spl
-
ఘనంగా ‘సాక్షి’ ప్రీమియర్ లీగ్ ప్రారంభం (ఫొటోలు)
-
ఆర్ఐఎల్ చేతికి శుభలక్ష్మీ పాలి
న్యూఢిల్లీ: పాలియెస్టర్ చిప్స్, యార్న్ తయారీ కంపెనీ శుభలక్ష్మీ పాలియెస్టర్స్(ఎస్పీఎల్)ను కొనుగోలు చేసినట్లు డైవర్సిఫైడ్ దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్(ఆర్ఐఎల్) తాజాగా పేర్కొంది. ఇందుకు సొంత అనుబంధ సంస్థ రిలయన్స్ పాలియెస్టర్ లిమిటెడ్ ద్వారా తప్పనిసరి ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు తెలియజేసింది. దీనిలో భాగంగా శుభలక్ష్మీ పాలియెస్టర్స్, శుభలక్ష్మీ పాలిటెక్స్ లిమిటెడ్‌కు చెందిన పాలియెస్టర్ బిజినెస్‌లను కొనుగోలు చేయనున్నట్లు వెల్లడించింది. వీటికి రూ. 1,522 కోట్లు, రూ. 70 కోట్లు చొప్పున చెల్లించనున్నట్లు తెలియజేసింది. ఈ డీల్‌కు కాంపిటీషన్ కమిషన్(సీసీఐ)తోపాటు రెండు సంస్థల రుణదాతల నుంచి అనుమతులు లభించవలసి ఉన్నట్లు పేర్కొంది. తాజా కొనుగోలు ద్వారా టెక్స్టైల్ తయారీ బిజినెస్ మరింత పటిష్టంకానున్నట్లు తెలియజేసింది. ఎస్పీఎల్ పాలియెస్టర్ ఫైబర్, యార్స్, టెక్స్టైల్ గ్రేడ్ చిప్స్ తయారు చేస్తోంది. ఏడాదికి 2,52,000 టన్నుల పాలిమరైజేషన్ తయారీ సామర్థ్యాన్ని కలిగి ఉంది. కంపెనీ గుజరాత్‌లోని దహేజ్, దాద్రానగర్ హవేలీలోని సిల్వస్సాలో ప్లాంట్లను నిర్వహిస్తోంది. ఇదీ చదవండి: ఐటీ జాబ్ పొందడమే మీ లక్ష్యమా? రెజ్యూమ్‌లో ఈ తప్పులు చేయకండి! -
చాంపియన్స్ భవన్స్, సర్దార్ పటేల్ కాలేజీ
సాక్షి, హైదరాబాద్: సాక్షి ప్రీమియర్ లీగ్ (ఎస్పీఎల్) తెలంగాణ రీజియన్ క్రికెట్ టోర్నమెంట్ జూనియర్ విభాగంలో భవన్స్ శ్రీ అరబిందో జూనియర్ కాలేజీ (సైనిక్‌పురి), సీనియర్ విభాగంలో సర్దార్ పటేల్ (ఎస్పీ) డిగ్రీ కాలేజీ (సికింద్రాబాద్, పద్మారావునగర్) జట్లు విజేతలుగా నిలిచాయి. ‘సాక్షి’ మీడియా గ్రూప్, శ్రీ చైతన్య విద్యాసంస్థల సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ టోర్నీ గురువారం ముగిసింది. దుండిగల్‌లోని మర్రి లక్ష్మణ్ రెడ్డి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎంఎల్ఆర్ఐటీ) మైదానంలో జరిగిన జూనియర్ విభాగం ఫైనల్లో భవన్స్ శ్రీ అరబిందో జూనియర్ కాలేజీ ఎనిమిది వికెట్ల తేడాతో ఎస్ఆర్ఆర్ జూనియర్ కాలేజీ (మంచిర్యాల) జట్టుపై ఘనవిజయం సాధించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఎస్ఆర్ఆర్ కాలేజీ జట్టు 20 ఓవర్లలో 74 పరుగులకు ఆలౌటైంది. సాయి (22), ఆసిఫ్ (15), వికాస్ (15) రాణించారు. భవన్స్ జట్టు బౌలర్లలో ఇలియాన్ 9 పరుగులిచ్చి 3 వికెట్లు తీయగా... మయాంక్, రాహుల్ రెండేసి వికెట్లు పడగొట్టారు. అనంతరం భవన్స్ 8 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పో యి 78 పరుగులు చేసి గెలిచింది. భవన్స్ జట్టులో సాకేత్ (43; 7 ఫోర్లు), ఇలియాన్ (12) ఆకట్టుకున్నారు. ఎస్ఆర్ఆర్ బౌలర్ సాయి కృష్ణ రెండు వికెట్లు తీశాడు. ఆల్‌రౌండ్ ప్రదర్శన చేసిన ఇలియాన్కు ‘మ్యాన్ ఆఫ్ ద ఫైనల్’ అవార్డు లభించింది. సర్దార్ పటేల్ డిగ్రీ కాలేజీ జట్టు సీనియర్స్ విభాగం ఫైనల్లో సర్దార్ పటేల్ కాలేజీ 47 పరుగుల ఆధిక్యంతో ఆదర్శ్ డిగ్రీ, పీజీ కాలేజీ జట్టును ఓడించి టైటిల్ సొంతం చేసుకుంది. తొలుత సర్దార్ పటేల్ కాలేజీ జట్టు 20 ఓవర్లలో మూడు వికెట్లకు 162 పరుగులు సాధించింది. షేక్ సోహైల్ (55), రాకేశ్ (43) రాణించారు. అనంతరం ఆదర్శ్ కాలేజీ జట్టు 20 ఓవర్లలో 9 వికెట్లకు 115 పరుగులు చేసి ఓడిపోయింది. షేక్ సోహైల్‌కు ‘మ్యాన్ ఆఫ్ ద ఫైనల్’ పురస్కారం దక్కింది. జూనియర్, సీనియర్ విభాగంలో విజేతగా నిలిచిన భవన్స్, సర్దార్ పటేల్ కాలేజీ జట్లకు రూ. 50 వేలు చొప్పున... రన్నరప్ ఎస్ఆర్ఆర్, ఆదర్శ్ డిగ్రీ కాలేజీ జట్లకు రూ. 25 వేలు చొప్పున ప్రైజ్‌మనీ అందజేశారు. ‘మ్యాన్ ఆఫ్ ద సిరీస్’గా నిలిచిన సాకేత్ (భవన్స్ శ్రీ అరబిందో), రాకేశ్ (సర్దార్ పటేల్ కాలేజీ)లకు రూ. 15 వేలు చొప్పున... ‘మ్యాన్ ఆఫ్ ద ఫైనల్స్’గా నిలిచిన ఇలియాన్ (భవన్స్), షేక్ సోహైల్ (సర్దార్ పటేల్)లకు రూ. 10 వేలు చొప్పున ప్రైజ్‌మనీ లభించింది. సైనిక్‌పురిలోని భవన్స్ శ్రీ అరబిందో జూనియర్ కాలేజీలో జరిగిన బహుమతి ప్రదానోత్సవంలో సాక్షి మీడియా గ్రూప్ డైరెక్టర్లు రాణి రెడ్డి (కార్పొరేట్ ఎఫైర్స్), ఏఎల్ఎన్ రెడ్డి (బిజినెస్ కంట్రోల్), భవన్స్ విద్యాసంస్థల వైస్ చైర్మన్ కమోడోర్ (రిటైర్డ్) జేఎల్ఎన్ శాస్త్రి, శ్రీ చైతన్య గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూట్స్ ఏజీఎం డి.వెంకటేశ్వర్లు డీన్ విజయ్ కుమార్ ముఖ్య అతిథులుగా పాల్గొని విజేతలకు ట్రోఫీలు, చెక్‌లు అందజేశారు. -
క్రికెట్టే మీ జీవితమా...
క్రికెట్టే మీ జీవితమా... అయితే ఇక్కడ మీ జీవితమే మారిపోవచ్చు... ఆశల ఆకాశం... కలల ప్రపంచం... మీ నిలువెత్తు ప్రయత్నానికి మా అతి పెద్ద వేదిక.. కేవలం మీరు చేయాల్సిందల్లా... ముందుగా ఎంట్రీలు పంపించడం.. ఆ తర్వాత బరిలోకి దిగడమే... తెలంగాణ రాష్ట్రంలోని ఔత్సాహిక క్రికెటర్లకు సువర్ణావకాశాలు కల్పించాలనే సదుద్దేశంతో సాక్షి మీడియా గ్రూప్ ఆధ్వర్యంలో జనవరి తొలి వారం నుంచి సాక్షి క్రికెట్ ప్రీమియర్ లీగ్ (ఎస్‌సీపీఎల్) జరగనుంది. ఏ ఏ విభాగాల్లో... ⇔ సాక్షి ప్రీమియర్ లీగ్‌ను రెండు కేటగిరీల్లో నిర్వహిస్తారు. అండర్–18 జూనియర్ స్థాయిలో (1–12–2001 తర్వాత జన్మించి ఉండాలి)... అండర్–24 సీనియర్ స్థాయిలో (1–12–1995 తర్వాత జన్మించి ఉండాలి) వేర్వేరుగా నిర్వహిస్తారు. ⇔ జూనియర్ స్థాయిలో ఆడేందుకు జూనియర్ కాలేజీ జట్లకు, సీబీఎస్ఈ స్కూల్ (ప్లస్ 11,12) జట్లకు, ఐటీఐ, పాలిటెక్నిక్ జట్లకు అర్హత ఉంది. ⇔ సీనియర్ స్థాయిలో ఆడేందుకు డిగ్రీ, పీజీ, మెడిసిన్, ఇంజనీరింగ్, ఫార్మా కాలేజీ జట్లకు అవకాశం కల్పిస్తారు. ఎన్ని జట్లకు అవకాశం... ⇔ ఒక్కో కాలేజీ నుంచి గరిష్టంగా మూడు జట్లను పంపించే వెసులుబాటు ఉంది. మూడు జట్లు కూడా వేర్వేరుగా ఎంట్రీ ఫీజు చెల్లించాలి. ఒక జట్టులో ఆడే ఆటగాడు మరో జట్టుకు ఆడకూడదు. జట్ల నమోదు ఇలా.... ⇔ సాక్షి క్రికెట్ ప్రీమియర్ లీగ్‌లో పాల్గొనాలనుకునే జట్లు దరఖాస్తుతో పాటు మూడు డాక్యుమెంట్లను జత చేయాలి. ⇔ డాక్యుమెంట్–1: కళాశాల లెటర్ హెడ్‌పై జట్టులోని 15 మంది ఆటగాళ్ల పేర్లు, ఫోన్ నంబర్లు రాసి ప్రిన్సిపాల్ సంతకం, రబ్బరు స్టాంపు వేసి పంపించాలి. ⇔ డాక్యుమెంట్–2: 15 మంది ఆటగాళ్ల ఫోటోలు, వారి వివరాలు, చివర్లో ప్రిన్సిపాల్, ఫిజికల్ డైరెక్టర్ సంతకాలు, రబ్బరు స్టాంపుతో పంపించాలి. ⇔ డాక్యుమెంట్–3: (మ్యాచ్ జరిగే రోజు ఇవ్వాలి): ఆటగాళ్ల భద్రతకు సంబంధించిన డిక్లరేషన్ దరఖాస్తు చివర్లో ప్రిన్సిపాల్ సంతకం, రబ్బరు స్టాంపుతో పంపించాలి. ⇔ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ కోసం... www.arenaone.in వెబ్సైట్లో లాగిన్ కావాలి. ధ్రువ పత్రాలు లేకుండా వచ్చిన ఎంట్రీలను పరిగణించరు. ముఖ్యమైన విషయం... ⇔మ్యాచ్ సమయంలో ఇరు జట్ల ఆటగాళ్లు తమ కళాశాల గుర్తింపు కార్డు (ఒరిజినల్), వయసు ధ్రువీకరణకు సంబంధించి పదో తరగతి మార్కుల మెమో (ఒరిజినల్)ను నిర్వాహకులకు తప్పనిసరిగా చూపించాలి. ⇔ మ్యాచ్ జరిగే సమయంలో బ్యాట్స్‌మెన్, వికెట్ కీపర్ తప్పనిసరిగా హెల్మెట్లు, లెగ్ ప్యాడ్లు, అండర్ గార్డ్స్, హ్యాండ్‌గ్లౌవ్స్, వైట్ డ్రెస్, వైట్ షూస్ ధరించాలి. గమనిక: అన్ని విషయాల్లో నిర్వాహకులదే తుది నిర్ణయం టోర్నీ ఫార్మాట్ ముందుగా జిల్లా, ప్రాంతీయ, రాష్ట్ర స్థాయిలో నాకౌట్ పద్ధతిలో మ్యాచ్‌లు జరుగుతాయి. ఈ మ్యాచ్‌లను 10 ఓవర్ల పాటు నిర్వహిస్తారు. జిల్లా స్థాయిలో విజేతగా నిలిచిన జట్లు ప్రాంతీయ స్థాయి టోర్నీకి అర్హత సాధిస్తాయి. ఈ మ్యాచ్‌లను 20 ఓవర్ల పాటు నిర్వహిస్తారు.ప్రాంతీయ స్థాయి టోర్నీ విజేతలు రాష్ట్ర స్థాయిలో రౌండ్ రాబిన్ లీగ్ పద్ధతిలో టైటిల్ కోసం తలపడతాయి. తెలంగాణలో ఉమ్మడి జిల్లాలే ప్రతిపాదికగా ఎంట్రీలు స్వీకరిస్తారు. ఎంట్రీ ఫీజు... ఈ టోర్నీలో పాల్గొనాలనుకునే జట్లు రూ. 1200 ఎంట్రీ ఫీజుగా చెల్లించాలి. ఈ మొత్తాన్ని ఆన్‌లైన్‌లోనూ, ఆఫ్‌లైన్ పద్ధతిలోనూ చెల్లించవచ్చు. వివరాలకు సాక్షి జిల్లా యూనిట్ కార్యాలయంలో సంప్రదించాలి. www.arenaone.in వెబ్సైట్లోనూ వివరాలు లభిస్తాయి. ఎంట్రీలను డిసెంబర్ 25వ తేదీలోగా పంపించాలి. తెలంగాణలోని ఉమ్మడి జిల్లాలను మూడు జోన్లుగా విభజించారు. జోన్–1లో హైదరాబాద్, రంగారెడ్డి, మెదక్ ఉన్నాయి. (ఈ మూడు జిల్లాల మ్యాచ్‌లు మాత్రం హైదరాబాద్ కేంద్రంగా నిర్వహిస్తారు) జోన్–2లో వరంగల్, కరీంనగర్, ఖమ్మం, ఆదిలాబాద్ ఉన్నాయి. జోన్–3లో నిజామాబాద్, మహబూబ్‌నగర్, నల్లగొండ ఉన్నాయి. ఒక్కో జోన్ నుంచి విజేత జట్టు రాష్ట్ర స్థాయి టోర్నీకి అర్హత సాధిస్తుంది. ఇతర వివరాలు.. Sakshi City Office, H.No. 9-4-2, Sri Sai Complex, 2nd Floor, Shadikhana Back Side, Railway Station Road, Khammam. Ph: 9666013544 -
జానపద కళలను ఆదరించండి
ముగిసిన రాష్ట్ర స్థాయి జానపద నృత్యపోటీలు సత్తుపల్లి : జానపద కళలను అందరు ఆదరించాలని జిల్లా విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సభ్యులు డాక్టర్ మట్టా దయానంద్ విజయ్‌కుమార్ అన్నారు. సత్తుపల్లి బస్టాండ్ ప్రాంగణంలో తెలంగాణ రాష్ట్ర జానపద కళాకారుల సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన రెండు రోజుల రాష్ట్ర స్థాయి జానపద నృత్యాలు, పాటలు, కోలాటం, తాళంభజన పోటీలు మంగళవారం రాత్రి ముగిశాయి. ఈ పోటీలలో విజేతలకు రాషే్ట్రతర తెలుగు సమాఖ్య అధ్యక్షుడు కోడూరు శ్రీనివాస్ బహుమతులు అందించారు. కార్యక్రమంలో తహశీల్దార్ దొడ్డా పుల్లయ్య, జిల్లా ప్రధాన కార్యదర్శి నంధ్యాల నాగేశ్వరరావు, దొడ్డా శ్రీనివాసరెడ్డి, ఈఓ శివరామకృష్ణ, గ్రాండ్ మౌలాలి, చిత్తలూరి ప్రసాద్, రంగపూరి వెంకటేశ్వరరావు, పి.సాయి శ్రీనివాస్, తమ్మిశెట్టి గణేష్, బత్తుల పూర్ణచంద్రరావు, చల్లారి వెంకటేశ్వరరావు, కూసంపూడి అచ్యుతవాణి, పాటిబండ్ల రామకృష్ణ, పెద్దిరాజు, గంగా, మధు పాల్గొన్నారు. పోటీలలో విజేతలు వీరే.. తాళం భజన పోటీలలో అభయాంజనేయ భజనమండలి, సీతారామ భజన మండలి ప్రథమ, ద్వితీయ బహుమతులను అందుకున్నారు. జానపద నృత్య పోటీలలో తల్లాడ బాలవెలుగు పాఠశాల, ఖమ్మం క్రియేటీవ్ గ్రామర్ స్కూల్లు, జానపద పాటల పోటీలలో ఎస్.హుస్సేన్, ఎ.నందు, కోలాటం పోటీలలో మంగాపురం శ్రీలక్ష్మీతిరుపతమ్మ కోలాటబృందం, లంకపల్లి బృందావన కోలాట బృందంలు ప్రథమ, ద్వితీయ బహుమతులను సాధించారు. ఈ పోటీలకు శివనాగులు, సంస్కాృతిక శ్రీకాంత్, శరత్, బాలు న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించారు.