Asian Games 2018
-
సలామ్ బాస్: రిషభ్
న్యూఢిల్లీ: అంతర్జాతీయ వేదికపై భారత మహిళా అథ్లెట్ హిమ దాస్ మూడు వారాల వ్యవధిలో ఐదో స్వర్ణాన్ని గెలిచి శభాష్ అనిపించారు. చెక్ రిపబ్లిక్లో శనివారం జరిగిన అంతర్జాతీయ అథ్లెటిక్స్ మీట్లో హిమ దాస్ 400 మీటర్ల రేసులో తొలి స్థానంలో నిలిచి పసిడిని సొంతం చేసుకున్నారు. 200 మీటర్ల రేసులో నాలుగు స్వర్ణాలు సాధించిన హిమదాస్.. 400 మీటర్ల రేసులోనూ తనకు తిరుగులేదని నిరూపించారు. భారత కీర్తిని మరింత పెంచిన హిమ దాస్ ప్రదర్శనపై ప్రశంసల వర్షం కురుస్తోంది. భారత యువ క్రికెటర్ రిషభ్ పంత్ తన ట్విటర్ అకౌంట్లో స్పందిస్తూ.. ‘ నీవే ఒక స్ఫూర్తి. ద గోల్డెన్ గర్ల్ ఆఫ్ ఇండియా.. సలామ్ బాస్’ అంటూ కొనియాడాడు. ‘ గత 19 రోజుల కాలంలో యూరోపియన్ సర్క్యూట్లో నీ ప్రదర్శన చూసి గర్విస్తున్నాం. గెలవాలనే నీలో కసి యువతకు ఒక స్ఫూర్తి. ఐదు పతకాలు గెలిచినందుకు అభినందనలు. భవిష్యత్తులో మరిన్ని పతకాలు సాధించాలని ఆశిస్తున్నా’ అని మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ పేర్కొన్నాడు. (ఇక్కడ చదవండి: నచ్చారండి.. హిమదాస్) -
నచ్చారండి.. హిమదాస్
నచ్చారండి హిమదాస్.. తెగ నచ్చేశారు. దేశమంతా క్రికెట్ ప్రపంచకప్ పిచ్చిలో మునిగి మీ గెలుపును గుర్తించకున్నా.. మీరు మాత్రం వరుస పతకాలతో భారత కీర్తి పతాకాన్ని రెపరెపలాడించారు. మూడు వారాల వ్యవధిలో ఐదు స్వర్ణాలు సాధించి ఔరా అనిపించారు. మీ విజయానికి రావాల్సినంత పేరు రాకున్నా.. దాన్ని మీ చిరునవ్వుతోనే సరిపెట్టుకున్నారు. మొబైల్లో టెంపుల్ రన్ గేమ్ ఆడుతూ బిజీగా ఉన్న మేము.. మీ పరుగును పట్టించుకోకున్నా.. మీరు ముందుకు సాగారు. ప్రకృతి కన్నెర్ర చేసి మీ రాష్ట్రాన్ని వరదలతో ముంచెత్తుతుంటే.. కోట్లు సంపాదించే ఆటగాళ్లు ట్వీట్లతో సరిపెడితే.. మీరు మాత్రం మీకు తోచిన సాయం చేసి పెద్ద మనుసు చాటుకున్నారు.. సరిగ్గా ఏడాది క్రితం.. ఫిన్లాండ్లోని టాంపెరెలో జరిగిన ఈవెంట్లో 400 మీటర్ల పరుగులో 51.46 సెకన్ల టైమింగ్‌తో చిరుతలా పరుగెత్తి స్వర్ణ పతకం నెగ్గారు. ఈ గెలుపుతో ఐఏఏఎఫ్ వరల్డ్ ట్రాక్ ఈవెంట్లో స్వర్ణ పతకం గెలిచిన తొలి భారత అథ్లెట్‌గా నిలిచి ప్రపంచ దృష్టిని ఆకర్షించారు. రాత్రికి రాత్రే స్టార్ అయ్యారు. ఈ రేసులో నెగ్గిన వెంటనే మీరు జాతీయ పతాకం కోసం అన్వేషిస్తూ భావోద్వేగానికి లోనవ్వడం మాకు ఇంకా కళ్ల ముందు కదలాడుతూనే ఉంది. మీ ప్రతిభను దేశ ప్రధానే కొనియాడుతుంటే.. మీకు నజరానాలు.. కానుకల వర్షం కురుస్తందని భావించాం. ప్చ్.. అందరూ ప్రశంసలతోనే సరిపెట్టినా.. మీరు ఏ మాత్రం అసంతృప్తికి లోనవ్వలేదు. మీ పరుగును ఆపలేదు. ఆ ప్రశంసలను తలకెక్కించుకోలేదు. అంతేకాకుండా ఆసియా క్రీడల్లో స్వర్ణంతో పాటు రెండు రజతాలు సాధించారు. తమ ప్రతిభను గుర్తించడం లేదని, నజరానాలు ఇవ్వడం లేదని గగ్గోలు పెడుతున్న ఆటగాళ్లున్న ఈ రోజుల్లో.. ఇన్ని విజయాలందుకున్న మీరు స్థిత ప్రజ్ఞతతో ఉండడం.. చిరునవ్వుతో ముందుకు సాగడం అందర్నీ ఆకట్టుకుంది. ఫిన్లాండ్లోని టాంపెరెలో మొదలైన మీ జైత్రయాత్ర.. నిన్నటి చెక్ రిపబ్లిక్ అంతర్జాతీయ అథ్లెటిక్స్ మీట్ వరకు అప్రతిహతంగా కొనసాగింది. ఇది ఇలానే టోక్యో ఒలింపిక్స్-2020 వరకు కొనసాగాలని.. భారత్‌కు స్వర్ణపతకం అందించాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాం. -
ఏషియన్‌గేమ్స్ రజతం.. బంగారమైంది!
జకార్త : ఏషియన్ గేమ్స్-2018లో మిక్స్డ్ 4x400m రిలే విభాగంలో తొలిసారి భారత ట్రాక్ జట్టు రజత పతకం సాధించిన విషయం తెలిసిందే. అయితే ఆ రజతం కాస్త ఇప్పుడు స్వర్ణమైంది. ముహమ్మద్ అనస్ యాహియా, పూవమ్మ మచెట్టేరి, హిమదాస్, రాజీవ్ అరోకియాలతో కూడిన భారత బృందం 3:15.71 సమయంలో లక్ష్యాన్ని చేరుకొని రెండో స్థానంలో నిలిచింది. దీంతో భారత్ ట్రాక్‌జట్టుకు రజతం వరించింది. తొలి స్థానంలో నిలిచిన బెహ్రెయిన్(3:11.89) జట్టుకు స్వర్ణం దక్కగా.. కజకిస్తన్(3:19.52)కు కాంస్యం లభించింది. అయితే బెహ్రెయిన్ జట్టుకు చెందిన అథ్లెట్ కెమి అడెకోయ డోపింగ్‌టెస్ట్‌లో విఫలమవడంతో అథ్లెటిక్స్ ఇంటెగ్రిటీ యూనిట్ (ఏఐయూ) నాలుగేళ్లు నిషేధం విధించింది. అంతేకాకుండా 2018 ఆగస్టు 24 నుంచి 2018 నవంబర్ 2018 మధ్య కెమి అడెకోయ సాధించిన విజయాలకు అనర్హురాలిగా ప్రకటించింది. దీంతో ఏషియన్ గేమ్స్‌లో బెహ్రెయిన్ జట్టు గెలిచిన స్వర్ణం భారత్ వశమైంది. ఇక బెహ్రెయిన్ ఆటగాళ్లు ఉద్దేశపూర్వకంగానే తమ అథ్లెట్లకు పరుగు ఆటంకం కలిగించారని భారత అధికారులు అప్పట్లో ఫిర్యాదు చేశారు. చివరకు ఆ స్వర్ణం భారత్ వశం కావడం గమనార్హం. కెమి అడెకోయ 400m రిలే విభాగంలో స్వర్ణం సాధించగా.. భారత అథ్లెట్ అను రాఘవన్ నాలుగో స్థానంలో నిలిచింది. అయితే ఏఐయూ తాజా నిర్ణయంతో అనుకు కాంస్యం లభించింది. చదవండి: టాలెంట్‌కి ప్రశంసలేనా.. ఇంకేం లేదా? -
చేత కాకపోతే చెప్పండి: ఏషియన్ గేమ్స్ విజేత
సాక్షి, లక్నో: క్రీడాకారులు పతకాలు సాధించిన వెంటనే.. ప్రభుత్వాలు వారిపై వరాల జల్లు కురిపిస్తాయి. కొద్ది రోజులపాటు మీడియాలో హడావుడి చేసి, కావాల్సిన పబ్లిసిటి వచ్చాక అసలు విషయాన్ని మరిచిపోతాయి. ప్రభుత్వం ప్రకటించిన ఉద్యోగం, నగదు కోసం క్రీడాకారులు పోటీల్లో పరుగులు తీసినట్టు ఆఫీసుల చుట్టు పరుగులు తీస్తుంటారు. ప్రస్తుతం అలాంటి పరిస్థితే ఉత్తర ప్రదేశ్‌కు చెందిన వెటరన్ లాంగ్ డిస్టెన్స్ రన్నర్ సుధా సింగ్‌కు ఎదురైంది. ఆసియా గేమ్స్ 2018లో రజతం సాధించిన ఈ క్రీడాకారిణికి యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం ముప్పై లక్షల నగదుతో పాటు, క్రీడా శాఖలో అత్యున్నత ఉద్యోగం ఇస్తామని ప్రకటించింది. తాజాగా మంగళవారం జరిగిన ఓ కార్యక్రమంలో సీఎం యోగితో పాటు ఆ రాష్ట్ర గవర్నర్ రామ్ నాయక్ సుధాకు 30 లక్షల చెక్‌ను అందచేయగా.. ఆమె తిరస్కరించారు. తనకు కావాల్సింది డబ్బు కాదని ఉద్యోగమని సభా వేదికగా డిమాండ్ చేశారు. అనంతరం అధికారులు, యోగి బుజ్జగించాక చెక్ తీసుకున్నారు. కానీ ఉద్యోగం ఇవ్వకపోతే చెక్ వెనక్కి ఇచ్చేస్తానని ప్రకటించారు. గతంలో కూడా.. 2015లో కూడా అప్పటి ప్రభుత్వం క్రీడా శాఖలో ఉద్యోగం ఇస్తామని హామీ ఇచ్చిందని, కానీ ఇప్పటివరకు కార్యరూపం దాల్చలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అప్పటి సీఎంను మూడు సార్లు కలిసినా ప్రయోజనం లేకుండా పోయిందని ఆగ్రహించారు. తాను రైల్వే శాఖలో మంచి ఉద్యోగం చేస్తున్నప్పటికీ రాష్ట్ర క్రీడా శాఖలో ఉద్యోగం చేయాలనే కోరిక ఉందని, యువ ఆటగాళ్లకు చేయుతనివ్వాలనే ఉద్దేశంతోనే ఆ ఉద్యోగాన్ని కోరుకుంటున్నానని తెలిపారు. క్రీడాకారుల పట్ల ప్రభుత్వం వివక్ష చూపడం సరికాదన్నారు. తనకు ఇచ్చిన నగదును యువ క్రీడాకారుల శిక్షణ కోసం ఖర్చు చేస్తానని పేర్కొన్నారు. ఇవ్వడం సాధ్యం కాకపోతే చెప్పండి.. తనకు క్రీడా శాఖలో ఉద్యోగం ఇవ్వడం సాధ్యం కాదని అధికారులు చెబితే తను వేరే ప్రత్యామ్నాయం చూసుకుంటానని, యూపీ నుంచి ప్రాతినిథ్యం వహించబోనని స్పష్టం చేశారు. తొమ్మిది సార్లు జాతీయ చాంపియన్, ఆసియన్ గేమ్స్‌లో బంగారు, రజత పతకాలు, అర్జున అవార్డు సాధించిన తాను ప్రభుత్వ ఉద్యోగానికి పనికిరానా అంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. చదవండి: సుధా సింగ్‌కు యూపీ ప్రభుత్వ ఉద్యోగం -
హిమదాస్‌కు ఐఓసీలో ఉద్యోగం
గువాహటి: స్ప్రింట్ సంచలనం హిమదాస్‌కు ప్రభుత్వ చమురు కంపెనీ అయిన ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఓసీ) ఉద్యోగం ఇచ్చింది. అంతర్జాతీయ పోటీల్లో హిమ నిలకడగా రాణిస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవలే జరిగిన ఆసియా క్రీడల్లో రిలేలో స్వర్ణం సహా మూడు పతకాలు గెలుచుకుంది. ఆమె సాధించిన ఘన విజయాలకు ప్రోత్సాహంగా తమ సంస్థ మానవ వనరుల (హెచ్ఆర్) విభాగంలో గ్రేడ్ ‘ఎ’ ఆఫీసర్ ఉద్యోగం ఇచ్చినట్లు ఐఓసీ చీఫ్ జనరల్ మేనేజర్ ఉత్తియ భట్టాచార్య తెలిపారు. హిమదాస్‌కు ఉన్నతస్థాయి వేతన భత్యాలతో పాటు ఆమె పాల్గొనే ఈవెంట్ల కోసం ప్రయాణ, బస ఏర్పాట్లకయ్యే ఖర్చును తమ సంస్థే భరిస్తుందని ఆయన చెప్పారు. హిమ ఘనతను గుర్తించిన కేంద్రప్రభుత్వం ఇటీవల అర్జున అవార్డు కూడా బహూకరించింది. -
‘టాప్స్’లో భారత మహిళల హాకీ జట్టు!
న్యూఢిల్లీ: ఆసియా క్రీడల్లో రజతం సాధించిన భారత మహిళల హాకీ జట్టును త్వరలో టార్గెట్ ఒలింపిక్ పోడియం పథకం (టాప్స్)లో చేర్చనున్నారు. తదుపరి ‘టాప్స్’ సమావేశంలో జట్టులోని మొత్తం 18 మంది సభ్యులను ఈ పథకం కిందికి తేనున్నారు. ఇప్పటికే భారత పురుషుల జట్టు ‘టాప్స్’లో ఉంది. 48 మంది ప్రాబబుల్స్... ‘సాయ్’ ఆధ్వర్యంలో నేటి నుంచి బెంగళూరులో జరుగనున్న జాతీయ మహిళల శిబిరానికి హాకీ ఇండియా 48 మందితో కూడిన ప్రాబబుల్స్ జాబితా ప్రకటించింది. ఇందులో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన గోల్‌కీపర్ ఇతిమరపు రజని, తెలంగాణకు చెందిన ఫార్వర్డ్ యెండల సౌందర్య చోటు దక్కించుకున్నారు. -
హిమ దాస్‌కు అడిడాస్ స్పాన్సర్షిప్
న్యూఢిల్లీ: భారత స్టార్ అథ్లెట్ హిమ దాస్‌కు ప్రముఖ క్రీడా పరికరాల సంస్థ అడిడాస్ స్పాన్సర్షిప్ చేస్తుంది. ఈ మేరకు మంగళవారం జరిగిన కార్యక్రమంలో ఈ అస్సాం స్ప్రింటర్తో ఆ సంస్థ ఒప్పందం చేసుకుంది. ఈ ఒప్పందంలో భాగంగా 18 ఏళ్ల హిమకు అడిడాస్ కిట్ స్పాన్సర్ చేస్తుంది. ఫిన్ లాండ్లో జరిగిన ప్రపంచ అండర్–20 చాంపియన్‌షిప్‌లో బంగారు పతకం గెలిచిన భారత అథ్లెట్‌గా ఆమె చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే. ఆసియా క్రీడల్లో స్వర్ణంతో పాటు రెండు రజతాలు గెలిచింది. అందుకే అడిడాస్ కంపెనీ ఆమె కోసమే ప్రత్యేకంగా ప్రీమియం షూస్‌ను తయారు చేసి ఇచ్చింది. ఒక బూటుపై ప్రముఖంగా ‘హిమ దాస్’ అని... ఇంకోదానిపై ‘క్రియేట్ హిస్టరీ’ అని ముద్రించింది. ఈ సందర్భంగా ‘అడిడాస్ కుటుంబంలో చేరడం గర్వంగా ఉంది. అంతర్జాతీయ అథ్లెట్ల గ్రూపులో ఇప్పుడు నేను భాగమైనందుకు ఆనందపడుతున్నా. క్రీడా ప్రపంచంలో ఎంతో మందికి ఈ సంస్థ అండగానిలుస్తోంది. అడిడాస్ స్పాన్సర్‌షిప్‌తో నేను రెట్టించిన ఉత్సాహంతో రాణిస్తా. నా ప్రదర్శనను మెరుగుపర్చుకుంటా’ అని హిమ చెప్పింది. -
‘అర్జున’కు బాక్సర్ అమిత్
న్యూఢిల్లీ: ఆసియా క్రీడల్లో బంగారు పతకం గెలిచిన బాక్సర్ అమిత్ పంఘాల్‌ను ‘అర్జున’ అవార్డు కోసం భారత బాక్సింగ్ సమాఖ్య (బీఎఫ్ఐ) నామినేట్ చేసింది. ఇండోనేసియా ఆతిథ్యమిచ్చిన క్రీడల్లో అతను లైట్ ఫ్లయ్ వెయిట్ (49 కేజీలు) ఫైనల్లో ఒలింపిక్ చాంపియన్ దుస్మతోవ్ (ఉజ్బెకిస్తాన్)ను కంగుతినిపించాడు. దీంతో అతన్ని క్రీడాపురస్కారానికి నామినేట్ చేసినట్లు బీఎఫ్ఐ వర్గాలు తెలిపాయి. ఇప్పటికే సోనియా లాథర్, గౌరవ్ బిధూరిలను నామినేట్ చేశారు. 22 ఏళ్ల అమిత్ తన నామినేషన్‌పై సంతోషం వ్యక్తం చేశాడు. ‘నా పేరు నామినేట్ చేయడం గొప్ప గౌరవంగా భావిస్తున్నా. ఈ సంతోషాన్ని మాటల్లో చెప్పలేను. దీనిపై నాకంటే నా పతకమే బాగా మాట్లాడుతుంది’ అని చెప్పాడు. -
ఏషియాడ్ కాంస్య విజేత.. టీ అమ్ముతూ..
న్యూఢిల్లీ : హరీష్ కుమార్.. ఏషియన్ గేమ్స్-2018లో కాంస్యం సాధించిన భారత సెపక్ తక్రా జట్టులో సభ్యుడు. ప్రస్తుతం అతను టీ అమ్ముతున్నాడు. మెడల్ సాధించి టీ అమ్మడం ఏంటని మీడియా ప్రశ్నించగా.. తమది చాలా పేద కుటుంబమని, అందరూ పనిచేస్తేనే ఇళ్లు గడుస్తుందని తన దయనీయ స్థితిని వివరించాడు. ‘మాకున్న చిన్న టీ కొట్టులో మా కుటుంబానికి సాయంగా టీ అమ్ముతాను. ప్రతిరోజు రోజు నాలుగు గంటలు 2 నుంచి 6 మధ్య ప్రాక్టీస్ చేస్తాను. భవిష్యత్తులో మంచి ఉద్యోగం సాధించి నా కుటుంబానికి అండగా ఉండాలనుకుంటున్నాను’ అని తన మనసులోని మాటను చెప్పాడు. ప్రత్యేకంగా ఉండే సెపక్ తక్రా ఆట ఆడటం అంత సులవుకాదు. ఈ ఆటను ఆడటానికి తను ఎన్నో కష్టాలని పడ్డానని తెలిపాడు. ‘2011లో ఈ ఆటను ఆడటం ప్రారంభించాను. నా కోచ్ హెమ్రాజ్ నన్ను ఈ ఆటకు పరిచయం చేశారు. ఒకరోజు నేను నా స్నేహితులతో టైర్ ఆట ఆడుతుండగా మా కోచ్ చూసి నన్ను స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాకు తీసుకెళ్లారు. అప్పటి నుంచి ఉపకార వేతనాలు అందుకుంటూ ఆటను నేర్చుకున్నాను. దేశానికి మెడల్ సాధించాలనే పట్టుదలతో ప్రాక్టీస్ చేసేవాడిని.’ అని తెలిపాడు. హరీష్ తల్లి ఇందిరాదేవి మాట్లాడుతూ.. ‘ ఎన్నో కష్టాలు పడుతూ నా పిల్లలను పెంచాను. వీళ్ల నాన్న ఆటో డ్రైవర్. మాకు ఓ చిన్న టీకొట్టు ఉంది. నా కొడుకు సైతం టీ అమ్ముతూ మాకు ఆసరాగా ఉంటాడు. నా కొడుకుకు అన్ని సౌకర్యాలు కల్పించి మెడల్ సాధించేలా చేసిన ప్రభుత్వానికి ధన్యవాదాలు. అలాగే కోచ్ హెమ్రాజ్ సర్‌కు ఎంతో రుణపడి ఉంటాం.’ అని తెలిపారు. హరీష్ సోదరుడు ధావన్ మాట్లాడుతూ.. కాంస్యపతకం సాధించిన తన సోదరుడికి ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చి ఆదుకోవాలని విజ్ఞప్తి చేశాడు. ‘కొన్ని సార్లు మా ఇంటి అద్దెను కూడా చెల్లిచలేని ధీన స్థితిమాది. నా సోదరుడిని మొత్తం హేమ్రాజ్ సరే చూసుకున్నాడు. సాయ్ సాయం మరవలేని. అతని ఆటకు కావాల్సిన సామ్రాగ్రి ని అందజేయడంతో పాటు ఉపకార వేతనం అందించింది. రూ. 50 లక్షల రివార్డు ప్రకటించిన సీఎం కేజ్రీవాల్‌కు ధన్యవాదాలు. అలాగే నా సోదరుడికి ప్రభుత్వం ఉద్యోగం కల్పించి మా కుటుంబానికి అండగా నిలివాలి’ అని కోరాడు. -
మళ్లీ మెరిసిన సౌరభ్ చౌదరి
చాంగ్వాన్ (దక్షిణ కొరియా): ఆసియా క్రీడల్లో పసిడి పతకం నెగ్గి సంచలనం సృష్టించిన 16 ఏళ్ల భారత యువ షూటర్ సౌరభ్ చౌదరి అదే జోరును ప్రపంచ షూటింగ్ చాంపియన్‌షిప్‌లో కొనసాగించాడు. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ జూనియర్ ఈవెంట్లో అతను బంగారు పతకం సాధించాడు. ఈ పోటీలో సౌరభ్ 245.5 స్కోరుతో తన పేరిటే ఉన్న ప్రపంచ రికార్డు (243.7 పాయింట్లు)ను తానే అధిగమించి కొత్త రికార్డు సృష్టించాడు. జర్మనీలో జూన్‌లో జరిగిన జూనియర్ ప్రపంచకప్‌లో ఈ రికార్డు నెలకొల్పాడు. హోజిన్ లిమ్ (243.1 పాయింట్లు; కొరియా) రజతం నెగ్గగా, అర్జున్ సింగ్ చీమా (218 పాయింట్లు; భారత్) కాంస్యం గెలిచాడు. పలు టీమ్ ఈవెంట్లలో భారత షూటర్లు పతకాలపై గురి పెట్టారు. జూనియర్ పురుషుల ట్రాప్ టీమ్ ఈవెంట్లో అమన్ అలీ, వివాన్ కపూర్, మానవాదిత్య సింగ్ రాథోడ్‌లతో కూడిన భారత బృందం (348 పాయింట్లు) రజత పతకం గెలిచింది. సీనియర్ పురుషుల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ టీమ్ ఈవెంట్లో అభిషేక్ వర్మ, ఓంప్రకాశ్, షాజర్ రిజ్వీ బృందం (1738 పాయింట్లు) రజతం సాధించింది. -
పతకం పోయినా... 10 లక్షలు వచ్చాయి
న్యూఢిల్లీ: ఏషియాడ్‌లో దురదృష్టం వెంటాడి కాంస్యం కోల్పోయిన భారత అథ్లెట్ గోవిందన్ లక్ష్మణన్‌ను నజరానా వరించింది. కేంద్ర క్రీడల మంత్రి రాజ్యవర్ధన్ రాథోడ్... అతడిని నగదు పురస్కారానికి ఎంపిక చేశారు. ఈ లాంగ్ డిస్టెన్స్ రన్నర్ 10 వేల మీటర్ల పరుగులో మూడో స్థానంలో నిలిచాడు. కానీ మరో అథ్లెట్ నెట్టడంతో అతని అడుగు అనూహ్యంగా ట్రాక్ లైన్‌ను దాటి బయటపడింది. దీంతో అనర్హతకు గురై పతకాన్ని కోల్పోయాడు. మరో అథ్లెట్ తగలడం వల్లే అతను లైన్ దాటాడని భారత్ చేసిన అప్పీల్‌ను నిర్వాహకులు తోసిపుచ్చారు. అయితే పరుగును పూర్తిచేసిన లక్ష్మణన్ కఠోర శ్రమను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో నజరానాకు ఎంపిక చేసినట్లు రాథోడ్ తెలిపారు. -
ఒలింపిక్స్ పతకాలు సాధించాలి: మోదీ
న్యూఢిల్లీ: ఆసియా క్రీడల్లో పతకాలు సాధించిన అథ్లెట్లను అభినందించిన భారత ప్రధాని నరేంద్ర మోదీ... వారిని ఒలింపిక్స్ పతకాలపై దృష్టిపెట్టా లని సూచించారు. బుధవారం పతక విజేతలు ప్రధానిని ఆయన నివాసంలో కలిశారు. ఈ సందర్భంగా మోదీ వారితో ముచ్చటించారు. ‘ఇక్కడితోనే ఆగిపోవద్దు. ఈ పతకాలు, ప్రశంసలతోనే తృప్తిపడొద్దు. క్రీడల్లో సమున్నత లక్ష్యాలను చేరేవరకు విశ్రమించకండి. ఒలింపిక్స్ పతకాలే మీ లక్ష్యమైతే ఇప్పటి నుంచే కష్టపడండి. పోడియం విజేతలుగా నిలవండి’ అని మోదీ భారత అథ్లెట్లతో అన్నారు. ప్రధాని సూచనల్ని క్రీడాకారులంతా శ్రద్ధగా ఆలకించారు. ఏషియాడ్ విజేతల్లో కొందరు కుగ్రామాలకు చెందిన పేదలున్నారు. వీరిని చూసి ప్రధాని మోదీ పులకించిపోయారు. అసలేమాత్రం మౌలిక సదుపాయాలు లేని ప్రాంతాల నుంచి వచ్చి మట్టిలో మాణిక్యాలుగా ఎదిగిన వారిని ఆయన అభినందించారు. -
క్రికెటర్ల కన్నా వారే రియల్ హీరోలు: గంభీర్
న్యూఢిల్లీ : క్రికెటర్ల కన్నా ఇతర ఆటగాళ్లే రియల్ హీరోలని టీమిండియా సీనియర్ క్రికెటర్ గౌతం గంభీర్ అభిప్రాయపడ్డాడు. ఏ మాత్రం పేరు, డబ్బులు రాకున్నా క్రికెటేతర ఆటగాళ్లు ఎన్నో సమస్యల మధ్య విజయాలు సాధిస్తున్నారని కొనియాడారు. ముఖ్యంగా ఏషియన్ గేమ్స్‌లో భారత్ పతాకాన్ని రెపరెపలాడించి అథ్లెట్స్ రియల్ హీరోలు అని అభివర్ణించారు. టైమ్స్ ఆఫ్ ఇండియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘క్రికెటేతర ఆటగాళ్లు ఆర్థికంగా, సౌకర్యాల పరంగా చాలా ఇబ్బంది పడుతారు. కానీ పతకాలు సాధించకపోతే ప్రజలు వారిని అసలు గుర్తించడం లేదు. ఏషియన్ గేమ్స్‌లో భారత అథ్లెట్స్ అదరగొట్టారు. 69 పతకాలతో చరిత్ర సృష్టించారు. కానీ భారత్‌లో క్రికెట్‌కు ఉన్న ఆదరణ ఇతర క్రీడలకు లేదు. క్రికెటరేతర ఆటగాళ్లకు అన్ని ప్రతికూల అంశాలే. స్వప్న బర్మను చూస్తే రియల్ హీరోలు ఎవరో తెలుస్తోంది. నన్ను ఎవరైన ప్రశ్నిస్తే క్రికెటర్ల కన్నా వారే గొప్పవారని చెబుతా. క్రికెటర్లే కాకుండా దేశం తరపున ఇతర ఆటగాళ్లు సైతం రాణిస్తున్నారు. వారి ప్రతిభను గుర్తించి ప్రోత్సాహం అందించాలి’ అని గంభీర్ చెప్పుకొచ్చాడు. చదవండి: ఆ ‘స్వప్నం’ వెనుక ది వాల్ -
ఏషియాడ్ విజేతలకు సత్కారం
న్యూఢిల్లీ: ఆసియా క్రీడల్లో పతకాలు గెలుచుకున్న భారత క్రీడాకారులను కేంద్ర ప్రభుత్వం ఘనంగా సత్కరించింది. మంగళవారం ఇక్కడ జరిగిన కార్యక్రమంలో వారిని నగదు పురస్కారంతో ప్రోత్సహించింది. స్వర్ణం గెలిచిన ఆటగాళ్లకు రూ.30 లక్షలు చొప్పున లభించగా... రజతానికి రూ. 20 లక్షలు, కాంస్యానికి రూ.10 లక్షల చొప్పున అందజేశారు. 2018 ఆసియా క్రీడల్లో భారత్ 15 స్వర్ణాలు, 24 రజతాలు, 30 కాంస్యాలు కలిపి మొత్తం 69 పతకాలు గెలుచుకున్నది. క్రీడల చరిత్రలో ఇది మన దేశానికి అత్యుత్తమ ప్రదర్శన. సన్మాన కార్యక్రమానికి కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ముఖ్య అతిథిగా హాజరు కాగా... క్రీడా శాఖ మంత్రి రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్, పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తదితరులు కూడా పాల్గొన్నారు. ‘మన ఆటగాళ్ల ప్రదర్శన చాలా సంతోషాన్ని కలిగించింది. భవిష్యత్తులో భారత్ క్రీడల్లో కూడా సూపర్ పవర్‌గా ఎదుగుతుంది. విజేతలకు నా అభినందంతో పాటు ఆశీర్వాదాలు. క్రీడల పట్ల మంత్రి రాథోడ్‌కు ఉన్న అంకితభావం వెలకట్టలేనిది. ఇది భారతీయులందరికీ గర్వకారణం’ అని రాజ్‌నాథ్ వ్యాఖ్యానించారు. -
పట్టుదలగా శ్రమిస్తేనే పతకాలు
నలభై అయిదు దేశాలకు చెందిన 1,100మంది క్రీడాకారులు పక్షం రోజులపాటు వివిధ క్రీడాం శాల్లో పరస్పరం తలపడిన ఆసియా క్రీడోత్సవాలు ఇండొనేసియా రాజధాని జకార్తాలో ఆదివారం ముగిశాయి. ఆరంభ వేడుకల్లాగే ముగింపు సంరంభం కూడా కన్నులపండువగా సాగి అందరినీ అలరించింది. ఇటువంటి అంతర్జాతీయ క్రీడా సంబరాలు దేశాల మధ్య సదవగాహనను పెంచు తాయి. ఆరోగ్యకరమైన పోటీని, క్రీడాస్ఫూర్తిని రగిలిస్తాయి. క్రీడా రంగంలో దేశానికి ప్రాతినిధ్యం వహించే అవకాశం రావడమంటే మాటలు కాదు. ఆ అవకాశం దక్కించుకున్న ప్రతి ఒక్కరూ తమ తమ క్రీడల్లో అహర్నిశలూ శ్రమిస్తారు. తమ నైపుణ్యానికి పదునుబెట్టుకుంటారు. ప్రత్యర్థిని మట్టికరిపించి క్రీడాభిమానుల హృదయాల్లో చెరగని ముద్రేయాలని చూస్తారు. అయితే బరిలో అప్పటికప్పుడు మెరుపువేగంతో తీసుకునే సరైన నిర్ణయాలు విజయాన్నందిస్తాయి. ఎప్పటిలాగే చైనా 132 స్వర్ణాలతో, 92 రజతాలతో శిఖరాగ్రాన నిలిచి వేరెవరూ తన దరిదాపుల్లో కూడా లేకుండా చూసుకుంది. నిర్దేశించుకున్న లక్ష్యంతో పోలిస్తే ఇది తక్కువే కావొచ్చుగానీ... ఉన్నతమైన కలలు కనగలిగినవారే ముందుకు దూసుకెళ్తారు. చైనా ఆ పనే చేసింది. ‘డ్రాగన్’తో తలపడటం మాటలు కాదని ఆ దేశ క్రీడాకారులు నిరూపించారు. బ్యాడ్మింటన్, టేబుల్ టెన్నిస్, ఈత, జిమ్నా స్టిక్స్, బాస్కెట్‌బాల్, వాలీబాల్ వగైరాల్లో అసమాన ప్రతిభ కనబరుస్తూ వస్తున్న చైనాకు ఫుట్ బాల్లో సైతం అగ్రభాగాన నిలవాలన్న ఆశ ఎప్పటినుంచో ఉంది. కానీ అది ఇంతవరకూ నెరవేర లేదు. జకార్తాలో ఆ దేశ మహిళా టీం రజతం గెల్చుకున్నా, పురుషుల టీం బోల్తా పడింది. వచ్చే ఆసియా క్రీడోత్సవాలకు చైనాయే ఆతిథ్యమివ్వబోతున్నది గనుక ఫుట్‌బాల్‌లో సైతం బోణీ చేసేం దుకు మరింత పట్టుదలగా శ్రమిస్తుందనుకోవచ్చు. మన దేశం ఈసారి 15 స్వర్ణ పతకాలు, 24 రజతాలు, 30 కాంశ్య పతకాలు గెల్చుకుని ఫర్వా లేదనిపించింది. 1951లో జరిగిన తొలి ఆసియా క్రీడోత్సవాల్లో కూడా ఇదే స్థాయిలో స్వర్ణాలు సాధించాం గనుక కనీసం మొదలెట్టిన చోటుకైనా ఇప్పటికి చేరుకోగలిగామని సంతృప్తిపడాలి. ఎందుకంటే ఆ తర్వాత జరిగిన ఆసియా క్రీడోత్సవాల్లో కనీసం ఈ మాదిరి ప్రతిభ కూడా మనవాళ్లు కనబరచలేకపోయారు. 1951తో పోలిస్తే మన దేశ జనాభా నాలుగు రెట్లు పెరిగింది. అప్పటితో పోలిస్తే భిన్న రంగాల్లో ఎంతో ముందున్నాం. ఎంచుకున్న రంగంలో సమర్ధతను పెంచుకునేందుకు అనువైన శక్తిసామర్థ్యాలున్నాయి. ఈ కోణం నుంచి చూస్తే ఇప్పుడొచ్చిన పతకాలు తీసికట్టని చెప్పాలి. అంతర్జాతీయ క్రీడా సంబరాలు వచ్చినప్పుడల్లా గంపెడాశలు పెట్టుకోవటం... తీరా మన వాళ్లు ముఖాలు వేలాడేసుకు రావటం రివాజుగా మారింది. ప్రతిసారీ అంతక్రితం కంటే ఎంతో కొంత మెరుగ్గా ఉన్నారని సరిపెట్టుకుని సంతృప్తి పడటం తప్ప ఔరా అనిపించే స్థాయిలో ఆట తీరు ఉండటం లేదు. అందుకు ఈసారి కొన్ని మినహాయింపులున్నాయి. బహుళ క్రీడాంశాల సమా హారమైన హెప్టాథ్లాన్‌లో పసిడి పతకాన్ని సాధించిన స్వప్న బర్మన్ గురించి, బాక్సింగ్‌లో మోత మోగించిన అమిత్ పంఘాల్ గురించి ప్రత్యేకించి చెప్పుకోవాలి. వీరిద్దరూ పేదరికంలో పుట్టి, పేదరికంలో పెరిగినవారు. తాము ఎంచుకున్న క్రీడల్లో సాధన చేయడానికి కావల్సిన సాధనా సంపత్తులు వారిదగ్గర లేవు. స్వప్నబర్మన్ బెంగాల్‌లోని మారుమూల గ్రామంలో ఓ రిక్షా కార్మికుడి కుమార్తె. ఓ చిన్న రేకుల షెడ్డే వారి గూడు. పైగా తండ్రికి అయిదేళ్లక్రితం గుండెపోటు వచ్చి మంచా నికే పరిమితమయ్యాడు. పొట్టిగా ఉండటం వల్ల ఈ ఆటకు పనికిరావని కోచ్ తిరగ్గొట్టాడు. కాళ్లకు ఆరేసి వేళ్లుండటం వల్ల బూట్లు ధరించటం ఎంతో కష్టం. వాటికి పనికొచ్చేలా బూట్లు తయారు చేయించుకోవటం ఆమె వల్ల కాని పని. స్వప్న ప్రతిభను ఏ ప్రభుత్వ సంస్థా గమనించలేదు. అదృష్టవశాత్తూ మాజీ క్రికెటర్ రాహుల్ ద్రవిడ్ ప్రారంభించిన ఒక కార్యక్రమం వల్ల ఈ మట్టిలో మాణిక్యం వెలుగుచూసింది. 68 ఏళ్లనుంచి ఆ ఆటలో ఏ పతకమూ అందుకోలేకపోతున్న మన దేశానికి అనుకోని రీతిలో స్వర్ణాన్ని సాధించింది. బాక్సింగ్ స్టార్ అమిత్‌పంఘాల్ పరిస్థితీ అదే. బాక్సింగ్‌కు అవసరమైన గ్లోవ్స్ కూడా కొనుక్కోవటం అతని శక్తికి మించిన పని. దానికితోడు బాక్సింగ్‌లో ఉండేవారికి మంచి ఆహారం అవసరం. పేదరికం వల్ల అది కూడా పెద్దగా సాధ్య పడలేదు. ఇదే క్రీడలో అతనితోపాటు శిక్షణ పొందిన అతని అన్న అమిత్ కోసం బాక్సింగ్ నుంచి తప్పుకుని, సైన్యంలో చేరి నెలనెలా డబ్బు పంపుతూ ప్రోత్సహించాడు. ఇలా పడుతూ లేస్తూ శిక్షణ పొందిన అమిత్ జకార్తాలో ఓడించింది సాధారణ ప్రత్యర్థిని కాదు. రియో ఒలింపిక్స్‌లో చాంపి యన్‌గా నిలిచిన ఉజ్బెకిస్తాన్ క్రీడాకారుడు హసన్‌బోయ్ దుస్మతోవ్‌ను! చిత్తశుద్ధితో వెదకాలే గానీ ఇలాంటి స్వప్నలు, అమిత్‌లు దేశంలో వేలాదిమంది ఉంటారు. మెరికల్లాంటి అథ్లెట్ల కోసం టార్గెట్ ఒలిపింక్ పోడియం స్కీం(టీఓపీ) వంటి ప్రభుత్వ పథకాలున్నాయి. అవి కొందరికి అక్కరకొస్తు న్నాయి కూడా. కానీ చేరాల్సినంతమందికి ఆ పథకాలు చేరటం లేదు. వివిధ క్రీడాంశాల్లో ప్రతిభ కనబరిచేవారిని గుర్తించి వారికి అత్యంత నిపుణులైనవారితో శిక్షణ నిప్పించటం, అవసరమైన సదుపాయాలన్నీ కల్పించి ఏ లోటూ లేకుండా చూడటం ప్రభుత్వాల బాధ్యత. ఈ శిక్షణ, సదుపాయాల కల్పన ఏదో ఒక క్రీడా సందర్భాన్ని పురస్కరించుకుని చేస్తే చాలదు. అదొక నిరంతర ప్రక్రియగా ఉండాలి. దాన్నొక యజ్ఞంగా భావించాలి. పాఠశాలలు, కళాశాలల్లో క్రీడాంశాలను తప్పనిసరి చేయాలి. ఇతర పాఠ్యాంశాల్లాగే వాటికి కూడా మూల్యాంకన జరుగుతుండాలి. శిక్షణనివ్వడానికి ప్రతిభావంతులైనవారిని నియమించాలి. అంతే కాదు... విద్యా సంస్థల వెలుపల ఉంటున్న మెరికల్ని కూడా పసిగట్టాలి. మౌలిక సదుపాయాలకు ధారాళంగా నిధులు వెచ్చించాలి. ఇవన్నీ చేయగలిగితే దేశం తలెత్తుకునేలా, గర్వపడేలా అంతర్జాతీయ క్రీడా వేదికలపై మనవాళ్లు కూడా మెరుస్తారు. -
జీవితంలో కష్టాలు.. మైదానంలో బంగారాలు
నిన్నటితో ‘దంగల్’ ముగిసింది. దంగల్ అంటే.. తెలిసిందే, కుస్తీ! పతకం కోసం కుస్తీ.. పరువు కోసం కుస్తీ.ఊరికే కుస్తీ పడితే పతకం వస్తుందా? పరువు పతాకమై ఎగురుతుందా?! ప్రత్యర్థిని పడగొట్టాలి.. విజేతగా.. నిలబడాలి! ఈసారి ఏషియన్ గేమ్స్‌లో.. అమ్మాయిలదే దంగల్ అంతా! అది కాదు విషయం.. జీవితంతో కుస్తీ పడి వచ్చినవాళ్లే అంతా! లేమి లోంచి మెరిసిన ఈ మేలిమి బంగారాలు ఇప్పుడు మన దేశానికి.. గోల్డ్, సిల్వర్, బ్రాంజ్లను మించిన త్రివర్ణ ‘పతకాలు’!! 2018, జకార్తా ఏషియన్ గేమ్స్.. మన అమ్మాయిల దమ్ము చూపించింది. దుమ్ము రేపింది! ఈ ఆటల్లో మెడల్స్ సాధించిన చాలామంది అమ్మాయిలు కలిమిలోంచి వచ్చినవాళ్లు కాదు. మధ్యతరగతి, ఇంకా చెప్పాలంటే దిగువ మధ్యతరగతి కుటుంబాలకు చెందినవాళ్లు. ఆర్థిక బాధ్యతలను పంచుకుంటూ ఇంటి పరువునే కాదు, దేశ కీర్తినీ మోస్తున్న క్రీడాబలులు. జీవితంలోని హార్డిల్స్నూ అదే స్పిరిట్‌తో దాటుతున్న ఆ చిరుతలు తమ గెలుపుతో ప్రభుత్వ కర్తవ్యాన్నీ గుర్తుచేస్తున్నారు. మైదానంలో మాణిక్యాలు వినేశ్ ఫోగత్, చిత్రా ఉన్నికృష్ణన్, స్వప్నా బర్మన్, ద్యుతి చంద్, మలప్రభ జాధవ్, దివ్యా కక్రన్, హిమాదాస్, సరితాబెన్ లక్ష్మణ్ గైక్వాడ్, హర్షితా తోమర్, పింకీ బల్హారా.. ఒక్కొక్కరిదీ ఒక్కో నేపథ్యం! వినేశ్ ఫోగత్.. ఈ గేమ్స్‌లో మనదేశ మహిళా రెజ్లర్ల బలం చూపించింది.. 50 కేజీల ఫ్రీస్టయిల్ రెజ్లింగ్‌లో గోల్డ్ మెడల్ సంపాదించి! ఆమె మహావీర్ సింగ్ ఫోగత్‌కు స్వయానా తమ్ముడి బిడ్డ. మహావీర్ కూతుళ్లు గీత, బబితాలతో సమానమైన కుస్తీ మెళకువలున్నా గ్లాస్గో, స్కాట్లాండ్ కామన్వెల్త్ గేమ్స్‌లో విజయం సాధించినా పెద్దనాన్న పంచన నీడగానే ఉండిపోయింది. ఈసారే ఫోగత్ అనే ఇంటిపేరుతోనే కాక వినేశ్ అనే బంగారం కాంతితో మీడియాలో బ్యానర్ అయింది. వినేశ్ ఫోగత్‌కు అయిదేళ్లున్నప్పుడే తండ్రి రాజ్‌పాల్ ఫోగత్ చనిపోయాడు. ఫోగత్‌కు ఒక చెల్లి, తమ్ముడు. తల్లే ఆ ముగ్గురిని పెంచి పెద్ద చేసింది. తర్వాత వినేశ్‌ను మహావీర్ ఫోగత్ దత్తత తీసుకున్నాడు. తన బిడ్డలతోపాటుగా వినేశ్కూ కుస్తీ నేర్పాడు. పెళ్లి చేసి పంపకుండా ఆడపిల్లలకు కుస్తీపట్టడం నేర్పిస్తున్నాడు అంటే అత్తింట్లో జుట్టుపట్టుకొని పోట్లాడమనా అంటూ ఊరి (భివాణి, హర్యానా) పెద్దలు, కులస్థులు హేళన చేశారు, వెలివేశారు. అయినా ఫోగత్ పట్టుబట్టి ఆడపిల్లలను కుస్తీ వీరులుగా తయారు చేశాడు. అలా బతుకు యుద్ధాన్నీ నేర్చుకుంది వినేశ్. వాటిన్నిటినీ రింగ్‌లో ప్రత్యర్థిని నిలువరించేందుకు ప్రయోగిస్తోంది వినేశ్! చిత్రా ఉన్నికృష్ణన్ స్టోరీ సింపులేం కాదు.. కేరళలోని పాలక్కాడ్ జిల్లా, మందూరు ఆమె స్వస్థలం. చిత్రకు ఊహ తెలిసేటప్పటికే ఆకలి కడుపుతోనే ఆడుకోవడం అలవాటైంది. ఆమె తల్లిదండ్రులు కూలీలు. ఇద్దరూ కష్టడితేనే ఆరుగురు సభ్యులున్న ఆ కుటుంబానికి రెండు పూటలా తిండి దొరికేది. అర్ధాకలితో నిద్ర పోయిన రోజులే ఎక్కువ. పొట్టలో ఎలుకలు రన్నింగ్ రేస్ పెట్టుకొని రాత్రంతా కంటికి మీద కునుకుకు దూరం చేసినా పొద్దున్నే అయిదున్నరకల్లా తను చదువుకునే సర్కారు బడిలోని గ్రౌండ్‌కు పరుగెత్తేది. ఆ పట్టుదలే మొన్నటి ఏషియన్ గేమ్స్‌లో బ్రౌంజ్ మెడల్ వచ్చేలా చేసింది. ఆకలిని జయించింది. ఆత్మవిశ్వాసంతో విధిరాతను మార్చుకుంది. ఇప్పుడు ఒలింపిక్స్‌లో జయమే ధ్యేయంగా ప్రాక్టీస్‌ను ట్రాక్‌లో పెడుతోంది. పశ్చిమ బెంగాల్‌కు చెందిన స్వప్న బర్మన్.. హెపథ్లాన్‌లో బంగారు పథకం సాధించింది. ఈ అమ్మాయి కూడా పేదరికం ఫ్రెండ్షిప్తోనే పెరిగింది. తండ్రి పంచన్ బర్మన్ ఆటోడ్రైవర్. తల్లి బసనా టీ జల్పాయ్గురిలోని టీ ఎస్టేట్‌లో కూలీ. స్వప్నకు గోల్డ్‌మెడల్ వచ్చిందని తెలియగానే ఒక విషయాన్ని తలుచుకొని ఆ అమ్మ కంటతడి పెట్టింది. ‘‘అథ్లెట్స్‌కి బలమైన తిండి పెట్టాలి. పౌష్టికాహారం కాదు కదా నా బిడ్డకు కడుపునిండా కూడా తిండిపెట్టలేదు నేను’’ అంటూ! అయినా ఆ అమ్మాయి అమ్మ మీద అలగలేదు. నాకీ పరిస్థితి ఏంటీ అని కాళ్లు నేలకేసి కొట్టలేదు. ఆకలితో పరుగుపందెం పెట్టుకుంది. దానికి ఎప్పటికీ దొరకనంత దూరానికి వచ్చేసింది. ఒడిషా అమ్మాయి ద్యుతి చంద్‌కు హండ్రెడ్ మీటర్స్ రేస్‌లో సిల్వర్ మెడల్ వచ్చింది. మెడల్స్కన్నా టఫ్గేమ్ అయిన ఆత్మబలాన్ని దెబ్బతీసే సమస్యతో పోరాడి గెలిచింది ఆమె ఆ సక్సెస్ ముందు ఈ పథకాలు చిన్నవే. కాని ఆడడానికే ఆ పోరు నెగ్గింది కాబట్టి ఈ విజయం ద్యుతికి అమూల్యమైనదే. చేనేత కార్మికుల ఇంట ఏడుగురు సంతానంలో మూడో అమ్మాయిగా పుట్టింది ద్యుతి. ఆమె బాల్యమూ గొప్పగా ఏమీ గడవలేదు. అక్క సరస్వతి.. నేషనల్ లెవెల్ అథ్లెట్. ఆమె స్ఫూర్తితోనే ద్యుతి కూడా అథ్లెట్ అయింది. పదిహేడేళ్లకే రికార్డులు సృష్టించడం మొదలుపెట్టింది. విజయపరంపరతో దూసుకెళ్తున్న ద్యుతి లండన్ ఒలింపిక్స్‌లో కూడా పార్టిసిపేట్ చేయాల్సి ఉండింది. అథ్లెటిక్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ద్యుతి మీద వైద్య పరీక్షలు మొదలుపెట్టింది కారణం ఆమెకు చెప్పకుండానే. చివరకు ‘జెండర్ టెస్ట్’లో ఫెయిల్ అయినందుకు ఒలిపింక్స్‌లో పాల్గొనే చాన్స్ లేదని, నేషనల్ ఛాంపియన్షిప్ కూడా వదులుకోవాలని చెప్పారు ఆమెతో. ఆ మాట ఆమెను అచేతనం చేసింది. జెండర్టెస్ట్లో ఫెయిలవడానికి దారితీసిన ఆమె శారీరక పరిస్థితిని హైపర్ఆండ్రోనిజమ్ అంటారు. సాధారణ మహిళల్లో ఉండే కంటే ఎక్కువ పాళ్లలో ఆండ్రోజన్, టెస్టోస్టిరాన్ హర్మోన్లు ఆమె శరీరంలో ఉన్నాయి. ఈ స్థితిలో ఆమె స్త్రీలకు సంబంధించిన అథ్లెట్స్‌లో పాల్గొనే అవకాశం లేదు. ఆమెకు రెండే దారులు. ఒకటి.. ఆటలకు శాశ్వతంగా దూరం కావడం, రెండు.. హార్మోన్ రీప్లేస్మెంట్ థెరపీకి వెళ్లి ఆండ్రోజెన్ హర్మోన్ లెవెల్స్‌ను తగ్గించుకోవడం. అయితే ద్యుతి మూడో ఆప్షన్‌ను ఎన్నుకుంది. అలాంటి టెస్ట్‌కు వ్యతిరేకంగా పోరాడాలని. తనకు ఎదురైంది ఇంకే అమ్మాయికి ఎదురు కావద్దని. గెలిచింది. అప్పుడు.. ఇప్పుడు.. ఎప్పుడూ ఆమెది గెలుపు దారే! మలప్రభా జాధవ్.. రైతు బిడ్డ. కర్ణాటకలోని తుర్మూరు ఆమె జన్మస్థలం. జూడో కేటగిరీ కురాష్లో కాంస్య పథకం సాధించింది. ‘‘కురాష్ అనే ఒక ఆట ఉంటుందని కూడా నాకు తెలియదు. అమ్మాయిలకు ఈ ఆట వస్తే చాలా మంచిది. మీ అమ్మాయి చాలా చురుగ్గా ఉంది. నేర్పించండి అని కోచ్ చెబితే సర్లే స్కూల్లోనే కదా నేర్పిస్తున్నారు అని చేర్పించా’’ అన్నాడు మలప్రభ తండ్రి యెల్లప్ప జాధవ్. ఇప్పుడు కూతురు మెడల్ కొట్టిందని తెలియగానే ఆయన ఆనందానికి అంతులేదు. అన్నట్టు మలప్రభ తుర్మూరు పక్కనుంచే పారే ఒక నది. ఆ పేరే కూతురికి పెట్టుకున్నాడు యెల్లప్ప. తగ్గట్టుగానే ఎప్పుడూ నవ్వుతూ తుళ్లుతూ ఉంటుంది మలప్రభ. దివ్యాకక్రన్.. మహిళల ఫ్రీస్టయిల్ 68 కేజీల రెజ్లింగ్ పోటీల్లో బ్రౌంజ్ మెడల్ తెచ్చుకుంది. ఢిల్లీలో పుట్టిపెరిగిన దివ్యా దిగివ మధ్యతరగతి కుటుంబం. నాయి సామాజికవర్గం. తల్లి లంగోటాలు కుడితే.. తండ్రి వాటిని అమ్మి కుటుంబాన్ని పోషిస్తున్నాడు. అరకొర వసతులతో అడ్జస్ట్ అవుతూ స్పోర్ట్స్‌లో సత్తా చూపుతోంది దివ్యా. స్పోర్ట్స్కోటాలోనే నోయిడా కాలేజ్‌లో ఫిజికల్ ఎడ్యుకేషన్‌లో బ్యాచలర్స్ డిగ్రీ చేస్తోంది. హిమాదాస్.. జకార్తా ఏషియన్ గేమ్స్ కన్నా ముందే ప్రాచుర్యంలోకి వచ్చిన అథ్లెట్. అస్సాంలోని నాగోన్ జిల్లా, కంధులిమరి అనే ఊళ్లో పుట్టింది. తండ్రి రొంజిత్ దాస్, జొనాలి దాస్ తల్లిదండ్రులు. రైతులు. అయిదుగురు పిల్లల్లో ఆఖరు సంతానం హిమాదాస్. ఈశాన్య రాష్ట్రాలంటే మిగతా దేశానికి ఉన్న చిన్నచూపు, ఆర్థిక ఇబ్బందులు అన్నింటినీ ఎదుర్కొంది హిమా. ముందు ఫుట్‌బాల్ అంటే ఆసక్తి చూపింది. బాగా ఆడేది కూడా. కాని మన దగ్గర ఫుట్‌బాల్ పట్ల అనాదరణ, అసలు మహిళా టీమ్ అన్న జాడే లేకపోవడంతో అథ్లెటిక్స్ వైపు మొగ్గు చూపింది. విజయాల ట్రాక్ మీద ఉరుకుతూ మొన్నటి ఏషియన్ గేమ్స్‌లో మహిళల 400 మీటర్స్ డెస్టినేషన్‌లో సిల్వర్ సాధించింది. సరితాబెన్ లక్ష్మణ్‌భాయి గాయక్వాడ్.. గుజరాత్‌కు చెందిన ట్రైబల్ గర్ల్. దుగా జిల్లాలోని ఖరాది అంబ స్వగ్రామం. పేదింటి పిల్ల. ఏషియన్‌గేమ్స్‌లో పాల్గొనేందుకు అరకొర డబ్బుల్తోనే జకార్తా వచ్చింది. డబ్బు సరిపోవట్లేదని గుజరాత్లో తెలిసిన వాళ్లకు ఫోన్ చేస్తే వాళ్లు డబ్బు పంపారు. ఈ గేమ్స్‌లో 4 ఇంటూ 400 రిలేలో గోల్డ్ మెడల్ తెచ్చిపెట్టింది. పింకీ బల్హారా... ఢిల్లీ అమ్మాయి. మధ్యతరగతి కుటుంబం. జూడో అంటే ఇష్టం. ఈ ఏషియన్ గేమ్స్‌లో కురాష్లో రజత పథకం సాధించింది. ప్రాక్టీస్ మొదలుపెట్టినప్పటి నుంచీ హార్డిల్సే. ఉమ్మడి కుటుంబంలో కజిన్ చనిపోయాడు. ఆ తర్వాత హఠాత్తుగా తండ్రి చనిపోయాడు. ఆ విషాదాన్ని పిడికిలిలో బిగించి రింగ్‌లోకి వచ్చింది. కొడుకు పోయాడన్న దిగులుతో పింకీ తాత (తండ్రి తండ్రి) చనిపోయాడు. ఈ విషయాన్ని పింకీకి చెప్పకుండా దాచారు ఇంట్లోవాళ్లు. ఆమె పోటీలో నెగ్గాక విషయం చెప్పారు. పుట్టెడు దుఃఖాన్ని పంటిబిగువన పెట్టి పథకం తెచ్చింది. కూతురికి తోడుగా జకార్తా వెళ్లాలనుకున్నాడు పింకీ వాళ్ల నాన్న. ఆమె గెలుపు చూడకుండానే వెళ్లిపోయాడు. కండబలంతో మైదానాన్ని ఓడిస్తూ .. గుండెబలంతో జీవితాన్ని విన్ అవుతున్నారు వీళ్లంతా! బతుకు పోడియం ఎక్కి సమాజం సృష్టించిన తారతమ్యాలు తలదించుకునేలా చేస్తున్నారు. ఈ సామర్థ్యాన్ని ఇంకా పరీక్షించొద్దు. ఈ ప్రతిభకు ఇంకా పోటీలు పెట్టొద్దు. ఎన్ని అడ్డంకులున్నా దీక్షకు అడ్డురావని చూపారు. ఆటలు అనగానే ఒక సానియా, ఒక సైనా.. ఒకే ఒక సింధు కాదు.. ఏషియన్ గేమ్స్‌లో ఇండియా జెండా ఎగరేసిన చాలామంది క్రీడాకారిణులున్నారు. స్పాన్సర్షిప్స్కు ఒక టెన్నిస్.. ఇక స్వా్కషే కాదు.. అథ్లెటిక్స్ కూడా ఉంటాయి. ఆటలను గ్లామర్ హంగులతో కాదు... స్పోర్టివ్ స్పిరిట్‌తో చూద్దాం! వీళ్ల జీవితాలను ట్రాక్ మీదకు తెద్దాం! – సరస్వతి రమ -
గ్లోవ్స్ కొనడానికి కూడా డబ్బుల్లేవు..
హరియాణా:ఆసియా క్రీడల్లో భారత యువ బాక్సర్ అమిత్ పంఘాల్ సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. రియో ఒలింపిక్ చాంపియన్ దుస్మతోవ్‌ను ఓడించి భారత్‌కు స్వర్ణ పతకాన్ని సాధించి పెట్టాడు. ఆసియా క్రీడల 49 కిలోల లైట్ ఫ్లై విభాగంలో అమిత్ 3-2తో విజయం సాధించి పసిడిని ముద్దాడాడు. అయితే, అమిత్ ఈ దశకు చేరుకోవడానికి జీవితంలో ఎన్నో కష్టాలు పడ్డాడు. అతని క్రీడా పయనం అంతా సులువుగా ఏమీ సాగలేదు. హరియాణాలో మైనా గ్రామంలో జన్మించిన అమిత్ విజయాల వెనుక అతని అన్న అజయ్ త్యాగమే ప్రధానంగా కనిపిస్తోంది. బాక్సింగ్‌లో రాణిస్తున్న సమయంలో అతడి సోదరుడు అజయ్.. తమ్ముడు అమిత్ కోసం కెరీర్‌ను త్యాగం చేశాడు. వారిద్దరూ క్రీడల్లో ముందుకు సాగేందుకు వారి పేదరికం అడ్డుపడింది. 12 ఏళ్ల క్రితం అజయ్, అమిత్.. ఇద్దరూ హరియాణాలోని రోహ్తక్ సమీపంలోని మైనా గ్రామంలోని ప్రైవేట్ అకాడమీలో బాక్సింగ్ శిక్షణ కోసం చేరారు. కొన్నాళ్లకు ఆర్థిక పరిస్థితుల కారణంగా బాక్సింగ్ నుంచి అజయ్ తప్పుకున్నాడు. కుటుంబ పోషణ కోసం ఆర్మీలో చేరాడు. అనంతరం అమిత్ బాక్సింగ్‌ను కొనసాగించాడు. తన త్యాగం వృథాగా పోలేదని గతేడాది ఆసియన్ ఛాంపియన్‌షిప్‌లో అమిత్ కాంస్యం గెలవడంతో తనకు ఎంతో సంతోషాన్నించిందని అజయ్ తెలిపాడు. తాజాగా ఆసియా క్రీడల్లో అమిత్ స్వర్ణం గెలిచి హీరోగా నిలవడంతో తన ఆనందానికి అవధులు లేవని చెబుతున్నాడు. త్యాగానికి మంచి ప్రతిఫలం లభించిందని పేర్కొన్నాడు. ‘మా ఇద్దరికీ బాక్సింగ్ గ్లోవ్స్ కొనివ్వడానికి కూడా మా నాన్న వద్ద డబ్బులు ఉండేవి కావు. ఒట్టి చేతులతోనే శిక్షణ తీసుకోవాల్సి వచ్చేది. అమిత్ అలానే బాక్సింగ్ ప్రాక్టీస్ చేసేవాడు. మరొకవైపు బాక్సింగ్‌లో రాణించాలంటే మంచి ఆహారం కూడా తీసుకోవాలి. అది ఖర్చుతో కూడుకున్నది. నా తమ్ముడైనా బాక్సింగ్‌లో రాణించాలని నేను త్యాగం చేశాను. ఆర్మీలో చేరాను' అని అజయ్ అనాటి రోజులను గుర్తుచేసుకున్నాడు. భారత్ పసిడి పంచ్ -
అట్టహాసంగా ఏషియాడ్ ముగింపు వేడుకలు
-
ఆ ‘స్వప్నం’ వెనుక రాహుల్ ద్రవిడ్
కోల్‌కతా: స్వప్న బర్మన్ ప్రస్తుతం సోషల్ మీడియాలో మారుమోగుతున్న పేరు. ఏషియన్ గేమ్స్ ముందు వరకు అసలు ఈమె ఎవరో కూడా తెలియదు. కానీ ఈ టోర్నీలో భారత్ 68 ఏళ్ల నిరీక్షణను తెరదించుతూ హెప్టథ్లాన్ విభాగంలో తొలిసారి స్వర్ణం సాధించి చరిత్ర సృష్టించింది ఈ బెంగాల్ అమ్మాయి. అప్పటి నుంచి ఈ అథ్లెట్‌పై ప్రశంసల జల్లు కురుస్తోంది. సామాన్యుడి నుంచి ప్రధాని వరకు ఆమె ప్రతిభను కొనియాడుతున్నారు. మీడియాలో అయితే ఆమెకు సంబంధించి పుంఖాను పుంఖాను కథనాలు వెలువడుతున్నాయి. ఇలా గత వారంలో రోజులగా ఆమె పేరు దేశ్యాప్తంగా మారుమోగుతుంది.(మమతాజీ..10 లక్షల సాయమేనా?) స్వప్నబర్మన్ ఓ నిరుపేద అథ్లెట్ అని, రెక్కాడితేగాని డొక్కాడని కుటుంబం నుంచి వచ్చి పతకం సాధించిందన్న విషయం తెలిసిందే. అయితే ఈ నిరుపేద అథ్లెట్‌కు అండగా నిలిచింది భారత మాజీ క్రికెటర్, దివాల్ రాహుల్ ద్రవిడ్. స్వప్న బర్మన్ తండ్రి ఓ రిక్షా పుల్లర్. ఆయనకు రెండు సార్లు గుండెపోటు రావడంతో మంచానికే పరిమితమయ్యాడు. తల్లి టీ తోటలో పనిచేపే దినసరి కూలి. ఈ పరిస్థితుల్లో స్మప్న ఆటను కొనసాగించడం కష్టమైంది. దీంతోనే ఆమె తన ఆటకు స్వస్తి చెప్పాలని నిర్ణయించుకుంది. అదే జరిగితే నేడు భారత్ ఓ బంగారం లాంటి అథ్లెట్‌ను కోల్పోయేది. ఆమె ప్రతిభ గురించి తెలుసుకున్న ద్రవిడ్ ఆర్థికంగా చేయూతనిచ్చాడు. ద్రవిడ్ మెంటార్ షిప్ కార్యక్రమం ద్వారా ఆర్థికంగానే కాకుండా మానసికంగా ధృడం అయ్యేలా శిక్షణను ఇచ్చాడు. ఆమెకే కాదు 2018 ఏషియాడ్‌లో పాల్గొన్న మరో 19 అథ్లెట్లకు ‘వాల్ ఆఫ్ క్రికెట్’ అనే పేరుతో ఆర్థికంగా సాయం చేసి ప్రోత్సాహించాడు. గో స్పోర్ట్స్ భాగస్వామ్యంతో ద్రవిడ్ ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. మారుమూల గ్రామాల్లోని క్రీడా ఆణిముత్యాల ప్రతిభను వెలకితీయడమే ఈ ప్రోగ్రాం ప్రధాన ఉద్దేశ్యం. ఇలా ఎంతో మంది అథ్లెట్లను ద్రవిడ్ ప్రపంచానికి పరిచయం చేశాడు.. చేస్తున్నాడు. చదవండి: 'స్వప్న' సాకారం -
జకార్తా జిగేల్...
ఒక దీవి... 2 వేదికలు...45 దేశాలు... 40 క్రీడాంశాలు 11000 అథ్లెట్లు... లక్షల్లో వీక్షకులు...15 రోజుల ఏషియాడ్ ‘షో’కు తెరపడింది. ఆరంభానికి తీసిపోని విధంగా ముగింపు వేడుకలు అట్టహాసంగా జరిగాయి. బాలీవుడ్ చిత్రగీతాలు వేదికపై హైలైట్ అయ్యాయి. వేడుకకే శోభ తెచ్చాయి. ఇండోనేసియాలో రెండోసారీ ఆసియా క్రీడలు సూపర్ హిట్టయ్యాయి. జకార్తా: ఆటలు ఆగాయి. పాటలు సాగాయి. మిరుమిట్లు మిన్నంటాయి. వెలుగులు వెన్నెలనే పరిచాయి. ఆరంభం అదిరినట్లే... ముగింపు శోభ కనువిందు చేసింది. మొత్తానికి వేడుక ముగిసింది. వేదిక మురిసింది. అథ్లెట్లకు, అధికారులకు ఆతిథ్య ఇండోనేసియా బరువెక్కిన హృదయంతో వీడ్కోలు పలికింది. పతకాలు గెలిచిన అథ్లెట్లంతా గర్వంగా జకార్తాను వీడితే... పోరాడిన అథ్లెట్లు మళ్లీ లక్ష్యంపై స్ఫూర్తితో ముందుకు సాగారు. ఈ క్రీడల చివరిరోజు ఆదివారం మిక్స్డ్ ట్రయాథ్లాన్ ఈవెంట్ జరిగింది. జపాన్ బృందం ఈ గేమ్స్ చివరి స్వర్ణాన్ని సాధించింది. ఆటలేమో చూడలేదు కానీ! ఇండోనేసియా వాసులు ఇక్కడి ‘గెలోరా బంగ్ కర్నో’ స్టేడియంలో జరిగిన ఆటల్ని పట్టించుకోలేదు. ట్రాక్ అండ్ ఫీల్డ్ క్రీడాంశాలు ఇక్కడే జరిగినా... ఎందుకనో అంతగా ఆసక్తి కనబరచలేదు. అయితే వినోదాన్ని పంచే ముగింపు ఉత్సవానికి మాత్రం ఎగబడ్డారు. దీంతో 76 వేల సీట్ల సామర్థ్యం ఉన్న గెలోరా వేదిక ప్రేక్షకులతో కిక్కిరిసిపోయింది. రెండు గంటల పాటు సాగిన ఈ ముగింపు వేడుకల్ని వారంతా తనివితీరా ఆస్వాదించారు. ముఖ్యంగా ఇండోనేసియా వారికి బాలీవుడ్ చిత్రాలన్నా, స్టార్లన్నా ఎక్కడలేని క్రేజ్. అందుకేనేమో సిద్ధార్థ్ స్లాథియా, డెనద పాడిన ‘కోయి మిల్ గయా’, ‘కుచ్ కుచ్ హోతా హై’, ‘జై హో’ పాటలకు జేజేలు పలికారు. స్టేడియంపై ఆకాశ వీధిలో బాణసంచా వెలుగులు మిరుమిట్లు గొలిపాయి. ఆసియా స్ఫూర్తిని చాటేలా భారత్, చైనా, ఉభయ కొరియాలకు చెందిన కళాకారులు ఈ వేడుకల్లో పాల్గొన్నారు. మార్చ్‌పాస్ట్‌లో హాకీ ప్లేయర్ రాణి రాంపాల్ త్రివర్ణ పతా కంతో భారత జట్టును నడిపించింది. రెండువారాల క్రితం ఆరంభోత్సవంలో ఇండోనేసియా అధ్యక్షుడు జొకొ విడోడో బైక్ స్టంట్తో వేదికకు విచ్చేయగా... ఈసారి వీడియో సందేశంతో వచ్చారు. క్రీడాప్రపం చాన్ని ఉర్రూతలూగించిన ఈ గేమ్స్‌ను ఆస్వా దించిన వారికి ఆయన అభినందనలు తెలి పారు. ఈ వేడుకల్ని అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ అధ్యక్షుడు థామస్ బాచ్, ఆసియా ఒలింపిక్స్ కౌన్సిల్ చీఫ్ అహ్మద్ అల్ ఫహాద్ స్టేడియంలోని వీఐపీ గ్యాలరీ నుంచి ప్రత్య క్షంగా వీక్షించారు. 2022 ఆసియా క్రీడలు చైనాలోని హాంగ్జౌ నగరంలో జరుగుతాయి. ఈ ఆసియా క్రీడల్లో 45 దేశాలు పాల్గొనగా... 37 దేశాలు కనీసం కాంస్య పతకాన్ని సాధించాయి. శ్రీలంక, పాలస్తీనా, ఈస్ట్ తిమోర్, బంగ్లాదేశ్, మాల్దీవులు, భూటాన్, బ్రూనై దేశాలు రిక్తహస్తాలతో వెనుదిరిగాయి. -
ముగింపులో పతాకధారి రాణి రాంపాల్
జకార్తా: ఆదివారం ఆసియా క్రీడల ముగింపు వేడుకల్లో భారత బృందానికి మహిళల హాకీ జట్టు సారథి రాణి రాంపాల్ పతకధారిగా వ్యవహరించనున్నారు. భారత త్రివర్ణ పతకాన్ని చేతబూని మన బృందానికి ముందుండి నడవనున్నారు. రాణి నేతృత్వంలోని హాకీ జట్టు రజతం సాధించింది. భారత విజయాల్లో ఆమెది కీలక పాత్ర. ఆరంభ వేడుకల్లో జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా పతాకధారిగా వ్యవహరించిన సంగతి తెలిసిందే. ఈ ఆసియా గేమ్స్‌లో భారత్‌కి చెందిన దాదాపు 550 మంది క్రీడాకారులు పోటీపడగా మొత్తం 69 పతకాలు లభించాయి. ఇందులో 15 స్వర్ణాలు, 24 రజతాలతో పాటు 30 కాంస్య పతకాలు ఉన్నాయి. ముగింపు వేడుకల్లో భారత పతాకధారిగా మహిళల హాకీ టీమ్ కెప్టెన్ రాణి రాంపాల్ ఎంపికైంది. ఈ మేరకు భారత ఒలింపిక్ అసోషియేషన్ (ఐఓఏ) అధ్యక్షుడు నరీందర్ బాత్రా శనివారం అధికారిక ప్రకటన చేశారు. ఆరంభ వేడుకల్లో జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా భారత జట్టును ముందుండి నడిపించిన సంగతి తెలిసిందే. ఆసియా గేమ్స్‌లో 20 ఏళ్ల తర్వాత ఫైనల్‌కి చేరిన భారత మహిళల హాకీ జట్టు శుక్రవారం జపాన్ చేతిలో ఓడిపోయి రజతంతో సరిపెట్టుకున్న సంగతి తెలిసిందే. కాగా, రాణి రాంపాల్ జట్టును నడిపించిన తీరుకి మెచ్చిన ఐఓఏ ఆమెకి ఈ అవకాశాన్ని కల్పించింది. అయితే ఇప్పటికే చాలా మంది అథ్లెట్స్ ఇండోనేషియా నుంచి భారత్‌కి వచ్చేశారు. ప్రస్తుతం కొంతమంది మాత్రమే అక్కడ ఉన్నారు. -
ఏషియన్ గేమ్స్: భారత్ పసిడి పంచ్
-
బ్రిడ్జ్‌లో జయకేతనం
ఏషియాడ్‌లో తొలిసారి ప్రవేశపెట్టిన క్రీడాంశం ‘బ్రిడ్జ్’లో భారత్ స్వర్ణం గెల్చుకుంది. శనివారం పురుషుల పెయిర్ ఈవెంట్ ఫైనల్లో ఐదు రౌండ్లు పూర్తయ్యేసరికి భారత్ జోడీ ప్రణబ్ బర్దన్, శివ్‌నాథ్ సర్కార్ 384 పాయింట్లు స్కోరు చేశారు. ప్రత్యర్థి చైనా జంట లిగ్జిన్ యాంగ్, గాంగ్ చెన్ 378 పాయింట్ల వద్దే నిలిచిపోయింది. ఇండోనేసియా (374 పాయింట్లు), హాంకాంగ్ (373 పాయింట్లు) మూడు, నాలుగు స్థానాల్లో నిలిచాయి. ఈ విజయంతో 60 ఏళ్ల బర్దన్... అత్యంత పెద్ద వయసులో పతకం గెలిచిన భారత క్రీడాకారుడిగా రికార్డులకెక్కాడు. అతడి సహచరుడు శివ్‌నాథ్ వయసు 56 ఏళ్లు కావడం విశేషం. మరోవైపు మిక్స్డ్ పెయిర్ ఫైనల్లో భారత్ జంట బాచిరాజు సత్యనారాయణ, కిరణ్ 333 పాయింట్లతో ఐదో స్థానంలో నిలిచి కొద్దిలో పతకం కోల్పోయింది. బ్రిడ్జ్‌లో మన దేశానికి ఒక స్వర్ణం (పురుషుల పెయిర్), రెండు కాంస్యాలు (పురుషుల టీమ్, మిక్స్డ్ టీమ్) లభించాయి. జూద క్రీడ కాదు... అందరూ భావించినట్లు బ్రిడ్జ్ జూద క్రీడ కాదని... నైపుణ్యం, అదృష్టం కలగలిసిన ఆట అని అంటున్నారు బర్దన్. చెస్లాగానే మేధో క్రీడ అని, దానికంటే మరింత చాలెంజింగ్ అని అభివర్ణిస్తున్నారు. అందరికీ మొదటి సెట్ కార్డులే వస్తాయి కాబట్టి, పరిస్థితిని అర్ధం చేసుకుని ఆడినవారే విజేతగా నిలుస్తారని చెబుతున్నాడు. ఇది అన్ని వయసుల వారు ఆడే క్రీడ అని శివ్‌నాథ్ సర్కార్ వ్యాఖ్యానించారు. ఫైనల్ ముందు రాత్రి తాను నిద్ర పోలేదని, ఉదయం కేవలం పండ్లు మాత్రమే తీసుకుని బరిలో దిగానని సర్కార్ చెప్పడం విశేషం. -
భారత్ అత్యుత్తమ ప్రదర్శన
బాక్సింగ్‌లో కుర్రాడు అమిత్ అదరగొట్టగా... బ్రిడ్జ్‌లో పెద్దోళ్లు ప్రణబ్ బర్దన్, శివ్‌నాథ్ సర్కార్ చేయి తిరగడంతో జకార్తా ఏషియాడ్‌ను భారత్ తమ అత్యధిక పతకాల రికార్డుతో ముగించింది. స్క్వాష్‌లో భారత మహిళల జట్టు రజతం... పురుషుల హాకీలో కాంస్యం సాధించడం ఊరటనిచ్చాయి. శనివారంతో మన ఆటగాళ్లు పాల్గొనే ఈవెంట్లు పూర్తికాగా... మొత్తం 15 స్వర్ణాలు ఖాతాలో చేరాయి. ఢిల్లీ ఆతిథ్యమిచ్చిన తొలి (1951) ఆసియా క్రీడల తర్వాత మళ్లీ ఇన్నాళ్లకు భారత్ 15 పసిడి పతకాలు సాధించడం విశేషం. దీంతోపాటు 24 రజతాలు, 30 కాంస్యాలతో మొత్తం 69 పతకాలు నెగ్గి ఆసియా క్రీడల చరిత్రలోనే తమ అత్యుత్తమ ప్రదర్శనను నమోదు చేసి అభిమానులకు అమితానందం కలిగించింది. నేడు జరిగే ముగింపు వేడుకలతో జకార్తా ఏషియాడ్‌కు తెర పడనుంది. జకార్తా: బరిలో దిగబోతున్నది ఫైనల్ బౌట్... ప్రత్యర్థి రియో ఒలింపిక్స్ చాంపియన్, ఆసియా విజేత... ఇటు చూస్తే 22 ఏళ్ల కుర్రాడు... ఇటీవలే అతడి చేతిలో ఓటమి పాలయ్యాడు! పైగా తొలిసారిగా ఏషియాడ్‌లో దేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్నాడు! ఈ సమీకరణాలన్నీ చూస్తే ఆ యువకుడు చిత్తుగా ఓడిపోయి ఉండాలి.! కానీ, అంతా తారుమారైంది. అద్భుతం జరిగింది. స్వర్ణం భారత్ సొంతమైంది. దీనంతటినీ సాధించింది హరియాణా బాక్సర్ అమిత్ పంఘాల్. 49 కేజీల విభాగంలో శనివారం జరిగిన తుది పోరులో అతడు 3–2 తేడాతో హసన్‌బోయ్ దుస్మతోవ్ (ఉజ్బెకిస్తాన్)ను మట్టికరిపించి రింగ్‌లో ఈ ఆసియా క్రీడల్లో దేశానికి తొలి బంగారు పతకం అందించాడు. తేలిపోతాడనుకుంటే... ఫైనల్లో చురుకైన వ్యూహం, వేగం, చక్కటి డిఫెన్స్, దూకుడుతో పాటు ఎలాంటి తప్పులు చేయకుండా అమిత్... దుస్మతోవ్ ఆట కట్టించాడు. ఓవైపు ప్రత్యర్థికి చిక్కకుండా చూసుకుంటూనే బలమైన పంచ్‌లు విసిరాడు. సహజంగా ఎదురు దాడితో దెబ్బతీసే దుస్మతోవ్... అమిత్ జోరుముందు ఆ పనీ చేయలేకపోయాడు. చివరకు వచ్చేసరికి పూర్తిగా అలసిపోయాడు. దీంతో అమిత్‌ను విజయం వరించింది. ‘ప్రపంచ చాంపియన్‌షిప్‌లో దుస్మతోవ్ చేతిలో పరాజయానికి బదులు తీర్చుకున్నా. కోచ్‌లు నన్ను బాగా సిద్ధం చేశారు. ఇంగ్లండ్‌లో శిక్షణ, భారత్‌లో సన్నాహక శిబిరంలో పాల్గొనడం ఉపయోగపడింది’ అని అమిత్ అన్నాడు. గతేడాది ఆసియా చాంపియన్‌షిప్‌లో కాంస్యం నెగ్గిన అమిత్... కామన్వెల్త్ క్రీడల్లో రజతం గెలిచాడు. ఈ ఏషియాడ్‌లో బాక్సింగ్‌లో భారత్‌కు రెండు పతకాలు (అమిత్ స్వర్ణం, వికాస్ కాంస్యం) లభించాయి. పురుషుల హాకీ జట్టుకు కాంస్యం డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలో దిగి... గోల్స్ వర్షంతో ప్రత్యర్థిని బెంబేలెత్తించి... సెమీస్‌లో మలేసియాపై చతికిలపడిన భారత పురుషుల హాకీ జట్టు... వర్గీకరణ మ్యాచ్‌లో దాయాది దేశం పాకిస్తాన్‌పై చక్కటి విజయంతో ఏషియాడ్‌లో కాంస్యం నెగ్గి పరువు దక్కించుకుంది. ఆట ఆరంభంలో ఆకాశ్‌దీప్ సింగ్ (3వ ని.లో)... ముగింపులో హర్మన్‌ప్రీత్ సింగ్ (50వ ని.లో) మెరవడంతో శనివారం ఇక్కడ జరిగిన పోటీలో శ్రీజేష్ సేన 2–1తో చిరకాల ప్రత్యర్థిని ఓడించింది. పాక్ తరఫున అతీఖ్ (52వ ని.లో) ఏకైక గోల్ చేశాడు. మరోవైపు ఫైనల్లో జపాన్ ‘షూటౌట్’లో 3–1తో మలేసియాను ఓడించి స్వర్ణ పతకాన్ని సొంతం చేసుకుంది. ఈసారి చేజారనీయలేదు... సెమీస్‌లో ఆఖరి నిమిషంలో ఆధిక్యం చేజార్చుకుని సడెన్ డెత్ వరకు వెళ్లి ఓటమి మూటగట్టుకున్న భారత్... పాక్‌పై మాత్రం పట్టు జారనీయలేదు. ప్రారంభంలోనే రెండు అవకాశాలు సృష్టించుకుంది. 3వ నిమిషంలో లలిత్ ఉపాధ్యాయ్ ఇచ్చిన పాస్‌ను ఆకాశ్‌దీప్... ప్రత్యర్థి కీపర్ ఇమ్రాన్ బట్‌ను తప్పిస్తూ గోల్ పోస్ట్‌లోకి పంపి ఆధిక్యం అందించాడు. దీనికి స్పందనగా ఐదో నిమిషంలోనే పాక్ గోల్ చేసినంత పనిచేసింది. అయితే, సమీక్షలో అతీఖ్ కొట్టిన షాట్ గోల్ లైన్‌ను దాటలేదని తేలింది. టీమిండియా ఆధిపత్యంతోనే మొదటి క్వార్టర్ ముగిసింది. రెండో క్వార్టర్లో వరుస దాడులతో పాక్ ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేసింది. 39వ నిమిషంలో పాక్‌కు లభించిన పెనాల్టీ కార్నర్‌ను ఇర్ఫాన్ గోల్ చేయలేకపోయాడు. చివరిదైన నాలుగో క్వార్టర్లో భారత్ ప్రత్యర్థి శిబిరంలోకి పదేపదే చొచ్చుకెళ్లింది. 50వ నిమిషంలో తొలి పెనాల్టీ కార్నర్ లభించగా... డ్రాగ్ ఫ్లికర్ హర్మన్‌ప్రీత్ తడబాటు లేకుండా నెట్లోకి పంపాడు. మరో రెండు నిమిషాలకే అబుబకర్ నుంచి పాస్ అందుకున్న అతీఖ్ పాక్ ఖాతా తెరిచాడు. ఈ పరిస్థితుల్లో చివర్లో గోల్స్ సమర్పించుకునే బలహీనతను అధిగమిస్తూ శ్రీజేష్ సేన... పట్టుదలతో ఆడి పాక్‌ను నిలువరించి విజయాన్ని ఖాయం చేసుకుంది. స్క్వాష్‌లో రజతమే మహిళల టీమ్ స్క్వాష్ సెమీస్‌లో డిఫెండింగ్ చాంపియన్ మలేసియాపై సంచలన విజయం సాధించిన భారత జట్టు ఫైనల్లో హాంకాంగ్ చేతిలో ఓడిపోయి రజతంతో సరిపెట్టుకంది. జోష్నా చినప్ప, దీపిక పల్లికల్, సునయన కురువిల్లా, తన్వీ ఖన్నాలతో కూడిన భారత మహిళల జట్టు తుది సమరంలో 0–2తో హాంకాంగ్ చేతిలో ఓడింది. మొదటి మ్యాచ్‌లో సునయన 8–11, 6–11, 12–10, 3–11తో జె లక్ హో చేతిలో .... రెండో మ్యాచ్‌లో జోష్నా చినప్ప 3–11, 9–11, 5–11తో వింగ్ చీ అన్నీ చేతిలో ఓడిపోయారు. ఫలితం తేలిపోవడంతో మూడో మ్యాచ్ నిర్వహించలేదు. -
పాక్‌పై భారత్ గెలుపు
జకార్త: ఆసియా క్రీడల్లో డిఫెండింగ్ చాంపియన్ భారత పురుషుల హాకీ జట్టు ఈ సారి కాంస్యంతో సరిపెట్టింది. సెమీఫైనల్లో మలేషియాతో అనూహ్య ఓటమి పాలైన విషయం తెలిసిందే. దీంతో శనివారం జరిగిన కాంస్య పోరులో భారత్ దాయాదీ పాకిస్తాన్‌ను మట్టికరిపించింది. హోరాహోరిగా సాగిన ఈ మ్యాచ్‌లో భారత్ 2-1తో గెలిచి కాంస్యం అందుకుంది. భారత్ ఆటగాడు మూడవ నిమిషంలో తొలి గోల్ నమోదు చేశాడు. అనంతరం 50వ నిమిషంలో హర్మన్‌ప్రీత్ సింగ్ మరో గోల్ చేయడంతో 2-0తో భారత్ ఆధిక్యంలోకి వెళ్లింది. ఈ గోల్ అనంతరం రెండు నిమిషాలకే పాక్ ముహ్మద్ అతీఖ్ గోల్ సాధించడంతో స్కోర్ 2-1కు చేరింది. అనంతరం ఇరు జట్లు పోరాడిన గోల్ లభించలేదు. దీంతో భారత్ విజయం ఖాయమైంది. అయితే హాట్ ఫేవరట్‌గా బరిలోకి దిగిన భారత్‌కు మాత్రం కాంస్యమే లభించింది. శనివారం రెండు స్వర్ణాలు, ఒక రజతం, కాంస్యంతో కలిపి మొత్తం భారత్‌కు నాలుగు పతకాలు వరించాయి. ఆసియా క్రీడల స్క్వాష్ చరిత్రలో తొలిసారి ఫైనల్‌కు చేరిన భారత మహిళల స్క్వాష్ బృందం( దీపికా పళ్లికల్, జోష్నా చిన్నప్ప, సునయనా కురువిల్లా, తాన్వి ఖన్నా) రజతంతో సరిపెట్టింది. శనివారం జరిగిన మహిళల ఫైనల్ పోరులో భారత జట్టు 0-2తేడాతో హాంకాంగ్ చేతిలో ఓటమి పాలైంది. పురుషుల లైట్ ఫ్లై 49 కేజీల విభాగంలో భారత బాక్సర్ అమిత్ పంగాల్ స్వర్ణ పతకం సాధించాడు. ఆద్యంతం ఆసక్తిర రేపిన ఫైనల్లో అమిత్ 3-2 తేడాతో రియో ఒలింపిక్స్ గోల్డ్ మెడల్ విజేత దుస్మాతోవ్ హసన్‌బాయ్(ఉజ్బెకిస్తాన్)పై గెలిచి పసిడి గెలుచుకున్నాడు. ఇక బ్రిడ్జ్ ఈవెంట్లో సైతం భారత్ స్వర్ణం సాధించింది. మెన్స్ పెయిర్ ఫైనల్-2లో భారత్ జోడి ప్రణబ్ బర్దాన్- శివ్‌నాథ్ సర్కార్లు 384.00 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచి పసిడి సాధించారు. దీంతో భారత్ పతకాల సంఖ్య (15 స్వర్ణం, 24 రజతం, 30 కాంస్యం) 69కి చేరింది. హాకీ క్రీడాకారుణలకు నజరానా.. ఏషియాడ్‌లో రజతం గెలిచిన మహిళల హాకీ జట్టులోని ఓడిశా క్రీడాకారుణులకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ కోటి నజరానా ప్రకటించారు. ఒడిశా నుంచి భారత జట్టుకు ప్రాతినిథ్యం వహించిన సునితా లక్రా, నామితా టొప్పో, లిలిమా మింజ్, డీప్ గ్రేస్ ఎక్కాలకు ఒక్కొక్కరికి కోటి రూపాయాల రివార్డ్ అందనుంది. ఇక రెండు పతకాలతో అదరగొట్టిన రాష్ట్ర స్ప్రింటర్ ద్యుతీ చంద్‌కు మూడుకోట్లు నగదు పురస్కారంతో పాటు త్వరలో జరగనున్న ఒలింపిక్ క్రీడల పోటీ సాధనకు అయ్యే ఖర్చును రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుందని ప్రకటించిన విషయం తెలిసిందే. -
స్క్వాష్‌లో రజతంతో సరి
జకార్తా: ఆసియా క్రీడల స్క్వాష్ చరిత్రలో తొలిసారి ఫైనల్‌కు చేరి చరిత్ర సృష్టించిన భారత మహిళల జట్టుకు స్వర్ణ పతక పోరులో నిరాశే ఎదురైంది. శనివారం జరిగిన మహిళల ఫైనల్ పోరులో భారత జట్టు 0-2తేడాతో హాంకాంగ్ చేతిలో ఓటమి పాలైంది. ఫలితంగా రన్నరప్‌గా నిలిచి రజతంతో సరిపెట్టుకుంది. దీపికా పళ్లికల్, జోష్నా చిన్నప్ప, సునయనా కురువిల్లా, తాన్వి ఖన్నా బృందం ఆఖరి పోరులో పరాజయం చెందారు. దాంతో స్వ్కాష్‌లో తొలిసారి స్వర్ణం అందుకునే అవకాశాన్ని భారత మహిళా జట్టు కోల్పోయింది. ప్రస్తుతం భారత్ పతకాల సంఖ్య 68 కాగా, అందులో 15 స్వర్ణాలు, 24 రజతాలు, 29 కాంస్య పతకాలున్నాయి. ఈ రోజు జరిగిన బాక్సింగ్ పోరులో భారత్ పసిడి సాధించింది. పురుషుల లైట్ ఫ్లై 49 కేజీల విభాగంలో భారత బాక్సర్ అమిత్ పంగాల్ స్వర్ణ పతకం సాధించాడు. ఆద్యంతం ఆసక్తిర రేపిన ఫైనల్లో అమిత్ 3-2 తేడాతో రియో ఒలింపిక్స్ గోల్డ్ మెడల్ విజేత దుస్మాతోవ్ హసన్‌బాయ్(ఉజ్బెకిస్తాన్)పై గెలిచి పసిడి గెలుచుకున్నాడు. ఆది నుంచి ప్రత్యర్థిపై తన పదునైన పంచ్‌లతో విరుచుకుపడిన అమిత్.. హసన్‌బాయ్‌పై పైచేయి సాధించి పసిడిని ఒడిసి పట్టుకున్నాడు. ఇక బ్రిడ్జ్ ఈవెంట్లో సైతం భారత్ స్వర్ణం సాధించింది. మెన్స్ పెయిర్ ఫైనల్-2లో భారత్ జోడి ప్రణబ్ బర్దాన్- శివ్‌నాథ్ సర్కార్లు 384.00 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచి పసిడి సాధించారు. -
ఏషియన్ గేమ్స్‌లో భారత్ పసిడి పంచ్
జకార్తా: ఏషియన్ గేమ్స్ 2018లో బాక్సింగ్‌లో భారత్ పంచ్ అదిరింది. శనివారం జరిగిన పురుషుల లైట్ ఫ్లై 49 కేజీల విభాగంలో భారత బాక్సర్ అమిత్ పంగాల్ స్వర్ణ పతకం సాధించాడు. ఆద్యంతం ఆసక్తిర రేపిన ఫైనల్లో అమిత్ 3-2 తేడాతో రియో ఒలింపిక్స్ గోల్డ్ మెడల్ విజేత దుస్మాతోవ్ హసన్‌బాయ్(ఉజ్బెకిస్తాన్)పై గెలిచి పసిడి గెలుచుకున్నాడు. ఆది నుంచి ప్రత్యర్థిపై తన పదునైన పంచ్‌లతో విరుచుకుపడిన అమిత్.. హసన్‌బాయ్‌పై పైచేయి సాధించి పసిడిని ఒడిసి పట్టుకున్నాడు. ఫలితంగా భారత్ పతకాల సంఖ్య 67కు చేరింది. దాంతో ఈ క్రీడల చరిత్రలోనే భారత్ అత్యధిక పతకాలను సాధించినట్లయ్యింది. 2010 గ్వాంగ్జూ ఏషియాడ్‌లో భారత్ అత్యధికంగా 65 పతకాలు సాధించగా... జకార్తా క్రీడల్లో ఆ రికార్డు కూడా తెరమరుగైంది. ఇప్పటివరకూ భారత్ 15 స్వర్ణ పతకాలు, 23 రజతాలు, 29 కాంస్యాలను సాధించింది. అంతకుముందు జరిగిన బ్రిడ్జ్ ఈవెంట్లో సైతం భారత్ స్వర్ణం సాధించింది. మెన్స్ పెయిర్ ఫైనల్-2లో భారత్ జోడి ప్రణబ్ బర్దాన్- శివ్‌నాథ్ సర్కార్లు 384.00 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచి పసిడి సాధించారు. -
ఏషియాడ్‌లో నేటి భారతీయం
బాక్సింగ్: పురుషుల 49 కేజీల ఫైనల్ (అమిత్ గీహసన్బాయ్; మ.గం.12.30 నుంచి). బ్రిడ్జ్: పురుషుల పెయిర్ ఫైనల్–2; మహిళల పెయిర్ ఫైనల్–2; మిక్స్డ్ పెయిర్ ఫైనల్–2 ఉ.గం.8.30 నుంచి). పురుషుల హాకీ: భారత్గీపాకిస్తాన్ కాంస్య పతక పోరు (సా.గం.4 నుంచి). స్క్వాష్: మహిళల టీమ్ ఫైనల్ (భారత్గీహాంకాంగ్; మ.గం.1.30 నుంచి). సోనీ టెన్–2, టెన్–3, సోనీ ఈఎస్పీఎన్ చానెల్స్‌లో ప్రత్యక్ష ప్రసారం -
సాక్షి పసిడి పంచ్
బుడాపెస్ట్: ప్రపంచ యూత్ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో సాక్షి (57 కేజీలు) స్వర్ణ పతకం నెగ్గింది. తుదిపోరులో నికోలినా కాసిక్ (క్రొయేషియా)పై సాక్షి విజయం సాధించింది. మనీష (64 కేజీలు), అనామిక (51 కేజీలు) ఫైనల్స్‌లో ఓడి రజతాలతో సరిపెట్టుకున్నారు. డెస్టినీ గార్సియా (అమెరికా) చేతిలో అనామిక; గెమ్మా (ఇంగ్లండ్) చేతిలో మనీష ఓటమి పాలయ్యారు. ఓవరాల్‌గా ఈ చాంపియన్‌షిప్‌లో భారత బాక్సర్లు 2 స్వర్ణాలు, 2 రజతాలు, 6 కాంస్యాలతో మొత్తం 10 పతకాలు సాధించారు. -
స్క్వాష్‌లో సంచలనం
జకార్తా: కఠినమైన ప్రత్యర్థి అనుకున్న మలేసియాను అతి సులువుగా ఓడించిన భారత మహిళల జట్టు ఆసియా క్రీడల స్క్వాష్‌లో తొలిసారి ఫైనల్ చేరి సంచలనం సృష్టించింది. శుక్రవారం జరిగిన సెమీఫైనల్ మొదటి మ్యాచ్‌లో జోష్నా చిన్నప్ప 12–10, 11–9, 6–11, 10–12, 11–9తో ఎనిమిదిసార్లు ప్రపంచ చాంపియన్, ఐదుసార్లు ఏషియాడ్ సింగిల్స్ విజేత నికోల్ డేవిడ్‌ను మట్టికరిపించింది. నాలుగో గేమ్‌లో 10–9 స్కోరుపై జోష్నా మ్యాచ్ బాల్ మీద ఉండగా... నికోల్ అద్భుతంగా పుంజుకుని మూడు పాయింట్లు సాధించి గేమ్‌ను గెల్చుకుంది. ఐదో గేమ్‌లోనూ సరిగ్గా ఇలాంటి పరిస్థితే ఎదురైనా... ఈసారి జోష్నా పట్టువిడవకుండా పోరాడి మ్యాచ్‌ను సొంతం చేసుకుంది. ఇక రెండో మ్యాచ్‌లో దీపికా పల్లికల్ 11–2, 11–9, 11–7తో లొ వీ వెర్న్‌ను ఓడించడంతో భారత్ 2–0తో గెలిచింది. ఫలితం తేలిపోవడంతో మూడో మ్యాచ్‌ను నిర్వహించలేదు. పురుషుల విభాగంలో కాంస్యమే డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలో దిగిన భారత పురుషుల స్క్వాష్ జట్టు సెమీఫైనల్లో హాంకాంగ్ చేతిలో 2–0 తేడాతో ఓడి కాంస్యంతో సరిపెట్టుకుంది. తొలి మ్యాచ్‌లో సౌరవ్ ఘోషాల్ 7–11, 9–11, 10–12తో మాక్స్ లీ చేతిలో... రెండో మ్యాచ్‌లో హరీందర్ పాల్ సంధూ 9–11, 11–9, 9–11, 11–13తో లియో అయు చేతిలో ఓడిపోయారు. -
‘పసిడి’ పోరుకు బాక్సర్ అమిత్
భారత బాక్సర్ అమిత్ పంఘాల్ (49 కేజీలు) ఆసియా క్రీడల ఫైనల్లోకి దూసుకెళ్లాడు. శుక్రవారం జరిగిన సెమీస్‌లో అమిత్ 3–2తో కార్లో పాలమ్ (ఫిలిప్పీన్స్)పై గెలిచి పసిడి పోరుకు అర్హత సాధించాడు. ఈ ఏషియాడ్‌లో భారత్ తరఫున ఫైనల్ చేరిన ఏకైక బాక్సర్‌గా నిలిచాడు. నేడు జరిగే ఫైనల్లో రియో ఒలింపిక్స్ చాంపియన్ దుస్మతోవ్ హసన్‌బాయ్ (ఉజ్బెకిస్తాన్)తో అమిత్ తలపడతాడు. మరో భారత బాక్సర్ వికాస్ కృషన్ (75 కేజీలు) ఎడమ కంటి గాయం కారణంగా సెమీస్ బరిలోకి దిగలేదు. దీంతో అతనికి కాంస్య పతకం ఖాయమైంది. వికాస్ శుక్రవారం సెమీఫైనల్లో అబిల్‌ఖాన్ (కజకిస్తాన్)తో తలపడాల్సి ఉం డగా... గాయం తీవ్రత ఎక్కువగా ఉండటంతో అతను పోటీ నుంచి తప్పుకున్నాడు. ఈ పతకంతో వికాస్ వరుసగా మూడు ఆసియా క్రీడల్లో పతకాలు సాధించిన తొలి భారతీయ బాక్సర్‌గా చరిత్ర సృష్టించాడు. -
సెయిలింగ్‌లో రజతం, రెండు కాంస్యాలు
ఏషియాడ్‌లో భారత సెయిలర్లు ఒక రజతం, రెండు కాంస్యాలు అందించారు. మహిళల 49ఈఆర్ ఎఫ్ఎక్స్ ఈవెంట్లో వర్షా గౌతమ్–శ్వేతా షిర్వేగర్ ద్వయం 15 రేసులు పూర్తయ్యేసరికి 40 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచి రజతం సొంతం చేసుకుంది. ఓపెన్ లేజర్ 4.7 విభాగంలో 16 ఏళ్ల హర్షిత తోమర్ 12వ రేసు అనంతరం 62 పాయింట్లతో నిలిచి కాంస్యం దక్కించుకుంది. పురుషుల 49 ఈఆర్‌లో వరుణ్ ఠక్కర్, చెంగప్ప గణపతి కేలపండ జోడీ 15వ రేసు తర్వాత 53 పాయింట్లు స్కోరు చేసి కాంస్యంతో సంతృప్తి పడింది. -
మహిళల హాకీలో భారత్ చేజారిన స్వర్ణం
కబడ్డీలో స్వర్ణాలకు గండిపడినా... వెయిట్‌లిఫ్టింగ్‌లో వెనుకబడినా... హాకీలో పసిడి అందినట్టే అంది చేజారినా... 18వ ఏషియాడ్ భారత్‌కు మరుపురానిదిగానే మిగిలిపోనుంది. అథ్లెటిక్స్‌లో అనూహ్య ప్రదర్శనలు... స్క్వాష్‌లో సంచలనాలు... షూటింగ్లో అదిరిపోయే గురితో... పతకాల పట్టికలో మన దేశం ఇప్పటికే 2014 ఇంచియోన్ క్రీడల ప్రదర్శనను అధిగమించింది. 13వ రోజు శుక్రవారం మన ఖాతాలో రెండు రజతాలు, నాలుగు కాంస్యాలు జమయ్యాయి. దాంతో మొత్తం 65 పతకాలతో ఈ క్రీడల చరిత్రలోనే భారత్ తమ అత్యుత్తమ ప్రదర్శనను సమం చేసింది. 2010 గ్వాంగ్జూ ఏషియాడ్‌లో భారత్ అత్యధికంగా 65 పతకాలు సాధించగా... జకార్తా క్రీడల్లో ఆ రికార్డు కూడా నేడు తెరమరుగు కానుంది. జకార్తా: భారత హాకీ జట్ల ఏషియాడ్ ప్రయాణం స్వర్ణం లేకుండానే ముగిసింది. గురువారం పురుషుల జట్టు సెమీఫైనల్లో ఓడి నిరాశపర్చగా... శుక్రవారం మహిళల బృందం ఫైనల్లో 1–2తో జపాన్ చేతిలో పరాజయం పాలై రజతంతో సరిపెట్టుకుంది. ఒకటికి రెండు అవకాశాలు చేజార్చుకుని... చరిత్రలో నిలిచే రికార్డును కోల్పోయింది. తద్వారా 2020 టోక్యో ఒలింపిక్స్ అర్హత కోసం క్వాలిఫయింగ్ టోర్నీలు ఆడాల్సిన పరిస్థితి తెచ్చుకుంది. సమం చేసి... చేజార్చుకుని మహిళల హాకీ ప్రపంచ ర్యాంకింగ్స్‌లో భారత్ 9వ స్థానంలో ఉంటే జపాన్ ర్యాంక్ 14. దీనికి తగ్గట్లే తుది సమరంలో ఫేవరెట్‌గా బరిలో దిగింది రాణి రాంపాల్ సేన. అయితే, ఆటలో మాత్రం ఆ స్థాయిని అందుకోలేకపోయింది. దూకుడైన ఆరంభానికి తొలి క్వార్టర్‌లోనే చక్కటి అవకాశాలు దక్కినా ఫినిషింగ్ లోపంతో గోల్స్‌గా మలచలేకపోయింది. ప్రత్యర్థి శిబిరంలోకి చొచ్చుకెళ్లి 4వ నిమిషంలో కెప్టెన్ రాణి ఇచ్చిన పాస్‌ను నవనీత్ కౌర్ వృథా చేసింది. 8వ నిమిషంలో జపాన్‌కూ గోల్ అవకాశం దక్కినా కీపర్ సవిత అడ్డుకుంది. 10వ నిమిషంలో నవనీత్ పెనాల్టీ కార్నర్ పాస్ ఇవ్వగా గుర్జీత్ కౌర్ స్కోరుగా మలచలేకపోయింది. అయితే, మినామి షిమిజు పెనాల్టీ కార్నర్‌ను గోల్‌పోస్ట్‌లోకి పంపడంతో జపాన్‌కు 11వ నిమిషంలో ఫలితం దక్కింది. రెండో క్వార్టర్లో దాడిని పెంచిన భారత్‌కు... నేహా గోయల్ (25వ ని.లో) ఫీల్డ్ గోల్ అందించింది. ఈ భాగంలో బంతి ఎక్కువ శాతం మన జట్టు నియంత్రణలోనే ఉండటంతో పాటు పలు అవకాశాలు వచ్చాయి. అయితే, ఉదిత, వందన షాట్లను ప్రత్యర్థి కీపర్ సమర్థంగా నిలువరించింది. మరోవైపు మొటొమొరి కవాముర (44వ ని.లో) పెనాల్టీ కార్నర్‌ను రివర్స్ హిట్‌తో నెట్లోకి పంపి జపాన్‌కు ఆధిక్యం అందించింది. చివరి పది నిమిషాల్లో భారత్ ఒత్తిడి తెచ్చేందుకు ప్రయత్నించినా... ఆ ప్రయత్నాలేమీ ఫలించలేదు. ఇదే సమయంలో జపాన్ వ్యూహాత్మకంగా ఆడుతూ ఆధిక్యాన్ని కాపాడుకుంది. మరో రెండు నిమిషాల్లో ఆట ముగుస్తుందనగా కీపర్ సవితను ఉపసంహరించుకున్న భారత్‌కు చివరి 40 సెకన్లలో రెండు అవకాశాలొచ్చాయి. కానీ... అవేమీ స్కోరుగా మారలేదు. తొలిసారిగా 1982 ఏషియాడ్‌లో స్వర్ణం నెగ్గిన భారత మహిళలు... ఈసారి కూడా ఆ ఘనతను అందుకోలేకపోయారు. 1998 తర్వాత భారత జట్టు ఈసారే ఏషియాడ్ ఫైనల్స్‌కు అర్హత సాధించింది. టీటీలో కథ ముగిసింది... ఆసియా క్రీడల టేబుల్ టెన్నిస్ (టీటీ)లో భారత్ కథ ముగిసింది. పురుషుల సింగిల్స్ ప్రిక్వార్టర్స్‌లో శరత్ 7–11, 11–9, 10–12, 16–14, 9–11తో చి యున్ చునాగ్ (చైనీస్ తైపీ) చేతిలో, సత్యన్ 11–9, 4–11, 9–11, 6–11, 10–12తో మట్సుడైరా (జపాన్) చేతిలో ఓడిపోయారు. మహిళల సింగిల్స్ ప్రిక్వార్టర్స్‌లో మనికా బాత్రా 2–11, 8–11, 8–11, 11–6, 4–11తో వాంగ్ మన్యు (చైనా) చేతిలో ఓడింది. ఒక్క విజయం లేకుండానే: ఆసియా క్రీడల్లో భారత మహిళల వాలీబాల్ జట్టు ఒక్క విజయం సాధించకుండానే తమ పోరాటాన్ని ముగించింది. 9–10 స్థానాల కోసం జరిగిన వర్గీకరణ మ్యాచ్‌లో భారత్ 21–25, 16–25, 15–25తో చైనీస్ తైపీ చేతిలో ఓడింది. జూడోలో నిరాశ: పురుషుల 100 కేజీల జూడో ప్రిక్వార్టర్స్‌లో అవతార్ సింగ్ 1–10తో ఇవాన్ రామరెన్కో (యూఏఈ) చేతిలో ఓడగా... మహిళల ప్లస్ 78 కేజీల క్వార్టర్ ఫైనల్లో అకిరా సోనె (జపాన్) చేతిలో రజ్విందర్ కౌర్ పరాజయం పాలైంది. -
హాకీ ఫైనల్లో భారత మహిళలకు చుక్కెదురు!
జకార్త : సుదీర్ఘ నిరీక్షణ అనంతరం ఆసియా క్రీడల ఫైనల్ చేరిన భారత మహిళల హాకీ జట్టుకు ఎదురుదెబ్బ తగిలింది. శుక్రవారం జపాన్‌తో జరిగిన ఫైనల్లో రాణి రాంపాల్ బృందం 1-2 తేడాతో ఓటమి పాలైంది. 2014 ఆసియా క్రీడల్లో కాంస్యంతో సరిపెట్టుకున్నభారత మహిళలు ఈసారి రజతంతో సరిపెట్టారు. తొలి అర్థభాగం వరకు ఇరు జట్ల స్కోర్ సమంగా ఉండగా రెండో అర్ధభాగంలో జపాన్ ఆధిక్యం సాధించి పసిడి సొంతం చేసుకుంది. జపాన్ మహిళలకు ఏషియాడ్‌లో ఇదే తొలి స్వర్ణం కావడం విశేషం. భారత్ తరపున నేహాగోయల్ గోల్ చేయగా.. జపాన్ తరపున మినామి, మొటామి గోల్స్ సాధించారు. స్వర్ణం నెగ్గి తద్వారా 2020 టోక్యో ఒలింపిక్స్‌కు నేరుగా అర్హత సాధించాలనుకున్న భారత మహిళల ఆశలు గల్లంతయ్యాయి. భారత్ 36 ఏళ్ల క్రితం 1982 న్యూఢిల్లీ క్రీడల్లో స్వర్ణం నెగ్గింది. చివరగా 1998 బ్యాంకాక్ క్రీడల్లో ఫైనల్ చేరినా... అక్కడ కొరియా చేతిలో ఓడి రజతంతో సరిపెట్టుకుంది. పురుషుల జట్టు సెమీస్‌లో మలేషియాతో ఓడిన విషయం తెలిసిందే. కాంస్యం కోసం దాయదీ పాకిస్తాన్‌తో తలపడనుంది. శుక్రవారం భారత్‌కు మొత్తం ఒక రజతం నాలుగు కాంస్యాలతో ఐదు పతకాలు లభించాయి. దీంతో భారత్ పతకాల సంఖ్య 64 (13 స్వర్ణం, 22 రజతం, 29 కాంస్యం)కు చేరింది. -
ఓ నిరుపేద అథ్లెట్ తల్లి భావోద్వేగం
స్వప్న బర్మన్.. ప్రస్తుతం దేశవ్యాప్తంగా మారుమోగుతున్న పేరు. ఏషియన్ గేమ్స్‌లో కఠినమైన ఏడు క్రీడాంశాల సమాహారమైన హెప్టాథ్లాన్ విభాగంలో పసిడి అందించిన వీర వనిత. 66 ఏళ్లుగా సాధ్యం కాని ఘనతను అందుకొని శిఖరాన నిలిచిన 21 ఏళ్ల బెంగాల్ అమ్మాయి. ప్రస్తుతం స్వప్న బర్మన్పై సోషల్‌మీడియా వేదికగా ప్రశంసలు కురుస్తున్నాయి. అయితే ఆమె ఈ ఘనతను అంత సులువుగా అందుకోలేదు. నాడు కష్టాలతో సహవాసం చేసింది కాబట్టే నేడు చాంపియన్ అయింది. స్వప్న బర్మన్ ఎన్ని కష్టాలు పడ్డదో ఆమె తల్లి భావోద్వేగం తెలియజేస్తోంది. స్వప్న ఆటను టీవీలో తిలికించిన ఆమె తల్లి స్వప్న కల సాకారం కావడంతో ఒక్కసారిగా ఉద్వేగానికి లోనైంది. బిడ్డ కష్టాన్నంత గుర్తు తెచ్చుకొని ఉబికి వస్తున్న కన్నీళ్లను ఆపుకోలేక ఏడ్చేసింది. అంతటితో ఆగకుండా సమీప దేవాలయానికి వెళ్లి ప్రార్థనలు చేసింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో హల్చల్ చేస్తోంది. స్వప్న బర్మన్‌ది నిరుపేద కుటుంబం. తండ్రి రిక్షా లాగుతాడు. తల్లి స్థానికంగా ఉండే టీకొట్టులో పనిచేస్తోంది. ఉండటానికి సరిగ్గా ఇళ్లు కూడా లేదు. డబ్బాలాంటి ఓ రేకుల షెడ్డులో ఈ కుటుంబం కాలం వెళ్లదిస్తోంది. తండ్రి కూడా ఐదేళ్లుగా ఆనారోగ్యంతో మంచానికే పరిమితమయ్యాడు. సోదరుడు కట్టెలు కొట్టడం ద్వారా వచ్చిన ఆదాయం, తల్లి కష్టంతోనే ఇల్లు గడిచింది. దీనికి తోడు ఆమె శరీరాకృతి కూడా సమస్యగా మారింది. శిక్షణ కోసం కోచ్ సుభాష్ సర్కార్ (ప్రస్తుత కోచ్ కూడా) వద్దకెళ్తే పొట్టిగా ఉన్నావ్ పోటీలకు పనికిరావని వారించారు. కానీ ఆ పొట్టి అమ్మాయే 2012 స్కూల్ గేమ్స్ (హై జంప్) పోటీల్లో స్వర్ణం గెలిచింది. వెంటనే కోచ్ నుంచి పిలుపొచ్చింది. మరోవైపు రెండు కాళ్లకు ఆరేళ్లు. షూస్‌తో సౌకర్యంగా ఉండటం చాలా కష్టం. ఏకబికిన ఏడు ఈవెంట్లలో పాల్గొనడం మరెంతో కష్టం... కానీ ఇంతకు మించిన కష్టాలే నిత్యం చవిచూసిన బర్మన్కు ఈ హెప్టాథ్లాన్ పోటీ ఏపాటిది! అందుకేనేమో సౌకర్యం సంగతి పక్కనబెట్టింది. పసిడే లక్ష్యంగా బరిలోకిదిగి విజయం సొంతం చేసుకుంది. ఈ విజయానంతరం మాట్లాడుతూ...’నేను మాములు షూస్నే ధరించాను. ట్రెయినింగ్‌లో చాలా నొప్పిగా ఉండేది. నాకు అవి చాలా అసౌకర్యంగా ఉండేవి.’ అంటూ తన కష్టాన్ని వివరంచింది. మమతాజీ..10 లక్షలేనా? స్వప్న బర్మన్ ప్రతిభను గుర్తించిన ప్రశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ రూ.10 లక్షల నజరానా ప్రకటించారు. అయితే ఈ నజరానాపై సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. నిరుపేద అథ్లెట్‌కు ఈ సహకారం సరిపోదని కామెంట్ చేస్తున్నారు. ఆమెకు ఆర్థికంగా సహకారం అందిస్తే భారత్‌కు మరిన్నీ పతకాలు తెచ్చిపెడుతోందని అభిప్రాయపడుతున్నారు. ఇక రజత పతకాలు సాధించిన ద్యుతిచంద్‌కు ఒడిశా ప్రభుత్వం రూ. కోటిన్నర్ నగదు ప్రోత్సాహకం ప్రకటించిన విషయం తెలిసిందే. చదవండి: 'స్వప్న' సాకారం -
'స్వప్న' సాకారం: తల్లి భావోద్వేగం
-
పరుగుల రాణికి నగదు పురస్కారం
భువనేశ్వర్ : జకార్తాలో జరుగుతున్న 18వ ఏషియన్ క్రీడల్లో రాష్ట్రానికి చెందిన ద్యుతీ చాంద్ వరుసగా పతకాల్ని సాధిస్తోంది. తాజాగా ఆమె 200 మీటర్ల పరుగు పందెంలో రెండో రజత పతకం సాధించింది. లోగడ 100 మీటర్ల పరుగు పందెంలో తొలి రజత పతకం సాధించింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ఆమెకు రెండోసారి రూ.1.5 కోట్ల నగదు పురస్కారం ప్రకటించారు. త్వరలో జరగనున్న ఒలింపిక్ క్రీడల పోటీ సాధనకు అయ్యే ఖర్చును రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుందని ముఖ్యమంత్రి గురు వారం ప్రకటించారు. రెండో రజత పతకం సాధించిన సందర్భంగా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ఆమెతో ప్రత్యక్షంగా ఫోన్లో మాట్లాడి అభినందనలు తెలియజేశారు. ఏషియన్ క్రీడల్లో రెండు రజత పతకాలు సాధించిన తొలి క్రీడాకారిణిగా ద్యుతీ చాంద్ సరికొత్త రికార్డు నెలకొల్పింది. జాతీయస్థాయిలో ఆమె రెండో క్రీడాకారిణిగా స్థానం సాధించడం మరో విశేషం. లోగడ 1982లో న్యూ ఢిల్లీలో జరిగిన ఏషియన్ క్రీడల పోటీల్లో పి. టి. ఉష 100 మీటర్లు, 200 మీటర్ల పరుగు పందాల్లో రెండు రజత పతకాల్ని సాధించిన తొలి క్రీడాకారిణిగా నిలిచారు. -
స్క్వాష్‌లో పసిడి పోరుకు అమ్మాయిలు సై
జకార్తా: ఏషియన్ గేమ్స్ 2018లో భాగంగా స్క్వాష్ ఈవెంట్లో భారత మహిళల జట్టు ఫైనల్లోకి ప్రవేశించింది. శుక్రవారం జరిగిన సెమీ ఫైనల్ మ్యాచ్‌లో భారత మహిళల జట్టు 2-0 తేడాతో డిఫెండింగ్ చాంపియన్ మలేసియాను ఓడించి ఫైనల్‌కు చేరింది. జోష్నా చిన్నప్ప, దీపికా పళ్లికల్, సునయనా కురువిల్లా, తాన్వి ఖన్నాతో కూడిన భారత మహిళల స్క్వాష్ జట్టు.. ఆద్యంతం ఆకట్టకుంది. ఆది నుంచి పూర్తి ఆధిక్యాన్నికనబరిచిన భారత బృందం ఫైనల్ బెర్తును ఖరారు చేసుకుంది. ఫలితంగా భారత మహిళల స్క్వాష్ జట్టు కనీసం రజతాన్ని ఖాయం చేసుకుంది. శనివారం జరిగే పసిడి పోరులో హాంకాంగ్-జపాన్ల మధ్య జరుగునున్న రెండో సెమీ ఫైనల్ విజేతతో భారత్ తలపడనుంది. ఈ రోజు జరిగే స్క్వాష్ పురుషుల సెమీ ఫైనల్లో భారత్ జట్టు హాంకాంగ్‌తో ఆడనుంది. -
భారత్(vs)జపాన్
సుదీర్ఘ నిరీక్షణ అనంతరం ఆసియా క్రీడల ఫైనల్ చేరిన భారత మహిళల హాకీ జట్టు నేడు జరుగనున్న తుదిపోరులో జపాన్‌తో తలపడనుంది. 2014 ఆసియా క్రీడల్లో కాంస్యంతో సరిపెట్టుకున్న భారత్ ఈసారి ఎలాగైనా స్వర్ణం నెగ్గి తద్వారా 2020 టోక్యో ఒలింపిక్స్‌కు నేరుగా అర్హత సాధించాలనే పట్టుదలతో ఉంది. భారత్ 36 ఏళ్ల క్రితం 1982 న్యూఢిల్లీ క్రీడల్లో స్వర్ణం నెగ్గింది. చివరగా 1998 బ్యాంకాక్ క్రీడల్లో ఫైనల్ చేరినా... అక్కడ కొరియా చేతిలో ఓడి రజతంతో సరిపెట్టుకుంది. -
గోల్డెన్ జాన్సన్
డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలో దిగిన పురుషుల హాకీ జట్టు సెమీస్‌లో ఓడి నిరాశపర్చినా... అదరహో అనేలా సాగిన అథ్లెట్ల ప్రదర్శనతో ఆసియా క్రీడల్లో భారత్ ఖాతాలో గురువారం మరిన్ని పతకాలు చేరాయి. 1500 మీ. పరుగులో జిన్సన్ జాన్సన్ మ్యాజిక్... మహిళల రిలేలో సాధికార స్వర్ణం...12వ రోజు విశేషాలు. పురుషుల రిలే జట్టు రజతంతో సరిపెట్టగా, డిస్కస్ త్రోలో నిరాశపర్చిన సీమా కాంస్యంతో సంతృప్తి పడింది. 1500 మీ. పరుగులో చిత్రా మరో కాంస్యం అందించింది. అథ్లెటిక్స్‌లో... ఓవరాల్‌గా భారత అథ్లెట్లు ఈ ఏషియాడ్‌లో 7 స్వర్ణాలు, 10 రజతాలు, 2 కాంస్యాలు నెగ్గి సత్తా చాటారు. బుధవారం నాటికి మొత్తం 11 స్వర్ణాలు సాధించి గత క్రీడల స్వర్ణాలను సమం చేసిన భారత్ ఖాతాలో గురువారం మరో రెండో పసిడి పతకాలు చేరాయి. అన్నీ కలిపి ఇప్పటికే 59 పతకాలు రావడంతో 2014 ఏషియాడ్ (57 పతకాలు) లెక్కలనూ భారత్ అధిగమించింది. జకార్తా: మిడిల్ డిస్టెన్స్ రన్నర్ జిన్సన్ జాన్సన్ మళ్లీ మెరిశాడు. గురువారం ఆసియా క్రీడల 1500 మీ. పరుగులో స్వర్ణం ఒడిసిపట్టాడు. రెండు రోజుల క్రితం జరిగిన 800 మీటర్ల పరుగులో రజతంతో సంతృప్తిపడిన జాన్సన్... ఈసారి మాత్రం పట్టువిడవలేదు. 3 నిమిషాల 44.72 సెకన్లలో రేసు పూర్తి చేసి బంగారు పతకం అందుకున్నాడు. ఇరాన్‌కు చెందిన అమిర్ మొరాడీ (3 నిమిషాల 45.62 సెకన్లు) రజతం, బహ్రెయిన్ అథ్లెట్ మొహమ్మద్ టియోలీ (3 నిమిషాల 45.88 సెకన్లు) కాంస్యం నెగ్గారు. అయితే 800 మీటర్ల పరుగులో స్వర్ణం సాధించి అందరినీ ఆశ్చర్యపర్చిన భారత్ అథ్లెట్ మన్జీత్ సింగ్... 1500 మీ. ఈవెంట్లో పతకం చేజార్చుకున్నాడు. 3 నిమిషాల 46.57 సెకన్ల టైమింగ్‌తో నాలుగో స్థానంలో నిలిచాడు. -
డిస్కస్ త్రోలో సీమాకు కాంస్యమే!
ఏషియాడ్ మహిళల డిస్కస్ త్రో డిఫెండింగ్ చాంపియన్, భారత వెటరన్ క్రీడాకారిణి సీమా పూనియా... ఈసారి కాంస్యంతో వెనుదిరిగింది. గురువారం జరిగిన పోటీలో 35 ఏళ్ల సీమా డిస్క్‌ను 62.26 మీటర్లు మాత్రమే విసరగలిగింది. ఆసియా చాంపియన్, చైనా అథ్లెట్ చెన్ యాంగ్ (65.12 మీ.) స్వర్ణం నెగ్గింది. ఆ దేశానికే చెందిన ఫెంగ్ బిన్ (64.25 మీ.)కు రజతం దక్కింది. మరోవైపు 2014 ఇంచియోన్ ఏషియాడ్‌లో స్వర్ణం గెలిచిన గణాంకాలను (61.03 మీ.) సీమా సవరించినా ప్రత్యర్థులు ఇంకా మెరుగ్గా రాణించడంతో మూడో స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. గత ఆరేళ్లలో ఆమెకిదే అత్యుత్తమ రికార్డు కావడం గమనార్హం. భారత మరో త్రోయర్ సందీప్ కుమారి (54.61 మీ.) ఐదో స్థానంలో నిలిచింది. పెద్ద మనసు చాటుకుంది ఆసియా క్రీడల రోజువారీ భత్యం కింద తనకు లభించిన 700 అమెరికన్ డాలర్ల (రూ.50 వేలు)కు మరో లక్ష రూపాయలు కలిపి కేరళ వరద బాధితుల సహాయార్థం అందజేయనున్నట్లు సీమా పూనియా ప్రకటించింది. ఇతర అథ్లెట్లు కూడా తమ భత్యాల్లో కనీసం సగమైనా అందించాలని ఆమె కోరింది. స్వయంగా కేరళ వెళ్లి సహాయ చర్యల్లో పాల్గొంటానని హరియాణాకు చెందిన సీమా తెలిపింది. అక్కడి నుంచి తిరిగి వచ్చాక తన ఎడమ పాదంలో దెబ్బతిన్న ఎముకకు శస్త్ర చికిత్స చేయించుకోనున్నట్లు పేర్కొంది. గురువారం డిస్కస్ త్రో పోటీల సందర్భంగానూ గాయం ఇబ్బంది పెట్టిందని, అయితే తన వైఫల్యానికి అది కారణం కాదని వివరించింది. ఇదే సందర్భంగా తనకు అర్జున అవార్డు రాకపోవడం పట్ల ఆశ్చర్యం వ్యక్తం చేసింది. ప్రస్తుతం సీమా హరియాణా పోలీస్ శాఖలో ఎస్సైగా పనిచేస్తోంది. ద్యుతీ, స్వప్నలకు నజరానా ఏషియాడ్ మహిళల 100 మీ., 200 మీ. పరుగులో రజతాలు నెగ్గిన ద్యుతీ చంద్‌కు రూ.కోటిన్నర నగదు ప్రోత్సాహకం ఇవ్వనున్నట్లు ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ప్రకటించారు. హెప్టాథ్లాన్‌లో స్వర్ణం సాధించిన స్వప్నా బర్మన్కు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ రూ.10 లక్షల నజరానా ప్రకటించారు. -
రిలేలో జోరు
జకార్తా: ఆసియా క్రీడల్లో అద్భుత రికార్డును కొనసాగిస్తూ 4్ఠ400మీ. రిలే పరుగులో భారత మహిళలు వరుసగా ఐదోసారి స్వర్ణం నెగ్గారు. గురువారం జరిగిన రేసులో హిమా దాస్, ఎంఆర్ పూవమ్మ, సరితాబెన్ గైక్వాడ్, విస్మయ కరోత్లతో కూడిన భారత బృందం 3ని. 28.72 సెకన్లలో రేసును పూర్తిచేసి విజేతగా అవతరించింది. హిమా బుల్లెట్లా దూసు కెళ్లడంతో ప్రారంభం నుంచి భారత జట్టు ఆధిక్యంలో నిలిచింది. బహ్రెయిన్ (3ని. 30.61 సెకన్లు), వియా త్నాం (3ని. 33.23 సెకన్లు) వరుసగా రజతం, కాం స్యాలు సాధించాయి. 2002 ఏషియాడ్ నుంచి 4్ఠ400మీ. స్వర్ణం భారత్ ఖాతాలోనే ఉంటోంది. పురుషుల 4్ఠ400 మీటర్ల రిలేలో భారత బృందం రజతం గెలుచుకుంది. కున్హు ముహమ్మద్, ధరుణ్ అయ్యసామి, మొహమ్మద్ అనస్, అరోకియా రాజీవ్‌లతో కూడిన బృందం 3 నిమిషాల 01.85 సెకన్లలో రేసును పూర్తి చేసి రెండో స్థానంలో నిలిచింది. 3 నిమిషాల 0.56 సెకన్ల ఆసియా క్రీడల రికార్డుతో ఖతర్ జట్టు స్వర్ణం దక్కించుకుంది. 3 ని. 1.94 సెకన్ల టైమింగ్ నమోదు చేసిన జపాన్ బృందం కాంస్యం అందుకుంది. గత ఏషియాడ్‌లో భారత పురుషుల రిలే జట్టు నాలుగో స్థానంతో త్రుటిలో పతకాన్ని కోల్పోయింది. స్క్వాష్ సెమీస్ ప్రత్యర్థి మలేసియా మహిళల స్క్వాష్ జట్టు హాంకాంగ్ చేతిలో 1–2 తేడాతో పరాజయం పాలైంది. గురువారం జోయ్ చాన్ 3–1తో దీపికా పల్లికల్పై, యానీ 3–0తో జోష్నా చినప్పపై గెలుపొందారు. అయితే... సునయనా కురువిల్లా 3–2 తేడాతో జె లాక్ హొపై గెలుపొందింది. గ్రూప్ ‘బి’లో మూడు మ్యాచ్‌లు గెలిచి, ఒకదాంట్లో ఓడిన మన జట్టు రెండో స్థానంలో నిలిచింది. సెమీస్‌లో మలేసియాతో తలపడనుంది. టీటీ ప్రిక్వార్టర్స్‌లో మనికా, శరత్, సత్యన్ టేబుల్ టెన్నిస్‌లో భారత ఆటగాళ్లు ప్రిక్వార్టర్స్‌కు చేరారు. మహిళల విభాగంలో మనికా బాత్రా 11–3, 11–7, 11–3, 11–6తో నంథానా కొమ్వాంగ్ (థాయ్‌లాండ్)ను, పురుషుల విభాగంలో ఆచంట శరత్ కమల్ 11–4, 11–8, 11–7, 11–5తో ముహమ్మద్ ఆసిమ్ ఖురేషి (పాకిస్తాన్)ని ఓడించారు. సత్యన్ జ్ఞాన శేఖరన్ 4–2 తేడాతో శాంటొసొపై (ఇండోనేసియా) నెగ్గాడు. 1500 మీ. పరుగులో చిత్రకు కాంస్యం మహిళల 1500 మీటర్ల పరుగులో ఆసియా చాంపియన్ అయిన చిత్ర ఉన్నికృష్ణన్ ఏషియాడ్‌లో ఆ స్థాయి ప్రదర్శన కనబర్చలేకపోయింది. 4 నిమిషాల 12.56 సెకన్ల టైమింగ్‌తో మూడో స్థానంలో నిలిచి కాంస్యంతోనే సంతృప్తి పడింది. బహ్రెయిన్ అథ్లెట్లు కల్కిదన్ బెఫ్కదు (4 ని. 07.88 సెకన్లు), టిగిస్ట్ బిలే (4 ని. 09.12 సెకన్లు) స్వర్ణం, రజతం నెగ్గారు. -
సెమీస్‌లో భారత్‌కు షాక్
జకార్తా: డిఫెండింగ్ చాంపియన్ భారత పురుషుల హాకీ జట్టు ఆసియా క్రీడల సెమీఫైనల్లో అనూహ్య ఓటమి పాలైంది. గురువారం జరిగిన సెమీస్‌లో భారత్ 6–7తో మలేసియా చేతిలో షూటౌట్లో ఓడింది.మ్యాచ్ ఆరంభం నుంచి ఆధిపత్యాన్ని కొనసాగించిన మన జట్టు చివరి నిమిషంలో ప్రత్య ర్థికి గోల్ సమర్పించుకొని మూల్యం చెల్లించుకుంది. నిర్ణీత సమయంలో ఇరు జట్లు 2–2 గోల్స్‌తో సమంగా నిలవడంతో షూటౌట్ ద్వారా విజేతను తేల్చారు. షూటౌట్లో తొలుత ఆకాశ్‌దీప్ సింగ్, హర్మన్‌ప్రీత్ సింగ్ గోల్స్ చేయగా... మన్‌ప్రీత్ సింగ్, దిల్‌ప్రీత్ సింగ్, ఎస్వీ సునీల్ విఫలమయ్యారు. గోల్ కీపర్, కెప్టెన్ శ్రీజేశ్ ప్రత్యర్థి ఆటగాళ్ల మూడు షాట్లను అడ్డుకోవడంతో మళ్లీ స్కోరు 2–2తో సమమైంది. దీంతో ‘సడన్ డెత్’ కొనసాగించారు. అందులోనూ ఇరు జట్లు వరుసగా నాలుగేసి గోల్స్ చేశాయి. ఐదో షాట్‌ను మలేసియా ఆటగాడు గోల్ పోస్ట్‌లోకి కొట్టగా... ఐదో షాట్ ఆడిన సునీల్ గోల్ కొట్టలేకపోవడంతో భారత్ ఓటమి ఖాయమైంది. అంతకుముందు మ్యాచ్‌లో భారత్ తరఫున హర్మన్‌ప్రీత్ సింగ్ (33వ ని.లో), వరుణ్ కుమార్ (40వ ని.లో) చెరో గోల్ చేశారు. మలేసియా తరఫున ఫైజల్ సారి (39వ ని.లో), మొహమ్మద్ రహీం (59వ ని.లో) చెరో గోల్ చేశారు. ఈ మ్యాచ్‌లో భారత్‌కు 7 పెనాల్టీ కార్నర్ అవకాశాలు రాగా అందులో రెండింటిని గోల్స్‌గా మలిచింది. మరో సెమీస్‌లో జపాన్ 1–0తో పాకిస్తాన్‌పై గెలిచి ఫైనల్ చేరింది. శనివారం స్వర్ణం కోసం మలేసియాతో జపాన్; కాంస్యం కోసం పాకిస్తాన్‌తో భారత్ తలపడతాయి. ఇప్పటి వరకు ఈ టోర్నీలో ఎదురైన ప్రతీ ప్రత్యర్థిని చిత్తు చేస్తూ.... రికార్డు స్థాయిలో 76 గోల్స్‌తో సెమీస్‌కు చేరింది శ్రీజేశ్ సేన. ప్రత్యర్థులకు 3 గోల్స్ మాత్రమే ఇచ్చింది. కానీ అసలు పోరులో తమకంటే బలహీన ప్రత్యర్థి చేతిలో ఓడింది. ఈ మెగా ఈవెంట్ ప్రారంభానికి ముందు... ఏషియాడ్‌లో స్వర్ణం నెగ్గి నేరుగా 2020 టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత సాధించాలనుకున్న భారత్ ఆశలు ఈ ఓటమితో ఆవిరయ్యాయి. ఇక ఒలింపిక్స్‌లో పాల్గొనాలంటే మన జట్టు అర్హత టోర్నీలు ఆడాల్సి ఉంటుంది. -
బాక్సింగ్ సెమీస్‌లో వికాస్, అమిత్
ఏషియాడ్ బాక్సింగ్‌లో భారత్‌కు మరో రెండు పతకాలు ఖాయమయ్యాయి. బుధవారం క్వార్టర్ ఫైనల్స్‌లో స్టార్ బాక్సర్ వికాస్ కృషన్ (75 కేజీలు) 3–2తో చైనాకు చెందిన తుహెటా ఎర్బీక్ తంగ్లథియాన్‌పై నెగ్గి సెమీస్‌కు చేరాడు. అంతకుముందు జరిగిన మరో క్వార్టర్ ఫైనల్లో అమిత్ ఫంఘాల్ (49 కేజీలు) 5–0తో దక్షిణ కొరియా బాక్సర్ కిమ్ జాంగ్ ర్యాంగ్‌పై గెలుపొందాడు. మరోవైపు మహిళల బాక్సింగ్ క్వార్టర్ ఫైనల్స్‌లో సర్జుబాలా దేవి (51 కేజీలు) 0–5 తేడాతో చాంగ్ యువాన్ (చైనా) చేతిలో ఓడిపోయింది. దీంతో భారత మహిళా బాక్సర్లు పతకాలేమీ సాధించకుండా వెనుదిరిగినట్లయింది. మహిళల బాక్సింగ్‌ను ఏషియాడ్‌లో ప్రవేశపెట్టిన (2010) తర్వాత భారత్‌కు ఇలా జరగడం ఇదే మొదటిసారి. -
హాకీ ఫైనల్లో భారత మహిళలు
భారత మహిళల హాకీ జట్టు ఆసియా క్రీడల ఫైనల్‌కు దూసుకెళ్లింది. గ్రూప్ ‘బి’లో అజేయంగా అగ్రస్థానంతో సెమీస్ చేరిన రాణి రాంపాల్ బృందం బుధవారం జరిగిన సెమీస్‌లో 1–0తో చైనాను చిత్తు చేసింది. గత 20 ఏళ్లలో భారత మహిళల జట్టు ఆసియా క్రీడల ఫైనల్ చేరడం ఇదే తొలిసారి. 1998లో చివరిసారి భారత్ ఫైనల్‌కు చేరి స్వర్ణం సాధించింది. భారత్ తరఫున గుర్జీత్ కౌర్ (52వ నిమిషంలో) ఏకైక గోల్ నమోదు చేసింది. శుక్రవారం జరిగే తుదిపోరులో జపాన్‌తో భారత్ తలపడనుంది. నేడు పురుషుల హాకీ సెమీఫైనల్ డిఫెండింగ్ చాంపియన్ భారత పురుషుల హాకీ జట్టు నేడు సెమీఫైనల్ బరిలో దిగనుంది. పూల్ ‘ఎ’లో అజేయంగా అగ్రస్థానంతో సెమీస్ చేరిన భారత్... పూల్ ‘బి’లో రెండో స్థానంలో నిలిచిన మలేసియాతో అమీతుమీ తేల్చుకోనుంది. టోర్నీ ఆరంభం నుంచి అటాకింగ్ గేమ్ ఆడుతున్న శ్రీజేశ్ సేన ఈ మ్యాచ్‌లోనూ అదే మంత్రంతో ఆడి తుదిపోరుకు అర్హత సాధించాలనే పట్టుదలతో ఉంది. హాకీ చరిత్రలో ఓ టోర్నీలో అత్యధిక గోల్స్(76) కొట్టిన ఘనతను భారత జట్టు ఈ మెగా ఈవెంట్లో సొంతం చేసుకుంది. -
టీటీ మిక్స్డ్ డబుల్స్‌లో కాంస్యమే
టేబుల్ టెన్నిస్ మిక్స్డ్ డబుల్స్ సెమీ ఫైనల్స్‌లో భారత జోడీ ఆచంట శరత్ కమల్–మనికా బాత్రా పరాజయం పాలై కాంస్యంతో సరిపెట్టుకుంది. బుధవారం సెమీస్‌లో చైనాకు చెందిన ఇంగ్షా సన్– వాంగ్ సన్ జంట 11–9, 11–5, 11–13, 11–4, 11–8 తేడాతో భారత జోడీని ఓడించింది. అంతకుముందు క్వార్టర్స్‌లో భారత్ 4–11, 12–10, 6–11, 11–6, 11–8తో ఉత్తర కొరియాపై, ప్రికార్వర్ట్స్లో 11–7, 7–11, 11–8, 10–12, 11–4 స్కోరుతో దక్షిణ కొరియాపై గెలుపొందింది. -
ద్యుతీకి మరో రజతం
భారత స్ప్రింటర్ ద్యుతీ చంద్ ఆసియా క్రీడల్లో రెండో పతకాన్ని సాధించింది. మహిళ 200 మీటర్ల పరుగులో ఆమె రెండో స్థానంలో నిలిచింది. ఈ రేసును ద్యుతీ 23.20 సెకన్లలో పూర్తి చేసింది. ఎడిడియాంగ్ ఒడియాంగ్ (బహ్రెయిన్– 22.96 సె.), వీ యోంగ్లీ (చైనా –23.27 సె.) స్వర్ణ, కాంస్యాలు గెలుచుకున్నారు. ఆదివారమే ద్యుతి 100 మీటర్ల స్ప్రింట్‌లో కూడా రజతం సాధించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఒకే ఏషియాడ్‌లో ఒకటి కంటే ఎక్కువ పతకాలు గెలిచిన నాలుగో అథ్లెట్‌గా చరిత్రకెక్కింది. అంతకుముందు పీటీ ఉష 1986 సియోల్ ఏషియాడ్‌లో 200 మీ., 400 మీ. పరుగులు, 400 మీ. హర్డిల్స్, 4గీ400 మీటర్ల రిలేలో స్వర్ణాలు గెలిచింది. జ్మోతిర్మయి సిక్దర్ 1998లో 800 మీ., 1500 మీ. పరుగులో, సునీతా రాణి 2002లో 1500 మీ., 5 వేల మీ. పరుగులో పతకాలు గెల్చుకున్నారు. -
అర్పీందర్ అద్భుతం
జకార్తా: ఆసియా క్రీడల్లో పురుషుల ట్రిపుల్ జంప్ స్వర్ణం కోసం సుదీర్ఘంగా సాగుతున్న భారత నిరీక్షణకు అర్పీందర్ సింగ్ తెరదించాడు. అద్భుత ప్రదర్శనతో ఈ క్రీడాంశంలో అతడు 48 ఏళ్ల అనంతరం బంగారు పతకం అందించాడు. బుధవారం జరిగిన పోటీల్లో మూడో ప్రయత్నంలో 16.77 మీటర్లు దూకిన అర్పీందర్ టాప్‌లో నిలిచాడు. తొలి యత్నంలో విఫలమైనప్పటికీ... రెండో సారి అతడు 16.58 మీటర్లు జంప్ చేశాడు. మూడోసారి ఈ పంజాబ్ అథ్లెట్ దానిని మరింత మెరుగుపర్చుకున్నాడు. ఉజ్బెకిస్తాన్‌కు చెందిన రుస్లాన్ కుర్బనోవ్ (16.62 మీ.) రజతం, షువో కావ్ (16.56 మీ.) కాంస్యం అందుకున్నారు. మరోవైపు 2014 కామన్వెల్త్ క్రీడల కాంస్యం తర్వాత అర్పీందర్కు ఇదే తొలి పతకం కావడం విశేషం. అతడి వ్యక్తిగత ఉత్తమ రికార్డు మాత్రం 17.17 మీటర్లు కావడం గమనార్హం. ట్రిపుల్ జంప్‌లో 1970 ఏషియాడ్‌లో మొహిందర్ సింగ్ గిల్ (16.11 మీ.) స్వర్ణం నెగ్గిన తర్వాత భారత్‌కు మరో స్వర్ణం రావడం ఇదే మొదటిసారి. -
'స్వప్న' సాకారం
చరిత్రలో నిలిచే విజయాలతో లభించిన రెండు స్వర్ణాలు... అరుదైన రికార్డుతో దక్కిన రజతం... నిలకడైన ప్రదర్శనకు అందిన కాంస్యంతో ఆసియా క్రీడల 11వ రోజు భారత్... నాలుగు పతకాలు సాధించింది. 11 స్వర్ణాలతో గత ఏషియాడ్ రికార్డు సమం చేసిన మన దేశం... ప్రస్తుతం మొత్తం 54 పతకాలతో 9వ స్థానంలో కొనసాగుతోంది. హెప్టాథ్లాన్‌లో స్వప్న బర్మన్ స్వర్ణ స్వప్నం సాకారం చేయడం... ట్రిపుల్ జంప్‌లో అర్పీందర్ అదరగొట్టడం ఏషియాడ్‌లో బుధవారం భారత్ తరఫున నమోదైన మెరుపులు...! ద్యుతీ చంద్ రెండో పతకంతో సత్తా చాటగా...టీటీలో మరో కాంస్యంతో మిక్స్డ్ ద్వయం ఆనందం నింపింది. జకార్తా: కఠినమైన ఏడు క్రీడాంశాల సమాహారం... 66 ఏళ్లుగా సాధ్యం కాని ఘనత... గతంలో మూడుసార్లు ఊరించి చేజారిన కల... ఇప్పుడు మాత్రం నెరవేరింది. అద్భుత ప్రదర్శనతో బెంగాల్‌కు చెందిన 21 ఏళ్ల స్వప్న బర్మన్ దానిని సాధించింది. ఆసియా క్రీడల హెప్టాథ్లాన్‌లో తొలిసారి స్వర్ణం నెగ్గిన భారత అథ్లెట్‌గా రికార్డులకెక్కింది. అరుదైన విజయంతో చరిత్ర సృష్టించింది. ఏడు క్రీడాంశాల్లో ఇలా... రెండు రోజుల పాటు జరిగిన హెప్టాథ్లాన్‌లో ఏడు క్రీడాంశాల్లో స్వప్న మొత్తం 6,026 పాయింట్లు సాధించింది. హై జంప్ (1.82 మీ.), జావెలిన్ త్రో (50.63 మీ.)లలో టాపర్‌గా నిలిచిన ఈ బెంగాలీ యువతి... షాట్‌పుట్ (12.69 మీ.), లాంగ్ జంప్ (6.05 మీ.)లో రెండో స్థానంలో వచ్చింది. ఇక 100 మీటర్ల పరుగులో 13.98 సెకన్లతో నాలుగో స్థానంలో, 200మీ. పరుగులో 26.08 సెకన్లతో నాలుగో స్థానంతో సరి పెట్టుకుంది. 64 పాయింట్ల ఆధిక్యంతో చివరిదైన 800 మీ. పరుగు బరిలో దిగిన బర్మన్... అందులో (2ని.21:13సె.) నాలుగో స్థానంలో నిలిచినా... మెరుగైన పాయింట్లతో స్వర్ణం గెల్చుకుంది. చైనాకు చెందిన క్వింగ్లింగ్ వాంగ్ (5954 పాయింట్లు) రజతం, జపాన్ అథ్లెట్ యమసాకి యుకి (5873 పాయింట్లు) కాంస్యంతో సరిపెట్టుకున్నారు. అయితే, 800 మీ. పరుగుకు ముందు యమసాకి కంటే 18 పాయింట్లు మాత్రమే వెనుకబడిన భారత అథ్లెట్ పూర్ణిమా హెంబ్రామ్ (5837 పాయింట్లు)... ఆ రేసులో మూడో స్థానంలో నిలిచినా ఓవరాల్ స్కోరులో వెనుకబడి త్రుటిలో కాంస్యం చేజార్చుకుంది. మరోవైపు ఏషియాడ్ హెప్టాథ్లాన్‌లో భారత్ తరఫున సోమా బిశ్వాస్ (2002, 2006) రజతం నెగ్గడమే ఇప్పటివరకు అత్యుత్తమం. జేజే శోభా (2002, 2006), ప్రమీలా అయ్యప్ప (2010)లు కాంస్యాలు గెలిచారు. ఆరు వేళ్ల బర్మన్... ఏడు ఈవెంట్ల విన్నర్ రెండు కాళ్లకు ఆరు వేళ్లుంటే నడవొచ్చు. పరిగెత్తొచ్చు. అంతేకాదు పతకం కూడా గెలవొచ్చని ఏషియాడ్‌లో ఘనంగా చాటింది స్వప్న బర్మన్. ఇది కూడా ఓ ఘనతేనా అనుకుంటే ఒక అథ్లెట్ శ్రమను తక్కువగా అంచనా వేసినట్లే! ఎందుకంటే ఆరేసి వేళ్లున్న అమ్మాయి అయినా అబ్బాయైనా షూస్‌తో సౌకర్యంగా ఉండటం చాలా కష్టం. ఏకబికిన ఏడు ఈవెంట్లలో పాల్గొనడం మరెంతో కష్టం... కానీ ఇంతకు మించిన కష్టాలే నిత్యం చవిచూసిన బర్మన్కు ఈ హెప్టాథ్లాన్ పోటీ ఏపాటిది! అందుకేనేమో సౌకర్యం సంగతి పక్కనబెట్టింది. సాధించడంపైనే మక్కువ పెంచుకుంది. చివరకు ఇంచియోన్ (గత ఏషియాడ్‌లో ఐదోస్థానం)లో పోగొట్టుకున్న పతకాన్ని జకార్తాలో చేజిక్కించుకునేలా తయారు చేసింది. నాడు కష్టాలతో సహవాసం... నేడు పసిడితో సాకారం... బెంగాల్‌కు చెందిన 21 ఏళ్ల స్వప్న బర్మన్‌ది నిరుపేద కుటుంబం. తండ్రి రిక్షా లాగుతాడు. అతను కూడా ఐదేళ్లుగా మంచానికే పరిమితమయ్యాడు. సోదరుడు కట్టెలు కొట్టడం ద్వారా వచ్చిన ఆదాయంతోనే ఇల్లు గడిచింది. కడుపునిండా తినడానికే పోరాడాల్సిన ఇంట్లో పతకం కోసం ఆరాటపడటం అత్యాశే అని అనిపిస్తుంది! కానీ... స్వప్న కేవలం ఆరాటంతోనే గడిపేయలేదు. దినదిన పోరాటంతో కుంగిపోలేదు. ఓ లక్ష్యం కోసం సుదీర్ఘ ప్రయాణం చేసింది. చివరికి ఈ పయనంలో విజేతగా నిలిచింది. ఒకటి కాదు... రెండు కాదు... ఏడు. హైజంప్, లాంగ్‌జంప్, జావెలిన్ త్రో, షాట్‌పుట్, 100 మీ. 200 మీ. 800 మీ. పరుగు పోటీలు. ఇవన్నీ ఓ ‘పట్టు’పడితే ముగిసే రెజ్లింగ్ పోటీలు కాదు. ధనాధన్‌గా బాదే క్రికెట్ మెరుపులు కాదు. ఒక్కో ఈవెంట్ ఒక్కో లక్ష్యాన్ని నిర్దేశిస్తుంది. అన్నీ భిన్న మైనవే! అన్నీ కష్టమైనవే! కానీ ఇవన్నీ స్వప్నకు సలాం చేశాయి. పొట్టిగా ఉన్నావంటే... గట్టిగా బదులిచ్చింది... స్వప్న హెప్టాథ్లాన్కు హైజంప్‌తో బీజం పడింది. తన సోదరుడు దూకే ఎత్తును చూసి తాను దూకేందుకు సరదా చూపెట్టింది. 2011లో 1.20 మీ. నుంచి 1.30 మీటర్ల ఎత్తు వరకూ దూకింది. శిక్షణ కేంద్రంలో మిగతావారు వివిధ ఈవెంట్లలో ఆడటం చూసి క్రమంగా హెప్టాథ్లాన్ ప్లేయర్‌గా ఎదిగింది. ఈ చాన్స్ కూడా అంత ఈజీగా రాలేదు. ముందుగా శిక్షణ కోసం కోచ్ సుభాష్ సర్కార్ (ప్రస్తుత కోచ్ కూడా) వద్దకెళ్తే పొట్టిగా ఉన్నావ్ పోటీలకు పనికిరావని వారించారు. కానీ ఆ పొట్టి అమ్మాయే 2012 స్కూల్ గేమ్స్ (హై జంప్) పోటీల్లో స్వర్ణం గెలిచింది. వెంటనే కోచ్ నుంచి పిలుపొచ్చింది. సాయ్‌లో శిక్షణకు సీటొచ్చింది. సరిగ్గా ఆరేళ్ల తర్వాత చూస్తే ఆమె 66 ఏళ్ల నిరీక్షణకు తెరదించింది. హెప్టాథ్లాన్‌లో విజేతగా నిలిచింది. తన చిరకాల స్వప్నాన్ని సాకారం చేసుకునేందుకు సిద్ధమైతున్న వేళ కూడా బర్మన్ను పంటినొప్పి తీవ్రంగా బాధపెట్టింది. అయితే యాంటిబయోటిక్స్ మందులతో బరిలోకి దిగి అనుకున్నది సాధించింది. -
ఏషియన్ గేమ్స్: ఫైనల్లో టీమిండియా
జకర్తా: భారత మహిళల హాకీ జట్టు ఆసియా క్రీడల్లో అదరగొడుతున్నారు. వరుస విజయాలతో టీమిండియా ఫైనల్‌కు దూసుకెళ్లింది. బుధవారం జరిగిన మ్యాచ్‌లో టీమిండియా 1-0తేడాతో చైనాపై గెలిచి స్వర్ణపోరుకు సిద్దమైంది. సెమీఫైనల్లో నమోదైన ఏకైక గోల్ టీమిండియా స్టార్ ప్లేయర్ గుర్జీత్ కౌర్(52వ నిమిషంలో) సాధించి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించారు. ఏషియన్ గేమ్స్‌లో భారత మహిళల జట్టు ఫైనల్‌కు చేరుకోవడం ఇది మూడో సారి కాగా, 1998 తర్వాత ఇదే తొలి సారి కావడం విశేషం. భారత జట్టు ఫైనల్ పోరులో ఈ నెల 31న (శుక్రవారం) జపాన్‌తో తలపడనుంది. నేడు జరిగిన సెమీఫైనల్ ఉత్కంఠభరితంగా సాగింది. ఇరుజట్ల ఢిపెన్స్ బలంగా ఉండటంతో గోల్ నమోదు కావడానికి చాలా సమయమే పట్టింది. దీంతో మూడు క్వార్టర్స్ ముగిసే సరికి ఒక్క గోల్ నమోదుకాలేదు. మరో ఎనిమిది నిమిషాల్లో మ్యాచ్ ముగుస్తుందనగా పెనాల్టీ కార్నర్ రూపంలో భారత జట్టుకు అదృష్టం వరించింది. వచ్చిన అవకాశాన్ని మిస్ చేయకుండా భారత స్టార్ ప్లేయర్ గుర్జీత్ కౌర్ చైనా గోల్కీపర్ను బోల్తా కొట్టించి గోల్ సాధించారు. ఇక ఆట ముగిసే సమయానికి మరో గోల్ నమోదు కాకపోవడంతో టీమిండియా విజయం సాధించింది. -
ఏషియన్ గేమ్స్: ద్యుతి చంద్ డబుల్ ధమాకా!
జకార్త: ఏషియన్ గేమ్స్‌లో భారత అథ్లెట్ ద్యుతి చంద్ మరో పతకం సాధించారు. ఇప్పటికే మహిళల 100 మీటర్ల విభాగంలో రజతం సాధించిన ఆమె.. బుధవారం జరిగిన 200 మీటర్ల ఫైనల్లో 23.20 సెకన్లలో పరుగును పూర్తిచేసి రెండో స్థానంలో నిలిచారు. దీంతో ద్యుతి మరో రజత పతకం సొంతం చేసుకున్నారు. 22.96 సెకనల్లో బెహ్రెయిన్ అథ్లెట్ ఓడియంగో ఎడిడాంగ్ స్వర్ణం గెలవగా.. 23.27 సెకన్లతో వుయ్యాంగీ(చైనా) కాంస్యం సొంతం చేసుకున్నారు. ఆసియా క్రీడల్లో ఒకటి కన్నా ఎక్కువ పతకాలు సాధించిన పీటీ ఉష, జ్యోతిర్మయి వంటి దిగ్గజ అథ్లెట్ల సరసన నిలిచారు. ఇక 100 మీటర్లు, 200 మీటర్ల విభాగంలో పతకాలు సాధించిన నాలుగో క్రీడాకారిణిగా కూడా ద్యుతి గుర్తింపు పొందారు.1986లో సియోల్‌లో జరిగిన ఆసియా క్రీడల్లో పీటీ ఉష 200 మీటర్లు, 400 మీటర్లు, 400 మీటర్ల హర్డిల్స్, 4×400 మీటర్ల రిలేలో స్వర్ణాలు గెలిచి రికార్డు సృష్టించారు. 1998 బ్యాంకాక్ క్రీడల్లో జ్యోతిర్మయి సిక్దార్ 800 మీటర్లు, 1500 మీటర్లలో రెండు పతకాలు సాధించారు. 2002 బుసాన్ క్రీడల్లో సునితా రాణి 1500 మీటర్లు, 500 మీటర్లలో రెండు పతకాలతో మెరిసారు. ద్యుతీచంద్‌లో అధిక మోతాదులో పురుష హార్మోన్లు (టెస్టోస్టిరాన్) ఉన్నాయి కాబట్టి ఆమెకు మహిళల విభాగంలో పాల్గొనే అర్హత లేదంటూ కామన్వెల్త్ క్రీడల నుంచి తప్పించారు. స్పోర్ట్స్ ఆర్బిట్రేజ్ కోర్టులో పోరాడిన ద్యుతీ తిరిగి కఠోర సాధన చేసింది. అకుంఠిత దీక్షతో అందరినీ మెప్పించింది. భారత్‌కు రెండు స్వర్ణాలు హెప్టాథ్లాన్ మహిళల విభాగం, పురుషుల ట్రిపుల్ జంప్ విభాగల్లో భారత్‌కు స్వర్ణం లభించింది. బర్మాన్ స్వప్న 5218 స్కోర్‌తో అగ్రస్థానంలో నిలిచి పసిడి సొంతం చేసుకుంది. పురుషుల ట్రిపుల్ జంప్ విభాగంలో భారత అథ్లెట్ అర్పిందర్ 16.77 మీటర్లు దూకి స్వర్ణం సాధించాడు. దీంతో 48 ఏళ్ల తర్వాత భారత్‌కు ఈ ఈవెంట్ స్వర్ణం వరించింది. 1970లో మోహిందర్ సింగ్ 16.11 మీటర్లతో స్వర్ణం సాధించాడు. ఆ తర్వాత భారత అథ్లెట్ మళ్లీ పసిడి అందుకోవడం ఇదే తొలిసారి. ఫైనల్‌కు అర్హత సాధించిన మరో భారత అథ్లెట్ రాకేశ్ ఆరోస్థానంతో సరిపెట్టుకున్నాడు. టేబుల్ టెన్నిస్‌లో కాంస్యం.. టేబుల్ టెన్నిస్ మిక్స్డ్ డబుల్స్‌లో భారత్ కాంస్యంతో సరిపెట్టుకుంది. శరత్ కమల్, మనికా బాత్రా జోడీ సెమీస్‌లో కఠిన ప్రత్యర్థి చైనాతో 9-11, 5-11, 13-11, 4-11, 8-11 తేడాతో ఓటమి చవిచూసింది. దీంతో భారత పతకాల సంఖ్య(11 స్వర్ణాలు, 20 రజతాలు, 23 కాంస్యాలు) 54కు చేరింది. -
ఏషియాడ్‌లో నేటి భారతీయం
అథ్లెటిక్స్: పురుషుల 20 కి.మీ. నడక (ఇర్ఫాన్, మనీశ్; ఉ. గం. 4.30 నుంచి); మహిళల 20 కి.మీ. నడక (సౌమ్యా, ఖుష్బీర్; ఉ. గం.4.40 నుంచి); మహిళల హెప్టాథ్లాన్ (స్వప్నా, పూర్ణిమా; ఉ. గం.7.30 నుంచి); పురుషుల ట్రిపుల్ జంప్ ఫైనల్: రాకేష్, అర్పిందర్; సా. గం. 4.45 నుంచి); మహిళల 200 మీ. ఫైనల్: (ద్యుతీ చంద్; సా. గం.5.35 నుంచి). బాక్సింగ్ (క్వార్టర్స్): పురుషుల 49 కేజీలు: (అమిత్గీకిమ్ జాంగ్; మ. గం.12.15 నుంచి); పురుషుల 64 కేజీలు: (ధీరజ్గీబాటర్సుఖ్; సా.గం.5.15 నుంచి); పురుషుల 75 కేజీలు: (వికాస్గీఎర్బీక్; మ. గం.1.45 నుంచి); మహిళల 51 కేజీలు: (సర్జుబాలా దేవిగీచాంగ్ యువాన్; మ.గం.2.15 నుంచి) హాకీ: మహిళల సెమీఫైనల్ (భారత్గీచైనా; మ. 12.30 నుంచి) -
సుధా సింగ్‌కు యూపీ ప్రభుత్వ ఉద్యోగం
లక్నో: వెటరన్ లాంగ్ డిస్టెన్స్ రన్నర్ సుధా సింగ్‌కు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఉద్యోగం ఇవ్వనుంది. 32 ఏళ్ల సుధా... సోమవారం 3 వేల మీటర్ల స్టీపుల్‌ఛేజ్‌లో రజతం నెగ్గింది. దీంతో ఆమెకు రూ.30 లక్షల ప్రోత్సాహక నగదుతో పాటు గెజిటెడ్ హోదాతో కొలువు ఇవ్వనున్నట్లు యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రకటించారు. అయితే, దీనిపై సుధా సింగ్ ఒకింత నిర్వేదంతో స్పందించింది. ‘నాకెలాంటి సంతోషమూ, నిరుత్సాహమూ లేదు. 2010 ఏషియాడ్‌లోనే స్వర్ణం గెలిచాను. ఆసియా చాంపియన్‌షిప్‌లలో కూడా పతకాలు నెగ్గాను. ప్రపంచ చాంపియన్‌షిప్, ఒలింపిక్స్‌లోనూ ప్రాతినిధ్యం వహించాను. ఈ ఉద్యోగం ఇంతకుముందే రావాల్సింది. క్రీడా కోటాలో నియామకానికి సంబంధించి నాలుగేళ్లుగా నా ఫైల్ అపరిష్కృతంగా ఉంది. అప్పుడు కాకున్నా, ఇప్పుడు ఇవ్వడం కొంతలో కొంత ఉపశమనం. క్రీడా శాఖలో మాత్రమే ఉద్యోగం చేస్తా. ఇతర శాఖల్లో చేయను’ అని పేర్కొంది. సుధా ప్రస్తుతం రైల్వే శాఖ ఉద్యోగి. 2015లో యూపీ ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వుల మేరకు ఆమెకు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగం రావాల్సి ఉంది. దీనిపై మూడుసార్లు నాటి సీఎంను కలిసినా ఉపయోగం లేకపోయిందని ఆమె సోదరుడు పర్వేష్ తెలిపాడు. -
లంకపైనా గోల్స్ వర్షం
జకార్తా: ఏషియాడ్ పురుషుల హాకీలో భారత్ భారీ సంఖ్యలో గోల్స్‌తో అదరగొడుతోంది. మంగళవారం శ్రీలంకతో జరిగిన పూల్ ‘ఎ’ చివరి లీగ్ మ్యాచ్‌లో 20–0తో జయభేరి మోగించింది. భారత్ తరఫున ఆకాశ్‌దీప్ సింగ్ (9, 11, 17, 22, 32, 42వ నిమిషాల్లో) ఆరు గోల్స్ చేయడం విశేషం. రూపిందర్ పాల్ సింగ్ (1, 52, 53వ ని.), హర్మన్‌ప్రీత్ సింగ్ (5, 21, 33వ ని.), మన్దీప్ సింగ్ (35, 43, 59వ ని.) మూడేసి కొట్టారు. లలిత్ రెండు, ప్రసాద్, అమిత్, దిల్‌ప్రీత్ సింగ్ తలా ఒక గోల్ సాధించారు. ఆడిన ఐదు మ్యాచ్‌ల్లోనూ గెలిచిన భారత్ పూల్ ‘ఎ’లో అజేయంగా అగ్రస్థానంలో నిలిచింది. పూల్ ‘బి’లో రెండో స్థానంలో నిలిచిన మలేసియాతో గురువారం జరిగే సెమీఫైనల్లో టీమిండియా తలపడతుంది. మరో సెమీఫైనల్లో కొరియాతో పాక్ ఆడుతుంది. బాక్సింగ్‌లో నిరాశ... ఏషియాడ్ మహిళల బాక్సింగ్‌లో మంగళవారం భారత్‌కు నిరాశ ఎదురైంది. 57 కేజీల విభాగంలో సోనియా లాథర్ 0–5తో ఉత్తర కొరియా బాక్సర్ జొ సన్ హ్వా చేతిలో ఓడిపోయింది. 60 కేజీల విభాగంలో పవిత్ర 2–3తో హుస్వాతున్ హసనాహ్ (ఇండోనేసియా) చేతిలో ఓటమి పాలైంది. -
చివర్లో తడబడి... రజతాలతో సరి...
కాంపౌండ్ టీమ్ ఆర్చరీలో భారత పురుషుల జట్టు తమ స్వర్ణ పతకాన్ని నిలబెట్టుకోలేకపోయింది. మరోవైపు భారత మహిళల జట్టు కూడా ‘పసిడి’ పోరులో ఒత్తిడికిలోనై రజత పతకంతోనే సరిపెట్టుకుంది. 2014 ఏషియాడ్ ఫైనల్లో దక్షిణ కొరియాను ఓడించి స్వర్ణం నెగ్గిన భారత జట్టు ఈసారి కొరియా చేతిలోనే ఓడిపోయి రజతంతో సంతృప్తి పడింది. అభిషేక్ వర్మ, అమన్ సైని, రజత్ చౌహాన్‌లతో కూడిన భారత పురుషుల జట్టుకు ఫైనల్లో అదృష్టం కలిసి రాలేదు. నిర్ణీత 24 షాట్ల తర్వాత భారత్, కొరియా 229–229 పాయింట్లతో సమఉజ్జీగా నిలిచాయి. దాంతో విజేతను నిర్ణయించేందుకు రెండు జట్లకు మూడేసి షాట్లతో కూడిన ‘షూట్ ఆఫ్’ను నిర్వహించారు. ఇందులోనూ రెండు జట్లు 29 పాయింట్ల చొప్పున సాధించాయి. అయితే కొరియా ఆర్చర్లు కొట్టిన రెండు షాట్లు 10 పాయింట్ల వృత్తానికి అతి సమీపంలో ఉండటంతో వారికి స్వర్ణం ఖాయమైంది. భారత్ ఖాతాలో రజతం చేరింది. ఆంధ్రప్రదేశ్ అమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ, ముస్కాన్, మధుమితలతో కూడిన భారత మహిళల జట్టు ఫైనల్లో 228–231తో దక్షిణ కొరియా జట్టు చేతిలో ఓడిపోయింది. 18 షాట్ల తర్వాత రెండు జట్లు 173–173తో సమంగా ఉన్నాయి. అయితే చివరి ఆరు షాట్ల సిరీస్‌లో భారత్ 55 పాయింట్లు సాధించగా... కొరియా 58 పాయింట్లు స్కోరు చేసి విజయాన్ని ఖాయం చేసుకుంది. జ్యోతి సురేఖకు ఇది రెండో ఆసియా క్రీడల పతకం. 2014 ఏషియాడ్‌లో సురేఖ సభ్యురాలిగా ఉన్న భారత మహిళల కాంపౌండ్ జట్టు కాంస్యం గెలిచింది. -
సిల్వర్ సింధు
భారత స్టార్ షట్లర్ పూసర్ల వెంకట (పీవీ) సింధుకు మళ్లీ నిరాశ తప్పలేదు. మరో మెగా ఈవెంట్లో ఆమె ఫైనల్లో పరాజయం పాలై రజత పతకంతోనే సంతృప్తి చెందాల్సి వచ్చింది. గత రెండేళ్ల వ్యవధిలో రియో ఒలింపిక్స్, రెండు వరల్డ్ చాంపియన్‌షిప్‌లు, వరల్డ్ సూపర్ సిరీస్ ఫైనల్స్, కామన్వెల్త్ గేమ్స్‌లాంటి ప్రతిష్టాత్మక పోటీల్లో తుది పోరులో విజయాన్ని అందుకోలేకపోయిన సింధు ఇప్పుడు ఆసియా క్రీడల ఫైనల్లోనూ ఓడింది. ఏకపక్షంగా సాగిన ఫైనల్లో ప్రపంచ నంబర్‌వన్ తై జు యింగ్ (చైనీస్ తైపీ) 21–13, 21–16తో సింధును ఓడించింది. ఈ మ్యాచ్ 34 నిమిషాల్లోనే ముగిసింది. అయితే ఆసియా క్రీడల చరిత్రలో రజత పతకం సాధించిన తొలి భారత బ్యాడ్మింటన్ క్రీడాకారిణిగా సింధు చరిత్ర సృష్టించింది. సెమీస్‌లో ఓడిన సైనా నెహ్వాల్ కాంస్యం సాధించడంతో ఏషియాడ్‌లో తొలిసారి వ్యక్తిగత విభాగంలో భారత్‌కు రెండు పతకాలు లభించాయి. ఫైనల్‌కు ముందు తై జుతో వరుసగా ఐదు మ్యాచ్‌ల్లోనూ ఓడిన ప్రపంచ మూడో ర్యాంకర్ సింధు ఈ సారైనా ఫలితం మార్చాలని పట్టుదలగా శ్రమించినా ఫలితం లేకపోయింది. తొలి గేమ్‌లో 5–0తో ముందంజలో నిలిచిన తై జు అదే జోరులో 16 నిమిషాల్లో గేమ్‌ను గెలుచుకుంది. రెండో గేమ్ ఆరంభంలో 4–4తో స్కోరు సమంగా ఉన్నా... తైపీ అమ్మాయి దూకుడుగా ఆడుతూ 15–10తో విజయంవైపు దూసుకెళ్లి వెనుదిరిగి చూడలేదు. ‘నాకు, తై జుకు మధ్య ఆటలో అంతరం మరీ ఎక్కువగా ఏమీ లేదు. ఆమెను కచ్చితంగా ఓడించగలను. నేను మరింత బాగా సన్నద్ధమై, తప్పుల నుంచి పాఠాలు నేర్చుకుంటే అది సాధ్యమే. మానసికంగా కూడా బాగానే ఉన్నాను. నేను కాస్త ఓపిగ్గా ఆడి ఉంటే ఫలితం భిన్నంగా ఉండేది. రజతంతో కూడా సంతృప్తి చెందాను’ అని పీవీ సింధు వ్యాఖ్యానించింది. సింధుకు వైఎస్ జగన్ అభినందనలు సాక్షి, హైదరాబాద్: రజతం నెగ్గిన తెలుగు తేజం పీవీ సింధుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి అభినందనలు తెలిపారు. భవిష్యత్తులో ఆమె మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. నాడు తండ్రి... నేడు కూతురు... పీవీ సింధు తండ్రి పీవీ రమణ ఖాతాలోనూ ఆసియా క్రీడల పతకం ఉంది. ఇప్పుడు సింధు రజతం సాధించగా... టీమ్ ఈవెంట్ వాలీబాల్‌లో రమణకు కాంస్యం దక్కింది. 1986 సియోల్ ఆసియా క్రీడల్లో మూడో స్థానంలో నిలిచిన భారత జట్టులో రమణ సభ్యులుగా ఉన్నారు. తండ్రీ కూతుళ్లిద్దరూ ఆసియా క్రీడల పతకాలు గెలుచుకోవడం, రెండు వేర్వేరు క్రీడాంశాలు కావడం విశేషం. -
టీటీలో తొలిసారి కాంస్యం
ఏషియాడ్ చరిత్రలో తొలిసారి సెమీఫైనల్‌కు చేరుకొని చరిత్ర సృష్టించిన భారత పురుషుల టేబుల్ టెన్నిస్ (టీటీ) జట్టు పోరాటం ముగిసింది. మంగళవారం జరిగిన సెమీఫైనల్లో సత్యన్ జ్ఞానశేఖరన్, ఆచంట శరత్ కమల్, ఆంథోనీ అమల్‌రాజ్, హర్మీత్ దేశాయ్‌లతో కూడిన భారత జట్టు 0–3తో దక్షిణ కొరియా చేతిలో పరాజయం పాలై కాంస్యం దక్కించుకుంది. తొలి మ్యాచ్‌లో సత్యన్ 11–9, 9–11, 3–11, 3–11తో లీ సాంగ్సు చేతిలో... రెండో మ్యాచ్‌లో శరత్ కమల్ 9–11, 9–11, 11–6, 11–7, 8–11తో యంగ్ సిక్ జియోంగ్ చేతిలో... మూడో మ్యాచ్‌లో అమల్‌రాజ్ 5–11, 7–11, 11–4, 7–11తో వూజిన్ జాంగ్ చేతిలో ఓడిపోయారు. మరోసెమీఫైనల్లో చైనీస్ తైపీ 1–3తో చైనా చేతిలో ఓటమి పాలై కాంస్యాన్ని సాధించింది. ఫైనల్లో చైనా 3–0తో దక్షిణ కొరియాను ఓడించి స్వర్ణ పతకం సొంతం చేసుకుంది. -
‘మన్’జీత్‌గయా...
పురుషుల 800 మీటర్ల ఫైనల్ రేసు. భారత స్టార్ జిన్సన్ జాన్సన్ కచ్చితంగా పతకం సాధిస్తాడని అంచనాలు ఉన్నాయి. అందుకు తగినట్లుగానే రేసు సాగింది. కానీ ఎక్కడో దూరంగా ఉన్న మరో భారత అథ్లెట్ మన్జీత్ సింగ్ అనూహ్యంగా దూసుకొచ్చాడు. ఒక్కొక్కరినీ వెనక్కి తోసి పరుగెడుతూ చివరకు అగ్రస్థానంలో నిలిచి పసిడిని అందుకున్నాడు. అతని వెనకే జాన్సన్ నిలవడంతో ఒకే ఈవెంట్లో స్వర్ణ, రజతాలు భారత్ ఖాతాలో చేరాయి. మరోసారి ఫైనల్లో తడబడిన తెలుగు తేజం పీవీ సింధు బ్యాడ్మింటన్ తుది పోరులో ఓడి రజతంతో సరి పెట్టుకోగా... మరో తెలుగమ్మాయి జ్యోతి సురేఖ సభ్యురాలిగా ఉన్న ఆర్చరీ జట్టు రజతంతో మురిసింది. టీటీలో తొలి కాంస్యంతో చరిత్ర సృష్టించగా... ఎవరూ పెద్దగా దృష్టి పెట్టని ‘కురాష్’లో రెండు మెడల్స్ రావడంతో పదో రోజు ముగిసేసరికి ఆసియా క్రీడల్లో భారత్ మొత్తం 50 పతకాలతో 8వ స్థానంలో నిలిచింది. జకార్తా: అంచనాలను నిజం చేస్తూ ఆసియా క్రీడల్లో భారత అథ్లెట్ల జోరు మరో రోజు కొనసాగింది. మంగళవారం కూడా అథ్లెటిక్స్ నుంచే భారత్ ఖాతాలో స్వర్ణ పతకం చేరింది. పురుషుల 800 మీటర్ల పరుగులో మన్జీత్ సింగ్ అగ్రస్థానంలో నిలిచి పసిడి సొంతం చేసుకున్నాడు. 1 నిమిషం 46.15 సెకన్లలో అతను రేసు పూర్తి చేశాడు. భారత్‌కే చెందిన జిన్సన్ జాన్సన్ (1ని. 46.35 సెకన్లు) రెండో స్థానంలో నిలిచి రజతం సాధించాడు. అబూ బకర్ (ఖతర్–1ని. 46.38 సెకన్లు) కాంస్యం అందుకున్నాడు. మన్జీత్ అగ్రస్థానం స్పష్టంగా ఖరారు కాగా, ఇతర పతక విజేతలను ఫొటోఫినిష్ ద్వారా తేల్చారు. 1982 ఢిల్లీ ఆసియా క్రీడల్లో ఛార్లెస్ స్వర్ణం గెలుచుకున్న తర్వాత 800 మీటర్ల పరుగులో భారత్‌కు ఇదే తొలి పసిడి కావడం విశేషం. ఇదే జకార్తాలో జరిగిన 1962 ఏషియాడ్‌లో దల్జీత్, అమ్రిత్ పాల్ రజత, కాంస్యాలు సాధించిన తర్వాత 800 మీటర్ల పరుగులో ఇద్దరు భారత అథ్లెట్లు పతకాలు నెగ్గడం కూడా ఇదే మొదటిసారి. మిక్స్డ్ రిలేలోనూ రజతం తొలిసారి ప్రవేశపెట్టిన 4గీ400 మిక్స్డ్ రిలే ఈవెంట్లో కూడా భారత జట్టు రజత పతకం గెలుచుకుంది. 3 నిమిషాల 15.71 సెకన్లలో భారత్ రేసును పూర్తి చేసి రెండో స్థానంలో నిలిచింది. ఈ టీమ్‌లో మొహమ్మద్ అనస్ యహియా, పూవమ్మ, హిమ దాస్, అరోకియా రాజీవ్ సభ్యులుగా ఉన్నారు. తొలి లెగ్‌లో అనస్ అద్భుతంగా పరుగెత్తి ముందంజలో నిలవగా, పూవమ్మ దానిని కొనసాగించింది. అయితే మూడో లెగ్‌లో ప్రత్యర్థితో పోలిస్తే హిమ దాస్ బాగా నెమ్మదించిపోయింది. బహ్రెయిన్ అథ్లెట్ అడెకోయా తన సహచరి సల్వా నాసర్‌కు బ్యాటన్ అందిస్తూ ట్రాక్‌పై పడిపోవడంతో ఆమెను తప్పించుకుంటూ తనను తాను నియంత్రించుకునే క్రమంలో హిమ దాస్ వేగం తగ్గించాల్సి వచ్చింది. చివరి లెగ్‌లో రాజీవ్ తీవ్రంగా శ్రమించినా ఫలితం దక్కలేదు. దాంతో భారత బృందం రజతంతోనే సంతృప్తి చెందాల్సి వచ్చింది. ఈ ఈవెంట్లో బహ్రెయిన్ (3 ని. 11.89 సెకన్లు) స్వర్ణం... కజకిస్తాన్ (3 ని. 19.52 సెకన్లు) కాంస్యం సాధించాయి. ‘కురాష్’లో రెండు పతకాలు... ఆసియా క్రీడల్లో తొలిసారి ప్రవేశ పెట్టిన కురాష్ (రెజ్లింగ్ తరహా క్రీడ)లో భారత క్రీడాకారిణులు పింకీ బల్హారా, మాలప్రభ (52 కేజీలు) రజతం, కాంస్యం గెలిచారు. ఫైనల్లో పింకీ 0–10తో గుల్నార్ (ఉజ్బెకిస్తాన్) చేతిలో... సెమీఫైనల్లో మాలప్రభ 0–10తో గుల్నార్ (ఉజ్బెకిస్తాన్) చేతిలోనే ఓడింది. కన్నబిడ్డను చూసుకోకుండా... రెండేళ్ల క్రితమే మన్జీత్ కెరీర్ దాదాపు ముగింపు దశకు వచ్చేసింది. అప్పటికి అతని వయసు 27 ఏళ్లు కాగా... ‘ఇప్పటి వరకు నువ్వు చెప్పుకోదగ్గ ప్రదర్శన ఇవ్వలేదు. ఇంకా మెరుగుపర్చుకునే వయసు కూడా నీది కాదు’ అంటూ ఓఎన్జీసీ చిన్న కాంట్రాక్ట్ ఉద్యోగం నుంచి కూడా అతడిని తొలగించింది. డబ్బుల కోసం ఇంకా తల్లిదండ్రులపై ఆధారపడే పరిస్థితి. అతనిపై ఎవరికీ నమ్మకం లేకపోగా తనకు కూడా ఎలాంటి ఆశలు లేవు. కెరీర్లో ఎప్పుడూ ఒక్క అంతర్జాతీయ పతకం కూడా గెలవని మన్జీత్ జాతీయ స్థాయిలో ఆఖరి సారిగా 2013లో పతకం సాధించాడు. ఇలాంటి సమయంలో ఆర్మీ కోచ్ అమ్రిష్ కుమార్ మాత్రమే అండగా నిలిచారు. అప్పటి వరకు ఫలితాలు బాగా లేకపోయినా మన్‌జీత్‌లో ప్రతిభ ఉందని గుర్తించిన అమ్రిష్ ‘నీ జీవితంలో ఎలాంటి బాధ్యతలు లేకుండా రెండేళ్లు నాకు ఇస్తే ఆసియా క్రీడల్లో పతకం సాధించేలా చేస్తాను’ అని ప్రోత్సహించారు. అంతే... కోచ్‌కు మాట ఇచ్చి రెండేళ్లు అతను తీవ్రంగా కష్టపడ్డాడు. నెలకు 30 వేల సొంత ఖర్చుతో ఆర్మీ క్యాంప్‌లో శిక్షణ పొందాడు. అయినా సరే ఆసియా చాంపియన్‌షిప్, 2018 కామన్వెల్త్ క్రీడలకు కూడా అర్హత సాధించలేకపోయాడు. కానీ మన్జీత్ పట్టు వదల్లేదు. మంగళవారం పోరుకు కూడా క్వాలిఫయింగ్ చివరి స్థానంలో నిలిచి అర్హత సాధించిన అతను ఏకంగా స్వర్ణం కొట్టేశాడు. మార్చి 6న అతనికి కొడుకు పుట్టాడు. కానీ ట్రైనింగ్‌లో ఉన్న మన్జీత్ ఇప్పటి వరకు తన బిడ్డను చూడలేదు. ‘ఇప్పుడు నా కొడుకును కలుస్తాను. నా స్వర్ణాన్ని చూపించి అతని తండ్రి ఏం సాధించాడో చెబుతాను’ అంటూ మన్జీత్ భావోద్వేగంతో చెప్పాడు! -
వారెవ్వా.. స్వర్ణం, రజతం రెండు మనకే!
జకార్త: ఏషియన్ గేమ్స్‌లో భారత అథ్లెట్స్ అదరగొట్టారు. పురుషుల 800 మీటర్ల విభాగంలో స్వర్ణం, రజతం రెండు పతకాలను సొంతం చేసుకున్నారు. మంగళవారం జరిగిన ఫైనల్లో భారత రన్నర్స్ మన్జిత్ సింగ్, జిన్సన్ జాన్సన్ తొలి రెండు స్థానాల్లో నిలిచారు. మన్జిత్ (1:46:15 )లో పరుగు పూర్తి చేసి పసిడి దక్కించుకోగా.. జిన్సన్ జాన్సన్ (1:46: 35)సెకన్లలో పరుగు పూర్తి చేసి రజతం కైవసం చేసుకున్నాడు. ఖతర్‌కు చెందిన అబ్దల్లా అబుబేకర్ (1:46:38)కు కాంస్యం వరించింది. 1962 తర్వాత 800 మీటర్ల విభాగంలో భారత ఆటగాళ్లు రెండు పతకాలు నెగ్గడం విశేషం. ఇక 26 ఏళ్ల తర్వాత భారత్‌కు ఈ విభాగంలో స్వర్ణం దక్కడం మరో విశేషం. 1951లో తొలిసారి భారత ఆటగాళ్లు రంజీత్ సింగ్ (గోల్డ్), కుల్వంత్ సింగ్ (రజతం) నెగ్గగా.. 1962లో దల్జిత్ సింగ్ సిల్వర్, అమ్రిత్ పాల్ కాంస్య పతకాలు నెగ్గారు. తాజాగా మన్జిత్ సింగ్, జిన్సన్ జాన్సన్ ఆ జాబితాలో చేరి రికార్డు సృష్టించారు. #GOLD medals for India in #AsianGames 800m (men) 1951: Ranjit Singh 1966: Bhogeswar Baruah 1974: Sriram Singh 1978: Sriram Singh 1982: Charles Borromeo 2018: Manjit Singh#AsianGames2018 — Mohandas Menon (@mohanstatsman) August 28, 2018 బ్యాడ్మింటన్ సింగిల్స్ ఫైనల్లో ప్రపంచ మూడో ర్యాంకర్ సింధు 13-21, 16-21 తేడాతో వరల్డ్ నంబర్ వన్ క్రీడాకారిణి తై జు యింగ్(చైనీస్ తైపీ) చేతిలో ఓటమి పాలై రజతంతో సరిపెట్టుకున్నారు. ఇక సెమీస్‌లో ఓడిన సైనా కాంస్యం గెలిచిన విషయం తెలిసిందే. పురుషుల టేబుల్ టెన్నిస్ టీమ్ విభాగంలో భారత జట్టు కాంస్యం సొంతం చేసుకుంది. ఆర్చరీ కాంపౌడ్ టీమ్ విభాగంలో భారత మహిళల, పురుషుల జట్లు రజతం పతకాలను గెలిచాయి. జావెలిన్ త్రోలో అనురాణి పోరాటం ముగిసింది. ఫైనల్లో ఆమె ఆరోస్థానంతో సరిపెట్టుకున్నారు. మిక్స్డ్ 4x400m రిలే విభాగంలో రజతం మిక్స్డ్ 4x400m రిలే విభాగంలో తొలిసారి భారత జట్టుకు పతకం వరించింది. ముహమ్మద్ అనస్ యాహియా, పూవమ్మ మచెట్టేరి, హిమదాస్, రాజీవ్ అరోకియాల బృందం 3:15.71 సమయంలో లక్ష్యాన్ని చేరుకొని రెండో స్థానంలో నిలిచారు. దీంతో భారత్‌కు రజతం వరించింది. బెహ్రెయిన్(3:11.89) జట్టుకు స్వర్ణం, కజకిస్తన్(3:19.52)కు కాంస్యం లభించింది. అయ్యో హిమదాస్... 400 మీటర్ల విభాగంలో రజతం సొంతం చేసుకున్న హిమదాస్.. 200 మీటర్ల విభాగంలో డిస్క్వాలిఫై అయ్యారు. సెమీస్2 రేసులో ఆమె ఫాల్స్ స్టార్ చేయడంతో రిఫరీలు అనర్హురాలిగా ప్రకటించారు. ఇదే విభాగంలో సెమీస్ అర్హత సాధించిన 100 మీటర్ల రజత విజేత ద్యుతిచంద్ ఫైనల్‌కు అర్హత సాధించారు. 9 స్వర్ణాలు, 19 రజతాలు, 22 కాంస్యాలతో మొత్తం భారత పతకాల సంఖ్య 50కి చేరింది. దీంతో పతకాల పట్టికలో భారత్ 9వ స్థానంలో నిలిచింది. వైఎస్ జగన్ ప్రశంసలు.. ఏషియన్‌గేమ్స్‌లో సత్తా చాటిన భారత అథ్లెట్స్‌ను వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రశంసించారు. భారత బృందం అద్భుత ప్రదర్శన కనబర్చిందని కొనియాడారు. ప్రతి ఒక్కరి గెలుపు తమకు గర్వంగా ఉందని ట్వీట్ చేశారు. Remarkable performance by the entire Indian troupe at #AsianGames2018 It is raining medals and numbers have been high throughout! Each one of you is a champion and we are extremely proud of you! — YS Jagan Mohan Reddy (@ysjagan) August 28, 2018 -
ఎయిర్‌పోర్ట్‌లో స్టార్‌ప్లేయర్ ఎంగేజ్మెంట్
సాక్షి, న్యూఢిల్లీ : ఏషియన్‌గేమ్స్‌లో సత్తా చాటి భారత్‌కు స్వర్ణం అందించిన స్టార్ రెజ్లర్ వినేశ్ ఫొగాట్ తన ఎంగేజ్‌మెంట్‌ను వినూత్నంగా జరుపుకున్నారు. రెజ్లింగ్‌లో పసిడి కొట్టి తొలి భారత మహిళా రెజ్లర్‌గా వినేశ్ ఫొగాట్ రికార్డు సృష్టించిన విషయం తెలిసిందే. ఈ విజయానంతరం జకార్త నుంచి భారత్‌కు తిరుగు వచ్చే క్రమంలో ఆమె ఢిల్లీ ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో తన వివాహ నిశ్చితార్థం జరుపుకున్నారు. తన ప్రియుడు సోమ్‌వీర్ రతితో ఇరుకుటుంబాల సమక్షంలో అత్యంత నిరాడంబరంగా ఈ వేడుక జరిగింది. గ్రీకో-రోమన్ రెజ్లర్ అయిన సోమ్‌వీర్‌తో వినేశ్ ఎయిర్‌పోర్ట్‌లోనే రింగ్స్ మార్చుకుని కేకు కట్ చేశారు. ఈ విషయాన్ని ఆమె సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. దీంతో ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట్లో హల్చల్ చేస్తున్నాయి. మహిళల ఫ్రీస్టయిల్ 50 కేజీల విభాగంలో స్వర్ణం సాధించిన వినేశ్ ఫొగాట్.. ఫైనల్లో జపాన్ రెజ్లర్ యుకి ఇరీని 6-2తో ఓడించారు. ఇక తన లక్ష్యం 2020 టోక్యో ఒలింపిక్సేనని, దీని కోసం అన్ని పోటీల్లో పాల్గొంటున్నాని వినేశ్ ఫొగాట్ స్పష్టం చేశారు.(చదవండి: ‘పసిడి’ కాంత) The best decision I ever made! Glad you pinned me for life 😍❤️ A post shared by Vinesh Phogat (@vineshphogat) on Aug 22, 2018 at 12:12am PDT ప్రియుడు సోమ్‌వీర్‌తో వినేశ్ ఫొగాట్ -
ఏషియన్ గేమ్స్: ఇండోనేషియాలో భూకంపం
జకార్త: ఏషియన్ గేమ్స్ ఆతిథ్య దేశం ఇండోనేషియాలో మంగళవారం భూకంపం సంభవించింది. అయితే ఈ భూకంప దాటికి ఎలాంటి ప్రమాదాలు, ప్రాణనష్టం జరగలేదు. సునామీ వచ్చే అవకాశం కూడా లేదని, భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 6.2 గా నమోదైందని యూఎస్ జియోలాజికల్ సర్వే పేర్కొంది. ఈ భూకంప దాటికి 18వ ఏషియా గేమ్స్ జరుగుతున్న జకార్త, పలేంబాగ్ ప్రాంతాల్లోతో పాటు టీమర్ ఐస్లాండ్, కుపాంగ్‌ల్లో భూమి కొంతమేర కంపించింది. ఇటీవల లంబోక్ దీవుల్లో సంభవించిన భూకంప తీవ్రతకు 80 మందికి పైగా మృతి చెందగా, వేలాది పౌరులు తీవ్ర గాయలపాలయ్యారు. ఈ ఏడాది వరుసగా సంభవించిన భూకంపాలతో ఇండోనేషియాలో సుమారు 500 మంది ప్రాణాలు కోల్పోయినట్లు అక్కడి అధికారులు పేర్కొన్నారు. Prelim M6.2 Earthquake Timor region, Indonesia Aug-28 07:08 UTC, updates https://t.co/3jkUFHLFjy — USGS Big Quakes (@USGSBigQuakes) August 28, 2018 -
సింధూను వదలని ఫైనల్ ఫోబియా
-
ఫైనల్లో ఓడిన సింధు.. రజతంతో సరి
జకార్తా: ఆసియా క్రీడల బ్యాడ్మింటన్ చరిత్రలో ఫైనల్‌కు చేరిన తొలి భారత ప్లేయర్‌గా రికార్డులకెక్కిన పీవీ సింధు.. ఫైనల్ పోరులో తడబడింది. మంగళవారం జరిగిన మహిళల సింగిల్స్ తుది పోరులో ప్రపంచ మూడో ర్యాంకర్ సింధు 13-21, 16-21 తేడాతో వరల్డ్ నంబర్ వన్ క్రీడాకారిణి తై జు యింగ్(చైనీస్ తైపీ) చేతిలో ఓటమి పాలై రన్నరప్‌గా సరిపెట్టుకుంది. ఆద్యంతం ఏకపక్షంగా సాగిన పోరులో సింధు పూర్తిస్థాయి ఆటను కనబరచడంలో విఫలమైంది. ఫలితంగా సింధు రజతంతోనే సంతృప్తి పడింది. వరుస రెండు గేమ్‌లను తై జు యింగ్‌కు సునాయాసంగా కోల్పోయిన సింధు.. మరొకసారి ఫైనల్ ఫోబియాను అధిగమించలేకపోయింది. తద్వారా 2016 రియో ఒలింపిక్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో చివరిసారి తై జు యింగ్‌ని ఓడించిన సింధు ఆ తర్వాత ఆమెతో ఆడిన వరుస ఆరు మ్యాచ్‌ల్లోనూ పరాజయం పాలైనట్లయ్యింది. కాగా, ఏషియన్ గేమ్స్ సింగిల్స్ విభాగంలో రజత పతకం సాధించిన తొలి భారత క్రీడాకారిణిగా సింధు గుర్తింపు సాధించింది. ఈ ఆసియా క్రీడల ముందు వరకూ మహిళల, పురుషుల సింగిల్స్‌లో ఫైనల్‌కు చేరిన వారు లేదు. ఆసియా క్రీడా బ్యాడ్మింటన్ చరిత్రలో భారత్ ఇప్పటివరకూ ఒకే ఒక్క సింగిల్స్ పతకం ఉంది. 1982లో ఢిల్లీలో నిర్వహించిన ఆసియా క్రీడల్లో పురుషుల సింగిల్స్‌లో సయ్యద్ మోదీ కాంస్య గెలిచాడు. ఆ తర్వాత సింగిల్స్‌లో భారత్‌కు ఒక్క పతకం కూడా రాకపోగా, తాజా ఏషియన్ గేమ్స్‌లో సింధు రజత పతకాన్ని సాధించగా, సైనా కాంస్యాన్ని సాధించింది. సింధు మరో చరిత్ర -
ఆసియా క్రీడల బ్యాడ్మింటన్ ఫైనల్లో తెలుగు తేజం
-
ఏషియాడ్‌లో నేటి భారతీయం
బ్యాడ్మింటన్: మహిళల సింగిల్స్ ఫైనల్ (సింధు,తైజుయింగ్; ఉ. గం.11.30 నుంచి) ఆర్చరీ: మహిళల, పురుషుల కాంపౌండ్ టీమ్ ఫైనల్స్ (భారత్‌గీకొరియా;ఉ.10.30 నుంచి) అథ్లెటిక్స్: మహిళల జావెలిన్ త్రో ఫైనల్ (అన్ను రాణి; సా.5.55 నుంచి); పురుషుల 800 మీ. ఫైనల్: జిన్సన్ జాన్సన్, మన్జిత్ సింగ్ (సా.6.10 నుంచి); మహిళల 5 వేల మీ. ఫైనల్ (సూరియా, సంజీవని; సా. గం.6.20 నుంచి). బాక్సింగ్: మహిళల 57 కేజీల క్వార్టర్ ఫైనల్స్ (సోనియా గీ జొ సన్ హా); మ. గం.1 నుంచి; మహిళల 60 కేజీల క్వార్టర్ ఫైనల్: పవిత్ర గీ హుస్వాతున్); మం.గం.1.45 నుంచి హాకీ: పురుషుల పూల్ లీగ్ మ్యాచ్, భారత్ గీ శ్రీలంక; మ. గం.2.30 నుంచి. సోనీ టెన్–2, టెన్–3, సోనీ ఈఎస్పీఎన్ చానెల్స్‌లో ప్రత్యక్ష ప్రసారం -
పురుషుల టీటీలో నయా చరిత్ర
ఆసియా క్రీడల టేబుల్ టెన్నిస్ (టీటీ)లో భారత పురుషుల జట్టు చరిత్రాత్మక గెలుపుతో రికార్డు పుస్తకాలకెక్కింది. సోమవారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో సత్యన్ జ్ఞానశేఖరన్, ఆచంట శరత్ కమల్, హర్మీత్ దేశాయ్,ఆంథోనీ అమల్‌రాజ్‌లతో కూడిన భారత జట్టు 3–1తో ప్రపంచ రెండో ర్యాంకర్ జపాన్‌పై సంచలన విజయం సాధించింది. 1958 ఏషియాడ్ నుంచి కనీసం ఒక్క పతకమైనా నెగ్గని భారత్ ఈసారి ఏకంగా సెమీఫైనల్స్‌కు చేరి కనీసం కాంస్యం ఖాయం చేసుకుంది. క్వార్టర్స్ తొలి మ్యాచ్‌లో సత్యన్ జ్ఞానశేఖరన్ 11–9, 11–9, 11–7తో యుడా జిన్‌పై నెగ్గి శుభారంభం అందించగా... రెండో మ్యాచ్‌లో శరత్ కమల్ 11–8, 12–10, 11–8తో మసుదైరా కెంటాను మట్టికరిపించి ఆధిక్యాన్ని 2–0కు పెంచాడు. మూడో మ్యాచ్‌లో హర్మీత్ దేశాయ్ 11–9, 12–14, 11–8, 8–11, 4–11తో యొషిడా మసాకి చేతిలో ఓడిపోయాడు. అయితే నాలుగో మ్యాచ్‌లో సత్యన్ జ్ఞానశేఖరన్ విజృంభించి 12–10, 6–11, 11–7, 11–4తో కెంటాను ఓడించి భారత విజయాన్ని ఖాయం చేశాడు. మంగళవారం జరిగే సెమీఫైనల్లో దక్షిణ కొరియాతో భారత్; చైనీస్ తైపీతో చైనా తలపడతాయి. సెమీస్‌లో ఓడిన జట్లకు కాంస్యాలు లభిస్తాయి. మరోవైపు భారత మహిళల జట్టు క్వార్టర్ ఫైనల్లో 1–3తో హాంకాంగ్ చేతిలో ఓడిపోయింది. -
వికాస్ ముందంజ... హుసాముద్దీన్ ఓటమి
ఏషియాడ్ బాక్సింగ్‌లో ముగ్గురు భారత బాక్సర్లు వికాస్ కృషన్ (75 కేజీలు), అమిత్ (49 కేజీలు), ధీరజ్ (64 కేజీలు) క్వార్టర్ ఫైనల్స్‌కు చేరారు. అయితే, కామన్వెల్త్ క్రీడల కాంస్య పతక విజేత, నిజామాబాద్ కుర్రాడు మొహమ్మద్ హుసాముద్దీన్ (56 కేజీలు) ప్రిక్వార్టర్స్‌లో పరాజయం పాలయ్యాడు. హుసాముద్దీన్ 2–3తో కిర్గిస్తాన్‌కు చెందిన ఎంక్ అమర్ ఖర్ఖు చేతిలో ఓడిపోయాడు. ఉత్కంఠగా సాగిన ఈ పోరులో హుసాముద్దీన్ నుదురుకు గాయమైంది. వికాస్ పదునైన పంచ్‌లతో 5–0తో తన్వీర్ అహ్మద్ (పాకిస్తాన్)పై... అమిత్ 5–0తో ఎన్ఖమన్‌దఖ్ ఖర్హు (మంగోలియా)పై... ధీరజ్ (64 కేజీలు) 3–0తో నుర్లాన్ కొబషెవ్ (మంగోలియా)పై గెలుపొందారు. -
స్వర్ణం కోసం సింధు
జకార్తా: ఆసియా క్రీడల చరిత్రలో పీవీ సింధు రూపంలో తొలిసారి భారత బ్యాడ్మింటన్ క్రీడాకారిణి స్వర్ణ పతక పోరుకు అర్హత సాధించింది. సోమవారం జరిగిన మహిళల సింగిల్స్ సెమీఫైనల్లో ప్రపంచ మూడో ర్యాంకర్ సింధు 21–17, 15–21, 21–10తో ప్రపంచ రెండో ర్యాంకర్ అకానె యామగుచి (జపాన్)పై గెలిచి ఫైనల్లోకి దూసుకెళ్లింది. తద్వారా ఈ క్రీడల చరిత్రలో ఓ విభాగంలో ఫైనల్‌కు చేరిన తొలి భారతీయ ప్లేయర్‌గా ఆమె కొత్త చరిత్ర సృష్టించింది. నేడు జరిగే టైటిల్ పోరులో ప్రపంచ నంబర్‌వన్ తై జు యింగ్ (చైనీస్ తైపీ)తో సింధు తలపడుతుంది. తై జు యింగ్‌తో ముఖాముఖి రికార్డులో సింధు 5–9తో వెనుకంజలో ఉంది. 2016 రియో ఒలింపిక్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో చివరిసారి తై జు యింగ్‌ని ఓడించిన సింధు ఆ తర్వాత ఆమెతో ఆడిన వరుస ఐదు మ్యాచ్‌ల్లోనూ పరాజయం పాలైంది. ‘తై జు యింగ్‌తో ఫైనల్ మ్యాచ్ కోసం నా వద్ద ప్రత్యేక వ్యూహం ఉంది. టైటిల్ పోరు హోరాహోరీగా సాగడం ఖాయం’ అని సింధు వ్యాఖ్యానించింది. అంతకుముందు మరో సెమీఫైనల్లో భారత్‌కే చెందిన మరో స్టార్ ప్లేయర్ సైనా నెహ్వాల్ 17–21, 14–21తో తై జు యింగ్ చేతిలో ఓడిపోయింది. తై జు యింగ్ చేతిలో సైనాకిది వరుసగా 10వ ఓటమి కావడం గమనార్హం. సెమీఫైనల్లో ఓటమి పాలైన సైనా, అకానె యామగుచిలకు కాంస్య పతకాలు లభించాయి. మహిళల సింగిల్స్ ఫైనల్ ఉ. గం.11.30 నుంచి సోనీ టెన్–2, టెన్–3, చానెల్స్‌లో ప్రత్యక్ష ప్రసారం -
మహిళల హాకీలో అజేయంగా...
ఏషియాడ్ మహిళల హాకీ లీగ్ దశలో ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లోనూ గెలుపొందిన భారత జట్టు (12 పాయింట్లు) పూల్ ‘బి’ టాపర్‌గా నిలిచింది. కెప్టెన్ రాణి రాంపాల్ (37, 46, 56 నిమిషాలు) హ్యాట్రిక్ గోల్స్‌తో అదరగొట్టడంతో సోమవారం చివరి లీగ్ మ్యాచ్‌లో థాయ్‌లాండ్‌పై 5–0 తేడాతో ఘన విజయం సాధించింది. మోనికా (52వ ని.), నవజ్యోత్ కౌర్ (55వ ని.) చెరో గోల్ చేశారు. థాయ్ గోల్ కీపర్ అలిసా నరీన్‌గ్రామ్ అడ్డుగోడలా నిలబడటంతో ఈ మ్యాచ్‌లో రాణి సేనకు పలు అవకాశాలు చేజారాయి. అయితే, కీలక సమయంలో జూలు విదిల్చిన కెప్టెన్... రెండు గోల్స్ కొట్టి ఆధిక్యం అందించింది. మూడు నిమిషాల తేడాతో మోనికా, నవ్‌జోత్ స్కోరు చేసి దానిని మరింత పెంచారు. ఆట ఆఖరులో రాణి మరో గోల్ కొట్టింది. -
పసిడి నీరాజనం
వరల్డ్ జూనియర్ చాంపియన్, కామన్వెల్త్ క్రీడల్లో స్వర్ణ పతక విజేత నీరజ్ చోప్రా తనపై ఉన్న అంచనాలను నిలబెట్టుకున్నాడు. తొలిసారి పాల్గొంటున్న ఆసియా క్రీడల్లో ఈ జావెలిన్ త్రోయర్ పసిడి పతకంతో మెరిశాడు. ఈ ఘనత సాధించిన తొలి భారత అథ్లెట్‌గా రికార్డు సృష్టించాడు. జావెలిన్‌ను 88.06 మీటర్లు విసిరిన నీరజ్ ఈ క్రమంలో తన పేరిటే ఉన్న జాతీయ రికార్డును కూడా సవరించడం విశేషం. మరోవైపు మరో ముగ్గురు అథ్లెట్లు సుధా సింగ్, నీనా వరకిల్, ధరుణ్ అయ్యసామి తమ సత్తాను ప్రదర్శించి మూడు రజతాలు అందించారు. బ్యాడ్మింటన్ సెమీఫైనల్లో ఓటమితో సైనా నెహ్వాల్ కాంస్యాన్ని తన ఖాతాలో వేసుకోగా, సింధు ఫైనల్ చేరడం ఆసియా క్రీడల తొమ్మిదో రోజు విశేషాలు. ప్రస్తుత పతకాల పట్టికలో భారత్ తొమ్మిదో స్థానంలో ఉంది. జకార్తా: ఆసియా క్రీడల్లో భారత్ ఖాతాలో ఎనిమిదో స్వర్ణ పతకం చేరింది. జావెలిన్ త్రోలో నీరజ్ చోప్రా ఈ పతకాన్ని అందించాడు. మొత్తం ఆరు ప్రయత్నాల్లో మూడోసారి అత్యుత్తమంగా 88.06 మీటర్లు త్రో చేసిన అతను అగ్రస్థానంలో నిలిచాడు. రెండు సార్లు ఫౌల్ చేసినా... ఇతర మూడు ప్రయత్నాల్లో నీరజ్ స్కోరు చేసిన 86.36 మీటర్లు, 83.46 మీటర్లు, 83.25 మీటర్లతో పోలిస్తే రజతం సాధించిన ఆటగాడికి మధ్య ఎంతో అంతరం ఉండటం భారత త్రోయర్ సత్తాకు నిదర్శనం. ఈ ఈవెంట్లో ల్యూ ఖిజెన్ (చైనా–82.22 మీటర్లు) రజతం గెలుచుకోగా, పాకిస్తాన్ అథ్లెట్ నదీమ్ అర్షద్ (80.75 మీటర్లు)కు కాంస్యం దక్కింది. 1982 ఢిల్లీ ఆసియా క్రీడల్లో గుర్తేజ్ సింగ్ కాంస్యం సాధించిన తర్వాత ఈ మెగా ఈవెంట్లో భారత్‌కు జావెలిన్‌లో ఇది రెండో పతకం మాత్రమే కావడం విశేషం. గత మే నెలలో దోహాలో జరిగిన డైమండ్ లీగ్ సిరీస్ తొలి అంచెలో 87.43 మీటర్ల దూరం జావెలిన్ విసిరి భారత రికార్డు నెలకొల్పిన 20 ఏళ్ల నీరజ్, ఇప్పుడు దానిని తానే సవరించాడు. స్టీపుల్‌ఛేజ్... హర్డిల్స్... లాంగ్‌జంప్... అథ్లెటిక్స్‌లో సోమవారం మూడు భిన్న క్రీడాంశాల్లో భారత్‌కు రజత పతకాలు లభించాయి. మహిళల 3000 మీటర్ల స్టీపుల్‌ఛేజ్‌లో భారత సీనియర్ లాంగ్ డిస్టెన్స్ రన్నర్ సుధా సింగ్ రజతం సాధించింది. 9 నిమిషాల 40.03 సెకన్లలో ఆమె పరుగు పూర్తి చేసి రెండో స్థానంలో నిలిచింది. 2010 ఆసియా క్రీడల్లో ఇదే ఈవెంట్లో స్వర్ణం సాధించిన సుధ, గత ఏషియాడ్‌లో నాలుగో స్థానంలో నిలిచింది. ఇప్పుడు రెండో పతకం ఆమె ఖాతాలో చేరింది. యవి విన్‌ఫ్రెడ్ (బహ్రెయిన్–9 ని.36.52 సెకన్లు), గ్యూయెన్ థి ఓన్ (వియత్నాం–9 ని. 43.83 సెకన్లు) స్వర్ణ, కాంస్యాలు గెలుచుకున్నారు. పురుషుల 400 మీటర్ల హర్డిల్స్‌లో ధరుణ్ అయ్యసామి రెండో స్థానంలో నిలిచి వెండి పతకం అందుకున్నాడు. తన అత్యుత్తమ టైమింగ్‌ను నమోదు చేస్తూ ధరుణ్ 48.96 సెకన్లలో గమ్యాన్ని చేరాడు. 300 మీటర్లు ముగిసేసరికి నాలుగో స్థానంలో కొనసాగిన ఈ తమిళనాడు అథ్లెట్ చివరి 100 మీటర్లలో దూసుకుపోయి రజతం గెలుచుకున్నాడు. అబ్దర్ రహమాన్ (ఖతర్–47.66 సెకన్లు)కు స్వర్ణం లభించగా... అబె టకటోషి (జపాన్ – 49.12 సెకన్లు) కాంస్యం గెలుచుకున్నాడు. మహిళల లాంగ్‌జంప్‌లో నీనా వరకిల్కు కూడా రజతం లభించింది. తన నాలుగో ప్రయత్నంలో అత్యుత్తమంగా 6.51 మీటర్ల దూకిన నీనా రెండో స్థానంలో నిలిచింది. బుయి థీ థూ థావో (వియత్నాం–6.55 మీ), గ్జియోలింగ్ (చైనా–6.50 మీ.) స్వర్ణం, కాంస్యం సాధించారు. ఈ ఈవెంట్లో మరో భారత అథ్లెట్ జేమ్స్ నయన పదో స్థానానికే పరిమితమైంది. విజయం అంత సులువుగా దక్కలేదని భావిస్తున్నా. పోటీలో కొందరు అత్యుత్తమ త్రోయర్లు ఉన్నా వారు రాణించలేకపోయారు. నేను బాగా సన్నద్ధమై వచ్చాను. ఆసియా క్రీడల రికార్డు నెలకొల్పాలని వచ్చాను. అయితే జావెలిన్ ఎత్తు సమస్యగా మారడంతో అది సాధ్యం కాలేదు. అయితే జాతీయ రికార్డు కావడం సంతోషంగా ఉంది. వరల్డ్ చాంపియన్‌షిప్‌లో సాధించిన స్వర్ణం జూనియర్ స్థాయిలో కాబట్టి నా కెరీర్లో ఇదే పెద్ద గెలుపు. భారీ లక్ష్యాలు నిర్దేశించుకొని అనవసరంగా నాపై ఒత్తిడి పెంచుకోను. – నీరజ్ చోప్రా నాకు ఎనిమిదేళ్ల వయసు ఉన్నప్పుడు మా నాన్న చనిపోతే అమ్మ ఎన్నో కష్టనష్టాలకు ఓర్చి నన్ను పెంచింది. ఈ పతక విజయం ఆమెదే. ప్రస్తుతం టీచర్‌గా అమ్మ నెలకు రూ. 14 వేలు మాత్రమే సంపాదిస్తోంది. నా ఈ ప్రదర్శనతో ఒక ఉద్యోగం లభిస్తే ఆమెకు అండగా నిలుస్తాను. – ధరుణ్ అయ్యసామి -
ఏషియాడ్: జయహో భారత్
-
ఏషియన్ గేమ్స్: అదరగొట్టిన భారత అథ్లెట్స్
జకార్త: ఏషియన్ గేమ్స్‌లో భారత అథ్లెట్స్ అదరగొట్టారు. సోమవారం అథ్లెటిక్స్ విభాగంలో పతకాల పంట పండించారు. జావెలిన్ త్రోలో నీరజ్ చోప్రా స్వర్ణం సాధించాడు. 88.06 స్కోర్ సాధించి అగ్రస్థానంలో నిలిచాడు. తొలి ప్రయత్నంలో 83.46 స్కోర్ సాధించిన నీరజ్.. రెండో ప్రయత్నంలో విఫలమయ్యాడు. మూడో ప్రయత్నంలో రికార్డు 88.06 స్కోరు సాధించి అగ్రస్థానంలో నిలిచాడు. అనంతరం మరో మూడుసార్లు ప్రయత్నించినప్పటికి ఈ స్కోర్‌ను అధిగమించలేకపోయాడు. 82.22 స్కోర్‌తో చైనా ఆటగాడు లియూ కిజెన్ రజతం సొంతం చేసుకోగా..80.75 స్కోర్‌తో పాకిస్తాన్ అథ్లెట్ నదీమ్ అర్షబ్ కాంస్యం సొంతం చేసుకున్నాడు. ఇదే విభాగంలో పాల్గొన్న మరో భారత అథ్లెట్ సింగ్ శివపాల్ (74.11)తో 8వ స్థానంలో నిలిచాడు. ఇక పురుషుల హర్డల్స్ విభాగంలో అయ్యసామి ధరుణ్ రజతం సొంతం చేసుకోగా.. మహిళల లాంగ్‌జంప్ విభాగంలో వరాకిల్ నీనా (6.51)తో రజతం కైవసం చేసుకుంది. ఇదే విభాగంలో పాల్గొన్న మరో భారత క్రీడాకారిణి నాయన జేమ్స్(6.14)తో పదోస్థానంలో నిలిచింది. పురుషుల హై జంప్‌లో బాలసబ్రమణ్యన్ చేతన్ పోరాటం ముగిసింది. ఫైనల్లో అతను 8 స్థానంతో సరిపెట్టుకున్నాడు. మహిళల 3000మీ స్టీపుల్‌చేజ్ విభాగంలో సుధా సింగ్ రజతం కైవసం చేసుకుంది. ఫైనల్లో 9 నిమిషాల 40 సెకన్లలో గమ్యం చేరుకొని రెండోస్థానంలో నిలిచింది. ఇక ఫైనల్‌కు అర్హత సాధించిన మరో భారత క్రీడాకారిణి చింతా (10 నిమిషా 26 సెకన్లతో) 11వ స్థానంతో సరిపెట్టుకుంది. పురుషుల 3000మీ స్టీపుల్‌చేజ్ విభాగంలో ఫైనల్‌కు చేరిన భారత అథ్లెట్ స్వామి శంకర్ లాల్ 8వ స్థానంలో నిలిచాడు. దీంతో ఇప్పటి వరకు భారత పతకాల సంఖ్య 8 స్వర్ణాల, 13 రజతాలు, 20 కాంస్యాలతో 41కి చేరింది. పతకాల జాబితో భారత్ 9 స్థానంలో కొనసాగుతోంది. చదవండి: సింధు మరో చరిత్ర -
సైనాకు నిరాశ.. కాంస్యంతో సరి
-
ఆసియా క్రీడలు: ఫైనల్లో సింధు
-
ద్యుతీచంద్‌కు భారీ నజరానా
ఒడిశా: ఏషియన్ గేమ్స్ 2018లో రజత పతకం సాధించిన అథ్లెట్ ద్యుతీచంద్‌కు ఒడిశా ప్రభుత్వం భారీ నజరానా ప్రకటించింది. ఈ మేరకు రూ. 1.50 కోట్లు నజరానాను ద్యుతీచంద్‌కు ఇవ్వనున్నట్లు ఒడిశా సీఎంఓ(ముఖ్యమంత్రి కార్యాలయం) ఒక ప్రకటనలో తెలిపింది. ఆసియా క్రీడల్లో పతకం సాధించడానికి ద్యుతీచంద్ అంకిత భావంతో కృషి చేసిందని, అదే సమయంలో పతక వేటలో ఆమె ఎంతగానో శ్రమించిందని సీఎంఓ పేర్కొంది. దానిలో భాగంగానే ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్.. ద్యుతీచంద్‌కు కోటిన్నర నజరానా ప్రకటించినట్లు సీఎంఓ స్పష్టం చేసింది. 1998 ఏషియన్ గేమ్స్‌లో తమ రాష్ట్ర అథ్లెట్ రచితా పాండా మిస్త్రీ కాంస్య పతకం సాధించిన సుదీర్ఘ కాలం తర్వాత ద్యుతీచంద్ రజత పతకాన్ని తేవడం ఎంతో గర్వంగా ఉందని సదరు ప్రకటనలో పేర్కొన్నారు. కాగా, ఒడిశా ఒలింపిక్ అసోసియేషన్(ఓఓఏ) రూ.50 వేల నజరానాను ద్యుతీకి ప్రకటించింది. ఆదివారం జరిగిన 100 మీటర్ల ఫైనల్ పోరులో ద్యుతిచంద్ రజత పతకం సాధించిన సంగతి తెలిసిందే. ద్యుతీ... రజత ఖ్యాతి -
ఆసియా క్రీడలు: సింధు మరో చరిత్ర
జకార్తా: ఏషియన్ గేమ్స్ 2018లో భాగంగా బ్యాడ్మింటన్ విభాగంలో భారత స్టార్ షట్లర్ పీవీ సింధు పసిడి పోరుకు అర్హత సాధించింది. సోమవారం జరిగిన మహిళల సింగిల్స్ సెమీ ఫైనల్లో ప్రపంచ మూడో ర్యాంకర్ పీవీ సింధు 21-17, 15-21, 21-10 తేడాతో వరల్డ్ నంబర్ టూ యామగూచి(జపాన్)పై గెలిచి ఫైనల్లోకి ప్రవేశించింది. ఫలితంగా రజత పతకాన్ని ఖాయం చేసుకున్న సింధు.. స్వర్ణ పతక పోరుకు సిద్ధమైంది. తొలి గేమ్‌లో పోరాడి గెలిచిన సింధు.. రెండో గేమ్‌ను కోల్పోయింది. దాంతో నిర్ణయాత్మక మూడో గేమ్ అనివార్యమైంది. ఈ గేమ్‌లో సింధు చెలరేగి ఆడింది. ప్రధానం సుదీర్ఘమైన ర్యాలీతో ఆకట్టుకుని యామగూచి ఆటకట్టించింది. అదే సమయంలో ఏషియన్ గేమ్స్‌లో ఫైనల్‌కు చేరిన తొలి భారత క్రీడాకారిణిగా సింధు మరో చరిత్ర సృష్టించింది. ఆదివారం సెమీస్ బెర్తును ఖాయం చేసుకోవడం ద్వారా ఏషియన్ గేమ్స్ మహిళల సింగిల్స్‌లో తొలిసారి కాంస్య పతకాన్ని ఖాయం చేసుకున్న భారత క్రీడాకారిణులుగా సైనా నెహ్వాల్, పీవీ సింధులు కొత్త చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే. కాగా, పైనల్‌కు చేరడం ద్వారా కనీసం రజతాన్ని ఖాయం చేసుకుని సింగిల్స్‌లో ఆ ఘనత సాధించిన తొలి భారత క్రీడాకారిణిగా సింధు నిలిచింది. మరొకవైపు ఇప్పటి వరకూ ఆసియా క్రీడల్లో మహిళల, పురుషుల సింగిల్స్‌లో ఫైనల్‌కు చేరిన వారు లేదు. ఆసియా క్రీడా బ్యాడ్మింటన్ చరిత్రలో భారత్ ఇప్పటివరకూ ఒకే ఒక్క సింగిల్స్ పతకం ఉంది. 1982లో ఢిల్లీలో నిర్వహించిన ఆసియా క్రీడల్లో పురుషుల సింగిల్స్‌లో సయ్యద్ మోదీ కాంస్య గెలిచాడు. ఆ తర్వాత సింగిల్స్‌లో భారత్‌కు ఒక్క పతకం కూడా రాకపోగా, తాజా ఏషియన్ గేమ్స్‌లో సింధు కనీసం రజత పతకాన్ని ఖాయం చేసుకోగా, సైనా కాంస్యాన్ని సాధించింది. మంగళవారం జరిగే పసిడి పతక పోరులో తై జు యింగ్(చైనీస్ తైపీ)తో సింధు తలపడనుంది. అంతకుముందు జరిగిన మరొక సెమీ ఫైనల్లో భారత బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్‌కు నిరాశే ఎదురైంది. సైనా నెహ్వాల్ 17-21, 14-21 తేడాతో తై జు యింగ్(చైనీస్ తైపీ) చేతిలో పరాజయం పాలైంది. తొలి గేమ్‌లో పోరాడి ఓడిన సైనా.. రెండో గేమ్‌లో మాత్రం పూర్తిగా చతికిలబడింది. దాంతో వరుస రెండు గేమ్‌లతో పాటు మ్యాచ్‌ను చేజార్చుకుని ఏషియన్ గేమ్స్‌లో తొలిసారి ఫైనల్‌కు చేరే అవకాశాన్ని కోల్పోయింది. ఫలితంగా కాంస్యంతోనే సరిపెట్టుకుంది. -
ఆసియా క్రీడలు : సైనాకు నిరాశ..!!
జకార్తా: ఏషియన్ గేమ్స్ 2018లో భారత షట్లర్ సైనా నెహ్వాల్‌కు చుక్కెదురైంది. సోమవారం జరిగిన సెమీ ఫైనల్లో సైనా నెహ్వాల్ 17-21, 14-21 తేడాతో తై జు యింగ్(చైనీస్ తైపీ) చేతిలో పరాజయం పాలైంది. తొలి గేమ్‌లో పోరాడి ఓడిన సైనా.. రెండో గేమ్‌లో మాత్రం పూర్తిగా చతికిలబడింది. దాంతో వరుస రెండు గేమ్‌లతో పాటు మ్యాచ్‌ను చేజార్చుకుని ఏషియన్ గేమ్స్‌లో తొలిసారి ఫైనల్‌కు చేరే అవకాశాన్ని కోల్పోయింది. ఫలితంగా కాంస్యంతోనే సరిపెట్టుకుంది. అదే సమయంలో పూర్తి అటాకింగ్ గేమ్ ఆడిన తై జు యింగ్ ఫైనల్ బెర్తును ఖాయం చేసింది. పీవీ సింధు-యమగూచిల మధ్య జరిగే మరొక సైమీ ఫైనల్లో మ్యాచ్ విజేతతో తై జు యింగ్ తలపడనుంది. -
ఈక్వెస్ట్రియన్‌లో భారత్‌కు రెండు రజతాలు
ఆసియా క్రీడల ఈక్వెస్ట్రియన్ (అశ్విక క్రీడలు) విభాగంలో భారత్‌కు రెండు రజత పతకాలు లభించాయి. వ్యక్తిగత విభాగంలో ఫౌద్ మీర్జా... టీమ్ విభాగంలో ఫౌద్ మీర్జా, రాకేశ్, ఆశిష్, జితేందర్ సింగ్‌లతో కూడిన జట్టు రెండో స్థానంలో నిలిచింది. 1982 ఆసియా క్రీడల్లో రఘువీర్ సింగ్ తర్వాత 36 ఏళ్లలో వ్యక్తిగత విభాగంలో భారత్ తరఫున పతకం నెగ్గిన ప్లేయర్‌గా ఫౌద్ మీర్జా గుర్తింపు పొందాడు. ఆదివారం జరిగిన ఈవెంట్లో మీర్జా 26.40 జంపింగ్ పాయింట్లతో రెండో స్థానంలో నిలిచాడు. యొషియాకి (జపాన్–22.70 పాయింట్లు) స్వర్ణం సాధించాడు. -
‘పసిడి’పై భారత ఆర్చరీ జట్ల గురి
ఆర్చరీ కాంపౌండ్ విభాగంలో భారత జట్లు స్వర్ణ పతక పోరుకు అర్హత సాధించి పతకాలను ఖాయం చేసుకున్నాయి. ఆంధ్రప్రదేశ్ ఆర్చర్ జ్యోతి సురేఖ, ముస్కాన్, మధుమితలతో కూడిన భారత మహిళల జట్టు సెమీఫైనల్లో 225–222తో చైనీస్ తైపీపై గెలిచింది. పురుషుల విభాగంలో అభిషేక్ వర్మ, అమన్ సైనీ, రజత్ చౌహాన్‌లతో కూడిన భారత జట్టు సెమీఫైనల్లో 230–227తో చైనీస్ తైపీ బృందంపై నెగ్గింది. మంగళవారం పసిడి పతకాల కోసం జరిగే ఫైనల్స్‌లో దక్షిణ కొరియా జట్లతో భారత పురుషుల, మహిళల జట్లు తలపడతాయి. -
ఏషియాడ్‌లో నేటి భారతీయం
అథ్లెటిక్స్: మహిళల లాంగ్‌జంప్ ఫైనల్ (నీనా వరాకిల్, జేమ్స్ నయన; సా.గం.5.10 నుంచి); పురుషుల జావెలిన్ త్రో ఫైనల్ (నీరజ్ చోప్రా, శివ్‌పాల్ సింగ్; సా.గం.5.15 నుంచి); మహిళల 400 మీ. హర్డిల్స్ ఫైనల్ (జువానా ముర్ము, అను రాఘవన్; సా.గం.5.15 నుంచి), పురుషుల 400 మీ. హర్డిల్స్ ఫైనల్ (సంతోష్, ధరున్; సా.గం.5.30 నుంచి), పురుషుల హైజంప్ ఫైనల్ (చేతన్; సా.గం.5.30 నుంచి); మహిళల 3 వేల మీ. స్టీపుల్‌చేజ్ ఫైనల్ (సుధా సింగ్, చింతా; సా.గం.5.45 నుంచి); పురుషుల 3 వేల మీ. స్టీపుల్‌చేజ్ ఫైనల్ (శంకర్‌లాల్; సా.గం.6 నుంచి). బ్యాడ్మింటన్: మహిళల సింగిల్స్ సెమీఫైనల్స్ (సైనా వర్సెస్ తై జు యింగ్, సింధు వర్సెస్ యామగుచి, ఉ.గం.10.30 నుంచి) బాక్సింగ్: పురుషుల 49 కేజీలు (అమిత్ వర్సెస్ ఎన్ఖమండఖ్, సా.గం.5.15 నుంచి), పురుషుల 56 కేజీలు (హుసాముద్దీన్ వర్సెస్ అమర్, సా.గం. 6.15 నుంచి), పురుషుల 64 కేజీలు (ధీరజ్ వర్సెస్ కుబషేవ్; సా.గం.7 నుంచి), పురుషుల 75 కేజీలు (వికాస్ వర్సెస్ తన్వీర్). సోనీ టెన్–2, సోనీ ఈఎస్‌పీఎన్‌లలో ప్రత్యక్ష ప్రసారం -
ద్యుతీ... రజత ఖ్యాతి
అంచనాలు నిలబెట్టుకుంటూ పతకంతో మెరిసిన టీనేజర్ ఒకరు... ఆటకే పనికిరావంటూ ఒకనాడు ఎదురైన చేదు జ్ఞాపకాలను ట్రాక్ కింద సమాధి చేస్తూ విజయంతో మరొకరు... సొంతూళ్లో ప్రకృతి వైపరీత్యానికి అల్లాడుతున్న సన్నిహితులకు గెలుపుతో ఊరటనందించే ప్రయత్నం చేసిన వారొకరు... ఆసియా క్రీడల్లో ముగ్గురు భిన్న నేపథ్యాల అథ్లెట్లు అందించిన రజత పతకాలతో ఆదివారం భారత్ మురిస్తే... ‘గీత’ దాటినందుకు మరో అథ్లెట్ చేతికి వచ్చిన కాంస్యం దూరమై విజయం కాస్తా విషాదంగా మారిపోవడం మరో కీలక పరిణామం. ఈక్వెస్ట్రియన్‌లో వచ్చిన రెండు వెండి పతకాలు, ‘బ్రిడ్జ్’ అందించిన రెండు కాంస్యాలు కలిపి ఈవెంట్ ఎనిమిదో రోజు మొత్తం ఏడు పతకాలు మన ఖాతాలో చేరాయి. జకార్తా: అథ్లెటిక్స్‌లో ప్రతిష్టాత్మక ఈవెంట్ 100 మీటర్ల పరుగు (మహిళల)లో భారత క్రీడాకారిణి ద్యుతీ చంద్ రజత పతకంతో సత్తా చాటింది. 11.32 సెకన్లలో ఆమె లక్ష్యాన్ని చేరి రెండో స్థానంలో నిలిచింది. ఒడియాంగ్ ఎడిడియాంగ్ (బహ్రెయిన్) 11.30 సెకన్లలో పరుగు పూర్తి చేసి స్వర్ణం గెలుచుకోగా... వీ యోంగ్లీ (చైనా–11.33 సెకన్లు) కాంస్యం సాధించింది. ఎనిమిది మంది హోరాహోరీగా తలపడ్డ ఈ రేస్‌లో ఫలితాన్ని ‘ఫొటో ఫినిష్’ ద్వారా తేల్చారు. తాను పాల్గొంటున్న తొలి ఆసియా క్రీడల్లోనే ద్యుతీ రజతం సాధించడం విశేషం. మహిళల 100 మీటర్ల ఈవెంట్లో భారత అథ్లెట్ ఒకరు ఆఖరిసారిగా 1998 ఆసియా క్రీడల్లో పతకం సాధించారు. నాడు రచిత మిస్త్రీకి కాంస్యం దక్కింది. 1951లో రోషన్ మిస్త్రీ... 1982, 1986 ఆసియా క్రీడల్లో పీటీ ఉష రజత పతకాలు సాధించాక ... మళ్లీ ఇప్పుడు భారత అథ్లెట్‌కు 100 మీటర్ల విభాగంలో రజతం దక్కింది. హిమ దాస్ మళ్లీ రికార్డు... వరుసగా రెండో రోజు జాతీయ రికార్డును బద్దలు కొడుతూ 18 ఏళ్ల హిమ దాస్ 400 మీటర్ల పరుగులో రజతం గెలుచుకుంది. హిమ 50.79 సెకన్లలో పరుగు పూర్తి చేసి రెండో స్థానంలో నిలిచింది. సల్వా నాసర్ (బహ్రెయిన్–50.09 సెకన్లు) స్వర్ణం గెలుచుకోగా, మిఖినా ఎలీనా (కజకిస్తాన్–52.63 సె.)కి కాంస్యం దక్కింది. శనివారమే ఆమె క్వాలిఫయింగ్ రౌండ్లో 51.00 సెకన్ల టైమింగ్ నమోదు చేసి కొత్త జాతీయ రికార్డు నెలకొల్పగా, ఇప్పుడు తానే దానిని బద్దలు కొట్టింది. ఇదే ఈవెంట్లో మరో భారత అథ్లెట్ నిర్మలా (52.96 సెకన్లు) నాలుగో స్థానంలో నిలిచి నిరాశగా వెనుదిరిగింది. 2006 దోహా క్రీడల్లో మన్జీత్ కౌర్ రజతం గెలిచిన తర్వాత 400 మీటర్ల పరుగులో భారత్‌కు ఇదే తొలి పతకం కావడం విశేషం. పురుషుల 400 మీటర్ల పరుగులో భారత అథ్లెట్ మొహమ్మద్ అనస్ యహియా రజతం సాధించాడు. 45.69 సెకన్ల టైమింగ్ నెలకొల్పి అనస్ రెండో స్థానంలో నిలిచాడు. ఈ పోరులో హసన్ (ఖతర్–44.89 సెకన్లు) అగ్రస్థానంలో నిలిచి స్వర్ణం గెలుచుకోగా, అలీ (బహ్రెయిన్–45.70 సె.)కు కాంస్యం లభించింది. ‘నేను మరింత వేగంగా పరుగెత్తాల్సింది. అయితే ప్రస్తుతానికి రజతంతో సంతృప్తిగా ఉన్నా. కచ్చితంగా పతకం సాధించాలనే లక్ష్యంతో ఇక్కడ బరిలోకి దిగాను. అనుకున్నది దక్కింది. నా కేరళలో అష్టకష్టాలు పడుతున్న ప్రజలకు నా విజయం అంకితం’ అని అనస్ వ్యాఖ్యానించాడు. కొత్తగా రెక్కలు తొడిగి... సాక్షి క్రీడా విభాగం సరిగ్గా నాలుగేళ్ల క్రితం ద్యుతీ చంద్ గ్లాస్గో కామన్వెల్త్ క్రీడలకు సన్నద్ధమవుతోంది. అప్పటికే ఈ ఈవెంట్‌కు అర్హత సాధించిన ఆమె ఎలాగైనా పతకం గెలవాలని పట్టుదలగా శ్రమిస్తోంది. అయితే అనూహ్యంగా అథ్లెటిక్స్ సమాఖ్య చేసిన ప్రకటనతో ఆమె ట్రాక్‌పై కుప్పకూలిపోయింది. ద్యుతీచంద్‌లో అధిక మోతాదులో పురుష హార్మోన్లు (టెస్టోస్టిరాన్) ఉన్నాయి కాబట్టి ఆమెకు మహిళల విభాగంలో పాల్గొనే అర్హత లేదంటూ కామన్వెల్త్ క్రీడల నుంచి తప్పించారు. ఎలాంటి డ్రగ్స్ ఆరోపణలు లేకున్నా... ఈ తరహాలో వేటు పడటం 18 ఏళ్ల అమ్మాయిని ఒక్కసారిగా షాక్‌కు గురి చేసింది. అన్ని వైపుల నుంచి విమర్శలతో పాటు ఒక రకమైన వ్యంగ్య వ్యాఖ్యలతో ఆమె మనసు వికలమైంది. ట్రాక్‌పై ప్రాక్టీస్‌కంటే కూడా ముందు తాను ఆడపిల్లనేనని రుజువు చేసుకోవాల్సిన అగత్యం ద్యుతీకి ఎదురైంది. అయితే ఆమె వెనక్కి తగ్గకుండా పోరాడాలని నిర్ణయించుకుంది. తాను ఎంచుకున్న ఆటలో లక్ష్యం చేరాలంటే అన్ని అడ్డంకులు అధిగమించేందుకు సిద్ధమైంది. చివరకు కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్స్ ద్యుతీకి అనుకూలంగా తీర్పు ఇచ్చింది. ‘హైపర్‌ఆండ్రోజెనిజమ్’ను రుజువు చేయడంలో అంతర్జాతీయ అథ్లెటిక్స్ సమాఖ్య (ఐఏఏఎఫ్) విఫలమైందని, సరైన ఆధారాలు కూడా లేవంటూ ద్యుతీ మళ్లీ బరిలోకి దిగేందుకు అనుమతి ఇచ్చింది. దాంతో ద్యుతీ మళ్లీ కొత్తగా ట్రాక్‌పైకి అడుగు పెట్టి తన పరుగుకు పదును పెట్టింది. హైదరాబాద్‌లోనే... పేరుకు ఒడిషాకు చెందిన అమ్మాయే అయినా ద్యుతీ ప్రాక్టీస్ మొత్తం హైదరాబాద్‌లోనే సాగింది. గచ్చిబౌలి అథ్లెటిక్స్ స్టేడియంలో ట్రాక్‌లో ఆమె సాధన చేసింది. ద్యుతీని తీర్చి దిద్దడంలో తెలంగాణకు చెందిన భారత కోచ్ నాగపురి రమేశ్‌దే ప్రధాన పాత్ర. ఎన్ని సమస్యలు వచ్చినా, కొన్ని సార్లు ప్రతికూల ఫలితాలు వచ్చినా పట్టువదలకుండా ఆయన ద్యుతీకి లక్ష్యాలు విధించి ప్రాక్టీస్ చేయించారు. ఒక మెగా ఈవెంట్లో ఆమె వల్ల పతకం సాధించడం సాధ్యమవుతుందా అనే సందేహాలు అనేక సార్లు వచ్చినా... రమేశ్ మాత్రం ఆశలు కోల్పోలేదు. చివరకు ఇప్పుడు ఆసియా క్రీడల్లో రజతంతో వీరిద్దరి శ్రమకు గుర్తింపు లభించింది. జిమ్, ఫిట్నెస్ ట్రైనింగ్, డైట్‌కు సంబంధించిన అన్ని అదనపు సౌకర్యాలు తన అకాడమీలోనే కల్పించి ద్యుతీని ప్రోత్సహిస్తూ భారత బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్ కూడా అండగా నిలవడం విశేషం. ‘ద్యుతీచంద్ రజతం నెగ్గడంతో చాలా సంతోషంగా ఉన్నాను. ఎన్నో ప్రతికూలతలను అధిగమించి ఆమె ఈ స్థాయికి చేరుకుంది’ అని గోపీచంద్ వ్యాఖ్యానించారు. లక్ష్మణన్ విషాదం... మరో భారత అథ్లెట్ గోవిందన్ లక్ష్మణన్‌ను దురదృష్టం వెంటాడింది. 10 వేల మీటర్ల పరుగును 29 నిమిషాల 44.91 సెకన్లలో పూర్తి చేసిన లక్ష్మణన్‌కు ముందుగా కాంస్య పతకం ఖరారైంది. అయితే అంతలోనే అతడిని డిస్‌క్వాలిఫైగా తేల్చడంతో ఆనందం ఆవిరైంది. పరుగులో ప్రత్యర్థిని దాటే ప్రయత్నంలో అతను ట్రాక్ వదిలి ఎడమ వైపు బయటకు వెళ్లినట్లు తేలింది. జ్యూరీ నిర్ణయాన్ని భారత జట్టు సవాల్ చేసింది. అతను గీత దాటినా సహచర ఆటగాడిని ఇబ్బంది పెట్టలేదని, దాని వల్ల అదనపు ప్రయోజనం ఏమీ పొందలేదని కూడా వాదించింది. అయితే ఈ అప్పీల్‌ను జ్యూరీ తిరస్కరించడంతో లక్ష్మణన్‌కు నిరాశ తప్పలేదు. మరోవైపు పురుషుల లాంగ్‌జంప్ ఫైనల్లో శ్రీశంకర్ 7.95 మీటర్ల దూరం గెంతి ఆరో స్థానంలో నిలిచాడు. పురుషుల 400 మీటర్ల హర్డిల్స్‌లో ధరున్ అయ్యసామి, సంతోష్ కుమార్... మహిళల 400 మీటర్ల హర్డిల్స్‌లో జౌనా ముర్ము, అను రాఘవన్ ఫైనల్స్‌కు అర్హత సాధించారు. అథ్లెటిక్స్‌కు సంబంధించి ఆసియా క్రీడలు ఎంతో కఠినమైనవి. ఇక్కడ ఎన్నో ఏళ్ల తర్వాత పతకం దక్కడం సంతోషంగా ఉంది. ఆమె ఆరంభంపై ఎంతో శ్రమించాం. దక్షిణాఫ్రికా నుంచి ప్రత్యేకంగా స్పీడ్ రబ్బర్లను తెప్పించి సాధన చేయించాం. గోపీచంద్‌తో పాటు ఎన్నో రకాలుగా సహకరించిన అందరికీ కృతజ్ఞతలు. –నాగపురి రమేశ్, ద్యుతీ కోచ్ 2014లో నా గురించి జనం నానా రకాల మాటలు అన్నారు. ఇప్పుడు దేశం తరఫున పతకం సాధించడం గొప్ప ఘనతగా భావిస్తున్నా. రేసులో మొదటి 40 మీటర్లు చాలా వేగంగా పరుగెత్తాలని కోచ్ ముందే చెప్పారు. నేను కళ్లు మూసుకొనే పరుగెత్తాను. కళ్లు తెరిచే సరికి రేసు పూర్తయింది. గెలిచానో కూడా తెలీదు. డిస్ప్లే బోర్డుపై పేరు కనిపించిన తర్వాతే జాతీయ పతాకాన్ని చేతిలోకి తీసుకున్నాను. నా కెరీర్లో ఇదే పెద్ద పతకం. –ద్యుతీచంద్ ద్యుతీచంద్ హిమ దాస్, అనస్ -
‘ట్రాక్’తప్పాడు.. పతకం కోల్పోయాడు!
జకార్తా: ఏషియన్ గేమ్స్ వంటి మెగా టోర్నీల్లో పతకాలు సాధించడమనేది ప్రతీ అథ్లెట్ కల. ఇందుకోసం వారు సంవత్సరాలు పాటు చెమటోడ్చి మరీ సిద్దమవుతారు. ఇక్కడ తృటిలో పతకం చేజారిపోతేనే ఆయా అథ్లెట్ల బాధ అంతా ఇంతా కాదు.. మరి వచ్చిన పతకం చేజారిపోతే.. అది మాటల్లో చెప్పలేని మనోవ్యథగా మిగిలిపోతుంది. తాజా ఏషియన్ గేమ్స్‌లో భారత అథ్లెట్ ఇలానే పతకం చేజార్చుకున్నాడు. ఒక చిన్నపొరపాటుతో డిస్ క్వాలిఫై అయి పతకాన్ని కోల్పోయాడు. వివరాల్లోకి వెళితే... ఆదివారం జరిగిన పదివేల మీటర్ల రేసులో భారత స్ప్రింటర్ గోవిందన్ లక్ష్మణన్ ఫైనల్ రేసులో పాల్గొన్నాడు. అయితే ఆ రేసును అర గంటలోపే ముగించి మూడో స్థానంలో నిలిచాడు. ఇక్కడ తొలి స్థానంలో నిలిచి గోల్డ్ మెడల్ సాధించిన బెహ్రయిన్ స్ప్రింటర్ చాని హసన్‌తో రేసును పూర్తి చేసే సమయంతో పోల్చితే గోవిందన్ దాదాపు నిమిషం వెనుకబడ్డాడు. దాంతో స్వర్ణం పతకం సాధించే అవకాశాన్ని స్వల్ప తేడాలో కోల్పోయాడని భారత అభిమానులు భావించారు. కనీసం కాంస్య పతకం సాధించాడు కదా అని సరిపెట్టుకున్నారు. కాగా, ఆ పతకం కూడా పోయింది. రేసు పూర్తి చేసే క్రమంలో ‘ట్రాక్’ తప్పడంతో అతనికి వచ్చిన పతకం చేజారిపోయింది. -
ఏషియన్ గేమ్స్‌లో సత్తా చాటిన హిమదాస్
-
ఏషియన్ గేమ్స్: మెరిసిన హిమదాస్
జకార్త : ఏషియన్ గేమ్స్‌లో హిమదాస్ సత్తా చాటింది. హాట్ ఫేవరేట్‌గా బరిలోకి దిగిన ఈ అస్సాం అమ్మాయి రజతం కైవసం చేసుకుంది. అథ్లెటిక్స్ 400 మీటర్ల విభాగంలో 50.79 సెకన్లలో పరుగును పూర్తి చేసి రెండో స్థానంలో నిలిచింది. ఇదే విభాగంలో పాల్గొన్న మరో భారత అథ్లెట్ నిర్మల నాలుగోస్థానంతో సరిపెట్టుకుంది. ఆమె 52.96 సెకన్లలో పరుగును పూర్తి చేసి తృటిలో కాంస్యాన్ని చేజార్చుకుంది. ఇక అగ్రస్థానంలో నిలిచిన బెహ్రెయిన్ క్రీడాకారిణి నాసెర్ సల్వా 50.09 సెకన్లలో పరుగును పూర్తిచేసి స్వర్ణం కైవసం చేసుకుంది. కజకిస్తాన్ క్రీడాకారిణి మికినా ఎలినా 52.63 సెకన్లలో పరుగును పూర్తి చేసి కాంస్యం దక్కించుకుంది. చదవండి: హిమదాస్ టాలెంట్‌కి ప్రశంసలేనా.. ఇంకేం లేదా? హిమదాస్ ఇటీవల అండర్–20 ప్రపంచ చాంపియన్‌షిప్ 400 మీటర్ల పరుగు పందెంలో స్వర్ణం నెగ్గి దేశప్రజల మన్ననలు పొందిన విషయం తెలిసిందే. దీంతో జకార్తాలోనూ ఆమె ఫేవరెట్‌గా బరిలోకి దిగింది. ఇక 100 మీటర్ల విభాగంలో భారత రన్నర్ ద్యూతీ చంద్ ఫైనల్‌కు అర్హత సాధించింది. పురుషుల విభాగంలో.. పురుషుల 400 మీటర్ల విభాగంలో సైతం భారత్‌కు రజతం వరించింది. భారత అథ్లెట్ యహియా మొహహ్మద్ 45.69 సెకన్లలో పరుగును పూర్తి చేసి రజతం దక్కించుకున్నాడు. ఖతర్ అథ్లెట్ హసన్ అబ్దెల్లా(44.89) స్వర్ణం దక్కించుకోగా.. బెహ్రెయిన్ క్రీడాకారుడు కమీస్ అలీ (45.7) కాంస్యం సొంత చేసుకున్నాడు. ఇదే విభాగంలో పాల్గొన్న మరో భారత రన్నర్ ఆరోకియారాజీవ్ (45.84) నాలుగో స్థానంలో నిలిచాడు. దీంతో భారత పతకాల సంఖ్య 7 స్వర్ణాలు,9 రజతాలు, 19 కాంస్యలతో కలుపుకొని 35కు చేరుకుంది. ప్రస్తుతం పతకాల జాబితాలో భారత్ 9వ స్థానంలో కొనసాగుతోంది. -
సైనా, సింధు కొత్త చరిత్ర
జకార్తా: సుదీర్ఘ నిరీక్షణ ముగిసింది. ఆసియా క్రీడల్లో అందని ద్రాక్షగా ఊరిస్తోన్న బ్యాడ్మింటన్ మహిళల సింగిల్స్ పతకం ఎట్టకేలకు ఖాయమైంది. స్టార్ క్రీడాకారిణులు సైనా నెహ్వాల్, పీవీ సింధు సెమీఫైనల్లోకి దూసుకెళ్లడంతో భారత్‌కు ఒకేసారి రెండు పతకాలు లభించనున్నాయి. 1962 ఆసియా క్రీడల్లో బ్యాడ్మింటన్‌ను తొలిసారి ప్రవేశపెట్టాక ఒకేసారి భారత్‌కు రెండు సింగిల్స్ పతకాలు రానుండటం ఇదే తొలిసారి. ఇప్పటివరకు సింగిల్స్‌లో లభించిన ఒకే ఒక్క కాంస్య పతకం 1982 ఆసియా క్రీడల్లో దివంగత సయ్యద్ మోదీ పురుషుల సింగిల్స్‌లో అందించాడు. ఆ తర్వాత భారత్‌కు సింగిల్స్ విభాగంలో పతకం రావడం ఇదే ప్రథమం. ఆదివారం జరిగిన మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్స్‌లో సైనా 21–18, 21–16తో ప్రపంచ మాజీ చాంపియన్, నాలుగో ర్యాంకర్ ఇంతనోన్ రచనోక్ (థాయ్‌లాండ్)పై గెలుపొందగా... ప్రపంచ మూడో ర్యాంకర్ పీవీ సింధు 21–11, 16–21, 21–14తో ప్రపంచ 12వ ర్యాంకర్ నిచావోన్ జిందాపోల్ (థాయ్‌లాండ్)ను ఓడించింది. హాకీ సెమీస్‌లో భారత్ డిఫెండింగ్ చాంపియన్ హోదాకు తగ్గట్లు దూసుకెళ్తున్న భారత పురుషుల హాకీ జట్టు ఆసియా క్రీడల్లో సెమీఫైనల్‌కు చేరింది. పూల్ ‘ఎ’లో భాగంగా ఆదివారం జరిగిన లీగ్ మ్యాచ్‌లో భారత్ 5–3తో దక్షిణ కొరియాపై విజయం సాధించింది. భారత్ తరఫున రూపిందర్ పాల్ సింగ్ (1వ ని.లో), చింగ్లెన్సనా సింగ్ (4వ ని.లో), లలిత్ ఉపాధ్యాయ్ (15వ ని.లో), మన్‌ప్రీత్ సింగ్ (49వ ని.లో), ఆకాశ్‌దీప్ సింగ్ (55వ ని.లో) ఒక్కో గోల్ చేశారు. లీగ్‌లో ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లోనూ గెలిచిన భారత్ 12 పాయింట్లతో అగ్రస్థానంలో ఉంది. -
‘బ్రిడ్జ్’లో 2 పతకాలు ఖాయం
ఆసియా క్రీడల్లో తొలిసారి ప్రవేశపెట్టిన ‘బ్రిడ్జ్’ క్రీడలో భారత్ రెండు పతకాలు ఖాయం చేసుకుంది. భారత పురుషుల, మిక్స్డ్ టీమ్‌లు సెమీఫైనల్ చేరుకోవడంతో కనీసం రెండు పతకాలు మన ఖాతాలో చేరాయి. 13 క్వాలిఫికేషన్ రౌండ్లు ముగిసిన తర్వాత పురుషుల బ్రిడ్జ్ జట్టు నాలుగో స్థానంలో నిలవగా, మిక్స్డ్ విభాగంలో 7 క్వాలిఫయింగ్ రౌండ్ల అనంతరం మన జట్టు అగ్రస్థానం సాధించింది. సెమీస్‌లో ఓడినా భారత్‌కు కనీసం కాంస్యం దక్కుతుంది. -
ఇంకోటి గెలిస్తే చరిత్ర
జకార్తా: ఒలింపిక్స్, ప్రపంచ చాంపియన్‌షిప్, ఆసియా చాంపియన్‌షిప్, కామన్వెల్త్ గేమ్స్ ఇలా అత్యున్నత వేదికలపై మహిళల సింగిల్స్ విభాగంలో భారత బ్యాడ్మింటన్ క్రీడాకారిణులు పీవీ సింధు, సైనా నెహ్వాల్ పతకాలు కొల్లగొట్టారు. అయితే ఆసియా క్రీడల్లో మాత్రం సింగిల్స్ విభాగం పతకం ఈ ఇద్దరు స్టార్స్‌కే కాకుండా భారత్‌కూ అందని ద్రాక్షగా ఉంది. కొంతకాలంగా మంచి ఫామ్‌లో ఉన్న ఈ ఇద్దరు ఆ కొరత తీర్చుకునేదిశగా మరో అడుగు ముందుకేశారు. ఆసియా క్రీడల్లో భాగంగా సింధు, సైనా మహిళల సింగిల్స్‌లో క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించారు. శనివారం జరిగిన ప్రిక్వార్టర్ ఫైనల్స్‌లో సింధు 21–12, 21–15తో గ్రెగోరియా టున్‌జుంగ్ (ఇండోనేసియా)పై... సైనా 21–6, 21–14తో ఫిత్రియాని (ఇండోనేసియా)పై గెలుపొందారు. నేడు జరిగే క్వార్టర్లో రచనోక్ (థాయ్ లాండ్)తో సైనా; జిందాపోల్ (థాయ్‌లాండ్)తో సింధు ఆడతారు. ఈ మ్యాచ్‌ల్లో గెలిస్తే పతకాలు ఖాయమవుతాయి. పోరాడి ఓడిన సుమీత్ జంట... మహిళల డబుల్స్‌లో సిక్కి రెడ్డి–అశ్విని పొన్నప్ప జంట క్వార్టర్ ఫైనల్లో... పురుషుల డబుల్స్‌లో సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి; సుమీత్ రెడ్డి–మనూ అత్రి జోడీలు ప్రిక్వార్టర్ ఫైనల్లో నిష్క్రమించాయి. సిక్కి–అశ్విని ద్వయం 11–21, 22–24తో మూడో సీడ్ చెన్ కింగ్‌చెన్–జియా యిఫాన్ జంట చేతిలో ఓడిపోయింది. సాత్విక్–చిరాగ్ 17–21, 21–19, 17–21తో చోయ్ సొల్గు–మిన్ హుక్ కాంగ్ (కొరియా) చేతిలో... సుమీత్–మనూ అత్రి 13–21, 21–17, 23–25తో రెండో సీడ్ లి జున్హుయ్–లియు యుచెన్ (చైనా) చేతిలో పోరాడి ఓడిపోయారు. సుమీత్ జంట నిర్ణాయక మూడో గేమ్‌లో ఏకంగా మూడు మ్యాచ్ పాయింట్లను వదులుకోవడం గమనార్హం. -
ఏషియాడ్‌లో నేటి భారతీయం
అథ్లెటిక్స్: మహిళల 400 మీ. హర్డిల్స్ (జువానా ముర్ము; ఉ. గం.9 నుంచి); పురుషుల 400 మీ. హర్డిల్స్ (సంతోష్, ధరున్ అయ్యాసామి; ఉ.గం. 9.30 నుంచి); మహిళల 100 మీ. సెమీఫైనల్ (ద్యుతీ చంద్; సా. గం.5 నుంచి); పురుషుల లాంగ్‌జంప్ ఫైనల్ (శ్రీ శంకర్; సా. గం.5.10 నుంచి); మహిళల 400 మీ. ఫైనల్ (హిమదాస్, నిర్మల; సా.గం.5.30 నుంచి); పురుషుల 10 వేల మీ. ఫైనల్ (లక్ష్మణన్; సా. గం.5.50 నుంచి) ఆర్చరీ: మహిళల కాంపౌండ్ టీమ్ క్వార్టర్ ఫైనల్స్ (సా. గం.12.10 నుంచి) బ్యాడ్మింటన్: మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్స్ (సైన్ఠారచనోక్); (సింధ్ఠుజిందాపొల్; ఉ. గం.11.30 నుంచి) బాక్సింగ్: పురుషుల 60 కేజీలు (శివ థాపా–జున్ షాన్; సా. గం.5.45 నుంచి); పురుషుల 69 కేజీలు (మనోజ్ కుమార్ఠ్అబ్దురక్మనొవ్; మ. గం.2.15 నుంచి); మహిళల 51 కేజీలు (సర్జుబాలాదేవి ్ఠమదినా గఫరొకొవా; మ. గం. 3 నుంచి) షూటింగ్: స్కీట్ మహిళల, పురుషుల క్వాలిఫయింగ్, ఫైనల్స్ (రష్మీ రాథోడ్, గణెమత్ షెఖాన్, అంగద్ వీర్ సింగ్ బాజ్వా, షీరాజ్ షేక్; ఉదయం 6.30 నుంచి 2.30 వరకు) పురుషుల హాకీ: పూల్ ‘ఎ’లో దక్షిణ కొరియాతో భారత్ మ్యాచ్ (సా. గం.4.30 నుంచి). సోనీ టెన్–2, సోనీ ఈఎస్‌పీఎన్‌లలో ప్రత్యక్ష ప్రసారం -
మహిళల హాకీ సెమీస్‌లో భారత్
జకార్తా: ఆట ఆఖరు దశలో మూడు నిమిషాల్లో మూడు గోల్స్ కొట్టి... ఆసియా క్రీడల మహిళల హాకీలో భారత జట్టు సెమీఫైనల్‌కు చేరింది. శనివారం దక్షిణ కొరియాతో జరిగిన పూల్ ‘బి’ లీగ్ మ్యాచ్‌లో టీమిండియా 4–1తో జయభేరి మోగించింది. నవనీత్ కౌర్ 16వ నిమిషంలోనే గోల్ కొట్టి భారత్ ఖాతా తెరిచింది. మరికొద్దిసేపటికే యురియ్ లీ (20వ ని.) పెనాల్టీ స్ట్రోక్‌ను గోల్‌గా మలచడంతో స్కోరు సమమైంది. తర్వాత చాలాసేపటి వరకు ఇరు జట్ల నుంచి గోల్స్ నమోదు కాలేదు. అయితే... 54, 55 నిమిషాల్లో పెనాల్టీ కార్నర్లను నెట్లోకి పంపి గుర్జీత్ కౌర్ భారత్‌ను ఆధిక్యంలోకి తీసుకెళ్లింది. వందనా కటారియా (56వ ని.) ఫీల్డ్ గోల్‌తో ప్రత్యర్థికి అందనంత ఎత్తున జట్టును నిలిపింది. పూల్ ‘బి’లో ఆడిన మూడు మ్యాచ్ లనూ గెలిచిన భారత్ తొమ్మిది పాయింట్లతో అగ్రస్థానాన్ని ఖాయం చేసుకుంది. సోమవారం జరిగే చివరి లీగ్ మ్యాచ్‌లో థాయ్‌లాండ్‌తో భారత్ తలపడనుంది. క్వార్టర్స్‌లో పవిత్ర భారత మహిళా బాక్సర్ పవిత్ర (60 కేజీలు) ఆసియా క్రీడల క్వార్టర్ ఫైనల్‌కు చేరింది. శనివారం జరిగిన ప్రిక్వార్టర్స్‌లో పవిత్ర 10–8తో పర్వీన్ రుక్సానా (పాకిస్తాన్)పై విజయం సాధించింది. బౌట్ ప్రారంభం నుంచే దూకుడుగా ఆడిన పవిత్ర ప్రత్యర్థిని రెండు సార్లు నాక్డౌన్ చేయడంతో రిఫరీ ఆమెను విజేతగా ప్రకటించారు. ఆర్చరీలో అదే కథ ఆర్చరీలో భారత అగ్రశ్రేణి క్రీడాకారులు మరోసారి తడబడ్డారు. రికర్వ్ విభాగంలో శనివారం జరిగిన పురుషుల, మహిళల టీమ్ విభాగాల్లో భారత జట్లు క్వార్టర్ ఫైనల్లో ఓటమి పాలయ్యాయి. జగదీశ్ చౌదరి, అతాను దాస్, విశ్వాస్‌లతో కూడిన భారత పురుషుల జట్టు 1–5తో కొరియా చేతిలో ఓడగా... దీపిక, ప్రమీల, అంకితలతో కూడిన మహిళల బృందం 2–6తో చైనీస్ తైపీ చేతిలో ఓడింది. షూటింగ్ గురి తప్పింది పోటీలు మొదలైన తర్వాత వరుసగా ఆరు రోజులు కనీసం ఒక పతకమైనా నెగ్గిన భారత షూటర్లకు శనివారం ఒక్క పతకం కూడా దక్కలేదు. పురుషుల 25 మీటర్ల ర్యాపిడ్ ఫైర్ ఎయిర్ పిస్టల్ విభాగంలో బరిలో దిగిన 15 ఏళ్ల అనీశ్ క్వాలిఫయింగ్ రౌండ్లో 576 పాయింట్లతో 9వ స్థానంలో నిలిచి ఫైనల్‌కు అర్హత సాధించలేకపోయాడు. మరో భారత షూటర్ శివమ్ శుక్లా 569 పాయింట్లతో 11వ స్థానంతో సరిపెట్టుకున్నాడు. గత ఏప్రిల్‌లో కామన్వెల్త్ గేమ్స్‌లో అనీశ్ స్వర్ణం గెలిచి సంచలనం సృష్టించాడు. కానీ అలాంటి ఫలితాన్ని ఆసియా క్రీడల్లో పునరావృతం చేయలేకపోయాడు. -
మూడు ‘కాంస్యాల’ స్క్వాష్
జకార్తా: ఆసియా క్రీడల ‘స్క్వాష్’లో భారత్‌కు మూడు కాంస్య పతకాలు లభించాయి. ముగ్గురు అగ్రశ్రేణి సింగిల్స్ ఆటగాళ్లు సెమీఫైనల్లోనే ఓడిపోవడంతో కంచుతో సరిపెట్టుకోక తప్పలేదు. అయితే ఆసియా క్రీడల్లో భారత్‌కు ఇదే అత్యుత్తమ ప్రదర్శన కావడం విశేషం. 2014లో స్క్వాష్‌లో భారత్ ఒక రజతం, ఒక కాంస్యం సాధించింది. నాడు రజతం గెలిచిన సౌరవ్ ఘోషల్ ఈసారి కాంస్యం సాధించగా, దీపిక పల్లికల్ మళ్లీ కాంస్యానికే పరిమితమైంది. శనివారం జరిగిన పురుషుల సెమీఫైనల్లో సౌరవ్ 12–10, 13–11, 6–11, 6–11, 6–11 స్కోరుతో చున్ మింగ్ యు (హాంకాంగ్) చేతిలో పరాజయం పాలయ్యాడు. తొలి రెండు సెట్లు గెలిచి ముందంజలో నిలిచినా...ఘోషల్ చివరి వరకు దానిని కాపాడుకోలేక చేతులెత్తేశాడు. రెండు సెట్లు గెలుచుకున్న అనంతరం మూడో సెట్లో ఒక దశలో సౌరవ్ 6–5తో ఆధిక్యంలో నిలిచాడు. అయితే చున్ మింగ్ వరుసగా ఆరు పాయింట్లు గెలుచుకొని భారత ఆటగాడికి షాక్ ఇచ్చాడు. అదే ఊపును అతను తర్వాతి రెండు సెట్లలో కొనసాగించగా, సౌరవ్ మాత్రం చతికిల పడ్డాడు. అయితే రెండో సెట్ చివర్లో తన కాలికి గాయమైందని, దాంతో ఓటమి తప్పలేదని ఘోషల్ వివరణ ఇచ్చాడు. మహిళల సింగిల్స్ సెమీఫైనల్లో మలేసియా దిగ్గజ క్రీడాకారిణి, డిఫెండింగ్ చాంపియన్ నికోల్ డేవిడ్ 11–7, 11–9, 11–6 తేడాతో దీపిక పల్లికల్‌ను చిత్తు చేసింది. పదేళ్ల పాటు వరల్డ్ నంబర్‌వన్‌గా స్క్వాష్‌ను శాసించిన నికోల్ ముందు దీపిక నిలవలేకపోయింది. మరో సెమీఫైనల్లో శివశంకరి సుబ్రహ్మణ్యం (మలేసియా) 12–10, 11–6, 9–11, 11–7తో జోష్నా చినప్పను ఓడించింది. గత మూడు ఆసియా క్రీడల్లో రిక్తహస్తాలతో తిరిగొచ్చిన జోష్నాకు ఇదే మొదటి పతకం కావడం విశేషం. -
షాట్‌పుట్‌లో స్వర్ణం సాధించిన తేజీందర్‌పాల్
ఆసియా క్రీడల అథ్లెటిక్స్ విభాగంలో భారత్ బోణీ చేసింది. ఆసియా నంబర్‌వన్ షాట్‌పుటర్‌గా తనపై ఉన్న అంచనాలను నిలబెట్టుకుంటూ పంజాబీ బిడ్డ తేజీందర్‌పాల్ సింగ్ తూర్ బంగారు పతకంతో మెరిశాడు. 7 కేజీల 260 గ్రాముల బరువు ఉండే ఇనుప గుండును ఏకంగా 20.75 మీటర్ల దూరం విసిరి ఆసియా క్రీడల్లో కొత్త రికార్డుతో సత్తా చాటాడు. తాజా విజయంతో కలిపి మన స్వర్ణాల సంఖ్య ఏడుకు చేరగా... స్క్వాష్‌లో మరో మూడు కాంస్యాలు దక్కడంతో శనివారం నాలుగు పతకాలు భారత్ ఖాతాలో పడ్డాయి. మొత్తంగా 29 పతకాలతో భారత్ ఎనిమిదో స్థానంలో ఉంది. జకార్తా: ఆసియా క్రీడల్లో వరుసగా ఏడో రోజు కూడా పతకాలు సాధించిన జట్ల జాబితాలో భారత్ నిలిచింది. 24 ఏళ్ల తేజీందర్‌పాల్ సింగ్ తూర్ విసిరిన గుండు బంగారాన్ని తెచ్చి పెట్టింది. పురుషుల షాట్‌పుట్‌లో తేజీందర్ స్వర్ణం సాధించడంతో అథ్లెటిక్స్‌లో మన ఖాతాలో మొదటి పతకం చేరింది. ఆరు ప్రయత్నాల్లో అత్యుత్తమంగా షాట్‌పుట్‌ను 20.75 మీటర్ల దూరం విసిరిన తేజీందర్ అగ్రస్థానంలో నిలిచాడు. ఈ ఈవెంట్లో ల్యూ యాంగ్ (19.52 మీటర్లు–చైనా), ఇవాన్ ఇవనోవ్ (19.40 మీటర్లు–కజకిస్తాన్) రజత, కాంస్యాలు గెలుచుకున్నారు. ఐదో ప్రయత్నంలో... ఆసియా క్రీడల్లో పతకం గెలుచుకునే క్రమంలో తేజీందర్ పాల్ ఆరేళ్ల క్రితం నాటి జాతీయ రికార్డును కూడా బద్దలు కొట్టాడు. 2012లో ఓంప్రకాశ్ కర్హానా 20.69 మీటర్లతో నెలకొల్పిన జాతీయ రికార్డును తేజీందర్ తెరమరుగు చేశాడు. శనివారం జరిగిన ఈవెంట్లో తేజీందర్ తొలి ప్రయత్నంలో 19.96 మీటర్లు గుండు విసరగా, రెండో ప్రయత్నంలో అది తగ్గి 19.15 మీటర్లకు చేరింది. మూడో ప్రయత్నం ‘ఫౌల్’గా తేలింది. నాలుగోసారి కూడా 19.96 మీటర్లే విసిరిన తేజీందర్... తర్వాతి ప్రయత్నంలో తన పవర్ చూపించాడు. రికార్డు స్థాయిలో 20.75 మీటర్లు గుండు దూసుకెళ్లింది. చివరిసారి అతను 20.00 మీటర్లకే పరిమితమయ్యాడు. అయితే దానిని అందుకోవడం ల్యూ వల్ల కాకపోగా...ఈసారి అతను ఫౌల్ చేశాడు. దాంతో భారత షాట్ పుటర్కు స్వర్ణం ఖాయమైంది. హిమ దాస్ కొత్త రికార్డు... అథ్లెటిక్స్‌లో మరో భారత జాతీయ రికార్డు బద్దలైంది. మహిళల 400 మీటర్ల పరుగు (క్వాలిఫయింగ్)లో హిమ దాస్ 51.00 సెకన్ల టైమింగ్ నమోదు చేసి ఫైనల్‌కు అర్హత సాధించింది. ఈ క్రమంలో 2004లో మన్జీత్ కౌర్ (51.05 సెకన్లు) నెలకొల్పిన రికార్డును హిమ చెరిపేసింది. హిమ దాస్తోపాటు భారత్‌కే చెందిన నిర్మల కూడా ఫైనల్‌కు అర్హత పొందింది. మహిళల 100 మీ. పరుగు సెమీఫైనల్‌కు ద్యుతీచంద్ అర్హత సాధించింది. హీట్స్‌లో ఆమె 11.38 సెకన్లలో పరుగు పూర్తి చేసి రెండో స్థానంలో నిలిచింది. ఇతర అథ్లెట్లలో మొహమ్మద్ అనస్, రాజీవ్ అరోకియా (400 మీ.), ఎం. శ్రీశంకర్ (లాంగ్‌జంప్), చేతన్ బాలసుబ్రహ్మణ్య (హైజంప్) కూడా ఫైనల్‌కు క్వాలిఫై అయ్యారు. అయితే మహిళల 10 వేల మీటర్ల పరుగులో సూరియా లోగనాథన్ (ఆరో స్థానం), సంజీవని బాబూరావు (9వ స్థానం), సరితా సింగ్ (హ్యామర్ త్రో–ఐదో స్థానం) విఫలమై నిరాశగా వెనుదిరిగారు. గుండె నిబ్బరంతో... తేజీందర్‌పాల్ తండ్రి కరమ్ సింగ్ గత రెండేళ్లుగా క్యాన్సర్‌తో బాధ పడుతున్నాడు. అయితే ఇలాంటి స్థితిలోనూ అతని కుటుంబం, సన్నిహితులు అండగా నిలిచి లక్ష్యం దిశగా తేజీందర్ను ప్రోత్సహించారు. తండ్రి ఆస్పత్రిలో ఉన్న సమయంలో దగ్గరుండి చూసుకోవాల్సిన అవసరం లేకుండా మిత్రులే అన్ని రకాలుగా సహకారం అందించారు. అతనిపై ఎలాంటి ఒత్తిడి లేకుండా, ఏకాగ్రత కోల్పోకుండా ప్రాక్టీస్ చేసే విధంగా అండగా నిలిచారు. ఈ నేపథ్యంలో తేజీందర్ సాధించిన స్వర్ణం అతడికి ఎంతో ప్రత్యేకమైంది. ‘నా గెలుపు వెనక ఎంతో మంది త్యాగం ఉంది. ధర్మశాలలో ప్రాక్టీస్ కారణంగా ఇంటి కోసం, నాన్న కోసం సమయం కేటాయించలేకపోయాను. కానీ నా వాళ్ల కారణంగా ఈ గెలుపు సాధ్యమైంది. అందుకే నా జీవితంలో ఇది అతి పెద్ద విజయంగా భావిస్తున్నా. పతకంతో వెళ్లి నాన్నను కలుస్తా’ అని 6 అడుగుల 4 అంగుళాల ఎత్తు, 135 కేజీల బరువున్న తేజీందర్ ఉద్వేగంగా చెప్పాడు. గత ఏడాది జూన్‌లో జాతీయ అథ్లెటిక్స్ ఈవెంట్ ఫెడరేషన్ కప్‌లో 20.40 మీటర్ల దూరం షాట్‌పుట్ విసరడం తేజీందర్కు మంచి గుర్తింపు తెచ్చి పెట్టింది. కొద్ది రోజులకే ఆసియా అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో రజత పతకం సాధించి అతను సత్తా చాటాడు. తుర్క్మెనిస్తాన్లో జరిగిన ఆసియా ఇండోర్ చాంపియన్‌షిప్‌లో కూడా రెండో స్థానంలో నిలిచాడు. అయితే ఈ ఏడాది కామన్వెల్త్ క్రీడల్లో 19.42 మీటర్ల దూరం మాత్రమే గుండు విసిరి ఎనిమిదో స్థానంలో నిలవడంతో తీవ్రంగా నిరాశ చెందిన తేజీందర్... ఇప్పుడు ఆసియా క్రీడల్లో స్వర్ణంతో లెక్క సరి చేశాడు. శనివారం ఈవెంట్లో 21 మీటర్లు దాటాలనే లక్ష్యంతో బరిలోకి దిగానన్న ఈ అథ్లెట్... గత కొన్నేళ్లుగా జాతీయ రికార్డును బద్దలు కొట్టాలనే ప్రయత్నం ఇప్పుడు నిజమైనందుకు సంతోషం వ్యక్తం చేశాడు. 9 ఆసియా క్రీడల చరిత్రలో పురుషుల షాట్‌పుట్ ఈవెంట్లో భారత అథ్లెట్‌కు స్వర్ణం లభించడం ఇది తొమ్మిదోసారి. గతంలో మదన్‌లాల్ (1951), పార్థుమన్ సింగ్ బ్రార్ (1954, 1958), జోగీందర్ సింగ్ (1966, 1970), బహదూర్ సింగ్ చౌహాన్ (1978, 1982), బహదూర్ సింగ్ సాగూ (2002) ఈ ఘనత సాధించారు. హిమ -
షాట్‌పుట్‌లో భారత్‌కు స్వర్ణం
జకార్త : ఏషియన్ గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం వరించింది. పురుషుల షాట్‌పుట్ విభాగంలో తజిందర్‌పాల్ సింగ్ తూర్ పసిడిని సొంతంచేసుకున్నాడు. హోరాహోరీగా సాగిన పోటీలో తజిందర్‌పాల్ గుండును 20.75 మీటర్లు విసిరి ఆసియా క్రీడల్లో సరికొత్త రికార్డు నెలకొల్పాడు. తద్వారా అథ్లెటిక్స్‌లో భారత్‌కు తొలి స్వర్ణం అందజేశాడు. తొలి ప్రయత్నంలో గుండును 19.96 మీటర్లు విసిరిన తజిందర్ రెండో ప్రయత్నంలో 19.15 మీటర్లు విసిరాడు. మూడో సారి విఫలమయ్యాడు. నాలుగోసారి 19.96, ఐదోసారి 20.75 మీటర్లు విసిరాడు. ఆరోసారి 20 మీటర్లకు పరిమితం అయ్యాడు. చైనా ఆటగాడు లియూ యంగ్ 19.52 మీటర్లతో రజతం, కజకిస్థాన్ అథ్లెట్ ఇవనోవ్ ఇవాన్ 19.40తో కాంస్యం అందుకున్నారు. ఏషియన్ గేమ్స్ చరిత్రలో పురుషుల షాట్‌పుట్ విభాగంలో భారత్‌కు ఇది 8వ మెడల్. -
దీపికా పళ్లికల్ కాంస్యంతో సరి
జకార్తా: ఏషియన్ గేమ్స్ 2018 స్క్వాష్ మహిళల సింగిల్స్‌లో భారత క్రీడాకారిణి దీపికా పళ్లికల్ కాంస్యంతో సరిపెట్టుకుంది. శనివారం జరిగిన సెమీ ఫైనల్లో దీపికా పళ్లికల్ 0-3 తేడాతో డేవిడ్ నికోలాన్(మలేసియా) చేతిలో ఓటమి పాలైంది. దాంతో ఫైనల్‌కు చేరి రజతం సాధించాలన్నా దీపికా ఆశలు నెరవేరలేదు. కాగా, కాంస్యం దక్కడంతో ఏడో రోజు ఆటలో భారత్ పతకాల బోణీ కొట్టింది. మరొక స్క్వాష్ మహిళల సింగిల్స్ సెమీ ఫైనల్లో జ్యోష్నచిన్నప్ప పరాజయం చెందింది. మలేసియా క్రీడాకారిణి శివసాంగారి చేతిలో జ్యోష్న చిన్నప్ప 1-3 తేడాతో ఓటమి చెంది కాంస్యంతో సంతృప్తి చెందింది. ఫలితంగా భారత్ పతకాల సంఖ్య 27కు చేరింది. ఇందులో ఆరు స్వర్ణాలు, ఐదు రజతాలు, పదహారు కాంస్య పతకాలున్నాయి. ఇదిలా ఉంచితే, ఈ రోజు ఆటలో భారత బ్యాడ్మింటన్ క్రీడాకారిణులు సైనా నెహ్వాల్, పీవీ సింధులు క్వార్టర్స్‌లోకి ప్రవేశించారు. ప్రిక్వార్టర్ ఫైనల్లో సైనా నెహ్వాల్ 21-6, 21-14 తేడాతో ఫిత్రియాని(ఇండోనేసియా)పై విజయం సాధించి క్వార్టర్స్‌లోకి ప్రవేశించగా, ఆపై జరిగిన మరో ప్రిక్వార్టర్ పోరులో పీవీ సింధు 21-12, 21-15 తేడాతో టంజంగ్ జార్జియా(ఇండోనేసియా)పై గెలిచి రౌండ్-16లోకి ప్రవేశించింది. -
ఏషియన్ గేమ్స్: నన్ను తోసేసి స్వర్ణం నెగ్గాడు!
జకార్త: ప్రశాంతంగా సాగుతున్న ఏషియన్ గేమ్స్‌లో శనివారం వివాదం చోటుచేసుకుంది. పురుషుల రన్నింగ్ కాంపిటేషన్‌లో తనను నెట్టేసి జపాన్ ఆటగాడు హిరోటో స్వర్ణం గెలిచాడని బెహ్రెయిన్ రన్నర్ ఎలబస్సి ఆరోపించాడు. జకార్త వీధుల్లో అప్పటి వరకు జరిగిన 42 కిలోమీటర్ల పరుగు పందెంలో ఈ ఇద్దరు ఆటగాళ్లు నువ్వా-నేనా అన్నట్లు పరుగెత్తారు. ఫైనల్ 100 మీటర్ల విభాగంలో హోరాహోరిగా పోటీపడ్డారు. అయితే అంతా ఎలబస్సే గెలుస్తాడని భావించారు. ఇంతలో అతని సమీపంలో ఉన్న హిరటో.. ఎలబస్సిని నెట్టేశాడు. దీంతో పట్టు తప్పిన ఎలబస్సి కింద పడిపోకుండా సమన్వయంతో పరుగును కొనసాగించాడు. కానీ జరగాల్సిన నష్టం జరిగిపోయింది. రెప్పపాటు వ్యవధిలో స్వర్ణం గెలుస్తాననుకున్న ఎలబస్సి ఆశలు గల్లంతయ్యాయి. దీంతో హిరటోకు పసిడి సొంతం కాగా.. ఎలబస్సికి రజతం దక్కింది. ‘అతను తోసేసాడు లేకుంటే నేనే గెలిచేవాడిని’ అని పరుగు అనంతరం ఎలబస్సి ఆవేదన వ్యక్తం చేశాడు. స్వర్ణ విజేత హిరోటో మాత్రం.. ‘చివర్లో అసలేం జరిగిందో నాకు తెలియదు. కానీ ఆశ్చర్యం వేస్తుంది’ అని తెలిపాడు. జపాన్ అధికారులేమో అతన్ని అధిగమించే సమయంలో వారి మధ్య గ్యాప్ లేదని, దాంతోనే తమ అథ్లెట్ తాకాడని వాదిస్తున్నారు. రిఫరీ మాత్రం ఇరుదేశాల అభ్యర్థనలను తోసిపుచ్చారు. దీంతో బెహ్రెయిన్ జట్టు మేనేజ్మెంట్ అధికారులు ఆసియా క్రీడల ప్రతినిధులకు ఫిర్యాదు చేశారు. వీడియోలను పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని వారు తెలిపారు. బెహ్రెయిన్ కోచ్ మాత్రం జపాన్ అథ్లెట్ ఎలాగైనా నెగ్గాలనే ఉద్దేశంతో తోసేశాడని ఆరోపించాడు. -
క్వార్టర్స్‌లో సైనా నెహ్వాల్
జకార్తా: ఏషియన్ గేమ్స్ 2018 బ్యాడ్మింటన్ మహిళల సింగిల్స్‌లో భారత షట్లర్ సైనా నెహ్వాల్ క్వార్టర్స్‌కు చేరారు. శనివారం జరిగిన సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో సైనా నెహ్వాల్ 21-6, 21-14 తేడాతో ఫిత్రియాని(ఇండోనేసియా)పై విజయం సాధించి క్వార్టర్స్‌లోకి ప్రవేశించారు. తొలి గేమ్‌ను అవలీలగా గెలిచిన సైనా.. రెండో గేమ్‌లో మాత్రం కాస్త ప్రతిఘటన ఎదురైంది. కాగా, రెండో గేమ్‌ను 21-14 తేడాతో గెలిచిన సైనా క్వార్టర్స్ బెర్తును ఖాయం చేసుకుంది. ఇక ఆర్చరీ రికర్వ్ విభాగంలో భారత మహిళల జట్టు కథ క్వార్టర్స్‌లోనే ముగిసింది. ఈ రోజు జరిగిన క్వార్టర్ ఫైనల్లో భారత జట్టు 2-6 తేడాతో చైనీస్ తైపీ జట్టు చేతిలో ఓటమి పాలైంది. సింధు శ్రమించి... సైనా అలవోకగా... శ్రీకాంత్, ప్రణయ్ నిష్క్రమణ -
రజత, కాంస్యాలు సంతృప్తిని ఇవ్వట్లేదు
న్యూఢిల్లీ: కబడ్డీ ప్రపంచస్థాయి క్రీడగా ఎంతగా పరిణామం చెందిందో చెప్పేందుకు తాజా ఆసియా క్రీడల ఫలితాలే నిదర్శనమని భారత మహిళల కబడ్డీ జట్టు కోచ్ లింగంపల్లి శ్రీనివాస్ రెడ్డి అభిప్రాయపడ్డారు. కబడ్డీకి కంచుకోట అయిన భారత జట్ల ఓటమి... గ్రామీణ క్రీడలో ప్రపంచ దేశాలు పురోగమనాన్ని తెలుపుతోందని అన్నారు. ఆసియా క్రీడల చరిత్రలోనే కబడ్డీ ఈవెంట్లో భారత్ స్వర్ణం లేకుండా వెనుదిరగడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. భారత పురుషుల జట్టు సెమీస్‌లో ఇరాన్ చేతిలో ఓడి కాంస్యంతో సరిపెట్టుకోగా... మహిళల జట్టు ఫైనల్లో 24–27తో ఇరాన్ చేతిలోనే ఓడిపోయి రజతంతో తృప్తిపడింది. ఈ ఫలితాలు నిరాశ కలిగించాయన్న శ్రీనివాస్‌రెడ్డి రజత, కాంస్యాలను సంతృప్తిని ఇవ్వలేకపోతున్నాయని చెప్పారు. ‘మేం ఎప్పుడూ స్వర్ణం కోసమే బరిలోకి దిగాం. మహిళల విభాగంలో హ్యాట్రిక్ స్వర్ణం సాధించే అవకాశాన్ని కోల్పోవడం బాధిస్తోంది. కబడ్డీ ఆట విశ్వవ్యాప్తమైంది. ఇందులో పతకం సాధించేందుకు ప్రపంచ దేశాలు ఆరాటపడుతున్నాయి’ అని తెలంగాణలోని సంగారెడ్డి జిల్లాకు చెందిన ఆయన వివరించారు. కబడ్డీ ప్లేయర్లకు గుర్తింపు కూడా లేని దశ నుంచి ప్రపంచ వ్యాప్తంగా 40 దేశాలు ఈ క్రీడను ఆడే స్థితికి ఆట అభివృద్ధి చెందిందని ఆయన హర్షం వ్యక్తం చేశారు. ‘2014లోనే చైనీస్ తైపీ కబడ్డీ ఆడటం మొదలుపెట్టింది. కానీ ఇప్పుడు ఆ దేశం పతకం బరిలో నిలుస్తోంది. దీన్ని బట్టే కబడ్డీ ఎంత వేగంగా అభివృద్ధి చెందుతుందో చెప్పొచ్చు. ఒకప్పుడు కబడ్డీ ప్లేయర్ల అర్జున అవార్డు దరఖాస్తులను పరిగణనలోకి తీసుకునేవారు కాదు. ఒకానొక సమయంలో మిల్కాసింగ్ నేతృత్వంలోని కమిటీ కేవలం ఐదారు దేశాలు ఆడే కబడ్డీకి అర్జున అవార్డు ఇవ్వటమేంటని ఆ దరఖాస్తును తిరస్కరించారు. ప్రస్తుతం 40 దేశాలు ఈ క్రీడలో సత్తా చాటుతున్నాయి’ అని ఆయన గుర్తుచేసుకున్నారు. ప్రొ కబడ్డీ లీగ్ ద్వారా స్వదేశీ, విదేశీ ఆటగాళ్ల మధ్య సాన్నిహిత్యం పెరిగిందని చెప్పారు. భారత ఆటగాళ్ల ఆటను విదేశీ ప్లేయర్లు శ్రద్ధగా గమనిస్తున్నారని, ఇక మనవాళ్లు మరింత కఠినంగా శ్రమించాల్సి ఉందని పేర్కొన్నారు. కొన్నేళ్ల కఠోర శ్రమ అనంతరం ఇరాన్ జట్టు స్వర్ణం గెలిచిందని అన్నారు. ప్రస్తుతం ఆ జట్టుకు భారత్‌కు చెందిన శైలజా జైన్ కోచ్‌గా ఉండటంతో ఆమె పేరు ప్రముఖంగా వినిపిస్తుందని వివరించారు. ‘భారత్ నుంచి చాలామంది కోచ్‌లు ఇరాన్‌కు వెళ్లారు. ఆరు నెలల కాలంలోనే పటిష్టమైన జట్టును తయారు చేయడం ఏ కోచ్‌కూ సాధ్యం కాదు. గతంలో చేసిన కృషి ప్రస్తుతం ప్రతిఫలిస్తోంది. ప్రస్తుతం ఆ జట్టుకు శైలజా జైన్ కోచ్‌గా ఉండటంతో ఆమెకు ఆ ఖ్యాతిని ఇస్తున్నారు’ అని ఆయన విశ్లేషించారు. -
ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం
-
సురేఖ జోడీ ఓటమి
ఆర్చరీ రికర్వ్, కాంపౌండ్ మిక్స్డ్ విభాగాల్లో భారత పోరు ముగిసింది. మిక్స్డ్ కాంపౌండ్ విభాగంలో ఈ ఏడాది వరుసగా నాలుగు ప్రపంచకప్‌లలో కాంస్య పతకాలు సాధించి జోరు మీదున్న ఆంధ్రప్రదేశ్ ఆర్చర్ జ్యోతి సురేఖ–అభిషేక్ వర్మ జంట ఆసియా క్రీడల్లో మాత్రం విఫలమైంది. క్వార్టర్ ఫైనల్లో సురేఖ–అభిషేక్ జంట 153–155తో గొర్బానీ–మహబూబీ (ఇరాన్) ద్వయం చేతిలో ఓడింది. రికర్వ్ మిక్స్డ్ టీమ్ ఈవెంట్లో ప్రపంచ మాజీ నంబర్‌వన్ దీపిక కుమారి–అతాను దాస్ జంట క్వార్టర్ ఫైనల్లో ‘షూట్ ఆఫ్’లో 4–5తో బిషిండి–బాతర్ఖుయా (మంగోలియా) జోడీ చేతిలో ఓడింది. -
దీపా కర్మాకర్ ఐదుతో సరి...
జిమ్నాస్టిక్స్‌లో భారత కథ ముగిసింది. ఎన్నో ఆశలు పెట్టుకున్న స్టార్ జిమ్నాస్ట్ దీపా కర్మాకర్ బ్యాలెన్స్ బీమ్ ఫైనల్లో ఐదో స్థానంతో సరిపెట్టుకుంది. ఎనిమిది మంది పాల్గొన్న ఫైనల్లో దీపా 12.500 పాయింట్లతో ఐదో స్థానానికి పరిమితమైంది. అంతకుముందు క్వాలిఫయింగ్ రౌండ్లో ఆమె 12.750 పాయింట్లతో ఫైనల్‌కు చేరింది. చెన్ యైల్ (చైనా, 14.600 పాయింట్లు) స్వర్ణం దక్కించుకోగా... కిమ్ జాంగ్ (ఉత్తర కొరియా, 13.400), జాంగ్ జిన్ (చైనా, 13.325) వరుసగా రజత కాంస్యాలు దక్కించుకున్నారు. మహిళల టీమ్ విభాగంలో భారత జట్టు ఏడో స్థానంతో సరిపెట్టుకోగా... పురుషుల జట్టు ఫైనల్‌కు అర్హత సాధించలేకపోయింది. -
శ్రీకాంత్, ప్రణయ్ నిష్క్రమణ
ఆసియా క్రీడల బ్యాడ్మింటన్ పురుషుల సింగిల్స్‌లో పతక నిరీక్షణ మరో నాలుగేళ్లు కొనసాగనుంది. ఈ మెగా క్రీడల్లో భారత్‌కు పురుషుల సింగిల్స్‌లో ఒకే ఒక్కసారి 1982 ఏషియాడ్‌లో సయ్యద్ మోదీ కాంస్య పతకాన్ని అందించాడు. ఈసారి జకార్తాలో భారత స్టార్స్ కిడాంబి శ్రీకాంత్, ప్రణయ్‌లలో ఒకరు ఈ సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతారని ఆశించారు. అయితే అనూహ్యంగా ఈ ఇద్దరూ రెండో రౌండ్లోనే ఇంటిముఖం పట్టడం గమనార్హం. ప్రపంచ మాజీ నంబర్‌వన్ శ్రీకాంత్ 21–23, 19–21తో 28వ ర్యాంకర్ వాంగ్ వింగ్ కి విన్సెంట్ (హాంకాంగ్) చేతిలో ఓడిపోగా... మరో మ్యాచ్‌లో 11వ ర్యాంకర్ ప్రణయ్ 12–21, 21–15, 15–21తో 18వ ర్యాంకర్ వాంగ్‌చరొన్ కంటాఫోన్ (థాయ్‌లాండ్) చేతిలో పరాజయం చవిచూశాడు. క్వార్టర్స్‌లో సిక్కి రెడ్డి–అశ్విని జంట మరోవైపు మహిళల డబుల్స్‌లో తెలంగాణ క్రీడాకారిణి సిక్కి రెడ్డి–అశ్విని పొన్నప్ప జంట క్వార్టర్ ఫైనల్‌కు దూసుకెళ్లింది. ప్రిక్వార్టర్స్‌లో సిక్కి– అశ్విని జోడీ 21–17, 16–21, 21–19తో మీ కున్ చౌ–మెంగ్ యెన్‌లీ (మలేసియా) ద్వయంపై గెలిచింది. 1986 తర్వాత భారత తరఫున మహిళల డబుల్స్ జోడీ ఏషియాడ్‌లో క్వార్టర్స్‌కు చేరడం ఇదే ప్రథమం. -
హీనా ఖాతాలో కాంస్యం
పాలెంబాంగ్: ఆసియా క్రీడల షూటింగ్ పోటీల్లో భారత షూటర్ల అద్భుత ప్రదర్శన కొనసాగుతోంది. శుక్రవారం మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్లో హీనా సిద్ధూ భారత్‌కు కాంస్య పతకాన్ని అందించింది. ఫైనల్లో హీనా 219.2 పాయింట్లు స్కోరు చేసి మూడో స్థానంలో నిలిచింది. భారత్‌కే చెందిన మనూ భాకర్ ఐదో స్థానంతో సరిపెట్టుకుంది. కియాన్ వాంగ్ (చైనా–240.3 పాయింట్లు) స్వర్ణం, కిమ్ మిన్‌జుంగ్ (కొరియా–237.6 పాయింట్లు) రజతం సాధించారు. -
ఈసారి మహిళల జట్టుకు షాక్
ఆసియా క్రీడల కబడ్డీలో ఇరాన్ మహిళల జట్టు కూడా సంచలనం సృష్టించింది. వరుసగా మూడో స్వర్ణంపై గురి పెట్టిన భారత మహిళల జట్టుకు షాక్ ఇస్తూ ఇరాన్ తొలిసారి పసిడి పతకాన్ని గెల్చుకుంది. శుక్రవారం జరిగిన ఫైనల్లో భారత మహిళల జట్టు 24–27తో ఇరాన్ చేతిలో ఓడిపోయి రజత పతకంతో సంతృప్తి పడింది. గురువారం వరుసగా ఏడుసార్లు చాంపియన్‌గా నిలిచిన భారత్‌ను ఇరాన్ పురుషుల జట్టు ఓడించిన సంగతి తెలిసిందే. ఫైనల్లోనూ అదే జోరు కొనసాగించిన ఇరాన్ 26–16తో దక్షిణ కొరియాను ఓడించి మొదటిసారి విజేతగా నిలిచి టైటిల్ అందుకుంది. -
బోపన్న–దివిజ్ జంటకు స్వర్ణం
పాలెంబాంగ్: టాప్ సీడ్ హోదాకు న్యాయం చేస్తూ ఆసియా క్రీడల టెన్నిస్‌లో రోహన్ బోపన్న–దివిజ్ శరణ్ (భారత్) జంట స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకుంది. శుక్రవారం జరిగిన పురుషుల డబుల్స్ ఫైనల్లో బోపన్న–దివిజ్ జోడీ 6–3, 6–4తో అలెగ్జాండర్ బుబ్లిక్–డెనిస్ యెవ్సెయెవ్ (కజకిస్తాన్) ద్వయంపై గెలుపొందింది. తమ కెరీర్లో తొలిసారి ఏషియాడ్ డబుల్స్ స్వర్ణాన్ని సొంతం చేసుకుంది. మరోవైపు పురుషుల సింగిల్స్‌లో భారత్‌కే చెందిన ప్రజ్నేశ్ గుణేశ్వరన్ కాంస్య పతకాన్ని దక్కించుకున్నాడు. సెమీఫైనల్లో ప్రజ్నేశ్ 2–6, 2–6తో డెనిస్ ఇస్టోమిన్ (ఉజ్బెకిస్తాన్) చేతిలో ఓడిపోయాడు. -
ఎదురునిలిచిన మొనగాళ్లు
అప్రతిహత రికార్డున్న కబడ్డీలో పట్టు జారింది... అంచనాలున్న ఆర్చరీలో బాణం గురి తప్పింది... జిమ్నాస్టిక్స్ విన్యాసాల్లోనూ రిక్తహస్తమే మిగిలింది... కానీ, రోయింగ్ బృందం చరిత్ర తిరగరాసింది! ఎవరూ ఊహించని విధంగా త్రివర్ణ పతాకం ఎగురేసింది! పరువు పోయిందన్న చోటే సగర్వంగా నిలిచింది! సాక్షి క్రీడా విభాగం :‘ప్రత్యర్థి గురించి భయపడొద్దు. నిశ్చలంగా నిలిచి, విజయాన్ని ముద్దాడు!’ ... పంజాబీ ప్రసిద్ధ నానుడి ఇది. దీనిని అక్షరాలా ఆచరించింది భారత పురుషుల రోయింగ్ జట్టు. మన సైన్యంలోని సిక్కు రెజిమెంట్‌లో పనిచేసే నాయిబ్ సవర్ణ్ సింగ్, దత్తు బబన్, ఓంప్రకాశ్, సుఖ్మీత్ సింగ్‌లతో కూడిన బృందం... సైనికుల్లానే పోరాడి స్వర్ణం పట్టు కొచ్చింది. సవర్ణ్ సింగ్ సారథ్యంలో క్లిష్ట పరిస్థితులకు ఎదురొడ్డి మరీ త్రివర్ణ పతాకం ఎగురేసింది. ఈ సంచలన గెలుపుతో వారి చుట్టూ మీడియా మూగింది... ఇంటర్వ్యూల కోసం ఎగబడింది! కానీ, ఈ విజయం వెనుక ఉత్కంఠను అధిగమించిన క్షణాలు... శరీరం నియంత్రణ తప్పేంత శ్రమ... అవమానాన్ని దిగమింగిన కసి ఉన్నాయి... అంతటి ఆసక్తికర నేపథ్యం ఏమంటే! ఎదురుగాలికి ఎదురొడ్డి... శుక్రవారం ఉదయం భారత రోయింగ్ బృందం బరిలో దిగేటప్పటికి అన్నీ ప్రతికూలతలే. గురువా రం నాలుగు ఫైనల్స్‌లో ఓడిపోవడంతో భారత రోయింగ్ చరిత్రలో ఇది చీకటి రోజంటూ కోచ్ ఇస్మాయిల్ బేగ్ మండిపడ్డారు. దత్తు... రేసుకు ముందు ఏకంగా లాక్ వేసుకోవడం మర్చిపోవడంతో బోట్ నుంచి పడిపోయాడు. దీంతో అతడు మానసికంగా దృఢంగా లేడంటూ, ఏ దేశంలోనూ ఇలా ఉండరంటూ విదేశీ కోచ్ నికోల్ జియోగా నిందించాడు. ఇదంతా ఒక ఎత్తయితే శుక్రవారం తేమతో కూడిన గాలుల వాతావరణం సవర్ణ్ జట్టుకు మరింత పరీక్ష పెట్టింది. ఇక బరిలో దిగాక ఆతిథ్య దేశం ఇండోనేసియా నుంచి విపరీతమైన పోటీ ఎదురైంది. అయినా... తట్టుకుని నిలిచి గెలిచింది. ఇబ్బందులను తట్టుకుని... 28 ఏళ్ల సవర్ణ్ సింగ్ జట్టులో సీనియర్. భారత గొప్ప రోయర్లలో ఒకడు. గత ఆసియా క్రీడల్లో కాంస్యం గెలిచాడు. అయితే, గాయంతో రెండేళ్లుగా ఆటకు దూరమయ్యాడు. దాన్నుంచి కోలుకున్నాక టైఫాయిడ్ బారిన పడ్డాడు. కొన్నాళ్ల క్రితమే బరిలో దిగాడు. దత్తు గురువారం నీటిలో పడిపోవడంతో జ్వరం, దగ్గు, జలుబు చుట్టుముట్టాయి. అయితే, కీలకమైన వీరిద్దరూ రేసుకు వచ్చేసరికి ఇబ్బందులన్నీ మర్చిపోయారు. ‘జాన్ చలీ జాయేగీ... మర్ జాయేంగే... లేకిన్ హార్ నహీ మానేంగే (ప్రాణం పోయినా ఫర్వాలేదు కానీ ఓటమి ఒప్పుకోం)’ అంటూ కదంతొక్కారు. ఈ క్రమంలో సవర్ణ్... సిక్కుల గురువు గోవింద్ సింగ్ మాటలను జట్టు సభ్యులకు పదేపదే గుర్తుచేశాడు.‘శభాష్... శభాష్’ అంటూ వెన్నుతట్టాడు. దాని ఫలితమే ఈ విజయం. ఎవరికీ తక్కువ కాదని నిరూపించాం... స్వర్ణం నెగ్గాక భారత రోయర్ల స్పందన ఆకాశాన్నంటింది. ‘మా గుండె పేలిపోతుందేమో అన్నంతగా దడదడలాడింది. నేను 2 వేల రేసుల్లో పాల్గొన్నా. అన్నింట్లోకి ఇదే క్లిష్టమైనది. నిన్న నా కారణంగా దేశ గౌరవం పోయింది. నేడు అది తిరిగొచ్చింది. మేం ఏ దేశం వారికీ తక్కువ కాదని నిరూపించాం’ అని దత్తు వ్యాఖ్యానించాడు. ‘తల వెంట్రుకల నుంచి కాలి గోళ్ల వరకు మా శరీరం మొత్తం అలసిపోయింది. రేసులో చివరి 100 మీటర్లయితే నా పేరు అడిగినా తెలియదనే చెప్పేవాడిని’ అని సవర్ణ్ అనడం గమనార్హం. ‘అంత శక్తి మాకు ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు. కానీ వచ్చింది. ఇది మా జీవితాలను మార్చే రేస్’ అని ఓంప్రకాశ్ పేర్కొన్నాడు. ఈ ఒత్తిడి ఫలితమో, విజయ గర్వమో ఏమో, రేసు అనంతరం దత్తు, ఓంప్రకాశ్‌లు...సవర్ణ్ భు జంపై అమాంతం వాలిపోయారు. దుష్యంత్‌ది మరో కథ.. రోయింగ్ వ్యక్తిగత విభాగంలో కాంస్యం గెలిచిన 25 ఏళ్ల దుష్యంత్ చౌహాన్ తీవ్ర జలుబుతో బాధపడుతూనే పోటీకి దిగాడు. ‘నేను మరణానికి దగ్గరగా ఉన్నాననిపించే పరిస్థితి. చివరి 200 మీటర్లలో నా కాళ్లు, చేతుల గురించి ఆలోచించలేని పరిస్థితి. ఎక్కడున్నానో కూడా చూసుకోలేదు. ఇదే చివరి రేసా అన్నట్లున్నాను’ అని చెప్పాడు. రేసు పూర్తయ్యాక దుష్యంత్ కుప్పకూలాడు. అధికారులు వచ్చి బోటు నుంచి బయటకు తీసి అతడి మెదడుకు రక్త ప్రసరణ మెరుగు పడేలా కాళ్లను పైకెత్తారు. తర్వాత ఆస్పత్రికి తీసుకెళ్లి ఆక్సిజన్ మాస్క్ తొడిగి గ్లూకోజ్ పెట్టించారు. ఈ కారణంగానే బహుమతి ప్రదానోత్సవం ఆలస్యమైంది. అన్నింటికంటే విశేషమేమంటే... పతకం తేవడం సంతోషంగా ఉన్నా, విజయానికి సంకేతంగా త్రివర్ణ పతాకం రెపరెపలాడిన క్షణాన్ని చూడలేనందుకు దుష్యంత్ ఒకింత నిరాశకు లోనవడం. -
పతకాలు నెగ్గిన వారందరూ సైనికులే
కదనరంగంలోనే కాదు దేశం కోసం క్రీడాంగణంలోనూ తమ సత్తా చాటుతామని భారత సైనికులు నిరూపించారు. ఆసియా క్రీడల్లో భాగంగా రోయింగ్ క్రీడాంశం చివరి రోజు మన క్రీడాకారులు స్వర్ణం, రెండు కాంస్యాలతో తమ పోరాటానికి చిరస్మరణీయ ముగింపు ఇచ్చారు. గురువారం నాలుగు ఈవెంట్స్‌లో ఫైనల్‌కు చేరినా ఒక్క పతకం కూడా గెలవలేకపోయిన బాధను మరచి... శుక్రవారం వీరోచిత ప్రదర్శనతో అందరి మన్ననలు పొందారు. సవర్ణ్ సింగ్, దత్తు బబన్ భోకనాల్, ఓంప్రకాశ్, సుఖ్మీత్ సింగ్‌లతో కూడిన బృందం పురుషుల క్వాడ్రాపుల్ స్కల్స్‌లో పసిడి పతకం దక్కించుకుంది. రోహిత్ కుమార్, భగవాన్ సింగ్‌లతో కూడిన జోడీ పురుషుల లైట్ వెయిట్ డబుల్ స్కల్స్‌లో కాంస్యం... దుష్యంత్ చౌహాన్ పురుషుల లైట్ వెయిట్ సింగిల్ స్కల్స్‌లో కాంస్యం సాధించాడు. రోయింగ్తోపాటు టెన్నిస్, షూటింగ్‌లోనూ రాణించి పోటీల ఆరో రోజును భారత్ రెండు స్వర్ణాలు, రజతం, 4 కాంస్యాలతో ముగించింది. పాలెంబాంగ్: ఒకరోజు ముందు పతకాలు గెలవాల్సిన చోట తడబడ్డామనే బాధ ఒకవైపు వేటాడుతుండగా... దేశానికి పతకాలతో తిరిగి వెళ్లాలనే చివరి అవకాశం కళ్ల ముందు కదలాడుతుండగా... భారత రోయర్లు అద్భుతం చేశారు. తమ శక్తినంతా కూడదీసుకొని స్వర్ణం, రెండు కాంస్యాలు సాధించి మూడు పతకాలతో స్వదేశానికి సగర్వంగా తిరిగి రానున్నారు. ఆసియా క్రీడల్లో భాగంగా రోయింగ్ క్రీడాంశం చివరి రోజు శుక్రవారం భారత్ మూడు పతకాలతో మెరిపించింది. ముందుగా లైట్ వెయిట్ సింగిల్ స్కల్స్ ఈవెంట్లో దుష్యంత్ చౌహాన్ కాంస్య పతకంతో ఖాతా తెరిచాడు. రెండు కిలోమీటర్ల లక్ష్యాన్ని దుష్యంత్ 7 నిమిషాల 18.76 సెకన్లలో చేరి మూడో స్థానాన్ని పొందాడు. హ్యున్సు పార్క్ (కొరియా; 7ని:12.86 సెకన్లు) స్వర్ణం... చున్ చియు హిన్ (హాంకాంగ్; 7ని:14.16 సెకన్లు) రజతం గెలిచారు. 2014 ఇంచియోన్ క్రీడల్లోనూ ఇదే విభాగంలో దుష్యంత్‌కు కాంస్యం లభించింది. కాంస్యంతో ఖాతా తెరిచిన ఉత్సాహంతో క్వాడ్రాపుల్ స్కల్స్ ఫైనల్ రేసుకు సిద్ధమైన భారత బృందం అగ్రస్థానాన్ని దక్కించుకుంది. రెండు కిలోమీటర్ల లక్ష్యాన్ని సవర్ణ్ సింగ్, దత్తు బబన్ భోకనాల్, ఓంప్రకాశ్, సుఖ్మీత్ సింగ్‌లతో కూడిన బృందం 6 నిమిషాల 17.13 సెకన్లలో అందరికంటే ముందుగా చేరుకొని పసిడి పతకాన్ని కైవసం చేసుకుంది. 2014 ఇంచియోన్ ఆసియా క్రీడల్లో సింగిల్ స్కల్స్‌లో కాంస్యం నెగ్గిన సవర్ణ్ ఆ తర్వాత గాయంతో దూరమయ్యాడు. గతేడాది పునరాగమనం చేసిన అతను ఈసారి స్వర్ణాన్ని మెడలో వేసుకున్నాడు. ‘నేను పునరాగమనం చేస్తానని...దేశం కోసం మళ్లీ పతకం గెలుస్తానని అస్సలు అనుకోలేదు. నా వెన్నునొప్పి చికిత్సకు భారత రోయింగ్ సమాఖ్య ఖర్చులు భరించింది. మళ్లీ బరిలో దిగేందుకు చీఫ్ కోచ్ ఇస్మాయిల్ బేగ్ కూడా ఎంతో ప్రోత్సహించారు’ అని సవర్ణ్ సింగ్ అన్నాడు. కాంస్యం, స్వర్ణం లభించాక లైట్ వెయిట్ డబుల్స్ స్కల్స్ ఫైనల్లో భగవాన్ సింగ్, రోహిత్ కుమార్‌లతో కూడిన జోడీ భారత్ ఖాతాలో మూడో పతకాన్ని జమచేసింది. రెండు కిలోమీటర్ల లక్ష్యాన్ని భగవాన్, రోహిత్ ద్వయం 7 నిమిషాల 04.61 సెకన్లలో ముగించి మూడో స్థానాన్ని దక్కించుకుంది. మహిళల విభాగంలో మాత్రం భారత్‌కు నిరాశ ఎదురైంది. సంయుక్త డుంగ్‌డుంగ్, అన్ను, నవనీత్ కౌర్, యామిని సింగ్‌లతో కూడిన భారత బృందం ఉమెన్స్ ఫోర్ ఫైనల్లో చివరిదైన ఆరో స్థానంలో నిలిచింది. రోయింగ్ కోచ్‌పై వేటు? ఏషియాడ్ రోయింగ్‌లో పతకాల లక్ష్య సాధనలో విఫలమైనందుకు విదేశీ కోచ్ నికోలాయ్ జియోగాపై వేటుపడనున్నట్లు తెలుస్తోంది. భారత బృందం ప్రదర్శనపై రోయింగ్ సమాఖ్య ప్రధాన కార్యదర్శి గిరీష్ ఫడ్నిస్... త్వరలో సమీక్ష సమావేశం ఏర్పాటు చేయడం ఇందుకు బలాన్నిస్తోంది. ఈ సందర్భంగా రొమేనియాకు చెందిన జియోగా... శిక్షణపై ప్రశ్నించనున్నట్లు సమాచారం. అతడి పద్ధతుల కారణంగా భారత రోయర్లు అస్వస్థతకు గురవడంతో పతకాల సాధనలో వెనుకడినట్లు సమాఖ్య అధికారులు భావిస్తున్నారు. దీంతో జియోగాను సాగనంపడం ఖాయంగా కనిపిస్తోంది. ►ఆసియా క్రీడల చరిత్రలో రోయింగ్‌లో భారత్‌కు లభించిన స్వర్ణాల సంఖ్య. 2010లో బజరంగ్ లాల్ ఠక్కర్ సింగిల్ స్కల్స్ విభాగంలో భారత్‌కు తొలి స్వర్ణం సాధించాడు. ►ఢిల్లీ ఏషియాడ్ (1982)లో రోయింగ్‌ను తొలిసారి ప్రవేశపెట్టారు. అప్పటి నుంచి ఇప్పటివరకు భారత రోయర్లు 2 స్వర్ణాలు, 5 రజతాలు, 16 కాంస్యాలతో కలిపి మొత్తం 23 పతకాలు సాధించారు. -
రోయింగ్‌లో భారత్‌కు స్వర్ణం
-
ఆసియా క్రీడల్లో కబడ్డీ జట్టుకు ఊహించని షాక్
-
జోడి రోహన్ బోపన్న-దివిజ్ శరణ్ స్వర్ణం
-
షూటింగ్లో భారత్‌కు మరో మెడల్
-
మహిళా కబడ్డీలోనూ నిరాశే!
జకార్త: భారత మహిళల కబడ్డీ జట్టు హ్యాట్రిక్ స్వర్ణం మిస్సయ్యింది. ఏషియన్స్ గేమ్స్‌లో భాగంగా శుక్రవారం ఇరాన్‌తో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో భారత మహిళలు 24-27 తేడాతో తృటిలో పసిడిని చేజార్చుకున్నారు. ఒకవైపు పురుషుల జట్టు తొలిసారి సెమీఫైనల్లో ఓడి నిరాశపరచగా.. మహిళలు సైతం ఫైనల్లో ఓడి రజతంతో సరిపెట్టుకున్నారు. హోరాహొరిగా సాగిన ఈ మ్యాచ్‌లో ఇరాన్ మహిళలే పై చేయి సాధించారు. అద్యాంతం ఉత్కంఠగా సాగిన ఈమ్యాచ్‌కు ఇరు దేశాల పురుషుల జట్లు హాజరై తమ జట్లకు మద్దతు పలికాయి. మ్యాచ్ సందర్భంగా పురుషుల జట్టు కెప్టెన్ అజయ్ ఠాకుర్ కన్నీటీ పర్యంతమయ్యాడు. ఆసియా క్రీడల్లో మహిళల కబడ్డీని 2010లో ప్రవేశ పెట్టినప్పటి నుంచి రెండు సార్లు భారత మహిళలే స్వర్ణం సాధించారు. తొలిసారి ఇరాన్ మహిళల జట్టు స్వర్ణం దక్కించుకుంది. ఇక భారత్ పతకాల సంఖ్య 24కు చేరింది. ఇందులో 6 స్వర్ణాలు, 5 రజతాలు, 13 కాంస్య పతకాలు ఉన్నాయి. -
ఏషియన్ గేమ్స్: భారత్‌కు మరో స్వర్ణం
జకార్తా: ఏషియన్ గేమ్స్ 2018లో భారత్ జోరు కొనసాగుతోంది. శుక్రవారం ఆరో రోజు ఆటలో భాగంగా భారత్ తన పతకాల వేటను కొనసాగిస్తోంది. టెన్నిస్ పురుషుల డబుల్స్ ఫైనల్లో భారత జోడి రోహన్ బోపన్న-దివిజ్ శరణ్ ద్వయం విజయం సాధించి స్వర్ణాన్ని సాధించింది. తుది పోరులో బోపన్న జంట 2-0 తేడాతో బబ్లిక్- డెనిస్(కజికిస్తాన్)జోడిపై గెలిచి పసిడితో మెరిసింది. తొలి సెట్‌ను 6-3 తేడాతో గెలిచిన బోపన్న జోడి.. రెండో సెట్‌ను 6-4తో సొంతం చేసుకుని మ్యాచ్‌తో పాటు స్వర్ణాన్ని ఖాతాలో వేసుకుంది. షూటింగ్లో మరో కాంస్యం షూటింగ్లో భారత్‌కు మరో కాంస్య పతకం దక్కింది. ఈరోజు జరిగిన 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్లో హీనా సిద్ధు కాంస్యాన్ని సాధించారు. ఓవరాల్‌గా 198.8 స్కోరుతో మూడో స్థానంలో నిలిచి కాంస్యాన్ని దక్కించుకున్నారు. దాంతో భారత్ పతకాల సంఖ్య 23కు చేరింది. ఇందులో 6 స్వర్ణాలు, 4 రజతాలు, 13 కాంస్య పతకాలు ఉన్నాయి. అంతకుముందు ఆరో రోజు ఆటలో పురుషుల సింగిల్ స్కల్స్ ఈవెంట్లో దుష్యంత్ చౌహాన్ కాంస్య పతకం సాధించి రోయింగ్‌లో తొలి పతకాన్ని అందించగా, ఆపై డబుల్ స్కల్స్‌లో భారత రోయర్లు రోహిత్ కుమార్-భగవాన్ సింగ్ జోడి మరో కాంస్యాన్ని సాధించింది. కాగా, పురుషుల క్వాడ్రాపుల్ స్కల్స్ ఈవెంట్లో భారత్ పసిడితో మెరిసింది. టీమ్ ఈవెంట్లో భారత రోయర్లు సవరణ్ సింగ్, దత్తు భోకనల్, ఓం ప్రకాశ్, సుఖ్మీత్ సింగ్‌లు స్వర్ణాన్ని సాధించారు. ఫైనల్స్‌లో వీరు 6;17;13 సెకన్లలో వేగవంతమైన టైమింగ్ నమోదు చేసి స్వర్ణాన్ని సాధించారు. ఏ దశలోనూ అలసటకు లోను కాకుండా తొలి స్థానంలో నిలిచారు. దాంతో రోయింగ్‌లో భారత్‌కు తొలి స్వర్ణం లభించింది. -
రోయింగ్‌లో భారత్‌కు పసిడి
జకార్తా: ఏషియన్ గేమ్స్ 2018లో భాగంగా రోయింగ్ ఈవెంట్లో భారత్ పతకాలు పంట పండిస్తోంది. ముందుగా పురుషుల సింగిల్ స్కల్స్ ఈవెంట్లో దుష్యంత్ చౌహాన్ కాంస్య పతకం సాధించి రోయింగ్‌లో తొలి పతకాన్ని అందించగా, ఆపై డబుల్ స్కల్స్‌లో భారత రోయర్లు రోహిత్ కుమార్-భగవాన్ సింగ్ జోడి మరో కాంస్యాన్ని సాధించింది. కాగా, పురుషుల క్వాడ్రాపుల్ స్కల్స్ ఈవెంట్లో భారత్ పసిడితో మెరిసింది. టీమ్ ఈవెంట్లో భారత రోయర్లు సవరణ్ సింగ్, దత్తు భోకనల్, ఓం ప్రకాశ్, సుఖ్మీత్ సింగ్‌లు స్వర్ణాన్ని సాధించారు. శుక్రవారం జరిగిన ఫైనల్స్‌లో వీరు 6;17;13 సెకన్లలో వేగవంతమైన టైమింగ్ నమోదు చేసి స్వర్ణాన్ని సాధించారు. ఏ దశలోనూ అలసటకు లోను కాకుండా తొలి స్థానంలో నిలిచారు. దాంతో రోయింగ్‌లో భారత్‌కు తొలి స్వర్ణం లభించింది. మొత్తంగా ఇప్పటివరకూ భారత్ 21 పతకాలను తన ఖాతాలో వేసుకుంది. ఇందులో 5 స్వర్ణాలు, 4 రజతాలు, 12 కాంస్యాలు ఉన్నాయి. చదవండి: కనకం కాదు కంచు... 15 ఏళ్లకే పతకం కొట్టాడు -
ఏషియాడ్‌లో నేటి భారతీయం
జిమ్నాస్టిక్స్: మహిళల బ్యాలెన్స్ బీమ్ ఫైనల్: దీపా కర్మాకర్ (మ.గం. 3 నుంచి) కబడ్డీ: మహిళల ఫైనల్: భారత్ వర్సెస్ ఇరాన్; (మ.గం.1.30 నుంచి) షూటింగ్: ఉ.గం.7.30 నుంచి) పురుషుల 300 మీ. స్టాండర్డ్ రైఫిల్: అమిత్, హర్జీందర్ సింగ్ పురుషుల 25 మీ. ర్యాపిడ్ ఫైర్ పిస్టల్: శివమ్ శుక్లా, అనీష్; మహిళల 10 మీ. ఎయిర్ పిస్టల్ : మను భాకర్, హీనా సిద్ధూ టెన్నిస్: పురుషుల డబుల్స్ ఫైనల్: బోపన్న, దివిజ్ శరణ్గీబబ్లిక్/డెనిస్ (కజకిస్తాన్); సింగిల్స్ సెమీస్: ప్రజ్నేశ్ వర్సెస్ డెనిస్ ఇస్తోమిన్ వెయిట్‌లిఫ్టింగ్: మహిళల 63 కేజీలు: రాఖీ హల్దార్ (మధ్నాహ్నం గం.12.30 నుంచి) బ్యాడ్మింటన్: పురుషుల సింగిల్స్: శ్రీకాంత్ వర్సెస్ విన్సెంట్ (హాంకాంగ్); ప్రణయ్ వర్సెస్ వాంగ్చరొయెన్ (థాయ్‌లాండ్) (మ.12 గం.నుంచి). -
ఏషియన్ గేమ్స్; దుష్యంత్‌కు కాంస్యం
జకార్తా: ఏషియన్ గేమ్స్ 2018లో భాగంగా రోయింగ్ విభాగంలో భారత్‌కు కాంస్య పతకం దక్కింది. పురుషుల సింగిల్ స్కల్స్ ఈవెంట్లో భారత రోయర్ దుష్యంత్ చౌహాన్ కాంస్యం పతకం సాధించాడు. శుక్రవారం ఉదయం జరిగిన ఫైనల్ హీట్‌లో దుష్యంత్ 7:18: 76 సెకన్లతో వేగవంతమైన టైమింగ్ నమోదు చేసి ఓవరాల్‌గా మూడో స్థానంలో నిలిచి కాంస్యాన్ని దక్కించుకున్నాడు. అంతకుముందు దుష్యంత్ ఫైనల్‌కు చేరే క్రమంలో 7:43.08 సెకన్లతో హీట్-1ను పూర్తి చేశాడు. ఫలితంగా ఓవరాల్ రెండో స్థానంతో ఫైనల్స్‌కు అర్హత సాధించాడు. ఆపై ఫైనల్ కూడా ఆకట్టుకున్న దుష్యంత్ కాంస్యంతో మెరిశాడు. గత ఏషియన్ గేమ్స్‌లో సైతం దుష్యంత్ మూడో స్థానంలో నిలిచి కాంస్య పతకాన్ని సాధించిన సంగతి తెలిసిందే. ఇక పురుషుల లైట్ వెయిట్ డబుల్ స్కల్క్‌లో భారత్‌కు కాంస్యం సాధించింది. భారత రోయర్లు రోహిత్ కుమార్-భగవాన్ సింగ్ జోడి మూడో స్థానంలో నిలిచి కాంస్యాన్ని సాధించారు. ఫైనల్స్‌లో 07:04:61 సెకన్లతో మూడో స్థానంలో నిలిచారు. ప్రస్తుత ఏషియన్ గేమ్స్‌లో భారత జట్టు ఇప్పటివరకూ 20 పతకాలను ఖాతాలో వేసుకుంది. ఇందులో నాలుగు స్వర్ణాలు, నాలుగు రజతాలు, 12 కాంస్య పతకాలు ఉన్నాయి. -
అరుణా రెడ్డికి ఏడో స్థానం
జకార్తా: ఆసియా క్రీడల జిమ్నాస్టిక్స్‌లో తెలుగుతేజం బుద్దా అరుణారెడ్డి (12.775 పాయింట్లు) విఫలమైంది. మహిళల వాల్ట్ ఫైనల్ ఈవెంట్లో బరిలోకి దిగిన ఆమె ఏడో స్థానంతో సరిపెట్టుకుంది. మరో భారత జిమ్నాస్ట్ ప్రణతి నాయక్‌కు (12.650 పాయింట్లు) చివరిదైన ఎనిమిదో స్థానం దక్కింది. ఫైనల్లో మహిళల కబడ్డీ జట్టు... భారత పురుషుల కబడ్డీ జట్టు కాంస్యంతో సరిపెట్టుకోగా... భారత మహిళల కబడ్డీ జట్టు వరుసగా మూడో స్వర్ణంపై గురి పెట్టింది. సెమీఫైనల్లో భారత్ 27–14తో చైనీస్ తైపీని ఓడించింది. మరో సెమీఫైనల్లో ఇరాన్ 23–16తో థాయ్‌లాండ్‌పై గెలిచింది. శుక్రవారం జరిగే ఫైనల్లో ఇరాన్‌తో భారత్ అమీతుమీ తేల్చుకుంటుంది. ఆసియా క్రీడల్లో మహిళల కబడ్డీని 2010లో ప్రవేశ పెట్టారు. గురి తప్పిన దీపిక భారత స్టార్ ఆర్చర్ దీపిక కుమారి మళ్లీ నిరాశపరిచింది. ఈ ప్రపంచ మాజీ నంబర్‌వన్ ఆర్చర్ మూడో రౌండ్లో 3–7తో చియెన్ యింగ్ లీ (చైనీస్ తైపీ) చేతిలో ఓడింది. పురుషుల రికర్వ్‌లో అతాను దాస్ క్వార్టర్స్‌లో 3–7తో రియు ఎగా అగత సాల్సా బిల్లా (ఇండోనేసియా) చేతిలో పరాజయం చవిచూశాడు. -
సింధు శ్రమించి... సైనా అలవోకగా...
మహిళల బ్యాడ్మింటన్ సింగిల్స్‌లో భారత స్టార్స్ పీవీ సింధు, సైనా నెహ్వాల్ ప్రిక్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించారు. తొలి రౌండ్లో సింధు 21–10, 12–21, 23–21తో ప్రపంచ 52వ ర్యాంకర్ వు థి ట్రాంగ్ (వియత్నాం)పై కష్టపడి గెలుపొందగా... సైనా 21–7, 21–9తో సొరాయా అఘజియాఘా (ఇరాన్)పై సునాయాసంగా నెగ్గింది. మహిళల డబుల్స్ తొలి రౌండ్లో సిక్కి రెడ్డి–అశ్విని పొన్నప్ప 21–16, 21–15తో ఎన్జీ వుంగ్ యుంగ్–వైయుంగ్ ఎన్జీ టింగ్ (హాంకాంగ్)లపై... పురుషుల డబుల్స్ తొలి రౌండ్లో సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి 21–12, 21–14తో చుంగ్ యాని–టామ్ చున్ హె (హాంకాంగ్)లపై... మనూ అత్రి–సుమీత్ రెడ్డి 21–10, 21–8తో అహ్మద్–రషీద్ (మాల్దీవులు)లపై గెలిచారు. మిక్స్డ్ డబుల్స్‌లో మాత్రం సిక్కి రెడ్డి–ప్రణవ్ చోప్రా... సాత్విక్ సాయిరాజ్–అశ్విని పొన్నప్ప జోడీలు తొలి రౌండ్లోనే ఓడిపోవడం గమనార్హం. -
కనకం కాదు కంచు...
జకార్తా: భారత పురుషుల కబడ్డీకి ఆసియా క్రీడల్లో అసాధారణ రికార్డుంది. కానీ ఈ ‘కూత’ ఈసారి ‘కనకం’ దాకా పెట్టలేకపోయింది. సెమీస్‌లో ఓడి కాంస్యంతో సరిపెట్టుకుంది. గురువారం జరిగిన సెమీఫైనల్లో భారత పురుషుల జట్టుకు ఇరాన్ ఊహించని షాక్ ఇచ్చింది. భారత్ 18–27తో పరాజయం చవిచూసింది. 1990లో బీజింగ్ ఆతిథ్యమిచ్చిన ఏషియాడ్‌లో తొలిసారి ఈ గ్రామీణ క్రీడను చేర్చారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రతి నాలుగేళ్లకోసారి ఎదురులేని భారత జట్టు స్వర్ణం సాధిస్తూనే ఉంది. కానీ ఇప్పుడు మాత్రం ఈ విజయవంతమైన చరిత్రకు చుక్కెదురైంది. 28 ఏళ్ల స్వర్ణ భారతానికి కాంస్యమే దిక్కయింది. గత రెండు పర్యాయాలు ఫైనల్లో భారత్ చేతిలో ఎదురైన పరాజయానికి ఇరాన్ ఈసారి బదులు తీర్చుకుంది. ఇరాన్‌తో సెమీస్‌లో ఆరంభంలో భారత ఆటగాళ్లు బాగానే ఆడారు. 6–4తో జట్టును ఆధిక్యంలోకి తీసుకొచ్చారు. కానీ ఇరాన్ రైడర్లు, డిఫెండర్లు ఒక్కసారిగా ఫామ్‌లోకి వచ్చారు. అంతే భారత్ ఆలౌటైంది. విరామానికి 9–9తో సమంగా ఉన్న స్కోరు వెనుకబడుతూ వచ్చింది. ఇరాన్ ఆల్‌రౌండ్ ప్రదర్శనకు ప్రొకబడ్డీ (పీకేఎల్) హీరోలు అజయ్ ఠాకూర్, ప్రదీప్ నర్వాల్, రాహుల్ చౌదరి, దీపక్ నివాస్ హుడాలు జీరోలయ్యారు. ఇరాన్ ఆటగాళ్లు మిఘాని, అత్రాచలి భారత రైడర్లను ఉక్కిరిబిక్కిరి చేశారు. రాహుల్ చౌదరి రైడింగ్‌లో మెరిసినా... ఇరాన్ జోరుముందు అది ఏమాత్రం సరిపోలేదు. దీంతో డిఫెండింగ్ చాంపియన్ భారత్ స్కోరు పరంగా చూసినా భారీ తేడాతో ఓడింది. -
15 ఏళ్లకే పతకం కొట్టాడు
క్రికెట్లో ‘అప్రాధాన్యత’ను వద్దనుకున్నాడు. బ్యాడ్మింటన్‌లో మనసు పెట్టలేక లేటైపోయాడు. షూటింగ్లో మాత్రం కోచ్ చెప్పినట్టు విన్నాడు. తుపాకీ అంత లేకపోయినా... తేలిగ్గానే ఎత్తిపట్టుకున్నాడు. అంతే కోచ్‌కు ఆశ్చర్యం, నమ్మకం రెండు కలిగాయి. కాలచక్రం గిర్రున తిరిగాక... ఆ కుర్రాడే ఏషియాడ్‌లో రజతంపై గురిపెట్టాడు. క్రికెట్, బ్యాడ్మింటన్ అబ్బని ఆ బాలుడే ఇండోనేసియాలో టీనేజ్ సంచలనమయ్యాడు. అతనే మీరట్ షూటర్ శార్దూల్ విహాన్... ఆరేళ్లప్పుడు క్రికెట్ నేర్చుకునేందుకు వెళ్తే అక్కడ అంతా ‘లాస్ట్’ చాన్సే దక్కేది. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ చివర్లో అవకాశమిచ్చారు. ఏడాది భరించాక తండ్రి దీపక్ విహాన్‌తో నాకొద్దు ఈ క్రికెటన్నాడు చిన్నారి శార్దూల్. సర్లేపదా అని బ్యాడ్మింటన్ అకాడమీకి తీసుకెళ్తే దూరాభారంతో లేట్‌గా వెళ్లాడు. సమయపాలన ధిక్కరణను సహించని కోచ్ మీ వాడికి వేరే ఆటేదో ఆడించండని చెప్పి పంపించాడు. దీంతో ఏడేళ్ల శార్దూల్ షూటింగ్ రేంజ్కెళితే పాలబుగ్గలోడికి ఈ తుపాకీలెందుకని కోచ్ వేద్‌పాల్ సింగ్ వారించాడు. అయిష్టంగా ఏది ఓసారి ఈ గన్ ఎత్తు అంటే టక్కున ఎత్తేశాడు శార్దూల్. కోచ్ కన్నార్పలేదు. ఇక వద్దనలేదు. గురి పెట్టించాడు. పతకానికి తొలి అడుగులు వేయించాడు. 8 ఏళ్ల తర్వాత ఆ కుర్రాడే ఆసియా క్రీడల్లో అదరగొట్టేశాడు. 15 ఏళ్లకే రజతాన్ని మెడలో వేసుకున్నాడు. భారత్ తరఫున ఆసియా క్రీడల చరిత్రలో పిన్న వయస్సులో పతకం గెలిచిన షూటర్‌గా చరిత్రకెక్కాడు. పాలెంబాంగ్: మళ్లీ భారత యువ ‘గురి’ అదిరింది. ‘పతకం వస్తే పేరు ప్రఖ్యాతులు... పతకం రాకపోతే అనుభవమైనా వస్తుంది’ అనుకుంటున్నారేమోగానీ... ఆసియా క్రీడల్లో మాత్రం ఏమాత్రం అంచనాలు లేకుండా బరిలోకి దిగిన భారత యువ షూటర్లు మెరిపిస్తున్నారు. మొన్న 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్లో 16 ఏళ్ల సౌరభ్ చౌదరీ ఏకంగా పసిడి పతకాన్ని సొంతం చేసుకోగా... తాజాగా పురుషుల ‘డబుల్ ట్రాప్’ ఈవెంట్లో 15 ఏళ్ల శార్దూల్ విహాన్ రజత పతకాన్ని సాధించి ఔరా అనిపించాడు. సౌరభ్, శార్దూల్లది ఉత్తరప్రదేశ్‌లోని మీరట్ జిల్లానే కావడం మరో విశేషం. సాధారణంగా షాట్‌గన్ (ట్రాప్, డబుల్ ట్రాప్) ఈవెంట్స్‌లో వెటరన్ షూటర్లు ఆధిపత్యం చలాయిస్తారు. కానీ గురువారం ఆసియా క్రీడల్లో మాత్రం శార్దూల్ విహాన్ తనకంటే రెట్టింపు వయస్సున్న షూటర్లకు చెమటలు పట్టించాడు. 20 మంది పాల్గొన్న క్వాలిఫయింగ్‌లో శార్దూల్ 141 పాయింట్లు సాధించి అగ్రస్థానంలో నిలిచాడు. అతనితోపాటు మరో ఐదుగురు హమద్ అలీ అల్ మరి (42 ఏళ్లు–ఖతర్; 139 పాయింట్లు)...షిన్ వున్హ్యూ (34 ఏళ్లు–దక్షిణ కొరియా; 138 పాయింట్లు)... లియు అన్లాంగ్ (38 ఏళ్లు–చైనా; 138 పాయింట్లు).... ఖాలిద్ అల్కాబీ (33 ఏళ్లు–యూఏఈ; 137 పాయింట్లు)... సుంగ్జీ వాంగ్ (27 ఏళ్లు–దక్షిణ కొరియా; 137 పాయింట్లు) ఫైనల్‌కు చేరారు. భారత్‌కే చెందిన మరో షూటర్ అంకుర్ మిట్టల్ 134 పాయింట్లతో తొమ్మిదో స్థానంలో నిలిచి ఫైనల్‌కు అర్హత పొందలేకపోయాడు. ఫైనల్లోనూ శార్దూల్ చెదరని ఏకాగ్రతతో ఆడి 73 పాయింట్లు స్కోరు చేసి రెండో స్థానంతో రజత పతకాన్ని దక్కించుకున్నాడు. షిన్ వున్వ్యూ 74 పాయింట్లతో స్వర్ణాన్ని కైవసం చేసుకోగా... హమద్ అలీ 53 పాయింట్లతో కాంస్యంతో సరిపెట్టుకున్నాడు. మహిళల డబుల్ ట్రాప్ లో భారత షూటర్లు శ్రేయసి (121 పాయింట్లు) ఆరో స్థానంలో... వర్ష (120 పాయింట్లు) ఏడో స్థానంలో నిలిచారు. పోటీల ఐదో రోజు భార త్‌కు రజతం, రెండు కాంస్యాలు లభించాయి. ప్రస్తుతం భారత్ 4 స్వర్ణాలు, 4 రజతాలు, 10 కాంస్యాలతో కలిపి 18 పతకాలతో పదో స్థానంలో ఉంది. అంకితకు కాంస్యం మహిళల టెన్నిస్ సింగిల్స్‌లో భారత క్రీడాకారిణి అంకిత రైనాకు కాంస్యం లభించింది. సెమీఫైనల్లో అంకిత 4–6, 6–7 (6/8)తో 34వ ర్యాంకర్ షుయె జాంగ్ (చైనా) చేతిలో పోరాడి ఓడిపోయింది. పురుషుల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో ప్రజ్నేశ్ గుణేశ్వరన్ 6–7 (2/7), 6–4, 7–6 (10/8)తో క్వాన్ సూన్‌వూ (దక్షిణ కొరియా)పై గెలిచి సెమీస్‌కు చేరాడు. కనీసం కాంస్య పతకాన్ని ఖాయం చేసుకున్నాడు. పురుషుల డబుల్స్ సెమీఫైనల్లో బోపన్న–దివిజ్ శరణ్ జంట 4–6, 6–3, 10–8తో యుసిగి–షిమాబుకురో (జపాన్) జోడీపై గెలిచి ఫైనల్లోకి దూసుకెళ్లింది. మిక్స్డ్ డబుల్స్ క్వార్టర్ ఫైనల్లో బోపన్న–అంకిత ద్వయం 4–6, 6–1, 6–10తో రుంగ్‌కాట్–అల్దిలా(ఇండోనేసియా) జంట చేతిలో ఓడిపోయింది. స్క్వాష్‌లో పతకం ఖాయం పురుషుల స్క్వాష్ సింగిల్స్ ఈవెంట్లో భారత ప్లేయర్ సెమీస్‌కు చేరనుండటంతో కనీసం కాంస్యం ఖాయమైంది. సౌరవ్ ఘోషాల్, హరీందర్ క్వార్టర్ ఫైనల్లో ముఖాముఖిగా తలపడనున్నారు. మహిళల సింగిల్స్‌లో జోష్నా, దీపిక క్వార్టర్స్‌కు చేరారు. -
ఏషియన్ గేమ్స్ చరిత్రలో తొలిసారి..
జకర్తా: ప్రపంచ కబడ్డీ చాంపియన్ భారత్‌కు ఆసియా క్రీడల్లో ఊహించని షాక్ తగిలింది. ఏషియన్ గేమ్స్ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఫైనల్ చేరకుండానే ఇంటి ముఖం పట్టింది. సెమీఫైనల్లో భాగంగా గురువారం బలమైన ఇరాన్ చేతిలో 18-27 తేడాతో భారత్ ఘోర ఓటమి చవిచూసింది. ఆట ప్రారంభం నుంచి దూకుడుగా ఆడిన ఇరాన్ ఆటగాళ్లు.. బలమైన డిఫెన్స్‌తో అజయ్ ఠాకూర్‌సేనకు పాయింట్లు చిక్కకుండా అడ్డుకున్నారు. బలమైన డిఫెండింగ్ గల ఇరాన్ సూపర్ ట్యాకిల్ పాయింట్లతో విరుచుకపడింది. దీంతో ఆత్మరక్షణలో పడిన భారత ఆటగాళ్లు ప్రత్యర్థి జట్టుకు తలవంచారు. టీమిండియా సారథి అజయ్ ఠాకూర్, ప్రో కబడ్డీ లీగ్ స్టార్ రైడర్లు ప్రదీప్ నర్వాల్, రాహుల్ చౌదరీ, రిషాంక్ దేవడిగా, మోనూ గోయత్‌లు ఇరాన్ డిఫెండింగ్ ముందు తేలిపోయారు.భారత రైడర్లు పాయింట్లు తేవడంలో పూర్తిగా విఫలమయ్యారు. ఇక డిఫెండింగ్‌లోనూ భారత ఆటగాళ్లు అంతగా రాణించలేకపోయారు. తొలుత డిఫెండర్ గిరీష్ మారుతి ఎర్నాక్ రాణించినా చివర్లో విఫలమయ్యారు. మోహిత్ చిల్లర్, దీపక్ నివాస్ హుడా, సందీప్ నర్వాల్‌లు కూడా చేతులెత్తాశారు. భారత ఆటగాళ్లు సమిష్టిగా విఫలమవ్వడంతో ఆసియా క్రీడల్లో స్వర్ణం గెలుస్తుందనుకున్న జట్టు తొలి సారి కాంస్యంతో సరిపెట్టుకుంది. ఇక మరోవైపు భారత మహిళల కబడ్డీ జట్టు ఆసియా క్రీడల్లో వరుసగా మూడోసారి ఫైనల్‌కు చేరింది. గురువారం జరిగిన సెమీఫైనల్లో భారత మహిళల జట్టు 27-14తేడాతో చైనీస్ తైపీ జట్టును చిత్తు చేసి కనీసం రజతం ఖాయం చేశారు. -
ఏషియన్ గేమ్స్: 15 ఏళ్ల ‘సిల్వర్’ విహాన్
జకర్తా: ఇండోనేషియాలో జరుగుతున్న 18వ ఆసియా క్రీడల్లో భారత క్రీడాకారులు సత్తాచాటుతున్నారు. ముఖ్యంగా షూటర్లు పతకాల పంట పండిస్తున్నారు. గురువారం పురుషుల డబుల్ ట్రాప్ ఈవెంట్లో 15 ఏళ్ల యువ సంచలనం శార్దూల్ విహాన్ రజత పతకం సాధించాడు. దీంతో నాలుగు స్వర్ణాలు, మూడు రజతాలు, పది కాంస్య పతకాలు సాధించిన భారత్.. మొత్తం 17 పతకాలతో తొమ్మిదో స్థానంలో కొనసాగుతోంది. 50 మీటర్ల బట్టర్ఫ్లై (స్విమ్మింగ్) విభాగంలో విర్ద్వాల్ ఖడే ఫైనల్‌కు అర్హత సాధించాడు. అతడు 24.09 సెకన్లలోనే ఫీట్‌ను పూర్తి చేసి జాతీయ రికార్డును నెలకోల్పాడు మరోవైపు ఆర్చరీలో తీవ్ర నిరాశే ఎదురైంది. ఎన్నో అంచనాల మధ్య ఆసియా క్రీడల బరిలోకి దిగిన దీపికా కుమారి ప్రీక్వార్టర్స్ ఫైనల్స్‌లోనే వెనుదిరిగారు. ఈ రోజు జరిగిన మ్యాచ్‌లో చియాంగ్ యంగ్ లి (చైనీస్ తైపీ) చేతిలో 3-7 చేతిలో ఓటమి చవిచూశారు. -
కాంస్యంతోనే సరిపెట్టుకున్న అంకితా రైనా
సాక్షి, న్యూఢిలీ : మంచి ప్రదర్శనలతో దూసుకుపోతున్న ఇండియన్ టెన్నిస్ స్టార్ అంకితా రైనా సెమీఫైనల్లో ఓటమి పాలయ్యారు. చైనా ప్లేయర్ జంగ్ షౌల్‌తో రెండు గంటలకు పైగా జరిగిన మ్యాచ్‌లో వరుస సెట్ల (4-6, 6-7)లో ఓడిపోయారు. దాంతో కాంస్య పతకంతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. కాగా, ఏషియన్ గేమ్స్‌లో మహిళల టెన్నిస్ సింగిల్స్‌లో పతకం గెలుపొందిన రెండో ప్లేయర్‌గా అంకిత నిలిచారు. అంతకు ముందు 2006, 2010 ఏషియన్ గేమ్స్‌లో సానియా మీర్జా వరుసగా రజతం, కాంస్య పతకాలు గెలుపొందారు. ఏషియన్ గేమ్స్‌లో భారత్‌కు మరో పతకం ఖాయం అయింది. పురుషుల టెన్నిస్ డబుల్స్‌లో బోపన్న-శరణ్ జోడీ ఫైనల్ చేరింది. సెమీఫైనల్లో జపాన్ జోడీ ఉసుంగు-షమబుకరోపై గెలిచి భారత్‌కు పతకం ఖరారు చేసిందీ ద్వయం. కాగా, నాలుగు స్వర్ణాలు, మూడు రజతాలు, తొమ్మిది కాంస్య పతకాలు సాధించిన భారత్.. మొత్తం 16 పతకాలతో తొమ్మిదో స్థానంలో కొనసాగుతోంది. -
ఏషియాడ్‌లో నేటి భారతీయం
జిమ్నాస్టిక్స్: మహిళల వాల్ట్ ఫైనల్: బుద్దా అరుణా రెడ్డి, ప్రణతి నాయక్ (మ.గం.3 నుంచి). బ్యాడ్మింటన్: మహిళల సింగిల్స్: సింధు(vs)వు తి ట్రాంగ్ (వియత్నాం); సైనా (vs) సొరయ (ఇరాన్). మహిళల డబుల్స్: సిక్కిరెడ్డి, అశ్విని (vs) ఎన్గా తింగ్ యుంగ్, వింగ్ యుంగ్ (హాంకాంగ్). మిక్స్డ్ డబుల్స్: సిక్కి రెడ్డి, ప్రణవ్ (vs)లూ యింగ్ గో, పెంగ్ సూన్ చాన్ (మలేసియా); అశ్విని, సాత్విక్(vs)సప్సిరి, డెచాపొల్ (థాయ్‌లాండ్) (ఉ.గం.10.30 నుంచి). షూటింగ్ : మహిళల డబుల్ ట్రాప్ ఫైనల్స్: వర్ష వర్మన్, శ్రేయసి సింగ్ (ఉ.గం.9.15 నుంచి). వెయిట్‌లిఫ్టింగ్: సతీశ్ శివలింగం (77 కేజీలు– ఉ.గం. 9.30 నుంచి). టెన్నిస్: మహిళల సింగిల్స్ సెమీస్: అంకిత(vs)షువాయి జంగ్ (చైనా) (ఉ. 8.30 గంటల నుంచి). ►సోనీ టెన్–2, సోనీ ఈఎస్‌పీఎన్‌లలో ప్రత్యక్ష ప్రసారం -
అంకితకు పతకం ఖాయం
భారత నంబర్‌వన్ మహిళా టెన్నిస్ క్రీడాకారిణి అంకిత రైనా సింగిల్స్ సెమీఫైనల్‌కు చేరుకొని పతకాన్ని ఖాయం చేసుకుంది. సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో అంకిత 6–4, 6–1తో చోంగ్ యుడిస్ వోంగ్ (హాంకాంగ్)పై గెలిచింది. మిక్స్డ్ డబుల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో అంకిత–రోహన్ బోపన్న జంట 6–4, 6–4తో చోంగ్ యుడిస్ వోంగ్–చున్ హున్ వోంగ్ (హాంకాంగ్) ద్వయంపై నెగ్గింది. కుస్తీలో నిరాశ ఆసియా క్రీడల్లో రెజ్లింగ్‌కు చివరి రోజైన బుధవారం భారత్‌కు పతకం దక్కలేదు. నలుగురు రెజ్లర్లు బరిలోకి దిగినా ఎవరూ పతకం ‘పట్టు’ పట్టలేకపోయారు. గ్రీకో రోమన్ విభాగంలో హర్‌ప్రీత్ సింగ్ కాంస్యం కోల్పోయాడు. 87 కేజీల కాంస్య పతక బౌట్లో అతను 3–6తో కుస్తుబయేవ్ (కజకిస్తాన్) చేతిలో ఓడాడు. మిగతా ముగ్గురు రెజ్లర్లు... గుర్ప్రీత్ (77 కేజీలు), నవీన్ (130 కేజీలు), హర్దీప్ (97 కేజీలు) పతకం రౌండ్‌కు అర్హత సాధించేకపోయారు. జ్యోతి సురేఖ బృందానికి రెండో ర్యాంక్... మహిళల ఆర్చరీ కాంపౌండ్ టీమ్ ర్యాంకింగ్ క్వాలిఫయింగ్‌లో ఆంధ్రప్రదేశ్ అమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ బృందం 2085 పాయింట్లతో రెండో స్థానాన్ని దక్కించుకుంది. జ్యోతి సురేఖ 705 పాయింట్లు సాధించి ఓవరాల్‌గా రెండో ర్యాంక్‌లో నిలిచింది. మిగతా భారత ఆర్చర్లలో ముస్కాన్ (691) 9వ, మధుమిత (689) 11వ, త్రిషా దేబ్ (683) 19వ స్థానాల్లో నిలిచారు. తమ ప్రదర్శనతో భారత్‌కు నేరుగా క్వార్టర్ ఫైనల్‌కు బై లభించింది. జిమ్నాస్టిక్స్‌లో ఏడో స్థానం ఆర్టిస్టిక్ జిమ్నాస్టిక్స్ టీమ్ ఈవెంట్లో బుద్దా అరుణా రెడ్డి, ప్రణతి దాస్, మందిర చౌదరీలతో కూడిన భారత జట్టు 138.050 పాయింట్లతో ఏడో స్థానంలో నిలిచింది. గాయం కారణంగా స్టార్ జిమ్నాస్ట్ దీపా కర్మాకర్ టీమ్ ఈవెంట్ ఫైనల్‌కు దూరంగా ఉంది. -
భారత్ 26 హాంకాంగ్ 0
జకార్తా: భారత పురుషుల హాకీ జట్టు ఆసియా క్రీడల్లో చరిత్రకెక్కే విజయాన్ని సాధించింది. బుధవారం జరిగిన పూల్ ‘బి’ లీగ్ మ్యాచ్‌లో భారత్ 26–0తో హాంకాంగ్‌పై భారీ ఏకపక్ష విజయాన్ని నమోదు చేసింది. దీంతో 86 ఏళ్ల క్రితం లాస్ ఏంజిల్స్ ఒలింపిక్స్ (1932)లో దివంగత దిగ్గజం ధ్యాన్‌చంద్ జట్టు 24–1తో అమెరికాపై సాధించిన రికార్డు కనుమరుగైంది. ఆట మొదలైన రెండో నిమిషం నుంచి భారత్ విజృంభణ మొదలైంది. ఆకాశ్‌దీప్ సింగ్‌తో మొదలైన శుభారంభం మరో నిమిషంలో మూడింతలైంది. రూపిందర్‌పాల్ సింగ్, మన్‌ప్రీత్ సింగ్ ఇద్దరు మూడో నిమిషంలో చెరో గోల్ చేశారు. ఇక ఇక్కడి నుంచి మొదలైన గోల్స్ సునామీ ఆట ఆఖరి నిమిషం దాకా సాగిందంటే అతిశయోక్తికాదు. ఒకరో ఇద్దరో కాదు ఏకంగా 13 మంది భారత క్రీడాకారులు గోల్స్ చేశారు. వీరిలో ముగ్గురు ఆటగాళ్లు రూపిందర్‌పాల్ (3, 5, 30, 45, 59వ నిమిషాల్లో), హర్మన్‌ప్రీత్ సింగ్ (29, 52, 53, 54వ ని.), ఆకాశ్‌దీప్ సింగ్ (2, 32, 35వ ని.) హ్యాట్రిక్ గోల్స్ చేయడం విశేషం. మన్‌ప్రీత్ సింగ్ (3, 17వ ని.), లలిత్ ఉపాధ్యాయ్ (17, 19వ ని.), వరుణ్ కుమార్ (23, 30వ ని.) తలా రెండు గోల్స్ సాధించారు. సునీల్ (7వ ని.), వివేక్ సాగర్ (14వ ని.), మన్దీప్ సింగ్ (21వ ని.), అమిత్ రొహిదాస్ (27వ ని.), దిల్‌ప్రీత్ సింగ్ (48వ ని.), చింగ్లేసనా సింగ్ (51వ ని.), సిమ్రాన్‌జీత్ సింగ్ (53వ ని.), సురేందర్ కుమార్ (55వ ని.) తలా ఒక గోల్ చేశారు. మ్యాచ్‌లో ఏ నిమిషం కూడా ప్రపంచ ఐదో ర్యాంకర్ భారత్‌ను 45వ ర్యాంకులో ఉన్న హాంకాంగ్ నిలువరించలేకపోయింది. అయితే హాకీలో ఇదే అతిపెద్ద విజయం మాత్రం కాదు. 1994లో న్యూజిలాండ్ 36–1 గోల్స్‌తో సమోవాపై గెలిచిన రికార్డు పదిలంగా ఉంది. శుక్రవారం జరిగే తదుపరి లీగ్‌లో జపాన్ను భారత్ ఎదుర్కొంటుంది. అర్ధభాగానికే నాకర్థమైంది... ఆట అర్ధభాగానికే ఈ మ్యాచ్‌లో భారత్ రికార్డు సృష్టిస్తుందని తనకు అర్థమైందని చీఫ్ కోచ్ హరేంద్ర సింగ్ చెప్పారు. ‘నాకు కొత్త చరిత్ర కళ్లముందే కదలాడింది. విరామ సమయంలో ఘన చరిత్రకు కదంతొక్కండి అని కుర్రాళ్లకు చెప్పాను. పుటల్లో మీ పేరు ఎక్కాల్సిందేనని అన్నాను. నాకైతే ఇది గొప్ప కాకపోయినా... కుర్రాళ్లు మాత్రం గర్వపడేలా ఆడారు’ అని కోచ్ ఆటగాళ్లపై ప్రశంసలు కురిపించాడు. ►1 భారత్ హాకీలో ఇదే అతిపెద్ద విజయం ►2 సగటున ప్రతీ రెండున్నర నిమిషాలకు ఓ గోల్ నమోదైంది. ►3 ముగ్గురు భారత ఆటగాళ్లు ‘హ్యాట్రిక్’ను మించారు. రూపిందర్ 5, హర్మన్‌ప్రీత్ 4, ఆకాశ్ దీప్ 3 గోల్స్ చేశారు. ►13 ఏకంగా 13 మంది భారత ఆటగాళ్లు స్కోరు చేశారు. -
బుల్లేట్ దిగింది
ఆసియా క్రీడల్లో భారత బుల్లెట్ మరోసారి లక్ష్యంలోకి దిగింది. ఈసారీ స్వర్ణాన్ని కొల్లగొట్టింది. అభిమానులందరినీ సంబరంలో ముంచెత్తింది. మంగళవారం 16 ఏళ్ల సౌరభ్ చౌధరీ 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్లో ఆఖరి రెండు షాట్లలో స్వర్ణాన్ని సొంతం చేసుకోగా... బుధవారం 27 ఏళ్ల రాహీ సర్నోబాత్ 25 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో రెండు ‘షూట్ ఆఫ్’లలో పసిడి పతకాన్ని ఖాయం చేసుకుంది. 2014 గ్లాస్గో కామన్వెల్త్ గేమ్స్‌లో స్వర్ణం సాధించాక ఫామ్ కోల్పోవడం... 2016లో మోచేతి గాయంతో ఏడాదిపాటు ఆటకు దూరం కావడం... ఇటీవల 16 ఏళ్ల మనూ భాకర్ పతకాల పంట పండిస్తుండటం... ఈ నేపథ్యంలో తీవ్ర ఒత్తిడిలో బరిలోకి దిగిన రాహీ ఒకే ఒక్క ప్రదర్శనతో చరిత్రకెక్కింది. ఆసియా క్రీడల్లో స్వర్ణ పతకం సాధించిన తొలి భారతీయ మహిళా షూటర్‌గా ఘనత వహించింది. మరోవైపు వుషు క్రీడాంశంలో నలుగురు భారత క్రీడాకారులు సెమీస్‌లో ఓడిపోవడంతో నాలుగు కాంస్యాలు లభించాయి. ఓవరాల్‌గా పోటీల నాలుగో రోజు భారత్‌కు స్వర్ణం, నాలుగు కాంస్యాలతో కలిపి ఐదు పతకాలు వచ్చాయి. పతకాల పట్టికలో ప్రస్తుతం భారత్ 4 స్వర్ణాలు, 3 రజతాలు, 8 కాంస్యాలతో కలిపి 15 పతకాలతో ఏడో స్థానంలో ఉంది. పాలెంబాంగ్: చివరి షాట్ వరకు ఉత్కంఠ రేపిన ఫైనల్లో భారత షూటర్ రాహీ సర్నోబాత్ పైచేయి సాధించింది. తన కెరీర్లోనే గొప్ప విజయాన్ని నమోదు చేసింది. ఆసియా క్రీడల్లో భాగంగా బుధవారం జరిగిన మహిళల 25 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో మహారాష్ట్రలోని కొల్హాపూర్‌కు చెందిన రాహీ సర్నోబాత్ విజేతగా నిలిచి భారత్‌కు స్వర్ణ పతకాన్ని అందించింది. ఈ క్రమంలో ఆసియా క్రీడల చరిత్రలో పసిడి పతకం నెగ్గిన తొలి భారతీయ మహిళా షూటర్‌గా, ఓవరాల్‌గా ఆరో షూటర్‌గా గుర్తింపు పొందింది. షూట్ ఆఫ్‌లో సూపర్... మొత్తం ఎనిమిది మంది పాల్గొన్న ఫైనల్లో ఐదు షాట్లతో కూడిన 10 సిరీస్‌లు ముగిశాక రాహీ, నఫాస్వన్ యాంగ్‌పైబూన్ (థాయ్‌లాండ్) 34 పాయింట్లతో సమఉజ్జీగా నిలిచారు. దాంతో విజేతను నిర్ణయించేందుకు ‘షూట్ ఆఫ్’ అవకాశం ఇచ్చారు. ఇందులో ఇద్దరూ నాలుగేసి పాయింట్లు చేయడం... స్కోరు సమం కావడంతో... మరో ‘షూట్ ఆఫ్’ అనివార్యమైంది. ఈసారి రాహీ 3 పాయింట్లు స్కోరు చేయగా... నఫాస్వన్ 2 పాయింట్లే సాధించడంతో భారత షూటర్‌కు స్వర్ణం లభించింది. నఫాస్వన్ ఖాతాలో రజతం చేరింది. 29 పాయింట్లతో కిమ్ మిన్‌జుంగ్ (దక్షిణ కొరియా) కాంస్య పతకాన్ని దక్కించుకుంది. ఫైనల్లో పోటీపడిన భారత యువ సంచలనం, 16 ఏళ్ల మనూ భాకర్‌కు నిరాశ ఎదురైంది. ఆమె 16 పాయింట్లు స్కోరు చేసి ఆరో స్థానంతో సరిపెట్టుకుంది. 32 మంది షూటర్లు పాల్గొన్న క్వాలిఫయింగ్‌లో మనూ 593 పాయింట్లు సాధించి అగ్రస్థానాన్ని పొందగా... రాహీ సర్నోబాత్ 580 పాయింట్లతో ఏడో స్థానంలో నిలిచింది. టాప్–8లో నిలిచిన వారు ఫైనల్‌కు అర్హత సాధించారు. 50 మీటర్ల రైఫిల్ త్రీ పొజిషన్ విభాగంలో భారత షూటర్లు అంజుమ్, గాయత్రి ఫైనల్‌కు అర్హత పొందలేకపోయారు. స్వర్ణం నెగ్గిన రాహీకి రూ. 50 లక్షల నగదు పురస్కారాన్ని మహారాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. 2014 కామన్వెల్త్ గేమ్స్‌లో పసిడి పతకం నెగ్గిన తర్వాత రాహీకి రాష్ట్ర ప్రభుత్వం పుణేలో డిప్యూటీ కలెక్టర్‌గా ఉద్యోగం ఇచ్చింది. షూటింగే నా జీవితం. పది నెలల క్రితం వ్యక్తిగత కోచ్‌గా వచ్చిన ముంక్బాయెర్ డార్జ్సురేన్ నా టెక్నిక్‌లో కొన్ని మార్పులు చేసింది. ఆ మార్పులు ఫలితాన్ని ఇచ్చాయి. ఖాళీగా ఉంటే పుస్తకాలు చదువుతాను. నా తదుపరి లక్ష్యం ప్రపంచ చాంపియన్‌షిప్. వచ్చే నెలలో కొరియాలోని చాంగ్‌వన్‌లో ఈ మెగా ఈవెంట్ మొదలవుతుంది. 2013లో ఇదే వేదికపై ప్రపంచకప్‌లో స్వర్ణం గెలిచాను. ఈసారీ ఆ వేదిక నాకు కలిసొస్తుందని ఆశిస్తున్నాను. –రాహీ సర్నోబాత్ నలుగురికీ కాంస్యాలే... వుషు క్రీడాంశంలో భారత్‌కు నాలుగు కాంస్యాలు లభించాయి. ఈ క్రీడల చరిత్రలో భారత్‌కిదే అత్యుత్తమ ప్రదర్శన. పురుషుల ‘సాండా’ ఈవెంట్లో బరిలోకి దిగిన నరేందర్ గ్రెవాల్ (65 కేజీలు)... సంతోష్ కుమార్ (56 కేజీలు)... సూర్యభాను ప్రతాప్ సింగ్ (60 కేజీలు)... మహిళల ‘సాండా’ ఈవెంట్లో రోషిబినా దేవి (60 కేజీలు) సెమీఫైనల్లో ఓడిపోయి కాంస్య పతకాలు సాధించారు. సెమీఫైనల్స్‌లో నరేందర్ 0–2తో ఫరూద్ జఫారీ (ఇరాన్) చేతిలో, సంతోష్ 0–2తో ట్రువోంగ్ గియాంగ్ (వియత్నాం) చేతిలో, సూర్యభాను 0–2తో ఇర్ఫాన్ (ఇరాన్) చేతిలో, రోషిబినా 0–1తో కాయ్ యింగ్యింగ్ (చైనా) చేతిలో ఓటమి చవిచూశారు. -
నెవర్ స్టాప్
వినేష్ పోగత్. రెజ్లింగ్‌లో కామన్వెల్త్, ఏషియన్ గేమ్స్ రెండింట్లో గోల్డ్ మెడల్ తెచ్చుకున్న ఒకే ఒక్క రెజ్లర్. వినేష్ పెదనాన్న పేరున్న రెజ్లర్ మహవీర్ సింగ్ పోగత్. ఆయన తన నలుగురు కూతుళ్లతో పాటు తన తమ్ముడి కూతుళ్లయిన ప్రియాంక, వినేష్లకూ కలిపి ఇంట్లోనే రెజ్లింగ్‌లో తిరుగులేని ట్రైనింగ్ ఇచ్చారు. ఆయన కథను ‘దంగల్’ పేరుతో బాలీవుడ్ సినిమాగా కూడా తీసింది. ఇప్పుడు ఈ ఆరుగురూ పెద్ద రెజ్లర్స్. గీతా, బబితా, వినేష్ ఇప్పటికే కామన్వెల్త్లో గోల్డ్ మెడల్స్ సాధిస్తే, వీళ్లలో వినేష్ తాజాగా ఏషియన్ గేమ్స్‌లో గోల్డ్ సాధించారు. ఇది ఇండియన్ వుమన్ రెజ్లింగ్ చరిత్రలోనే రికార్డు. ఈ అవార్డు అందుకున్న వినేష్, తన ఆనందాన్ని తెలుపుతూ, ‘ఏషియన్ గేమ్స్‌లో గోల్డ్ అందుకోవడం అద్భుతంగా ఉంది. ఈ మెడల్ ఇండియాది. అన్ని సందర్భాల్లో నా వెన్నంటి ఉన్న వాళ్లందరికీ ఈ సందర్భంగా కృతజ్ఞతలు. ఒక్కటి చెప్పాలనుకుంటున్నా. ఇది ప్రారంభం మాత్రమే. ఏ సక్సెస్తోనూ ఎప్పుడూ ఆగిపోవద్దు. నెవర్ స్టాప్.’ అంటున్నారు వినేష్! -
ఏషియన్ గేమ్స్: అదరగొట్టిన భారత హాకీ జట్టు
జకర్తా: ఆసియా క్రీడల్లో భారత పురుషుల హాకీ జట్టు అదరగొట్టింది. ఏకంగా 26 గోల్స్ చేసి ప్రత్యర్థి జట్టును చిత్తు చేసింది. బుధవారం గ్రూపు రౌండ్ మ్యాచ్‌లో భారత్26-0తేడాతో హాంకాంగ్‌పై ఘనవిజయం సాధించింది. భారత ఆటగాళ్లు పోటీపడి గోల్స్ చేస్తుంటే అనుభవంలేని ప్రత్యర్థి జట్టు చూస్తూ ఉండిపోయింది. ఆట ప్రారంభమైన ఐదు నిమిషాల్లోనే టీమిండియా ఆటగాళ్లు నాలుగు గోల్స్ చేశారు. ఇక ప్రథమార్థం ముగిసే సరికి భారత ఆటగాళ్లు 14 గోల్స్ నమోదు చేయడం విశేషం. ఆట ప్రారంభం నుంచి దూకుడుగా కనిపించిన భారత్ చివరి వరకు ఆదే ప్రదర్శన కొనసాగించింది. భారత ఆటగాళ్లలో అక్షదీప్, రూపిందర్, లలిత్ చెరో మూడు గోల్స్‌తో చెలరేగగా.. హర్మన్ ప్రీత్ అత్యధికంగా 4 గోల్స్ సాధించాడు. ప్రతిష్టాత్మకమైన ఈవెంట్లలో భారత్‌కు ఇదే అతి పెద్ద విజయం. 1932లో ధ్యాన్‌చంద్ నాయకత్వంలోని భారత జట్టు అమెరికాను 24-1 తేడాతో చిత్తుచేసింది. తాజాగా ఆసియా క్రీడల్లో భారత జట్టు ఆ రికార్డును తిరగరాసింది. ఇక తొలి మ్యాచ్‌లో కూడా భారత్17-0తో ఇండోనేషియాపై ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. FT| The Indian Men's Hockey Team score 26 goals against Hong Kong China in their third game of the @asiangames2018 which saw 4 players claim hat-tricks and a sublime team effort to achieve the large score-line on 22nd August 2018.#IndiaKaGame #AsianGames2018 #INDvHKG pic.twitter.com/UiqYtgzbsq — Hockey India (@TheHockeyIndia) 22 August 2018 -
ఏషియన్ గేమ్స్: భారత్ ఖాతాలో మరో నాలుగు
జకర్తా: ఆసియా క్రీడల్లో భారత క్రీడాకారులు పోటీపడి పతకాలు సాధిస్తున్నారు. ఏషియన్ క్రీడల్లో భాగంగా నాలుగో రోజు వుషు సాండా విభాగంలోనే భారత ఆటగాళ్లు నాలుగు పతకాలు సాధించారు. బుధవారం సాయంత్రం జరిగిన ఈ పోటీల్లో మహిళల వుషు సాండా 60 కేజీల విభాగంలో రోష్బినా దేవి కాంస్య పతకం గెలుచుకున్నారు. పురుషుల సాండా 56 కేజీల విభాగంలో సంతోష్ కుమార్ కాంస్య పతకం గెలుపొందారు. ఇదే ఈవెంట్లో 60 కేజీల విభాగంలో సూర్య భాను ప్రతాప్ సింగ్ సెమీఫైనల్లో ఆఫ్గనిస్తాన్ ఆటగాడు ఇర్ఫాన్ చేతిలో ఓడిపోయి కాంస్య పతకంతో సరిపెట్టుకున్నాడు. పురుషుల సాండా 65 కేజీల విభాగంలో నరేంద్ర కూడా కాంస్య పతకంతో సరిపెట్టుకున్నాడు. ఇక సెపక్‌తక్రాలో భారత్ తొలి పతకం సాధించింది. థాయ్‌లాండ్‌తో జరిగిన సెమీఫైనల్లో 0-2తో భారత జట్టు ఓటమి చవిచూసింది. 1990 ఏషియాడ్‌లో ఈ క్రీడను ప్రవేశపెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు భారత్‌కు పతకం దక్కలేదు. మరోవైపు మహిళల 25 మీటర్ల పిస్టల్ ఈవెంట్లో షూటర్ రహీ జీవన్ సర్నోబత్ పసిడి గెలుచుకున్న విషయం తెలిసిందే. దీంతో ఇప్పటివరకు భారత్ ఖాతాలో నాలుగు స్వర్ణాలు, మూడు రజతాలు, ఎనిమిది కాంస్యపతకాలు చేరాయి. -
ఏషియన్ గేమ్స్-2018 : టెన్నిస్ సెమీస్‌లో అంకితా రైనా
సాక్షి, న్యూఢిల్లీ: అద్భుత ప్రదర్శనలతో దూసుకెళ్తున్న టెన్నిస్ స్టార్ అంకిత రైనా భారత్‌కు మరో పతకం అందించేందుకు అడుగు దూరంలో నిలిచారు. ఏషియన్ గేమ్స్-2018లో భాగంగా బుధవారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో గెలుపొంది సెమీ ఫైనల్లోకి అడుగుపెట్టారు. పాలెంబర్గ్‌లో చైనా ప్లేయర్ యూడిస్ చోంగ్‌తో జరిగిన మ్యాచ్‌లో మొదట తడబాటుకు గురైన అంకిత అనంతరం దూకుడుగా ఆడి 6-4తో మొదటి సెట్లో గెలుపొందారు. రెండో సెట్లో 6-1 తో గెలిచి సెమీఫైనల్లోకి ప్రవేశించారు. ఏషియన్ గేమ్స్-2018లో నాలుగోరోజు భారత్‌కు మరిన్ని పతకాలు వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయి. మహిళల 25 మీటర్ల పిస్టల్ షూటింగ్ పోటీల్లో మనుభాకర్, రాహి సర్నోబట్ ఫైనల్స్‌లోకి దూసుకెళ్లారు. 8 మంది ఫైనలిస్టుల్లో చోటు సంపాధించారు. కాగా, 16 ఏళ్ల మనుభాకర్ 593 పాయింట్లతో టాప్‌లో, రాహి 580 పాయింట్లతో 7వ స్థానంలో నిలిచి ఫైనల్‌కు అర్హత సాధించారు. -
స్వర్ణం 'సౌరభం'...
ఒకవైపు ప్రత్యర్థులుగా మాజీ విశ్వవిజేతలు... మాజీ ఒలింపిక్ చాంపియన్లు... ప్రపంచకప్‌లో పతకాలు గెలిచినవారు.. మరోవైపు నూనుగు మీసాల కుర్రాడు... తన ప్రత్యర్థుల్లో కొందరి అనుభవమంత వయసు కూడా అతనికి లేదు... అసలే జట్టులో అతని ఎంపికపై విమర్శలు... షాట్ షాట్‌కు ఆధిక్యం తారుమారయ్యే పరిస్థితులు... ఇలాంటి స్థితిలో ఆ కుర్రాడు మాత్రం ఒక్కో బుల్లెట్‌ను లక్ష్యంలోకి దించాడు... ఒక్కోషాట్తో దిగ్గజాలను వెనక్కి నెట్టాడు... చివరకు అందర్నీ అబ్బురపరుస్తూ ‘పసిడి’ గురితో భళా అనిపించాడు. తన పిస్టల్‌తోనే అందరికీ సమాధానం ఇచ్చి ఆసియా క్రీడల వేదికపై మువ్వన్నెలను రెపరెపలాడించిన ఆ యువ షూటరే 16 ఏళ్ల సౌరభ్ చౌధరీ. ఉత్తరప్రదేశ్‌లోని మీరట్ జిల్లా కలీనా గ్రామానికి చెందిన సౌరభ్ మంగళవారం ఆసియా క్రీడల్లో అద్భుతమే చేశాడు. హేమాహేమీలు బరిలో నిలిచిన 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో క్వాలిఫయింగ్‌లో ‘టాప్’గా నిలిచి... అదే జోరును ఫైనల్లోనూ కొనసాగించి ఆసియా క్రీడల రికార్డు ప్రదర్శనతో స్వర్ణకాంతులు విరజిమ్మి ఈ క్రీడాంశంలో భారత్‌కు తొలి పసిడి పతకాన్ని అందించాడు. ఓవరాల్‌గా పోటీల నాలుగో రోజు భారత్‌కు స్వర్ణం, రజతం, మూడు కాంస్యాలు లభించాయి. ప్రస్తుతం భారత్ 10 పతకాలతో ఏడో స్థానంలో ఉంది. పాలెంబంగ్: విజయకాంక్ష ఉండాలేగానీ బరిలో ఏస్థాయి వారున్నా అనుకున్న ఫలితాన్ని సాధించవచ్చని భారత యువ పిస్టల్ షూటర్ సౌరభ్ చౌధరీ నిరూపించాడు. ఆసియా క్రీడల్లో భాగంగా మంగళవారం జరిగిన 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్లో 16 ఏళ్ల సౌరభ్ బంగారు పతకాన్ని సాధించాడు. 24 షాట్లతో కూడిన ఫైనల్లో సౌరభ్ 240.7 పాయింట్లు స్కోరు చేసి ఆసియా క్రీడల్లో కొత్త రికార్డు నెలకొల్పడంతోపాటు పసిడి పతకాన్ని కైవసం చేసుకున్నాడు. 2010 ప్రపంచ చాంపియన్, 42 ఏళ్ల తొమోయుకి మత్సుదా (జపాన్–239.7 పాయింట్లు) రజతం నెగ్గగా... భారత్‌కే చెందిన 29 ఏళ్ల అభిషేక్ వర్మ (219.3 పాయింట్లు) కాంస్య పతకాన్ని దక్కించుకున్నాడు. 2012 లండన్ ఒలింపిక్స్ స్వర్ణ పతక విజేత... 2010, 2014 ఆసియా క్రీడల్లో ఈ విభాగంలో టీమ్ ఈవెంట్లో పసిడి పతకాలు నెగ్గిన 38 ఏళ్ల కొరియా దిగ్గజ షూటర్ జిన్ జొంగో ఐదో స్థానంతో... 35 ఏళ్ల కజకిస్తాన్ షూటర్ వ్లాదిమిర్ ఇసాచెంకో ఏడో స్థానంతో సరిపెట్టుకున్నారు. 40 మంది షూటర్లు పాల్గొన్న క్వాలిఫయింగ్‌లో సౌరభ్ అందరికంటే ఎక్కువగా 586 పాయింట్ల స్కోరుతో అగ్రస్థానాన్ని దక్కించుకోవడం విశేషం. న్యాయవాద వృత్తిలో ఉన్న అభిషేక్ వర్మ మూడేళ్ల క్రితమే ఈ క్రీడలో అడుగు పెట్టాడు. ఆసియా క్రీడల్లో పాల్గొన్న తొలి ప్రయత్నంలోనే కాంస్యాన్ని దక్కించుకున్నాడు. మిక్స్డ్ ట్రాప్ ఈవెంట్లో ఫైనల్‌కు అర్హత సాధించిన భారత జంట లక్షయ్ షెరాన్, శ్రేయసి సింగ్ ఆరో స్థానంతో సరిపెట్టుకుంది. ఒక్క షాట్‌తో తారుమారు... ఫైనల్లో చివరి సిరీస్‌లోని రెండు షాట్లే సౌరభ్‌కు స్వర్ణాన్ని ఖాయం చేశాయి. 22 షాట్లు పూర్తయ్యాక మత్సుదా 220.4 పాయింట్లతో అగ్రస్థానంలో... సౌరభ్ 220.1 పాయింట్లతో రెండో స్థానంలో ఉన్నారు. 23వ షాట్లో మత్సుదా 8.9 స్కోరు చేయగా... సౌరభ్ 10.2 కొట్టాడు. దాంతో సౌరభ్ 230.3తో తొలి స్థానంలోకి రాగా... మత్సుదా 229.3తో రెండో స్థానానికి పడిపోయాడు. చివరి షాట్లో మత్సుదా 10.3 కొట్టగా... సౌరభ్ 10.4 స్కోరు చేశాడు. దాంతో సౌరభ్ పాయింట్ తేడాతో పసిడి సొంతం చేసుకోగా.. మత్సుదా రజతంతో సరిపెట్టుకున్నాడు. మూడేళ్లలో పైపైకి... సరదా కోసం 2015లో షూటింగ్ క్రీడలో అడుగుపెట్టిన సౌరభ్ ఏడాది తిరిగేలోపు ఆసియా జూనియర్ చాంపియన్‌షిప్‌లో పోటీపడి రజతం సాధించాడు. ఆ తర్వాతి సంవత్సరం ఆసియా యూత్ చాంపియన్‌షిప్‌లో స్వర్ణం గెలిచాడు. ఈ ఏడాది జూన్‌లో జర్మనీలో జరిగిన జూనియర్ ప్రపంచకప్‌లో ప్రపంచ రికార్డు నెలకొల్పి బంగారు పతకాన్ని సాధించాడు. పోటీలు లేని సమయంలో మీరట్‌లోని అమిత్ షెరాన్ అకాడమీలో... జాతీయ శిబిరాల సమయంలో భారత దిగ్గజ షూటర్ జస్పాల్ రాణా పర్యవేక్షణలో సౌరభ్ శిక్షణ తీసుకుంటాడు. సౌరభ్ తండ్రి జగ్మోహన్ సింగ్ చెరకు రైతు. ఖాళీగా ఉన్న సమయంలో సౌరభ్ పొలం పనుల్లో తండ్రికి చేదోడు వాదోడుగా ఉంటాడు. ‘నేను ఎలాంటి ఒత్తిడికి లోను కాలేదు. ఒత్తిడితో ఎలాంటి ఉపయోగం కూడా లేదు. నా తదుపరి లక్ష్యం ప్రపంచ చాంపియన్‌షిప్‌లో పతకం సాధించి 2020 టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత సాధించడం’ అని సౌరభ్ అన్నాడు. ►ఆసియా క్రీడల చరిత్రలో వ్యక్తిగత విభాగంలో స్వర్ణ పతకం నెగ్గిన ఐదో భారతీయ షూటర్ సౌరభ్. గతంలో రణ్‌ధీర్ సింగ్ (1978), జస్పాల్ రాణా (1994, 2006), రంజన్ సోధి (2010), జీతూ రాయ్ (2014) ఈ ఘనత సాధించారు. సెకనులో వందో వంతు తేడాతో... పురుషుల 50 మీటర్ల ఫ్రీస్టయిల్ ఈవెంట్లో భారత స్విమ్మర్ వీర్‌ధవల్ ఖడేను దురదృష్టం వెంటాడింది. కేవలం సెకనులో వందో వంతు తేడాతో అతడు కాంస్యం చేజార్చుకున్నాడు. ఫైనల్లో ఖడే 22.47 సెకన్ల టైమింగ్ నమోదు చేశాడు. అయితే, జపాన్‌కు చెందిన షునిచి నకావ్ (22.46)... అతడి కంటే .01 సెకన్ల ముందే లక్ష్యాన్ని చేరుకుని కాంస్య పతకం ఎగురేసుకుపోయాడు. పతకం కోల్పోయినా, 26 ఏళ్ల ఖడే ఎనిమిదేళ్లుగా తన పేరిటే ఉన్న జాతీయ రికార్డు (22.52 సెకన్లు)ను సవరించాడు. ఇదే విభాగంలో అన్షుల్ కొఠారి (23.83 సెకన్లు)... 28వ స్థానంలో నిలిచి ఫైనల్‌కు అర్హత సాధించలేకపోయాడు. ఉద్యోగం వస్తుందని ఆశ... పురుషుల 50 మీటర్ల రైఫిల్ త్రీ పొజిషన్ విభాగంలో భారత సీనియర్ షూటర్ సంజీవ్ రాజ్‌పుత్ తొలిసారి ఆసియా క్రీడల్లో వ్యక్తిగత పతకం సాధించాడు. ఫైనల్లో 37 ఏళ్ల సంజీవ్ 452.7 పాయింట్లు స్కోరు చేసి రెండో స్థానంలో నిలిచి రజత పతకం గెలిచాడు. 18 ఏళ్లకే ఇండియన్ నేవీలో ఉద్యోగం పొందిన సంజీవ్ 2014లో హరియాణా ప్రభుత్వం ఉద్యోగం ఇస్తామని హామీ ఇవ్వడంతో అతను నేవీ ఆఫీసర్ ఉద్యోగానికి రాజీనామా చేశాడు. అయితే రాష్ట్రంలో ప్రభుత్వం మారడంతో సంజీవ్‌కు ఇచ్చిన హామీ నెరవేరలేదు. రెండేళ్లు ఖాళీగా ఉన్న అతను 2016లో స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (సాయ్)లో కోచ్‌గా విధుల్లోకి చేరాడు. అయితే గతేడాది అతనిపై అత్యాచార ఆరోపణలు రావడంతో ‘సాయ్’ అతడిని ఉద్యోగంలో నుంచి తొలగించింది. ‘తాజా ప్రదర్శనతో మళ్లీ నాకు ఉద్యోగం వస్తుందని ఆశిస్తున్నాను. 2020 టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత సాధించడమే నా తర్వాతి లక్ష్యం’ అని సంజీవ్ అన్నాడు. సెపక్‌తక్రాలో తొలిసారి కాంస్యం... 1990 నుంచి ఆసియా క్రీడల్లో మెడల్ ఈవెంట్‌గా ఉన్న సెపక్‌తక్రాలో తొలిసారి భారత్ కాంస్య పతకం సాధించింది. పటిష్టమైన థాయ్‌లాండ్ జట్టుతో మంగళవారం జరిగిన రెగూ ఈవెంట్ సెమీఫైనల్లో భారత్ 0–2తో ఓడిపోయి కాంస్యం ఖాయం చేసుకుంది. 2006లో తొలిసారి ఈ క్రీడలో పోటీపడిన భారత్ నాలుగో ప్రయత్నంలో పతకం నెగ్గడం విశేషం. భారత్ 21 – 0 కజకిస్తాన్ మహిళల హాకీలో భారత జట్టు వరుసగా రెండో విజయం నమోదు చేసింది. కజకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత అమ్మాయిలు గోల్స్ వర్షం కురిపించారు. పూల్ ‘బి’లో భాగంగా మంగళవారం జరిగిన ఈ మ్యాచ్‌లో టీమిండియా 21–0 తేడాతో ప్రత్యర్థిని చిత్తు చేసింది. భారత్ తరఫున నవనీత్ కౌర్ ఐదు, గుర్జీత్ కౌర్ నాలుగు, లల్రెమ్సియామి, వందనా కటారియా మూడేసి గోల్స్ కొట్టారు. భారత్ మరొక్క గోల్ చేసి ఉంటే... 1982 ఆసియా క్రీడల్లో హాంకాంగ్‌పై భారత్ సాధించిన 22–0 రికార్డు స్కోరును అందుకునేది. దివ్య పట్టుకు కాంస్యం రెజ్లింగ్‌లో భారత్‌కు మరోపతకం వచ్చింది. మహిళల ఫ్రీస్టయిల్ 68 కేజీల విభాగంలో దివ్య కక్రాన్ కాంస్య పతకాన్ని సాధించింది. చెన్ వెన్లింగ్ (చైనీస్ తైపీ)తో జరిగిన కాంస్య పతక బౌట్లో దివ్య ఒక నిమిషం 29 సెకన్లలో విజయాన్ని అందుకుంది. మరోవైపు 76 కేజీల విభాగంలో కిరణ్ క్వార్టర్ ఫైనల్లో 2–4తో ఐపెరి మెడిట్కిజి (కిర్గిస్తాన్) చేతిలో ఓడిపోయింది. పురుషుల గ్రీకో రోమన్ స్టయిల్ రెజ్లింగ్‌లో భారత్‌కు చెందిన జ్ఞానేందర్ (60 కేజీలు)... మనీశ్ (67 కేజీలు) క్వార్టర్ ఫైనల్లో పరాజయం చవిచూశారు. వాల్ట్ ఫైనల్లో అరుణా రెడ్డి మహిళల జిమ్నాస్టిక్స్‌లో భారత క్రీడాకారిణులు ఆకట్టుకున్నారు. వాల్ట్‌లో ప్రణతి నాయక్ (13.425), హైదరాబాద్ అమ్మాయి అరుణారెడ్డి (13.350)లు ఆరు, ఏడు స్థానాల్లో నిలిచి ఫైనల్ రౌండ్‌కు వెళ్లారు. స్టార్ జిమ్నాస్ట్ దీపా కర్మాకర్‌కు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. వాల్ట్ విభాగంలో ఫైనల్‌కు అర్హత సాధించలేకపోయిన ఆమె...బీమ్‌లో మాత్రం ముందడుగేసింది. టీమ్ విభాగంలో దీపా, ప్రణతి, అరుణ, ప్రణతి దాస్లతో కూడిన భారత బృందం ఏడో స్థానంలో నిలిచింది. బుధవారం టీమ్ విభాగంలో ఫైనల్స్ ను నిర్వహిస్తారు. సెమీస్‌లో కబడ్డీ జట్లు కీలకమైన విజయాలతో భారత కబడ్డీ జట్లు సెమీఫైనల్లోకి ప్రవేశించాయి. గ్రూప్ ‘ఎ’ చివరి మ్యాచ్‌లో పురుషుల జట్టు 49–30తో థాయ్‌లాండ్‌ను ఓడించింది. గ్రూప్‌లో భారత్... బంగ్లాదేశ్, శ్రీలంకపై గెలిచి, దక్షిణ కొరియా చేతిలో పరాజయం పాలైంది. కొరియా మ్యాచ్‌లు పూర్తయ్యాక.. గ్రూప్ టాపర్ ఎవరో తేలనుంది. మరోవైపు మహిళల జట్టు శ్రీలంకను 38–12తో, ఇండోనేసియాను 54–22తో ఓడించింది. అంతకుముందు జపాన్, థాయ్లాండ్లపైనా విజయం సాధించడంతో గ్రూప్ ‘ఎ’లో అజేయంగా నిలిచినట్లైంది. సెమీఫైనల్స్ గురువారం జరుగనున్నాయి. -
ఆ అమ్మాయి పేరు... ‘ఏషియన్ గేమ్స్’
ఇండోనేసియా జంటకు ఓ అమ్మాయి జన్మించింది. అది కూడా సరిగ్గా ఆసియా క్రీడలు మొదలైన 18వ తేదీనే కావడం విశేషం. ప్రసవ తేది సెప్టెంబర్‌లో ఉండగా ఓ నెల ముందే కలిగిన ఆ సంతానానికి గేమ్స్ పేరే పెట్టారు. ఇండోనేసియాకు చెందిన యొర్డానియా, వెరనొవా డెని దంపతులు. వీరికి ఇదివరకే ముగ్గురు పిల్లలున్నారు. గర్భంతో ఉన్న యొర్డానియాకు వచ్చే నెల డెలివరీ డేట్ ఇచ్చారు వైద్యులు. ఆశ్చర్యంగా ఆమె 18న ఓ పండంటి ఆడశిశువుకు జన్మనిచ్చింది. దీంతో తల్లిదండ్రులు మెగా ఈవెంట్‌ను పురస్కరించుకొని ఆ చిన్నారికి ‘అబిదా ఏషియన్ గేమ్స్’ అని పేరు పెట్టారు. అంతేకాదు... తన కుమార్తెను ప్రొఫెషనల్ అథ్లెట్‌గా చేస్తానని వెరనొవా డెని చెప్పారు. ‘ఈ పేరు మా పాప భవిష్యత్తుకు ఉపయోగపడుతుంది. తనలో ప్రతిభవుంటే తప్పుకుండా అథ్లెట్‌ను చేస్తా’ అని అన్నారు. -
ఏషియాడ్‌లో నేటి భారతీయం
జిమ్నాస్టిక్స్: మహిళల టీమ్ ఫైనల్ (సా.గం.5 నుంచి) పురుషుల హాకీ: భారత్(vs)హాంకాంగ్ (మ.గం. 12.30 నుంచి) షూటింగ్: మహిళలు: అంజుమ్, గాయత్రి (50 మీ. రైఫిల్ త్రీ పొజిషన్ క్వాలిఫయింగ్; ఉ.గం. 8 నుంచి, ఫైనల్స్ ఉ.గం. 11.30 నుంచి) మను భాకర్, రాహీ సర్నోబాత్ (25 మీ. పిస్టల్ క్వాలిఫయింగ్; ఉ.గం. 8 నుంచి, ఫైనల్స్ ఉ.గం. 11.30 నుంచి) పురుషుల గ్రీకో రోమన్ రెజ్లింగ్: గుర్ప్రీత్ సింగ్ (77 కేజీలు), హర్‌ప్రీత్ సింగ్ (87 కేజీలు), హర్దీప్ (97 కేజీలు), నవీన్ (130 కేజీలు) (మధ్యాహ్నం గం. 12 నుంచి). సోనీ టెన్–2, సోనీ ఈఎస్‌పీఎన్‌లలో ప్రత్యక్ష ప్రసారం -
సెపక్‌తక్రాలో కాంస్యంతో సరి
జకార్తా: ఏషియన్ గేమ్స్ 2018లో భాగంగా సెపక్తక్రా పురుషుల ఈవెంట్లో భారత జట్టు కాంస్యంతో సరిపెట్టుకుంది. మంగళవారం థాయ్‌లాండ్‌తో జరిగిన సెమీ ఫైనల్ పోరులో భారత్ జట్టు ఓటమి పాలైంది. ఈ పోరులో ఏమాత్రం పోటీ ఇవ్వలేని భారత్ 0-2 తేడాతో పరాజయం చెందింది. ఫలితంగా కాంస్యాన్ని మాత్రమే దక్కించుకోగల్గింది. ఇది ఓవరాల్ ఏషియన్ గేమ్స్ లో భారత్‌కు తొలి సెపక్తక్రా పతకం కావడం విశేషం. దాంతో ఇప్పటివరకూ భారత్ సాధించిన పతకాల సంఖ్య 9కి చేరింది. భారత్ ఖాతాలో మూడు స్వర్ణాలు, మూడు రజతాలు, మూడు కాంస్య పతకాలు ఉన్నాయి. చదవండి: ‘రజత’ రాజ్‌పుత్ పరిమళించిన యువ ‘సౌరభం’ -
ఏషియన్ గేమ్స్ భారత షూటర్ల హవా
-
ఏషియన్ గేమ్స్: ‘రజత’ రాజ్‌పుత్
జకార్తా: ఏషియన్ గేమ్స్ 2018లో భాగంగా భారత్ ఖాతాలో మరో పతకం చేరింది. భారత స్టార్ షూటర్ సంజీవ్ రాజ్‌పుత్ రజత పతకాన్ని సాధించాడు. మంగళవారం జరిగిన పురుషుల 50 మీటర్ల త్రీ పొజిషన్ ఫైనల్లో రాజ్‌పుత్ ఆద్యంతం ఆకట్టుకుని రజతాన్ని ఖాయం చేసుకున్నాడు. మొత్తంగా 452. 7 పాయింట్ల స్కోరు సాధించి రెండో స్థానంలో నిలిచాడు. దాంతో ఇప్పటివరకూ భారత్ సాధించిన పతకాల సంఖ్య ఎనిమిదికి చేరుకుంది. ఇందులో మూడు స్వర్ణాలు, మూడు రజతాలు, రెండు కాంస్యాలు ఉన్నాయి. అంతకుముందు ఈ రోజు క్రీడల్లో సౌరభ్ చౌదరి స్వర్ణ పతకాన్ని సాధించాడు. పురుషుల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్లో భాగంగా ఫైనల్ పోరులో సౌరభ్ చౌదరి 240.7 పాయింట్లు సాధించి పసిడిని ఖాతాలో వేసుకున్నాడు. ఇదే విభాగంలో మరో భారత షూటర్ అభిషేక్ వర్మ కాంస్య పతకాన్ని సాధించాడు. మొత్తంగా 219.3 పాయింట్ల స్కోరు సాధించి కాంస్యాన్ని దక్కించుకున్నాడు. చదవండి: పరిమళించిన యువ ‘సౌరభం’ -
ఆసియా క్రీడల్లో భారత్‌కు డబుల్ ధమాకా
-
ఏషియన్ గేమ్స్: పరిమళించిన యువ ‘సౌరభం’
జకార్తా: ఏషియన్ గేమ్స్ 2018లో భారత క్రీడాకారుల హవా కొనసాగుతోంది. తొలి రోజు మెన్స్ విభాగంలో రెజ్లర్ బజరంగ్ పూనియా స్వర్ణం సాధిస్తే, రెండో రోజు వుమెన్స్ విభాగంలో రెజ్లర్ వినేశ్ ఫొగాట్ పసిడితో మెరిశారు. ఇక మూడో రోజు భారత యువ షూటర్ సౌరభ్ చౌదరి స్వర్ణ పతకాన్ని సాధించారు. మంగళవారం పురుషుల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్లో భాగంగా ఫైనల్ పోరులో సౌరభ్ చౌదరి 240.7 పాయింట్లు సాధించి పసిడిని ఖాతాలో వేసుకున్నారు. తొలి రౌండ్ నుంచే ఆకట్టుకున్న 16 ఏళ్ల సౌరభ్.. ఏషియన్ గేమ్స్‌లో 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో రికార్డు స్కోరు సాధించి స్వర్ణాన్ని ఒడిసి పట్టుకున్నాడు. కాగా, ఇదే విభాగంలో మరో భారత షూటర్ అభిషేక్ వర్మ కాంస్య పతకాన్ని సాధించాడు. మొత్తంగా 219.3 పాయింట్ల స్కోరు సాధించి కాంస్యాన్ని దక్కించుకున్నాడు. ఫలితంగా భారత్ ఖాతాలో ఏడు పతకాలు చేరాయి. ఇందులో మూడు స్వర్ణాలు, రెండు రజతాలు, రెండు క్యాంస్యలు ఉన్నాయి. చదవండి: ‘పసిడి’ కాంత బజరంగ్ బంగారం -
ఏషియాడ్‌లో నేటి భారతీయం
► జిమ్నాస్టిక్స్: దీపా కర్మాకర్, ప్రణతి దాస్, అరుణా రెడ్డి, మందిర, ప్రణతి నాయక్ (క్వాలిఫయింగ్; మ.గం. 2.30 నుంచి). ►కబడ్డీ (మహిళల విభాగం): భారత్(vs) శ్రీలంక, (ఉ.గం. 8 నుంచి); భారత్(vs)ఇండోనేసియా, (ఉ.గం. 11.20 నుంచి); పురుషుల విభాగం: భారత్(vs)థాయ్‌లాండ్ (సా.గం. 4 నుంచి). ►షూటింగ్: అభిషేక్ శర్మ, సౌరభ్ (10 మీటర్ల ఎయిర్ పిస్టల్ క్వాలిఫయింగ్; ఉ.గం. 8 నుంచి; ఫైనల్స్ 9.45 నుంచి). లక్షయ్, శ్రేయసి సింగ్ (ట్రాప్ మిక్స్డ్ టీమ్ ఈవెంట్ క్వాలిఫయింగ్; ఉ.గం. 8.30 నుంచి; ఫైనల్స్ మ.గం. 3 నుంచి). ► రెజ్లింగ్: పురుషుల గ్రీకో రోమన్ స్టయిల్ (జ్ఞానేందర్–60 కేజీలు; మనీశ్–67 కేజీలు); మహిళల ఫ్రీస్టయిల్ (దివ్య కక్రాన్–68 కేజీలు; కిరణ్–72 కేజీలు; మ.గం. 12 నుంచి రాత్రి 7 వరకు). సోనీ టెన్–2, సోనీ ఈఎస్‌పీఎన్‌లలో ప్రత్యక్ష ప్రసారం -
రజతాలు నెగ్గిన షూటర్లు లక్షయ్, దీపక్
పాలెంబాంగ్‌లో భారత షూటర్లు దీపక్ కుమార్ 10 మీటర్ల రైఫిల్ ఈవెంట్లో... లక్షయ్ షెరాన్ ట్రాప్ పోటీలో రజత పతకాలు నెగ్గారు. ఈ రెండు ఈవెంట్లలో రవి కుమార్, మానవ్‌జీత్ సింగ్ సంధు నాలుగో స్థానంలో నిలిచి పతకం అవకాశాన్ని కోల్పోయారు. ఓ మెగా ఈవెంట్ పతకాన్వేషణలో దీపక్ కుమార్‌ది సుదీర్ఘ నిరీక్షణ. ఇండోనేసియాలో రజతంతో ఎట్టకేలకు ఈ నిరీక్షణకు తెరపడింది. ఒకట్రెండు కాదు... ఏకంగా 14 ఏళ్లుగా పతకం కోసం శ్రమించాడు. ఈ సారి మాత్రం 33 ఏళ్ల దీపక్ గురితప్పలేదు. సోమవారం జరిగిన పురుషుల 10 మీటర్ల రైఫిల్ పోటీలో అతను 17 షాట్ల వరకు రేసులోనే లేడు. 18వ షాట్ 10.9 పాయింట్లు తెచ్చిపెట్టడంతో అనూహ్యంగా పతకం రేసులోకి వచ్చాడు. 24 షాట్లలో 247.7 స్కోరుతో రెండో స్థానంలో నిలిచి రజతం గెలిచాడు. ఇందులో యంగ్ హరన్ (చైనా; 249.1) స్వర్ణం, లూ షావోచున్ (చైనీస్ తైపీ; 226.8) కాంస్యం నెగ్గారు. రవి కుమార్ (205.2) నాలుగో స్థానం పొందాడు. సంస్కృతంలో నిష్ణాతుడైన దీపక్ పతక విజయంపై ఆధ్యాత్మిక ధోరణిలో స్పందించాడు. ‘ప్రతి ఒక్కరు తమకు దక్కేదానిపై ఆశావహ దృక్పథంతోనే ఉంటారు. నేనూ అంతే... జీవితంలో రాసిపెట్టి ఉంటే అదెప్పుడైనా దక్కుతుంది. అతిగా ఆశించి చింతించాల్సిన పనిలేదు. ఈ విషయాల్ని నేను గురుకుల్ అకాడమీలో పాఠశాల విద్యలోనే నేర్చుకున్నా’ అని దీపక్ అన్నాడు. ఢిల్లీకి చెందిన అతని తల్లిదండ్రులు నగర అలవాట్లకు దూరంగా ఉండాలనే ఉద్దేశంతో దీపక్‌ను డెహ్రాడూన్‌లోని గురుకుల్లో చేర్పించారు. ట్రాప్ ఈవెంట్లో మరో భారత షూటర్ లక్షయ్ 43 పాయింట్లతో రజతం చేజిక్కించుకోగా, వెటరన్ షూటర్, మాజీ ప్రపంచ చాంపియన్ మానవ్‌జీత్ సింగ్ గురి తప్పింది. అతను 26 పాయింట్లతో నాలుగో స్థానంతో సరిపెట్టుకున్నాడు. ఈ ఈవెంట్లో యంగ్ కున్పి (చైనీస్ తైపీ; 48) ప్రపంచ రికార్డును సమం చేసి బంగారు పతకం గెలువగా, డేమియంగ్ అహ్న్ (కొరియా; 30) కాంస్యం నెగ్గాడు. మహిళల విభాగంలో భారత షూటర్లకు నిరాశే ఎదురైంది. 10 మీ. రైఫిల్ ఈవెంట్లో అపూర్వీ చండీలా ఐదో స్థానం, ట్రాప్‌లో సీమ తోమర్ ఆరో స్థానం పొందారు. -
బ్యాడ్మింటన్‌లో భారత్‌కు నిరాశ
భారత మహిళల, పురుషుల బ్యాడ్మింటన్ జట్లు క్వార్టర్ ఫైనల్లో ఓడిపోయి పతకం రేసు నుంచి నిష్క్రమించాయి. భారత మహిళల జట్టు 1–3తో పటిష్టమైన జపాన్ చేతిలో ఓడింది. తొలి మ్యాచ్‌లో సింధు 21–18, 21–19తో రెండో ర్యాంకర్ అకానె యామగుచిపై నెగ్గి 1–0 ఆధిక్యం అందించింది. డబుల్స్‌లో సిక్కిరెడ్డి–ఆర్తి సునిల్ జంట 15–21, 6–21తో యూకి ఫుకుషిమా–సయాకా జోడీ చేతిలో ఓడింది. మూడో మ్యాచ్‌లో సైనా 11–21, 25–23, 16–21తో ఒకుహారా చేతిలో ఓడింది. తప్పక గెలవాల్సిన నాలుగో మ్యాచ్‌లో సింధు–అశ్విని ద్వయం 13–21, 12–21తో అయాక తకహషి–మిసాకి జంట చేతిలో ఓడటంతో భారత పోరాటం ముగిసింది. ఇక భారత పురుషుల జట్టు 1–3తో ఇండోనేసియా చేతిలో ఓటమి పాలైంది. తొలి మ్యాచ్‌లో 8వ ర్యాంకర్ శ్రీకాంత్ 21–23, 22–20, 10–21తో గిన్టింగ్ చేతిలో ఓడాడు. రెండో మ్యాచ్‌లో సాత్విక్æ–చిరాగ్‌శెట్టి జోడీ 21–19, 19–21, 16–21తో సుకాముల్జో–ఫెర్నాల్డీ గిడియోన్ చేతిలో ఓడింది. భారత్ 0–2తో వెనుకబడిన స్థితిలో సింగిల్స్ బరిలో దిగిన ప్రణయ్ 21–15, 19–21, 21–19తో జొనాథన్ క్రిస్టీపై గెలిచి పోటీలో నిలిపినా... మను అత్రి–సుమీత్ రెడ్డి జంట 14–21, 18–21తో ఫజర్–రియాన్ జోడీ చేతిలో ఓడింది. కబడ్డీలో షాక్... డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలో దిగిన భారత పురుషుల కబడ్డీ జట్టుకు షాక్ తగిలింది. గ్రూప్ ‘ఎ’లో భాగంగా సోమవారం భారత్ 23–24తో కొరియా చేతిలో ఖంగుతింది. ఆసియా క్రీడల్లో కబడ్డీని ప్రవేశ పెట్టిన 28 ఏళ్లలో భారత జట్టు ఓ మ్యాచ్‌లో ఓడటం ఇదే తొలి సారి. మహిళల జట్టు 33–23తో థాయ్‌లాండ్‌పై గెలిచింది. సెపక్‌తక్రాలో పతకం ఖాయం... సెపక్‌తక్రాలో భారత్‌కు తొలిసారి పతకం ఖాయమైంది. పురుషుల టీమ్ రెగూ ప్రిలిమినరీ విభాగంలో భారత్ 21–16, 19–21, 21–17తో ఇరాన్‌పై గెలిచి సెమీస్‌కు అర్హత సాధించింది. ప్రాంజల జంట ఓటమి మహిళల టెన్నిస్ డబుల్స్ తొలి రౌండ్లో తెలుగమ్మాయి యడ్లపల్లి ప్రాంజల–రుతుజా భోస్లే జంట 6–3, 4–6, 9–11తో నిచా–ప్లిపుయెచ్ (థాయ్‌లాండ్) ద్వయం చేతిలో పోరాడి ఓడింది. పురుషుల సింగిల్స్‌లో ప్రజ్నేశ్ గుణేశ్వరన్; రామ్‌కుమార్... మహిళల సింగిల్స్‌లో అంకిత రైనా, కర్మన్ కౌర్ ప్రిక్వార్టర్ ఫైనల్ చేరారు. భారత్ 17 – ఇండోనేసియా 0 భారత పురుషుల హాకీ జట్టు తొలి మ్యాచ్‌లో 17–0తో ఆతిథ్య ఇండోనేసియాను చిత్తుచేసింది. భారత్ తరఫున దిల్‌ప్రీత్ సింగ్, సిమ్రన్‌జీత్ సింగ్, మన్దీప్ సింగ్ మూడేసి గోల్స్ చేయగా...రూపిందర్ పాల్ సింగ్ రెండు గోల్స్ చేశాడు. ఆకాశ్‌దీప్ సింగ్, హర్మన్‌ప్రీత్ సింగ్, లలిత్ ఉపాధ్యాయ్, సునీల్, వివేక్ సాగర్ ఒక్కో గోల్ సాధించారు. -
చరిత్ర సృష్టించిన వినేశ్ ఫొగాట్!
భారత పట్టుకు మరోసారి ‘పసిడి’ చిక్కింది. ఆసియా క్రీడల్లో వరుసగా రెండో రోజు భారత్ ఖాతాలో స్వర్ణం చేరింది. తొలి రోజు పురుషుల రెజ్లింగ్‌లో బజరంగ్ పూనియా బంగారు పతకం నెగ్గగా... ఈసారి మహిళల రెజ్లింగ్‌లో వినేశ్ ఫొగాట్ భారత సత్తా చాటి పసిడి కాంతులు విరజిమ్మింది. ఈ క్రమంలో 23 ఏళ్ల ఈ హరియాణా అమ్మాయి ఆసియా క్రీడల చరిత్రలో స్వర్ణం నెగ్గిన తొలి భారతీయ మహిళా రెజ్లర్‌గా కొత్త చరిత్ర లిఖించింది. మరోవైపు భారత షూటర్ల గురికి రెండు రజత పతకాలు లభించాయి. పురుషుల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగంలో దీపక్ కుమార్... పురుషుల ట్రాప్ విభాగంలో లక్షయ్ షెరాన్ రజత పతకాలు సొంతం చేసుకున్నారు. ఓవరాల్‌గా రెండో రోజు భారత్ ఖాతాలో స్వర్ణం, రెండు రజతాలతో కలిపి మూడు పతకాలు చేరాయి. ప్రస్తుతం భారత్ ఐదు పతకాలతో ఎనిమిదో స్థానంలో ఉంది. జకార్తా: ఎట్టకేలకు నిరీక్షణ ముగిసింది. ఆసియా క్రీడల మహిళల రెజ్లింగ్ చరిత్రలో వినేశ్ ఫొగాట్ రూపంలో తొలిసారి భారత వనిత ‘పసిడి పట్టు’ పట్టింది. అదీ కూడా ప్రపంచ మహిళల రెజ్లింగ్‌లో తిరుగులేని శక్తిగా పేరున్న జపాన్ క్రీడాకారిణిని చిత్తు చేసి ఈ ఘనత సాధించింది. మహిళల ఫ్రీస్టయిల్ 50 కేజీల విభాగంలో వినేశ్ ఫొగాట్ విజేతగా నిలిచింది. యావత్ జాతి గర్వపడేలా చేసింది. ఫైనల్లో వినేశ్ 6–2 పాయింట్ల తేడాతో యుకి ఇరీ (జపాన్)ను ఓడించి చాంపియన్‌గా అవతరించింది. అంతకుముందు వినేశ్ తొలి రౌండ్లో 8–2తో సన్ యానన్ (చైనా)పై... క్వార్టర్ ఫైనల్లో 4 నిమిషాల 37 సెకన్లలో 11–0తో కిమ్ హ్యుంగ్జూ (దక్షిణ కొరియా)పై, సెమీఫైనల్లో 75 సెకన్లలో 10–0తో దౌలత్బైక్ యక్షిమురతోవా (ఉజ్బెకిస్తాన్)పై విజయం సాధించింది. 2016 రియో ఒలింపిక్స్‌లో సన్ యానన్‌తో జరిగిన క్వార్టర్ ఫైనల్లో వినేశ్ మోకాలి గాయంతో అర్ధంతరంగా వైదొలిగింది. ఆరు నెలల విశ్రాంతి తర్వాత కోలుకున్న ఆమె ఈసారి మాత్రం సన్ యానన్పై పూర్తి ఆధిపత్యం చలాయించింది. గతంలో ఆమెతో పోటీపడ్డ మూడుసార్లూ ఓడిన వినేశ్ నాలుగో ప్రయత్నంలో గెలిచింది. జపాన్ రెజ్లర్ యుకి ఇరీతో జరిగిన ఫైనల్లో వినేశ్ ఆరంభంలోనే 4–0తో ఆధిక్యంలోకి వెళ్లింది. రెండో రౌండ్లో జపాన్ రెజ్లర్ కోలుకునేందుకు ప్రయత్నించినా వినేశ్ తన పట్టు సడలించకుండా విజయాన్ని ఖాయం చేసుకుంది. సాక్షి మలిక్ చేజేతులా... భారత్‌కే చెందిన సాక్షి మలిక్ (62 కేజీలు), పూజా ధాండ (57 కేజీలు) కాంస్య పతక పోరులో ఓడిపోయారు. ఐసులు టినిబెకోవా (కిర్గిస్తాన్)తో జరిగిన సెమీఫైనల్లో సాక్షి 7–9తో ఓడింది. 10 సెకన్ల సమయం ఉందనగా సాక్షి 7–6తో ఆధిక్యంలో ఉంది. అయితే చివరి 10 సెకన్లలో ఆమె రక్షణాత్మకంగా వ్యవహరించడం... టినిబెకోవా దూకుడుగా ఆడి సాక్షి మలిక్‌ను మ్యాట్ బయటకు పంపించి రెండు పాయింట్లు సంపాదించి 8–7తో ఆధిక్యంలోకి వచ్చింది. అయితే రిఫరీ 2 పాయింట్ల నిర్ణయాన్ని సాక్షి సమీక్ష కోరడం... రిఫరీ నిర్ణయం సరైనదేనని తేలడంతో ఆమె అదనంగా మరో పాయింట్ కోల్పోయి ఓటమిని మూటగట్టుకుంది. కాంస్య పతక బౌట్లలో సాక్షి 2–12తో హాంగ్ జంగ్వన్ (ఉత్తర కొరియా) చేతిలో... పూజా 1–6తో సాకగామి (జపాన్) చేతిలో పరాజయం పాలయ్యారు. మరో భారత మహిళా రెజ్లర్ పింకీ (53 కేజీలు) తొలి రౌండ్లో 0–10తో సుమియా (మంగోలియా) చేతిలో పరాజయం పాలైంది. పురుషుల 125 కేజీల కాంస్య పతక పోరులో భారత రెజ్లర్ సుమీత్ 0–2తో దావిత్ (ఉజ్బెకిస్తాన్) చేతిలో ఓడిపోయాడు. వైఎస్ జగన్ అభినందన... స్వర్ణం గెలిచి కొత్త చరిత్ర సృష్టించిన భారత మహిళా రెజ్లర్ వినేశ్ ఫొగాట్‌ను... రజత పతకాలు గెలిచిన షూటర్లు దీపక్ కుమార్, లక్షయ్లను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి అభినందించారు. ఏషియాడ్‌లో భారత క్రీడాకారుల బృందానికి అంతా మంచి జరగాలని ఆయన ఆకాంక్షించారు. స్వర్ణమే లక్ష్యంగా బరిలోకి దిగా. ఆసియాస్థాయిలో మూడుసార్లు రజతం గెలిచా. అందుకే ఈసారి ఎలాగైనా పసిడి గెలవాలనుకున్నా. పూర్తి ఫిట్నెస్తో ఉండటం... కఠోర శ్రమ ఫలించడం... అన్ని పరిస్థితులు అనుకూలించడం... దేవుడు కూడా సహకరించడంతో పసిడి కల నెరవేరింది. –వినేశ్ 2 ఆసియా క్రీడల్లో వినేశ్‌కు ఇది రెండో పతకం. 2014 ఇంచియోన్ క్రీడల్లో ఆమె 48 కేజీల విభాగంలో రజతం గెలిచింది. 2 ఆసియా క్రీడల్లో రెండు పతకాలు నెగ్గిన రెండో భారతీయ మహిళా రెజ్లర్ వినేశ్. గతంలో గీతిక జఖర్ (2006; 63 కేజీల్లో కాంస్యం; 2014; 63 కేజీల్లో రజతం) ఈ ఘనత సాధించింది. -
ఏషియన్ గేమ్స్: భళా వినేష్ ఫోగట్
జకర్తా: ఆసియా క్రీడల్లో భారత పతకాల వేట కొనసాగుతోంది. రెజ్లర్ వినేష్ ఫోగట్ తన జైత్రయాత్రను జకర్తాలోను కొనసాగించారు. రెజ్లింగ్ విభాగంలో ఫోగట్ భారత్‌కు మరో స్వర్ణాన్నిఅందించారు. సోమవారం మహిళల రెజ్లింగ్ 50 కేజీల విభాగంలో జరిగిన ఫైనల్లో ఫోగట్.. జపాన్ రెజ్లర్ యుకీ ఐరీపై 6-2తేడాతో చిత్తుచేసి స్వర్ణం తన ఖాతాలో వేసుకున్నారు. తొలి నుంచే తన ఆధిపత్యాన్ని ప్రదర్శించిన ఫోగట్ ప్రత్యర్థికి ఎలాంటి అవకాశం ఇవ్వలేదు. ఆసియా క్రీడల్లో రెజ్లింగ్ విభాగంలో స్వర్ణం సాధించిన తొలి భారతీయ మహిళగా వినేష్ ఫోగట్ సరికొత్త రికార్డు సృష్టించారు. దీంతో భారత్ ఖాతాలో ఇప్పటివరకు రెండు స్వర్ణాలు, ఒక కాంస్యం, రెండు రజత పతకాలు చేరాయి. -
ఏషియన్ గేమ్స్: భారత్ ఖాతాలో మరో పతకం
జకర్తా: ఆసియా క్రీడల్లో రెండో రోజు భారత్ మరో పతకం ఖాతాలో వేసుకుంది. సోమవారం జరిగిన పురుషుల ట్రాప్ ఈవెంట్లో లక్షయ్ షెరాన్ రజతం సాధించాడు. ట్రాప్ ఫైనల్లో 48 టార్గెట్లకు గాను లక్షయ్ 39 టార్గెట్లను పూర్తి చేసి రజతం గెలుపొందాడు. దీంతో ఇప్పటివరకు భారత్ ఖాతాలో స్వర్ణం, కాంస్యం, రెండు రజత పతకాలు చేరాయి. ఇదే ఈవెంట్లో మరో భారత షూటర్ మనవ్‌జిత్ సింగ్ సంధూ నాలుగో స్థానంతో సరిపెట్టుకున్నాడు. మరోవైపు సోమవారం ఉదయం జరిగిన 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ పురుషుల ఈవెంట్లో దీపక్ కుమార్ పతకాన్ని సాధించాడు. ఆసియా క్రీడల్లో తొలి రోజు ఎయిర్ రైఫిల్ మిక్స్డ్ ఈవెంట్లో రవి–అపూర్వీ జంటకు కాంస్యం, యువ రెజ్లర్ బజరంగ్ పూనియా పసిడి సాధించిన విషయం తెలిసిందే. -
స్వర్ణానికి అడుగు దూరంలో..
జకార్తా: ఏషియన్ గేమ్స్ 2018లో భారత మహిళా రెజ్లర్ వినేశ్ ఫోగట్ రజత పతకాన్ని ఖాయం చేసుకున్నారు.. సోమవారం జరిగిన మహిళల రెజ్లింగ్ పోరులో భాగంగా 50 కేజీల ఫ్రీస్టైయిల్ విభాగంలో ఫోగట్ ఫైనల్లోకి ప్రవేశించారు. సెమీ ఫైనల్ పోరులో వినేశ్ ఫోగట్ 10-0 తేడాతో యక్షిమురతోవా( ఉజ్బెకిస్తాన్)పై గెలిచి తుది పోరుకు అర్హత సాధించారు. ఫలితంగా రజత పతకాన్ని ఖాయం చేసుకున్న ఫోగట్.. పసిడికి అడుగు దూరంలో నిలిచారు. ఈ రోజు సాయంత్రం జరుగనున్న స్వర్ణ పత పోరులో జపాన్‌కు చెందిన ఇరి యుకితో ఫోగట్ అమీతుమీ తేల్చుకోనున్నారు. అంతకుముందు జరిగిన క్వార్టర్ ఫైనల్లో వినేశ్ ఫోగట్ 8-2 తేడాతో చైనా రెజ్లర్ యనన్ సున్‌పై గెలిచి సెమీస్‌లోకి ప్రవేశించారు. కాగా, పింకీ(53కేజీలు) తొలి బౌట్‌లోనే నిష్క్రమించింది. ఇక పూజ దండా( 57 కేజీలు), సాక్షి మాలిక్(62 కేజీల విభాగం) లు సెమీస్‌లో పరాజయం చెందారు. దాంతో కాంస్య పతక పోరులో తలపడే మరో అవకాశం లభించింది. కాంస్య పతక పోరులో జపాన్ క్రీడాకారిణి సాకగామి కాట్సుకితో పూజా దండా తలపడనుండగా, టినిబెకోవాతో సాక్షి తలపడనుంది. -
బ్యాడ్మింటన్‌లో ఎదురుదెబ్బ
జకార్తా: ఏషియన్ గేమ్స్ 2018లో భాగంగా బ్యాడ్మింటన్ విభాగంలో భారత్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. సోమవారం మహిళల టీమ్ ఈవెంట్ క్వార్టర్ ఫైనల్లో భారత జట్టు 1-3 తేడాతో జపాన్ చేతిలో ఓటమి పాలైంది. ఫలితంగా స్వర్ణ పతక రేసులో నిలుస్తుందన్న భారత మహిళల విభాగం ఆశలు క్వార్టర్స్‌లోనే ఆవిరయ్యాయి. తొలి మ్యాచ్‌లో పీవీ సింధు గెలిచి భారత్‌కు ఆధిక్యాన్ని అందించింది. పీవీ సింధు 21-18, 21-19తో యమగూచిపై విజయం నమోదు చేసింది. కానీ, ఆ తర్వాత భారత్ ఆడిన మూడు మ్యాచ్‌ల్లో పరాజయం పాలవ్వడంతో మహిళల టీమ్ ఈవెంట్ నుంచి భారత నిష్ర్కమించాల్సి వచ్చింది. డబుల్స్ విభాగంలో సిక్కిరెడ్డి- ఆరతి జోడి15-21, 6-21తో ఘోర పరాజయాన్ని మూటకట్టుకోవడంతో భారత్ ఆధిక్యానికి తెరపడింది. మరో సింగిల్స్‌లో సైనా 11-21, 25-23, 16-21 తేడాతో ఒకుహార చేతిలో ఓడిపోయింది. ఆ తర్వాత తప్పక గెలవాల్సిన మరో డబుల్స్‌లో సింధు-పొన్నప్ప జోడి కూడా ఓడిపోయింది. దీంతో ఈ ఆసియా క్రీడల్లో మహిళల టీమ్ ఈవెంట్లో భారత మహిళల పోరుకు తెర పడింది. -
ఏషియన్ గేమ్స్: భారత్‌కు రజతం
జకార్తా: ఏషియన్ గేమ్స్-2018లో భారత్ పతకాల వేట కొనసాగుతోంది. తొలి రోజు పసిడి, కాంస్య పతకాలు సాధించిన భారత్.. రెండో రోజు రజత పతకం సాధించింది. సోమవారం ఉదయం జరిగిన 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ పురుషుల ఈవెంట్లో దీపక్ కుమార్ రజత పతకాన్ని సాధించాడు. ఆఖరి రౌండ్లో 10.9 పాయింట్లు సాధించిన దీపక్ కుమార్.. మొత్తంగా 247.7 పాయింట్ల సాధించి రజతాన్ని ఖాయం చేసుకున్నాడు. కాగా, ఇదే ఈవెంట్లో మరో భారత షూటర్ రవి కుమార్ నాల్గో స్థానంతో సరిపెట్టుకున్నాడు. చైనాకు చెందిన యాంగ్ హారాన్ 249.1 పాయింట్లతో స్వర్ణ పతకాం సాధించాడు. ఫలితంగా ఆసియన్ గేమ్స్‌లో తన డిఫెండింగ్ చాంపియన్‌షిప్ హోదాను నిలబెట్టుకున్నాడు. ఇక చైనీస్ తైపీకి చెందిన లు సాచువాన్ 226.8 పాయింట్లతో కాంస్య పతకం సాధించాడు. తొలి రోజు బజరంగ్ మినహా మిగతా భారత రెజ్లర్లు సందీప్, సుశీల్ కుమార్, పవన్, మౌజమ్ ఖత్రి పతకం నెగ్గడంలో విఫలమయ్యారు. మరోవైపు షూటింగ్లో 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ మిక్స్డ్ ఈవెంట్లో రవికుమార్–అపూర్వీ చండేలా ద్వయం మూడో స్థానంలో నిలిచి కాంస్య పతకాన్ని దక్కించుకున్న సంగతి తెలిసిందే. చదవండి: బజరంగ్ బంగారం -
బజరంగ్ పూనియాకు వైఎస్ జగన్ అభినందనలు
సాక్షి, హైదరాబాద్ : ఇండోనేషియాలో కొనసాగుతున్న ఆసియా క్రీడల్లో పతకాలు గెలుపొందిన భారత ఆటగాళ్లకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ట్విటర్లో అభినందనలు తెలిపారు. భారత్‌కు తొలి స్వర్ణ పతకం అందించిన రెజ్లర్ బజరంగ్ పూనియాకు, షూటింగ్లో కాంస్య పతకాలు సాధించిన అపూర్వీ చండేలా, రవికుమార్‌కు ఆయన అభినందనలు తెలిపారు. ఆసియా క్రీడల్లో పాల్గొంటున్న భారత క్రీడాకారులకు ఆల్ ద బెస్ట్ చెప్పారు. అధికారికంగా ఆసియా క్రీడలు మొదలైన తొలి రోజే భారత్ బంగారంతో బోణీ చేసింది. భారత యువ రెజ్లర్ బజరంగ్ పూనియా పసిడి పట్టుతో అదరగొట్టాడు. ఫ్రీస్టయిల్ 65 కేజీల విభాగంలో ఆద్యంతం ఆధిపత్యం చలాయించిన బజరంగ్ ఎదురులేని విజేతగా అవతరించాడు. ఫైనల్లో బజరంగ్ 11–8 పాయింట్ల తేడాతో తకతాని దైచి (జపాన్)పై గెలుపొంది గోల్డ్ మెడల్‌ను సొంతం చేసుకున్నాడు. తొలి రోజు బజరంగ్ మినహా మిగతా భారత రెజ్లర్లు సందీప్, సుశీల్ కుమార్, పవన్, మౌజమ్ ఖత్రి పతకం నెగ్గడంలో విఫలమయ్యారు. మరోవైపు షూటింగ్లో 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ మిక్స్డ్ ఈవెంట్లో రవికుమార్–అపూర్వీ చండేలా ద్వయం మూడో స్థానంలో నిలిచి కాంస్య పతకాన్ని దక్కించుకుంది. Congratulations to #BajrangPunia on winning India’s first gold, and Apurvi Chandela & Ravi Kumar for bronze, in #AsianGames2018. All the best to the Indian contingent. — YS Jagan Mohan Reddy (@ysjagan) 20 August 2018 -
ఏషియాడ్‌లో నేటి భారతీయం
బ్యాడ్మింటన్ (క్వార్టర్ ఫైనల్స్) మహిళల టీమ్ ఈవెంట్ (ఉ.గం.8 నుంచి భారత్(vs)జపాన్), పురుషుల టీమ్ విభాగం (మ.1 గం. నుంచి భారత్ vsఇండోనేసియా) పురుషుల హాకీ భారత్(vs)ఇండోనేసియా (సా.గం.7 నుంచి) కబడ్డీ భారత్(vs)థాయ్‌లాండ్ (మహిళల లీగ్ మ్యాచ్ ఉ.గం.8.40 నుంచి), భారత్(vs)దక్షిణ కొరియా (పురుషుల లీగ్ మ్యాచ్ మ.గం.3 నుంచి) షూటింగ్ మహిళల ట్రాప్ క్వాలిఫయింగ్ (ఉ.గం.7 నుంచి; శ్రేయసి సింగ్, సీమ తోమర్), పురుషుల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ క్వాలిఫయింగ్ (ఉ.గం.6.30 నుంచి; రవి కుమార్, దీపక్ కుమార్), పురుషుల ట్రాప్ క్వాలిఫయింగ్ (ఉ.గం.8 నుంచి; మానవ్‌జీత్ సింగ్ సంధు), మహిళల 10 మీటర్ల రైఫిల్ క్వాలిఫయింగ్ (ఉ.గం.8.30 నుంచి; అపూర్వీ చండీలా, ఎలవేనీల్ వలరివన్) రెజ్లింగ్ (మ.గం.12 నుంచి) పురుషుల విభాగం (సుమిత్ 125 కేజీలు) మహిళల విభాగం (వినేశ్ 50 కేజీలు; పింకీ 53 కేజీలు, పూజ 57 కేజీలు, సాక్షి 62 కేజీలు). సోనీ టెన్–2, సోనీ ఈఎస్‌పీఎన్‌లలో ప్రత్యక్ష ప్రసారం -
షూటింగ్ గురితో భారత్ బోణీ
ఎయిర్ రైఫిల్ మిక్స్డ్ ఈవెంట్లో రవి–అపూర్వీ జంటకు కాంస్యం రెజ్లింగ్‌లో పసిడి పట్టుకు ముందు ఉదయమే షూటింగ్లో భారత్ కాంస్యంతో పతకాల ఖాతా తెరిచింది. మిక్స్డ్ రైఫిల్ టీమ్ ఈవెంట్లో అపూర్వీ చండీలా–రవి కుమార్ జోడీ 429.9 స్కోరుతో మూడో స్థానంలో నిలిచింది. చైనీస్ తైపీ జంట ఇంగ్షిన్ లిన్–షావోచున్ 494.1 స్కోరుతో బంగారు పతకం గెలుచుకుంది. చైనాకు చెందిన రుయోజు జావో–హవోరన్ యంగ్ (492.5 స్కోరు) జంట రజతం సొంతం చేసుకుంది. పురుషుల ట్రాప్ ఈవెంట్లో భారత షూటర్లు మానవ్‌జీత్ సింగ్ సంధు, లక్ష్యయ్ షెరాన్, మహిళల ట్రాప్‌లో శ్రేయాసి సింగ్, సీమా తోమర్ ఫైనల్స్‌కు అర్హత పొందారు. మిక్స్డ్ పిస్టల్ టీమ్ ఈవెంట్లో మను భాకర్–అభిషేక్ వర్మ జంట ఫైనల్స్‌కు అర్హత సంపాదించడంలో విఫలమైంది. చైనాదే తొలి పసిడి... జకార్తా ఆసియా క్రీడల్లో తొలి స్వర్ణం చైనా దక్కించుకుంది. పురు షుల వుషు క్రీడాంశంలో సన్ పియువాన్ బంగారు పతకం సాధించాడు. ఆతిథ్య ఇండోనేసియా ఆటగాడు జేవియర్‌కు రజతం దక్కగా, చైనీస్ తైపీకి చెందిన సయి సెమిన్ కాంస్యం గెలిచాడు. తొలి రోజు ఓవరాల్‌గా చైనా (7 స్వర్ణాలు+5 రజతాలు+4 కాంస్యాలు) 16 పతకాలు గెలిచి పతకాల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది. భారత్ 2 పతకాలతో తొమ్మిదో స్థానంలో ఉంది. -
బజరంగ్ బంగారం
అధికారికంగా ఆసియా క్రీడలు మొదలైన తొలి రోజే భారత్ బంగారు బోణీ చేసింది. భారత మరో యువ రెజ్లర్ బజరంగ్ పూనియా పసిడి పట్టుతో అదరగొట్టాడు. ఫ్రీస్టయిల్ 65 కేజీల విభాగంలో ఆద్యంతం ఆధిపత్యం చలాయించిన బజరంగ్ ఎదురులేని విజేతగా అవతరించాడు. తొలి రోజు బజరంగ్ మినహా మిగతా భారత రెజ్లర్లు సందీప్, సుశీల్ కుమార్, పవన్, మౌజమ్ ఖత్రి పతకం నెగ్గడంలో విఫలమయ్యారు. మరోవైపు షూటింగ్లో 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ మిక్స్డ్ ఈవెంట్లో రవికుమార్–అపూర్వీ చండేలా ద్వయం మూడో స్థానంలో నిలిచి కాంస్య పతకాన్ని దక్కించుకుంది. జకార్తా: కొంతకాలంగా అంతర్జాతీయస్థాయిలో నిలకడగా రాణిస్తోన్న భారత యువ రెజ్లర్ బజరంగ్ పూనియా అదే జోరును ఆసియా క్రీడల్లోనూ కొనసాగించాడు. తన ఉడుంపట్టుతో భారత్ ఖాతాలో తొలి పసిడి పతకాన్ని జమ చేశాడు. ఆదివారం జరిగిన పురుషుల ఫ్రీస్టయిల్ రెజ్లింగ్ 65 కేజీల విభాగంలో హరియాణాకు చెందిన 24 ఏళ్ల బజరంగ్ విజేతగా అవతరించాడు. ఫైనల్లో బజరంగ్ 11–8 పాయింట్ల తేడాతో తకతాని దైచి (జపాన్)పై గెలుపొందాడు. ఫైనల్ చేరే క్రమంలో అన్ని బౌట్లను టెక్నికల్ సుపీరియారిటీ (ప్రత్యర్థిపై 10 పాయింట్ల ఆధిక్యం సంపాదించడం) ద్వారా నెగ్గిన బజరంగ్‌కు పసిడి పోరులో కాస్త ప్రతిఘటన ఎదురైంది. ఆరంభంలోనే 6–0తో ఆధిక్యంలోకి వెళ్లిన బజరంగ్ ఆ తర్వాత తడబడి నాలుగు పాయింట్లు కోల్పోయాడు. తొలి విరామానికి 6–4తో ముందంజ వేసిన బజరంగ్ ఆ తర్వాత మరో రెండు పాయింట్లు చేజార్చుకోవడంతో స్కోరు 6–6తో సమమైంది. అనంతరం బజరంగ్ రెండు, తకతాని రెండు పాయింట్లు నెగ్గడంతో మళ్లీ స్కోరు 8–8తో సమమైంది. ఇక బౌట్ మరో నిమిషంలో ముగుస్తుందనగా బజరంగ్ రెండు పాయింట్లు గెలిచి 10–8తో ఆధిక్యంలోకి వచ్చాడు. చివరి సెకన్లలో మరో పాయింట్ గెలిచి 11–8తో విజయాన్ని, స్వర్ణాన్ని ఖాయం చేసుకున్నాడు. అంతకుముందు తొలి రౌండ్లో బజరంగ్ 4 నిమిషాల 58 సెకన్లలో 13–3తో సిరోజుద్దీన్ ఖసనోవ్ (ఉజ్బెకిస్తాన్)పై... క్వార్టర్ ఫైనల్లో 3 నిమిషాల 31 సెకన్లలో 12–2తో ఫెజీవ్ అబ్దుల్కోసిమ్ (తజికిస్తాన్)పై, సెమీఫైనల్లో 3 నిమిషాల 56 సెకన్లలో 10–0తో బత్మాగ్నయ్ బత్చులు (మంగోలియా)పై గెలుపొందాడు. ఆసియా క్రీడలకు ముందు బజరంగ్ కామన్వెల్త్ గేమ్స్, తిబిలిసి గ్రాండ్‌ప్రి, యాసర్ డోగు అంతర్జాతీయ టోర్నీల్లో స్వర్ణాలు గెలిచాడు. ఈ స్వర్ణాన్ని ఇటీవలే స్వర్గస్తులైన భారత మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారి వాజ్‌పేయికి అంకితంఇస్తున్నాను. యోగీ భాయ్ (యోగేశ్వర్ దత్)కి ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నాను. 28 ఏళ్ల విరామం తర్వాత యోగేశ్వర్ దత్ గత ఆసియా క్రీడల్లో పసిడి గెలిచాడు. మరో స్వర్ణానికి మళ్లీ అంత విరామం ఉండొద్దని అతను నన్ను కోరాడు. నా తదుపరి లక్ష్యం ప్రపంచ చాంపియన్‌షిప్, 2020 టోక్యో ఒలింపిక్స్. ఈ రెండు మెగా ఈవెంట్స్‌లోనూ స్వర్ణాలు గెలవాలనే లక్ష్యంతో ఉన్నాను.– బజరంగ్ షట్లర్ల జోరు... భారత పురుషుల బ్యాడ్మింటన్ జట్టు శుభారంభం చేసింది. ఆదివారం జరిగిన తొలి మ్యాచ్‌లో కిడాంబి శ్రీకాంత్ సారథ్యంలోని భారత జట్టు 3–0తో మాల్దీవులపై విజయం సాధించింది. ప్రపంచ 8వ ర్యాంకర్ శ్రీకాంత్ 21–4, 21–5తో హుస్సేన్ జయాన్ షహీద్‌ను చిత్తు చేసి 1–0తో ఆధిక్యం అందించాడు. రెండో మ్యాచ్‌లో 11వ ర్యాంకర్ హెచ్ఎస్ ప్రణయ్ 21–8, 21–6తో మొహమ్మద్ సరిమ్పై గెలిచి ఆధిక్యాన్ని 2–0కు పెంచాడు. మూడో మ్యాచ్‌లో సాయి ప్రణీత్ 21–7, 21–8తో అజ్ఫాన్ రషీద్‌పై విజయం సాధించాడు. సోమవారం జరిగే క్వార్టర్ ఫైనల్లో ఆతిథ్య ఇండోనేసియాతో భారత పురుషుల జట్టు తలపడనుంది. అదిరే కూత... డిఫెండింగ్ చాంపియన్లుగా ఆసియా క్రీడల్లో బరిలో దిగిన కబడ్డీ జట్లు హోదాకు తగ్గట్లే సత్తాచాటాయి. పురుషుల జట్టు వరుసగా రెండు మ్యాచ్‌ల్లో విజయం సాధించగా... మహిళల జట్టు తొలి మ్యాచ్‌లో నెగ్గి శుభారంభం చేసింది. గ్రూప్ ‘ఎ’లో భాగంగా పురుషుల జట్టు తొలి మ్యాచ్‌లో 50–21తో బంగ్లాదేశ్‌ను చిత్తు చేసి... రెండో మ్యాచ్‌లో 44–28తో శ్రీలంక పనిపట్టింది. మహిళల విభాగంలో భారత జట్టు 43– 12తో జపాన్ను మట్టికరిపించింది. పురుషుల జట్టు తదుపరి మ్యాచ్‌లో దక్షిణ కొరియాతో, మహిళల బృందం థాయ్‌లాండ్‌తో తలపడనున్నాయి. గోల్స్ మోత... మహిళల హాకీ జట్టు తొలి మ్యాచ్‌లో గోల్స్ మోత మోగించింది. పూల్ ‘బి’లో భాగంగా ఆదివారం జరిగిన మ్యాచ్‌లో భారత్ 8–0తో ఆతిథ్య ఇండోనేసియాను చిత్తుచేసింది. గుర్జీత్ కౌర్ హ్యాట్రిక్ గోల్స్ (16వ, 22వ, 57వ నిమిషాల్లో)తో సత్తా చాటగా... వందన కటారియా (13వ, 27వ నిమిషాల్లో) రెండు... ఉదిత (6వ ని.లో), లాల్రేమ్సియామి (24వ ని.లో), నవనీత్ కౌర్ (50వ ని.లో) ఒక్కో గోల్ నమోదు చేశారు. సుశీల్ విఫలం... మరోవైపు భారత సీనియర్ స్టార్ రెజ్లర్ సుశీల్ కుమార్ రిక్తహస్తాలతో వెనుదిరిగాడు. వరుసగా మూడు కామన్వెల్త్ గేమ్స్ (2010, 2014, 2018)లలో స్వర్ణాలు గెలిచిన సుశీల్ 74 కేజీల విభాగం తొలి రౌండ్లోనే 3–5తో ఆడమ్ బతిరోవ్ (బహ్రెయిన్) చేతిలో ఓడిపోయాడు. 2006 దోహా ఆసియా క్రీడల్లో కాంస్యం నెగ్గిన సుశీల్ 2010, 2014లలో దూరంగా ఉన్నాడు. 57 కేజీల విభాగంలో సందీప్ కుమార్ క్వార్టర్ ఫైనల్లో 9–15తో రెజా అత్రియానఘర్చి (ఇరాన్) చేతిలో... 97 కేజీల విభాగంలో మౌజమ్ ఖత్రీ క్వార్టర్ ఫైనల్లో 0–8తో ఇబ్రాజిమోవ్ మగోమెడ్ (ఉజ్బెకిస్తాన్) చేతిలో... 86 కేజీల విభాగం కాంస్య పతక పోరులో పవన్ కుమార్ 1–8తో ఒర్గోడోల్ ఉతమెన్ (మంగోలియా) చేతిలో ఓడిపోయారు. టెన్నిస్‌లో శుభారంభం... టెన్నిస్ మిక్స్డ్ డబుల్స్‌లో భారత జోడీ తొలి రౌండ్లో సునాయస విజయం సాధించింది. ఆదివారం జరిగిన మ్యాచ్‌లో దివిజ్ శరణ్–కర్మన్ కౌర్ జోడీ 6–4, 6–4తో మారియన్ జెన్–అల్బెర్టో లిమ్ (ఫిలిప్పిన్స్) జంటపై గెలిచింది. స్విమ్మింగ్‌లో నిరాశ... స్విమ్మింగ్‌లో పురుషుల 200 మీటర్ల బటర్‌ఫ్లయ్ విభాగంలో ఫైనల్ చేరిన సజన్ ప్రకాశ్ తృటిలో పతకం చేజార్చుకున్నాడు. అతను 1ని.57.75 సెకన్లలో లక్ష్యాన్ని చేరి ఐదో స్థానానికి పరిమితమయ్యాడు. మరోవైపు పురుషుల 100 మీటర్ల బ్యాక్‌స్ట్రోక్ ఫైనల్లో నటరాజ్ శ్రీహరి 56.19 సెకన్లలో లక్ష్యాన్ని చేరి 7వ స్థానంలో నిలిచాడు. పురుషుల 200 మీటర్ల ఫ్రీస్టయిల్ హీట్స్‌లో భారత స్మిమ్మర్ సౌరభ్ 1ని.54.87 సెకన్లలో లక్ష్యాన్ని చేరి ఫైనల్‌కు అర్హత సాధించలేకపోయాడు. టీమ్ విభాగాల్లో చుక్కెదురు... ►బాస్కెట్‌బాల్‌లో మహిళల జట్టు వరుసగా రెండో మ్యాచ్‌లో ఓటమి పాలైంది. తొలి మ్యాచ్‌లో కజకిస్తాన్ చేతిలో ఓడిన భారత్ ఆదివారం జరిగిన రెండో మ్యాచ్‌లో 61–84తో చైనీస్ తైపీ చేతిలో పరాజయం పాలైంది. ►హ్యాండ్‌బాల్‌లో మహిళల జట్టు పరాజయాల బాట వీడలేదు. ఆదివారం జరిగిన మూడో మ్యాచ్‌లో భారత్ 21–36తో చైనా చేతిలో ఓటమి పాలైంది. మనిందర్ కౌర్ 10 పాయింట్లతో ఒంటరి పోరాటం చేసినా లాభం లేకపోయింది. ►తైక్వాండో పూమ్సే ఈవెంట్లో భారత మహిళల జట్టు ఓటమి పాలైంది. అనామిక, మమత కులకర్ణి, శిల్ప థాపాలతో కూడిన భారత బృందం థాయ్‌లాండ్ చేతిలో ఓడింది. ► వాలీబాల్‌లో భారత మహిళల జట్టు తొలి మ్యాచ్‌లో 17–25, 11–25, 13–25తో దక్షిణ కొరియా చేతిలో ఓడింది. ► సెపక్‌తక్రాలో భారత మహిళల జట్టు రెగూ ప్రిలిమినరీ లీగ్ మ్యాచ్‌లో 0–3తో కొరియా చేతిలో పరాజయం పాలైంది.