workouts
-
ఫిట్నెస్ ఎలాస్టిక్ రోప్: దెబ్బకు కొవ్వు మాయం..!
ఈ రోజుల్లో వ్యాయామం చేయకపోతే ఇట్టే బరువు పెరగడం, కొలతలు సరిలేక, అందం తగ్గడం సాధారణ సమస్యలుగా మారిపోతున్నాయి. తినే తిండి, ఎక్కువ సమయం కూర్చునే వర్క్ చేయడం, పెద్దగా శారీరక శ్రమ లేకపోవడం వంటి కారణాలతో, చాలామందికి ఫిట్నెస్ దూరమవుతోంది. అయితే జిమ్‌లో చేసుకున్నట్లే ఇంట్లోనే వ్యాయామం చేసుకోవడానికి ఈ ’ఫిట్నెస్ ఎలాస్టిక్ రోప్’ చక్కగా పని చేస్తుంది.ఈ రోప్‌తో వర్కౌట్స్ చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇది అన్ని భంగిమల్లోనూ వ్యాయామం చేయడానికి, శారీరక శ్రమను కలిగించి, కొవ్వును తగ్గించడానికి సహకరిస్తుంది. మన్నికైన ఈ రోప్.. వీపు, నడుము, పొట్ట, తొడలు, చేతులు వంటి భాగాల్లో పేరుకున్న కొవ్వును కరిగించుకోవడానికి వినియోగించొచ్చు. దీంతో వ్యాయామం చేస్తే కండరాలు బలపడి, శరీరం దృఢంగా తయారవుతుంది.వ్యాయామ సమయంలో దీన్ని ఎలా కావాలంటే అలా సులభంగా, బలం ఉపయోగించి సాగదీయొచ్చు. సాగదీసే క్రమంలోనే గ్రిప్ తప్పి లేని నొప్పులు వస్తాయేమోనన్న భయం అవసరం లేదు. సౌకర్యవంతమైన పట్టును అందించగల ఈ సాగే తాడు.. చేతులకు, కాళ్లకు అలసట కలిగించదు. ఎకో–ఫ్రెండ్లీ మెటీరియల్‌తో రూపొందిన ఈ రోప్ కొత్తగా వ్యాయామం ప్రారంభించే వాళ్లకు కూడా అనువుగానే ఉంటుంది. దీని ధర 14 డాలర్లు (రూ.1,286) మాత్రమే! -
'ఎల్లప్పుడూ స్ట్రాంగ్‌గా ఉండాలంటే'..!: ఇవాంక ట్రంప్ ఫిట్నెస్ మంత్ర..!
అమెరికా అధ్యక్షుడు డొనాల్ట్ ట్రంప్ కూతురు ఇవాంక ట్రంప్ బిజినెస్ ఎగ్జిక్యూటివ్‌గా, తల్లిగా రెండు బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించే స్ట్రాంగ్ విమెన్. ముగ్గురు పిల్లల తల్లి అయినా.. ఆమె ఇప్పటకీ అంతే స్లిమ్‌గా ఆకర్షణీయంగా కనిపిస్తారు. ఆమె శరీరాకృతి చూస్తే 16 ఏళ్ల అమ్మాయే అన్నంత అందంగా ఉంటుంది. అంతలా టోన్డ్ ఫిజిక్‌ని మెయింటైన్ చేసేందుకు ఎలాంటి వర్కౌట్లు చేస్తుంటుందో సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు ఇవాంక. సాధారణ వ్యాయమాలతో సరిపెట్టెకుండా అలాంటి వర్కౌట్లు కూడా చేస్తే.. ఎప్పటికీ స్ట్రాంగ్‌గా ఉండగలమని అంటోంది. ఇంతకీ ఆమె విల్లులాంటి శరీరాకృతి కోసం ఎలాంటి వ్యాయామాలు చేస్తుందో తెలుసా..!.చాలామంది మహిళల మాదిరిగానే తాను కూడా కార్డియో, యోగా, పైలేట్స్ వంటి వర్కౌట్లపైనే దృష్టిసారిస్తానని ఆ వీడియోలో పేర్కొంది ఇవాంక. అయితే తన కండరాల బలం కోసం ప్రస్తుతం తాను వెయిట్ లిఫ్టింగ్ వర్కౌట్లపై శిక్షణ తీసుకుంటున్నట్లు తెలిపింది. ఎప్పుడూ సాధారణ వ్యాయామాలే కాకుండా ఎల్లప్పుడు స్ట్రాంగ్‌గా ఉండేందుకు ఇలాంటి వ్యాయామాలు కూడా చేయాలని చెబుతోంది. మన కండరాలు బలోపేతంగా ఉండేలా స్క్వాట్లు, డెడ్‌లిఫ్ట్‌లు, హింగ్లు, పుష్-పుల్ అప్స్ వంటి వర్కౌట్లు అవసరమని గట్టిగా విశ్వసిస్తానంటోంది ఇవాంక. స్ట్రాంగ్‌గా ఉండేందుకు ఇలాంటివి ప్రతి మహిళ తప్పనిసరిగా చేయాలని చెబుతోంది. అంతేగాదు వర్కౌట్లలో అత్యంత కీలకమైనవి ఇవేనని పేర్కొంది. వారంలో నాలుగు రోజులు ఇలాంటి వ్యాయామాలకు కేటాయిస్తానని చెప్పారు. జిమ్‌కి వెళ్లడమే గాక ఆరు బయట సర్ఫింగ్ పాడిల్ టెన్నిస్, స్విమ్మింగ్, వేక్ సర్ఫింగ్, బ్రెజిలియన్ జియు-జిట్సు, హైకింగ్, వాకింగ్, గోల్ప్ వంటి వాటిల్లో కూడా పాల్గొంటానని అన్నారు. తాను రొటీన్ వ్యాయామాలతో సరిపెట్టనని గేమ్‌చేంజర్‌లా వివిధ వ్యాయామాలపై దృష్టిపెడతానని చెప్పారు. తాను శరీరాకృతి విల్లులా ఉండేలా.. అత్యంత బలంగా ఉండేందుకు ప్రాధాన్యత ఇస్తానని చెబుతోంది ఇవాంక. అందుకు అంకితభావంతో కూడిన నిబద్ధత అవసరమని చెప్పారు. అలా క్రమతప్పకుండా వర్కౌట్లు చేస్తే మంచి ఫిట్నెస్ లక్ష్యాన్ని చేరుకోగలుగుతామని అంటోంది. అలాగే వీడియోలో అందర్నీ ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇస్తూ ఫిట్‌గా ఉండమని కోరింది ఇవాంక. View this post on Instagram A post shared by Ivanka Trump (@ivankatrump) (చదవండి: బెల్ట్‌లు, చెప్పులతో కొట్టేవారు: ఆయుష్మాన్ ఖురాన్! బాల్యం భారంగా మారకూడదంటే..) -
వర్కౌట్లతో సమంత..ఉదయానికి మించిన బెస్ట్ టైమ్ లేదు!
టాలీవుడ్ నటి సమంత రూత్ ప్రభు ఎప్పటికప్పుడూ తన విషయాలను సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటారు. అలానే ఈసారి తన వర్క్ఔట్లకు సంబంధించిన పోటోలను షేర్ చేశారు. అంతేగాదు దానికి 'ఎప్పటికీ ఉదయపు సూర్యుడినే కోరుకుంటారు' అనే క్యాప్షన్‌ని జోడించి మరీ పోస్ట్ చేశారు. పైగా వేకువజాముకి మించిన మంచి సమయం మరోకటి లేదు అని ఆ పోస్ట్‌లో రాసుకొచ్చింది సమంత. ఆ ఫోటోలకు ప్రతిస్పందనగా ప్రముఖ సెలబ్రెటీలు, అభిమానుల కామెంట్లోతో పోస్ట్‌లు వెల్లువలా వచ్చాయి. సమంత ఉదయపు సూర్యుడి కోసం వెతుకుతున్నట్లుగా ఉంది ఆ ఫోజ్ అంటూ ఉదయిస్తున్న సూర్యుడి ఎమోజీలతో పోస్ట్‌లు పెట్టారు. ఇక ఫిల్మ్ మేకర్ నందిని రెడ్డి చమత్కారంగా ఇప్పుడే రెండుసార్లు వర్క్ఔట్లు చేశా! అంటూ సన్‌గ్లాసెస్ ఎమోజీలతో పోస్టులు పెట్టారు. అలగే మృణాల్ ఠాకూర్ ఆమె వయసు జస్ట్ 23 అన్నట్లు ఉంది అంటూ హార్ట్ సింబర్ ఎమోజీని పెట్టింది. ఇక సమంత 2022లో మైయోసిటిస్ అని పిలిచే ఆటో ఇమ్యూన్ పరిస్థితితో బాధపడిన సంగతి తెలిసిందే. అందుకోసం నటనకు కొంతకాలం విరామం కూడా ఇచ్చింది. ఈ నేపథ్యంలో ఆమె ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వడమే గాక తనలా ఎవ్వరూ అలాంటి స్థితిని ఎదుర్కొనకూడదని 'టేక్ 20' అనే హెల్త్ పాడ్ కాస్ట్కి సంబంధించిన ఓ యూట్యూబ్ ఛానెల్‌ని కూడా ఇటీవల ప్రారంభించింది. ఇందులో ప్రముఖ ఆరోగ్య నిపుణుడి సలహాలతో విలువైన సమాచారం అందిస్తామని ఆ ఛానెల్ టీజర్‌ని రీలీజ్‌కి సంబంధించిన వీడియోని షేర్ చేస్తూ వెల్లడించారు. ఈ సమస్య రావడానికి ముందు సంవత్సరం చాలా కష్టంగా గడిచింది. చివరికి కోలుకుని ప్రశాంతంగా నిద్రపోగలుగుతున్నా. హాయిగా ఊపిరి పీల్చుకోగులుగుతున్నా అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం తాను నటనపై దృష్టి పెడుతున్నానని, షూటింగ్లలో పాల్గొననున్నట్టు తెలిపింది. ఇక ఈ పోడోకాస్ట్ని తనలా ఎవ్వరూ ఇలాంటి వ్యాధుల బారిన పడకుండా సురక్షితంగా ఉండాలనే ఉద్దేశ్యంతో ప్రారంభించినట్లు తెలిపింది. ప్రస్తుతం ఉన్న కాలుష్య ప్రపంచంలో మనల్ని మనం సేఫ్‌గా ఉంచుకునేలా ఎలాంటి ఆహారం తీసుకుంటే మంచిది, ఏం చేయొచ్చు, ఏం చేయకూడదు అనే వాటి గురించి ప్రముఖ నిపుణులతో మాట్లాడి అత్యంత విలువైన సమాచారం ఇవ్వనున్నట్లు వెల్లడించి సమంత. ఎర్లిమార్నింగ్ వర్క్ఔట్లు చేస్తే.. సెలబ్రెటీలు, కామన్పీపుల్స్.. ఎవ్వరైనా సరే ఉదయమే చేసే వర్క్ఔట్లు ఎప్పటికీ మనలో నూతన ఉత్తేజాన్ని, ఉత్సాహాన్ని అందిస్తాయి. ఉదయమే చేసే వర్క్ ఔట్లతో దేహం చురుకుగా ఉంటుంది. ఎలాంటి రుగ్మతలు ఉన్నా తగ్గడం లేదా అదుపులో ఉండే అవకాశాలు పుష్కలంగా ఉంటాయి. మన ముఖంలో కూడా ఏదో తెలియని వెలుగు కనిపిస్తుంది. ఇలా అందరూ తాము చేయగలిగనన్ని వర్క్ఔట్లు చేసి ఆరోగ్యంగా ఉండండి. అంతేకాదండోయ్ ఇలా చేస్తే మన జీవితం కూడా ఉదయపు సూర్యుడిలా ప్రకాశవంతంగా సాగిపోతుందని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. View this post on Instagram A post shared by Samantha (@samantharuthprabhuoffl) (చదవండి: టోపీ, హెల్మెట్లు వల్ల బట్టతల వస్తోందా? నిపుణులు ఏమంటున్నారంటే..) -
జస్ట్ ఈమూడు వ్యాయామాలు చేయండి! బరువు తగ్గడం ఖాయం!
కొన్నిసార్లు ఎలాంటి వ్యాయామాలు చేసినా.. మంచి ఫలితం ఉండదు. శారీరక శ్రమ తప్ప పడుతున్న కష్టమంతా వృధా అనిపిస్తుంది. అలాంటి వాళ్ల కోసం ఈ మూడు వ్యాయమాలు చాలా చక్కగా ఉపయోగపడతాయి. చాలా సులభంగా బరువు తగ్గుతారు. అలాగే ఆరోగ్యానికి ఆరోగ్యం తోపాటు మంచి ఫిట్నెస్గా ఉంటారు అంటున్నారు ఫిట్నెస్ ట్రైనర్ అలీ కబ్బా. ఇంతకీ ఏంటా ఆ వ్యాయామాలు అంటే.. ఈ మూడు వ్యాయమాలు జస్ట్ 20 నిమిషాలు కనీసం కొన్ని పర్యాయాలు చొప్పున చేస్తే చాలు చక్కటి ఫలితం చాలా త్వరిగతగతిన కనిపిస్తుంది. దీనికి కావల్సిందల్లా కెటిల్‌బెల్స్, రోయింగ్ మెషిన్ ఉంటే చాలు. ఎలా చెయ్యాలంటే..? ముందుగా రోయింగ్ మెషిన్ పై మీరు కూర్చొని ముందుకు వెనక్కు రోప్ని పట్టుకుని వెళ్తుంటే అది మీ కండరాలను ఫిట్‌గా ఉంచడానికి ఉపయోగపడటమే గాక కాళ్లకి చేతులకి మంచి వ్యాయామంగా ఉంటుంది. మొత్తం బాడీ అంతా కదలుతుంది కాబట్టి కేలరీలు కూడా స్పీడ్‌గా తగ్గుతాయి. హృదయ స్పందన రేటు పెరుగుతుంది. కాళ్లు, చేతులు, భుజాలు బలోపేతం అవుతాయి. ఇక రెండోది కెటిల్ బాల్స్‌తో పుష్ అప్లు బాడీ ఫ్లాట్‌గా ఉండేలా చేస్తుంది. బెల్లీ ఫ్యాట్ కరిగి పొట్ట ఫ్లాట్‌గా ఉంటుంది. బాడీ మొత్తం బ్యాలెన్సింగ్ చేసే వ్యాయామం కాబట్టి తొందరగా బరువు తగ్గడం ఈజీ అవుతుంది. ఒక వేళ కెటిల్ బాల్స్‌తో చేయడం కష్టమైతే అవి లేకుండా ఒట్టిగా నేలపైనే అయినా ట్రై చేయండి సరిపోతుంది. తదుపరి ఈ కెటిల్ బాల్స్‌ని పట్టుకుని పైకిలేపి వదలడం. దీనికి ముందుగా నుంచొని ముందుకు వంగి కాళ్లని ఏ మాత్రం వంచకుండా ఆ బాల్స్‌ని కింద నుంచి పైకి తీయడం, దించడం ఇలా ఓ 5 నిమిషాలు చేస్తే..భుజాలు, నడుం మంచిగా బలోపేతం అవుతాయి. మీ కటి భాగంలో కొవ్వు కరిగి తొడలు సన్నబడతాయి. ఈ మూడింటిని క్రమం తప్పకుండా కనీసం ఓ 20 నిమిషాలు చేస్తే ఫిట్‌గా ఉండటమే గాక బరువు తగ్గి నాజూగ్గా ఉండటం పక్కా అని చెబుతున్నారు బాడీ ట్రైయినర్ అలీ కబ్బా. View this post on Instagram A post shared by Ali Kabba - Personal Trainer (@amt.fitness) (చదవండి: చపాతీలు డయాబెటిక్ రోగులకు మేలు! వెలుగులోకి షాకింగ్ విషయాలు) -
జిమ్ చేస్తున్నా బరువు తగ్గడం లేదు.. సర్జరీ చేయించుకోవచ్చా?
కొందరు ఎంత తిన్నా శరీరానికి కొవ్వు పట్టదు. జీరో సైజ్‌లోనే కనిపిస్తుంటారు. మరికొందరికేమో కొంచెం తిన్నా లావెక్కిపోతారు. ఈ రోజుల్లో బరువు పెరగడం అనేది అన్ని వయసుల వారికి పెద్ద సమస్యలా మారింది. బరువు అదుపులో ఉంచుకునేందుకు గంటల తరబడి జిమ్‌లో వర్కవుట్స్ చేసినా, డైట్ కంట్రోల్ చేసినా ఏ మాత్రం రిజల్ట్ ఉండటం లేదు. ''నాకు 24 ఏళ్లు. నా హైట్ 5.2. బరువు 92 కిలోలు ఉన్నాను. యోగా, రెగ్యులర్‌గా జిమ్‌కి వెళుతున్నా, డైటింగ్ కూడా చేస్తున్నా. అయినా బరువు తగ్గడం లేదు. బేరియాట్రిక్ సర్జరీ చేయించుకోవచ్చా? భవిష్యత్‌లో ప్రెగ్నెన్సీ మీద ఏమైనా ప్రభావం ఉంటుందా?'' మీ వయసు 24 కాబట్టి డైటింగ్, ఎక్సర్సైజెస్ కొంతవరకు బరువు తగ్గడానికి దోహద పడతాయి. మీరు చెప్పిన మీ ఎత్తు, బరువు వివరాలను బట్టి మీ బీఎమ్ఐ (బాడీ మాస్ ఇండెక్స్) 40 పైనే వస్తుంది. అంటే అధిక బరువు ఉన్నారని అర్థం. మార్బిడ్ ఒబేసిటీ అంటాం. బేరియాట్రిక్ సర్జరీ అనేది ఫస్ట్ ఆప్షన్‌గా తీసుకోకండి. ప్రొఫెషనల్ జిమ్ ఇన్స్ట్రక్టర్, డైట్ కౌన్సెలర్‌ని కలవండి. ఒకసారి హార్మోన్స్, థైరాయిడ్, సుగర్ టెస్ట్‌లు చేసుకోండి. జీవన శైలిని మార్చుకోవడం ద్వారా బరువు తగ్గించుకునే వీలు ఉంటుంది. బీఎమ్ఐ 40 దాటిన వారికి బేరియాట్రిక్ సర్జరీని సూచిస్తాం. బీఎమ్ఐ 35 లేదా అంతకంటే ఎక్కువ ఉంటే ప్రెగ్నెన్సీకి సంబంధించిన సమస్యలు ఎక్కువగా ఉంటాయి. అయినా స్పెషలిస్ట్‌ని సంప్రదించిన తరువాతే మీకు ఏది సరిపోతుందో అంచనా వేస్తాను. మామూలుగా బేరియాట్రిక్ సర్జరీ అయిన 12– 18 నెలల తరువాత మాత్రమే ప్రెగ్నెన్సీ ప్లానింగ్ స్టార్ట్ చెయ్యాలి. ఎందుకంటే బరువు తగ్గే క్రమంలో మొదట్లో పోషకాల లోపం తలెత్తుతుంది. వాటిని మల్టీ విటమిన్స్‌తో కవర్ చేసి అప్పుడు ప్రెగ్నెన్సీ ప్లాన్ చెయ్యాలి. ప్రెగ్నెన్సీ సమయంలో చాలా జాగ్రత్తగా డైట్‌ని సూచించాల్సి ఉంటుంది. బీపీ, సుగర్ సమస్యలు తలెత్తకుండా టెస్ట్ చెయ్యాలి. బేరియాట్రిక్ సర్జరీ తరువాత ప్రెగ్నెన్సీలో చాలా వరకు ఏ సమస్యలూ ఉండకపోవచ్చు. కానీ కొన్ని కేసెస్‌లో తక్కువ బరువుతో బిడ్డ పుట్టడం, నెలలు నిండకుండానే ప్రసవమవడం వంటి సమస్యలు తలెత్తుతాయి. అయితే ఒబేసిటీతో ఉన్నప్పటి రిస్క్ కంటే ఈ రిస్క్ చాన్సెస్ చాలా తక్కువ. కాబట్టి మంచి స్పెషలిస్ట్‌ని కలిసిన తరువాత అన్ని విషయాలు అసెస్ చేసుకుని అప్పుడు బేరియాట్రిక్ సర్జన్‌ని కలిస్తే మంచిది. -డా. భావన కాసు, గైనకాలజిస్ట్ – ఆబ్స్టెట్రీషియన్ హైదరాబాద్ -
జిమ్ చేస్తున్నా గుండెజబ్బులు.. సిద్దార్థ్ నుంచి స్పందన వరకు.. కారణమేంటి?
సాధారణంగానే సెలబ్రిటీలు స్ట్రిక్ట్ డైట్‌ను ఫాలో అవుతుంటారు. వయసు పైబడుతున్నా ఇంకా అదే గ్లామర్‌ను మెయింటైన్ చేస్తున్న వాళ్లు ఎందరో ఉన్నారు. అదే సమయంలో 40ఏళ్లు కూడా నిండకుండానే గుండెపోటుతో ఇటీవల తరచూ సెలబ్రిటీలు మృతి చెందడం ఆందోళన కలిగిస్తోంది.సరైన జీవనశైలి, పౌష్టికాహారం, శారీరక శ్రమ ఉంటే గుండెపోటు నుంచి కశ్చితంగా తప్పించుకోవచ్చు అనడానికి కూడా ఎలాంటి ఆధారాలు లేవని సెలబ్రిటీల మరణాలను చూస్తే అర్థమవుతుంది.వయసుతో సంబంధం లేకుండా చిన్నవయసులోనే ఎంతోమంది సెలబ్రిటీలు గుండెపోటుతో మరణించిన ఘటనలు కలకలం రేపుతున్నాయి. సిద్దార్థ్ శుక్లా నుంచి స్పందన వరకు.. గుండెపోటుతో మరణించిన సెలబ్రిటీలు వీళ్లే.. గుండెపోటుతో మరణించిన సెలబ్రిటీలుగతంలో హిందీ ‘బిగ్ బాస్’ సీజన్ 13 విజేత, ‘చిన్నారి పెళ్లి కూతురు’ సీరియల్ నటుడు సిద్ధార్థ్ శుక్లా గుండెపోటుతో కన్నుమూసిన సంగతి తెలిసిందే. చనిపోయేనాటికి ఆయన వయస్సు కేవలం 40 ఏళ్లు మాత్రమే. ఆయన నిత్యం వ్యాయాయం చేస్తూ ఆరోగ్యకరమైన డైట్‌ను ఫాలో అయ్యేవాడు. చనిపోయే ముందురోజు కూడా వర్కవుట్స్ చేశాడు. ఎంతో భవిష్యత్తు ఉన్న సిద్ధార్థ్ దురదృష్టం కొద్దీ ఆకస్మికంగా గుండెపోటుతో కన్నుమూశాడు.ప్రముఖ కన్నడ నటుడు పునీత్ రాజ్‌కుమార్ కూడా 2021లో గుండెపోటుతోనే హఠార్మణం చెందిన విషయం తెలిసిందే. జిమ్‌లో వర్కవుట్స్ చేస్తూ 46 ఏళ్ల వయసులోనే హార్ట్ఎటాక్కు గురయ్యారు. యన సినిమాలకంటే కూడా పునీత్ ప్రజలకు చేసిన మంచి పనులు, సేవా కార్యక్రమాలు అలాంటి అభిమానులను సంపాదించుకునేలా చేసింది. పునీత్ మరణ వార్తను ఆయన అభిమానులు ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నారు.చిన్నవయసులోనే హార్ట్ఎటాక్మరో కన్నడ నటుడు చిరంజీవి సర్జా కూడా గుండెపోటుతోనే మరణించారు. ఈయన ప్రముఖ నటుడు అర్జున్‌కు స్వయానా మేనల్లుడు. 35ఏళ్ల వయస్సులోనే హార్ట్ ఎటాక్‌తో చిరంజీవి సర్జా కన్నుమూశారు. చిరంజీవి సర్జా 2009లో వాయుపుత్ర చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చి సుమారు 19 సినిమాల్లో నటించాడు. ఎంతో భవిష్యత్తు ఉన్న ఆయన గుండెపోటుతో అకాల మరణం చెందాడు. చదవండి: హీరో భార్య మృతి, చిన్నవయసులోనే గుండెజబ్బులు..ఎందుకిలా?టాలీవుడ్ హీరో నందమూరి తారకరత్న కూడా గుండెపోటుతోనే కన్నుమూశారు. 39 ఏళ్ల వయసులోనే గుండెపోటుతో అర్థంతరంగా తారకరత్న తనువు చాలించాడు. సుమారు 23రోజుల పాటు బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆసుపత్రిలో చికిత్స పొందిన ఆయన పరిస్థితి విషమించడంతో ఈ ఏడాది ఫిబ్రవరి 18న తుదిశ్వాస విడిచారు. పునీత్ కుటుంబంలో మరో విషాదంతాజాగా కన్నడ నటుడు విజయ్ రాఘవేంద్ర భార్య స్పందన గుండెపోటుతో మరణించింది. స్నేహితులు, కుటుంబసభ్యులతో కలిసి బ్యాంకాక్ వెళ్లిన ఆమె ఆదివారం రాత్రి గుండెపోటుతో కుప్పకూలిపోయింది. దీంతో వెంటనే ఆమె స్థానిక ఆసుపత్రికి తరలించినా ఫలితం లేకుండా పోయింది.కన్నడ దివంగత నటుడు పునీత్ రాజ్‌కుమార్ కుటుంబానికి విజయ్ రాఘవేంద్ర దగ్గర బంధువు.2021లో పునీత్ కూడా గుండెపోటుతో మరణించారు. ఇప్పుడు వారి కుటుంబం నుంచే స్పందన కూడా మరణించడం శాండల్‌వుడ్ ఇండస్ట్రీలో తీరని విషాదాన్ని నింపిందని చెప్పవచ్చు. ఈనెలలో ఈ జంట తమ 16వ వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకోనుంది. కానీ ఆ వేడకకు కొన్నిరోజులు ముందే స్పందన ఇలా హఠాన్మరణం చెందడం ఆ కుటుంబాన్ని తీవ్ర విషాదంలోకి నెట్టివేసింది.వ్యాయామం చేస్తున్నా ఎందుకీ గుండెజబ్బులు?స్ట్రిక్ట్ డైట్ ఫాలో అవుతున్నా చిన్న వయసులోనే గుండెపోటు ఎందుకొస్తుందనే ప్రశ్న ఇప్పుడు చాలా మందిని వేధిస్తుంది. గతంలో 25-30-40 ఏళ్ల వయస్సులో గుండెపోటు అనేది చాలా అరుదుగా ఉండేది. కానీ ఇటీవలికాలంలో ఈ సంఖ్య పెరుగుతోంది. వర్కవుట్స్ చేస్తే మంచిదే కదా అని అతిగా వ్యాయామాలు చేయకూడదు.దీనివల్ల గుండెపై ఒత్తిడి పెరుగుతంది. యువత చాలా ఎక్కువ జిమ్ చేస్తుంటారు. కానీ జిమ్‌లో చేసే కొన్ని పొరపాట్లు కూడా గుండెపోటుకు కారణమౌతుంటుంది. వ్యాయామం ఎప్పుడూ సాధారణ స్థాయిలో, మితంగా ఉండాలి. పరిమితి దాటితే అనర్థాలు తప్పవు.హెవీ ఎక్సర్సైజ్ చేయడం వల్ల శరీరంపై, గుండెపై దుష్ప్రభావం పడుతుంది. గంటల తరబడి వ్యాయామం చేయడం కూడా మంచిది కాదని, వయసు పెరుగుతున్న కొద్దీ డాక్టర్ల సూచనతో వ్యాయామం, డైట్‌ను పాటించాలని వైద్యులు సూచిస్తున్నారు. -
మహేశ్ బాబు త్రీ మినిట్ ఛాలెంజ్.. మీరు చేయగలరా?
టాలీవుడ్ ప్రిన్స్ మహేశ్ బాబు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. రాజకుమారుడి సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత మురారి, ఒక్కడు సినిమాలు సూపర్ హిట్ కావడంతో స్టార్ హీరో హోదా దక్కించుకున్నాడు. ప్రస్తుతం మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో గుంటూరు కారం చిత్రంలో నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది. అయితే తాజాగా మహేశ్ బాబు షేర్ చేసిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. ఇంతకీ అదేంటో తెలుసుకుందాం. (ఇది చదవండి: ప్రియుడి బర్త్‌డే బాష్: మలైకా డ్రెస్ ఖరీదెంతో తెలుసా?) ప్రస్తుతం గుంటూరు కారం చిత్రంలో నటిస్తోన్న మహేశ్ బాబు జిమ్‌లో కసరత్తులు చేస్తున్నాడు. తాజాగా దీనికి సంబంధించిన ఓ వీడియోను తన ఇన్‌స్టాలో పంచుకున్నారు. జిమ్‌లో మూడు రకాల తన ఫేవరేట్ వర్కవుట్స్ ఇవేనంటూ క్యాప్షన్ ఇచ్చాడు. మై సాటర్ డే సిజిల్ సెట్ అంటూ ఒక నిమిషం ల్యాండ్‌మైన్ ప్రెస్, ఒక నిమిషం కెటిల్‌బెల్ స్వింగ్, ఒక నిమిషం స్కిల్‌మిల్ రన్!! మీరు ఎన్ని సెట్లు చేయగలరు ??? అంటూ ఛాలెంజ్ విసిరారు. ఇది చూసిన మహేశ్ సతీమణి నమ్రత శిరోద్కర్ ఫైర్ ఎమోజీలతో కామెంట్ చేసింది. ఇది చూసిన మహేశ్ బాబు ఫ్యాన్స్ మాత్రం మరో పోకిరి అంటూ కామెంట్స్ చేస్తున్నారు. (ఇది చదవండి: అక్కడ ప్లేట్స్ కడిగిన స్టార్ హీరోయిన్.. కారణం అదే!) View this post on Instagram A post shared by Mahesh Babu (@urstrulymahesh) -
'మిస్టర్ రజనీ ఎందుకు ఎక్స్‌ట్రాలు చేస్తున్నావ్!'
టీమిండియా ఆటగాడు కేఎల్ రాహుల్ ప్రస్తుతం బెంగళూరులోని ఎన్సీఏ అకాడమీలో రీహాబిలిటేషన్‌లో ఉన్నాడు. ఈ లక్నో కెప్టెన్ మోకాలి గాయంతో ఐపీఎల్ 2023 సీజన్ మధ్యలోనే వైదొలిగిన సంగతి తెలిసిందే. భార్య అతియా శెట్టితో కలిసి జర్మనీకి వెళ్లి మోకాలికి సర్జరీ చేయించుకున్నాడు. స్వదేశానికి తిరిగి వచ్చిన అనంతరం రీహాబిలిటేషన్ పేరుతో బీసీసీఐ బెంగళూరు ఎన్సీఏ అకాడమీకి పంపింది. ప్రస్తుతం ఫిట్నెస్ సాధించే పనిలో ఉన్న కేఎల్ రాహుల్ అందుకు తగ్గట్టుగా జిమ్ వర్కౌట్స్ చేస్తు చెమటలు కక్కాడు.ఇందుకు సంబంధించిన ఫోటోలను, వీడియోను రాహుల్ స్వయంగా ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసుకున్నాడు. రాహుల్ పెట్టిన ఫోటోలపై అభిమానులు స్పందించారు. టీమిండియా యంగ్ క్రికెటర్ ఇషాన్ కిషన్ సైతం రాహుల్ పోస్టుకు స్పందిస్తూ సరదాగా టీజ్ చేశాడు. ''ఏంటి మిస్టర్ రజనీ(కేఎల్ రాహుల్) చాలా ఎక్స్‌ట్రాలు చేస్తున్నావ్.. చూడలేకపోతున్నాం'' అంటూ సరదాగా కామెంట్ చేశాడు. ఇక గాయం కారణంగా డబ్ల్యూటీసీకి దూరమైన కేఎల్ రాహుల్ స్థానంలో ఇషాన్ కిషన్‌ను బీసీసీఐఘ ఎంపిక చేసింది. కానీ ఫైనల్ మ్యాచ్‌కు అతను బెంచ్‌కే పరిమితమయ్యాడు. ప్రస్తుతం ఇషాన్ కిషన్ కూడా బెంగళూరులోని ఎన్సీఏ అకాడమీలోనే ఉన్నాడు. విండీస్ టూర్‌కు ఎంపిక కావడంతో బ్యాటింగ్‌లో టెక్నిక్స్ మెరుగుపరుచుకునేందుకు ఇషాన్ ఎన్సీఏలో శిక్షణ తీసుకుంటున్నాడు. డబ్ల్యూటీసీ ఫైనల్‌కు బెంచ్‌కే పరిమితమైన ఇషాన్ విండీస్ గడ్డపై పరుగుల వరద పారించేందుకు తహతహలాడుతున్నాడు. వెస్టిండీస్ పర్యటనలో టీమిండియా రెండు టెస్టులు, 3 వన్డేలు, 5 టి20లు ఆడనుంది. మొదటి టెస్టు జూలై 12-16 తేదీల్లో విండ్సర్ పార్క్ స్టేడియంలో, రెండో టెస్టు 20-24 మధ్య క్వీన్స్ పార్ట్ ఓవల్ వేదికగా జరగనున్నాయి. వన్డే సిరీస్ జూలై 27న మొదలు కానుంది. మొదటి వన్డేకు కింగ్స్టన్ స్టేడియం ఆతిథ్యం ఇస్తోంది. రెండో వన్డే జూలై 29న అదే స్టేడియంలో జరగనుంది. భారత్, వెస్టిండీస్ జట్లు ట్రినిడాడ్‌లోని బ్రియాన్ లారా క్రికెట్ అకాడమీలో మూడో వన్డే ఆడతాయి. ఐదు టీ 20ల సిరీస్ ఆగష్టు 3న ప్రారంభమవుతుంది. ఆగష్టు 6, 8, 12, 13న మిగతా టి20 మ్యాచ్‌లు ఉన్నాయి. View this post on Instagram A post shared by KL Rahul👑 (@klrahul) చదవండి: 'మెక్కల్లమ్ కంటే ముందు నన్ను సంప్రదించారు.. తిరస్కరించా' భార్య ఆట చూద్దామని వస్తే నిరాశే మిగిలింది -
వైరల్ వీడియో : సిక్స్‌ప్యాక్ కోసం జిమ్ లో తెగ కష్టపడుతున్న పిల్లి
-
పడుచు కుర్రాడనుకుంటున్నారా.. అసలు వయసు తెలిస్తే.. షాకవుతారు
సామాన్యంగా జనాలకు ముఖ్యంగా సెలబ్రిటీలకు వృద్ధాప్యం అంటే చాలా భయం. వయసు మీదపడుతున్న కొద్ది.. దాన్ని కప్పిపుచ్చుకోవడం కోసం రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. డైటింగ్, ఎక్సర్సైజ్, సర్జరీలు, స్టెరాయిడ్స్ వాడటం వంటివి చేస్తుంటారు. ఎన్ని చేసినా ఓ వయసు వచ్చే వరకు మాత్రమే. ఆ తర్వాత ఆటోమెటిగ్గా మనకు ఇంట్రెస్ట్ తగ్గుతుంది. కానీ కొందరు మాత్రం వ్యాయమాన్ని తమ జీవితంలో భాగం చేసుకుంటారు. ఏళ్ల తరబడి దాన్ని అలానే కొనసాగిస్తారు. దాని ఫలితం ఎలా ఉంటుందో తెలియాలంటే ఇది చదవాల్సిందే. తాజాగా సోషల్ మీడియాలో ఒక ఫోటో తెగ వైరలవుతోంది. ఇది చూసిన జనాలు ఆశ్చర్యంతో నోరు వెళ్లబెడుతున్నారు. ఇదేలా సాధ్యం అయ్యింది అని ప్రశ్నిస్తున్నారు. ఆ వివరాలు తెలుసుకునేముందు ఓ సారి పైన ఉన్న ఫోటోను జాగ్రత్తగా పరిశీలించండి. అతడిని చూడగానే మంచి బాడీబిల్డర్‌లా ఉన్నాడు.. ఏవైనా పోటీలకు సిద్ధం అవుతున్నాడేమో అనిపిస్తుంది. వయసు అంటే మహా అయితే 30-35 మధ్యన ఉంటుంది అనిపిస్తుంది కదా. (చదవండి: Science Facts: ఎక్సర్సైజ్ చేస్తే దేహాకృతి మారుతుందా? ఎంతవరకు నిజం..) అదుగో అక్కడే మీరు తప్పులో కాలేశారు. అతడి అసలు వయసు తెలిస్తే మీరు ఓ నిమిషం పాటు షాక్‌కు గురవుతారు. ఎందుకంటే అతడు 72 ఏళ్ల వ్యక్తి. కానీ చూడ్డానికి మాత్రం 30 ఏళ్ల పడుచు కుర్రాడిలా ఉన్నాడు. వామ్మో ఫించను తీసుకోవాల్సిన వయసులో ఈ బాడీ బిల్డింగ్ ఏంట్రా సామీ అనిపిస్తుంది కదా. ఫోటోలోని వ్యక్తి పేరు జిన్మిన్ యాంగ్. గత 30 ఏళ్ల నుంచి క్రమం బాడీ బిల్డింగ్ చేస్తున్నాడు. 2019లో ఇతడికి సంబంధించిన ఓ వీడియో కూడా తెగ వైరలయ్యింది. దానిలో అతడు తన వయసు 30 సంవత్సరాలు అని చెప్తే జనాలు ఈజీగా నమ్మేశారు. మరి జిన్మిన్ ఇంత యవ్వనంగా కనిపించడానికి ఏం చేస్తున్నాడంటే.. (చదవండి: దేహంలో చెత్త లేకుండా చూసుకోవాలి: రకుల్) జిన్మిన్ గత 30 ఏళ్లుగా క్రమం తప్పకుండా వర్కౌట్స్ చేస్తూ.. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడంతో పాటు.. మంచి జీవన విధానాలు పాటిస్తాడు. బాడీబిల్డింగ్ కోసం ప్రతి రోజు 6-8 గుడ్లు, దోసకాయలు, చికెన్, టమాటాలు, ఓట్మీల్ తీసుకుంటాడు. ఇతడి ఫిట్నెస్కి ఇటు సామాన్యులతో పాటు పెద్ద పెద్ద కంపెనీలు కూడా ఫిదా అయ్యాయి. తమ ఉత్పత్తులకు అతడిని ప్రచారకర్తగా నియమించుకుంటున్నారు. చదవండి: డాక్టర్లు హెచ్చరించినా సిద్ధార్థ్ శుక్లా పట్టించుకోలేదా? -
Science Facts: ఎక్సర్సైజ్ చేస్తే దేహాకృతి మారుతుందా? ఎంతవరకు నిజం..
Can You Change Your Body Shape With Daily Exercises: నిద్రలేచి అద్దంలో చూసుకునే వాళ్లు ఎంతమంది ఉంటారో కానీ బయటకు వెళ్లడానికి తయారైన తర్వాత అద్దంలో చూసుకునే అలవాటు చాలామందికి ఉంటుంది. ‘పట్టుచీరల షోరూమ్ ముందు హోర్డింగ్‌లో ఉన్న మోడల్ కట్టుకుంటే అంత అందంగా అమరిన చీర తనకెందుకు ఆ స్థాయిలో నప్పడం లేదు. మూడు నెలలుగా ఎక్సర్సైజ్ చేస్తున్నా ఫలితం అంతంత మాత్రమే’ అని ఓ యువతి అసంతృప్తిగా ముఖం పెట్టడం సహజమే. అలాగే స్లిమ్ ఫిట్ షర్ట్‌ను ధరించిన మోడల్‌ను చూసి మనసు పడి ఆ చొక్కా కొనుక్కున్న ఓ కుర్రాడు కూడా అద్దంలో చూసుకుంటూ ‘మోడల్ ఉన్నంత స్మార్ట్‌గా లేను’ అనుకోవడమూ, మరుసటి రోజు నుంచే వ్యాయామం మొదలు పెట్టడం కూడా సర్వసాధారణమే. ఎక్సర్సైజ్ దేహాకృతిని మారుస్తుంది. నిజమే, అయితే ఎక్సర్సైజ్ ఎన్ని రోజులు చేస్తే ప్రకటనలో ఉన్న మోడల్ దేహాకృతి వస్తుంది..? ఇది జెనెటిక్స్ నిర్ణయం... మనిషి దేహాకృతిని ప్రధానంగా జెనెటిక్స్ నిర్దేశిస్తాయి. బొద్దుగా లేదా బక్క పలుచగా ఉండడం వంటి లక్షణాలు పిల్లలకు వారసత్వంగా సంక్రమిస్తాయి. అలా సంక్రమించిన లక్షణాలను మన జీవనశైలి ప్రభావితం చేస్తుంది. ఆహారవిహారాల ప్రభావంతో సన్నని వాళ్లు కూడా అధిక బరువుకు లోనవుతుంటారు. బొద్దు వాళ్లు ఏకంగా ఒబేసిటీ బారిన పడుతుంటారు. ఎక్సర్సైజ్ చేయడం వల్ల దేహంలో కొవ్వు కరిగి కండరాలు చక్కని షేప్‌లో రూపుదిద్దుకుంటాయి. అందులో సందేహం లేదు. చదవండి: Science Facts: చీమల రక్తం అందుకే ఎర్రగా ఉండదట..! అయితే నడుము భాగం సన్నగా ఉండడం లేదా వెడల్పుగా ఉండడం, భుజాలు విశాలంగా ఉండడం లేదా కుంచించుకు పోయినట్లు ఉండడం వంటివి వారసత్వంగా వస్తాయి. వ్యాయామం వల్ల దేహ నిర్మాణరీతిలో ఎటువంటి మార్పు రాదు. ఈ అంశం మీద ఏకంగా 24 అధ్యయనాలు జరిగాయి. మూడు వేలమందికి పైగా ఇందులో పాల్గొన్నారు. వారంలో మూడు రోజుల చొప్పున పన్నెండు వారాలపాటు వ్యాయామం చేస్తే... ఒకరి దేహం స్పందించినట్లు మరొక దేహం స్పందించలేదు. మనిషి ఎత్తు, బరువు, వయసు, ఆహారవిహారాలు, నిద్ర వంటి వాటన్నింటినీ ఆరోగ్యవంతంగా క్రమబద్ధం చేసుకుంటూ వ్యాయామాన్ని కొనసాగించాలి. వ్యాయామం దేహాన్ని శక్తిమంతంగా, ఫ్లెక్సిబుల్‌గా ఉంచుతుంది. దేహం అంతర్గత అవయవాల పనితీరు మెరుగ్గా ఉంటుంది. సమగ్ర ఆరోగ్యం వ్యాయామం మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి వ్యాయామం మంచిదే. అలాగే దేహాకృతి మీద ధ్యాస ఉండడం కూడా ఆరోగ్యకరమే. అయితే మనదేహం మరొకరి దేహాకృతిలాగా మారిపోవాలనుకోవడం ఆరోగ్యకరం కాదు. అది సాధ్యం కాదు. చదవండి: Covid Taste Test: తెలుసా..! కాఫీతో కోవిడ్ టెస్ట్ చేయొచ్చు... ఎలాగంటే.. -
జిమ్‌లో అసభ్య ప్రవర్తన... టిక్టాక్లోషేర్ చేయడంతో పరార్!!
కొన్ని సంఘటనలు చూస్తే ఎన్ని చట్టాలు వచ్చినప్పటికీ ఇంకా మహిళలు పనులను స్వతంత్రంగా, స్వేచ్ఛగా ఇబ్బందిపడకుండా చేసుకునే అవకాశం మాత్రం ఎప్పటికీ కుదరదేమో అనిపిస్తుంది. అచ్చం అలాంటి సంఘటనే ఇక్కడ ఒకటి జరిగింది. (చదవండి: యూకే లివర్‌పూల్ నగంలో కారు బ్లాస్ట్... ఒకరు మృతి) సాధారణంగా జిమ్ సెంటర్లలో అందరూ ఒకేసారి తమ వర్క్ అవుట్లను చేసుకుంటుంటారు. అదేవిధంగా ఇక్కడొక మహిళ అలానే తాను తన వర్కవుట్లు కొనసాగిస్తుండగా ఒక సీనియర్ సిటిజన్ తనను తదేకంగా చూస్తుంటాడు. దీంతో ఆమె అసౌకర్యంగా ఫీలై ఆమె తన భర్తను తన పక్కన నిలబడమని చెబుతుంది. అయితే ఆమె భర్త తన పక్కన నిలబడి ఉన్నప్పటికీ సదరు వ్యక్తి మళ్లీ అలానే చూస్తుంటాడు. దీంతో ఆమె తన ఫోన్ కెమెరా ఆన్ చేసి ఆ ఘటనను చిత్రికరించి టిక్‌టాక్‌లో పోస్ట్ చేస్తుంది. పైగా ఆ విషయాన్ని అతనికి చెప్పడంతో సదరు వ్యక్తి అక్కడ్నుంచి నెమ్మదిగా జారుకున్నాడు. అంతేకాదు ఆ విషయాన్ని గమనిస్తున్న జిమ్ ట్రైనర్ ఆమె చేసిన పనికి ప్రశంసిస్తాడు. అయితే ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతోంది. దీంతో నెటిజన్లు ఆమె చేసిన పనికి ప్రశంసలు వర్షం కురిపించడమే కాక మంచి పనిచేశారంటూ రకరకాలుగా ట్వీట్ చేశారు. (చదవండి: మెక్‌డొనాల్డ్స్ ‘టాయిలెట్’ వివాదం) -
కత్రినా కైఫ్ కిల్లింగ్ వర్కవుట్స్ వీడియో వైరల్
సాక్షి,ముంబై: బాలీవుడ్స్టార్ హీరోయిన్ కత్రినా కైఫ్ కొత్త వర్కౌట్ వీడియోను షేర్ చేసింది. ఈ మధ్య కాలంలో ఫిట్నెస్ ఫ్రీక్‌గా మారి సెక్సీ ఫిగర్‌తో మరింత ఎట్రాక్టివ్‌గా మారిన ఈ భామ శనివారం ఉదయం ఇన్‌స్టాగ్రామ్‌లో భారీ కసరత్తు చేస్తున్న వీడియోను పోస్ట్ చేసింది. క్లిష్టమై వర్కవుట్ చేస్తున్న ఈ వీడియో వైరల్‌గా మారింది. చదవండి : Tiger-3: సల్మాన్ ఖాన్ డ్యాన్సింగ్ వీడియో వైరల్ "నేను నా మనసుకు శిక్షణ ఇస్తాను.. దాన్ని నా బాడీ ఫాలో అవుతుంది. లేదంటే రెజా కటానికి (ఫిట్నెస్ ట్రైనర్) కాల్ చేస్తా’’ అనే క్యాప్షన్‌ను జోడించింది. దీంతో కిల్లింగ్ అంటూ సోఫీ చౌదరి కామెంట్ చేయగా అభిమానులు మాత్రం వావ్ అంటూ ఫిదా అవుతున్నారు. కాగా కత్రినా ప్రస్తుతం సల్మాన్ ఖాన్ సరసన టైగర్-3 మూవీలో నటిస్తోంది. ఈ షూటింగ్‌కు సంబంధించిన ఫోటోలను ఇటీవల ఇన్‌స్టాలో అప్లోడ్ చేసిన సంగతి తెలిసిందే. View this post on Instagram A post shared by Katrina Kaif (@katrinakaif) View this post on Instagram A post shared by Katrina Kaif (@katrinakaif) -
డాక్టర్లు హెచ్చరించినా సిద్ధార్థ్ శుక్లా పట్టించుకోలేదా?
RIP Sidharth Shukla: బాలీవుడ్ నటుడు, బిగ్ బాస్ 13 విజేత సిద్ధార్థ్ శుక్లా ఆకస్మిక మృతితో బాలీవుడ్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. 40 ఏళ్ళకే యువనటుడు గుండెపోటుతో మృతి చెందడం అభిమానులను షాక్‌కు గురిచేస్తోంది. తీవ్రమైన గుండెపోటు రావడంతో గురువారం ఉదయం 10.30 నిమిషాలకు సిద్ధార్థ్ తుదిశ్వాస విడిచారు. ఎప్పుడూ యాక్టివ్‌గా ఉల్లాసంగా కనిపించే సిద్ధార్థ్ లేడన్న వార్త అందరినీ విస్మయానికి గురిచేస్తుంది. ఫిట్‌నెస్‌కు ఎంతో ప్రాధాన్యం ఇచ్చే సిద్ధార్థ్ ఘటన జరగడానికి ముందురోజు సైతం వర్కవుట్స్ చేసినట్లు సమాచారం. చదవండి : సిద్ధార్థ్ శుక్లా చివరి క్షణాలు ఇవేనంటూ వీడియో వైరల్.. నిజం ఏంటంటే? రాత్రి 8గంటలకు ఇంటికి చేరుకున్న సిద్ధార్థ్..పది గంటల సమయంలో జాగింగ్‌తో పాటు కొన్ని వర్కవుట్స్ చేశాడని తెలుస్తుంది. అనంతరం నిద్రపోయే ముందు అతను కొన్ని మెడిసిన్స్ తీసుకున్నాడని, అయితే తెల్లవారుజామున 3గంటలకు ఛాతిలో నొప్పి రావడంతో తన తల్లికి సమాచారం ఇచ్చాడు. దీంతో ఆమె స్వయంగా నీళ్లు తాగించిందని, అనంతరం నిద్రపోయిన సిద్ధార్థ్ మళ్లీ మేల్కోలేదని ఆసుపత్రి వర్గాలు పేర్కొన్నాయి. ఫిట్‌నెస్‌కు ఎంతో ప్రాధాన్యం ఇచ్చే సిద్ధార్థ్ ప్రతిరోజు క్రమం తప్పకుండా దాదాపు 3గంటల పాటు వ్యాయామం చేసేవాడట. అయితే వర్కవుట్ సమయాన్ని కాస్త కుదించమని ఇటీవలె వైద్యులు సలహా ఇచ్చినట్లు సమాచారం. తీవ్రమైన వర్కవుట్స్ కూడా ప్రమాదమేనని వైద్యులు అంటున్నారు. ఆర్థిక జీవనశైలితో పాటు ఒత్తిడి కారణంగా చిన్న వయసులోనే గుండెపోటు తలెత్తడం వంటివి జరుగుతున్నాయని హెచ్చరిస్తున్నారు. శారీరక దాడృత్యంతో పాటు మాససిక ప్రశాంతత కూడా ఎంతో ముఖ్యమని సూచిస్తున్నారు. చదవండి : Sidharth Shukla: ఆరోజు రాత్రి ఏం జరిగింది.. పోస్ట్‌మార్టం నివేదికలో ఏముంది? -
మహా బలశాలిని: గ్యాస్ బండతో మహిళ ఫీట్లు వైరల్
గ్యాస్ సిలిండర్‌తో ఏం ఉపయోగమంటే ఏం చెప్తాం.. వంటలు చేసుకునేందుకు అని. కానీ ఈ మహిళ గ్యాస్‌బండను కసరత్తులు చేసేందుకు ఉపయోగిస్తోంది. గ్యాస్ బండను అమాంతం ఎత్తేసి ఎక్ససైజ్లు చేస్తున్న వీడియో వైరల్‌గా మారింది. అది కూడా చీర ధరించి చేయడం గమనార్హం. ఆమెనే షైలీ చికరా. ఈమె ఫిట్నెస్ నిపుణురాలు. ఆమెకు సాహసాలు చేయడం అలవాటు. వ్యాయామాలు కొత్త తరహా చేస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. తాజాగా ఇంట్లో ఉన్న గ్యాస్ సిలిండర్‌ను షైలీ వరండాలోకి తీసుకువచ్చి అమాంతం సింపుల్‌గా ఎత్తేసింది. రెండుసార్లు పైకి కిందకు ఎత్తి దింపింది. ఈ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. ‘చూద్దాం నా వీడియో ఎక్కడెక్కడకు వెళ్తుందో’ అని మెసేజ్ చేసి పోస్టు చేసింది. ఈ వీడియోను చూసిన వారందరూ ఆమెను అభినందిస్తున్నారు. షైలీ గతంలో కూడా ఇలాంటి ప్రయత్నాలు చేసింది. గతనెలలో పంటితో గ్యాస్ సిలిండర్ ఎత్తేసి ఔరా అనిపించింది. ఆమెకు ఇన్‌స్టాగ్రామ్‌లో పెద్ద సంఖ్యలో ఫాలోవర్లు ఉన్నారు. ఇప్పటివరకు రెండున్నర లక్షల మందికిపైగా ఆమెను ఫాలోవుతున్నారు. ఆమె ఐటీ ఉద్యోగిని అని కూడా తెలుస్తోంది. View this post on Instagram A post shared by Shaili Chikara-Wonder Woman (@shaili_chikara) -
‘వేరే పనేం లేదు.. అందుకే ఇలా’
షూటింగ్‌లు, ప్రెస్ మీట్లు, ఇండస్ట్రీకి చెందిన పలు కార్యక్రమాలతో బిజీగా ఉండే సినిమా జనాలు లాక్డౌన్ ఎఫెక్ట్‌తో ఇళ్లకే పరిమితమయ్యారు. షూటింగ్‌లకు అనుమతించినప్పటికి చాలా మంది ఇంకా వర్క్ మోడ్‌లోకి రాలేదు. అయితే ఈ గ్యాప్‌ను కూడా బాగానే సద్వినియోగం చేసుకుంటున్నారు మన స్టార్లు. ఒకేసారి ఇన్ని రోజులు సెలవు దొరకింది. ఖాళీగా ఉంటే బద్దకంగా తయారవుతామనే ఉద్దేశంతో నచ్చిన వ్యాపకాలతో తమను తాము బిజీగా ఉంచుకుంటున్నారు సినీ జనాలు. కొందరు వ్యవసాయం, వంటలవైపు మల్లగా.. మరి కొందరు శరీరానికి పని చెప్పే పనిలో పడ్డారు. మళయాళ సూపర్‌స్టార్ మమ్ముట్టి కూడా కసరత్తులు చేస్తూ.. బిజీగా గడుపుతున్నారు. ఈ మేరకు ఆదివారం వర్క్‌వుట్ సెషన్‌కు సంబంధించిన ఫోటోలు షేర్ చేశారు మమ్ముట్టి.(అడుగు బయటపెట్టేది లేదు!) View this post on Instagram Work at Home ! 🤔 Work from Home ! 😏 Home Work ! 🤓 No other Work 🤪 So Work Out ! 💪🏻 A post shared by Mammootty (@mammootty) on Aug 16, 2020 at 5:18am PDT గ్రే కలర్ టీ షర్ట్ ధరించి.. జిమ్ గ్లవ్స్ వేసుకుని ఉన్న ఫోటోలను.. ‘వర్క్ ఎట్ హోం.. వర్క్ ఫ్రమ్ హోం.. హోం వర్క్.. నో అదర్ వర్క్.. సో వర్క్‌వుట్’ క్యాప్షన్‌తో ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు మమ్ముట్టి. ప్రస్తుతం ఈ ఫోటోలు తెగ వైరల్ అవుతున్నాయి. వీటిని చూసిన నెటిజనలు సూపర్బ్.. మీరు యువతకు ఆదర్శం అంటూ కామెంట్ చేస్తున్నారు. గత పోస్ట్‌లో క్వారంటైన్ పిరియడ్‌లో ఓల్డ్ హాబీ పేరుతో.. ప్రొఫెషనల్ కెమరాతో పక్షుల ఫోటోలను తీస్తున్న చిత్రాలను షేర్ చేశారు మమ్ముట్టి. ఇక సినిమాల విషయానికి వస్తే.. లాక్‌డౌన్‌కు ముందు మమ్ముట్టి అజయ్ వాసుదేవ్ దర్శకత్వంలో వచ్చిన షైలాక్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. (లాక్డౌన్లో బరువు పెరిగారా? ఇలా చేయండి) -
అప్పుడు అన్నీ మాయం!
‘‘నా మైండ్‌లోని ఆలోచనలు నన్ను మానసికంగా ఎంత ఉక్కిరిబిక్కిరి చేస్తున్నప్పటికీ ఒక్కసారి నేను వర్కౌట్స్ చేయడం ప్రారంభిస్తే అవన్నీ మాయమైపోతాయి. అంతేకాదు నా లక్ష్యానికి నేను మరింత దగ్గరగా వస్తున్నానన్న భావన కలుగుతుంది’’ అంటున్నారు ఇలియానా. ‘వ్యాయామానికి రోజూ ఎంత సమయం కేటాయిస్తారు? అనే ప్రశ్నను ఇలియానా ముందుంచితే – ‘‘ప్రస్తుతం ఆన్లైన్ వర్కౌట్ ప్రోగ్రామ్ చేస్తున్నాను. ప్రతి రోజూ ఓ కొత్త వర్కౌట్‌ను ట్రై చేస్తున్నాను. నా వర్కౌట్ సమయం అన్ని రోజులూ ఒకేలా ఉండదు. ఒకరోజు 75 నిమిషాలు, మరో రోజు 45 నిమిషాలు.. ఇలా రోజు రోజుకీ తేడా ఉంటుంది. ఒక్కో రోజు జస్ట్ యోగా మాత్రమే చేస్తాను. ఫిట్‌గా ఉండటానికి, మానసిక ఆరోగ్యం బాగుండేందుకు మీరు (అభిమానులు) వర్కౌట్స్ చేసి చూడండి. వచ్చే ఫలితం మీకు సంతోషాన్ని ఇస్తుంది’’ అని పేర్కొన్నారు ఇలియానా. -
'పీటర్సన్.. రిటైర్మెంట్ తర్వాత వస్తా'
ముంబై : టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఫిట్నెస్ కాపాడుకోవడంలో ఎంత ముందుంటాడో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇంతకుముందు కూడా కోహ్లి ఫిట్‌నెస్‌కు సంబంధించిన వీడియోలను ట్విటర్లో షేర్ చేశాడు. కరోనా నేపథ్యంలో లాక్డౌన్ విధించడంతో ఆటకు కూడా విరామం దొరకడంతో కోహ్లి ఫిట్‌నెస్‌పై మరింత దృష్టి సారించాడు. తాజాగా వెయిట్‌లిప్టింగ్ చేస్తున్న వీడియో ఒకటి కోహ్లి తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు. (కోహ్లితో పోల్చొద్దు: పాక్ కెప్టెన్ బాబర్) 'నేను రోజూ ఎక్సర్సైజ్లు చేయాలనుకున్నప్పుడు వెయిట్‌లిఫ్టింగ్ పుషప్ను తప్పకుండా ఉంచుకుంటా. ఎందుకంటే అది నా ఫేవరెట్. నాలో ఎంత పవర్ ఉందనేది బయటపెడుతుంది. అందుకే ఈ వర్కవుట్‌ను బాగా ఇష్టపడుతా' అంటూ క్యాప్షన్ జత చేశాడు. ఈ వీడియో చూసిన తర్వాత ఇంగ్లండ్ మాజీ ఆల్‌రౌండ్‌ర్ కెవిన్ పీటర్సన్ కోహ్లిపై సరదాగా కామెంట్ చేశాడు. ' ఏయ్ కోహ్లి.. బైక్‌పై వచ్చేయ్.. ఇద్దరం కలిసి చేద్దాం' అంటూ పేర్కొన్నాడు. దీనికి కోహ్లి.. తప్పకుండా.. కానీ రిటైర్మెంట్ తర్వాత వస్తా అంటూ సరదాగా పేర్కొన్నాడు. -
‘ఇలా చేస్తే ఎన్నో లాభాలు’
ముంబై: బాలీవుడ్ నటి రాధిక మడన్ వ్యాయమమం ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇందులో రాధిక ఎలాంటి సపోర్టు లేకుండా చేతుల ఆధారం కాళ్లను పైకి పెట్టి నవ్వుతూ కెమారాకు ఫొజ్ ఇవ్వడం చూసి ఆమె అభిమానులు ఫిదా అవుతున్నారు. అంతేగాక ఈ పోస్టుకు తను పెట్టిన క్యాప్షన్ నెటిజన్లను మరింత ఆకట్టుకుంటోంది. గురువారం తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన ఈ పోస్టుకు ‘ఈ రోజుల్లో నేలపై పడకండి’ అనే ఈ శీర్షికను రాధిక 1978లో ప్రముఖ గాయని లతా మంగేష్కర్ పాడిన ప్రముఖ పాట నుంచి తీసుకున్నారు. అయితే శీర్షాసనం (తలను ఆధారంగా చేసుకుని తల కిందులుగా ఉండటం) వేయడం అంత సులభం కాదు. ఎంతో కష్టపడితే కానీ ఈ ఆసనంలో ఉండటం కష్టం. (మళ్లీ గోల్మాల్) View this post on Instagram Aaj kal paao zameen par nahi padhte mere . .🧚♀️ A post shared by Radhika Madan (@radhikamadan) on Jun 24, 2020 at 8:37am PDT ఒకవేళ మీరు ఈ ఆసనం వేస్తే మాత్రం దీనివల్ల అనేక అరోగ్య సమస్యలకు చెక్ పెట్టినట్లే. ఇది మీ రోగ నిరోధక శక్తిని పెంచడమే కాకుండా శరీర సమతుల్యతను పెంచుతుంది. అంతేగాక ఏకాగ్రతను, దృష్టిని మెరుగుపరుస్తుంది. మరీ ఇంకేందుకు ఆలస్యం రాధికలా మీరుకూడా ఈ ఆసనాన్ని వేసి ఆరోగ్యంగా ఉండండి. కాగా రాధిక ‘మేరీ ఆషీకీ తుమ్ సే హై’ సీరియల్లో లీడ్రోల్లోలో నటించారు. ఆ తర్వాత 2018లో వచ్చిన ‘పటాఖా’తో మొదటిసారిగా సినిమాలో నటించారు. ఆ తర్వాత ‘మార్ధ్ కో దర్ధ్ నాహి హోతా’తో పాటు ఇటీవల లెజండరీ నటుడు ఇర్ఫాన్ ఖాన్ నటించిన అంగ్రేజీ మీడియంలో నటించారు. (బెల్లీ ఫ్యాట్‌కు ఇలా చెక్ పెట్టండి..) -
'అందుకే నిన్ను మిస్టర్ పర్ఫెక్ట్ అంటారు'
ఢిల్లీ : టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి ఏ పని చేసినా కచ్చితత్వం ఉండేలా చూసుకుంటాడు. అది మ్యాచ్ అయినా లేక మరే ఏ పనైనా మిస్టర్ పర్ఫెక్ట్గానే వ్యవహరిస్తాడు. తాజాగా లాక్డౌన్ నేపథ్యంలో ఇంటికే పరిమితమైన కోహ్లి ఫిట్‌నెస్‌పై దృష్టి సారిస్తూ ఇన్‌స్టాలో వరుసపెట్టి వీడియోలు షేర్ చేస్తున్నాడు. తాజాగా కోహ్లి 180 డిగ్రీల కోణం ల్యాండింగ్ ఎక్సర్సైజ్ వీడియోను షేర్ చేశాడు. ఆ వీడియోలో కోహ్లి కేవలం తన కాలిపాదం సహయంతోనే ఒకవైపు తిరిగి 180 కోణంలో మరో పాదం సహాయంతో ఇంకోవైపు తిరిగాడు. చూడడానికి ఈ వీడియో కొంచెం కఠినంగానే ఉన్నా కోహ్లి మాత్రం ఈ వర్కవుట్‌ను పర్ఫెక్ట్గా చేశాడు. ' ఇది నా ఫస్ట్ 180 ల్యాండిగ్ ఎక్సర్సైజ్.. ఇదే నా టాప్ ఎక్సర్సైజ్ ' అంటూ క్యాప్షన్ జత చేశాడు. కోహ్లి చేసిన ఈ వర్కవుట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ' విరాట్.. ఇలాగే మాకు ఆదర్శంగా నిలబడు'.. ' నువ్వు ఏం చేసినా కచ్చితత్వం వచ్చేవరకు వదిలిపెట్టవు' అంటూ కామెంట్లు పెట్టారు. సిక్సర్ల కంటే సింగిల్స్‌పైనే ఫోకస్ చేశాడు కాగా మంగళవారం హర్భజన్ సింగ్ డంబుల్స్తో చేసిన వర్కవుట్‌పై కోహ్లి సరదాగా స్పందించిన సంగతి తెలిసిందే. 'పాజీ.. మెల్లిగా బిల్డింగ్ షేక్ అవుతుంది' అంటూ కామెంట్ చేయడం తెగ వైరల్‌గా మారింది. ఇంతకుముందు కూడా విరాట్ ఇలాగే వెయిట్‌లిఫ్టింగ్‌తో చేసిన వీడియో కూడా వైరల్‌గా మారింది. ఈ వెయిట్‌లిఫ్టింగ్ వర్కవుట్ రాయల్ చాలెంజర్స్ బెంగుళూరు సహచర ఆటగాడు ఏబీ డివిలియర్స్ ఆకట్టుకున్న సంగతి తెలిసిందే.('భజ్జీ ! మెల్లిగా.. బిల్డింగ్ షేక్ అవుతుంది') -
నటుడు సూర్యకు గాయాలు !
సినీ నటుడు సూర్య గాయాలు అయినట్లుగా తెలుస్తోంది. ఆయనకు గాయాలయ్యాన్న వార్త సామాజిక మాధ్యమాల్లో గుప్పుమంటోంది. సుధ కొంగర దర్శకత్వంలో సూరారై పొట్రు చిత్రాన్ని పూర్తి చేసిన సూర్య ఆ చిత్ర విడుదల కోసం ఎదురు చూస్తున్నారు. అదే విధంగా ఆయన భార్య జ్యోతిక కథానాయకిగా నిర్మించిన పొన్మగళ్ వందాళ్ చిత్రం ఈ నెల 29న ఓటీటీలో విడుదల కానుంది. లాక్డౌన్ కాలంలో సూర్య వర్కవుట్ చేస్తుండగా గాయాలు అయినట్లు ప్రచారం సాగుతోంది. ఈ విషయంలో ఆయన అభిమానులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. అభిమాన నటుడు త్వరగా కోలుకోవాలని ప్రార్థనలు చేస్తున్నారు. ఈ విషయంపై సూర్య అందుబాటులోకి రాకపోగా, ఆయన బంధు వర్గాలను విచారించగా సామాజిక మాధ్యమాల్లో ప్రచారం జరుగతున్నట్లు పెద్దగా గాయాలేమీ కాలేదని వివరించారు. ఇటీవల వర్కవుట్ చేస్తుండగా ఆయన ఎడమ చేతికి గాయమైందన్నారు. వెంటనే ఆసుపత్రికి వెళ్లి చికిత్స చేయించుకున్నారని తెలిపారు. ఇప్పుడు సూర్య చేతి గాయం 90 శాతం నయమమైందని చెప్పారు. లాక్ డౌన్ పూర్తి కాగానే హరి దర్శకత్వంలో అరువా చిత్ర షూటింగ్లో పాల్గొంటారని సమాచారం. చదవండి: త్రీఎఫ్ ఉంటే చాలు! -
ఈ వీడియో ఇప్పుడు వార్తల్లో
సినిమా: నటిగా కంటే వివాదాస్పద సంఘటనలతోనే ఎక్కువగా పాపులర్ అయిన నటి అమలాపాల్ అని పేర్కొనవచ్చు. కోలీవుడ్‌లో తొలి చిత్రంలోనే చర్చనీయాంశ కథా పాత్రలో నటించి వార్తల్లోకి ఎక్కింది. ఆ తరువాత మైనా చిత్ర విజయంతో నటిగా పేరు తెచ్చుకుంది. ఇక దర్శకుడు విజయ్‌తో ప్రేమలో పడి సంచలన నటిగా ముద్ర వేసుకుంది. ఆయన్ని పెళ్లి చేసుకుని రెండేళ్లలోనే విడిపోయి విడాకులు తీసుకుని మరోసారి వార్తల్లోకి ఎక్కింది. అయినా కథానాయకిగా నిలదొక్కుకుందంటే ఆమె సంపాధించుకున్న పాపులారిటీనే కారణం అని చెప్పవచ్చు. కాగా ఆ మధ్య ఒకతను అసభ్యంగా ప్రవర్తించాడని పోలీస్‌స్టేషన్ వరకరూ వెళ్లి కలకలం సృష్టించింది. అలా ఆమె ధైర్యానికి పోలీసులతో కూడా ప్రశంసులు అందుకుంది. ఇకపోతే విదేశాల నుంచి ఖరీదైన కారును కొనుగోలు చేసి, ఖర్చు తగ్గుతుందని పాండిచేరిలో రిజిస్టర్ చేయించుకుని వివాదాల్లోకి ఎక్కింది. View this post on Instagram It all starts with A Vision! ✨ . . #wakeupandlift #girlswholift #weightlife #gymrat #fuelyourlife #fitfam #lifeinmumbai #AmalaPaul A post shared by Amala Paul ✨ (@amalapaul) on Dec 19, 2019 at 7:31am PST ఇలా అమలాపాల్ అంటేనే సంచలనం అన్నంతగా ముద్ర వేసుకున్న ఈ కేరళా కుట్టి. ఇటీవల ఆడై చిత్రంలో నగ్నంగా నటించి మరోసారి చర్చకు తావిచ్చింది. కాగా సమీప కాలంలో వార్తల్లో ఎక్కడా కనిపించని అమలాపాల్ తాజాగా మరో సారి సామాజక మాధ్యాలకు పనిచెప్పింది. పిట్నెస్ కోసం కసరత్తులు చేస్తున్న వీడియో తన ఇన్‌స్ట్రాగామ్‌లో పోస్ట్ చేసింది. అందులో అమలాపాల్ ఎంత కష్టపడి కసరత్తులు చేస్తున్నదో అందరికీ తెలిసేలా ఉంది. ఈ వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఆడై చిత్రం తరువాత అమలాపాల్ నటించిన చిత్రమేదీ తెరపైకి రాలేదు. కాగా ఈ సంచలన నటి నటించిన అదో అందపరవై పోల చిత్రం నిర్మాణ కార్యక్రమాలను పూర్తిచేసుకుని త్వరలో విడుదలకు ముస్తాబవుతోంది. ప్రస్తుతం ఒక మలయాళ చిత్రంతో పాటు వెబ్ సిరీస్‌లోనూ నటిస్తోంది. కాగా తాజాగా బాలీవుడ్లో అడుగు పెట్టనుంది. అక్కడ హీరోయిన్లు ఎలా ఉంటే ఆదరిస్తారో తెలిసిందేగా. ఆ చిత్రం కోసమే ఈ అమ్మడు స్లిమ్‌గా తయారవ్వడానికి వరౌట్స్ చేస్తోందట. ఈ విషయాన్ని తెలియజేయడానికీ, పనిలో పనిగా ఉచిత ప్రచారం పొందడానికీ తన కసరత్తుల వీడియోను విడుదల చేసింది. ఇలా వార్తల్లో ఉండడంలో అమలాపాల్ తనకు తానే చాటి అని మరోసారి రుజువు చేసింది. -
‘దారుణమైన వర్కవుట్లు; కాబట్టే సింధూ గెలిచింది’
-
రెండేళ్లు శ్రమించా
కెరీర్ స్టార్టింగ్‌లో బొద్దుగా ఉండేవారు రాశీ ఖన్నా. ఇప్పుడు స్లిమ్‌గా మారిపోయారు. ఈ మార్పు వెనక రెండేళ్ల శ్రమ ఉందట. ప్రస్తుతం ‘నాకు నేనే నా బెస్ట్ వెర్షన్‌లా’ అనిపిస్తున్నాను అంటున్నారామె. బాడీ ట్రాన్స్ఫర్మేషన్ గురించి రాశీ ఖన్నా మాట్లాడుతూ – ‘‘నేను తరచూ వర్కవుట్స్ చేస్తూనే ఉంటాను. ఫలితాలు ఎప్పుడూ ఓవర్‌నైట్‌లో రావు. అలాగే కఠినమైన డైటింగ్‌ల మీద పెద్దగా ఆసక్తి చూపించను. కానీ ప్రస్తుతానికి చాలా ఫిట్‌గా అనిపిస్తున్నాను. ఇక్కడి వరకూ రావడానికి నాకు రెండేళ్ల సమయం పట్టింది. ప్రస్తుతం హ్యాపీగా, హెల్తీగా ఉన్నాను. వారంలో ఆరు రోజులు వ్యాయామం చేస్తాను’’ అన్నారు. ప్రస్తుతం రాశీ ఖన్నా తెలుగులో ‘వెంకీ మామ’, తమిళంలో ‘సంఘతమిళన్’ సినిమాలతో బిజీగా ఉన్నారు. -
సల్మాన్ సర్కస్
పెళ్లి కోసం సల్మాన్‌ఖాన్ ఫీట్స్ వర్కౌట్ ఎంత వరకు వచ్చిందో తెలియదు కానీ ‘భారత్’ సినిమా కోసం స్టేజ్‌పై ఆయన బాగానే ఫీట్స్ చేస్తున్నారు. తాడు పట్టుకుని గాల్లో ఊగుతున్నాడు. కుర్చీలతో అద్భుతమైన ఫీట్స్ చేస్తున్నాడు. స్టేజ్‌పై బైక్‌ను గింగిరాలు తిప్పుతున్నాడు. అలీ అబ్బాస్ జాఫర్ దర్శకత్వంలో సల్మాన్‌ఖాన్ హీరోగా రూపొందుతోన్న సినిమా ‘భారత్’. ఇందులో కత్రినా కైఫ్ కథానాయికగా నటించనున్నారు. దిశా పాట్నీ ఓ కీ రోల్ చేస్తున్నారు. ఈ చిత్రంలో సల్మాన్ ఖాన్, దిశా సర్కస్ ఆర్టిస్టులుగా నటిస్తున్నారు. ప్రస్తుతం సల్మాన్ ఇంట్రో సాంగ్ షూటింగ్ జరుగుతోందని సమాచారం. ఈ సాంగ్‌లో దిశా పాట్నీ కూడా పాల్గొంటున్నారు. ఈ సాంగ్ కోసం దాదాపు ఐదు వందలమంది బ్యాక్‌గ్రౌండ్ డ్యాన్సర్స్‌ను పిలిపించారట టీమ్. అంటే సల్మాన్ సర్కస్ కమ్ సాహసాలతో సాగే ఈ సాంగ్ ఐఫీస్ట్‌గా ఉంటుందట.