ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపాల్‌గా డేవిడ్‌కుమార్
ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపాల్‌గా డేవిడ్‌కుమార్
Published Wed, Aug 24 2016 10:26 PM | Last Updated on Thu, Mar 21 2019 9:05 PM
‘నాక్’ ‘ఎ’ గ్రేడ్ పొందగలమని ధీమా
వర్సిటీ హోదా దక్కుతుందన్న ఆశాభావం
కంబాలచెరువు (రాజమహేంద్రవరం) : ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపాల్‌గా డాక్టర్ ఆర్.డేవిడ్‌కుమార్ బుధవారం బాధ్యతలు చేపట్టారు. ఇప్పటివరకు ప్రిన్సిపాల్‌గా పనిచేసిన సీహెచ్ మస్తానయ్య హైదరాబాద్ ఉన్నతవిద్యాశాఖకు వెళ్లిపోయారు. బాధ్యతలు చేపట్టిన సందర్భంగా డేవిడ్‌కుమార్ మాట్లాడుతూ విద్యార్థుల ఉన్నతే లక్ష్యంగా పనిచేస్తానన్నారు. నాక్ ఏ గ్రేడ్ పొందగలన్న ధీమా వ్యక్తం చేశారు. ఇటీవల అధ్యాపకుల బదిలీలు అధికసంఖ్యలో జరిగిన నేపథ్యంలో ఖాళీగా ఉన్న స్థానాలను హెచ్‌ఆర్‌డీ ద్వారా కాంట్రాక్టు పద్ధతిలో భర్తీ చేసేందుకు చర్యలు చేపడుతున్నామన్నారు. యూనివర్సిటీ హోదాపై గత ఏడాది జరగాల్సిన సమావేశం ఇంకా జరగలేదని, అది అయిన వెంటనే వర్సిటీకి అడ్డంకులు తొలగినట్టేనని అన్నారు.
బదిలీ గురించి ముందే చెప్పిన ‘సాక్షి’
కాగా ఆర్ట్స్ కళాశాలకు డేవిడ్‌కుమార్ ప్రిన్సిపాల్‌గా రానున్నట్టు ‘సాక్షి’ ముందే చెప్పింది. ‘విశ్వహోదాపై నీలినీడలు’ పేరిట కొద్దిరోజుల క్రితం ప్రచురితమైన కథనంలో కళాశాల వర్సిటీగా మారుతున్న సమయంలో ప్రిన్సిపాల్ బదిలీ కొంత ఇబ్బందేనని, కచ్చితంగా ఐదేళ్లు ప్రిన్సిపాల్‌గా పనిచేయాల్సిన మస్తానయ్య మూడేళ్లకే ఉన్నత విద్యాశాఖకు బదిలీ అవుతున్నారని తెలిపింది. ఆ స్థానంలో హైదరాబాద్‌లో అదే శాఖలో పనిచేస్తున్న డేవిడ్‌కుమార్ రానున్నారని తెలిపింది. అయితే.. అవేమీ కాదని అప్పట్లో మస్తానయ్య కొట్టిపారేసినా ప్రిన్సిపాల్ బదిలీపై ‘సాక్షి’ చెప్పిందే జరిగింది. కళాశాలకు కొత్త ప్రిన్సిపాల్ వచ్చారన్న విషయం కూడా బుధవారం ఉదయం వరకూ ఎవరికీ తెలీదు. దీంతో అ«ధ్యాపకులు సైతం నోరెళ్లబెట్టారు. నూతన ప్రిన్సిపాల్ డేవిడ్‌ను కళాశాల వైస్ ప్రిన్సిపాల్ కె.రమేష్‌బాబు, చిక్కం సత్యనారాయణ, కె.రత్నమాణిక్యం, కామేశ్వరరావు, డాక్టర్ సునీత, అ«ధ్యాపకులు కలిసి అభినందనలు తెలియజేశారు.
Advertisement
Advertisement