Madhumita
-
Madhumita Murgia: డీప్‌ఫేక్ గుట్టు ఆమెకు తెలుసు
ఇప్పుడు డీప్‌ఫేక్‌ల వివాదం నడుస్తోంది. ఎన్నికల సమయంలోనే కాదు సర్వ కాలాల్లోనూ డీప్‌ఫేక్ వీడియోలు ప్రముఖులకు పెద్ద సవాలు. ఇక స్త్రీలకు ఇవి పీడగా పరిణమించాయి. వీటి గుట్టుమట్లు ఏమిటో ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ నీడలో ఎలా జాగ్రత్తగా జీవించాలో తెలియచేస్తోంది ఆ రంగంలో నిపుణురాలు మధుమితా ముర్గియా.‘ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ సహాయంతో తయారయ్యే డీప్‌ఫేక్ వీడియోలు ఎంత కచ్చితంగా ఉంటాయంటే నిజమైనవా, అబద్ధమైనవా కనిపెట్టడం బ్రహ్మతరం కూడా కాదు. డీప్‌ఫేక్ వీడియోలు ఎవరినీ వదలవు. ప్రముఖులు వీటివల్ల అభాసుపోలు కావచ్చు. కాని మామూలు స్త్రీలు దీని బాధితులవుతారు. డీప్‌ఫేక్‌లో వీడియోను మార్ఫింగ్ చేయొచ్చు. అంటే మీరు పోర్క్‌లో నడుస్తుంటే బీచ్‌లో నడుస్తున్నట్టుగా మార్చవచ్చు. దుస్తులతో ఉంటే దుస్తులు లేకుండా చేయొచ్చు. మరో పద్ధతి ‘ఇమేజ్ క్రియేటింగ్’. అంటే మీ వీడియో ఏమీ లేకపోయినా మీ ఇమేజ్ను పూర్తిగా సృష్టించి దానిని కావల్సినట్టుగా ఆడించవచ్చు. డీప్‌ఫేక్‌లో ఏ స్త్రీనైనా పోర్నోగ్రఫీ వీడియోలో ఉన్నట్టుగా భ్రమింపచేయవచ్చు. అదొక్కటే కాదు నిషేధిత సమయాల్లో నిషేధిత ప్రదేశాల్లో సంఘవ్యతిరేక శక్తుల మధ్య ఉన్నట్టుగా కూడా మిమ్మల్ని చూపోచ్చు. దీనికి అంతం లేదు. రాజకీయ ఉపన్యాసాలను డీప్‌ఫేక్‌తో మార్చి ఇబ్బంది పెట్టడం చాలా సులువు. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ వల్ల ప్రయోజనాలు ఎన్ని ఉన్నాయో ప్రమాదాలు అన్ని ఉన్నాయి. ఈ టెక్నాలజీ నాశనం అయ్యేది కాదు. మరింత పెరిగేది. దీని పట్ల ఎరుకతో ఉండటమే చేయగలిగింది’ అంటుంది మధుమితా ముర్గియా. ఆమె ఏ.ఐ. ఎక్స్పర్ట్.బ్రిటిష్ ఇండియన్ముంబైలో మూలాలు కలిగిన మధుమితా ముర్గియా లండన్‌లో పెరిగింది. అక్కడే చదువుకుంది. బయోలజిస్ట్గా, ఇమ్యూనాలజిస్ట్గా పని చేస్తూ టెక్ ఇండస్ట్రీ గురించి ఆసక్తి పెంచుకుంది. లండన్‌కు చెందిన ఫైనాన్షియల్ టైమ్స్ పత్రికకు ఏ.ఐ. ఎడిటర్‌గా పని చేస్తూ వ్యాపోర ప్రయోజనాల కోసం మన డేటా ఎలా వాడబడుతున్నదో, చేతిలోని ఫోన్ వల్ల మన ప్రైవసీకి ఎలా భంగం కలుగుతున్నదో ఆమె ప్రపంచానికి తెలియచేస్తూ వస్తోంది. అంతేకాదు ఈ విషయాల గురించి ఆమె రాసిన తాజా పుస్తకం ‘కోడ్ డిపెండెంట్’కు మంచి ప్రశంసలు వస్తున్నాయి. 2024 సంవత్సరానికి ఆమె బెస్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీ జర్నలిస్ట్‌గా బ్రిటిష్ ప్రెస్ అవార్డ్‌ను గెలుచుకుంది.ఏ.ఐ.తో మంచి: ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్‌తో మూడు రంగాల్లో మంచి జరుగుతున్నదని అంటుంది మధుమిత. ‘ఆరోగ్య రంగంలో రిపోర్ట్‌ల ఆధారంగా పేషెంట్ వ్యాధిని ఏ.ఐ.తో గొప్ప స్పెషలిస్ట్ స్థాయిలో అంచనా కట్టొచ్చు. దీనివల్ల డాక్టర్ అపోయింట్మెంట్ కోసం వేచి ఉండే బాధ తప్పింది. ఫార్మాసూటికల్ రంగంలో కూడా ఏ.ఐ సేవలు బాగా ఉపయోగపడతాయి. ఇక సైన్స్ రంగంలో చేయాల్సిన పరిశోధనలు సులువవుతాయి. విద్యారంగంలో విద్యార్థుల రీసెర్చ్ కోసం ఏ.ఐ. ఉపయోగపడుతుంది. నేర పరిశోధనలో ఏ.ఐ.ని వాడి నేరస్తులను పట్టుకుంటున్నారు. ఇవన్నీ మంచి విషయాలే’ అంటుందామె.చెడు ఎంతో ఉంది:‘ఏ.ఐ. వల్ల రాబోయే ఐదేళ్లలో ఫొటోగ్రాఫర్లు అనేవాళ్లే లేకుండా పోవచ్చు. ఏ.ఐ. సహాయంతో ఎవరైనా సరే గొప్ప ఫొటోలు తీయవచ్చు. రచయితల బదులు ఏ.ఐ.తో కథలు రాయవచ్చు. కంప్యూటర్ల మీద జరగాల్సిన చాలా పనులు మనుషులు లేకుండానే జరిగే స్థితి రావచ్చు. దీనివల్ల లాభాలు సంస్థలకు వచ్చిన మనుషుల ఉనికి అంటే ఉద్యోగుల ఉనికి ఆందోళనలో పడుతుంది. చేతిలో ఫోన్ ఉంటే ఏ.ఐ. ద్వారా మీ ప్రతి కదలికను గుర్తించవచ్చు. మీరు ఇంట్లో ఉన్నా సురక్షితం కాదు. మీరు యాప్స్ ద్వారా కొనే వస్తువులను, మీరు వెళ్లే ఆస్పత్రులను, మీరు కొనే మందులను, వెళ్లే రెస్టరెంట్లను బట్టి రాబోయే కాలంలో మీ జీవితం ఎలా ఉంటుందో ఊహించి మీ చేత ఏమేమి కొనిపించాలో మిమ్మల్ని ఎలా వినియోగదారునిగా మార్చాలో ఏ.ఐ. ఆయా కంపెనీలకు చెబుతుంది. గతంలో ఒక టెక్నాలజీని అనేక ఏళ్లు పరీక్షించి జనానికి మేలు కలిగే విధంగా వదిలేవారు. ఏ.ఐ. లాంటివి మంచి చెడ్డలు పరీక్షించకనే వదిలారు. అవి రోజు రోజుకూ శక్తి పుంజుకుంటున్నాయి. ఏ.ఐ. నుంచి తప్పించుకోలేము. అలాగని మరీ అంత భయం కూడా అక్కర్లేదు. మానవశక్తి, మానవ జ్ఞానం కృత్రిమ యాంత్రిక జ్ఞానం కంటే ఎప్పుడూ గొప్పవే’ అంటోంది మధుమిత. -
భర్త శివ బాలాజీతో మధుమిత మాస్ డాన్స్, వీడియో వైరల్
టాలీవుడ్ క్యూట్ కపుల్లో నటుడు శివ బాలాజీ, మధుమిత జంట ఒకటి. హీరోహీరోయిన్లుగా నటించిన వీరిద్దరు ఆ తర్వాత ప్రేమ పెళ్లి చేసుకున్నారు. 2004లో వచ్చిన తమిళ చిత్రం ‘ఇంగ్లీస్ కారన్’ షూటింగ్లో వీరిద్దరికి పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారి కొంతకాలం పాటు డేటింగ్ చేశారు. అనంతరం పెద్ద అంగీకారంతో 2009లో వీరిద్దరు పెళ్లి చేసుకున్నారు. ఇక వివాహం అనంతరం నటకు గుడ్‌బై చెప్పిన మధుమిత ప్రస్తుతం గృహిణిగా పిల్లలు బాధ్యత, ఇంటి వ్యవహారాలను చూసుకుంటుంది. మరోవైపు సోషల్ మీడియాలోనూ ఫుల్ యాక్టివ్‌గా ఉంటుంది. చదవండి: ‘కట్టప్ప’ సత్యరాజ్ కూతురు గురించి ఈ ఆసక్తిక విషయాలు తెలుసా? తరచూ తన వ్యక్తిగత విషయాలను, ఫ్యామిలీ వెకేషన్ ఫొటోలను ఎప్పటికప్పుడు షేర్ చేస్తుంది. ఈ నేపథ్యంలో తాజాగా భర్త శివ బాలాజీతో కలిసి డాన్స్ చేసిన వీడియో షేర్ చేసింది. పుష్పలో సమంత నటించిన ‘ఊ అంటవా మావ ఊఊ అంటావా’ ఐటెం సాంగ్‌కు భర్తతో కలిసి స్టెప్పులేసింది. ఈ వీడియోకు నెటిజన్లంతా ఫిదా అవుతున్నారు. ఆమె ఇచ్చిన క్యూట్ క్యూట్ ఎక్స్ప్రెషన్స్, స్టెప్స్‌కి ఫ్యాన్స్ సర్ప్రైజ్ అవుతున్నారు. చాలా రోజులు తర్వాత మధుమితను ఇలా కొత్తగా చూస్తున్నామంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం శివ బాలాజీ-మధుమితల ఈ డాన్స్ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. View this post on Instagram A post shared by Madhumitha (@madhumithasivabalaji) -
‘పసిడి’పై భారత ఆర్చరీ జట్ల గురి
ఆర్చరీ కాంపౌండ్ విభాగంలో భారత జట్లు స్వర్ణ పతక పోరుకు అర్హత సాధించి పతకాలను ఖాయం చేసుకున్నాయి. ఆంధ్రప్రదేశ్ ఆర్చర్ జ్యోతి సురేఖ, ముస్కాన్, మధుమితలతో కూడిన భారత మహిళల జట్టు సెమీఫైనల్లో 225–222తో చైనీస్ తైపీపై గెలిచింది. పురుషుల విభాగంలో అభిషేక్ వర్మ, అమన్ సైనీ, రజత్ చౌహాన్‌లతో కూడిన భారత జట్టు సెమీఫైనల్లో 230–227తో చైనీస్ తైపీ బృందంపై నెగ్గింది. మంగళవారం పసిడి పతకాల కోసం జరిగే ఫైనల్స్‌లో దక్షిణ కొరియా జట్లతో భారత పురుషుల, మహిళల జట్లు తలపడతాయి. -
టాలీవుడ్ నటుడి భార్యకు వేధింపులు
-
టాలీవుడ్ నటుడి భార్యకు వేధింపులు
సాక్షి, హైదరాబాద్ : సినీనటుడు, తెలుగు బిగ్‌బాస్ విజేత శివబాలజీ మరోసారి సైబరాబాద్ పోలీసులను ఆశ్రయించిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తన భార్య, నటి మధుమితను ఎస్ఎంఎస్లతో వేధిస్తున్నారంటూ ఆయన మూడు రోజుల క్రితం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. శివబాలాజీ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. యూట్యూబ్‌లో తన భార్యకు సంబంధించి వచ్చిన అనుచిత వ్యాఖ్యలపై అతడు కంప్లైంట్ చేశాడు. కాగా ఇటీవలి కాలంలో సోషల్ మీడియాలో సినిమా వార్తలతో పాటు, నటీనటులపై గాసిప్స్ రాస్తున్న విషయం తెలిసిందే. కొన్ని సైట్లు హద్దులు మీరి అత్యుత్సాహాన్ని ప్రదర్శిస్తూ నటులపై ఊహాజనిత వార్తలు రాయడంతో తమ పరువు మర్యాదలకు భంగం కలిగిస్తున్నాయని తెలుగు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్(మా) సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ విషయంలో శివబాలాజీ కూడా ’మా’ కు మద్దతుగా మాట్లాడారు. దీంతో అతడిపై కక్ష కట్టి... దుండగులు ఈ చర్యకు పాల్పడినట్లు సమాచారం. అయితే శివబాలాజీ గతంలో కూడా తన ఫేస్బుక్లో అసభ్యకర కామెంట్లు చేసిన ఓ వ్యక్తిపై సైబరాబాద్ సైబర్ క్రైం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. పవన్ కల్యాణ్ హీరోగా నటించిన కాటమరాయుడు సినిమాలో హీరో తమ్ముడి పాత్రలో శివబాలాజీ నటించాడు. దానికి సంబంధించిన నాలుగు ఫొటోలను ఫేస్బుక్లో షేర్ చేసిన అతడు.. డబ్బింగ్ పనులను పూర్తి చేశామంటూ అందుకు సంబంధించిన ఫోటోలను ఫేస్బుక్లో పోస్ట్ చేశాడు. ఆ ఫొటోలను పొగుడుతూ చాలా మంది కామెంట్లు పెట్టగా...వాసు అనే యువకుడు మాత్రం అసభ్య పదజాలంతో కామెంట్స్ పెట్టాడు. దీంతో ఆ కామెంట్‌తో సహా ఫొటోను స్క్రీన్ షాట్ తీసి.. ‘ఎందుకు? నాకు నువ్వు సమాధానం చెప్పి తీరాలి. నీ ఈ తిట్ల వల్ల నేను నీమీద కేసు పెట్టొచ్చు తెలుసా?’ అంటూ శివబాలాజీ ఓ లింక్‌ను పోస్ట్ చేశాడు. అయితే ఆ యువకుడు మరింత రెచ్చిపోవడంతో గచ్చిబౌలిలోని సైబరాబాద్ సైబర్ క్రైం కార్యాలయంలోలో శివబాలాజీ ఫిర్యాదు చేశాడు. -
విభిన్న కథాంశంతో చెంజిట్టాలే ఎన్ కాదల్
చెంజిట్టాలే ఎన్ కాదల్ చిత్రం పేరులో కాస్త వ్యత్యాసం కనిపిస్తోంది కదూ అయితే ఇది మహిళల్ని కించపరచే కథా చిత్రం మాత్రం కాదు అంటున్నారు ఈ చిత్రం ద్వారా దర్శకుడుగానూ, కథానాయకుడిగాను పరిచయం అవుతున్న ఎళిల్. ఇంతకు ముందు 50కి పైగా షార్ట్ ఫిలింస్‌లో నటించిన ఆయన కొన్ని చిత్రాలకు సహాయ దర్శకుడిగానూ పని చేశారట. ముఖ్యంగా చెంజిట్టాలే ఎన్ కాదల్ చిత్రం కథనం ఇప్పటి తమిళ చిత్రాల ట్రెండ్‌ను బద్దలు కొడుతుందని చాలా కాన్ఫిడెంట్‌గా అంటున్నారు. కాగా బుల్లి తెర నటి మధుమిత నాయకిగా వెండితెరకు పరిచయం అవుతున్నారు. ఆమెకు తల్లిగా మెడ్రాస్, కత్తి చిత్రాల ఫేమ్ రమ, తండ్రిగా కబాలి, మెడ్రాస్, మారి చిత్రాలతో గుర్తింపు పొందిన మైమ్‌గోపి నటిస్తున్నారు. హీరోకు తండ్రిగా అజయ్త్న్రం, మరో ముఖ్య పాత్రలో నటి అభినయ నటిస్తున్నారు. ఇతర పాత్రల్లో కయల్ విన్సెంట్, అర్జునన్ తదితరులు నటిస్తున్నారు. చిత్రం గురించి దర్శక, హీరో ఎళిల్ తెలుపుతూ ఇది ప్రేమలో విఫలమైన హీరో ఎలాంటి సమస్యలను ఎదుర్కొన్నాడు, ఆ తరువాత అవి ఎలా పరిష్కారం అయ్యాయి అన్న సంఘటనల సమాహారంగా తెరకెక్కిస్తున్న చిత్రం అని తెలిపారు. ఇటీవల ప్రేమ మలినపడుతోందని బాగా వినిపిస్తోందన్నారు. అందుకు కారణం ఏమిటన్న అంశాలను ఈ చిత్రంలో చర్చించినట్లు తెలిపారు. అయితే ఇది స్త్రీ, పురుషులిద్దరికీ సంబంధించిన అంశాన్ని చర్చించే చిత్రంగా ఉంటుందన్నారు. ఈ చిత్రానికి నిర్మాత బాలసుబ్రమణియన్ తీవ్రప్రయత్నం, సహకారం పక్కా బలంగా నిలిచాయని ఎళిల్ పేర్కొన్నారు. -
ఓల్డ్ సిటీ అంటే.. ఇష్టం
ఇంటర్ నుంచి సిటీలోనే ఉంటున్నాను. కోఠి ఉమెన్స్ కాలేజీలో డిగ్రీ చేశాను. అప్పుడు కోఠి, చార్మినార్ నా షాపింగ్ అడ్డాలు. మట్టి గాజులంటే చాలా ఇష్టం. రంగు రంగుల మట్టిగాజులు కొని దాచుకునేదాన్ని. నా ఫేవరేట్ హిస్టారికల్ స్పాట్ కూడా చార్మినారే. నాకు చార్మినార్ ఎక్కాలని ఉండేది కానీ అప్పుడు అనుమతించే వారు కాదు. ఇప్పుడు వెళ్దామంటే సెలబ్రిటీని. ఇక నా కోరిక తీరని కలగా మిగిలిపోయింది. సాయంత్రం వేళ ట్యాంక్‌బండ్‌పై వెలుగుల్లో నడుచుకుంటూ వెళ్లడమంటే చాలా చాలా ఇష్టం. గోకుల్ చాట్ మా హ్యాంగవుట్ అడ్డా. ఫ్రెండ్స్ అందరం అక్కడ కలుసుకుని చాట్ తినేవాళ్లం. సిటీలో వినాయక చవితి ఉత్సవాలు చాలా బాగా జరుగుతాయి. ప్రతి ఏటా ఈ పండక్కి సిటీలో తప్పకుండా ఉండేలా ప్లాన్ చేసుకుంటాను. - మధుమిత, సినీనటి -
విభిన్న ప్రేమకథా చిత్రం
ఇప్పుడొస్తున్న ప్రేమకథా చిత్రాలకు భిన్నంగా సరికొత్త కథనంతో తెరకెక్కుతున్న చిత్రం ‘ఫిదా’. సుష్మా దర్శన్ క్రియేషన్స్ పతాకంపై అభినయ్ దర్శన్, మధుమిత జంటగా నటిస్తున్న ఈ చిత్రాన్ని సత్యనారాయణ నిర్మిస్తున్నారు. హైదరాబాద్‌లో బుధవారం ముహూర్తపు సన్నివేశానికి పద్మిని కెమెరా స్విచ్చాన్ చేయగా, మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ క్లాప్ ఇచ్చారు. ‘‘వైవిధ్యమైన ప్రేమకథతో ఈ చిత్రం చేస్తున్నాం. దర్శకుడి వివరాలు త్వరలో తెలియజేస్తాం’’ అని నిర్మాత చెప్పారు. ఈ చిత్రానికి సంగీతం: పీఆర్. -
ఫ్యామిలీ వినోదం ఓకేనా?
సుమంత్‌రెడ్డి, వందన, మధుమిత ముఖ్య తారలుగా రత్న డి. గిరి దర్శకత్వంలో రత్నం హరి కుప్పాల నిర్మించిన చిత్రం ‘నాకు ఓకే.. నీకు ఓకేనా’. ఈ చిత్రం ఫస్ట్ లుక్‌ని సహనిర్మాత డేవిడ్ జ్ఞానకుమార్ ఆవిష్కరించారు. అతిథులు నందమూరి ప్రసాద్ టైటిల్ లోగోను, అశోక్ బేనర్ లోగోను ఆవిష్కరించారు. ఇటీవలే తొలి షెడ్యూల్ పూర్తి చేశామని, ఈ నెల 18న రెండో షెడ్యూల్ ఆరంభిస్తామని నిర్మాత తెలిపారు. చక్కని ఫ్యామిలీ ఎంటర్టైనర్గా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నామని దర్శకుడు చెప్పారు. మంచి పాటలివ్వడానికి ఆస్కారం ఉన్న కథ అని సంగీతదర్శకుడు సురేష్ శ్రీవిటి అన్నారు. ఈ చిత్రానికి రచనా సహకారం: గోపీనాథ్ యాదవ్.