నృత్య పోటీల్లో విజేతలతో అతిథులు
- ముగిసిన రాష్ట్ర స్థాయి జానపద నృత్యపోటీలు
సత్తుపల్లి : జానపద కళలను అందరు ఆదరించాలని జిల్లా విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సభ్యులు డాక్టర్ మట్టా దయానంద్ విజయ్‌కుమార్ అన్నారు. సత్తుపల్లి బస్టాండ్ ప్రాంగణంలో తెలంగాణ రాష్ట్ర జానపద కళాకారుల సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన రెండు రోజుల రాష్ట్ర స్థాయి జానపద నృత్యాలు, పాటలు, కోలాటం, తాళంభజన పోటీలు మంగళవారం రాత్రి ముగిశాయి. ఈ పోటీలలో విజేతలకు రాషే్ట్రతర తెలుగు సమాఖ్య అధ్యక్షుడు కోడూరు శ్రీనివాస్ బహుమతులు అందించారు. కార్యక్రమంలో తహశీల్దార్ దొడ్డా పుల్లయ్య, జిల్లా ప్రధాన కార్యదర్శి నంధ్యాల నాగేశ్వరరావు, దొడ్డా శ్రీనివాసరెడ్డి, ఈఓ శివరామకృష్ణ, గ్రాండ్ మౌలాలి, చిత్తలూరి ప్రసాద్, రంగపూరి వెంకటేశ్వరరావు, పి.సాయి శ్రీనివాస్, తమ్మిశెట్టి గణేష్, బత్తుల పూర్ణచంద్రరావు, చల్లారి వెంకటేశ్వరరావు, కూసంపూడి అచ్యుతవాణి, పాటిబండ్ల రామకృష్ణ, పెద్దిరాజు, గంగా, మధు పాల్గొన్నారు.
పోటీలలో విజేతలు వీరే..
తాళం భజన పోటీలలో అభయాంజనేయ భజనమండలి, సీతారామ భజన మండలి ప్రథమ, ద్వితీయ బహుమతులను అందుకున్నారు. జానపద నృత్య పోటీలలో తల్లాడ బాలవెలుగు పాఠశాల, ఖమ్మం క్రియేటీవ్ గ్రామర్ స్కూల్‌లు, జానపద పాటల పోటీలలో ఎస్.హుస్సేన్, ఎ.నందు, కోలాటం పోటీలలో మంగాపురం శ్రీలక్ష్మీతిరుపతమ్మ కోలాటబృందం, లంకపల్లి బృందావన కోలాట బృందంలు ప్రథమ, ద్వితీయ బహుమతులను సాధించారు. ఈ పోటీలకు శివనాగులు, సంస్కాృతిక శ్రీకాంత్, శరత్, బాలు న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించారు.