జకర్తా: ఆసియా క్రీడల్లో భారత పురుషుల హాకీ జట్టు అదరగొట్టింది. ఏకంగా 26 గోల్స్ చేసి ప్రత్యర్థి జట్టును చిత్తు చేసింది. బుధవారం గ్రూపు రౌండ్ మ్యాచ్‌లో భారత్26-0తేడాతో హాంకాంగ్‌పై ఘనవిజయం సాధించింది. భారత ఆటగాళ్లు పోటీపడి గోల్స్ చేస్తుంటే అనుభవంలేని ప్రత్యర్థి జట్టు చూస్తూ ఉండిపోయింది. ఆట ప్రారంభమైన ఐదు నిమిషాల్లోనే టీమిండియా ఆటగాళ్లు నాలుగు గోల్స్ చేశారు. ఇక ప్రథమార్థం ముగిసే సరికి భారత ఆటగాళ్లు 14 గోల్స్ నమోదు చేయడం విశేషం. ఆట ప్రారంభం నుంచి దూకుడుగా కనిపించిన భారత్ చివరి వరకు ఆదే ప్రదర్శన కొనసాగించింది.
భారత ఆటగాళ్లలో అక్షదీప్, రూపిందర్, లలిత్ చెరో మూడు గోల్స్‌తో చెలరేగగా.. హర్మన్ ప్రీత్ అత్యధికంగా 4 గోల్స్ సాధించాడు. ప్రతిష్టాత్మకమైన ఈవెంట్లలో భారత్‌కు ఇదే అతి పెద్ద విజయం. 1932లో ధ్యాన్‌చంద్ నాయకత్వంలోని భారత జట్టు అమెరికాను 24-1 తేడాతో చిత్తుచేసింది. తాజాగా ఆసియా క్రీడల్లో భారత జట్టు ఆ రికార్డును తిరగరాసింది. ఇక తొలి మ్యాచ్‌లో కూడా భారత్17-0తో ఇండోనేషియాపై ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే.
FT| The Indian Men's Hockey Team score 26 goals against Hong Kong China in their third game of the @asiangames2018 which saw 4 players claim hat-tricks and a sublime team effort to achieve the large score-line on 22nd August 2018.#IndiaKaGame #AsianGames2018 #INDvHKG pic.twitter.com/UiqYtgzbsq
— Hockey India (@TheHockeyIndia) 22 August 2018
Comments
Please login to add a commentAdd a comment