్చర్యపోయాను: మోహన్‌బాబు ప్రకాశ్‌రాజ్ ప్యానెల్ రాజీనామాలపై స్పందించిన మంచు విష్ణు -
చేయి కొరకడంపై శివబాలాజీ భార్య సీరియస్
MAA Elections 2021 : మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్(మా) ఎన్నికల్లో ప్రకాశ్ రాజ్‌పై మంచు విష్ణు ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. అయితే నిన్న జరిగిన ఎన్నికల పోలింగ్ కేంద్రం వద్ద శివ బాలాజీ చేయిని సినీ నటి హేమ కొరకడం చర్చకు దారి తీసింది. పోలింగ్ కేంద్రం వద్ద తాను వెళ్తున్న సమయంలో శివబాలాజీ చేయి అడ్డుగా పెట్టాడని, తప్పుకోమంటే తప్పుకోలేదని, అందుకే చేయి కొరకాల్సి వచ్చిందని హేమ క్లారిటీ ఇచ్చింది. తాజాగా ఈ ఘటనపై శివబాలాజీ భార్య మధుమిత స్పందించింది. చదవండి: టీటీ ఇంజెక్షన్ వేయించుకున్న శివబాలాజీ ఆమె మాట్లాడుతూ.. ఇలాంటి పనులు మనుషులు మాత్రం చేయరు. ఇంతకన్నా ఇంకేమీ చెప్పలేను అని ఘాటుగా బదుల్చిచ్చింది. ఇక తన భర్త శివబాలాజీ గెలవడంపై హర్షం వ్యక్తం చేసింది. నిస్వార్థంగా సేవ చేసినప్పుడు దానికి ప్రతిఫలం దక్కుతుందని తాను నమ్ముతానని బదులిచ్చింది. చదవండి: MAA Elections 2021 Results: 'మంచు'కే మా అధ్యక్ష పదవి -
టీటీ ఇంజెక్షన్ వేయించుకున్న శివబాలాజీ
MAA Elections 2021: నటుడు శివ బాలాజీ నిమ్స్ హాస్పిటల్లో చికిత్స చేయించుకున్నారు. పోలింగ్ కేంద్రం వద్ద ఇరు వర్గాల మధ్య చోటుచేసుకున్న ఉద్రిక్తతల నేపథ్యంలో నటి హేమ శివబాలాజీ చేయిని కొరికిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నిమ్స్ హాస్పిటల్లో శివ బాలాజీ టీటీ ఇంజెక్షన్ వేయించుకున్నారు. ముందు జాగ్రత్తగా ఇంజెక్షన్ తీసుకున్నట్లు తెలిపారు. చదవండి: MAA Elections 2021: శివబాలాజీని కొరికిన హేమ! అయితే హేమ ఎందుకు కొరికిందో తనకు అర్థం కావడం లేదని, ఈ విషయం చెప్పుకోవడానికి తనకే చాలా ఇబ్బందిగా ఉందని పేర్కొన్నారు. టీటీ ఇంజెక్షన్ చేయించుకున్న అనంతరం నరేశ్‌తో కలిసి శివబాలాజీ పోలింగ్ కేంద్రానికి చేరుకున్నారు. చదవండి: అందుకే శివబాలాజీ చేయి కొరికా: హేమ -
MAA Elections 2021: శివబాలాజీ, సమీర్ మధ్య తీవ్ర ఘర్షణ
మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నిక పోలింగ్ లో ఊహించిన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. పోలింగ్ ప్రారంభమైన ఒక గంట మాత్రమే ప్రశాంతంగా సాగిన ఎన్నికలు.. ఆ తర్వాత పూర్తిగా గందరగోళంగా మారిపోయాయి. ఇరు ప్యానళ్ల సభ్యులు ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు చేసుకుంటున్నారు. పోలింగ్ కేంద్రం లోపల ప్రకాశ్ రాజ్ ప్యానల్ ప్రచారం చేస్తున్నారంటూ.. మంచు మోహన్‌బాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు శివబాలాజీ చేయిని హేమ కొరకడం గమనార్హం. ఇదిలా ఉంటే.. పోలింగ్ కేంద్రం వద్ద సమీర్, శివబాలాజీ సైతం ఘర్షణకు దిగారు. సమీర్ పోలింగ్ కేంద్రంలో ప్రచారం చేస్తున్నాడు అంటూ శివబాలాజీ ఆరోపించాడు. సమీర్ సైతం అతనిపై విరుచుకుపడ్డాడు. ఇద్దరికీ ఇరు వర్గాల సభ్యులు సర్ది చెప్పారు. ప్రస్తుతం ‘మా’ పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతుంది. మధ్నాహ్నం 12 గంటల వరకు 380 ఓట్లు పోలైయ్యాయి. ఆగ్రహీరోలు చిరంజీవి, నాగార్జున, బాలకృష్ణ, రామ్ చరణ్ తమ తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఆదివారం మధ్యాహ్నం 2 గంటల వరకు ఈ పోలింగ్ కొనసాగుతుంది. మొత్తం 925 మంది ‘మా’ సభ్యులుగా ఉండగా.. అందులో 883 మందికి ఓటు హక్కు ఉంది. -
అందుకే శివబాలాజీ చేయి కొరికా: హేమ
మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్(మా) ఎన్నికల పోలింగ్ కేంద్రం వద్ద శివబాలాజీ చేయి కొరకడంపై నటి హేమ క్లారిటీ ఇచ్చింది. తాను వెళ్తున్న క్రమంలో శివబాలాజీ చేయి అడ్డుగా పెట్టాడని, తప్పుకోమంటే తప్పుకోలేదని, అందుకే చేయి కొరకాల్సి వచ్చిందని హేమ చెప్పుకొచ్చారు. దాని వెనక తనకు ఎలాంటి దురుద్దేశం లేదన్నారు. ప్రస్తుతం పోలింగ్ చాలా ప్రశాంతంగా కొనసాగుతున్నాయని తెలిపారు. మరోవైపు శివబాలాజీ కూడా హేమ చేయి కొరకడాన్ని తెలిగ్గా తీసుకున్నాడు. అనుకోకుండా అలా జరిగిపోయిందన్నారు. తనకు బెనర్జీకి ఎలాంటి గొడవ జరగలేదని, పోలింగ్ కేంద్రం వద్ద ప్రచారం చేస్తున్న వ్యక్తిని పట్టుకోబోతున్న క్రమంలో వాగ్వాదం జరిగిన మాట వాస్తవమనేనని శివబాలాజీ చెప్పారు. -
MAA Elections 2021: శివబాలాజీని కొరికిన హేమ!
మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికల పోలింగ్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. ప్రకాశ్‌రాజ్ ఫ్యానల్ మెంబర్స్‌పై మంచు విష్ణు ప్యానల్ మెంబర్స్ అభ్యంతరం వ్యక్తం చేశారు. కేంద్రం లోపల ప్రచారం చేస్తున్నారంటూ ఆరోపించారు. ఈ సందర్భంగా ఇరు వర్గాల మధ్య తోపులాట చోటు చేసుకుంది. కాగా, పోలింగ్ కేంద్రం వద్ద జరిగిన గొడవపై నటుడు నరేశ్ స్పందించారు. ‘పెద్ద గొడవలేవి జరగలేదు. ఎవరో ఒకరు ప్రకాశ్ రాజ్ బ్యాడ్జ్ వేసుకొని రిగ్గింగ్ చేయడానికి ప్రయత్నిస్తే.. ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేశాం. నేను, ప్రకాశ్ రాజ్ కౌగిలించుకున్నాం. ‘నో ఫైటింగ్.. ఓన్లీ ఓటింగ్’అని చెప్పుకున్నాం. శివబాలాజీని నటి హేమ కొరికిందని నరేశ్ ఆ గాయాన్ని మీడియాకు చూపించారు. -
స్కూల్ ఫీజులు.. మధుమిత కంటతడి
సాక్షి, హైదరాబాద్ : కరోనా వైరస్ కాలంలోనూ ఆన్లైన్ క్లాసుల పేరుతో ప్రైవేటు పాఠశాలలు దోచుకుంటున్నాయని ప్రముఖ నటుడు శివ బాలాజీ మరోసారి గళమెత్తారు. కార్పొరేట్ స్కూళ్ల దోపిడీపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. కరోనాతో ప్రజలంతా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న తరుణంలో పాఠశాల యాజమాన్యాలు ప్రజలను అనేక ఇబ్బందులకు గురిచేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు శుక్రవారం హైదరాబాద్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో శివబాలాజీ మాట్లాడారు. లాక్డౌన్ కారణంగా ఎంతోమంది ఉద్యోగాలను కోల్పోయారని, ఇలాంటి విపత్కరణమైన పరిస్థితుల్లో స్కూళ్ల ఫీజులు కట్టాలని ఒత్తిడి పెట్టడం సరైనది కాదని అభిప్రాయపడ్డారు. ఫీజులు కట్టకపోతే ఆన్లైన్ క్లాసుల ఐడీలు తొలగిస్తున్నారని, వ్యక్తిగతంగా ఈ మెయిల్స్ పెట్టి ఇబ్బందులకు గురిచేస్తున్నారని బాలాజీ వాపోయారు. నగరంలోని మౌంట్ లితేరా స్కూలు నుంచి తొలుత ఇలాంటి ఒత్తిళ్లు ప్రారంభం అయ్యాయని, ఆ తరువాత అనేక స్కూళ్లలో కూడా ఇదే పరిస్థితి మొదలైదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రైవేటు పాఠశాలలన్నీ సిండికేట్ అయ్యాయని ఆరోపించారు. ప్రతి ఒక్క పేరెంట్ ఇలాంటి ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని, తన పోరాటానికి వారంతా సపోర్టు చేయాలని కోరారు. మధుమిత కన్నీంటి పర్యంతం.. ‘ముఖ్యమంత్రి మీద గౌరవంగా అడుగుతున్నాం. మౌంట్ లిటేరా స్కూళ్లు ఫీజులతో అనేక రకాలుగా ఇబ్బందులు పెడుతున్నాయి. ట్యూషన్ ఫీజ్ మాత్రమే చెల్లించాలని మీరు చెప్పిన స్కూళ్లు ఇతరత్రా ఫీజులతో క్షోభకు గురిచేస్తున్నాయి. మేము ఇప్పటికే 35 శాతం ఫీజులు చెల్లించాం. ఫీజు కట్టలేదని పరీక్షలు రాయనివ్వటం లేదు. విద్యార్థుల తల్లిదండ్రుల బాధ అర్థం చేసుకొని ఈ సమస్యను పరిష్కరించాలి’ అని మధుమిత కోరారు. కాగా నగరంలోని మౌంట్ లిటేరా యాజమాన్యంపై శివ బాలాజీ చేసిన ఫిర్యాదుపై మానవ హక్కుల సంఘం(హెచ్ఆర్సీ) ఇదివరకే స్పందించిన విషయం తెలిసిందే. మౌంట్ లిటేరా స్కూల్‌పై చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించింది. సమగ్ర విచారణ చేసి రెండు వారాల్లో నివేదిక ఇవ్వాలని రంగారెడ్డి జిల్లా డీఈఓకి నోటీసులు జారీ చేసింది. కాగా, మణికొండలోని మౌంట్ లిటేరా జీ స్కూల్ యాజమాన్యం ఫీజుల పేరుతో తల్లిదండ్రులను వేధింపులకు గురి చేస్తోందని శివ బాలాజీ హెచ్ఆర్సీని ఆశ్రయించిన సంగతి తెలిసిందే. స్కూల్ ఫీజులు తగ్గించుకోమన్నందుకు ఆన్లైన్ తరగతుల నుంచి తమ పిల్లలను తొలగించారని ఆయన తన పిటిషన్లో పేర్కొన్నారు. -
శివ బాలాజీ ఫిర్యాదుపై హెచ్ఆర్సీ స్పందన
సాక్షి, హైదరాబాద్ : నగరంలోని ఓ ప్రైవేట్ స్కూల్ యాజమాన్యంపై సినీ నటుడు శివ బాలాజీ చేసిన ఫిర్యాదుపై మానవ హక్కుల సంఘం(హెచ్ఆర్సీ) బుధవారం స్పందించింది. మౌంట్ లిటేరా జీ స్కూల్‌పై చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించింది. సమగ్ర విచారణ చేసి రెండు వారాల్లో నివేదిక ఇవ్వాలని రంగారెడ్డి జిల్లా డీఈఓకి నోటీసులు జారీ చేసింది. కాగా, మణికొండలోని మౌంట్ లిటేరా జీ స్కూల్ యాజమాన్యం ఫీజుల పేరుతో తల్లిదండ్రులను వేధింపులకు గురి చేస్తోందని శివ బాలాజీ హెచ్ఆర్సీని ఆశ్రయించిన సంగతి తెలిసిందే. స్కూల్ ఫీజులు తగ్గించుకోమన్నందుకు ఆన్లైన్ తరగతుల నుంచి తమ పిల్లలను తొలగించారని ఆయన తన పిటిషన్లో పేర్కొన్నారు. -
బిగ్‌బాస్ టైటిల్ గెలిచినా భవిష్యత్తు అంధకారమే!
వరల్డ్ బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్‌బాస్.. పేరు ఘనం ఫలితం శూన్యం అన్న చందంగా తయారైంది. ఈ షోలో పాల్గొనే కంటెస్టెంట్ల ఎంపిక కోసం బిగ్‌బాస్ యాజమాన్యం తీవ్ర కసరత్తులే చేస్తుంది. జనాల్లో కొద్దో గొప్పో పేరు సంపాదించుకున్న వారినే షోకు ఎంపిక చేసుకుంటుంది. బిగ్‌బాస్ హౌస్‌లో నియమనిబంధనలను అతిక్రమించకుండా, వందరోజులు హౌస్‌లోనే ఉండేలా బాండ్ రాయించుకుంటుంది. అయితే.. షో తర్వాత ఎన్నో అవకాశాలు వస్తాయని భావించిన కంటెస్టెంట్ల గంపెడాశలపై బిగ్‌బాస్ నీళ్లు చల్లుతుందని నెటిజన్లు విమర్శిస్తున్నారు. షో నిర్వహించే వారికి మంచి టీఆర్పీ రేటింగ్‌తో భారీగానే గిట్టుబాటు అవుతుంది.. కానీ అందులో పాల్గొన్నవారికి మాత్రం అంతకుమునుపు ఉన్న పేరు కూడా ఊడిపోతుందని పలువురు కామెంట్ చేస్తున్నారు. ఆ హడావుడి ఏమైంది? అప్పుడప్పుడే వెలుగులోకి వస్తున్న తారలు.. బిగ్‌బాస్ షో తర్వాత చేతిలో ఏ ప్రాజెక్టు లేక ఈగలు తోలుకుంటున్నారు. జనాలు వారి పేర్లను కూడా మర్చిపోతున్నారంటే వారి పరిస్థితేంటో అర్థం చేసుకోవచ్చు. బిగ్‌బాస్ 1 విజేతగా నిలిచిన శివబాలాజీ రూ.50 లక్షల ప్రైజ్‌మనీ గెలుచుకున్నాడు. బిగ్‌బాస్ కిరీటం గెలిచాడన్న మాటే గానీ అది అతని జీవితానికి ఎంతమాత్రం ఉపయోగపడలేదు. అంతకుముందు చకచకా సినిమాలు చేసుకుంటూ పోయిన శివబాలాజీ బిగ్‌బాస్ తర్వాత అడపాదడపా సినిమాల్లో మాత్రమే కనిపించాడు. అంతదాకా ఎందుకు? అందులో పాల్గొన్న చాలా మంది కంటెస్టెంట్లు పత్తాలేకుండా పోయారు. ఏ ఒకరిద్దరికో తప్పితే ఎవరికీ పాపులారిటీ రాలేదు. ఇక రెండో సీజన్లో కౌశల్ ఆర్మీ చేసిన సందడి అంతా ఇంతా కాదు. బిగ్‌బాస్ విన్నర్‌గా కౌశల్‌ను ప్రకటించాలంటూ ఆర్మీల పేరిట ర్యాలీలు చేస్తూ నానాహడావుడి చేశారు. కప్పు కొట్టాక భవిష్యత్తు ఏంటి? బిగ్‌బాస్ షో తర్వాత కౌశల్ సినిమాల్లోకి రానున్నాడన్న వార్తలు కూడా వినిపించాయి. కానీ టైటిల్ గెలిచిన తర్వాత కౌశల్ పరిస్థితి తలకిందులైంది. కేవలం టీవీ ఇంటర్వ్యూలకు, షాప్ ఓపెనింగ్లకు మాత్రమే అతను పరిమితమైపోయాడు. మెల్లిమెల్లిగా మీడియా కూడా ఆయన్ను పట్టించుకోవడం మానేసింది. మొత్తానికి గత రెండు సీజన్ల విజేతలకు ప్రైజ్‌మనీ తప్పితే అంతకుమించి ఒరిగిందేమీ లేదు. బిగ్‌బాస్ షో తర్వాత వాళ్లిప్పుడు కనిపించకుండా పోయారని నెటిజన్లు అంటున్నారు. ఇప్పుడు టైటిల్ కోసం నువ్వా నేనా అని పోరాడుతున్న శ్రీముఖి, రాహుల్‌లో ఎవరు గెలిచినా.. తర్వాత వారి పరిస్థితి కూడా ఇంతేనా అని ప్రేక్షకులు పరిపరివిధాలా ఆలోచిస్తున్నారు. -
బిగ్‌బాస్‌పై శివ బాలాజీ షాకింగ్ కామెంట్స్!
బిగ్ బాస్ తెలుగు సీజన్ 3 తుది అంకానికి చేరుకుంది. మరో రెండు వారాల్లో ఈ సీజన్ విజేత ఎవరో తేలనుంది. అయితే తొలి రెండు సీజన్లతో పోలిస్తే ఈసారి ఎంటర్టైన్మెంట్ తగ్గిందని బిగ్‌బాస్ అభిమానులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. గత సీజన్లతో పోలిస్తే ఈ సారి కంటెస్టెంట్స్ చాలా వీక్‌గా ఉన్నారని మరో వాదన వినిపిస్తోంది. అంతేకాకుండా బంధాలు, ఎమోషన్స్, ప్రేమవ్యవహారాలతో ఈ సారి షోలో వినోదం తక్కువైందని వాపోతున్నారు. అదేవిధంగా బిగ్‌బాట్ టాస్కుల్లో కొత్తదనం లోపించిందని విమర్శిస్తున్నారు. ప్రస్తుత సీజన్లో పాల్గొన్న కంటెస్టెంట్లు అన్ని బిగ్‌బాస్ షోలు చూసి రావడంతో ఫిజికల్, సీక్రెట్ టాస్క్‌లను ముందే అంచనా వేస్తున్నారనే విషయాన్ని గుర్తుచేస్తున్నారు. దీంతో బిగ్ బాస్ అభిమానులు ఈ సీజన్‌ను చాలా బోరింగ్‌గా ఫీలవుతున్నామని చెప్పకనే చెబుతున్నారు. తాజాగా ఈ వాదనకు మరింత బలం చేకూరేలా బిగ్ బాస్ సీజన్ వన్ విన్నర్ శివబాలాజీ షాకింగ్ కామెంట్స్ చేశాడు. ఓ యూట్యూబ్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తాజా సీజన్‌ను చూడటం లేదని నిర్మొహమాటంగా చెప్పేశాడు. దానికి గల కారణాలను కూడా వివరించాడు. తనకు ఎంటర్టైన్మెంట్ అంటే చాలా ఇష్టమని, అయితే అది ఈ సీజన్లో లోపించిందన్నాడు. అందుకే ఈ సీజన్ తనకు కనెక్ట్ కాలేదన్నాడు. ఆరంభంలో కొన్ని ఎపిసోడ్లు చూసినప్పుడే ఈ విషయం పక్కాగా అర్థమైందన్నాడు. ప్రస్తుతం షూటింగ్, వ్యక్తిగత పనులతో బిజీగా ఉండటం వలన బిగ్‌బాస్ షోను మొత్తానికే చూడటం మానేశానని పేర్కొన్నాడు. తొలి సీజన్లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ హోస్ట్‌గా వ్యవహరించడం ఆ సీజన్‌కు హైలెట్‌గా నిలిచింది. దీంతో పాటు శివబాలాజీ, ఆదర్శ్, అర్చన, నవదీప్, ప్రిన్స్ వంటి కంటెస్టెంట్లు చాలా బలంగా ఉన్నారు. అంతేకాకుండా ఇంటిసభ్యులు అభిమానులకు కావాల్సిన వినోదాన్ని డబుల్ పంచారు. దీంతో ఆ సీజన్ విజయం సాధించింది. అనంతరం రెండో సీజన్‌కు హోస్ట్ మారినా.. ఎంటర్టైన్మెంట్ కాస్తా కూడా తగ్గలేదు. గీతామాధురి పాటలు.. దీప్తి మాటల ప్రవాహం.. తనీశ్, సామ్రాట్ల బ్రొమాన్స్.. కౌశల్ తన యాటిట్యూడ్‌తో పాటు గొడవలతో రెండో సీజన్‌ను హీటెక్కించాడు. ఇక మూడో సీజన్‌కు కింగ్ నాగార్జున హోస్ట్‌గా వ్యవహరిస్తుండటంతో వినోదం మినిమమ్ గ్యారెంటీగా ఉంటుందని భావించారు. అయితే ఈ సారి బిగ్‌బాస్‌లో పాల్గొన్న కంటెస్టెంట్లు షోలో చేసే ప్రదర్శన కంటే ముందుగా చేసుకున్న సోషల్ మీడియా క్యాంపైన్ మీదే ఎక్కువగా ఆధారపడినట్లు తెలుస్తోంది. అందుకే బిగ్‌బాస్‌లో ఆడినా ఆడకున్నా బయట తమకున్న ఫాలోయింగ్‌తో ఓట్లు రాబట్టి విజేతగా నిలవాలని అనుకుంటున్నారు. అయితే ఇంత ముందు చూపు ఉన్న కంటెస్టెంట్లు కాస్త టాస్క్‌లపై దృష్టి పెట్టాలని బిగ్‌బాస్ ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. చదవండి: బిగ్‌బాస్: వితికా ఎలిమినేట్.. ఇది ఫిక్స్! బిగ్‌బాస్: ఆ ముగ్గురు సేఫ్..! -
ఘనంగా హీరోయిన్ నిశ్చితార్థం
హీరోయిన్ అర్చన(వేద) త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతోంది. ఓ ప్రముఖ హెల్త్‌కేర్ కంపెనీ ఉపాధ్యక్షుడు, వ్యాపారవేత్త జగదీశ్ భక్తవత్సలంతో అర్చన నిశ్చితార్థం గురువారం హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి పలువురు సినీ ప్రముఖులు హాజరై అర్చన-జగదీశ్‌లకు శుభాకాంక్షలు చెప్పారు. ముఖ్యంగా బిగ్‌బాస్ సీజన్-1 మిత్రులైన నవదీప్, శివబాలాజీలు ఈ వేడుకలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఇక జగదీశ్-అర్చనల మధ్య గత కొద్ది కాలంగా ప్రేమాయణం నడుస్తోన్న విషయం తెలిసిందే. గత నెలలో తన ప్రియుడితో కలిసి దిగిన ఫోటోలను ఫేస్బుక్లో పోస్ట్ చేసి త్వరలోనే శుభవార్త వింటారని అర్చన పేర్కొన్న సంగతి తెలిసిందే. కాగా, 2004లో నేను సినిమాతో తెరంగేట్రం చేసిన అర్చన.. తెలుగుతో పాటు కన్నడ, తమిళంలోనూ సినిమాలు చేసింది. అయితే సరైన హిట్ లేకపోవడంతో హీరోయిన్గా నిలదొక్కుకోలేకపోయింది. అయితే తన అందం, అభినయంతో కుర్రకారు మనసులను దోచుకుంది. బిగ్‌బాస్ సీజన్-1 కంటెస్టెంట్‌గా పాల్గొని వార్తల్లో నిలిచింది. అయితే ఆ షో తెచ్చిన ఫేమ్ ఆమె సినిమా కెరీర్‌కు అంతగా ఉపయోగపడలేదు. తాజాగా సప్తగిరి హీరోగా నటించిన వజ్రకవచధార గోవిందా అనే చిత్రంలో ఓ పవర్ఫుల్ పాత్రను పోషించింది. పలు డ్యాన్స్‌షోలకు అర్చన న్యాయనిర్ణేతగా వ్యవహరించిన విషయం తెలిసిందే. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
శివబాలాజీ.. జర దేఖో జీ..!
మణికొండ: మణికొండ పరిధిలోని పంచవటి కాలనీ, హరివిల్లు అపార్ట్మెంట్లో టీఆర్ఎస్ రాజేంద్రనగర్ అభ్యర్థి టి. ప్రకాశ్‌గౌడ్ ఆదివారం ఎన్నికల ప్రచారం చేశారు. పలువురు సినీ, టీవీ నటులను కలిసి కారు గుర్తుకు ఓటు వేయాలని ఆయన అభ్యర్థించారు. సినీ, బుల్లితెర నటుడు శివబాలాజీ ఇంటికి వెళ్లి తనకు మద్దతు ఇవ్వాలని కోరారు. ప్రకాశ్ గౌడ్ వెంట ఎంపీపీ తలారి మల్లేశ్, ఎంపీటీసీ సభ్యుడు కె.రామకృష్ణారెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ పి.చంద్రశేఖర్‌రెడ్డి తదితరులు ఉన్నారు. -
ప్రశ్నించే హక్కును కోల్పోవద్దు
బంజారాహిల్స్: కొంతమంది తమ ఓటు హక్కు వినియోగించుకోకుండా గమ్మున కూర్చుంటారు. దీనివల్ల ప్రశ్నించే హక్కు కోల్పోతారు. ఆ పరిస్థితి ఎదురు కాకూడదనుకుంటే నిజాయితీతో స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకోవాలి. ఇదే విషయాన్ని రాజ్యాంగం చెబుతోంది. ప్రలోభాలకు లొంగకుండా ఓటేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైనా ఉంది. ఒక్కసారి ఓటు వేయకపోతే ఐదేళ్ల వరకు తలవంచాల్సి ఉంటుంది. ఓటేసిన తర్వాత తలెత్తుకు తిరిగేలా ఉండాలి. ప్రజాస్వామ్య దేశంలో ఓటు హక్కును వ్యక్తిగత బాధ్యతగా భావించాలి. మన హక్కును మనం కాపాడుకోవాలి. నేను ప్రతి ఎన్నికల్లోనూ తప్పనిసరిగా ఓటు వేస్తాను. ఆ రోజు షూటింగ్‌లు ఉన్నా ఆలస్యంగానైనా వెళ్తాను కానీ ఓటు వేయడం మాత్రం మానను.– శివబాలాజీ,సినీనటుడు, బిగ్‌బాస్–1 విజేత -
దుబాయ్‌లో ‘స్నేహమేరా జీవితం’ ట్రైలర్ లాంచ్
-
స్నేహం, పగ నేపథ్యంలో ‘స్నేహమేరా జీవితం’
బిగ్ బాస్ సీజన్ 1తో బుల్లితెర ప్రేక్షకులను మెప్పించిన శివాబాలాజీ నిర్మాతగా మారి వెండితెర ప్రేక్షకులను మెప్పించేందుకు సిద్ధమవుతున్నాడు. కాటమరాయుడులో పవన్ కల్యాణ్ సోదరుడిగా నటించిన శివబాలాజీ ఓ మల్టీ స్టారర్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. రాజీవ్ కనకాల, శివబాలాజీలు హీరోలుగా నటించిన సినిమా ‘స్నేహమేరా జీవితం’. ఈ సినిమా ఈ నెల 17న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా ట్రైలర్ ను దుబాయ్ లో జరిగిన ఓ ప్రైవేట్ కార్యక్రమంలో శుక్రవారం విడుదల చేశారు. వేవ్ రెజొనెంట్స్ ఈవెంట్స్ 10వ వార్షికోత్సవం సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఆ ట్రైలర్ ను విడుదల చేశారు. ఈ సందర్భంగా శివబాలజీ మాట్లాడుతూ.. వాస్తవానికి ఈ ట్రైలర్ లాంచ్ ను హైదరాబాద్ లో కొంతమంది ప్రత్యేక అతిథుల సమక్షంలో విడుదల చేద్దామని ప్లాన్ చేశామన్నారు. అయితే, వార్షికోత్సవ కార్యక్రమానికి తాను ఇక్కడికి వస్తానని కమిట్ అవ్వడంతో ఇక్కడే ట్రైలర్‌ను లాంచ్ చేశామన్నారు. బిగ్ బాస్ షో తర్వాత తనకు లభిస్తోన్న ఆదరణ చూస్తోంటే చాలా ఆనందంగా ఉందన్నారు. త్వరలోనే తాను నిర్మించి నటించిన స్నేహమేరా జీవితం సినిమా విడుదల కాబోతోందన్నారు. 1982 బ్యాక్ డ్రాప్ లో ఇద్దరు ప్రాణ స్నేహితుల జరిగిన ఘటనల నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కించామన్నారు. -
టాలీవుడ్ నటుడి భార్యకు వేధింపులు
-
టాలీవుడ్ నటుడి భార్యకు వేధింపులు
సాక్షి, హైదరాబాద్ : సినీనటుడు, తెలుగు బిగ్‌బాస్ విజేత శివబాలజీ మరోసారి సైబరాబాద్ పోలీసులను ఆశ్రయించిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తన భార్య, నటి మధుమితను ఎస్ఎంఎస్లతో వేధిస్తున్నారంటూ ఆయన మూడు రోజుల క్రితం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. శివబాలాజీ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. యూట్యూబ్‌లో తన భార్యకు సంబంధించి వచ్చిన అనుచిత వ్యాఖ్యలపై అతడు కంప్లైంట్ చేశాడు. కాగా ఇటీవలి కాలంలో సోషల్ మీడియాలో సినిమా వార్తలతో పాటు, నటీనటులపై గాసిప్స్ రాస్తున్న విషయం తెలిసిందే. కొన్ని సైట్లు హద్దులు మీరి అత్యుత్సాహాన్ని ప్రదర్శిస్తూ నటులపై ఊహాజనిత వార్తలు రాయడంతో తమ పరువు మర్యాదలకు భంగం కలిగిస్తున్నాయని తెలుగు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్(మా) సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ విషయంలో శివబాలాజీ కూడా ’మా’ కు మద్దతుగా మాట్లాడారు. దీంతో అతడిపై కక్ష కట్టి... దుండగులు ఈ చర్యకు పాల్పడినట్లు సమాచారం. అయితే శివబాలాజీ గతంలో కూడా తన ఫేస్బుక్లో అసభ్యకర కామెంట్లు చేసిన ఓ వ్యక్తిపై సైబరాబాద్ సైబర్ క్రైం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. పవన్ కల్యాణ్ హీరోగా నటించిన కాటమరాయుడు సినిమాలో హీరో తమ్ముడి పాత్రలో శివబాలాజీ నటించాడు. దానికి సంబంధించిన నాలుగు ఫొటోలను ఫేస్బుక్లో షేర్ చేసిన అతడు.. డబ్బింగ్ పనులను పూర్తి చేశామంటూ అందుకు సంబంధించిన ఫోటోలను ఫేస్బుక్లో పోస్ట్ చేశాడు. ఆ ఫొటోలను పొగుడుతూ చాలా మంది కామెంట్లు పెట్టగా...వాసు అనే యువకుడు మాత్రం అసభ్య పదజాలంతో కామెంట్స్ పెట్టాడు. దీంతో ఆ కామెంట్‌తో సహా ఫొటోను స్క్రీన్ షాట్ తీసి.. ‘ఎందుకు? నాకు నువ్వు సమాధానం చెప్పి తీరాలి. నీ ఈ తిట్ల వల్ల నేను నీమీద కేసు పెట్టొచ్చు తెలుసా?’ అంటూ శివబాలాజీ ఓ లింక్‌ను పోస్ట్ చేశాడు. అయితే ఆ యువకుడు మరింత రెచ్చిపోవడంతో గచ్చిబౌలిలోని సైబరాబాద్ సైబర్ క్రైం కార్యాలయంలోలో శివబాలాజీ ఫిర్యాదు చేశాడు. -
నా విజయానికి అది ఓ కారణం
సాక్షి, శంషాబాద్ : ప్రజలు చూపిన అభిమానం, ఆదరణతోనే తాను తెలుగు బిగ్‌బాస్ సీజన్ వన్ విజేతగా నిలిచానని టాలీవుడ్ నటుడు శివబాలాజీ అన్నారు. షిర్టీ సాయిబాబాను దర్శించుకున్న అనంతరం ఆయన మంగళవారం హైదరాబాద్‌కు చేరుకున్నారు. శంషాబాద్ విమానాశ్రయంలో ఆయనకు అభిమానులు, కుటుంబ సభ్యులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా శివబాలాజీ మీడియాతో తన అనుభవాలను పంచుకున్నారు. ‘బిగ్‌బాస్‌లో ప్రవేశించిన మొదటి వారం ఏమీ అర్థం కాలేదు. ఎవరితోనూ మాట్లాడలేక పోయాను. రెండో వారం పరిస్థితి అర్థమైంది. అప్పటి నుంచి గెలుపుపై సానుకూల దృక్పథంతోనే ఆటలో కొనసాగాను. కొన్ని సందర్భాల్లో పక్కవారికి నచ్చినా నచ్చకపోయినా అదే విధానాన్ని కొనసాగించాను. ఇది కూడా నా విజయానికి ఓ కారణం’ అన్నారు. సల్మాన్‌ను మించిన హోస్టింగ్ ‘తారక్ హోస్టింగ్ సల్మాన్ ఖాన్‌ను మించి ఉంది. ఆయన అద్బుతంగా చేశారు. ఎప్పటికప్పుడు బయట ప్రేక్షకులు వారి మదిలో మా గురించి ఏమనుకుంటున్నారనేది ఆయన వ్యాఖ్యానంతో తెలిసిపోయేది. ఈ షో అద్భుత విజయానికి ఆయనే ప్రధాన కారకులు’ అన్నారు. బిగ్ బాస్ షో తర్వాత తాము షీర్డి వెళ్లామని, అక్కడ ఓ వృద్ధురాలు తన వద్దకు వచ్చి ఎంతో అభిమానం చూపిందని తెలిపారు. -
బిగ్‌బాస్ షోలో భార్యలు..
-
బిగ్‌బాస్ షోలో భార్యలు
-
బిగ్‌బాస్ షోలో భార్యలు
జూనియర్ ఎన్టీఆర్ హోస్టుగా వ్యవహరిస్తున్న బిగ్ బాస్ షోకి కంటెస్టెంట్స్ భార్యలు అతిథులుగా విచ్చేసి సడెన్ సర్ ప్రైజ్ ఇవ్వనున్నారు. శివ బాలాజీ భార్య మధుమిత, ఆదర్శ్ భార్య గుల్నార్లు అతిథులుగా షోకి వస్తున్నట్లు ప్రోమోలో తెలుస్తోంది. కాగా, సడెన్ సర్ప్రైజ్తో చాలా రోజుల తర్వాత కలుసుకున్న జంటలు అందరినీ కంటతడి పెట్టించింది. తెలుగు బుల్లితెరపై బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ ఇటీవలే 50 రోజుల పండుగ చేసుకొని చివరి దశకు చేరుకుంది. ఇది వరకు అర్జున్ రెడ్డి హీరో విజయ్ దేవరకొండ, తాప్సీ, నరేష్, తదితరులు షోని సందర్శించిన విషయం తెలిసిందే. -
'బిగ్ బాస్'కు ఆమె సెట్ అవ్వరు: నటుడు
టాలీవుడ్ స్టార్ హీరో ఎన్టీఆర్ హోస్ట్ చేస్తున్న రియాల్టీ షో ‘బిగ్‌బాస్’ శనివారం ఎపిసోడ్ ఆసక్తికరంగా సాగిపోయింది. రోజురోజుకు ఈ రియాల్టీ షోకు ఆదరణ పెరుగుతోంది. అయితే ఈ షో రెండో వీకెండ్ ఎపిసోడ్లో భాగంగా తారక్ 12 మంది సభ్యులకు ఓ టాస్క్ ఇచ్చారు. టాస్క్ లో పాల్గొన్న సందర్భంగా షోలో యాక్టివ్ ఉంటున్న నటుడు శివబాలాజీ సంచలన వ్యాఖ్యలు చేశారు. తమకు నచ్చని వ్యక్తిని విలన్ గా ఎంచుకుని కత్తుల సింహాసనంపై కూర్చోపెట్టి కారణం వివరించడం టాస్క్ ప్రత్యేకత. సభ్యుల విషయంలో గొడవ జరిగితే సర్దిచెప్పాలని తాను చూస్తే, కల్పన మాత్రం అడ్డుపడుతున్నారని అర్చన అన్నారు. తొలివారం ఓకే అనేలా ఉన్న కల్పన రెండో వారంలో మాత్రం డబుల్ గేమ్ అడుతున్నారని నటి హరితేజ చెప్పారు. శివబాలాజీ మాత్రం మరో అడుగు ముందుకేశారు. కెప్టెన్ గా చేసిన కల్పన ఈ బిగ్ బాస్ కు సెట్ అవ్వరని, హౌస్ లో ఉండేందుకు తగిన వారు (అన్ ఫిట్) కాదని అభిప్రాయపడ్డారు. ఆమె విలన్ అని చెప్పేందుకు ఒక్క కారణం కాదు.. తన వద్ద ప్యాకేజీ కారణాలున్నాయంటూ శివబాలాజీ పేర్కొన్నారు. దీంతో హౌస్ వాతావరణం కాస్త వేడెక్కింది. టాస్క్ లో భాగంగా ఏడుగురు సభ్యులు కల్పనను విలన్ గా ఎంపిక చేసుకోగా, ఆ తర్వాతి స్థానంలో నటుడు సమీర్ నిలిచారు. బిగ్ బాస్ హౌస్ నుంచి ఎలిమినేట్ అయిన మూడో కంటెస్టెంట్ గాయని మధుప్రియ. ఎలిమినేషన్ నుంచి ఆమె పేరు ప్రకటించిన తర్వాత సభ్యులలో ఎలాంటి భావోద్వేగాలు కనిపించలేదు. 14 మంది కంటెస్టెంట్లతో ప్రారంభమైన రియాల్టీ షో తొలి వారం తర్వాత నటి జ్యోతి ఎలిమినేట్ అవ్వగా, బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు అర్థాంతరంగా తప్పుకున్న విషయం తెలిసిందే. షోను విజయవంతంగా నిర్వహిస్తున్నందుకు ఎన్టీఆర్ కు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. -
'బిగ్ బాస్'లో నటుడు సంచలన వ్యాఖ్యలు
హైదరాబాద్: టాలీవుడ్ నటుడు ఎన్టీఆర్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న ‘బిగ్ బాస్’ షోలో నటుడు శివబాలాజీ సంచలన వ్యాఖ్యలు చేశారు. తమకు ఏం గతిలేక ఇక్కడికి వచ్చాం అనుకుంటున్నారా, అసలు బిగ్ బాస్ ఎందుకు ఇంత కఠినంగా వ్యవహరిస్తున్నారంటూ శివబాలాజీ ఆగ్రహం వ్యక్తం చేశారు. షోలో పాల్గొన్న ఇతర సభ్యులు ధన్‌రాజ్, సమీర్లు శివబాలాజీకి మద్ధతు తెలిపారు. అసలేమైందంటే.. బిగ్ బాస్ షో రూల్స్ ప్రకారం స్మోక్ రూమ్‌లోకి ఒకసారి ఒకరు మాత్రమే వెళ్లాల్సి ఉంటుంది. తొలిరోజే ఒకేసారి ఐదుగురు స్మోక్ రూమ్‌లో ఉండటంతో బిగ్‌బాస్ వారిని హెచ్చరించారు. ప్రతిరోజు వారు ఈ రూల్ బ్రేక్ చేయడంతో బిగ్‌బాస్ వారికి పనిష్మెంట్ ఇవ్వాలనుకున్నారు. రోజువారీగా ఇచ్చే సిగరెట్లను ఇవ్వడం తాత్కాలికంగా ఆపివేస్తున్నామని, తదుపరి నిర్ణయం వెల్లడయ్యేవరకు ఈ శిక్ష తప్పదని ఆదేశాలు రావడంతో స్మోకింగ్ అలవాటున్న కొందరు ఈ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. బిగ్‌బాస్ ఇచ్చే టాస్క్‌లు ఎలా ఉన్నా వందశాతం మనసుపెట్టి చేస్తున్నామని, అప్పుడప్పుడు తమ ఉల్లంఘనలకు ఇచ్చే శిక్షలను స్వీకరిస్తున్నా ఇంత కఠినంగా వ్యవహరించడం తమకు నచ్చలేదని శివబాలాజీ అన్నారు. తమకు ఏం లేక ఇక్కడికి వచ్చామనుకుంటున్నారా.. అందరూ సెలబ్రిటీలే వారికి ఎలా నడుచుకోవాలో తెలుసునని, అయితే బిగ్‌బాస్ ఇంత స్టుపిడ్ నిర్ణయం తీసుకుంటారనుకోలేదని అభిప్రాయపడ్డారు. ధన్‌రాజ్, సమీర్, ముమైత్ ఖాన్ లు శివబాలాజీకి మద్దతు తెలిపారు. తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకుని బిగ్‌బాస్ సిగరెట్లు అందించినా.. ఒక్కరు స్మోక్ చేస్తున్నప్పుడు ఇతర 13 మంది సభ్యులు బాత్రూమ్లో ఉండాలని కండీషన్ పెట్టారు. కొందరు సభ్యులు ఒక్కొక్కరుగా స్మోక్ రూమ్‌కు వెళ్లి వచ్చిన తర్వాత బిగ్‌బాస్‌కు క్షమాపణ చెప్పారు. ఒక్క వ్యక్తి స్మోక్ చేస్తుంటే మిగిలిన 13 మంది బాత్రూమ్లో ఉండాలన్న కండీషన్‌ను రద్దు చేయాలని, మరోసారి స్మోక్ జోన్ రూల్ బ్రేక్ చేయకుండా జాగ్రత్తగా ఉంటామని.. ధన్‌రాజ్ సహా స్మోకింగ్ చేసే ఇతర సెలబ్రిటీలు బిగ్‌బాస్‌కు విజ్ఞప్తి చేశారు. బిగ్ బాస్ షోలో కంటతడి పెట్టిన నటుడు బిగ్ బాస్ షోలో సంపూర్ణేష్‌కు షాక్..! -
బిగ్ బాస్ షోలో కంటతడి పెట్టిన నటుడు
హైదరాబాద్: ఎన్టీఆర్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న ‘బిగ్ బాస్’ షో ఈ ఆదివారం రాత్రి నుంచి ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ షోలో పాల్గొన్న14 మంది సెలబ్రెటీస్లలో నటుడు శివబాలాజీ ఒకరు. అయితే గడిచిన షోలోని ఓ టాస్క్‌లో సహ కంటెస్టెంట్లు చెప్పిన నిజ జీవిత సంఘటలు విన్న శివ బాలాజీ కన్నీరు పెట్టుకోవడం అందరి హృదయాల్ని కలచివేసింది. ఈ విషయాన్ని శివ బాలాజీ భార్య మధుమిత సోషల్ మీడియా ద్వారా మరో మారు గుర్తుచేసుకున్నారు. ఇది బాలాజీలోని అరుదైన కోణమని ఆమె తెలిపారు. అలాంటిదాన్ని బిగ్ బాస్ షో ఒక్క రోజులో బయట పెట్టిందని చెప్పారు. ఆయన కన్నీరు పెట్టుకోవడం నేను చూడలేనని తన భర్త ఫేస్బుక్ అకౌంట్లో పోస్ట్ చేశారు. అంతే కాకుండా ఈ రోజు మా ఆయన చెప్పబోయే కథ కోసం ఎదురుచూస్తున్నట్లు ఇందులో పేర్కొన్నారు. -
యువతరానికి నచ్చే సినిమా
శ్రీబాలాజీ, నటుడు గౌతంరాజు తనయుడు కృష్ణ కథానాయకులుగా రూపొందుతోన్న చిత్రం ‘నాకైతే నచ్చింది’. త్రినాథ్ కోసూరు దర్శకుడు. ఎ.పి.రాధాకృష్ణ నిర్మాత. పోస్ట్ ప్రొడక్షన్ జరుపుకుంటోన్న ఈ చిత్రం గురించి నిర్మాత మాట్లాడుతూ -‘‘యువతరం మెచ్చే కథాంశంతో ఈ చిత్రాన్ని రూపొందించాం. ప్రస్తుతం రీ-రికార్డింగ్ జరుగుతోంది. నవంబర్ తొలివారంలో పాటల్ని విడుదల చేస్తాం’’ అని తెలిపారు. మణిశర్మ గీతాలు ఈ చిత్రానికి హైలైట్‌గా నిలుస్తాయని, నవంబర్ చివరి వారంలో సినిమాను విడుదల చేస్తామని ఎగ్జిక్యూటివ్ నిర్మాత బి.ఆర్.రాజు చెప్పారు. సోని చరిష్టా, రిషిక, సిరి కథానాయికలుగా నటిస్తున్న ఈ చిత్రంలో రఘు, గౌతంరాజు, చిత్రం శ్రీను, జూ.రేలంగి తదితరులు ఇతర పాత్రధారులు. ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: బి.ఆర్.కె.రాజు, కూర్పు: నందమూరి హరి, సహ నిర్మాత: ఎం.మలర్కొడి.