
సరైన ఫిటింగ్‌తో డ్రెస్సింగ్ ఉంటేనే బాగుంటుంది అనేది చాలామందిలో ఉండే ఆలోచన. ప్రస్తుత రోజుల్లో ఎంత వదులైన డ్రెస్ వేసుకుంటే అంత స్టైలిష్‌గా ఉంటాం అనేది అసాధారణ ఆలోచనగా మారింది. ట్యునిక్స్, కుర్తీస్, షర్ట్స్, టాప్స్, ప్రాక్స్.. ఏ మోడల్ డ్రెస్ అయినా వదులుగా ఉండటం వల్ల ఈ వేసవికి తగినట్టు సౌకర్యంగానూ, స్టైలిష్‌గానూ ఉంటుంది. ప్లస్ సైజ్ డ్రెస్సుల్లో ప్లస్ స్టైల్ మార్కులూ కొట్టేయవచ్చు.
చిన్నపిల్లలు పెద్దవాళ్ల డ్రెస్సులు వేసుకొని, వాటిలో మునిగినొతున్నట్టు కనిపించినా ఎంతో ఆనందాన్ని వ్యక్తం చేస్తారు. అలాంటి ఆనందాన్ని ఈ సీజన్‌లో ఓవర్‌సైజ్డ్ డ్రెస్సులు ధరించి పొందవచ్చు. చూపరుల నుంచి ‘ఎంత స్టైలిష్‌గా ఉన్నారు...’ అనే కితాబులూ దవచ్చు.
పూర్తిగా శరీరం అంతా కప్పేసినట్టుగా ఉన్నా ఈవెంట్‌లో ప్రత్యేకంగా కనిపిస్తారు. స్లిమ్‌గా ఉన్నవారు కూడా ఈ సీజన్‌లో ప్లస్ సైజ్ డ్రెస్సులు వేసుకొని హాయిగా తిరిగేయవచ్చు.
ఈ స్టైల్‌ని ఎవరికి వారు వినూత్నంగా మార్చుకునే వెసులుబాటు ఉంటుంది. వదులైన ట్యునిక్స్ ధరించినప్పుడు నడుము దగ్గర బెల్ట్‌తో ఓ స్టైల్‌ని, ముడి వేసి మరో స్టైల్‌ని సృష్టించవచ్చు.
జీన్స్‌కి టాప్‌గా ఉపయోగించే వదులైన షర్ట్స్ ధరించినప్పుడు పూర్తిగా టక్ చేసి లేదా సగం టక్ చేసి స్టైలిష్‌గా కనిపించవచ్చు.
స్ట్రీట్ స్టైల్‌ను పోలి ఉండే ఈ డ్రెస్సింగ్‌లో లేయర్డ్ ఔట్‌ఫిట్స్‌ను కూడా ధరించవచ్చు. ఒక ప్రింటెడ్ ట్యునిక్ వేస్తే, దాని మీదకు ట్రాన్స్‌పరెంట్ ప్లెయిన్ మరో ట్యునిక్‌ను వేసుకోవచ్చు. లేయర్డ్ లోనూ లూజ్ టాప్స్‌నే ఎంచుకోవాలి.
ఈ తరహా ఔట్‌ఫిట్స్‌తోనే స్టైల్‌ను క్రియేట్ చేయవచ్చు కాబట్టి ఇతరత్రా హంగులేవీ అక్కర్లేదు. సింపుల్ వెస్ట్రన్ జ్యువెలరీ, లూజ్ అండ్ బన్ కేశాలంకరణ్, పాదరక్షల విషయంలో ఫ్లాట్స్ ధరిస్తే చాలు. సీజన్‌కి తగిన సౌకర్యవంతమైన స్టైల్‌లో మెరిసిపోవచ్చు.
వదులుగా ఉంటాయి కాబట్టి సిల్క్, కాటన్, షిఫాన్, ఆర్గంజా... ఏ ఫ్యాబ్రిక్ అయినా ఎంచుకోవచ్చు. టాప్ టు బాటమ్ ప్లెయిన్, ప్రింట్స్ కూడా బాగుంటాయి.
(చదవండి: