
జనవరి 30నుంచి రాంచరణ్ కొత్త సినిమా
మెగా పవర్ స్టార్ రాంచరణ్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కబోయే సినిమాకు ముహూర్తం ఫిక్స్ చేశారు. పీరియాడిక్ లవ్ స్టోరిగా తెరకెక్కనున్న ఈ సినిమాను జనవరి 30న లాంచనంగా ప్రారంభించేదుకు ప్లాన్ చేస్తున్నారు. ధృవ రిలీజ్ తరువాత ఖైదీ నంబర్ 150 పోస్ట్ ప్రొడక్షన్, ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉన్న చరణ్ అవన్నీ పూర్తయిపోవటంతో త్వరలో తన సినిమాను ప్రారంభించాలని నిర్ణయించుకున్నాడు.
నాన్నకు ప్రేమతో సినిమా తరువాత లాంగ్ గ్యాప్ తీసుకున్న సుకుమార్ రాం చరణ్ కోసం ఓ పీరియాడిక్ లవ్ ఎంటర్టైనర్ను సిద్ధం చేశాడు. ఇప్పటికే పక్కా స్క్రిప్ట్తో రెడీగా ఉన్న సుక్కు, ఈ సినిమాను వీలైనంత త్వరగా పూర్తి చేసి, దసరా బరిలో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నాడు. పల్లెటూరి వాతావరణంలో తెరకెక్కనున్న ఈ సినిమాలో రాంచరణ్ సరసన అనుపమా పరమేశ్వరన్ హీరోయిన్గా నటిస్తోంది. శ్రీమంతుడు, జనతా గ్యారేజ్ లాంటి సక్సెస్ ఫుల్ చిత్రాలను నిర్మించిన మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్తో ఈ సినిమాను నిర్మిస్తోంది.