respect
-
నమస్కారం అంటే..!
గురువు గారికి తిరిగి ప్రత్యుపకారం చేస్తాను... అనడం సాధ్యమయ్యే విషయం కాదు. గురువు విషయంలో చేయగలిగినది ఏమిటి.. అంటే ...‘జలజాతేక్షణు? దోడితెచ్చితివి నా సందేశముం జెప్పి; నన్/నిలువం బెట్టితి; నీ కృపన్ బ్రతికితిన్ నీ యంత పుణ్యాత్మకుల్/గలరే; దీనికి నీకు? బ్రత్యుపకృతిం గావింప నే నేర; నం/జలిం గావించెద; భూసురాన్వయమణీ! సద్బంధుచింతామణీ!‘ అంటుంది రుక్మిణీ దేవి భాగవతంలో. అంతటి ఉపకారం చేసిన నీకు ప్రత్యుపకారం నేనేం చేయగలను.. అంజలి ఘటించడం తప్ప... అంటుంది. అంటే రెండు చేతులు కలిపి జోడించి శిరస్సు తాటించి నమస్కరించడం. ఈ ఐదు వేళ్ళతో కూడుకున్న చెయ్యి–కర్మేంద్రియ సంఘాతం. ఐదు కర్మేంద్రియాలు, ఐదు జ్ఞానేంద్రియాలు పదింటిని, బుద్ధిస్ధానమయిన 11వదయిన శిరస్సును కలిపి మీ పాదాల దగ్గర న్యాసం చేస్తున్నాను... అని చెప్పడానికి నమస్కారం చేస్తారు. ఈ తలలో వచ్చిన ఎన్నో ఆలోచనలను, ఈ చేతులతో ఎన్నో చేయకూడని పనులను చేసి మనుష్య జన్మ పాడుచేసుకున్నా. మీ వాక్కులు అగ్నిహోత్రం. నాలో ఉన్న అజ్ఞానాన్ని దహించి నేను ప్రయాణించాల్సిన మార్గాన్ని చూపించి నన్ను రక్షించండి... అని చెప్పడానికి అంజలి ఘటిస్తారు. అంతటి గొప్పరూపం గురువు. సనాతన ధర్మంలో భగవంతుడే గురువుగా కూడా ఉంటాడు. గురువు ఒకడు, భగవంతుడు ఒకడు కాదు. నిజానికి భగవంతుడే గురువు. శైవసంప్రదాయంలో దక్షిణామూర్తి చాలా చాలా గొప్ప గురువు. ఆయన నోటితో మాట్లాడకుండా చిన్ముద్రపట్టి కూర్చున్నాడు. ఆయన గురువు. అలాగే వైష్ణవ సంప్రదాయంలో శ్రీకృష్ణపరమాత్మ జగద్గురువు.‘కృష్ణం వందే జగద్గురుమ్!’. అమ్మవారు గురు మండల రూపిణి. సమస్త గురుమండల రూపిణి జగన్మాతయే. భగవంతుడు ఏ అవతారంలో మనముందుకొచ్చినా గురువుపట్ల అమిత గౌరవంతో ప్రవర్తిస్తాడు. 16 గుణాలు పరిపూర్ణంగా కలిగిన నరుడెవరు? – అంటే రామచంద్రమూర్తిని చూపించాడు నారద మహర్షి సంక్షేప రామాయణంలో. అంతటి గొప్ప రాముడు కూడా గురువుకు నమస్కరించి తలవంచుకుని నిలబడ్డాడు. ఏదో యాంత్రికమైన నమస్కారం కాదు. నమస్కారం చేసేటప్పుడు ఎప్పుడు ఎక్కడ ఎలా నమస్కారం చేయాలో తెలుసుకుని చేయాలి. సాష్టాంగ నమస్కారం చేయాలన్నా, అభివాదం చేయాలన్నా ఒక పద్దతి ఉండాలి. రెండు చేతులు కలిపి తలతాకించి నమస్కారం చేయడం కూడా నమస్కారమే. అలాకాక, ప్రణిపాతం.. కర్ర ఎలా నేలమీద పడిపోతుందో అలా పడిపోవడం. అంటే ఎంత కింద పడిపోవాలో అంత పడిపోయాను. ఇంతకన్నా కిందపడే అవకాశం లేదు. ఇప్పుడు నన్ను పైకెత్తడం మీ చేతుల్లో ఉంది... అన్న భావనతో చేస్తే ప్రణిపాతం. అంటే అహంకారం వదిలి పెద్దలముందు పడిపోవడం. రామచంద్రమూర్తి అలా గురువుగారి ముందు నిలబడి నమస్కరించి నేను రాకుమారుడిని కాదు, కింకరుడిని.. సేవకుడిని, మీరేది ఆజ్ఞాపిస్తే అలా చేయడానికి సంసిద్ధంగా ఉన్నా.. ఆజ్ఞాపించండి. అన్నాడు.. గురువుల, పెద్దల విషయంలో అలా మసలుకోవాలనేది సనాతన ధర్మం మనకు ఇచ్చిన సందేశం. గురువు గారికి తిరిగి ప్రత్యుపకారం చేస్తాను... అనడం సాధ్యమయ్యే విషయం కాదు. గురువు విషయంలో చేయగలిగినది ఏమిటి.. అంటే ... ‘జలజాతేక్షణు? దోడితెచ్చితివి నా సందేశముం జెప్పి; నన్/నిలువం బెట్టితి; నీ కృపన్ బ్రతికితిన్ నీ యంత పుణ్యాత్మకుల్/గలరే; దీనికి నీకు? బ్రత్యుపకృతిం గావింప నే నేర; నం/జలిం గావించెద; భూసురాన్వయమణీ! సద్బంధుచింతామణీ!‘ అంటుంది రుక్మిణీ దేవి భాగవతంలో. అంతటి ఉపకారం చేసిన నీకు ప్రత్యుపకారం నేనేం చేయగలను.. అంజలి ఘటించడం తప్ప... అంటుంది. అంటే రెండు చేతులు కలిపి జోడించి శిరస్సు తాటించి నమస్కరించడం. ఈ ఐదు వేళ్ళతో కూడుకున్న చెయ్యి–కర్మేంద్రియ సంఘాతం. ఐదు కర్మేంద్రియాలు, ఐదు జ్ఞానేంద్రియాలు పదింటిని, బుద్ధిస్ధానమయిన 11వదయిన శిరస్సును కలిపి మీ పాదాల దగ్గర న్యాసం చేస్తున్నాను... అని చెప్పడానికి నమస్కారం చేస్తారు. ఈ తలలో వచ్చిన ఎన్నో ఆలోచనలను, ఈ చేతులతో ఎన్నో చేయకూడని పనులను చేసి మనుష్య జన్మ పాడుచేసుకున్నా. మీ వాక్కులు అగ్నిహోత్రం. నాలో ఉన్న అజ్ఞానాన్ని దహించి నేను ప్రయాణించాల్సిన మార్గాన్ని చూపించి నన్ను రక్షించండి... అని చెప్పడానికి అంజలి ఘటిస్తారు. అంతటి గొప్పరూపం గురువు. సనాతన ధర్మంలో భగవంతుడే గురువుగా కూడా ఉంటాడు. గురువు ఒకడు, భగవంతుడు ఒకడు కాదు. నిజానికి భగవంతుడే గురువు. శైవసంప్రదాయంలో దక్షిణామూర్తి చాలా చాలా గొప్ప గురువు. ఆయన నోటితో మాట్లాడకుండా చిన్ముద్రపట్టి కూర్చున్నాడు. ఆయన గురువు. అలాగే వైష్ణవ సంప్రదాయంలో శ్రీకృష్ణపరమాత్మ జగద్గురువు.‘కృష్ణం వందే జగద్గురుమ్!’. అమ్మవారు గురు మండల రూపిణి. సమస్త గురుమండల రూపిణి జగన్మాతయే. భగవంతుడు ఏ అవతారంలో మనముందుకొచ్చినా గురువుపట్ల అమిత గౌరవంతో ప్రవర్తిస్తాడు. 16 గుణాలు పరిపూర్ణంగా కలిగిన నరుడెవరు? – అంటే రామచంద్రమూర్తిని చూపించాడు నారద మహర్షి సంక్షేప రామాయణంల.. అంతటి గొప్ప రాముడు కూడా గురువుకు నమస్కరించి తలవంచుకుని నిలబడ్డాడు. ఏదో యాంత్రికమైన నమస్కారం కాదు. నమస్కారం చేసేటప్పుడు ఎప్పుడు ఎక్కడ ఎలా నమస్కారం చేయాలో తెలుసుకుని చేయాలి. సాష్టాంగ నమస్కారం చేయాలన్నా, అభివాదం చేయాలన్నా ఒక పద్దతి ఉండాలి. రెండు చేతులు కలిపి తలతాకించి నమస్కారం చేయడం కూడా నమస్కారమే. అలాకాక, ప్రణిపాతం.. కర్ర ఎలా నేలమీద పడిపోతుందో అలా పడిపోవడం. అంటే ఎంత కింద పడిపోవాలో అంత పడిపోయాను. ఇంతకన్నా కిందపడే అవకాశం లేదు. ఇప్పుడు నన్ను పైకెత్తడం మీ చేతుల్లో ఉంది... అన్న భావనతో చేస్తే ప్రణిపాతం. అంటే అహంకారం వదిలి పెద్దలముందు పడిపోవడం. రామచంద్రమూర్తి అలా గురువుగారి ముందు నిలబడి నమస్కరించి నేను రాకుమారుడిని కాదు, కింకరుడిని.. సేవకుడిని, మీరేది ఆజ్ఞాపిస్తే అలా చేయడానికి సంసిద్ధంగా ఉన్నా.. ఆజ్ఞాపించండి. అన్నాడు.. గురువుల, పెద్దల విషయంలో అలా మసలుకోవాలనేది సనాతన ధర్మం మనకు ఇచ్చిన సందేశం. (చదవండి: అలవాటుని అధిగమించటం అతికష్టం!) -
ఎన్ఈపీలో ప్రతి భారతీయ భాషకు తగు గౌరవం
న్యూఢిల్లీ: నూతన జాతీయ విద్యా విధానం(ఎన్ఈపీ) ద్వారా దేశంలోని ప్రతి భాషకూ సముచిత గౌరవం లభిస్తుందని ప్రధాని మోదీ చెప్పారు. స్వార్థ ప్రయోజనాల కోసం భాషపై రాజకీయం చేసే వారు తమ దుకాణాలను మూసేసుకోవాలని ఆయన వ్యాఖ్యానించారు. శక్తి సామర్థ్యాల ఆధారంగా కాకుండా భాష ప్రాతిపదికన ప్రతిభను అంచనా వేయడం వల్ల విద్యార్థులకు తీరని అన్యాయం జరుగుతోందని చెప్పారు. ఎన్ఈపీ ప్రారంభమై మూడో వార్షికోత్సవా న్ని పురస్కరించుకుని ఏర్పాటైన ‘అఖిల భారతీయ శిక్షా సమాగమ్’నుద్దేశించి ఆయన ప్రసంగించారు. ‘మాతృభాషలో విద్యా బోధన ద్వారా భారతీయ విద్యార్థులకు న్యాయం చేసే కొత్త రూపానికి నాంది పలుకుతోంది. సామాజిక న్యాయం దిశగా ఇది చాలా ముఖ్యమైన అడుగు’అని ప్రధాని అన్నారు. ప్రపంచంలోని అనేక భాషలు, వాటి ప్రాముఖ్యతను ప్రస్తావిస్తూ ప్రధానమంత్రి.. అనేక అభివృద్ధి చెందిన ముఖ్యంగా యూరప్ దేశాలు విద్యాబోధన స్థానిక భాషల్లో జరుగుతున్నందునే ఒక అడుగు ముందుకు వేశాయని చెప్పారు. మన దేశంలో అనేక ప్రాచీన భాషలున్నప్పటికీ, వాటిని వెనుకబాటుకు చిహ్నంగా చూపుతు న్నారని, ఇంగ్లిష్ మాట్లాడలేని వారిని విస్మరించారని, వారి ప్రతిభను గుర్తించడం లేదని మోదీ విచారం వ్యక్తం చేశారు. ‘ఫలితంగా గ్రామీణ ప్రాంతాల్లోని చిన్నారులు ఎక్కువగా నష్టపోతున్నారు. ఎన్ఈపీ రాకతో దేశం ఇప్పుడు ఈ నమ్మకాన్ని విస్మరించడం ప్రారంభించింది. ఐక్యరాజ్యసమితిలో కూడా నేను భారతీయ భాషలోనే మాట్లాడతాను’ అని చెప్పారు. సామాజిక శాస్త్రాల నుంచి ఇంజినీరింగ్ విద్య వరకు అన్ని సబ్జెక్టుల్లోనూ భారతీయ భాషల్లోనే బోధిస్తున్నారని తెలిపారు. భాషపై విద్యార్థులు పట్టుసాధించగలిగితే, ఎలాంటి అవరోధాలు లేకుండా వారిలో నైపుణ్యం, ప్రతిభ బయటికొస్తాయని ప్రధాని అన్నారు. ప్రపంచం భారతదేశాన్ని కొత్త అవకాశాల వేదికగా చూస్తోంది. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ) క్యాంపస్‌లను ఏర్పాటు చేయాలంటే అనేక దేశాలు కేంద్ర ప్రభుత్వాన్ని సంప్రదిస్తున్నా యని వెల్లడించారు. ఇప్పటికే టాంజానియా, అబుధాబిల్లో ఐఐటీ క్యాంపస్‌లు నెలకొల్పార ని చెప్పారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ శ్రీ (ఎస్హెచ్ఆర్ఐ) పథకం కింద మొదటి ఇన్స్టాల్మెంట్ నిధులను విడుదల చేశారు. -
ష్..! దేశమంటే ప్రాణం.. ఇది పుతిన్‌లో మరో కోణం..!
దేశమంటే ప్రాణం.. జాతీయ గీతం అంటే గౌరవం.. ఇదీ పుతిన్ నమ్మిన సిద్ధాంతం. ఓ వైపు పశ్చిమ దేశాలన్నీ కలిసి పగబట్టినా.. పట్టు వీడని మనస్థత్వం ఆయనది. ప్రపంచంలో రష్యా దేశ స్వాభిమానాన్ని నిలపడంలో అలిసిపోకుండా పోరాడుతున్నారు. అయినప్పటికీ ప్రతీ చిన్న విషయంలోనూ దేశ ప్రేమను వెలిబుచ్చుతున్నారు. ఇలాంటి వీడియోనే ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఈ చిన్న సంఘటనతో దేశానికి ఆయన ఇచ్చే గౌరవం ఎంతటిదో అర్ధమవుతుంది. సెయింట్ పీటర్‌బర్గ్‌లో నిర్వహించిన ఓ జాతీయ వేడుకలో పుతిన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన పెట్రోలియం రిఫైనరీ కంపెనీ గాజ్ప్రోమ్ నెఫ్ట్‌కు చెందిన అధికారి ఎలెనా ఇల్యుఖినాతో కలిసి పడవపై నిలబడి ఉన్నారు. ఈ క్రమంలో జాతీయ గీతం ఆలాపన ప్రారంభమైంది. అదే సమయంలో పుతిన్‌తో ఎలెనా చర్చను ప్రారంభించారు. జాతీయ గీతానికి గౌరవంగా నిలబడిన పుతిన్..మాట్లాడొద్దంటూ మూతిపై వేలు చూపించారు. తప్పు చేసినదానిలా భావించిన ఎలెనా.. నిశ్శబ్దంగా పుతిన్ పక్కన నిలబడ్డారు. 22 సెకన్ల పాటు ఉన్న ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ కాగా.. నెటిజన్లు రకరకాలుగా స్పందించారు. Vladimir Putin 😎 reminds his talkative host not to speak during the Russian National Anthem pic.twitter.com/xMf7W8FeVH — Megh Updates 🚨™ (@MeghUpdates) June 18, 2023 అధ్యక్షుల వారి ఆంతర్యమేంటో..! మరో వేడుకలో పుతిన్ ఆ దేశ రక్షణ మంత్రికి వీపు చూపించిన వీడియో కూడా ఇటీవల బాగా వైరల్ అయింది. సైనికులకు బహుమతులు ఇవ్వడానికి మిలిటరీ ఆస్పత్రికి వెళ్లిన పుతిన్.. సైనికులతో మాట్లాడతారు. ఈ క్రమంలో పక్కనే నిల్చున్న రక్షణ మంత్రి సెర్జీ షోయిగు వైపు చూసి వెంటనే ముఖం తిప్పుకున్నారు. అంతటితో ఆగకుండా షోయిగుకు వీపు చూపించారు. వెనకనే ఉన్న మంత్రి ఎలా స్పందించాలో తెలియక తికమకపడ్డారు. దేశమే ప్రధానం.. ఆ తర్వాతే పుతిన్‌కు ఎవరైనా అనే విషయం ఈ ఘటనతో అర్థమవుతుంది. ఈ వీడియో వైరల్ కాగా.. నెటిజన్లు రకరకాలుగా స్పందించారు. అధ్యక్షుల వారీ ఆంతర్యమేంటో అని కామెంట్లు పెట్టారు. రక్షణ మంత్రి ఉద్యోగం ఊడినట్టేనని ఫన్నీగా స్పందించారు. అయితే.. ఉక్రెయిన్‌తో యుద్ధంలో సరైనా విజయాలు సాధించట్లేదనే మంత్రిపై ఆ విధంగా పుతిన్ ప్రవర్తించారని మరికొందరు కామెంట్ చేశారు. You don't have to be a body language expert to understand what Putin currently thinks about his Defence Minister Sergei Shoigu... 😅 pic.twitter.com/ZRfJaJDE1X — Jimmy Rushton (@JimmySecUK) June 12, 2023 ఇదీ చదవండి:రష్యా అధ్యక్షుడికి తిక్క రేగింది.. భారీ క్షిపణులతో దాడి.. -
వైరల్ వీడియో: గణేశుడికి మోకరిల్లి మొక్కుతున్న శునకం
-
గణేశుడికి మోకరిల్లి మొక్కుతున్న శునకం: వీడియో వైరల్
ఇటీవల కాలంలో ఉన్నటుండి మోగ జీవులు చాలా వింతగా ప్రవర్తిస్తున్నాయి. ఒక్కసారిగా మనుషుల వలే భక్తిప్రపత్తులు చాటుకుంటూ వింతగా ప్రవర్తిస్తున్నాయి. ఇలాంటి ఘటనలు ఇటీవలే కోకొల్లుగా జరిగాయి. అచ్చం అలాంటి సంఘటనే ఒకటి పూణేలో చోటుచేసుకుంది. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట హల్చల్ చేస్తోంది. ఆ వీడియోలో ఒక శునకం గణేశుడి దేవాలయం వద్ద మోకరిల్లి ప్రార్థిస్తోంది. అతని పక్కనే ఉన్న వ్యక్తి కూడా ప్రార్థిస్తున్నాడు. ఈ ఘటనను విశాల్ అనే వ్యక్తి రికార్డు చేసినట్లు తెలుస్తోంది. అతను ఇన్‌స్టాగ్రామ్‌లో 'పూణేలోని దగ్దుషేత్ గణపతి మందిర్ వద్ద ఏం జరుగుతుందో చూడండి' అని ఒక క్యాప్షన్ పెట్టి మరీ వీడియోని పోస్ట్ చేశాడు. ఆలస్యం ఎందుకు మీరు కూడా ఈ వీడియో చూసేయండి. (చదవండి: అరే! ఏం మనుషుల్రా ఇంత రాక్షసత్వమా! శునకానికి ఉరి వేసి...) -
క్వీన్ ఎలిజబెత్ II గౌరవార్థం సెప్టెంబర్ 11న సంతాపదినంగా ప్రకటించిన భారత్
న్యూఢిల్లీ: క్వీన్ ఎలిజబెత్ 2 బ్రిటన్ రాణిగా సుదీర్ఘకాలం కొనసాగిన వ్యక్తిగా రికార్డు సృష్టించారు. ఐతే ఆమె గతకొంతకాలంగా తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఈ మేరకు వేసవి విడిది కోసం స్కాట్లాండ్లోని బల్మోరల్ కోటలో ఉన్న రాణి గురువారం తుది శ్వాస విడిచారు. దీంతో రాచ కుటుంబికులు, యావత్తు యునైటైడ్ కింగ్డమ్ ప్రజలంతా శోకసంద్రంలో మునిగిపోయారు. ఆ దేశ ప్రజల ఆమె సుదీర్ఘపాలనను గుర్తు చేసుకోవడమే కాకుండా వారి ఆలోచనలన్నీ ఆమె చుట్టూనే తిరుగుతున్నాయి. ఈ మేరకు భారత ప్రభుత్వం కూడా సుదీర్ఘకాలం రాణిగా అత్యున్నత హోదాలో కొనసాగిన క్వీన్ ఎలిజబెత్2 గౌరవార్థం ఒక రోజు దేశం మొత్తం సంతాపదినంగా పాటించాలని శుక్రవారం నిర్ణయించింది. అందులో భాగంగానే సెప్టెంబర్ 11న సంతాప దినంగా పాటించాలని ప్రకటించింది. యావత్ భారతదేశం ఆరోజుని సంతాపదినంగా పాటించడమే కాకుండా భవనాలన్నింటిపై జాతీయ జెండ మాస్ట్‌లో ఎగురవేసి ఉంటుందని స్పష్టం చేసింది. ఆ రోజుల ఎలాంటి అధికారిక వినోద కార్యక్రమాలు ఉండవని పేర్కొంది. (చదవండి: బ్రిటన్ రాణి వాడిపడేసిన టీబ్యాగ్ ఎంతకు అమ్ముడుపోయిందంటే....) -
శతక నీతి – సుమతిమీ కింకరులం ..
‘‘ఏరకుమీ కసుగాయలు దూరకుమీ బంధుజనుల దోషము సుమ్మీ...’’ అంటూ బద్దెనగారు ఇంకా ... ‘‘పాఱకుమీ రణమందున మీరకుమీ గురువులాజ్ఞ మేదిని సుమతీ!... అని కూడా అంటున్నారు. పాఱకుమీ రణమందున అంటే... యుద్ధరంగంలోకి దిగినవాడు యుద్ధం చేసితీరవలసిందే... శరీరత్యాగానికి సిద్ధపడే పోతాడు. అసలు నిజానికి ఆ ఆలోచన కూడా రాదు వీరుడికి...విజయ సాధనే ఏకైక లక్ష్యం.. దాన్ని సాధించాలన్న ఆలోచన తప్ప మరొకటి ఉండదు, ఉండకూడదు కూడా. ఒకవేళ సగంలో వెనుదిరిగితే... అది అత్యంత హేయమైన చర్య. వీరుడిగా గౌరవం పొందడు. కురుక్షేత్ర సంగ్రామ సమయం లో ‘నేను అర్జునుడిని ఓడిస్తా..’ అని కర్ణుడు మాట్లాడినప్పుడల్లా.. భీష్మాచార్యుడు... ‘‘గతంలో ఎన్నిమార్లు నువ్వు అర్జునుడితో తలపడ్డావు.. ద్రౌపదీ స్వయంవరమప్పుడు అర్జునుడి చేతిలో ఓడిపోయావు, ఉత్తర గోగ్రహణ సమయంలో అర్జునుడు బాణప్రయోగం చేస్తే పారిపోయావు, ఘోష యాత్ర జరుగుతున్నప్పుడు చిత్రసేనుడితో పోరాడలేక నువ్వు పారిపోతే అర్జునుడు వచ్చి చిత్రసేనుణ్ణి ఓడించి అందర్నీ కాపాడాడు... ఇన్నిసార్లు ఓడినవాడివి నీవిప్పుడు అర్జునుడిని ఓడిస్తానని ప్రగల్భాలు ఎందుకు పలకడం...’’ అనేవాడు. అయితే ఇప్పుడు యుద్ధాలు లేవు కానీ అంతకంటే క్లిష్టమైన జీవిత సమస్యలున్నాయి... ఏదయినా పోరాటమే... పోరాటానికి దిగేటప్పుడు దాని అంతు తేలుస్తా... అనే ఉక్కు సంకల్పంతో పోరాడాలి.. ఒకసారి పోరాడడం మొదలయిన తరువాత దాన్ని మధ్యలో వదిలేయకూడదన్నదే బద్దెన సందేశం. ఆయన ఇంకా ఏమంటున్నారు... ‘మీరకుమీ గురువలాజ్ఞ మేదిని సుమతీ’... పూర్తిగా పక్వానికి రాని పండ్లను తినడం, బంధువులను దూషించడం, ఒక పనిని మొదలుపెట్టి మధ్యలో వదిలేయడం ఎంతగా నిషిద్ధమో... అలాగే గురువుగారు చెప్పిన మాటలను పూర్తి శ్రద్ధతో ఆలకించి, ఆచరించడం కూడా అంతే అవసరం. ఆత్మబుద్ధి సుఖంచైవ... కొన్ని సంక్లిష్ట సందర్భాల్లో మనం కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోవలసి ఉంటుంది. అప్పుడు మన మనసు కు తట్టిన ఆలోచనలు మంచివే, వాటిని ఆచరించడానికే మనసు మొగ్గు చూపుతుంటుంది కానీ... గురుబుద్ధిర్విశేషతః... అటువంటప్పుడు సందర్భాన్నిబట్టి గురువుగారు గతంలో చెప్పిన విషయాలు ఒక్కసారి జ్ఞప్తికి తెచ్చుకోవాలి. అవి మన ఆలోచనలకంటే మెరుగ్గా ఉంటాయి కనుక వాటిని కూడా శ్రద్ధగా పరిశీలించాలి. అప్పుడు మంచి నిర్ణయాలు వెలువడే అవకాశం ఉంటుంది. అందువల్ల గురువుగారికి ఆయన మాటలకు ఎప్పుడూ ఆ గౌరవం ఇవ్వాలి. తాటక సంహారం తరువాత సుబాహుణ్ణి చంపగా, మారీచుణ్ణి దూరంగా తరిమికొట్టాడు రామచంద్రమూర్తి. రుషులందరూ వచ్చి పిల్లవాడివయినా దేవేంద్రుడిలాగా పోరాడావయ్యా... అంటూ బాగా పొగిడారు. సాధారణంగా పిల్లలను అందరిముందు పొగిడితే కించిత్ గర్వం వస్తుంది. విశ్వామిత్రుడు వారి గురువు. మరుసటిరోజు ఉదయాన రామలక్ష్మణులు చేతులు కట్టుకుని ఆయన ముందు నిలబడి ‘‘ఇమౌ స్మ ముని శార్దూల కింకరౌ సముపస్థితౌ, ఆజ్ఞాపయ మునిశ్రేష్ఠ శాసనం కరవావ కిం..’’ అన్నారు వినయ విధేయతలతో. అంటే–‘‘హే గురువర్యా! దశరథ మహారాజుగారి కుమారులు, కోసల రాజ్యానికి రాకుమారులు..అనే దృష్టితో మమ్మల్ని చూడకండి. మీ కింకరులం..అంటే మీ సేవకులం.. ఇది చేసి పెట్టు .. అని శాసించండి. అది అలా చెయ్యడం మా జీవితానికి అదృష్టంగా భావిస్తాం.. మీరలా ఆజ్ఞాపిస్తే.. మేము మీ అనుగ్రహానికి పాత్రులయినట్టు లెక్క...’’ అన్నారు. అదీ గురువులపట్ల ఉండాల్సిన గౌరవం, విధేయత... బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు -
చట్టసభల గౌరవం పెంచాలి
సాక్షి, బనశంకరి(కర్ణాటక): మంచి నడవడికతో చట్టసభల గౌరవం పెంచాల్సిన బాధ్యత ప్రజాప్రతినిధులపైనే ఉందని లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా అన్నారు. ఆయన శనివారం బెంగళూరులో విధానసౌధలో మీడియా సమావేశంలో మాట్లాడారు. సభా గౌరవం పెంచడంలో ప్రజాప్రతినిధుల పాత్ర అపారమైనదన్నారు. ఏదైనా చట్టం తీసుకువచ్చే బాధ్యత ప్రభుత్వనిదే. స్పీకర్ దీనిపై చర్చ జరిగేలా చూసుకోవాలి అని చెప్పారు. తరచూ చట్టసభల్లో గందరగోళ పరిస్థితులు ఏర్పడటం పట్ల స్పీకర్ స్పందిస్తూ సభను సజావుగా నడిపించే బాధ్యత సభాపతిదేనన్నారు. పార్టీ ఫిరాయింపుల చట్టంపై నివేదిక.. పార్టీ ఫిరాయింపుల నిషేధ చట్టానికి సంబంధించి రాజస్థాన్ అసెంబ్లీ స్పీకర్ సీపీ జోషి నేతృత్వంలోని కమిటీ నివేదిక అందజేసిందని, దీనిపై ఈ నెల 26 నుంచి 28 వరకు సిమ్లాలో జరిగే సమ్మేళనంలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని స్పీకర్ ఓం బిర్లా తెలిపారు. ఈ నివేదికను కేంద్ర ప్రభుత్వానికి అందజేస్తామని తెలిపారు. స్పీకర్ పరిధి, నిబంధనల్లో స్పష్టత, ఏ కాల పరిమితిలోగా చర్యలు తీసుకోవాలనేదానిపై ఇందులో నియమావళి ఉంటుందని చెప్పారు. చదవండి: న్యాయమూర్తులకు నైతికతే కీలకం -
రాజకీయాల్లో లోపిస్తున్న గౌరవ మర్యాదలు
భారత ప్రజాస్వామ్య వ్యవస్థలో రాజకీయ నాయకులు పోషించాల్సిన పాత్ర బహుముఖమైనదనే విషయాన్ని ఇటీవల చాలామంది నాయకులు మరచిపోవడం బాధాకరం. నాయకులు హుందాగా నడచుకోవాల్సిన అవసరం ఎంతైనా వున్నది. కానీ క్రమేపీ రాజకీయాల్లో మర్యాదలనేవి మంట గలుస్తు న్నాయి. దీనికి కారణం ఒకరా, ఇద్దరా, ఒక పార్టీవారా, అన్ని పార్టీలవారా అంటే జవాబు దొరకని ప్రశ్నగానే మిగిలి పోతుంది. ‘తిలా పాపం, తలా పిడికెడు’. ఇటీవల ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్యనాయుడు ఒక సమావేశంలో రాజకీయాల్లో సభ్యత, మర్యాద, మన్నన అనేవి మూడు ప్రధానమైన సూత్రాలనీ; వీటికి కట్టుబడి రాజకీయాలు సాగిస్తేనే అవి అర్థవంతంగా, క్రియాశీలకంగా సాగుతాయనీ అన్నారు. కానీ కొందరు నాయకులు బహి రంగంగా మాట్లాడేటప్పుడు, అందునా వారికంటే ఎన్నో రెట్లు ఎక్కువ గౌరవ ప్రదమైన తమ ప్రత్యర్థుల ప్రస్తావన తెచ్చినప్పుడు కూడా అసభ్యకరమైన పదజాలాన్ని అల వోకగా ఉపయోగిస్తు న్నారు. ఈ ధోరణి అన్ని రాష్ట్రాల్లో ఉన్నప్పటికీ తెలంగాణలో ఈమధ్య ఎక్కువ మోతాదులో కనిపిస్తున్నది. మొన్న–మొన్న దుబ్బాకలో, తదనంతరం గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికల సమయంలో, అవి ముగిసిన తరువాతా ఒక జాతీయపార్టీ అధ్యక్షుడైన వ్యక్తి, రాష్ట్ర ముఖ్య మంత్రి మీద అనునిత్యం విషం కక్కుతున్నారు. వారి కుటుంబ సభ్యులపై కూడా తిట్లు, శాపనార్థాలతో దాడి చేశారు. ఒక జాతీయ పార్టీ రాష్ట్ర నాయకుడెవరూ గతంలో ఇలా వ్యవహరించిన దాఖలాలు లేవు. ప్రత్యర్థిని మాటల తూటాలతో, వాగ్బాణాలతో మట్టి కరిపించవచ్చు. రాజకీయ వ్యూహాలకు పదును పెట్టవచ్చు. కానీ బురద జల్లడం దుర దృష్టకరం. ఇలాంటి నాయకులు చరిత్ర నుండి గుణపాఠాలు నేర్చుకోవాల్సిన అవసరం ఎంతైనా వున్నది. 1977లో ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ ఎత్తేసిన తర్వాత, కేంద్రంలో మొట్టమొదటి కాంగ్రెసేతర ప్రభుత్వం ఏర్పడిన కొత్తల్లో, అప్పటి కేంద్ర పరిశ్రమల శాఖ మంత్రి జార్జి ఫెర్నాండెజ్ హైదరాబాద్‌లో పర్యటించి, ముషీరాబాద్, ఆర్టీసీ క్రాస్‌రోడ్ వద్ద జరిగిన సభల్లో ప్రసంగించారు. ఆ సందర్భంలో ఇందిరాగాంధీని ‘నిరంతర అబద్ధాలకోరు’ అని విమర్శించారు. ఇది ప్రధానమంత్రిగా ఉన్న మొరార్జీ దేశాయ్‌కు నిమిషాల్లో వేగుల ద్వారా తెలిసింది. దీంతో ఫెర్నాండెజ్‌ను సుతిమెత్తగా మందలించారు. ఇలాంటి మాటల వల్ల మాజీ ప్రధానిగా ఇందిరాగాంధీ గొప్పతనాన్ని, సుదీర్ఘ రాజకీయ అనుభవాన్ని తక్కువ చేసి మాట్లాడినట్లు అవుతుందని చెప్పారు. ‘నిరంతర అబద్ధాలకోరు’ బదులుగా ‘ఇందిరాగాంధీ చాలా అరుదుగా నిజాలు మాట్లాడతారు’ అని సభ్యతగా అంటే బాగుంటుందని సలహా ఇచ్చారు. ఈ విషయం పత్రికల్లో ప్రముఖంగా వచ్చింది. ఆ రోజుల్లో రాజ కీయాలంటే అలా ఉండేవి. గతేడాది మనదేశంలో కరోనా మొదలైనప్పుడు ప్రజలు సంఘటితమై దాన్ని ఎదుర్కోవాలని, సంఘటిత శక్తిని ప్రద ర్శించడానికి కొవ్వొత్తులు వెలిగించాలని, పళ్లాలు గరిటెలు పట్టుకొని చప్పుళ్లు చేస్తూ సంఘీభావం ప్రకటించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. దీంతో ఆయన్ను కొందరు ప్రతిపక్ష నాయకులు ఎగతాళి చేశారు. ఆ సందర్భంలో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు దేశ ప్రధా నిని అలా విమర్శించడం ఎవరికీ తగదని హితవు పలికారు. ప్రధానిని అపహాస్యం చేసిన వారిపై కేసులు నమోదు చేయాలని కూడా డీజీపీని కోరారు. ఇప్పుడు తెలంగాణలో ప్రతిపక్షం అంటే, అధికారంలో ఉన్న పక్షాన్ని అందరికంటే ఎక్కువగా తిట్లుతిట్టే స్థాయికి దిగజార్చారు జాతీయ పార్టీల్లోని కొందరు నాయకులు. అధికార పార్టీపై సహజంగా ఉండే కొద్దిపాటి వ్యతిరేకతను చూసి, అదే తమ బలం అనుకుంటున్నారు. తాము ముఖ్య మంత్రిని ఇలా తిడుతుండబట్టే ప్రజలు బ్రహ్మరథం పడు తున్నారని అనుకుంటున్నారు. ఇది వారి అవివేకం. అయితే, ఈయన వాడుతున్న భాష అదే పార్టీలోని మిగతా నాయ కులను ఇబ్బంది పెడుతున్నది. అతడు ఏమాట జారినా, మీడియాకు పార్టీలోని వారంతా ఏం సంజాయిషీ ఇచ్చుకునే పరిస్థితి వస్తుందో అనే సంశయం వారిలో నెలకొంది. అదే సమయంలో ఆ జాతీయపార్టీ అధినాయ కత్వం కూడా ఇలా అనైతికంగా మాట్లాడుతున్న వ్యక్తిని నిశ్శబ్దంగా చూస్తుం డటం దురదృష్టకరం. గతంలో పీవీ నరసింహారావు ప్రధానిగా ఉన్నపుడు, ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న అటల్ బిహారీ వాజ్‌పేయి అను నిత్యం విమర్శించేవారు. కానీ, ఐక్యరాజ్య సమితిలో కశ్మీర్ సమస్యపై మాట్లాడేందుకు దేశ ప్రతినిధిగా వాజ్‌పేయినే నియమించి ఇదీ పీవీ ఠీవీ అని అందరూ ఆశ్చర్యపోయేలా చేశారు పీవీ. నెహ్రూ ప్రభుత్వాన్ని కూడా ప్రతిపక్ష పార్ల మెంట్ సభ్యుడిగా వాజ్‌పేయి విమర్శిస్తూనే ఉండేవారు. కానీ జనతా ప్రభుత్వం హయాంలో నెహ్రూ చిత్రపటాన్ని విదేశాంగ మంత్రిత్వశాఖ కార్యాలయం నుంచి తొలగిస్తున్న పుడు, వాజ్‌పేయి అభ్యంతరం వ్యక్తం చేసి, ఆ చిత్రపటాన్ని మళ్లీ అదేచోట పెట్టించారు. అప్పటి నాయకుల్లో పరస్పర గౌరవం అలా ఉండేది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసన సభలో, వావిలాల గోపాలకృష్ణయ్య లాంటి వారున్నప్పటి కాలంలో ట్రెజరీ బెంచీలకు చెందిన మంత్రులు, విప్‌లు ప్రతిపక్ష నాయకుల దగ్గరికి వెళ్లి వారడిగిన ప్రశ్నలకు ఎలాంటి సమాధానమిస్తే ప్రజోపయోగకరంగా వుంటుందో చర్చించిన సందర్భాలు వున్నాయి. ఈ రోజుల్లో అధికార పార్టీ ప్రయత్నించినా, ప్రతిపక్షం సరైన స్ఫూర్తితో స్పంది స్తుందా అన్నది సందేహమే. ఒక రాజకీయ పార్టీ అస్తిత్వం దాన్ని నడిపే నాయ కత్వం, వారు పనిచేసే విధానంపైనే ఆధారపడి ఉంటుంది. దుర్భాష వినడానికి వినోదంగా అనిపిస్తుందేమో గానీ, అందులో ప్రజా ప్రయోజనం ఉండదు. ప్రత్యర్థులు అనుసరి స్తున్న విధానాలపైగానీ, ప్రజా సమస్యలపైగానీ విమర్శిం చవచ్చు. కానీ, తిట్టడం, శరీరాకృతిని అవహేళన చేయడం ప్రజా జీవితంలో ఉండే నాయకులు ఏనాడూ చేయకూడదు. తొండి మాటలు, తిట్ల పురాణాలు తాత్కాలికంగా విజ యంగా కనిపించినా, మన స్థాయిని దిగజార్చి, మనల్ని శాశ్వతంగా భూస్థాపితం చేస్తాయనే విషయాన్ని వారు ఎంత త్వరగా గ్రహిస్తే అంత మంచిది. ఇంతవరకు ఎవరూ వాడని భాషను తాత్కాలికంగా ప్రజలు ఆసక్తిగా గమనిస్తారే తప్ప, ఆ భాష మాట్లాడిన వ్యక్తిని మాత్రం అభిమానించరు. దీర్ఘ కాలంలో వారిని ప్రజా నాయకుడిగా కూడా అంగీకరించరు. -వనం జ్వాలా నరసింహారావు వ్యాసకర్త తెలంగాణ ముఖ్యమంత్రి ప్రధాన ప్రజాసంబంధాల అధికారి -
'21 రోజుల్లో కరోనాపై విజయం సాధించాలి'
న్యూఢిల్లీ: కరోనాపై పోరాటంలో అగ్రభాగంలో ఉన్న వైద్యులు, ఎయిర్‌లైన్స్ సిబ్బందితో అమర్యాదకరంగా ప్రవర్తించే వారిపై కఠిన చర్యలు తప్పవని ప్రధాని నరేంద్ర మోదీ హెచ్చరించారు. సంక్షోభ పరిస్థితుల నుంచి గట్టెక్కించేందుకు శ్రమిస్తున్న యంత్రాంగానికి పౌరులంతా సహకరించాలని విజ్ఞప్తి చేశారు. కరోనా సోకుతుందనే భయంతో కొన్నిచోట్ల ఎయిర్‌లైన్స్, వైద్య సిబ్బందిని ప్రజలు వివక్షకు గురి చేయటంపై ఆయన స్పందించారు. భారత యుద్ధం 18 రోజులే సాగిందని, కరోనాపై మన సంగ్రామం మాత్రం 21 రోజులు కొనసాగుతుందని చెప్పారు. పార్లమెంట్‌కు తాను ప్రాతినిధ్యం వహిస్తున్న వారణాసి నియోజకవర్గ ప్రజలతో ప్రధాని బుధవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. ఈ సందర్భంగా పలు అంశాలను ప్రస్తావించిన ప్రధాని ఇబ్బందులు ఉండటం నిజమేనని, అంతా బాగుందని చెప్పడమంటే ఆత్మ వంచనే అవుతుందని వ్యాఖ్యానించారు. వైద్యులు, ఎయిర్‌లైన్స్ సిబ్బంది పట్ల కొందరు అమర్యాదగా వ్యవహరిస్తున్నట్లు వచ్చిన వార్తలు తనకు బాధ కలిగించాయన్నారు. దీనిపై కఠిన చర్యలు తీసుకోవాలని హోంశాఖ, డీజీపీలను ఆదేశించినట్లు చెప్పారు. విపత్కర సమయంలో సేవలందిస్తున్న వైద్యులు, నర్సులను లక్ష్యంగా చేసుకునే వారిని ఉపేక్షించబోమన్నారు. తెల్ల కోటు ధరించే వైద్యులు, నర్సులు దేవతల లాంటి వారని ప్రధాని పేర్కొన్నారు. ఇలాంటి వారిపట్ల అమర్యాదకరంగా ప్రవర్తించేవారిని ప్రజలు కూడా అడ్డుకోవాలని పిలుపునిచ్చారు. ఈ యుద్ధంలో ప్రజలే సారథులు.. ‘కొన్ని చోట్ల సరైన సదుపాయాలు లేకపోవడం, నిర్లక్ష్యం వల్ల స్వల్ప సంఘటనలు జరిగి ఉండవచ్చు. కానీ వీటిపైనే దృష్టి పెట్టి ప్రచారం చేయడం, కొన్ని రంగాలను నిరుత్సాహపరచడం ఈ సమయంలో మంచిది కాదు. నిరాశావాదాన్ని వ్యాప్తి చేసేందుకు వెయ్యి కారణాలు ఉండొచ్చు. వారంతా తప్పు చేస్తున్నారని నేను చెప్పట్లేదు. కానీ ఆశావాదం, విశ్వాసంపైనే జీవితం కొనసాగుతుంది’అని ప్రధాని వ్యాఖ్యానించారు. కఠిన పరిస్థితుల్లో సేవలందిస్తున్న వైద్యులు, పోలీస్ సిబ్బంది, ఇతరులకు అండగా నిలుద్దామని పిలుపునిచ్చారు. మూఢనమ్మకాలు, పుకార్లు, స్వీయ వైద్యాన్ని విడనాడాలని సూచించారు. భయంకరమైన ఈ యుద్ధంలో విజయం సాధించాలంటే సామాజిక దూరాన్ని పాటించడమే మార్గమని ప్రధాని స్పష్టం చేశారు. ‘చారిత్రక మహాభారత యుద్ధాన్ని 18 రోజుల్లో గెలిచారు. కరోనాపై 21 రోజుల్లో విజయం సాధించాలని మనం సంకల్పించాం’అని చెప్పారు. నాడు శ్రీకృష్ణుడు రథ సారథిగా ఉన్నారని, ఇప్పుడు ఈ యుద్ధంలో 130 కోట్ల మంది ప్రజలూ సారథులేనని ప్రధాని పేర్కొన్నారు. నేడు జీ–20 దేశాల సదస్సు వైరస్ కట్టడిపై చర్చించేందుకు గురువారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరగనున్న జీ–20 దేశాల సదస్సు కోసం ఎదురు చూస్తున్నట్లు మోదీ తెలిపారు. కోవిడ్ అరికట్టడంలో జీ–20 దేశాలు అంతర్జాతీయంగా కీలక పాత్ర పోషించాల్సి ఉందన్నారు. వాట్సాప్‌తో హెల్ప్‌డెస్క్ నవరాత్రుల ప్రారంభానికి గుర్తుగా అందరూ తొమ్మిది పేద కుటుంబాల సంరక్షణ బాధ్యతలు చేపట్టాలని మోదీ కోరారు. వైరస్‌ను ఓడించడంలో కరుణ చూపడం ఓ భాగమేనన్నారు. ‘ఇబ్బందులు 21 రోజులు మాత్రమే ఉంటాయి. కానీ కరోనా సంక్షోభం ముగియలేదు. వైరస్ వ్యాప్తి ఆగలేదు. అది కలగజేసే నష్టాన్ని ఊహించలేం’అని పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా లక్ష మందికిపైగా కోవిడ్–19 బాధితులు కోలుకున్నారని తెలిపారు. ‘ఈ మహమ్మారికి పేద, ధనిక, కులమతాలు, ప్రాంతాలనే తేడా లేదు. ఆరోగ్యంపై ఎంతో జాగ్రత్తలు తీసుకునే వారికి సైతం సోకుతోంది. సామాజిక దూరం పాటించడమే దీనికి విరుగుడు. ప్రజలు ఓర్పు వహించి మార్గదర్శకాలను అనుసరించాలి. వాట్సాప్‌తో కలసి సహాయ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నాం. 90131 51515 నంబర్లో సంప్రదించడం ద్వారా మార్గదర్శకాలను తెలుసుకోవచ్చు’అని ప్రధాని పేర్కొన్నారు. కాశీ నగరం ఓర్పు, సమన్వయం, శాంతి, సహనం, సేవాభావంతో దేశానికి దారి చూపుతుందని భావిస్తున్నట్లు చెప్పారు. -
భారతీయ రైతుకు అరుదైన గౌరవం
కెనడాలో వ్యవసాయ రంగంలో చేసిన విశేష కృషికిగాను భారతీయ రైతుకు కెనడాలో అరుదైన గౌరవం దక్కింది. అక్కడి ‘కెనడియన్ అగ్రికల్చరల్ హాల్ ఆఫ్ ఫేమ్ (సీఏహెచ్ఎఫ్ఏ)’ లో రైతు పీటర్ పావిటర్ ధిల్లాన్ పేరును చేర్చారు. వ్యవసాయ రంగంలో విశిష్ట సేవలు చేసిన వారి పేరును సీఏహెచ్ఎఫ్ఏలో చేర్చి వారి విజయాలను ఆ సంస్థ ప్రచారం చేస్తుంది. కెనడాలోనే అత్యధిక క్రాన్బెర్రీ పంటను పండించినందుకుగాను ధిల్లాన్‌ను సంస్థ ఇలా గౌరవించింది. పంజా బ్, హోషియార్‌పూర్‌లోని పాండోరి గ్రామం నుంచి 1950లో ధిల్లాన్ తండ్రి రాచ్పాల్ సింగ్ ధిల్లాన్ కెనడాకి వచ్చారు. 19 ఏళ్ళ వయస్సులోనే రాయల్ కెనడియన్ మౌంటెడ్ పోలీస్‌లో చేరిన తొలి ఇండో కెనడియన్‌గా పీటర్ ధిల్లాన్ గుర్తింపు పొందాడు. అనతి కాలంలో డిప్యూటీ షరిఫ్గా ధిల్లాన్ ఎదిగారు. బ్రిటన్‌లో లా పూర్తిచేశాక ధిల్లాన్ కుటుంబం 1993లో వ్యాపారంలోకి అడుగుపెట్టింది. ప్రస్తుతం ధిల్లాన్ ఏకంగా 2000 ఎకరాల్లో క్రాన్బెర్రీ పండిస్తున్నారు. ప్రపంచంలోనే అత్యధిక క్రాన్బెర్రీ సాగుచేస్తున్నవారిలో ధిల్లాన్ రెండో స్థానంలో ఉన్నారు. రిచ్మండ్, బ్రిటిష్ కొలంబియాల్లో రిచ్బెర్రీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ పేరుతో క్రేన్బెర్రీ ఉత్పాదక పరిశ్ర మను నిర్వహిస్తున్నారు. గత ఏడాదిలో రిచ్బెర్రీ గ్రూప్ రూ.188 కోట్ల విలువైన క్రాన్బెర్రీలను పండించింది. అమెరికా, కెనడా ల్లోని క్రాన్బెర్రీ మార్కెటింగ్ కో–ఆపరేటివ్ ‘ఓషియన్ స్ప్రే’కి «ప్రస్తుతం దిల్లాన్ చైర్మన్. «2014లో తొలిసారిగా దిల్లాన్ ఓషియన్ స్ప్రేకో ఆపరేటివ్ సొసైటీకి శ్వేతజాతీయేతర చైర్మన్‌గా ఎంపికై రికార్డు సృష్టించారు. ఓషియన్ స్ప్రేకి చెందిన 2.5 బిలియన్ డాలర్ల ఖరీదైన ఉత్పత్తులు ప్రతియేటా అమ్ముడవుతున్నాయి. త్వరలో భారత మార్కెట్లోకి అడుగు పెట్టాలన్న యోచనలో ఉన్నారు. -
పురుషాధిక్యమే..!
మహిళలకు గౌరవం అంతంతే సాక్షి, రంగారెడ్డి జిల్లా: సమాజంలో మహిళలకు గౌరవం అంతంత మా త్రంగానే లభిస్తోంది. ఆకాశంలో సగం, అవకాశాల్లో సగమంటూ నినదిస్తున్నా ఇప్పటికీ పురుషాధిక్యమే కొనసాగుతోంది. పురుషులతో సమానంగా తమకు ఎక్కడా గౌరవం దక్క డం లేదని మహిళామణులు అసం తృప్తి వ్యక్తం చేస్తున్నారు. గురువారం అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకుంటున్న నేపథ్యంలో ‘సాక్షి’ సర్వే చేపట్టింది. జిల్లా వ్యాప్తంగా వెయ్యి మంది మగువల అభిప్రాయాలు సేకరించింది. సమాజంలో తమ పట్ల ఇంకా చిన్నచూపే ఉందని, సముచిత గౌరవం మాటలకే పరిమితమైందని 65 శాతం మంది మహిళలు చెప్పారు. అలాగే మహిళల సంక్షేమం కోసం ప్రభుత్వాలు ప్రవేశపెడుతున్న కార్యక్రమాలు, తీసుకుంటున్న చర్యలూ వారి మనసును గెలుచుకోకపోవడం గమనార్హం. మగువలకు పెద్ద పీట వేస్తున్నామన్న ప్రకటనలే తప్ప.. అవి కార్యరూపం దాల్చడదం లేదని 47 శాతం మంది పెదవివిరిచారు. 33 శాతం మహిళలు మాత్రం ఆ విషయంలో సంతృప్తి వ్యక్తంచేశారు. మగువలపై జరుగుతున్న వేధింపులు, దాడులకు కారణం సోషల్ మీడియానేనని తేల్చారు. సుమారు 58 శాతం మంది సోషల్ మీడియా ప్రభావం అధికంగా ఉంటోందన్నారు. పురుషులతో సమానంగా మీకు గౌరవం లభిస్తుందా ?............ లేదు 651 .. అవును 349 మహిళా సంక్షేమానికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు సంతృప్తికరంగా ఉన్నాయా?................ పర్వాలేదు 321 ఉన్నాయి 281 లేదు 398 మహిళలపై వేధింపులు, దాడులకు సోషల్ మీడియానే కారణమని భావిస్తున్నారా?............................ అవును 578 కాదు 422 -
ఇవ్వవలసినంత
మనిషికి ఏం కావాలి? చేతి నిండా డబ్బా? గుప్పెట నిండా అధికారమా? గుండె నిండా ప్రేమా? అన్నీ కావలసిందే. అన్నిటికన్నా గౌరవం.. అది మెయిన్‌గా కావాలనుకుంటాడు మనిషి. గౌరవం దక్కకపోతే, ఆశించినంతగా అందకపోతే విలవిలలాడిపోతాడు. ఎందుకు అంత బాధ కలుగుతుంది? మన మీద మనకు గౌరవం లేక! ఓ సాధువు దగ్గరికి ఒక వ్యక్తి వచ్చాడు. ‘‘నా పేరు గౌరయ్య. నేను గౌరవంగా బతుకుతున్నాను. కానీ నాకెవ్వరూ గౌరవం ఇవ్వడం లేదు’’ అని గోడు వెళ్లబోసుకున్నాడు. ‘‘ఇవ్వడం లేదా? అసలు ఇవ్వడం లేదా?’’ అడిగాడు సాధువు. ‘‘ఇవ్వవలసినంత ఇవ్వడం లేదని నాకు అనిపిస్తోంది’’ అని గౌరయ్య బాధపడ్డాడు. సాధువు అతడికి మెరుస్తూ ఉన్న ఒక ఎర్రటి రాయిని ఇచ్చాడు. ‘‘ఇది విలువైన రాయి. దీని విలువ ఎంతో తెలుసుకునిరా. అమ్మకానికి మాత్రం పెట్టకు’’ అని చెప్పి పంపించాడు. గౌరయ్య మొదట ఓ పండ్లవ్యాపారికి ఆ రాయిని చూపించాడు. ‘‘డజను అరటిపండ్లు ఇస్తాను. రాయిని ఇచ్చి వెళ్లు’ అన్నాడు వ్యాపారి. ‘‘ఇది అమ్మడానికి కాదు’’ అని చెప్పి, దగ్గర్లో సంత జరుగుతుంటే అక్కడికి వెళ్లి రాయిని చూపించాడు గౌరయ్య. ‘‘ఈ రాయికి ఏమొస్తాయి? పోనీ, కిలో ఉల్లిపాయలు తీసుకో’’ అన్నాడు సంత వ్యాపారి. అమ్మడానికి కాదని చెప్పి, అక్కడి నుంచి నగల దుకాణానికి వెళ్లాడు గౌరయ్య. ‘‘ఐదు లక్షలు ఇస్తాను.. ఇస్తావా?’’ అన్నాడు నగల వ్యాపారి! ‘‘అమ్మడానికి కాదు’’ అన్నాడు. ‘‘రెండు కోట్లు ఇస్తాను. ఆ రాయిని ఇచ్చెయి’’ అన్నాడు నగల వ్యాపారి ఈసారి!! గౌరయ్య ఆశ్చర్యపోయాడు. అయినా రాయిని అమ్మలేదు. చివరిగా రాళ్లూ రత్నాలు అమ్మే దుకాణానికి వెళ్లి, తన దగ్గరి రాయిని చూపించి ‘‘విలువెంతుంటుంది?’’ అని అడిగాడు. ఆ దుకాణందారు వెంటనే లేచి నిలబడ్డాడు. ఆ రాయికి రెండు చేతులు జోడించి నమస్కరించాడు. నేలపై శుభ్రమైన మెత్తటి గుడ్డను పరిచి, దాని మధ్యలో రాయిని ఉంచి, రాయికి ప్రణమిల్లాడు. ‘‘ఈ రాయి ఎంతో అమూల్యమైనది. నా జీవితాన్నంతా ధారపోసినా ఈ అమూల్యాన్ని కొనలేను’’ అని, గౌరయ్యకు కూడా ఓ నమస్కారం పెట్టి పంపాడు. సాధువు దగ్గరికి వచ్చి జరిగిందంతా చెప్పాడు గౌరయ్య. సాధువు నవ్వాడు. ‘‘మనకు లభించే గౌరవం, మన గురించి ఎవరికి ఎంత తెలుసో అంతవరకే ఉంటుంది’’ అని గౌరయ్యకు చెప్పాడు. మనలో కూడా ఒక గౌరయ్య ఉంటాడు! తనను అంతా ఒకేలా గౌరవించాలని ఆ గౌరయ్య ఎప్పుడూ అనుకుంటూ ఉంటాడు. ఎక్కడైనా కొద్దిగా గౌరవం తగ్గితే, తనకు ఇవ్వవలసినంత గౌరవం ఇవ్వడం లేదని గుదులుకుంటూ ఉంటాడు. గౌర వాల్లోని హెచ్చుతగ్గులను బట్టి వ్యక్తి గౌరవం పెరగడం, తగ్గడం ఉండదు. ఎవరు ఎన్ని రకాలుగా విలువ కట్టినా.. అన్నిటినీ సమాన విలువగా స్వీకరించే అమూల్యమైన సెల్ఫ్ రెస్పెక్ట్ (సాధువు ఇచ్చిన రాయిలా) మనకు ఉండాలి. అది లేనప్పుడే.. గౌరయ్యలా బయటి నుంచి వచ్చే గౌరవాలను తక్కెట్లో వేసుకుని చూసుకుంటూ ఉంటాం. సెల్ఫ్ రెస్పెక్ట్.. మన లోపలి గురువు. ఆ గురువుకు మనం ఇవ్వవలసినంత ఇవ్వాలి. అప్పుడు మనకు కోరుకున్నంత రాలేదన్న చింత ఉండదు. హ్యాపీ న్యూ ఇయర్. - మాధవ్ శింగరాజు -
వద్దంటే వదిలెయ్యాలి
క్రైమ్ పేరెంటింగ్ వదిలెయ్యకపోతే ఏమవుతుంది? లైఫ్‌లో ఎన్నో వదులుకోవాల్సి వస్తుంది! సంతోషాలను వదులుకోవాల్సి వస్తుంది.. గౌరవాన్ని వదులుకోవాల్సి వస్తుంది.. ఇంట్లో ప్రేమను.. బయట స్నేహాన్నీ వదులుకోవాల్సి వస్తుంది.. ఫుల్‌నెస్‌ను వదులుకోవాల్సి వస్తుంది.. చివరికి ఎంప్టీనెస్లో బతకాల్సి వస్తుంది! నీ ఫీలింగ్స్ తన ఫీలింగ్స్ కానక్కర్లేదు. అంతగా ఫీల్ అవొద్దు. వద్దంటే వదిలెయ్యాలి!! నువ్వు ఆ అమ్మాయిని ఇష్టపడితే... నువ్వంటే ఇష్టంలేదు అన్న ఆ అమ్మాయి అభిప్రాయాన్ని గౌరవించాలి.. ఆమె సంతోషాన్ని కోరుకొని పక్కకు తప్పుకోవాలి. ‘‘న్యూస్ పెట్టరా అజయ్’’ రిమోట్ అంతెత్తున ఎగిరి పడింది! ‘‘నువ్వే పెట్టుకో’’ సూర్య షాక్ తిన్నాడు. ‘‘ఒరేయ్.. ఎక్కడికీ! టిఫిన్ చెయ్యకుండా..’’ ఉప్మా ప్లేటు టేబుల్ మీద గిర్రున తిరిగింది! ‘‘ఇది టిఫినా మమ్మీ.. తినూ తినూ అని ఎందుకు చంపుతావ్?’’ వసంత షాక్ తింది! ‘‘అన్నయ్యా.. నా ఫోన్లో వై–ఫై డిస్కనెక్ట్ అయింది. కొంచెం కనెక్ట్ చెయ్యవా ప్లీజ్?’’పెద్ద సౌండ్‌తో తలుపు ధడేల్మంది.‘‘ఎన్నిసార్లు చెప్పాలి. నా రూమ్‌లోకి రావద్దని. ఫో అవతలికి’’ సౌమ్య షాక్ తింది. అమ్మ, నాన్న, చెల్లి... ఈ ముగ్గురూ షాక్ తిన్నవాళ్లు. అజయ్.. షాక్ ఇచ్చినవాడు! కొత్తగా ఇవ్వడం కాదు.. కొన్నాళ్లుగా వాడికి ఇంట్లోవాళ్ల పొడే గిట్టడం లేదు. మాటకు మందు ‘ఐ నో’ అంటున్నాడు. మాట తర్వాత ‘స్టే అవే’ అంటున్నాడు. ఏమైంది అజయ్‌కి!రాత్రి... భోజనం చేస్తూ కొడుకు తీరునే గమనిస్తున్నాడు సూర్య. టీవీలో ఏ ఒక్క చానల్ మీద కూడా మనసు లగ్నం చేయట్లేదు అజయ్. పదేపదే చానళ్లు మారుస్తున్నాడు. అసలు వాడి దృష్టి టీవీ మీద కూడా లేనట్లుంది. అన్యమనస్కంగా ఉన్నాడు. తినే తిండి మీద కూడా ధ్యాస లేదు. ఎక్కడో మనసు పెట్టి కంచంలో నాలుగు మెతుకులు కతికి లేస్తున్నాడు. వాడి ధోరణికి భార్యాభర్తలు మొహమొహాలు చూసుకోవడం ఎక్కువైపోయింది ఈమధ్య. చీటికి మాటికి కోపం! అజయ్ టీవీ రిమోట్‌ను విసిరేస్తూ అక్కడినుంచి తన బెడ్రూమ్లోకి వెళ్లిపోయాక అతడిని అనుసరించాడు సూర్య. నిజానికి ఆ వంకతో కొడుకుతో మాట్లాడాలనుకున్నాడు సూర్య. ఈ మధ్య అజయ్ ఏదో పోగొట్టుకున్నట్టుగా.. దిగులుగా.. కనిపిస్తున్నాడు. మాట్లాడితే కోపం తెచ్చుకుంటున్నాడు. మొదటినుంచీ కాస్త మొండివాడు. వాడు ఏది కావాలంటే అది కొనివ్వాల్సిందే. కోపమూ ఎక్కువే. కాని కొన్నిరోజులుగా ఆ కోపం మరింత ఎక్కువైంది! ఇంట్లో తల్లి దగ్గర, చెల్లి దగ్గర కూడా అదే ఆవేశాన్ని ప్రదర్శిస్తున్నాడు. ఇప్పుడు తండ్రి రాకను గమనించి కూడా గమనించనట్లే గదిలో లైట్ ఆఫ్ చేసి అటుతిరిగి పడుకున్నాడు అజయ్! అయామ్ ది బెస్ట్ అనే ఫీలింగ్ అజయ్.. బీటెక్ ఫైనలియర్లో ఉన్నాడు. చదువులో చురుకే. ఇంజనీరింగ్‌లో ఫ్రీ సీట్ కూడా సాధించుకున్నాడు. వాళ్లది మధ్యతరగతి కుటుంబం. తండ్రి సంపాదన మీదే అంతా నడుస్తుంది. సర్దుబాట్లతో సాగుతోంది. ఆ సర్దుబాటంటే చిరాకు అజయ్‌కి. దాంతో ముందు అజయ్‌కి అన్ని సమకూర్చాకే మిగతావాటితో మిగిలినవాళ్లు అడ్జస్టవడం అలవాటు చేసుకున్నారు. అందునా మొదటి సంతానం అవడంవల్ల ఇంట్లో అజయ్‌కే ప్రయారిటీ. ఈ ప్రాధాన్యం అజయ్‌లో తనేదో ప్రత్యేకం అనే భావనను పెంచిపోషించింది. ఐయామ్ ది బెస్ట్ ఎమాంగ్ ఆల్.. అనే ఫీలింగ్ జీర్ణించుకుపోయింది అజయ్‌లో. అజయ్ ఇంట్లో లేని ఓ రోజు ‘ఏమైంది అంకుల్... మమ్మల్ని రమ్మన్నారు?’ అజయ్ ఫ్రెండ్ రఘు అడిగాడు. అతనితోపాటు అజయ్ వాళ్లింటికి వచ్చిన మిగిలిన ముగ్గురు స్నేహితులూ ఆయన ఏం చెప్పబోతున్నాడోనని ఊహిస్తూ ఎదురు చూస్తున్నారు. ‘వసంతా... రఘు, దీపక్ వాళ్లు వచ్చారు.. టీలు.. పెట్టిస్తావా..?’ రిక్వెస్టింగ్‌గా అడిగాడు భార్యను సూర్య. అలాగే అంటూ వంటింట్లోంచి హాల్లోకి వచ్చి అజయ్ ఫ్రెండ్స్‌ని పలకరించి టీ పెట్టడానికి మళ్లీ లోపలికి వెళ్లిపోయింది వసంత. భార్య అక్కడ లేదని నిర్ధారించుకున్నాక గొంతు సవరించుకున్నాడు సూర్య. ‘చెప్పండంకుల్..’ అన్నాడు దీపక్. ‘ఏంలేదర్రా.. ఈ మధ్య అజయ్ మరీ మొండిగా బిహేవ్ చేస్తున్నాడు. ఏమైంది? కాలేజ్‌లో బాగానే ఉంటున్నాడా? ఎవరితోనైనా గొడవపడ్డాడా...?’.. కొంత కంగారుగానే అడిగాడు సూర్య. ‘అబ్బే.. అలాంటిదేమీ లేదు అంకుల్’ అని అన్నాడు రఘు.‘ఒరేయ్.. ఇంత దూరం వచ్చాక అసలు విషయం దాచడమెందుకు?’అని ఫ్రెండ్స్‌ని వారించి ‘అంకుల్.. నిజానికి మేమే మిమ్మల్ని కలుద్దామనుకున్నాం.. ఈలోపు మీరే పిలిచారు. మంచిదే అయింది..’ అంటూ జరిగిన విషయం చెప్పడం మొదలుపెట్టాడు జయంత్.‘అంకుల్.. మా క్లాస్మేట్ దివ్యని అజయ్ ఇష్టపడుతున్నాడు. ఆ అమ్మాయి వీడిని ఫ్రెండ్‌లాగే ట్రీట్ చేస్తోంది. మాతో సినిమాలకు వచ్చేది. క్యాంటీన్లో కూర్చుని తినేవాళ్లం.. ఇంకా... లాంగ్ డ్రైవ్స్కీ వచ్చింది. వాడి ప్లేట్లోంచి షేర్ చేసుకునేది.. ఇవన్నీ చూసి అజయ్ ఆమె కూడా తనను ఇష్టపడుతుందేమో అనుకున్నాడు అంకుల్’ అన్నాడు జయంత్. ‘వీడు ఆ అమ్మాయితో చెప్పాడా ఇష్టమని?’ అడిగాడు సూర్య. ‘ఊ... చెప్పాడు అంకుల్’ రఘు సమాధానం. ‘కాని ఆ అమ్మాయి మాత్రం.. నేను నిన్ను అలా చూడలేదు. అందరితో ఉన్నట్టే నీతో ఉన్నా. నిన్ను మంచి ఫ్రెండ్‌లాగే అనుకున్నా.. అసలు లవ్ అన్న థాటే లేదు నాకు. సారీ అజయ్.. ఒకవేళ నీకు నేను అలాంటి ఫీలింగ్ కలిగించి ఉంటే క్షమించు’’అని చెప్పింది. వాడు దాన్ని రిజెక్షన్లా ఫీలవుతున్నాడు. ఇన్సల్ట్ అనుకుంటున్నాడు. ఇది జరిగిన తర్వాత కూడా ఆ అమ్మాయి వాడితో స్నేహంగానే ఉండడానికి ప్రయత్నించింది. కాని వీడే సాధించే పని పెట్టుకున్నాడు. నిజం చెప్పాలంటే ఆ అమ్మాయిని చాలా ఇబ్బంది పెడ్తున్నాడు అంకుల్. నీది తప్పురా.. అని చెప్పినందుకు నాతో సరిగ్గా మాట్లాడట్లేదు!’ పూర్తి చేశాడు జయంత్. ‘బట్. ఆ అమ్మాయి అంత క్లోజ్‌గా మూవ్ కావల్సింది కాదేమో అంకుల్... ’ అన్నాడు దీపక్. ‘ఆ క్లోజ్‌నెస్ చూసి వాడే కాదు, నేనూ ఆమె వీడిని ఇష్టపడుతుందనే అనుకున్నా.. ’ అన్నాడు. ‘ఆగరా.. నువ్వు! అంకుల్.. ఆ పిల్ల అజయ్‌తోనే కాదు. మా అందరితోనూ అంతే క్లోజ్‌గా ఉంది.. నిజంగానే ఓ ఫ్రెండ్‌లాగే ఉంది. ఆ అమ్మాయిదేం తప్పులేదు’ అన్నాడు జయంత్. ‘హూ...’ అంటూ నిట్టూర్చాడు సూర్య. ఈలోపు టీలు తెచ్చిచ్చింది వసంత. అనుకుంటే సరిపోతుందా? బాల్కనీలో కూర్చుని సెల్ఫోన్లో చాట్ చేస్తున్న కొడుకు దగ్గరకు వెళ్లాడు సూర్య. ఒక కుర్చీలో కూర్చొని ఇంకో కుర్చీలో కాళ్లు బార్లా చాపి పెట్టుకున్న అజయ్.. తండ్రిని చూసి కూడా చూడనట్టే సెల్ఫోన్లో మునిగిపోయాడు. ‘‘కాళ్లు తియ్’’ అంటూ కొడుకు కాళ్లను తట్టాడు. ఇక తప్పదన్నట్టుగా కాళ్లు తీసి కింద పెట్టుకున్నాడు అజయ్. ఆ కుర్చీలో కూర్చుంటూ కొడుకు మీద చూపులు నిలిపాడు. ఇబ్బందిగా అనిపించిందేమో.. సర్దుకున్నాడు అజయ్. ‘నీతో మాట్లాడాలి..’ అన్నాడు సూర్య. ‘దేని గురించి?’ కొంచెం నిర్లక్ష్యంతో కూడిన సమాధానమే అజయ్ నుంచి. ఆ వెంటనే, ‘చూడూ... నాకు విషయం తెలిసింది’ అన్నట్టు కళ్లతోనే చెప్తూ.. ‘ఒరేయ్.. అనుకున్నవన్నీ సాధించడం కుదరదు’ అంటూ మొదలు పెట్టాడు. అజయ్ వయసులో సూర్య ‘‘నా పాతికేళ్ల వయసులో.. బిజినెస్ చేద్దామను కున్నా. మా నాన్నని పెట్టుబడి కోసం అయిదువేలు అడిగా. అప్పుడే చెల్లి పెళ్లి ఖాయం అయింది. ఇంట్లో డబ్బూ ఉంది. అయిదువేలు అందులోంచి ఇస్తే.. పెళ్లప్పుడు ఇబ్బంది పడాల్సి వస్తుందేమోనని ‘వీలుకాదు’ అని చెప్పాడు నాన్న . నేను నాన్నపై కోపం పెంచుకోలేదు. ఆయన నిస్సహాయతను అర్థం చేసుకున్నా. నా ఫ్రెండ్‌ని అడిగాను. వాడూ కుదరదనే అన్నాడు. వాడి మీదా కోపం పెంచుకోలేదు. పరిస్థితి తెలుసుకున్నా. ముందు ఏదో ఒక ఉద్యోగం చేసి కొంత డబ్బు పోగేసుకొని వ్యాపారం మొదలుపెట్టాలనుకున్నా. ఉద్యోగం సంపాదించా. అనుకున్నట్లుగానే షేర్స్ బిజినెస్‌లోకి దిగుదామనుకున్నా. కాని అప్పటికి అందులో పెట్టుబడి పెట్టిన నా ఫ్రెండ్స్ అంతా అప్పులపాలయ్యారు. అచ్చిరాదు అనుకొని ఉద్యోగంలోనే కంటిన్యూ అయ్యా. జాబ్‌తో గొప్పగా సంపాదించలేకపోవచ్చు.. కాని నా కుటుంబానికి మూడుపూటలా తిండి, నా పిల్లలకు మంచి చదువు.. నా భార్యకు చిన్నచిన్న ఆనందాలనైతే ఇవ్వగలిగాను. ఆ సంతృప్తిని అయితే సొంతం చేసుకున్నా. ఆ రోజు మా నాన్న మీద, నా ఫ్రెండ్ మీద కసి పెంచుకొని కక్ష్య సాధించి ఉంటే.. ఈ రోజు రత్నాల్లాంటి నా ఈ పిల్లలకు దూరమై ఉండేవాడిని. ఈ ఆనందాన్ని జీవితకాలం మిస్ అయి ఉండే వాడిని’’ అంటూ.. ఆగాడు సూర్య. అజయ్ తదేకంగా తండ్రినే చూస్తున్నాడు. ప్రేమించలేదని సాధించాలా!! ‘‘జీవితం అంటే అంతే.. మనసుపడ్డవన్నీ ఇవ్వదు. దక్కాల్సిందే దక్కుతుంది. దక్కినదాని మీద ప్రేమను పెంచుకోవాలి తప్ప, దక్కనిదానిపై ద్వేషాన్ని ఏర్పరచుకోకూడదు. అయినా నువ్వు ఆ అమ్మాయిని ఇష్టపడితే... నువ్వంటే ఇష్టంలేదు అన్న ఆ అమ్మాయి అభిప్రాయాన్నీ గౌరవించాలి.. ఆమె సంతోషాన్ని కోరుకొని పక్కకు తప్పుకోవాలి. అప్పుడే నీ ఇష్టానికి విలువ.. నువ్వంటే రెస్పెక్ట్ పెరుగుతుంది. వెంటపడి వే«ధించడం ఇష్టం కాదురా.. పైశాచికత్వం. రాక్షసత్వం. ఆ అమ్మాయి మనసులో మనిషిగా మిగులుతావో.. రాక్షసుడిగా ముద్రపడ్తావో.. నీ ఇష్టం!’ అంటూ కొడుకుతో చెప్పి అక్కడి నుంచి కదిలాడు సూర్య. – శరాది -
వేల గొంతుకలు ఒక్కటిగా!
మహిళా లోకం కన్నెర్ర - ఎమ్మెల్యే రోజా పట్ల ప్రభుత్వ తీరుపై సర్వత్రా నిరసన - త్వరలోనే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరిక - చంద్రబాబు బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ కర్నూలు(అర్బన్): ఎక్కడ స్త్రీలు గౌరవింపబడతారో, అక్కడ దేవతలు కొలువై ఉంటారనేది శాస్త్రం. అయితే మన రాష్ట్రంలో మాత్రం స్త్రీలకు కనీస గౌరవం కూడా దక్కడం లేదనేందుకు ఎమ్మెల్యే ఆర్కే రోజా పట్ల ప్రభుత్వం వ్యవహరించిన తీరు అద్దం పడుతోంది. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న మహిళా పార్లమెంటేరియన్ల సాధికార సదస్సుకు రోజాను ప్రభుత్వమే ఆహ్వానించి అవమానించిన ఘటనపై నారీ లోకం ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఓ ఫ్యాక్షనిస్టు, టెర్రరిస్టును అరెస్ట్ చేసిన విధంగా సదస్సు జరిగే ప్రాంగణంలోకి అడుగు పెడుతున్న ఆమెను పోలీసులు అదుపులోకి తీసుకొని ఎక్కడికి తీసుకెళ్తున్నారో కూడా చెప్పకుండా హైదరాబాద్‌కు తరలించడం భావ స్వేచ్ఛను హరించడమేనని మహిళలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మహిళలకు రక్షణ కరువైందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. చాలీచాలని జీతాలతో కడుపులు ఎలా నింపుకోవాలని అంగన్వాడీ కార్యకకర్తలు ధర్నాలు చేస్తే మహిళలనే కనీస విచక్షణ లేకుండా పోలీసులు లాఠీ ఝలిపించి పలువురిని గాయపరిచన ఘటన గతంలో కర్నూలులో చోటు చేసుకుంది. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళలపై దాడులు అనేకం చోటు చేసుకుంటున్నాయని, అడ్డుకోవాల్సిన పోలీసులే ప్రేక్షక పాత్ర వహించడంతో దాడులు పునరావృతం అవుతున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. మహిళల హక్కులను కాల రాస్తున్నారు చంద్రబాబు రాష్ట్రంలో మహిళల హక్కులను కాల రాస్తున్నారు. మహిళా పార్లమెంటేరియన్ల సదస్సుకు ఎమ్మెల్యే రోజాను ఆహ్వానించి, అవమానించడం దారుణం. మహిళా సాధికార సదస్సులో ఎవరి భావాలను వారు వ్యక్తపరిచే హక్కు ఉంది. రోజాను అనధికారికంగా అరెస్ట్ చేసి హైదరాబాద్‌కు తీసుకురావడంలో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. స్పీకర్ కోడెల శివప్రసాద్, ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రోద్బలంతోనే ఇదంతా జరిగింది. – శౌరీలు విజయకుమారి, వైఎస్సార్సీపీ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు చంద్రబాబు క్షమాపణ చెప్పాలి ఒక మహిళ అని చూడకుండా ఎమ్మెల్యే రోజా పట్ల ప్రభుత్వం, పోలీసులు వ్యవహరించిన తీరు పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు బేషరతుగా రాష్ట్రంలోని మహిళలందరికి క్షమాపణ చెప్పాలి. రోజా పేరు వింటే చంద్రబాబుకు భయం పట్టుకుంది. వేదికపై మహిళా నేతల ఫొటోలు మచ్చుకైనా కనిపించకపోవడం పురుషాహంకార సమాజానికి నిదర్శనం. – పట్నం రాజేశ్వరి, మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు పోలీసులు పచ్చ చొక్కాలు వేసుకుంటే సరి రాష్ట్రంలో మహిళలను అవమానించడం చంద్రబాబు ప్రభుత్వానికి కొత్తేమి కాదు. అధికారంలో ఉన్నామనే అహంతో తాము ఏమి చేసినా చెల్లుతుందనుకోవడం భ్రమ. జాతీయ సదస్సుకు ఇతర రాష్ట్రాలు, దేశాల నుంచి అతిథులను ఆహ్వానించిన ప్రభుత్వం మన రాష్ట్రానికి చెందిన మహిళా ప్రజా ప్రతినిధిని అవమానించడం క్షమించరాని విషయం. జరిగిన ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి. – అలివేలమ్మ, ఐద్వా జిల్లా కార్యదర్శి మహిళలు తిరగబడే రోజు వస్తుంది ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తీరు పట్ల మహిళలు తిరగబడే రోజు దగ్గర్లోనే ఉంది. ఒక మహిళా ఎమ్మెల్యేకే రక్షణ కరువైతే సామాన్యుల పరిస్థితి ఏంటి? మహిళలకు సంబంధించిన సదస్సుకు హాజరవుతున్న ఎమ్మెల్యే ఆర్కే రోజా తమ ప్రభుత్వ బండారాన్ని ఎక్కడ బయట పెడుతుందోననే భయంతోనే చంద్రబాబు పోలీసులను ఉసిగొలిపి అనధికారికంగా అరెస్ట్ చేయించారు. ఒక్క గొంతు నొక్కినంత మాత్రానా వాస్తవం ప్రజల్లోకి పోకుండా అడ్డుకోలేరు. - నాగేశమ్మ, ఏపీ మహిళా సంఘం జిల్లా కార్యదర్శి -
జీవితాన్ని కూచిపూడికి త్యాగం చేసిన ఫ్యామిలీ
-
మూగబోయిన టీ నగర్
చెన్నై: ముఖ్యమంత్రి జయలిలత మృతితో చెన్నైలోని ప్రధాన బిజినెస్ సెంటర్లు మూగబోయాయి. ముఖ్యంగా చెన్నైలో ప్రధాన షాపింగ్ కేంద్రంగా ప్రసిద్ది చెందిన టీ నగర్ లో వ్యాపార కార్యకలాపాలు పూర్తిగా నిలిపివేశారు.వీటితోపాటు ఉస్మాన్ రోడ్, పాండీ బజార్ సహా రంగనాధన్ వీధి లో అన్ని దుకాణాలను తమ అభిమాన ముఖ్యమంత్రి, ప్రియతమ అమ్మ మృతిపట్ల గౌరవ సూచకంగా మూసివేశారు. దీంతో కొనుగోలుదారులతో ఎంతో రద్దీగా ఉండే పలు ప్రాంతాల్లో తీరని విషాదంతో నిశ్శబ్దం అలుముకుంది.ఎపుడూ ఆటోరిక్షాలు, కార్లు, ద్విచక్రవాహనాలు సందడి ఉండే పలువాణిజ్య కూడళ్లు నిర్మానుష్యంగా మారిపోయాయ. ఈ ప్రాంతంలో పరిస్థితిని పర్యవేక్షించడానికి ఉద్దేశించిన కొన్ని పోలీసు వాహనాలు మాత్రం దర్శనమిస్తున్నాయి కాగా తీవ్ర అనారోగ్యం సోమవారం తుదిశ్వాస విడిచిన తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత పార్ధివ దేహానికి పూర్తి అధికార లాంఛనాలతో ఈ సాయంత్రం 4.30 ని.లకు అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ఆమెకు తుది నివాళులర్పించేందకు గాను దేశ ప్రధాని నరేంద్ర మోదీ ఇప్పటికే చెన్నైలోని రాజాజీకి భవనకు చేరుకుని నివాళులర్పించారు. అలాగే పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్రమంత్రులు, ఇతర రాజకీయ ప్రముఖులు కూడా హాజరు కానున్నారు. -
పోగొట్టుకున్న ఆస్తి
సంపాదించుకోవడానికి ఎన్నో ఉన్నాయి. ఆస్తి, గౌరవం, హోదా, పరపతి... ఇవన్నీ అలాగే పోగొట్టుకోవచ్చు కూడా! మరి, సంపాదించి... పోగొట్టుకోనిది ఏదైనా ఉందా? ఉంది... దాన్నే ‘బంధం’ అంటారు. కట్టుకున్నవారితో బంధం... కన్నవారితో బంధంలో... అనుబంధం లేకపోతే? అన్నీ ఉండీ ఏమీ లేనట్టే! అన్నింటి కన్నా గొప్ప ఆస్తి పోగొట్టుకున్నట్టే!! పరంధామయ్య పొయ్యి మీద పాలు మరగపెడుతున్నాడు. గిన్నె చేజారి, కాళ్ల మీద పడింది. చర్మం కాలి, బొబ్బలు వచ్చేశాయి. విపరీతమైన మంట, నొప్పితో విలవిల్లాడిపోయాడు. కుంటుకుంటూ వెళ్లి మంచమ్మీద జారిగిలబడ్డాడు. భార్య సుశీల గుర్తుకు వచ్చింది. ‘తను చనిపోయి ఐదేళ్లు అవుతోంది. డెబ్భై ఏళ్ల వయసులో ఒక్కణ్ణే అయిపోయాను. ఇంత ఇంట్లో పిలిస్తే పలకడానికి కూడా ఎవరూ లేరు’ అనుకుంటుండగా బయట ఏవో పెద్ద పెద్ద అరుపులు వినిపించాయి. కుంటుకుంటూనే మెల్లగా బయటకు వచ్చాడు. వాళ్లను చూడగానే గుండెలో ఏదో గుబులుగా అనిపించింది. వాళ్లు తన కొడుకులు రమేష్, సురేష్. భయపెట్టే బంధాలు రమేష్ లోపలికి వస్తూనే ‘ఏంటీ, ఇంటి కొనుగోలుకు మనిషిని పంపిస్తే నీ ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడావంట.’ దబాయిస్తున్న కొడుకు వైపు విస్మయంగా చూశాడు. ‘నా ముందు నిల్చోవడానికి కూడా భయపడేవాడు, వీడేనా ఇన్ని మాటలు అంటోంది..’ అనుకుంటూ నిల్చోలేక అక్కడే ఉన్న కుర్చీలో కూలబడ్డాడు. ‘ఈ ఇల్లేమీ నీ సంపాదన కాదుగా? ఆల్రెడీ వాడికి డబ్బు ఇచ్చేశావు. ఈ ఇంటిని నాకే ఇవ్వాలి..’ అంటున్న చిన్న కొడుకు సురేష్కేసి నిర్వేదంగా చూశాడు. ‘ఈ ఇల్లు నీ ఒక్కడికే చెందుతుందా? నువ్వొక్కడివేనా ఆయన కొడుకివి’ అంటూ తమ్ముడిపై విరుచుకుపడ్డాడు రమేష్. ఇద్దరూ ఒకరినొకరు తోసుకుంటూ, తిట్టుకుంటూ, కొట్టుకుంటున్నారు. ఊళ్లో నలుగురూ పోగయ్యారు. ‘‘వచ్చేవారమే ఇంటి రిజిస్ట్రేషన్. వచ్చి సంతకాలు పెట్టు’’ అంటూ విసురుగా వెళ్లిపోయాడు రమేష్. చిన్న కొడుకు కూడా వచ్చిన దారి పట్టాడు. పరంధామయ్య స్థితి చూసిన పెద్దమనుషులు ‘‘ఈ వయసులో నీకెందుకయ్యా ఈ కష్టం. ఒక్కడివే ఎన్ని పాట్లని పడతావు. ఇల్లు అమ్మేసి కొడుకుల దగ్గరే ఉండు. చూడు కాళ్లు బొబ్బలెలా వచ్చాయో..!’’ సానుభూతిగా మాట్లాడుతున్న వాళ్లవైపు చూసి, మెల్లగా లోపలికెళ్లిపోయాడు పరంధామయ్య. సంపాదన కోసం కష్టపడ్డ రోజులన్నీ గుర్తొచ్చాయి పరంధామయ్యకు. సంపాదన మైకం భార్య, ఇద్దరు కొడుకులు... ‘బాగా సంపాదించాలి, ఊళ్లో అందరి కన్నా ధనవంతుడి’ని కావాలని కలగన్నాడు. ఉన్న కొద్ది భూమి అమ్మేసి ఆ డబ్బును ఇనుము వ్యాపారంలో పెట్టాడు. రేయింబవళ్లు కష్టపడ్డాడు. రెండేళ్లకే ఉన్న ఇంటిపై మరో ఇల్లు వేశాడు. పిల్లలను పట్నంలో పెట్టి చదివించాడు. ఎప్పుడూ పని ధ్యాసే. పైసకు పైస చేర్చి టౌన్లో ప్లాట్లు కొన్నాడు. భార్య అప్పుడప్పుడు అంటుండేది ‘ఏనాడూ బుక్కెడు తిండి కుదురుగా కూర్చుని తిన్నది లేద’ని. ఆ మాటలు పట్టించుకునేవాడు కాదు. పిల్లలు పెద్దవాళ్లయ్యారు. పెళ్ళిళ్లు అయ్యాయి. ఇద్దరూ వ్యాపారాలే చేస్తున్నారు. ఇద్దరూ పట్నంలో ఉండడం వల్ల ఎప్పుడో చుట్టపుచూపుగా వచ్చిపోయేవాళ్లు. కోడళ్ళిద్దరికీ పడదు. వాళ్లు వచ్చి కూడా నాలుగేళ్లకు పైగా అయింది. ఇక మనవలు, మనవరాళ్లు సరే సరి. భార్య ఐదేళ్ల కిందట చనిపోయింది. అప్పటి నుంచి ఆస్తులు పంచమని కొడుకుల గొడవ. ఈ ఇల్లు ‘అమ్మే ద్దాం..’ అంటున్నాడు రమేష్. ‘ఈ ఇల్లు నాకే కావాలి’ అని వాదిస్తున్నాడు సురేష్. ఇక్కడే అన్నదమ్ములిద్దరికీ పడటం లేదు. కంటి మీద కునుకు లేదు.. బొబ్బలెక్కిన కాళ్లు మండుతున్నాయి. ఇకనైనా తెలుస్తుందా! కళ్లు తెరిచేసరికి తనెక్కడో ఉన్నట్టు అర్థమైంది పరంధామయ్యకు. ఆశ్చర్యంగా చూస్తుంటే ‘అంకుల్! మీకు రెండ్రోజులుగా విపరీతమైన జ్వరం. ఊళ్లో వాళ్లు ఫోన్ చేసి మీ గురించి చెప్పారు. మీ ఇంటి పరిస్థితి తెలుసు కదా! చూసెల్దామని వచ్చాను. మీరు స్పృహలో లేరు. వెంటనే ఇక్కడికి తీసుకొచ్చాను..’ అని వర్ధన్ చెబుతుంటే కళ్లనీళ్లు ఆగలేదు పరంధామయ్యకు. తను సాయపడిన ప్రసాద్ కొడుకు వర్ధన్. ప్రసాద్ చనిపోయి ఆరేళ్లు అయ్యింది. కానీ, అతని కొడుకు తనను మర్చిపోలేదు. ‘నిన్ను చూస్తుంటే మనసు నిండిపోతుందయ్యా. నా కొడుకులు సంపాదించిందంతా పట్టుకుపోయారు. ఇంకా కావాలంటున్నారు. నన్ను ఒంటరివాడిని చేశారు’అంటూ కుమిలిపోతున్న పరంధామయ్యను ఓదార్చాడు వర్ధన్. కర్మ రుణాలు ‘‘ఎక్కడకొచ్చాం’’ ఆ క్లినిక్‌ను చూసి వర్ధన్‌ని అడిగాడు పరంధామయ్య. ‘‘అంకుల్! ఇది గతం గురించి తెలుసుకొని, సాంత్వన చెందే చోటు. మీరు మా నాన్నగారు నిలదొక్కుకోవడానికి సాయపడ్డారు. ఇప్పుడు మీ బాధ పోగొట్టడానికి నేను సాయపడాలనే ఇక్కడకు తీసుకువచ్చాను’’ అంటూ కౌన్సెలర్‌ను పరిచయం చేశాడు వర్ధన్. రిగ్రెషన్ థెరపీ గురించి అంతా తెలుసుకున్న పరంధామయ్య తన బాధల్ని తొలగించమని కోరాడు. కర్మలు పునరావృతం తన గత జీవితాన్ని తనే చేతనత్వంతో దర్శిస్తున్నాడు పరంధామయ్య. థెరపీ మొదలయిన కొద్దిసేపటికి అతని మనోఫలకం మీద ఏవేవో దృశ్యాలు.. వాటి గురించి చెబుతున్నాడు. ఐదేళ్ల క్రితం... ‘నా భార్య సుగుణ చావు బతుకుల్లో ఉంది. తన దగ్గర కాసేపు కూర్చోమంది. అప్పుడే బయట నుంచి ఫోన్ వచ్చింది. వెళ్లక తప్పనిస్థితి. చె య్యి పట్టుకొని ఆపింది. ‘ఎన్నాళ్లు సంపాదనంటూ తిరుగుతావు! ఈ రోజైనా ఉండకూడదా! సంచీ నిండా డబ్బు తెచ్చుకోవాలని చూస్తావు. కానీ, మనసు నిండా ఏం నింపుకోవాలని చూడవా!’ అంటోంది. తను మళ్లీ వస్తానని చెప్పి వచ్చేశాడు. వెళ్లిన అరగంటకే పెద్దోడు ఫోన్ చేశాడు - ‘అమ్మ చనిపోయిందని..’ ‘డబ్బు కోసం ఆశపడి చివరి రోజుల్లో ఉన్న భార్య దగ్గర కాసేపు కూడా కూర్చోలేకపోయాను. ప్రేమగా చూసుకోవాల్సిన భార్యను ఇంటి పనులు చేసే యంత్రంలాగే చూశాను..’ పరంధామయ్య గొంతు దుఃఖంతో పూడుకుపోయింది. కాసేటి తర్వాత ఇంకా ప్రయాణించండి... అని కౌన్సెలర్ సూచనలు అందుకున్నాడు. తనకు ఇంకా వెనక్కి వెళుతున్నాడు.. పాతికేళ్ల వయసు. తండ్రితో తాను గొడవ పడుతున్నాడు. ‘‘భూమి అమ్మడానికి వీల్లేదు’’ అంటున్నాడు తండ్రి. ‘‘అమ్మి తీరాల్సిందే’’ అంటున్నాడు తను. ‘‘అన్నం పెట్టిన నేలయ్యా, దాన్ని అమ్మద్దు. నీకు దండం పెడతా!’’ అని తన కాళ్లు పట్టుకుంటున్నాడుతండ్రి. తను అనరాని మాటలన్నీ అంటున్నాడు తండ్రిని. విసిగిపోయిన ఆయన ‘నీ ఇష్టం’ అన్నాడు. తను భూమిని అమ్మేశాడు. వ్యాపారం మొదలుపెట్టాడు. ఆరు నెలలు తిరక్కుండానే తండ్రి చనిపోయాడు. ముసలోడైపోయాడు అనుకున్నాడు. కానీ, భూమి మీద మమకారంతో చనిపోయాడు తన తండ్రి. పరంధామయ్య గుండెలో నుంచి దుఃఖం ఉబుకుతోంది. తండ్రికి చేసిన అన్యాయం గుర్తుకు వచ్చింది. తండ్రిని క్షమించమని వెక్కుతూనే ప్రాథేయపడ్డాడు పరంధామయ్య. ‘‘ఇంకా వెనక్కి ప్రయాణించండి. మీ ఈ జీవితం నుంచి గత జీవితంలోకి... ’’ అన్నారు కౌన్సెలర్. పరంధామయ్య గతంలోకి ప్రయాణిస్తున్నాడు. ఆ ప్రయాణం.. మెల్ల మెల్లగా ఒక దగ్గరకు చేరుకుంది. ‘ముగ్గురు వ్యక్తులు గొడవపడుతున్నారు. వారిలో తనున్నాడు. ఎవరో పెద్దాయన మోకాళ్లలో తల దాచుకుని ఏడుస్తున్నాడు. అతను తన తండ్రి. ఆస్తుల కోసం గొడవలు. తను ఆ ఇంటికి పెద్ద. కాబట్టి, తనకు ఎక్కువ వాటా కావాలని తమ్ముళ్లతో వాదిస్తున్నాను. వాళ్లెవరో కాదు రమేష్, సురేష్‌లు. అంటే, వాళ్లే ఈ జన్మలో నాకు కొడుకులుగా పుట్టారా? వాళ్లను తను కొడుతున్నాడు. తమను విడదీయడానికి తండ్రి వచ్చాడు. అయినా నేను వినడం లేదు. తను అందరికన్నా ధనవంతుడవ్వాలి. ఈ విషయం అర్థమయ్యాక పరంధామయ్య మనసు పశ్చాత్తాపంతో కుమిలిపోయింది. తనకు డబ్బు మీద ఉన్న కాంక్ష ఎంతటిదో అర్థమైంది. ఆస్తి కోసం తండ్రిని వేధించాను. భార్యను పట్టించుకోలేదు. పిల్లలను దూరం పెట్టాడు. బంధువులను దగ్గరకు రానివ్వలేదు. అందుకే తాను ఒంటరి అయిపోయాడు. ఈ విషయం అర్థమవగానే పరంధామయ్య మనసు తేలికపడింది. తన ధన దాహం బంధాలను ఎలా దూరం చేసిందో అర్థమైంది. ఈ బాధల నుంచి బయటపడడమే కాదు, పిల్లలను దగ్గరకు తీసుకొని, తన ఆస్తి మీరే అని చెప్పాలని నిర్ణయించుకున్నాడు. తనకీ అవకాశాన్ని కల్పించిన వర్ధన్‌కి, కౌన్సెలర్ కృతజ్ఞతలు తెలిపి పిల్లల వద్దకు బయల్దేరాడు పరంధామయ్య. విశ్వమంతా ఒకే న్యాయం ‘ఎలాంటి విత్తనం నాటుతామో అలాంటి మొక్కే వస్తుంది’. ఇది ప్రకృతి చెబుతోంది. ‘ఏదైనా వస్తువు పైకి విసిరేస్తే పైకి వెళ్లదు. అది కిందే పడుతుంది’. ఇది సైన్స్ చెబుతోంది. కర్మలు కూడా అంతే! ఎవరైతే ఈ ప్రక్రియను అర్థం చేసుకుంటారో వారిలో ఆత్మపరిణతి చెంది, కర్మల నుంచి బయటకు వస్తారు. లేదంటే, కర్మల విషవలయంలో తిరుగుతూనే వుంటారు. మన దేశం ‘భగవద్గీత’ ద్వారా ప్రపంచ దేశాలకు కర్మన్యాయ జ్ఞానాన్ని ఇచ్చింది. బుద్ధిజవ్ు సైతం కర్మన్యాయం గురించి వివరించింది. అయితే, మిగతా ప్రపంచ దేశాలు వీటిని ఆధారంగా చేసుకొని శాస్త్రీయ పరిశోధనలు చేస్తూ, పరిష్కారానికి చికిత్సామార్గాన్ని సూచించారు. అదే పాస్ట్‌లైఫ్ రిగ్రెషన్ థెరపీ. 1950 నుంచి జరిగిన ఈ పరిశోధనల విస్తృతి ఇంకా పెరుగుతోంది. తెలుసుకొని వదిలేయడం కాకుండా అవగాహన చేసుకొని ఆచరణలో పెట్టడం ద్వారా పాప కర్మలు తగ్గించుకునే అవకాశం ఉంది. డాక్టర్ బ్రెయిన్ ఎల్ వెయిజ్ అనే అమెరికన్ ైసైకియో థెరపిస్ట్ కర్మన్యాయం మీద పరిశోధనలు జరిపి‘మెనీ లైవ్స్... మెనీ మాస్టర్స్’ అనే పుస్తకం రాశారు. ఇంకా ఎంతో ప్రముఖ మనస్తత్వ నిపుణులు పాపకర్మలు మనిషి జీవితంపై ఎలాంటి ప్రభావాలు చూపుతున్నాయనే అంశాలను గ్రంథస్థం చేశారు. కర్మలకు దూరంగా ఉంటే మానవ జీవనానికి అర్థం ఉండదు. మంచి కర్మలు చేసిన మనిషి సుఖమయ జీవనాన్ని పొందుతాడని అర్థం చేసుకోవాలి. ధృతరాష్ర్టుడి కథలోనూ... కురుక్షేత్ర యుద్ధంలో నూరుగురు కుమారులను కోల్పోయిన ధృతరాష్ట్రుడు ఆవేదనతో కృష్ణుడిని సమీపించి ‘కృష్ణా... కొడుకులను కాపాడుకోలేని నిస్సహాయుడిని ఎందుకయ్యాను?’ అని అడిగాడు. కృష్ణుడు అతనికి జ్ఞాననేత్రం ద్వారా గత జన్మ కర్మలను దర్శించే అవకాశం ధృతరాష్ట్రుడికి కల్పించాడు. ‘కిందటి జన్మలో వేటగాడైన ధృతరాష్ట్రుడు చెట్టు మీదున్న మగపక్షికి బాణం వేశాడు. అది తప్పించుకుంది. అతనికి కోపం వచ్చి, చెట్టుకు నిప్పు పెట్టాడు. చెట్టు పై గూడులో ఆ మగ పక్షి సంతానమైన వంద పక్షులు మంటల్లో కాలిపోయాయి. మంటల ధాటికి మగ పక్షి కళ్లు పోయాయి. దానివల్లే ఈ జన్మలో అంధత్వం ప్రాప్తించింది. కొడుకులు యుద్ధంలో మరణిస్తుంటే నిస్సహాయిడై ఉన్నానని గ్రహించాడు. శిక్షకు శిక్ష తప్పదని అదే కర్మ పాఠం అని గ్రహించాడు. వృద్ధాప్య పాఠం చాలా మంది వృద్ధాప్యంలో ‘తమను ఎవరూ పట్టించుకోరు’ అని బాధపడుతూనో, ‘పిల్లలు తమ మాట ఇంకా వినితీరాలని’ ఆలోచన వల్లనో ప్రశాంతతను కోల్పోతుంటారు. వృద్ధాప్యం అనేది ఒక అందమైన విద్యావిధానం. అన్ని బాధ్యతలూ తీరిపోయి జీవన ప్రయాణంలో పరుగులు తీయడం తగ్గి తమ కోసం తాము జీవించే అవకాశం వృద్ధాప్యం కలిగిస్తుంది. ఈ వయసులో తమ చేతన (ఆత్మ) లక్ష్యం ఏంటి? అని తెలుసుకునే ప్రయత్నం చేయడానికి ఇదో మంచి అవకాశం. మన పూర్వీకులు వృద్ధాప్యంలో అన్ని బంధాల నుంచి విముక్తి పొంది, తమను తాము తెలుసుకోవడానికి వానప్రస్థాశ్రమాన్ని చేరుకునేవారు. ఈ వయసులో బంధుత్వాలకు దగ్గరగా ఉంటూనే బంధాల నుంచి మానసికంగా దూరం అవడం నేర్చుకోవాలి. - నిర్మల చిల్కమర్రి -
సత్వర న్యాయంతోనే గౌరవం
జిల్లా ప్రధాన జడ్జి సీహెచ్.విజయ్‌మోహన్ ఖమ్మం లీగల్ : ఎంతో నమ్మకంతో న్యాయస్థానానికి వచ్చిన వారి కేసులను త్వరితగతిన పరిష్కరించినప్పుడే సమాజంలో వ్యవస్థపై గౌరవం పెరుగుతుందని జిల్లా ప్రధాన జడ్జి సీహెచ్ విజయ్‌మోహన్ అన్నారు. సెప్టెంబర్ 10న నిర్వహించనున్న జాతీయ లోక్ అదాలత్‌ను విజయవంతం చేయడానికి తీసుకోవాల్సిన చర్యలను చర్చించే నిమిత్తం బుధవారం జిల్లా కోర్టులో సమావేశం నిర్వహించగా ఆయన ప్రసంగించారు. క్రిమినల్ కేసుల్లో తగిలిన గాయాలు మానకముందే తీర్పు వెలువడితే నిందితులకు భయం కలిగి బాధితులకు అభయం లభించినట్లు అవుతుందన్నారు. రాజీ పడదగిన క్రిమినల్ కేసులు ఎక్కువగా ఉన్న ప్రస్తుత తరుణంలో సెప్టెంబర్ 10న జరిగే జాతీయ లోక్‌అదాలత్‌ను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. మోటారు ప్రమాద కేసులు, డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులపై ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. కార్యక్రమంలో మొదటి అదనపు జిల్లా జడ్జి డాక్టర్ రాధాకృష్ణ కృపాసాగర్, అదనపు ఎస్పీ సాయికృష్ణ, న్యాయవాద సంఘం అధ్యక్షుడు బండారుపల్లి గంగాధర్, ప్రాసిక్యూటింగ్ ఆఫీసర్ రామారావు మాట్లాడారు. న్యాయమూర్తులు వీఏఎల్ సత్యవతి, ఎం.వెంకటరమణ, మాధవీలత, అమరావతి, గీతారాణి, సతీష్‌కుమార్, ప్రాసిక్యూటర్లు, పోలీస్ అధికారులు పాల్గొన్నారు. -
జానపద కళలను ఆదరించండి
ముగిసిన రాష్ట్ర స్థాయి జానపద నృత్యపోటీలు సత్తుపల్లి : జానపద కళలను అందరు ఆదరించాలని జిల్లా విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సభ్యులు డాక్టర్ మట్టా దయానంద్ విజయ్‌కుమార్ అన్నారు. సత్తుపల్లి బస్టాండ్ ప్రాంగణంలో తెలంగాణ రాష్ట్ర జానపద కళాకారుల సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన రెండు రోజుల రాష్ట్ర స్థాయి జానపద నృత్యాలు, పాటలు, కోలాటం, తాళంభజన పోటీలు మంగళవారం రాత్రి ముగిశాయి. ఈ పోటీలలో విజేతలకు రాషే్ట్రతర తెలుగు సమాఖ్య అధ్యక్షుడు కోడూరు శ్రీనివాస్ బహుమతులు అందించారు. కార్యక్రమంలో తహశీల్దార్ దొడ్డా పుల్లయ్య, జిల్లా ప్రధాన కార్యదర్శి నంధ్యాల నాగేశ్వరరావు, దొడ్డా శ్రీనివాసరెడ్డి, ఈఓ శివరామకృష్ణ, గ్రాండ్ మౌలాలి, చిత్తలూరి ప్రసాద్, రంగపూరి వెంకటేశ్వరరావు, పి.సాయి శ్రీనివాస్, తమ్మిశెట్టి గణేష్, బత్తుల పూర్ణచంద్రరావు, చల్లారి వెంకటేశ్వరరావు, కూసంపూడి అచ్యుతవాణి, పాటిబండ్ల రామకృష్ణ, పెద్దిరాజు, గంగా, మధు పాల్గొన్నారు. పోటీలలో విజేతలు వీరే.. తాళం భజన పోటీలలో అభయాంజనేయ భజనమండలి, సీతారామ భజన మండలి ప్రథమ, ద్వితీయ బహుమతులను అందుకున్నారు. జానపద నృత్య పోటీలలో తల్లాడ బాలవెలుగు పాఠశాల, ఖమ్మం క్రియేటీవ్ గ్రామర్ స్కూల్లు, జానపద పాటల పోటీలలో ఎస్.హుస్సేన్, ఎ.నందు, కోలాటం పోటీలలో మంగాపురం శ్రీలక్ష్మీతిరుపతమ్మ కోలాటబృందం, లంకపల్లి బృందావన కోలాట బృందంలు ప్రథమ, ద్వితీయ బహుమతులను సాధించారు. ఈ పోటీలకు శివనాగులు, సంస్కాృతిక శ్రీకాంత్, శరత్, బాలు న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించారు. -
అతిథి మర్యాదల్లో లోటు రాకూడదు
గుంటూరు రూరల్ ఎస్పీ నారాయణ నాయక్ సాక్షి, గుంటూరు : పుష్కరాలకు వివిధ ప్రాంతాల నుంచి వచ్చే యాత్రికులను అతిథులుగా భావించి వారికి ఎలాంటి ఇబ్బందు లు తలెత్తకుండా సేవలందించాలని గుంటూరు రూరల్ ఎస్పీ నారాయణ నాయక్ కోరారు. గుంటూ రు నగరంలోని పోలీసు కల్యాణ మండపంలో శనివారం వలంటరీ ఫోర్స్ ప్రతినిధులు– పోలీసుల సమన్వయ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా ప్రసంగించారు. ప్రతి పౌరుడు బాధ్యతగల పోలీసుగా వ్యవహరించాలని సూచించారు. యాత్రికులకు దారి చూపడం, ట్రాఫిక్, దేవాలయాలు, ఘాట్లు, పార్కింగ్ స్థలాల్లో పోలీసులకు తోడుగా సేవలు అందించేందుకు వలంటరీ ఫోర్స్‌ను వినియోగించనున్నట్లు తెలిపారు. యాత్రికులతో దురుసుగా ప్రవర్తించకుండా గౌరవ భావంతో పలుకరిస్తూ సేవ చేయాలని సూచించారు. ఎక్కడైనా తోపులాట జరుగుతుందని ముందుగా వలంటీర్లు గుర్తిస్తే దగ్గర్లోని పోలీసు అధికారులకు విషయాన్ని తెలపాలని చెప్పారు. వలంటీర్లకు ప్రత్యేకమైన టీషర్టులు అందిస్తామని, పుష్కరాలు జరిగే 12 రోజుల పాటు పోలీసులతో సమానంగా వారిని గుర్తిస్తామన్నారు. పుష్కరాలు పూర్తయ్యేవరకు చిన్న అవాంఛనీయ సంఘటన కూడా జరగకుండా పోలీసు శాఖ తరఫున అన్ని జాగ్రత్త చర్యలు చేపట్టామని, వలంటీర్లు సహకరిస్తే ఈ మహాయజ్ఞాన్ని ప్రశాంతంగా పూర్తి చేస్తామని తెలిపారు. జిల్లా అదనపు ఎస్పీ రామాంజనేయులు, గుంటూరు అర్బన్ ఎస్బీ డీఎస్పీ నాగేశ్వరరావు, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం కో–ఆర్డినేటర్ డాక్టర్ పాల్‌కుమార్, స్కౌట్స్ అండ్ గైడ్స్ జిల్లా కో–ఆర్డినేటర్ శ్రీనివాసులు, ఎన్సీసీ కమాండర్ శ్రీనివాస్, రెడ్‌క్రాస్ సెక్రటరీ బాబు పాల్గొన్నారు. సమావేశం అనంతరం వలంటీర్లతో కలిసి నగరంలో ర్యాలీ చేపట్టారు. -
భక్తులతో మర్యాదపూర్వకంగా మెలగాలి
ఆర్టీసీ ఆర్ఎం జ్ఞానంగారి శ్రీహరి పట్నంబజారు : కృష్ణా పుష్కరాలకు వచ్చే భక్తులతో మర్యాదపూర్వకంగా మెలగాలని ఏపీఎస్ ఆర్టీసీ ఆర్ఎం జ్ఞానంగారి శ్రీహరి సూచించారు. ఆర్టీసీ బస్టాండ్‌లోని తిక్కన కాన్ఫరెన్స్ హాలులో శనివారం రీజియన్ పరిధిలోని 13 డిపోల మేనేజర్లు, ట్రాఫిక్ ఇన్చార్జిలు, గ్యారేజీ ఇన్చార్జిలు, స్టోర్ సూపర్ వైజర్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. 12 రోజులపాటు జరిగే పుష్కరాల్లో ప్రతి ఒక్కరూ వారి విధులను బాధ్యతగా నిర్వర్తించాలని చెప్పారు. ఇతర రీజియన్ల నుంచి గుంటూరు రీజియన్‌కు 500 బస్సులు వస్తున్నాయని, మూడు వేల మంది అదనపు సిబ్బంది వస్తున్నారని తెలిపారు. అమరావతి, సీతానగరం, తాళాయపాలెం, విజయపురిసౌత్, దైద, సత్రశాల, పొందుగల, పెనుమూడితో పాటు శ్రీశైలానికి ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు వివరించారు. ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చాల్సిన బాధ్యత సిబ్బందిపై ఉందని సూచించారు. సమావేశంలో డిప్యూటీ సీటీఎంలు సీహెచ్ వెంకటేశ్వరరావు, వాణిశ్రీ, సీఎంవోలు శరత్‌బాబు, గంగాధర్, ట్రాఫిక్ అధికారి బెనర్జి, 13 డిపోల మేనేజర్లు, సిబ్బంది పాల్గొన్నారు. -
నేనేంటో నిరూపించుకుంటా!
గ్లామరస్ పాత్రలతో తన గౌరవాన్ని తగ్గించారని తాప్సీ ఆవేదన వ్యక్తం చేశారు. దక్షిణాదిలో తొలుత తెలుగు చిత్ర పరిశ్రమలో పరిచయమై ఆపై తమిళ సినిమాల్లోకి వచ్చిన ఢిల్లీ బ్యూటీ తాప్సీ. ఇక్కడ ఆడుగళం తదితర చిత్రాల్లో నటించినా మంచి గుర్తింపు తెచ్చుకోలేకపోయారు. ఇప్పుడు తమిళంలో అసలు అవకాశాలు లేవు. తెలుగులో ఒక చిత్రం చేస్తున్నారు. అయితే హిందీలో రెండు భారీ చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు. ఈ సందర్భంగా తాప్సీ తన మనోభావాన్ని పంచుకుంటూ తాను నటిగా రంగప్రవేశం చేసినప్పుడు సినీప్రపంచం గురించి ఎక్కువ తెలుసుకోలేకపోయానన్నారు. కథల ఎంపికలోనూ ప్రత్యేక శ్రద్ధ చూపలేదని పేర్కొన్నారు. దీంతో నటనకు ప్రాధాన్యం లేని చిత్రాలు చాలా చేశానని అన్నారు. అందులో చాలా చిత్రాల్లో తనను గ్లామరస్‌గా నటింపజేశారని వాపోయారు. ముఖ్యంగా తెలుగు చిత్రాల్లో అలాంటి అవకాశాలు ఇచ్చారని అన్నారు. తద్వారా తన గౌరవాన్ని తగ్గించి ఎక్కువగా అలాంటి అవకాశాలే ఇచ్చారన్నారు. అందుకే తనలోని నటనా ప్రతిభకు అవకాశం రాలేదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అయితే తాజాగా నటిస్తున్న హిందీ చిత్రాల్లో నటనకు అవకాశం ఉన్న పాత్రలు పోషిస్తున్నట్లు చెప్పారు. ఈ చిత్రాల ద్వారా నటిగా తానేమిటో నిరూపించుకుంటానని అన్నారు. బాలీవుడ్లో ప్రతిభావంతులైన నటీ మణులు చాలా మంది ఉన్నారని, వారితో పోటీ పడడం అంత సులభం కాదని అన్నారు. అయినా తనకంటూ ఒక స్థానాన్ని సంపాదించుకోవడానికి పోరాడతానని బాలీవుడ్లో మంచి నటిగా గుర్తింపు పొందిన తరువాతనే ఇతర భాషా చిత్రాల్లో నటిస్తానని తాప్సీ అంటున్నారు. -
బ్రెగ్జిట్ పై ప్రజా నిర్ణయాన్నిగౌరవిస్తాంః ఒబామా
వాషింగ్టన్ః యూరోపియన్ యూనియన్ నుంచి బ్రిటన్ వైదొలగాలన్న బ్రిటన్ ప్రజల తీర్పును గౌరవిస్తానని అమెరికా అధ్యక్షుడు బారాక్ ఒబామా అన్నారు. బ్రెగ్జిట్ పై స్పందించిన ఒబామా.. ఈ పరిస్థితుల్లో అమెరికాతో బ్రిటన్ కు ఉన్న సంబంధాలపై ఎటువంటి ప్రభావం ఉండదన్నారు. బ్రిటన్ తో ఎప్పట్లాగే సంబంధాలు కొనసాగిస్తామని వివరించారు. బ్రిటన్ ప్రజలు తమ గళాన్ని వినిపించారని, వారి నిర్ణయాన్ని తాము తప్పక గౌరవిస్తామని అమెరికా అధ్యక్షుడు ఒబామా ఓ ప్రకటనలో తెలిపారు. యూరోపియన్ యూనియన్ తో బ్రిటన్ విడిపోయినా, ఆ రెండింటితో అమెరికా సంబంధాలు విడివిడిగా కొనసాగుతాయన్నారు. యూరోపియన్ యూనియన్ నుంచి విడిపోయేందుకు పెట్టిన ఓటింగ్ లో ఎక్కువ మంది బ్రిటన్ ప్రజలు మద్దతు పలకిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రస్తుతం బ్రిటన్ ఈయూతో విడిపోవడం ఖాయమైంది. -
మర్యాదగా మాట్లాడుకుందాం!
ఏపీ జెన్కో ఎండీ పేషీలో కొత్తగా ‘మర్యాదగా మాట్లాడుకుందాం’ అనే బోర్డు వెలిసింది. దీన్ని చూసిన వాళ్లకు అంత అమర్యాదగా ఎవరు మాట్లాడుతున్నారు? అనే అనుమానం కలిగింది. విషయం ఏమిటా అని వాకబు చేస్తే... కొంతమంది తెలుగు తమ్ముళ్లు జెన్కో ఎండీని కలవడానికి వచ్చి నానా యాగీ చేస్తున్నారట! ‘మేం సీఎం మనుషులం. ఎండీ ఏ పనిలో ఉంటే మాకెందుకు? మేం వెంటనే కలవాలి. పంపించండి’ అంటూ బలవంతపెడుతున్నారట. ‘సార్ మీటింగ్‌లో ఉన్నారు... ఆగండి’ అని పేషీ సిబ్బంది చెబితే వారిపై నోటి దురుసుతనం ప్రదర్శిస్తున్నారట. వాళ్లను ఏమీ చేయలేక, వాళ్లు అనే మాటలు భరించలేక.. అధికారులు ఇలా బోర్డు తగిలించారని తెలిసింది. - సాక్షి, హైదరాబాద్ -
జీవ జలాలను గౌరవిద్దాం!
విశ్లేషణ మన దేశంలోని నదుల జాబి తాను ఓసారి చూడండి, చాలా పొడవుగా ఉంటుంది. ప్రతి నదీ ఆ పరివాహక ప్రజలకు ఒక్కొక్క అర్థాన్నిచ్చేదై ఉంటుంది లేదా గంగానదిలాగా సువిశాల మైదాన ప్రాంతాల వ్యవసాయానికి ఆధా రమై ఉంటుంది. చాలా నదులు బంగాళాఖాతంలో, కొన్ని అరేబియా మహాసము ద్రంలో కలుస్తాయి. కాగా కచ్, రాజస్థాన్ వంటి ఉత్తరాది పాక్షిక మెట్ట ప్రాంతాల్లోని నదులు... జీవ ప్రదాతలుగా నదుల పాత్రను నొక్కిచెబుతున్నట్టు అంతర్గతంగానే ప్రవహిస్తాయి. అయినాగానీ, మనం ఏమంత ఫలదాయకంగాని సాగునీటి వసతి కోసం నదుల మీద డ్యాములు నిర్మించ డానికి మించి వాటి గురించి పెద్దగా ఆలోచించం. కానీ మన పట్టణం లేదా గ్రామం పక్కగా పారే నదులను కలుషితం మాత్రం చేస్తాం. పౌరులకు జీవజలమైన శుభ్రమైన మంచి నీటిని సరఫరా చేయాలని స్థానిక ప్రభుత్వాలను ఆదే శిస్తాం... మనం మాత్రం మరో ఆలోచనే లేకుండా నదుల్లోకి వ్యర్థాలను కుమ్మరించేస్తుంటాం. అవి ఆ వ్యర్థాలను దిగు వకు ప్రవహింపజేసి ఇతరులకు హాని చేస్తాయి. అయినా మనం వాటిని పవిత్ర మైనవిగా పిలవ డానికి సంకోచించం. మనల్ని పరిశుద్ధం చేసుకోవడం కోసం నదుల్లో స్నానాలూ చేస్తాం, అడ్డూఅదుపూ లేకుండా వాటిని మురికిగానూ చేస్తాం. వాటిని పరిశుభ్రం చేసే ప్రయత్నం ఎన్నడూ సఫలం కాలేదు. నదు లను ఎంతగా కలు షితం చేసేశా మంటే, మనం చేయగలిగినది వాటిని పరిశుభ్రం చేయడం గురించి మాట్లాడటం మాత్రమే. గంగానదిని శుద్ధి చేస్తా మనే మాట ఎంత కాలంగా వినడం లేదు? ఇప్పుడిక మిగతా నదులన్నీ యమునలా దాదాపు గంగతో పోటీపడే స్థాయిలో కలుషితమైపోయాయి. ఢిల్లీ సమీప ప్రాంతాల్లో అవి నురగలు కక్కుతుంటాయి. బహుశా అవి ఎండిపోయి నప్పుడు మాత్రమే శుభ్రంగా కనిపిస్తాయ నుకుంటాను. ఇటీవలి కాలంలో వాటి పూడిక కూడా సమ స్యగా మారింది. హఠాత్తుగా మనం ఇప్పడు నీరు చాలా ముఖ్యమైనదని గుర్తించాం. చాలా రాష్ట్రాల్లో బావులు, నదీ గర్భాలు కూడా ఎండిపోయేంతగా ఈ ఏడాది నీటికి కరువు ఏర్పడటమే అందుకు కారణం. ట్యాంకర్లలో వచ్చే నీళ్ల కోసం పెద్దవాళ్లే కాదు, పిల్లలు సైతం నీటి పోరాటాలు చేయాల్సి వస్తోంది. అలా సరఫరా చేసే నీరు ఎక్కడి నుంచి తెస్తున్నదో వాటిని ఉపయోగించేవారికి తెలియకపోవడం ఘోర మైన తప్పు. నీటిని మన మనుగడకు అవసరమైన ముఖ్య సరుకుగా గుర్తించడానికి మనం గతంలో కూడా చేరువయ్యాం. నీటిని సంరక్షిస్తూ జాగ్రత్తగా వాడుకోవాల్సిన అవసరాన్ని లెక్క చేయని అవివేకానికి సంబంధించి ప్రతి కరువూ దేశానికి గుణ పాఠమే. వచ్చేసారి వానలు సమృద్ధిగా కురిస్తే చాలు, గత ఏడాది ఎంత దుర్భరంగా గడిచిందో, పంటలు దెబ్బ తిని ప్రజలు ఎలా వేరే ప్రాంతాలకు తరలిపోవాల్సి వచ్చిందో, కొద్దిగా తాగునీటి కోసం ఎంత సమయాన్ని వెచ్చించాల్సి వచ్చిందో మనమందరం విస్మరిస్తాం. కొన్ని నెలలు గడిచేసరికి, ఎంత దయనీయంగా బతికామనే జ్ఞాప కాలు ఆవిరైపోతాయి. మళ్లీ నీటికి కరువు వచ్చే వరకు గుర్తుకురావు. ఉత్తమ నీటి నిర్వహణకు ఉదాహరణగా చెప్పే అన్నా హజారే గ్రామం రాలేగావ్‌సిద్ధిలో సైతం ఈసారి బోరు బావులు ఎండిపోయాయి. అతిగా నీటిని తోడేయడం వల్లనే మిగతావి కూడా ఎండి పోయాయని గుర్తించిన హజారే వాటికి అడ్డుకట్ట వేయాలనుకున్నారు. కానీ ఆ గ్రామం అందుకు ఒప్పుకోలేదు. ఆయన గ్రామాన్ని నమూనాగా చూపి ప్రభుత్వం ఇతర ప్రాంతాలలో కూడా అలాంటి గ్రామాలను తయారు చేయాలని కోరింది. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం రావడానికి దశాబ్దాల ముందే మహారాష్ట్రకు సొంత ఉపాధి హామీ పథకం (ఈజీఎస్) ఉండేది. ఇంకుడు గుంతల నిర్మాణం అందులో భాగంగా ఉండేది. వర్షాలు బాగా కురిసిన ఏడాది భూగర్భంలోని నీటి బ్యాంకును అది రీచార్జ్ చేస్తుంది. అయినా బోరు బావులను మరింత లోతుగా తవ్వాల్సి వస్తోంది. 200 అడుగుల లోతుకు మించి తవ్వరాదనే చట్టం అమల్లోకి వచ్చింది. కానీ స్థానిక అధి కారులు దీన్ని పట్టించుకోవడం లేదు. ఇంతకూ ఆ ఇంకుడు గుంతలు ఏమయ్యాయి? లంచగొండి యంత్రాంగం అవి నిర్మాణం కాకుండా చేసి ఉండాలి. ఇది హజారే నమూనాతో ఉన్న సమస్య కాదు, మనం నీటితో ఎలా వ్యవహరి స్తున్నామనే దానికి సంబంధించినది. నీరు పుష్కలంగా ఉన్న ప్పుడు మనం దాన్ని విలువలేనిదిగా లెక్క చేయనే చేయం. నీటి కొరత మొదలైన ప్పుడు ఆ సంక్షోభాన్ని ఎలాగో ఒకలా అధిగ మిస్తామని విశ్వసిస్తాం. ఈసారి, అది అంత తేలికగా ఏం జరగడం లేదు. బహుశా ఆ ప్రకృతే జీవజలంపట్ల మన్నన చూపమని మనల్ని కోరు తున్నట్టుంది. అదృష్టవశాత్తూ ఈ విషయం పట్ల గుర్తింపు అక్కడక్కడా కనిపిస్తోంది. నీటిని సంరక్షించడానికి ఏమైనా చేసినవారికి లేదా చేస్తున్నవారికి ఒక టీవీ చానల్ అవార్డులను ప్రదానం చేసింది. మహారాష్ట్రలో నానాపాటేకర్-మార్కండ్ అనాస్పురేల ‘నామ్’ వంటి స్వచ్ఛంద సంస్థలు చిన్న చిన్న నదులను విశాలం చేస్తున్నాయి. ఆ ఇద్దరు నటులు అందరి నుంచి చందాలు వసూలు చేస్తున్నారు. ఒక రిక్షావాలా జేబులో ఎంతుంటే అంతా ఇచ్చేస్తే, ఒక రచయిత్రి తన పారితోషి కాన్ని ఇచ్చేస్తారు. అతి తక్కువ ఖర్చుతో, ఎంతో వేగంతో ఆ పని జరిగేలా తోడ్పడుతున్నారు. మన ముందున్న సమస్య సరళమైనదే. నీటి వినియోగ దారులంగా మనం నీటి వనరులతో ఎలా వ్యవహరిస్తున్నా మనేది ఆలోచించడం లేదు. సంక్షోభం తలెత్తినప్పుడు లేదా సంక్షోభం మధ్య ఉండగా సైతం, కొంత నీటిని నదికి దిగువన ఉన్నవారి కోసం వదులు కోవాలంటే గగ్గోలు పెట్టేయవచ్చు... నాసిక్ నీటిని మరఠ్వాడాకు పంపుతుంటే జరిగినట్టు. అంతేగానీ అక్కడ తాగడానికి గుక్కెడు నీళ్లు లేక అల్లాడుతుండగా, ఇక్కడ నాసిక్ ఘాట్లలో ఆ అరుదైన నీటితో మతాచారం కోసం స్నానాలు చేస్తున్నందుకు బాధైనా కలుగదు. వారికి బుద్ధి చెప్పడానికి కోర్టులు కలుగ జేసుకోవాల్సి వచ్చింది. - మహేష్ విజాపుర్కార్ వ్యాసకర్త సీనియర్ పాత్రికేయులు ఈమెయిల్: mvijapurkar@gmail.com -
'షబ్బీర్' కోసం ఆగిన శివ పూజలు
తిరువనంతపురం : మానవత్వానికి మతంతో సంబంధం లేదని చాటి చెప్పిన ఉదంతమిది. దుండగుల చేతుల్లో ప్రాణాలు కోల్పోయిన ముస్లిం యువకుడు షబ్బీర్ (20)కు నివాళిగా స్థానిక శివాలయం అధికారులు స్పందించిన తీరు ఆసక్తికరంగా మారింది. మత సామరస్యానికి ప్రతీకగా నిలిచిన ఈ ఉదంతం పలువురి అభిమానానికి పాత్రమైంది. మరోవైపు మృతుడు షబ్బీర్‌కు సంబంధించి మరో కోణం వెలుగు చూసింది. వివరాల్లోకి వెళితే ఒక కేసులో ప్రత్యక్ష సాక్షిగా ఉన్న పాపానికి ఉన్మాదులు పొట్టనపెట్టుకున్న షబ్బీర్ స్థానిక శివాలయానికి సంబంధించిన వార్షిక ఉత్సవాల్లో చురుగ్గా పాల్గొనేవాడట. ప్రతి సంవత్సరం నిర్వహించే ఉత్సవాల నిర్వహణలో నిబద్ధతతో పనిచేసేవాడట. ఈ క్రమంలో షబ్బీర్ అకాల మరణ వార్త విన్న అలయ అధికారులు హతాశులయ్యారు. అతని మృతికి సంతాపం తెలుపుతూ సదరు ఆలయంలో రెండురోజులపాటు అన్ని పూజలను నిలిపివేయాలని దేవస్థాన పరిపాలక కమిటి నిర్ణయించింది. గుడిలో దీపం వెలగొద్దు... గుడి గంట మోగవద్దని తీర్మానించారు. గడిచిన సోమ, మంగళవారాల్లో దీపారాధాన, తీర్థప్రసాదాలను నిలిపివేశారు. రోజుకు అయిదు రకాల పూజలు నిర్వహించే దేవాలయంలో ముస్లిం యువకునికి గౌరవ సూచకంగా రెండు రోజుల పాటు పూజలు నిలిపివేయడం విశేషంగా నిలిచింది. కాగా గత ఆదివారం పట్టపగలు నడిరోడ్డుపై షబ్బీర్‌ను కొట్టి చంపిన వీడియో సంచలనం రేపింది. అయితే బాధితుడిని రక్షించడం కష్టం అని నిర్ణయించుకున్న తర్వాతే ఈ దృశ్యాలు రికార్డు చేసినట్టు తెలుస్తోంది. కనీసం సాక్ష్యంగా ఉపయోగపడాలనే ఉద్దేశంతోనే అలా చేసినట్టు సమాచారం. ఈ వీడియో ఆధారంగానే పోలీసులు నలుగురిని అరెస్ట్ చేశారు. -
బాలీవుడ్ హిట్ పెయిర్ మురిపెం
ముంబై: బాలీవుడ్ హిట్ పెయిర్ జెనీలియా, రితేష్ దేశ్ ముఖ్ పుత్రోత్సాహంలో మునిగి తేలుతున్నారు. తమ ముద్దుల కుమారుడు రియాన్ కబుర్లు చెప్పుకుని మురిసిపోతున్నారు. సుదీర్ఘ కాలం ప్రేమించుకుని దంపతులుగా మారిన వీరిద్దరూ ఇపుడిపుడే బుడిబుడి అడుగులు వేస్తున్న తమ చిన్నారి ఎదుగుదలను నలుగురితో పంచుకుంటూ తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. బిడ్డలకు తొలి గురువులైన తల్లిదండ్రులుగా తన అనుభూతులతో కూడిన ఫోటో ఒకదాన్ని సోషల్ మీడియాలో షేర్ చేశారు. జెనీలియా భర్త రితేశ్ దేశ్‌ముఖ్ తన కొడుకు రియాన్ దేశ్‌ముఖ్‌కి తొలి పాఠం నేర్పాడట. ఈ విషయాన్ని అతనే స్వయంగా తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా తెలిపాడు.అందరినీ గౌరవించడం ఎలాగో నేర్పాడట. ఒక తండ్రి కొడుక్కి నేర్పిన మొదటి పాఠం అంటూ ట్విట్ చేశాడు. దీంతో పాటు తన కుమారుడుతో దిగిన ఓ ఫొటోను అభిమానులతో పంచుకున్నాడు. ఈ సందర్భంగా అభిమానులకు, మిత్రులకు దీపావళి శుభాకాంక్షలు తెలిపాడు రితీష్. Father teaches the son his first lesson - RESPECT ABOVE ALL riteishd https://t.co/VMhpdX3UkE — Genelia Deshmukh (@geneliad) November 10, 2015 -
మనోభావాలను గమనించాలి
గొడ్డు మాంసానికీ, గొర్రె మాంసానికీ తేడా ఏమీ లేదని ఆర్జేడీ అధినేత లాలూప్రసాద్, న్యాయనిపుణుడు మార్కండేయ కట్జు చెప్పడం విచారకరం. ఆవును హిందువులు చూసే పద్ధతి వేరు. ఆ జీవి వారికి పవిత్రమైనది. దేవునితో సమంగా కొలుస్తారు. ఆవు పేడ, మూత్రం, పాలు అన్నీ ఎంతో ఆరోగ్యాన్ని ఇస్తా యని శాస్త్రీయంగా రుజువైంది. ఇప్పుడు ఆవు మాంసం వివా దం దేశాన్ని కుదిపివేస్తున్నది. అయితే ఈ పేరుతో భౌతిక దాడులు సరైనవి కావు. ఈ వాస్తవాన్ని అంగీకరిస్తూనే, హిందు వుల మనోభావాలను కించపరిచే విధంగా ఆవు మాంసం గురించి వ్యాఖ్యలు చేసే వారిపట్ల సుప్రీంకోర్టు కొరడా ఝళి పించవలసి ఉంది. గోవు మాంసం తినడం వ్యక్తిగతమే. కానీ ఆవు మాంసానికీ, మేక మాంసానికీ తేడా లేదని చెప్పడం మూర్ఖత్వమే. అదే సమయంలో ఆవు మాంసం వివాదం నేప థ్యంలో హిందూ మనోభావాలను అవమానిస్తూ, హిందూ దేవుళ్లను అవమానించడం సరికాదని గుర్తించాలి. భారతదేశం లో ముస్లింలకు సామాజికంగా ఉన్నత స్థానం ఇస్తున్నారు. ఇక్కడ హిందువులదే ఎక్కువ సంఖ్య అయినప్పటికీ ఆ విధ మైన సమరసత కనిపిస్తుంది. కాబట్టి ఆవు విషయంలో మైనారి టీలు కొంత ఉదారంగా వ్యవహరించాలని కోరుతున్నాను. కోలిపాక శ్రీనివాస్ బెల్లంపల్లి, ఆదిలాబాద్ జిల్లా -
కలాంకు గౌరవసూచకంగా పార్లమెంట్ వాయిదా
న్యూఢిల్లీ: భారత మాజీ రాష్ట్రపతి, భారతరత్న అబ్దుల్ కలాం మృతికి సంతాప సూచకంగా పార్లమెంట్ ఉభయ సభలు వాయిదా పడ్డాయి. పంజాబ్ టెర్రరిస్టు దాడిని రెండు సభలు ఖండించాయి. గురుదాస్ పూర్ అమరులకు నివాళులర్పించాయి. లోక్ సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ గురుదాస్ పూర్ అమరులకు నివాళులర్పిస్తూ తీర్మానం ప్రవేశపెట్టారు. దీనిని సభ్యులందరూ ఏకగ్రీవంగా ఆమోదించారు. కలాం అంత్యక్రియలు స్వగ్రామం రామేశ్వరంలో గురువారం పూర్తి కానున్నాయి. ఈ నేపథ్యంలో లోక్‌సభ ఆయనకు ఘన నివాళులర్పించింది. అనంతరం ప్రజా రాష్ట్రపతికి గౌరవసూచకంగా శుక్రవారానికి వాయిదా పడింది. అటు రాజ్యసభలోనూ ఉగ్రవాదుల దాడిలో మృతిచెందిన వారికి నివాళులర్పిలస్తూ సభ్యులు రెండు నిమిషాలు మౌనం పాటించారు. అనంతరం రాజ్యసభ చైర్మన్ హమీద్ అన్సారీ సభను మధ్నాహం రెండుగంటలకు వాయిదా వేశారు. కాగా మాజీ రాష్ట్రపతి కలాం హఠాన్మరణంతో పార్లమెంట్ ఉభయసభలు సోమవారం ఘనంగా నివాళులర్పించాయి. అనంతరం గురువారానికి వాయిదా పడిన సంగతి తెలిసిందే. -
నీచ భాషకు ‘రాచ’ గౌరవం
(సమకాలీనం) ఒక పక్షం నుంచి ఎన్నికై, ప్రజాక్షేత్రంలో ఏ పార్టీ అభ్యర్థిని ఓడించారో అదే పార్టీలోకి పదవుల కోసమో, ఇతర ప్రయోజనాల కోసమో నిస్సిగ్గుగా వెళ్లటం తెలుగునాట మామూలై పోయింది. తెలంగాణలో తెరాసలోకి, ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీలోకి ఈ ‘అధికారిక వలసలు’ నిరాటంకంగా సాగుతున్నాయి. ప్రజలు, ప్రజాభిప్రాయం, ఓట్ల రూపంలో వెల్లడించిన ప్రజాభీష్టం అన్నీ గాలికి పోతున్నాయి. ఎన్నికల ముందు ఎన్ని మాటలు చెప్పినా... ఎన్నికలయ్యాక ఏం చేసైనా అధికారపక్షం ఒడిలో వాలాలి. ‘బుద్ధిభూములేలాలని ఉంటే, వంతు వాకిలి ఊడవమంటుంద’ని సామెత. దేశంలో, ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు పరస్పర విరుద్ధ పరిణామాలు వేగంగా చోటు చేసుకుంటున్నాయి. శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం పుణ్యమా అని సామాజిక మాధ్యమాలు క్రియాశీల పాత్ర పోషిస్తు న్నాయి. పాలనతో సహా వివిధ వ్యవస్థల్లో పారదర్శకత పెరుగుతోంది. ఫలితంగా ప్రజలు నిత్య చైతన్యంతోఅన్నీ తెలుసుకుంటున్నారు. మరోపక్క పాలనాపగ్గాలు చేతబట్టిన రాజకీయ వ్యవస్థ మాత్రం రోజు రోజుకు తోలు మందం వ్యవస్థగా మారడమే విచిత్రం. సభ్య సమాజం సిగ్గుతో తలదించు కునేలా నాయకుల మాటలైనా, నిస్సిగ్గుగా పార్టీలు మారే ప్రజాప్రతినిధుల చేష్టలయినా, వాటిని నగ్నంగా ప్రోత్సహిస్తున్న పార్టీల వైఖరులైనా, ప్రజలకి చ్చిన హామీలను తుంగలో తొక్కి ఇష్టానుసారంగా అధికారం చెలాయిస్తున్న పాలకపక్షాల పోకడలైనా... ‘ఔరా! ఎంత తోలుమందం?’ అనిపిస్తున్నాయే తప్ప మరో ఆలోచన కలిగించడంలేదు. జనమేమనుకుంటారో అనే భావనే లేకుండా ఇవన్నీ యథేచ్ఛగా జరిగిపోతున్నాయి. ఇదివరలో ఉన్నట్టు, ఇటు వంటి నిర్వాకాలకు కాసింత మొహమాటమో, తెరచాటుతనమో, దాపరికమో ఏమీలేదు. వారి విచ్చలవిడితనం వల్లో, సంప్రదాయ ప్రసారమాధ్యమాలకు తోడైన సోషల్‌మీడియా క్రియాశీలత వల్లో ఇప్పుడీ విషయాలు ప్రజలకు తేటతెల్లమౌతున్నాయి. ప్రజలు అన్నీ గమనిస్తున్నారు. ఈ దుశ్చేష్టలు రోజు రోజుకు పెచ్చుమీరుతున్నాయే తప్ప అదుపులోకి రావడం లేదు. నరంలేని నాలుకలకింత స్వేచ్ఛా? ఇదివరలో, ఓసారి ఒకమాట మరోమారు ఇంకోమాట మాట్లాడితేనే రెండు నాల్కల ధోరణి అని విమర్శించేవారు. ఇప్పుడు, నాయకులు ఏం మాట్లాడు తున్నారో వారికీ స్పృహలేదేమో అనే అనుమానం కలిగిస్తున్నారు. బెయిల్‌పై విడుదలై వచ్చిన తెలుగుదేశం ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి మాట్లాడిన మాటలు వివిధ వర్గాల్లో విస్మయం కలిగించాయి. ముఖ్యమంత్రిపైన, మంత్రులపైన ఆయన చేసిన వ్యాఖ్యలు స్థాయికి తగ్గట్టు లేవు. సీఎంతోపాటు ఇద్దరు మం త్రుల గురించి చేసిన వ్యాఖ్యల్ని పత్రికలు ప్రచురించినా... ఇంకో మంత్రి నుద్దేశించి చెప్పిన మాటలు ప్రచురణార్హంగా లేకపోవడంతో వదిలేశాయి. రేవంత్‌రెడ్డి ఏం తెలియని వ్యక్తి కాదు. బాగా చదువుకొని ఒకసారి ఎమ్మె ల్సీగా, రెండు పర్యాయాలు ఎమ్మెల్యేగా ఎన్నికైన వ్యక్తి. రాష్ట్ర ఉన్నత న్యాయ స్థానం షరతులతో బెయిల్ మంజూరు చేసి ఒక రోజైనా గడవక ముందే ఇలా మాట్లాడటాన్ని ఎవరైనా ఎలా పరిగణిస్తారు? ఆయన ఇంకా నిందితుడే కనుక హుందాగా వ్యవహరించి, సంయమనం పాటించాల్సిందనే అభిప్రాయం వ్యక్తమౌతోంది. గద్దె దించుతానని, పోరాటం కొనసాగిస్తానని... సాక్షాత్తూ ముఖ్యమంత్రినే లెక్కచేయనితనంతో మాట్లాడటం, మంత్రుల్ని తూలనా డటం పరోక్షంగా దర్యాప్తు అధికారుల్ని, సాక్షుల్ని ప్రభావితం చేసేలా ఉందనే కారణంతో ఆయన చేసిన ప్రసంగం టేపుల్ని వివిధ మీడియా సంస్థల్నించి దర్యాప్తు బృందం సేకరిస్తోంది. ఆయన బెయిల్ రద్దు చేయాలని సుప్రీంకోర్టు ముందు వినిపించే వాదనల్లో ఈ టేపుల్ని భాగం చేయాలని యోచిస్తున్నట్టు సమాచారం. అభిమానులు ఆయనకు స్వాగతం పలికిన తీరు, ఆయా బృం దాల్ని పార్టీ నాయకత్వం సమాయత్తపరచిన వైనం, అది వేదికగా ఆయన చేసిన గర్జన ఒక కొత్త సంస్కృతికి తెరలేపినట్టుగా ఉంది. కేసు దర్యాప్తు ఇంకా కొనసాగుతుంది. సహజ న్యాయసూత్రాల ప్రకారం ఏ కేసులో అయినా బెయిల్ ఇవ్వడం సాధారణ నియమం, ప్రత్యేక పరిస్థితుల్లో బెయిల్ నిరాకరిం చడం మినహాయింపు, కనుక బెయిల్ లభించింది. నేర నిర్ధారణ జరిగేవరకు ప్రతి నిందితుడూ నిరపరాధి అయినట్టే, బెయిల్ లభించినప్పటికీ విడుదలైన వ్యక్తి, కడపటి తీర్పు వచ్చే వరకు నిందితుడే! ఈ పార్టీ ఆ పార్టీ అని కాకుండా, రాజకీయ ప్రత్యర్థులపై నోటికొచ్చినట్టు మాట్లాడటం ఇటీవల ఓ ఫ్యాషన యింది. ‘మా తెలంగాణలో ఇట్లాగే మాట్లాడుతాం...’ అనే ముసుగు కింద ఇటువంటి నిందాపూర్వక మాటలకు, తిట్లకు ప్రస్తుత ముఖ్యమంత్రి కేసీయారే ఆద్యుడని నిందించేవారూ ఉన్నారు. తమచే మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయించిన గవర్నర్‌నే ‘గంగిరెద్దు‘ అని తూలనాడిన ఆంధ్రప్రదేశ్ మంత్రులు కొందరి మాటలకు తెలుగువారంతా సిగ్గుతో బిక్కచచ్చిపోయారు. కేంద్రంలో మంత్రులుగా ఉన్నవారు, కీలకస్థానాల్లో-హోదాల్లో ఉన్న ఎంపీలు, ఇతర నేతలు కొందరి నోటికి హద్దూపద్దూ ఉండట్లేదు. దేశంలోని మైనారిటీలపైన, ముఖ్యంగా ముస్లిం మైనారిటీల మీద జుగుప్సాకరమైన వ్యాఖ్యలు చేసి ప్రధానమంత్రికీ, ఆయన నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వానికీ తలవంపులు తెచ్చిన సందర్భాలు కొల్లలు. ప్రజలేమనుకుంటారో! అన్న ఇంగితం కూడా లేకపోవడాన్ని చూసి వ్యవస్థ చాలా తోలుమందంగా తయా రయిందనే భావన వ్యక్తమౌతోంది. నైతిక విలువలే కాదు చట్టాలూ బేఖాతర్! ఒక పక్షం నుంచి ఎన్నికై, ప్రజాక్షేత్రంలో ఏ పార్టీ అభ్యర్థిని ఓడించారో అదే పార్టీలోకి పదవులకోసమో, ఇతర ప్రయోజనాల కోసమో నిస్సిగ్గుగా వెళ్లటం తెలుగునాట మామూలై పోయింది. తెలంగాణలో తెరాసలోకి, ఆంధ్రప్ర దేశ్‌లో టీడీపీలోకి ఈ ‘అధికారిక వలసలు’ నిరాటంకంగా సాగుతున్నాయి. ప్రజలు, ప్రజాభిప్రాయం, ఓట్ల రూపంలో వెల్లడించిన ప్రజాభీష్టం అన్నీ గాలికి పోతున్నాయి. ఎన్నికల ముందు ఎన్ని మాటలు చెప్పినా... ఎన్నికల య్యాక ఏం చేసైనా అధికారపక్షం ఒడిలో వాలాలి. వీలయితే పెద్ద పైరవీనో- ఓ మాంచి పదవో కొట్టేయడం, ముందు అది మాట్లాడుకొనే గోడ దూకడం, ఇవ్వాళ పలువురు ప్రజాప్రతినిధులు చేస్తున్నదే! ప్రత్యర్థి రాజకీయ పక్షాల ఉనికినే మట్టుపెటి,్ట వచ్చే ఎన్నికల నాటికి తాము మాత్రమే నిలవాలనుకుం టున్న రెండు పాలకపక్షాల ధ్వంసనీతి కూడా ఇదే! నిజానికిది తిమ్మరుసు ధీయుక్తిలోని పెద్దగీత లాంటిది! ఎందుకంటే, దీన్ని చూపించే.... తమ కేసు చిన్నదని తేలిక చేసి చూపడానికి తెలుగుదేశం నాయకత్వం పరోక్షంగా యత్ని స్తోంది. ఒక ఎమ్మెల్సీ అభ్యర్థిని గెలిపించుకునేందుకు 5 కోట్ల రూపాయల బేరానికి ఓ ఎమ్మెల్యే ఓటు కొనుగోలు వ్యవహారంలో 50 లక్షల నగదుతో పట్టుబడ్డ కేసు రేవంత్‌ది. ప్రభుత్వ పనుపుతో, ఏసీబీ అధికారులు పక్కాగా వలపన్ని పట్టుకుంటే బట్టబయలైన ఈ కేసును కూడా బలహీనపరచడా నికి.... ఇదే పాలకపక్షం తమ ఎమ్మెల్యేల్ని కొల్లగొట్టుకుపోయిన నిర్వాకం గురించి టీడీపీ అరిచి గీపెడుతోంది. తమ పార్టీ నుంచి ఎన్నికైన సభ్యుల్ని పార్టీలో చేర్చుకొని ఏకంగా మంత్రిపదవులే ఇవ్వడమేమిటని నిలదీస్తోంది. పార్టీ ఫిరాయింపుల చట్ట నిబంధనల్ని తుంగలో తొక్కడాన్ని ఎత్తిచూపుతు న్నారు. వారి సభ్యత్వాల్ని రద్దు చేయమన్న తమ విజ్ఞప్తులపై స్పీకర్ ఇంకా నిర్ణయం తీసుకోకపోవడాన్ని తెలుగుదేశం, కాంగ్రెస్‌లు తప్పుపడుతున్నాయి. తెలంగాణలో ఈ వాదన వినిపించే టీడీపీ, ఆంధ్రప్రదేశ్‌లో తానూ అదే ‘దొమ్మీ’ వ్యవహారం నడుపుతోంది కనుక తేలుకుట్టిన దొంగలా అక్కడ కిమ్మ నటం లేదు. వైఎస్సార్సీపీ నుంచి ఎన్నికైన ఎంపీల్ని, ఎమ్మెల్సీల్ని, ఇతర కింది స్థాయి ప్రజాప్రతినిధుల్ని ఎరవేసి లాక్కొని తానూ అదే నిర్వాకాన్ని దర్జాగా వెలగబెట్టడాన్ని ఎవరూ చూడటం లేదనుకోవడమే విచిత్రం! ఎన్నికైన ప్రజా ప్రతినిధులే కాదు, ఇతర పక్షాల్లో ఉండి ఓడిపోయిన నాయకులు, ‘పెద్ద మను షులూ’ పాలకపక్షాల వైపు దొంగ చూపులు చూస్తున్నారు. రాజ్యసభ- ఎమ్మెల్సీ వంటి ఎగువసభల సభ్యత్వాలో, ఇతర నామినేటెడ్ పదవులో.... అవీ కుదరవంటే కనీసం నాలుగైదు పనులన్నా అవుతాయన్న ఆశే ఇంధ నంగా అధికారపక్షాలతో అంటకాగాలని చూస్తున్నారు. పైకి మాత్రం, తాము పాలకపక్షంలోకి చేరేది నియోజకవర్గ ప్రజల కోసమే అని అందమైన ముసుగు కప్పుతున్నారు. పాలనలోనూ ప్రతిబింబిస్తున్న పెడధోరణి ప్రజాభిప్రాయంతో నిమిత్తం లేకుండా రాజకీయ వ్యవస్థలో బలపడుతున్న ఈ తోలుమందం వైఖరి పాలనలోనూ కనిపిస్తోంది. కేంద్రం, రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ దాదాపు ఇదే పరిస్థితి. ఏడాదిలోనే పలురకాల అవినీతి ఆరోప ణల్ని ఎదుర్కొంటున్న కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వానికి, పక్షం రోజుల్లో ప్రారంభం కానున్న పార్లమెంటు వర్షాకాల సమావేశాలు పరీక్షా కాలమే! ఎన్డీయే ప్రభుత్వపు పెద్దన్న బీజేపీకి చెందిన పలువురు కేంద్ర మంత్రులు, ఓ ముఖ్యమంత్రి, ఇంకా చాలా మంది వివిధ రాష్ట్రాల్లోని మంత్రులు అవినీతి ఆరోపణలనెదుర్కొంటున్నారు. లలిత్‌గేట్ వణుకు పుట్టిస్తోంది. ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ ఒత్తిడి పెంచుతోంది. దేశంలో గ్రామీణ ఆర్థిక వ్యవస్థ స్తబ్దుగా ఉంది. తీయని మాటలు, గంభీరోపన్యాసాలు, దేశభక్తి భావోద్వే గాలు తప్ప... హామీ ఇచ్చిన ‘మంచిరోజులి’ంకా మొదలు కావేమిటి? అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. తెలుగునేలపై పరిస్థితీ ఏం భిన్నంగా లేదు. ఎన్నికల ముందరి హామీలు, అధికారంలోకొచ్చాక ఇచ్చిన వాగ్దానాల మేరకు తెలం గాణలో కొన్ని పనులు మొదలయినట్టు కనిపిస్తున్నా... ఫలాలు, ఫలితాలు తామింకా చవి చూడనేలేదని ఇక్కడి జనం వాపోతున్నారు. రాజకీయ క్రీడ మాత్రం ముప్పొద్దులా సాగుతోంది. ఇక, ఆంధ్రప్రదేశ్‌లో పరిపాలన, ప్రగతి-సంక్షేమ ఫలాల గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిదనే అభిప్రాయం పాలకపక్ష అనుకూల వాదులూ వినిపిస్తున్నారు. ఏ కొత్త నిర్ణయానికీ ప్రజాభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకోవడం లేదు. ఇటువంటి పరిస్థితుల్లో తామెలా స్పందించాలో ప్రజలకు ఇదమిత్థంగా తోచడం లేదు. సామాజిక మాధ్య మాలు క్రియాశీలంగా మారుతున్న తరుణంలో రాజకీయ వ్యవస్థ ఇంత స్పందనా రహితంగా, ప్రజాభీష్టాన్ని బేఖాతరంటూ ఉండటం పట్ల మేధావి వర్గం కూడా విస్మయానికి గురవుతోంది. రానున్నది డిజిటల్ విప్లవమే! అన్న ప్రధానమంత్రి మోదీ మాటల్ని ప్రజలు, ప్రజా సమూహాలు జాగ్రత్తగా విశ్లేషించుకుంటున్నాయి. వివక్ష నుంచి ఆడపిల్లలను కాపాడుకోవా లనే సదుద్దేశంతో ‘సెల్ఫీ విత్ డాటర్’ అన్న ప్రధాని పిలుపు వల్ల సామాజిక ఆలోచనా దృక్పథంలో పెనుమార్పులు సంభవిస్తాయని అధినాయకత్వం ఆశిస్తున్న తరుణమిది. నిజంగానే, మారిన పరిస్థితుల్లో పౌరులు, పౌర సంఘాలు స్వీయ చేతన పొంది స్పందిస్తే.... మందగించిన మన రాజకీయ వ్యవస్థ తోలు పలచబడదా? ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేసేలా జనా భిప్రాయం మేరకు సర్కార్లు స్పందించవా? చూడాలి! సాక్షి ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ ఆర్. దిలీప్ రెడ్డి ఈమెయిల్ : dileepreddy@sakshi.com -
పుచ్చుకునేది మాత్రమే కాదు
గౌరవం సముద్రాలు మేఘాలకు ఆవిరి రూపంలో జలాన్ని అందిస్తాయి. ప్రతిగా మేఘాలు జల నిధులను ధారబోస్తాయి. ఇచ్చిపుచ్చుకునే ధోరణి ప్రకృతిలోనే ఉంది. గౌరవం కూడా ఇచ్చిపుచ్చుకునే ఓ సద్గుణమని మానవుడు ప్రకృతి నుండి నేర్చుకోవాలి. ప్రతి వ్యక్తీ తనను ఎదుటివారు గౌరవించాలని, తనకు ఇతరుల కన్నా ఎక్కువ ప్రాముఖ్యం లభించాలని కోరుకుంటాడు. తనకు తోటివారిని గౌరవించే అలవాటు ఉన్నా లేకపోయినా అతడి ఆలోచన ఇందుకు భిన్నంగా ఉండదు! ప్రస్తుత సమాజంలో గౌరవించడానికి సంపద, హోదా అవసరమౌతున్నాయి. నిజానికి తోటి మానవుల పట్ల ప్రేమ చూపడం అనే సుగుణం అలవరచుకుంటే గౌరవం దానికదే సాధ్యమౌతుంది. ద్రోణాచార్యుని వద్ద విలువిద్య నేర్చుకోవాలనుకున్నాడు ఏకలవ్యుడు. శూద్రుడు అన్న ఒకే ఒక కారణంతో విలువిద్య నేర్పించడానికి నిరాకరించాడు ద్రోణుడు. అప్పుడు ద్రోణుని మట్టిబొమ్మను ఎదురుగా పెట్టుకుని విలువిద్య సాధన చేశాడు ఏకలవ్యుడు. శ్రద్ధ, ఏకాగ్రతలతో అర్జునుణ్ని మించిన విలుకాడిగా రూపొందాడు. ద్రోణుడి కాపట్యం వల్ల గురుదక్షిణగా బొటనవేలు సమర్పించిన ఏకలవ్యుడు విలువిద్యకు దూరం కావడం వేరే సంగతి. ‘గురు’ శబ్దం పట్ల గురి, గౌరవం, అచంచల విశ్వాసం వల్లనే ఏకలవ్యుడికి మాత్రమే విలువిద్యా రహస్యాలన్నీ కూలంకషంగా బోధపడ్డాయన్నది వాస్తవం. శ్రీరమణులు జంతువులను కూడా ‘వారు’, ‘వీరు’ అని సంబోధించేవారట! ఎదుటి వారిని గౌరవించడం వల్ల మనకు గౌరవం లభిస్తుంది. సముద్రాలు మేఘాలకు ఆవిరి రూపంలో జలాన్ని అందిస్తాయి. ప్రతిగా మేఘాలు జల నిధులను ధారబోస్తాయి. ఇచ్చిపుచ్చుకునే ధోరణి ప్రకృతిలోనే ఉంది. గౌరవం కూడా ఇచ్చిపుచ్చుకునే ఓ సద్గుణమని మానవుడు ప్రకృతి నుండి నేర్చుకోవాలి. మన ఆత్మగౌరవాన్ని మనకై మనం పోగొట్టుకుంటే తప్ప ఎవరూ మనల్ని గౌరవించకుండా ఉండలేరు అనేవారు గాంధీజీ. అనేక కారణాల వల్ల, గౌరవానికి యోగ్యత కలిగి ఉండికూడా కొందరు గౌరవాన్ని పొందలేరు అన్నది అల్ఫ్రెడ్ నోబెల్ సూత్రీకరణ. ఎదుటి వారిని గౌరవించే గుణం వల్ల మనం కోల్పోయేదేమీ ఉండదు. బదులుగా ఇబ్బడి ముబ్బడిగా మనకూ గౌరవాభిమానాలు లభిస్తాయి. సమాజం గౌరవించే వ్యక్తి నాయకుడి గా పరిణతి చెందుతాడు. తల్లిదండ్రులను పిల్లలు గౌరవించడంలో ప్రేమ, ఆత్మీయబంధం అంతర్లీనంగా ఉంటాయి. పెద్దలు వాత్సల్య రూపంలో పిన్నలకు గౌరవాభిమానాలు అందిస్తారు. మనిషి ఆత్మగౌరవం కలిగి ఉండడం మంచిదే, కానీ నశ్వరమైన దేహానికి అమిత ప్రాధాన్యం ఇవ్వడం వలన కొత్త సమస్యలు తలెత్తవచ్చు. సూర్యవంశ చక్రవర్తి త్రిశంకుడు తన అందమైన దేహాన్ని ఎంతో ప్రేమించేవాడు. ఎంతగానంటే మరణం వల్ల ఆత్మదేహాన్ని వీడటం ఊహించలేకపోయాడు. అందుకే సశరీరంగా స్వర్గానికి వెళ్లాలని ఉబలాట పడి కడకు విశ్వామిత్రుడిని ఆశ్రయించి అంతిమంగా చతికిల పడడం మనం కథగా చదువుకున్నదే. ఆత్మగౌరవం కలిగి ఉండడం మంచి లక్షణమే గానీ, తన గురించి తాను చెప్పుకోవడం అహంకారానికి చిహ్నం. మంధర మాటలు విని రాముడిని అరణ్యవాసానికి పంపి, భరతుడికి పట్టాభిషేకం చేయాలనే కోరికను భర్త దశరథ మహారాజు ముందు వ్యక్తపరచిన కైకేయిని కన్నకొడుకు భరతుడు కూడా మన్నించలేకపోయాడు. స్వార్థ చింతన, ఇంద్రియ వ్యామోహం వలన మనిషి గౌరవ మర్యాదలు కోల్పోతాడు. అహంకారాన్ని ఆత్మగౌరవంగా పొరపడిన మనిషికి పతనం తప్పదు. తనను, తన కుటుంబాన్ని ప్రేమించడం వ్యక్తి స్వవిషయం. అయితే సమాజాన్ని గౌరవించడం వ్యక్తి బాధ్యత. నోరు మంచిదైన వాడిని సమాజం గౌరవిస్తుంది. అక్కున చేర్చుకుంటుంది. ఎదలోని దైవాన్ని ఎదుటి మనిషిలో చూడగల సత్పురుషుడికి సంఘ గౌరవం అప్రమేయంగా లభిస్తుంది. - శొంఠి. విశ్వనాథం -
ప్రశంసలు ఇచ్చే కిక్కే వేరబ్బా!
లైఫ్‌బుక్: అదితీరావ్ హైదరి చిన్నప్పుడు మా స్కూల్ టీచర్ ఒక విషయం చెప్పేవారు... ‘‘మిమ్మల్ని ఎవరైనా ప్రశంసిస్తే...వాటిని జాగ్రత్తగా మనసులో దాచుకోండి. మీలో ఎప్పుడైనా ఉత్సాహం తగ్గినప్పుడు వాటిని పదే పదే గుర్తు తెచ్చుకోండి. ఎంతో శక్తి వచ్చినట్లుంటుంది’’ అని. ఈ సూత్రాన్ని నేను ఇప్పటికీ అనుసరిస్తుంటాను. అమితాబ్, మీరా నాయర్, అనురాగ్ కశ్యప్...మొదలైన వారు మెచ్చుకున్న సందర్భాలను తరచుగా గుర్తు తెచ్చుకుంటాను. యౌవనం అంటేనే పెద్ద అలంకరణ. మళ్లీ ప్రత్యేకంగా అలంకరించుకోవడం ఎందుకనేది నా భావన. వీలైనంత ఎక్కువగా మేకప్‌కు దూరంగా ఉండడానికే ప్రయత్నిస్తాను. ఏడు నుంచి ఎనిమిది గంటలు నిద్రపోవాలి. నీళ్లు ఎక్కువగా తాగాలి. వ్యాయామాలు చేయాలి. అప్పుడు ఆనందంగా ఉంటాం. ఆనందంగా ఉంటే అందంగా కనిపిస్తాం. నేను నటించిన సినిమాలు నాకు ఒక విషయాన్ని చెప్పాయి. ‘‘స్వేచ్ఛగా జీవించు. గౌరవంగా జీవించు’’ అని. అలా అని విశృంఖలమైన స్వేచ్ఛను ఇష్టపడను. గౌరవంగా జీవించగలిగే స్వేచ్ఛను ఇష్టపడతాను. సిఫారసులతో మంచి పాత్రలు వస్తాయని నేను అనుకోను. మనలో నటించే సత్తా ఉంటే ఎలాంటి సిఫారసులూ అక్కర్లేదు. అయితే విధి కూడా మన విషయంలో కాస్త చల్లని చూపు చూడాలి. ‘నేను ఇలా ఉండాలనుకుంటున్నాను’ అని కొన్ని నియమాలు పెట్టుకున్నాను. కొన్ని సందర్భాలలో వాటి వల్ల కెరీర్‌కు నష్టం జరుగుతుందని తెలిసినా పట్టించుకోను. మనసుకు నచ్చని పని చేయను. శక్తిసామర్థ్యాలు ఎక్కడి నుంచో రావు. మన ఇష్టం నుంచే వస్తాయి. మనకు ఒక పని మీద ఇష్టం ఉంటే, శక్తిసామర్థ్యాలు వాటంతట అవే బయటపడతాయి. ఇష్టం లేక పోతే ఉన్నవి కూడా వెనక్కి పోతాయి. -
ఇచ్చి పుచ్చుకునేది గౌరవం
ఆహారాన్ని సమకూర్చుకోవడం, యోగ్య మైన నివాసాన్ని ఏర్పరుచుకోవడం అన్ని ప్రాణులు చేసే పనే. అయితే వివేకం వల్ల, విజ్ఞానం వల్ల మానవుడు ఇతర ప్రాణుల కంటె విశిష్టుడయ్యాడు. సకల ప్రాణులలో విశిష్టులైన, విజ్ఞానవంతులైన మానవులు అందరూ ముందుగా కోరుకునేది గౌరవాన్నే. ప్రతివ్యక్తిగౌరవప్రదమైన జీవితాన్ని గడపాలని భావిస్తాడు. ఇంటా బయటా అదే కోరుకుంటాడు. గొప్ప పదవి కలవాడైనా, కోటీశ్వరుడైనా గౌరవం లేకపోతే ఏ ఒక్క క్షణం మనశ్శాంతితో జీవించలేడు. సమాజంలో గౌరవం కోల్పోయినవారు, అప్రతిష్ఠపాలు అవుతామనే సందేహం కలవారు, అకారణంగా అభియోగాలను మోస్తున్న వారు ఆత్మహత్యలకు పాల్పడుతుంటారు. ఒక్కసారి గౌరవం పొందినవాడికి చెడ్డ పేరు రావడం, పరువు పోవడం వంటివి మరణం కంటెను ఎక్కువ దుఃఖాన్ని కలిగిస్తాయి అని గీతాచార్యులైన శ్రీకృష్ణుడు భగవద్గీతలో ‘సంభావితస్య చాకీర్తిః మరణాదతి రిచ్యతే’ అని ఉద్బోధించారు. ఈ భావాన్నే భర్తృహరి మహాకవి కూడా ‘‘అపయశో యద్వస్తి కిం మృత్యునా’’ అనే శ్లోకపాదంలో వివరించారు. మానవ జీవితంలో ఇంతటి ప్రముఖమైన గౌరవాన్ని పొందే మార్గాన్ని ఆవిష్కరిస్తోంది ఈ క్రింది శ్లోకం: వస్త్రేణ వపుషా వాచా విద్యయా వినయేనచ వకారైః పంచభిర్లుప్తో నాప్నోతి గౌరవమ్॥ వస్త్రం, వపువు (శరీరం), వాక్కు, విద్య, వినయములు అనే ఈ అయిదు ‘వ’కారాలు లేకపోతే ఏ మనిషీ గౌరవాన్ని పొందడు అని పై శ్లోకానికి అర్థం. పరిశుభ్రమైన, ఆకర్షణీయమైన వస్త్రాల ద్వారా, శారీరక పుష్టి, సౌందర్యాదుల వలన, మృదుమధురమైన ప్రియ హిత వాక్కుల ద్వారా, తనకు, తోటివారికి ఇహపర సాధకంగా నిలిచే విద్యను అభ్యసించడం వల్ల, వినయ స్వభావం కలిగి ఉండడం వల్ల ఏ మనిషైనా గౌరవాన్ని పొందగలడని పై శ్లోకం వ్యక్తపరుస్తోంది. ఒక్కరిలోనే సముచిత వస్త్రధారణ, ఆకర్షణీయమైన దేహపుష్టి, వాక్చాతుర్యం, విద్య, వినయం అను ఐదూ ఉండకపోయినా వీటిలో ఏ ఒక్కటో ఉంటే కొంతవరకైనా గౌరవపాత్రుడవు తాడు. కానీ అయిదింటిలో ఏ ఒక్కటి లేకపోయినా సమాజంలో నిరాదరణకు గురవ్వడమే కాకుండా, నామమాత్రంగా మిగిలిపోతాడు. ప్రతి వ్యక్తీ తాను ఇతరులచేత గౌరవం పొందాలని కోరుకున్నట్లే తాను కూడా ఇతరులను గౌరవించాలి. అందుకే మన పూర్వులు ‘‘పెద్దలను గౌరవింపుము, చిన్నలను ప్రేమింపుము’’ అని చెప్పా రు. ఈ భావనే కార్యరూపం దాలిస్తే సమాజంలో కలతలు, కలహాలు తొలగి, నేరప్రవృత్తి తగ్గిపోతుం దనడంలో సందేహం లేదు. - సముద్రాల శఠగోపాచార్యులు -
మేడ్ ఫర్ ఈచదర్...మేడీజీ ఇలా...
దాంపత్యం ‘చాలా మంది భర్తలు తమ భార్యలను తేలికగా తీసి పక్కన పెట్టేస్తుంటారు. లేదా నెమిలీకగా అపురూపంగానే చూసినా... పుస్తకాల్లాంటి చీకట్లలో మూసిపెట్టేస్తుంటారు. కానీ... మహిళా రంజకుడైన ఆ దేవుడి సంగతి వేరు. శ్రీకృష్ణుడి మాటే వేరు. నెత్తిమీద నెమిలీకతో పాటు భార్యనూ అక్కడే పెట్టుకుంటాడాయన. భార్యకు ఎంత విలువివ్వాలో తెలిసిన వాడు కాబట్టే దేవుడయ్యాడు. మగువకు దక్కాల్సిన మర్యాదను గౌరవంగా దక్కించేవాడు మగడయ్యాడు. భార్యగా తానంటే కృష్ణుడికి ఎంత ప్రేమో చెలులకు ఆమె చెప్పిన మాటలివి.,. సీ. కలలోననైనా నవ్వులకైనా నా మాట జవదాట వెఱచు నో చంద్రవదన యే పదార్థంబు నా యెదుట బెట్టకమున్న యెవ్వారి కొసగడో యిగురుబోడి చెలులు నాతో నేమి చెప్పుదురో యని లంచంబు లిచ్చు నో చంచలాక్షి...... ॥ నవ్వులాటకోసమైనా తన మాట జవదాటడట. చిరుతిండ్లేవైనా తనకు పెట్టకముందు చిగురంత కూడా పక్కవాళ్లకూ ఇవ్వడట. తన గురించి సత్యభామ దగ్గర ఎవరైనా చాడీలు చెబుతారేమోనని చెలికత్తెలకు లంచాలిచ్చి మంచి చేసుకుంటాడట... సాక్షాత్తూ అవతార పురుషుడే అయినా... బ్రహ్మాది దేవతలు కూరిమితో పూజించే దేవతలకే దేవుడైనా భార్యను అంతగా గౌరవించాడు కాబట్టే అంతమంది భార్యలున్నా కూడా మంచి భర్తగా మన్ననలు అందుకుంటున్నాడు. మరి భర్తగారు భార్యకు ఇంతగా లోబడి ఉన్నందుకేనేమో ‘నడిరేయి ఏ ఝాములో స్వామి నిను చేర దరివచ్చినా... పతిదేవుడికి కాస్త ఓ మాట చెప్పమ్మా’ అని పద్మావతిని కోరేవాళ్లూ... ‘మమూ బ్రోవమని చెప్పవే’ అంటూ సీతమ్మ తల్లి సిఫార్సులను కోరేవాళ్లూ ఉన్నారు. భర్త భార్యను సత్యభామలా నెత్తికెక్కించుకున్నా... సీతమ్మ వారు సిఫార్సులు స్వీకరించినా స్వీకరించకపోయినా... మహిళలు మంచివారు. అన్డ్యూ అడ్వాంటేజీ ఎప్పటికీ తీసుకోరు. జన్యూన్‌గా అవసరమైతే మాత్రం జగమంతటికి ఎదురుతిరిగి జయించగలరు. తాము తలచింది జరిగేవరకూ పట్టువిడువరు. కొప్పుముడువరు. ఈ గుణమే కొందరికి కాస్త వేరుగా అనిపించవచ్చు. పెళ్లాన్ని తేలికగా చూసేవాడికి ఇది మంకుపట్టులా అనిపిస్తుంది. నెమలీకగా నెత్తినపెట్టుకునేవాడికి పట్టుదలలా కనిపిస్తుంది. దీనిని అర్థం చేసుకునే భర్తే దేవుడు! ఇక దేవుడైనా సరే... చెలికత్తెలు చాడీలు చెబుతారేమో అని భార్యకు భయపడటం ఏమిటంటారా...? దానికి ఈ లోకంలో సత్యభామ అయినా మరో భామ అయినా చెప్పే మాట ఒకటే... ‘ఏ పనినైతే చాటుగా చేయాలని ఎవరైనా అనుకుంటున్నారంటే... ఆ పనిలో ఏదో తప్పుందన్నమాట. పతిదేవుడు పబ్లిగ్గా చేసే ప్రతిపనినీ మహిళ ఓకే అంటుంది. నా ఓటు నీకే అంటుంది. ఆ పని చేయగలిగితే... అలా పనిచేయగలిగితే ఎవరైనా, ఎవరికైనా భయపడాల్సిన పనేముంటుంది?’ ఈ కీలకం తెలిస్తే చాలు... సంసారానికి అదే పీజీ... మేడ్ ఫర్ ఈచదర్ మార్గం మేడ్ బహు ఈజీ. బహుత్ ఈజీ.