
జ్యోతి సురేఖ
ఆర్చరీ కాంపౌండ్ విభాగంలో భారత జట్లు స్వర్ణ పతక పోరుకు అర్హత సాధించి పతకాలను ఖాయం చేసుకున్నాయి. ఆంధ్రప్రదేశ్ ఆర్చర్ జ్యోతి సురేఖ, ముస్కాన్, మధుమితలతో కూడిన భారత మహిళల జట్టు సెమీఫైనల్లో 225–222తో చైనీస్ తైపీపై గెలిచింది. పురుషుల విభాగంలో అభిషేక్ వర్మ, అమన్ సైనీ, రజత్ చౌహాన్‌లతో కూడిన భారత జట్టు సెమీఫైనల్లో 230–227తో చైనీస్ తైపీ బృందంపై నెగ్గింది. మంగళవారం పసిడి పతకాల కోసం జరిగే ఫైనల్స్‌లో దక్షిణ కొరియా జట్లతో భారత పురుషుల, మహిళల జట్లు తలపడతాయి.