భర్త శివ బాలాజీతో మధుమిత మాస్‌ డాన్స్‌, వీడియో వైరల్‌ | Siva Balaji And His Wife Madhumitha Dance to Pushpa Item Song | Sakshi
Sakshi News home page

Siva Balaji-Madhumitha: ‘ఊ అంటవా మావ ఊఊ అంటావా’ పాటకు శివ బాలాజీ, మధుమిత మాస్‌ స్టెప్పులు, వీడియో వైరల్‌

Published Wed, Feb 22 2023 2:55 PM | Last Updated on Wed, Feb 22 2023 2:57 PM

Siva Balaji And His Wife Madhumitha Dance to Pushpa Item Song - Sakshi

టాలీవుడ్‌ క్యూట్‌ కపుల్లో నటుడు శివ బాలాజీ, మధుమిత జంట ఒకటి. హీరోహీరోయిన్లుగా నటించిన వీరిద్దరు ఆ తర్వాత ప్రేమ పెళ్లి చేసుకున్నారు. 2004లో వచ్చిన తమిళ చిత్రం ‘ఇంగ్లీస్‌ కారన్‌’ షూటింగ్‌లో వీరిద్దరికి పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారి కొంతకాలం పాటు డేటింగ్‌ చేశారు. అనంతరం పెద్ద అంగీకారంతో 2009లో వీరిద్దరు పెళ్లి చేసుకున్నారు. ఇక వివాహం అనంతరం నటకు గుడ్‌బై చెప్పిన మధుమిత ప్రస్తుతం గృహిణిగా పిల్లలు బాధ్యత, ఇంటి వ్యవహారాలను చూసుకుంటుంది. మరోవైపు సోషల్‌ మీడియాలోనూ ఫుల్‌ యాక్టివ్‌గా ఉంటుంది.

చదవండి: ‘కట్టప్ప’ సత్యరాజ్‌ కూతురు గురించి ఈ ఆసక్తిక విషయాలు తెలుసా?

తరచూ తన వ్యక్తిగత విషయాలను, ఫ్యామిలీ వెకేషన్‌ ఫొటోలను ఎప్పటికప్పుడు షేర్‌ చేస్తుంది. ఈ నేపథ్యంలో తాజాగా భర్త శివ బాలాజీతో కలిసి డాన్స్‌ చేసిన వీడియో షేర్‌ చేసింది. పుష్పలో సమంత నటించిన ‘ఊ అంటవా మావ ఊఊ అంటావా’ ఐటెం సాంగ్‌కు భర్తతో కలిసి స్టెప్పులేసింది. ఈ వీడియోకు నెటిజన్లంతా ఫిదా అవుతున్నారు. ఆమె ఇచ్చిన క్యూట్‌ క్యూట్‌ ఎక్స్‌ప్రెషన్స్‌, స్టెప్స్‌కి ఫ్యాన్స్‌ సర్‌ప్రైజ్‌ అవుతున్నారు. చాలా రోజులు తర్వాత మధుమితను ఇలా కొత్తగా చూస్తున్నామంటూ నెటిజన్లు కామెంట్స్‌ చేస్తున్నారు. ప్రస్తుతం శివ బాలాజీ-మధుమితల ఈ డాన్స్‌ వీడియో నెట్టింట వైరల్‌ అవుతోంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement