
క్రికెట్టే మీ జీవితమా... అయితే ఇక్కడ మీ జీవితమే మారిపోవచ్చు... ఆశల ఆకాశం... కలల ప్రపంచం... మీ నిలువెత్తు ప్రయత్నానికి మా అతి పెద్ద వేదిక.. కేవలం మీరు చేయాల్సిందల్లా... ముందుగా ఎంట్రీలు పంపించడం.. ఆ తర్వాత బరిలోకి దిగడమే... తెలంగాణ రాష్ట్రంలోని ఔత్సాహిక క్రికెటర్లకు సువర్ణావకాశాలు కల్పించాలనే సదుద్దేశంతో సాక్షి మీడియా గ్రూప్ ఆధ్వర్యంలో జనవరి తొలి వారం నుంచి సాక్షి క్రికెట్ ప్రీమియర్ లీగ్ (ఎస్‌సీపీఎల్) జరగనుంది.
ఏ ఏ విభాగాల్లో...
⇔ సాక్షి ప్రీమియర్ లీగ్‌ను రెండు కేటగిరీల్లో నిర్వహిస్తారు. అండర్–18 జూనియర్ స్థాయిలో (1–12–2001 తర్వాత జన్మించి ఉండాలి)... అండర్–24 సీనియర్ స్థాయిలో (1–12–1995 తర్వాత జన్మించి ఉండాలి) వేర్వేరుగా నిర్వహిస్తారు.
⇔ జూనియర్ స్థాయిలో ఆడేందుకు జూనియర్ కాలేజీ జట్లకు, సీబీఎస్‌ఈ స్కూల్ (ప్లస్ 11,12) జట్లకు, ఐటీఐ, పాలిటెక్నిక్ జట్లకు అర్హత ఉంది.
⇔ సీనియర్ స్థాయిలో ఆడేందుకు డిగ్రీ, పీజీ, మెడిసిన్, ఇంజనీరింగ్, ఫార్మా కాలేజీ జట్లకు అవకాశం కల్పిస్తారు.
ఎన్ని జట్లకు అవకాశం...
⇔ ఒక్కో కాలేజీ నుంచి గరిష్టంగా మూడు జట్లను పంపించే వెసులుబాటు ఉంది. మూడు జట్లు కూడా వేర్వేరుగా ఎంట్రీ ఫీజు చెల్లించాలి. ఒక జట్టులో ఆడే ఆటగాడు మరో జట్టుకు ఆడకూడదు.
జట్ల నమోదు ఇలా....
⇔ సాక్షి క్రికెట్ ప్రీమియర్ లీగ్‌లో పాల్గొనాలనుకునే జట్లు దరఖాస్తుతో పాటు మూడు డాక్యుమెంట్‌లను జత చేయాలి.
⇔ డాక్యుమెంట్–1: కళాశాల లెటర్ హెడ్‌పై జట్టులోని 15 మంది ఆటగాళ్ల పేర్లు, ఫోన్ నంబర్లు రాసి ప్రిన్సిపాల్ సంతకం, రబ్బరు స్టాంపు వేసి పంపించాలి.
⇔ డాక్యుమెంట్–2: 15 మంది ఆటగాళ్ల ఫోటోలు, వారి వివరాలు, చివర్లో ప్రిన్సిపాల్, ఫిజికల్ డైరెక్టర్ సంతకాలు, రబ్బరు స్టాంపుతో పంపించాలి.
⇔ డాక్యుమెంట్–3: (మ్యాచ్ జరిగే రోజు ఇవ్వాలి): ఆటగాళ్ల భద్రతకు సంబంధించిన డిక్లరేషన్ దరఖాస్తు చివర్లో ప్రిన్సిపాల్ సంతకం, రబ్బరు స్టాంపుతో పంపించాలి.
⇔ ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ కోసం... www.arenaone.in వెబ్‌సైట్‌లో లాగిన్ కావాలి. ధ్రువ పత్రాలు లేకుండా వచ్చిన ఎంట్రీలను పరిగణించరు.
ముఖ్యమైన విషయం...
⇔మ్యాచ్ సమయంలో ఇరు జట్ల ఆటగాళ్లు తమ కళాశాల గుర్తింపు కార్డు (ఒరిజినల్), వయసు ధ్రువీకరణకు సంబంధించి పదో తరగతి మార్కుల మెమో (ఒరిజినల్)ను నిర్వాహకులకు తప్పనిసరిగా చూపించాలి.
⇔ మ్యాచ్ జరిగే సమయంలో బ్యాట్స్‌మెన్, వికెట్ కీపర్ తప్పనిసరిగా హెల్మెట్లు, లెగ్ ప్యాడ్‌లు, అండర్ గార్డ్స్, హ్యాండ్‌గ్లౌవ్స్, వైట్ డ్రెస్, వైట్ షూస్ ధరించాలి.
గమనిక: అన్ని విషయాల్లో నిర్వాహకులదే తుది నిర్ణయం
టోర్నీ ఫార్మాట్
ముందుగా జిల్లా, ప్రాంతీయ, రాష్ట్ర స్థాయిలో నాకౌట్ పద్ధతిలో మ్యాచ్‌లు జరుగుతాయి. ఈ మ్యాచ్‌లను 10 ఓవర్ల పాటు నిర్వహిస్తారు. జిల్లా స్థాయిలో విజేతగా నిలిచిన జట్లు ప్రాంతీయ స్థాయి టోర్నీకి అర్హత సాధిస్తాయి. ఈ మ్యాచ్‌లను 20 ఓవర్ల పాటు నిర్వహిస్తారు.ప్రాంతీయ స్థాయి టోర్నీ విజేతలు రాష్ట్ర స్థాయిలో రౌండ్ రాబిన్ లీగ్ పద్ధతిలో టైటిల్ కోసం తలపడతాయి. తెలంగాణలో ఉమ్మడి జిల్లాలే ప్రతిపాదికగా ఎంట్రీలు స్వీకరిస్తారు.
ఎంట్రీ ఫీజు...
ఈ టోర్నీలో పాల్గొనాలనుకునే జట్లు రూ. 1200 ఎంట్రీ ఫీజుగా చెల్లించాలి. ఈ మొత్తాన్ని ఆన్‌లైన్‌లోనూ, ఆఫ్‌లైన్ పద్ధతిలోనూ చెల్లించవచ్చు. వివరాలకు సాక్షి జిల్లా యూనిట్ కార్యాలయంలో సంప్రదించాలి. www.arenaone.in వెబ్‌సైట్‌లోనూ వివరాలు లభిస్తాయి. ఎంట్రీలను డిసెంబర్ 25వ తేదీలోగా పంపించాలి.
తెలంగాణలోని ఉమ్మడి జిల్లాలను మూడు జోన్‌లుగా విభజించారు. జోన్–1లో హైదరాబాద్, రంగారెడ్డి, మెదక్ ఉన్నాయి. (ఈ మూడు జిల్లాల మ్యాచ్‌లు మాత్రం హైదరాబాద్ కేంద్రంగా నిర్వహిస్తారు)
జోన్–2లో వరంగల్, కరీంనగర్, ఖమ్మం, ఆదిలాబాద్ ఉన్నాయి. జోన్–3లో నిజామాబాద్, మహబూబ్‌నగర్, నల్లగొండ ఉన్నాయి. ఒక్కో జోన్ నుంచి విజేత జట్టు రాష్ట్ర స్థాయి టోర్నీకి అర్హత సాధిస్తుంది.
ఇతర వివరాలు..
Sakshi City Office, H.No. 9-4-2, Sri Sai Complex, 2nd Floor, Shadikhana Back Side, Railway Station Road, Khammam. Ph: 9666013544
Comments
Please login to add a commentAdd a comment