arts
-
నేటి ఆధునిక గృహాలలో నాటి ప్యాలెస్ కళ
మహారాజా ప్యాలెస్‌ల నుండి ఇకత్ డిజైన్ల వరకు ఆధునిక ఇళ్లలో భారతీయ కళల ప్రభావం అంతర్లీనంగా ఉంటోంది. క్లిష్టమైన ఎంబ్రాయిడరీ నమూనాల నుండి గ్రాండ్ ఆర్కిటెక్చరల్ మోటిఫ్‌ల వరకు, మనదైన వారసత్వం ఇంటీరియర్ డిజైన్‌లో కొంగొత్త నిర్వచనాన్ని చూపుతుంది.భారతీయ కళలు మ్యూజియంలు, గ్యాలరీలకు మించి విస్తరిస్తున్నాయి. ఇవి మనం నివాసం ఉండే ప్రాంతాలనూ ప్రభావితం చేస్తున్నాయి. క్లిష్టమైన ఎంబ్రాయిడరీ నమూనాల నుండి గ్రాండ్ ఆర్కిటెక్చరల్ మోటిఫ్‌ల వరకు, భారతీయ వారసత్వంలోని ఈ అంశాలు ఆధునిక ఇంటీరియర్ డిజైన్‌ను సరికొత్తగా చూపుతున్నాయి. భారతీయ కళ, సంప్రదాయాన్ని గౌరవించే సేకరణలు సమకాలీన గృహాలలోకి ప్రవేశించి, కలకాలం నిలిచేలా రిఫ్రెష్‌గా భావించే ఇంటీరియర్లను సృష్టిస్తున్నాయి. వారసత్వ ప్రేరేపిత డిజైన్లు సంప్రదాయంతో ఎంతో గొప్పగా ఉంటాయని రుజువు చేస్తున్నాయి. మహారాజ ప్యాలెస్–ప్రేరేపిత ఇంటీరియర్స్భారతీయ చరిత్ర మొత్తం వైభవంతో కూడిన కథలతో నిండి ఉంటుంది. హస్తకళతో పాటు ఎన్నో అంశాలకు ఉదాహరణలుగా నిలిచే రాజభవనాలు ఉన్నాయి. ఈ రీగల్–ప్రేరేపిత డిజైన్లు గ్రాండ్ మహారాజా ప్యాలెస్‌ల ఆర్చ్‌లు, మోటిఫ్‌లు, విలాసవంతమైన అలంకారాన్ని ప్రతిబింబిస్తాయి. అయితే ఇవి నేటి కాలపు అందానికి ప్రతీకగానూ ఉంటాయి. చికన్కరి సొగసుఇంటీరియర్ నిపుణుడు, మెరినో ఇండస్ట్రీస్ లిమిటెడ్ డైరెక్టర్ మనోజ్ లోహియా మరింత వివరిస్తూ, ‘రీగల్ శ్రేణిలో గజముద్ర, వసంత, సంస్కృతి వంటి డిజైన్ లు ఉన్నాయి. ప్రతి ఒక్క అంశమూ రాజ వైభవంతో అలరారుతుంటుంది. ఆ తర్వాత భారతదేశ విభిన్న కళారూ΄ాలలో చికన్కరీ ఎంబ్రాయిడరీ ఓ ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉంది. ఈ డిజైన్లు అల్లికలతో ఉంటాయి. చేతితో తయారైన ఈ అల్లికలు సాగసుగానూ, అందుబాటులో ఉంటాయి. అలంకృత్ ఒక అలంకారమైన ఆభరణాన్ని పోలి ఉంటుంది. కర్ణిక భారతీయ చెవి΄ోగుల నుండి స్ఫూర్తిని పొందింది. సాంప్రదాయ హవేలీలలో కనిపించే ఈ తోరణాల కళ నేటి ఆధునిక ఇళ్లలోనూ కనిపిస్తుంది. వాస్తుశిల్పం కూడా ఆధునిక అమరికలో చక్కగా ఇమిడిపోయి గొప్ప వారసత్వ కళతో ఆకట్టుకుంటున్నాయి’ అని ఆయన వివరించారు.ఇకత్ వీవింగ్ డిజైన్స్ఇకత్ అనేది దాని అద్భుతమైన నమూనాలు, సజీవ రంగులకు ప్రసిద్ధి చెందిన ఒక శక్తివంతమైన కళారూపం. కొత్త మెటీరియల్‌లలో ఈ నమూనాలను పునఃరూపకల్పన చేయడం ద్వారా, ఆధునిక డిజైన్ సేకరణలు అదే శక్తి, చైతన్యంతో నింపుతున్నాయి. ఇంటీరియర్ డిజైనర్ శ్రీ మనోజ్ మాట్లాడుతూ– ‘ఇకత్ హస్తకళకు కేంద్రంగా ఉండే ఒక థ్రెడ్‌వర్క్. సముద్రపు అలల నమూనాలను తలపిస్తోంది. ప్రశాంతతను కలిగిస్తుంది. తరంగ్ పుష్పం సున్నితమైన అందాన్ని మిళితం చేస్తుంది. ఈ డిజైన్లు ఒక గదికి శిల్పకళాపరమైన అందాన్ని తీసుకువస్తాయి. సాంస్కృతిక వారసత్వం, ఆధునిక సౌందర్యాల మధ్య అంతరాన్ని తగ్గిస్తాయి’ అని తెలిపారు. (చదవండి: తప్పుని ఎత్తిచూపడం కంటే.. చక్కదిద్దడమే ఉత్తమం) -
లడఖ్ కళలను పరిరక్షిస్తున్న నూర్ జహాన్
దాదాపు పద్నాలుగేళ్ల క్రితం వేసవికాలం... నూర్జాహాన్‌కు మరపురాని రోజులవి. ఆమె కాలేజీలో చదువుతున్న ఢిల్లీ నుండి సెలవుల కోసం ఇంటికి వచ్చింది. లేహ్ పాత పట్టణం ఆవరణలో కొంతమంది విదేశీయులు తారసపడ్డారు. వారు సమీపంలోని బౌద్ధ దేవాలయంలో పరిరక్షణ పనిని నిర్వహిస్తున్న బృందంలో ఉన్నారు. వారితో మాట్లాడిన కొన్ని మాటలు నూర్జాహాన్ జీవిత గమనాన్ని మార్చేశాయి. నూర్జాహాన్ కళా పరిరక్షణ రంగం గురించి చదవడం ప్రారంభించింది. 2017లో లేహ్‌లో తన కజిన్ వజీదా తబస్సుమన్తో కలిసి ‘షెస్రిగ్ లడఖ్’ అనే తన స్టూడియోను ప్రారంభించి, లడఖ్‌లోని మొదటి తరం ఆర్ట్ కన్జర్వేటర్లలో భాగమైంది.‘ఈ రంగంలోకి అనుకోకుండా ప్రవేశించాను. కళ లేదా వారసత్వానికి సంబంధించిన స్పృహ జీవితంలో చాలా ఏళ్ల తర్వాత వచ్చింది. కానీ ఒకసారి అనుకున్నది తారసపడితే గతంలోని చాలా చుక్కలను కనెక్ట్ చేయగలను’ అని భారత జాతీయ ఐస్ హాకీ జట్టుకు గోల్ కీపర్‌గానూ చేసిన 34 ఏళ్ల నూర్ చెబుతారు.లోతైన పరిశోధన‘‘లడఖ్‌లో కళల పరిరక్షణను ఎప్పుడూ వృత్తిగా పరిగణించలేదు. స్థానికుల కోసం కాదు. అంతర్జాతీయ నిపుణులు ప్రాజెక్టుల కోసం వచ్చి వెళ్లి΄ోవడం చూస్తుంటాం. అందుకే దీన్నే ఒక సబ్జెక్ట్‌గా ఎంచుకున్నాం. సుమారు రెండు దశాబ్దాల క్రితం లడఖ్‌లో జీవితం చాలా కఠినంగా ఉండేది. ప్రభుత్వ ఉద్యోగం లేదా కాంట్రాక్టర్‌గా జీవనోపాధి పొందడం ఇక్కడ ప్రాధాన్యతగా ఉండేది. నేను స్కూల్లో చేరగానే యువత దృష్టి డాక్టర్లు, ఇంజనీర్లుగా మారడం వైపు మళ్లింది. కళల పరిరక్షణ, పునరుద్ధరణ ఎప్పుడూ జీవనోపాధికి సంబంధించిన సాధనంగా పరిగణించబడలేదు. దీంతో ఈ రంగంలో ఎక్కువగా బయటి వ్యక్తులే ఉన్నారు.సవాల్‌గా నిలిచే రంగంలేహ్ సమీపంలోని సుమ్దా చు¯Œ లోని 13వ శతాబ్దానికి చెందిన గేట్‌వే స్థూపంపై నెల రోజుల΄ాటు పని చేయడం అంటే, అక్కడి స్థానికులతో కలిసి జీవించడం. గోల్డెన్ టెంపుల్ లోపల పెయింటింగ్స్‌పై పని చేయడంలో నిచ్చెనపై గంటల తరబడి గడిపేవాళ్లం. డిస్కిట్ సమీపంలోని సన్యాసిని ఆలయాన్ని పునరుద్ధరించడానికి, ఒక లోయలో వారాలు గడపడానికి ముగ్గురు మహిళల బృందం అవసరం అయ్యింది. విరిగిన జనరేటర్, వన్య్రప్రాణుల నుండి ఆహార నిల్వలను కాపాడుకోవడం ప్రతిదీ ఓ సవాల్‌గా ఉండేది. నా జీవితమంతా పట్టణ వాతావరణంలో జీవించాను కాబట్టి ఈ వాతావరణంలో పని చేస్తున్నప్పుడు చాలా సవాళ్లు ఎదుర్కొన్నాను. ఢిల్లీలోని నేషనల్ మ్యూజియం ఇన్స్టిట్యూట్లో పీహెచ్డీ డిసెర్టేషన్పై పనిచేస్తున్నప్పుడు సొంత ప్రాక్టీస్ ప్రారంభించాలనుకున్నాను పాత పట్టణం లేహ్‌లో మా పూర్వీకుల శిథిలమైన ఇంటిని స్టూడియోగా మార్చాను. తంగ్కా పెయింటింగ్‌లు, పాత పెయింటెడ్ ఫర్నిచర్, చెక్క కళాఖండాలు, పాత గ్రంథాలు, మాన్యుస్క్రిప్టులు, మెటీరియల్‌లను, ముఖ్యంగా గడ్డకట్టే చలికాలంలో విషయావగాహనకు, పరిధిని విస్తరించడానికి ఇటువంటి సౌకర్యం చాలా ముఖ్యమైనది. షెస్రిగ్ లడఖ్‌ను స్థాపించిన ఐదేళ్ల వరకు ఇంటిని పునరుద్ధరించడం, స్టూడియో పనిని పూర్తి చేయగలిగాం. సంరక్షణ దిశగా పనులుమా బృందంలో నలుగురు ఆడ, ఒక మగ. ఐదుగురం కలిసి లడఖ్ చుట్టుపక్కల ఉన్న స్థానిక కమ్యూనిటీలు, వ్యక్తిగత ఆసక్తి ఉన్నవారిని సంప్రదించాం. నిధులు నిరంతరం సమస్య. ప్రతి ్ర΄ాజెక్ట్కు కొత్త సవాళ్లు ఉండేవి. ఉదాహరణకు,19వ శతాబ్దం మధ్యలో డోగ్రా దండయాత్ర సమయంలో, వారి సైన్యం ముల్బెఖ్ ఆలయంలో స్థావరాన్ని ఏర్పాటు చేసి దానిలో వంట చేసింది. కాబట్టి, సాధారణ పునరుద్ధరణ పనులతో పాటు, పెయింటింగ్స్‌పై మిగిలి΄ోయిన ధూళిని కూడా మేం శుభ్రం చేయాల్సి వచ్చింది. సంవత్సరాలుగా, వాతావరణ మార్పులు, మానవ కార్యకలాపాల కారణంగా అనేక కట్టడాలు శిథిలమయ్యాయి. గత దశాబ్దంలో లడఖ్‌లో అధిక వర్షపాతం వల్ల సంప్రదాయ మట్టి నిర్మాణాలకు ముప్పు కలిగింది. నిర్మాణ, అభివృద్ధి పనులు కూడా వారసత్వ ప్రదేశాలపై దుష్ప్రభావం చూపుతున్నాయి. పాత ఆలయాన్ని సంరక్షించడం కంటే కొత్త ఆలయానికి నిధులు సేకరించడం సులభమని గ్రహించిన సందర్భాలూ ఉన్నాయి.కొంతమంది మా పనిని అర్థం చేసుకుంటారు. కానీ పని పూర్తయ్యాక విషయాలు కొత్తగా కనిపిస్తాయని ఆశించే వారు చాలా మంది ఉన్నారు. పరిరక్షణ, పునరుద్ధరణ అంటే చాలా మందికి తెలియదు. కాబట్టి, మేం ఒక ప్రాజెక్ట్‌లో పనిచేసినప్పుడల్లా, ఆ కమ్యూనిటీని, ముఖ్యంగా పిల్లలను వచ్చి మమ్మల్ని చూడమని ఆహ్వానిస్తాం. వారసత్వంపై అవగాహన, ప్రజలు దానిని ఎలా గ్రహిస్తారు అనేది రాబోయే కాలంలో ఈ సమాచారం అత్యంత కీలకం అవుతుంది’ అని వివరిస్తారు నూర్. -
వీకెండ్ ఆర్ట్.. వారాంతాల్లో కళాత్మకతకు పదును!
పాటరీ వర్క్‌షాప్స్: ఈ మధ్య కాలంలో పాటరీ వర్క్‌షాప్స్ బాగా ఆదరణ పొందుతున్నాయి. మొత్తని మట్టితో చిన్న చిన్న కళాకృతమైన కుండలు, బొమ్మలు, ఇంట్లో అలంకార వస్తువులను తయారు చేయడంపై శిక్షణ అందిస్తారు. గ్రామీణ మూలాల్లోంచి కొనసాగుతున్న కళ కావడం, అంతేగాకుండా ఈ పాటరీకి ప్రస్తుతం మార్కెట్లో మంచి ఆదరణ ఉండటంతో ఈ వర్క్‌షాప్స్‌కు ఔత్సాహికులు నిండిపోతున్నారు. తయారు చేసే సామాగ్రి, పనిముట్లు తదితరాలను నిర్వాహకులే సమకూరుస్తున్నారు.మ్యూజిక్ సైన్స్..సంగీతాన్ని ఇష్టపడని వారుండరంటే అతిశయోక్తి కాదేమో.. అయితే.. ఈ సంగీతాన్ని ఆస్వాదించడం పోయి వాయించడం అభిరుచిగా మార్చుకుంటున్నారు నగరవాసులు. గిటార్, వయోలిన్, డ్రమ్స్, ఫ్లూట్ ఇలా ఏదో ఒక సంగీత వాయిద్యంపై పట్టు పెంచుకోవడానికి ఇష్టపడుతున్నారు. ఓ వైపు ఐటీ జాబ్స్ చేస్తూనే ఇలాంటి ఆర్ట్స్‌పై అవగాహన పెంచుకుంటూ మ్యూజిక్ బ్యాండ్స్‌లో సైతం సభ్యులుగా మారుతున్నారు. వీటి శిక్షణ కోసం పలు సంగీత శిక్షణ కేంద్రాలు ఉండగా, రాష్ట్ర ప్రభుత్వ భాషా సాంస్కృతిక శాఖా ఆధ్వర్యంలోని కేంద్రాలు సైతం ఉన్నాయి.థియేటర్ ఆర్ట్స్..కొంతకాలంగా సిటీలో థియేటర్ ఆర్ట్స్‌కు ఔత్సాహికుల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. నటనలో, నాటకాల్లో శిక్షణ పొందుతూ.. థియేటర్ ప్లేలు ప్రదర్శిస్తూ వినూత్న ఒరవడికి నాంది పలుకుతున్నారు. వీటి కోసం రవీంద్రభారతి, తెలుగు యూనివర్సిటీ కళాప్రాంగణం, రంగభూమి వంటి వేదికలు ఆవకాశాలను కలి్పస్తున్నాయి. రంగస్థలంపై రాణించిన యువతకు సినిమాల్లో అవకాశాలు సైతం వస్తుండటంతో థియేటర్ ఆర్ట్స్ మోడ్రన్ యాక్టివిటీగా మారింది. అన్ని రంగాల్లో జాబ్స్ చేస్తున్న వారు ఇందులో భాగస్వామ్యం అవుతుండటం విశేషం.గార్డెనింగ్.. మోడ్రన్ ఆర్ట్..ఈ మధ్య మొక్కలు పెంచడం కూడా ఓ కళగా మారింది. ఇందులో ఇంటీరియర్, ఎక్స్టీరియర్, టెర్రస్ గార్డెనింగ్ అంటూ విభిన్న రకాలుగా ఉన్నాయి. నగరంలోని కొందరు మొక్కల ప్రేమికులు సోషల్ యాప్స్‌లో గ్రూపులుగా మారి ఈ గార్డెనింగ్పై ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారు. ముఖ్యంగా నగర జీవనశైలి దృష్ట్యా టెర్రస్ గార్డెనింగ్ ఔత్సాహికలు వేల సంఖ్యలో ఉన్నారు. వీరంతా ప్రత్యేకంగా మీట్స్ ఏర్పాటు చేసుకుని మొక్కలను, వాటి విత్తనాలను ఒకరికొకరు పంచుకుంటున్నారు. ఇదే వేదికలుగా ప్లాంటేషన్‌పై అనుభవజు్ఞలు, నిపుణులచే అవగాహన పొందుతున్నారు.నిత్యం ఒత్తిడి పెంచే సిటీ లైఫ్‌లో గార్డెనింగ్ అనేది వినూత్న కళగా అవతరించింది. ఇవేకాకుండా పెయింటింగ్, రెసిన్ ఆర్ట్స్, హ్యండ్ క్రాఫ్ట్, పేపర్ క్రాఫ్ట్, మైక్రో ఆర్ట్స్, జుంబా వంటి విభిన్న కళా అంశాలపై శిక్షణ పొందుతూ తమ ప్రత్యేకత చాటుకుంటున్నారు. వారి కళాత్మకతను సోషల్ మీడియా వేదికగా రీల్స్, షేర్లు, పోస్టులతో ప్రమోట్ చేసుకుంటూ సోసల్ సెలబ్స్గా మారుతున్నారు. -
Hyderabad: పటోలా ఆర్ట్స్.. వస్త్ర ప్రదర్శన ప్రారంభం!
సాక్షి, సిటీబ్యూరో: బంజారాహిల్స్‌లోని లేబుల్స్ పాప్–అప్ స్పేస్ వేదికగా కొలువుదీరిన ’డి సన్స్ పటోలా ఆర్ట్స్ వస్త్ర ప్రదర్శన’ను ప్రముఖ సామాజికవేత్త బినా మెహతా ప్రారంభించారు. విభిన్నమైన హ్యాండ్లూమ్ చీరలతోపాటు పటోలా ఆర్ట్ చీరలు, డిజైనర్ వేర్ వ్రస్తోత్పత్తులను ఒకే వేదికలో ప్రదర్శించడం అభినందనీయమని ఆమె అన్నారు. వస్త్ర ఉత్పత్తులను ఫ్యాషన్‌ప్రియులకు నేరుగా అందించేందుకు ఏర్పాటు చేసిన ఈ ప్రదర్శన అద్భుతంగా ఉందన్నారు.డి సన్స్ పటోలా ఆర్ట్స్ ఎక్స్పో నిర్వాహకులు భవిన్ మక్వానా మాట్లాడుతూ చేనేత పరిశ్రమకు మంచి మార్కెట్‌ను అందించడమే ఈ ఎగ్జిబిషన్ లక్ష్యమని వివరించారు. ఈ నెల 27వ తేదీ వరకు కొనసాగే ఈ ప్రదర్శనలో రాజ్‌కోట, పటోలా దుపట్టా, పటోలా శాలువాలు, సింగిల్ పటాన్ చీరలు, సింగిల్ పటోలా దుప్పట, పటాన్ పటోలా చీరలు, సిల్క్ టిష్యూ పటోలా వంటి 2 వేల రకాల ఉత్పత్తులు అందుబాటులో ఉన్నాయని చెప్పారు.35 మంది కళాకారులు.. 70 చిత్రాలు!– ఆర్ట్ గ్యాలరీలో ప్రారంభమైన చిత్రప్రదర్శనమాదాపూర్: కళాకారులు వేసిన చిత్రాలు సందేశాత్మకంగా ఉన్నాయని తెలంగాణ టూరిజం శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ వాణీప్రసాద్ అన్నారు. మాదాపూర్‌లోని చిత్రమయి స్టేట్ ఆర్ట్‌గ్యాలరీలో సోమవారం ఏర్పాటు చేసిన చిత్రప్రదర్శనను ఆమె ప్రారంభించారు.మున్ముందు చిత్రకారులకు మంచి భవిష్యత్తు ఉంటుందని తెలిపారు. 35 మంది కళాకారులు వేసిన 70 పెయింటింగ్ చిత్రాలు అందుబాటులో ఉన్నాయని ఈ నెల 25వ తేదీ వరకు ప్రదర్శన కొనసాగనుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఆర్కియాలజీ డైరెక్టర్ భారతి హోలికేరి, ఆర్ట్ గ్యాలరీ డైరెక్టర్ డాక్టర్ కె.లక్షి్మ, టూరిజం డిపార్ట్మెంట్ కార్పొరేషన్ ఎం.డి. ప్రకాశ్‌రెడ్డి, టూరిజం డైరెక్టర్ ఇలా త్రిపాఠి, భాషా సాంస్కృతిక డైరెక్టర్ మామిడి హరికృష్ణ, కళాకారులు పాల్గొన్నారు. -
మహిత.. తానొెక సూక్ష్మ లిఖిత!
అన్నం మహిత... చిన్నప్పుడు పెన్సిల్‌తో బొమ్మలు వేసింది. ఇప్పుడు పెన్సిల్ మీద గ్రంథాలు చెక్కుతోంది. మహనీయుల జీవిత చరిత్రలను పెన్సిల్ మీద రాస్తోంది. ఇప్పటి వరకు ఆమె రాసిన జీవిత చరిత్రలు, మహాగ్రంథాల జాబితా ఆమె వయసుకంటే పెద్దదిగా ఉంది. ఆంధ్రప్రదేశ్, బాపట్ల జల్లా, కారంచేడు మండలం, స్వర్ణ గ్రామానికి చెందిన మహిత... తాను సాధన చేస్తున్న మైక్రో ఆర్ట్ గురించి ‘సాక్షి ఫ్యామిలీ’తో పంచుకున్న వివరాలివి..‘‘చిన్నప్పటి నుంచి బొమ్మలు వేయడం ఇష్టం. ఇంటర్ పూర్తయి డిగ్రీలో చేరినప్పుడు కోవిడ్ లాక్డౌన్ వచ్చింది. ఆ ఖాళీ టైమ్‌లో బియ్యం మీద వినాయకుడు, జాతీయ పతకాలను చెక్కాను. ఆ తర్వాత మినుములు, పెసలు, బొబ్బర్లు మీద బొమ్మలు చెక్కాను. వాటిని చూసి మా నాన్న మహాభారతం ట్రై చెయ్యి, నీ సాధనకు గుర్తింపు వస్తుందన్నారు. సంస్కృత భాషలో మహాభారతంలోని 700 శ్లోకాలను 810 పెన్సిళ్ల మీద చెక్కాను. మొత్తం అక్షరాలు 67, 230, పదాల్లో చె΄్పాలంటే 7,238.కళను సాధన చేయడంలో ఉన్న గొప్పతనం ఏమిటంటే... ఒకటి పూర్తయిన తర్వాత మరొకటి చేయాలనిపిస్తుంది. మహాభారతం తర్వాత వాసవీ కన్యకాపరమేశ్వరి జీవిత చరిత్ర, పుట్టపర్తి సాయిబాబా చరిత్ర, అనేకమంది ప్రముఖుల జీవితచరిత్రలను పెన్సిల్ ముక్కు మీద రాశాను. జాతిపిత మహాత్మాగాంధీ, డాక్టర్ బీఆర్ అంబేద్కర్, అమరజీవి ΄÷ట్టి శ్రీరాములు, నెల్సన్మండేలా, ప్రధాని నరేంద్రమోదీ, స్వర్గీయ ఎన్టీఆర్, వైఎస్సార్, అంబేద్కర్, కరుణానిధి, కేసీఆర్, నరేంద్రమోదీ, ఎంఎస్రెడ్డితో΄ాటు ఏఎన్ఆర్ ఇంకా అనేక మంది సినీ ప్రముఖుల జీవితచరిత్రలను చెక్కాను. మన జాతీయగీతాన్ని ΄ాస్తా మీద చెక్కాను.కర్ణాటక రాష్ట్ర అవతరణ చరిత్రను కూడా రాశాను. నా కళకు గుర్తింపుగా చీరాల రోటరీ క్లబ్‌తో మొదలు ఉత్తరప్రదేశ్ ఆర్ట్ కాంపిటీషన్ వరకు అనేక పురస్కారాలందుకున్నాను. ఈ కళాసాధనను కొనసాగిస్తాను’’ అన్నారు అన్నం మహిత. సూక్ష్మ కళ ఆసక్తి కొద్దీ సాధన చేసే వాళ్లతోనే మనుగడ సాగిస్తోంది. ప్రభుత్వం నుంచి శిక్షణ అవకాశం లభిస్తే ఎక్కువ మంది కళాకారులు తయారవుతారని ఈ సందర్భంగా మహిత తన అభిలాషను వ్యక్తం చేశారు. – వంగూరి సురేశ్‌కుమార్, సాక్షి, బాపట్ల జిల్లా -
Sahaya Sharma: తనను తాను కొత్తగా ఆవిష్కరించుకుంటూ..
బామ్మ జీవితం నుండి ప్రేరణం పొంది అబ్స్ట్రాక్ట్ ఆర్టిస్ట్‌గానూ తల్లి సంగీత పరిజ్ఞానాన్ని ఒంటపట్టించుకొని సంగీత కళాకారిణిగానూ ఒకేసారి రెండు కళల్లోనూ రాణిస్తూ తనదైన ప్రత్యేకతను చాటుకుంటోంది ఢిల్లీవాసి సహాయ శర్మ. తనను తాను కొత్తగా ఆవిష్కరించుకుంటూ యువతరపు ఆలోచనలకు అద్దం పడుతుంది.‘‘నా ఎదుగుదలలో సంగీతం పాత్ర చాలా పెద్దది. మా అమ్మ సంగీత కళాకారిణి. తను పాడుతుండటాన్ని నా చిన్ననాటి నుంచి వింటూ, నేనూ పాడుతూ పెరిగాను. సంగీత ప్రపంచం నుంచి నాదైన సొంత శైలిని కనుక్కోవడానికి నిత్యం ప్రయత్నిస్తూనే ఉండేదాన్ని. స్కూల్, కాలేజీ రోజుల్లో ఎప్పుడు సెలవులు వచ్చినా రకరకాల పాటల్ని డౌన్లోడ్ చేసుకొని, ఒక ప్రత్యేకమైన జాబితా తయారు చేసేదాన్ని.సొంతంగా ఆల్బమ్స్ విడుదల..కిందటేడాది ముంబయిలో కిందటేడాది మా ఫ్రెండ్ మ్యూజిక్ స్టూడియోని సందర్శించాను. అక్కడ నేను రాసిన ఒక పాటను ప్లే చేశాను. ఆ పాట విన్నాక, వారు తమతో కలిసి పనిచేయవచ్చని చెప్పారు. దీంతో కిందటేడాది జూలై నాటికి అనుకున్న పాటను పూర్తి చేశాను. ఈ యేడాది మార్చిలో ‘ఫెడెక్స్ ఫెడప్’ ని విడుదల చేశాను. నా వ్యక్తీకరణను ప్రపంచంతో పంచుకోవడానికి ఇది సరైన సమయం అని భావించాను. గొడవల నుంచి పాటలు..రెండేళ్ల క్రితం మా కుటుంబసభ్యులతో చాలా గొడవ పడ్డాను. భగవద్గీత ఒక శ్లోకంలో కోపానికి, భయానికి మూలకారణం అనుబంధమే అని చెబుతోంది. దీనినుంచే నా ఆల్బమ్ పుట్టిందని చెప్పవచ్చు. ఒక సమయంలో జీవితం స్తంభించుకు΄ోయినట్టుగా అనిపిస్తుంది. అలాంటి సందర్భాన్ని దృష్టిలో పెట్టుకొని మొదటి మ్యూజిక్ ఆల్బమ్ చేశాను.96 బిపిఎమ్ అనేది నాన్నతో గొడవ తర్వాత రాశాను. ఈ గొడవ తర్వాత స్త్రీ ప్రవర్తన నాకు కొత్తగా అర్థమయ్యేలా చేసింది. జీవితంలోని ఆచరణాత్మక దృక్పథాన్ని, భగవంతుని పట్ల ఉండే భక్తి అన్నీ బలమైన మనిషిగా తీర్చిదిద్దాయి. నా పాటలోని సాహిత్యం అంతా ఇలాగే ఉంటుంది. ‘నేను మళ్లీ కలుస్తూనే ఉంటాను. రౌండ్ అండ్ రౌండ్‌గా తిరుగుతూనే ఉంటాను...’ అని సాగుతుంది. ఇప్పటికి మూడు ఆల్బమ్స్ విడుదలయ్యాయి.చిత్రకళలో ఓదార్పు..రంగులలో లోతైన ఓదార్పును, శాంతిని కనుక్కోవడానికి ఉపయోగపడేదే పెయింటింగ్. సంగీతం ద్వారా నన్ను నేను బయటకు వ్యక్తపరుచుకుంటే పెయింటింగ్‌లో నన్ను నేను వెతుక్కోగలిగాను. ఇలా ఈ రెండు కళలు నన్ను కొత్తగా ఆవిష్కరింపజేశాయి. మా బామ్మ తన చీరలపై రకరకాల పెయింటింగ్స్‌ను చిత్రిస్తుండేది. వాటిని చూస్తూ నేనూ సాధన చేసేదాన్ని. అలా రంగుల ప్రపంచం నాకు పరిచయం అయ్యింది. అంతేకాదు, మా ఇల్లు రకరకాల పెయింట్స్, శిల్పాలతో ఒక ఆర్ట్ మ్యూజియంలా ఉంటుంది.మా నాన్న అంత అందంగా తీర్చిదిద్దారు ఇంటిని. ఇది కళాకారిణిగా నా విజువల్ కార్టెక్స్‌లోని ప్రతి భాగాన్ని ప్రభావితం చేసింది. అక్కడి కళాకృతుల సేకరణలో అమ్మ అభిరుచి, మన దేశీయ సంస్కృతి... నాలో లోతైన గాఢత నింపాయి. ఆ ఇష్టంతోనే సింగపూర్ ఫైన్ ఆర్ట్స్ డిగ్రీ పూర్తి చేశాను. రంగులతో ఆధ్యాత్మిక ప్రపంచాలను సృష్టిస్తుంటాను. సోలో ఎగ్జిబిషన్లు నిర్వహిస్తుంటాను. భార తదేశం, న్యూయార్క్, లండన్, బోస్టన్, దుబాయ్, హాంకాంగ్‌లోని కేఫ్‌లు, కోర్టులు, హోటళ్లు, గెస్ట్ హౌజ్ గోడలను నా పెయింటింగ్స్ అలంకరించాయి. మార్చిన ప్రయాణాలు..అమ్మానాన్నలతో కలిసి దేశమంతా తిరిగిన రోడ్డు ప్రయాణాలు, జంగిల్ సఫారీలు, ట్రెక్కింగ్ ఏరియాలు నన్ను ప్రకృతికి దగ్గర చేశాయి. నా తల్లితండ్రులు ప్రయాణంలో సంగీతం, కళ, కథలు, సంస్కృతిని పరిచయం చేశారు. అప్పటినుంచి అందమైన ప్రకృతి దృశ్యాలను నా పెయింటింగ్స్ లో చూపించడం అలవాటు చేసుకున్నాను.కరోనా సమయంలో జీవితం ఎంత చిన్నదో కదా అనిపించింది. అప్పుడు భౌతికంగా, ఆధ్యాత్మికంగా అర్థం చేసుకోవడం మొదలుపెట్టాను. విలాసవంతమైన జీవనం అవసరమా అనేది తెలుసుకున్నాను. నా వాస్తవికత ఏమిటో అర్థమయ్యాక నేనేం సృష్టించాలో తెలుసుకున్నాను. అందువల్ల మ్యూజిక్ ఆల్బమ్స్, పెయింటింగ్స్ నన్ను కొత్తగా మార్చాయి’’ అని వివరిస్తుంది సహాయ. -
NRI: హాంగ్‌కాంగ్‌లో జేమీ లీవర్ పండించిన నవ్వుల డోలలు!
మే 1979లో ఒక సొసైటీ గా నమోదు చేయబడిన ఇండియన్ ఆర్ట్స్ సర్కిల్ అనేది లాభాపేక్ష లేని సంస్థ. సభ్యులు మరియు సాధారణ ప్రజల కోసం భారతీయ సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించడం, సభ్యులలో నాటకం, సంగీతం, నృత్యం, సాహిత్యం మరియు దృశ్య కళలపై ఆసక్తిని పెంపొందించడం మరియు ఇలాంటి సంస్థలతో సహకరించడం దీని లక్ష్యాలు. స్థానిక ప్రతిభావంతులకు అవకాశాలను అందించడానికి ఈ బృందం ప్రతి సంవత్సరం రెండు కార్యక్రమాలను నిర్వహిస్తుంది మరియు భారతదేశం నుండి ప్రఖ్యాత కళాకారులను కూడా ఆహ్వానిస్తుంది. భారత కాన్సుల్ జనరల్ మరియు శ్రీమతి పూర్విజ్ ష్రాఫ్ గౌరవ పోషకులు, మరియు శ్రీ జి.టి. గుల్ సర్కిల్ యొక్క శాశ్వత సలహాదారుగా సేవలు అందజేస్తున్నారు.కోవిడ్ తరువాత అంటే నాలుగు సంవత్సరాల తరువాత మొదటి సారి, ఇండియన్ ఆర్ట్స్ సర్కిల్ ఈ సంవత్సరం మన తెలుగు అమ్మాయి జేమి లీవర్ ని హాంగ్ కాంగ్ కి ఆహ్వానించారు. "గూన్జ్ సితారోన్ కి" అనే సాంస్కృతిక వినోద కార్యక్రమం 18 ఏప్రిల్ న స్థానిక సిటి హాల్ లో నిర్వహించారు. పూర్వ చైర్ పర్సన్ శ్రీమతి రాణి సింగ్ , చైర్ పర్సన్ శ్రీమతి రానూ సింగ్ , ఉపాధ్యక్షుడు సర్దార్ నవ్‌తేజ్ సింగ్ మరియు కార్యదర్శి శ్రీమతి జయ పీసపాటి మరియు ఇతర కార్యవర్గ సభ్యులందరూ ఈ కార్యక్రమాన్ని అద్భుతంగా నిర్వహించారు. చైర్ పర్సన్ శ్రీమతి రానూ సింగ్ కార్యక్రమాన్ని ప్రారంభించటానికి భారత కాన్సుల్ జనరల్ ఆఫ్ ఇండియా శ్రీమతి సత్వంట్ ఖనాలియా గారిని ఆహ్వానించి సన్మానించారు. సత్వంత గారు ఇండియన్ ఆర్ట్స్ సర్కిల్ చేస్తున్న అద్భుతమైన కార్యక్రమాలను మరియు కళారులకి ఒక చక్కని వేదికని అన్జేస్తున్నందుకు,వారిని ప్రోత్సహిస్తున్నందుకు ప్రశంసించారు. స్థానిక కళాకారుల బాలీవుడ్ , హిప్ హాప్, జానపద , నృత్యాలతో మరియు అలనాటి మధుర గీతాలతో ప్రారంభమైన ‘గూన్జ్ సితారోన్ కి” ని ప్రేక్షకులు ఆనందిస్తూ కరతాళ ధ్వనులతో కళాకారులని ప్రోత్సహించారు. అప్పుడు జేమీ లీవర్ ఎంట్రీ ఇచ్చారు … ఇంకా అప్పటినుంచి నవ్వుల పువ్వుల పండిస్తూ జేమీ మిమిక్రీ తో కామిడి చేస్తూ ప్రముఖ బాలీవుడ్ హీరోయిన్స్ హేమ మాలిని , మలాయికా, దీపికా పడుకోన, కంగనా రనౌత మో వారిని అనుకరిస్తూ తనకు ప్రత్యెక గుర్తింపు తెచ్చిన ప్రముఖ గాయని ఆశా భోంస్లే , కొరియోగ్రాఫర్ ఫరా ఖాన్ మరియు తన తండ్రి జాని లీవర్ ల మిమిక్రీ తో ఉత్తేజభరితమైన వాతావరణo ప్రేక్షకులని ఆనందోత్సాహాలతో ముంచేసింది. హాస్యంలో మిమిక్రి, గానం, నృత్యంమేళవించి ఒక గంట సేపు నవ్వుల మారథాన్ చేసారు జేమి!! ప్రముఖ సిని నటుడు, కమెడియన్ జాని లీవర్ అసలు పేరు జాన్ ప్రకాష్ రావు జనుముల, అయితే ఆయన హిందూస్తాన్ లేవేర్స్ లో పని చేస్తూ స్టాండ్ అప్ కామెడి పండించి స్టాఫ్ ని నవ్వుల డోలలూగించినప్పుడు, యాజమాన్యం వారు ఆయనకీ 'లీవర్' అని పేరు ఇవ్వడం జరిగింది. అప్పటి నుంచి ఆయన ఇంటి పేరే 'జానీ లీవర్' పాపులర్ అయ్యింది. తెలుగు హిందీ చిత్రరంగం లో కమెడియన్ గా పేరొందిన ప్రముఖ నటులు తండ్రి జానీ లీవర్ ప్రతిభని పుణికి పుచ్చుకుంది అని జెమీ లీవర్ గురించి చెప్పడం అతిశయోక్తి కాదేమో ! హాంగ్ కాంగ్ కళా ప్రేమికుల హృదయాల్లో చెరగని స్థానాన్ని సంపాయించుకున్న జేమి తను ఇంత ఉత్సాహభరితమైన ప్రేక్షకుల మధ్య ప్రదర్శించడం తనకి ఎంతో ఆనందంగా వుందని హర్షం వ్యక్తం చేసారు. స్థానికంగా విచ్చేసిన ప్రముఖులు , భారతీయ కన్సులార్ శ్రీ కుచిభోట్ల వెంకట్ రమణ గారు తదితరులు జేమి కి తమ శుభాభినందనలు, శుభాకాంక్షలు తెలిపారు. ఆమె స్టాండ్ అప్ కామెడి లో గొప్ప శిఖరాలను అందుకోవాలని త్వరగా మరల హాంగ్ కాంగ్ రావాలని స్థానికులు ఆశ వ్యక్తం చేసారు అందుకు జేమి తన చెరగని చిరునవ్వుతో అందరిని మంత్రముగ్ధుల్ని చేసింది. ఇండియన్ ఆర్ట్స్ సర్కిల్ జేమీ గౌరవార్ధం విందు భోజనం ఏర్పాటు చేసి అభినందించారు. జేమి ఇంస్టా లింక్ మీకోసం https://www.instagram.com/p/C58BqvivjhS/https://www.instagram.com/p/C5qEy7FoTut/?img_index=1ఇండియన్ ఆర్ట్స్ సర్కిల్ ఇంస్టా లింక్ https://www.instagram.com/p/C58IYSFy8qR/ -
వెలుగులు చిమ్మిన నందులు
‘కళలు ఉన్నంతకాలం నా గుండెను వేదిక చేస్తా కళాకారుణ్ణి బతికిస్తా...’ ఇది ఏపీ సీఎం వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి కళాకారులకు ఇచ్చిన భరోసా. డిసెంబర్ 23 నుంచి 29 వరకు గుంటూరు నగరంలో రాష్ట్ర ప్రభుత్వ 2022 వ సంవత్సర ‘నంది’ నాటకోత్సవాలు ఘనంగా జరిగాయి. ఉభయ తెలుగు రాష్ట్రాల నుండీ వందల సంఖ్యలో కళాకారులు ఏడురోజులూ ఉత్సాహంగా వీటిలో పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ‘చలనచిత్ర, టీవీ, నాటకరంగ అభివృద్ధి సంస్థ’ ఆధ్వర్యంలో స్వర్గీయ బలిజేపల్లి లక్ష్మీకాంతం కళాప్రాంగణం (శ్రీ వేంకటేశ్వర విజ్ఞాన మందిరం – ఎ.సి.) ఇందుకు వేదికైంది. ఎఫ్డీసీ చైర్మన్ పోసాని కృష్ణ మురళి పర్యవేక్షణలో విజయ కుమార్ రెడ్డి, శేషశాయి ఇత్యాది ఉన్నతాధికారులు, సిబ్బంది చేసిన ఏర్పాట్ల పట్ల కళాకారులు సంతుష్టి వ్యక్తం చేశారు. కళాకారులకు, అతిథులకు, ప్రదర్శన లకు చేసిన ఏర్పాట్లు తదితర అంశాల్లో ఈ ఉత్సవాలకూ గతంలో జరిగిన ఉత్సవాలకూ హస్తిమశకాంతరం ఉందనీ, ఇంత ఘనంగా, ఎంతో పారదర్శకంగా... మరీ ముఖ్యంగా టైమ్ ప్రకారం – గతంలో ఎన్నడూ జరగ లేదని పలువురు కళాకారులు అన్నారు. ఆర్టిస్టులకు, అతిథులకు స్టార్ హోటళ్లలో బస ఏర్పాటుచేశారు. అల్పాహార, భోజన సదుపాయం పట్ల కూడా అందరూ ఆనందం వ్యక్తం చేయడం విశేషం. రెండు మూడు తరగతులు చదువుతున్న బుడతల నుండి... జీవితాన్ని కాచి వడపోసిన... డెబ్భైలు దాటిన సీనియర్ మోస్ట్ కళాకారుల వరకూ పాల్గొనడం ఈ ఉత్సవాల ప్రత్యేకత. కరోనా మహమ్మారి కారణంగా వాయిదా పడిన ‘2022 నంది నాటక ఉత్సవా’లను ఇప్పుడు నిర్వహించారు. వివిధ విభాగాలకు సంబంధించి 115 ఎంట్రీలు రాగా ప్రాథమిక పరిశీలన అనంతరం– పద్య నాటకాలు 10 (ప్రదర్శన పారితోషికం రూ. 50 వేలు), సాంఘిక నాటకాలు 6 (రూ. 40 వేలు); సాంఘిక నాటికలు 12 (రూ. 25 వేలు); బాలల విభాగంలో 5 (రూ. 25 వేలు); కాలేజీ, యూనివర్శిటీ విద్యార్థుల విభాగంలో 5 (రూ. 25 వేలు) మొత్తం 38 నాటక, నాటికలను ప్రద ర్శించారు. మొత్తం 72 బహుమతుల కోసం దాదాపు పన్నెండొందల మంది కళాకారులు హోరాహోరీ తల పడ్డారు. పద్య నాటక విభాగంలో మాధవవర్మ – విజయవాడ (ప్రథమ రూ. 80 వేలు, బంగారు నంది), శ్రీకాంత కృష్ణమాచార్య – విశాఖ (ద్వితీయ రూ. 60 వేలు, రజిత నంది); వసంతరాజీయం – హైదరాబాద్ (తృతీయ రూ. 40 వేలు, కాంస్య నంది) విజేతలుగా నిలిచాయి. అలాగే.. సాంఘిక నాటకాల విభాగంలో ఇంద్ర ప్రస్థం – గుంటూరు (రూ 70 వేల నగదు, బంగారు నంది), ఇంపోస్టర్స్ – హైదరాబాద్ (రూ. 50 వేల నగదు, రజత నంది); కలనేత – హైదరాబాద్ (రూ. 30 వేల నగదు, కాంస్య నంది); సాంఘిక నాటికల విభా గంలో అస్తికలు – పెదకాకాని (రూ. 40 వేల నగదు, బంగారు నంది), కమనీయం – గుంటూరు (రూ. 30 వేల నగదు, రజత నంది), చీకటిపువ్వు – కరీంనగర్ (రూ. 20 వేల నగదు, కాంస్య నంది); బాలల విభాగంలో ప్రపంచతంత్రం – విజయవాడ (రూ. 40 వేల నగదు, బంగారు నంది), బాధ్యత – రాప్తాడు (రూ. 30 వేల నగదు, రజత నంది), మూడు ప్రశ్నలు – విజయవాడ (రూ. 20 వేల నగదు, రజత నంది); యువజన విభాగంలో ఇంకానా..? – విజయవాడ (రూ. 40 వేల నగదు, బంగారు నంది), కపిరాజు – గుంటూరు (రూ. 30 వేల నగదు, రజత నంది), ఉద్ధంసింగ్ – తిరుపతి (రూ. 20 వేల నగదు, కాంస్య నంది) బహుమతులను గెలుచుకున్నాయి. నాటకరంగంపై రచనల్లో ‘రాయలసీమ నాటక రంగ వికాసం’ (రచయిత డా. మూల మల్లికార్జునరెడ్డి) ఉత్తమ రచనగా ఎంపికైంది. ‘ఎన్టీఆర్ స్మారక రంగస్థల పురస్కారా’న్ని డా. మీగడ రామలింగస్వామి – విశాఖకు (రూ. 1.5 లక్షల నగదు, ప్రత్యేక జ్ఞాపిక), ‘వైఎస్సార్ స్మారక రంగస్థల అవార్డ్’ను యంగ్ మెన్స్ హ్యాపీ క్లబ్–కాకినాడ (రూ. 5 లక్షల నగదు, ప్రత్యేక జ్ఞాపిక)ను అందించారు. దర్శకత్వం, రచన సహా పలు అంశాల్లో వ్యక్తిగత అవార్డులు, నగదు బహుమతులు అందజేశారు. వ్యక్తిగత బహుమతుల నగదు మొత్తాన్ని ఐదురెట్లు పెంచుతున్నట్లు చైర్మన్ పోసాని ప్రకటించడంతో కళా కారుల ఆనందానికి అవధుల్లేవు. మైక్, లైటింగ్ సిస్టం అద్భుతంగా పనిచేయడం ఉత్సవాల విజయానికి దోహదపడింది. పక్కా ప్రణాళికతో... ఎప్పటికప్పుడు ప్రాక్టికల్ సమీక్షలతో మొత్తం కార్యక్రమాన్ని అత్యంత విజయవంతం చేశారంటూ పోసాని టీమును ఆర్టిస్టులు, అతిథులు మనఃపూర్వకంగా అభినందించడం ఈసారి ’నంది’ పండగ హైలైట్. – జి.వి. రంగారెడ్డి, సీనియర్ జర్నలిస్ట్ -
కళలు అనే వర్షం కావాలి! అప్పుడే..
అన్నార్భవంతు భూతాని... అసలు ప్రాణుల పుట్టుకకు, మనుగడకు అన్నం కావాలి. అన్నం దొరకాలంటే భూమికి ఆర్ద్రత ఉండాలి. ఆకాశంలో నుంచి పడిన వర్షంతో భూమి అంతా చెమ్మగిల్లి మొక్కలు పుట్టినట్లు, ఒక దేశసంస్కృతి నిలబడాలంటే కళలు.. అనే వర్షం కావాలి. కళల ద్వారా సంస్కృతి పెరుగుతుంది. సంస్కృతి పెరిగితే ప్రజల ఆచార వ్యవహారాలు, జీవనశైలి, నడవడిక, ఆ దేశపు కీర్తిప్రతిష్ఠలు నిర్ణయింప బడతాయి. కళలు... అంటే కవిత్వం, శిల్పం, నృత్యం, వాద్యం.. ఎప్పుడూ అవతలివారికి సంస్కృతిని కల్పించేవి అయి ఉంటాయి. ఇవన్నీ కళలు కాబట్టి ఇవి వర్షం లాంటివి. అవి సంస్కృతిని మొలకెత్తించడానికి కారణం కావాలి. మన దేశానికి ఇన్ని కీర్తిప్రతిష్ఠలు రావడానికి కారణం ఏమిటి? భగవద్గీత పుట్టిన భూమి. రామాయణం, భారతం, భాగవతం వంటివి పుట్టిన భూమి. గంగానది ప్రవహిస్తున్న భూమి. ఒకనాడు తాళంకప్ప అవసరం తెలియని భూమి. సంస్కృత భాషలో తాళం కప్ప అన్నదానికి పదం లేదు.. ఆ అవసరం రాలేదు. కారణం – పరద్రవ్యాణి లోష్ఠవత్... రహదారిమీద రాయి దొరికితే నాది కాదు అని ఎలా అంటామో అలాగే నాది కానిదేదీ, పరవాడివస్తువు ఏదయినా నాకు దొరికితే నాది కాదు కాబట్టి అది నాకు రాయితో సమానమే... అన్న భావన. అదీ ఈ దేశ సంస్కృతి. ఇది ఎక్కడినుంచి వచ్చింది? రామాయణంలో నుంచి, భారతంలోంచి.. వచ్చింది. నీదికానిది నీవు కోరుకుంటే .. పతనమయి పోతావన్న హెచ్చరిక... దాని జోలికి వెళ్ళనీయదు. కళలు ఈ దేశపు సంస్కృతిని ప్రతిబింబించేవి అయి ఉంటాయి. మీరు ఏది వింటున్నా, ఏది చూస్తున్నా, మనశ్శాంతికి కారకమైన భగవంతుని తత్త్వాన్ని ఆవిష్కరింపచేసేవిగా ఉంటాయి. ఒక నృత్యం జరుగుతోంది. ‘కస్తూరీ తిలకం లలాటఫలకే వక్షస్థలే కౌస్తుభమ్ నాసాగ్రే నవమౌక్తికమ్...’ అంటూ సాగుతున్న కీర్తనకు నర్తకి అభినయిస్తుంటే నర్తకి క్రమేణా కనుమరుగై కృష్ణపరమాత్మ కనబడడం మొదలవుతుంది. పాట అభినయంగా మీకు శ్రీకృష్ణ దర్శనం చేయించి, మీ ఉద్వేగాలను శాంతపరుస్తుంది. పాలగిన్నె కింద అగ్నిహోత్రం పెడితే పాలు పొంగుతాయి. నీళ్ళు చల్లితే పొంగు చల్లారుతుంది. అలా మనదేశంలో ఉన్న కళలు మన భావోద్వేగాలను అణచి ప్రశాంతతను, మనశ్శాంతిని కల్పించడానికి ఉపయుక్తమయ్యాయి. అందుకే ప్రపంచ వ్యాప్తంగా కీర్తిని, ఆదరణనూ పొందాయి. ఈ కళలన్నీ శాంతిని ప్రసాదించగల దివ్యత్వాన్ని సంతరించుకున్నాయి. ఇవన్నీ కూడా వేదాలకు ఉపవేదాలయినటువంటి వాటి నుంచి వచ్చాయి. సామవేదానికి గాంధర్వ వేదం ఉపవేదం. మిగిలినవి ఇతర వేదాలకు ఉపవేదాలు. వేదానాం సామవేదోస్మి... అన్నాడాయన. ఎందుకు అంతస్థాయిని పొందింది? అంటే తినడం ఒక్కటే కాదు, శరీరం పెరగడం ఒక్కటే కాదు ప్రధానం, అది ఎంత అవసరమో, మనసు సంస్కారవంతంగా తయారు కావడం కూడా అంతే ప్రధానం. (చదవండి: మెట్ట వేదాంతం..?) -
మొక్కలు రావాలంటే భూమికి తడి తగలాలి..సంస్కృతి నిలబడాలంటే..
ఊపిరి వాక్కుగా మారిన కారణంగా శరీరం పడిపోయినా, కీర్తి శాశ్వతంగా నిలబడిపోతుంది. నిజానికి మనకు సనాతన ధర్మంలో గొప్పది వేదం. వేదం అపౌరుషేయం. ఈశ్వరుడిచేత చెప్పబడినది. ఈశ్వరుడు ఎంత సనాతనుడో వేదం అంత సనాతనమైనది. నా ఊపిరి రెండు కాదు, ఊపిరి తీస్తున్నంతసేపే ‘నేను’ నేనుగా ఉన్నాను. ఊపిరి తీస్తూ మాట్లాడమంటే మాట్లాడలేను. ఊపిరి విడిచి పెడుతున్నప్పుడు అది వాక్కుగా మారుతుంది. తీసిన ఊపిరులను సమాజ శ్రేయస్సు కోసం వాక్కులుగా మార్చిన వారున్నారు. తామేదీ ఆశించకుండా కేవలం సమాజ శ్రేయస్సే కోరుకున్నారు వారు. భగవంతుడిచ్చిన ఊపిరిని వాక్కుగా మార్చి మాట్లాడుతున్నాను, అది నన్ను శాశ్వతుడిని చేస్తుందన్నాడు పోతన. శాశ్వతమైనది పరబ్రహ్మము. దానిలో చేరిపోతాను... అన్నాడు. శంకరాచార్యులవారు శివానందలహరి చేస్తూ..అసలు భక్తికి చివరి మాట ఏది అన్నదానికి సమాధానంగా ... ‘‘అంకోలం నిజ బీజ సంతతి రయస్కాంతోపలం సూచికా/ సాధ్వీ నైజ విభుం లతా క్షితి రుహం సింధు స్సరిద్వల్లభమ్/ ప్రాప్నోతీహ యథా తథా పశుపతేః పాదార వింద ద్వయమ్/ చేతో వృత్తి రుపేత్య తిష్ఠతి సదా సా భక్తి రిత్యుచ్యతే ’’ అంటారు. నది సముద్రంలో కలిసిపోయిన తరువాత ఇక నదికి రంగు, రుచి ఇవేం ఉండవు. అటువంటి త్యాగమయ జీవితాన్ని గడిపి భగవంతునిలో ప్రవేశించాడు, నది సముద్రంలో కలసిపోయినట్లు కలిసిపోయాడు. కానీ ఆయన మాత్రం లోకంలో చిరస్థాయిగా ఉండిపోయాడు. ఎలా ... వాక్కు కారణంగా. భారతం ద్వారా నన్నయ అలా ఉండిపోయాడు. ఎర్రాప్రగడ, త్యాగరాజస్వామి, ముత్తుస్వామి దీక్షితార్, శ్యామశాస్త్రి, రామదాసు... వీళ్ళందరూ అలాగే వాక్కుల కారణంగా ఉండిపోయారు. ఆ వాక్కును కొందరు పద్యరూపంగా, కొందరు గద్యరూపంగా, శ్లోకంగా, పాటగా చెప్పారు. పాటకున్న లక్షణం .. అది సంస్కృతికి మూలకందమై నిలబడుతుంది. భూమినుంచి మొక్కలు పుట్టాలి... అంటే భూమికి ఆర్ద్రత ఉండాలి. అందుకే గ్రీష్మం తరువాత వర్షరుతువు వస్తుంది. దానిముందు ఆషాఢమాసం ప్రవేశించగానే ప్రతి ఊరిలోనూ అధిష్ఠాన దేవతయిన గ్రామదేవతను దర్శించుకుని నైవేద్యం పెడతారు. ఎందుకు! ఆమె అనుగ్రహంతో నేను ఈ ఊరిలో ఉండి అన్నం తినగలుగుతున్నా... కాబట్టి ఏడాదికొక్కసారి నేను ఆమెకు నైవేద్యం పెట్టాలి. ఆమె భూమికి ఆర్ద్రత కలిగిస్తుంది, వర్షరూపంలో. తడి తగలగానే ఏడాదికి సరిపడా నేను తినగలిగిన అన్నం నాకు దొరుకుతుంది... అన్న భావన. భూమికి తడి తగలకపోతే, ఎండి పడిపోయిన జామ గింజలు, బత్తాయి గింజలు, ధాన్యపు గింజలు ఏవీ మొక్కలుగా పైకి లేవవు. తడి తగలగానే గడ్డిపరకనుంచి మొదలుపెట్టి, భూమికి చేరిన గింజలన్నీ మొక్కలై పెరుగుతాయి. అంటే ఆర్ద్రత ఉండాలి. ప్రాణుల మనుగడకు అది ఆధారం. అలాగే ఒక దేశ సంస్కృతి నిలబడాలంటే... భూమి అంతా చెమ్మగిల్లి మొక్కలు పుట్టినట్టు, కళలుండాలి. కళలద్వారా సంస్కృతి పెరుగుతుంది. (చదవండి: వరలక్ష్మీ వ్రతం ఎప్పుడు చేసుకోవాలి? శ్రావణంలో వచ్చే రెండో శుక్రవారం ప్రత్యేకత ఏంటి?) -
సీతాఫలంపై మహాత్ముల బొమ్మలు
-
ఆర్ట్స్‌లోనే కామర్స్ కూడా.. ఏపీ హైకోర్టు ముందుకు ఓ ఆసక్తికర కేసు..
సాక్షి, అమరావతి : బీకాం కోర్సు ఆర్ట్స్ అండ్ హ్యుమానిటీస్ విభాగం కిందకు వస్తుందా రాదా అంటూ హైకోర్టు ముందుకు ఓ ఆసక్తికర కేసు వచ్చింది. దీనిపై పూర్తి స్థాయిలో విచారణ జరిపిన హైకోర్టు ధర్మాసనం.. బీకాం కోర్సు ఆర్ట్స్ అండ్ హ్యుమానిటీస్ విభాగం కిందకే వస్తుందని తీర్పు చెప్పింది. రాష్ట్రంలోని దాదాపు అన్ని విశ్వవిద్యాలయాలు బీకాంను ఈ విభాగం కిందే బోధిస్తున్నాయని గుర్తు చేసింది. బీకాం, ఆర్ట్స్ విభాగం కిందకు రాదనేందుకు ఆధారాలేవీ అధికారులు సమర్పించలేదంది. కామర్స్ కోర్సు ఆర్ట్స్ కిందకు వస్తుందని యూజీసీ సమాచార హక్కు చట్టం కింద సమాచారం ఇచ్చిందని వివరించింది. వార్డ్ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ సెక్రటరీ (గ్రేడ్–2) పోస్టుకు బీకాం చదివిన వారు అర్హులు కాదనడాన్ని హైకోర్టు తప్పుపట్టింది. వారు ఈ విధులు నిర్వర్తించలేరన్న అధికారుల వాదనను తోసిపుచ్చింది. నోటిఫికేషన్లో ఈ ఉద్యోగులు ఎలాంటి విధులు నిర్వర్తించాలో ఎక్కడా ప్రస్తావించలేదని, ఆర్ట్స్ నేపథ్యం ఉన్న వారు మాత్రమే ఆ బాధ్యతలు నిర్వర్తిస్తారని కూడా చెప్పలేదంది. క్రీడాకారులు, ఎక్స్ సర్విస్‌మెన్, ఎన్సీసీలో ఇన్‌స్ట్రక్టర్‌గా పనిచేసిన వారికి అవకాశం ఇచ్చారని, వయో పరిమితిని సైతం సడలించారని గుర్తు చేసింది. వీరంతా వార్డ్ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ సెక్రటరీ బాధ్యతలు నిర్వర్తించగలిగినప్పుడు, బీకాం చదివిన వారూ అర్హులవుతారని హైకోర్టు ధర్మాసనం తేల్చి చెప్పింది. రాత పరీక్షలో ఉత్తీర్ణత సాధించి, సర్టీఫికెట్ల పరిశీలన సమయంలో అనర్హులుగా తేల్చిన అభ్యర్థులను ఆ పోస్టుకు అర్హులుగా పరిగణించాలని అధికారులను ఆదేశించింది. పిటిషనర్లను ఆ పోస్టుకు పరిగణనలోకి తీసుకుని, నియామకాలు చేయాలని ఆదేశించింది. ఈ ప్రక్రియను ఎనిమిది వారాల్లో పూర్తి చేయాలని హైకోర్టు చెప్పింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ డీవీఎస్ఎస్ సోమయాజులు, జస్టిస్ ఊటుకూరు శ్రీనివాస్ తదితరులతో కూడిన ధర్మాసనం గత వారం తీర్పు వెలువరించింది. విచారణ ద్వారా తేల్చాలన్న సింగిల్ జడ్జి వార్డ్ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ సెక్రటరీ పోస్టుకు పురపాలక శాఖ 2019లో నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ పోస్టులకు బీకాం చదివిన వారూ దరఖాస్తు చేయగా, వారిని అధికారులు రాతపరీక్షకు అనుమతించారు. సర్టీఫికెట్ల పరిశీలన సమయంలో బీకాం కోర్సు ఆర్ట్స్, హ్యుమానిటీస్ విభాగం కిందకు రాదని, పోస్టుకు అర్హులు కారని అధికారులు తిరస్కరించారు. దీనిపై పలువురు అభ్యర్థులు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. విచారణ జరిపిన హైకోర్టు.. అధికారులకు పూర్తిస్థాయి వినతిపత్రం సమర్పించాలని పిటిషనర్లను ఆదేశించింది. దానిపై చట్ట ప్రకారం నిర్ణయం తీసుకోవాలని అధికారులకు చెప్పింది. అభ్యర్థులు పురపాలక శాఖ కమిషనర్‌కు వినతిపత్రం సమర్పించగా, దానిని తిరస్కరిస్తూ కమిషనర్ 2020లో ఉత్తర్వులిచ్చారు. ఆ ఉత్తర్వులను సవాలు చేస్తూ అభ్యర్థులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన సింగిల్ జడ్జి.. పిటిషనర్లు చదివిన బీకాం కోర్సు ఆర్ట్స్ అండ్ హ్యుమానిటీస్ కిందకు వస్తుందో లేదో తేల్చాలని అధికారులను ఆదేశించారు. ఈ తీర్పును సవాలు చేస్తూ అభ్యర్థులు ధర్మాసనం ముందు అప్పీళ్లు దాఖలు చేశారు. చదవండి: Fact Check: దగా చేసింది ఎవరో తెలియదా రామోజీ ? ఈ అప్పీళ్లపై జస్టిస్ సోమయాజులు ధర్మాసనం విచారణ జరిపింది. అభ్యర్థుల తరఫున న్యాయవాది జొన్నలగడ్డ సుదీర్ వాదనలు వినిపిస్తూ.. సమాచార హక్కు చట్టం కింద అడిగిన ప్రశ్నకు బీకాం ఆర్ట్స్ అండ్ హ్యుమానిటీస్ కిందకే వస్తుందని యూజీసీ సమాధానం ఇచ్చిందంటూ, ఆ వివరాలను కోర్టు ముందుంచారు. రాష్ట్రంలో పలు విశ్వవిద్యాలయాలు బీకాంను ఆర్ట్స్ విభాగం కింద పేర్కొంటూ ఇచ్చిన డిగ్రీ సర్టీఫికేట్లను ధర్మాసనం ముందుంచారు. ప్రభుత్వ న్యాయవాది వాదనలు వినిపిస్తూ, యూజీసీ 2014లో ఇచ్చిన నోటిఫికేషన్ ఆధారంగానే నిర్ణయం తీసుకున్నామన్నారు. వార్డ్ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ సెక్రటరీ పోస్టు అణగారిన వర్గాలను పైకి తీసుకొచ్చేందుకు ఉద్దేశించిందని, కార్పొరేట్ అకౌంటింగ్ తదితర సబ్జెక్టులు ఈ పోస్టు కింద నిర్వర్తించే విధులకు సరిపోవన్నారు. అందువల్ల పురపాలక శాఖ నిర్ణయంలో ఎలాంటి తప్పులేదని తెలిపారు. -
ప్రపంచంలోని టాప్ 20 అత్యంత ప్రసిద్ధమైన పెయింటింగ్స్
-
ఈ పిక్స్ చూశారా? గుండెలు బాదుకుంటున్న కృతి సనన్ ఫ్యాన్స్
ఆర్టిఫిషియల్ ఇమేజెస్ హవా మామూలుగా లేదు. ఏఐ ద్వారా ఇప్పటికే సినిమా, క్రీడారంగానికి చెందిన సెలబ్రిటీల ఫోటోలను వివిధ రకాలుగా చిత్రించిన ఏఐ ఆర్టిస్ట్ తాజాగా మరికొన్నింటిని సృష్టించారు. మిడ్ జర్నీని టూల్‌తో ఏఐ ఆర్టిస్ట్ SK MD అబూ సాహిద్ అందమైన స్టార్లను వృద్ధులుగా మార్చేసారు. ఐశ్వర్యా రాయ్, ప్రియాంక చోప్రా తదితర విమెన్ యాక్టర్స్ సీనియర్ సిటిజెన్స్ అయితే ఎలా ఉంటారో అన్న ఊహ వీటికి ప్రాణమిచ్చింది. అంతేకాదు శ్రద్ధాకపూర్, దీపికా పదుకోన్, కత్రినా కైఫ్, అలియా భట్, కృతి సనన్, అనుష్క శర్మ లాంటి ఫోటోలను కూడా మార్చివేయడంతో ఇవి వైరల్‌గా మారాయి. అవేంటో మీరూ ఒకసారి చూసేయండి . ఇదీ చదవండి: టీ స్టాల్ కోసం ఐఏఎస్ డ్రీమ్‌ను వదిలేశాడు: ఏకంగా ఏడాదికి రూ. 150 కోట్లు ముడతలు పడిన చర్మం, నల్లటి వలయాలతో భయంకరంగా కనిపిస్తున్నారంటూ ఫ్యాన్స్ గుండెలు బాదుకుంటున్నారు. "బాప్ రే కృతి సనన్ నా బామ్మగా కనిపిస్తుంది." ఒకరు ఆందోళన వ్యక్తం చేయగా, "శారీరక సౌందర్యం తాత్కాలికం, కానీ అంతర్గత సౌందర్యం శాశ్వతమైనది" ఇలా ఒక్కో పిక్‌పై ఒక్కో రకంగా హిల్లేరియస్ కమెంట్స్‌తో యూజర్లు సందడి చేస్తున్నారు. (అయ్యయ్యో! ఐకానిక్ స్టార్, ప్రిన్స్ మహేష్, డార్లింగ్ ప్రభాస్? ఎందుకిలా?) కాగా 23 వేల ఇన్‌స్టా ఫాలోయర్లతో ఏఐఆర్టిస్ట్ సాహిద్ సోషల్ మీడియాలో ఏఐ పిక్స్‌తో బాగా పాపులర్ అవుతున్నాడు. క్రికెటర్లను ముసలివాళ్లుగా, స్థూల కాయులుగా, ఫుట్‌బాల్ క్రీడాకారులుగా, బిలియనీర్లను బిచ్చగాళ్ళుగా, షార్క్ ట్యాంక్ ఇండియా జడ్జీలను శిశువులుగా, మెట్ గాలాలో సందడి చేసిన బిలియనీర్లు, డిస్నీ సినిమాల్లో బాలీవుడ్ నటులు ఇలా ఆయన పోస్ట్ చేసిన వెంటనే ఏఐ పిక్స్ వైరల్ కావడం కామన్‌గా మారిపోయింది. (Dr.Vandana Lal Success Story: రూ. 3వేల కోట్ల నికర విలువతో రిచెస్ట్ విమెన్: ఆసక్తికర విషయాలు) View this post on Instagram A post shared by SAHID (@sahixd) -
Tim Cook ఢిల్లీలో సందడి: వాటిపై మనసు పారేసుకున్న కుక్
న్యూఢిల్లీ: దేశంలో యాపిల్ స్టోర్లు ప్రారంభం కానున్న నేపథ్యంలో యాపిల్ సీఈవో దేశంలో ప్రధాన నగరాలు ఢిల్లీ, ముంబైలలో పర్యటిస్తున్నారు. ముందుగా ముంబైలోని యాపిల్ స్టోర్ ప్రారంబించిన అనంతరం కుక్ దేశ రాజధాని ఢిల్లీలో సందడి చేశారు. గురువారం ఢిల్లీలోని యాపిల్ స్టోర్‌ను కుక్ ప్రారంభించనున్నారు. లోధీ ఆర్ట్ డిస్ట్రిక్ట్‌లోని మంత్రముగ్ధుల్ని చేసే కళాత్మక చిత్రాలపై ఆయన ప్రశంసలు కురిపించారు. అద్భుతమైన కళాకారులు.. 62 ఏళ్ల భారతీయ జీవితాన్ని చాలా శక్తి వంతంగా చిత్రీకరించారంటూ స్టేట్ ఆర్టిస్ట్ ఫౌండేషన్ ఆర్టిస్టులను అభినందించారు. ముఖ్యంగా ఐప్యాడ్‌లో కుడ్య చిత్రాలను ఎలా డిజైన్ చేస్తారో తనకు చూపించిన దత్తరాజ్ నాయక్‌కు ధన్యవాదాలు అంటూ ట్వీట్ చేశారు. కాగా ఇండియాలోకి యాపిల్ఎంటరై 25ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా దేశంలోనే తొలి అధికారిక యాపిల్ స్టోర్‌ను ముంబైలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్ (బీకేసీ)లో ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా యాపిల్ సీఈవో హాజరు కావడంతో అభిమానులు సందడి చేశారు. అలాగే మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్, నటి మౌనీ రాయ్, నిర్మాత బోనీ కపూర్, అలనాటి అందాల హీరోయిన్ మాధురి దీక్షిత్, నేహా ధూపియా, రకుల్ ప్రీత్ సింగ్, తదితర సెలబ్రిటీలు కుక్‌ను కలవడం విశేషంగా నిలిచింది. 1984 నాటి వింటేజ్ కంప్యూటర్ మానిటర్‌తో ఒకయాపిల్ అభిమాని అందరి దృష్టిని ఆకర్షించారు. మరోవైపు యాపిల్ సెకండ్ స్టోర్ ను ఏప్రిల్ 20న (రేపు) ఢిల్లీలో ఓపెన్ చేయనున్నారు. Delhi’s Lodhi Art District is a remarkable public space. Congratulations to the St+art India Foundation and so many amazing artists for capturing Indian life so powerfully. And thank you to Dattaraj Naik for showing me how you design your murals on iPad. pic.twitter.com/5JuzlHRvPC — Tim Cook (@tim_cook) April 19, 2023 -
కళాశాలల్లో ఇక ‘కళా గురువులు’
సాక్షి, అమరావతి: దేశంలోని ఉన్నత విద్యాసంస్థల్లో ప్రస్తుతం ఉన్న యాంత్రిక పద్ధతిని నివారించడానికి యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) నడుం బిగించింది. ప్రస్తుత విద్య ఒత్తిడితో కూడుకుని యాంత్రికంగా మారుతుండటంతో విద్యార్థులకు విద్యపై ఆసక్తి సన్నగిల్లుతోంది. దీన్ని మార్చి విద్యార్థులు ఇష్టంతో విద్య నేర్చుకునేలా యూజీసీ చర్యలు చేపట్టింది. చదువులను ఆహ్లాదకరంగా మార్చడానికి వివిధ కళారూపాలను విద్యార్థులకు అందుబాటులోకి తేవాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా వివిధ కళల్లో లబ్ధప్రతిష్ట లైన వారిని కళాశాలల్లో కళా గురువులుగా నియమించనుంది. వీరి ద్వారా హస్తకళలు, సంగీతం, నృత్యం, జానపదాలు, థియేటర్, తోలు»ొమ్మ ప్రదర్శనలు, ఫొటోగ్రఫీ, కాలిగ్రఫీ, యోగా, పెయింటింగ్, ఇంద్రజాలం (మ్యాజిక్) వంటి వాటిని సహ పాఠ్య కార్యక్రమాలుగా ప్రవేశపెట్టనుంది. ఈ మేరకు యూజీసీ తాజాగా ముసాయిదా ప్రతిపాదనలు విడుదల చేసింది. సృజనాత్మకతను పెంపొందించే ఈ సంప్రదాయ కళారూపాలు ఆరోగ్యకరమైన సమాజాన్ని రూపొందించేందుకు దోహదపడతాయని యూజీసీ భావిస్తోంది. దీనివల్ల విద్యార్థుల్లో కళాత్మక ఆలోచనలకు, సృజనాత్మకతకు అవకాశం ఉంటుందని, చదువుల్లోనూ వారు మరింత ఉత్సాహంగా ఉంటారని అభిప్రాయపడుతోంది. అదే సమయంలో మరుగునపడిపోతున్న కళారూపాలకు మళ్లీ కొత్త జీవం పోసినట్లు అవుతుందని తలపోస్తోంది. ఏకకాలంలో రెండు ప్రయోజనాలు.. మన దేశం గొప్ప కళా, సాంస్కృతిక వారసత్వాన్ని కలిగి ఉంది. ప్రాచీన కాలం నుంచి అనేక అద్భుతమైన కళారూపాలు ఉన్నాయి. వీటిని కళాకారులు సంరక్షించుకుంటూ వస్తున్నారు. అయితే వీటికి విద్యా వ్యవస్థతో సంబంధం లేకుండా పోవడంతో కొత్త తరానికి ఈ కళల గురించి అవగాహన లేదు. ముఖ్యంగా ఉన్నత విద్యను అభ్యసించే విద్యార్థులకు, కళలకు మధ్య చాలా అంతరం ఏర్పడింది. దీన్ని తగ్గించడానికి ఈ కళాగురువుల విధానానికి యూజీసీ శ్రీకారం చుట్టింది. దీనివల్ల ఈ కళా రూపాలను సంరక్షించుకునే వీలు కలుగుతుంది. అదే సమయంలో ఒత్తిడితో యాంత్రికంగా మారిపోయిన విద్యా విధానం నుంచి విద్యార్థులు బయటపడటానికి.. ఆహ్లాదకరంగా విద్య నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో కళాశాలల్లో విద్య, బోధన, పరిశోధన ఇతర విద్యా కార్యకలాపాల్లో నైపుణ్యం కలిగిన కళా గురువులను రెగ్యులర్ ప్రాతిపదికన నియమించనున్నారు. ఉన్నత విద్యా విధానంతో హస్త కళలు, నృత్య రూపకాలు, సంగీతం, లలిత కళలు మొదలైనవాటిని అనుసంధానం చేస్తారు. తద్వారా విద్యార్థుల అభ్యసన ప్రక్రియను మెరుగుపరచనున్నారు. మూడు విభాగాల్లో కళా గురువులు.. ఆయా కళల్లో స్థానిక కళాకారులను గుర్తించి ఎంప్యానెల్ చేయడానికి ఆయా విద్యాసంస్థలు కమిటీని ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. కమిటీ.. కాంపిటెంట్ అథారిటీకి సిఫార్సులను అందించాలి. కళా గురువులను మూడు విభాగాల్లో ఎంపిక చేయనున్నారు. పరమేష్టి గురువు, పరమ గురువు, గురువు అనే విభాగాల్లో వీరిని నియమించనున్నారు. పరమేష్టి గురువుగా నియమితులు కావాలంటే పద్మ అవార్డు లేదా జాతీయ, అంతర్జాతీయ స్థాయి ప్రతిష్టాత్మక అవార్డు పొంది ఉండాలి. కనీసం 20 ఏళ్ల అనుభవం ఉండాలి. పరమ గురువుకు కనీసం ఒక జాతీయ, రాష్ట్ర స్థాయి ప్రభుత్వ గుర్తింపు పొందిన అవార్డు, లేదా తత్సమాన అవార్డు తప్పనిసరి. అనుభవం 10 ఏళ్ల కంటే తక్కువ ఉండకూడదు. ఇక గురువుకు.. పరమేష్టి, పరమ గురువుల కేటగిరీల్లో లేని మాస్టర్లుగా పేరు తెచ్చుకున్న కళాకారులను ఎంపిక చేయొచ్చు. అనుభవం 5 ఏళ్లకన్నా తక్కువ ఉండరాదు. అయితే అంతర్జాతీయ, జాతీయ, ప్రభుత్వ గుర్తింపు పొందిన కచేరీల్లో పాల్గొని ఉండాలి. ఎంప్యానెల్ అయిన కళా గురువులకు కార్యకలాపాలను నిర్వహించడానికి తగిన వేదికను ఏర్పాటు చేస్తారు. అవసరమైన ఇతర సహాయంతో పాటు సౌకర్యాలు అందిస్తారు. ప్రయాణ ఖర్చులు, వసతి, నిబంధనల ప్రకారం గౌరవ వేతనం ఇస్తారు. కళారూపాల జాబితా ఇలా.. హస్త కళలు: కుండలు, వెదురు ఆకృతులు, చెక్క పని, టెర్రాకోట, మధుబని, పిచ్వాహి, చరఖా నేయడం, మొఘల్ ఉడ్ ఆర్ట్, స్టోన్, కాంస్యం పని, మీనాకారి పని, నేత, అద్దకం, బ్లాక్ ప్రింటింగ్, మినియేచర్ పెయింటింగ్, ఉడ్ కారి్వంగ్, ప్రింటెడ్ టెక్స్టైల్స్, నేచురల్–ఆర్గానిక్ డైస్ ప్రిపరేషన్, హ్యాండ్ ఎంబ్రాయిడరీ, కార్పెట్ నేత, కాలిగ్రఫీ, దడ్తాన్ గోయ్ తదితరాలు. శాస్త్రీయ సంగీతం: హిందుస్థానీ గాత్రం, హిందుస్థానీ వాద్యం, కర్ణాటక గాత్రం, కర్నాటిక్ ఇన్సŠట్రుమెంటల్, గుర్బానీ, సుఫియానా సెమీ క్లాసికల్, లైట్, మోడ్రన్ మ్యూజిక్, తుమరి/ దాద్రా/కజ్రీ, గజల్, గీత్, భజన్, సూఫీ తదితరాలు. సోపాన సంగీతం: ఖవాలీ, భక్తి– భజన, రామాయణం, శ్రీమద్భాగవత్ పఠనం తదితరాలు, రవీంద్ర సంగీతం, ఫ్యూజన్/జుగల్బందీ/తల్వాధ్య, ఆర్కె్రస్టా/కోరల్, రాక్, బ్యాండ్/జాజ్, కోయిర్ గానం తదితరాలు. డ్యాన్స్: సంప్రదాయ నృత్య రూపకాలైన కథక్, ఒడిస్సీ, భరతనాట్యం, కూచిపూడి, కథాకళి, మణిపురి, మోహినీయాట్టం, ఛౌ, సత్త్రియ, యక్షగానం, పాండ్వానీ తదితరాలు. జానపద నృత్యం: భాంగ్రా/గిద్దా, గర్బా, రౌఫ్, ఘూమర్, బిహు, లావణి, విలాసిని నాట్యం, ధిమ్సా, బగురుంబా, అలీ ఐ లిగాంగ్, కోలాటం, నాట్యం, అజిలాము, రొప్పి, ఫోనింగ్, కజారి, ఝుమారి, దండారి, గెండి, పంతి, కర్మ, దమ్కాచ్, మాండో, తల్గారి, సువారి, దసరవదన్, కుంబీ, ఫుగాడి, రాస్, భావాయి, తిప్పానీ, గుగ్గ, ఖోరియా, కులు నాటి, నామ్గెన్, హికత్, ఛమ్, దుమ్హాల్, కుడ్, భంద్ జషన్, ఫాగువా, కృష్ణ పారిజాత, నాగమండల, భూత ఆరాధన, కైకొట్టికలి, తుంబి తుల్లాల్, కర్మ, గౌర్ మారియా, కక్సర్, అహిరి, పావ్రీ, ధంగారి గజ, ఖంబ థోయిబి, పుంగ్ చోలోమ్, నోంగ్క్రెమ్, చెరావ్, ఖుల్లం, చంగ్లో–సువాలువా, ఘుమురా, రుక్ మార్, గోటిపువా, ఝుమర్, కుచి్చఘోడి, కల్బేలియా, భావాయి, సపేరా నృత్యం, సింఘీ చామ్, ఖుకూరి, తలచి, కరగాట్టం, మయిల్అట్టం, కుమ్మి, కావడి, గరియా, హోజాగిరి, రాస్లీల, చర్కుల, బరదానాటి, చాపెలి, లాంగ్వీర్, గంభీర, కలికాపటడి, డోమ్ని, కలరిపట్టు, ఒట్టంతుల్లాలెట్ తదితరాలు. వృత్తిపరమైన కళారూపాలు: పెయింటింగ్, ప్రింట్ మేకింగ్, టెక్స్టైల్, డ్రాయింగ్, స్కల్ప్చర్, సిరామిక్, కాలిగ్రఫీ, ఫొటోగ్రఫీ, జానపద థియేటర్, నౌతంకి, యోగా, ఇసుక కళ, మెహందీ, ఫ్లోర్ ఆర్ట్ (రంగోలి/మందన/కోలమెట్సీ), కథకులు, మ్యాజిక్ షో, పప్పెట్ షో, కామిక్ ఆర్ట్ తదితరాలు. -
బొమ్మేస్తే అచ్చు దిగాల్సిందే..!
బొమ్మలు గీయడమంటే ఆయనకు వెన్నతో పెట్టిన విద్య.. అచ్చు గుద్దినట్లు సహజత్వం ఒట్టిపడేలా చిత్రాలు తీర్చిదిద్దడంలో ఆయన దిట్ట. చిన్నప్పటి నుంచి త్రలేఖనంపై మక్కువ కలిగిన ప్రసాదరావు కష్టపడి ఆర్ట్స్ టీచర్ ఉద్యోగం సంపాదించాడు. తన లాగే చిత్ర లేఖనంలో ఆసక్తి ఉన్న విద్యార్థులను గుర్తించి వారిని మరింత ప్రోత్సహించి మేటిగా రాణించేందుకు కృషి చేస్తున్నారు. కొనకనమిట్ల(ప్రకాశం జిల్లా): కొనకనమిట్ల మండలం వెలిగొండ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ గురుకుల పాఠశాలలో ఆర్ట్స్ టీచర్‌గా పనిచేస్తున్న కొమ్ము ప్రసాదరావు విభిన్న శైలి. సామాజిక స్పృహపై అరుదైన చిత్రాలు వేస్తూ జాతీయ స్థాయిలో అవార్డులు అందుకున్నారు. సామాజిక స్పృహ కలిగించే చిత్రాలపై విద్యార్థులకు శిక్షణ ఇస్తూ ఉత్తమంగా తీర్చిదిద్దుతున్నారు. ప్రసంసించే చిత్రాలు.. సామాజిక రుగ్మతలు, దేశ, రాష్ట్ర నాయకులు, పర్యావరణ కాలుష్యం, మంచినీటి సమస్య, పరిసరాల పరిశుభ్రత, విజృంభిస్తున్న అంటువ్యాధులు, బాల కార్మిక నిర్మూలనం వంటి అంశాలపై చిత్ర లేఖనం ద్వారా నలుగురికి అవగాహన కల్పించేందుకు ప్రయత్నిస్తున్నారు. రైతు భరోసాతో జై కిసాన్ అంటూ రైతు శ్రమను గుర్తించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రైతుల మోములో ఆనందహేలలు నింపుతున్న దృశ్యాన్ని కళ్లకు కట్టినట్లు కొమ్ము ప్రసాదరావు తీర్చిదిద్దారు. గ్రామీణ ప్రజల్లో చైతన్యం తెచ్చేలా చిత్రాలు వేసి ప్రదర్శిస్తున్నారు. నీటి వృథా, స్వచ్ఛ భారత్, కాలుష్య నివారణ, పర్యావరణ పరిరక్షణ, పరిసరాల పరిశుభ్రత అంశాలతో పాటు కరోనా మహమ్మారిపై విద్యార్థులు గీసిన చిత్రాలు ఆకట్టుకుంటున్నాయి. భూగర్భజలాల ఆవశ్యకత, కాలుష్య కారకాలు, చెట్ల పెంపకం వల్ల కలిగే లాభాలు, కందకాలు తీయడం ద్వారా నీటి వృథాను అరికట్టవచ్చనే విషయాలపై చిత్రాలు వేస్తూ రాష్ట్ర, జాతీయస్థాయిలో చిత్రలేఖనం పోటీలకు ఎంపిక కావటంతో పాటు ఉత్తమ చిత్రాలకు అవార్డులు, బహుమతులు సాధించారు. ఆర్టు అకాడమీలో ప్రశంసలు.. ఆర్టు అకాడమీ నిర్వహిస్తున్న పెయింటింగ్ ప్రదర్శనల్లో పాల్గొంటూ ప్రముఖుల మన్ననలు పొందుతున్నారు. ఈ నెల 8వ తేదీన ఒంగోలులో ‘సృష్టి ఆర్ట్ అకాడమీ’ వారు నిర్వహించిన పెయింటింగ్ ప్రదర్శనలో పలు రాష్ట్రాల నుంచి 87 మంది ప్రముఖ ఆర్టిస్టులు పాల్గొని చిత్రాలు ప్రదర్శించారు. వారిలో ప్రసాదరావు ప్రదర్శించిన చిత్రాలు ఆకట్టుకున్నాయి. ముఖ్య అతిథులుగా పాల్గొన్న ఒంగోలు నగర మేయర్ గంగాడ సుజాత, దృశ్య కళల అకాడమీ చైర్మన్ సత్యశైలజ, అమృత హాస్పిటల్ వైద్యులు కేశవ, ప్రఖ్యాత చిత్ర కళాకారులు కళాసాగర్ చేతుల మీదుగా ప్రత్యేక అవార్డు పొందటంతో పాటు ఘనంగా సన్మానించారు. తమ పాఠశాల ఆర్ట్స్ టీచర్ అద్భుతంగా సందేశాత్మక చిత్రాలను పెయింటింగ్ ద్వారా రూపొందించి జాతీయ యిలో ప్రదర్శించి అవార్డులు సొంతం చేసుకోవటం అభినందనీయమని గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ కోటేశ్వరరావు అన్నారు. -
పండగ కళ పదింతలు.. ఆదుర్దా వద్దు.. ఇలా చేయండి!
పండగ వేళ ఇల్లు కళగా వెలిగిపోవాలంటే ఏం చేయాలా అని ఎక్కువ ఆదుర్దా పడనక్కర్లేదు. సింపుల్‌గా అనిపిస్తూనే, ఎక్కువ శ్రమ లేకుండా కొన్ని వస్తువులతో అలంకరణ ద్వారా పండగ కళను రెట్టింపు చేసుకోవచ్చు. దశమి నాడు పది విధాల మేలైన కళ ఇది. 1. ఇత్తడి, రాగి పాత్రలు ఇవి ఉంటే చిటికెలో పని అయిపోయినట్టే. అందులోనూ దేవతా రూపాలతో ఉన్న వస్తువులైతే అలంకరణ మరింత సులువు అయిపోతుంది. మర చెంబులు, వెడల్పాటి ప్లేట్లు ఉన్నా.. వీటిలో నీళ్లు పోసి పువ్వులు వేస్తే చాలు పండగ కళ వచ్చేసినట్టే. 2. డిజైనర్ రంగోలీ ముంగిట్లో ముచ్చటైన రంగవల్లికలు అందం. అలాగని పెద్ద పెద్ద ముగ్గులు వేసే టైమ్ లేదు అనుకునేవారికి సింపుల్ చిట్కా.. మార్కెట్లో డిజైనర్ రంగవల్లికలు రెడీమేడ్‌గా దొరుకుతున్నాయి. సాయంకాలపు వెలుగుకు ఈ ముగ్గులు మరింత అందాన్ని తెచ్చిపెడతాయి. 3. పువ్వులు–ఆకులు ముగ్గుల స్థానంలో పువ్వులు, ఆకులతో ఇలా ముచ్చటైన డిజైన్లుగా రూపుకట్టవచ్చు. ఈ అలంకరణ ఎప్పుడు చేసినా పండగ నట్టింట్లో కొలువుదీరినట్టే. 4. డిజైనర్ తోరణం మామిడి, బంతిపూలతోనే కాదు ఇవి కూడా డిజైనర్ తోరణాలే. ఎంబ్రాయిడరీ జిలుగులు, అద్దకం, కుందన్స్ మెరుపులతో తీర్చిదిద్దిన అందమైన తోరణాలు ఎన్నో. వాటిని ఒకసారి తెచ్చుకుంటే ప్రతి పండగకూ మెరిపించవచ్చు. ఇలా అందమైన కళను తీసుకురావచ్చు. 5. వాల్ హ్యాంగింగ్స్ టెర్రకోట గంటలు, ఫెదర్ తో కూడిన పక్షుల బొమ్మలు .. ఇలా రకరకాల హ్యాంగింగ్స్ తెచ్చి గుమ్మం ముందు వేలాడదీస్తే ఎంత కళను తెచ్చిపెడతాయో కళ్లారా చూడాల్సిందే. 6. పువ్వుల హ్యాంగింగ్ ఎన్ని పూల దండలను వేలాడదీస్తే అంత అందంగా కనిపిస్తుంది ఇల్లు. అయితే, ఎక్కడ ఎలా అలంకరించాలో మాత్రం ఎవరి అభిరుచి వారిదే. 7. డెకార్ కుషన్స్ చిన్న చిన్న పిల్లోస్ లేదా కుషన్స్ సోఫా– దివాన్ల మీద వేస్తూ ఉంటారు. వాటికి రంగు రంగుల కాంబినేషన్లో ఉన్న కవర్స్ వేస్తే పండగ కళ అదిరిపోయిందనే కితాబు రాకుండా ఉండదు. 8. బొమ్మలు దసరా పండగ అంటే చాలామంది బొమ్మల కొలువులతో అలరిస్తుంటారు. అన్ని బొమ్మలు లేకపోయినా ఈ పండగ నాడు కొన్న కొన్ని బొమ్మలతో షోకేస్‌ని అలంకరిస్తే చాలు. వాటిలో మన దేశీయ హస్త కళాకృతులను చేరిస్తే మరింత అందం వస్తుంది. దసరా పండగను పురస్కరించుకుని వచ్చిన వాల్ స్టిక్కర్స్‌ను కూడా ఉపయోగించవచ్చు. 9. పూజా ప్లేట్ పూజలలో వాడే ప్లేట్‌ని కూడా అందంగా అలంకరించుకోవచ్చు. డిజైనర్ థాలీ పేరుతో ఇవి మార్కెట్లో లభిస్తున్నాయి. పువ్వులు, ఆకులు, నెమలి ఈకలు.. మొదలైనవాటిని ఉపయోగించే పూజా ప్లేట్స్ లేదా అలంకరణ ప్లేట్లను తయారు చేసుకోవచ్చు. 10. నీటిపైన పువ్వులు అలంకరణకు ఏ వస్తువులూ లేవని చింతించనక్కర్లేదు. కొన్ని రకాల పువ్వులను ఒక పెద్ద పాత్రలో ఉంచి గుమ్మానికి ఒక వైపున లేదా ఇంటిలోపల గుమ్మానికి ఎదురుగా అలంకరించినా చాలు... పండగ కళ రెట్టింపుగా మిమ్మల్ని పలకరిస్తుంది. -
మీ కోసం 'వెదురు' చూసే బొమ్మలం!
వేలేరుపాడు: జీవనది గోదావరి చెంతన పాపికొండలుకు వెళ్లే మార్గంలో విహార యాత్రా స్థలంగా ప్రసిద్ధి చెందిన గిరిజన గ్రామం పేరంటపల్లి (పేరంటాలపల్లి). పశ్చిమ గోదావరి జిల్లా వేలేరుపాడు మండలంలో గల ఈ గ్రామంలో శ్రీరామకృష్ణ మునివాటం ఆలయం ఉంది. అక్కడ శివుణ్ణి దర్శించి.. పచ్చని ఎత్తైన కొండల నుంచి జాలువారే జలపాతాలను.. గుడి వెనుక రాళ్ల నుంచి పారే నీటిని వీక్షించే పర్యాటకులు పరవశించిపోతారు. కొండ గుట్టల మధ్య సుమారు 170 మెట్లు ఎక్కితే 500 సంవత్సరాల క్రితం మాతంగి మహర్షిచే ప్రతిష్ఠించబడిన సీతారామలక్ష్మణ ఆంజనేయ సుందర విగ్రహాలు దర్శనమిస్తాయి. సీతారామ లక్ష్మణ అంజనేయస్వామి వార్లు సజీవంగా మన ఎదుట ప్రత్యక్షమైన అనుభూతి కలుగుతుంది. ఆ పక్కనే ఉండే వాలి, సుగ్రీవుల గుట్టలు కనువిందు చేస్తాయి. ఆ గ్రామంలో సుమారు 60 కొండరెడ్డి గిరిజన కుటుంబాలు జీవిస్తున్నాయి. అందరిదీ ఒకే వృత్తి. వెదురు బొమ్మల తయారీలో వారంతా నిష్టాతులే. కొండకోనల్లో దొరికే ములస వెదురు వీరికి ఉపాధినిస్తోంది. ఆకట్టుకునే కళాకృతులు తమచుట్టూ క్రూర మృగాలుంటాయని తెలిసినా అక్కడి గిరిజనులు ప్రమాదం అంచున జీవనం సాగిస్తుంటారు. అక్కడి గిరిజనులు దారీతెన్నూ లేని గుట్టల్లో ప్రయాణించి వెదురు బొంగులను సేకరిస్తారు. వాటితో వివిధ కళాకృతులు తయారు చేస్తుంటారు. తామర, గులాబీ పువ్వులు, వివిధ అంతస్తుల భవనాలు, లాంచీలు, బోట్లు, ఫైల్ ట్రే తదితర నమూనాల రూపంలో కళాకృతులను తయారు చేస్తున్నారు. వీటివల్ల నిరంతరం ఇళ్ల వద్దే వీరికి ఉపాధి దొరుకుతోంది. ఆదివారం, సెలవు రోజులతో పాటు దసరా, శివరాత్రి, సంక్రాంతి పండుగలకు పర్యాటకుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. ఇక్కడి వెదురు కళాకృతులు పర్యాటకులను ఆకట్టుకుంటున్నాయి. వీటిని కొనుగోలు చేసి జ్ఞాపికలుగా తీసుకెళ్తుంటారు. ఒక్కో బొమ్మ సైజును బట్టి రూ.50 నుంచి రూ.350 వరకు ధర పలుకుతున్నాయి. పన్నెండేళ్ల క్రితం ఐటీడీఏ ఇచ్చిన శిక్షణ కొండరెడ్ల కళా నైపుణ్యాన్ని వెలుగులోకి తెచ్చింది. వెదురు వస్తువులే మా జీవనం వెదురు బొమ్మల తయారీతోనే మేం జీవిస్తున్నాం. పర్యాటకులు వచ్చే సీజన్లో నిత్యం 5 నుంచి 10 బొమ్మలు అమ్ముతా. రోజుకు రూ.500 వరకు ఆదాయం వస్తోంది. – కోపాల యశోద, పేరంటపల్లి వీటితోనే మా కుటుంబం గడుస్తోంది నేను రోజుకు రూ.600 వరకు సంపాదిస్తున్నా. పర్యాటకులు బాగానే కొంటున్నారు. రోజుకు 15 బొమ్మలు అమ్ముతున్నాను. వీటి తయారీ, విక్రయం ద్వారానే మా కుటుంబం గడుస్తోంది. – కెచ్చెల అనురాధ, పేరంటపల్లి -
పిల్లల భవిష్యత్తు కోసం...
తల్లిదండ్రులకు పిల్లలంటే పంచ ప్రాణాలు. వారి కోసం ఏ త్యాగానికి అయినా సిద్ధంగా ఉంటారు. చెప్పలేనంత ప్రేమ కురిపిస్తారు. ఇవన్నీ సహజమే. వారి మెరుగైన భవిష్యత్తుకు మీరు ఏమి చేయగలరు? ఇది అత్యంత కీలకమైన విషయం. ‘పిల్లలకు ఇచ్చే గొప్ప ఆస్తి విద్య’ అని వివేకానందుడు ఎప్పుడో చెప్పాడు. కనుక పిల్లలపై ప్రేమతో మీరు ఏం చేసినా అది నాణేనికి ఒక కోణమే. వారికి నాణ్యమైన విద్య అందించడం రెండో కోణం అవుతుంది. దీనికి ముందు చూపు కావాలి. పక్కా ఆచరణతో నడవాలి. మెరుగైన ప్రణాళిక కావాలి. దీనికి క్రమశిక్షణ తోడవ్వాలి. అప్పుడే కల నెరవేరుతుంది. భవిష్యత్తుకు సంబంధించి ఏ లక్ష్యాలు సాధించాలని అనుకుంటున్నారు? వాటికి ఎంత వ్యవధి ఉంది? వీటిపై ముందు స్పష్టత తెచ్చుకోవాలి. పిల్లలకు సంబంధించి భవిష్యత్తు లక్ష్యాల్లో ముందుగా వచ్చేది విద్యా అవసరాలే. తర్వాత వివాహం. సాధారణ ద్రవ్యోల్బణం కంటే విద్యా ద్రవ్యోల్బణం మరింత ఎక్కువగా ఉంటోంది. ఫీజులు ఏటా 10–15% చొప్పున పెరుగుతున్నాయి. కనుక ద్రవ్యోల్బణాన్ని పరిగణనలోకి తీసుకుని భవిష్యత్తులో విద్యకు అయ్యే వ్యయంపై అంచనాలకు రావాలి. ఉన్నత విద్యా ఖర్చుల కోసం ముందు నుంచి సన్నద్ధం కావాలి. వివాహ ఖర్చు అన్నది మీ చేతుల్లో ఉండేది. పరిస్థితులకు అనుగుణంగా కొంత తగ్గించుకోగలరు. ముందు విద్యకు ప్రాధా న్యం ఇచ్చి, ఆ తర్వాత వివాహ లక్ష్యంపై దృష్టి పెట్టాలి. విద్యా ఖర్చుకు సంబంధించిన అంచనాల్లో ఎక్కువ మంది బోల్తా పడుతుంటారు. ఆ సమయం వచ్చే సరికి కావాల్సినంత సమకూరదు. కనుక పెరిగే ఖర్చులకు తగ్గట్టు పొదుపు ప్రణాళికలు ఉండాలి. అధిక నాణ్యమైన విద్యను అందించే సంస్థలు, అత్యుత్తమ బోధనా సిబ్బంది, వసతులు, విదేశీ విద్యా సంస్థలతో భాగస్వామ్యాలు కలిగినవి సహజంగానే విద్యార్థులను ఆకర్షిస్తుంటాయి. ఇతర విద్యా సంస్థలతో పోలిస్తే ఈ తరహా విద్యా సంస్థల ఫీజులు అధికంగా ఉంటుంటాయి. డిమాండ్ ఎక్కువగా ఉండడంతో ఇవి గరిష్ట ఫీజులను వసూలు చేస్తుంటాయి. చదువుతోపాటు ఇతర కళలు విద్యతోపాటే సమాంతరంగా పిల్లలకు నేర్పించే ఇతర నైపుణ్యాలు కూడా ఉంటాయని మర్చిపోవద్దు. క్రీడలు, సంగీతం, కళలు తదితర వాటిల్లో ఏదైనా ఒక విభాగంలో మీ చిన్నారిని చాంపియన్‌గా తీర్చిదిద్దాలనుకోవచ్చు. కనుక ఈ తరహా నైపుణ్యాల కోసం చేసే ఖర్చు అదనంగా ఉంటుంది. దీనికితోడు విడిగా ట్యూషన్ చెప్పించాల్సి రావచ్చు. ఆ ఖర్చును కూడా తల్లిదండ్రులు పరిగణనలోకి తీసుకోవాలి. వ్యయ అంచనాలు శిశువుగా ఉన్నప్పుడే పిల్లలకు సంబంధించి ప్రణాళిక మొదలు పెడితే.. పెట్టుబడులకు ఎంతలేదన్నా 15–20 ఏళ్ల కాలవ్యవధి మిగిలి ఉంటుంది. ఈ కాలంలో ద్రవ్యోల్బణం సగటున ఎంత ఉంటుందన్న అంచనాకు రావాలి. ఒకవేళ ఉన్నత విద్య కోసం పిల్లలను విదేశీ విద్యా సంస్థలకు పంపించాలనుకుంటే అప్పుడు ద్రవ్యోల్బణంతోపాటు.. రూపాయి మారకం విలువను కూడా పరిగణనలోకి తీసుకోవాలి. సగటు విద్యా ద్రవ్యోల్బణం 8–10 శాతం మధ్య ఉంటోంది. ఐదేళ్ల క్రితం ఇది 6 శాతం స్థాయిలోనే ఉంది. కనుక భవిష్యత్తులోనూ 8–10 శాతం వద్దే ఉంటుందని అనుకోవడానికి లేదు. ఇంకాస్త అదనపు అంచనా వేసుకున్నా నష్టం ఉండదు. భవిష్యత్తులో ఏ కోర్సు చేయాలన్నది పిల్లల అభిమతంపైనే ఆధారపడి ఉంటుంది. అది ముందుగా తెలుసుకోలేరు. కనుక తల్లిదండ్రులు తమ ఇష్టానుసారం ఒక కోర్సును అనుకుని దానికి సంబంధించి ప్రణాళిక రూపొందించుకోవచ్చు. ఈ అంచనాకు 10 శాతం అదనంగా సమకూర్చుకునే ప్రణాళికతో ముందుకు సాగిపోవాలి. విదేశీ విద్య అయితే.. గతంతో పోలిస్తే విదేశాల్లో గ్రాడ్యుయేషన్, ప్రోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసే వారి సంఖ్య పెరిగింది. విదేశీ విద్యతో విదేశాల్లోనే మెరుగైన అవకాశాలు సొంతం చేసుకుని అక్కడే స్థిరపడాలన్న ధోరణి కూడా పెరుగుతోంది. తల్లిదండ్రులుగా మీ పిల్లలను విదేశాలకు పంపించాలనుకుంటే.. లేదా పిల్లలు భవిష్యత్తులో విదేశీ ఆప్షన్ కోరుకునే అవకాశం ఉందనుకుంటే.. అందుకోసం పెద్ద నిధి అవసరం పడుతుంది. ఐఐఎంలో చేసే కోర్సు వ్యయంతో పోలిస్తే హార్వర్డ్ లాంటి ప్రతిష్టాత్మక విద్యా సంస్థల్లో కోర్సు వ్యయం నాలుగైదు రెట్లు అధికంగా ఉంటోంది. అంతర్జాతీయ ప్రమాణాలతో కోర్సులను అందించే దేశీయ ప్రైవేటు విద్యా సంస్థల్లోనూ కోర్సుల వ్యయాలు అధికంగానే ఉన్నాయి. విదేశీ విద్య అయితే అక్కడ నివాస వ్యయాలు కూడా కలుస్తాయి. ఇవి ఎక్కువగా ఉంటాయి. దేశీయంగా అయితే నివాస వ్యయాలు తక్కువగా ఉంటాయి. పేరున్న విద్యా సంస్థల్లో అధిక ఫీజులు ప్రైవేటు విద్యా సంస్థల్లో కోర్సులకు అధిక ఫీజులు చెల్లించాలి. ప్రభుత్వ విద్యా సంస్థల్లో చౌకగా పూర్తవుతుందనే అభిప్రాయం ఉంటే దాన్ని తీసివేయండి. ప్రభుత్వంలోనూ ప్రతిష్టాత్మకమైన విద్యా సంస్థలు చాలానే ఉన్నాయి. వీటిల్లో కోర్సుల వ్యయాలు ప్రైవేటుకు ఏ మాత్రం తీసిపోవు. ఐఐటీలు, నిట్లు, ఏఐఐఎంఎస్, ఐఐఎస్సీ, ఐఐఎంల్లో ప్రవేశాలకు ఏటా డిమాండ్ పెరుగుతూనే ఉంది. ఇక్కడ సరఫరా తక్కువ డిమాండ్ ఎక్కువ. కాకపోతే వీటిల్లో కోర్సులకు ‘హయ్యర్ ఎడ్యుకేషన్ ఫైనాన్సింగ్ ఏజెన్సీ’ నుంచి రుణాలు పొందే అవకాశం ఉంటుంది. వీటిల్లో చాలా ఇనిస్టిట్యూషన్స్ సొంతంగానే వనరులను సమకూర్చుకోవాల్సి ఉంటుంది. కనుకనే ఎప్పటికప్పుడు ఇవి ఫీజులను సవరిస్తున్నాయి. ప్రాథమిక విద్య నిర్లక్ష్యం వద్దు.. పిల్లల భవిష్యత్తు విద్యా అవసరాలకు ప్రణాళిక వేసుకునే సమయంలో పాఠశాల విద్యను తక్కువ అంచనా వేసుకోవద్దు. కొన్ని ప్రతిష్టాత్మక విద్యా సంస్థలు ఉన్నత విద్యా కోర్సుల స్థాయిలో ఫీజులు వసూలు చేస్తున్నాయి. పిల్లల విద్య ఖర్చు భరించలేక అప్పులు చేసే వారు చాలా మంది ఉన్నారు. ముందు చూపు లేకపోవడం వల్ల వచ్చే సమస్యే ఇది. ముందు నుంచే కావాల్సినంత మేర పొదుపు, మదుపు చేస్తూ వస్తే రుణాల అవసరం ఏర్పడదు. ఒకవేళ కొంచెం అంచనాలు తప్పినా పెద్ద ఇబ్బంది ఏర్పడదు. విద్యా రుణాలను ఉన్నత విద్య సమయంలో తీసుకోవడం తప్పు కాదు. అది పూర్తగా వారికొచ్చే వేతనం నుంచి చెల్లింపులు చేసే వెసులుబాటు ఉంటుంది. కానీ, పాఠశాల విద్యకు సొంత వనరులే మార్గం కావాలి. మొదటి నుంచే రుణ బాట పడితే.. 15 ఏళ్ల తర్వాత భారీ వ్యయాలు అయ్యే కోర్సుల్లో చేరటం కష్టమవుతుంది. పెట్టుబడుల పోర్ట్‌ఫోలియో పిల్లల విద్యకు సంబంధించి పెట్టుబడుల విషయంలో భావోద్వేగాలకు చోటు ఇవ్వొద్దు. తమ అవసరాలకు సరిపడే ఉత్పత్తులను ఎక్కువ మంది ఎంపిక చేసుకోకపోవడాన్ని గమనించొచ్చు. పిల్లల కోసం పెట్టుబడి, తమకు ఏదైనా జరగరానికి జరిగితే బీమా రక్షణ కలగలసిన ఉత్పత్తులను ఎంపిక చేసుకుంటుంటారు. కానీ, బీమా, ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ ఈ రెండూ విడిగా లభించే సాధనాలు. అటువంటప్పుడు రెండింటినీ కలపాల్సిన అవసరం ఏముంటుంది? అందుకుని ముందుగా టర్మ్ ఇన్సూరెన్స్‌ను తగినంత కవరేజీతో తీసుకోవాలి. ఏదైనా ఊహించనిది జరిగితే ఎంతో ప్రేమించే తమ కుటుంబం ఇబ్బందుల్లో పడకుండా టర్మ్ ప్లాన్ ఆదుకుంటుంది. కుటుంబ వ్యయాలు, పిల్లల విద్యా వ్యయాలు, ఇతర అవసరాలను కలిపి టర్మ్ కవరేజీ ఎంతన్నది నిర్ణయించుకోవాలి. ఆరోగ్య అవసరాలు, రుణ అవసరాలు ఉంటే వాటిని కూడా పరిగణనలోకి తీసుకోవాలి. ముందే ఆరంభిస్తే కాంపౌండింగ్ కలిసొస్తుంది. రిస్క్ తీసుకుని ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేసే వెసులుబాటు లభిస్తుంది. ఎక్కువ పెట్టుబడులను ఈక్విటీకే కేటాయించుకోవచ్చు. తద్వారా అధిక రాబడులు అవకాశం ఉంటుంది. ఈక్విటీల్లో స్వల్ప కాలంలోనే (3–5ఏళ్లు) రిస్క్. దీర్ఘకాలంలో కళ్లు చెదిరే రాబడులు ఉంటాయి. అదే ఆలస్యంగా మొదలు పెడితే రిస్క్‌కు అవకాశం ఉండదు. కనుక డెట్ సాధనాల్లో ఇన్వెస్ట్ చేయాలి. వీటిల్లో రాబడి 8 శాతం మించదు. ద్రవ్యోల్బణం కూడా ఇదే స్థాయిలో ఉంటుంది కనుక నికరంగా వచ్చే రాబడి ఏమీ ఉండదు. కనీసం ఐదేళ్లకు పైబడిన కాలానికే ఈక్విటీలను ఎంపిక చేసుకోవచ్చు. ఐదేళ్లలోపు కోసం అయితే ఈక్విటీలు సూచనీయం కాదు. సిస్టమ్యాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ ద్వారా ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్లాలన్నది నిపుణుల సూచన. బీమా, ఈక్విటీలతో కూడిన ప్లాన్లు అందుబాటులో ఉన్నాయి. కానీ, వీటిల్లో వ్యయాలు ఎక్కువ. రాబడులను సమీక్షించుకోవడం మ్యూచువల్ ఫండ్స్ పథకాలతో పోలిస్తే కొంచెం క్లిష్టం. కనుక మెరుగైన ఈక్విటీ ఫండ్స్‌ను ఎంపిక చేసుకోవడమే మంచి మార్గం అవుతుంది. ఒకవేళ పిల్లల విదేశీ విద్య కోసం అయితే.. విదేశీ ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేసే మ్యూచువల్ ఫండ్స్‌ను ఎంపిక చేసుకోవచ్చు. తద్వారా కరెన్సీ మారకం విలువ మార్పులకు హెడ్జ్ చేసుకున్నట్టు అవుతుంది. డెట్ సాధనాల్లో అయితే సుకన్య సమృద్ధి యోజన (కుమార్తెల కోసం), పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (పీపీఎఫ్), లాంగ్ డ్యురేషన్ ఫండ్స్‌ను పరిగణనలోకి తీసుకోవచ్చు. పొదుపు... చిన్న అడుగులు పొదుపు ముందే ప్రారంభిస్తే లక్ష్యం సులభం అవుతుంది. ఆలస్యం చేసిన కొద్దీ అది భారంగా మారుతుంది. 5 ఏళ్లు ఆలస్యం చేసినా, చేయాల్సిన పొదుపు రెట్టింపు అయిపోతుంది. అందుకనే చిన్నారి జన్మించిన వెంటనే పొదుపు, పెట్టుబడి ఆరంభించాలి. ఆలస్యం చేసినా మొదటి పుట్టిన రోజు నుంచి అయినా ఈ ప్రణాళికను అమలు చేయాలి. అప్పుడే అనుకున్నంత సమకూర్చుకోగలరు. ఉన్నత విద్య కోసం సాధారణంగా 18 ఏళ్లు ఉంటుంది. ప్రాథమికోన్నత పాఠశాల విద్య కోసం 10 ఏళ్ల వ్యవధి ఉంటుంది. అందుకని ఉన్నతవిద్య, ప్రాథమిక విద్యకు వేర్వేరుగా ఇన్వెస్ట్ చేసుకోవడం మంచిది. విద్యా రుణం ఇది చివరి ఎంపికగానే ఉండాలి. విద్యా రుణం చాలా సులభంగా లభిస్తుంది. ఫీజులకు చాలకపోతే రుణం తీసుకోవచ్చులేనన్న భరోసాతో పెట్టుబడులను నిర్లక్ష్యం చేయవద్దు. నిజాయితీ పెట్టుబడులు చేస్తూ, చివర్లో కావాల్సిన మొత్తానికి తగ్గితే (రాబడుల అంచనాలు మారి) లేదా అంచనాలకు మించి కోర్సుల వ్యయాలు పెరిగిపోతే అప్పుడు ఎలానూ అదనంగా సమకూర్చుకోవాలి. అటువంటి పరిస్థితుల్లో విద్యారుణం బాట పట్టొచ్చు. లేదా ఉద్యోగం లేదా ఉపాధి పరంగా సమస్యలతో ఆర్థిక ఇబ్బందులు ఎదురుకావచ్చు. అటువంటి పరిస్థితుల్లో విద్యా రుణాన్ని ఆశ్రయించొచ్చు. అది కూడా ఉద్యోగం పొందిన తర్వాత పిల్లలు చెల్లించే సౌలభ్యం పరిధిలోనే ఉండేలా చూసుకోవడం మర్చిపోవద్దు. -
ప్రేమించడానికి రోజుకో కారణం!
‘‘నిన్ను (శంతను హజారిక) ప్రేమించడానికి, గౌరవించడానికి నాకు రోజూ ఓ కొత్త కారణం దొరుకుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది’’ అని హీరోయిన్ శ్రుతీహాసన్ అన్నారు. శ్రుతి బాయ్‌ఫ్రెండ్ శంతను చిత్రకారుడు అనే సంగతి తెలిసిందే. తాజాగా శంతను కొన్ని ఆర్ట్స్‌ను డిజైన్ చేశారు. ఈ డిజైన్స్‌ను చూసి తెగ మురిసిపోతూ, శంతను గురించి సోషల్ మీడియాలో ఓ పోస్ట్ షేర్ చేశారు శ్రుతీహాసన్. ‘‘నిన్ను చూస్తుంటే చాలా గర్వంగా ఉంది. ఈ అద్భుత (ఆర్ట్ ఎగ్జిబిషన్) సాయంకాల సమయాల్లో నన్ను భాగస్వామిని చేసినందుకు నా మనసు ఆనందంతో పులకరించిపోతోంది’’ అన్నారు శ్రుతి. ఈ ఎగ్జిబిషన్లో శ్రుతీ తన మ్యూజికల్ టీమ్‌తో కలసి పాడారు. -
సైన్స్‌లో సోనాలి కామర్స్‌లో సుగంధ ఆర్ట్స్‌లో భారతి
ఇంటర్ పరీక్షల నిర్వహణలో బిహార్ బోర్డు ఈసారి అన్ని రాష్ట్రాల కన్నా ముందుంటే, బిహార్ పరీక్షా ఫలితాల్లో అమ్మాయిలు ముందున్నారు. అమ్మాయిలు ముందుండటం అన్నీ రాష్ట్రాల్లోనూ యేటా అదొక సంప్రదాయంగా వస్తున్నప్పటికీ, కరోనా పరిస్థితుల్లో మనోబలాన్ని సడలనివ్వకుండా చక్కగా చదివి.. ఆర్ట్స్, కామర్స్, సైన్స్.. ఈ మూడు స్ట్రీమ్‌లలోనూ అమ్మాయిలే టాపర్లుగా నిలవడం విశేషం. సైన్స్‌లో సొనాలి కుమారి 94.2 శాతం మార్కులతో స్టేట్ ఫస్ట్ వచ్చింది. సైన్సే కష్టం అనుకుంటే, ఆమె కుటుంబ పరిస్థితులు ఇంకా కష్టమైనవి. రెండు కష్టాల మధ్య విజేతగా చదువును లాక్కొచ్చొని సొనాలి తండ్రి రిక్షా పుల్లర్! సోనాలికి స్వీట్ తినిపిస్తున్న కుటుంబ సభ్యులు. చిత్రంలో జీత్ సార్, సోనాలి తల్లిదండ్రులు (కుడి చివర) మార్చి 26 శుక్రవారం బిహార్ ఇంటర్మీడియట్ బోర్డు ఫలితాలు వెల్లడయ్యాయి. మూడు విభాగాల్లో టాపర్‌గా విజయ కేతనాన్ని ఎగరేసిన వారు ముగ్గురూ అమ్మాయిలే! బిహార్‌లోని ఖగరియాకు చెందిన మధు భారతి 92.6 శాతం మార్కులతో ఆర్ట్స్‌లో, ఔరంగాబాద్‌కు చెందిన సుగంధ కుమారి 94.2 శాతం మార్కులతో కామర్స్‌లో స్టేట్ టాపర్లుగా నిలిచారు. సైన్స్‌లో టాప్ ర్యాంక్ కొట్టిన సోనాలి 500 కు 471 మార్కులు సాధించి తండ్రి కష్టానికి తగ్గ ఫలితాన్ని సాధించింది. సోనాలి నలందలోని శ్రీమతి పరమేశ్వరీ దేవి ఉఛ్తార్ మాధ్యమిక పాఠశాల విద్యార్థిని. బిహార్ ఇంటర్ పరీక్షలు ఫిబ్రవరి 1 నుంచి 13 వరకు జరిగాయి. మొత్తం 13.4 లక్షల మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. వాళ్లల్లో 10.45 లక్షల మంది ఉత్తీర్ణులయ్యారు. ఉత్తీర్ణశాతం 78.04. ఆ శాతం కంటే కూడా ఈ ముగ్గురు అమ్మాయిలు వ్యక్తిగతంగా సాధించిన శాతమే ఎక్కువ. ముగ్గురూ 90 అంకెను దాటేశారు. సోనాలి చదివిన పాఠశాలకు సమీపంలో బిహార్ షరిఫ్ అనే ప్రాంతంలో ఒక బస్టాండ్ ఉంది. ఆ బస్టాండ్‌లోనే తోపుడు బండిపై తినుబండారాలను అమ్ముతారు సోనాలి తండ్రి చున్నులాల్. ఆ సంపాదనే వారి కుటుంబానికి జీవనాధారం. ఓపిక ఉన్నప్పుడు ఆయన రిక్షాబండి లాగుతారు. గత ఏడాది లాక్డౌన్ అన్ని బతుకు బండ్ల ఇరుసులను లాగేసినట్లే సోనాలి తండ్రి జీవికనూ కనాకష్టం చేసేసింది. మరో వైపు సోనాలి పంతం పట్టినట్టుగా చదివింది. లాక్డౌన్ సమయం మొత్తాన్ని చదువుకే అంకితం చేసింది. ‘‘నాన్న కష్టపడేవారు. జీత్ సర్ కష్టపడి నన్ను చదివించేవారు. అమ్మ కష్టపడి నాకు అన్నీ అమర్చేది. జీత్ సార్ టెన్త్‌లో కూడా దగ్గరుండి మరీ నా డౌట్లు తీర్చేవారు. లాక్డౌన్లో సార్ మా ఇంటికే వచ్చి నాకు సబ్జెక్ట్‌లు టీచ్ చేసేవారు. ఆన్ లైన్ స్టడీస్ కోసం అప్పుడప్పుడు తన సెల్‌ఫోన్‌ను నాకు ఇచ్చేవారు. అమ్మ ఎప్పుడూ నా ఆకలిని కనిపెట్టుకుని ఉండేది. ఇంతమంది పడిన కష్టం మందు నేను ర్యాంకు సాధించడం పెద్ద విషయం కాదు అనిపిస్తుంది నాకు’’ అంటోంది సోనాలి! జీత్సార్కి, అమ్మకు నాన్నకు థ్యాంక్స్ చెబుతోంది. సోనాలి ఐ.ఎ.ఎస్. ఆఫీసర్ అవాలని కలగంటోంది. ‘‘భవిష్యత్తులో యు.పి.ఎస్.సి. పరీక్షకు ప్రిపేర్ అవుతాను. నాకెప్పుడూ సమాజానికి, పేదవాళ్లకు సాయం చేయాలని ఉంటుంది. నాలా ఆర్థికంగా బలహీన వర్గాలకు చెందిన విద్యార్థుల కోసం కూడా ఐ.ఎ.ఎస్. అధికారిగా నేను తప్పకుండా ఏదైనా చేసి తీరుతాను. ప్రతి విద్యార్థిలో ప్రతిభ ఉంటుంది. ఆ ప్రతిభ వెలుగులోకి రాకుండా పేదరికం అడ్డుపడుతుంటుంది. కడుపులో పేగుల్ని ఆకలి మెలిపెడుతుంటే పుస్తకం ముందేసుకుని చదవగలడం కూడా ఆ పూటకు సాధించిన ర్యాంకే నా దృష్టిలో..’’ అంటోంది సోనాలి. -
సంప్రదాయ కళలకు జీవం పోస్తున్న కళాకారులు
సాక్షి, మంచిర్యాల : తెలంగాణ పల్లెలు ఓనాడు కళలకు నిలయాలు. ఆనాటి పాటలు, ఆటలు, బాలనాగమ్మ, భక్తసిరియాల, హరిచంద్ర, అల్లిరాణి నాటకాలు ప్రజలను ఎంతగానో ఆకర్షించేవి. ఆ కళాప్రదర్శనలు చూసేందుకు ఊరంతా ఒకచోటుకే చేరేవారు. పల్లెల్లో వాటికి ఆదరణ ఉండడంతో భాగవతాలు, యక్షగాణాలు, చిరుతల రామయాణాలు వంటి నాటికలు, భాగవత ప్రదర్శనలు జోరుగా ఉండేవి. ఎప్పుడైతే సినిమాలు, టీవీలు అందుబాటులోకి వచ్చాయో ఆనాటి పల్లెకళలు, నాటకాలు, భాగవతాలు పూర్తిగా కనుమరుగయ్యాయి. నాటి కళలను ఈనాటి వారికి పుస్తకాల ద్వారానో, టీవీల ద్వారా చూపించే ఈ రోజుల్లో పల్లెకళలు ఇంకా బతికే ఉన్నాయిని చెబుతున్నారు దండేపల్లి మండలానికి చెందిన పలువురు కళాకారులు. మండలంలోని పలు గ్రామాల నుంచి.. దండేపల్లి మండలంలోని రెబ్బనపల్లి, వెల్గనూర్, కొర్విచెల్మ, కొండాపూర్, కాసిపేట, నంబాల, నర్సాపూర్ గ్రామాల్లో చాలా మంది కళాకారులు ఉన్నారు. వీరంతా భజన బృందాలుగా ఏర్పడి, ఇప్పటికీ పలు పండుగలు, పబ్బాలు, శ్రావణం, కార్తీక మాసాల్లో, మహశివరాత్రి, శ్రీరామనవమి, కృష్ణాష్టమి పండుగల రోజుల్లో ప్రత్యేక భజన కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. వీటితో పాటు గ్రామాల్లో పూజలు జరుపుకునే వారి ఇళ్లలో కూడా రాత్రి వరకు భజనలు చేస్తుంటారు. అంతేకాకుండా కృష్ణాష్టమి, దీపావళీ, శ్రీరామనవమి, శివరాత్రి పండుగలతో పాటు ఇతర పండుగల్లో సందర్భాన్ని బట్టి నాటికలు, భాగవతాలు, యక్షగాణాలు, చిరుతల రామాయణం వంటి కళాప్రదర్శనలు నేటికీ ప్రదర్శిస్తున్నారు. ఇలాంటి కార్యక్రమాలు దండేపల్లి మండలంలోని పలు గ్రామాల్లో అప్పుడప్పుడు నిర్వహిస్తుంటారు. వీటిని వీక్షించేందుకు ఒక గ్రామం నుంచి ఇంకో గ్రామానికి వెళ్లి ఆనాటి కళప్రదర్శనలు ప్రజలు ఆసక్తిగా తిలకిస్తూ మురిసి పోతున్నారు. పుణ్య క్షేత్రాల్లో భజనలకు.. గ్రామాల్లో గల భజన బృందాలు సాకాకుండా, తిరుమల, తిరుపతి, దేవస్థానాలు, భద్రాచలం, బాసర, కొండగట్టు, గూడెం, ఆలయల్లో నిర్వహించే భజన కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. అంతేకాకుండా రవీంద్రభారతిలో నిర్వహించే సంస్కృతిక కార్యక్రమాల్లో కూడా పాల్గొంటూ తమ కళా ప్రదర్శనలు ప్రదర్శిస్తుంటారు. అప్పుడప్పుడు ప్రదర్శిస్తున్నం నేను నేర్చుకున్న నాటికలు, బాగవతాలను ఇప్పటికీ మా గ్రామంలో పలు పండుగ సమయాల్లో ప్రదర్శిస్తుంటాం. దీంతో ఇప్పటి వారికి ఆనాటి కళలను గుర్తు చేసిన వాళ్లం కావడంతో పాటు, పల్లె కళలు ఇంకా బతికే ఉన్నాయని తెలియజేస్తున్నం. మా గ్రామంలో చాలా మంది కళాకారులు ఉన్నారు. కళాకారులకు ప్రభుత్వం గుర్తింపు ఇవ్వాలి. – ముత్యం శంకరయ్య, రెబ్బనపల్లి -
సరయు : డాన్స్, ఫైట్స్, ఆర్ట్స్
ఆ బాలిక కుంచె పట్టుకుంటే ‘చిత్రమై’న అనుభూతినిచ్చే సూర్యోదయం ఆవిష్కృతమవుతుంది. గజ్జె కట్టుకుంటే సంప్రదాయం ఘల్లు మంటుంది. యాహూ అని కేక పెట్టిందంటే ఈవ్ టీజర్లకు వణుకుపుడుతుంది. జన్మతః అమెరికా వాసి అయినా సనాతన భారతీయ కళలపై తరగని ఇష్టంతో పాటు నవతరం అభిరుచులకు తగ్గట్టుగా చిత్రకళ, మార్షల్ ఆర్ట్స్... ఇలా సకల కళల్లోనూ రాణిస్తోంది సరయు. అంతేకాదు... ఎంతగా కళలపై ఆసక్తి పెంచుకుంటే అంతగా ఇటు చదువులోనూ మంచి ఫలితాలు వస్తాయంటోంది. ‘‘ఆధ్యాత్మిక భావాలు, చారిత్రక మూలాలు తెలిపే నాట్యం ఓ వైపు మనసుకు ఆహ్లాదాన్ని ఇచ్చింది. మరోవైపు చదువులోనూ రాణించేందుకు ఉపకరించింది’’అని చెప్పింది సరయు (15). సాఫ్ట్వేర్ ఉద్యోగులైన తల్లిదండ్రులు విజయ్, గీతల ఇద్దరు సంతానంలో ఒకరైన సరయు... అమెరికాలో ఉంటున్న భారతీయ చిన్నారుల సంప్రదాయ అభిరుచులకు నిదర్శనం కరాటే కిక్ కొట్టినా.. కాళ్లకు గజ్జకట్టినా... ‘‘ఎంత నాట్యం నేర్చుకోవాలనుకున్నా కాలిఫోర్నియాలో శిక్షకుకులు దొరకడం కష్టంగా మారింది. అయినా పట్టు వదలకుండా ఉన్న నన్ను చూసి అమ్మా నాన్నలు ఎలాగోలా నాట్య గురువును పట్టుకున్నారు’’ అంటూ చెప్పింది సరయు. పద్యాలకు అర్ధమే తెలియని ఐదేళ్ల వయసులో ప్రారంభమైన ఆమె నాట్యాభ్యాసం అప్రతిహతంగా కొనసాగుతూనే ఉంది. ఎన్నో బృంద ప్రదర్శనల్లో పాల్గొన్న ఆమె... ఈనెల 20న బెంగుళూర్లో సోలో ప్రదర్శన ద్వారా ఆరంగేట్రం చేయాలనుకుంటోంది. మరోవైపు కరాటేలో కూడా సరయు ప్రతిభ చాటుతోంది. సెకండ్ డిగ్రీ బ్లాక్ బెల్ట్‌ను స్వంతం చేసుకుంది. నాట్యం సెల్ఫ్ ఎక్స్ప్రెషన్కైతే.. మార్షల్ ఆర్ట్స్ సెల్ఫ్ డిఫెన్స్‌కి అంటుందీ బాలిక. తెలుగు, ఇంగ్లీషు భాషలతో పాటు స్పానిష్ భాష కూడా ప్రావీణ్యం సంపాదించింది. చిత్రకళలోనూ రాణిస్తూ అనేక బహుమతులు అందుకుంటోంది. తాను గీసిన చిత్రాలను విక్రయించడం ద్వారా వచ్చిన ఆదాయాన్ని సేవా కార్యక్రమాలకు విరాళంగా ఇవ్వడం విశేషం. బ్యాడ్మింటన్, స్విమ్మింగ్, టెన్నిస్ క్రీడల్లోనూ ప్రవేశమున్న సరయు... ఇదంతా కూడా చదువే అంటుంది. డెర్మటాలజిస్ట్ కావాలని..! ఒత్తిడితో కూడిన సంక్లిష్టమైన ఇంటర్నేషనల్ బ్యాక్కల్యూరేట్ (ఐబి) కరిక్యులమ్కీ, తన సకల కళాభ్యాసానికి మధ్య ఆమె విజయవంతంగా బ్యాలెన్స్ చేసుకుంది. గత మే నెలలో ఓక్రిడ్జ్ ఇంటర్నేషనల్ స్కూల్ నుంచి తన గ్రేడ్ టెన్ ఐబి పూర్తి చేసుకుంది. డెర్మటాలజిస్ట్ కావాలనేది ఆమె లక్ష్యం. తనను తాను మాత్రమే కాకుండా తన సంస్కృతీ సంప్రదాయాలను కూడా ఇతరులకు తెలియజెప్పడంలో నాట్యం ఒక ప్రధాన మార్గం అంటుంది. – ఎస్.సత్యబాబు -
మూడు కళల్లో రాణిస్తూ..
ఇందూరు(నిజామాబాద్ అర్బన్): ప్రతీ మనిషికో కళ ఉంటుంది. ఆ కళనే నమ్ముకుని రాణిస్తున్న వారు చాలా మంది ఉంటారు. కానీ ఒకే మనిషికి రెండు, మూడు కళలుండి మూడు రంగాల్లో రాణిస్తున్న వారు మాత్రం కొంతమందే ఉంటారు. పైగా మహిళలు ఉండడం చాలా అరుదు. అయితే నిజామాబాద్ జిల్లా కేంద్రం ఆర్యనగర్‌కు చెందిన పారిపల్లి గౌరిశ్రీ అందులో ఒకరని చెప్పవచ్చు. 2014 నుంచి కళా రంగాల్లో రాణిస్తూ అందరినీ ఆకట్టుకుంటున్నారు. లఘు చిత్రాల్లో నటిగానే కాకుండా రచయిత్రిగా పనిచేస్తూ ఉనికిని చాటుతున్నారు. ఇప్పటి వరకు కారుణ్య హత్య, మార్పు, ప్రథమ పౌరుడు, ఏది పవిత్ర యుద్ధం, దటీజ్ రావుగారు, మేఘా నాయకుడు, మరణం లేని మనిషి, మరణానికి దారేది, హృదయం, అనాథ శవాల ఆపద్భాందవుడు లాంటి లఘు చిత్రాలకు పనిచేశారు. వీటిలో కారుణ్య హత్య లఘు చిత్రంలో న్యూస్ రీడర్‌గా ఇమిడిపోయి, మార్పు లఘుచిత్రంలో న్యాయవాదిగా జీవించి, హృదయం లఘు చిత్రానికి గాత్రం(వాయిస్) అందించి మంచి పేరు సంపాదించారు. కాగా మూడింటికి రచయితగా, ఆరింటికి సహాయ రచయితగా పనిచేశారు. గౌరిశ్రీ నటించిన, రచించిన లఘు చిత్రాలు యూట్యూబ్‌లో ఎంతో మంది నుంచి ప్రశంసలు పొందాయి. బుల్లితెర నటులు సైతం చిత్రాలను వీక్షించి అభినందించారు. అయితే పీజీ పూర్తి చేసిన గౌరిశ్రీ మహిళల చైతన్యం కోసం కూడా పాటుపడుతున్నారు. లఘు చిత్రాల్లో మహిళలకు ఉపయోగపడే, చైతన్యం కలిగించే విధంగా నటనతో పాటు రచనలు చేశారు. సేవారంగంలో కూడా.. గౌరిశ్రీ లఘు చిత్రాలకు నటిగా, రచయిత్రిగానే కాకుండా సమాజానికి సేవకురాలిగా కూడా పరిచయం అయ్యారు. సేవా రంగంలో సైతం తనవంతుగా పాత్ర పోషిస్తూ న్యాయం చేస్తున్నారు. నేనుసైతం స్వచ్ఛంద సంస్థ మహిళా విభాగం ఇన్చార్జిగా ఉంటూ బాలోవ్సవ్ కార్యక్రమాన్ని ప్రతి ఏడాది నిర్వహించి నిరుపేద బాలికలకు నోటు పుస్తకాలు, ఇతర సహాయ సహకారాలు అందించడంతో పాటు వారిలో నైపుణ్యాన్ని బయటకు తీస్తున్నారు. అలాగే ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలిగా ఉంటూ... మహిళలను, విద్యార్థినులను చైతన్య పరుస్తున్నారు. భర్తనే ఆదర్శంగా తీసుకున్నా.. నటన, రచన, సేవా రంగాల్లోకి రావడానికి ప్రధాన కారణం నా భర్త రవిశ్రీనే. ఎందుకంటే తాను సమాజానికి ఉపయోగపడే, సందేశాన్ని ఇచ్చే విధంగా లఘు చిత్రాలు ఎంతో తాపత్రయపడి తీస్తున్నారు. ఇందులో నేను కూడా భాగస్వామిని కావాలనే ఉద్దేశంతో లఘు చిత్రాల్లో నటనతో పాటు చిత్రాలకు రచనలు చేయడం ప్రారంభించాను. అలాగే పేద విద్యార్థినులకు సేవ చేయడం, వారిని చైతన్య చర్చడం నాకు ఎంతగానో సంతృప్తిని ఇస్తోంది. మున్ముందు మరిన్ని సేవా కార్యక్రమాతో పాటుగా మంచి సందేశాత్మక లఘు చిత్రాల్లో నటించడమే కాకుండా రచనలు చేయాలని ఉంది. – గౌరిశ్రీ, ఆర్యనగర్, నిజామాబాద్