హాంగ్‌కాంగ్‌లో నివసిస్తున్న తెలంగాణా ఆడపడుచులు తెలంగాణ సాంస్కృతిక ప్రతీక, రాష్ట పండుగైన బతుకమ్మ పండుగను ఎంతో ఉత్సాహంగా ఎదురుచూసే ప్రక్రుతి లోని అందమైన ఈ పుల పండుగను భక్తీ ఉత్సాహాలతో ఘనంగా జరుపుకుంటున్నారు. హాంగ్ కాంగ్ లో కూడా సాధారణంగా సెప్టెంబరు, అక్టోబరు నెలలలో రెండు పెద్ద పండుగలు జరుపుకుంటారు.
ఈ పండుగలకు కనీసం పదిహేను రోజులు అటువైపు, ఇటువైపు అంతా పండుగ సంబరాలు, కుటుంబ స్నేహితుల కోలాహలాలు, కలయకలతో నిండిపోయుంటుంది. ఈ పండుగలలో ఒకటి ’బతుకమ్మ పండుగ’, మరియొకటి దసరా (విజయ దశమి). బతుకమ్మ పండుగ మన తెలంగాణా ఆడపడుచులు మాత్రమె జరుపుకుంటారు, కాని ఉత్సాహంగా ఎందరో ఆడపడుచులు పాల్గొంటారు. దసరా నవరాత్రులలో లలితా పారాయణం , బొమ్మల కొలువులు , పేరంటాళ్ళతో రంగ రంగ వైభవంగా పండుగల సందడి పట్టు చీరలు ధగ ధగ మెరిసే నగలు గాజుల సవ్వడి తో విదేశీయులని కుడా ఆకర్షిస్తుంటుంది.
సంవత్సరం కూడా హాంగ్ కాంగ్ లో బతుకమ్మ సంబరాలు ఎంతో ఘనంగా సముద్ర తీరాన లాన్తాఉ ఐలాండ్ తుంగ్ చుంగ్ ప్రోమేనెడ్ మీద జరిగాయని, పిల్లలు పెద్దలు ఎంతో ఆనందంగా రెట్టింపు ఉత్సాహాలతో పాల్గొనేవారు సంప్రదాయ వస్త్రాలలో మరిన్ని ఆట పాటలతో విందు భోజనంతో జరుపుకున్నారని, ది హాంగ్ కాంగ్ తెలుగు సమాఖ్య అధ్యక్షురాలు ఆనందంగా తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment