పెళ్లి.. పిల్లాడు.. అందమైన ప్రయాణం... | Workout Routine Mrs India | Sakshi
Sakshi News home page

పెళ్లి.. పిల్లాడు.. అందమైన ప్రయాణం...

Published Sat, Sep 19 2015 9:17 AM | Last Updated on Sun, Sep 3 2017 9:38 AM

పెళ్లి.. పిల్లాడు..    అందమైన ప్రయాణం...

పెళ్లి.. పిల్లాడు.. అందమైన ప్రయాణం...

 పెళ్లయ్యాక కూడా అమ్మలు అందాల రాణులు అవుతున్నారు. సంతూర్‌మమ్మీల్లా  సొగసులతో  మెప్పిస్తున్నారు. సిటీకి చెందిన మిసెస్ ఇండియా  ప్లానెట్ టైటిల్ విజేత అనుపమ...  ఈ వారం తన ఫిట్‌నెస్ జర్నీని వివరిస్తున్నారిలా..
 
 రోజూ ఇడ్లీలో నెయ్యి, కారప్పొడి వేసుకుని తినేదాన్ని. 8వతరగతి చదువుతున్నప్పుడే ఒబెసిటీ సమస్యతో డాక్టర్ దగ్గరకు తీసుకెళ్లారు. ఆ డాక్టర్ బాగా భయపెట్టడంతో నోరు కట్టేసుకుని కొంత బెటరయ్యా. టీనేజ్‌లో స్టడీస్‌లో పడి మళ్లీ పెరిగాను. ‘కొంచెం బరువు తగ్గవే చాలా బావుంటావ్’ అనేవారు. అప్పుడు విజయవాడలో ఉండేవాళ్లం. రైల్వేగ్రౌండ్, మున్సిపల్ స్టేడియంలలో వాకింగ్, జాగింగ్ చేసేదాన్ని. సన్నగా కాదు గానీ కరెక్ట్ ఫిజిక్ వచ్చేసింది.
 
పెళ్లి, పిల్లాడు... మళ్లీ ఒబెసిటీ...

తక్కువ వయసులోనే పెళ్ళై పిల్లాడు పుట్టాడు. బరువేమో 90 కిలోలు.. నాకు నేనే అన్‌హెల్దీగా కనపడ్డా. వర్కవుట్స్ స్టార్ట్ చేశాను. ఆర్నెల్లు ఒంటిమీదే ధ్యాస. అన్ని వ్యాయామాలు చేశా. వారానికి 1, 2 కిలోల చొప్పున బరువు తగ్గుతూ 60 కిలోలకు వచ్చేశా. అమెరికాలో ఉన్నప్పుడు  ఫొటోగ్రాఫర్ ఫ్రాంక్ ప్రోద్బలంతో ఫొటో షూట్ చేశాం. ఆ ఫొటోలకు వచ్చిన రెస్పాన్స్‌తో ఇన్‌స్పైర్ అయ్యి బ్యూటీ కాంటెస్ట్‌లో పాల్గొన్నా. మిసెస్ ఇండియా ప్లానెట్ గెలుచుకున్నాను.
 
వర్కవుట్ రొటీన్ ఇదీ...

ఉదయం 10 నుంచి 11గంటల వరకూ వర్కవుట్ సెషన్. యోగా స్ట్రెచెస్, యాబ్స్‌కి సంబంధించినవి  చేస్తా. డెలివరీ అయ్యాక పొట్ట జారిపోతుంది కదా. మజిల్ టోన్ అవడానికి క్రంచెస్ బాగా చేసే అలవాటు కంటిన్యూ అవుతోంది. కేలరీస్ బర్న్ అవ్వడానికి బెస్ట్ అయిన క్రాస్ ట్రైనర్ బాగా ఇష్టమైన వర్కవుట్. అది 30 నిమిషాలు చేస్తా. సైక్లింగ్, స్క్వాట్స్, సైడ్ బెండ్స్, వెయిస్ట్ లిఫ్టింగ్ అన్నీ చేస్తా. కపాల భాతి, మెడిటేషన్‌లు కూడా సాధన చేస్తా.
 
ఫుడ్ రొటీన్ ఇదీ...

పొద్దున్నే 7గంటలకు తేనె, లైమ్ వాటర్  తాగుతా. పిల్లాడ్ని స్కూల్‌కి రెడీ చేసేసి బ్రేక్‌ఫాస్ట్‌గా చిన్న కప్పుతో ఓట్స్ లేదా 3 వైట్ ఎగ్స్, బాదంపప్పులు 10 తింటాను.  లేదా స్క్రాంబుల్డ్ ఎగ్స్ గాని, బనానాలో స్కిమ్డ్ మిల్క్, ఓట్స్ వేసి గాని తీసుకుంటా.  ఫంక్షన్లకు వెళితే తప్ప రైస్ తీసుకోను. ప్రొటీన్ బార్స్ బాగా తీసుకుంటా. వర్కవుట్ తర్వాత గ్రీన్ టీ తప్పనిసరి. మధ్యాహ్నం భోజనంగా ఒంటి గంటకు గ్రిల్డ్ చికెన్ లేదా వెజ్ కర్రీతో 3 రోటీలు, సాయంత్రం 4 లేదా 5గంటలకు బిగ్ బౌల్‌తో ఫ్రూట్స్, రాత్రి 7.30లోగా ప్రొటీన్ బార్, లేదా ఓట్స్, క్వినోవా ఉంటుంది.  ఒక గ్లాస్ బట్టర్ మిల్క్  తాగుతా. ఆదివారం డైట్‌కి హాలిడే. చాక్లెట్ ఐస్‌క్రీమ్స్‌తో సహా నచ్నినవన్నీ టేస్ట్‌చేస్తా.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement