
టాలీవుడ్ నటుడు మంచు మోహన్ బాబు అభిమానులకు అదిరిపోయే అప్‌డేట్ ఇచ్చారు. ఈరోజు ఆయన పుట్టిన రోజు కావడంతో మరో మూవీకి సంబంధించిన ఆసక్తికర విషయాన్ని రివీల్ చేశారు. దక్ష అనే మెడికల్ సైకలాజికల్ థ్రిల్లర్ మూవీలో మోహన్ బాబు నటిస్తున్నారు. ఈ సినిమాకు వంశీ కృష్ణ మల్లా దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో ఆయన ప్రత్యేక పాత్రలో కనిపించనున్నారు. దీనికి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్‌ను పుట్టిన రోజు సందర్భంగా విడుదల చేశారు.
ఈ సినిమాను మంచు ఎంటర్ టైన్మెంట్, శ్రీ లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ బ్యానర్‌లో తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రానికి మోహన్ బాబు, మంచు లక్ష్మీ ప్రసన్న నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రంలో మంచు లక్ష్మీ ప్రసన్న, మార్కో స్టార్ సిద్ధిక్, సముద్రఖని, విశ్వంత్, చిత్రా శుక్లా, మహేష్, వీరేన్ తంబిదొరై ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రం ఈ వేసవి కానుకగా థియేటర్లలో విడుదల కానుంది.
Happy Birthday Dear Legend!
Back with another banger, #Daksha The Deadly Conspiracy. Proud to be a producer alongside you. 🧿❤️ pic.twitter.com/AV09pC3wLs— Manchu Lakshmi Prasanna (@LakshmiManchu) March 19, 2025
Comments
Please login to add a commentAdd a comment