languages
-
లాంగ్వేజ్ ఫర్ ఎర్న్.. విదేశీ భాష.. విజయాలు లెస్స
కొత్త భాషలు నేర్చుకోవడం కొన్నేళ్ల క్రితం వరకూ కేవలం హాబీగా భావించేవారు. అయితే, ప్రపంచీకరణతో విదేశీ భాషా నైపుణ్యం ఆదాయమార్గంగా కూడా అవతరించింది. దీంతో వయసుతో సంబంధం లేకుండా నగరవాసుల్లోనూ విదేశీ భాషలపై ఆసక్తి పెరుగుతోంది. సంపాదన కోసమో, మరేదైనా లక్ష్యాలతోనో సీరియస్‌గా ఫారిన్ లాంగ్వేజెస్‌కు జై కొడుతున్నారు. ప్రస్తుతం ఫ్రెంచి, రష్యన్, స్పానిష్ చైనీస్ అరబిక్ వంటి అనేక విదేశీ భాషలు బాగా డిమాండ్‌లో ఉన్నాయి. ఇటీవలే కొరియన్ వెబ్‌సిరీస్, మ్యూజిక్కూ పెరిగిన ఆదరణ కొరియన్ భాషా పరిజ్ఞానంపై యువత ఆసక్తిని పెంచింది. విదేశీ భాషని అధ్యయనం చేయడం వల్ల కలిగే ప్రయోజనాలు అంతకంతకూ పెరుగుతున్నాయి. మన రెస్యూమ్‌ను బలోపేతం చేయడంతో పాటు పర్యాటక రంగంలో, గైడ్స్‌గా ఇతరత్రా రంగాల్లో రాణించడానికి, ట్రావెల్, బ్లాగులను తయారు చేయడం తదితర ఎన్నో రంగాల్లో ఉపాధి అవకాశాలను అందిస్తోంది. అంతేకాకుండా ప్రపంచం నలుమూలలకూ కమ్యూనికేట్ చేయగలిగేలా చేస్తుంది. విదేశీ విశ్వవిద్యాలయలో ప్రవేశాలకు కూడా ఉపయుక్తం అవుతున్నాయి.. ప్రస్తుతం వర్క్ కల్చర్, ఆన్లైన్ ప్లాట్‌ఫారమ్‌లకు మారడంతో విదేశీ భాషా నైపుణ్యాలతో ఫ్రీలాన్సర్‌గా అవకాశాలు పెరిగాయి. ఓటీటీ తదితర వేదికల విజృంభణతో అనువాదకులకు భారీగా డిమాండ్ పెరగడం కూడా విదేశీ భాషలను క్రేజీగా మార్చింది. ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో అనేక ఉద్యోగ అవకాశాలతో జాతీయ, అంతర్జాతీయ బ్యాంకులు దేశ విదేశాలలో రాయబార కార్యాలయాలు, హై–కమిషన్లలో విదేశీ భాషా ఉపాధ్యాయులుగా కొనసాగడానికి వీలైన కోర్సులకు డిమాండ్ సంతరించుకుంటున్నాయి. ఫ్రెంచ్ పట్ల ఆసక్తి.. ప్రపంచవ్యాప్తంగా 30 కోట్ల మంది పైగా మాట్లాడే ఫ్రెంచ్ అత్యధికంగా మాట్లాడే భాషగా ఆరో స్థానంలో ఉంది. ఇది ఫ్రాన్స్, కెనడాతో సహా 29 దేశాల్లో అధికారిక భాష. ఫ్యాషన్, హాస్పిటాలిటీ, టూరిజంలో కెరీర్‌కు ఉపకరించే ఫ్రెంచ్ నేర్చుకోవడానికి విశ్వవ్యాప్తంగా విలువైన భాష. శిక్షణా తరగతులు..ఈ నేపథ్యంలో విదేశీ భాష నేర్చుకోవడంలో సహాయపడే అనేక అకాడమీలు, సంస్థలు నగరంలో వెలుస్తున్నాయి. ఆయా భాషల కోర్సు వ్యవధి సాధారణంగా ఆరు నుంచి 12 నెలల్లో పూర్తి చేసి ప్రొఫెషనల్ డిగ్రీని అందుకుంటారు. అయితే అనర్గళంగా మాట్లాడడం, చదవడం, రాయడం అర్థం చేసుకోవడంపై పూర్తి పట్టు సాధించేందుకు మరింత వ్య«వధి అవసరం అవుతుందని శిక్షకులు అంటున్నారు. ఇవి కాకుండా ఒక విద్యార్థి ఆ భాష చరిత్ర, భాష సంస్కృతి సంబంధిత దేశాల ప్రజలు, అర్థం చేసుకునే పద్దతి, ఆ భాష యాస, డిక్షన్ గురించి కూడా నేర్చుకుంటేనే పూర్తి అవగాహన వస్తుందని సూచిస్తున్నారు. విద్యార్థులు పదో తరగతి తర్వాత సరి్టఫికెట్ డిప్లొమా స్థాయి కోర్సు లేదా పన్నెండో తరగతి పూర్తి చేసిన తర్వాత విదేశీ భాషలో డిప్లొమా, అండర్ గ్రాడ్యుయేట్ లేదా పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సును అభ్యసించవచ్చు. నగరంలో ఇంగ్లిష్ ఫారిన్ లాంగ్వేజెస్ యూనివర్శిటీ, హైదరాబాద్, జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం, ఢిల్లీ విశ్వవిద్యాలయాలు వంటివి విదేశీ భాషల్లో సర్టిఫికెట్ కోర్సులను అందిస్తున్నాయి. అలాగే పలు ఆన్లైన్ లెరి్నంగ్ ప్లాట్‌ఫారమ్‌లలో విదేశీ భాషా కోర్సులను సులభంగా యాక్సెస్ చేయవచ్చు. స్పాని‹Ù.. జోష్.. దాదాపు 50 కోట్ల మందికి పైగా మాట్లాడే వారితో స్పానిష్ ప్రపంచవ్యాప్తంగా ఎక్కువగా మాట్లాడే భాషలలో రెండో స్థానంలో ఉంది. స్పానిష్ మాట్లాడే దేశాలతో మన దేశానికి ఇటీవల పెరుగుతున్న వాణిజ్యం దృష్ట్యా నేర్చుకోవడానికి అత్యధికులు ఆసక్తి చూపిస్తున్నారు. ప్రత్యేకించి అంతర్జాతీయ వ్యాపారం, ఆతిథ్యం పర్యాటక రంగంలో ఆసక్తి ఉన్న వారికి ఇది బెస్ట్. విన్.. జపాన్.. సాంకేతిక హబ్ హోదా, భారతదేశంతో బలమైన వాణిజ్య సంబంధాలు కలిగిన జపాన్ జపనీస్ అత్యధికులు కోరుకునే భాషగా మార్చాయి. ప్రపంచవ్యాప్తంగా 13 కోట్ల మందికి పైగా మాట్లాడే ఈ భాష సాంకేతికత, యానిమేషన్, గేమింగ్‌లో కెరీర్‌ను ఎంచుకున్న సిటీ యూత్ ఎంపికగా మారింది.జర్మన్‌కు జై.. ప్రపంచవ్యాప్తంగా 10 కోట్ల మందికి పైగా, యూరోపియన్ యూనియన్‌లో అత్యధికంగా మాట్లాడే భాష జర్మన్. జర్మన్ నేర్చుకోవడం ఇంజినీరింగ్, సాంకేతిక రంగాల్లో విభిన్న అవకాశాలకు తలుపులు తెరుస్తోంది.ఇదీ..ఇటాలియన్.. యూరోపియన్ యూనియన్‌లో అత్యధికంగా మాట్లాడే నాల్గో భాష ఇది. పర్యాటక కేంద్రంగా మరియు ఫ్యాషన్ మరియు డిజైన్‌కు కేంద్రంగా ఇటలీకి ఉన్న ప్రాచుర్యంతో ఫ్యాషన్, డిజైన్, హాస్పిటాలిటీలో కెరీర్‌ను లక్ష్యంగా చేసుకున్న సిటీ విద్యార్థులకు రైట్ ఛాయిస్‌గా నిలుస్తోంది. మాండరిన్.. మంచిదే.. మనదేశపు అతిపెద్ద వ్యాపార భాగస్వామిగా చైనాను దృష్టిలో ఉంచుకుంటే.. అంతర్జాతీయ వ్యాపారం, దౌత్యం పర్యాటక రంగం కోసం మాండరిన్ నేర్చుకోవడం అవసరంగా మారింది. కో అంటే కొరియన్.. ప్రపంచవ్యాప్తంగా 75 కోట్ల మందికి పైగా మాట్లాడే కొరియన్‌కు నగరంలో బాగా డిమాండ్ ఉంది. ఆసియాలో మనదేశానికి మూడో అతిపెద్ద వాణిజ్య భాగస్వామి కొరియా కావడం సాంకేతిక, వినోద పర్యాటక రంగాల్లో ఈ భాషా నైపుణ్యానికి డిమాండ్ పెంచుతోంది.గ్రేస్.. పోర్చుగీస్.. బ్రెజిల్ పోర్చుగల్‌తో సహా ఎనిమిది దేశాల్లో మాట్లాడేది పోర్చుగీస్. ఈ దేశాలతో మనకు విస్తరిస్తున్న సంబంధాల కారణంగా పోర్చుగీస్ భాషలో ప్రావీణ్యం అనేది భవిష్యత్తు విజయాలకు బాట వేస్తుంది.పలు భాషల్లో ప్రావీణ్యం కోసం.. విదేశీ భాషా పరిజ్ఞానం వల్ల ఉపాధి అవకాశాలతో పాటు మరెన్నో ప్రయోజనాలను యువత ఆశిస్తున్నారు. గతంలో పదుల సంఖ్యలో మాత్రమే విద్యార్థులు కనిపించేవారు. ఇప్పుడు ఆ సంఖ్య వందలకు చేరింది. కెనడాలో ఉండే భారతీయులు కూడా ఆన్లైన్ ద్వారా మాకు స్టూడెంట్స్‌గా ఉన్నారు. నేర్చుకోవడం అనేది ఇలా సులభంగా మారడం కూడా విదేశీ భాషల పట్ల ఆసక్తిని పెంచుతోంది. – ఎం.వినయ్‌కుమార్, అసిస్టెంట్ ప్రొఫెసర్, ఫ్రెంచ్ భాషా విభాగం, ఉస్మానియా వర్సిటీ -
Sign Languages Day: ఒకప్పుడు చులకనగా చూసినవాళ్లే నేడు..
అంతర్జాతీయ సంజ్ఞా భాష (సైన్ లాంగ్వేజ్) దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 23న జరుపుకుంటారు. వినికిడి లోపం కలిగినవారికి సంజ్ఞా భాష అవగాహన పెంచేందుకు ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తారు. అయితే ఈ దినోత్సవం నిర్వహణ వెనుక సుదీర్ఘ చరిత్ర, ఎంతో ప్రాముఖ్యత ఉన్నాయి. సంజ్ఞా భాష అనేది వినికిడి లోపం కలిగినవారు ఒకరితో ఒకరు సంభాషించడానికి ఉపయోగించే దృశ్య భాష. ఇది ఒక సహజ భాష, దానికి సొంత వ్యాకరణం, వాక్య నిర్మాణం, పదజాలం ఉన్నాయి. సంకేత భాషలో ప్రధానంగా చేతులు, ముఖ కవళికలు, శరీర కదలికలను ప్రదర్శిస్తారు.సంజ్ఞా భాష ఎంతో పురాతనమైనది. మొదట్లో ఈ భాషను చులకనగా చూసేవారట. అలాగే కొన్ని చోట్ల సంకేత భాషను ఉపయోగించకుండా నిరోధించారని కూడా చెబుతారు. అయితే కాలక్రమేణా సంజ్ఞా భాష అభివృద్ధి చెందిన భాషగా గుర్తింపు పొందింది. బధిరుల హక్కుల సాధన కోసం జరిగే పోరాటంలో ఉపయుక్తమయ్యింది.సామాన్యులలో సంజ్ఞా భాషపై అవగాహన పెంచడానికి ఈ దినోత్సవం దోహదపడుతుంది. సంజ్ఞా భాష అనేది ఒక కమ్యూనికేషన్ మాధ్యమం. దీనిని ఉపయోగించే వారి విషయంలో ఉండే వివక్షను తొలగించాలనే విషయాన్ని ఈ ప్రత్యేక దినోత్సవం గుర్తు చేస్తుంది. సంకేత భాష అనేది వక్రీకరణ కాదు, సహజమైన, అందమైన భాష అని గుర్తెరగాలని నిపుణులు చెబుతుంటారు.సంజ్ఞా భాషలు ప్రపంచవ్యాప్తంగా విభిన్నంగా ఉంటాయి. బధిరులకు విద్య, వైద్యం, ఇతర సేవలను ఇతరులతో సమానంగా అందించేందుకు ఈ సైన్ లాంగ్వేజ్ ఉపయోగపడుతుంది. ఇతర భాషల మాదిరిగానే సంకేత భాషలు కూడా నిరంతరం అభివృద్ధి చెందుతున్నాయి. కొత్త పదాలు, చిహ్నాలు, కొత్త ఆలోచనలు, సాంకేతికతలకు అనుగుణంగా అవి కొత్త రూపం తీసుకుంటున్నాయి. సంజ్ఞా భాష అనేది ఆలోచనలను వ్యక్తీకరించడానికి మాత్రమే కాకుండా భావోద్వేగాలను వ్యక్తీకరించడానికి కూడా ఉపయోగపడుతుంది. ఇది కూడా చదవండి: నిద్రలో నడుస్తూ అడవిలోకి...! -
మరిన్ని భాషల్లో గూగుల్ సెర్చ్ రిజల్ట్స్
గూగుల్ సెర్చ్ రిజల్ట్స్ ఇప్పుడు మరిన్ని భాషల్లో అందుబాటులోకి వచ్చింది. గతంలో కేవలం 13 భాషల్లో మాత్రమే అందుబాటులో ఉండేది. ఇప్పుడు ఆ సంఖ్య 21కి చేరింది. ఇంతకీ ఇప్పుడు అందుబాటులో ఉన్న భాషలు ఏవి, అందులో భారతీయ భాషలు ఎన్ని అనే వివరాలు వివరంగా తెలుసుకుందాం.గూగుల్ సెర్చ్ రిజల్ట్స్‌లో కొత్తగా చేరిన భాషలు మొత్తం ఎనిమిది. అవి అరబిక్, గుజరాతీ, కొరియన్, పర్షియన్, థాయ్, టర్కిష్, ఉర్దూ, వియత్నామీస్. ఇప్పటికే 13 భాషల్లో ఇది వినియోగంలో ఉంది. దీంతో మొత్తం భాషలు 21కి చేరాయి. అంటే గూగుల్ సెర్చ్ ఫలితాలు అరబిక్, బెంగాలీ, ఇంగ్లీష్, ఫ్రెంచ్, జర్మన్, గుజరాతీ, హిందీ, ఇండోనేషియా, కన్నడ, కొరియన్, మలయాళం, మరాఠీ, పర్షియన్, పోర్చుగీస్, స్పానిష్, తమిళం, తెలుగు, థాయ్, టర్కిష్, ఉర్దూ, వియత్నామీస్ భాషల్లో కూడా పొందవచ్చు.ఈ మొత్తం 21 భాషల్లో భారతీయ భాషలు.. బెంగాలీ, గుజరాతీ, హిందీ, కన్నడ, మలయాళం, మరాఠీ, తమిళం, తెలుగు, ఉర్దూ. సెర్చ్ రిజల్ట్స్ ఇప్పుడు మరిన్ని భాషల్లో అందుబాటులో ఉండటం వల్ల మరింత మంది యూజర్స్ దీన్ని ఉపయోగించే అవకాశం ఉంది. -
గూగుల్ ట్రాన్స్‌లేట్‌లో మరో 110 కొత్త భాషలు
ఏదైన ఒక భాష నుంచి మరో భాషకు అనువాదం (ట్రాన్స్‌లేట్) చేయాలంటే అందరికి గూగుల్ ట్రాన్సలేట్ గుర్తొస్తుంది. ఇప్పటికే సుమారు 243 భాషలకు సపోర్ట్ చేస్తున్న గూగుల్ ట్రాన్స్‌లేట్ ఇప్పుడు మరో 110 భాషలకు సపోర్ట్ చేయడానికి సన్నద్ధమైంది. ఈ కొత్త భాషలను విస్తరించడానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ను ఉపయోగించనున్నట్లు గూగుల్ తెలిపింది.2006లో ప్రారంభమైన గూగుల్ ట్రాన్స్‌లేట్ 2022లో జీరో-షాట్ మెషిన్ అనువాదాన్ని ఉపయోగించి 24 కొత్త భాషలను జోడించింది. కాగా 2024 జూన్ నాటికి 243 భాషలల్లో అందుబాటులోకి వచ్చింది. ఇందులో భాగంగానే ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా మాట్లాడే 1000 భాషలకు మద్దతు ఇచ్చే AI మోడల్లను రూపొందించాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది.ప్రపంచ జనాభాలో ఎనిమిది శాతం మందికి అనువాదాలు అందుబాటులో ఉన్నాయి. వీటిలో కొన్ని 100 మిలియన్లకు పైగా మాట్లాడే ప్రధాన భాషలు, మరికొన్ని స్థానిక ప్రజల చిన్న భాషలు ఉన్నాయి. తాజాగా గూగుల్ యాడ్ చేసిన కొత్త భాషల జాబితాలో ఫాన్, లువో, గా, కికోంగో, స్వాతి, వెండా, వోల్ఫ్ వంటి మరిన్ని ఆఫ్రికన్ భాషలతో పాటు అవధి, బోడో, ఖాసి, కోక్బోరోక్, మార్వాడీ, సంతాలి, తుళు వంటి ఏడు భారతీయ భాషలు ఉన్నట్లు తెలుస్తోంది. -
భాషలన్నింటిలో టాప్ ఏవో తెలుసా మీకు?
2023లో ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా మాట్లాడిన భాషలు ఎన్నో, ఎంతమంది మాట్లాడారో తెలుసా.ప్రతి సంవత్సరం అతిపెద్ద భాషల జాబితాను ప్రచురించే ఎథ్నోలాగ్ తాజా జాబితాను వెల్లడించించింది. ఇందులో అత్యధికంగా అంటే 1.5 బిలియన్లు మంది మాట్లాడిన భాషగా ఇంగ్లీష్ నిలిచింది. అలాగే భారత దేశానికి చెందిన హిందీ భాష మూడో స్థానంలో నిలవడం విశేషం. అలాగే బెంగాలీ భాష 7, ఉర్దూ భాష 10వ స్థానంలో నిలిచాయి. భూమి మొత్తం 200కు పైగా దేశాలు ఉండగా వాటిల్లో మొత్తం 7వేలకు పైగా భాషలు వాడుకలో ఉన్నాయి. ఈ జాబితా ఆర్థిక పోకడలు, అధిక జనాభా ఉన్న దేశాలు, వలస చరిత్రను కూడా ప్రతిబింబిస్తాయంటున్నారు విశ్లేషకులు భూమిపై అత్యధికంగా మాట్లాడే 12 భాషలు ఇంగ్లీష్: 1,500,000,000 మాండరిన్: 1,100,000,000 హిందీ: 609,500,000 స్పానిష్: 559,100,000 ఫ్రెంచ్: 309,800,000 ప్రామాణిక అరబిక్: 274,000,000 బెంగాలీ: 272,800,000 పోర్చుగీస్: 263,600,000 రష్యన్: 255,000,000 ఉర్దూ: 231,700,000 ఇండోనేషియన్: 199,100,000 జర్మన్: 133,200,000 -
వీటి ముందు కిలికిలి భాష బేకార్!
బాహుబలి సినిమాలో కాలకేయుల భాష గుర్తుందా? ‘కిలి కిలి’ భాష. అర్థం కాక మనమందరం కాసేపు జట్టుపీక్కున్న వాళ్లమే! కానీ.. కింది భాషల గురించి తెలుసుకుంటే.. అబ్బే.. ‘కిలి కిలి’ చాలా సుందరమైన, సులువైన భాష అని అనక మానరు మీరు! ఇంకో విషయం.. ఈ భాషలను అప్పుడు.. ఇప్పడు.. ఎవరూ మాట్లాడలేదు! ఏమిటీ విచిత్రం అనుకోక ముందే... చదవడం మొదలుపెట్టేయండి! గ్రహాంతర వాసలు గురించి మీరిప్పటికే కథలు కథలుగా విని ఉంటారు కాబట్టి.. మనం వాటిజోలికి పోవద్దు. ఇప్పటివరకూ మనిషి గ్రహాంతర వాసిని ప్రత్యక్షంగా చూసింది లేదు.. మాట్లాడింది అంతకంటే లేదు. కానీ.. ఎప్పుడో.. రేప్పొద్దున అంటే భవిష్యత్తులో వారితో మాట్లాడాల్సిన పరిస్థితి వస్తే...?? ఏం మాట్లాడతాం? ఎలా మాట్లాడతాం? తెలుగు, హిందీ, ఇంగ్లీషులు వారికి వస్తాయో రావో మనకు తెలియదు కదా! ఈ సమస్యను గుర్తించే కొందరు భాషా శాస్త్రవేత్తలు గ్రహాంతర వాసులను కలిస్తే మాట్లాడేందుక ఏకంగా ఆరు భాషలను సిద్ధం చేశారు. కిలికిలి భాష మాదిరే ఈ భాషలను కూడా ఉద్దేశపూర్వకంగా నిర్మించారు కాబట్టి వీటిని కన్స్ట్రక్టెడ్ లాంగ్వేజెస్ క్లుప్తంగా కాన్లాంగ్స్ అని పిలుస్తున్నారు. ఎక్సోలాంగ్స్ అని కూడా వీటికి పేరు! ఒక్కో దాని గురించి స్థూలంగా... 1. ఫిథ్ (Fith): గ్రహాంతర వాసుల కోసం సిద్ధం చేసిన చాలా భాషలు మానవ భాషలు అన్నింటికీ వర్తించే వ్యాకరణ సూత్రాలను ఉపయోగిస్తాయి. జెఫ్రిహెన్నింగ్స్ అనే భాష శాస్త్రవేత్త ఒక అడుగు ముందుకేసి ఈ సామాన్య వ్యాకరణ సూత్రాలన్నింటినీ అతిక్రమించేలా ఒక భాషను రూపొందిచాడు. Forth అనే కంప్యూటర్ లాంగ్వేజ్, పోస్ట్‌ఫిక్స్ నొటేషన్ కాలిక్యులేటర్లు (వీటిల్లో 2 + 4 అని రాసేందుకు బదులు 2 4 + అని రాస్తారు) స్ఫూర్తిగా తాను ఫిథ్ను రూపొందించినట్లు జెఫ్రీ చెబుతున్నారు. అంటే తెలుగులో మనం ‘రాముడు మంచి బాలుడు’ అని రాస్తే... ఫిథ్లో ‘రాముడు బాలుడు మంచి’ అని రాయాల్సి ఉంటుందన్నమాట. సంసృ్కతంలో పదకొండును ఏకాదశి (ఏక అంటే ఒకటి, దశ అంటే పది) అని పిలిచినట్టు అన్నమాట. ఫిథ్ కానీ.. సంసృ్కతం కానీ.. మాట్లాడేటప్పుడు అర్థం చేసుకోవడం సులువే కానీ... రాతలో ఉంటే మాత్రం చాలా కష్టం! ఇలాంటి క్లిష్టమైన భాషలో రెండు చేతి గుర్తులు కూడా భాగంగా ఉంటే.. మానవ మెదడు హీటెక్కాల్సిందే! ఫిథ్ మాట్లాడే గ్రహాంతర వాసుల ఒక్కో చేతికి రెండు అంగుష్టాలు ఉంటాయన్నది జెఫ్రీ ఊహ) ఫిథ్లో ఒక ఉదాహరణ... Zhong hong lin lo, అన్న పదాలను ఇంగ్లీషులోకి తర్జుమా చేస్తే “nation man loyal of.” అని వస్తుంది. పదాలు తారుమారైనట్లుగా ఉంది కదా? అవును. ఈ వాక్యం అర్థం దేశానికి నమ్మకమైన వ్యక్తి అని. ఇంకోలా చెప్పాలంటే దేశభక్తుడూ అని!. 2. రిక్‌చిక్... పేరు భలే చిత్రంగా ఉందే అనుకుంటున్నారా? భాష మరింత విచిత్రంగా ఉంటుంది. డెనిస్ మోస్కోవిట్జ్ సిద్ధం చేశాడు దీన్ని. పచ్చ రంగులో ఉండే ఒంటి కన్ను గ్రహాంతర వాసులు ఈ భాష మాట్లాడాతరన్నది డెనిస్ కల్పన. ఆల్ఫా సెంటూరైలో ఉంటారీ గ్రహాంతర వాసులన్నదీ ఆయన ఊహల్లోని విషయమే. రిక్చిక్స్ వినలేరు! కానీ.. ఒక్కో రిక్‌చిక్ శరీరంపై 49 తోకల్లాంటివి వేలాడుతూంటాయి. వీటిల్లో ఏడింటిని చేతులుగా వాడుకుంటూంటాయి. వీటితో చేసే సంకేతాలే రిక్‌చిక్ భాష అన్నమాట. ఇదంతా డెనిస్ సృష్టేనండోయ్! రిక్చిక్ల మాదిరిగా బోలెడన్ని చేతుల్లేని కారణంగా మనం వాటితో రాతపూర్వకమైన భాష ద్వారా మాత్రమే మాట్లాడగలం. లోగోలత కూడిన రిక్‌చిక్ భాషలో ఒక్కో పదంలో నాలుగు భాగాలుంటాయి. మధ్యలో పదం ప్రాథమిక అర్థం. ఉంటే ఆ పదం క్రియ? ప్రాంతం, ప్రాణమున్నదా? లేనిదా? అన్న వివరాలు చెబుతుంది. ఇది దిగువన ఎడమవైపున ఉంటుంది. ఇతర పదాలతో ఉన్న సంబంధాన్ని సూచించే గుర్తు కుడివైపు... చిన్న అక్షరమా? పెద్ద అక్షరమా అని చెప్పే భాగం పైన ఉంటుంది. రిక్‌చిక్ భాష 2012లో స్మైలీ అవార్డును గెలుచుకుంది కూడా. 3. ద్రిటోక్: డాన్ బూజర్ అనే శాస్త్రవేత్త సిద్ధం చేసిన ఏలియన్ లాంగ్వేజ్ ఇది. ఎలుక కిచకిచలను పోలినట్టు ఓ భాషను తయారు చేయవచ్చా? అన్న సింపుల్ ఆలోచన నుంచి ద్రిటోక్ పుట్టుకొచ్చిందని డాన్ చెబుతారు. అయితే ఈ భాషను సిద్ధం చేయడం ఏమంత ఆషామాషీ వ్యవహారమేమీ కాదు. ఈ భాషలో అచ్చులూ ఉండవు. పాము బుసలు, క్లిక్ శబ్దాలతో కూడి ఉంటుందీ భాష. స్వరపేటికలోని తంత్రుల ప్రకంపనాలతో ఏర్పడుతుందన్నమాట. ద్రుషెక్ అనే గ్రహాంతర వాసుల భాష ఈ ద్రిటోక్. వీరికి వోకల్ కార్డ్స్' ఉండవు. పొడవైన తోకలుంటాయి. బాగా గెంతగలవు. ద్రిటోక్లో 50 వరకూ తేడాలతో చేతి సంజ్ఙలూ ఉంటాయి. ఒక ఉదాహరణ చూడండి.. అర్థం చేసుకోవాల్సిన పనేమీ లేదు.. ద్రిటోక్ భాషలో “tr’w.cq.=P4=C3^Q3-pln.t’.” అంటే.. ‘‘The Drushek, he holds a cloak’’ అని అర్థం. ఈ భాషను ఎలా మాట్లాడతారో తెలుసుకోవాలంటే.. ఈ ఆడియో ఫైల్స్ వినండి. 4.లింకోస్: గ్రహాంతర వాసులను వెతికేందుకు ఏర్పాటు చేసుకున్న సంస్థ సెటీ శాస్త్రవేత్తలు రూపొందించారీ భాషను. భాష రాని వారికి కూడా అర్థమయ్యేలా చెప్పేందుకు ఉద్దేశించిన లింగ్వా ఫ్రాంకా భాషలు (ప్లెయిన్స్ ఇండియన్ సైన్ లాంగ్వేజ్, వంటివి)లను ఖగోళానికి వర్తింపజేసి హాన్స్ ఫ్రాయిడెథాల్ లింగ్వా కాస్మికా అనే భాషను తయారు చేస్తే.. సెటీ శాస్త్రవేత్తలు దాన్ని మరింత అభివృద్ధి చేశారు. లింగ్వా కాస్మికా కాస్తా లింకోస్ అయ్యిందన్నమాట. 1960లోనే హాన్స్ ఫ్రాయిడెథాల్ ఈ భాషను తన పుస్తకం ‘లింకోస్’లో విశదీకరించారు. మనుషులు ప్రపంచాన్ని ఎలా చూస్తారో గ్రహాంతర వాసులకు వివరించేలా ఉంటుందీ భాష. అంకెలకు తగ్గ కాంతి పుంజాలు పంపడం. ప్రాథమిక గణిత శాస్త్ర గురుతులతో మొదలుపెట్టి... అతి సంక్లిష్టమైన ‘ప్రేమ’ అన్న భావనను వివరించే వరకూ సాగుతుంది లింకోస్. సెటీ శాస్త్రవేత్తలు ఇప్పటికే లింకోస్ ఆధారంగా గ్రహాంతర వాసులను ఉద్దేశించి కొన్ని సందేశాలు పంపారు కూడా. 5. లిజెనా: పీటర్ బ్లీక్‌లీ సిద్ధం చేసిన గ్రహాంతర వాసుల భాష ఈ లిజెనా. స్లైవియా సోటోమేయర్ తాలూకూ గ్రహాంతర భాష ‘క్లెన్’ స్ఫూర్తితో తయారైంది ఇది. క్రియల్లేని భాషగా దీనికి పేరు. కాకపోతే బ్లీక్‌లీ లిజెనాలో ప్రతి నామవాచకం క్రియగానూ పనిచేస్తుంది. 2015లో జరిగిన లాంగ్వేజ్ క్రియేషన్ కాన్ఫరెన్స్‌లో బ్లీక్‌లీ మాట్లాడుతూ లిజెనా మాట్లాడే గ్రహాంతర వాసుల గురించి తన ఆలోచనలను ఇలా పంచుకున్నారు. ‘‘లిజెనా మాట్లాడే వారు లీయెన్లు. పిల్లులకు మూతిమీద స్పర్థను గుర్తించగలిగే వెంట్రుకల్లాంటివి ఉంటే లీయెన్లకు అలాంటివి శరీరం మొత్తమ్మీద ఉంటాయి. ఈ లక్షణం వల్ల పరిసరాల్లో జరిగే అతిసూక్ష్మమైన మార్పులను కూడా ఇవి గుర్తించగలవు. దీనికి తగ్గట్టుగానే వారి లిజెనా కూడా ఉంటుంది’’ అని వివరించారు. 6. ఏయూఐ: ఆస్ట్రియా సైకోఅనలిస్ట్ వూల్ఫ్‌గ్యాంగ్ జాన్ వీల్గార్ట్ రూపకల్పన ఈ ‘ఈయూఐ’ భాష. చిన్నప్పుడు ఓ గ్రహాంతర వాసి తన కలల్లో వచ్చి మాట్లాడిందన్న నమ్మకం ఆధారంగా వూల్ఫ్‌గ్యాంగ్ ఈ భాషను సిద్ధం చేశారు. 1930 40లలో నాజీల ప్రచారం హోరెత్తుతున్న తరుణంలో వూల్ఫ్‌గ్యాంగ్ ఆ నినాదాలను తీవ్రంగా వ్యతిరేకించేవాడు. మనిషి మనసులను సబ్కాన్షస్ స్థాయిలో ప్రభావితం చేస్తాయీ నినాదాలని నమ్మేవాడు. ఈ నేపథ్యంలోనే 1958లో ఆయన ఈ ‘ఏయూఐ’ భాషను రూపొందించారు. కొన్ని గంటల్లో నేర్చుకోగల ఈ భాషను వూల్ఫ్‌గ్యాంగ్ ‘అంతరిక్ష భాష’గా అభివర్ణించడం గమనార్హం. ఈ ఏయూఐ భాషలో 31 సంకేతాలు ఉంటాయి. వీటి మేళవింపుతో కొత్త అర్థాలను సృష్టించవచ్చు. -
తెలుగు వర్సిటీని అంతర్జాతీయ స్థాయిలో నిలపాలి
నాంపల్లి (హైదరాబాద్): దేశంలో సంస్కృత, హిందీ, పాశ్చాత్య భాషలకు కేంద్రీయ విశ్వవిద్యాలయాలు ఏర్పడినట్లుగా తెలుగు భాషకు కూడా జాతీయ స్థాయిలో ఒక విశ్వవిద్యాలయం ఏర్పడితే తప్ప తెలుగు భాషా, సంస్కృతిని విస్తృత స్థాయిలో భవిష్యత్ తరాలకు అందించలేమని సుప్రీంకోర్టు విశ్రాంత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డాక్టర్ ఎన్వీ రమణ అభిప్రాయపడ్డారు. శనివారం తెలుగు వర్సిటీ ఎన్టీఆర్ కళా మందిరంలో ఏర్పాటు చేసిన మండలి వెంకటకృష్ణారావు సంస్కృతీ పురస్కార ప్రదానోత్సవ సభకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. తెలుగు వర్సిటీ ఆశించిన స్థాయిలో లేదని అసంతృప్తిని వ్యక్తం చేశారు. నగర శివార్లలోని బాచుపల్లిలో వందెకరాల విస్తీర్ణంలో ఏర్పాటు కాబోతున్న తెలుగు విశ్వవిద్యాలయాన్ని అంతర్జాతీయ విశ్వవిద్యాలయంగా తీర్చిదిద్దాల్సిన అవసరం ఉందన్నారు. అందుకు తెలుగు భాషపై మక్కువ కలిగిన, భాషకు ఎనలేని కృషి చేస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి చొరవ తీసుకోవాలని కోరారు. సభకు అధ్యక్షత వహించిన వర్సిటీ ఉపాధ్యక్షుడు ఆచార్య తంగెడ కిషన్‌రావు మాట్లాడుతూ... రాష్ట్ర తర తెలుగు సంస్థలకు తెలుగు విశ్వవిద్యాలయం తెలుగు భాషా సంస్కృతి ఔన్నత్యాన్ని పెంచే సాహిత్యాన్ని అందజేయడమే కాకుండా ఆయా సంస్థలతో ఒప్పందం చేసుకుని తెలుగు భాష, బోధన, పరివ్యాప్తికి కృషి చేస్తున్నదని అన్నారు. విశిష్ట అతిథిగా హాజరైన రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు బోయినపల్లి వినోద్ కుమార్ మాట్లాడుతూ... శాస్త్రీయ విజ్ఞానం మాతృ భాషలో విద్యార్థులకు అందుబాటులో ఉంచితే దేశం మరింత అభివృద్ధి సాధిస్తుందని పేర్కొన్నారు. ఆత్మియ అతిథిగా హాజరైన మండలి బుద్ధ ప్రసాద్ మాట్లాడుతూ... ఉభయ తెలుగు రాష్ట్రాలలోని తెలుగు వారికన్నా ప్రవాసాంధ్రులకే తెలుగు భాషపై మక్కువ ఎక్కువని అన్నారు. జర్మనీ మాజీ ఎంపీ డాక్టర్ జి.రవీంద్ర కార్యక్రమంలో పాల్గొని తెలుగులో మాట్లాడి సభికులను ఆకట్టుకున్నారు. అంతర్జాతీయంగా తెలుగు భాషా సంస్కృతి, ఆధ్యాత్మిక వికాసానికి చిరస్మరణీయమైన సేవలందిస్తున్న లండన్‌లోని యునైటెడ్ కింగ్డమ్ తెలుగు అసోసియేషన్ (యుక్తా) సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు సత్య ప్రసాద్ కిల్లీకి మండలి వెంకట కృష్ణారావు సంస్కృతి పురస్కారాన్ని ప్రదానం చేశారు. ఈ కార్యక్రమానికి మండలి వెంకటకృష్ణారావు తెలుగు కేంద్రం సంచాలకులు ఆచార్య వై.రెడ్డి శ్యామల సమన్వయకర్తగా వ్యవహరించగా, సంస్థ కో ఆర్డినేటర్ డాక్టర్ విజయ్‌పాల్ పాత్లోత్ వందన సమర్పణ చేశారు. -
ఎన్ఈపీలో ప్రతి భారతీయ భాషకు తగు గౌరవం
న్యూఢిల్లీ: నూతన జాతీయ విద్యా విధానం(ఎన్ఈపీ) ద్వారా దేశంలోని ప్రతి భాషకూ సముచిత గౌరవం లభిస్తుందని ప్రధాని మోదీ చెప్పారు. స్వార్థ ప్రయోజనాల కోసం భాషపై రాజకీయం చేసే వారు తమ దుకాణాలను మూసేసుకోవాలని ఆయన వ్యాఖ్యానించారు. శక్తి సామర్థ్యాల ఆధారంగా కాకుండా భాష ప్రాతిపదికన ప్రతిభను అంచనా వేయడం వల్ల విద్యార్థులకు తీరని అన్యాయం జరుగుతోందని చెప్పారు. ఎన్ఈపీ ప్రారంభమై మూడో వార్షికోత్సవా న్ని పురస్కరించుకుని ఏర్పాటైన ‘అఖిల భారతీయ శిక్షా సమాగమ్’నుద్దేశించి ఆయన ప్రసంగించారు. ‘మాతృభాషలో విద్యా బోధన ద్వారా భారతీయ విద్యార్థులకు న్యాయం చేసే కొత్త రూపానికి నాంది పలుకుతోంది. సామాజిక న్యాయం దిశగా ఇది చాలా ముఖ్యమైన అడుగు’అని ప్రధాని అన్నారు. ప్రపంచంలోని అనేక భాషలు, వాటి ప్రాముఖ్యతను ప్రస్తావిస్తూ ప్రధానమంత్రి.. అనేక అభివృద్ధి చెందిన ముఖ్యంగా యూరప్ దేశాలు విద్యాబోధన స్థానిక భాషల్లో జరుగుతున్నందునే ఒక అడుగు ముందుకు వేశాయని చెప్పారు. మన దేశంలో అనేక ప్రాచీన భాషలున్నప్పటికీ, వాటిని వెనుకబాటుకు చిహ్నంగా చూపుతు న్నారని, ఇంగ్లిష్ మాట్లాడలేని వారిని విస్మరించారని, వారి ప్రతిభను గుర్తించడం లేదని మోదీ విచారం వ్యక్తం చేశారు. ‘ఫలితంగా గ్రామీణ ప్రాంతాల్లోని చిన్నారులు ఎక్కువగా నష్టపోతున్నారు. ఎన్ఈపీ రాకతో దేశం ఇప్పుడు ఈ నమ్మకాన్ని విస్మరించడం ప్రారంభించింది. ఐక్యరాజ్యసమితిలో కూడా నేను భారతీయ భాషలోనే మాట్లాడతాను’ అని చెప్పారు. సామాజిక శాస్త్రాల నుంచి ఇంజినీరింగ్ విద్య వరకు అన్ని సబ్జెక్టుల్లోనూ భారతీయ భాషల్లోనే బోధిస్తున్నారని తెలిపారు. భాషపై విద్యార్థులు పట్టుసాధించగలిగితే, ఎలాంటి అవరోధాలు లేకుండా వారిలో నైపుణ్యం, ప్రతిభ బయటికొస్తాయని ప్రధాని అన్నారు. ప్రపంచం భారతదేశాన్ని కొత్త అవకాశాల వేదికగా చూస్తోంది. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ) క్యాంపస్‌లను ఏర్పాటు చేయాలంటే అనేక దేశాలు కేంద్ర ప్రభుత్వాన్ని సంప్రదిస్తున్నా యని వెల్లడించారు. ఇప్పటికే టాంజానియా, అబుధాబిల్లో ఐఐటీ క్యాంపస్‌లు నెలకొల్పార ని చెప్పారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ శ్రీ (ఎస్హెచ్ఆర్ఐ) పథకం కింద మొదటి ఇన్స్టాల్మెంట్ నిధులను విడుదల చేశారు. -
ఆ దేశంలో వాడుకలో 840 భాషలు.. భారత్‌లో ఎన్ని భాషలంటే..
ప్రపంచంలోని ప్రతి వ్యక్తి తన ఆలోచనలను ఇతరులకు తెలియజేయాలన్నా.. ఇతరులు చెప్పేవి అర్థం చేసుకోవాలన్నా ‘భాష’ ముఖ్యం. ప్రపంచవ్యాప్తంగా 6,500కు పైగా భాషలు వాడుకలో ఉండగా.. అందులో 840 భాషలు పపువా న్యూ గినియా అనే చిన్న దేశంలో వాడుకలో ఉన్నట్లు వెల్లడయ్యింది. దీంతో ప్రపంచంలోనే అత్యధిక భాషలు వాడుకలో ఉన్న దేశంగా పపువా న్యూ గినియా రికార్డులకెక్కింది. ఆసియా, ఆస్ట్రేలియా ఖండాల మధ్యలో 4,62,840 కి.మీ విస్తీర్ణంలో ఉన్న ఈ దేశ జనాభా 94 లక్షలే. కానీ ఇప్పటికీ అక్కడి ప్రజలు 840 భాషల్లో మాట్లాడుకుంటూ ఉంటారు. అక్కడ ఇంగ్లిష్ అధికార భాష కాగా.. హిరిమోటు, పీఎన్జీ సింగ్, టోక్ పిసిన్ తదితర భాషలను ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. ఇక ఇండోనేసియా 710 భాషలతో రెండో స్థానంలో నిలిచింది. నైజీరియా 524 భాషలతో మూడో స్థానంలో, భారత్ 453 భాషలతో 4వ స్థానంలో నిలిచాయి. ఇక, 337 భాషలతో అమెరికా ఐదో స్థానంలో, 317 భాషలతో ఆస్ట్రేలియా ఆరో స్థానం ఉండగా, 307 భాషలతో చైనా ఏడో స్థానంలో కొనసాగుతోంది. ఉత్తర కొరియా ప్రజలు.. కొరియన్ తప్ప ఇతర భాషలను ఉపయోగించరు.ఆ తర్వాత వాటికన్ సిటీలో రెండు, ఐస్‌ల్యాండ్‌లో రెండు, దక్షిణ కొరియాలో 5 భాషలే వాడకలో ఉన్నాయి. అలాగే అత్యధిక దేశాల్లో ఇంగ్లిష్ భాషను ఉపయోగిస్తున్నట్లు వెల్లడైంది. 67 దేశాల్లో ఇంగ్లిష్, 29 దేశాల్లో ఫ్రెంచ్, 27 దేశాల్లో అరబిక్, 21 దేశాల్లో స్పానిష్, 10 దేశాల్లో పోర్చుగీస్, ఆరు దేశాల్లో జర్మన్, నాలుగు దేశాల్లో రష్యన్ భాష వాడుకలో ఉంది. ఇది కూడా చదవండి: హలో.. ఆస్ట్రోనాట్..! -
ఆధార్ బిగ్ అప్డేట్ ఒక్క ఫోన్ తో ఆధాార్ సమస్యలకు చెక్
-
‘మీరెవరండీ బాబూ’.. ఇదెలా ఎలా సాధ్యం?
‘ఎన్ని పాటలు పాడగలరు?’ అని అడిగితే ‘ఎన్నయినా సరే’ అంటారు పాటలను ప్రేమించే గాయకులు. ‘ఒకే ఒక్క నిమిషంలో ఎన్ని పాడగలరు?’ అని అడిగితే మాత్రం– ‘మీరెవరండీ బాబూ’ అంటారు. అయితే సాత్ కొరియాకు చెందిన ఒక యువ జంట ఇండోనేషియా నుంచి ఇండియా (బాలీవుడ్ సినిమా సుఖూన్లోని దిల్ కో ఖరార్ ఆయా.. పాట) వరకు తొమ్మిది భాషలలో 13 పాటలు పాడారు. ఈ వీడియో 2.1 మిలియన్ల వ్యూస్ సొంతం చేసుకొని దూసుకుపోతోంది. ‘ఇది సరేగానీ.. ఒక్క నిమిషంలో 13 పాటలు ఎలా సాధ్యం?’ అనే సందేహం అందరికీ వస్తుంది. 13 పాటలలోని ఒక్కో చరణాన్ని తీసుకొని ఒకే పాటలా చాలా స్పీడ్‌గా పాడారు. చదవండి: ఈమె దెయ్యమా.. మనిషా..? అనుమానం వస్తే తప్పులేదు.. ఎందుకంటే? -
మూడు లాంగ్వేజ్‌లు రాసుకునే ఆప్షన్ ఇవ్వండి
సాక్షి, హైదరాబాద్: 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు అంధ విద్యార్థులు రెండు లాంగ్వేజ్‌లు మాత్రమే రాసుకునే అవకాశం ఇస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవో నంబర్ 27ను సవాల్ చేస్తూ అంధుల అభివృద్ధి, సంక్షేమ సంఘం హైకోర్టును ఆశ్రయించింది. మూడు లాంగ్వేజ్‌లు రాయాలా.. రెండు లాంగ్వేజ్‌లు రాయాలా.. అనేది అంధులకు ఆప్షన్ ఇవ్వాలని విజ్ఞప్తి చేసింది. ఈ పిటిషన్‌పై న్యాయమూర్తి జస్టిస్ కె.లక్ష్మణ్ విచారణ చేపట్టారు. పిటిషనర్ తరఫున న్యాయవాది ఎన్ఎస్ అర్జున్‌కుమార్ వాదనలు వినిపించారు. లాంగ్వేజ్‌లు విద్యార్థుల భవిష్యత్‌కు ఎంతో ముఖ్యమని.. రెండు లాంగ్వేజ్‌లు మాత్రమే చదివితే.. ముందుముందు పోటీ పరీక్షలకు, ఉద్యోగాలకు ఇబ్బందిగా మారుతుందని నివేదించారు. విద్యార్థులు ఇప్పటికే మూడు లాంగ్వేజ్‌లు చదివారని, తుది పరీక్షల్లో వారిని రెండు మాత్రమే రాయాలని ఒత్తిడి చేయడం సరికాదని, ప్రభుత్వ జీవోను కొట్టివేయాలని కోరారు. ప్రభుత్వ న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. మూడు లాంగ్వేజ్‌లు రాసుకునే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోందని, వీలైనంత త్వరగా నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. దీంతో న్యాయమూర్తి.. తదుపరి విచారణను మార్చి 12కు వాయిదా వేశారు. -
నేటి నుంచి తెలుగు భాషా అమృతోత్సవాలు
సాక్షి, హైదరాబాద్: తెలుగు భాష, సాహితీ, సాంస్కృతిక సేవా సంస్థ ఆధ్వర్యంలో మంగళవారం నుంచి ఈ నెల 29 వరకు తెలుగు భాషా అమృతోత్సవాలను జరుపతలపెట్టినట్లు సంస్థ వ్యవస్థాపక చైర్మన్ కంచర్ల సుబ్బానాయుడు తెలిపారు. రవీంద్రభారతిలో మంగళవారం టంగుటూరి ప్రకాశం పంతులు జయంత్యుత్సవాలతో ఇవి ప్రారంభమవుతాయని, తొలిరోజు జరగనున్న కార్యక్రమాలకు సమన్వయకర్తలుగా లక్ష్మీ పెండ్యాల, పేరి,, ఖాదర్ బాషా, అమరనేని సుకన్య, ఇమ్మడి రాంబాబు, వడ్డేపల్లి విజయలక్ష్మి వ్యవహరిస్తారని వివరించారు. వారం పాటు ప్రతీ రోజూ సాహితీ సదస్సులు, సాహితీ ప్రక్రియలు, కవి సమ్మేళనాలు, కవులకు గౌరవ పురస్కారాలు, పుస్తకావిష్కరణలు, పుస్తక ప్రదర్శనలు ఉంటాయన్నారు. (చదవండి: బంగారు కాదు బార్ల తెలంగాణ: షర్మిల) -
చిచ్చర పిడుగు!...13 ఏళ్ల వయసులో 17 కంప్యూట్ భాషలు...
కొంతమంది పిల్లలు అత్యంత చురుకుగా అతి చిన్న వయసులోనేఅన్ని నేర్చుకుంటారు. జౌరా! అనిపించేలా పెద్దలే ఇబ్బంది పడి నేర్చుకున్న వాటిని సైతం అలవొకగా నేర్చుకుంటారు. అచ్చం అలానే ఇక్కడొక చిన్నారి అతి పిన్న వయసులోనే కంప్యూటర్ భాషలను నేర్చుకున్నాడు. ఒకటి రెండు కాదు ఏకంగా 17 ప్రోగామింగ్ లాంగ్వేజ్‌లను సునాయాసంగా నేర్చకున్నాడు. ఇంతకీ ఆ చిన్నారి ఎవరంటే?... వివరాల్లోకెళ్తే....తమిళనాడులోని కోయంబత్తూరుకు చెందిప అర్నవ్ శివరామ్ 13 ఏళ్ల వయసులోనే 17 కంప్యూటర్ భాషలను నేర్చుకున్నాడు. అంతేకాదు ఆ చిన్నారి అతి పిన్నవయసులో కంప్యూటర్ భాషలను నేర్చుకున్న వారిలో ఒకడిగా నిలిచాడు. శివరామ్ 4 వతరగతి చదువుతున్నప్పుడే కంప్యూటర్ భాషలను నేర్చుకోవడం ప్రారంభించాడు. జావా, ఫైథాన్‌తో సహా మొత్తం 17 ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌లను నేర్చుకున్నాడు. అంతేకాదు భారత్‌లో తక్కువ పెట్టుబడితో ఆటో పైలెట్ కోసం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ని రూపొందించాలని యోచిస్తున్నట్లు శివరామ్ తెలిపాడు. ఈ విషయం నెట్టింట వైరల్ అవ్వడంతో పలువురు నెటిజన్లు ఆ చిన్నారికి మంచి భవిష్యత్తు ఉందంటూ ప్రశంసిస్తున్నారు. Tamil Nadu | Coimbatore's Arnav Sivram becomes one of the youngest children to have learnt 17 computer languages at the age of 13 I started learning computers when I was in 4th grade. I have learnt 17 programming languages including Java & Python, he said pic.twitter.com/FTehgFHrBt — ANI (@ANI) July 2, 2022 -
ఇదెక్కడి మాస్ రిలీజ్ జేమ్స్ మావా.. అన్ని భాషల్లో 'అవతార్ 2' సినిమా !
James Cameron Avatar 2 Movie Release: అవతార్.. 2009లో జేమ్స్ కామెరాన్ సృష్టించిన విజువల్ వండర్ ఈ సినిమా. హైలెవెల్ గ్రాఫిక్ వర్క్‌తో ఒక సరికొత్త ఊహ ప్రపంచంలో విహరించేలా చేసింది ఈ మూవీ. పండోరా లోకం, అక్కడి మనుషులు, ఆ వింత గుర్రాలు, వాటితో హీరో చేసే సాహసాలు ప్రేక్షకులను ఆశ్చర్యపరిచాయి. ఇన్ని అద్భుతాలు ఉన్న ఈ సినిమా అనేక అభిమానులను సంపాదించుకుంది. ఈ సినిమాకు సీక్వెల్‌గా 'అవతార్ 2' తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఈ మూవీ ట్రైలర్‌ను 'డాక్టర్ స్ట్రేంజ్: ఇన్ ది మల్టీవర్స్ ఆఫ్ మ్యాడ్నెస్' సినిమా ప్రదర్శించే థియేటర్లలో రిలీజ్ చేయనున్నట్లు ఇదివరకే ప్రకటించారు మేకర్స్. తాజాగా ఈ మూవీ గురించి వచ్చిన అప్డేట్ ఆడియెన్స్ వరల్డ్‌ను ఆశ్చర్యపరిచేలా ఉంది. అవతార్ 2 డిసెంబర్ 16, 2022న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. అది కూడా ఏకంగా 160 భాషల్లో (Avatar 2 Movie Release In 160 Languages). అవును. అవతార్ 2 సినిమాను సుమారు 160 భాషల్లో రిలీజ్ చేయనున్నారట. ఒకవేళ ఇదే జరిగితే సినీ చరిత్రలోనే ఇది రికార్డ్‌గా నెలకొల్పనుంది. అలాగే త్రీడీ, 4కె, 5కె, 8కె వీడియో ఫార్మాట్లలో రిలీజ్ చేయనున్నారని సమాచారం. అంతేకాకుండా బుధవారం (ఏప్రిల్ 27) ఈ సినిమా గ్లింప్స్‌ను 'సినిమా కాన్'లో ప్రీమియర్‌గా ప్రదర్శించానున్నారని టాక్. చదవండి: ప్రేక్షకులకు కనువిందు.. ఆ సినిమాతో 'అవతార్ 2' ట్రైలర్ ! ఓటీటీలోకి ప్రియాంక చోప్రా హాలీవుడ్ మూవీ.. ఎప్పుడు? ఎక్కడంటే? var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4231450453.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
కాస్త సరదాగా నేర్చుకుందాం...
కాలంతో పాటు ఆసక్తులు మారుతుంటాయి. అయితే అవి కాలక్షేప ఆసక్తులు కాకుండా భవిష్యత్ కార్యాచరణకు అవసరమైనవి అయితే ఎంతో బాగుంటుంది. ప్రస్తుతం జరుగుతున్నది అక్షరాలా అదే! బ్రిటిష్ సాప్ట్వేర్ డెవలపర్,రచయిత, పబ్లిక్ స్పీకర్ మార్టిన్ ఫౌలర్ ‘ప్రోగామ్ రాయడానికి అసాధారణమైన నైపుణ్యం అక్కర్లేదు’ అని ఎంతోమందికి చెప్పి పుణ్యం కట్టుకున్నాడు. ‘మీ హాబీస్ ఏమిటి?’ అనే ప్రశ్నకు ‘సినిమాలు చూడడం’ ‘సంగీతం వినడం’ ‘కవిత్వం రాయడం’ ‘ఫేస్బుక్లో పోస్ట్‌లు పెట్టడం’... ఇలాంటి సమాధానాలు ‘యూత్’ నుంచి రావడం ఎప్పుడూ ఉండేదే. అయితే ఇప్పుడు కొత్తగా వినిపిస్తున్న మాట... ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్! ‘సరదాగా ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ నేర్చుకుంటున్నాను’ అని చెప్పేవారు పెరుగుతున్నారు. అయితే తమ చదువుకు కొనసాగింపుగానో, భవిష్యత్ ప్రణాళికలో భాగంగానో నేర్చుకోవడం లేదు. కాస్త సరదాగా మాత్రమే నేర్చుకుంటున్నారు. కోవిడ్ సృష్టించిన విరామసమయం ఎన్నో ‘డిజిటల్’ ఆసక్తులకు తెరతీసింది. అందులో ప్రోగామింగ్ లాంగ్వేజెస్ కూడా ఒకటి. యూత్ ఆసక్తి చూపుతున్న లాంగ్వేజెస్‌లలో టెక్ దిగ్గజం యాపిల్ అఫిషియల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ‘స్విఫ్ట్’లాంటివి ఉన్నాయి. ఈ లాంగ్వేజ్ నేర్చుకోవడానికి స్విఫ్ట్ ప్రోగామింగ్ ఫర్ బిగినర్స్... మొదలైన ఆన్లైన్ కోర్సులను ఆశ్రయిస్తున్నారు. ఇక పైథాన్ సంగతి సరేసరి. ఇంట్రడక్షన్ టు ఫైథాన్ ప్రోగ్రామింగ్, పైథాన్ ఫ్రమ్ బిగినెర్ టు ఇంటర్మీడియట్ ఇన్ 30 మినిట్స్, ఎనాలసిస్ డాటా విత్ ఫైథాన్... మొదలైన ఫ్రీ ఆన్లైన్ కోర్సులు యువతను ఆకర్షిస్తున్నాయి. ఈ కోర్సులు పైథాన్ ప్రోగ్రామింగ్‌కు బేసిక్ ఇంట్రడక్షన్ గా పనిచేస్తున్నాయి. వీటి ద్వారా స్క్రిప్ట్, ఫంక్షన్స్ రాయడంలో మెలకువలు నేర్చుకుంటున్నారు. ఈ ఫ్రీ కోర్సు నేర్చుకోవడానికి 5 వారాల సమయం పడుతుంది. ‘టెక్నికల్ విషయాలు అంటే నాకు పెద్దగా ఆసక్తి లేదు’ అనే వాళ్లు కూడా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌ను నేర్చుకోవడానికి ఆసక్తి చూపుతున్నారు. ‘నేర్చుకున్నది ఏదీ వృథా పోదు’ అన్నట్లుగా తాము నేర్చుకుంటున్న ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ తమలోని సృజనను పదునుపెట్టడానికి పనికొస్తున్నాయి. ప్రోగామింగ్‌లో లాజిక్, ప్రాబ్లమ్ సాల్వింగ్, ఆర్గనైజేషన్... అనే కీలక అంశాలు తమను తాము మెరుగుపరుచుకోవడానికి ఉపయోగపడుతున్నాయి. ప్రోగ్రామింగ్‌లో నిరూపించుకోవడానికి కంప్యూటర్ సైన్స్ పట్టాతో అట్టే పనిలేదని నిరూపించుకోవడానికి బిలాల్‌ను ఉదాహరణగా చూపవచ్చు. ముంబైకి చెందిన బిలాల్ ఫైనాన్స్ డిగ్రీ చేసిన విద్యార్థి. టెక్ విషయాలపై ఆసక్తితో ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌లు నేర్చుకున్నాడు. ఇదేమీ వృ«థా పోలేదు. చిన్నపాటి సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం వచ్చేలా చేసింది. తరువాత తానే ఒక సాఫ్ట్వేర్ ల్యాబ్‌ను మొదలుపెట్టాడు. పదవ తరగతి మధ్యలో మానేసిన వాళ్లు కూడా ప్రోగ్రామింగ్‌లో అద్భుత మైన ప్రతిభ చూపుతున్న ఉదాహరణలు మనకు ఉన్నాయి. వీరు మార్టిన్ ఫౌలర్ మాట విని ఉండకపోవచ్చు. అతడి ఉపన్యాసంతో ప్రభావితమైన అనేక మందిలో మనం లేకపోవచ్చు. అయితే ఆయన చెప్పిన ‘ప్రోగ్రాం రాయడానికి అసాధారణమైన నైపుణ్యం అక్కర్లేదు’ అనే మాటతో మాత్రం పూర్తిగా ఏకీభవిస్తారు. కొంతకాలం క్రితం గ్లోబల్ డిజిటల్ పేమెంట్స్ ప్లాట్‌ఫామ్ ‘పే పాల్’ ఒక సర్వే నిర్వహించింది. స్కూల్, కాలేజీలలో చదివే 96 శాతం మంది అమ్మాయిలు కొత్త సాంకేతిక విషయాలు నేర్చుకోవడానికి అమిత ఆసక్తి చూపుతున్నారని చెప్పింది. ఈ సంతోషాన్ని రెట్టింపు చేసింది తాజా బైట్ ఎక్స్ఎల్ సర్వే. హైదరాబాద్‌కి చెందిన ఎడ్యుకేషనల్ టెక్నాలజీ సంస్థ ‘బైట్ ఎక్స్ఎల్’ డీప్ టెక్ ఇన్సైట్స్ 2021–2022 నివేదిక సాంకేతిక అంశాల పట్ల అమ్మాయిలు ఆసక్తి చూపుతున్నారని, నైపుణ్యం పెంచుకోవడానికి ప్రయత్నిస్తున్నారని తెలియజేసింది. -
అక్కడ భర్త ఎడ్డెం అంటే భార్య తెడ్డెం అనాల్సిందే, ఎందుకంటే..
భర్త ఎడ్డెం అంటే భార్య తెడ్డెం అనడం కామన్. కానీ, ఇక్కడ మాత్రం అన్నా, తమ్ముడు, స్నేహితుడు ఆఖరుకు నాన్న మాట్లాడినా కూడా వారితో పాటు సమానంగా అదే మాటను ఏ మహిళా అక్కడ పలకదు. ఆశ్చర్యపోకండి. అవును.. అక్కడి ప్రజల్లో ఏ జెండర్‌కు ఆ భాష నడుస్తోంది. అంటే అక్కడి మహిళలకు, పురుషులకు వేర్వేరు భాషలు ఉన్నాయి. ఉదాహరణకు దుస్తులను పురుషుడు ‘నికి’ అంటే, స్త్రీ ‘అరిగా’ అని.. చెట్టును ‘కిచి’ అంటే ‘ఓక్వెంగ్’ అనే భిన్న పదాలతో సంభాషిస్తారు. కేవలం వారి భాషలే కాదు, లిపులు కూడా వేర్వేరుగానే ఉంటాయి. తరతరాలుగా వారు ఇదే పద్ధతి అవలంబిస్తున్నారు. మరి, ఆ ప్రాంత ప్రజలు జీవనం ఎలా సాగిస్తున్నారు?, అక్కడ ఓ స్త్రీ మరో స్త్రీతో తప్ప.. ఒక పురుషుడు మరో పురుషుడితో తప్ప స్త్రీ, పురుషులు ఒకరితో ఒకరు మాట్లాడుకోరా? అని అనుకుంటే పొరపాటే.. ఇద్దరికీ రెండు భాషలు తెలుసు. కానీ, సంప్రదాయాన్ని గౌరవించి కేవలం వారు మాట్లాడే భాషల్లోనే మాట్లాడతారు. కేవలం వారి పిల్లలకు తప్ప మరో తెగతో కానీ, సమాజంతో గానీ వారి భాషలను నేర్పించడానికి ఇష్టపడరు. కారణం అక్కడి స్త్రీలు శుక్రగ్రహం నుంచి పురుషులు అంగారక గ్రహం నుంచి వచ్చారని, ఇది దైవ రహస్యం అని వారి నమ్మకం. విచిత్రంగా ఉన్నా ఇదే నిజం. ఇంతకీ వారు ఎవరో చెప్పలేదు కదా. నైజీరియా అడవుల్లో నివసించే ఓ ఆటవిక తెగ ప్రజలు. -
బెంగళూరులో 106 భాషల ప్రజలు
బనశంకరి: సిలికాన్ సిటీ బెంగళూరులో ఎన్ని భాషలు మాట్లాడేవారు నివసిస్తుండవచ్చు? దీనికి సమాధానం 20 లేదా 30 అనుకుంటున్నారా.. కాదు.. 106..! అని ఒక సర్వే తేల్చింది. 2011 జనాభా లెక్కల ఆధారంగా ఢిల్లీకి చెందిన ఓ నిపుణుడు నిర్వహించిన పరిశోధనలో ఇది వెల్లడైంది. బెంగళూరులో 22 అధికార, 84 ఇతరత్రా భాషలు మాట్లాడే ప్రజలు జీవనం సాగిస్తున్నారని తెలిపారు. ఇందులో 44.5% మంది కన్నడ మాట్లాడేవారు కాగా, 15% తమిళం, 14% తెలుగు, 12% ఉర్దూ, 3% మలయాళీలు, 6% మంది ఇతర భాషలు మాట్లాడే ప్రజలున్నారు. చదవండి: ఐఫోన్‌తో కేక్ కట్ చేసి.. ఎమ్మెల్యే కొడుకు బర్త్‌డే వేడుకలు: వైరల్ -
ఈ రోబో 47 భాషలు మాట్లాడుతూ.. మనుషులను గుర్తిస్తుంది
న్యూఢిల్లీ: ప్రముఖ దర్శకుడు శంకర్ తెరకెక్కించిన ‘రోబో’ చిత్రం నుంచి స్ఫూర్తి పొందిన ఓ ఉపాధ్యాయుడు 47 భాషలు అనర్గళంగా మాట్లాడే మరమనిషిని(రోబో) రూపొందించాడు. దీనికి ‘షాలూ’ అని నామకరణం చేశాడు. ఇది 9 స్థానిక భాషలు, 38 విదేశీ భాషలు మాట్లాడగలదు. ఉత్తరప్రదేశ్‌కి చెందిన దినేశ్ పటేల్ ఐఐటీ-బాంబేలోని కేంద్రీయ విద్యాలయంలో కంప్యూటర్ సైన్స్ టీచర్‌గా పని చేస్తున్నాడు. ‘రోబో’ చిత్రం చూసిన తర్వాత అలాంటి మరమనిషిని తయారుచేయాలని సంకల్పించాడు. ప్లాస్టిక్, కార్డుబోర్డ్, అల్యూమినియం, ఇనుము, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్, చెక్క వ్యర్థాలతో ‘షాలూ’కు తుదిరూపం తీసుకొచ్చాడు. ఇందుకోసం మూడేళ్ల సమయం పట్టిందని, రూ.50,000 ఖర్చు చేశానని దినేశ్‌పటేల్ వెల్లడించాడు. ఇది ప్రోటోటైప్ రోబో అని, 47 భాషలు మాట్లాడడంతో పాటు మనుషులను గుర్తించగలదని, జనరల్ నాలెడ్జ్, గణితానికి సంబంధించిన ప్రశ్నలు అడిగితే జవాబులు చెప్పగలదని తెలిపాడు. వార్తా పత్రికలను చదువుతుందని, రకరకాల వంటలు ఎలా చేయాలో వివరిస్తుందని అన్నాడు. చదవండి: వాట్సాప్ లో మరో సరికొత్త ఫీచర్! -
ఈ భాషలన్నీ టీఆర్ఎస్ ఎమ్మెల్యేకు కొట్టిన పిండి!
సాక్షి , కామారెడ్డి: ‘ఆ ఎమ్మెల్యే మరాఠీ మాట్లాడే గ్రామాలకు వెళ్లినప్పుడు కనిపించిన వారినల్లా ‘కసే అహత్’ అంటూ మరాఠీలో వారి యోగ క్షేమాలు తెలుసుకుంటారు. కన్నడ మాట్లాడే గ్రామాలకు వెళితే ‘నీవు హేగిద్దిరే’ అంటూ కన్నడలో మాట్లాడి వారి కష్టసుఖాలను కనుక్కుంటారు. అలాగే తెలుగు మాట్లాడే గ్రామాలకు వెళితే ‘బాగున్నరా..’ అంటూ తెలుగులో మాట్లాడతారు. ఆయనే బహు భాషల సమ్మేళనమైన కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం ఎమ్మెల్యే హన్మంత్ సింధే. ఆయనకు పలు భాషలు వచ్చు. అందుకే నియోజకవర్గంలో ఏ భాషవాళ్లు కలిస్తే వారి భాషలో మాట్లాడతారు. నియోజకవర్గంలో గిరిజనుల జనాభా కూడా ఎక్కువే. లంబాడీ భాషలో కూడా ఆయన అనర్గళంగా మాట్లాడతారు. అలాగే అధికారుల దగ్గరకు వెళ్లినపుడు ఇంగ్లీషు భాషను ఉపయోగిస్తారు. హిందీ మాట్లాడే అవకాశం ఉంటే హిందీలో మాట్లాడతారు. మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల సరిహద్దుల్లో ఉన్న జుక్కల్ నియోజకవర్గంలో ప్రజలు తెలుగు, కన్నడ, మరాఠీ భాషలు మాట్లాడతారు. దీంతో అధికారులు, ప్రజాప్రతినిధులు కూడా వారితో ఆయా భాషల్లో మాట్లాడాల్సిందే. ఇంజనీరింగ్ విద్యనభ్యసించిన ఎమ్మెల్యే హన్మంత్ సింధేకు తెలుగు, హిందీ, ఇంగ్లిష్ భాషలతో పాటు కన్నడ, మరాఠీ భాషలు కూడా వచ్చు. దీంతో ఆయా ప్రాంతాల్లోని ప్రజలు ఏ భాష మాట్లాడితే ఎమ్మెల్యే కూడా వారికి అర్థమయ్యే భాషలో మాట్లాడతారు. జుక్కల్ మండలంలోని సోపూర్ గ్రామం దాటితే కర్ణాటక రాష్ట్రం వస్తుంది. దీంతో జుక్కల్ మండలంలోని పలు గ్రామాల ప్రజలు చాలా వరకు కన్నడనే మాట్లాడతారు. అలాగే మద్నూర్, బిచ్కుంద మండలాల్లోని గ్రామాలు మహారాష్ట్ర సరిహద్దుల్లో ఉంటాయి. ఇక్కడ చాలా వరకు మరాఠీ మాట్లాడుతారు. పలు గ్రామాల్లో మరాఠీ మీడియం స్కూళ్లు ఇప్పటికీ కొనసాగుతున్నాయి. ఇలా జుక్కల్ నియోజకవర్గం మూడు భాషల సంగమంలా ఉంటుంది. ఎమ్మెల్యే సింధే ఎన్నికల సమయంలో ప్రచారంతో పాటు గ్రామాల్లో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల ప్రారంభోత్సవాలు చేయడానికి వెళ్లినప్పుడు అక్కడి ప్రజలకు అర్థమయ్యేలా కన్నడ, మరాఠీ భాషలు మాట్లాడుతారు. ప్రతి సభలో ఆయన మూడు భాషలలో మాట్లాడి ఆకట్టుకుంటారు. దీంతో ప్రజలు కూడా ఆయనంటే అభిమానం చూపిస్తారు. ఎమ్మెల్యే వివిధ భాషల్లో మాట్లాడడాన్ని కొత్తవారు ఆసక్తిగా చూస్తుంటారు. చదవండి: నభూతో నకాశీ.. మెప్పించిన చిత్రకళ ‘పల్లాను గెలిపిస్తే సీఎం గ్లాస్లో సోడా పోశాడు’ -
ఫ్రెండ్ ఫోన్ చేసి ‘వొద్దకో జినెసో?’ అని అడగవచ్చు!
ఒకరోజు మీ ఫ్రెండ్ ఫోన్ చేసి ‘వొద్దకో జినెసో?’ అని అడగవచ్చు. ఎప్పుడైనా ఏ ఫ్రెండ్‌కో మీరు ఫోన్ చేసి ‘హౌ ఆర్ యూ?’ అని అడిగితే అటునుంచి ‘చైల్ చినెమో’ అని జవాబు రావచ్చు. కొరియన్లో ‘వొద్దకో జినెసో?’ అంటే ‘ఎలా ఉన్నావు?’ అని, ‘చైల్ చినెమో’ అంటే ‘ఐయామ్ ఫైన్’ అని అర్థం. ఒక్క కొరియన్ మాత్రమే కాదు ప్రపంచంలోని పలు భాషలు చూస్తూ చూస్తూనే నేర్చుకోవచ్చు.... నెట్‌ఫ్లిక్స్‌లో! మీరు ఫ్రెంచ్ భాష నేర్చుకోవాలనుకుంటున్నారా? ‘30 రోజుల్లో...’లాంటి పుస్తకాలు చదవనక్కర్లేదు. ఏ ఇన్స్టిట్యూట్కో వెళ్లి శిక్షణ పొందనక్కర్లేదు. మీ ఇంట్లోనే ఎటు కదలకుండా నెట్‌ఫ్లిక్స్‌లో లుపిన్, ఇన్ టూ ది నైట్, కాల్ మై ఏజెంట్...ఇంటర్నేషనల్ టీవీడ్రామాలు, మిల్ఫ్, ఆఫ్రికన్ డాక్టర్, ది క్లైంబ్...కామెడీలు, ఏజ్ ఆఫ్ టాంక్స్, టోనీ పార్కర్–ది ఫైనల్ షాట్, కిల్ హిట్లర్...డాక్యుమెంటరీలు చూస్తే చాలు! కడుపుబ్బా నవ్వించే కామెడీ సినిమాలు, వెంట్రుకలు నిక్కబొడుచుకునే హారర్ సినిమాలు, పిడికిళ్లు బిగిసే యాక్షన్ సినిమాలు చూస్తూనే ప్రపంచంలోని ఏదో ఒక భాష ఎంతో కొంత నేర్చుకుంటే ఎంత హ్యాపీ! ‘లాంగ్వేజ్ లెర్నింగ్ విత్ నెట్‌ఫ్లిక్స్’ (ఎల్ఎల్ఎన్) అనే క్రోమ్ ఎక్సెటెన్షతో ఇది సాధ్యమవుతుంది. ఈ ఎక్స్‌టెన్షన్‌ను డేవిడ్ వికిన్సన్, ఒగ్న్జెన్లు రూపొందించారు. ‘ఇష్టమైన మాధ్యమంలో ఎలాంటి కష్టం లేకుండా సరదా సరదాగా కొత్త భాషలు నేర్చుకోవచ్చు’ అంటాడు వికిన్సన్. ప్రేక్షక ఆదరణ పొందిన సిరీస్‌కు సంబంధించిన అల్టర్నెటివ్ ఆడియోట్రాక్స్ అందుబాటులో ఉన్నాయి. అయితే వేరే భాషలకు సంబంధించిన ఆడియోలకు, సబ్‌టైటిల్స్ మ్యాచ్ కావు. ఈ పరిమితిని సరిదిద్దారు. నిజానికి 2017లోనే ఒకే సమయంలో రెండు సబ్ టైటిల్స్ ప్రదర్శితమయ్యే లెర్నింగ్ మోడ్‌ను వికి(స్ట్రీమింగ్ సర్వీస్ ఫర్ ఏషియన్ డ్రామాస్) ప్రవేశపెట్టింది. మన పనిని సులభతరం చేయడానికి విస్తృతమైన కెటలాగ్ కూడా ‘ఎల్ఎల్ఎన్’లో రెడీగా ఉంది. లాంగ్వేజ్ యూ స్టడీ, యువర్ నెట్‌ఫ్లిక్స్ కంట్రీలలో మనకు ఇష్టమైనవి ఎంపిక చేసుకోవచ్చు. సినిమా పోస్టర్, సినాప్సిస్, నిడివి, రేటింగ్, జానర్, ఏ దేశంలో అందుబాటులో ఉన్నాయి...మొదలైన వివరాలు ఈ కెటలాగ్లో మనకు కనిపిస్తాయి. సెట్టింగ్స్‌లో మెషిన్, హ్యూమన్ ట్రాన్స్లెషన్ ఆప్షన్స్ ఉన్నాయి. మెషిన్ ట్రాన్స్‌లేషన్‌లో మక్కీకిమక్కీ అనువాదం ఉన్నా, మన టార్గెట్ లాంగ్వేజ్‌కి సంబంధించిన వాక్యనిర్మాణంపై స్పష్టత వస్తుంది. అయితే ఈ మెషిన్లో తప్పులు దొర్లే అవకాశం లేకపోలేదు. కీ బోర్డ్‌లో... ‘ఎ’ ప్రీవియస్ సబ్ టైటిల్ ‘యస్’ రిపీట్ సబ్‌టైటిల్స్ ‘డి’ నెక్ట్స్ సబ్‌టైటిల్ టస్పేస్బార్–ప్లే, పాజ్ వెకబలరీ హైలిటింగ్ ఫీచర్ నుంచి పాప్–అప్ డిక్షనరీ వరకు ‘ఎల్ఎల్ఎన్’లో రకరకాల భాషలలోని పదాలు, వాక్యాలపై పట్టు పెంచుకోవచ్చు. మెల్ల మెల్లగా మాట్లాడనూ వచ్చు. ఇంకెందుకు ఆలస్యం, ట్రై చేసి చూడండి మరి. -
యూట్యూబ్ వీడియోలు తెగ చూస్తున్నారు
సాక్షి,న్యూఢిల్లీ: యూట్యూబ్‌లో వీడియోల వీక్షణం భారత్‌లో అంతకంతకూ పెరుగుతోంది. వీక్షిస్తున్న సమయం క్రితం ఏడాదితో పోలిస్తే 2020 జూలైలో 45 శాతం పెరిగింది. ఆరు ప్రాంతీయ భాషలలో 2020 రెండవ భాగంలో యూట్యూబ్ ఇండియాలో అత్యధికంగా వీక్షించిన టాప్ 10 వాణిజ్య ప్రకటనల జాబితాలో చోటు దక్కించుకున్నట్లు ఆన్లైన్ వీడియో ప్లాట్‌ఫాం శుక్రవారం తెలిపింది. తెలుగు, తమిళం, మలయాళం, బెంగాలీ, మరాఠీ, కన్నడ లాంటి ప్రాంతీయ భాషల్లో కంటెంట్ ఉండడం కూడా ఈ వృద్ధిని నడిపించిన కారణాల్లో ఒకటని యూట్యూబ్ తెలిపింది. అందుబాటు ధరలో స్మార్ట్ఫోన్లు లభించడం, చవక డేటా టారిఫ్‌లతో కొన్నేళ్లుగా వీడియోలు ఎక్కువగా చూస్తున్నారని వివరించింది. మహమ్మారి నేపథ్యంలో లాక్డౌన్ కారణంగా ఓటీటీల వాడకం మరింతగా పెరిగిందని యూట్యూబ్ తెలిపింది. 2019 సెప్టెంబరులో విడుదలైన గూగుల్-కాంటార్ అధ్యయనం ప్రకారం 93 శాతం మంది ప్రాంతీయ భాషల్లో ఉన్న కంటెంట్‌ను చూసేందుకే మొగ్గు చూపుతున్నారు. యూట్యూబ్‌లో ప్రస్తుతం ఆరు ప్రాంతీయ భాషల్లో ప్రకటనలు వెలువడుతున్నాయి. -
తెలుగు ప్రజలకు ఫ్లిప్‌కార్ట్ శుభవార్త
ముంబై: ఈ- కామర్స్ దిగ్గజం ఫిప్కార్ట్ ఎప్పటికప్పుడు సరికొత్త ఆవిష్కరణలతో కస్టమర్లకు చేరువయ్యే ప్రణాళికలు రచిస్తోంది. తాజాగా తెలుగు, తమిళ, కన్నడ ప్రజలకు ప్లిప్‌కార్ట్ శుభవార్త తెలిపింది. ఇక మీదట (తెలుగు, తమిళ, కన్నడ భాషల)కు చెందిన వినియోగదారులు తమ ప్రాంతీయ భాషలలో షాపింగ్ చేయవచ్చని ఫ్లిప్‌కార్ట్ పేర్కొంది. ప్లిప్‌కార్ట్‌లో ఇప్పటివరకు కేవలం హిందీ మొబైల్ అప్లికేషన్‌కు మాత్రమే ఈ వెసలుబాటు ఉండేది. అయితే దేశ వ్యాప్తంగా ప్రాంతీయ భాషలలో సేవలను విస్తరించడం వల్ల వినియోగదారులకు సంస్థ మరింత చేరువయ్యే ప్రయత్నం చేస్తుంది. కాగా 54 ప్రాంతీయ భాషల పదాలను (తెలుగు, తమిళ, కన్నడ భాషలలో) బ్యానర్ పేజీలతో కలిపి వినియోగదారులకు అందించినట్లు పేర్కొంది. గత సెప్టెంబర్‌లో హిందీ భాషలో వినియోగదారులకు సేవలను అందించామని ఫ్లిప్‌కార్ట్ గుర్తుచేసింది. హిందీ భాషలలో సేవలందించడం ద్వారా వినియోగదారులు సంతృప్తికరంగా ఉన్నారని, ప్రస్తుతం దక్షిణాది రాష్ట్రాలలో భారీగా పెరుగుతున్న వినియోగదారులను దృష్టిలో ఉంచుకొని.. వారికి భాషాపరమైన ఇబ్బందులు తలెత్తకుండా ప్రాంతీయ భాషలలో సేవలందించనున్నట్లు తెలిపింది. ప్రాంతీయ భాషలలో సేవలందించే ప్రణాళికలో భాగంగా విశాఖపట్నం, మైసూర్‌లలో భాషలకు సంబంధించిన పదాలను అధ్యయనం చేశామని తెలిపింది. తాజా సేవలతో దేశవ్యాప్తంగా వినియోగదారులను ఫ్లిప్‌కార్ట్ ఆకట్టుకుంటుందని పేర్కొంది. (చదవండి: ఆహార రిటైల్‌లో ఫ్లిప్‌కార్ట్‌కు నో ఎంట్రీ!) -
భాషల బాషా
‘బాషా ఒక్కసారి చెబితే వందసార్లు చెప్పినట్లు’ అంటాడు ‘బాషా’ సినిమాలో రజనీకాంత్ వేలెత్తి చూపుతూ. దేశంలోని ఎన్ని భాషలు ఉన్నాయో అన్ని భాషల్లోనూ..ఎన్ని ఏకార్థ పదాలున్నాయో కొండలు, కోనలు ఎక్కిదిగి మరీ చెబుతున్నాడు గణేశ్ నారాయణ్ దేవ్. అందుకే ఆయన భాషల బాషా! మనదేశంలో ఎన్ని భాషలున్నాయి? 780. ఇది మల్టిపుల్ చాయిస్లో ఒక ఆప్షన్ కాదు. నూటికి నూరు శాతం కచ్చితమైన ఆన్సర్. మరో ప్రశ్న.. మనదేశంలో ఉన్న భాషల్లో లిపి ఉన్న భాషలెన్ని? 86. ఇక్కడ కూడా రెండో ఆప్షన్ లేదు. నికార్సయిన జవాబిది. ఇంకో ప్రశ్న కూడా ఉంది. ఆ ప్రశ్నలోంచే ఇప్పుడు మనం ఆసక్తికరమైన అనేక విశేషాల్లోకి వెళ్లబోతున్నాం. హిమాచల్ ప్రదేశ్ ప్రజలు ఎన్ని భాషలు మాట్లాడుతున్నారు? ఇదేం ప్రశ్న. ఎన్నో భాషలెందుకుంటాయి? అని ఎదురు ప్రశ్నించారంటే ‘మంచు’లో కూరుకుపోయినట్లే. అక్కడ పదహారు రకాల భాషలు మనుగడలో ఉన్నాయి. మంచుకొండల పాదాల చెంత విస్తరించిన దేశంలో మంచును వర్ణించడానికే 200 పదాలున్నాయి! ఆశ్చర్యంగా ఉన్నా సరే... ఇది నిజం. ‘పీపుల్స్ లింగ్విస్టిక్ సర్వే ఆఫ్ ఇండియా’ దేశవ్యాప్తంగా సంచరించి నిర్వహించిన అధ్యయనంలో వెల్లడయిన విషయాలివి. మనుగడ పోరాటం పద్మశ్రీ, సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత ‘లింగ్విస్ట్ గణేశ్ నారాయణ దేవ్’ ఆధ్వర్యంలో ఈ ‘ఏకార్థ పదాల సర్వే’ జరిగింది. రాజస్థాన్‌లోని సంచార తెగల్లో ఎడారి ఇసుకను వర్ణించడానికి ఎన్ని పదాలు వాడతారో లెక్క పెట్టడం కూడా సాధ్యం కాదు. ఆ తెగల వాళ్లు అనేక ప్రాంతాల్లో సంచరిస్తుంటారు కాబట్టి రాష్ట్రవ్యాప్తంగా వాడుకలో ఉన్న పదాలన్నింటితోనూ అనుబంధం కలిగి ఉంటారు. ఇలా మనదేశంలో ఎన్నో భాషలు, మరెన్నో మాండలికాలు... వేటికవి తమ ఉనికిని కాపాడుకుంటూ ఉంటాయి. అయితే గడచిన యాభై ఏళ్లలో మనదేశంలో దాదాపుగా 250 భాషలు అంతరించి పోయాయి. అంతకు ముందెప్పుడో..! మనదేశంలో భాషల మీద అధ్యయనం, భాషల పరిరక్షణ బ్రిటిష్ హయాంలో జరిగింది. ముప్పై ఏళ్ల పరిశోధనలో వాళ్లు గుర్తించింది 364 భాషలు, మాండలికాలను మాత్రమే. బ్రిటిష్ పాలకులు నియమించిన విదేశీ ఉద్యోగులు మారుమూల ప్రదేశాలకు వెళ్లక పోవడం, వాళ్లకు భారతీయ భాషల్లోని వైవిధ్యత స్పష్టంగా తెలియకపోవడంతో ఆ పరిశోధన పరిమితమైన నివేదికను మాత్రమే ఇవ్వగలిగింది. స్వాతంత్య్రం వచ్చిన ఇన్నేళ్లలో మన పాలకులు భాషాపరమైన పరిశోధన మీద ఆసక్తి చూపించకపోవడంతో ఇప్పటికీ అధికారిక లెక్కల్లో బ్రిటిష్ అధికారుల నివేదిక ప్రామాణికంగా కొనసాగుతోంది. దానిని వ్యతిరేకిస్తారు గణేశ్. అందుకే ఆయన పరిశోధన మొదలు పెట్టారు. పదేళ్లవుతోంది ‘పీపుల్స్ లింగ్విస్టిక్ సర్వే ఆఫ్ ఇండియా’ 2010లో ఈ ప్రయత్నం మొదలుపెట్టింది. రచయితలు, ప్రొఫెసర్లు, పరిశోధకులు, స్కూలు టీచర్లతోపాటు భాషల మీద ఆసక్తి కలిగిన వాళ్లు మొత్తం కలిసి 3500 మంది ఈ పరిశోధనలో పాల్గొన్నారు. వీరికి సర్వే ఎలా నిర్వహించాలనే మార్గదర్శనం చేయడం కోసం దేవ్ దేశవ్యాప్తంగా పర్యటించి మూడు వందల వర్క్‌షాప్‌లు నిర్వహించారు. గణేశ్ నారాయణ దేవ్ మహారాష్ట్రలో పుట్టారు, వాళ్లది గుజరాతీ కుటుంబం. ఇంట్లో గుజరాతీ మాట్లాడేవాళ్లు. స్కూల్లో మరాఠీ మాధ్యమంలో చదవాల్సి వచ్చింది. అది ఒక సంఘర్షణ, అసౌకర్యం. అలాగే టెన్త్ పూర్తిచేసి కాలేజ్‌లో అడుగుపెట్టినప్పుడు ఇంగ్లిష్ రూపంలో మరో అడ్డంకి ఎదురైంది. ఆంగ్లంలో చెప్పే పాఠాలు అర్థం చేసుకోలేక కాలేజ్ మానేసి గోవాకు వెళ్లి గనుల్లో రోజు వారీ కూలీగా పనికి కుదిరారు. ఖాళీ సమయంలో ఇంగ్లిష్ రచనలను విస్తృతంగా చదివారు. ఇంగ్లిష్ మీద ఇష్టం పెరిగిన తర్వాత తిరిగి కాలేజ్‌లో చేరారు. తర్వాత కొల్హాపూర్ యూనివర్సిటీ నుంచి పిహెచ్డీ కూడా చేశారు దేవ్. బరోడాలోని మహారాజా షాయాజీ రావు యూనివర్సిటీలో ప్రొఫెసర్‌గా ఉన్న సమయంలో భాషల మీద పరిశోధన మొదలు పెట్టారు. ఇప్పటి వరకు సేకరించిన సమాచారంతో 92 పుస్తకాలు రాయడానికి సిద్ధమయ్యారాయన. 2013లో మొదలైన ఈ యజ్ఞంలో ఇప్పటికి 45 పుస్తకాలు పూర్తయ్యాయి. మిగిలినవి 2020 నాటికి పూర్తవుతాయని చెప్తున్నారు జి.ఎన్ దేవ్. మంజీర -
12 దేశాలు.. 200 ప్రతినిధులు
సాక్షి, హైదరాబాద్: విభిన్న సామాజిక అంశాలు, కళలు, భాషలు,సంస్కృతుల సమ్మేళనంగా రాష్ట్ర రాజధాని నగరం బేగంపేటలోని హైదరాబాద్ పబ్లిక్స్కూల్లో 3 రోజులు నిర్వహించిన హైదరాబాద్ సాహితీ ఉత్సవాలు ఆదివారం ముగిశాయి. దేశ,విదేశాలకు చెందిన సాహితీప్రియులు, కళాకారులు, రచయితలు, విద్యార్థులు, పాత్రికేయులు, ప్రొఫెసర్లు, వివిధ రంగాల నిపుణులు 12 దేశాల నుంచి 200 మంది విదేశీ ప్రతినిధులు ఉత్సవాల్లో పాల్గొన్నారు. చైనా అతిథిదేశంగా హాజరవడం విశేషం. సాహితీ ఉత్సవంలో సుమారు 30 అంశాలపై సదస్సులు జరిగాయి. చివరిరోజు ప్రముఖ నటి షబానా ఆజ్మీ తన తండ్రి కైఫి ఆజ్మీ శతాబ్ది జన్మదినం సందర్భంగా ఆయన రాసిన కవితలు,ఆయన విశిష్ట వ్యక్తిత్వాన్ని వివరించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు ఆమె సంతోషం వ్యక్తంచేశారు. సులభతర పన్నులతో చేయూత: గురుచరణ్ సులభతర పన్నులవ్యవస్థ ఆర్థికరంగానికి చేయూత నిస్తుందని ప్రముఖ ఆర్థికవేత్త గురుచరణ్‌దాస్ అన్నారు. ఆదివారం ‘మనీమ్యాటర్స్’అన్న అంశంపై నిర్వహించిన సదస్సులో ఆయన మాట్లాడారు. దేశ ఆర్థికవ్యవస్థ ప్రస్థానం, యురోపియన్ దేశాల్లో పన్ను ల వ్యవస్థ పరిణామ క్రమం తదితర అంశాలను వివరించారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ ఆర్థిక నిపుణులు విక్రమ్,వివేక్‌కౌల్ తదితరులు పాల్గొన్నారు. హౌ సేఫ్ ఈజ్ అవర్ మనీ: వివేక్ కౌల్ డబ్బు, ఆర్థిక వ్యవస్థ మీద పుస్తకాలు వెలువరిస్తూ, ప్రసంగాలు చేసే వివేక్ కౌల్ పాల్గొన్నారు. నగదు రద్దు క్రమంలో డబ్బు దాచుకోవటం ఎంత ప్రమాదకరమో వివరించారు. బిట్ కాయిన్స్, క్రిప్టో కరెన్సీ ఏమాత్రం సురక్షితం కావని అన్నారు. మేధావుల మౌనం నష్టమే : మల్లికాసారాభాయ్ దేశంలో మేధావులు,విద్యావంతులు వివిధ సామాజిక సమస్యలు,అంశాలపై మౌనంగా మారడం సమాజానికి తీరని నష్టం కలిగిస్తోందని ప్రముఖ సామాజికవేత్త మల్లికాసారాభాయ్ అన్నారు. మంచికోసం,సమాజంలో మార్పుకోసం ప్రతీఒక్కరూ పోరాడాలని,చుట్టూ జరుగుతున్న అన్యాయాలపై రాజకీయనేతలు,అధికారులను ప్రశ్నించే తత్వం అలవరచుకోవాలన్నారు.ఈ కార్యక్రమంలో తెలంగాణా ఐటీశాఖ ముఖ్య కార్యదర్శి జయేష్‌రంజన్ తదితరులు పాల్గొన్నారు. దళిత మహిళా రచయితలపై వివక్ష కొనసాగుతోంది: మెర్సీ మార్గరెట్ దేశవ్యాప్తంగా దళిత క్రైస్తవ మహిళా రచయితలపై వివక్ష కొనసాగుతోందని ప్రముఖ రచయిత్రి,సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత మెర్సీ మార్గరెట్ ఆవేదన వ్యక్తంచేశారు. ‘తెలంగాణ సాహితీసంస్కృతి’అన్న అంశంపై ఆమె మాట్లాడారు. జాతీయ ఉర్దూవర్సిటీ ప్రొఫెసర్ బేజ్ ఎజాజ్ మాట్లాడుతూ..హైదరాబాద్ విశిష్ట సంస్కృతీ,సంప్రదాయాలను వివరించారు. ప్రముఖ జర్నలిస్ట్ టంకశాల అశోక్ మాట్లా డుతూ..సమాజానికి ఉపయోగపడే సమాచారాన్ని అనువాద రచనల్లో తాను అందిస్తోన్న విధానాన్ని వెల్లడించారు. కామ– ది రిడిల్ ఆఫ్ డిజైర్ తాను ఇటీవల వెలువరించిన పుస్తకం ‘కామ– ది రిడిల్ ఆఫ్ డిజైర్ ’గురించి దాని రచయిత గురుచరణ్‌దాస్ ప్రసంగించారు. ఆధునిక జీవితంలో ధార్మిక, ఆర్థిక, సామాజిక, రాజకీయ విషయాలకు అధిక ప్రాధాన్యతనిస్తూ, స్వీయ జీవితం పట్ల దృష్టి తగ్గిస్తున్నామన్నారు. ప్రేమికుల దినోత్సవాన్ని, కామదేవ దివస్‌గా నిర్వహించుకోవాలని తాను, కేంద్ర మాజీ మంత్రి శశిథరూర్ ఒక ఉద్యమం ప్రారంభించాలనే యోచనలో ఉన్నామని, ఈ ఏడాది ప్రేమికుల దినోత్సవం నుంచే దీన్ని ప్రారంభిస్తామన్నారు.హిందూత్వ భావజాలానికి ఇక కాలం చెల్లుతుందన్నారు.