2023లో ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా మాట్లాడిన భాషలు ఎన్నో, ఎంతమంది మాట్లాడారో తెలుసా.ప్రతి సంవత్సరం అతిపెద్ద భాషల జాబితాను ప్రచురించే ఎథ్నోలాగ్ తాజా జాబితాను వెల్లడించించింది. ఇందులో అత్యధికంగా అంటే 1.5 బిలియన్లు మంది మాట్లాడిన భాషగా ఇంగ్లీష్ నిలిచింది. అలాగే భారత దేశానికి చెందిన హిందీ భాష మూడో స్థానంలో నిలవడం విశేషం. అలాగే బెంగాలీ భాష 7, ఉర్దూ భాష 10వ స్థానంలో నిలిచాయి.
భూమి మొత్తం 200కు పైగా దేశాలు ఉండగా వాటిల్లో మొత్తం 7వేలకు పైగా భాషలు వాడుకలో ఉన్నాయి. ఈ జాబితా ఆర్థిక పోకడలు, అధిక జనాభా ఉన్న దేశాలు, వలస చరిత్రను కూడా ప్రతిబింబిస్తాయంటున్నారు విశ్లేషకులు
భూమిపై అత్యధికంగా మాట్లాడే 12 భాషలు
ఇంగ్లీష్: 1,500,000,000
మాండరిన్: 1,100,000,000
హిందీ: 609,500,000
స్పానిష్: 559,100,000
ఫ్రెంచ్: 309,800,000
ప్రామాణిక అరబిక్: 274,000,000
బెంగాలీ: 272,800,000
పోర్చుగీస్: 263,600,000
రష్యన్: 255,000,000
ఉర్దూ: 231,700,000
ఇండోనేషియన్: 199,100,000
జర్మన్: 133,200,000
Comments
Please login to add a commentAdd a comment