సినీనటుడు, తెలుగు బిగ్‌బాస్ విజేత శివబాలజీ మరోసారి సైబరాబాద్ పోలీసులను ఆశ్రయించిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తన భార్య, నటి మధుమితను ఎస్‌ఎంఎస్‌లతో వేధిస్తున్నారంటూ ఆయన మూడు రోజుల క్రితం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. శివబాలాజీ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.