సూళ్లురుపేటలో టీడీపీకి షాక్‌ | Venati sumanth Reddy quits TDP; likely to join ysrcp | Sakshi
Sakshi News home page

టీడీపీకి సుమంత్‌ రెడ్డి రాజీనామా

Published Thu, Jan 25 2018 3:02 PM | Last Updated on Fri, Aug 10 2018 8:46 PM

వేనాటి సుమంత్‌ రెడ్డి - Sakshi

సాక్షి, నెల్లూరు : నెల్లూరు జిల్లా సూళ్లూరుపేటలో అధికార తెలుగుదేశం పార్టీకి షాక్‌ తగిలింది. టీడీపీ సీనియర్‌ నేత, సూళ్ళూరు పేట మున్సిపల్‌ కౌన్సిలర్‌  వేనాటి సుమంత్‌ రెడ్డి గురువారం ఆ పార్టీకి రాజీనామా చేశారు. త్వరలో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరనున్నట్లు ఆయన ప్రకటించారు. ఎన్టీఆర్‌ టీడీపీని స్థాపించినప్పటి నుంచి పార్టీలోనే ఉన్నామని, అయితే పార్టీలో జరిగిన అవమానాలు భరించలేకే ఈ నిర్ణయం తీసుకున్నామని ఆయన తెలిపారు. సూళ్లూరుపేటలో తాగునీటిని కూడా ఇప్పించలేకపోయామని సుమంత్‌ రెడ్డి వ్యాఖ్యానించారు. కాగా జిల్లాలో ప్రజాసంకల్పయాత్ర చేస్తున్న వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డిని ఇటీవలే వేనాటి సుమంత్‌ రెడ్డి కలిశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement