ఈ రోజుల్లో వ్యాయామం చేయకపోతే ఇట్టే బరువు పెరగడం, కొలతలు సరిలేక, అందం తగ్గడం సాధారణ సమస్యలుగా మారిపోతున్నాయి. తినే తిండి, ఎక్కువ సమయం కూర్చునే వర్క్ చేయడం, పెద్దగా శారీరక శ్రమ లేకపోవడం వంటి కారణాలతో, చాలామందికి ఫిట్‌నెస్ దూరమవుతోంది. అయితే జిమ్‌లో చేసుకున్నట్లే ఇంట్లోనే వ్యాయామం చేసుకోవడానికి ఈ ’ఫిట్‌నెస్ ఎలాస్టిక్ రోప్’ చక్కగా పని చేస్తుంది.
ఈ రోప్‌తో వర్కౌట్స్ చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇది అన్ని భంగిమల్లోనూ వ్యాయామం చేయడానికి, శారీరక శ్రమను కలిగించి, కొవ్వును తగ్గించడానికి సహకరిస్తుంది. మన్నికైన ఈ రోప్.. వీపు, నడుము, పొట్ట, తొడలు, చేతులు వంటి భాగాల్లో పేరుకున్న కొవ్వును కరిగించుకోవడానికి వినియోగించొచ్చు. దీంతో వ్యాయామం చేస్తే కండరాలు బలపడి, శరీరం దృఢంగా తయారవుతుంది.
వ్యాయామ సమయంలో దీన్ని ఎలా కావాలంటే అలా సులభంగా, బలం ఉపయోగించి సాగదీయొచ్చు. సాగదీసే క్రమంలోనే గ్రిప్ తప్పి లేని నొప్పులు వస్తాయేమోనన్న భయం అవసరం లేదు. సౌకర్యవంతమైన పట్టును అందించగల ఈ సాగే తాడు.. చేతులకు, కాళ్లకు అలసట కలిగించదు. ఎకో–ఫ్రెండ్లీ మెటీరియల్‌తో రూపొందిన ఈ రోప్ కొత్తగా వ్యాయామం ప్రారంభించే వాళ్లకు కూడా అనువుగానే ఉంటుంది. దీని ధర 14 డాలర్లు (రూ.1,286) మాత్రమే!
Comments
Please login to add a commentAdd a comment