Hong Kong
-
హాంకాంగ్ జాతీయ భద్రతా కేసులో సంచలన తీర్పు
హాంకాంగ్: పార్లమెంట్లో తమకు అనుకూలంగా వ్యవహరించే నేతల ఎంపిక కోసం అనధికారికంగా ప్రైమరీ ఎలక్షన్స్ చేపట్టి సమాంతర పార్లమెంటరీ వ్యవస్థ నిర్వహణకు తెగించారంటూ 45 మంది ప్రజాస్వామ్య ఉద్యమకారులు, మాజీ చట్టసభసభ్యులకు హాంకాంగ్ హైకోర్టు కఠిన శిక్షలు విధించింది. వీరికి నాలుగేళ్ల నుంచి పదేళ్ల శిక్షలుపడ్డాయి. పార్లమెంట్లో మెజారిటీ సభ్యులను తమ వైపునకు తిప్పుకుని ప్రభుత్వాన్ని నిర్విర్యంచేయాలని కుట్ర పన్నారని హైకోర్టు తన తీర్పులో పేర్కొంది. తదుపరి పార్లమెంట్ ఎన్నికల్లో గెలిస్తే విపక్షసభ్యులుగా ఉంటూ తర్వాత ప్రభుత్వం ప్రవేశపెట్టే బడ్జెట్లను తిరస్కరిస్తూ వీటో చేసేందుకు వీరంతా కుట్ర పన్నారని కోర్టు తీర్పులో ప్రస్తావించింది. 2020 జూలై 10, 11వ తేదీల్లో జరిగిన ఈ అనధికార ప్రైమరీ ఎన్నికల్లో 6,10,000 ఓట్లు పోలయ్యాయి. అయితే ఆనాడు అధికార ఎన్నికలను ప్రభుత్వం కోవిడ్ మహమ్మారి విజృంభణ కారణంగా వాయిదా వేయడం తెల్సిందే. అయితే హాంకాంగ్ చరిత్రలోనే అతిపెద్ద జాతీయ భద్రతా కేసుగా పరిగణించబడిన ఈ కేసులో ఉద్యమకారులపై అన్యాయంగా శిక్షలు మోపారని ప్రపంచ దేశాలు ఖండించాయి. పరోక్షంగా చైనా ఏలుబడిలో ఉన్న హాంకాంగ్‌లో సమాంతర పాలనకు ప్రయత్నించారంటూ 2021 ఏడాదిలో 47 మంది ఉద్యమకారులను ప్రభుత్వం అరెస్ట్‌చేసింది. కఠిన జాతీయ భద్రతా చట్టం–2020 కింద కేసులు నమోదుచేసింది. ఈ చట్టం కింద దోషులుగా తేలితే గరిష్టంగా జీవితఖైదు పడే అవకాశముంది. 47 మందిలో గత ఏడాది ఇద్దరు నిందితులు నిర్దోషులుగా విడుదలయ్యారు. ఈ ఉదంతంలో సూత్రధారిగా కోర్టు పేర్కొన్న బెన్నీ థాయ్‌కు గరిష్టంగా పదేళ్ల జైలుశిక్షపడింది. మాజీ విద్యార్థి నాయకుడు జోషువా వాంగ్, మాజీ చట్టసభ సభ్యులకూ వేర్వేరు శిక్షలు పడ్డాయి. అయితే ప్రభుత్వానికి వ్యతిరేకంగా కుట్ర జరుగుతోందన్న విషయంపై తమకు కనీస అవగాహన కూడా లేదని కొందరు నిందితులు కోర్టులో చెప్పడంతో వారికి తక్కువ శిక్షలుపడ్డాయి. 2019లో ప్రభుత్వ వ్యతిరేక ఉద్యమాలు, మీడియాపై కఠిన ఆంక్షలు, ఎన్నికల్లో సాధారణ ప్రజల భాగస్వామ్యాన్ని తగ్గించడం వంటి పరిణామాల తర్వాత ప్రజాస్వామ్య ఉద్యమకారులు ఆనాడు ఇలా అనధికార ప్రైమరీ ఎన్నికలు నిర్వహించారు. దీంతో హాంకాంగ్ ప్రభుత్వం కన్నెర్రజేసింది. బ్రిటిష్ వలసప్రాంతంగా అభివృద్ధిచెందిన హాంకాంగ్‌పై పాలనాపగ్గాలు 1997లో చైనాకు దఖలుపడ్డాక హాంకాంగ్‌లో నిరంకుశ చట్టాలను డ్రాగన్‌దేశం అమలుచేస్తోందని ప్రపంచదేశాలు తప్పుపట్టడం విదితమే. ‘‘హాంకాంగ్ ప్రాథమిక చట్టం ప్రకారం శాంతియుతంగా తమ నిరసన తెలుపుతున్న ఉద్యమకారులపై కక్షగట్టి ప్రభుత్వం కేసులు బనాయించి ఆగమేఘాల మీద తీర్పు వెలువరించి శిక్షించింది’’అని హాంకాంగ్‌లోని అమెరికా కాన్సులేట్ మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొంది. ఆ్రస్టేలియా, బ్రిటన్, ఐరోపా సమాఖ్యతోపాటు ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్, హ్యూమన్ రైట్స్ వాచ్ వంటి మానవహక్కుల పరిరక్షణా సంస్థలు తీర్పును తీవ్రంగా తప్పుబట్టాయి. అయితే తీర్పును చైనా స్వాగతించింది. -
జూపార్కులో 10 రోజుల్లో 12 కోతుల మృతి
హాంకాంగ్: హాంకాంగ్ జూ పార్కులో బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ కారణంగా 10 రోజుల వ్యవధిలో 12 కోతులు మృతిచెందాయి. కొద్ది రోజుల క్రితమే జూపార్కులో ప్రమాదకర బ్యాక్టీరియా విస్తరణను అధికారులు గుర్తించారు.మృతిచెందిన కోతులకు నిర్వహించిన పోస్ట్‌మార్టంలో జూ ఎన్క్లోజర్ల మట్టిలో ఒక రకమైన బ్యాక్టీరియా అధికంగా ఉన్నట్లు కనుగొన్నారు. తద్వారా ఇన్ఫెక్షన్ సోకింది. అనంతరం కోతులు సెప్సిస్ బారిన పడి మృతిచెందాయి. ఇన్ఫెక్షన్ వల్ల ఆ కోతులలోని కణాలు దెబ్బతిన్నాయి. ఫలితంగా అవయవాలు పనిచేయడం ఆగిపోయి, అవి మృతిచెందాయి. జూ కార్మికుల బూట్ల ద్వారా కలుషితమైన మట్టి జంతువుల ఎన్క్లోజర్లకు చేరిందని అధికారులు భావిస్తున్నారు. జంతువుల కోసం గుహలు, ఇతర ఆవాసాల నిర్మాణ పనుల సమయంలో కోతుల సామూహిక మరణాలు సంభవించాయి.అంతర్జాతీయ మీడియా నివేదికల ప్రకారం మట్టి ద్వారా అంటువ్యాధులు సంక్రమించడమనేది సాధారణమే. కానీ జంతుప్రదర్శనశాలలలో ఇటువంటి సంఘటనలు చాలా అరుదు. బ్యాక్టీరియా సంక్రమణ కారణంగా కాటన్ టాప్ టామరిన్, వైట్-ఫేస్డ్ సాకి, కామన్ స్క్విరెల్ మంకీ, డి బ్రజ్జాతో సహా పలుకోతులు మృతిచెందాయి. మెలియోయిడోసిస్ అనేది కలుషితమైన మట్టి, గాలి లేదా నీటితో సంపర్కం ద్వారా వ్యాపించే ఒక అంటు వ్యాధి. ఇదే కోతుల ప్రాణాలను తీసింది. హాంకాంగ్ జూ పార్కు నగరం నడిబొడ్డున 14 ఎకరాల్లో విస్తరించి ఉంది. ఇన్ఫెక్షన్ కారణంగా కోతులు చనిపోవడంపై జంతు ప్రేమికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ఇది కూడా చదవండి: ఈ ఐదు నగరాల్లో.. మిన్నంటే దీపావళి సంబరాలు -
హాంగ్‌కాంగ్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు వేడుక
హాంగ్‌కాంగ్‌లో నివసిస్తున్న తెలంగాణా ఆడపడుచులు తెలంగాణ సాంస్కృతిక ప్రతీక, రాష్ట పండుగైన బతుకమ్మ పండుగను ఎంతో ఉత్సాహంగా ఎదురుచూసే ప్రక్రుతి లోని అందమైన ఈ పుల పండుగను భక్తీ ఉత్సాహాలతో ఘనంగా జరుపుకుంటున్నారు. హాంగ్ కాంగ్ లో కూడా సాధారణంగా సెప్టెంబరు, అక్టోబరు నెలలలో రెండు పెద్ద పండుగలు జరుపుకుంటారు.ఈ పండుగలకు కనీసం పదిహేను రోజులు అటువైపు, ఇటువైపు అంతా పండుగ సంబరాలు, కుటుంబ స్నేహితుల కోలాహలాలు, కలయకలతో నిండిపోయుంటుంది. ఈ పండుగలలో ఒకటి ’బతుకమ్మ పండుగ’, మరియొకటి దసరా (విజయ దశమి). బతుకమ్మ పండుగ మన తెలంగాణా ఆడపడుచులు మాత్రమె జరుపుకుంటారు, కాని ఉత్సాహంగా ఎందరో ఆడపడుచులు పాల్గొంటారు. దసరా నవరాత్రులలో లలితా పారాయణం , బొమ్మల కొలువులు , పేరంటాళ్ళతో రంగ రంగ వైభవంగా పండుగల సందడి పట్టు చీరలు ధగ ధగ మెరిసే నగలు గాజుల సవ్వడి తో విదేశీయులని కుడా ఆకర్షిస్తుంటుంది.సంవత్సరం కూడా హాంగ్ కాంగ్ లో బతుకమ్మ సంబరాలు ఎంతో ఘనంగా సముద్ర తీరాన లాన్తాఉ ఐలాండ్ తుంగ్ చుంగ్ ప్రోమేనెడ్ మీద జరిగాయని, పిల్లలు పెద్దలు ఎంతో ఆనందంగా రెట్టింపు ఉత్సాహాలతో పాల్గొనేవారు సంప్రదాయ వస్త్రాలలో మరిన్ని ఆట పాటలతో విందు భోజనంతో జరుపుకున్నారని, ది హాంగ్ కాంగ్ తెలుగు సమాఖ్య అధ్యక్షురాలు ఆనందంగా తెలిపారు. -
హాంగ్‌కాంగ్ సిక్సర్స్ టోర్నీలో పాల్గొననున్న టీమిండియా
భారత క్రికెట్ జట్టు హాంగ్‌కాంగ్ క్రికెట్ సిక్సర్స్ టోర్నీలో పాల్గొననుంది. ఈ విషయాన్ని క్రికెట్ హాంగ్‌కాంగ్ అధికారికంగా ధృవీకరించింది. హాంగ్‌కాంగ్ క్రికెట్ సిక్సర్స్ టోర్నీ ఈ ఏడాది నవంబర్ 1న ప్రారంభం కానుంది. మూడు రోజుల పాటు సాగే ఈ టోర్నీలో భారత్, పాక్ సహా 12 జట్లు పాల్గొననున్నాయి. ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, న్యూజిలాండ్, సౌతాఫ్రికా, శ్రీలంక, బంగ్లాదేశ్ లాంటి పెద్ద జట్లతో పాటు హాంగ్‌కాంగ్, నేపాల్, ఒమన్, యూఏఈ లాంటి చిన్న జట్లు ఈ టోర్నీలో తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాయి.హాంగ్‌కాంగ్ క్రికెట్ సిక్సర్స్ టోర్నీ 1992లో తొలిసారి నిర్వహించబడింది. అప్పటి నుంచి 2017 వరకు ప్రతి ఏటా నిర్వహించబడిన ఈ టోర్నీ.. ఆతర్వాత వేర్వేరు కారణాల చేత గతేడాది వరకు నిర్వహించబడలేదు. తిరిగి ఏడేళ్ల తర్వాత ఈ టోర్నీ అభిమానులను అలరించేందుకు ముందుకు రానుంది. 🚨TEAM ANNOUNCEMENT🚨Team India is gearing up to smash it out of the park at HK6! 🇮🇳💥Prepare for explosive power hitting and a storm of sixes that will electrify the crowd! 🔥Expect More Teams, More Sixes, More Excitement, and MAXIMUM THRILLS! 🔥🔥HK6 is back from 1st to… pic.twitter.com/P5WDkksoJn— Cricket Hong Kong, China (@CricketHK) October 7, 2024ఈ టోర్నీలో సచిన్ టెండూల్కర్, ఎంఎస్ ధోని, షేన్ వార్న్, వాసిం అక్రమ్, సనత్ జయసూర్య లాంటి దిగ్గజాలు పాల్గొన్నారు. ఈ టోర్నీలో పాకిస్తాన్, ఇంగ్లండ్, సౌతాఫ్రికా జట్లు సక్సెస్ఫుల్ జట్లుగా ఉన్నాయి. భారత్ 2005 ఎడిషన్‌లో ఈ టోర్నీ విజేతగా నిలిచింది. శ్రీలంక, ఆస్ట్రేలియా, వెస్టిండీస్ సైతం తలో ఏడాది విజేతలుగా నిలిచాయి.హాంగ్‌కాంగ్ క్రికెట్ సిక్సర్స్ టోర్నీ రూల్స్ ఇలా ఉంటాయి..ఈ టోర్నీలో పాల్గొనే ప్రతి జట్టులో ఆరుగురు సభ్యులు ఉంటారు.ఈ టోర్నీలో ప్రతి జట్లు ఐదు ఓవర్లు వేయాల్సి ఉంటుంది. ఒక్కో ఓవర్లో ఎనిమిది బంతులు ఉంటాయి. వికెట్‌కీపర్ మినహా ప్రతి ఆటగాడు తలో ఓవర్ బౌలింగ్ చేయాల్సి ఉంటుంది. వైడ్ మరియు నో బాల్స్‌కు రెండు పరుగులు కేటాయిస్తారు.ఆరుగురు బ్యాటర్లు ఔటయ్యేంత వరకు ప్రతి మ్యాచ్ కొనసాగుతుంది. ప్రతి గేమ్‌లో బ్యాటర్ 31 పరుగుల తర్వాత రిటైర్డ్ అవుతాడు. ఒకవేళ ఐదుగురు ఔటైతే అతను తిరిగి బరిలోకి దిగుతాడు. చదవండి: T10 League: ఊతప్ప ఊచకోత.. కేవలం 27 బంతుల్లోనే! -
ముంబై.. చాలా కాస్ట్లీ గురూ!
సాక్షి, అమరావతి: ప్రముఖ హెచ్ఆర్ కన్సల్టెన్సీ సంస్థ మెర్సర్– ‘2024 కాస్ట్ ఆఫ్ లివింగ్’ సర్వే ప్రకారం దేశంలోనే అత్యంత ఖరీదైన నగరాల్లో ముంబై అగ్రస్థానంలో నిలిచింది.దేశ ఆర్థిక రాజధానిగా పిలిచే ముంబైలో జీవించే ప్రవాసుల జీవన వ్యయం గణనీయంగా పెరిగినట్టు ఈ సంస్థ వెల్లడించింది. ప్రపంచ వ్యాప్తంగా 11 స్థానాలు ఎగబాకి 136వ స్థానానికి చేరుకుంది. ఢిల్లీ 164, చెన్నై ఐదు స్థానాలు దిగజారి 189వ స్థానానికి, అలాగే బెంగళూరు ఆరు స్థానాలు క్షీణించి 195వ స్థానానికి చేరుకున్నాయి. హైదరాబాద్ 202వ స్థానంలో స్థిరంగా కొనసాగుతోంది.ఉపాధి, ఉద్యోగ అవకాశాల కోసం వేరొక నగరం, దేశానికి వలస వెళ్లి జీవించడంలో జీవన వ్యయం కీలక పాత్ర పోషిస్తున్నది. స్థానిక ఆర్థిక పరిస్థితులు కొన్ని నగరాలను ప్రవాసులకు మరింత ఖరీదైనవిగా చేస్తున్నట్లు నివేదిక పేర్కొంది. ఈ వరుసలోనే పూణే ఎనిమిది స్థానాలు ఎగబాకి 205వ, కోల్‌కతా నాలుగు స్థానాలు ఎగబాకి 207వ స్థానానికి చేరుకున్నాయి. ఇక్కడ ఈ ఖర్చులు ఎక్కువ ఆసియాలో అత్యంత ఖరీదైన నగరంగా ముంబై 21వ స్థానం, ఢిల్లీ 30వ స్థానంలో ఉన్నాయి. ఢిల్లీలో ఈ ఏడాది గృహాల అద్దెలు 12–15 శాతం పెరిగాయి. ముంబైలో 6–8 శాతం, బెంగళూరు, పూణే, హైదరాబాద్, చెన్నైలలో 2–6 శాతం పెరుగుదల నమోదైనట్లు నివేదిక చెబుతున్నది. ఇక ముంబైలో రవాణా ఖర్చులు భారీగా ఉంటున్నాయి. ఆ తర్వాత బెంగళూరు ఉంది.పాల ఉత్పత్తులు, రొట్టెలు, పానీయాలు, నూనెలు, పండ్లు, కూరగాయలు వంటి రోజువారీ నిత్యావసరాల కోసం కోల్‌కతాలో పొదుపుగా ఖర్చు చేయాల్సిన పరిస్థితి. కేవలం ఆల్కహాల్, పొగాకు ఉత్పత్తులు ఢిల్లీలో అత్యంత తక్కువ ధరలకు లభిస్తున్నాయి. వ్యక్తిగత సంరక్షణ ఉత్పత్తుల ఖర్చుల్లో మాత్రం ముంబై అందనంత ఎత్తులో ఉంది. దీని వెనుకే చెన్నై ఉంది. ఎనర్జీ, యుటిలిటీ ఖర్చుల్లో ముంబై, పూణేలు భయపెడుతున్నట్లు నివేదిక పేర్కొంది. హాంకాంగ్ మరోసారి ప్రపంచవ్యాప్తంగా జీవన వ్యయాన్ని పరిశీలిస్తే మొదటి ఐదు నగరాలు ర్యాంకింగ్‌లో ఎటువంటి మార్పు కనిపించలేదు. హాంకాంగ్ (చైనా) అగ్రస్థానాన్ని నిలబెట్టుకోగా, సింగపూర్, జ్యూరిచ్, జెనీవా, బాసెల్, బెర్న్ (స్విట్జర్లాండ్), న్యూయార్క్ సిటీ (యూఎస్), లండన్ (యూకే), నసావు (బహామాస్), లాస్ ఏంజిల్స్ (యూఎస్) తర్వాతి స్థానాల్లో నిలిచాయి. మెర్సర్ సర్వే ప్రపంచ వ్యాప్తంగా 227 నగరాల్లో జీవన వ్యయాన్ని అంచనా వేసింది. గృహనిర్మాణం, రవాణా, ఆహారం, దుస్తులు, గృహోపకరణాలు, వినోదం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుంది. 2024లో అధిక జీవన వ్యయాన్ని ఖరీదైన గృహ వినియోగం, అధిక రవాణా ఖర్చులు, వస్తువులు, సేవల అధిక ధర, ద్రవ్యోల్బణం, మారకపు రేటు హెచ్చుతగ్గులు, యుటిలిటీలు, స్థానిక పన్నులు, విద్య తీవ్రంగా ప్రభావితం చేసినట్టు వివరించింది. అధిక జీవన వ్యయాలకు ప్రసిద్ధి చెందిన న్యూయార్క్ నగరం ఈ జాబితాలో ఏడో స్థానాన్ని పొందింది. ఆసియా–పసిఫిక్ ప్రాంతాల్లోని నగరాలు టాప్–10లో ఎక్కువ సంఖ్యలో ఉండడం విశేషం. ఇందులో టోక్యో 5వ, బీజింగ్ 9వ స్థానంలో ఉన్నాయి. -
హాంకాంగ్ లో ఘనంగా ఉగాది వేడుకలు..
హాంగ్‌కాంగ్‌లో తెలుగు వారంతా కలిసి ది హాంగ్ కాంగ్ తెలుగు సమాఖ్య ఆధ్వర్యంలో శ్రీ క్రోధి నామ సంవత్సర ఉగాది వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. కుటుంబ సభ్యులు, కొత్త స్నేహితులతో ఉల్లాసంగా సాగిన ఈ కార్యక్రమానికి స్థానిక ప్రముఖులు, శ్రీ కే. వెంకట రమణ గారుకాన్సల్, కన్సుల్టే జనరల్ అఫ్ ఇండియా,హాంగ్ కాంగ్ మరియు మకావ్; మాస్.ఏమి యుంగ్, డిస్ట్రిక్ట్ ఆఫీసర్ (ఐలాండ్స్), హాంగ్ కాంగ్ హోమ్ అఫైర్స్ డిపార్ట్మెంట్; శ్రీ. లాల్ హర్దసాని ప్రెసిడెంట్, ది హిందూ అసోసియేషన్; ఉస్తాద్ గులాం సిరాజ్, చైర్మన్, పుంహక మరియు శ్రీ. కె. వెంకట వంశీధర్, రీజినల్ హెడ్,స్టేట్ బ్యాంక్ అఫ్ ఇండియా, ముఖ్య అతిధులుగా విచ్చేసారు. శ్రీ వెంకట రమణ గారు దీప ప్రజ్వలన చేయగా, ఇతర ముఖ్య అతిధులు కూడా ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. తదనంతరం శ్రీ వెంకట రమణ గారు,హాంగ్ కాంగ్ లో తెలుగు వారు సమాఖ్య ద్వారా చేస్తున్న భాష సేవ సాంస్కృతిక పరిరక్షణను కొనియాడారు. తదనంతరం శంకరంబాడి సుందరాచారి గారి రచన ‘మా తెలుగు తల్లికి మల్లె పూదండ‘ గానంతో ప్రారంభైన సాంస్కృతిక కార్యక్రమాలు ప్రేక్షకులను అలరించాయి. కూచిపూడి, భరతనాట్యం వంటి సాంప్రదాయ నృత్యాలు, ఫ్లూట్ మరియు యుకెలేలే వాయిద్యాలపై టాలీవుడ్ పాటలు, ఫ్యూజన్ డ్యాన్స్, పాత క్లాసిక్ మెడ్లీలకు నృత్యం వంటి విభిన్నమైన ఆట పాటలతో మరియు హాస్య నాటిక తో కార్యక్రమం ఆసాంతం ఆకట్టుకుంది. గౌరవనీయ అతిధులు కాన్సల్ శ్రీ వెంకట రమణ గారు మరియు మిస్ మాస్.ఏమి యుంగ్ సమాఖ్య లోని స్వచ్చంద సేవకులకు, తెలుగు బడి గురువులకు, స్థానికంగా జరిగే జాతీయ అంతర్జాతీయ మారథాన్లలో మరియు ఆక్స్‌ఫామ్ ట్రయిల్ వాకర్ లో పాల్గొని విజయవంతంగా పూర్తి చేసిన వారి ప్రతిభ గుర్తిస్తూ వారికి మొమెంటోలు అందించారు. సమాఖ్య వ్యవస్థాపక అధ్యక్షురాలు శ్రీమతి జయ పీసపాటి కార్యక్రమ వివరాలిస్తూ, హాంగ్ కాంగ్ లో నివసిస్తున్న తెలుగు వారు సంప్రదాయ వస్త్రధారణతో హాజరైన సభ్యులతో తెలుగుతనం వెల్లివిరిసిన ఈ వేడుకలతో తెలుగు నేలను మరిపించిందని హర్షం తెలిపారు. ప్రపంచంలోని అత్యంత ఖరీదైన నగరం కనుక ఇక్కడ తమకి ఇక్కడ పెద్ద హాల్ల్స్ అందుబాటులో ఉండవని, ప్రభుత్వ వసతులు లభ్యమైనప్పుడు వేడుకలు చేసుకుంటున్నామని, అందుకీ ఉగాది వేడుకలు చేసుకోవడం కొంత ఆలస్యంయ్యిందని వివరించారు .జూన్ లో తమ సంస్థ క్రీడా దినోత్సవానికి సిద్ధమవుతున్నామని చెప్పారు. సమాఖ్య కార్యవర్గ సభ్యులు జయ పీసపాటి, రాజశేఖర్ మన్నే,రమేష్ రేణిగుంట్ల, హరీన్ తుమ్మల, రమాదేవి సారంగా, మాధురి కొండా మరియు ఇతర సభ్యులు అపర్ణ కంద, రాధికా సంబతూర్, ప్రత్యుష – రవికాంత్ గునిశెట్టి, కల్పన – జయసురేష్ మట్టపర్తి, ప్రియాంక – బాబీ సత్తినేని, కృష్ణ ప్రసాద్ రెడ్డి, భరత్ కోరాడ, ధర్మ రాజు దుంప, సుగుణ రవి, మానస గర్దాస్, శాంతి పలుకూరి తదితరులు ఉగాది వేడుకల నిర్వాహణలో ఉత్సాహంగా పాల్గొన్నారు. -
32 వీడియో లింకులను బ్లాక్ చేసిన యూట్యూబ్!
ప్రముఖ ఆన్లైన్ వీడియో ప్లాట్‌ఫామ్ యూట్యూబ్ నిషేధిత కంటెంట్‌గా భావించే 32 వీడియో లింకులను బ్లాక్ చేస్తున్నట్లు ప్రకటించింది. హాంకాంగ్ కోర్టు నిర్ణయానికి లోబడి ఈ చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పింది.చైనా-హాంకాంగ్ మధ్య కొన్నేళ్లుగా రాజకీయ, బౌగోళిక సమస్య కొనసాగుతోంది. హాంకాంగ్‌లో ప్రత్యేకపాలన ఉంటుంది. అక్కడి ప్రభుత్వాన్ని చైనాకు అనుకూలంగా ఉండే వారికి కట్టబెడుతారు. దాంతో స్థానిక ప్రజలనుంచి వ్యతిరేకత ఎదురవుతోంది. అందులో భాగంగా 2019లో ‘గ్లోరీ టు హాంకాంగ్’ అనే నిరసన గీతం ప్రాచుర్యంలోకి వచ్చంది. దీన్ని నిషేధించాలని కోరుతూ హాంకాంగ్ అప్పీల్ కోర్టులో వ్యాజ్యాలు దాఖలయ్యాయి. ఆ గీతం యూట్యూబ్‌లో వైరల్‌గా మారడంతో దాన్ని తొలగించాలని తాజాగా కోర్టు ఆదేశించింది. ఫలితంగా పాటకు సంబంధించిన 32 వీడియో లింకులను తొలగిస్తున్నట్లు యూట్యూబ్ ప్రకటించింది. చైనా నుంచి హాంకాంగ్ విభజనను కోరుకుంటున్న అసమ్మతివాదులు ఆ పాటను ఉపయోగించుకోవచ్చని న్యాయమూర్తులు హెచ్చరించారు.ఇదీ చదవండి: టీవీ రిమోట్ పనిచేయడం లేదా..? చిట్కా మీ కోసమే..కోర్టు నిర్ణయంతో నిరాశ చెందినట్లు యూట్యూబ్ చెప్పింది. అయినప్పటికీ ఆ తీర్పును పాటిస్తామని స్పష్టం చేసింది. బుధవారం నుంచి ఇకపై యూట్యూబ్‌లో ఆ గీతం కోసం సెర్చ్‌చేస్తే ‘కోర్టు ఆర్డర్ వల్ల ఇందుకు సంబంధించిన కంటెంట్ దేశీయ డొమైన్లో నిషేధించడమైంది’ అనే పాప్అప్ మెసేజ్ వస్తుందని చెప్పింది. ఆన్లైన్లో స్వేచ్ఛగా తమ భావాలను వ్యక్తీకరించానుకునేవారిని కట్టడి చేయడం సరికాదని, ఈ వ్యవహారానికి సంబంధించి ఇతర వర్గాలకు అప్పీల్ చేస్తామని తెలిపింది. ఇప్పటికే మానవ హక్కుల సంస్థలతో తమ భావాలను పంచుకున్నట్లు కంపెనీ పేర్కొంది. -
NRI: హాంగ్‌కాంగ్‌లో జేమీ లీవర్ పండించిన నవ్వుల డోలలు!
మే 1979లో ఒక సొసైటీ గా నమోదు చేయబడిన ఇండియన్ ఆర్ట్స్ సర్కిల్ అనేది లాభాపేక్ష లేని సంస్థ. సభ్యులు మరియు సాధారణ ప్రజల కోసం భారతీయ సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించడం, సభ్యులలో నాటకం, సంగీతం, నృత్యం, సాహిత్యం మరియు దృశ్య కళలపై ఆసక్తిని పెంపొందించడం మరియు ఇలాంటి సంస్థలతో సహకరించడం దీని లక్ష్యాలు. స్థానిక ప్రతిభావంతులకు అవకాశాలను అందించడానికి ఈ బృందం ప్రతి సంవత్సరం రెండు కార్యక్రమాలను నిర్వహిస్తుంది మరియు భారతదేశం నుండి ప్రఖ్యాత కళాకారులను కూడా ఆహ్వానిస్తుంది. భారత కాన్సుల్ జనరల్ మరియు శ్రీమతి పూర్విజ్ ష్రాఫ్ గౌరవ పోషకులు, మరియు శ్రీ జి.టి. గుల్ సర్కిల్ యొక్క శాశ్వత సలహాదారుగా సేవలు అందజేస్తున్నారు.కోవిడ్ తరువాత అంటే నాలుగు సంవత్సరాల తరువాత మొదటి సారి, ఇండియన్ ఆర్ట్స్ సర్కిల్ ఈ సంవత్సరం మన తెలుగు అమ్మాయి జేమి లీవర్ ని హాంగ్ కాంగ్ కి ఆహ్వానించారు. "గూన్జ్ సితారోన్ కి" అనే సాంస్కృతిక వినోద కార్యక్రమం 18 ఏప్రిల్ న స్థానిక సిటి హాల్ లో నిర్వహించారు. పూర్వ చైర్ పర్సన్ శ్రీమతి రాణి సింగ్ , చైర్ పర్సన్ శ్రీమతి రానూ సింగ్ , ఉపాధ్యక్షుడు సర్దార్ నవ్‌తేజ్ సింగ్ మరియు కార్యదర్శి శ్రీమతి జయ పీసపాటి మరియు ఇతర కార్యవర్గ సభ్యులందరూ ఈ కార్యక్రమాన్ని అద్భుతంగా నిర్వహించారు. చైర్ పర్సన్ శ్రీమతి రానూ సింగ్ కార్యక్రమాన్ని ప్రారంభించటానికి భారత కాన్సుల్ జనరల్ ఆఫ్ ఇండియా శ్రీమతి సత్వంట్ ఖనాలియా గారిని ఆహ్వానించి సన్మానించారు. సత్వంత గారు ఇండియన్ ఆర్ట్స్ సర్కిల్ చేస్తున్న అద్భుతమైన కార్యక్రమాలను మరియు కళారులకి ఒక చక్కని వేదికని అన్జేస్తున్నందుకు,వారిని ప్రోత్సహిస్తున్నందుకు ప్రశంసించారు. స్థానిక కళాకారుల బాలీవుడ్ , హిప్ హాప్, జానపద , నృత్యాలతో మరియు అలనాటి మధుర గీతాలతో ప్రారంభమైన ‘గూన్జ్ సితారోన్ కి” ని ప్రేక్షకులు ఆనందిస్తూ కరతాళ ధ్వనులతో కళాకారులని ప్రోత్సహించారు. అప్పుడు జేమీ లీవర్ ఎంట్రీ ఇచ్చారు … ఇంకా అప్పటినుంచి నవ్వుల పువ్వుల పండిస్తూ జేమీ మిమిక్రీ తో కామిడి చేస్తూ ప్రముఖ బాలీవుడ్ హీరోయిన్స్ హేమ మాలిని , మలాయికా, దీపికా పడుకోన, కంగనా రనౌత మో వారిని అనుకరిస్తూ తనకు ప్రత్యెక గుర్తింపు తెచ్చిన ప్రముఖ గాయని ఆశా భోంస్లే , కొరియోగ్రాఫర్ ఫరా ఖాన్ మరియు తన తండ్రి జాని లీవర్ ల మిమిక్రీ తో ఉత్తేజభరితమైన వాతావరణo ప్రేక్షకులని ఆనందోత్సాహాలతో ముంచేసింది. హాస్యంలో మిమిక్రి, గానం, నృత్యంమేళవించి ఒక గంట సేపు నవ్వుల మారథాన్ చేసారు జేమి!! ప్రముఖ సిని నటుడు, కమెడియన్ జాని లీవర్ అసలు పేరు జాన్ ప్రకాష్ రావు జనుముల, అయితే ఆయన హిందూస్తాన్ లేవేర్స్ లో పని చేస్తూ స్టాండ్ అప్ కామెడి పండించి స్టాఫ్ ని నవ్వుల డోలలూగించినప్పుడు, యాజమాన్యం వారు ఆయనకీ 'లీవర్' అని పేరు ఇవ్వడం జరిగింది. అప్పటి నుంచి ఆయన ఇంటి పేరే 'జానీ లీవర్' పాపులర్ అయ్యింది. తెలుగు హిందీ చిత్రరంగం లో కమెడియన్ గా పేరొందిన ప్రముఖ నటులు తండ్రి జానీ లీవర్ ప్రతిభని పుణికి పుచ్చుకుంది అని జెమీ లీవర్ గురించి చెప్పడం అతిశయోక్తి కాదేమో ! హాంగ్ కాంగ్ కళా ప్రేమికుల హృదయాల్లో చెరగని స్థానాన్ని సంపాయించుకున్న జేమి తను ఇంత ఉత్సాహభరితమైన ప్రేక్షకుల మధ్య ప్రదర్శించడం తనకి ఎంతో ఆనందంగా వుందని హర్షం వ్యక్తం చేసారు. స్థానికంగా విచ్చేసిన ప్రముఖులు , భారతీయ కన్సులార్ శ్రీ కుచిభోట్ల వెంకట్ రమణ గారు తదితరులు జేమి కి తమ శుభాభినందనలు, శుభాకాంక్షలు తెలిపారు. ఆమె స్టాండ్ అప్ కామెడి లో గొప్ప శిఖరాలను అందుకోవాలని త్వరగా మరల హాంగ్ కాంగ్ రావాలని స్థానికులు ఆశ వ్యక్తం చేసారు అందుకు జేమి తన చెరగని చిరునవ్వుతో అందరిని మంత్రముగ్ధుల్ని చేసింది. ఇండియన్ ఆర్ట్స్ సర్కిల్ జేమీ గౌరవార్ధం విందు భోజనం ఏర్పాటు చేసి అభినందించారు. జేమి ఇంస్టా లింక్ మీకోసం https://www.instagram.com/p/C58BqvivjhS/https://www.instagram.com/p/C5qEy7FoTut/?img_index=1ఇండియన్ ఆర్ట్స్ సర్కిల్ ఇంస్టా లింక్ https://www.instagram.com/p/C58IYSFy8qR/ -
హాంకాంగ్ కోర్టు సంచలన తీర్పు.. చిక్కుల్లో చైనా కంపెనీ!
చైనా రియల్ ఎస్టేట్ కంపెనీ 'ఎవర్‌గ్రాండే' గ్రూప్‌ను లిక్విడేషన్ చేయాలని హాంకాంగ్ కోర్టు ఆదేశించింది. రుణదాతలతో పునర్వ్యవస్థీకరణ ఒప్పందం కుదుర్చుకోవడంలో విఫలమైన నేపథ్యంలో కోర్టు ఈ ఆదేశాలు జారీ చేసింది. ఆచరణాత్మకమైన పునర్వ్యవస్థీకరణ ప్రణాళిక అమలు చేయలేకపోవడంతోపాటు, కంపెనీ దివాళా దిశగా అడుగులేస్తున్న కారణంగానే కంపెనీ మూసివేస్తేనే మంచిదని పేర్కొంటూ హాంకాంగ్ కోర్టు న్యాయమూర్తి లిండా ఛాన్ పేర్కొన్నారు. ఈ ప్రభావం చైనా ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉందని పలువురు భావిస్తున్నారు. ఎవర్‌గ్రాండే గ్రూప్ లిక్విడేషన్ జరిగితే.. స్టాక్ మార్కెట్లో వివిధ సంస్థల స్టాక్స్‌పై అమ్మకాల ఒత్తిళ్లు కూడా పెరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం కంపెనీ ఆస్తుల విలువ మొత్తం 240 బిలియన్ డాలర్లు, కాగా.. సంస్థ చేసిన అప్పులు విలువ సుమారు 300 బిలియన్ డాలర్లు. ఇదీ చదవండి: అంబానీ కంటే ముందే 'లోటస్' కారు కొన్న హైదరాబాద్ మహిళ హాంకాంగ్ కోర్టు తీర్పు నేపథ్యంలో ఎవర్‌గ్రాండే స్టాక్స్ 20 శాతానికి పైగా నష్టపోయాయి. ఫలితంగా కొంత సేపు హాంకాంగ్ స్టాక్ ఎక్స్చేంజీలో ట్రేడింగ్ కూడా నిలిపేశారు. చైనాలోని రియాల్టీ రంగంలో రుణాలు అదుపు తప్పాయి. వాటిని నియంత్రించడంతో పాటు.. రియాల్టీ రంగాన్ని క్రమబద్ధీకరించేందుకు చైనా రెగ్యులేటరీ సంస్థలు కఠినమైన నిబంధనలు అమలులోకి తెచ్చాయి. ఫలితంగా ఎవర్‌గ్రాండే వంటి చాలా కంపెనీలు చిక్కుల్లో పడ్డాయి. ఇదే ప్రస్తుతం కంపెనీని దివాళా అంచులకు తీసుకువెళ్ళింది. -
హాంగ్‌కాంగ్‌లో ముచ్చటైన తెలుగు సాంస్కృతిక ఉత్సవం
సౌత్ చైనా సముద్ర తీరాన వున్న చిన్న ద్వీపం 'హాంగ్‌కాంగ్' లో ఇతర భారతీయ ప్రాంతాల వారితో పాటు మన ఉభయ తెలుగు రాష్ట్రాల వారు ఇక్కడ నివసిస్తున్నారు. వారి సంఖ్య చాలా తక్కువే అయినా, మన తెలుగు భాష , దేశ సంస్కృతీ సంప్రదాయాలను భావి తరాలకి అందించే కృషి లో భాగంగా తెలుగు సాంస్కృతిక ఉత్సవాలు గత కొన్ని సంవత్సరాల కాలంగా నిర్వహిస్తున్నారు. క్రిస్మస్ పండుగ, ఆంగ్ల నూతన సంవత్సరం, సంక్రాంతి పండుగల ఉత్సాహాన్ని మేళవించి ఈ కార్యక్రమాన్ని రూపొందించామని అధ్యక్షులు తెలిపారు. ఈ సంవత్సరం కూడా 'తెలుగు సాంస్కృతిక ఉత్సవం' లో ముద్దులొలికే చిన్నారుల ఫాన్సీ డ్రెస్ ,పద్యాలు - శ్లోకాలు, భక్తి పాటలు, టాలీవుడ్ - కూచిపూడి నృత్యాలు, వయోలిన్ , కీబోర్డ్ , తబలా వాయిద్యాల తో చక్కని చిక్కని కర్నాటిక్ సంగీతాలు, అక్షరమాలలో సంపూర్ణ రామాయణం కథ, చిత్ర లేఖనం ..ఇలా అనేక అంశాలలో పిల్లలు తమ ప్రతిభలతో అందరిని మురిపించారు. వ్యాఖ్యాతలుగా ఇక్కడ పెరిగి పెద్దయి, ఇదే వేదిక మీద ప్రదర్శనలు ఇచ్చిన రజిత మరియు హర్షిత, ఇద్దరు అక్కాచెల్లెలిద్దరు చక్కటి తెలుగులో నిర్వహించారు. ముఖ్య అతిధులుగా కౌన్సలార్ శ్రీ. కె. వెంకట రమణ గారు,కాన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియా ఇన్ హాంగ్ కాంగ్ & మకావ్, స్థానిక ఇంటర్నేషనల్ ప్రైమరీ స్కూల్ హెడ్ శ్రీమతి ప్రియా కాంతన్ మరియు హాంగ్ కాంగ్ ఆర్ట్అఫ్ లివింగ్ టీచర్ శ్రీమతి సీమా హిరానందాని విచ్చేసి, పిల్లల ప్రతిభలని చూసి ఆనందించి, మెచ్చుకొని తల్లి తండ్రులని ప్రశంసించారు. పిల్లల్ని ఇలాగే తమ భాష, సంస్కృతీ, దేశం గురించిన ఇటువంటి కార్యక్రమాలలో ఎప్పుడు పాల్గొనే లా ప్రోత్సహించాలని, సంస్థ చేస్తున్న సేవలను కొనియాడారు. అతిధులకు తమ కృతజ్ఞతలు తెలుపుతూ వ్యవస్థాపక అధ్యక్షురాలు శ్రీమతి జయ పీసపాటి, కార్యక్రమం విజయవంతంగా నిర్వహించడంలో తమ కార్యవర్గ సభ్యులను, వ్యాఖ్యాతలను, పిల్లలను వారి తల్లి తండ్రులకు దయవాదాలు తెలుపుతూ, అభినందించారు. -
హాంకాంగ్‌లో చూసి కొత్త ఆలోచన
కొమరం భీమ్: ఉపాధి కోసం హాంకాంగ్ వెళ్లిన యువకుడు అక్కడ వేసిన డ్రాగన్‌ఫ్రూట్ పంటను చూడడంతో తనకు ఓ కొత్త ఆలోచన వచ్చింది. తమ చేనులో కూడా డ్రాగన్ ప్రూట్ పంట వేయాలనుకుని విషయం తన అన్నతో చెప్పాడు. అతను కూడా సై అనడంతో పంట సాగుకు ముందుకు వచ్చారు. ఏడాదిక్రితం పంట వేయగా ప్రస్తుతం ఫలాలు ఇస్తుంది. హాంకాంగ్‌లో చూసి ఆలోచన జన్నారం మండలం దేవునిగూడ గ్రామానికి చెందిన కల్లెం రవీందర్‌రెడ్డి, జమున దంపతులకు ఇద్దరు కుమారులు. పిల్లలు చిన్నతనంలోనే తండ్రి అనారోగ్యంతో మరణించాడు. దీంతో తల్లి జమున కూలిపని చేస్తూ వారిని డిగ్రీ వరకు చదివించింది. పెద్ద కుమారుడు శివకృష్ణారెడ్డి వ్యవసాయం వైపు వెళ్లగా సాయికృష్ణారెడ్డి ఉపాధి కోసం హాంకాంగ్ వెళ్లాడు. అక్కడ ఎక్కువశాతం మంది డ్రాగన్ ఫ్రూట్ సాగు చేస్తుండడంతో పంట గురించి తెలుసుకున్నాడు. జగిత్యాల రైతు వద్ద అవగాహన జగిత్యాల జిల్లా అంతర్గావ్కు చెందిన రైతు శుభాష్‌రెడ్డి డ్రాగన్‌ఫ్రూట్ సాగు చేస్తున్నట్లు శివకృష్ణారెడ్డి యూట్యూబ్‌లో తెలుసుకున్నాడు. అక్కడికి వెళ్లి రైతు వద్ద పంట గురించి పూర్తిగా తెలుసుకుని తమ్మునికి వివరించాడు. అతను సరే అనడంతో తమకున్న ఎకరం 10 గుంటల భూమిలో 2022 డిసెంబర్లో అదే రైతు వద్ద నుంచి రూ.80కి ఒక మొక్క చొప్పున 2 వేల మొక్కలు కొనుగోలు చేశారు. 500 సిమెంటు దిమ్మెలు తీసుకువచ్చారు. ఒక్కో దిమ్మె చుట్టూ నాలుగు మొక్కలు నాటి డ్రిప్ ద్వారా నీటిని అందించారు. మొత్తంగా రూ.6 లక్షల వరకు ఖర్చు చేశారు. అందుతున్న ఫలాలు గతేడాది డిసెంబర్లో మొక్కలు నాటగా 2023 నవంబర్‌లో కాయలు కాశాయి. మొదటి దశలో ఆశించినంత కాయకపోవడంతో వాటిని సొంతానికి వాడుకున్నారు. ఏటా జూన్ నుంచి నవంబర్ వరకు పంట చేతికి వస్తుందని వారు పేర్కొన్నారు. ప్రస్తుతం మార్కెట్లో కిలోకు రూ.150 ఉందని, ఎకరం పది గుంటల్లో సుమారు 2 టన్నుల పంట వచ్చే అవకాశం ఉందన్నారు. ఒక్కసారి పంట వేస్తే 20 సంవత్సరాల వరకు ఫలాలు వస్తుంటాయని, మొక్క పెరిగిన కొద్దీ కత్తిరిస్తూ ఉంటే ఏటా పంట చేతికి వస్తుందన్నారు. ఏడాదికి రూ.3 లక్షల నుంచి రూ.4 లక్షల వరకు లాభాలు వచ్చే అవకాశం ఉందని వారు పేర్కొన్నారు. కొత్త ఆలోచనతో సాగు ఉపాధి కోసం హాంకాంగ్ వెళ్లా. అక్కడ ఆన్లైన్ పనిచేస్తూ అప్పుడప్పుడు బయటకు వెళ్లగా ఎక్కువగా డ్రాగన్‌ఫ్రూట్ పంట కనిపించేది. అదే పంటను మా భూమిలో కూడా వేయాలని కొత్త ఆలోచనతో వచ్చింది. అన్నతో చర్చించి మా భూమిలో మొక్కలు నాటాం. ఇప్పుడు మొదటి క్రాపు చేతికి వచ్చింది. – సాయికృష్ణారెడ్డి సబ్సిడీ ఇవ్వాలి మా తమ్మునికి వచ్చిన ఆలోచనతో ఎకరం పది గుంటల్లో మొక్కలు నాటాం. డ్రిప్‌తో నీరందిస్తున్నాం. ఇప్పటి వరకు రూ.6 లక్షలు ఖర్చు వచ్చింది. వచ్చే జూన్ వరకు రెండో క్రాప్ వచ్చే అవకాశం ఉంది. ప్రభుత్వం ఆయిల్‌పాం పంట మాదిరి డ్రాగన్‌ఫ్రూట్ పంటకు కూడా సబ్సిడీ ఇస్తే బాగుండు. ఖర్చులు తగ్గుతాయి. – శివకృష్ణారెడ్డి -
హాంగ్‌కాంగ్‌లో బుజ్జాయిలతో భోగిపండ్లు
ది హాంగ్ కాంగ్ తెలుగు సమాఖ్య స్థాపించక ముందు నుంచే దాదాపు రెండు దశాబ్దాలుగా భోగిపండ్లు వేడుకని చేస్తున్న, వ్యవస్థాపక అధ్యక్షురాలు శ్రీమతి జయ పీసపాటి తమ సంతోషాన్ని తెలుపుతూ ఈ సంవత్సర నిర్వహించిన భోగిపండ్ల సరదాల విశేషాలు తెలిపారు. ముఖ్య అతిధులు స్థానిక యునెస్కో అసోసియేషన్ కార్యవర్గ సభ్యులు శ్రీ తిరునాచ్ దంపతులు మరియు బాలవిహార్ గురువు శ్రీమతి చిత్ర జికేవీ దంపతులు విచ్చేసి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించగా పిల్లలకు భోగి పండ్లు పొసే అంశాన్ని కొనసాగించారు. పిల్లలు సందడిగా చాకోలెట్లు ఏరుకొంటూ, మరి కొందరు అవి తినే ప్రయత్నం చేస్తుంటే వారి అమ్మ నాన్నలు వద్దని ఆరాట పడుతుంటే చూడ ముచ్చట కొలిపింది. మరింత ఆనందంగా కొనసాగింది పిల్లల కానుకలు ఇచ్చి పుచ్చుకోవడం. ముఖ్య అతిధులు కూడా పిల్లలకు భోగి పండ్లు పోసీ ఆశీర్వదించి చాలా సంతోశాన్ని తెలిపారు. తమకి ఇటువంటి అనుభవం ఎప్పుడు కలగలేదని అన్నారు. అలాగే మరి కొందరూ.. తమకి ఈ వేడుక అనుభవం తొలిసారిదని, తమ పిల్లలకి అందరితో కలిపి చేసుకోవడం ఎంతో ఆనందాన్ని ఇచ్చిందని తెలిపారు. కార్యవర్గ సభ్యులందరు శ్రీమతి రమాదేవి, శ్రీ రమేష్, శ్రీ రాజశేఖర్ అలాగే శ్రీమతి మాధురి అధ్యక్షులు శ్రీమతి జయతో కలసి కార్యక్రమాన్ని నిర్వహించడంలో కీలకపాత్ర పోషించారు. విచ్చేసిన సభ్యులందలందరితో పాటు కొందరు పిల్లలు కూడా తమ వంతు సహాయాన్నిఈ కార్యక్రమ నిర్వాహణలో అందించారు. ఈ విషశేషాలను తమ కెమెరాలో అద్భుతమైన జ్ఞాపకికాలుగా అందించారు శ్రీ రవికాంత్. వచ్చే వారం తమ వార్షిక తెలుగు కల్చరల్ ఫెస్టివల్ నిర్వహించబోతున్నామని, పిల్లలు తమ సంగీత నాట్య కళలను ప్రదర్శించనున్నారని ఉత్సాహంగా తెలిపారు. ఆత్మీయ పాఠకులందరికి మా హాంగ్ కాంగ్ తెలుగు వారి సంక్రాతి పండుగ శుభాకాంక్షలు! ఇవి చదవండి: సందేశాన్నిచ్చిన సంక్రాంతి ముగ్గు.. 'డోంట్ బి అడిక్టెడ్' -
అలరించిన నారాయణి గాయత్రి నృత్య ప్రదర్శన
ది హాంగ్ కాంగ్ తెలుగు సమాఖ్య, భారతీయ సంస్కృతి మరియు సంప్రదాయాలను ప్రోత్సహించడానికి, ప్రతిభావంతులైన కళాకారులు ప్రదర్శించడానికి వేదికను అందించడం అనే అంకితభావనతో సేవలను అందిస్తున్న సంస్థ. దాదాపు రెండు దశాబ్దాలుగా, హాంగ్ కాంగ్ లో భారతీయ సంస్కృతిని చురుకుగా ప్రచారం చేస్తోంది. భారతదేశంలోని విభిన్న కళారూపాలను ప్రదర్శించడానికి వివిధ కార్యక్రమాలు నిర్వహించారు. వారి ప్రయత్నాలు భారతీయ సంప్రదాయాలను పరిరక్షించడంలో మాత్రమే కాకుండా హాంగ్ కాంగ్ లోని భారతీయ ప్రవాసులలో సమైఖ్యత - సమ భావాన్ని సృష్టించడంలో కూడా కీలక పాత్ర పోషిస్తుంది.ఇటీవల, వారధి ఫౌండేషన్ (హైదరాబాద్) మరియు శ్రుతిలయ కేంద్ర నటరాజలయ (హైదరాబాద్) వారి సహకారంతో హాంగ్ కాంగ్ లో “మార్గం” అనే ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించింది. శాస్త్రీయ నృత్యం భరతనాట్యం మరియు కర్ణాటక సంగీతంలో రాణిస్తున్న యువ కళాకారిణి నారాయణి గాయత్రి ఈయుణ్ణి సోలో రిసైటల్ ఏర్పాటు చేసారు . హాంగ్ కాంగ్ నివాసులైన శ్రీ.రాజీవ్ ఈయుణ్ణి మరియు శ్రీమతి.అపర్ణ కంద దంపతుల కుమార్తె గాయత్రి ఈయుణ్ణి. గురు కలైమామణి డా.రాజేశ్వరి సాయినాథ్ గారి శిష్యరికంలో ఇటీవలే ఆగస్టు 2023లో హైదరాబాద్ లో తన ఆరంగేట్రం చేసి అందరి మన్ననలు పొందింది. ఆమె సాధించిన ఆరంగేట్ర విజయాన్ని పురస్కరించుకుని, హాంగ్‌కాంగ్‌లోని లాంటౌ ద్వీపంలో తుంగ్ చుంగ్ కమ్యూనిటీ హాల్లో 6 జనవరి 2024న నృత్య ప్రియులకు, ఆమె ఆరంగేత్రం నుండి కొన్నిఅంశాలను ప్రదర్శించారు. ఈ కార్యక్రమానికి హాంగ్ కాంగ్ & మకావులోని భారత కాన్సుల్ జనరల్ హాజరై, ప్రారంభోత్సవం చేశారు, వారు గాయత్రి మరియు ఆమె తల్లిదండ్రులను శాస్త్రీయ కళారూప సంస్కృతిని కొనసాగించడాన్నిఅభినందించారు మరియు గాయత్రికి ప్రశంసా పత్రాన్ని అందించి ప్రశంసించారు. హాంగ్ కాంగ్‌లోని వివిధ శాస్త్రీయ నృత్య-సంగీత గురువులు కూడా హాజరయ్యారు. దీప ప్రజ్వలన తరువాత, గాయత్రి కర్ణాటక సంగీతంలో తన నైపుణ్యాన్ని ప్రదర్శించింది. ఆమె శ్రావ్యమైన స్వరం ప్రేక్షకులను విస్మయానికి గురి చేసింది. గాయత్రి తల్లి శ్రీమత అపర్ణ, ప్రతి నాట్య అంశాన్ని లయబద్ధంగా వివరిస్తూ వేడుకకు వ్యాఖ్యాతగా వ్యవహరించారు. గాయత్రి తన అందమైన సాంప్రదాయ భరతనాట్య వేషధారణలో సంప్రదాయ ఆవాహనతో ప్రారంభిన్చింది. పుష్పాంజలి, అల్లారిపు, దేవీ స్తుతి, ముద్దుగారే యశోధ, తిల్లానా, మరియు మంగళం వంటి అభినయ అంశాలని అద్భుతంగా ప్రదర్శిస్తూ.. చక్కని హావ భావాలతో అందరిని ఆకట్టుకుంది. ఆమె మనోహరమైన కదలికలు మరియు వ్యక్తీకరణలు ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశాయి. ఆమె ప్రతిభ మరియు ఆమెకు కళ పట్ల గల అంకితభావం ఆమె నృత్యంలో స్పష్టంగా కనిపించాయి, అలా ఆమె ప్రేక్షకుల నుండి అనేక ప్రశంసలను అందుకుంది. గాయత్రి అభినయ చాతుర్యం, ఆమె కృషి మరియు అంకితభావం ఈ తరం యువతకి చక్కని నిదర్శనం. ఈ కార్యక్రమంలో ప్రముఖ సంగీత విద్వాంసులు ఉస్తాద్ ఘులాం సిరాజ్, కథక్ గురువులు నీశ ఝవేరి, శ్వేత రాజ్ పుట్, భరతనాట్యం గురువు సంధ్య గోపాల్, మోహినియాట్టం గురు దివ్య అరుణ్, మృదంగం కళాకారుడు అరవింద్ జేగాన్ పాల్గొన్నారు . ది హాంకాంగ్ తెలుగు సమాఖ్య వ్యవస్థాపక అధ్యక్షురాలు శ్రీమతి జయ పీసపాటి స్పందిస్తూ, మనోహరంగా సాగిన “మార్గం” లో నారాయణి గాయత్రి ఈయుణ్ణి ప్రదర్శన ద్వారా భారతీయ సంస్కృతిని ప్రోత్సహించడానికి, తమ సమాఖ్య లక్ష్యం యొక్క నిజమైన ప్రతిబింబంమని .. గాయత్రి వంటి వర్ధమాన కళాకారులు తమ ప్రతిభను ప్రదర్శించడానికి, భారతీయ సంప్రదాయాలు - సంస్కృతిని అనుసరించడానికి ఇతరులను ప్రోత్సహించడానికి ఈ కార్యక్రమం సరైన వేదిక యని అందుకు తమ సమాఖ్య సదా సిద్ధమే అన్నారు. -
Hongkong: హాంకాంగ్ తెలుగు సామాఖ్య ఆధ్వర్యంలో కార్తిక వనభోజనాలు
కార్తీకమాసం అనగానే వనభోజనాల హడావిడి మొదలౌతుంది. కార్తీక వనభోజనాలు స్నేహాన్ని, సమైక్యతను పెంపొందిస్తాయన్న మాట, ఆథ్యాత్మికం..ఆనందం..ఆరోగ్యం..సందేశం..కలగలిపి వడ్డించిన విందు భోజనం..వనభోజనం. దైనందిన జీవితంలో ఎదురయ్యే చిరాకులు, పరాకులకు దూరంగా అందరూ కలిసి వేడుక చేసుకోవడం వల్ల వత్తిళ్ళు, వేదనలు తీరతాయి. వనభోజనాలను పెద్దల కంటే పిల్లలు మరీమరీ ఆనందిస్తారు. హాంకాంగ్ తెలుగు సమాఖ్య తమ వార్షిక పిక్నిక్, కార్తీక మాసం ‘వనభోజనం’ హాంకాంగ్‌లోని అతిపెద్ద కంట్రీ పార్కులలో ఒకటైన ట్యూన్ మున్ కంట్రీ పార్క్‌లో జరుపుకున్నారు. సభ్యులు ఎంతో ఆనందంగా నీలి ఆకాశం క్రింద మరియు పార్క్ సహజ ఆవాసాలతో అందమైన పచ్చదనం మధ్య వారు సరదాగా ఆటలు ఆడారు మరియు రుచికరమైన భోజనాన్ని ఆస్వాదించారు. ప్రతి సంవత్సరం, సభ్యులందరూ ఒకరినొకరు కలుసుకోవడానికి మరియు కనెక్ట్ అవ్వడానికి ఎదురుచూస్తున్నఆనంద సమయం అది. వ్యవస్థాపక అధ్యక్షురాలు శ్రీమతి జయపీసపాటి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు తన సమర్ధవంతమైన బృందానికి మరియు సభ్యులందరికీ ధన్యవాదాలు తెలుపుతూ, హాంగ్ కాంగ్ లో ప్రజల ఆరోగ్య , ఆహ్లాదం మరియు శ్రేయస్సు కోసం అక్కడ వున్న కంట్రీ పార్క్స్ గురించి , తాము వనభోజనం కోసం వచ్చిన పార్క్ గురించి కొన్ని విశేషాలను తెలిపారు. హాంకాంగ్ కేవలం ఆకాశహర్మ్యాలు మరియు రద్దీగా ఉండే వీధులు మాత్రమే కాదు; నగరంలో చాలా పచ్చటి ప్రదేశాలు ఉన్నాయి, సుందరమైన ప్రదేశాలు, హైకింగ్ ట్రయల్స్, వన్యప్రాణులు, చారిత్రాత్మక ప్రదేశాలు మరియు అవుట్డోర్ అడ్వెంచర్ కోసం అంతులేని అవకాశాలు ఉన్నాయి. అటువంటి జనసాంద్రత కలిగిన మహానగరానికి విశేషమేమిటంటే, మొత్తం భూమిలో మూడొంతుల భూమి గ్రామీణ ప్రాంతాలు మరియు హాంకాంగ్ యొక్క మొత్తం భూభాగంలో 40 శాతం - 435 చదరపు కిలోమీటర్లు - 24 కంట్రీ పార్కుల సరిహద్దులలో రక్షించబడింది. వాటిలో అడవులు, గడ్డి భూములు మరియు 3,300 స్థానిక మొక్కల రకాలు మరియు చిరుతపులి మరియు సివెట్ పిల్లుల నుండి అడవి పందులు మరియు కొండచిలువల వరకు వన్యప్రాణులు ఉన్నాయి. పాంగోలిన్లు మరియు రోమర్స్ చెట్టు కప్పలు వంటి ప్రపంచవ్యాప్తంగా అంతరించిపోతున్న జాతులు కూడా స్వేచ్ఛగా తిరుగుతాయి, తద్వారా దేశ ఉద్యానవనాలు పరిరక్షణకు ముఖ్యమైనవి. ట్యూన్ మున్ పార్క్ మొత్తం 12.5 హెక్టార్ల విస్తీర్ణంలో ఉంది, ఇది కొత్త భూభాగాలలో విస్తృతమైన సౌకర్యాలను అందించే మొదటి ప్రధాన పార్క్. ఇది 3 దశలను కలిగి ఉంటుంది, ఫేజ్ I ఆగస్ట్ 1985లో, ఫేజ్ II ఆగస్ట్ 1988లో మరియు ఫేజ్ III ఫిబ్రవరి 1991లో ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. ఈ పార్క్ టుయెన్ మున్ జిల్లా పట్టణ కేంద్రంలో మరియు ట్యూన్ మున్ టౌన్ హాల్ పరిసరాల్లో ఉంది. పునరుద్ధరణ భూమిపై నిర్మించబడిన ఈ ఉద్యానవనం ట్యూన్ మున్ నివాసితులకు అలాగే భూభాగంలోని సందర్శకులకు పచ్చదనంతో కూడిన విశ్రాంతి స్థలాన్ని అందిస్తుంది. ఉద్యానవనంలో సుమారు 1500 చెట్లు మరియు 200 వివిధ జాతులకు చెందిన 100 000 పొదలు నాటబడ్డాయి. ల్యాండ్‌స్కేప్ ఫీచర్లు మరియు అందమైన వాతావరణంతో పాటు ఉల్లాసంగా మరియు రిలాక్స్‌గా అనిపించేలా, పార్క్‌లో దాదాపు 1 హెక్టారు విస్తీర్ణంలో కృత్రిమ సరస్సు ఉంది. పార్క్ యొక్క దక్షిణ భాగంలో ఉన్న రెప్టైల్ హౌస్ చాలా మంది సందర్శకులను ఆకర్షిస్తున్న మరొక ప్రధాన వాన్టేజ్ పాయింట్. పార్క్‌లోని ఇతర సౌకర్యాలు వాటర్ క్యాస్కేడ్, మోడల్ బోట్ పూల్, యాంఫీథియేటర్, రోలర్-స్కేటింగ్ రింక్, పిల్లల ప్లేగ్రౌండ్ మరియు మల్టీ-గేమ్ ఏరియా మొదలైనవి ఉన్నాయి. మొత్తం మీద, పార్క్ సందర్శకులకు ఒక రోజు సరదాగా గడిపేందుకు అనువైన విశ్రాంతి ప్రదేశం. 1999లో ప్రారంభించబడిన ఈ రెప్టైల్ హౌస్ విశ్రాంతి మరియు సాంస్కృతిక సేవల విభాగంలో ఇదే మొదటిది. ఇది పార్క్ యొక్క దక్షిణ భాగంలో టర్ఫెడ్ ప్రాంతం వద్ద ఉంది మరియు 245 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఉంది, ఇది 2006లో మొత్తం 500 చదరపు మీటర్లకు విస్తరించబడింది. రెప్టైల్ హౌస్‌లోని సౌకర్యాలలో ఇండోర్ టెర్రేరియా మరియు ప్రాంగణంలో టెర్రిరియం ఉన్నాయి. ఇక్కడ వివిధ రకాల సరీసృపాలు ప్రదర్శించబడతాయి. ప్రస్తుతం, రెప్టైల్ హౌస్ లో 53 ప్రత్యక్ష ప్రదర్శనలతో కూడిన 33 జాతులు ఉన్నాయి, వీటిలో కార్పెట్ పైథాన్, వోమా పైథాన్, బాల్ పైథాన్, గ్రీన్ ట్రీ పైథాన్, పిగ్-నోస్డ్ టర్టిల్, రేడియేటెడ్ టార్టాయిస్ ఉన్నాయి. ఆసియాటిక్ లీఫ్ తాబేలు, స్పైడర్ తాబేలు, నల్ల చెరువు తాబేలు, స్పర్డ్ టార్టాయిస్, మడ అడవుల మానిటర్, నీలి నాలుకగల చర్మం, అలంకరించబడిన స్పైనీ-టెయిల్డ్ బల్లి, చిరుతపులి గెక్కో మరియు చైనీస్ వాటర్ డ్రాగన్. అంతేకాకుండా, సంబంధిత సమాచారం యొక్క గ్రాఫిక్ ప్రదర్శన మరియు 7 సరీసృపాల నమూనాలు కూడా అందించబడ్డాయి. 28 800 మంది సమూహ సందర్శకులతో సహా 360 000 వార్షిక ప్రోత్సాహంతో, సరీసృపాలు హౌస్ పార్క్‌లోని ప్రధాన వాన్టేజ్ పాయింట్లలో ఒకటిగా మారుతోంది. -
హాంకాంగ్ తెలుగు సమాఖ్య ఆధ్వర్యంలో ఘనంగా దీపావళి వేడుకలు
ది హాంకాంగ్ తెలుగు సమాఖ్య ఆధ్వర్యంలో దీపావళి-2023 వేడుకలను ఘనంగా జరిగాయి. స్థానిక ఇండియా క్లబ్లో నిర్వహించిన ఈ వేడుకల్లో సమాఖ్యలో సభ్యులుగా ఉన్న కుటుంబాలన్నీ పాల్గొన్నాయి. అందర్నీ ఆహ్వానిస్తూ వ్యవస్థాపక అధ్యక్షురాలు జయ పీసపాటి ప్రారంభోపన్యాసం చేశారు. ప్రవాసులంతా కలిసి వేడుకలు నిర్వహించుకోవడం ఆనందంగా ఉందన్నారు. ప్రవాసులంతా ఒక్కచోట చేరడం వల్ల ఒకరికొకరు తోడు ఉన్నారన్న భావన కలుగుతుందన్నారు. పిల్లలు, పెద్దలు ఒక కళా వేదిక కల్పించామని, అందుకు అందరూ సమిష్టిగా కృష్టి చేశారని తెలిపారు. తమ కార్యవర్గసభ్యులు రాజశేఖర్ మన్నె, రమాదేవి సారంగ, మాధురి అరవపల్లి, హరీన్ తుమ్మల, రమేశ్ రేనిగుంట్ల తదితరులకు కృతజ్ఞతలు తెలిపారు. తదనంతరం సంస్కృతిక కార్యక్రమాలు ప్రారంభించారు. చిన్న ఆదిత్య సార్ల శ్లోక పద్యాలతో వినాయకుడిని స్తుతిస్తూ కార్యక్రమం మొదలు పెట్టారు. ఆ తరువాత ప్రేక్షకులని పరవశింప చేసిన అద్వైత ఈయుణ్ణి తబలా ప్రదర్శన, మన కళళ ప్రాముఖ్యతను చాటి చెప్పాయి.చిన్నారులు గుణ ఘట్టి మరియు భేవిన్ ఘట్టి మదురమైన లలితా సంగీతం వినిపించారు. అందరినీ ఆహ్లాద పరిచిన చిట్టి పొట్టి అడుగుల బుజ్జాయిలు జాహ్నవి బెల్లంకొండ, ధన్య సత్తినేని, అమృత ధర్మపురి, ముద్దోచ్చేలా తమ నృత్యాలతో అందరిని ఆశ్చర్యచకితుల్ని చేసారు. ఆ తరువాత, హాంకాంగ్ తెలుగు భామల హుషారైన డాన్స్ స్టెప్పులతో దీపావళి పటాసుల వలె ప్రదర్శనలిచ్చారు. అందరూ సరదాగా ఖబుర్లు చెబుకుంటూ, ముచ్చట్లు వేసుకుంటూ నోరు ఊరించే భోజనం చేసిన తరువాత, నృత్య - గాన ప్రద్శనలతో అందరినీ ఆనంద పరిచిన వారికి బహుమతులు ఇవ్వడం జరిగంది. సాంస్కృతిక కార్యక్రమాని చక్కటి చిక్కటి అచ్చ తెలుగు లో భామలు రాధిక సంబతూర్ మరియు రాధిక నూతలపాటి చక్కగా నిర్వహించి అందరి మన్ననలు పొందారు. హాంగ్ కాంగ్ లో మూడు దశాబ్దాలకు పైగా నివసించిన వైద్య నిపుణులు డాక్టర్ మోహన్ భాస్కరభట్ల గారు, సతీమణి సూర్య గారు ఆకస్మిక సందర్శన అందరిని ఆశ్చర్యపరుస్తూ ఎంతో ఆనందాన్నిచ్చింది. ఆ తరువాత అందరూ ఎంతో ఆనందంగా కలిసి గ్రూప్ ఫోటోలు,సెల్ఫీలు తీసుకొని వచ్చిన ప్రతి కుటుంబం తమ బహుమతులు ఉత్సాహంగా అందుకున్నారు. చివరిగా దీపావళి వేడుకలు ఘనంగా నిర్వహించిన - పాల్గొన్న వారందరికీ ధన్యవాదాలు తెలుపుతూ, అందరు మన దేశ జాతీయ గీతంతో కార్యక్రమాన్ని ముగించారు. -
హాంగ్ కాంగ్ లో ఘనంగా సద్దుల బతుకమ్మ సంబరాలు
దసరాకి రెండు రోజుల ముందు వచ్చె బతుకమ్మ (గౌరి) పండుగ లేదా సద్దుల పండుగను ది హాంగ్ కాంగ్ తెలుగు సమాఖ్య వారందరు కలిసి ఎంతో ఆనందోత్సాహాలతో, భక్తీ శ్రద్ధలతో సకుటుంబంగా జరుపుకున్నారు. లాంటౌ ద్వీపం లో క్రొత్తగా నిర్మించబడ్డ వాటర్ ఫ్రంట్ ప్రోమేనాడ పై అందమైన ఆకాశంలో నక్షత్రాల మెరుపుల క్రింద, రంగు రంగుల పూలతో అందంగా తయారైన గౌరమ్మను మెరిసే పట్టు చీరలు, నగలలో అందాల భామలు, అందమైన నవ్వులతో, పిల్ల - పాపలతో ఆడపడుచులందరూ చక చక తరిలి వచ్చారు. తుంగ్ చుంగ్ మెట్రో స్టేషన్ నుండి కేవలం కొద్ది దూరంలో ఉన్న తుంగ్ చుంగ్ ఈస్ట్ ప్రొమెనేడ్, జాగర్స్, బైకర్స్, డాగ్ వాకర్స్ మరియు విహార యాత్రలకు వచ్చే వారితో ప్రసిద్ది చెందింది, ఇది విశ్రాంతి తీసుకోవడానికి మరియు ప్రక్రుతిని ఆస్వాదించటానికి సరైన ప్రదేశం. హాంకాంగ్, న్యూ టెరిటరీస్ లో ఉన్న తుంగ్ చుంగ్ ఈస్ట్ ప్రొమెనేడ్ 1.9 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. ఈ పార్క్ సహజ దృశ్యాలతో పాటు, ఈ పార్కులో పిల్లలు, పెద్దలు మరియు వయో వృద్ధులు అందరికి అనువైన అందమైన విహార స్థలం. చివరి రోజు బతుకమ్మ (సద్దుల బతుకమ్మ) పండుగ అత్యంత మనోహరంగా ఉంటుంది. ఆ రోజు తంగేడు, గునుగు మొదలగు పూలను ఇంటిళ్ళపాదీ స్నేహితులు కూర్చుని ఆ పూలతో బతుకమ్మను తయారు చేస్తారు. ఇందులో గునుగు పూలు, తంగెడు పూలు ముఖ్య భూమికను పోషిస్తాయి.ఈ పూలను జాగ్రత్తగా ఒక పళ్ళెం (తాంబలం) లో వలయాకారంగా, రంగులు మార్చుకుంటూ పేరుస్తారు. ముందుగా తంగెడు ఆకులు, పూలు పళ్లెంలో లేదా తాంబోలంలో పేర్చి, ఆపై తంగేడు పూల కట్టలు పేర్చుతారు. మధ్య మధ్యలో ఇతర రకాల పూలను ఉపయోగిస్తారు. ఈ అమరిక ఎంత పెద్దదిగా ఉంటే అంత అందంగా ఉంటుంది. తెల్లని గునుక పూలను రంగులతో అద్ది పెడతారు. పేర్చడం అయ్యాక పైన పసుపుతో చేసిన గౌరి మాతను పెడతారు. ఇలా పేర్చిన బతుకమ్మను గృహంలోని దైవస్థానంలో అమర్చి అగరొత్తులతో అలంకరించి పూజిస్తారు. చీకటి పడుతుండగా, స్త్రీలందరూ ఈ బతుకమ్మలను తలపై పెట్టుకుని వాటర్ ఫ్రంట్ కి ఊరేగింపుగా బయలుదేరుతారు. ఈ ఊరేగింపు లో బతుకమ్మ పాటలు బతకమ్మ బతకమ్మ ఉయ్యాలో పాడుతూ అందంగా అలంకిరించుకున్నబాలికలు, కన్నె పడుచులు, స్త్రీలు, బతుకమ్మలతో అత్యంత సుందరంగా, వైభావయానంగా ఉంటుంది. ఈ ఊరేగింపు కొనసాగినంత సేపూ, జానపద గీతాలతో వీధులు మారుమోగుతాయి. చూస్తున్న స్థానికులు ఆశ్చర్యంగా , ఆనందంగా చూస్తూ ఫోటోలు తీసుకుంటారు. సాయంకాలం అందరూ తమ తమ బతకమ్మలతో ప్రోమేనాడ చేరి వాటిని మధ్యలో పెట్టి వాటి చుట్టూ తిరుగుతూ పాటలతో గౌరి దేవిని కీర్తిస్తూ ఆడి పాడారు. ఇలా చాలా సేపు ఆడాక గౌరమ్మను పూజించి వెళ్ళి రావే బతుకమ్మ అంటూ సముద్రంలో నిమజ్జనం చేసారు. ఆపై ఆ పళ్లెంలో తెచ్చిన నీటితో ఆడవారు వాయినమమ్మా వాయినం అంటూ వాయినాలు ఇచ్చి పుచ్చుకున్నారు.ఆపై ఇంటి నుండి తీసుకువచ్చిన సత్తుపిండి (మొక్కజొన్నలు, లేదా వేరుశనగ లేదా పెసర విత్తనాలను దోరగ వేయించి, వాటిని పిండి చేసి, వాటితో చక్కెర పిండి లేదా బెల్లం, నెయ్యి తగినంత కలిపి తయారు చేస్తారు) వాయనాలను ఇచ్చి పుచ్చుకొని ప్రసాదం సేవించారు. ది హాంగ్ కాంగ్ తెలుగు సమాఖ్య (THKTS) వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీమతి జయ పీసపాటి మాట్లాడుతూ తమ సంస్థ ఆధ్వర్యంలో వరుసగా ఆరవ సంవత్సరం జరుగుతున్న బతుకమ్మ ఉత్సవమని ఆనందంగా తెలుపుతూ, ఈ ఉత్సవానికి సహాయ సహకారాలు అందించిన వారందరికి ధన్యవాదాలు తెలిపారు. THKTS సభ్యులు, వారి కుటుంబ సభ్యుల కృషివల్లే బతుకమ్మ సంబురాలను ఇంత బాగా చేయగలుగుతున్నామని అన్నారు. నవంబర్ లో కార్తిక వనభోజనాలు మరియు దీపావళి వేడుకల ఏర్పాట్లకు సన్నాహాలు జరుగుతున్నాయని తెలిపారు. -
పాక్ బ్యాటర్లకు చుక్కలు చూపించిన హాంగ్‌కాంగ్ బౌలర్లు.. అయినా..!
ఏషియన్ గేమ్స్ 2023లో పసికూన హాంగ్‌కాంగ్ పటిష్టమైన పాకిస్తాన్‌కు చుక్కలు చూపించింది. హాంగ్‌కాంగ్ మ్యాచ్ అయితే గెలవలేపోయింది కాని, పాక్ బ్యాటింగ్‌ను కకావికలం చేసి నామమాత్రపు స్కోర్‌కే పరిమితం చేసింది. 8.5 ఓవర్లలో కేవలం 54 పరుగులకే సగం పాక్ వికెట్లు పడగొట్టిన హాంగ్‌కాంగ్ బౌలర్లు.. ఆ తర్వాత పాక్ లోయర్ ఆర్డర్ బ్యాటర్ ఆమెర్ జమాల్‌ను (16 బంతుల్లో 41; 2 ఫోర్లు, 4 సిక్సర్లు) కట్టడి చేయడంలో విఫలం కావడంతో పాక్ ఓ మోస్తరు చేయగలిగింది. అయితే ఛేదనలో బ్యాటర్లు చేతులెత్తేయడంతో హాంగ్‌కాంగ్ ఓటమిపాలైంది. ఈ గెలుపుతో పాక్ సెమీ ఫైనల్‌కు చేరుకోగా.. హాంగ్‌కాంగ్ ఇంటిదారి పట్టింది. ఇవాళ ఉదయం 11:30 గంటలకు ప్రారంభమైన క్వార్టర్ ఫైనల్-2లో టాస్ ఓడి హాంగ్‌కాంగ్ ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్ చేసిన పాక్.. ఇన్నింగ్స్ ఆరంభంలో కష్టాల్లో పడినప్పటికీ, ఆతర్వాత తేరుకుని నిర్ణీత 20 ఓవర్లలో 160 పరుగులకు ఆలౌటైంది. పాక్‌కు ఆమెర్ జమాల్ (41) ఆదుకోగా.. ఆసిఫ్ అలీ (25), అరాఫత్ మిన్హాస్ (25), ఒమర్ యూసుఫ్ (21), ఖుష్దిల్ (13), రోహైల్ నజీర్ (13), ఖాసిమ్ అక్రమ్ (12) రెండంకెల స్కోర్లు చేశారు. హాంగ్‌కాంగ్ బౌలర్లలో ఆయేష్ శుక్లా (4-0-49-4) పాక్ టాపార్డర్‌ను గడగడలాడించగా.. మెహమ్మద్ గజన్ఫార్ (4-0-26-3), అనాస్ ఖాన్ (3-0-18-2), ఎహసాన్ ఖాన్ (4-0-28-1) వికెట్లు తీశారు. అనంతరం ఓ మోస్తరు లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన హాంగ్‌కాంగ్.. ఖుష్దిల షా (4-0-13-3), అరాఫత్ మిన్హాస్ (4-0-19-2), సుఫియాన్ ముఖీమ్ (4-1-11-2), ఖాసిమ్ అక్రమ్ (1.5-0-6-2) ధాటికి 18.5 ఓవర్లలో 92 పరుగులకు ఆలౌటై, 68 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. హాంగ్‌కాంగ్ ఇన్నింగ్స్‌లో బాబర్ హయత్ (29) టాప్ స్కోరర్‌గా నిలువగా.. ఎహసాన్ ఖాన్ (16 నాటౌట్), నియాజ్ అలీ (12), నిజఖత్ ఖాన్ (11), శివ్ మాథుర్ (100 రెండంకెల స్కోర్లు చేశారు. కాగా, ఈ మ్యాచ్‌కు ముందు జరిగిన తొలి క్వార్టర్ ఫైనల్లో భారత్.. నేపాల్‌ను మట్టికరిపించి, సెమీస్‌కు చేరింది. సెమీస్‌లో భారత్.. క్వార్టర్ ఫైనల్-4 (బంగ్లాదేశ్ వర్సెస్ మలేషియా) విజేతను ఎదుర్కొంటుంది. పాక్ సెమీస్‌లో క్వార్టర్ ఫైనల్-3 (శ్రీలంక వర్సెస్ ఆఫ్ఘనిస్తాన్) విజేతతో తలపడుతుంది. భారత్, పాక్‌లు సెమీస్‌ను దాటితే స్వర్ణ పతకం కోసం ఫైనల్లో తలపడతాయి. -
హాంకాంగ్‌లో ‘సురభి ... ఏక్ ఎహసాన్ ’
దేశభక్తిని ప్రబోధించే ‘సురభి ఏక్ ఎహసాన్ హాంకాంగ్‌లో ప్రవాస భారతీయుల ప్రత్యేక కార్యక్రమం. అమరవీరులైన సైనికుల స్ఫూర్తిని చాటిన జయ పీసపాటి టోరీ రేడియోల ప్రసారం సాక్షి, సిటీబ్యూరో టోరీ రేడియో పరిచయాల ద్వారా సైనికుల త్యాగాలు, వారి కుటుంబాలపైన స్ఫూర్తిదాయకమైన ప్రసంగాలు, విశేషాలను సామాన్య ప్రజలకు విస్తృతంగా పరిచయం చేశారు. ఆ జయ పీసపాటి...మరో అద్భుతమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. హైదరాబాద్‌కు చెందిన ఆమె హాంకాంగ్‌లో నివాసం ఉంటున్నారు. అక్కడి నుంచే చాలాకాలంగా ఆమె టోరి రేడియో వ్యాఖ్యాతగా సేలందజేస్తున్నారు. తాజాగా ‘సురభి ... ఏక్ ఎహసాన్ ’ అనే పేరుతో మరో ప్రత్యేక కార్యక్రమాన్ని టోరి రేడియో ద్వారా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఇటీవల హాంకాంగ్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అనేక మంది ప్రవాస భారతీయులు పాల్గొని తమ దేశభక్తిని చాటుకున్నారు. పిల్లలు ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు, దేశ భక్తి పాటలలు, నృత్యాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ వేడుకల్లో ప్రవీణ్ అగర్వాల్, సౌరభ్ రాఠీలు వ్యాఖ్యాతలుగా వ్యవహరించారు. మంజరి గుహ, నేహా అగర్వాల్ , సాక్షి గోయల్ , సుగుణ రవి, కొరడ భరత్ కుమార్, ప్రశాంత్ పటేల్, శ్రీదేవి బొప్పన, లక్ష్మి యువ,సంజయ్ గుహ, తదితరులు స్వచ్ఛంద సేవకులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జయ పీసపాటి నిర్వహించిన ‘ జై హింద్ ’ టాక్ షోలో ఉమేష్ గోపీనాథ్ జాదవ్ పాల్గొని ప్రసంగించారు. ‘సురభి ఏక్ ఎహసాన్‘కార్యక్రమానికి ఆయన అభినందలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ‘బి ది చేంజ్’ సంస్థ వ్యవస్థాపకులు పూనమ్ మెహతా, రిటైర్డ్ సివిల్ సర్వెంట్ నీనా పుష్కర్ణ, రుట్టోంజీ ఎస్టేట్స్ కంటిన్యూయేషన్ లిమిటెడ్ డైరెక్టర్ రానూ వాసన్లు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. భారతీయ సంఘాల నుంచి పలువురు ప్రముఖులు కార్యక్రమానికి హాజరయ్యారు.కార్గిల్ యుద్ధంలో భారతీయ సైనికులు ప్రదర్శించిన అద్భుతమైన ధైర్యసాహసాలు, పరాక్రమాన్ని శ్లాఘిస్తూ ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ప్రతి ఒక్కరిలో స్ఫూర్తిని నింపాయి. సాయుధ దళాల వైద్య కళాశాలలో చదవాలనే ఆశయాన్ని సాధించలేకపోయినప్పటికీ టోరి రేడియో వ్యాఖ్యాతగా అనేక దేశభక్తి కార్యక్రమాలను నిర్వహిస్తున్న జయ పీసపాటి ‘‘జై హింద్’’ అనే టాక్ షో ద్వారా ఆమె పలువురు సాయుధ దళాల అధికారులు, విశ్రాంత అధికారులు, అమర వీరుల కుటుంబ సభ్యులతో ప్రత్యక్ష ప్రసారం నిర్వహించి ప్రపంచలోని ప్రవాస తెలుగు వారికి పరిచయం చేశారు. (చదవండి: శాన్ఫ్రాన్సిస్కోలో భారత నూతన కాన్సులేట్ జనరల్‌గా తెలుగు వ్యక్తి!) -
గగుర్పాటు కలిగించే ఘటన.. ఎత్తైన భవనంపై సాహసం.. అంతలోనే పట్టుతప్పి..
హాంగ్‌కాంగ్: డేర్‌డెవిల్ గా పేరొందిన 30 ఏళ్ల రెమీ లుసిడి ఎత్తైన భవనం అంచున నిలబడి వీడియో తీసుకునే సాహసం చేస్తుండగా పట్టుతప్పి జారిపోయాడు. 68వ అంతస్తు నుండి కింద పడి ప్రాణాలు కోల్పోయాడు. లుసిడి చనిపోయిన స్పాట్ నుండి కెమెరాను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. ఈ ఘటన హంగ్ కాంగ్ లోని ట్రెజుంటర్ టవర్ దగ్గర జరిగింది. రెమీ లుసిడి ఒళ్ళు గగుర్పొడిచే సాహసాలు చేసే ఓ బ్లాగర్. అతను చేసే సాహసాలంన్నిటినీ వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఉంటాడు. ఇదే క్రమంలో హాంగ్‌కాంగ్‌లోని ట్రెగుంటర్ టవర్ కాంప్లెక్స్ భవనంపైకి ఎక్కి వీడియో తీసుకోవాలని సంకల్పించాడు. అనుకుంది తడవు ఆ కాంప్లెక్స్ కి వెళ్లి 40వ అంతస్తులో తన ఫ్రెండుని కలవడానికి వెళ్తున్నానని చెప్పి సెక్యూరిటీ కళ్ళుగప్పి బిల్డింగ్‌లోకి ప్రవేశించాడు. BREAKING NEWS: Tragic Death of Fearless Instagram Daredevil in Hong Kong High-Rise IncidentIn a heartbreaking incident that shocked the world of extreme sports, Remi Lucidi, a 30-year-old French daredevil renowned for his high-rise stunts, lost his life after falling from the… pic.twitter.com/9jYKnrgVVt— URECOMM (@URECOMM) July 30, 2023 తీరా అతను చెప్పింది వాస్తవం కాదని సెక్యూరిటీ వారికి తెలిసే సమయానికే లుసిడి సీసీటీవీ ఫుటేజిలో 49వ అంతస్తులో బిల్డింగ్‌పైకి వెళ్లే మెట్లు ఎక్కుతూ కనిపించాడు. చివరిగా అతను 7.38 నిముషాలకు పెంట్ హౌస్ బయట కిటికీ తలుపు తడుతూ తాను ప్రమాదంలో ఉన్నట్లు చెప్పబోయాడని అందులో పని చేసే ఒకామె తెలిపింది. అంత ఎత్తు నుండి పడిపోవడంతో లుసిడి అక్కడికక్కడే చనిపోయాడని పోలీసులు తెలిపారు. స్పాట్లో లుసిడి కెమెరాను కనుగొన్న పోలీసులు అందులో కళ్లుచెదిరే సాహసాలకు సంబంధించిన అతడి వీడియోలు ఉన్నట్లు.. బలహీనమైన గుండె కలవారు వాటిని చూడలేరని తెలిపారు. లుసిడి మరణానికి గల కారణం ఏంటనేది మాత్రం వారు చెప్పలేదు. గతంలో లుసిడి చాలా సాహస కృత్యాలు చేశాడు. పారిస్ లోని ఈఫిల్ టవర్ తో పాటు దుబాయ్ లోని బుర్జ్ ఖలీఫా పైకి ఒట్టి చేతులతో ఎక్కి ఫోటోలు తీసుకున్నాడు. చివరిసారిగా హంగ్ కాంగ్ లో లుసిడి తీసుకున్న ఫోటోను కింది ట్వీట్ లో చూడవచ్చు. #STUPIDITY gets you #KILLED #Daredevil #Remi #lucidi , 30, known for Instagram #stunts dies after falling 721ft from the top of a 68-story #Hong #Kong #skyscraper - having posted final photo from another high-rise pic.twitter.com/ooMDorcFdB— NEWS-ONE 🏴 (@NEWSONE14898745) July 31, 2023 ఇది కూడా చదవండి: పాలస్తీనా శరణార్ధుల శిబిరంలో అల్లర్లు.. ఐదుగురు మృతి -
అస్థికలు భద్రపరిచేందుకు అద్దె రూ.63 లక్షలు, ఫ్యామిలీ ప్యాక్ కూడా!
ప్రపంచ రియల్ ఎస్టేట్ మార్కెట్లో అత్యంత ఖరీదైన ప్రాంతం ఏదంటే హాంకాంగ్ అని ఠక్కున చెప్పేయొచ్చు. ఒక జత చెప్పుల డబ్బా అంతటి విస్తీర్ణం ఉన్న స్థలం కూడా వేల డాలర్లు పలుకుతుంది. అలాంటి ప్రాంతంలో చూపరుల్ని ఆకట్టుకునే 12 అంతస్తుల అందమైన భవనాన్ని ఈ మధ్య నిర్మించారు. పాలరాతితో, వంపులు తిరిగిన డిజైన్, రూఫ్ గార్డెన్తో చూడముచ్చటగా కనిపిస్తున్న ఈ భవనాన్ని చూస్తే ఎవరైనా ఫిదా(వశం) అయిపోతారు. అయితే అది నిర్మించింది ధనవంతులు నివసించడం కోసం కాదు. మరణించిన వారి అస్థికలను భద్రపరచడం కోసం ప్రత్యేకంగా నిర్మించారు. ఒక లగ్జరీ అపార్ట్మెంట్ ఎలా ఉంటుందో అదే స్థాయిలో అందులో సకల సదుపాయాలు ఏర్పాటు చేశారు. షాన్ సమ్ టవర్ పేరుతో నిర్మించిన ఈ భవనంలో అస్థికల కలశాన్ని భద్రపరచాలంటే 76,000 డాలర్లు (రూ.63 లక్షలు) చెల్లించాలి. అది కూడా 10 సంవత్సరాలు మాత్రమే. ఆ తర్వాత లీజ్ రద్దయిపోతుంది. ఎందుకంటే ఆ భవనంలో 22,000 మంది అస్థికలను మాత్రమే భద్రపరచవచ్చు. ఒక కుటుంబంలో ఎనిమిది మంది అస్తికలను భద్రపరచడానికి ఫ్యామిలీ ప్యాకేజీ సదుపాయం ఉంది. అందుకయ్యే ఖర్చు 4,40,000 డాలర్లు (రూ.3.64 కోట్లు). షాన్ సమ్ అంటే చైనా భాషలో దయా హృదయం అని అర్థం. ఈ భవనం సంపన్నులకే అందుబాటులో ఉండడం గమనార్హం. అంతా అత్యాధునికం కేవలం అస్థికల కోసం ఇంత ఖరీదా? అని ఎవరైనా నోరెళ్లబెట్టొచ్చు. కానీ, అక్కడున్న హంగులు, ఆర్భాటాలు చూస్తే మతి పోవాల్సిందే. తమకెంతో ఇష్టమైన వారిని స్మరించుకోవడానికి వచ్చేవారికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఆ భవనాన్ని నిర్మించారు. పైన అంతా రూప్గార్డెన్ ఉంటుంది. ప్రతి అంతస్తులోనూ పెద్ద పెద్ద బాల్కనీలు ఉంటాయి. చైనా సంస్కృతి సంప్రదాయాల్లో శ్మశాన వాటికలు ఎలా ఉంటాయో అలా వంపుల తిరిగిన డిజైన్‌తో భవనం ఉంటుంది. ఇక లోపల పాలరాతి ఫ్లోరింగ్, ఏసీలు, గాలిలో తేమని తొలగించే వ్యవస్థ కూడా ఉన్నాయి. అస్థికలను భద్రపర్చే చిన్నచిన్న గదుల తలుపులను బంగారు నాణేలతో సౌందర్యభరితం చేశారు. భిన్న సంప్రదాయాలు, ఆచారాలను పాటించే వారి అభిరుచులకు అనుగుణంగా ఈ భవన నిర్మాణం జరిగింది. పెద్దలకి నివాళులరి్పంచుకోవడానికి ముందస్తుగా యాప్ ద్వారా బుక్ చేసుకోవచ్చు. వారికిష్టమైన ఆహారాన్ని వండి తీసుకువెళ్లి, సంప్రదాయబద్ధంగా నివేదించవచ్చు. పెద్దలను గౌరవించుకోవడానికి మనుషుల అస్థికల కోసం ప్రత్యేకంగా అందమైన భవనం కట్టాలన్న ఆలోచన ఏడు పదుల వయసున్న మార్గరెట్ జీ అనే ఒక మహిళా పారిశ్రామికవేత్తకు వచ్చింది. జ్యువెలరీ, రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేస్తున్న ఆమె వయసు మీదపడ్డాక సేవా కార్యక్రమాల బాట పట్టారు. తన పేరు మీదే ఒక ఫౌండేషన్‌ను ఏర్పాటు చేసి సమాజానికి సేవలందిస్తున్నారు.‘‘మరణించిన పెద్దలకి నివాళులర్పించడానికి చైనా సంప్రదాయంలో చాలా ప్రాధాన్యతనిస్తారు. దివికేగిన పెద్దల స్మృతుల్లో గడిపి, వారిని గౌరవిస్తే అంతా మంచే జరుగుతుందని విశ్వసిస్తారు. అలాంటి వారి ఆకాంక్షలకు అనుగుణంగా ఈ భవనం నిర్మించాం’’ అని మార్గరెట్ చెప్పారు. భర్త మరణంతో.. హాంకాంగ్ నగర జనాభా 70 లక్షలపైమాటే. చుట్టుపక్కల ప్రాంతాల్లోనూ జనాభా కిటకిటలాడిపోతూ ఉంటుంది. వాస్తవానికి విస్తీర్ణంలో హాంకాంగ్ పెద్దదే. కానీ కొండలు, గుట్టలు ఎక్కువగా ఉండడం వల్ల నివాసయోగ్యమైన ప్రాంతం తక్కువే. అందుకే ఇక్కడ ఆకాశహార్మ్యాల నిర్మాణం ఎక్కువగా ఉంది. ఈ నగరంలో ఒక ఇంటి సగటు విస్తీర్ణం 430 చదరపు అడుగులు మాత్రమేనని గణాంకాలు చెబుతున్నాయి. అస్థికల భవన నిర్మాణాన్ని తలపెట్టిన మార్గరెట్ భర్త 2007లో మరణించారు. ఆయన స్మృతి చిహ్నం ఏర్పాటు చేయడానికి ఆమెకి స్థలం దొరకలేదు. ఆ సమయంలోనే మరణించిన వారి కోసం ప్రత్యేకంగా ఒక అపార్ట్మెంట్ నిర్మించాలన్న ఆలోచన ఆమెకు వచి్చంది. అది ఇన్నేళ్లకి సాధ్యమైందని చెబుతున్నారు. ఇక హాంకాంగ్‌లో వృద్ధుల జనాభా పెరిగిపోతోంది. ప్రతి అయిదుగురిలో ఒకరు 65 ఏళ్లకు పైబడిన వారే. ఇక నగరంలో ప్రతి ఏటా దాదాపు 46,000 మంది మరణిస్తున్నారు. వారి అవశేషాలను భద్రపరచడానికి ప్రభుత్వం పలు సదుపాయాలు ఏర్పాటు చేసింది. అయితే అవి సరిపోకపోవడం వల్ల ప్రైవేట్ భవనం నిర్మించాల్సి వచి్చంది. హాంకాంగ్‌లో సంపన్నులు కూడా ఎక్కువే. అలాంటి వారి సౌకర్యార్థం షాన్ సమ్ అందుబాటులోకి వచి్చంది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
ACC Women's T20: భారత్- పాక్ మ్యాచ్ రద్దు.. సెమీస్‌లో ఇరు జట్లు
హాంకాంగ్: ఎమర్జింగ్ కప్ ఆసియా అండర్–23 మహిళల టి20 క్రికెట్ టోర్నమెంట్లో భారత ‘ఎ’ జట్టు సెమీఫైనల్ చేరింది. భారీ వర్షం కారణంగా భారత్ ‘ఎ’, పాకిస్తాన్ ‘ఎ’ జట్ల మధ్య శనివారం జరగాల్సిన గ్రూప్ ‘ఎ’ లీగ్ మ్యాచ్ రద్దయింది. దాంతో రెండు జట్లకు ఒక్కో పాయింట్ కేటాయించారు. లీగ్ మ్యాచ్‌లు ముగిశాక భారత్, పాక్ జట్లు నాలుగు పాయింట్లతో గ్రూప్ ‘ఎ’ నుంచి సెమీఫైనల్‌కు చేరాయి. గ్రూప్ ‘బి’ నుంచి శ్రీలంక, బంగ్లాదేశ్ జట్లకు సెమీఫైనల్ బెర్త్‌లు ఖరారయ్యాయి. సోమవారం జరిగే సెమీఫైనల్స్‌లో శ్రీలంకతో భారత్; బంగ్లాదేశ్‌తో పాకిస్తాన్ తలపడతాయి. బంగ్లాదేశ్ భారీ విజయం.. టెస్టు క్రికెట్ చరిత్రలో.. మిర్పూర్: ఆద్యంతం ఆధిపత్యం కనబరిచిన బంగ్లాదేశ్ జట్టు తమ టెస్టు క్రికెట్ చరిత్రలోనే అతి పెద్ద విజయాన్ని నమోదు చేసింది. అఫ్గానిస్తాన్‌తో జరిగిన ఏకైక టెస్టులో లిటన్ దాస్ సారథ్యంలోని బంగ్లాదేశ్ ఏకంగా 546 పరుగుల తేడాతో ఘనవిజయం అందుకుంది. 662 పరుగుల విజయ లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్‌లో బరిలోకి దిగిన అఫ్గానిస్తాన్ 33 ఓవర్లలో 115 పరుగులకే కుప్పకూలింది. ఓవర్‌నైట్ స్కోరు 45/2తో ఆట నాలుగో రోజు రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన అఫ్గానిస్తాన్ మరో 70 పరుగులు జోడించి మిగతా ఎనిమిది వికెట్లను కోల్పోయింది. బంగ్లాదేశ్ బౌలర్లు తస్కిన్ అహ్మద్ (4/37), షోరిఫుల్ ఇస్లాం (3/28) అఫ్గానిస్తాన్‌ను దెబ్బ తీశారు. రెండు ఇన్నింగ్స్‌లలో సెంచరీలు చేసిన బంగ్లాదేశ్ బ్యాటర్ నజ్ముల్ హుస్సేన్ షాంతో ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు గెల్చుకున్నాడు. మొత్తం టెస్టు క్రికెట్ చరిత్రలో పరుగుల తేడా పరంగా బంగ్లాదేశ్‌ది మూడో అతి పెద్ద విజయం కావడం విశేషం. ఈ జాబితాలో ఇంగ్లండ్ (1928లో ఆస్ట్రేలియాపై 675 పరుగుల తేడాతో గెలుపు), ఆస్ట్రేలియా (1934లో ఇంగ్లండ్‌పై 562 పరుగుల తేడాతో గెలుపు) జట్లు తొలి రెండు స్థానాల్లో ఉన్నాయి. -
సంచలనం.. 34 పరుగులకే ఆలౌట్; భారత్ ఘన విజయం
ఏసీసీ వుమెన్స్ ఎమర్జింగ్ ఆసియా కప్‌లో సంచలనం చోటుచేసుకుంది. లీగ్‌లో భాగంగా మంగళవారం హాంగ్ కాంగ్ వుమెన్స్, ఇండియా వుమెన్స్-ఏ మధ్య మ్యాచ్ జరిగింది. కాగా మ్యాచ్‌లో ఇండియా వుమెన్స్ బౌలర్ల దాటికి హాంగ్‌కాంగ్ కేవలం 34 పరుగులకే ఆలౌట్ అయింది. శ్రేయాంకా పాటిల్ ఐదు వికెట్లతో చెలరేగగా.. పార్శవీ చోప్రా, మన్నత్ కశ్యప్‌లు తలా రెండు వికెట్లు పడగొట్టగా.. తిటాస్ సాదు ఒక వికెట్ తీశాడు. హాంగ్ కాంగ్ బ్యాటర్లలో మరికో హిల్ 14 పరుగులతో టాప్ స్కోరర్ కాగా.. మిగతా పది మంది సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు. అందులో నాలుగు డకౌట్లు ఉన్నాయి. అనంతరం బ్యాటింగ్ చేసిన ఇండియా-ఏ వుమెన్స్ 5.2 ఓవర్లలో వికెట్ నష్టపోయి 38 పరుగులు చేసి టార్గెట్‌ను అందుకుంది. గొంగిడి త్రిష 19, ఉమా చెత్రీ 16 పరుగులు చేశారు. టోర్నీలో తొలి మ్యాచ్ ఆడిన ఇండియా-ఏ వుమెన్స్ భారీ విజయం అందుకొని టేబుల్ టాపర్స్‌గా ఉన్నారు. Patil’s 5-fer demolishes Hong Kong! Put into bat, the 🇭🇰 batters had no answers to the Indian spinners - ending with just 34 runs. The 🇮🇳 top order completed the chase with over 14 overs to spare! #WomensEmergingTeamsAsiaCup #ACC pic.twitter.com/8e11IyECs5 — AsianCricketCouncil (@ACCMedia1) June 13, 2023 Shreyanka Patil was terrific today! She picked up 5 wickets and conceded just 2 runs. Her splendid spell has put India ‘A’ in the drivers seat at the break! #WomensEmergingTeamsAsiaCup #ACC pic.twitter.com/UqF0HPd3Xs — AsianCricketCouncil (@ACCMedia1) June 13, 2023 చదవండి: ఔను.. ఇంగ్లండ్‌లోనే ఎందుకు జరగాలి? వేరే పిచ్ పెట్టాల్సిందే.. పెరుగుతున్న మద్ధతు -
చెరువులో వింత జీవి.. వామ్మో ఇరవై నాలుగు కళ్లు..
హాంకాంగ్‌లోని ఒక చెరువులో బయటపడింది ఈ వింతజీవి. జెల్లీఫిష్ జాతికి చెందిన ఈ జీవికి ఏకంగా ఇరవైనాలుగు కళ్లు ఉన్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. ఒక అంగుళం పరిమాణంలో పారదర్శకమైన శరీరం, మూడు పొడవాటి టెంటకల్స్ కలిగి ఉన్న ఈ జీవిని హాంకాంగ్‌లోని మై పో రిజర్వ్ చెరువులో గుర్తించారు. ఇది జెల్లీఫిష్లో ఇప్పటివరకు తెలియని కొత్తజాతికి చెందినదని శాస్త్రవేత్తలు వెల్లడించారు. గంట మాదిరిగా కనిపించే దీని శరీరం లోపలి వైపు ఆరుభాగాల్లో పన్నెండు జతల కళ్లు ఉన్నాయని, ఆస్ట్రేలియన్ బాక్స్ జెల్లీఫిష్ మాదిరిగానే ఇది కూడా విషపూరితమైనదని శాస్త్రవేత్తలు వివరించారు. హాంకాంగ్ బాప్టిస్ట్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు ఈ వింత జెల్లీఫిష్‌ను మూడేళ్ల కిందటే గుర్తించారు. దీనిపై విస్తృతంగా పరిశోధనలు జరిపి, ఇటీవల దీని విశేషాలను మీడియాకు వెల్లడించారు. చదవండి: కాంగోలో వరదల బీభత్సం..200 మందికిపైగా మృతి -
మంటల్లో చిక్కుకున్న 42 అంతస్తుల భవనం..ఒక్కసారిగా వీధుల్లో..
ఓ బారీ ఆకాశహర్మం మంటల్లో చిక్కుకుంది. దీంతో ఒక్కసారిగా వీధుల్లో నిప్పుల వర్షం కురిసింది. ఈ ఘటన హాంకాంగ్‌లో చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే..హాంకాంగ్‌లోని సిమ్ షా సుయ్‌లో 42 అంతస్తుల భారీ ఆకాశహర్మంలో అర్థరాత్రి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో నిర్మాణం లోపల ఏవో పెద్దపెద్దగా పేలుళ్ల శబ్దాలతో అగ్నికీలలు ఉవ్వెత్తున ఎగిసిపడ్డాయి. దీంతో వెంటనే రంగంలో దిగిన అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేసేందుకు యత్నించగా..వీధుల్లో కుప్పలు కుప్పులుగా కాలిపోతున్న చెత్త చెదారం ఏదో ఎర్రటి నిప్పుల వర్షం మాదిరి కనిపించాయి. ఈ ఘటకు ముందు ఇద్దరు అగంతకులు ఇదే భవనంలోని క్వీన్ ఎలిజబెత్ ఆస్పత్రికి చికిత్స కోసం వచ్చినట్లు స్థానికి మీడియా పేర్కొంది. ఐతే ఈ ఘటనలో ఎంత ప్రాణ, ఆస్తి నష్టం జరిగిందనేది తెలియాల్సి ఉంది. ఈ నిర్మాణ స్థలం 1967లో హాంకాంగ్ గవర్నర్ డేవిడ్ ట్రెంచ్ చేత ప్రారంభించబడిన మెరైనర్స్ అనే ఓ క్లబ్ ఉండేది. ఐతే ఈ పాత భవనం 2018లో కూల్చివేసి దాని స్థానంలో ఈ 42 అంతస్థుల కింప్టన్ హోటల్ని ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఇది మంటల్లో పూర్తిగా దెబ్బతింది. దీన్ని సుమారు మూడు లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించినట్లు సమాచారం. ఇందులో సుమారు 500కి పైగా గదులు ఉంటాయని అంచనా. Huge fire tears through #HongKong #skyscraper: Fire hits skyscraper being built on site of old Mariner's Club in Hong Kong's #TsimShaTsui https://t.co/zmG6QrCLhQ pic.twitter.com/3DcPsuIykq — 🛰️ War in Ukraine 🍉 (@EUFreeCitizen) March 2, 2023 (చదవండి: అమెరికా, రష్యా, యూఏఈల వ్యోమగాములతో..) -
Hong Kong Model Case: సూప్ కుండలో ఆమె తల..కంగుతిన్న పోలీసులు
ప్రముఖ హాంకాంగ్ మోడల్ అబ్బి చోయ్ అతి దారుణంగా హత్యకు గురైన సంగతి తెలిసిందే. ఈ కేసును దర్యాప్తును చేస్తున్న హాంకాంగ్ పోలీసులు ఆమె ఛిద్రమైన శరీర భాగాలను నగర శివార్లలోని ఓ ఇంట్లోని ఫ్రిజ్‌లో గుర్తించగా.. తల, మొండెం కోసం తీవ్రంగా గాలిస్తున్న పోలీసులు ఓ కుండలోని సూప్ చూసి కంగుతిన్నారు. నిండుగా ఉన్న సూప్‌ని నిశితంగా గమనించి దగ్గరకు వెళ్లితే గాని తెలియలేదు అందులో మోడల్ తల భాగం ఉందన్న విషయం. తొలుత ఆ కుండలో క్యారట్, ముల్లంగి వంటి వాటితో సూప్ మాదిరి చక్కగా ఆకర్షణీయంగా ఉండటంతో సూప్ అనే అనుకున్నారు. ఐతే అందులో ఆ మోడల్ తల భాగాం పుర్రె మాదిరిగా చూసి.. షాక్ గురైనట్లు తెలిపారు. ముఖం మీద చర్మం, మాంసం భాగాలు ఆ సూప్‌లోనే అవశేషాలుగా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. జుట్టుతో సహా చోయి పుర్రె ఉన్నట్లు తెలిపారు. అంతేగాదు ఈ దారుణానికి ఒడిగట్టిన వ్యక్తి కారులో ఉండగానే ఆమెపై దాడి చేసి ఇంటికి తీసుకువెళ్లినట్లు పోలీసులు భావిస్తున్నారు. ఆ మోడల్ పుర్రె వెనుక ఉన్న రంధ్రాన్ని బట్టి ఆమెపై ప్రాణాంతక దాడి జరిగి ఉండవచ్చని చెబుతున్నారు. ఇదిలా ఉండగా, పోలీసుల దర్యాప్తులో.. చోయి మాజీ భర్త, అతని కుటుంబానికి సంబంధించి పది మిలియన్ల డాలర్లతో కూడిని విలాసవంతమైన ఆస్తుల విషయమై వివాదాలు ఉన్నట్లు తేలింది. చోయి అదృశ్యం కావడానికి ముందు రోజే చోయి భర్త అలెక్స్ క్వాంగ్, అతని తండ్రి క్వాంగ్ కౌ, సోదరుడు ఆంథోనీ క్వాంగ్, అత్తగారు జెన్నీ లీ కోర్టుకు హాజరుకాగా, వారికి బెయిల్ లభించలేదు. పైగా కోర్టు విచారణను మే 8కి వాయిదా వేసినట్లు వెల్లడించారు. ఈ మేరకు ఈ దారుణ హత్యకు ఆ నలుగురి పాత్ర ఉండవచ్చన్న అనుమానంతో కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. కాగా, అబ్బి చోయి హాంకాంగ్‌లో ప్రసిద్ధ మోడల్ మాత్రమేగాదు, పారిస్ ఫ్యాషన్ వీక్‌లో రెగ్యులర్‌గా పాల్గొంటోంది. ఆమె ఫిబ్రవరి19న చివరిసారిగా ఫ్యాషన్ మ్యాగజైన్ ఎల్ ఆఫీయల్ మోనాక్తో కలిసి ఒక ఫోటోషూట్ చేసినట్లు సమాచారం. (చదవండి: మోడల్ హత్య..చంపి, ఫ్రిజ్‌లో కాళ్లను దాచి..)