NRI: హాంగ్‌కాంగ్‌లో జేమీ లీవర్ పండించిన నవ్వుల డోలలు! | Jamie Lever Comedy Show In HongKong | Sakshi
Sakshi News home page

NRI: హాంగ్‌కాంగ్‌లో జేమీ లీవర్ పండించిన నవ్వుల డోలలు!

Published Thu, Apr 25 2024 6:07 PM | Last Updated on Thu, Apr 25 2024 6:07 PM

Jamie Lever Comedy Show In HongKong - Sakshi

మే 1979లో ఒక సొసైటీ గా నమోదు చేయబడిన ఇండియన్ ఆర్ట్స్ సర్కిల్ అనేది లాభాపేక్ష లేని సంస్థ. సభ్యులు మరియు సాధారణ ప్రజల కోసం భారతీయ సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించడం, సభ్యులలో నాటకం, సంగీతం, నృత్యం, సాహిత్యం మరియు దృశ్య కళలపై ఆసక్తిని పెంపొందించడం మరియు ఇలాంటి సంస్థలతో సహకరించడం దీని లక్ష్యాలు. స్థానిక ప్రతిభావంతులకు అవకాశాలను అందించడానికి ఈ బృందం ప్రతి సంవత్సరం రెండు కార్యక్రమాలను నిర్వహిస్తుంది మరియు భారతదేశం నుండి ప్రఖ్యాత కళాకారులను కూడా ఆహ్వానిస్తుంది. భారత కాన్సుల్ జనరల్ మరియు శ్రీమతి పూర్విజ్ ష్రాఫ్ గౌరవ పోషకులు, మరియు శ్రీ జి.టి. గుల్ సర్కిల్ యొక్క శాశ్వత సలహాదారుగా సేవలు అందజేస్తున్నారు.

కోవిడ్ తరువాత అంటే నాలుగు సంవత్సరాల తరువాత మొదటి సారి, ఇండియన్ ఆర్ట్స్ సర్కిల్ ఈ సంవత్సరం మన తెలుగు అమ్మాయి జేమి లీవర్ ని హాంగ్ కాంగ్ కి ఆహ్వానించారు. "గూన్జ్ సితారోన్ కి" అనే సాంస్కృతిక వినోద కార్యక్రమం 18 ఏప్రిల్ న స్థానిక సిటి హాల్ లో నిర్వహించారు. పూర్వ చైర్ పర్సన్  శ్రీమతి రాణి సింగ్ , చైర్ పర్సన్ శ్రీమతి రానూ సింగ్ , ఉపాధ్యక్షుడు సర్దార్ నవ్తేజ్ సింగ్ మరియు కార్యదర్శి శ్రీమతి జయ పీసపాటి మరియు ఇతర కార్యవర్గ సభ్యులందరూ ఈ కార్యక్రమాన్ని అద్భుతంగా నిర్వహించారు. 

చైర్ పర్సన్ శ్రీమతి రానూ సింగ్ కార్యక్రమాన్ని ప్రారంభించటానికి భారత కాన్సుల్ జనరల్ ఆఫ్ ఇండియా శ్రీమతి సత్వంట్ ఖనాలియా గారిని ఆహ్వానించి సన్మానించారు. సత్వంత గారు ఇండియన్ ఆర్ట్స్ సర్కిల్ చేస్తున్న అద్భుతమైన కార్యక్రమాలను మరియు కళారులకి ఒక చక్కని వేదికని అన్జేస్తున్నందుకు,వారిని ప్రోత్సహిస్తున్నందుకు ప్రశంసించారు. 

స్థానిక కళాకారుల బాలీవుడ్ , హిప్ హాప్, జానపద , నృత్యాలతో మరియు అలనాటి మధుర గీతాలతో ప్రారంభమైన ‘గూన్జ్ సితారోన్ కి” ని ప్రేక్షకులు ఆనందిస్తూ కరతాళ ధ్వనులతో కళాకారులని ప్రోత్సహించారు. అప్పుడు జేమీ లీవర్ ఎంట్రీ ఇచ్చారు … ఇంకా అప్పటినుంచి నవ్వుల పువ్వుల పండిస్తూ జేమీ మిమిక్రీ తో కామిడి చేస్తూ ప్రముఖ బాలీవుడ్ హీరోయిన్స్ హేమ మాలిని , మలాయికా, దీపికా పడుకోన, కంగనా రనౌత మో వారిని అనుకరిస్తూ తనకు ప్రత్యెక గుర్తింపు తెచ్చిన ప్రముఖ గాయని ఆశా భోంస్లే , కొరియోగ్రాఫర్ ఫరా ఖాన్ మరియు తన తండ్రి జాని లీవర్ ల మిమిక్రీ తో ఉత్తేజభరితమైన వాతావరణo ప్రేక్షకులని ఆనందోత్సాహాలతో ముంచేసింది. హాస్యంలో మిమిక్రి, గానం, నృత్యంమేళవించి ఒక గంట సేపు నవ్వుల మారథాన్ చేసారు జేమి!!    

ప్రముఖ సిని నటుడు, కమెడియన్ జాని లీవర్ అసలు పేరు జాన్ ప్రకాష్ రావు జనుముల, అయితే ఆయన హిందూస్తాన్ లేవేర్స్ లో పని చేస్తూ స్టాండ్ అప్ కామెడి పండించి స్టాఫ్ ని నవ్వుల డోలలూగించినప్పుడు, యాజమాన్యం వారు ఆయనకీ 'లీవర్' అని పేరు ఇవ్వడం జరిగింది. అప్పటి నుంచి ఆయన ఇంటి పేరే 'జానీ లీవర్' పాపులర్ అయ్యింది. 

తెలుగు హిందీ చిత్రరంగం లో కమెడియన్ గా పేరొందిన ప్రముఖ నటులు తండ్రి జానీ లీవర్ ప్రతిభని పుణికి పుచ్చుకుంది అని జెమీ లీవర్ గురించి చెప్పడం అతిశయోక్తి కాదేమో ! హాంగ్ కాంగ్ కళా ప్రేమికుల హృదయాల్లో చెరగని స్థానాన్ని సంపాయించుకున్న జేమి తను ఇంత ఉత్సాహభరితమైన ప్రేక్షకుల మధ్య ప్రదర్శించడం తనకి ఎంతో ఆనందంగా వుందని హర్షం వ్యక్తం చేసారు. స్థానికంగా విచ్చేసిన ప్రముఖులు , భారతీయ కన్సులార్  శ్రీ కుచిభోట్ల వెంకట్ రమణ గారు తదితరులు జేమి కి తమ శుభాభినందనలు, శుభాకాంక్షలు తెలిపారు.  ఆమె స్టాండ్ అప్ కామెడి లో గొప్ప శిఖరాలను అందుకోవాలని  త్వరగా మరల హాంగ్ కాంగ్ రావాలని స్థానికులు ఆశ వ్యక్తం చేసారు అందుకు జేమి తన చెరగని చిరునవ్వుతో అందరిని మంత్రముగ్ధుల్ని చేసింది. ఇండియన్ ఆర్ట్స్ సర్కిల్ జేమీ గౌరవార్ధం విందు భోజనం ఏర్పాటు చేసి అభినందించారు. 

జేమి ఇంస్టా లింక్ మీకోసం https://www.instagram.com/p/C58BqvivjhS/

https://www.instagram.com/p/C5qEy7FoTut/?img_index=1

ఇండియన్ ఆర్ట్స్ సర్కిల్ ఇంస్టా లింక్ https://www.instagram.com/p/C58IYSFy8qR/

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement