
#Continuum: జిమ్‌లో చేరాలంటే నెలకు ఎంత కడతాం? మిగిలిన చోట్ల ఎంత ఉన్నా, న్యూయార్క్ (NewYork) లోని గ్రీన్‌విచ్‌కి దగ్గరలోని ఒక గ్రామంలో కొంటినూమ్ (Continuum )అనే వెల్‌నెస్ సోషల్ క్లబ్‌లో జిమ్ చేయాలంటే అక్షరాలా 8000 పౌండ్లు కట్టాలి. గత ఏడాది ఏప్రిల్‌లో ఆరంభం అయిన ఈ జిమ్‌లో లగ్జరీ లాంజ్ ఉంది. సభ్యులకు ఫిట్‌నెస్ పెంచుకోవడం కోసం టాప్‌క్లాస్ జిమ్ తరగతులు జరుగుతుంటాయి. 25000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఈ వెల్‌నెస్ సెంటర్ 250 మంది సభ్యులకు మాత్రమే పరిమితం. చిత్రం ఏమిటంటే, కళ్లు తిరిగేటంత సభ్యత్వ రుసుము కండలు పిండి మరీ వసూలు చేస్తున్నా కూడా ఇక్కడ మెంబర్‌షిప్ తీసుకోవడం కోసం వెయిటింగ్ లిస్ట్‌లో ఉన్న వారి జాబితా చాలానే ఉందట.
చదవండి: #WomenPower :హంపీ టెంపుల్‌లోని ఈ సారథుల గురించి తెలుసా?
ఇక్కడ చేరి శారీరక దృఢత్వాన్ని పెంచుకుంటున్న వారందరికోసం ఇంటి దగ్గర ఉండి మరీ కసరత్తులు చేసేందుకు ఆన్‌లైన్‌లో ప్రత్యేకమైన హోమ్ వర్క్ (వర్కవుట్లు చేయిస్తారట) కూడా ఇస్తారట. డబ్బు కట్టగానే ఇక్కడ సభ్యులకు పూర్తి వివరాలతో కూడిన ‘ఆన్‌బోర్డింగ్ అసెస్‌మెంట్’ ఉంటుంది. శరీరంలోని ప్రతి పార్ట్‌నూ స్కాన్ చేసి, ఉండవలసిన దానికన్నా హెచ్చుతగ్గులు ఏమైనా ఉంటే పరీక్షించి, వాటిని బ్యాలన్స్ చేసుకునేందుకు తగిన స్పెషల్ వర్కవుట్లు చేయిస్తారు. అంతేకాదు, శరీరంలో బ్లడ్ సర్క్యులేషన్ ఎలా ఉంది, ఆక్సిజన్ లెవెల్స్ ఎలా ఉన్నాయి, నిద్ర నాణ్యత ఎలా ఉంది... వంటి పరీక్షలన్నీ చేసి అందుకు తగ్గట్టు జిమ్ చేయిస్తారట. ఏమైనా.. పిండికొద్దీ రొట్టె అన్నట్టు మనం చెల్లించిన డబ్బుకు తగ్గట్టు వర్కవుట్లు చేయించి మన ఫిట్‌నెస్‌ను పరిరక్షిస్తారన్నమాట!
Comments
Please login to add a commentAdd a comment