obscene SMS
-
టాలీవుడ్ నటుడి భార్యకు వేధింపులు
-
టాలీవుడ్ నటుడి భార్యకు వేధింపులు
సాక్షి, హైదరాబాద్ : సినీనటుడు, తెలుగు బిగ్‌బాస్ విజేత శివబాలజీ మరోసారి సైబరాబాద్ పోలీసులను ఆశ్రయించిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తన భార్య, నటి మధుమితను ఎస్ఎంఎస్లతో వేధిస్తున్నారంటూ ఆయన మూడు రోజుల క్రితం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. శివబాలాజీ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. యూట్యూబ్‌లో తన భార్యకు సంబంధించి వచ్చిన అనుచిత వ్యాఖ్యలపై అతడు కంప్లైంట్ చేశాడు. కాగా ఇటీవలి కాలంలో సోషల్ మీడియాలో సినిమా వార్తలతో పాటు, నటీనటులపై గాసిప్స్ రాస్తున్న విషయం తెలిసిందే. కొన్ని సైట్లు హద్దులు మీరి అత్యుత్సాహాన్ని ప్రదర్శిస్తూ నటులపై ఊహాజనిత వార్తలు రాయడంతో తమ పరువు మర్యాదలకు భంగం కలిగిస్తున్నాయని తెలుగు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్(మా) సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ విషయంలో శివబాలాజీ కూడా ’మా’ కు మద్దతుగా మాట్లాడారు. దీంతో అతడిపై కక్ష కట్టి... దుండగులు ఈ చర్యకు పాల్పడినట్లు సమాచారం. అయితే శివబాలాజీ గతంలో కూడా తన ఫేస్బుక్లో అసభ్యకర కామెంట్లు చేసిన ఓ వ్యక్తిపై సైబరాబాద్ సైబర్ క్రైం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. పవన్ కల్యాణ్ హీరోగా నటించిన కాటమరాయుడు సినిమాలో హీరో తమ్ముడి పాత్రలో శివబాలాజీ నటించాడు. దానికి సంబంధించిన నాలుగు ఫొటోలను ఫేస్బుక్లో షేర్ చేసిన అతడు.. డబ్బింగ్ పనులను పూర్తి చేశామంటూ అందుకు సంబంధించిన ఫోటోలను ఫేస్బుక్లో పోస్ట్ చేశాడు. ఆ ఫొటోలను పొగుడుతూ చాలా మంది కామెంట్లు పెట్టగా...వాసు అనే యువకుడు మాత్రం అసభ్య పదజాలంతో కామెంట్స్ పెట్టాడు. దీంతో ఆ కామెంట్‌తో సహా ఫొటోను స్క్రీన్ షాట్ తీసి.. ‘ఎందుకు? నాకు నువ్వు సమాధానం చెప్పి తీరాలి. నీ ఈ తిట్ల వల్ల నేను నీమీద కేసు పెట్టొచ్చు తెలుసా?’ అంటూ శివబాలాజీ ఓ లింక్‌ను పోస్ట్ చేశాడు. అయితే ఆ యువకుడు మరింత రెచ్చిపోవడంతో గచ్చిబౌలిలోని సైబరాబాద్ సైబర్ క్రైం కార్యాలయంలోలో శివబాలాజీ ఫిర్యాదు చేశాడు. -
అసభ్య ఎస్ఎంఎస్లు పంపిన విశాఖ సైనికుడి అరెస్టు
ప్రేమించనని చెప్పిన పాపానికి ఓ అమ్మాయికి అసభ్య ఎస్ఎంఎస్లు పెడుతూ, వేధింపు కాల్స్ చేస్తున్న ఓ సైనికుడిని పోలీసులు అరెస్టుచేశారు. విశాఖపట్నంలోని గాజువాక ప్రాంతానికి చెందిన మైలపల్లి వినోద్‌కుమార్ (21) కొన్నేళ్ల క్రితం భారతసైన్యంలో చేరాడు. తమిళనాడులోని ఊటీ సమీపంలో గల వెల్లింగ్టన్లో అతడికి పోస్టింగ్ లభించింది. ఇటీవల సెలవులు గడిపేందుకు అతడు విశాఖపట్నం వచ్చాడు. పెందుర్తి ప్రాంతంలోని ఓ అమ్మాయిని అతడు ప్రేమిస్తున్నట్లు చెప్పగా, ఆమె నిరాకరించింది. అప్పటినుంచి అతడు తమిళనాడులో కొన్న మూడు సిమ్ కార్డులు ఉపయోగించి అసభ్య ఎస్ఎంఎస్లు పంపడం మొదలుపెట్టాడు. దీంతోపాటు పదేపదే వేధిస్తూ ఫోన్లు కూడా చేసేవాడు. అర్ధరాత్రి, అపరాత్రి అని కూడా లేకుండా ఇలా పదే పదే విసిగిస్తుండటంతో ఆమె పెందుర్తి పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఆ కేసును సిటీ సైబర్ క్రైం ఇన్వెస్టిగేషన్ సెల్‌కు పంపారు. నిందితుడి ఫోన్ ఐఎంఈఐ నెంబర్లు, సిమ్ కార్డుల గుర్తింపు కార్డుల ఆధారంగా కేసును దర్యాప్తుచేసిన పోలీసులు.. వినోద్ కుమార్‌ను సోమవారం అరెస్టు చేశారు. నిందితుడి నుంచి ఒక మొబైల్ ఫోన్, సిమ్ కార్డులు స్వాధీనం చేసుకున్నారు. ఈ విషయాన్ని ఆర్మీ వర్గాలకు తెలియజేసి తదుపరి చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతామని అదనపు డీసీపీ మహమూద్ ఖాన్ తెలిపారు.