Sumanth Reddy
-
లాభాలతో పాటు విలువలూ ముఖ్యమే
సాక్షి, బిజినెస్ బ్యూరో : రియల్టర్లు లాభాలతోపాటు విలువలతో కూడిన వ్యాపారాన్ని నిర్వహించాలని ప్రైస్ వాటర్‌హౌస్ కూపర్స్ (పీడబ్ల్యూసీ) అసోసియేట్ డైరెక్టర్ మహ్మద్ ఆసిఫ్ ఇక్బాల్ సూచించారు. నేషనల్ అసోసియేషన్ ఆఫ్ రియల్టర్స్ (ఎన్‌ఏఆర్) ఇండియా 11వ కన్వెన్షన్ శనివారమిక్కడ ప్రారంభమైంది. ‘గేమ్ చేంజర్’థీమ్‌తో నిర్వహిస్తున్న రెండు రోజుల ఈ సదస్సుకు సాక్షి గ్రూప్ మీడియా పార్టనర్‌గా వ్యవహరిస్తోంది. మహ్మద్ ఆసిఫ్ ఇక్బాల్ సదస్సును ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రయత్నం చేస్తే సాధ్యం కానిదేదీ ఉండదని, తాను జీవితంలో ఎన్నో వివక్షలు ఎదుర్కొన్నానని తెలిపారు. దేశంలోనే నాల్గవ అతిపెద్ద సంస్థ అయిన పీడబ్ల్యూసీ ఇండియా కంపెనీలో అసోసియేట్ డైరెక్టర్‌గా పనిచేయడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. ఇప్పటికి 12 సార్లు 10 కే మారథాన్‌లో పాల్గొన్నానని, 20కే మారథాన్‌లో పాల్గొనాలనేది లక్ష్యమని తెలిపారు. సంస్థ ఎదుగుదలలో హైదరాబాద్ పాత్ర ఎన్‌ఏఆర్ ఇండియా చైర్మన్ రవివర్మ మాట్లాడుతూ ఎన్‌ఏఆర్ ఇండియా రియల్టీ పరిశ్రమలోని రియల్టర్లు, స్టేక్ హోల్డర్స్, ఏజెంట్ల గొంతును సమాజానికి వినిపించే సారథిగా పనిచేస్తుందని, పరిశ్రమ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించడంలో ముందుంటుందని తెలిపారు. రెరా చట్టం తీసుకురావడంలో నార్ ఇండియా ముఖ్య భూమిక పోషించిందన్నారు. ఎన్‌ఏఆర్ ఇండియా ప్రెసిడెంట్ ఇర్షాద్ అహ్మద్ మాట్లాడుతూ స్థూల జాతీయోత్పత్తిలో రియల్ ఎస్టేట్ వాటా 17–18% ఉంటుందన్నారు. దీనిపై 250కి పైగా అనుబంధ కంపెనీలు ఆధారపడి ఉన్నాయని, వ్యవసాయం తర్వాత అత్యధిక ఉద్యోగ అవకాశాలు కల్పించేది నిర్మాణ రంగమేనన్నారు. నివాస, వాణిజ్య సముదాయాలతోపాటు కో–లివింగ్, కో–వర్కింగ్, వేర్‌హౌసింగ్ విభాగాలకు డిమాండ్ పెరుగుతోందని, రియల్టర్లు వాటిపై దృష్టి సారించాలని సూచించారు. ఎన్‌ఏఆర్ ఇండియా ప్రెసిడెంట్‌గా హైదరాబాదీ 2019–20 ఏడాదికి గాను ఎన్‌ఏఆర్ ఇండియా ప్రెసిడెంట్‌గా హైదరాబాద్‌కు చెందిన రియల్టర్ సుమంత్ రెడ్డి అర్నాని నియమితులయ్యారు. హైదరాబాద్ రియల్టర్స్ అసోసియేషన్ (హెచ్ఆర్ఏ) హోస్టింగ్‌గా వ్యవహరించిన దీనిలో కాన్ఫడరేషన్ ఆఫ్ రియల్ ఎస్టేట్ డెవలపర్స్ అసోసియేషన్ (క్రెడాయ్) , నేషనల్ రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ కౌన్సిల్ (నరెడ్కో) ప్రతినిధులు, వివిధ రాష్ట్రాల నుంచి 1,500 మంది రియల్టర్లు పాల్గొన్నారు. ఎన్‌ఏఆర్ ఇండియాలో 16 రాష్ట్రాల్లో 48 చాప్టర్లలో 30 వేలకు పైగా సభ్యులున్నారు. -
ఎన్‌ఏఆర్ ఇండియా ప్రెసిడెంట్‌గా హైదరాబాద్ రియల్టర్
సాక్షి, హైదరాబాద్: నేషనల్ అసోసియేషన్ ఆఫ్ రియల్టర్స్ (ఎన్‌ఏఆర్) ఇం డియా ప్రెసిడెంట్‌గా హైదరాబాద్‌కు చెందిన డెవలపర్ సుమంత్ రెడ్డి నియమితులయ్యారు. ఈయన కాల పరిమితి 2019–2020. నిర్మాణ రంగ సమ స్యలను ప్రభుత్వం దష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తానని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విప్లవాత్మక నిర్ణయా లతో రియల్టీ రంగా నికి ఉజ్వల భవిష్యత్తు ఉంటుందన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఎన్‌ఏఆర్‌లో 13 లక్షల మంది, మన దేశంలో 20 రాష్ట్రాల్లో 30వేల మంది సభ్యులుగా ఉన్నారు. 1908లో చికాగో ప్రధాన కేంద్రంగా ఎన్‌ఏఆర్ ప్రారంభమైంది. -
సూళ్లురుపేటలో టీడీపీకి షాక్
సాక్షి, నెల్లూరు : నెల్లూరు జిల్లా సూళ్లూరుపేటలో అధికార తెలుగుదేశం పార్టీకి షాక్ తగిలింది. టీడీపీ సీనియర్ నేత, సూళ్ళూరు పేట మున్సిపల్ కౌన్సిలర్ వేనాటి సుమంత్ రెడ్డి గురువారం ఆ పార్టీకి రాజీనామా చేశారు. త్వరలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లు ఆయన ప్రకటించారు. ఎన్టీఆర్ టీడీపీని స్థాపించినప్పటి నుంచి పార్టీలోనే ఉన్నామని, అయితే పార్టీలో జరిగిన అవమానాలు భరించలేకే ఈ నిర్ణయం తీసుకున్నామని ఆయన తెలిపారు. సూళ్లూరుపేటలో తాగునీటిని కూడా ఇప్పించలేకపోయామని సుమంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. కాగా జిల్లాలో ప్రజాసంకల్పయాత్ర చేస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని ఇటీవలే వేనాటి సుమంత్ రెడ్డి కలిశారు. -
డీసీఎమ్మెస్ సర్వసభ్య సమావేశం రేపు
నెల్లూరు రూరల్: జిల్లా కో ఆపరేటివ్ మార్కెటింగ్ సొసైటీ సర్వసభ్య సమావేశాన్ని నెల్లూరులోని సొసైటీ కార్యాలయంలో బుధవారం ఉదయం 11 గంటలకు నిర్వంచనున్నట్లు ఎన్డీసీఎమ్మెస్ చైర్మన్ ఏడుగుండ్ల సుమంత్‌రెడ్డి తెలిపారు. శాంతినగర్‌లోని కార్యాలయంలో సోమవారం విలేకరులతో మాట్లాడారు. మార్కెటింగ్ సొసైటీ లాభాల బాటలో పయనిస్తోందని చెప్పారు. 2013 – 14 ఆర్థిక సంవత్సరంలో సంస్థ రూ.18.96 కోట్ల వ్యాపార లావాదేవీలను నిర్వహించగా, రూ.26 లక్షల ఆదాయం, 2014 – 15లో రూ.36.6 కోట్ల వ్యాపారం చేయగా, రూ.28 లక్షల ఆదాయం వచ్చిందన్నారు. ఆత్మకూరు, నెల్లూరులోని గోదాములు శిథిలావస్థకు చే రుకోగా, కొత్త వాటిని నిర్మించామని చెప్పారు. టీటీడీకి కందిపప్పును సరఫరా చేస్తున్నామని, ఈ ఏడాది మిరియాలు, బెల్లాన్ని సరఫరా చేసేందుకు అవకాశం వచ్చిందని చెప్పారు. నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో అంగన్వాడీ కేంద్రాలకు పాలు సరఫరా చేసేందుకు ప్రభుత్వం అనుమతిచ్చిందన్నారు. బుధవారం ఉదయం 9 గంటలకు పాలకవర్గ సభ్యులతో సమావేశం, మధ్యాహ్నం 11 గంటలకు సర్వసభ్య సమావేశానికి సభ్యులు సకాలంలో హాజరుకావాలని కోరారు. -
ఫ్యామిలీ వినోదం ఓకేనా?
సుమంత్‌రెడ్డి, వందన, మధుమిత ముఖ్య తారలుగా రత్న డి. గిరి దర్శకత్వంలో రత్నం హరి కుప్పాల నిర్మించిన చిత్రం ‘నాకు ఓకే.. నీకు ఓకేనా’. ఈ చిత్రం ఫస్ట్ లుక్‌ని సహనిర్మాత డేవిడ్ జ్ఞానకుమార్ ఆవిష్కరించారు. అతిథులు నందమూరి ప్రసాద్ టైటిల్ లోగోను, అశోక్ బేనర్ లోగోను ఆవిష్కరించారు. ఇటీవలే తొలి షెడ్యూల్ పూర్తి చేశామని, ఈ నెల 18న రెండో షెడ్యూల్ ఆరంభిస్తామని నిర్మాత తెలిపారు. చక్కని ఫ్యామిలీ ఎంటర్టైనర్గా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నామని దర్శకుడు చెప్పారు. మంచి పాటలివ్వడానికి ఆస్కారం ఉన్న కథ అని సంగీతదర్శకుడు సురేష్ శ్రీవిటి అన్నారు. ఈ చిత్రానికి రచనా సహకారం: గోపీనాథ్ యాదవ్.