విక్టోరియా : మనదేశంలో కోవిడ్-19 కారణంగా రియల్ ఎస్టేట్ కుదేలవటం, లాక్డౌన్తో నిర్మాణ రంగ కూలీలంతా తమ సొంతూళ్లకు వలసపోవడంతో సేల్స్ నేలచూపులు చూస్తున్నాయి. అయినా సరే అద్దె ఇంట్లో నివసించే ఎక్కువ శాతం మంది సొంతంగా ఇళ్లను కొనుగోలు చేసేందుకు ఇష్టపడుతున్నారు. మనదేశంలో పరిస్థితి ఇలా ఉంటే విదేశాల్లో కారు పార్కింగ్కు సైతం కోట్లు కుమ్మరించాల్సి వస్తుంది. దీంతో కొనుగోలు దారులు వామ్మో కారు పార్కింగ్కు ఇంత ఖరీదా అంటూ ముక్కున వేలేసేకుంటున్నారు.
బ్లూమ్బర్గ్ బిజినెస్ మ్యాగజైన్ కథనం ప్రకారం.. హాంకాంగ్ వాన్ ఛాయ్ జిల్లాలో అత్యంత రద్దీ ప్రాంతం మౌంట్ నికల్సన్. ఇక్కడ కొండల మీద ఇళ్లు వాటి ఎదురుగా విమానాశ్రయం. ఇంటి బయట కూర్చుంటే వీచే చల్లటి గాలులతో ఆ ప్రాంతంలో నివసించేందుకు సంపన్నులు మక్కువ చూపుతుంటారు. దీంతో ఆ ప్రాంతంలో నిర్మించుకున్న ఇళ్లు .. ప్రపంచంలో అత్యంత ఖరీదైనవిగా గుర్తింపు పొందాయి. ప్రతి ఏడు బ్లూమ్ బెర్గ్ అత్యంత ఖరీదైన ఇళ్ల జాబితాలో ఈ ప్రాంతంలో నిర్మించిన ఇళ్లు ప్రథమస్థానాన్ని సంపాదించుకుంటున్నాయి.ఈ ప్రాంతంలో రద్దీ ఎక్కువగా ఉండడం, నిర్మించుకునేందుకు ప్లేసులు లేకపోవడంతో ఇప్పటికే ఇళ్లను నిర్మించుకున్న యజమానులు, ఇళ్ల పార్కింగ్ స్థలాన్ని కోట్లలో అమ్ముకుంటున్నారు. పార్కింగ్ ఏరియాల్ని కొనుగోలు చేసేందుకు ఔత్సాహికులు ఎగబడుతున్నారు.
తాజాగా ఈ ప్రాంతంలో 12.5 చదరపు మీటర్లు (135 చదరపు అడుగుల) ఓ అపార్ట్ మెంట్ కారు పార్కింగ్ స్థలం 1.3 మిలియన్లకు అమ్ముడైనట్లు బ్లూమ్ బెర్గ్ తన నివేదికలో పేర్కొంది. ఇదే స్థలం ఇండియన్ కరెన్సీ ప్రకారం రూ. 9,49,16,380.00గా ఉంది. ఫైనాన్షియల్ సంస్థ యూబీఎస్ 2019 నివేదిక ప్రకారం.. ఓ సాధారణ ఉద్యోగి ఇక్కడ 60 చదరపు మీటర్ల ఫ్లాట్ కొనడానికి 22 సంవత్సరాల ఆదాయం అవసరం అవుతుందని తెలిపింది. కాగా ఈ సంవత్సరం, 3,378 చదరపు అడుగుల పెంట్ హౌస్ 59 మిలియన్ డాలర్లకు అమ్ముడైంది, ఇది చదరపు అడుగుకు,రూ.12,78,185.12 మార్క్ చేరి కొత్త రికార్డ్ ను క్రియేట్ చేసింది.
చదవండి : 'అద్దె ఇంట్లో ఉండలేం బాబోయ్..సొంతిల్లే కొనుక్కుంటాం'
Comments
Please login to add a commentAdd a comment