Anupama
-
మమ్మల్ని చిత్రవధ చేసింది.. నటిపై సవతి కూతురి ఆరోపణలు
ప్రముఖ బుల్లితెర నటి రూపాలీ గంగూలీ తనను ఎంతో వేధించిందంటోంది ఆమె సవతి కూతురు ఈషా. తన తండ్రిని తమకు దూరం చేసిందని, మా పేరెంట్స్‌ను విడగొట్టిందని ఆరోపించింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. నాలుగేళ్ల కిందట నేను పెట్టిన పోస్ట్ ఒకటి ఇప్పుడు వైరలవుతోంది. దీన్ని రూపాలి, నాన్న (అశ్విన్) ఎలా సమర్థించుకుంటారో అర్థం కావట్లేదు.పేరెంట్స్ బెడ్రూమ్లో తిష్టఅప్పటికీ మా నాన్న ఎక్స్(ట్విటర్)లో ఈ గొడవకు, రూపాలీకి ఎలాంటి సంబంధం లేదని తేల్చేశాడు. అది అన్నింటికంటే పెద్ద అబద్ధం. ఎందుకంటే అమెరికాలోని న్యూజెర్సీలో ఉన్న మా ఇంటికి రూపాలీ తరచూ వచ్చేది. మా అమ్మ నాన్నతో షేర్ చేసుకున్న బెడ్‌పైనే తనూ నిద్రించేది. ఆమె నన్ను, మా అమ్మను శారీరకంగా, మానసికంగా వేధించింది. మాటలతో చిత్రవధ చేసింది. ఆమె వల్ల ఎంతో నరకం అనుభవించాం.సీరియల్లో హీరోయిన్.. బయట విలన్నాన్న-రూపాలీ ఎఫైర్ వ్యవహారంలో ఇద్దరి తప్పు ఉంది. రూపాలీ ప్రధాన పాత్రలో నటించే అనుపమ సీరియల్లో.. ఆమె భర్త మరొకరితో ఎఫైర్ పెట్టుకుని తనను మోసం చేస్తాడు. ఆమె తనకోసమే కాకుండా మహిళలందరి పక్షాన నిలబడి పోరాడుతున్నట్లు ప్రవర్తిస్తుంటుంది. మరి నిజ జీవితంలో ఏం జరిగింది? ఎంతో ప్రశాంతంగా సాగిపోతున్న మా జీవితాల్లో అడుగుపెట్టింది. మా అమ్మను, నాన్నను విడదీసింది. శాశ్వతంగా విడగొట్టాలని ప్రయత్నాలుబలవంతంగా మా నాన్నతో రెండుసార్లు విడాకుల పత్రాలు పంపించింది. రూపాలీ కోసం మా నాన్న మమ్మల్ని వదిలేసి ఇండియాకు వెళ్లిపోయాడు. పెళ్లి అయిన తర్వాత కూడా ఎఫైర్ పెట్టుకోవడమనేది చాలా పెద్ద తప్పు అని ఈషా చెప్పుకొచ్చింది. కాగా అశ్విక్ కె వర్మ.. 1997లో సప్నను పెళ్లి చేసుకున్నాడు. వీరికి ఈషాతో పాటు మరో కూతురు సంతానం. 2013లో అశ్విన్.. నటి రూపాలీ గంగూలీని పెళ్లి చేసుకున్నాడు. వీరికి రుద్రాన్ష్ అనే కుమారుడు జన్మించాడు. View this post on Instagram A post shared by Esha Verma (@eshav.official) చదవండి: రానా, తేజ సజ్జా సారీ చెప్పాల్సిందే.. మహేశ్ బాబు ఫ్యాన్స్ ఆగ్రహం -
ఐఏఎస్ ఆఫీసర్ కుమార్తె, బిలియనీర్ భార్య, కానీ బిడ్డలు మాత్రం.. ఎవరీమె?
ఐఏఎస్ ఆఫీసర్ కుమార్తె, హైదరాబాద్‌లోనే చదువుకుంది. టెక్ దిగ్గజం భార్య. భర్తకు 450 కోట్ల జీతం. ఆమె స్వయంగా ఆర్కిటెక్చర్ గ్రాడ్యుయేట్. అయినప్పటికీ, ఉద్యోగంలో రాణించేందుకు అన్ని అర్హతులున్నా పిల్లలు, భర్త కోసం ఇంటికే పరిమితమైంది. వారి బాధ్యతలే ప్రధానంగా భావించింది. ఇంతకీ ఎవరీమె? తెలుసుకుందాం రండి! అమె మరెవ్వరో కాదు ప్రపంచంలోనే దిగ్గజ సాఫ్ట్ వేర్ సంస్థ మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల సతీమణి అనుపమ ప్రియదర్శిని నాదెళ్ల. అనుగా పాపులర్ అయిన ఈమె.. ఐఏఎస్ అధికారి కేఆర్ వేణుగోపాల్ కుమార్తె. అనుపమ ప్రాథమిక విద్యాభ్యాసం హైదరాబాద్‌లోనే జరిగింది. తరువాత మణిపాల్ విశ్వవిద్యాలయం నుంచి ఆర్కిటెక్చర్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. సత్య నాదెళ్ల తండ్రి, అనుపమ తండ్రి కేఆర్ వేణుగోపాల్ ఇద్దరూ బ్యాచ్‌మేట్స్. వీరిద్దరి స్నేహం వియ్యానికి దారి తీసింది. సత్య నాదెళ్ల మైక్రోసాఫ్ట్‌లో చేరిన ఏడాదిలోనే (1992)అనుపమ నాదెళ్లను వివాహం చేసుకున్నారు. పెళ్లి నాటికే సత్యనాదెళ్ల అమెరికాలో గ్రీన్ కార్డ్ హోల్డర్. అయినా అనుపమ వీసా దరఖాస్తును యుఎస్ తిరస్కరించింది. దీంతో పర్యాటక వీసాతో కొంతకాలం కలసి ఉండాల్చి వచ్చింది. అయితే అనుపమను అమెరికా తీసుకెళ్లేందుకు, ఇమ్మిగ్రేషన్ వ్యవహరాలను సులభంగా పూర్తి చేసుకుందుకుగాను గ్రీన్ కార్డును వదులుకొని, తిరిగి హెచ్-1బీ వీసా తీసుకున్నారు. చివరికి ఇద్దరూ అక్కడ శాశ్వత నివాసితులయ్యారు. ఈ దంపతులకు ముగ్గురు పిల్లలు. బిడ్డల కోసం అత్యసవరస్థితిలో సిజేరియన్ ద్వారా తొలి చూరు కాన్పులో మగబిడ్డ జైన్‌కు జన్మనిచ్చింది. కానీ ఈ దంపతుల సంతోషం ఎంతో కాలం నిలవ లేదు. గర్భాశయ శ్వాసలోపం కారణంగా శిశువుగా ఎదగలేదు, తీవరమైన సెరిబ్రల్ పాల్సీ, స్పాస్టిక్ క్వాడ్రిప్లెజియాతో జైన్ బాధపడుతున్నట్లు వైద్యులు తేల్చారు. తరువాత ఇద్దరు కుమార్తెలు తారా,దివ్య పుట్టారు. వీరిలో కూడా ఒకరి లెర్నింగ్ సమస్యలు తలెత్తాయి. దీంతో బిడ్డల కోసం ఆర్కిటెక్ట్‌గా తన కెరీర్ నుండి తప్పుకుంది. ఇలాంటి ప్రత్యేక పరిస్థితులతో బాధపడుతున్న పిల్లల జీవితాలను అనుపమ నాదెళ్ల సానుకూలంగా తీర్చిదిద్దుకున్నారు. కానీ దురదృష్టవశాత్తూ 2022లో 26 ఏళ్ల కుమారుడు జైన్ మరణం వారి జీవితాల్లో పెద్ద విషాదం. అప్పటినుంచి ఆమె సీటెల్ చిల్డ్రన్స్ హాస్పిటల్, భాగస్వామ్యంతో పిల్లల ఆరోగ్యాన్ని మెరుగుపరిచే కార్యక్రమాలపై దృష్టి సారించారు. అంతేకాదు భర్త సత్యకు దీర్ఘకాల భాగస్వామిగా, నాదెళ్ల కుటుంబానికి పెద్ద అండగా నిలబడ్డారు. సమస్యలతో ఉన్న బిడ్డల్ని సాదుకుంటూ, వారిని ఆసుపత్రుల చుట్టూ తిరుగుతూ వారి అభివృద్ధికి కృషి చేశారు. మైక్రోసాఫ్ట్ బిలియనీర్ సీఈవో భార్యగా ప్రపంచంలోనే అత్యత్తుమ కంపెనీ సీఈవో భార్యగా భర్తకు వెన్నంటి ఉంటూ ఆయన విజయంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మైక్రోసాఫ్ట్ జనవరి 11న 2.87 ట్రిలియన్లడాలర్ల మార్కెట్ విలువతో ప్రపంచంలోనే అత్యంత విలువైన కంపెనీగా అవతరించింది. 2024 ఫిబ్రవరి నాటికి సత్య నాదెళ్ల నికర విలువ 974 మిలియన్ డాలర్లు. కాగా కరోనా, లాక్ డౌన్ నేపథ్యంలో పని కోల్పోయి తీవ్ర ఇబ్బందులు పడుతున్న రైతన్నలు, రైతు కూలీలను ఆదుకునేందుకు అనుపమ పెద్ద మనసు చాటుకున్న సంగతి తెలిసిందే. ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లా రైతులు, వ్యవసాయ కూలీల అదనపు ఉపాధి కోసం అనుపమ 2 కోట్ల రూపాయిల విరాళం ప్రకటించారు. అనంతపురం కేంద్రంగా నడుస్తోన్న యాక్షన్ ఫ్రేటార్నా ఎకాలజీ సెంటర్‌కు ఈ విరాళాన్ని అనుపమ అందచేసిన సంగతి తెలిసిందే. -
వార్ వన్ సైడ్.. పాకిస్థాన్‌కు భారత్ స్ట్రాంగ్ కౌంటర్!
జెనీవా: దాయాది దేశం పాకిస్థాన్‌కు మరోసారి భారత్ స్ట్రాంగ్ కౌంటరిచ్చింది. అంతర్జాతీయ వేదికపై భారత్‌ను దోషిగా నిలబెట్టాలనే పాక్ ప్లాన్‌ను భారత్ చాకచక్యంగా తిప్పి కొట్టింది. దీంతో, పాకిస్థాన్‌కు మరోసారి భంగపాటు తప్పలేదు. జమ్మూకశ్మీర్ అంశంలో పాకిస్తాన్‌కు భారత్ గట్టిగా బుద్ధిచెప్పింది. భారత అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకునే హక్కు లేదని గట్టిగా వార్నింగ్ ఇచ్చింది. కాగా, జెనీవా వేదికగా ఐరాస మానవ హక్కుల మండలి 55వ సమావేశం జరుగుతోంది. ఈ సందర్భంగా ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల మండలిలో జమ్మూకశ్మీర్ అంశాన్ని పాకిస్థాన్, తుర్కియే లేవనెత్తాయి. భారత్‌లో మానవ హక్కుల అణచివేత జరుగుతోందని నోరుపారేసుకున్నాయి. దీంతో, వారి ఆరోపణలకు భారత్ స్ట్రాంగ్ కౌంటరిచ్చింది. ‘రైట్ టు రిప్లై’ అవకాశం కింద ఈ మండలికి భారత కార్యదర్శి అనుపమ సింగ్.. పాకిస్థాన్‌కు గట్టి వార్నింగ్ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..‘ఉగ్ర దాడులతో పారిన రక్తంతో వారి చేతులు తడిసిపోయాయి. భారత అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకునే హక్కు వారికి లేదు. భారత్‌పై అసత్య ఆరోపణలు చేయడానికి అంతర్జాతీయ వేదికను పాకిస్థాన్ ఉపయోగించుకోవడం దురదృష్టకరం. ఆ దేశం తమ ప్రసంగంలో జమ్మూకశ్మీర్ అంశాన్ని ప్రస్తావించింది. వారికి మేం చెప్పేది ఒక్కటే.. కేంద్రపాలిత ప్రాంతాలైన జమ్మూకశ్మీర్, లద్దాఖ్ మా దేశ అంతర్భాగాలే. మా అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడానికి ఆ దేశానికి ఎలాంటి హక్కు లేదు అంటూ హెచ్చరించారు. ఇదే సమయంలో తుర్కియేపైనా భారత్ అసంతృప్తి వ్యక్తం చేసింది. పాక్‌కు మద్దతిస్తూ తుర్కియే కూడా మా దేశ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడం విచారకరం. భవిష్యత్తులో మరోసారి ఇలా జరగకుండా.. అనుచిత వ్యాఖ్యలు చేయడం జాగ్రత్తలు తీసుకుంటారని ఆశిస్తున్నా’మని అన్నారు. 🇮🇳 India exercises Right of Reply at #HRC55, First Secretary Anupama Singh, says, "The entire Union Territories of Jammu and Kashmir and Ladakh is an integral and inalienable part of India".pic.twitter.com/vk6wXezfOO — All India Radio News (@airnewsalerts) February 29, 2024 ఇటీవలి కాలంలో పాకిస్థాన్‌లో ఎన్నో దారుణ ఘటనలు చోటుచేసుకున్నాయి. మైనార్టీలకు దారుణంగా కాల్చివేశారు. వందలమంది ప్రాణాలు కోల్పోయారు. అలాంటి వారు మానవహక్కుల గురించి ఇప్పుడు మొసలి కన్నీళ్లు కారుస్తున్నారు. వారు ప్రోత్సహిస్తున్న ఉగ్రవాదం కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. వారి రక్తంతో పాక్ తడిసిపోయింది. అప్పుల ఊబిలో కూరుకుపోయింది. సొంత ప్రజల కష్టాలు తీర్చలేక ఆ ప్రభుత్వం విఫలమైంది. అలాంటి దేశం చేసే అసత్య ఆరోపణలపై మేం దృష్టి పెట్టాల్సిన అవసరం లేదు అంటూ కౌంటరిచ్చారు. -
రెక్కల పురుగు కథ ఏమిటో అడుగు
రెక్కల పురుగులన్నీ సీతాకోక చిలుకలు కావు.కాని సీతాకోకచిలుకలన్నీ రెక్కల పురుగులే.హిమాలయప్రాంతాలకు చెందిన మాత్ (రెక్కల పురుగు)లపై తీసిన ‘నాక్టర్న్స్’ డాక్యుమెంటరీ అమెరికాలో జరిగిన ‘సండాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్’లో స్పెషల్ జ్యూరీ అవార్డ్ పొందింది. ఇండియా నుంచి అవార్డ్ గెలిచిన డాక్యుమెంటరీ ఇదొక్కటే. డైరెక్టర్ అనుపమ శ్రీనివాసన్ పరిచయం. అమెరికాలో ప్రతి ఏటా జరిగే సండాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో నామినేషన్ పొందడమే పెద్ద గుర్తింపుగా భావిస్తారు. అవార్డు రావడం ఇంకా పెద్ద గౌరవం. ఈ సంవత్సరం ఉటాలో జనవరి 18–28 తేదీల మధ్య జరిగిన ఈ ఫిల్మ్ ఫెస్టివల్లో మన దేశం నుంచి ‘వరల్డ్ డాక్యుమెంటరీ కాంపిటీషన్’లో ‘నాక్టర్న్స్’లో చోటు సంపాదించడమే కాకుండా ‘స్పెషల్ జ్యూరీ అవార్డ్ ఫర్ క్రాఫ్ట్’ అవార్డు పొందింది. అనిర్ బన్‌దత్తాతో కలిసి అనుపమా శ్రీనివాసన్ దర్శకత్వం వహించిన ఈ డాక్యుమెంటరీ రెక్కల పురుగుల లోకంలో ప్రేక్షకులను విహరింపచేస్తుంది. ఢిల్లీ కృత్రిమత్వం నుంచి ‘నేను, అనిర్ బన్ దత్త ఢిల్లీలో జీవిస్తుంటాము. రోజూ ఒకే రకమైన ట్రాఫిక్, ΄÷ల్యూషన్. ప్రకృతితో మాకు ఏమీ సంబంధం లేదనిపించేది. ఆ సమయంలో మాకు మాన్సీ అనే పర్యావరణ శాస్త్రవేత్త పరిచయం అయ్యింది. హిమాలయాలలో ‘మాత్స్’ (రెక్కల పురుగులు) మీద పరిశోధన చేస్తున్నానని చెప్పింది. వాతావరణ మార్పుల వల్ల వీటికి కలుగుతున్న నష్టం ఏమిటో ఆమె తెలుసుకుంటోంది. ఇది డాక్యుమెంటరీ చేయాల్సిన విషయం అనుకున్నాం. గత కొన్నేళ్లుగా నేను, అనిర్బన్ డాక్యుమెంటరీలు తీస్తున్నాం. మెయిన్‌స్ట్రీమ్ పట్టించుకోని విషయాలను మేం పట్టించుకుంటాం. దీనికి ముందు మేము ఇండో–మయన్మార్ సరిహద్దులోని తోరా అనే పల్లెకు (మణిపూర్‌లో ఉంది) కరెంటు రావడం గురించి డాక్యుమెంటరీ తీశాం. దాని పేరు ‘ఫ్లికరింగ్ లైట్స్’. స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు అవుతున్నా కరెంటు లేని పల్లె ఉండటం, దానికి కరెంటు కోసం కొందరు ఎదురు చూడటం, దేశంలోనే ఉన్నా పరాయీకరణ భావన ఎదుర్కొనడం దీనిలో చూపించాం. ఈ డాక్యుమెంటరీకి ఆమ్స్టర్ డ్యామ్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో అవార్డు దక్కింది. ఇప్పుడు మాత్స్ గురించి తీసిన ‘నాక్టర్న్స్’కు కూడా సండాన్స్ ఫెస్టివల్లో అవార్డ్ వచ్చింది. ఇందుకు మాకు చాలా సంతోషంగా ఉంది’ అని తెలిపింది అనుపమా శ్రీనివాసన్. కష్టనష్టాలకు ఓర్చి ‘నాక్టర్న్స్ డాక్యుమెంటరీలో రెండే పాత్రలుంటాయి. ఒకటి పర్యావరణ శాస్త్రవేత్త మాన్సీ, రెండు హిమాలయాల స్థానిక బగున్ తెగకు చెందిన బికి అనే గిరిజనుడు. అతని సాయంతో ఆమె రెక్కల పురుగులను అన్వేషణ చేస్తుంటే మేం రికార్డు చేస్తూ వెళ్లాం. సాయంత్రం అయ్యాక మాన్సీ పలచటి తెర కట్టి దాని వెనుక నీలం రంగు బల్బు వెలిగించేది. ఆ తర్వాత కాసేపటికే వేలాది రెక్కల పురుగులు వచ్చి ఆ స్క్రీన్ మీద వాలేవి. వాటి రంగులు, రూపాలు, ఆకారాలు అన్నీ అద్భుతం. అవి తాము మనిషితో కలిసి జీవిస్తున్నామన్నట్టు ఉన్నాయి. మనమే వాటితో కలిసి జీవిస్తున్నాం అన్న ఎరుకలో లేము’ అంటుంది అనుపమా శ్రీనివాసన్. ‘హిమాలయాల్లో షూటింగ్... అదీ అడవుల్లో అంటే చాలా శ్రమ. అక్కడంతా తేమగా ఉంటుంది. ఏ క్షణమైనా వాన పడొచ్చు. అంతేగాక రాత్రి వేళల్లో విపరీతమైన చలి. జలగలు పట్టి పీక్కుతినాలని చూసేవి. కాని ఇన్ని సమస్యల మధ్య ఆ రెక్కల పురుగుల జీవనం, వాటి కదలికలు ఎంతో ఆసక్తి కలిగించేవి. మా డాక్యుమెంటరీకి అవార్డు రావడానికి కారణం మేము ప్రకృతి ధ్వనులను పరిపూర్ణంగా రికార్డు చేశాం. ఆ ధ్వనుల వల్ల అడవిలో ఉంటూ మాత్స్‌ను చూస్తున్న అనుభూతి కలుగుతుంది’ అంది అనుపమా శ్రీనివాసన్. -
Strandja Memorial Boxing Tournament 2023: భారత బాక్సర్లకు రజతాలు
సోపియా: స్ట్రాండ్జా మెమోరియల్ టోర్నమెంట్లో భారత బాక్సర్లు అనామిక, అనుపమ, గోవింద్ కుమార్ సహాని రజత పతకాలు సాధించారు. మహిళల 50 కేజీల ఫైనల్లో జాతీయ చాంపియన్ అనామిక 1–4తో చైనాకు చెందిన హు మెయి చేతిలో ఓడింది. పురుషుల 48 కేజీల తుదిపోరులో గోవింద్ కుమార్ 1–4తో షోదియోర్జన్ మెలికుజీవ్ (ఉజ్బెకిస్తాన్) చేతిలో పరాజయం చవిచూశాడు. మహిళల 81 కేజీల ఫైనల్లో అనుపమ 0–5తో ఆస్ట్రేలియన్ బాక్సర్ ఎమ్మా సూ గ్రీన్ట్రి చేతిలో ఓడిపోయింది. ఈ టోరీ్నలో భారత్ మొత్తం ఎనిమిది పతకాలు సాధించింది. ఇందులో మూడు రజతాలు కాగా... ఐదు కాంస్య పతకాలున్నాయి. పురుషుల కేటగిరీలో బిశ్వామిత్ర చొంగ్తమ్ (51 కేజీలు), సచిన్ (54 కేజీలు), మహిళల విభాగంలో కలైవాణి (48 కేజీలు), శ్రుతి యాదవ్ (70 కేజీలు), మోనిక (ప్లస్ 81 కేజీలు) కాంస్యాలు గెలిచారు. -
ప్రపంచ నంబర్ వన్ షట్లర్‌గా భారత అమ్మాయి
న్యూఢిల్లీ: ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య (బీడబ్ల్యూఎఫ్) అండర్–19 మహిళల సింగిల్స్ ర్యాంకింగ్స్‌లో కొత్త నంబర్‌వన్‌గా భారత్‌కు చెందిన అనుపమ ఉపాధ్యాయ అవతరించింది. హరియాణాలోని పంచ్‌కులాకు చెందిన 17 ఏళ్ల అనుపమ ఈ ఏడాది ఉగాండా, పోలాండ్ ఇంటర్నేషనల్ టోర్నీలలో విజేతగా నిలిచింది. టాప్ ర్యాంక్‌లో ఉన్న భారత్‌కే చెందిన తస్నిమ్ మీర్‌ను రెండో స్థానానికి నెట్టి అనుపమ అగ్రస్థానానికి చేరింది. భారత్‌కే చెందిన అన్వేష గౌడ ఆరో ర్యాంక్‌లో, ఉన్నతి హుడా తొమ్మిదో ర్యాంక్‌లో ఉన్నారు. బెంగళూరులోని ప్రకాశ్ పడుకోన్ అకాడమీలో శిక్షణ తీసుకుంటున్న అనుపమ జూనియర్ ప్రపంచ ర్యాంకింగ్స్‌లో నంబర్‌వన్‌గా నిలిచిన ఆరో భారతీయ ప్లేయర్‌గా గుర్తింపు పొందింది. గతంలో ఆదిత్య జోషి (2014), సిరిల్ వర్మ (2016), లక్ష్య సేన్ (2017), తస్నిమ్ (2022), శంకర్ సుబ్రమణియన్ (2022) ఈ ఘనత సాధించారు. -
కేరళ కుట్టి అనుపమ పరమేశ్వరన్ కి హ్యాపీ బర్త్ డే..!!
-
‘రౌడీ బాయ్స్’తో రామ్ చరణ్ సందడి
-
అనుపమ అలుపెరగని పోరాటం...ఎట్టకేలకు చెంతకు చేరిన బిడ్డ!!
Kerala Baby Kidnap Case Finally Woman Gets Custody Of Her Infant Son: కేరళ రాష్ట్రాన్ని కుదిపేస్తున్న ఓ సంఘటన ఎట్టకేలకు సుఖాంతం అయ్యింది. స్వయంగా కేరళ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రత్యేక దృష్టి పెట్టిన కేసు ఇది. అనుపమ అనే ఓ తల్లి తన బిడ్డ కోసం చేస్తున్న పోరాటంలో కేరళ ప్రభుత్వ యంత్రాంగం మొత్తం భాగమైన సంగతి తెలిసిందే. పైగా యావత్తు ప్రజలంతా కూడా ఆ తల్లికి న్యాయం జరగాలని ఆకాంక్షించిన విచిత్రమైన కేసు ఇది. అయితే అనుపమ ఎస్ చంద్రన్ గతేడాది అక్టోబర్‌లో ఓ బిడ్డకు తల్లి అయిన సంగతి విధితమే. అంతేకాక ఆమె కేరళ సమాజంలో అగ్రవర్ణంగా గుర్తింపు పొందిన సామాజిక వర్గానికి చెందిన మహిళ. పైగా ఆమె ప్రేమించిన వ్యక్తి షెడ్యూల్డ్ కులానికి చెందిన వ్యక్తి కావడంతో స్వయానా ఆమె తండ్రే బిడ్డను కిడ్నాప్ చేసి కూతుర్నీ మోసం చేస్తూ మభ్యపెడుతూ వచ్చాడు. దీంతో ఆమె తన ప్రేమికుడితో కలసి పోలీస్ కంప్లయింట్ ఇచ్చింది. (చదవండి: చట్టానికి ఎవరూ అతీతులు కారు: కంగనాకు కౌంటర్) అయితే ఆమె తండ్రి సమాజంలో పరపతి కలిగిన వ్యక్తి, కమ్యూనిస్ట్ నాయకుడు కావడంతో పోలీసులు అరెస్టు చేయకుండా వెనుకడుగు వేస్తున్నారంటూ శిశు సంక్షేమ శాఖతోపాటు సంబంధిత శాఖల ఉన్నతాధికారులను, ముఖ్యమంత్రిని వేడుకుంది. దీంతో ప్రభుత్వ యంత్రాంగం మొత్తం కదిలివచ్చి ఆమె బిడ్డను సత్వరమే వెతికే చర్యలు తీసుకోవడమే కాక సరిహద్దు దాటి ఆంధ్రప్రదేశ్‌లో అడుగుపెట్టిన కేరళ పోలీసులు ఆ బిడ్డను సొంత రాష్ట్రానికి తీసుకువచ్చింది. అంతేకాదు ఆ బిడ్డ ఆ తల్లికే చెందాలని అక్కడి రాష్ట్ర ప్రజలందరూ ఆకాంక్షించారు. డీఎన్ఏ పరీక్షలు పూర్తి అయ్యేంత వరకు జిల్లా చైల్డ్ ప్రొటెషన్ ఆఫీసర్ సంరక్షణలో ఉంచుతారని చెప్పడంతో అనుపమ ఎంతో ఆవేదనగా ఎదురుచూస్తూ ఉంది. ఈ మేరకు న్యాయమూర్తి ఛాంబర్లో గంటన్నరసేపు జరిగిన విచారణలో నిర్మల శిశు భవన్లో సీడబ్ల్యూసీ కస్టడీలో ఉన్న బాబుని కోర్టు ఆదేశాల మేరకు న్యాయస్థానం ముందు హాజరుపరిచారు. అంతేకాదు బాబుకి అన్ని వైద్యపరీక్షలు నిర్వహించడమే కాక చట్టపరమైన లాంఛనాలు పూర్తి చేసిన సత్వరమే ఆ చిన్నారిని తల్లికి అప్పగించాలని చైల్డ్ వెల్ఫేర్ కమిటీ(సీడబ్ల్యూసీ)ని కోర్టు ఆదేశించింది. ఈ క్రమంలో కోర్టు ఈ కేసును నవంబర్ 30కి వాయిదా వేసింది. అయితే శిశువును వీలైనంత త్వరగా తల్లిదండ్రులకు అప్పగించాలని ప్రభుత్వ ప్లీడర్ విజ్ఞప్తి చేయడంతో ఎట్టకేలకు అనుపమ ఒడికి ఆ చిన్నారి చేరుకుంది. అంతేకాదు సంవత్సరం నిరీక్షణ వారాల న్యాయ పోరాటాలు అన్ని ఫలించి ఈ రోజు అనుపమ తన భర్త అజిత్‌తో కలిసి తన చిన్నారిని ఎత్తుకుని ఆనందంగా కోర్టు నుంచి బయటకు వచ్చింది. అయితే మూడు రోజుల వయస్సు ఉన్నప్పుడు ఆమె చివరిసారిగా చూసిన తన బిడ్డ సంరక్షణ బాధ్యతను కోర్టు నేడు ఆమెకు అప్పగించింది. (చదవండి: వామ్మో!...పైప్‌లైన్‌లో నోట్ల కట్టలు..!!) -
కన్నపేగు పోరాటం.. ఆ బిడ్డ అనుపమ బిడ్డే అయి ఉండాలని..
కేరళ రాష్ట్రాన్ని కుదిపేస్తున్న ఓ సంఘటన ఈ సోమవారం నాడు చోటు చేసుకుంది. అధికార యంత్రాంగం, పోలీసు ఉన్నతాధికారులు అప్రమత్తంగా విధుల్లో నిమగ్నమై ఉన్నారు. జరగాల్సిన కార్యక్రమం యథావిధిగా నడుస్తోంది. మీడియా అటెన్షన్ కూడా ఈ విషయం మీదనే కేంద్రీకృతమై ఉంది. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రత్యేక దృష్టి పెట్టిన కేసు అది. అనుపమ అనే ఓ తల్లి తన బిడ్డ కోసం చేస్తున్న పోరాటం. కన్నపేగు చేస్తున్న పోరాటంలో ప్రభుత్వ యంత్రాంగం మొత్తం భాగమైంది. పోలీసులు బిడ్డను వెతికి రాష్ట్రానికి తీసుకువచ్చారు. ఇక అనుపమ చేతిలో పెట్టడమే తరువాయి. బిడ్డను చూపించండి! ఆదివారం నాటి రాత్రి పోలీసులు బిడ్డతో కేరళ రాజధాని తిరువనంతపురం చేరారు. ఆ రాష్ట్ర ఆరోగ్యమంత్రి వీణా జార్జ్ ఆదేశం మేరకు డీఎన్ఏ పరీక్ష కోసం సోమవారం నాడు బిడ్డ నుంచి నమూనా సేకరించారు. డీఎన్ఏ పరీక్ష తమ కళ్ల ముందే జరగాలని అనుపమ పట్టుపట్టింది. తన బిడ్డ నమూనాలను మార్చివేయరనే నమ్మకం ఏమిటని ప్రశ్నించింది అనుపమ. ఒక్కసారి బిడ్డను కళ్లారా చూస్తానని ప్రాధేయపడింది. ఇప్పటి వరకు జరిగిన పరిణామాల నేపథ్యంలో అంతా సవ్యంగా జరుగుతుందనే నమ్మకం కలగడం లేదని ఆమె పడుతున్న ఆవేదన, ఆందోళన అందరికీ అర్థమవుతోంది. నమూనా సేకరణ ప్రక్రియ మొత్తాన్ని వీడియో రికార్డ్ చేసినట్లు చెబుతూ, ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు మంత్రి. అనుపమ, ఆమె ప్రేమికుడు, బిడ్డ నమూనాలు స్థానిక రాజీవ్‌గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బయోటెక్నాలజీకి చేరినట్లు ఆ రాష్ట్రంలోని కౌముది మీడియా తెలిపింది. నమూనాలు సరిపోలినట్లు అధికారిక ప్రకటన వెలువడిన తర్వాత న్యాయపరమైన నిబంధనలు పూర్తి చేసి బిడ్డకు అనుపమకు ఇస్తారు. అప్పటివరకు బిడ్డను జిల్లా చైల్డ్ ప్రొటెషన్ ఆఫీసర్ సంరక్షణలో ఉంచుతారు. ఆ బిడ్డ ఈ బిడ్డేనా! జరుగుతున్న పరిణామాలు అనుపమకు సంతోషాన్నిస్తున్నట్లే కనిపిస్తున్నట్లు స్థానిక మీడియా చెప్తోంది. అలాగే పోలీసులు తీసుకువచ్చిన బిడ్డ అనుపమకు పుట్టిన బిడ్డ అనడానికి తార్కికపరమైన ఆధారాలు అందుతున్నాయి. బిడ్డ మాయమైన తర్వాత ఒకటి– రెండు రోజుల తేడాలో ఆ రాష్ట్రంలో అమ్మ తొట్టిల్ (ఉయ్యాల) పథకంలో భాగంగా ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఉయ్యాలలోకి ఇద్దరు బిడ్డలు వచ్చారు. వారిలో ఒక బిడ్డకు గత నెలలో పరీక్షలు నిర్వహించగా నెగెటివ్ వచ్చింది. ఓ బిడ్డను దత్తత ఇచ్చినట్లు తెలిసింది. ఆ బిడ్డ కోసం గాలించి ఆదివారం నాడు విజయవంతంగా ఛేదించారు. కన్నపేగు పోరాటం వృథా కాదని, ఆ బిడ్డ అనుపమ బిడ్డే అయి ఉండాలని రాష్ట్రం మొత్తం కోరుకుంటోంది. అనుపమ ఒడికి చేరే క్షణం కోసం ఎదురు చూస్తోంది. ఇదీ జరిగింది! అనుపమ గత ఏడాది అక్టోబర్‌లో ఓ బిడ్డకు తల్లయింది. ఆమె కేరళ సమాజంలో అగ్రవర్ణంగా గుర్తింపు పొందిన సామాజిక వర్గానికి చెందిన మహిళ. ఆమె ప్రేమించిన వ్యక్తి షెడ్యూల్డ్ కులానికి చెందిన వ్యక్తి. అనుపమ ప్రేమను అంగీకరించని ఆమె తండ్రి స్వయానా కూతురినే మోసం చేశాడు. ఆమె కన్నబిడ్డను ఆమె నుంచి వేరు చేశాడు. ‘బిడ్డను రహస్య ప్రదేశంలో సంరక్షిస్తున్నట్లు’ కొద్ది నెలల పాటు ఆమెను మభ్యపెట్టాడు. తాను మోసపోయానని తెలిసిన తర్వాత ఆమె ఇంటి నుంచి పారిపోయి, ప్రేమికుడితో కలసి పోలీస్ కంప్లయింట్ ఇచ్చింది. ఆమె తండ్రి సమాజంలో పరపతి కలిగిన వ్యక్తి, కమ్యూనిస్ట్ నాయకుడు, ప్రజాప్రతినిధి కూడా కావడంతో పోలీసులు మొదట్లో ఆమె కంప్లయింట్‌ను ఫైల్ చేయడానికి మీనమేషాలు లెక్కపెట్టారు. ఆమె పోలీసులు, శిశు సంక్షేమశాఖతోపాటు సంబంధిత శాఖల ఉన్నతాధికారులను కలిసి తన బిడ్డను తనకు ఇప్పించమని వేడుకుంది. రాష్ట్ర ముఖ్యమంత్రిని కూడా అభ్యర్థించింది. అనుపమ తండ్రి చేసిన ఘోరం రాష్ట్రంలో రాజకీయ వివాదానికి దారి తీసింది. మీడియాలో వరుస కథనాలు వెలువడ్డాయి. ఈ నెల 18వ తేదీన వెలువడిన ఆదేశాల మేరకు ఆ రాష్ట్ర పోలీసు యంత్రాంగంలో కదలిక వచ్చింది. సరిహద్దు దాటి ఆంధ్రప్రదేశ్‌లో అడుగుపెట్టిన పోలీసులు బిడ్డను సొంత రాష్ట్రానికి తీసుకువెళ్లారు. బిడ్డ రాష్ట్రానికి చేరిన వార్త సోమవారంనాడు ఆ రాష్ట్రంలో హాట్ టాపిక్ అయింది. -
నా బిడ్డను నాకివ్వండి! ప్లీజ్!!
అనుపమ ఓ బిడ్డకు తల్లి. బిడ్డ పుట్టి మొన్నటికి (ఈ నెల 19వ తేదీకి) ఏడాదైంది. సంతోషంగా బిడ్డ తొలి పుట్టిన రోజును పండగ చేసుకోవాల్సిన సమయం. ఈ ఏడాది లోపు పాపాయి బోర్లా పడడం, పాకడం, అన్నప్రాశన, తల నీలాలు తీయడం... ప్రతిదీ ఓ వేడుకగా జరిగి ఉండాల్సింది. కానీ ఏ ఒక్క వేడుకా జరగలేదు. పుట్టినరోజు వేడుక కూడా జరగలేదు. అనుపమకు తన బిడ్డ ఎక్కడ ఉందో తెలియదు. ఎలా ఉందో తెలియదు. ప్రసవం తర్వాత హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ కాక ముందు వరకే బిడ్డను పొత్తిళ్లలో చూసుకుంది అనుపమ. హాస్పిటల్ నుంచి తల్లీ బిడ్డ వేరయ్యారు. ఇంతవరకూ కలవలేదు. బిడ్డ కోసం అనుపమ పోరాడుతోంది. ఆ (కేరళ) రాష్ట్ర ముఖ్యమంత్రి కి కూడా విన్నవించుకుంది. అయినా సరే... బిడ్డ ఆచూకీ అగమ్యంగానే ఉంది. మరీ ఇంత వ్యూహాత్మకమా! ఇలాంటి సంఘటనల్లో సాధారణంగా హాస్పిటల్ సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా బిడ్డ మాయం కావడం చూస్తుంటాం. పిల్లలు లేని మహిళలు పేషెంట్ల రూపంలో హాస్పిటల్లో సంచరిస్తూ చంటిబిడ్డను ఎత్తుకెళ్లిపోవడం కూడా జరుగుతుంటుంది. అయితే ఇక్కడ చంటిబిడ్డ మాయం కావడానికి కారణం ఆ బిడ్డ తాత జయచంద్రన్. అతడు కేరళలో కమ్యూనిస్ట్ పార్టీ నాయకుడు. బిడ్డ ఏమైందని అడిగితే అతడు ‘నా కూతురు అనుపమ అనుమతితో ఆమె బిడ్డను దత్తత ఇచ్చేశాను’ అని చెప్తున్నాడు. ‘తన మానసిక, ఆర్థిక స్థితి సరిగ్గా లేని కారణంగా బిడ్డను పోషించే స్థితిలో లేదని, ఈ కారణాల వల్ల బిడ్డను దత్తత ఇవ్వడానికి అంగీరిస్తున్నట్లు... నా కూతురు సంతకం చేసింది చూడండి’ అని అనుపమ సంతకంతో కూడిన పత్రాన్ని కూడా చూపిస్తున్నాడు. ఇదీ కారణం! అనుపమది మలబార్ ఎరావా సామాజిక వర్గం. ఆ సామాజికవర్గానికి సమాజంలో అగ్రవర్ణంగా గుర్తింపు ఉంది. ఆమె ప్రేమించిన అజిత్ దళిత క్రిస్టియన్. అనుపమ ప్రేమను ఆమె తండ్రి అంగీకరించకపోవడానికి కారణం సామాజిక వర్గమే. గర్భవతిగా ఉన్న కూతురికి మంచి మాటలు చెప్పి ప్రసవానికి పుట్టింటికి తీసుకువచ్చారు ఆమె తల్లిదండ్రులు. అనుపమ అక్కకు పెళ్లయ్యే వరకు అనుపమ పెళ్లి, బిడ్డ వివరాలను గోప్యంగా ఉంచుదామని అనుపమను నమ్మించారు. డెలివరీ తర్వాత హాస్పిటల్ నుంచి అనుపమను నేరుగా జయచంద్రన్ స్నేహితుని ఇంటికి తీసుకు వెళ్లారు. బిడ్డను మరోచోట సురక్షితంగా ఉంచామని చెప్పారు. కొన్నాళ్లకు అనుపమను పుట్టింటికి తీసుకువెళ్లారు, ఆ తీసుకువెళ్లడమే ఆమెను గదిలో బంధించారు. బిడ్డ వివరాలు అడిగితే చెప్పేవాళ్లు లేరు. పైగా అనుక్షణం ఆమెతో ఇంట్లో వాళ్లు ఎవరో ఒకరు నీడలా అంటిపెట్టుకునే ఉండేవారు. అనుపమ అక్క పెళ్లికి ఊరి వాళ్లను ఆహ్వానించే సమయంలో అనుపమను కూడా వెంట తీసుకువెళ్లారు. అనుపమ ఎక్కడా నోరు విప్పకూడదనే ఆంక్ష విధించి మరీ. అలాగే నడుచుకుంది అనుపమ. అక్క పెళ్లి తర్వాత తన బిడ్డను ఇవ్వమని, అజిత్ దగ్గరకు వెళ్తానని అడిగింది. ‘కుటుంబ ఆస్తిలో తనకు వారసత్వంగా రావాల్సిన హక్కు వదులుకుంటున్నట్లు’ సంతకం చేయమన్నాడు తండ్రి. అలాగే అతడు చెప్పిన చోటల్లా సంతకం చేసింది. ఆ తర్వాత ఇంట్లో వాళ్ల అసలు కుట్ర బయటపడింది. ‘బిడ్డను నీ అంగీకారం ప్రకారమే దత్తత ఇచ్చేశాను’ అనేశాడు అనుపమ తండ్రి. ఇన్నాళ్లూ బిడ్డ కోసం తండ్రి చెప్పినట్లల్లా చేసింది. ఇప్పుడా బిడ్డ ఆచూకీనే లేనప్పుడు ఏం చేయాలి? ఎలాగైనా బిడ్డను దక్కించుకోవాలనే మొండిపట్టుదలతో ఇల్లు దాటి వచ్చేసింది. అజత్తోపాటు పోలీసులను ఆశ్రయించింది. తన బిడ్డ ఆచూకీ తెలిస్తే చెప్పమని కనిపించిన బంధువులను, కుటుంబ స్నేహితులను అర్థిస్తోంది. ప్రభుత్వంలో ఉన్న పెద్ద అధికారులు, పార్టీ అగ్రశ్రేణి నాయకులను కలిసి న్యాయం చేయమని మొరపెట్టుకుంది. ఆఖరుకు రాష్ట్ర ముఖ్యమంత్రిని కూడా అభ్యర్థించింది. ఇంత జరిగినా బిడ్డ ఏమైందో ఎవరికీ తెలియడం లేదు. తన డెలివరీ లోపు ఒకసారి తల్లిదండ్రులు తనకు అబార్షన్ చేయించడానికి కూడా ప్రయత్నించినట్లు అనుపమ చెప్తోంది. తన గోడు విన్న వాళ్లందరూ సానుభూతితో స్పందిస్తున్నారు, కానీ బిడ్డ ఆచూకీ మాత్రం లభించలేదు. ‘బిడ్డకు పాలివ్వడానికి నోచుకోలేని తల్లిగా తాను, తల్లిపాలకు దూరమైన తన బిడ్డ దురదృష్టవంతుల’మని కన్నీరు పెట్టుకుంటోంది అనుపమ. కేరళ రాష్ట్రం మనదేశంలో అత్యున్నత శాతం అక్షరాస్యత సాధించిన రాష్ట్రం. ఆ రాష్ట్రాన్ని అభ్యుదయపథంలో నడుస్తున్న రాష్ట్రంగా పరిగణిస్తాం. అలాంటిది ఈ డిజిటల్ యుగంలో కూడా ‘కులం, మతం’ మనిషి జీవితాన్ని నిర్ణయిస్తున్నాయి. బిడ్డను తల్లికి దూరం చేస్తున్నాయి. బిడ్డ ఎక్కడ ఉన్నట్లు? అనుపమ ఈ ఏడాది మార్చిలో ఇంటి నుంచి తప్పించుకుని వచ్చింది, అదే నెలలో పోలీసును ఆశ్రయించింది, పోరాడగా పోరాడగా... విషయం మీడియాలో బయటకు వచ్చిన తర్వాత పోలీసులు నిన్న ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారని, కానీ ఇంకా ఎవరినీ అదుపులోకి తీసుకోలేదని చెప్పాడు అజిత్ ఆవేదనగా. ఇక జయచంద్రన్ మాత్రం అనాథ బిడ్డల కోసం ప్రభుత్వం నిర్వహిస్తున్న అమ్మతొట్టిల్ పథకం ఉయ్యాల్లో వేసినట్లు ఒకసారి చెప్పాడు, శిశు సంక్షేమ శాఖ కమిటీకి అప్పగించినట్లు మరోసారి చెప్పాడు. శిశు సంక్షేమ కమిటీ నిర్వహకురాలు సునంద ఈ విషయంలో స్పందిస్తూ... ’ఏప్రిల్‌లో బిడ్డ తల్లిదండ్రులు తమ బిడ్డ ఆచూకీ కోసం వచ్చినట్లు చెబుతూ తమ వద్దకు వచ్చిన ప్రతి బిడ్డ గురించిన రికార్డు ఉంటుందని, ప్రభుత్వ నిబంధనల ప్రకారం కన్నతల్లితో స్వయంగా మాట్లాడిన తర్వాత మాత్రమే బిడ్డను స్వీకరిస్తామని వివరించారు. గత ఏడాది అక్టోబర్‌లో అమ్మతొట్టిల్కి వచ్చిన ఇద్దరు శిశువుల్లో ఒక శిశువును దత్తత ఇచ్చేయడం జరిగింది. మరో శిశువుకు డీఎన్ఏ పరీక్ష చేయగా నెగిటివ్ వచ్చింది. నిజానిజాలు పోలీసు దర్యాప్తులో మాత్రమే తేలతాయని, ఒకవేళ దత్తత ఇచ్చిన శిశువే అనుపమ బిడ్డ అయితే ఆ బిడ్డను తిరిగి అనుపమ దంపతులకు ఇవ్వడం చట్టరీత్యా చాలా కష్టమని చెప్పింది సునంద. -
ఐఏఎస్ కావాలనుకుంటున్నారా? ఈ సూచనలు పాటించారంటే..
ఐఏఎస్ ఎందరికో కల. కానీ కొందరు మాత్రమే విజయతీరాలను చేరగలుగుతారు. యూపీఎస్సీ ప్రతియేటా నిర్వహించే సివిల్ సర్వీసెస్ పరీక్షలు క్లియర్ చేయడం అంతసులువేంకాదనే విషయం మనందరికీ తెలిసిందే! అందుకు చదువుతోపాటు మానసిక, శారీరక ఆరోగ్యం కూడా కీలకమే. ఎందుకంటే.. అభ్యర్ధులు మానసికంగా, శారీరకంగా ఎప్పుడైతే దృఢంగా ఉండగలుగుతారో ప్రిపరేషన్‌పై మరింత ఫోకస్ చేయగలుగుతారు. 2018 బ్యాచ్‌కి సంబంధించిన ఐఏఎస్ ఆఫీసర్ అనుపమ అంజలి కూడా ఇదే విషయాన్ని చెబుతున్నారు. సివిల్స్ ఆశావహ అభ్యర్ధులకు అనుపమ సూచనలు, సలహాలు ఇవే.. విద్యాభ్యాసం అనుపమ అంజలి మెకానికల్ ఇంజనీరింగ్‌లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. రెండో ప్రయత్నంలోనే సివిల్ సర్వీస్ పరీక్షలను క్లియర్ చేశారు. ఆమె సామాజిక కార్యకర్త కూడా. కుటుంబ నేపథ్యం అనుపమ తండ్రి కూడా సివిల్ సర్వెంటే. ఐపీఎస్ ఆఫీసర్‌గా భోపాల్‌లో బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఫొటో కర్టెసీ: డీఎన్ఏ విజయ సూత్రం ఇదే సివిల్స్ ప్రిపరేషన్లో అభ్యర్ధులు బోర్‌గా ఫీలవడం సర్వసాధారణం. అనుపమ ఏం చెబుతున్నారంటే.. ఇటువంటి సందర్భాల్లో అభ్యర్ధులు తమని తాము పునరుత్తేజ పరచుకోవడానికి మధ్య మధ్యలో కొద్దిపాటి విరామాలు తీసుకుంటూ ఉండాలి. తద్వారా నూతన ఉత్సాహం నిండి, ప్రిపరేషన్ కొనసాగించడానికి ప్రోత్సాహకంగా ఉంటాయి. అలాగే శారీరక వ్యాయామాలు, ధ్యానం చేయడం కూడా ప్రతి అభ్యర్థికి ఎంతో ముఖ్యం. ఇది మిమ్మల్ని దృఢంగా, సానుకూలంగా ఉంచడానికి తోడ్పడుతుంది. సెల్ఫ్ మోటివేషన్ లేదా స్వీయ ప్రేరణ సుదీర్ఘ యూపీఎస్సీ ప్రిపరేషన్లో వ్యతిరేక ఆలోచనలు రావడం సాధారణమే. అయితే అనుపమ ఏమంటారంటే.. ప్రిపరేషన్ సమయంలో అభ్యర్ధులు తరచుగా ఒత్తిడికి గురై, నిరాశకు లోనవ్వడం జరుగుతుంది. ఏదేమైనా పాజిటివ్‌గా ఉండటం మాత్రం చాలా అవసరం. ఎందుకంటే ఈ విధమైన ధోరణి అత్యుత్తమ ప్రదర్శన కనబరచడానికి దోహదపడుతుంది. ప్రతికూల ఆలోచనలను అధిగమించకపోతే విజయం సాధించడం చాలా కష్టం. కాబట్టి పరీక్షలు సమర్ధవంతంగా రాయాలనుకునే అభ్యర్ధులు స్వీయ ప్రేరణను అలవరచుకోవాలి. ప్రేరణ పొందడానికి కొంత కృషి కూడా అవసరమౌతుంది. ఎందుకంటే.. మీ ప్రిపరేషన్ సజావుగా కొనసాగేందుకు ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. సివిల్స్ ఆశావహ అభ్యర్ధులకు అనుపమ సూచనలు యూపీఎస్సీ పరీక్షలకు సిద్ధమయ్యేటప్పుడు అన్నిరకాల ఆటంకాలకు/ఆందోళనలకు దూరంగా ఉండాలి. ఫ్యామిలీ ఫంక్షన్లు, ఫ్రెండ్స్ పార్టీలకు కూడా దూరంగా ఉండాలి. అలాగే కుటుంబ బాధ్యలకు దూరంగా ఉంటే మంచిది. యూపీఎస్సీ పరీక్షలను క్లియర్ చేయడానికి ఈ సూచనలు ఎంతో సహాయపడతాయి. చదవండి: Trupti Gaikwad: రెండేళ్ల కిందట అలా మొదలైంది.. పూజ తర్వాత -
సత్య నాదెళ్ల సతీమణి అనుపమ ఔదార్యం
సాక్షి, అనంతపురం : మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల సతీమణి అనుపమ ఔదార్యం చూపారు. రైతులు, వ్యవసాయ కూలీల అదనపు ఉపాధి కోసం ఆమె 2 కోట్ల రూపాయిల విరాళం ప్రకటించారు. అనంతపురం యాక్షన్ ఫ్రేటార్నా ఎకాలజీ సెంటర్‌కు ఈ విరాళాన్ని అనుపమ అందచేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు అనుపమ నాదెళ్లను అభినందించారు. (నాన్నా.. నువ్వే నా దిక్సూచి: నాదెళ్ల) దాతలు ఇచ్చిన ఆర్ధిక సాయంతో రైతులు, వ్యవసాయ కూలీలకు ప్రత్యామ్నాయ ఉపాధి అవకాశాలు కల్పిస్తామని ఏఎఫ్ ఎకాలజీ సెంటర్ డైరెక్టర్ వైవీ మల్లారెడ్డి తెలిపారు. కాగా అనుపమ తండ్రి వేణుగోపాల్ ఐఏఎస్ అధికారి. పలు ప్రాంతాల్లో ఆయన కలెక్టర్‌గా పనిచేశారు. అప్పట్లో తండ్రి ఉద్యోగరీత్యా ఆమె కూడా దేశమంతా పర్యటించారు. అప్పుడే అక్కడ సమస్యలను తెలుసుకున్న అనుపమ తన వంతు సేవ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. -
టీవీ నటి అనుపమ పాథక్ ఆత్మహత్య
-
వచ్చే నెలలో ప్రొ కబడ్డీ వేలం
ముంబై: ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్) ఏడో సీజన్ కోసం వచ్చే నెల 8, 9 తేదీల్లో ఆటగాళ్ల వేలం నిర్వహిస్తారు. ‘రెండు రోజుల పాటు జరిగే ఈ వేలం ప్రక్రియను ముంబైలో నిర్వహిస్తాం. 12 జట్లు తలపడే ఈ సీజన్ పోటీలు జూలై 19న మొదలవుతాయి’ అని లీగ్ కమిషనర్ అనుపమ్ గోస్వామి వెల్లడించారు. వచ్చే ఏడాది ఎనిమిదో సీజన్ పోటీలను కూడా జూలైలోనే ప్రారంభిస్తామని ఆయన అన్నారు. పూర్తి షెడ్యూలును ఈ నెలలోనే ప్రకటిస్తామని చెప్పారు. -
సూర్యచంద్రికలు
‘సూర్యుడిలా ప్రకాశించాలంటే ముందు సూర్యుడిలా ప్రజ్వలించాలి’’అని అబ్దుల్ కలామ్ అనేవారు. ఈ మహిళామణులంతా అలా ప్రజ్వరిల్లి, ప్రకాశించినవారే. అందుకే వీరు తొలి మహిళలు అవగలిగారు. భారతావనిలో ఆదర్శవంతులుగా నిలవగలిగారు. ‘మహిళా దినోత్సవం’ సమీపిస్తున్న వేళ.. కొందరు తొలి మహిళల ప్రస్తావన. లెఫ్టినెంట్ భావనా కస్తూరి రిపబ్లిక్ డే పరేడ్‌లో (2019) పురుషుల సైనిక దళానికి సారథ్యం వహించిన తొలి మహిళ! కెప్టెన్ శిఖా సురభి రిపబ్లిక్ డే పరేడ్ (2019)లో భారత సైన్యం ప్రదర్శించిన మోటార్ సైకిల్ విన్యాస బృందం ‘డేర్ డెవిల్స్’లో తొలి, ఏకైక మహిళా సభ్యురాలు. డాక్టర్ జి.సి. అనుపమ ఆస్ట్రొనామికల్ సొసైటీ ఆఫ్ ఇండియా (భారత ఖగోళరంగ సంస్థ) తొలి మహిళా అధినేత. దేశంలోని ఖగోళ శాస్త్రవేత్తలంతా ఇందులో అధికారిక సభ్యత్వం కలిగి ఉంటారు. ఫ్లయిట్ లెఫ్టినెంట్ హీనా జైస్వాల్ భారతీయ వాయుసేనలో (ఇండియన్ ఎయిర్ ఫోర్స్) తొలి మహిళా ఫ్లయిట్ ఇంజినీర్. శాంతిదేవి భారతదేశంలో తొలి మహిళా ట్రక్కు మెకానిక్కు. శాంతిదేవి ఇరవై ఏళ్లుగా భారీ వాహనాలను రిపేర్ చేస్తున్నారు. ఉషా కిరణ్ చత్తీస్‌గడ్‌లోని కల్లోల బస్తర్ ప్రాంతంలో విధులను స్వీకరించిన తొలి సి.ఆర్.పి.ఎఫ్ మహిళా అధికారి. కవితాదేవి డబ్లు్య.డబ్లు్య.ఇ. (వరల్డ్ రెజ్లింగ్ ఎంటర్టైన్మెంట్)లో పాల్గొన్నతొలి భారతీయ మహిళా రెజ్లర్. అవని చతుర్వేది ఒంటరిగా ఫైటర్ ఎయిర్‌క్రాఫ్ట్‌ను నడిపిన తొలి మహిళా ఫ్లయింగ్ ఆఫీసర్. ఎం.ఎ.స్నేహ భారత ప్రభుత్వం నుంచి అధికారికంగా నో క్యాస్ట్, నో రెలిజియన్ ‘సర్టిఫికెట్’ సంపాదించిన తొలి భారతీయ మహిళ. అరుణిమ సింగ్ జలచరాలను కాపాడే పనిలో ఉన్న తొలి భారతీయ ప్రాణి ప్రేమికురాలు. ఇప్పటివరకు ఆమె 18 ప్రమాదకరమైన నీటి ప్రాణులను ప్రాణగండం నుంచి బయటపడేశారు. ప్రాంజల్ పాటిల్ కంటిచూపు లేని తొలి భారతీయ మహిళా ఐఎఎస్ అధికారి. గత ఏడాదే ఆమె ఎర్నాకులం జిల్లా (కేరళ) అసిస్టెంట్ కలెక్టర్‌గా పదవీ బాధ్యతలు స్వీకరించారు. -
జావా బుకింగ్స్... టాప్–5లో హైదరాబాద్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: జావా మోటార్‌సైకిళ్ల బుకింగ్స్‌లో హైదరాబాద్ టాప్–5లో నిలిచింది. దేశంలో దక్షిణాది నుంచే అత్యధిక బుకింగ్‌లు వచ్చినట్లు జావాను ప్రమోట్ చేస్తున్న క్లాసిక్ లెజెండ్స్ కో–ఫౌండర్ అనుపమ్ థరేజా వెల్లడించారు. హైదరాబాద్‌లో మూడు షోరూంలను ప్రారంభించిన సందర్భంగా సోమవారమిక్కడ ఆయన మీడియాతో మాట్లాడారు. ‘ఆన్లైన్ బుకింగ్స్ క్లోజ్ చేశాం. ఊహించిన దాని కంటే ఎక్కువ బుకింగ్స్ నమోదయ్యాయి. బ్రాండ్ న్యూ ఇంజిన్‌తో మోడళ్లకు రూపకల్పన చేశాం. బీఎస్–6 ప్రమాణాలకు అనుగుణంగా ఉంటాయి. లైఫ్‌స్టైల్, క్లాసిక్ బైక్‌లు ఇవి. ఎవరైనా సులువుగా రైడ్ చేయవచ్చు. బైక్‌ల తయారీకై 700 మంది వెండార్ల నుంచి విడిభాగాలను కొనుగోలు చేస్తున్నాం. వీరంతా కొత్త ప్లాంట్లు, యూనిట్లను ఏర్పాటు చేస్తున్నారు. అందుకే డెలివరీలు ఆలస్యం అవుతున్నాయి. తెలంగాణలో 9, ఏపీలో 16 ఔట్లెట్లు రానున్నాయి. మొత్తం 86 నగరాల్లో మార్చికల్లా 105 షోరూంలు తెరుచుకుంటాయి. ఇవి ప్రారంభం అయిన తర్వాతే డెలివరీలు ప్రారంభిస్తాం’ అన్నారు. -
అనుపమ ఐపీఎస్ పీ 'ఫర్' పాలిటిక్స్
అనుపమా షెనాయ్.. మాజీ ఐపీఎస్ ఆఫీసర్. 2010, కర్ణాటక కేడర్. రెండేళ్ల కిందట.. బళ్లారి జిల్లాలోని కుడ్లిగీలో డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్‌గా ఉన్నప్పుడు అక్కడి మద్యం మాఫియా కోరలు విరిచే ప్రయత్నం మొదలు పెట్టారు. ఆ మాఫియా లీడర్ కర్ణాటక రాష్ట్ర కేబినెట్లోని ఓ మంత్రికి చాలా దగ్గర. ఆ మంత్రి సహాయంతో అనుపమను నానా ఇబ్బందులు పెట్టాడు. ఆమె పైఅధికారులతో చెప్పించి కట్టుదిట్టం చేశాడు. అయినా అమె సర్దుకుపోలేదు. దుష్టశక్తులతో ఢీకొనడానికే సిద్ధపడ్డారు! మాఫియాను నిలువరించడానికి అనుపమ చాలా పోరాటమే చేశారు. ఆ లిక్కర్ మాఫియా వల్ల కుడ్లిగీ ప్రాంతంలో ఎన్ని కుటుంబాలు నాశనమయ్యాయో ప్రభుత్వానికి నివేదికలు ఇచ్చారు. అయినా ఎవరూ సీరియస్‌గా తీసుకోలేదు. ఆఖరికి డిపార్ట్మెంట్లో కూడా తనకు మద్దతు దొరక్కపోయేసరికి కలత చెందిన అనుపమ.. ఉద్యోగానికి రాజీనామా చేశారు. రాజకీయ నాయకుల అవినీతితో విసిపోయి అనుపమ అప్పుడే ఓ నిర్ణయానికీ వచ్చారు. తను రాజకీయాల్లోకి రావాలని! అయితే ఇప్పుడున్న పార్టీల కండువా మోయకుండా తనే సొంతంగా ఓ పార్టీ పెట్టాలని నిశ్చయించుకున్నారు. ఆ పార్టీ మూడు ‘సీ’లను.. అంటే కరప్షన్, కమ్యూనలిజం, కాస్టీజం.. వీటికి వ్యతిరేకంగా ఉండాలనుకున్నారు. అదే తమ ఎజెండాగా ‘భారతీయ జనశక్తి కాంగ్రెస్’ను స్థాపించారు. ఈ పోటీ గెలుపు కోసం కాదు మే 12న జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో కర్ణాటకలో ఉన్న మొత్తం 225 అసెంబ్లీ స్థానాలలో అనుపమ ‘భారతీయ జనశక్తి కాంగ్రెస్ పార్టీ’ 30 స్థానాలకు పోటీ చేస్తోంది. అనుపమ కోస్తా ఉడిపి జిల్లా నుంచి పోటీకి నిలబడుతున్నారు. ‘‘పార్టీ పెట్టి ఆర్నెల్లు కూడా కాలేదు. అందుకే ఈ ఎన్నికల్లో గెలుపు మా ధ్యేయం కాదు. మా పార్టీ గురించి ప్రజలకు తెలియాలి. ఈ ఎన్నికలను అందుకోసమే ఉపయోగించుకుంటున్నాం’’ అంటున్నారు అనుపమ షెనాయ్. బీజేసీ నుంచి పోటీ పడుతున్న అభ్యర్థుల్లో ఏ ఒక్కరికీ నేర చరిత్ర లేదు. ఎవరూ అవినీతి పరులు కాదు. అంతేకాదు, తన పార్టీకి సామాజిక, ఆర్థిక హోదా సంబంధం లేదనీ స్పష్టం చేస్తున్నారు అనుపమ. పైగా సామాజికంగా అట్టడుగు వర్గాల్లో ఉన్నవారికి ఎక్కువ ప్రాధాన్యమని ముందే స్పష్టం చేశారు. పేద వర్గం కూడా తన పార్టీలో నిరభ్యంతరంగా చేరవచ్చనీ, వారికీ టికెట్స్ ఇస్తామనీ హామీ ఇస్తున్నారు అనుపమ. విద్యకు, ఆరోగ్యానికీ ప్రాధాన్యం ‘‘బీజేపీ, కాంగ్రెస్.. ఇట్లా ఏ పార్టీ తీసుకున్నా అన్నీ అవినీతి కూపాలే. బీజేపీ అయితే మరీనూ’’ అంటున్నారు అనుపమ. ‘‘కర్ణాటకలో ఆ పార్టీ ఆగడాలకు అంతే లేదు. కాంగ్రెస్ కూడా మూడు ‘సీ’లకు దాసోహం. అందుకే వాటన్నిటికీ అతీతంగా బీజేసీని ఏర్పాటు చేశాం. మా పార్టీ పారదర్శకంగా ఉంటుంది. ప్రో విమెన్, ప్రో ఎన్విరాన్మెంట్, ఇంకా.. చిరకాలం కొనసాగే విధానాలే మా పార్టీ లక్ష్యం. వీటిని ఏ పార్టీ ఆచరించినా మా మద్దతు, సహకారం ఉంటాయి. ఆరోగ్యం, విద్య ఎంతగా వ్యాపార రంగాలు అయిపోయాయో చూస్తున్నాం. ఆ ధోరణిని అరికడతాం. ఆ రెండు రంగాల్లోనూ ప్రభుత్వ సంస్థలనే ప్రోత్సహిస్తాం. వాటి విధులను మెరుగుపరుస్తాం. ప్రజలే కింగ్ మేకర్స్. వారి సంపూర్ణ భద్రత, రక్షణే మా బాధ్యత’’ అని ఎంతో ఉత్సాహంగా చెబుతున్నారు అనుపమా షెనాయ్. హాయిగా ఉద్యోగం చేసుకోకా! కాంప్రమైజ్ అయిపోయి.. హాయిగా ఉద్యోగం చేసుకోక.. పార్టీలు.. ఎన్నికలు.. అంటూ ఈ తలనొప్పులు ఎందుకు? అని అనుపమను వెనక్కి లాగిన వారూ చాలామందే ఉన్నారు. వాళ్లందరికీ .. ‘‘ఇరవై నాలుగు గంటలూ శాంతిభద్రతలను కాపాడాల్సిన పోలీసు శాఖే అవినీతిమయమై, ప్రజాప్రతినిధులతో కుమ్మక్కై ప్రజాకంటకంగా మారితే.. ‘నాకేంటి? నా జీతం నాకొస్తోంది కదా’ అని ఊరకుండిపోయే తత్వం కాదు నాది. ప్రశ్నించే యువత రాజకీయాల్లోకి రావాలి. ఇప్పుడున్న పార్టీల్లో యువతకు అవకాశం లేదు. నా పార్టీ ద్వారా వారికి అవకాశం కల్పిస్తా.. అవినీతి లేని పాలన అందే వరకు పోరాడుతా’’ అని సమాధానమిస్తున్నారు అనుపమ. -
కృష్ణార్జున యుద్ధం టీజర్ విడుదల
-
సం'చలనం'
ఒక మంచి ఐఏఎస్ ఆఫీసర్ స్ట్రిక్ట్‌గా పనిచేస్తే వ్యవస్థలో చలనం వస్తుందో లేదో తెలియదు కానీ ఆమె పదవిలో చలనం వచ్చే అవకాశం ఎక్కువ. సంచలనం కోసం కాకుండా సత్యం కోసం యుద్ధం చేస్తే మంచి చలనం ఉంటుంది. సంచలనం. షి ఈజ్ యాన్ ఆఫీసర్ ఫర్ గుడ్ ఛేంజ్. 2017, కేరళలోని అలప్పుళ జిల్లా. మార్తండమ్ చెరువును పరిశీలిస్తున్నారు కలెక్టర్. ఓ కట్టడం కోసం ఆ చెరువు సగం లెవెల్ చేసి ఉంది. నిర్మాణ పనులు కూడా మొదలయ్యాయి. ఆ చెరువును ఆనుకునే ఇంకోవైపు వరిపొలాలున్నాయి. వాటిలో సగం కూడా లెవెల్ చేసి ఉన్నాయి. ‘ఇక్కడేం కడ్తున్నారు?’ అడిగారు సబార్డినేట్స్‌ను. ‘పార్కింగ్ లాట్ మేమ్’ చెప్పారు. ‘ఊ’ అంటూ దీర్ఘంగా నిట్టూర్చారు కలెక్టర్ వెనక్కి తిరుగుతూ. ఆమె కారులో కూర్చొని అక్కడి నుంచి కదిలాక చెప్పడం మొదలుపెట్టాడు సంబంధింత సబార్డినేట్. ‘మేమ్.. ఇందులో మంత్రిగారి హస్తముంది. ప్రతిపక్షాల నుంచి చాలా కంప్లయింట్స్ వచ్చినా మేనేజ్ చేసుకున్నారు. పైగా నిరూపిస్తే మినిస్టర్గిరే కాదు ఎమ్మేల్యేగిరీకీ రాజీనామా చేస్తాను అని సవాల్ కూడా చేశారు’ చెప్పాడు. ఆ చెరువు కబ్జా ఫైల్‌లోనే తల పెట్టిన కలెక్టర్ పేజీ తిప్పుతూ ‘ఈ కట్టడం లేనప్పటి చెరువు ఫొటోలు ఏమైనా మనకు దొరకొచ్చా?’ అడిగారు.‘ప్రయత్నించొచ్చు మేమ్’ తెలిపాడు. ‘అయితే ప్రయత్నం మొదలుపెట్టండి’ ఫైల్ మూసేస్తూ చెప్పారు కలెక్టర్. ఆ ప్రయత్నం ఫలించింది. చెరువుకు చెందిన శాటిలైట్ ఫొటోలు వచ్చాయి. అంతుకుముందు చెరువు ఎలా ఉందో ప్రస్తుతం ఎలా ఉందో స్పష్టంగా తెలుస్తోంది వాటి ద్వారా. వాటిని పెట్టి పూర్తి వివరాలతో నివేదిక తయారు చేసి రెవెన్యూశాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీకి సమర్పించారు కలెక్టర్. దీని మీద సంబంధిత వ్యక్తి కోర్టుకు కూడా వెళ్లాడు. అతని పిటీషన్‌ను కొట్టిపారేసింది కోర్టు. కేరళ ప్రభుత్వ ‘ప్యాడీ అండ్ వెట్‌ల్యాండ్ యాక్ట్’ కింద నేరం రుజవైంది. అతను చెప్పినట్టు రాజీనామా చేయలేదు. కాని ఆ జిల్లా కలెక్టర్ ధైర్యసాహసాలు, నిబద్ధత దేశమంతా మారుమోగాయి. ఆమె.. టీవీ అనుపమ. అతను.. కేరళ రవాణాశాఖ మంత్రి థామస్ చాందీ! అనుపమ ఈ యాక్షన్‌తో కేరళ కేబినేట్ వణికిపోయింది. ఆమెను అలప్పుళ జిల్లా కలెక్టర్‌గా ఏరికోరి నియమించింది స్వయానా ముఖ్యమంత్రి పినరయి విజయన్నే అయినా నియమనిబంధనలను అతిక్రమిస్తే మంత్రిని కూడా ఉపేక్షించేది లేదని నిరూపించారు ఆమె. స్వప్నం సాకారమైన వేళ కేరళలోని మలప్పురం జిల్లా ‘పొన్నని ’అనుపమ సొంతూరు. తండ్రి కేకే సుబ్రహ్మణ్యన్. సర్కిల్ ఇన్స్పెక్టర్గా పని చేస్తూ 2002లో మరణించాడు. తల్లి టీవీ రమణి ఎండోమెంట్ శాఖ ఉద్యోగి. అనుపమే పెద్ద కూతురు. చిన్నప్పటి నుంచి చదువులో చురుకే. నైన్త్క్లాస్లోనే నిర్ణయించుకుంది ఐఏఎస్ కావాలని. తండ్రి చనిపోయేనాటికి అనుపమ టెన్త్‌లో ఉంది. నాన్న పోయిన పుట్టెడు దుఃఖాన్ని కడుపులో దాచుకొని పబ్లిక్ పరీక్షలు రాసింది. స్టేట్‌లో పదమూడవ ర్యాంక్ సంపాదించింది. ఇంటర్లో మూడో ర్యాంక్! బిట్స్ పిలానీ గోవా క్యాంపస్‌లో బీటెక్ చేసింది. ఓవైపు ఇంజనీరింగ్ చదువుతూనే సివిల్స్‌కి ప్రిపేరవసాగింది. ఫస్ట్ అటెంప్ట్‌లోనే (2010) ఆల్ ఇండియా నాల్గవ ర్యాంక్‌తో సివిల్స్‌లో విజయం పొందింది. ఆహారం భద్రం 2015లో ఫుడ్ సేఫ్టీ కమిషనర్‌గా చార్జ్ తీసుకున్నారు అనుపమ. ఏ పనిచేసినా అందులోని లొసుగుల్ని సవరించందే నిద్రపోరు. వృత్తి అంటే అంత అంకితభావం. ఐఏఎస్‌గా నియామకం పొందిన క్షణాన్నే ప్రమాణం చేశారు కర్తవ్యనిర్వహణే ప్రాణం అని. ఆ నైజాన్నే ఫుడ్‌సేఫ్టీ కమిషనర్‌గా ఉన్నప్పుడూ చూపించారు. పేరున్న చాలా ఫుడ్ బ్రాండ్స్ కల్తీలు, మితిమీరిన శాతంలో క్రిమిసంహారక మందులను వాడి ఆహారపదార్థాలను మార్కెట్లో అమ్ముతున్నాయి. ఈ విషయం ఆమె దృష్టికి వచ్చింది. శాంపిల్స్ తెప్పించారు. పరీక్షకు పంపించారు. నిజమని తేలింది. ప్రతి వస్తువు కల్తీనే. పరిమితికి మించి 300 శాతం పెస్టిసైడ్స్. హతాశురాలయ్యారు. వెంటనే గోడౌన్స్ మీద దాడులు చేశారు. కేస్ కోర్ట్‌దాకా వెళ్లింది. రుజువులుగా కూరగాయలు, పండ్ల శాంపిల్స్‌ను కోర్టు ముందుంచారు. పెద్ద పెద్ద బ్రాండ్ల మోసాలను కోర్టు ప్రత్యక్ష్యంగా తెలుసుకుంది. డీలర్ల అరెస్ట్‌కు ఆర్డర్ వేసింది. అనుపమ తీసుకున్న స్టెప్ ఇంతటితో ఆగలేదు. పౌరులకు ఒక విజ్ఞాపన చేశారు. ఎవరిళ్లల్లో (వాకిలి, డాబా, బాల్కనీ ఇలా) వాళ్లు, చేలల్లో, చెలకల్లో సేంద్రీయ పద్ధతుల్లో కూరగాయలు పండించమనీ, విత్తనాలను తాము అందిస్తామని. అప్పటిదాకా కల్తీ నిండిన కడుపులను ప్రక్షాళన చేయడానికి ఇది మంచి ఆఫర్ అని కేరళ రాష్ట్రప్రజలూ ఒకొక్కరే నెమ్మదిగా ఇళ్లల్లో ఎంత జాగా ఉంటే అంతలో కూరగాయల పంట వేసుకోవడం మొదలుపెట్టారు. ప్రజల స్పందన రాష్ట్రప్రభుత్వాన్నీ ఆలోచనలో పడేసింది. వాళ్లకు ఏదైనా సహాయం అందించాలనుకుంది. దాంతో ఉచితంగా డ్రిప్‌ఇరిగేషన్, బయోగ్యాస్ ప్లాంట్ సౌకర్యాలను కల్పించింది. సబ్సిడీలు అందించింది. ఇది ఎంత ప్రభావం చూపిందంటే అప్పటిదాకా తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుంచి చేసుకుంటున్న కూరగాయల దిగుమతులను గణనీయంగా తగ్గించుకునేంతగా. దటీజ్ అనుపమ ఐఏఎస్! ‘ఇదంతా నా ఘనతగా మీడియా ప్రచారం చేస్తోంది. ఈ ప్రచారాలు, ఆర్భాటాలు నాకిష్టం ఉండదు. పైగా ఇందులో నేను చేసిందీ ఏమీ లేదు. కల్తీ జరుగుతోందని, పెస్టిసైడ్స్ వాడకం ప్రాణాంతకంగా మారిందని ప్రజలకు తెలిసింది. సొంతంగా సేంద్రీయ వ్యాపారం చేసుకుంటే ప్రభుత్వ పరంగా నేను ఈ సహాయం చేయగలనని చెప్పాను. ప్రజలు అర్థం చేసుకున్నారు. ప్రభుత్వమూ ముందుకు వచ్చింది. కొనసాగుతోంది. అంతే’ అంటూ సింపుల్‌గా సెలవిస్తారు ఆమె. వచ్చిన కొత్తలోనే... సంచలనం కోసం కాదు సత్యం కోసం పోరాడాలి అనేది అనుపమ తత్వం. అన్యాయాన్ని మనం సహించకపోతే న్యాయం తానంతట తానే బతుకుంది అనేది ఆమె నమ్మిన నిజం. అందుకే వ్యక్తిగత జీవితంలోనూ పాటిస్తారు నిక్కచ్చిగా. 2014లో జరిగిన ఓ సంఘటనే ఇందుకు ఉదాహరణ. కుటుంబంతో కలిసి ఇంకో ఇంట్లోకి మారాల్సి వచ్చింది ఆమె. ఇచ్చిన గడువులో సామాన్లను తీసుకోలేకపోయారు అనుపమ. దాంతో కేవలం ఆమెను వేధించే ఉద్దేశంతోనే ‘నొక్కుకూలీ’ (సామాన్లను కాపాలా కాసినందుకు, ప్రైవేట్ లేబర్‌తో ఆ సామాన్లను లోడ్ లేదా అన్లోడ్ చేయించినందుకు యూనియ్హెడ్లోడ్ వర్కర్స్కు అదనంగా చెల్లించే డబ్బు)ఇవ్వాలని సీఐటీయూ కన్వీనర్ బి.మురళి డిమాండ్ చేశారు.ఇది అన్యాయమని వాదించారు అనుపమ. వాషింగ్‌మెషీన్‌ను అలాగే ఉంచేసుకొని అదనపు కూలీ ఇస్తేనే దాన్ని ఇస్తామని చెప్పి వాళ్లింటి ముందున్న గోడమీద తన ఫోన్ నంబర్ రాసి డబ్బులు ఎప్పుడిస్తారో ఆ నంబర్‌కి కాల్ చేయమని చెప్పి మరీ వెళ్లాడు మురళి. అక్కడితో ఆగకుండా ఆ కుటుంబాన్ని వేధించడం మొదలుపెట్టాడు. పోలీస్కంప్లయింట్ ఇచ్చి మురళిని అరెస్ట్ చేయించారు అనుపమ. పక్షం రోజులు రిమాండ్‌లో ఉన్నాడు మురళి. తనను నియమించిన చీఫ్మినిస్టర్కైనా .. మురళి లాంటి వాళ్లకైనా.. తానెవరికీ భయపడననీ నిరూపించారామె. దటీజ్ అనుపమ. అందుకే ఆమె ప్రమేయం లేకుండానే ఆమె ఓ సంచలనం అయింది. నచ్చకపోయినా ఆమె పని తీరు ప్రాచుర్యం పొందుతోంది. ఇలాంటప్పుడే అనిపిస్తుంది పబ్లిసిటీ మంచిదే... ఇతరులకు ఇన్స్పైరింగ్గా! – శరాది -
అనుపమ అదరలేదు.. బెదరలేదు
సాక్షి, తిరువనంతపురం : భూకబ్జాల వివాదాలతో గత కొన్ని నెలలుగా ఆ మంత్రివర్యులు వార్తల్లో నిలుస్తూ వస్తున్నారు. పైగా అందమైన సరస్సును పూడ్చి మరీ విలాసానికి రిసార్ట్ కట్టుకున్నారు. అధికారంలో ఉన్నాం కదా ఏం ఫర్వాలేదన్న ధీమా. కానీ, నిజాయితీ ముందు ఏదీ నిలబడదు కదా. థామస్ చాందీ(నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ) కేరళ రవాణాశాఖ మంత్రి పదవికి రాజీనామా చేసిన వ్యవహారం గత మూడు రోజులుగా సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. ఇంతకీ ఆయన గద్దెదిగడానికి కారణం ఓ మహిళా కలెక్టర్. ఆమె పేరు టీవీ అనుపమ. ప్రస్తుతం అలప్పుఝా జిల్లా కలెక్టర్‌గా ఆమె విధులు నిర్వహిస్తున్నారు. అక్కడ ప్రకృతి అందాలతో విరజిల్లే మార్తాండం సరస్సును పూడ్చి మంత్రి థామస్ అక్రమంగా లేక్ ప్యాలెస్ నిర్మించటాన్ని ఆమె తీవ్రంగా ఖండించారు. ఈ విషయమై మంత్రి-కలెక్టర్ మధ్య విమర్శలు-ప్రతి విమర్శలు కూడా కొనసాగాయి. దీంతో రెవెన్యూ శాఖ నుంచి పూర్తి నివేదికలు తెప్పించుకున్న ఆమె అందులో అవినీతి జరిగిందన్న విషయం నిర్థారించుకున్నాకే రెవెన్యూ కార్యదర్శికి తుది నివేదికను సమర్పించారు. ఆ సమయంలో ఆమెపై తీవ్ర ఒత్తిళ్లు వచ్చాయి.. బెదిరింపులు ఎదురయ్యాయి. కానీ, ఆమె మాత్రం అస్సలు వెనక్కి తగ్గలేదు. దీంతో నివేదికను తప్పుబడుతూ సదరు మంత్రి హైకోర్టులో ఓ పిటిషన్ దాఖలు వేశారు. అయితే ఆయన వ్యవహారాన్ని పనిపై స్థానిక మీడియాలు వరుస కథనాలు ప్రసారం చేయటంతో ప్రజలు మంత్రిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోపక్క ఎల్డీఎఫ్ కూటమి భాగస్వామ్య పార్టీలు ఆయన రాజీనామాను పట్టుబట్టడం.. అదే సమయంలో కోర్టు కూడా ఆయన తీరుపై ఆగ్రహాం వ్యక్తం చేయటంతో చివరకు గత బుధవారం రాజీనామా చేస్తూ లేఖను ముఖ్యమంత్రికి అందజేశారు. ప్రస్తుతం ఆయన కబ్జా కట్టడాలను కూల్చివేసే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. ఇదిలా ఉంటే ప్రజాస్వామ్య విలువల పరిరక్షణే ధ్యేయంగా.. అధికారానికి ఎదురొడ్డి మరీ అనుపమ చూపించిన తెగువకు సామాజిక మాధ్యమాల్లో ప్రశంసలు కురుస్తున్నాయి. అనుపమ నేపథ్యం... మళప్పురం జిల్లా పొన్నానిలోని మారంచెరీకి చెందిన అనుపమకు చిన్నప్పటికీ సివిల్స్ సాధించాలన్నది కలగా ఉండేది. గోవా బిట్స్ పిలానీ క్యాంస్‌లో ఆమె ఉన్నత విద్యను అభ్యసించారు. బీఈలో 92 శాతం ఉత్తీర్ణత సాధించటం విశేషం. 2010 సివిల్స్ పరీక్షలో నాలుగో ర్యాంక్‌ను ఆమె సాధించారు. -
మేకింగ్ ఆఫ్ మూవీ - ఉన్నది ఒక్కటే జిందగీ
-
జనవరి 30నుంచి రాంచరణ్ కొత్త సినిమా
మెగా పవర్ స్టార్ రాంచరణ్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కబోయే సినిమాకు ముహూర్తం ఫిక్స్ చేశారు. పీరియాడిక్ లవ్ స్టోరిగా తెరకెక్కనున్న ఈ సినిమాను జనవరి 30న లాంచనంగా ప్రారంభించేదుకు ప్లాన్ చేస్తున్నారు. ధృవ రిలీజ్ తరువాత ఖైదీ నంబర్ 150 పోస్ట్ ప్రొడక్షన్, ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉన్న చరణ్ అవన్నీ పూర్తయిపోవటంతో త్వరలో తన సినిమాను ప్రారంభించాలని నిర్ణయించుకున్నాడు. నాన్నకు ప్రేమతో సినిమా తరువాత లాంగ్ గ్యాప్ తీసుకున్న సుకుమార్ రాం చరణ్ కోసం ఓ పీరియాడిక్ లవ్ ఎంటర్టైనర్ను సిద్ధం చేశాడు. ఇప్పటికే పక్కా స్క్రిప్ట్‌తో రెడీగా ఉన్న సుక్కు, ఈ సినిమాను వీలైనంత త్వరగా పూర్తి చేసి, దసరా బరిలో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నాడు. పల్లెటూరి వాతావరణంలో తెరకెక్కనున్న ఈ సినిమాలో రాంచరణ్ సరసన అనుపమా పరమేశ్వరన్ హీరోయిన్గా నటిస్తోంది. శ్రీమంతుడు, జనతా గ్యారేజ్ లాంటి సక్సెస్ ఫుల్ చిత్రాలను నిర్మించిన మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను నిర్మిస్తోంది. -
శతమానం భవతి.. తొలిరోజు వసూళ్లెంత?
సంక్రాంతి పండుగ బరిలో చిరంజీవి 'ఖైదీ నంబర్ 150', బాలకృష్ణ 'గౌతమిపుత్ర శాతకర్ణి'లాంటి చిత్రాలు ఉన్నా.. చిన్న సినిమాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది 'శతమానం భవతి'. చక్కని కుటుంబకథా నేపథ్యంతో పచ్చని పల్లెటూరు వాతావరణంలో సకుటుంబసమేతంగా చూడదగ్గ సినిమాగా తెరకెక్కిన 'శతమానం భవతి' పెద్ద సినిమాల నడుమ కూడా మంచి వసూళ్లు రాబడుతున్నట్టు తెలుస్తోంది. ఈ సినిమా తొలిరోజు రూ. మూడు కోట్లు వసూలు చేసినట్టు చెప్తున్నారు. చిన్న సినిమాగా సంక్రాంతి బరిలోకి దిగిన ఈ సినిమాకు ఇది మంచి ఆరంభమేనని చెప్పవచ్చు. శర్వానంద్, అనుపమా పరమేశ్వరన్, ప్రకాష్ రాజ్, జయసుధలు ప్రధాన తారాగణంగా సతీష్ వేగేశ్న దర్శకత్వంలో దిల్ రాజు ఈ సినిమాను నిర్మించారు. ఫ్యామిలీ సెంటిమెంట్ వర్కౌట్ అవ్వడం 'శతమానం భవతి'కి ప్లస్ పాయింట్ గా మారిందని అంటున్నారు. -
'శతమానం భవతి' మూవీ రివ్యూ
టైటిల్ : శతమానం భవతి జానర్ : ఫ్యామిలీ డ్రామా తారాగణం : శర్వానంద్, అనుపమా పరమేశ్వరన్, ప్రకాష్ రాజ్, జయసుధ సంగీతం : మిక్కీ జే మేయర్ దర్శకత్వం : సతీష్ వేగేశ్న నిర్మాత : దిల్ రాజు గత ఏడాది సంక్రాంతి బరిలో నాగార్జున, బాలకృష్ణలతో ఢీ కొని సక్సెస్ సాధించిన యంగ్ హీరో శర్వానంద్ మరోసారి అదే సాహసం చేశాడు. రెండు ప్రతీష్టాత్మక చిత్రాలు రిలీజ్ అవుతున్న సంక్రాంతి సీజన్ లో బరిలో దిగిన శర్వానంద్ మరోసారి అదే ఫీట్ ను రిపీట్ చేశాడా.? ఫ్యామిలీ ఎంటర్టైనర్లతో భారీ విజయాలు సాధించిన దిల్ రాజు మరోసారి సక్సెస్ సాధించాడా..? కథ : పిల్లలంతా పెరిగి పెద్దవారై విదేశాలకు వెళ్లిపోయినా పుట్టిన ఊరిమీద మమకారంతో సొంత ఊరు ఆత్రేయపురంలోనే భార్య జానకమ్మ(జయసుధ)తో కలిసి ఉండిపోతాడు రాజుగారు(ప్రకాష్ రాజ్). ఇద్దరు కొడుకులు, ఒక కూతురు ఉన్న ఎవరూ లేని వాళ్లలా ఒక్కరే ఊళ్లో ఉంటున్నందుకు రాజుగారు ఎప్పుడూ బాధ పడుతుంటారు. అయితే ఆ బాధ నుంచి కొంత ఓదార్పుగా మనవడు రాజు (శర్వానంద్) వారితోనే ఉంటుంటాడు. ఆ సమయంలో తన పిల్లలను చూడాలనుకున్న రాజుగారు వారిని సంక్రాంతి పండుగకు రప్పించేందుకు ఓ పథకం వేస్తాడు. అనుకున్నట్టుగా పిల్లలను మనవళ్లను సంక్రాంతికి ఇంటికి పిలిస్తాడు. ఇలా ఆస్ట్రేలియా నుంచి వచ్చిన రాజుగారి మనవరాలు నిత్యా (అనుపమా పరమేశ్వరన్), రాజుతో ప్రేమలో పడుతుంది. సంక్రాంతి సంబరాలు ఘనంగా జరుగుతుండగానే పిల్లలను ఇండియాకు రప్పించడం కోసం రాజుగారు వేసిన పథకం బయటికి తెలుస్తుంది. దీంతో రాజుగారి కుటుంబంలో గొడవలు మొదలవుతాయి. ఆ గొడవలకు కారణం ఏంటి..? రాజుగారు వేసిన ఆ పథకం ఏంటి..? ఇన్ని సమస్యల మధ్య రాజు, నిత్యా ఎలా ఒక్కటయ్యారు..? అన్నదే మిగతా కథ. నటీనటులు : హీరో శర్వానంద్ అయినా సినిమాలో ఎక్కువ భాగం రాజుగారి పాత్రలో నటించిన ప్రకాష్ రాజు చుట్టూనే తిరుగుతోంది. నటుడిగా జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న ప్రకాష్ రాజ్, తనదైన నటనతో రాజుగారి పాత్రకు ప్రాణం పోశాడు. జానకమ్మగా సహజనటి జయసుధ హుందాగా కనిపించారు. ఇప్పటికే పలు చిత్రాల్లో కనువిందు చేసిన ప్రకాష్ రాజ్, జయసుధల జంట మరోసారి ఆకట్టుకుంది. రాజు పాత్రలో శర్వానంద్ ఒదిగిపోయాడు. నిత్యా పాత్రలో అనుపమా పరమేశ్వరన్ శర్వాకు పోటీ ఇచ్చింది. అందంతో పాటు అభినయంతోనూ ఆకట్టుకుంది. ఇతర పాత్రల్లో నరేష్, ఇంద్రజ, రాజా రవీంద్ర లాంటి నటులు తమ పరిధి మేరకు ఆకట్టుకున్నారు. సాంకేతిక నిపుణులు : కావాలని ఎలాంటి కమర్షియల్ ఎలిమెంట్స్ ను ఇరికించకుండా అచ్చమైన కుటుంబ కథను వెండితెర మీద చూపించే ప్రయత్నం చేశాడు దర్శకుడు సతీష్ వేగేశ్న. ముఖ్యంగా కుటుంబ బంధాల విలువలు తెలిపేలా దర్శకుడు రాసుకున్న సన్నివేశాలు అద్భుతంగా వచ్చాయి. తొలి భాగాన్ని బాగానే నడిపించిన సతీష్, సెకండాఫ్ విషయంలో మాత్రం కాస్త తడబడినట్టుగా అనిపించింది. ముఖ్యంగా అనవసరంగా ఇరికించిన కామెడీ సన్నివేశాలతో పాటు, రొటీన్ ఫ్యామిలీ డ్రామాల్లో వచ్చే సన్నివేశాలతో బోర్ కొట్టించాడు. ఈ తరహా చిత్రాలకు తన సంగీతం అయితే కరెక్ట్ అని మరోసారి నిరూపించుకున్నాడు మ్యూజిక్ డైరెక్టర్ మిక్కీ జే మేయర్. పాటలతో పాటు నేపథ్య సంగీతంతోనూ ఆకట్టుకున్నాడు. ఎడిటింగ్, సినిమాటోగ్రఫి, నిర్మాణవిలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి. ప్లస్ పాయింట్స్ : ఎమోషనల్ సీన్స్ శర్వానంద్, అనుపమల జంట మైనస్ పాయింట్స్ : రొటీన్ సీన్స్ కమర్షియల్ ఎలిమెంట్స్ లేకపోవటం ఓవరాల్‌గా శతమానం భవతి, కుటుంబ విలువలను తెలియజేసే సంక్రాంతి సినిమా -
నకిలీ పాస్ పుస్తకాలపై ఫిర్యాదు
పెద్దపల్లిరూరల్: పెద్దపల్లి శాంతినగర్‌లో లంచం తీసుకుంటూ వీఆర్వో పట్టుబడ్డ సంఘటనలో ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్న 16 పట్టాదార్ పాసు పుస్తకాల్లో 12 బోగస్‌వేనని తేలిందని పెద్దపల్లి తహసీల్దార్ అనుపమ తెలిపారు. శుక్రవారం కార్యాలయంలో ఆమె విలేకరులతో మాట్లాడుతూ.. 12 పాసు పుస్తకాలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పేరిట ఉన్నాయని, సీరియల్ నెంబర్లు కూడా ఎక్కడివో తెలియవని అన్నారు. వాటికీ, కార్యాలయ రికార్డులకు పొంతన లేదన్నారు. ఆ పాసు పుస్తకాలపై 2009 నుంచి 2011వరకు పనిచేసిన తహసీల్దార్ మక్మూర్‌అలీ సంతకాలు ఉన్నాయన్నారు. ఈ వ్యవహారంపై విచారణ జరిపి వాస్తవాలు తేల్చేందుకు పోలీసులకు ఫిర్యాదు చేశామన్నారు. నకిలీ పాసుపుస్తకాలను కూడా పోలీసు అధికారులకు అప్పగిస్తున్నామని చెప్పారు. సాదాబైనామాల క్రమబద్ధీకరణకు ఎవరికీ డబ్బులు ఇవ్వొద్దని రైతులను కోరారు. సమావేశంలో డెప్యూటీ తహసీల్దార్ సదానందం, సమ్మయ్య ఉన్నారు. -
ఆయన మంచోడే కానీ...
బెంగళూరు: లిక్కర్ మాఫియాకు వ్యతిరేకంగా తన గళాన్ని వినిపించి, తన ఉద్యోగానికి రాజీనామా చేసిన అనుపమా శ్ణైమరోసారి తన వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచారు. ‘మాజీ మంత్రి పరమేశ్వర్ నాయక్ అంత చెడ్డ వ్యక్తేమీ కాదు, నా వల్లనే ఆయనకు అన్యాయం జరిగింది’ అంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు మరోసారి కలకలం సృష్టించాయి. ‘నేను రాజీనామా చేశాను, మరి మీరెప్పుడు మీ పదవికి రాజీనామా చేస్తారు?’ అంటూ తన ఫేస్బుక్ పేజ్‌లో ప్రశ్నించిన అనుపమా శ్ణై పరమేశ్వర్ నాయక్ మంత్రి పదవి నుంచి తప్పుకోగానే ఈ వ్యాఖ్యలు చేయడం సర్వత్రా చర్చనీయాంశమైంది. ఉడుపిలోని తన స్వగ్రామమైన ఉచ్చిలలో సోమవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో అనుపమా శ్ణైమాట్లాడారు. ‘నన్ను బదిలీ చేయడంలో కొంతమంది పెద్దల హస్తం ఉంది. పరమేశ్వర్ నాయక్ నిమిత్తమాత్రుడు. డీజీపీ ప్రోటోకాల్‌ను సైతం పక్కనపెట్టి నన్ను బదిలీ చేశారు. ఈ విషయంలో పరమేశ్వర్ నాయక్ ఒత్తిడి తీసుకువచ్చేందుకు అవకాశాలు తక్కువ. నా బదిలీ విషయంలో ఇంకా పెద్దల హస్తం ఉంది’ అంటూ వ్యాఖ్యానించారు. డీజీపీ, మాజీ మంత్రి పరమేశ్వర్ నాయక్‌లు ఆ వ్యక్తుల పేర్లను బయటపెట్టాలని అనుపమా శ్ణైడిమాండ్ చేశారు. తాను ఎదుర్కొన్న మానసిక సంఘర్షణపై ఇప్పటికే మహిళా కమిషన్ అధ్యక్షురాలు మంజుల మానసకు లేఖ రాశానని తెలిపారు. ఇదే సందర్భంలో ఆమె ప్రభుత్వంపై సైతం తన విమర్శల పరంపరను కొనసాగించారు. ‘ఓ మాజీ అధికారిని ఎదుర్కొనే ధైర్యం మీకు లేదా? మీరు పోరాడదలచుకుంటే నాతో నేరుగా పోరాడండి, అంతేకానీ నా కుటుంబాన్ని ఇబ్బంది పెట్టకండి’ అని అనుపమా శ్ణైపేర్కొన్నారు. తాను ఎట్టి పరిస్థితుల్లోనూ రాజకీయాల్లోకి రాబోనని, లెక్చరర్ అవుతానని, లేదంటే ఏదైనా ఎన్జీఓలో చేరి సమాజ సేవ చేస్తానని అనుపమా శ్ణైవిలేకరుల ప్రశ్నకు బదులిచ్చారు. -
అనుపమ రాజీనామా రద్దు చేయాలి
మంత్రి పరమేశ్వర నాయక్ రాజీనామా చేయాలి బళ్లారి : బళ్లారి జిల్లా కూడ్లిగి డీఎస్పీ అనుపమ షణై రాజీనామాను పోలీసు ఉన్నతాధికారులు ఆమోదించడంతో బళ్లారి జిల్లాలో నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. ఈనెల 4వ తేదీన కూడ్లిగి డీఎస్పీ అనుపమ షణై రాజీనామా చేసి నాలుగు రోజుల పాటు అజ్ఞాతంలోకి వెళ్లి గురువారం కూడ్లిగిలోని తన నివాస గృహానికి చేరుకుని ఆమె రాజీనామా ఉపసంహరించేది లేదని తేల్చిచెప్పిన సంగతి తెలిసిందే. దీంతో గురువారం రాత్రి కల్లా సంబంధిత పోలీసు ఉన్నతాధికారులు అనుపమ రాజీనామాను అమోదించారు. ఈ నేపథ్యంలో బళ్లారి జిల్లాలో సండూరు పట్టణంలో జన సంగ్రామ పరిషత్ ఆధ్వర్యంలో తీవ్ర నిరసనలు వ్యక్తం అయ్యాయి. అనుపమ షణై రాజీనామా వెనుక ప్రధాన కారణమైన జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి పరమేశ్వర నాయక్ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని లేదంటే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు. కూడ్లిగి డీఎస్పీగా పని చేసిన అనుపమ షణై ఎంతో నిజాయితీ పరురాలని పేర్కొన్నారు. మద్యం వ్యాపారులు, మంత్రి వల్ల ఎంతో మనస్థాపం చెందిన అనుపమ తన ఉద్యోగానికి రాజీనామా చేశారని ధ్వజమెత్తారు. ఈ నేపథ్యంలో పోలీసు ఉన్నతాధికారులు ఆమె రాజీనామాను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. శుక్రవారం సండూరులో జన సంగ్రామ సమితి నేతృత్వంలో పెద్ద ఎత్తున నిరసన తెలుపుతూ స్థానిక ఏపీఎంసీ కార్యాలయం నుంచి తహశీల్దార్ కార్యాలయం వరకు నిరసన ర్యాలీ చేపట్టారు. ధర్నాలో మహిళలు, వృద్దులు కూడా పాల్గొని ఆమెకు మద్దతుగా నిలిచారు. అనుపమ విధుల్లో చేరే విధంగా పోలీసు ఉన్నతాధికారులు ఒత్తిడి చేయాలని వారు డిమాండ్ చేశారు. -
కూడ్లిగిలో అనుపమ !
రాజీనామా వెనక్కు తీసుకునే ప్రశ్నే లేదు న్యాయపోరాటానికి సిద్ధం ఫేస్బుక్లో నేను కామెంట్ చేయలేదు పరమేశ్వర్ నాయక్ రాజీనామా చేయాలని కూడ్లిగిలో నిరసనలు బళ్లారి : ఎట్టకేలకు కూడ్లిగి డీవైఎస్పీ అను పమ షణై కూడ్లిగి డీఎస్పీ కార్యాలయంలో ప్రత్యక్షమయ్యారు. రాజీనామా చేసిన అనంతరం ఐదు రోజులుగా అజ్ఞాతంలో ఉన్న అనుపమ షణై ఎక్కడ ఉన్నారో ఆచూకీ కనుగొనేందుకు జిల్లా ఎస్పీ ఆర్.చేతన్ పోలీసు బృందాలను ఉడిపికి కూడా పంపిన సంగతి తెలిసిందే. ఆమె రాజీనామా చేయడంతో సీఎం సిద్దరామయ్య కూడా రంగంలో దిగి ఆమెతో ఎలాగైనా రాజీనామా ఉపసంహరించుకునేలా చేయాలని పోలీసు ఉన్నతాధికారులకు తెలపడంతో డీజీపీ కూడా రంగంలోకి దిగి ఆమెను రాజీనామా ఉపసంహించుకునే దిశగా ఎస్పీ ఆర్.చేతన్‌కు సూచనలు ఇచ్చారు. జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి పరమశ్వర్ నాయక్ వ ర్సస్ అనుపమ షణై వార్ జరుగుతోంది. జిల్లా మంత్రిపై ఫేస్బుక్లో అనుపమ షణై వాగ్బాణాలు సంధించిన నేపథ్యంలో జిల్లా మంత్రిపై సంఘ సంస్థల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. ఈ నేపథ్యంలో గురువారం అనుపమ షణై తన సోదరుడితో కలిసి ప్రైవేటు కారులో కూడ్లిగిలోకి అడుగు పెట్డడటంతో ఒక్కసారిగా భారీ జన సందోహం తరలి వచ్చారు. కూడ్లిగిలోని తన ప్రభుత్వ అధికార నివాసంలో ఆమె కాసేపు విశ్రాంతి తీసుకున్న తర్వాత డీవైఎస్పీ కార్యాలయానికి చేరుకుని తనకు సంబంధించిన రికార్డులను తీసుకున్నారు. అనంతరం ఆమె మీడియా ప్రతినిధులు, విలేకరులతో మాట్లాడుతూ... తాను సమర్పించిన తన రాజీనామాను వెనక్కి తీసుకునే ప్రశ్నే లేదని తేల్చిచెప్పారు. తాను పోలీసు ఉన్నతాధికారులెవరినీ కలిసే అవసరం లేదన్నారు. ఫేస్బుక్లో తన పేరు మీదుగా ఎవరో ట్వీట్ చేస్తున్నారని, తాను ఫేస్బుక్ అకౌంట్ కూడా ఓపెన్ చే యలేదన్నారు. ఫేస్బుక్లో అజ్ఞాత వ్యక్తులు ట్వీట్లు చేసిన అంశంపై కేసు పెడతారా? అని విలేకరులు ప్రశ్నించగా, కేసు పెడితే న్యాయం జరుగుతుందన్న నమ్మకం లేదన్నారు. ఇక నుంచి తాను చట్టపరంగా పోరాటం చేస్తానని పేర్కొన్నారు. మొత్తం మీద అనుపమ షణై రాజీనామా అంశం ప్రభుత్వాన్ని కుదిపేస్తున్న నేపథ్యంలో స్వయానా సీఎం సిద్దరామయ్య, హోం మంత్రి పరమేశ్వర్లు జోక్యం చేసుకున్న ఫలితం కనిపించలేదు. ఆమె రాజీనామా ఉపసంహరించుకునేది లేదని తేల్చి చెప్పడంతో పోలీసు ఉన్నతాధికారులకు, జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి పరమేశ్వర నాయక్‌లకు సవాల్‌గా మారింది. అనుపమ షణై రాజీనామా ఉపసంహరించుకునేది లేదని తేల్చి చెప్పడంతో కూడ్లిగిలో అమెకు మద్దతుగా భారీ ప్రదర్శనలు చేశారు. కూడ్లిగిలో పలువురు ప్రజాప్రతినిధులు, మాజీ ఎమ్మెల్యేలు, తాలూకా పంచాయతీ మెంబర్లు తదితరుల నేతృత్వంలో డీవైఎస్పీ కార్యాలయం ముందు ఆమెకు మద్దతుగా, జిల్లా ఇన్‌ఛార్జి మంత్రికి వ్యతిరేకంగా ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా కూడ్లిగి జాతీయ రహదారిలో ధర్నా చేపట్టడంతో వాహనాలు ఎక్కడివక్కడే ఆగిపోయాయి. పెద్ద ఎత్తున నిరసన కారులలో రోడ్డుపై బైఠాయించి మంత్రి పరమేశ్వర నాయక్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ అనుపమ షణైకు మద్దతుగా నినాదాలు చేశారు. జాతీయ రహదారి-13ని దిగ్బంధనం చేయడంతో కిలోమీటర్ల పొడవున వాహనాలు ఆగిపోయాయి. -
ప్రేమేసర్వం
నాగచైతన్య ఇప్పటివరకూ చేసిన సినిమాలన్నీ మాగ్జిమమ్ ప్రేమకథా చిత్రాలే. మరోసారి ప్రేమే సర్వస్వంగా భావించే ప్రేమికునిగా ఒదిగిపోవడానికి సిద్ధమయ్యారు. ఇటీవల అందరితో ప్రేమ మంత్రం జపించేలా చేసి సంచలన విజయం సాధించిన మలయాళ హిట్ ‘ప్రేమమ్’. ఇప్పుడా చిత్రాన్ని తెలుగులో నాగచైతన్య హీరోగా ‘కార్తికేయ’ ఫేమ్ చందూ మొండేటి తెరకెక్కించనున్నారు. సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్న ఈ చిత్రం శనివారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. శ్రుతీ హాసన్, అనుపమా పరమేశ్వరన్ నాయికలు. ముహూర్తపు సన్నివేశానికి నిర్మాత డి.సురేశ్‌బాబు కెమెరా స్విచ్చాన్ చేయగా, హీరో అఖిల్ క్లాప్ ఇచ్చారు. ఈ లవ్ మ్యూజికల్ ఎంటర్టైనర్ రెగ్యులర్ షూటింగ్ వచ్చే నెల 3 నుంచి వైజాగ్‌లో జరగనుంది. సమర్పణ: పీడీవీ ప్రసాద్. -
మూడో లైలా కోసం మజ్నూ వేట
-
ప్రేమ చేసే మాయలో..!
‘ఏ మాయ చేసావె’ సినిమాతో లవర్ బోయ్ ఇమేజ్ సంపాదించుకున్న నాగచైతన్య మళ్లీ ఓ ప్రేమకథా చిత్రంతో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధం అవుతున్నారు. మలయాళ సినీ పరిశ్రమనే కాకుండా మొత్తం దక్షిణాదినే షేక్ చేసిన చిత్రం ‘ప్రేమమ్’. ఓ యువకుని జీవితంలో జరిగే అందమైన ప్రేమకథలను తెర మీద అద్భుతంగా ఆవిష్కరించిన ఈ చిత్రం ఇప్పుడు నాగచైతన్య హీరోగా తెలుగులో రీమేక్ కానుంది. ‘కార్తికేయ’ ఫేమ్ చందూ మొండేటి దర్శకత్వం వహించనున్న ఈ చిత్రంలో చైతూ సరసన శ్రుతీహాసన్, అనుపమ కథానాయికలుగా నటించనున్నారు. ఇంకో కథానాయికను ఎంపిక చేయాల్సి ఉంది. సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సూర్య దేవర వంశీ నిర్మించనున్న ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ డిసెంబరులో ప్రారంభం కానుంది. నిర్మాత మాట్లాడుతూ-‘‘ ‘ప్రేమమ్’ ఓ స్వచ్ఛమైన ప్రేమకథ. అందరి హృదయాలను హత్తుకునేలా ఈ చిత్రాన్ని రూపొందించనున్నాం. వచ్చే ఏడాది వేసవిలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం. మాతృకను మించి హిట్ అయ్యేలా చందూ మొండేటి స్క్రిప్ట్‌ను బాగా తయారు చేశాడు’’ అని చెప్పారు. ఈ చిత్రానికి సంగీతం: రాజేశ్ మురుగేశన్, గోపీ సుందర్, ఛాయాగ్రహణం: కార్తీక్ ఘట్టమనేని, సమర్పణ: పీడీవీ ప్రసాద్. -
పెళ్లి.. పిల్లాడు.. అందమైన ప్రయాణం...
పెళ్లయ్యాక కూడా అమ్మలు అందాల రాణులు అవుతున్నారు. సంతూర్మమ్మీల్లా సొగసులతో మెప్పిస్తున్నారు. సిటీకి చెందిన మిసెస్ ఇండియా ప్లానెట్ టైటిల్ విజేత అనుపమ... ఈ వారం తన ఫిట్నెస్ జర్నీని వివరిస్తున్నారిలా.. రోజూ ఇడ్లీలో నెయ్యి, కారప్పొడి వేసుకుని తినేదాన్ని. 8వతరగతి చదువుతున్నప్పుడే ఒబెసిటీ సమస్యతో డాక్టర్ దగ్గరకు తీసుకెళ్లారు. ఆ డాక్టర్ బాగా భయపెట్టడంతో నోరు కట్టేసుకుని కొంత బెటరయ్యా. టీనేజ్‌లో స్టడీస్‌లో పడి మళ్లీ పెరిగాను. ‘కొంచెం బరువు తగ్గవే చాలా బావుంటావ్’ అనేవారు. అప్పుడు విజయవాడలో ఉండేవాళ్లం. రైల్వేగ్రౌండ్, మున్సిపల్ స్టేడియంలలో వాకింగ్, జాగింగ్ చేసేదాన్ని. సన్నగా కాదు గానీ కరెక్ట్ ఫిజిక్ వచ్చేసింది. పెళ్లి, పిల్లాడు... మళ్లీ ఒబెసిటీ... తక్కువ వయసులోనే పెళ్ళై పిల్లాడు పుట్టాడు. బరువేమో 90 కిలోలు.. నాకు నేనే అన్‌హెల్దీగా కనపడ్డా. వర్కవుట్స్ స్టార్ట్ చేశాను. ఆర్నెల్లు ఒంటిమీదే ధ్యాస. అన్ని వ్యాయామాలు చేశా. వారానికి 1, 2 కిలోల చొప్పున బరువు తగ్గుతూ 60 కిలోలకు వచ్చేశా. అమెరికాలో ఉన్నప్పుడు ఫొటోగ్రాఫర్ ఫ్రాంక్ ప్రోద్బలంతో ఫొటో షూట్ చేశాం. ఆ ఫొటోలకు వచ్చిన రెస్పాన్స్‌తో ఇన్స్పైర్ అయ్యి బ్యూటీ కాంటెస్ట్‌లో పాల్గొన్నా. మిసెస్ ఇండియా ప్లానెట్ గెలుచుకున్నాను. వర్కవుట్ రొటీన్ ఇదీ... ఉదయం 10 నుంచి 11గంటల వరకూ వర్కవుట్ సెషన్. యోగా స్ట్రెచెస్, యాబ్స్‌కి సంబంధించినవి చేస్తా. డెలివరీ అయ్యాక పొట్ట జారిపోతుంది కదా. మజిల్ టోన్ అవడానికి క్రంచెస్ బాగా చేసే అలవాటు కంటిన్యూ అవుతోంది. కేలరీస్ బర్న్ అవ్వడానికి బెస్ట్ అయిన క్రాస్ ట్రైనర్ బాగా ఇష్టమైన వర్కవుట్. అది 30 నిమిషాలు చేస్తా. సైక్లింగ్, స్క్వాట్స్, సైడ్ బెండ్స్, వెయిస్ట్ లిఫ్టింగ్ అన్నీ చేస్తా. కపాల భాతి, మెడిటేషన్లు కూడా సాధన చేస్తా. ఫుడ్ రొటీన్ ఇదీ... పొద్దున్నే 7గంటలకు తేనె, లైమ్ వాటర్ తాగుతా. పిల్లాడ్ని స్కూల్‌కి రెడీ చేసేసి బ్రేక్‌ఫాస్ట్‌గా చిన్న కప్పుతో ఓట్స్ లేదా 3 వైట్ ఎగ్స్, బాదంపప్పులు 10 తింటాను. లేదా స్క్రాంబుల్డ్ ఎగ్స్ గాని, బనానాలో స్కిమ్డ్ మిల్క్, ఓట్స్ వేసి గాని తీసుకుంటా. ఫంక్షన్లకు వెళితే తప్ప రైస్ తీసుకోను. ప్రొటీన్ బార్స్ బాగా తీసుకుంటా. వర్కవుట్ తర్వాత గ్రీన్ టీ తప్పనిసరి. మధ్యాహ్నం భోజనంగా ఒంటి గంటకు గ్రిల్డ్ చికెన్ లేదా వెజ్ కర్రీతో 3 రోటీలు, సాయంత్రం 4 లేదా 5గంటలకు బిగ్ బౌల్‌తో ఫ్రూట్స్, రాత్రి 7.30లోగా ప్రొటీన్ బార్, లేదా ఓట్స్, క్వినోవా ఉంటుంది. ఒక గ్లాస్ బట్టర్ మిల్క్ తాగుతా. ఆదివారం డైట్‌కి హాలిడే. చాక్లెట్ ఐస్‌క్రీమ్స్‌తో సహా నచ్నినవన్నీ టేస్ట్చేస్తా. -
ఆదర్శం
సామూహిక వివాహాల్లో మంత్రి ఆంజనేయ కుమార్తె పెళ్లి హాజరైన సీఎం, మంత్రులు, మఠాధీశులు రాష్ట్ర సాంఘీక సంక్షేమ శాఖ మంత్రి ఆంజనేయ స్వయంగా సామూహిక వివాహాలు నిర్వహించడంతో పాటు తన కుమార్తె పెళ్లి కూడా అందులో జరిపించడం ప్రాధాన్యతను సంతరించుకుంది. తన కుమార్తె వివాహాన్ని ఘనంగా.. అంగరంగ వైభవంగా నిర్వహించకుండా పేదల మధ్యే ఎలాంటి హంగూ.. ఆర్భాటాలకు తావివ్వకుండా నిరాడంబరంగా చేపట్టారు. చిత్రదుర్గం జిల్లా హొళల్కెరె పట్టణంలోని కొట్రనంజప్ప కాలేజీ ఆవరణలో బుధవారం నిర్వహించిన ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి, మంత్రులు, మఠాధీశులు హాజరయ్యారు. చిత్రదుర్గం : జిల్లా హొళల్కెరె పట్టణంలోని కొట్రనంజప్ప కాలేజీ ఆవరణంలో బుధవారం సామూహిక వివాహాలు అంగరంగ వైభవంగా జరిగాయి. రాష్ట్ర సాంఘీక సంక్షేమ శాఖ మంత్రి జే.ఆంజనేయ నేతత్వంలో 97 జంటలకు ఉచిత సామూహిక వివాహాలు జరిపించారు. ఈ కార్యక్రమంలో మంత్రి తన కుమార్తె అనుపమతో శాశ్వత్ వివాహం కూడా జరిపించారు. పేద కుటుంబాలకు చెందిన వారి పెళ్లిళ్లతో పాటు మంత్రి కూతురు పెళ్లి జరగ డంతో రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధరామయ్యతో పాటు పలువురు మఠాధీశులు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. అనంతరం సిద్ధరామయ్య మాట్లాడుతూ సామూహిక వివాహాలు జరిపించడంతో పాటు ఇదే వేదికపై మంత్రి తన కుమార్తె పెళ్లి కూడా జరిపించడం చాలా సంతోషంగా ఉందన్నారు. అనంతరం నూతన వధువరులను సీఎం, మఠాధీశులు ఆశీర్వదించారు. కాగా ఈ సామూహిక వివాహాల్లో పాల్గొన్న జంటలకు ఒక్కొక్క జెర్సీ ఆవును కానుకగా అందించడం గమనార్హం.