సుకుమార్‌ ప్రాజెక్ట్‌లో సరికొత్తగా కనిపించనున్న రామ్‌చరణ్‌ | Ram Charan And Sukumar To Collaborate On RC17 | Sakshi
Sakshi News home page

సుకుమార్‌ ప్రాజెక్ట్‌లో సరికొత్తగా కనిపించనున్న రామ్‌చరణ్‌

Published Wed, Feb 19 2025 12:54 AM | Last Updated on Wed, Feb 19 2025 6:46 AM

Ram Charan And Sukumar To Collaborate On RC17

‘ఆర్‌ఆర్‌ఆర్‌’ సినిమాతో అంతర్జాతీయ స్థాయిలో ప్రేక్షకులను అలరించారు హీరో రామ్‌చరణ్‌(Ram Charan). ‘పుష్ప 1: ది రైజ్‌’, ‘పుష్ప 2: ది రూల్‌’ చిత్రాలతో డైరెక్టర్‌ సుకుమార్‌(Sukumar) కూడా అంతర్జాతీయ స్థాయిలో పేరు తెచ్చుకున్నారు. వీరిద్దరి కాంబినేషన్‌లో రెండో సినిమా తెరకెక్కనుందనే వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. రామ్‌చరణ్‌ కెరీర్‌లో ఇది 17వ చిత్రంగా రూపొందనుంది.

ఈ మూవీలో రామ్‌చరణ్‌ సరికొత్త మేకోవర్‌లో కనిపించనున్నారని టాక్‌. రామ్‌చరణ్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వం వహించిన తొలి చిత్రం ‘రంగస్థలం’ (2022) బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఈ మూవీ తర్వాత వారి కాంబినేషన్‌లో మరో సినిమా రానుంది. రామ్‌చరణ్‌ ప్రస్తుతం ‘ఉప్పెన’ మూవీ ఫేమ్‌ బుచ్చిబాబు దర్శకత్వంలో ‘ఆర్‌సీ 16’ (వర్కింగ్‌ టైటిల్‌) సినిమా చేస్తున్నారు. ఈ చిత్రం తర్వాత రామ్‌చరణ్, సుకుమార్‌ మూవీ పట్టాలెక్కుతుందని టాక్‌. ‘రంగస్థలం’లో చిట్టిబాబుగా పక్కా పల్లెటూరు, ఫుల్‌ మాస్‌ పాత్రలో రామ్‌చరణ్‌ని చూపించారు సుకుమార్‌. తాజా చిత్రంలో అందుకు పూర్తి భిన్నమైన పాత్రలో చరణ్‌ని చూపించనున్నారట.

ఈ చిత్రంలో అల్ట్రా స్టైలిష్‌ అర్బన్‌ లుక్‌లో కనిపిస్తారట. ‘రంగస్థలం’లో చరణ్‌ని, ‘పుష్ప’ చిత్రాల్లో అల్లు అర్జున్‌ని పక్కా మాస్‌గా చూపించిన సుకుమార్‌... ఈసారి మాత్రం చరణ్‌ కోసం పూర్తి అర్బన్‌ బ్యాక్‌డ్రాప్‌ కథని సిద్ధం చేస్తున్నారని టాక్‌. ఈ చిత్రంలో హీరోయిన్‌గా రష్మికా మందన్నాని తీసుకోవాలని ప్లాన్‌ చేస్తున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement