ఫ్యామిలీ వినోదం ఓకేనా? | Naku Ok Neeku Ok Na First Look Launched | Sakshi
Sakshi News home page

ఫ్యామిలీ వినోదం ఓకేనా?

Published Wed, Jul 9 2014 12:23 AM | Last Updated on Sat, Sep 2 2017 10:00 AM

ఫ్యామిలీ వినోదం ఓకేనా?

ఫ్యామిలీ వినోదం ఓకేనా?

సుమంత్‌రెడ్డి, వందన, మధుమిత ముఖ్య తారలుగా రత్న డి. గిరి దర్శకత్వంలో రత్నం హరి కుప్పాల నిర్మించిన చిత్రం ‘నాకు ఓకే.. నీకు ఓకేనా’. ఈ చిత్రం ఫస్ట్ లుక్‌ని సహనిర్మాత డేవిడ్ జ్ఞానకుమార్ ఆవిష్కరించారు. అతిథులు నందమూరి ప్రసాద్ టైటిల్ లోగోను, అశోక్ బేనర్ లోగోను ఆవిష్కరించారు. ఇటీవలే తొలి షెడ్యూల్ పూర్తి చేశామని, ఈ నెల 18న రెండో షెడ్యూల్ ఆరంభిస్తామని నిర్మాత తెలిపారు. చక్కని ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నామని దర్శకుడు చెప్పారు. మంచి పాటలివ్వడానికి ఆస్కారం ఉన్న కథ అని సంగీతదర్శకుడు సురేష్ శ్రీవిటి అన్నారు. ఈ చిత్రానికి రచనా సహకారం: గోపీనాథ్ యాదవ్.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement