న్యూఢిల్లీ: నూతన జాతీయ విద్యా విధానం(ఎన్‌ఈపీ) ద్వారా దేశంలోని ప్రతి భాషకూ సముచిత గౌరవం లభిస్తుందని ప్రధాని మోదీ చెప్పారు. స్వార్థ ప్రయోజనాల కోసం భాషపై రాజకీయం చేసే వారు తమ దుకాణాలను మూసేసుకోవాలని ఆయన వ్యాఖ్యానించారు. శక్తి సామర్థ్యాల ఆధారంగా కాకుండా భాష ప్రాతిపదికన ప్రతిభను అంచనా వేయడం వల్ల విద్యార్థులకు తీరని అన్యాయం జరుగుతోందని చెప్పారు. ఎన్‌ఈపీ ప్రారంభమై మూడో వార్షికోత్సవా న్ని పురస్కరించుకుని ఏర్పాటైన ‘అఖిల భారతీయ శిక్షా సమాగమ్’నుద్దేశించి ఆయన ప్రసంగించారు.
‘మాతృభాషలో విద్యా బోధన ద్వారా భారతీయ విద్యార్థులకు న్యాయం చేసే కొత్త రూపానికి నాంది పలుకుతోంది. సామాజిక న్యాయం దిశగా ఇది చాలా ముఖ్యమైన అడుగు’అని ప్రధాని అన్నారు. ప్రపంచంలోని అనేక భాషలు, వాటి ప్రాముఖ్యతను ప్రస్తావిస్తూ ప్రధానమంత్రి.. అనేక అభివృద్ధి చెందిన ముఖ్యంగా యూరప్ దేశాలు విద్యాబోధన స్థానిక భాషల్లో జరుగుతున్నందునే ఒక అడుగు ముందుకు వేశాయని చెప్పారు.
మన దేశంలో అనేక ప్రాచీన భాషలున్నప్పటికీ, వాటిని వెనుకబాటుకు చిహ్నంగా చూపుతు న్నారని, ఇంగ్లిష్ మాట్లాడలేని వారిని విస్మరించారని, వారి ప్రతిభను గుర్తించడం లేదని మోదీ విచారం వ్యక్తం చేశారు. ‘ఫలితంగా గ్రామీణ ప్రాంతాల్లోని చిన్నారులు ఎక్కువగా నష్టపోతున్నారు. ఎన్‌ఈపీ రాకతో దేశం ఇప్పుడు ఈ నమ్మకాన్ని విస్మరించడం ప్రారంభించింది. ఐక్యరాజ్యసమితిలో కూడా నేను భారతీయ భాషలోనే మాట్లాడతాను’ అని చెప్పారు. సామాజిక శాస్త్రాల నుంచి ఇంజినీరింగ్ విద్య వరకు అన్ని సబ్జెక్టుల్లోనూ భారతీయ భాషల్లోనే బోధిస్తున్నారని తెలిపారు.
భాషపై విద్యార్థులు పట్టుసాధించగలిగితే, ఎలాంటి అవరోధాలు లేకుండా వారిలో నైపుణ్యం, ప్రతిభ బయటికొస్తాయని ప్రధాని అన్నారు. ప్రపంచం భారతదేశాన్ని కొత్త అవకాశాల వేదికగా చూస్తోంది. ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ) క్యాంపస్‌లను ఏర్పాటు చేయాలంటే అనేక దేశాలు కేంద్ర ప్రభుత్వాన్ని సంప్రదిస్తున్నా యని వెల్లడించారు. ఇప్పటికే టాంజానియా, అబుధాబిల్లో ఐఐటీ క్యాంపస్‌లు నెలకొల్పార ని చెప్పారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ శ్రీ (ఎస్‌హెచ్‌ఆర్‌ఐ) పథకం కింద మొదటి ఇన్‌స్టాల్‌మెంట్ నిధులను విడుదల చేశారు.
Comments
Please login to add a commentAdd a comment